🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 585 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 585 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀
🌻 585. 'శ్రీవిద్యా’ - 1 🌻
శ్రీవిద్యా స్వరూపిణి శ్రీమాత అని అర్థము. పంచదశి స్వరూపము గలది శ్రీవిద్య. ముఖము, కంఠము నుండి కటి, కటి అధమ భాగము అను మూడు కూటములుగ పంచదశి స్వరూపమై శ్రీమాత యున్నది. ఈ మూడు కూటములందు పదిహేను బీజాక్షరములతో వ్యాప్తి చెంది శ్రీమాత యున్నది. ఇది శ్రీమాత సూక్ష్మ రూపము. ఈ సూక్ష్మ రూపము కూడ మూడు శ్రేణులలో నుండును. అవి వరుసగా సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము. నడుము నుండి మూలాధారము వరకు గల రూపము సూక్ష్మము. నడుము నుండి కంఠము వరకు గల రూపము సూక్ష్మతరము. కంఠము నుండి పై భాగమంతయూ సూక్ష్మతమము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 585 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita
shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻
🌻 585. 'Shree Vidya' - 1 🌻
Sri Mata represents the essence of Sri Vidya, embodied in the form of the Panchadashi Mantra, which consists of fifteen sacred syllables. Her divine form is structured into three clusters: the face, the region from the neck to the waist, and the region below the waist. Each cluster corresponds to a section of the Panchadashi Mantra, with Sri Mata pervading these three regions through the fifteen bija mantras (seed syllables). This configuration represents her subtle form, which is further classified into three levels of subtlety. The form from the waist to the Muladhara chakra (base of the spine) is known as Sukshma (subtle). The form from the waist to the neck is Sukshmatara (more subtle). The form from the neck to the crown is Sukshmatama (most subtle). This triadic structure reveals the progressively refined and divine aspects of Sri Mata's subtle form, encapsulating the profound mysteries of Sri Vidya.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment