శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 584 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 584 - 3
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 584 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 584 - 3 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀
🌻 584. 'మహావిద్యా’ - 3 🌻
ఆత్మ విద్యావంతులకే మహావిద్య తెలియుట కవకాశము ఎక్కువ. ఈశ్వరత్వము, ప్రకృతి పురుషులు, మహదహంకారము, త్రివిధ అహంకారములు, పంచభూతములు- ఇత్యాది వన్నియూ వివరముగ తెలియును. ప్రజాపతుల కథలు తెలియగలవు. సప్త మరుత్తులు, సప్తాగ్నులు, రుద్రులు, వసువులు, విశ్వకర్మ యిత్యాది మహత్తరమగు విషయములు కూడ తెలియగలవు. ఇట్టి విస్తారమగు విద్య తెలియు చున్నకొలది శ్రీమాత మాహాత్మ్యము తెలియుచూ జీవుడు తన్మయత్వమున మునుగును. మహావిద్య మహత్తుగల విద్యయే. అట్టి విద్య యందు మునిగి యుండు వారే మహంతులు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 584 - 3 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita
shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻
🌻 584. 'Maha Vidya' - 3 🌻
The opportunity to understand Maha Vidya is greater for those proficient in Atma Vidya. It provides deep insight into Ishwaratva (divinity), the principles of Prakriti (nature) and Purusha (spirit), Mahad Ahankara (cosmic ego), the three forms of ego, the five elements, and more. It reveals the stories of Prajapatis (progenitors of creation). Additionally, it unveils profound concepts such as the Sapta Maruts (seven winds), Sapta Agnis (seven fires), Rudras, Vasus, and Vishwakarma. As one delves deeper into this expansive knowledge, they come to understand the glory of Sri Mata and merge into a state of Tanmayatva (oneness with the divine). Maha Vidya is indeed a supreme knowledge. Those who immerse themselves in it are truly the great ones.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment