శ్రీమద్భగవద్గీత - 539: 14వ అధ్., శ్లో 15 / Bhagavad-Gita - 539: Chap. 14, Ver. 15

 

🌹. శ్రీమద్భగవద్గీత - 539 / Bhagavad-Gita - 539 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 15 🌴

15. రజసి ప్రలయం గత్వా కర్మసఙ్గిషు జాయతే |
తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే ||


🌷. తాత్పర్యం : రజోగుణమునందుండి మరణించినవాడు కామ్యకర్మరతుల యందు జన్మించును. తమోగుణము నందుండి మరణించినవాడు జంతుజాలమున జన్మించును.

🌷. భాష్యము : ఆత్మ మానవజన్మ స్థాయిని పొందిన పిమ్మట తిరిగి పతనము నొందదనెడి అభిప్రాయమును కొందరు కలిగియున్నారు. కాని అట్టి భావన సరియైనది కాదు. ఈ శ్లోకము ననుసరించి తమోగుణమును వృద్ధిపరచుకొనినవాడు మరణానంతరము జంతురూపమునకు పతనము నొందును. తిరిగి ఆ స్థితి నుండి పరిణామ సిద్ధాంతము ద్వారా మానవజన్మను పొందుటకు జీవుడు తనను తాను ఉద్ధరించు కొనవలెను.

కనుక మనవజన్మ యెడ నిజముగా శ్రద్ధగలవారు సత్త్వగుణము నవలంబించి, సత్సాంగత్యమున గుణముల నధిగమించి కృష్ణభక్తిభావనలో నిలువవలెను. ఇదియే మానవజన్మ యొక్క లక్ష్యమై యున్నది. లేనిచో మానవుడు తిరిగి మానవజన్మనే పొందుచున్న హామీ ఏదియును లేదు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 539 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 15 🌴

15. rajasi pralayaṁ gatvā karma-saṅgiṣu jāyate
tathā pralīnas tamasi mūḍha-yoniṣu jāyate

🌷 Translation : When one dies in the mode of passion, he takes birth among those engaged in fruitive activities; and when one dies in the mode of ignorance, he takes birth in the animal kingdom.

🌹 Purport : Some people have the impression that when the soul reaches the platform of human life it never goes down again. This is incorrect. According to this verse, if one develops the mode of ignorance, after his death he is degraded to an animal form of life. From there one has to again elevate himself, by an evolutionary process, to come again to the human form of life.

Therefore, those who are actually serious about human life should take to the mode of goodness and in good association transcend the modes and become situated in Kṛṣṇa consciousness. This is the aim of human life. Otherwise, there is no guarantee that the human being will again attain to the human status.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 09, JUNE 2024 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు🌹

🍀🌹 09, JUNE 2024 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు🌹🍀
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 539 / Bhagavad-Gita - 539 🌹
🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 50 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 50 🌴
3) 🌹 సిద్దేశ్వరయానం - 76 🌹
🏵 రత్నప్రభ - 3 🏵
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 547 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 547 - 3 🌹 
🌻 547. 'బర్బరాలకా’ - 3 / 547. 'Barbaralaka' - 3 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 539 / Bhagavad-Gita - 539 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 15 🌴*

*15. రజసి ప్రలయం గత్వా కర్మసఙ్గిషు జాయతే |*
*తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే ||*

*🌷. తాత్పర్యం : రజోగుణమునందుండి మరణించినవాడు కామ్యకర్మరతుల యందు జన్మించును. తమోగుణము నందుండి మరణించినవాడు జంతుజాలమున జన్మించును.*

*🌷. భాష్యము : ఆత్మ మానవజన్మ స్థాయిని పొందిన పిమ్మట తిరిగి పతనము నొందదనెడి అభిప్రాయమును కొందరు కలిగియున్నారు. కాని అట్టి భావన సరియైనది కాదు. ఈ శ్లోకము ననుసరించి తమోగుణమును వృద్ధిపరచుకొనినవాడు మరణానంతరము జంతురూపమునకు పతనము నొందును. తిరిగి ఆ స్థితి నుండి పరిణామ సిద్ధాంతము ద్వారా మానవజన్మను పొందుటకు జీవుడు తనను తాను ఉద్ధరించు కొనవలెను.*

*కనుక మనవజన్మ యెడ నిజముగా శ్రద్ధగలవారు సత్త్వగుణము నవలంబించి, సత్సాంగత్యమున గుణముల నధిగమించి కృష్ణభక్తిభావనలో నిలువవలెను. ఇదియే మానవజన్మ యొక్క లక్ష్యమై యున్నది. లేనిచో మానవుడు తిరిగి మానవజన్మనే పొందుచున్న హామీ ఏదియును లేదు.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 539 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 15 🌴*

*15. rajasi pralayaṁ gatvā karma-saṅgiṣu jāyate*
*tathā pralīnas tamasi mūḍha-yoniṣu jāyate*

*🌷 Translation : When one dies in the mode of passion, he takes birth among those engaged in fruitive activities; and when one dies in the mode of ignorance, he takes birth in the animal kingdom.*

*🌹 Purport : Some people have the impression that when the soul reaches the platform of human life it never goes down again. This is incorrect. According to this verse, if one develops the mode of ignorance, after his death he is degraded to an animal form of life. From there one has to again elevate himself, by an evolutionary process, to come again to the human form of life.*

*Therefore, those who are actually serious about human life should take to the mode of goodness and in good association transcend the modes and become situated in Kṛṣṇa consciousness. This is the aim of human life. Otherwise, there is no guarantee that the human being will again attain to the human status.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 సిద్దేశ్వరయానం - 76 🌹*

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

*🏵 రత్న ప్రభ - 3 🏵*

*రత్నప్రభ వాళ్ళమ్మతో కలిసి స్వామి వారివెంట తీర్ధయాత్రలకు వెళ్ళింది. ఆయా క్షేత్రాలలో తాము ఎన్నివందల సంవత్సరాల క్రింద ఉన్నది. పూర్వజన్మ విశేషాలు ఆ దేవతా మహిమవల్ల జరిగిన అద్భుతాలు స్వామివారు తెలియజేసేవారు. వారు మాటాడుతున్నప్పుడల్లా ఆ సమయాలలో తానుకూడా వారితో ఉన్నట్లు అనిపించేది. ఈ విధంగా దీర్ఘప్రయాణాలు చేసి చివరకు కామాఖ్య చేరుకొన్నారు. కామాఖ్య కాళి గురించి కాళీపురాణంలోని విశేషాలు స్వామివారు చెపుతుంటే దిగ్భ్రాంతి కలిగింది.*

*ఆ ఊరిలో ఉండగా సంవత్సరాని కొకసారి జరిగే మహోత్సవములు వచ్చినవి. నాగ భూమి నుండి దిగంబర సాధువులెందరో ఆ కార్యక్రమాలలో పాల్గొనటానికి వచ్చారు. ఒకపూట అద్భుతమైన ఖడ్గ చాలన ప్రదర్శన జరిగింది. నిప్పులలో దూకేవారు, నారసాలు గుచ్చుకొనేవారు, కొరడాలతో కొట్టుకొనేవారు చిత్ర విచిత్ర తీవ్ర సాధకులక్కడ కనిపించారు. దీర్ఘకాలం ఉపవాసాలుండి, ఎండలో పంచాగ్ని మధ్యంలో నిల్చుని, శీతకాలంలో గొంతు లోతు చన్నీళ్ళలో నిల్చొని కఠోర నియమాలతో ప్రాచీనులు తపస్సుచేస్తే – ఈ మార్గంలో శరీరాన్ని హింసిస్తూ సూదులతో పొడుచుకొంటూ కత్తులతో గుచ్చుకొంటూ, కర్రతో, కొరడాతో బాదుకొంటూ తామస మంత్రాలు చేస్తుంటే ఆ మంత్ర దేవతలు తొందరగా అనుగ్రహిస్తారని స్వామివారు తమ ప్రసంగాలలో తెలియజేశారు.*

*అక్కడి ఉత్సవాలలో ప్రధానమైనరోజు స్వామివారు ఒక ఎర్రని గుడ్డలో చిన్న యంత్రం పెట్టియిచ్చి దానిని రాత్రి తలక్రింద పెట్టుకొని నిద్రించమని చెప్పారు. కామాఖ్యలో పరమేశ్వరి యోనిపూజించబడుతుంది. ఆ శిలాఖండం నుండి - ఆ దేవి రజస్వలయైన దానికి గుర్తుగా రక్తం స్రవిస్తూ ఉంటుంది. ఆ వస్త్ర ఖండాలను మహాప్రసాదంగా తీసుకొని పూజలో పెట్టుకొంటారు. ఆ వస్త్ర ఖండంలో కాళీయంత్రం ఉంచి యిచ్చారు స్వామివారు.*

*రాత్రి ఉపవాసం ఉండి భూశయనం చేసి కాళీదేవిని స్మరిస్తూ కండ్లు మూసుకొని పడుకొన్నది రత్నప్రభ. అప్పటికి మొదటిజాముదాటి రెండవజాము ప్రవేశించింది. నిద్రలో ఉన్నదో లేక మెలకువగా ఉన్నదో తెలియని స్థితిలో ఉన్నట్లుండి శరీరంలో నుండి బయటకు వచ్చినట్లు అనిపించింది. చూస్తే తాను ఆకాశంలో ఉంది. శరీరం క్రింద కనిపిస్తున్నది. గగనయానం చేస్తూ నీలిమబ్బుల మధ్య ఒక గుహలో ప్రవేశించింది. సుదీర్ఘమైన ఈ అంధకార కందరంలో వెళ్ళి వెళ్ళి చివరకు బయటకు వస్తే ఒక కాంతి పుంజం. ఆ తేజోమధ్యంలో కాళి - కాలభైరవుడు కనిపిస్తున్నారు. చిత్రం! ఇద్దరూ చాలా సుందరంగా ప్రేమమూర్తులుగా భాసిస్తున్నారు.*

*కాళీదేవి భైరవునితో ఇలా అంది "భైరవస్వామీ! ఈ బాలిక బృందావనంలో రాధాదేవి చెలికత్తెయైన ఇందులేఖ యొక్క అంశ. మనోరమ అనే పేరుతో ఉండి నా భక్తుడైన ఒక సిద్ధునితో అనుబంధం కలిగి భువనేశ్వరారణ్యంలోని నామందిరంలో కొంతకాలం మంత్రసాధన చేసింది. ఆ మంత్రమునే మళ్ళీ మీరిప్పుడు నా భక్తురాలికి ప్రసాదించండి. నాలో రాధాదేవి అంశయైన శ్యామకాళి మీలో కృష్ణుని అంశయైన కృష్ణభైరవుడు పూర్ణత్వ ప్రాభవం పొందటం జరిగింది. కనుక రాధాకృష్ణ భక్తురాలైన ఈ జీవి మీ అనుగ్రహానికి అర్హురాలు." కాళీ ప్రియుడైన కృష్ణ భైరవుడు రత్నప్రభకు కాళీమంత్రాన్ని ఉపదేశించాడు.
రత్నప్రభ అత్యంత వినమ్రమూర్తియై ఇద్దరికి పాదనమస్కారం చేసి ఆ మంత్రాన్ని జపించటం మొదలుపెట్టింది. ప్రారంభించిన కాసేపటికి ఆజ్ఞాచక్రంలో కదలిక వచ్చింది. మూసిన తలుపులు తెరుచుకొన్నట్లు అక్కడ సంచలనం కలిగి దివ్యదృష్టి లభించింది. వరుసగా తన జన్మపరంపర గోచరిస్తున్నది. బృందావనంలో రాధాదేవి పరివారంలో శ్యామ అనేపేరుతో ఉండి - జనమేజయుని సర్పయాగంలో హోమకుండంలో పడి దహనం కాకుండా రాధాదేవి కరుణవల్ల రక్షించబడిన సిద్ధనాగుడనే నాగజాతి తపస్వికి ఆ ధామంలో సేవచేసింది. రాధా శరీరంలోని రాసేశ్వరి బయటకువెళ్ళి కృష్ణునితో కలిసి దివ్యభూమికలోకి ప్రవేశించిన తర్వాత మిగిలిన ఉశీనర రాజకుమారి రాధ - సిద్ధాశ్రమానికి తపస్సు చేసుకోటానికి వెళ్ళిపోయింది.*

*అనంతరం శ్యామ సిద్ధనాగునితో ఉంది. రాధాదేవి సంకల్పంవల్ల ప్రపంచంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించే ప్రణాళికలో భాగంగా తాను ఎన్నో జన్మలు తీసుకోవలసి వచ్చింది. సిద్ధనాగుడు కూడా పరమేశ్వరి ఇచ్ఛవల్ల జన్మపరంపర పొందటం జరిగింది. అతడు భైరవనాధుడనే సిద్ధునిగా, భానుదేవుడనే రాజయోగిగా ఉన్నప్పుడు ఆయనకు సేవచేసింది. ప్రవరసేనుడనే మహారాజుగా బృందావన ప్రాంతాన్ని పరిపాలించినపుడు ఆ నరపాలుని భార్య నాగావళిగా రాధాదేవిని కొలిచింది. ఆ సిద్ధేశ్వరుడు డెహ్రాడూన్ ప్రాంతంలో జన్మించినపుడు అనూరాధా అనే కాళీసఖిగా ఉండి భౌతికరూపం తీసుకొని ఆయనతో కాపురంచేసి సంతానంకని మళ్ళీ అమ్మ పరివారంలోకి వెళ్ళింది. తరువాత కొంతకాలం హిమాలయాలలో సిద్ధాశ్రమంలో లలితాదేవి ఆలయంలో కింకరిగా హిరణ్య అనేపేరుతో ఉంది. అక్కడ తాంత్రిక సాధనలుచేసి డాకినీ సిద్ధిని పొందింది. హిమాలయాలలో డాకిని అంటే దేవయోని జాతికి చెందిన దివ్యశక్తులు గల అప్సరస వంటిది.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 547 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam  - 547 - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 111. పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా ।*
*పులోమజార్చితా, బంధమోచనీ, బర్బరాలకా ॥ 111 ॥ 🍀*

*🌻 547. 'బర్బరాలకా’ - 3 🌻*

*నిత్య సంస్కారములు లేనివారి యందు క్రమముగ మలినములు చేరును. కాలక్రమమున మలిన జీవనమును ప్రోత్సహించు బుద్ధి కూడ కలుగును. వీరినే మ్లేచ్ఛులు అందురు. మ్లేచ్ఛు లనగా మలినములందు యిచ్ఛ గలవారు. ఆధునిక యుగమున ఈ సంస్కారహీనతను స్పష్టముగ దర్శించ వచ్చును. శ్రీమద్రామాయణమున ఆదికవి వాల్మీకి మహర్షి అయోధ్య వాసులను, లంకావాసులను సరిపోల్చినాడు. అయోధ్యవాసులు సంస్కరింప బడిన శిరోజములు కలవారని, నిత్యమూ స్నానపానాదులను దైవారాధననూ గావించు ప్రశాంతచిత్తులుగా వర్ణించినాడు. లంకా వాసులు విరబోసికొనిన శిరోజములు కలవారని, రజస్తమోగుణ మాలిన్య ముతో జీవించువారని తెలిపినాడు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 547 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 111. Punyakirtih punyalabhya punyashravana kirtana*
*pulomajarchita bandhamochani bandhuralaka ॥111 ॥ 🌻*

*🌻 547. 'Barbaralaka' - 3 🌻*

*Impurities gradually accumulate in those who do not have daily rituals. In the course of time, there will come a mindset to encourage impure living as well. These are the Mlechhas. Mlechchas mean those who are fond of filth. This lack of culture can be clearly seen in the modern age. In Srimadramayana, sage Valmiki compared the people of Ayodhya and the people of Lanka. He described the people of Ayodhya as having groomed hair, having a daily bath, doing daily worship of God and as calm souls. He said that the people of Lanka have loose hair and live with impurities of Rajasthamogunas.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj

Siva Sutras - 252 : 3 - 39. cittasthitivat sarira karana bahyesu - 2 / శివ సూత్రములు - 252 : 3-39. చిత్తస్థితివత్ శరీర కరణ బాహ్యేషు - 2


🌹. శివ సూత్రములు - 252 / Siva Sutras - 252 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

3వ భాగం - ఆణవోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 3-39. చిత్తస్థితివత్ శరీర కరణ బాహ్యేషు - 2 🌻

🌴. అతను తన చైతన్యాన్ని (చిత్త) తుర్య యొక్క నాల్గవ స్థితితో నింపినట్లే, అతని మనస్సు తన శరీరం, ఇంద్రియాలు మరియు బాహ్య వస్తువులతో బాహ్యంగా నిమగ్నమై ఉన్నప్పుడు కూడా అదే సాధన చేయాలి. 🌴


అన్నీ ఇతర ఆలోచనా ప్రక్రియల నుండి మనస్సు విముక్తి పొందినప్పుడు మాత్రమే ఏక దృష్టి సాధ్యపడుతుంది. ఈ ఒక్క ఏకాగ్రతా శక్తి, అన్నీ పూర్వ ముద్రలు మరియు అహం యొక్క అవశేషాలను స్వయంచాలకంగా తుడిచి వేస్తుంది. ప్రారంభంలో భగవంతునిపై దృష్టిని ప్రభావవంతంగా కేంద్రీకరించడానికి మానవ ప్రయత్నం అవసరం. అప్పుడే ప్రక్షాళన ప్రక్రియ స్వయంచాలకంగా ప్రారంభించ బడుతుంది. మనస్సు పూర్తిగా శుద్ధి అయినప్పుడు, యోగి ఆనంద స్థితిలోకి ప్రవేశిస్తాడు. అతని మానసిక ఆనందం అతని శరీరం ద్వారా కూడా ప్రసరిస్తుంది. ముఖం అనేది మనస్సు యొక్క సూచిక అనే సామెతను ఇది ధృవీకరిస్తుంది మరియు ఈ సూత్రం ఈ అంశాన్ని మరింత విశదపరుస్తుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Siva Sutras - 252 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 3 - āṇavopāya

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 3 - 39. cittasthitivat śarīra karana bāhyesu - 2 🌻

🌴. Just as he fills his consciousness (chitta) with the fourth state of turya, so should he practice the same when his mind is externally engaged with his body, senses and external objects. 🌴


Single pointed attention is possible only when the mind is free of any other thought processes. This single pointed focus automatically sweeps off the remnants of impressions and ego. Effectually, initial human effort is needed merely to focus on the Lord and the cleansing process is automatically initiated. When the mind is totally purified, the yogi enters the state of blissfulness. His mental happiness is radiated through his body. This confirms the saying that, face is the index of the mind and this sūtra elucidates this aspect further.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


సిద్దేశ్వరయానం - 75 Siddeshwarayanam - 75


🌹 సిద్దేశ్వరయానం - 75 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 రత్న ప్రభ -2 🏵


రత్న ప్రభ : మహాత్మా! నేను మీతో మాట్లాడలేను. మొదటిసారి మిమ్ము కామాక్షీదేవి దగ్గర చూచినప్పుడే ఏదో చెప్పలేని భక్తి పారవశ్యం కలిగింది. ఎందుకో ఏమో తెలియదు. నా అనుభూతికి ఏ ఆధారము లేదు. కానీ అంతరాంతరాలలో మీరు తప్పక నన్ను కరుణిస్తారని అనిపిస్తున్నది. మీతో మాట్లాడాలని మీతో ఎక్కువసేపు గడపాలని, మీ సన్నిధిలో ఉండాలని తీవ్రమైన ఆకాంక్ష. నేను కొంచెం సంస్కృతం చదువుకొన్నాను. కాళిదాస మహాకవి రచించిన ఒక శ్లోకం గుర్తుకు వస్తున్నది.

శ్లో॥ రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శబ్దాన్ పర్యుత్సుకోభవతి యత్సుఖితో పిజంతుః
తచ్చేతసా స్మరతి నూన మబోధ పూర్వం భావస్థిరాణి జననాంతర సౌహృదాని

ఎప్పటివో ఏవో పూర్వజన్మ అనుబంధాలు నన్ను కలచి వేస్తున్నవా? కానీ మీముందు అంత సాహస వచనాలు పలుకలేను.

స్వామీ : ఓ! మంచి పండితురాలివి. పంచకావ్యాల వరకు చదువుకొన్నావు గదా! ఇంకా చదివేదానివే. నీ తండ్రి - నిన్ను మీ అమ్మను విడిచిపెట్టి వేరెవరితోనో ఉండటంవల్ల మీ యింటి పరిస్థితి కల్లోలితమైంది. ఏదో మీ అమ్మ పుట్టింటి వారిచ్చిన ఆస్తితో నిన్నుపెంచి పెద్ద చేస్తున్నది. ఇంకా పెద్ద చదువులు చదవవలసిన దానివే. సరిలే! దానికేమి? ఈ మంత్రోపదేశం సంగతి అటుంచు. పెళ్ళెప్పుడు చేసుకొంటావు?

రత్న : స్వామీ! స్వామీ! నేనెంత అదృష్టవంతురాలిని. నా కుటుంబ విషయాలు నేను మీకు చెప్పలేదు. మీకెవరూ చెప్పే అవకాశం లేదు. ఇవి మీకెలా తెలిసినవని నేనడగను. మీరు సర్వజ్ఞులని సిద్ధపురుషులని లోకమంతా చెపుతున్నది. నన్ను గురించి తెలుసుకోవాలన్న ఆలోచన మీకు రావటమే నా అదృష్టం. పేదదానిని. నాకు పెళ్ళేమిటి? మీ సేవ చేసుకొనే అవకాశమిస్తే చాలు. జీవితమంతా మీ పాద సన్నిధిలో గడుపుతాను.

స్వామి : చాలు! చాలు! చాలా ఉద్వేగంలో ఉన్నావు. నా సేవలోకి వస్తానంటున్నావు. మరి మీ అమ్మను ఏం చేస్తావు?

రత్న : గురుదేవా! నేనేమి చేస్తాను. మీరే నిర్ణయించాలి.

స్వామి : నన్ను గురుదేవా అంటున్నావు. నేనింకా మంత్రోపదేశం చేయలేదుగా!

రత్న : మహాప్రభూ! మంత్రోపదేశాన్ని మించిన జీవితోపదేశం మొదలైందని అనుకొంటున్నాను. మీరు ఆజ్ఞాపించండి! ఏం చేయమంటారు?

స్వామి : ఏమి చేయగలవు? ఏదైనా చేయగలరోజు భవిష్యత్తులో వస్తుంది. దాని కోసం సాధన చేయాలి. నీవు మంత్రోపదేశం కోసం వచ్చావు. కానీ నేను నీకు ఉపదేశం చేయాలని అనుకోటంలేదు.

రత్న : పూజ్యగురుదేవా! అంత అయోగ్యురాలినా? మీ దగ్గర మంత్రం తీసుకొనే అర్హతలేదా? అయితే నేనింక బ్రతికి ప్రయోజనమేమున్నది?

స్వామి : ఉన్నది. నీకు మంత్రాన్ని కృష్ణ భైరవుడిచ్చేట్లు చేస్తాను.

రత్న : గురుదేవా! నాకు మీరే ఇవ్వాలని నా ప్రార్ధన.

స్వామి : నీకోరిక కాదనను. అలానే!

రత్న : అయితే అనుగ్రహించండి!

స్వామి : ఇప్పుడు కాదు, ఇక్కడ కాదు.

రత్న : మరి యెప్పుడు? ఎక్కడ? నాకు చాలా ఆదుర్దాగా ఉంది.

స్వామి : ఆతురత అవసరంలేదు. సమయం వచ్చినప్పుడు అన్నీ జరగవలసిన పద్ధతిలో జరుగుతవి. నీ ఉపదేశాన్ని గురించి నేను చెప్పింది, నీవు కోరింది - రెండూ జరుగగలవు. అయితే భౌతిక భూమికలో కాదు.

దివ్యభూమికలో నాలో కృష్ణభైరవుడుండి నీకు ఉపదేశిస్తాడు.

రత్న : సిద్ధేశ్వరా! కృష్ణభైరవు డుండుట యేమిటి! మీరే కృష్ణభైరవులు.

స్వామి : తథాస్తు! సిద్ధేశ్వరా! అన్నావు. భక్తితో నిఘంటువు యొక్క అర్థంలో అన్నా భవిష్యత్తులో నా పేరదే అవుతుంది. ఇప్పటివలెనే అప్పుడూ నా దగ్గరకు వస్తావు. అవన్నీ తరువాత తెలియజేయబడతవి.

రత్న : నేను రావటమేమిటి? మీరు రప్పించుకొంటారన్నమాట. ఇప్పుడర్ధమవుతున్నది. నేను మంత్రం కోసం మీదగ్గరకు వచ్చానని అనుకొన్నాను. మీ సంకల్పంవల్ల నేను వచ్చానని ఇప్పుడు తెలుసుకొంటున్నాను.

స్వామి : (చిరునవ్వుతో) తెలివిగల దానివి. ఈ తెలివి నిజమైన అసలు తెలివిగా మారాలి. ఆరోజు త్వరలో వస్తుంది.

రత్న : మంత్రేశ్వరా! యోగీశ్వరులు మీరు. మీ మాటలు వింటుంటే నా తల తిరిగి పోతున్నది. నేనేమై పోతున్నానో అర్ధం కావటంలేదు. మిమ్ము శరణు వేడుకొంటున్నాను. మీ పాదపద్మాలను ఆశ్రయిస్తున్నాను.

త్వమేవ మాతాచ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ నాధశ్చ గురు స్త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ!

అంటూ ఆనందాశ్రువులు జాలువారుతుండగా స్వామి వారి పాదములపై తల ఉంచి రెండు చేతులతో నాగిని వలె చుట్టి నమస్కరించింది.

స్వామి : రత్నా! లే! ఇప్పటికీ అనుభవం చాలు! జాగ్రత్తగా విను. ఈ నవరాత్రుల తర్వాత నేను తీర్ధయాత్రలకు బయలుదేరుతున్నాను. శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ, ఉజ్జయిని, కామాఖ్య క్షేత్రాలకు ప్రయాణం. నాతో చాలామంది పరివారం భక్తయాత్రికులు ఉంటారు. మీ అమ్మతో చెప్పు. ఆమె నా ఇచ్ఛాశక్తివల్ల అంగీకరిస్తుంది. మీ యింటిని బంధువులకు అప్పగించండి. ఈ క్షేత్ర దేవతల అనుగ్రహంతో పునీతురాలివైన నీకు కామాఖ్యలో మంత్రోపదేశం జరుగుతుంది. ఇక యింటికి వెళ్ళు.

రత్న : మీ ఆజ్ఞ. మీ పాదపద్మస్థలమే నా యిల్లు. రేపు మళ్ళీ వస్తాను.

స్వామి : శుభమస్తు, వెళ్ళిరా.

(సశేషం )

🌹🌹🌹🌹🌹

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 938 / Vishnu Sahasranama Contemplation - 938


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 938 / Vishnu Sahasranama Contemplation - 938 🌹

🌻 938. విదిశః, विदिशः, Vidiśaḥ 🌻

ఓం విదిశాయ నమః | ॐ विदिशाय नमः | OM Vidiśāya namaḥ


వివిధాని ఫలాని అధికారిభ్యో విశేషేణ దిశతీతి విదిశః

ఆయా ఫలములకు అధికారము కలవారికి - వారి వారి కర్మములకు తగిన వివిధ ఫలములను విశేషరూపమున ఇచ్చును కనుక విదిశః.



సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 938 🌹

🌻 938. Vidiśaḥ 🌻

OM Vidiśāya namaḥ

विविधानि फलानि अधिकारिभ्यो विशेषेण दिशतीति विदिशः / Vividhāni phalāni adhikāribhyo viśeṣeṇa diśatīti vidiśaḥ

He causes realization of results as per different kinds of actions performed; hence He is Vidiśaḥ.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः ।
चतुरश्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः ॥ १०० ॥

అనన్తరూపోఽనన్తశ్రీర్జితమన్యుర్భయాపహః ।
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః ॥ 100 ॥

Anantarūpo’nantaśrīrjitamanyurbhayāpahaḥ,
Caturaśro gabhīrātmā vidiśo vyādiśo diśaḥ ॥ 100 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹

కపిల గీత - 345 / Kapila Gita - 345


🌹. కపిల గీత - 345 / Kapila Gita - 345 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 8. ధూమ - అర్చిరాది మార్గములద్వారా వెళ్ళువారి గతి - భక్తియోగ విశిష్టత - 28 🌴

28. జ్ఞానమేకం పరాచీనైరింద్రియైర్బ్రహ్మ నిర్గుణమ్|
అవభాత్యర్థరూపేణ భ్రాంత్యా శబ్దాదిధర్మిణా॥


తాత్పర్యము : నిర్గుణ బ్రహ్మము జ్ఞానస్వరూపుడు, అద్వితీయుడు. కాని, బాహ్యదృష్టి యందు ఆసక్తి గల ఇంద్రియములకు శబ్దాది ధర్మములు గల వస్తువుల యందు భ్రాంతిచే పెక్కు రూపములలో గోచరించును.

వ్యాఖ్య : పరమ పరమ సత్యం, భగవంతుని వ్యక్తిత్వం, ఒక్కటే, మరియు అతను తన అవ్యక్త లక్షణం ద్వారా ప్రతిచోటా వ్యాపించి ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, 'అనుభవించే ప్రతిదీ నా శక్తి యొక్క విస్తరణ మాత్రమే.' అయితే ఆయన అన్నిటిలోనూ ఉన్నాడని అర్థం కాదు. డ్రమ్ యొక్క శబ్దం యొక్క శ్రవణ గ్రహణశక్తి, అందమైన స్త్రీ యొక్క దృశ్య గ్రహణశక్తి లేదా నాలుక ద్వారా పాల తయారీ యొక్క రుచికరమైన రుచిని గ్రహించడం వంటి ఇంద్రియ గ్రహణాలు వివిధ ఇంద్రియాల ద్వారా వస్తాయి మరియు అందువల్ల భిన్నంగా అర్థం చేసుకోబడతాయి. అందువల్ల ఇంద్రియ జ్ఞానం వివిధ వర్గాలుగా విభజించబడింది, అయితే వాస్తవానికి ప్రతిదీ పరమేశ్వరుని శక్తి యొక్క అభివ్యక్తిగా ఉంది.

బ్రహ్మ పరమ సత్యం మరియు ఈ సృష్టి అసత్యం (బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా) అనే తత్వాన్ని వైష్ణవ తత్వవేత్తలు అంగీకరించరు. మెరిసేదంతా బంగారం కానప్పటికీ, మెరిసే వస్తువు అబద్ధమని దీని అర్థం కాదు అని ఉదాహరణ ఇవ్వబడింది. ఉదాహరణకు, ఓస్టెర్ షెల్ బంగారు రంగులో కనిపిస్తుంది. బంగారు రంగు యొక్క ఈ రూపాన్ని కేవలం కళ్ళు యొక్క అవగాహన కారణంగా మాత్రమే, కానీ ఓస్టెర్ షెల్ తప్పు అని అర్థం కాదు. అదే విధంగా, కృష్ణ భగవానుడి రూపాన్ని చూడటం ద్వారా అతను అసలు ఏమిటో అర్థం చేసుకోలేడు, కానీ అతను అబద్ధమని దీని అర్థం కాదు. కృష్ణుడి రూపాన్ని బ్రహ్మ-సంహిత వంటి జ్ఞాన గ్రంథాలలో వివరించినందున అర్థం చేసుకోవాలి. భగవంతుని యొక్క సర్వోన్నత వ్యక్తి అయిన కృష్ణుడు శాశ్వతమైన, ఆనందకరమైన ఆధ్యాత్మిక శరీరాన్ని కలిగి ఉన్నాడు. మన అసంపూర్ణ ఇంద్రియ గ్రహణశక్తి ద్వారా మనం భగవంతుని రూపాన్ని అర్థం చేసుకోలేము. మనం ఆయన గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 345 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 8. Entanglement in Fruitive Activities - 28 🌴

28. jñānam ekaṁ parācīnair indriyair brahma nirguṇam
avabhāty artha-rūpeṇa bhrāntyā śabdādi-dharmiṇā


MEANING : Those who are averse to the Transcendence realize the Supreme Absolute Truth differently through speculative sense perception, and therefore, because of mistaken speculation, everything appears to them to be relative.

PURPORT : The Supreme Absolute Truth, the Personality of Godhead, is one, and He is spread everywhere by His impersonal feature. This is clearly expressed in Bhagavad-gītā. Lord Kṛṣṇa says, "Everything that is experienced is but an expansion of My energy." Everything is sustained by Him, but that does not mean that He is in everything. Sense perceptions, such as aural perception of the sound of a drum, visual perception of a beautiful woman, or perception of the delicious taste of a milk preparation by the tongue, all come through different senses and are therefore differently understood. Therefore sensory knowledge is divided in different categories, although actually everything is one as a manifestation of the energy of the Supreme Lord.

The philosophy that the Absolute is true and this creation is false (brahma satyaṁ jagan mithyā) is not accepted by Vaiṣṇava philosophers. The example is given that although all that glitters is not gold, this does not mean that a glittering object is false. For example, an oyster shell appears to be golden. This appearance of golden hue is due only to the perception of the eyes, but that does not mean that the oyster shell is false. Similarly, by seeing the form of Lord Kṛṣṇa one cannot understand what He actually is, but this does not mean that He is false. The form of Kṛṣṇa has to be understood as it is described in the books of knowledge such as Brahma-saṁhitā. Īśvaraḥ paramaḥ kṛṣṇaḥ sac-cid-ānanda-vigrahaḥ (BS 5.1): Kṛṣṇa, the Supreme Personality of Godhead, has an eternal, blissful spiritual body. By our imperfect sense perception we cannot understand the form of the Lord. We have to acquire knowledge about Him.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 08, JUNE 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹

🍀🌹 08, JUNE 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹🍀
1) 🌹 కపిల గీత - 345 / Kapila Gita - 345 🌹 
🌴 8. ధూమ - అర్చిరాది మార్గముల ద్వారా వెళ్ళు వారి గతి - భక్తియోగ విశిష్టత - 28 / 8. Entanglement in Fruitive Activities - 28 🌴
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 938 / Vishnu Sahasranama Contemplation - 938 🌹
🌻 938. విదిశః, विदिशः, Vidiśaḥ 🌻
3) 🌹 సిద్దేశ్వరయానం - 75🌹
🏵 రత్నప్రభ -2 🏵
4) 🌹. శివ సూత్రములు - 252 / Siva Sutras - 252 🌹
🌻 3-39. చిత్తస్థితివత్ శరీర కరణ బాహ్యేషు - 2 / 3-39. cittasthitivat śarīra karana bāhyesu - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 345 / Kapila Gita - 345 🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 8. ధూమ - అర్చిరాది మార్గములద్వారా వెళ్ళువారి గతి - భక్తియోగ విశిష్టత - 28 🌴*

*28. జ్ఞానమేకం పరాచీనైరింద్రియైర్బ్రహ్మ నిర్గుణమ్|*
*అవభాత్యర్థరూపేణ భ్రాంత్యా శబ్దాదిధర్మిణా॥*

*తాత్పర్యము : నిర్గుణ బ్రహ్మము జ్ఞానస్వరూపుడు, అద్వితీయుడు. కాని, బాహ్యదృష్టి యందు ఆసక్తి గల ఇంద్రియములకు శబ్దాది ధర్మములు గల వస్తువుల యందు భ్రాంతిచే పెక్కు రూపములలో గోచరించును.*

*వ్యాఖ్య : పరమ పరమ సత్యం, భగవంతుని వ్యక్తిత్వం, ఒక్కటే, మరియు అతను తన అవ్యక్త లక్షణం ద్వారా ప్రతిచోటా వ్యాపించి ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, 'అనుభవించే ప్రతిదీ నా శక్తి యొక్క విస్తరణ మాత్రమే.' అయితే ఆయన అన్నిటిలోనూ ఉన్నాడని అర్థం కాదు. డ్రమ్ యొక్క శబ్దం యొక్క శ్రవణ గ్రహణశక్తి, అందమైన స్త్రీ యొక్క దృశ్య గ్రహణశక్తి లేదా నాలుక ద్వారా పాల తయారీ యొక్క రుచికరమైన రుచిని గ్రహించడం వంటి ఇంద్రియ గ్రహణాలు వివిధ ఇంద్రియాల ద్వారా వస్తాయి మరియు అందువల్ల భిన్నంగా అర్థం చేసుకోబడతాయి. అందువల్ల ఇంద్రియ జ్ఞానం వివిధ వర్గాలుగా విభజించబడింది, అయితే వాస్తవానికి ప్రతిదీ పరమేశ్వరుని శక్తి యొక్క అభివ్యక్తిగా ఉంది.*

*బ్రహ్మ పరమ సత్యం మరియు ఈ సృష్టి అసత్యం (బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా) అనే తత్వాన్ని వైష్ణవ తత్వవేత్తలు అంగీకరించరు. మెరిసేదంతా బంగారం కానప్పటికీ, మెరిసే వస్తువు అబద్ధమని దీని అర్థం కాదు అని ఉదాహరణ ఇవ్వబడింది. ఉదాహరణకు, ఓస్టెర్ షెల్ బంగారు రంగులో కనిపిస్తుంది. బంగారు రంగు యొక్క ఈ రూపాన్ని కేవలం కళ్ళు యొక్క అవగాహన కారణంగా మాత్రమే, కానీ ఓస్టెర్ షెల్ తప్పు అని అర్థం కాదు. అదే విధంగా, కృష్ణ భగవానుడి రూపాన్ని చూడటం ద్వారా అతను అసలు ఏమిటో అర్థం చేసుకోలేడు, కానీ అతను అబద్ధమని దీని అర్థం కాదు. కృష్ణుడి రూపాన్ని బ్రహ్మ-సంహిత వంటి జ్ఞాన గ్రంథాలలో వివరించినందున అర్థం చేసుకోవాలి. భగవంతుని యొక్క సర్వోన్నత వ్యక్తి అయిన కృష్ణుడు శాశ్వతమైన, ఆనందకరమైన ఆధ్యాత్మిక శరీరాన్ని కలిగి ఉన్నాడు. మన అసంపూర్ణ ఇంద్రియ గ్రహణశక్తి ద్వారా మనం భగవంతుని రూపాన్ని అర్థం చేసుకోలేము. మనం ఆయన గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 345 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 8. Entanglement in Fruitive Activities - 28 🌴*

*28. jñānam ekaṁ parācīnair indriyair brahma nirguṇam*
*avabhāty artha-rūpeṇa bhrāntyā śabdādi-dharmiṇā*

*MEANING : Those who are averse to the Transcendence realize the Supreme Absolute Truth differently through speculative sense perception, and therefore, because of mistaken speculation, everything appears to them to be relative.*

*PURPORT : The Supreme Absolute Truth, the Personality of Godhead, is one, and He is spread everywhere by His impersonal feature. This is clearly expressed in Bhagavad-gītā. Lord Kṛṣṇa says, "Everything that is experienced is but an expansion of My energy." Everything is sustained by Him, but that does not mean that He is in everything. Sense perceptions, such as aural perception of the sound of a drum, visual perception of a beautiful woman, or perception of the delicious taste of a milk preparation by the tongue, all come through different senses and are therefore differently understood. Therefore sensory knowledge is divided in different categories, although actually everything is one as a manifestation of the energy of the Supreme Lord.*

*The philosophy that the Absolute is true and this creation is false (brahma satyaṁ jagan mithyā) is not accepted by Vaiṣṇava philosophers. The example is given that although all that glitters is not gold, this does not mean that a glittering object is false. For example, an oyster shell appears to be golden. This appearance of golden hue is due only to the perception of the eyes, but that does not mean that the oyster shell is false. Similarly, by seeing the form of Lord Kṛṣṇa one cannot understand what He actually is, but this does not mean that He is false. The form of Kṛṣṇa has to be understood as it is described in the books of knowledge such as Brahma-saṁhitā. Īśvaraḥ paramaḥ kṛṣṇaḥ sac-cid-ānanda-vigrahaḥ (BS 5.1): Kṛṣṇa, the Supreme Personality of Godhead, has an eternal, blissful spiritual body. By our imperfect sense perception we cannot understand the form of the Lord. We have to acquire knowledge about Him.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 938 / Vishnu Sahasranama Contemplation - 938 🌹*

*🌻 938. విదిశః, विदिशः, Vidiśaḥ 🌻*

*ఓం విదిశాయ నమః | ॐ विदिशाय नमः | OM Vidiśāya namaḥ*

*వివిధాని ఫలాని అధికారిభ్యో విశేషేణ దిశతీతి విదిశః*

*ఆయా ఫలములకు అధికారము కలవారికి - వారి వారి కర్మములకు తగిన వివిధ ఫలములను విశేషరూపమున ఇచ్చును కనుక విదిశః.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 938 🌹*

*🌻 938. Vidiśaḥ 🌻*

*OM Vidiśāya namaḥ*

*विविधानि फलानि अधिकारिभ्यो विशेषेण दिशतीति विदिशः / Vividhāni phalāni adhikāribhyo viśeṣeṇa diśatīti vidiśaḥ*

*He causes realization of results as per different kinds of actions performed; hence He is Vidiśaḥ.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः ।चतुरश्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः ॥ १०० ॥
అనన్తరూపోఽనన్తశ్రీర్జితమన్యుర్భయాపహః ।చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః ॥ 100 ॥
Anantarūpo’nantaśrīrjitamanyurbhayāpahaḥ,Caturaśro gabhīrātmā vidiśo vyādiśo diśaḥ ॥ 100 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 సిద్దేశ్వరయానం - 75 🌹*

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
         
*🏵 రత్న ప్రభ -2 🏵*

*రత్న ప్రభ : మహాత్మా! నేను మీతో మాట్లాడలేను. మొదటిసారి మిమ్ము కామాక్షీదేవి దగ్గర చూచినప్పుడే ఏదో చెప్పలేని భక్తి పారవశ్యం కలిగింది. ఎందుకో ఏమో తెలియదు. నా అనుభూతికి ఏ ఆధారము లేదు. కానీ అంతరాంతరాలలో మీరు తప్పక నన్ను కరుణిస్తారని అనిపిస్తున్నది. మీతో మాట్లాడాలని మీతో ఎక్కువసేపు గడపాలని, మీ సన్నిధిలో ఉండాలని తీవ్రమైన ఆకాంక్ష. నేను కొంచెం సంస్కృతం చదువుకొన్నాను. కాళిదాస మహాకవి రచించిన ఒక శ్లోకం గుర్తుకు వస్తున్నది.*

*శ్లో॥ రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శబ్దాన్ పర్యుత్సుకోభవతి యత్సుఖితో పిజంతుః*
*తచ్చేతసా స్మరతి నూన మబోధ పూర్వం భావస్థిరాణి జననాంతర సౌహృదాని*

*ఎప్పటివో ఏవో పూర్వజన్మ అనుబంధాలు నన్ను కలచి వేస్తున్నవా? కానీ మీముందు అంత సాహస వచనాలు పలుకలేను.*
*స్వామీ : ఓ! మంచి పండితురాలివి. పంచకావ్యాల వరకు చదువుకొన్నావు గదా! ఇంకా చదివేదానివే. నీ తండ్రి - నిన్ను మీ అమ్మను విడిచిపెట్టి వేరెవరితోనో ఉండటంవల్ల మీ యింటి పరిస్థితి కల్లోలితమైంది. ఏదో మీ అమ్మ పుట్టింటి వారిచ్చిన ఆస్తితో నిన్నుపెంచి పెద్ద చేస్తున్నది. ఇంకా పెద్ద చదువులు చదవవలసిన దానివే. సరిలే! దానికేమి? ఈ మంత్రోపదేశం సంగతి అటుంచు. పెళ్ళెప్పుడు చేసుకొంటావు?*

*రత్న : స్వామీ! స్వామీ! నేనెంత అదృష్టవంతురాలిని. నా కుటుంబ విషయాలు నేను మీకు చెప్పలేదు. మీకెవరూ చెప్పే అవకాశం లేదు. ఇవి మీకెలా తెలిసినవని నేనడగను. మీరు సర్వజ్ఞులని సిద్ధపురుషులని లోకమంతా చెపుతున్నది. నన్ను గురించి తెలుసుకోవాలన్న ఆలోచన మీకు రావటమే నా అదృష్టం. పేదదానిని. నాకు పెళ్ళేమిటి? మీ సేవ చేసుకొనే అవకాశమిస్తే చాలు. జీవితమంతా మీ పాద సన్నిధిలో గడుపుతాను.*
*స్వామి : చాలు! చాలు! చాలా ఉద్వేగంలో ఉన్నావు. నా సేవలోకి వస్తానంటున్నావు. మరి మీ అమ్మను ఏం చేస్తావు?*
*రత్న : గురుదేవా! నేనేమి చేస్తాను. మీరే నిర్ణయించాలి.*
*స్వామి : నన్ను గురుదేవా అంటున్నావు. నేనింకా మంత్రోపదేశం చేయలేదుగా!*
*రత్న : మహాప్రభూ! మంత్రోపదేశాన్ని మించిన జీవితోపదేశం మొదలైందని అనుకొంటున్నాను. మీరు ఆజ్ఞాపించండి! ఏం చేయమంటారు?*

*స్వామి : ఏమి చేయగలవు? ఏదైనా చేయగలరోజు భవిష్యత్తులో వస్తుంది. దాని కోసం సాధన చేయాలి. నీవు మంత్రోపదేశం కోసం వచ్చావు. కానీ నేను నీకు ఉపదేశం చేయాలని అనుకోటంలేదు.*
*రత్న : పూజ్యగురుదేవా! అంత అయోగ్యురాలినా? మీ దగ్గర మంత్రం తీసుకొనే అర్హతలేదా? అయితే నేనింక బ్రతికి ప్రయోజనమేమున్నది?*
*స్వామి : ఉన్నది. నీకు మంత్రాన్ని కృష్ణ భైరవుడిచ్చేట్లు చేస్తాను.*
*రత్న : గురుదేవా! నాకు మీరే ఇవ్వాలని నా ప్రార్ధన.*
*స్వామి : నీకోరిక కాదనను. అలానే!*
*రత్న : అయితే అనుగ్రహించండి!*
*స్వామి : ఇప్పుడు కాదు, ఇక్కడ కాదు.*
*రత్న : మరి యెప్పుడు? ఎక్కడ? నాకు చాలా ఆదుర్దాగా ఉంది.*
*స్వామి : ఆతురత అవసరంలేదు. సమయం వచ్చినప్పుడు అన్నీ జరగవలసిన పద్ధతిలో జరుగుతవి. నీ ఉపదేశాన్ని గురించి నేను చెప్పింది, నీవు కోరింది - రెండూ జరుగగలవు. అయితే భౌతిక భూమికలో కాదు.*
*దివ్యభూమికలో నాలో కృష్ణభైరవుడుండి నీకు ఉపదేశిస్తాడు.*
*రత్న : సిద్ధేశ్వరా! కృష్ణభైరవు డుండుట యేమిటి! మీరే కృష్ణభైరవులు.*
*స్వామి : తథాస్తు! సిద్ధేశ్వరా! అన్నావు. భక్తితో నిఘంటువు యొక్క అర్థంలో అన్నా భవిష్యత్తులో నా పేరదే అవుతుంది. ఇప్పటివలెనే అప్పుడూ నా దగ్గరకు వస్తావు. అవన్నీ తరువాత తెలియజేయబడతవి.*
*రత్న : నేను రావటమేమిటి? మీరు రప్పించుకొంటారన్నమాట. ఇప్పుడర్ధమవుతున్నది. నేను మంత్రం కోసం మీదగ్గరకు వచ్చానని అనుకొన్నాను. మీ సంకల్పంవల్ల నేను వచ్చానని ఇప్పుడు తెలుసుకొంటున్నాను.*
*స్వామి : (చిరునవ్వుతో) తెలివిగల దానివి. ఈ తెలివి నిజమైన అసలు తెలివిగా మారాలి. ఆరోజు త్వరలో వస్తుంది.*
*రత్న : మంత్రేశ్వరా! యోగీశ్వరులు మీరు. మీ మాటలు వింటుంటే నా తల తిరిగి పోతున్నది. నేనేమై పోతున్నానో అర్ధం కావటంలేదు. మిమ్ము శరణు వేడుకొంటున్నాను. మీ పాదపద్మాలను ఆశ్రయిస్తున్నాను.*
*త్వమేవ మాతాచ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ నాధశ్చ గురు స్త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ!*
*అంటూ ఆనందాశ్రువులు జాలువారుతుండగా స్వామి వారి పాదములపై తల ఉంచి రెండు చేతులతో నాగిని వలె చుట్టి నమస్కరించింది.*
*స్వామి : రత్నా! లే! ఇప్పటికీ అనుభవం చాలు! జాగ్రత్తగా విను. ఈ నవరాత్రుల తర్వాత నేను తీర్ధయాత్రలకు బయలుదేరుతున్నాను. శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ, ఉజ్జయిని, కామాఖ్య క్షేత్రాలకు ప్రయాణం. నాతో చాలామంది పరివారం భక్తయాత్రికులు ఉంటారు. మీ అమ్మతో చెప్పు. ఆమె నా ఇచ్ఛాశక్తివల్ల అంగీకరిస్తుంది. మీ యింటిని బంధువులకు అప్పగించండి. ఈ క్షేత్ర దేవతల అనుగ్రహంతో పునీతురాలివైన నీకు కామాఖ్యలో మంత్రోపదేశం జరుగుతుంది. ఇక యింటికి వెళ్ళు.*
*రత్న : మీ ఆజ్ఞ. మీ పాదపద్మస్థలమే నా యిల్లు. రేపు మళ్ళీ వస్తాను.*
*స్వామి : శుభమస్తు, వెళ్ళిరా.*
*(సశేషం )*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 252 / Siva Sutras - 252 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*3వ భాగం - ఆణవోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 3-39. చిత్తస్థితివత్ శరీర కరణ బాహ్యేషు - 2 🌻*

*🌴. అతను తన చైతన్యాన్ని (చిత్త) తుర్య యొక్క నాల్గవ స్థితితో నింపినట్లే, అతని మనస్సు తన శరీరం, ఇంద్రియాలు మరియు బాహ్య వస్తువులతో బాహ్యంగా నిమగ్నమై ఉన్నప్పుడు కూడా అదే సాధన చేయాలి. 🌴*

*అన్నీ ఇతర ఆలోచనా ప్రక్రియల నుండి మనస్సు విముక్తి పొందినప్పుడు మాత్రమే ఏక దృష్టి సాధ్యపడుతుంది. ఈ ఒక్క ఏకాగ్రతా శక్తి, అన్నీ పూర్వ ముద్రలు మరియు అహం యొక్క అవశేషాలను స్వయంచాలకంగా తుడిచి వేస్తుంది. ప్రారంభంలో భగవంతునిపై దృష్టిని ప్రభావవంతంగా కేంద్రీకరించడానికి మానవ ప్రయత్నం అవసరం. అప్పుడే ప్రక్షాళన ప్రక్రియ స్వయంచాలకంగా ప్రారంభించ బడుతుంది. మనస్సు పూర్తిగా శుద్ధి అయినప్పుడు, యోగి ఆనంద స్థితిలోకి ప్రవేశిస్తాడు. అతని మానసిక ఆనందం అతని శరీరం ద్వారా కూడా ప్రసరిస్తుంది. ముఖం అనేది మనస్సు యొక్క సూచిక అనే సామెతను ఇది ధృవీకరిస్తుంది మరియు ఈ సూత్రం ఈ అంశాన్ని మరింత విశదపరుస్తుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras  - 252 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
*Part 3 - āṇavopāya*
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 3 - 39. cittasthitivat śarīra karana bāhyesu - 2 🌻*

*🌴. Just as he fills his consciousness (chitta) with the fourth state of turya, so should he practice the same when his mind is externally engaged with his body, senses and external objects. 🌴*

*Single pointed attention is possible only when the mind is free of any other thought processes. This single pointed focus automatically sweeps off the remnants of impressions and ego. Effectually, initial human effort is needed merely to focus on the Lord and the cleansing process is automatically initiated. When the mind is totally purified, the yogi enters the state of blissfulness. His mental happiness is radiated through his body. This confirms the saying that, face is the index of the mind and this sūtra elucidates this aspect further.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 547 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 547 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 547 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 547 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 111. పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా ।
పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా ॥ 111 ॥ 🍀

🌻 547. 'బర్బరాలకా’ - 2 🌻


సంస్కారవంతులు ఆపాద మస్తకము నిత్యమూ సంస్కరించుకొందురు. బహిరంతరములను కూడ అట్లే సంస్కరించుకొనుచుందురు. తమ పరిసరములను, దేహమును, యింద్రియములను, మనస్సును నిత్యమూ సంస్కరించు కొననిచో అపవిత్రత పేర్కొనుట తథ్యము. మనస్సు అద్దము వంటిది. అద్దముపై పడిన దుమ్ము తుడుచుకొననిచో ప్రతిబింబము స్పష్టముగ నుండదు.

నిత్యమూ శుచి, శౌచమునకు సంబంధించిన కార్యములు నిర్వర్తింపని వారు జీవితమున చిక్కులు పడుదురు. సంస్కారములను క్రతుబద్ధముగ నిర్వర్తించుకొనుట ఆర్య ధర్మము. అట్లు నిర్వర్తించుకొనని వారిని బర్బరులు అందురు. బర్బరు లనగా సంస్కారహీనులని అర్థము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 547 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 111. Punyakirtih punyalabhya punyashravana kirtana
pulomajarchita bandhamochani bandhuralaka ॥111 ॥ 🌻

🌻 547. 'Barbaralaka' - 2 🌻


Cultured people are constantly reforming their minds. In the same way they groom their bodies within and outside. If one does not constantly reform one's surroundings, body, senses and mind, it is certain for impurity to accumulate. Mind is like a mirror. If the dust on the mirror is not cleaned, the reflection will not be clear.

Those who do not perform the tasks related to cleanliness and hygiene will get tangled in life. Arya dharma is to perform the rites regularly. Those who do not do so are called barbarians. Barbarians are those who are uncivilized.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


సిద్దేశ్వరయానం - 74 Siddeshwarayanam - 74


🌹 సిద్దేశ్వరయానం - 74 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 రత్న ప్రభ - 1 🏵


కాంచీపుర కామాక్షీదేవి ఆలయంలో క్రీ.శ.1892 శరదృతువులో దేవీనవరాత్రోత్సవాలు ప్రారంభమైనవి. వైభవోపేతంగా శాస్త్రోక్త విధానంలో పూజలు, హోమాలు మొదలైనవన్నీ జరుగుతున్నవి. కార్యక్రమాలలో భాగంగా సాయంకాలంపూట పండితుల ప్రవచనాలు ఏర్పాటు చేయబడినవి. ఒకరోజు భీషణ సుందరంగా అలంకరించిన కాళీ విగ్రహం సమావేశం జరిగేచోట ఎత్తుగా ఉంచి పూజిస్తున్నారు. రోజుకొక దేవీమూర్తి. ఆరోజు అర్చించబడుతున్న కాళీదేవి దగ్గర ఒకయోగి కూర్చుండి కాళీతత్త్వాన్ని గూర్చి అద్భుతంగా ఉపన్యాసం చెపుతున్నాడు. సదస్యులంతా పరవశించి పోతున్నారు. వారిలో రత్నప్రభ అనే అమ్మాయి ఉంది. కార్యక్రమం అయిన తర్వాత తెలిసిన పెద్దవారిని ఆ యోగిని గూర్చి అడిగింది.

ఆయన ఆంధ్రదేశంలో విజయనగరం నుండి వచ్చాడట. శ్రీపాదవారి వంశంలో ప్రభవించాడు. తల్లిదండ్రులు తీర్ధయాత్రలకు వచ్చినప్పుడు కంచిలోనే పుట్టాడని కొందరు చెపుతున్నారు. ఏదైనా కంచితో వారికి బాగా అనుబంధం ఉంది. తరచుగా అక్కడికి వస్తుంటారు. కాళీమంత్రసిద్ధుడని దివ్యశక్తులు సాధించినవాడని ప్రఖ్యాతి పొందాడు. ఆయన పేరు అక్కడ ఎవరికీ తెలియదు. పరమాత్మస్వామి అని అందరూ పిలుస్తారు.

రత్నప్రభ ఇంటికి వెళ్ళి తల్లికి ఈ విషయాలను చెప్పింది. మర్నాడు ఆమె కూడా వచ్చి వారి ప్రవచనం విన్నది. ఆయన మహానుభావుడనే విశ్వాసం కలిగింది. ఇంట్లో పని వెసులుబాటు కలిగినరోజు వస్తున్నది. కూతురు మాత్రం రోజూ వచ్చి ఆ మహాత్ముని వాక్కుల వల్ల ఎంతో ప్రభావితురాలైంది. నవరాత్రులలో ఆయన ఎన్నో విషయాలు చెప్పాడు. అన్నింటిలో కాళీదేవిని గూర్చి ఆయన చెప్పినవి ఆ బాలిక నెంతో ఆకర్షించినవి. ఆలయం దగ్గరగా ఉన్న ఒకతోటలోని గృహంలో ఆ మహనీయుని వసతి అని, అక్కడికివెళ్ళి ప్రార్థించిన వారికి ఆయన మంత్రోపదేశం చేస్తున్నాడని విని తానుకూడా కాళీమంత్రోపదేశం పొందాలని భావించి తల్లితో చెప్పింది. తల్లి కాళీదేవి భయంకర దేవత అంటారు. ఏదైనా శాంత సుందరదేవత యొక్క మంత్రం ఉపదేశం తీసుకోరాదా అని అన్నదిగాని కూతురు పట్టుపట్టటంవల్ల కాదనలేక సరే అంది.

మరునాడు ఉదయం వారి నివాసానికి వెళ్ళి సందర్శకులంతా వెళ్ళిపోయిన తర్వాత చివరగా వెళ్లి పాదనమస్కారం చేసింది.

రత్నప్రభ : స్వామీ! నాపేరు రత్నప్రభ. ఇక్కడికి దగ్గరలో మా అమ్మ నేను ఉంటాము. మీ ప్రవచనాలు విన్న తర్వాత కాళీమంత్రసాధన చేయాలని అనిపించింది. నన్ను అనుగ్రహించి నాకు మంత్రం ఉపదేశించండి.

స్వామి : మంత్రం చెపుతాను. నీవు చేతనైనంత జపం చేస్తావు. మంచిదే. అయితే ఏం కోరి ఈ సాధనలోకి ప్రవేశిస్తున్నావు? నీ ధ్యేయ మేమిటి?

రత్న : అయ్యా! మీ మాటలలోని ఆకర్షణవల్ల కాళీదేవి అంటే ఇష్టం కలిగింది. నేను రోజూ కామాక్షీదేవి దగ్గరకు వచ్చి నమస్కారం చేసి వెళుతుంటాను. ఇప్పుడెందుకో కాళీదేవి అంటే ఇష్టం ఏర్పడింది. ఆమెను చూడాలని, ఆమె ఒడిలో బిడ్డగా ఉండాలని అనిపిస్తున్నది.

స్వామీ : ప్రభా! ఆహారము, నిద్ర వదలి ఎన్నో యేండ్లు అడవులలో లేక మహాక్షేత్రాలలో కోటానుకోట్లు జపం చేస్తేగాని కాళీదర్శనం కాదు. మరి నీవలా చేయగలవా?

రత్న : ఏది చేసైనా అమ్మను చూడాలి. నా కెంతవరకు సాధ్యమో అర్థం కావటం లేదు. మీరు సిద్ధ పురుషులని కాళీదేవి మీతో మాట్లాడుతుందని విన్నాను. మీరు దయదలిస్తే ఈ తపస్సులు, ఈ కఠోర దీక్షలు లేకుండా దర్శనం ఇవ్వగలరు గదా!

స్వామి : ఇవ్వగలగవచ్చు. కానీ ఎందుకు ఇవ్వాలి? నా దగ్గరకు వందలమంది వస్తారు. రకరకాల కోరికలతో వారికి తగిన మంత్రమిచ్చి జపహోమాలు చేయిస్తాను. వారికి కష్టనివారణ అభీష్టసిద్ధి కలుగుతుంది. నీవు వారివలెనే సాధనచెయ్యి. తీవ్రసాధన చేస్తే కొంత అనుగ్రహం కలగవచ్చు. కొన్ని అనుభూతులు రావచ్చు.

( సశేషం )

🌹🌹🌹🌹🌹


శ్రీమద్భగవద్గీత - 538: 14వ అధ్., శ్లో 14 / Bhagavad-Gita - 538: Chap. 14, Ver. 14

 

🌹. శ్రీమద్భగవద్గీత - 538 / Bhagavad-Gita - 538 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 14 🌴

14. యదా సత్త్వే ప్రవృద్దే తు ప్రలయం యాతి దేహభృత్ |
తదోత్తమవిదాం లోకానమలాన్ ప్రతిపద్యతే ||


🌷. తాత్పర్యం : సత్త్వగుణము నందుండి మరణించినవాడు మహర్షుల యొక్క ఉన్నత పవిత్రలోకములను పొందును.

🌷. భాష్యము : సత్త్వగుణము నందున్నవాడు బ్రహ్మలోకము లేదా జనలోకము వంటి ఉన్నత లోకములను పొంది అచ్చట దేహసౌఖ్యముల ననుభవించును. ఈ శ్లోకమున “అమలాన్” అను పదము ప్రధానమైనది. ఆ లోకములు రజస్తమోగుణముల నుండి విడివడియున్నవి తెలియజేయుటయే దాని భావము. కలుషభరితమైన ఈ భౌతికజగమున సత్త్వగుణమనునది అత్యంత పవిత్రమైయున్నది.

భిన్నజీవుల కొరకు భిన్నలోకములు ఏర్పాటు చేయబడియున్నందున, సత్త్వగుణమునందు నిలిచి మరణించువారు మహర్షులు మరియు మహాభక్తులు నివసించు లోకములకు ఉద్దరింపబడుదురు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 538 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 14 🌴

14. yadā sattve pravṛddhe tu pralayaṁ yāti deha-bhṛt
tadottama-vidāṁ lokān amalān pratipadyate


🌷 Translation : When one dies in the mode of goodness, he attains to the pure higher planets of the great sages.

🌹 Purport : One in goodness attains higher planetary systems, like Brahmaloka or Janaloka, and there enjoys godly happiness. The word amalān is significant; it means “free from the modes of passion and ignorance.” There are impurities in the material world, but the mode of goodness is the purest form of existence in the material world.

There are different kinds of planets for different kinds of living entities. Those who die in the mode of goodness are elevated to the planets where great sages and great devotees live.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 07, JUNE 2024 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు🌹

🍀🌹 07, JUNE 2024 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు🌹🍀
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 538 / Bhagavad-Gita - 538 🌹
🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 49 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 49 🌴
3) 🌹 సిద్దేశ్వరయానం - 74 🌹
🏵 రత్నప్రభ - 1 🏵
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 547 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 547 - 2 🌹 
🌻 547. 'బర్బరాలకా’ - 2 / 547. 'Barbaralaka' - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 538 / Bhagavad-Gita - 538 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 14 🌴*

*14. యదా సత్త్వే ప్రవృద్దే తు ప్రలయం యాతి దేహభృత్ |*
*తదోత్తమవిదాం లోకానమలాన్ ప్రతిపద్యతే ||*

*🌷. తాత్పర్యం : సత్త్వగుణము నందుండి మరణించినవాడు మహర్షుల యొక్క ఉన్నత పవిత్రలోకములను పొందును.*

*🌷. భాష్యము : సత్త్వగుణము నందున్నవాడు బ్రహ్మలోకము లేదా జనలోకము వంటి ఉన్నత లోకములను పొంది అచ్చట దేహసౌఖ్యముల ననుభవించును. ఈ శ్లోకమున “అమలాన్” అను పదము ప్రధానమైనది. ఆ లోకములు రజస్తమోగుణముల నుండి విడివడియున్నవి తెలియజేయుటయే దాని భావము. కలుషభరితమైన ఈ భౌతికజగమున సత్త్వగుణమనునది అత్యంత పవిత్రమైయున్నది.*

*భిన్నజీవుల కొరకు భిన్నలోకములు ఏర్పాటు చేయబడియున్నందున, సత్త్వగుణమునందు నిలిచి మరణించువారు మహర్షులు మరియు మహాభక్తులు నివసించు లోకములకు ఉద్దరింపబడుదురు.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 538 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 14 🌴*

*14. yadā sattve pravṛddhe tu pralayaṁ yāti deha-bhṛt*
*tadottama-vidāṁ lokān amalān pratipadyate*

*🌷 Translation : When one dies in the mode of goodness, he attains to the pure higher planets of the great sages.*

*🌹 Purport : One in goodness attains higher planetary systems, like Brahmaloka or Janaloka, and there enjoys godly happiness. The word amalān is significant; it means “free from the modes of passion and ignorance.” There are impurities in the material world, but the mode of goodness is the purest form of existence in the material world.*

*There are different kinds of planets for different kinds of living entities. Those who die in the mode of goodness are elevated to the planets where great sages and great devotees live.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 సిద్దేశ్వరయానం - 74 🌹*

*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
   
*🏵 రత్న ప్రభ - 1 🏵*

*కాంచీపుర కామాక్షీదేవి ఆలయంలో క్రీ.శ.1892 శరదృతువులో దేవీనవరాత్రోత్సవాలు ప్రారంభమైనవి. వైభవోపేతంగా శాస్త్రోక్త విధానంలో పూజలు, హోమాలు మొదలైనవన్నీ జరుగుతున్నవి. కార్యక్రమాలలో భాగంగా సాయంకాలంపూట పండితుల ప్రవచనాలు ఏర్పాటు చేయబడినవి. ఒకరోజు భీషణ సుందరంగా అలంకరించిన కాళీ విగ్రహం సమావేశం జరిగేచోట ఎత్తుగా ఉంచి పూజిస్తున్నారు. రోజుకొక దేవీమూర్తి. ఆరోజు అర్చించబడుతున్న కాళీదేవి దగ్గర ఒకయోగి కూర్చుండి కాళీతత్త్వాన్ని గూర్చి అద్భుతంగా ఉపన్యాసం చెపుతున్నాడు. సదస్యులంతా పరవశించి పోతున్నారు. వారిలో రత్నప్రభ అనే అమ్మాయి ఉంది. కార్యక్రమం అయిన తర్వాత తెలిసిన పెద్దవారిని ఆ యోగిని గూర్చి అడిగింది.*

*ఆయన ఆంధ్రదేశంలో విజయనగరం నుండి వచ్చాడట. శ్రీపాదవారి వంశంలో ప్రభవించాడు. తల్లిదండ్రులు తీర్ధయాత్రలకు వచ్చినప్పుడు కంచిలోనే పుట్టాడని కొందరు చెపుతున్నారు. ఏదైనా కంచితో వారికి బాగా అనుబంధం ఉంది. తరచుగా అక్కడికి వస్తుంటారు. కాళీమంత్రసిద్ధుడని దివ్యశక్తులు సాధించినవాడని ప్రఖ్యాతి పొందాడు. ఆయన పేరు అక్కడ ఎవరికీ తెలియదు. పరమాత్మస్వామి అని అందరూ పిలుస్తారు.*

*రత్నప్రభ ఇంటికి వెళ్ళి తల్లికి ఈ విషయాలను చెప్పింది. మర్నాడు ఆమె కూడా వచ్చి వారి ప్రవచనం విన్నది. ఆయన మహానుభావుడనే విశ్వాసం కలిగింది. ఇంట్లో పని వెసులుబాటు కలిగినరోజు వస్తున్నది. కూతురు మాత్రం రోజూ వచ్చి ఆ మహాత్ముని వాక్కుల వల్ల ఎంతో ప్రభావితురాలైంది. నవరాత్రులలో ఆయన ఎన్నో విషయాలు చెప్పాడు. అన్నింటిలో కాళీదేవిని గూర్చి ఆయన చెప్పినవి ఆ బాలిక నెంతో ఆకర్షించినవి. ఆలయం దగ్గరగా ఉన్న ఒకతోటలోని గృహంలో ఆ మహనీయుని వసతి అని, అక్కడికివెళ్ళి ప్రార్థించిన వారికి ఆయన మంత్రోపదేశం చేస్తున్నాడని విని తానుకూడా కాళీమంత్రోపదేశం పొందాలని భావించి తల్లితో చెప్పింది. తల్లి కాళీదేవి భయంకర దేవత అంటారు. ఏదైనా శాంత సుందరదేవత యొక్క మంత్రం ఉపదేశం తీసుకోరాదా అని అన్నదిగాని కూతురు పట్టుపట్టటంవల్ల కాదనలేక సరే అంది.*

*మరునాడు ఉదయం వారి నివాసానికి వెళ్ళి సందర్శకులంతా వెళ్ళిపోయిన తర్వాత చివరగా వెళ్లి పాదనమస్కారం చేసింది.*

*రత్నప్రభ : స్వామీ! నాపేరు రత్నప్రభ. ఇక్కడికి దగ్గరలో మా అమ్మ నేను ఉంటాము. మీ ప్రవచనాలు విన్న తర్వాత కాళీమంత్రసాధన చేయాలని అనిపించింది. నన్ను అనుగ్రహించి నాకు మంత్రం ఉపదేశించండి.*
*స్వామి : మంత్రం చెపుతాను. నీవు చేతనైనంత జపం చేస్తావు. మంచిదే. అయితే ఏం కోరి ఈ సాధనలోకి ప్రవేశిస్తున్నావు? నీ ధ్యేయ మేమిటి?*

*రత్న : అయ్యా! మీ మాటలలోని ఆకర్షణవల్ల కాళీదేవి అంటే ఇష్టం కలిగింది. నేను రోజూ కామాక్షీదేవి దగ్గరకు వచ్చి నమస్కారం చేసి వెళుతుంటాను. ఇప్పుడెందుకో కాళీదేవి అంటే ఇష్టం ఏర్పడింది. ఆమెను చూడాలని, ఆమె ఒడిలో బిడ్డగా ఉండాలని అనిపిస్తున్నది.*

*స్వామీ : ప్రభా! ఆహారము, నిద్ర వదలి ఎన్నో యేండ్లు అడవులలో లేక మహాక్షేత్రాలలో కోటానుకోట్లు జపం చేస్తేగాని కాళీదర్శనం కాదు. మరి నీవలా చేయగలవా?*
*రత్న : ఏది చేసైనా అమ్మను చూడాలి. నా కెంతవరకు సాధ్యమో అర్థం కావటం లేదు. మీరు సిద్ధ పురుషులని కాళీదేవి మీతో మాట్లాడుతుందని విన్నాను. మీరు దయదలిస్తే ఈ తపస్సులు, ఈ కఠోర దీక్షలు లేకుండా దర్శనం ఇవ్వగలరు గదా!*
*స్వామి : ఇవ్వగలగవచ్చు. కానీ ఎందుకు ఇవ్వాలి? నా దగ్గరకు వందలమంది వస్తారు. రకరకాల కోరికలతో వారికి తగిన మంత్రమిచ్చి జపహోమాలు చేయిస్తాను. వారికి కష్టనివారణ అభీష్టసిద్ధి కలుగుతుంది. నీవు వారివలెనే సాధనచెయ్యి. తీవ్రసాధన చేస్తే కొంత అనుగ్రహం కలగవచ్చు. కొన్ని అనుభూతులు రావచ్చు.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 547 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 547 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 111. పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా ।*
*పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా ॥ 111 ॥ 🍀*

*🌻 547. 'బర్బరాలకా’ - 2 🌻*

*సంస్కారవంతులు ఆపాద మస్తకము నిత్యమూ సంస్కరించుకొందురు. బహిరంతరములను కూడ అట్లే సంస్కరించుకొనుచుందురు. తమ పరిసరములను, దేహమును, యింద్రియములను, మనస్సును నిత్యమూ సంస్కరించు కొననిచో అపవిత్రత పేర్కొనుట తథ్యము. మనస్సు అద్దము వంటిది. అద్దముపై పడిన దుమ్ము తుడుచుకొననిచో ప్రతిబింబము స్పష్టముగ నుండదు.*

*నిత్యమూ శుచి, శౌచమునకు సంబంధించిన కార్యములు నిర్వర్తింపని వారు జీవితమున చిక్కులు పడుదురు. సంస్కారములను క్రతుబద్ధముగ నిర్వర్తించుకొనుట ఆర్య ధర్మము. అట్లు నిర్వర్తించుకొనని వారిని బర్బరులు అందురు. బర్బరు లనగా సంస్కారహీనులని అర్థము.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 547 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 111. Punyakirtih punyalabhya punyashravana kirtana*
*pulomajarchita bandhamochani bandhuralaka ॥111 ॥ 🌻*

*🌻 547. 'Barbaralaka' - 2 🌻*

*Cultured people are constantly reforming their minds. In the same way they groom their bodies within and outside. If one does not constantly reform one's surroundings, body, senses and mind, it is certain for impurity to accumulate. Mind is like a mirror. If the dust on the mirror is not cleaned, the reflection will not be clear.*

*Those who do not perform the tasks related to cleanliness and hygiene will get tangled in life. Arya dharma is to perform the rites regularly. Those who do not do so are called barbarians. Barbarians are those who are uncivilized.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj

Siva Sutras - 251 : 3-39. cittasthitivat sarira karana bahyesu - 1 / శివ సూత్రములు - 251 : 3-39. చిత్తస్థితివత్ శరీర కరణ బాహ్యేషు - 1


🌹. శివ సూత్రములు - 251 / Siva Sutras - 251 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

3వ భాగం - ఆణవోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 3-39. చిత్తస్థితివత్ శరీర కరణ బాహ్యేషు - 1 🌻

🌴. అతను తన చైతన్యాన్ని (చిత్త) తుర్య యొక్క నాల్గవ స్థితితో నింపినట్లే, అతని మనస్సు తన శరీరం, ఇంద్రియాలు మరియు బాహ్య వస్తువులతో బాహ్యంగా నిమగ్నమై ఉన్నప్పుడు కూడా అదే సాధన చేయాలి. 🌴


చిత్త – మానసిక; స్థితి – స్థితులు; వాత్‌ – వంటి లేదా వంటి; శరీర – స్థూల శరీరం; కరణ – ఇంద్రియ అవయవాలు; బాహ్యేషు (బాహ్య)- బాహ్య వస్తువులు.

మునుపటి సూత్రం తర్యను అభివ్యక్తి, జీవనోపాధి మరియు పునశ్శోషణం యొక్క ప్రాధమిక స్థితుల్లోకి ప్రేరేపించడం గురించి చర్చించింది. ఈ ప్రక్రియ మనస్సు యొక్క క్షేత్రంలో జరుగుతుంది. మనస్సును ఉత్తేజపరిచేందుకు ఇది సరిపోదు. పొందుపరిచిన ఇంద్రియ అవయవాలతో పాటు స్థూల శరీరాన్ని ఉత్తేజపరచడం కూడా అవసరం. తుర్య అనేది మానసిక స్థితి, ఇక్కడ ఆశించిన వ్యక్తి ఆనంద స్థితిలోకి ప్రవేశిస్తాడు. తుర్య స్థితిలోకి ప్రవేశించాలంటే, మనస్సు పూర్తిగా భగవంతునిపై దృష్టి కేంద్రీకరించగలిగేలా అన్నీ పూర్వ ముద్రల నుండి పూర్తిగా శుభ్రపరచబడి ఉండాలి.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Siva Sutras - 251 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 3 - āṇavopāya

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 3-39. cittasthitivat śarīra karana bāhyesu - 1 🌻

🌴. Just as he fills his consciousness (chitta) with the fourth state of turya, so should he practice the same when his mind is externally engaged with his body, senses and external objects. 🌴


citta – of the mental; sthiti – states; vat – as or like; śarīra –the gross body; karaṇa – sense organs; bāhyeṣu (bāhya) – external objects.

The previous sūtra discussed about invigoration of turya into primary states of manifestation, sustenance and reabsorption. This process happens in the arena of mind. It is not enough to invigorate the mind and it is also essential to enliven the gross body along with the embedded sensory organs. Turya is the mental state where the aspirant enters the state of bliss. To enter the state of turya, the mind should have been completely cleansed of impressions so that it can single pointedly focus on the Lord.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

సిద్దేశ్వరయానం - 73 Siddeshwarayanam - 73


🌹 సిద్దేశ్వరయానం - 73 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 1864 - సాధకయోగి 🏵


పరమాత్మస్వామి: హిమాలయాలలో డాకినులు మాట్లాడే ఒక ప్రాకృత భాష ఉంది. దానిని నేర్చుకొనే అవకాశం నీకు లభిస్తుంది. ఆభాషలోని కొన్ని మంత్రములు నీకు ప్రాప్తిస్తవి. కిరాతరూపుడైన పరమేశ్వరుడు అనాగరికులైన ఆటవికులు, క్రూరజంతువుల నుండి బాధల నుండి తప్పించుకోవటం కోసం తీవ్ర సాధనలతో, ఆచారాలతో, హోమాదులతో అవసరంలేని మంత్రములను సృష్టించాడు. అవి చాలా త్వరగా సిద్ధిస్తవి. వాటి వల్ల వచ్చిన శక్తులతో లోకోపకారం చేయగలుగుతావు. ప్రస్తుతం వీలైనంత త్వరలో హిమాలయాలకు వెళ్ళు.

ఆశ్రమ : స్వామీ ! నేను ఊహించని, ఊహించలేని ఎన్నో విశేషాలను తెలియజేశారు. మళ్ళీ మనం కలుసుకొనే అవకాశం కలిగించండి!

పరమాత్మస్వామి : ఈశ్వరేచ్ఛ! జీవులు నదిలో కొట్టుకుపోయే కాష్ఠముల వంటివారు. కొంతసేపు కలిసి విడిపోతుంటారు. భాగవతంలో ఇలా చెప్పబడింది.

ఉ . వాయువశంబులై యెగసి వారిధరంబులు మింట కూడుచున్ పాయుచునుండు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమై పాయుచు కూడుచుండు నొక భంగి చరింపదు కాలమన్నిటిన్ జేయుచునుందు కాలము విచిత్రము దుస్తరమెంత వానికిన్ - అన్నింటికి మూలం కాలం. ఎంత వారికైనా దాటరానిది. నీవడిగినది మనసులో పెట్టుకొంటాను. నీవు కోరిన ప్రకారము మళ్ళీ కలుద్దాము.

ఆశ్రమ : స్వామివారూ ! మీరప్పటికి ఈ శరీరంతోనే వస్తారు గదా!

పరమాత్మస్వామి : నేనిప్పటికి ఎన్నో శరీరాలు మారాను. దేవతల,సిద్ధాశ్రమ గురువుల సంకల్పాన్ని, ఆజ్ఞను అనుసరించి యోగ్యులలో దివ్యచైతన్యాన్ని జాగృతం చేయటం కోసం సమయాన్ని బట్టి కొత్త శరీరాలను తీసుకొంటుంటాను. అప్పటికి నేను కూడా మారిన శరీరంతో వస్తాను.

ఆశ్రమ : మహానుభావ! మీరు అపారశక్తి సంపన్నులు. మీరు కోరితే ఈ శరీరంతో ఉండలేరా?

పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం
పుట్టుక, చావు, మళ్ళీ పుట్టుక ఇవి తప్పవా?

స్వామి : సామాన్యంగా తప్పవు. తీవ్రంగా సంకల్పిస్తే దీర్ఘకాలం జీవించవచ్చు. కాలాన్ని జయించాలన్న పట్టుదలతో కాలానికి అధీశ్వరియైన కాళిని ఉపాసించి పూర్వజన్మలో మూడు వందల సంవత్సరాలు జీవించాను. సిద్ధగురుకృపఉంటే వారి అనుగ్రహం వల్ల దివ్యస్ఫురణ కలుగుతూ ఉంటే దేవకార్య, గురుకార్యం చేయటం కోసం శరీరాలు మారటంలో విచారం ఉండదు. నేను కర్తను కాదు, భోక్తనూ కాదు. దేవకార్యం కోసం నియమించ బడిన నిమిత్తమాత్రుడను అని మనసా వాచా కర్మణా భావించ గలిగితే అప్పుడు మనలను గురించి మనం ఆలోచించవలసిన అవసరం ఉండదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకొనేవారు వేరే ఉంటారు. సరి! వీటికేమి! మనం మళ్ళీ కలుస్తాము. నేను నిన్ను గుర్తుపట్టగలను. నీవు కూడా తెలుసుకోగలవు. ప్రస్తుతానికి ఇది చాలు.

ఆశ్రమాధిపతి : మీ ఆజ్ఞ! కర్తవ్య నిర్వహణకు దీవించండి.!

పరమాత్మస్వామి : తథాస్తు !


( సశేషం )

🌹🌹🌹🌹🌹


విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 937 / Vishnu Sahasranama Contemplation - 937


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 937 / Vishnu Sahasranama Contemplation - 937 🌹

🌻 937. గభీరాఽఽత్మా, गभीराऽऽत्मा, Gabhīrā’’tmā 🌻

ఓం గభీరాత్మనే నమః | ॐ गभीरात्मने नमः | OM Gabhīrātmane namaḥ

ఆత్మా స్వరూపం చిత్తం వా గభీరం పరిచ్ఛేత్తు మశక్యమ్స్యేతి గభీరాఽఽత్మా


ఈతని స్వరూపము, ఆత్మ లేదా చిత్తము గభీరము అనగా ఇంతటి పరిమాణముకలదియని నిర్ణయించనలవి కానిది కనుక గభీరాఽఽత్మా.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 937 🌹

🌻 937. Gabhīrā’’tmā 🌻

OM Gabhīrātmane namaḥ


आत्मा स्वरूपं चित्तं वा गभीरं परिच्छेत्तुमशक्यम्स्येति गभीराऽऽत्मा / Ātmā svarūpaṃ cittaṃ vā gabhīraṃ paricchettumaśakyamsyeti gabhīrā’’tmā

Since His ātma, citta i.e., mind cannot be perceived as of definite proportions and cannot be measured, He is called Gabhīrā’’tmā.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः ।
चतुरश्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः ॥ १०० ॥

అనన్తరూపోఽనన్తశ్రీర్జితమన్యుర్భయాపహః ।
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః ॥ 100 ॥

Anantarūpo’nantaśrīrjitamanyurbhayāpahaḥ,
Caturaśro gabhīrātmā vidiśo vyādiśo diśaḥ ॥ 100 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹




కపిల గీత - 344 / Kapila Gita - 344


🌹. కపిల గీత - 344 / Kapila Gita - 344 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 8. ధూమ - అర్చిరాది మార్గములద్వారా వెళ్ళువారి గతి - భక్తియోగ విశిష్టత - 27 🌴

27. ఏతావానేవ యోగేన సమగ్రేణేహ యోగినః|
యుజ్యతేఽభిమతో హ్యర్థో యదసంగస్తు కృత్స్నశః ॥


తాత్పర్యము : సంపూర్ణ సంసారము నందు రవంత కూడ ఆసక్తి లేకుండటయే, యోగులకు వారి యోగసాధన ద్వారా లభించునట్టి ఏకైక అభీష్టఫలము.

వ్యాఖ్య : మూడు రకాల యోగాలు ఉన్నాయి, అవి భక్తి-యోగ, జ్ఞాన-యోగ మరియు అష్టాంగ-యోగ. భక్తులు, జ్ఞానులు మరియు యోగులు అందరూ భౌతిక చిక్కుల నుండి బయటపడటానికి ప్రయత్నిస్తారు. జ్ఞానులు భౌతిక నిశ్చితార్థం నుండి వారి ఇంద్రియ కార్యకలాపాలను వేరు చేయడానికి ప్రయత్నిస్తారు. జ్ఞాన-యోగి పదార్థం అబద్ధమని మరియు బ్రహ్మమే సత్యమని భావిస్తాడు; అతను జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా భౌతిక ఆనందం నుండి ఇంద్రియాలను వేరు చేయడానికి ప్రయత్నిస్తాడు. అష్టాంగ-యోగులు ఇంద్రియాలను నియంత్రించడానికి ప్రయత్నిస్తారు. భక్తులు మాత్రం ఇంద్రియాలను భగవంతుని సేవలో నిమగ్నం చేసేందుకు ప్రయత్నిస్తారు. అందువల్ల జ్ఞానులు మరియు యోగుల కంటే భక్తులు, భక్తుల కార్యకలాపాలు ఉత్తమమైనవిగా కనిపిస్తాయి. ఆధ్యాత్మిక యోగులు యోగ - యమం, నియమం, ఆసన ప్రాణాయామం, ప్రత్యాహారం మొదలైన ఎనిమిది విభాగాలను అభ్యసించడం ద్వారా ఇంద్రియాలను నియంత్రించడానికి ప్రయత్నిస్తారు - మరియు జ్ఞానులు ఇంద్రియ ఆనందం తప్పు అని అర్థం చేసుకోవడానికి మానసిక తర్కం ద్వారా ప్రయత్నిస్తారు. కానీ భగవంతుని సేవలో ఇంద్రియాలను నిమగ్నం చేయడమే సులభమైన మరియు ప్రత్యక్ష ప్రక్రియ.

జ్ఞానులు బ్రహ్మ తేజస్సుతో ఏకం కావాలని, యోగులు పరమాత్మను గ్రహించాలని, మరియు భక్తులు భగవంతునికి అతీతమైన ప్రేమతో కూడిన సేవను పెంపొందించు కోవాలని కోరుకుంటారు. ఆ ప్రేమతో కూడిన సేవ ఇంద్రియ నియంత్రణ యొక్క పరిపూర్ణ దశ. భగవద్గీతలో ఇది ధృవీకరించ బడినట్లుగా, పరం దృష్ట్వ నివర్తతే ( భగ. 2.59) ఇంద్రియాలకు ఉన్నతమైన నిశ్చితార్థాలు ఇచ్చినట్లయితే వాటి కార్యకలాపాలు నిలిపి వేయబడతాయి. భగవంతుని సేవలో ఇంద్రియాలను నిమగ్నం చేయడమే సర్వోన్నతమైన నిశ్చితార్థం. అన్ని యోగాల ఉద్దేశ్యం అదే.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 344 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 8. Entanglement in Fruitive Activities - 27 🌴

27. etāvān eva yogena samagreṇeha yoginaḥ
yujyate 'bhimato hy artho yad asaṅgas tu kṛtsnaśaḥ


MEANING : The greatest common understanding for all yogīs is complete detachment from matter, which can be achieved by different kinds of yoga.

PURPORT : There are three kinds of yoga, namely bhakti-yoga, jñāna-yoga and aṣṭāṅga-yoga. Devotees, jñānīs and yogīs all try to get out of the material entanglement. The jñānīs try to detach their sensual activities from material engagement. The jñāna-yogī thinks that matter is false and that Brahman is truth; he tries, therefore, by cultivation of knowledge, to detach the senses from material enjoyment. The aṣṭāṅga-yogīs also try to control the senses. The devotees, however, try to engage the senses in the service of the Lord. Therefore it appears that the activities of the bhaktas, devotees, are better than those of the jñānīs and yogīs. The mystic yogīs simply try to control the senses by practicing the eight divisions of yoga-yama, niyama, āsana prāṇāyāma, pratyāhāra, etc.— and the jñānīs try by mental reasoning to understand that sense enjoyment is false. But the easiest and most direct process is to engage the senses in the service of the Lord.

Jñānīs want to become one with the Brahman effulgence, yogīs want to realize Paramātmā, and devotees want to develop Kṛṣṇa consciousness and transcendental loving service to the Lord. That loving service is the perfect stage of sense control. As it is confirmed in Bhagavad-gītā, paraṁ dṛṣṭvā nivartate: (BG 2.59) the activities of the senses can be stopped if they are given superior engagements. The supreme engagement is engagement of the senses in the service of the Lord. That is the purpose of all yoga.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 06, JUNE 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు🌹

🍀🌹 06, JUNE 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు🌹🍀
1) 🌹 కపిల గీత - 344 / Kapila Gita - 344 🌹 
🌴 8. ధూమ - అర్చిరాది మార్గముల ద్వారా వెళ్ళు వారి గతి - భక్తియోగ విశిష్టత - 27 / 8. Entanglement in Fruitive Activities - 27 🌴
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 937 / Vishnu Sahasranama Contemplation - 937 🌹
🌻 937. గభీరాఽఽత్మా, गभीराऽऽत्मा, Gabhīrā’’tmā 🌻
3) 🌹 సిద్దేశ్వరయానం - 73🌹
🏵 1864 - సాధకయోగి -2 🏵
4) 🌹. శివ సూత్రములు - 251 / Siva Sutras - 251 🌹
🌻 3-39. చిత్తస్థితివత్ శరీర కరణ బాహ్యేషు - 1 / 3-39. cittasthitivat śarīra karana bāhyesu - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 344 / Kapila Gita - 344 🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 8. ధూమ - అర్చిరాది మార్గములద్వారా వెళ్ళువారి గతి - భక్తియోగ విశిష్టత - 27 🌴*

*27. ఏతావానేవ యోగేన సమగ్రేణేహ యోగినః|*
*యుజ్యతేఽభిమతో హ్యర్థో యదసంగస్తు కృత్స్నశః ॥*

*తాత్పర్యము : సంపూర్ణ సంసారము నందు రవంత కూడ ఆసక్తి లేకుండటయే, యోగులకు వారి యోగసాధన ద్వారా లభించునట్టి ఏకైక అభీష్టఫలము.*

*వ్యాఖ్య : మూడు రకాల యోగాలు ఉన్నాయి, అవి భక్తి-యోగ, జ్ఞాన-యోగ మరియు అష్టాంగ-యోగ. భక్తులు, జ్ఞానులు మరియు యోగులు అందరూ భౌతిక చిక్కుల నుండి బయటపడటానికి ప్రయత్నిస్తారు. జ్ఞానులు భౌతిక నిశ్చితార్థం నుండి వారి ఇంద్రియ కార్యకలాపాలను వేరు చేయడానికి ప్రయత్నిస్తారు. జ్ఞాన-యోగి పదార్థం అబద్ధమని మరియు బ్రహ్మమే సత్యమని భావిస్తాడు; అతను జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా భౌతిక ఆనందం నుండి ఇంద్రియాలను వేరు చేయడానికి ప్రయత్నిస్తాడు. అష్టాంగ-యోగులు ఇంద్రియాలను నియంత్రించడానికి ప్రయత్నిస్తారు. భక్తులు మాత్రం ఇంద్రియాలను భగవంతుని సేవలో నిమగ్నం చేసేందుకు ప్రయత్నిస్తారు. అందువల్ల జ్ఞానులు మరియు యోగుల కంటే భక్తులు, భక్తుల కార్యకలాపాలు ఉత్తమమైనవిగా కనిపిస్తాయి. ఆధ్యాత్మిక యోగులు యోగ - యమం, నియమం, ఆసన ప్రాణాయామం, ప్రత్యాహారం మొదలైన ఎనిమిది విభాగాలను అభ్యసించడం ద్వారా ఇంద్రియాలను నియంత్రించడానికి ప్రయత్నిస్తారు - మరియు జ్ఞానులు ఇంద్రియ ఆనందం తప్పు అని అర్థం చేసుకోవడానికి మానసిక తర్కం ద్వారా ప్రయత్నిస్తారు. కానీ భగవంతుని సేవలో ఇంద్రియాలను నిమగ్నం చేయడమే సులభమైన మరియు ప్రత్యక్ష ప్రక్రియ.*

*జ్ఞానులు బ్రహ్మ తేజస్సుతో ఏకం కావాలని, యోగులు పరమాత్మను గ్రహించాలని, మరియు భక్తులు భగవంతునికి అతీతమైన ప్రేమతో కూడిన సేవను పెంపొందించు కోవాలని కోరుకుంటారు. ఆ ప్రేమతో కూడిన సేవ ఇంద్రియ నియంత్రణ యొక్క పరిపూర్ణ దశ. భగవద్గీతలో ఇది ధృవీకరించ బడినట్లుగా, పరం దృష్ట్వ నివర్తతే ( భగ. 2.59) ఇంద్రియాలకు ఉన్నతమైన నిశ్చితార్థాలు ఇచ్చినట్లయితే వాటి కార్యకలాపాలు నిలిపి వేయబడతాయి. భగవంతుని సేవలో ఇంద్రియాలను నిమగ్నం చేయడమే సర్వోన్నతమైన నిశ్చితార్థం. అన్ని యోగాల ఉద్దేశ్యం అదే.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 344 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 8. Entanglement in Fruitive Activities - 27 🌴*

*27. etāvān eva yogena samagreṇeha yoginaḥ*
*yujyate 'bhimato hy artho yad asaṅgas tu kṛtsnaśaḥ*

*MEANING : The greatest common understanding for all yogīs is complete detachment from matter, which can be achieved by different kinds of yoga.*

*PURPORT : There are three kinds of yoga, namely bhakti-yoga, jñāna-yoga and aṣṭāṅga-yoga. Devotees, jñānīs and yogīs all try to get out of the material entanglement. The jñānīs try to detach their sensual activities from material engagement. The jñāna-yogī thinks that matter is false and that Brahman is truth; he tries, therefore, by cultivation of knowledge, to detach the senses from material enjoyment. The aṣṭāṅga-yogīs also try to control the senses. The devotees, however, try to engage the senses in the service of the Lord. Therefore it appears that the activities of the bhaktas, devotees, are better than those of the jñānīs and yogīs. The mystic yogīs simply try to control the senses by practicing the eight divisions of yoga-yama, niyama, āsana prāṇāyāma, pratyāhāra, etc.— and the jñānīs try by mental reasoning to understand that sense enjoyment is false. But the easiest and most direct process is to engage the senses in the service of the Lord.*

*Jñānīs want to become one with the Brahman effulgence, yogīs want to realize Paramātmā, and devotees want to develop Kṛṣṇa consciousness and transcendental loving service to the Lord. That loving service is the perfect stage of sense control. As it is confirmed in Bhagavad-gītā, paraṁ dṛṣṭvā nivartate: (BG 2.59) the activities of the senses can be stopped if they are given superior engagements. The supreme engagement is engagement of the senses in the service of the Lord. That is the purpose of all yoga.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 937 / Vishnu Sahasranama Contemplation - 937 🌹*

*🌻 937. గభీరాఽఽత్మా, गभीराऽऽत्मा, Gabhīrā’’tmā 🌻*

*ఓం గభీరాత్మనే నమః | ॐ गभीरात्मने नमः | OM Gabhīrātmane namaḥ*

*ఆత్మా స్వరూపం చిత్తం వా గభీరం పరిచ్ఛేత్తు మశక్యమ్స్యేతి గభీరాఽఽత్మా*

*ఈతని స్వరూపము, ఆత్మ లేదా చిత్తము గభీరము అనగా ఇంతటి పరిమాణముకలదియని నిర్ణయించనలవి కానిది కనుక గభీరాఽఽత్మా.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 937 🌹*

*🌻 937. Gabhīrā’’tmā 🌻*

*OM Gabhīrātmane namaḥ*

*आत्मा स्वरूपं चित्तं वा गभीरं परिच्छेत्तुमशक्यम्स्येति गभीराऽऽत्मा / Ātmā svarūpaṃ cittaṃ vā gabhīraṃ paricchettumaśakyamsyeti gabhīrā’’tmā*

*Since His ātma, citta i.e., mind cannot be perceived as of definite proportions and cannot be measured, He is called Gabhīrā’’tmā.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः ।चतुरश्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः ॥ १०० ॥
అనన్తరూపోఽనన్తశ్రీర్జితమన్యుర్భయాపహః ।చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః ॥ 100 ॥
Anantarūpo’nantaśrīrjitamanyurbhayāpahaḥ,Caturaśro gabhīrātmā vidiśo vyādiśo diśaḥ ॥ 100 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 సిద్దేశ్వరయానం - 73 🌹*

*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*

*🏵 1864 - సాధకయోగి 🏵*

*పరమాత్మస్వామి: హిమాలయాలలో డాకినులు మాట్లాడే ఒక ప్రాకృత భాష ఉంది. దానిని నేర్చుకొనే అవకాశం నీకు లభిస్తుంది. ఆభాషలోని కొన్ని మంత్రములు నీకు ప్రాప్తిస్తవి. కిరాతరూపుడైన పరమేశ్వరుడు అనాగరికులైన ఆటవికులు, క్రూరజంతువుల నుండి బాధల నుండి తప్పించుకోవటం కోసం తీవ్ర సాధనలతో, ఆచారాలతో, హోమాదులతో అవసరంలేని మంత్రములను సృష్టించాడు. అవి చాలా త్వరగా సిద్ధిస్తవి. వాటి వల్ల వచ్చిన శక్తులతో లోకోపకారం చేయగలుగుతావు. ప్రస్తుతం వీలైనంత త్వరలో హిమాలయాలకు వెళ్ళు.*

*ఆశ్రమ : స్వామీ ! నేను ఊహించని, ఊహించలేని ఎన్నో విశేషాలను తెలియజేశారు. మళ్ళీ మనం కలుసుకొనే అవకాశం కలిగించండి!*

*పరమాత్మస్వామి : ఈశ్వరేచ్ఛ! జీవులు నదిలో కొట్టుకుపోయే కాష్ఠముల వంటివారు. కొంతసేపు కలిసి విడిపోతుంటారు. భాగవతంలో ఇలా చెప్పబడింది.*

*ఉ . వాయువశంబులై యెగసి వారిధరంబులు మింట కూడుచున్ పాయుచునుండు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమై పాయుచు కూడుచుండు నొక భంగి చరింపదు కాలమన్నిటిన్ జేయుచునుందు కాలము విచిత్రము దుస్తరమెంత వానికిన్ - అన్నింటికి మూలం కాలం. ఎంత వారికైనా దాటరానిది. నీవడిగినది మనసులో పెట్టుకొంటాను. నీవు కోరిన ప్రకారము మళ్ళీ కలుద్దాము.*

*ఆశ్రమ : స్వామివారూ ! మీరప్పటికి ఈ శరీరంతోనే వస్తారు గదా!*

*పరమాత్మస్వామి : నేనిప్పటికి ఎన్నో శరీరాలు మారాను. దేవతల,సిద్ధాశ్రమ గురువుల సంకల్పాన్ని, ఆజ్ఞను అనుసరించి యోగ్యులలో దివ్యచైతన్యాన్ని జాగృతం చేయటం కోసం సమయాన్ని బట్టి కొత్త శరీరాలను తీసుకొంటుంటాను. అప్పటికి నేను కూడా మారిన శరీరంతో వస్తాను.*

*ఆశ్రమ : మహానుభావ! మీరు అపారశక్తి సంపన్నులు. మీరు కోరితే ఈ శరీరంతో ఉండలేరా?*

*పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం*
*పుట్టుక, చావు, మళ్ళీ పుట్టుక ఇవి తప్పవా?*

*స్వామి : సామాన్యంగా తప్పవు. తీవ్రంగా సంకల్పిస్తే దీర్ఘకాలం జీవించవచ్చు. కాలాన్ని జయించాలన్న పట్టుదలతో కాలానికి అధీశ్వరియైన కాళిని ఉపాసించి పూర్వజన్మలో మూడు వందల సంవత్సరాలు జీవించాను. సిద్ధగురుకృపఉంటే వారి అనుగ్రహం వల్ల దివ్యస్ఫురణ కలుగుతూ ఉంటే దేవకార్య, గురుకార్యం చేయటం కోసం శరీరాలు మారటంలో విచారం ఉండదు. నేను కర్తను కాదు, భోక్తనూ కాదు. దేవకార్యం కోసం నియమించ బడిన నిమిత్తమాత్రుడను అని మనసా వాచా కర్మణా భావించ గలిగితే అప్పుడు మనలను గురించి మనం ఆలోచించవలసిన అవసరం ఉండదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకొనేవారు వేరే ఉంటారు. సరి! వీటికేమి! మనం మళ్ళీ కలుస్తాము. నేను నిన్ను గుర్తుపట్టగలను. నీవు కూడా తెలుసుకోగలవు. ప్రస్తుతానికి ఇది చాలు.*

*ఆశ్రమాధిపతి : మీ ఆజ్ఞ! కర్తవ్య నిర్వహణకు దీవించండి.!*
*పరమాత్మస్వామి : తథాస్తు !*

*( సశేషం )*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 251 / Siva Sutras - 251 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*3వ భాగం - ఆణవోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 3-39. చిత్తస్థితివత్ శరీర కరణ బాహ్యేషు - 1 🌻*

*🌴. అతను తన చైతన్యాన్ని (చిత్త) తుర్య యొక్క నాల్గవ స్థితితో నింపినట్లే, అతని మనస్సు తన శరీరం, ఇంద్రియాలు మరియు బాహ్య వస్తువులతో బాహ్యంగా నిమగ్నమై ఉన్నప్పుడు కూడా అదే సాధన చేయాలి. 🌴*

*చిత్త – మానసిక; స్థితి – స్థితులు; వాత్‌ – వంటి లేదా వంటి; శరీర – స్థూల శరీరం; కరణ – ఇంద్రియ అవయవాలు; బాహ్యేషు (బాహ్య)- బాహ్య వస్తువులు.*
*మునుపటి సూత్రం తర్యను అభివ్యక్తి, జీవనోపాధి మరియు పునశ్శోషణం యొక్క ప్రాధమిక స్థితుల్లోకి ప్రేరేపించడం గురించి చర్చించింది. ఈ ప్రక్రియ మనస్సు యొక్క క్షేత్రంలో జరుగుతుంది. మనస్సును ఉత్తేజపరిచేందుకు ఇది సరిపోదు. పొందుపరిచిన ఇంద్రియ అవయవాలతో పాటు స్థూల శరీరాన్ని ఉత్తేజపరచడం కూడా అవసరం. తుర్య అనేది మానసిక స్థితి, ఇక్కడ ఆశించిన వ్యక్తి ఆనంద స్థితిలోకి ప్రవేశిస్తాడు. తుర్య స్థితిలోకి ప్రవేశించాలంటే, మనస్సు పూర్తిగా భగవంతునిపై దృష్టి కేంద్రీకరించగలిగేలా అన్నీ పూర్వ ముద్రల నుండి పూర్తిగా శుభ్రపరచబడి ఉండాలి.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras  - 251 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
*Part 3 - āṇavopāya*
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 3-39. cittasthitivat śarīra karana bāhyesu - 1 🌻*

*🌴. Just as he fills his consciousness (chitta) with the fourth state of turya, so should he practice the same when his mind is externally engaged with his body, senses and external objects. 🌴*

*citta – of the mental; sthiti – states; vat – as or like; śarīra –the gross body; karaṇa – sense organs; bāhyeṣu (bāhya) – external objects.*
*The previous sūtra discussed about invigoration of turya into primary states of manifestation, sustenance and reabsorption. This process happens in the arena of mind. It is not enough to invigorate the mind and it is also essential to enliven the gross body along with the embedded sensory organs. Turya is the mental state where the aspirant enters the state of bliss. To enter the state of turya, the mind should have been completely cleansed of impressions so that it can single pointedly focus on the Lord.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj