కార్తిక పురాణం - 28 - విష్ణు సుదర్శన చక్ర మహిమ (Kartika Purana - 28 - The glory of Vishnu's Sudarshana Chakra)

🌹. కార్తిక పురాణం - 28 🌹

🌻. 28వ అధ్యాయము - విష్ణు సుదర్శన చక్ర మహిమ 🌻

ప్రసాద్‌ భరధ్వాజ

జనక మహారాజా! వింటివా దుర్వాసుని అవస్ధలు! తాను యెంతటి కోపవంతుడైనను, వెనుక ముందు లాలోచింపక ఒక మహాభక్తుని శుద్దిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున, ఎంతటి గొప్ప వారైనాను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోనవలెను.

అటుల దుర్వాసుడు శ్రీ మన్నారాయణుని కడ సెలవుపొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచూ తిరిగి మళ్లి భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి "అంబరీషా, ధర్మపాలకా! నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము, నీకు నాపై గల అనురాగముతో ద్వాదశీ పారాయణమునకు నన్నాహ్వనించితివి, కాని నిన్ను కష్టములు పాలుజేసి వ్రతభంగము చేయించి నీ పుణ్య ఫలమును నాశనము చేయతల పెట్టితిని. గాని నా దుర్బద్ది నన్నే వెంటాడి నాప్రాణములు తీయుటకే సిద్దమైనది. నేను విష్ణువు కడకేగి యా విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్ధి౦చితిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీవద్ద కేగమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను యెంతటి తపశ్శాలినైనను, యెంత నిష్టగలవాడనైనను నీ నిష్కళంక భక్తి ముందవియేమియు పనిచేయలేదు. నన్నీ విపత్తునుండి కాపాడు"మని అనేక విధాల ప్రార్ధఒచగా, అంబరీషుడు శ్రీ మన్నారాయణుని ధ్యానించి,

"ఓ సుదర్శన చక్రమా! నీకివే నా మన:పూర్వక వందనములు. ఈ దూర్వాస మహాముని తెలిసియో, తెలియకయో తొందరపాటుగా యీ కష్టమును కొని తెచ్చుకొనెను. అయినను యీతడు బ్రాహ్మణుడు గాన, ఈతనిని చంపవలదు, ఒక వేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితివేని, ముందు నన్నుచంపి, తర్వాత ఈ దుర్వాసుని జంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి, నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు యిలవేల్పు, దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్దములలో , అనేక మంది లోకకంటకులను చంపితివిగాని శరణుగోరువారిని యింత వరకు చంపలేదు. అందువలననే యీ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే యున్నావు గాని చంపుటలేదు. దేవా! సురాసురాది భూతకోటులన్నియు ఒక్కటిగా యేకమైననూ నిన్నేమియు చేయజాలవు, నీ శక్తికి యే విధమైన అడ్డునూలేదు. ఈ విషయము లోకమంతటికి తెలియును. అయినను మునిపుంగవునికి యే అపాయము కలుగకుండ రక్షింపుమని ప్రార్థించుచున్నాను.

నీ యుందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి యిమిడియున్నది. నిన్ను వేడుకోనుచున్న నన్నును, శరణు వేడిన యీ దుర్వాసుని రక్షింపుము" అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణుచక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి

"ఓ భక్తాగ్రేశ్వరా ! అంబరీషా! నీ భక్తిని పరీక్షించుట కిట్లు చేసితినిగాని వేరుగాదు. అత్యంత దుర్మార్గులు, మహాపరాక్రమవంతులైన మధుకైటభులను - దేవతలందరు యెకమైకూడ - చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా! ఈ లోకములో దుష్టశిక్షణ, శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్దాపించుచుండును. ఇది యెల్లరకు తెలిసిన విషయమే, ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీవ్రతమును నశింపజేసి, నానా యిక్కట్లు పెట్టవలెనని కన్ను లెఱ్ఱజేసి నీ మీద జూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధివగు నిన్ను రక్షించి, యీ ముని గర్వమణచవలెనని తరుముచున్నాను.

ఈతడు కూడా సామాన్యుడు గాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు. బ్రహ్మతేజస్సు గలవాడు. మహాతపశ్శాలి. రుద్రతేజము భులోకవాసుల నందరను చంపగలదుగాని, శక్తిలో నా కంటె యెక్కువేమియుగాదు. సృషి కర్తయగు బ్రాహ్మతేజస్సు కంటెను, కైలాసవతియగు మహేశ్వరుని తేజశ్శక్తి కంటెను యెక్కువయైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని , క్షత్రియ తేజస్సుగల నీవు గాని తులతూగరు. నన్నెదుర్కొనజాలరు. తనకన్న యెదుటి వాడు బలవంతుడై యున్నప్పుడు అతనితో సంధి చేసుకోనుట యుత్తమము. ఈ నీతిని ఆచరించువారలు యెటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకోనగలరు.

ఇంత వరకు జరిగినదంతయు విస్మరించి, శరణార్థియై వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపు" మని చక్రాయుధము పలికెను. అంబరీషుడా పలుకులాలకించి, " నేను దేవ గో, బ్రాహ్మణాదుల యుందును, స్త్రీలయందును, గౌరవము గలవాడను.

నా రాజ్యములో సర్వజనులూ సుఖిముగా నుండవలెననియే నా యభిలాష. కాన, శరణుగోరిన ఈ దుర్వాసుని, నన్నూ కరుణించి రక్షింపుము. వేలకొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్య మండలములు యేక మైననూ నీ శక్తీకి, తేజస్సుకూ సాటి రావు. నీవు అట్టి తేజోరాశివి మహా విష్ణువు లోకనిందితులపై, లోకకంటకులపై, దేవ - గో - బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి, వారిని శిక్షించి, తనకుక్షియుందున్న పధ్నాలుగు లోకములను కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు. కాన, నీకివే నా మన:పూర్వక నమస్కృతులు" అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను.

అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాడాలింగన మొనర్చి "అంబరీషా! నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము మూడు కాలములయుందు నెవరు పఠింతురో, యెవరు దానదర్మములతో పుణ్యఫలమును వృద్ది చేసుకొందురో, యెవరో పరులను హింసించక - పరధనములను ఆశపడక - పరస్త్రీలను చెరబెట్టిక - గోహత్య - బ్రాహ్మణహత్య - శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టివారి కష్టములు నశించి, యిహమందును పరమందును సర్వసౌఖ్యములతోడ తులతూగుదురు. కాన, నిన్నూ దుర్వాసుని రక్షించుచున్నాను, నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాల గొప్పది. నీ పుణ్యఫలము ముందు యీ మునిపుంగవుని తపశ్శక్తి పని చేయలేదు." అని చెప్పి అతని నాశీర్వదించి, అదృశ్యమయ్యెను.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్య మందలి అష్టావింశోధ్యాయము - ఇరవయ్యెనిమిదో రోజు పారాయణము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹

🌹 29 NOVEMBER 2024 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు🌹

🍀🌹 29 NOVEMBER 2024 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు🌹🍀 
1) 🌹 శివ సూత్రాలు 1 - 13వ సూత్రం: ఇచ్ఛాశక్తి‌ ఉమా కుమారి - యోగి సంకల్పం శివుని తేజో శక్తి. తేజస్సు అంటే ఉమ మరియు సంకల్పం అంటే కుమారి 🌹
2) 🌹 Shiva Sutras 1 - 13th Sutra. - Ichhaa Shakti Umaa Kumari. - The yogi's will is the radiant energy of Lord Shiva. Radiance is Umaa, and willpower is Kumari. 🌹
3) 🌹 शिव सूत्र -1 - 13वां सूत्र - इच्छा शक्ति उमा कुमारी. - योगी की इच्छा शक्ति भगवान शिव की तेजस्वी ऊर्जा है। तेजस्विता उमा है, और संकल्प शक्ति कुमारी है। 🌹
4) 🌹. కార్తిక పురాణం - 28 🌹
🌻. 28వ అధ్యాయము - విష్ణు సుదర్శన చక్ర మహిమ 🌻
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 577 - 6 / Sri Lalitha Chaitanya Vijnanam - 577 - 6 🌹 
🌻 577. 'మాతృకా వర్ణరూపిణీ' - 6 / 577. 'Mātr‌kā Varṇarūpiṇī' - 6 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 శివ సూత్రాలు 1- 13వ సూత్రం: ఇచ్ఛాశక్తి‌ ఉమా కుమారి - యోగి సంకల్పం శివుని తేజో శక్తి. తేజస్సు అంటే ఉమ మరియు సంకల్పం అంటే కుమారి 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*శివ సూత్రాలు - శంభవోపాయలోని 13వ సూత్రం "ఇచ్ఛాశక్తి ఉమా కుమారి" లోని ఆధ్యాత్మిక సత్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనిలో ఇచ్ఛాశక్తి అనేది శివుని తేజోమయ శక్తిగా వివరించబడింది. ఈ సూత్రంలో ఉమ అనే పదం స్వతంత్ర శక్తిని, కుమారి నిర్మలమైన సంకల్ప శక్తిని సూచిస్తుంది. సాధారణ చైతన్య స్థితి నుండి యోగిగా మారడానికి మరియు అంతిమంగా శివ చైతన్యాన్ని సాధించడానికి కావలసిన ముఖ్యమైన అర్హతలను, ఆచరణాత్మక విధానాలను ఈ సూత్రం వివరిస్తుంది. త్రిక తత్వశాస్త్రంలో వివరించిన విధంగా శివునితో ఐక్యత సాధించే మార్గాన్ని ఈ సూత్ర వివరణ ద్వారా తెలుసుకోండి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Shiva Sutras -1 13th Sutra. - Ichhaa Shakti Umaa Kumari. - The yogi's will is the radiant energy of Lord Shiva. Radiance is Umaa, and willpower is Kumari. 🌹*
*Prasad Bhardwaj.*

*Explore the spiritual truths of the 13th Sutra, "Icchā Shakti Umā Kumārī", from Shiva Sutras - Shambhavopaya, in this video. Here, Icchā Shakti is described as the radiant energy of Lord Shiva. The term Umā signifies independent energy, while Kumārī represents pure willpower. This Sutra explains the essential qualities and practical methods needed to transition from an ordinary state of consciousness to becoming a yogi and ultimately attaining Shiva consciousness. Discover the path to unity with Shiva as described in Trika philosophy through this Sutra's insights.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 शिव सूत्र - भाग 1 - शम्भवोपाय. - 13वां सूत्र - इच्छा शक्ति उमा कुमारी. - योगी की इच्छा शक्ति भगवान शिव की तेजस्वी ऊर्जा है। तेजस्विता उमा है, और संकल्प शक्ति कुमारी है। 🌹*
*प्रसाद भारद्वाज.*

*शिव सूत्रों के शंभवोपाय में 13वें सूत्र "इच्छा शक्ति उमा कुमारी" के आध्यात्मिक सत्य को इस वीडियो में जानिए। यहां, इच्छा शक्ति को भगवान शिव की तेजोमय ऊर्जा के रूप में वर्णित किया गया है। उमा स्वतंत्र ऊर्जा को, जबकि कुमारी शुद्ध इच्छाशक्ति को दर्शाता है। यह सूत्र एक सामान्य चेतना अवस्था से योगी बनने और अंततः शिव चेतना प्राप्त करने के लिए आवश्यक गुणों और व्यावहारिक विधियों को समझाता है। त्रिक दर्शन के अनुसार शिव के साथ एकत्व प्राप्त करने के मार्ग को इस सूत्र की व्याख्या से जानें।*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కార్తిక పురాణం - 28 🌹*
*🌻. 28వ అధ్యాయము - విష్ణు సుదర్శన చక్ర మహిమ 🌻*
*ప్రసాద్‌ భరధ్వాజ*

జనక మహారాజా! వింటివా దుర్వాసుని అవస్ధలు! తాను యెంతటి కోపవంతుడైనను, వెనుక ముందు లాలోచింపక ఒక మహాభక్తుని శుద్దిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున, ఎంతటి గొప్ప వారైనాను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోనవలెను.

అటుల దుర్వాసుడు శ్రీ మన్నారాయణుని కడ సెలవుపొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచూ తిరిగి మళ్లి భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి "అంబరీషా, ధర్మపాలకా! నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము, నీకు నాపై గల అనురాగముతో ద్వాదశీ పారాయణమునకు నన్నాహ్వనించితివి, కాని నిన్ను కష్టములు పాలుజేసి వ్రతభంగము చేయించి నీ పుణ్య ఫలమును నాశనము చేయతల పెట్టితిని. గాని నా దుర్బద్ది నన్నే వెంటాడి నాప్రాణములు తీయుటకే సిద్దమైనది. నేను విష్ణువు కడకేగి యా విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్ధి౦చితిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీవద్ద కేగమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను యెంతటి తపశ్శాలినైనను, యెంత నిష్టగలవాడనైనను నీ నిష్కళంక భక్తి ముందవియేమియు పనిచేయలేదు. నన్నీ విపత్తునుండి కాపాడు"మని అనేక విధాల ప్రార్ధఒచగా, అంబరీషుడు శ్రీ మన్నారాయణుని ధ్యానించి,

"ఓ సుదర్శన చక్రమా! నీకివే నా మన:పూర్వక వందనములు. ఈ దూర్వాస మహాముని తెలిసియో, తెలియకయో తొందరపాటుగా యీ కష్టమును కొని తెచ్చుకొనెను. అయినను యీతడు బ్రాహ్మణుడు గాన, ఈతనిని చంపవలదు, ఒక వేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితివేని, ముందు నన్నుచంపి, తర్వాత ఈ దుర్వాసుని జంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి, నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు యిలవేల్పు, దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్దములలో , అనేక మంది లోకకంటకులను చంపితివిగాని శరణుగోరువారిని యింత వరకు చంపలేదు. అందువలననే యీ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే యున్నావు గాని చంపుటలేదు. దేవా! సురాసురాది భూతకోటులన్నియు ఒక్కటిగా యేకమైననూ నిన్నేమియు చేయజాలవు, నీ శక్తికి యే విధమైన అడ్డునూలేదు. ఈ విషయము లోకమంతటికి తెలియును. అయినను మునిపుంగవునికి యే అపాయము కలుగకుండ రక్షింపుమని ప్రార్థించుచున్నాను.

నీ యుందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి యిమిడియున్నది. నిన్ను వేడుకోనుచున్న నన్నును, శరణు వేడిన యీ దుర్వాసుని రక్షింపుము" అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణుచక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి 

"ఓ భక్తాగ్రేశ్వరా ! అంబరీషా! నీ భక్తిని పరీక్షించుట కిట్లు చేసితినిగాని వేరుగాదు. అత్యంత దుర్మార్గులు, మహాపరాక్రమవంతులైన మధుకైటభులను - దేవతలందరు యెకమైకూడ - చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా! ఈ లోకములో దుష్టశిక్షణ, శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్దాపించుచుండును. ఇది యెల్లరకు తెలిసిన విషయమే, ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీవ్రతమును నశింపజేసి, నానా యిక్కట్లు పెట్టవలెనని కన్ను లెఱ్ఱజేసి నీ మీద జూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధివగు నిన్ను రక్షించి, యీ ముని గర్వమణచవలెనని తరుముచున్నాను.

ఈతడు కూడా సామాన్యుడు గాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు. బ్రహ్మతేజస్సు గలవాడు. మహాతపశ్శాలి. రుద్రతేజము భులోకవాసుల నందరను చంపగలదుగాని, శక్తిలో నా కంటె యెక్కువేమియుగాదు. సృషి కర్తయగు బ్రాహ్మతేజస్సు కంటెను, కైలాసవతియగు మహేశ్వరుని తేజశ్శక్తి కంటెను యెక్కువయైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని , క్షత్రియ తేజస్సుగల నీవు గాని తులతూగరు. నన్నెదుర్కొనజాలరు. తనకన్న యెదుటి వాడు బలవంతుడై యున్నప్పుడు అతనితో సంధి చేసుకోనుట యుత్తమము. ఈ నీతిని ఆచరించువారలు యెటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకోనగలరు.

ఇంత వరకు జరిగినదంతయు విస్మరించి, శరణార్థియై వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపు" మని చక్రాయుధము పలికెను. అంబరీషుడా పలుకులాలకించి, " నేను దేవ గో, బ్రాహ్మణాదుల యుందును, స్త్రీలయందును, గౌరవము గలవాడను. 

నా రాజ్యములో సర్వజనులూ సుఖిముగా నుండవలెననియే నా యభిలాష. కాన, శరణుగోరిన ఈ దుర్వాసుని, నన్నూ కరుణించి రక్షింపుము. వేలకొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్య మండలములు యేక మైననూ నీ శక్తీకి, తేజస్సుకూ సాటి రావు. నీవు అట్టి తేజోరాశివి మహా విష్ణువు లోకనిందితులపై, లోకకంటకులపై, దేవ - గో - బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి, వారిని శిక్షించి, తనకుక్షియుందున్న పధ్నాలుగు లోకములను కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు. కాన, నీకివే నా మన:పూర్వక నమస్కృతులు" అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను.

అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాడాలింగన మొనర్చి "అంబరీషా! నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము మూడు కాలములయుందు నెవరు పఠింతురో, యెవరు దానదర్మములతో పుణ్యఫలమును వృద్ది చేసుకొందురో, యెవరో పరులను హింసించక - పరధనములను ఆశపడక - పరస్త్రీలను చెరబెట్టిక - గోహత్య - బ్రాహ్మణహత్య - శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టివారి కష్టములు నశించి, యిహమందును పరమందును సర్వసౌఖ్యములతోడ తులతూగుదురు. కాన, నిన్నూ దుర్వాసుని రక్షించుచున్నాను, నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాల గొప్పది. నీ పుణ్యఫలము ముందు యీ మునిపుంగవుని తపశ్శక్తి పని చేయలేదు." అని చెప్పి అతని నాశీర్వదించి, అదృశ్యమయ్యెను.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్య మందలి అష్టావింశోధ్యాయము - ఇరవయ్యెనిమిదో రోజు పారాయణము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 577 - 6 / Sri Lalitha Chaitanya Vijnanam  - 577 - 6 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 116. పరాశక్తిః, పరానిష్ఠా, ప్రజ్ఞాన ఘనరూపిణీ ।*
*మాధ్వీపానాలసా, మత్తా, మాతృకా వర్ణ రూపిణీ ॥ 116 ॥ 🍀*

*🌻 577. 'మాతృకా వర్ణరూపిణీ' - 6 🌻*

*మాతృకా వర్ణములు ఆమె నుండియే పుట్టును. నాదముగ జనించి శబ్దములుగ వ్యాప్తిచేయును. శబ్దముల నుండి వెలుగులు వ్యాప్తి యగును. అటుపైన రూపములుగ యేర్పడును. ఇట్లు శబ్దము, రంగు, రూపముగ సృష్టి నేర్పరచును. తత్సంబంధిత శక్తులు, సామర్థ్యములు కూడ పుట్టుచుండును. అక్షరములు అనగా 'అ' నుండి 'క్ష' వరకు కొనిరాబడినవి అని మరియొక అర్థము. దేవ భాషయైన సంస్కృతము నందు 'అ' మొదటి అక్షరము. 'క్ష' చివరి అక్షరము. అట్లు 'అ' నుండి 'క్ష' వరకు సృష్టి నిర్మాణము చేయు శ్రీమాత ఆ మొత్తము రూపముగ తానే యుండును. ఆమెయే అక్షరమాల. స్కందుని పుట్టించుటచే ఆమె మాతృక అయినది.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 577 - 6 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 116. Parashaktih paranishta pragynana ghanarupini*
*madhvipanalasa matta matrukavarna rupini  ॥116 ॥ 🌻*

*🌻 577. 'Mātr‌kā Varṇarūpiṇī' - 6 🌻*

*The Mātr‌kā Varṇas (letters) originate from her alone. They are born as Nāda (primordial sound) and expand into Śabdas (audible sounds). From these sounds, light spreads forth, and subsequently, forms emerge. In this way, creation is manifested through sound, color, and form, along with the associated powers and capabilities. Another interpretation of Akṣaras (letters) is that they extend from "A" to "Kṣa". In the divine language of Sanskrit, "A" is the first letter and "Kṣa" is the last. Thus, Śrī Māta creates the entire universe, spanning from "A" to "Kṣa", and she herself embodies this totality. She is the very garland of letters (Akṣaramālā). She is called Mātr‌kā because she gave birth to Skanda (Lord Kārttikeya).*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube channel Facebook WhatsApp Channel 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. Chaitanya Vijnaanam YouTube FB Telegram groups 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
Like, Subscribe and Share 👀
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj

కపిల గీత 2వ భాగము. - కపిల దేవహూతి సంవాదం. - ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యత - 2. - 5 లఘు వీడియోలు (Kapila Gita Part 2 - Lord Kapila Devahuti's Conversation - The Importance of Spiritual Knowledge 2. - 5 Short Videos)

🌹 కపిల గీత 2వ భాగము. - కపిల దేవహూతి సంవాదం. - ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యత - 2. - 5 లఘు వీడియోలు 🌹

ప్రసాద్ భరద్వాజ.

🌹 కపిల గీత 2వ భాగము. - కపిల దేవహూతి సంవాదం. - ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యత - 2. - 1. భగవానుడు సర్వకారణ కారకుడు 🌹

ప్రసాద్ భరద్వాజ.

https://youtube.com/shorts/Gi-0H4oxGSQ

🌹 కపిల గీత 2వ భాగము. - కపిల దేవహూతి సంవాదం. - ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యత - 2. - 2. నిరంతర అనుసంధానం 🌹

ప్రసాద్ భరద్వాజ.

https://youtube.com/shorts/RC6TWR65qYc

🌹 కపిల గీత 2వ భాగము. - కపిల దేవహూతి సంవాదం. - ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యత - 2. - 3. భగవానుడు గోవిందుడు 🌹

ప్రసాద్ భరద్వాజ.

https://youtube.com/shorts/aTU9Zpk-f_k

🌹 కపిల గీత 2వ భాగము. - కపిల దేవహూతి సంవాదం. - ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యత - 2. - 4. భగవానుడే సర్వ జీవుల పోషకుడు 🌹

ప్రసాద్ భరద్వాజ.

https://youtube.com/shorts/MS2zIsq5lX0

🌹 కపిల గీత 2వ భాగము. - కపిల దేవహూతి సంవాదం. - ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యత - 2. - 5. అత్యున్నత జీవన లక్ష్యం 🌹

ప్రసాద్ భరద్వాజ.

https://youtube.com/shorts/5L1QNUIWX5o

సబ్‌స్క్రైబ్‌ చైతన్య విజ్ఞానం చానల్‌. లైక్ చేయండి, షేర్‌ చేయండి. - ప్రసాద్‌ భరధ్వాజ.

🌹🌹🌹🌹🌹

Kapila Gita Part 2 - Lord Kapila Devahuti's Conversation - The Importance of Spiritual Knowledge 2. - 5 Short Videos

🌹 Kapila Gita Part 2 - Lord Kapila Devahuti's Conversation - The Importance of Spiritual Knowledge 2. - 5 Short Videos. 🌹

Prasad Bharadwaj

🌹 Kapila Gita Part 2 - Lord Kapila Devahuti's Conversation - The Importance of Spiritual Knowledge 2. - 1. The Supreme Lord is the Cause of All Causes. 🌹

Prasad Bharadwaj

https://youtube.com/shorts/3hNG3X4kGbg?si=rWLw0zpKfwspOJJu

🌹 Kapila Gita Part 2 - Lord Kapila Devahuti's Conversation - The Importance of Spiritual Knowledge 2. - 2. Constant Connection. 🌹

Prasad Bharadwaj

https://www.youtube.com/shorts/KpR-ZBJWbD0

🌹 Kapila Gita Part 2 - Lord Kapila Devahuti's Conversation - The Importance of Spiritual Knowledge 2. - 3. The Lord is Govinda. 🌹

Prasad Bharadwaj

https://www.youtube.com/shorts/NAfW6b9IfTI

🌹 Kapila Gita Part 2 - Lord Kapila Devahuti's Conversation - The Importance of Spiritual Knowledge 2. - 4. The Lord as the Sustainer of All Living Beings. 🌹

Prasad Bharadwaj

https://www.youtube.com/shorts/of1XRs4qkYI

🌹 Kapila Gita Part 2 - Lord Kapila Devahuti's Conversation - The Importance of Spiritual Knowledge - 2. - 5. The Ultimate Goal of Life. 🌹

Prasad Bharadwaj

https://www.youtube.com/shorts/eZ6ZaxpI0v0

Subscribe to Chaitanya Vijnaanam channel. Like and share. - Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹

కార్తీక పురాణం - 27 - దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట (Kartika Purana - 27 - Durvasa takes refuge in Ambarish)

🌹. కార్తీక పురాణం - 27 🌹

🌻. 27వ అధ్యాయము - దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట 🌻

ప్రసాద్ భరద్వాజ

మరల అత్రి మహాముని అగస్త్యున కిట్లు వచించెను- కుంభ సంభవా! ఆ శ్రీ హరి దూర్వాసుని యెంతో ప్రేమతో జేరదీసి యింకను ఇట్లు చెప్పెను.

"ఓ దూర్వాస మునీ! నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారము లెత్తుట కష్టము గాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ యివ్వవలెను. గాన, అందులకు నేనంగగీకరించితిని. బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని యింట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరీవృతుడై ప్రాయోపవేశమొనర్పనెంచినాడు. ఆ కారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మము గాని, ప్రజాపీడనము గాదు.

ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపియైన మరొక విప్రుడే దండించ వలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్దమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని యెప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించువాడును హింసింపచేయువాడును, బ్రాహ్మణ హంతకులకి న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టిలాగిన వాడును, కాలితో తన్నినవాడును, విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును, విప్ర పరిత్యాగ మొనరించినవాడును బ్రహ్మహ౦తుకులే అగుదురు.

కాన, ఓ దూర్వాస మహర్షి! అంబరీషుడు నీ గురించి - తపశ్శాలియు, విప్రోత్తముడును అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణసంకటం పొందుచున్నాడు. అయ్యో! నేను బ్రాహ్మణ హంతకుడనయితినే యని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి, నీవు వేగమే అంబరీషుని కడకేగుము. అందువలన మీవుభయులకు శాంతి లభించును" అని విష్ణువు దూర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు బంపెను.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహత్మ్యమందలి సప్తవి౦శోధ్యాయము - ఇరవయ్యేడవ రోజు పారాయణము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 577 - 5 / Sri Lalitha Chaitanya Vijnanam - 577 - 5

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 577 - 5 / Sri Lalitha Chaitanya Vijnanam - 577 - 5 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 116. పరాశక్తిః, పరానిష్ఠా, ప్రజ్ఞాన ఘనరూపిణీ ।
మాధ్వీపానాలసా, మత్తా, మాతృకా వర్ణ రూపిణీ ॥ 116 ॥ 🍀

🌻 577. 'మాతృకా వర్ణరూపిణీ' - 5 🌻

అక్షరములు అనగా అక్ష + రములు అని కూడ పెద్దలు తెలుపుదురు. అనగా మూలమును అక్షముగ గొనువచ్చు శక్తి అని అర్థము. 'అ' అను పరతత్వమును మూలము లేక కేంద్రము లేక పరము నుండి అక్షముగ శ్రీమాత గొనివచ్చును. క్షరము కాని పరతత్వమును, అక్షముగా గొనివచ్చుచూ సృష్టి నిర్మాణము చేయును. ఆమె అక్షరి. ఇట్లు గొనివచ్చి ఏడు లోకముల సృష్టిని చేయును. కేంద్రము నుండి పరిధి వరకు లేక పరము నుండి పదార్థము వరకు సృష్టిని యేర్పరచు శ్రీమాతకు శబ్దములు, వర్ణములు, అర్థములు ఉపకరణములు. వానికి రూపము లేర్పరచునది కూడ ఆమెయే.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 577 - 5 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 116. Parashaktih paranishta pragynana ghanarupini
madhvipanalasa matta matrukavarna rupini ॥116 ॥ 🌻

🌻 577. 'Mātr‌kā Varṇarūpiṇī' - 5 🌻

The term "Akṣaramulu" is explained by elders as "Akṣa + Ramulu". This means the power to manifest the source as something imperishable. The syllable "A" symbolizes the Supreme Principle (Paratattva) and represents the origin, center, or transcendence. From this Supreme Principle, Śrī Māta manifests creation in an imperishable form (Akṣa). She draws the eternal Supreme Principle into an accessible form and constructs creation. Thus, she is called Akṣarī. Through this manifestation, she creates the seven worlds, extending from the center to the periphery, or from the transcendental realm to the material realm. For Śrī Māta, sounds (śabdas), letters (varṇas), and meanings (arthas) serve as tools, and she herself gives form to them.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 28 NOVEMBER 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు🌹

🍀🌹 28 NOVEMBER 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు🌹🍀 
1) 🌹 కపిల గీత 2వ భాగము. - కపిల దేవహూతి సంవాదం. - ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యత - 2. - 5 లఘు వీడియోలు 🌹
2) 🌹 Kapila Gita Part 2 - Lord Kapila Devahuti's Conversation - The Importance of Spiritual Knowledge 2. - 5 Short Videos. 🌹
3) 🌹. కార్తీక పురాణం - 27 🌹
🌻. 27వ అధ్యాయము - దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించు 🌻
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 577 - 5 / Sri Lalitha Chaitanya Vijnanam - 577 - 5 🌹 
🌻 577. 'మాతృకా వర్ణరూపిణీ' - 5 / 577. 'Mātr‌kā Varṇarūpiṇī' - 5 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 కపిల గీత 2వ భాగము. - కపిల దేవహూతి సంవాదం. - ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యత - 2. - 5 లఘు వీడియోలు 🌹*
*ప్రసాద్ భరద్వాజ.*

*🌹 కపిల గీత 2వ భాగము. - కపిల దేవహూతి సంవాదం. - ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యత - 2. - 1. భగవానుడు *సర్వకారణ కారకుడు 🌹*
*ప్రసాద్ భరద్వాజ.*

*🌹 కపిల గీత 2వ భాగము. - కపిల దేవహూతి సంవాదం. - ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యత - 2. - 2. నిరంతర అనుసంధానం 🌹*
*ప్రసాద్ భరద్వాజ.*

*🌹 కపిల గీత 2వ భాగము. - కపిల దేవహూతి సంవాదం. - ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యత - 2. - 3. భగవానుడు గోవిందుడు 🌹*
*ప్రసాద్ భరద్వాజ.*

*🌹 కపిల గీత 2వ భాగము. - కపిల దేవహూతి సంవాదం. - ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యత - 2. - 4. భగవానుడే సర్వ జీవుల పోషకుడు 🌹*
*ప్రసాద్ భరద్వాజ.*

*🌹 కపిల గీత 2వ భాగము. - కపిల దేవహూతి సంవాదం. - ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యత - 2. - 5. అత్యున్నత జీవన లక్ష్యం 🌹*
*ప్రసాద్ భరద్వాజ.*

*సబ్‌స్క్రైబ్‌ చైతన్య విజ్ఞానం చానల్‌. లైక్ చేయండి, షేర్‌ చేయండి. - ప్రసాద్‌ భరధ్వాజ.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Kapila Gita Part 2 - Lord Kapila Devahuti's Conversation - The Importance of Spiritual Knowledge 2. - 5 Short Videos. 🌹*
*Prasad Bharadwaj*

*🌹 Kapila Gita Part 2 - Lord Kapila Devahuti's Conversation - The Importance of Spiritual Knowledge 2. - 1. The Supreme Lord is the Cause of All Causes. 🌹*
*Prasad Bharadwaj*

*🌹 Kapila Gita Part 2 - Lord Kapila Devahuti's Conversation - The Importance of Spiritual Knowledge 2. - 2. Constant Connection. 🌹*
*Prasad Bharadwaj*  

*🌹 Kapila Gita Part 2 - Lord Kapila Devahuti's Conversation - The Importance of Spiritual Knowledge 2. - 3. The Lord is Govinda. 🌹*
*Prasad Bharadwaj*

*🌹 Kapila Gita Part 2 - Lord Kapila Devahuti's Conversation - The Importance of Spiritual Knowledge 2. - 4. The Lord as the Sustainer of All Living Beings. 🌹*
*Prasad Bharadwaj*  

*🌹 Kapila Gita Part 2 - Lord Kapila Devahuti's Conversation - The Importance of Spiritual Knowledge - 2. - 5. The Ultimate Goal of Life. 🌹*
*Prasad Bharadwaj*

*Subscribe to Chaitanya Vijnaanam channel. Like and share. - Prasad Bharadwaj*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కార్తీక పురాణం - 27 🌹*
*🌻. 27వ అధ్యాయము - దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట 🌻*
*ప్రసాద్ భరద్వాజ*

మరల అత్రి మహాముని అగస్త్యున కిట్లు వచించెను- కుంభ సంభవా! ఆ శ్రీ హరి దూర్వాసుని యెంతో ప్రేమతో జేరదీసి యింకను ఇట్లు చెప్పెను.

"ఓ దూర్వాస మునీ! నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారము లెత్తుట కష్టము గాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ యివ్వవలెను. గాన, అందులకు నేనంగగీకరించితిని. బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని యింట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరీవృతుడై ప్రాయోపవేశమొనర్పనెంచినాడు. ఆ కారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మము గాని, ప్రజాపీడనము గాదు. 

ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపియైన మరొక విప్రుడే దండించ వలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్దమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని యెప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించువాడును హింసింపచేయువాడును, బ్రాహ్మణ హంతకులకి న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టిలాగిన వాడును, కాలితో తన్నినవాడును, విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును, విప్ర పరిత్యాగ మొనరించినవాడును బ్రహ్మహ౦తుకులే అగుదురు. 

కాన, ఓ దూర్వాస మహర్షి! అంబరీషుడు నీ గురించి - తపశ్శాలియు, విప్రోత్తముడును అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణసంకటం పొందుచున్నాడు. అయ్యో! నేను బ్రాహ్మణ హంతకుడనయితినే యని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి, నీవు వేగమే అంబరీషుని కడకేగుము. అందువలన మీవుభయులకు శాంతి లభించును" అని విష్ణువు దూర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు బంపెను.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహత్మ్యమందలి సప్తవి౦శోధ్యాయము - ఇరవయ్యేడవ రోజు పారాయణము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 577 - 5 / Sri Lalitha Chaitanya Vijnanam  - 577 - 5 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 116. పరాశక్తిః, పరానిష్ఠా, ప్రజ్ఞాన ఘనరూపిణీ ।*
*మాధ్వీపానాలసా, మత్తా, మాతృకా వర్ణ రూపిణీ ॥ 116 ॥ 🍀*

*🌻 577. 'మాతృకా వర్ణరూపిణీ' - 5 🌻*

*అక్షరములు అనగా అక్ష + రములు అని కూడ పెద్దలు తెలుపుదురు. అనగా మూలమును అక్షముగ గొనువచ్చు శక్తి అని అర్థము. 'అ' అను పరతత్వమును మూలము లేక కేంద్రము లేక పరము నుండి అక్షముగ శ్రీమాత గొనివచ్చును. క్షరము కాని పరతత్వమును, అక్షముగా గొనివచ్చుచూ సృష్టి నిర్మాణము చేయును. ఆమె అక్షరి. ఇట్లు గొనివచ్చి ఏడు లోకముల సృష్టిని చేయును. కేంద్రము నుండి పరిధి వరకు లేక పరము నుండి పదార్థము వరకు సృష్టిని యేర్పరచు శ్రీమాతకు శబ్దములు, వర్ణములు, అర్థములు ఉపకరణములు. వానికి రూపము లేర్పరచునది కూడ ఆమెయే.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 577 - 5 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 116. Parashaktih paranishta pragynana ghanarupini*
*madhvipanalasa matta matrukavarna rupini  ॥116 ॥ 🌻*

*🌻 577. 'Mātr‌kā Varṇarūpiṇī' - 5 🌻*

*The term "Akṣaramulu" is explained by elders as "Akṣa + Ramulu". This means the power to manifest the source as something imperishable. The syllable "A" symbolizes the Supreme Principle (Paratattva) and represents the origin, center, or transcendence. From this Supreme Principle, Śrī Māta manifests creation in an imperishable form (Akṣa). She draws the eternal Supreme Principle into an accessible form and constructs creation. Thus, she is called Akṣarī. Through this manifestation, she creates the seven worlds, extending from the center to the periphery, or from the transcendental realm to the material realm. For Śrī Māta, sounds (śabdas), letters (varṇas), and meanings (arthas) serve as tools, and she herself gives form to them.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube channel Facebook WhatsApp Channel 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. Chaitanya Vijnaanam YouTube FB Telegram groups 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
Like, Subscribe and Share 👀
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj

कपिल गीता भाग 2 - भगवान कपिल और देवहूति का संवाद - आध्यात्मिक ज्ञान का महत्व 2. - 5 छोटे वीडियो। (Kapila Gita 2 - The Conversation of Kapila and Devahuti - The Importance of Transcendental Knowledge - Part 2 - 5 Youtube Shorts)

🌹 कपिल गीता भाग 2 - भगवान कपिल और देवहूति का संवाद - आध्यात्मिक ज्ञान का महत्व 2. - 5 छोटे वीडियो। 🌹

प्रसाद भरद्वाज

🌹 कपिल गीता भाग 2 - भगवान कपिल और देवहूति का संवाद - आध्यात्मिक ज्ञान का महत्व 2. - 1. भगवान ही सभी कारणों के कारण हैं। 🌹

प्रसाद भरद्वाज

https://youtube.com/shorts/8DFosJwsrwE

🌹 कपिल गीता भाग 2 - भगवान कपिल और देवहूति का संवाद - आध्यात्मिक ज्ञान का महत्व 2. - 2. निरंतर संबंध। 🌹

प्रसाद भरद्वाज

https://youtube.com/shorts/bH5fJbEE89A

🌹 कपिल गीता भाग 2 - भगवान कपिल और देवहूति का संवाद - आध्यात्मिक ज्ञान का महत्व 2. - 3. भगवान गोविंद हैं। 🌹

प्रसाद भरद्वाज

https://youtube.com/shorts/2DG_hU-hsGY

🌹 कपिल गीता भाग 2 - भगवान कपिल और देवहूति का संवाद - आध्यात्मिक ज्ञान का महत्व 2. - 4. भगवान सभी जीवों के पालनहार हैं। 🌹

प्रसाद भरद्वाज

https://youtube.com/shorts/kZYh3P8X4h4

🌹 कपिल गीता भाग 2 - भगवान कपिल और देवहूति का संवाद - आध्यात्मिक ज्ञान का महत्व 2. - 5. जीवन का परम उद्देश्य। 🌹

प्रसाद भरद्वाज

https://youtube.com/shorts/ZjCP45IGGs8

चैतन्य विज्ञानम चैनल को सब्सक्राइब करें। लाइक करें, शेयर करें । - प्रसाद भारद्वाज.

🌹🌹🌹🌹🌹

కార్తిక పురాణం - 26 - దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట - శ్రీహరి హితబోధ (Kartika Purana - 26 - Durvasu takes refuge in Srihari - Srihari's beneficial teachings)

🌹. కార్తిక పురాణం - 26 🌹

🌻. 26వ అధ్యాయము - దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట - శ్రీహరి హితబోధ 🌻

ప్రసాద్ భరద్వాజ

ఈ విధముగా అత్రిమహముని అగస్త్యునితో - దూర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిసి, మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను.

ఆవిధముగా ముక్కోపియైన దూర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోను తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకువెళ్లి

"వాసుదేవా! జగన్నాథా! శరణాగతరక్షణ బిరుదాంకితా! రక్షింపుము. నీభక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడను గాను. ముక్కోపినై మహాపరాధము చేసితిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగుమహర్షి నీ యురముపై తనిన్నను సహించితివి. అ కాలిగురుతు నేటికినీ నీ వక్షస్దలమందున్నది. ప్రశాంతమనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడ రక్షింపుము.

శ్రీహరి! నీచక్రాయుధము నన్ను జంపవచ్చుచున్న"దని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరివిధముల ప్రార్దించెను. ఆవిధముగా దూర్వాసుడు అహంకారమును వదలి తనను ప్రార్దుంచుట చూచి - శ్రీ హరి చిరునవ్వు నవ్వి "దూర్వాసా! నీ మాటలు యదార్ధములు. నీవంటి తపోధనులు నాకత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున బుట్టిన రుద్రడవు. నిన్ను జూచిన వారు మూడు లోకములందు భయపడకుందురా! నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము యెట్టి హింసా కలిగించను. ప్రతియుగమందున గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనంబులకు సంభవించే యాపదలను పోగొట్టుటకు ఆయా పరిస్ధితలకు తగిన రూపములు ధరించి దుష్టశిక్షణ శిష్టరక్షణ గావింతును.

నీవకారణముగా అంబరీషుని శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్కయములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహము నా రూపముగానే జూతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కాని, అటువంటి నాభక్తుని నీవు అనేక విధములు దూషించితివి. నీ యెడమ పాదముతో తన్నితివి. అతని యింటికి నీవు అతిథినై వచ్చికూడ, నేను వేళకు రానియెడల ద్వాదశి షుడియలు దాటకుండ భుజింపుమని అంబరీషునకు చెప్పవైతివి. అతడు వ్రతభంగమునుకు భయపడి, నీ రాకకై చూచి జలపానమును మాత్రమే జేసెను. అంతకంటే అతడు అపరాధము యేమిచేసెను!

చాతుర్వర్ణములవారికి భోజన నిషిద్ద దినములందు కూడా జలపానము దాహశాంతికిని, పవిత్రతకును చేయదగినదే కదా? జలపాన మొనరించిన మాత్రమున నాభక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్నవమానించుటకు చేయాలేదే? నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపచేయ జూచెను. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణువేడెను. నేనపుడు రాజు హృదయములో ప్రవేశించినాను. నీ శాపఫలము పది జన్మలలో అనుభవించుదునని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను. కాని, తన దేహము తాను తెలుసుకోనే స్దితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నాభక్త కోటిలో శ్రేష్టుడు. నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వానిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారించవలదు. ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును.

అదెటులనిన నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్యజన్మ. నేనీ కల్పమును మనువును రక్షించు నిమిత్తము, సోమకుడను రాక్షసుని జంపుటకు మత్స్యరూపమెత్తుదును. మరి కొంత కాలమునకు దేవదానవులు క్షీర సాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. అ పర్వతమును నీటిలో మునగకుండ కూర్మరూపమున నా వీపున మోయుదును. వరాహజన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని జంపి, ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గమునుండి పారద్రోలబడిన ఇంద్రనకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామనరూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కివేతును. భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును. లోకకంటకుడయిన రావణుని జంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును. పిదప, యదువంశమున శ్రీకృష్ణునిగను, కలియుగమున బుద్దుడుగను, కలియుగాంతమున విష్ణు చిత్తుడను విప్రునియింట "కల్కి" యను పేరున జన్మించి, అశ్వారూఢుండనై పరిభ్రమించుచు బ్రహ్మదేషులనందరను మట్టుబెట్టుదును.

నీవు అంబరీషునకు శాపరూపమున నిచ్చిన పదిజన్మలను యీ విధముగా పూర్తిచేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించువారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నోసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహత్మ్యమందలి షడ్వింశోధ్యాయము - ఇరవయ్యారో రోజు పారాయణము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 577 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 577 - 4

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 577 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 577 - 4 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 116. పరాశక్తిః, పరానిష్ఠా, ప్రజ్ఞాన ఘనరూపిణీ ।
మాధ్వీపానాలసా, మత్తా, మాతృకా వర్ణ రూపిణీ ॥ 116 ॥ 🍀

🌻 577. 'మాతృకా వర్ణరూపిణీ' - 4 🌻

మెఱపు వంటి అ కార, క్ష కార శబ్దములున్నవి. బంగారు కాంతి గల ల, శ, ష, స శబ్దము లున్నవి. అట్లే అరుణ వర్ణము లున్నవి. గౌర వర్ణము లున్నవి. ధూమ్రము, సిందూర వర్ణములు కూడ నున్నవి. ఆయా లోకములలో ఆ యా శబ్దముల ప్రభావము వలన ఆయా కాంతులు పుట్టుచుండును. తత్కారణముగనే శ్రీమాత వివిధ కాంతులతో శోభిల్లుచుండును. భక్తుల పరిపక్వతను బట్టి సాధారణ కాంతుల నుండి కన్నులు మిరుమిట్లు గొలుపు మెఱపు కాంతుల వరకు దర్శనములు జరుగుచుండును. నాదములు వినపడు చుండును. రహస్యార్థములు తెలియుచుండును. ఇట్లు తెలియుచుండగా ఆరాధకులు పరవశము చెంది నిర్ఘాంతబోవుచు ఆమె దివ్య రూపమును చూచుటకే అశ్రాంతము కోరుచుందురు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 577 - 4 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 116. Parashaktih paranishta pragynana ghanarupini
madhvipanalasa matta matrukavarna rupini ॥116 ॥ 🌻

🌻 577. 'Mātr̥kā Varṇarūpiṇī' - 4 🌻

There are sounds like "A" and "Kṣa" that resemble flashes of lightning. There are also sounds like "La," "Śa," "Ṣa," and "Sa," which are associated with a golden radiance. Similarly, there are hues of crimson, white, smoky gray, and vermillion. In each of the worlds, these specific radiances arise due to the influence of the corresponding sounds. For this reason, Śrī Māta radiates with diverse and splendid lights. Based on the spiritual maturity of devotees, visions range from ordinary lights to dazzling flashes that amaze the eyes. Sounds (nādas) are heard, and their esoteric meanings are revealed. In this state of realization, worshippers become enraptured, overwhelmed by bliss, and remain tirelessly devoted, yearning to behold her divine form again and again.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 27 NOVEMBER 2024 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు🌹

🍀 🌹 27 NOVEMBER 2024 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు🌹🍀 
1) 🌹 कपिल गीता भाग 2 - भगवान कपिल और देवहूति का संवाद - आध्यात्मिक ज्ञान का महत्व 2. - 5 छोटे वीडियो। 🌹
2) 🌹. కార్తిక పురాణం - 26 🌹 
🌻. 26వ అధ్యాయము - దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట - శ్రీహరి హితబోధ 🌻
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 577 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 577 - 4 🌹 
🌻 577. 'మాతృకా వర్ణరూపిణీ' - 4 / 577. 'Mātr‌kā Varṇarūpiṇī' - 4 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 कपिल गीता भाग 2 - भगवान कपिल और देवहूति का संवाद - आध्यात्मिक ज्ञान का महत्व 2. - 5 छोटे वीडियो। 🌹*
*प्रसाद भरद्वाज*  

*🌹 कपिल गीता भाग 2 - भगवान कपिल और देवहूति का संवाद - आध्यात्मिक ज्ञान का महत्व 2. - 1. भगवान ही सभी कारणों के कारण हैं। 🌹*
*प्रसाद भरद्वाज*

*🌹 कपिल गीता भाग 2 - भगवान कपिल और देवहूति का संवाद - आध्यात्मिक ज्ञान का महत्व 2. - 2. निरंतर संबंध। 🌹*
*प्रसाद भरद्वाज*

*🌹 कपिल गीता भाग 2 - भगवान कपिल और देवहूति का संवाद - आध्यात्मिक ज्ञान का महत्व 2. - 3. भगवान गोविंद हैं। 🌹*
*प्रसाद भरद्वाज*

*🌹 कपिल गीता भाग 2 - भगवान कपिल और देवहूति का संवाद - आध्यात्मिक ज्ञान का महत्व 2. - 4. भगवान सभी जीवों के पालनहार हैं। 🌹*
*प्रसाद भरद्वाज*

*🌹 कपिल गीता भाग 2 - भगवान कपिल और देवहूति का संवाद - आध्यात्मिक ज्ञान का महत्व 2. - 5. जीवन का परम उद्देश्य। 🌹*
*प्रसाद भरद्वाज*

*चैतन्य विज्ञानम चैनल को सब्सक्राइब करें। लाइक करें, शेयर करें । - प्रसाद भारद्वाज.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కార్తిక పురాణం - 26 🌹*
*🌻. 26వ అధ్యాయము - దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట - శ్రీహరి హితబోధ 🌻*
*ప్రసాద్ భరద్వాజ* 

ఈ విధముగా అత్రిమహముని అగస్త్యునితో - దూర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిసి, మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను.

ఆవిధముగా ముక్కోపియైన దూర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోను తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకువెళ్లి 

"వాసుదేవా! జగన్నాథా! శరణాగతరక్షణ బిరుదాంకితా! రక్షింపుము. నీభక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడను గాను. ముక్కోపినై మహాపరాధము చేసితిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగుమహర్షి నీ యురముపై తనిన్నను సహించితివి. అ కాలిగురుతు నేటికినీ నీ వక్షస్దలమందున్నది. ప్రశాంతమనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడ రక్షింపుము. 

శ్రీహరి! నీచక్రాయుధము నన్ను జంపవచ్చుచున్న"దని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరివిధముల ప్రార్దించెను. ఆవిధముగా దూర్వాసుడు అహంకారమును వదలి తనను ప్రార్దుంచుట చూచి - శ్రీ హరి చిరునవ్వు నవ్వి "దూర్వాసా! నీ మాటలు యదార్ధములు. నీవంటి తపోధనులు నాకత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున బుట్టిన రుద్రడవు. నిన్ను జూచిన వారు మూడు లోకములందు భయపడకుందురా! నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము యెట్టి హింసా కలిగించను. ప్రతియుగమందున గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనంబులకు సంభవించే యాపదలను పోగొట్టుటకు ఆయా పరిస్ధితలకు తగిన రూపములు ధరించి దుష్టశిక్షణ శిష్టరక్షణ గావింతును.

 నీవకారణముగా అంబరీషుని శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్కయములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహము నా రూపముగానే జూతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కాని, అటువంటి నాభక్తుని నీవు అనేక విధములు దూషించితివి. నీ యెడమ పాదముతో తన్నితివి. అతని యింటికి నీవు అతిథినై వచ్చికూడ, నేను వేళకు రానియెడల ద్వాదశి షుడియలు దాటకుండ భుజింపుమని అంబరీషునకు చెప్పవైతివి. అతడు వ్రతభంగమునుకు భయపడి, నీ రాకకై చూచి జలపానమును మాత్రమే జేసెను. అంతకంటే అతడు అపరాధము యేమిచేసెను!

చాతుర్వర్ణములవారికి భోజన నిషిద్ద దినములందు కూడా జలపానము దాహశాంతికిని, పవిత్రతకును చేయదగినదే కదా? జలపాన మొనరించిన మాత్రమున నాభక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్నవమానించుటకు చేయాలేదే? నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపచేయ జూచెను. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణువేడెను. నేనపుడు రాజు హృదయములో ప్రవేశించినాను. నీ శాపఫలము పది జన్మలలో అనుభవించుదునని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను. కాని, తన దేహము తాను తెలుసుకోనే స్దితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నాభక్త కోటిలో శ్రేష్టుడు. నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వానిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారించవలదు. ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును.

అదెటులనిన నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్యజన్మ. నేనీ కల్పమును మనువును రక్షించు నిమిత్తము, సోమకుడను రాక్షసుని జంపుటకు మత్స్యరూపమెత్తుదును. మరి కొంత కాలమునకు దేవదానవులు క్షీర సాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. అ పర్వతమును నీటిలో మునగకుండ కూర్మరూపమున నా వీపున మోయుదును. వరాహజన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని జంపి, ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గమునుండి పారద్రోలబడిన ఇంద్రనకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామనరూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కివేతును. భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును. లోకకంటకుడయిన రావణుని జంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును. పిదప, యదువంశమున శ్రీకృష్ణునిగను, కలియుగమున బుద్దుడుగను, కలియుగాంతమున విష్ణు చిత్తుడను విప్రునియింట "కల్కి" యను పేరున జన్మించి, అశ్వారూఢుండనై పరిభ్రమించుచు బ్రహ్మదేషులనందరను మట్టుబెట్టుదును.

నీవు అంబరీషునకు శాపరూపమున నిచ్చిన పదిజన్మలను యీ విధముగా పూర్తిచేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించువారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నోసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహత్మ్యమందలి షడ్వింశోధ్యాయము - ఇరవయ్యారో రోజు పారాయణము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 577 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam  - 577 - 4 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 116. పరాశక్తిః, పరానిష్ఠా, ప్రజ్ఞాన ఘనరూపిణీ ।*
*మాధ్వీపానాలసా, మత్తా, మాతృకా వర్ణ రూపిణీ ॥ 116 ॥ 🍀*

*🌻 577. 'మాతృకా వర్ణరూపిణీ' - 4 🌻*

*మెఱపు వంటి అ కార, క్ష కార శబ్దములున్నవి. బంగారు కాంతి గల ల, శ, ష, స శబ్దము లున్నవి. అట్లే అరుణ వర్ణము లున్నవి. గౌర వర్ణము లున్నవి. ధూమ్రము, సిందూర వర్ణములు కూడ నున్నవి. ఆయా లోకములలో ఆ యా శబ్దముల ప్రభావము వలన ఆయా కాంతులు పుట్టుచుండును. తత్కారణముగనే శ్రీమాత వివిధ కాంతులతో శోభిల్లుచుండును. భక్తుల పరిపక్వతను బట్టి సాధారణ కాంతుల నుండి కన్నులు మిరుమిట్లు గొలుపు మెఱపు కాంతుల వరకు దర్శనములు జరుగుచుండును. నాదములు వినపడు చుండును. రహస్యార్థములు తెలియుచుండును. ఇట్లు తెలియుచుండగా ఆరాధకులు పరవశము చెంది నిర్ఘాంతబోవుచు ఆమె దివ్య రూపమును చూచుటకే అశ్రాంతము కోరుచుందురు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 577 - 4 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 116. Parashaktih paranishta pragynana ghanarupini*
*madhvipanalasa matta matrukavarna rupini  ॥116 ॥ 🌻*

*🌻 577. 'Mātr‌kā Varṇarūpiṇī' - 4 🌻*

*There are sounds like "A" and "Kṣa" that resemble flashes of lightning. There are also sounds like "La," "Śa," "Ṣa," and "Sa," which are associated with a golden radiance. Similarly, there are hues of crimson, white, smoky gray, and vermillion. In each of the worlds, these specific radiances arise due to the influence of the corresponding sounds. For this reason, Śrī Māta radiates with diverse and splendid lights. Based on the spiritual maturity of devotees, visions range from ordinary lights to dazzling flashes that amaze the eyes. Sounds (nādas) are heard, and their esoteric meanings are revealed. In this state of realization, worshippers become enraptured, overwhelmed by bliss, and remain tirelessly devoted, yearning to behold her divine form again and again.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube channel Facebook WhatsApp Channel 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. Chaitanya Vijnaanam YouTube FB Telegram groups 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
Like, Subscribe and Share 👀
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 577 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 577 - 3

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 577 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 577 - 3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 116. పరాశక్తిః, పరానిష్ఠా, ప్రజ్ఞాన ఘనరూపిణీ ।
మాధ్వీపానాలసా, మత్తా, మాతృకా వర్ణ రూపిణీ ॥ 116 ॥ 🍀

🌻 577. 'మాతృకా వర్ణరూపిణీ' - 3 🌻

(త్రిపాదస్య అమృతందివి) రూపమునకు మరణ మున్నది. శబ్దము, అర్థము, రంగు మరణించవు. ఇట్లు సృష్టి అంతయూ అక్షర స్వరూపమే. మాతృకావర్ణ రూపమే అని తెలియవలెను. సప్త మాతృకలు అనగా సప్త లోకముల నేర్పరచు శబ్దము. వానిని బీజాక్షరములు అని కూడ పిలుతురు. సహ్రసారము నుండి మూలాధారము వరకు యం, హం, సం, కం, లం, రం, డం శబ్దములు కలవు. ఈ శబ్దము లత్యంత కాంతివంతములు. వజ్రకాంతి నుండి భూకాంతి (మట్టిరంగు) వరకు వివిధమగు కాంతులలో సప్తలోకములు ప్రకాశించు చుండును. శబ్దాచ్చారణమును నుండి రంగులు పుట్టును. అవి కాంతి వంతములు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 577 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 116. Parashaktih paranishta pragynana ghanarupini
madhvipanalasa matta matrukavarna rupini ॥116 ॥ 🌻

🌻 577. 'Mātr‌kā Varṇarūpiṇī' - 3 🌻

Tripādasya Amṛtaṁ Divi - The form is subject to mortality, but sound, meaning, and color are immortal. Thus, the entire creation is essentially of the nature of letters (akṣara-svarūpa). It must be understood that this is the form of Mātr‌kā Varṇa. The term "Sapta Mātr‌kās" refers to the sounds that represent the seven worlds. These are also called Bīja Akṣaras (seed syllables). From Sahasrāra (the crown chakra) to Mūlādhāra (the root chakra), there are the sounds Yaṁ, Haṁ, Saṁ, Kaṁ, Laṁ, Raṁ, Daṁ. These sounds are immensely radiant, shining with diverse forms of light—from the brilliance of diamonds to the earthen hues of the soil. The seven worlds are illuminated through these varied radiances. Colors emerge from the utterance of these sounds, and they possess extraordinary luminosity.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

కార్తీక పురాణం - 25 - దూర్వాసుడు అంబరీషుని శపించుట (Kartika Purana - 25 - Durvasa curses Ambarish)

🌹. కార్తీక పురాణం - 25 🌹

🌻 25వ అధ్యాయము - దూర్వాసుడు అంబరీషుని శపించుట 🌻

ప్రసాద్ భరద్వాజ

"అంబరీషా! పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకీ యనర్ధము వచ్చినది. నీ బుద్దిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించుము" అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు "ఓ పండితోత్తములారా! నానిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశీనిష్టను విడచుట కన్న, విప్రశాపము అధికమయినది కాదు. జలపానము చేయుట వలన బ్రాహణుని అవమానపరచుటగాదు. ద్వాదశిని విడచుటయుగాదు. అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందించును? నిందింపడు. నా తొల్లి పుణ్యఫలము నశింపదు. గాన, జలపాన మొనరించి వూరకుందును" అని వారి యెదుటనే జలపానము నొనరించెను.

అంబరీషుడు జలపాన మొనరించిన మరుక్షణముచే దూర్వాసుడు స్నానజపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై క౦డ్ల వెంట నిప్పులు గ్రక్కుచూ "ఓరీ మదాంధా! నన్ను భోజనానికి రమ్మని, నేను రాకనే నీవేల భుజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము? ఎంతటి ధర్మ పరిత్యాగివి? అతిధికి అన్నము పెట్టెదనని ఆశజూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్ష కుడగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి. అది భోజనముతో సమానమైనదే. నీవు అతిధిని విడిచి భుజించినావు కాన, నీవు నమ్మకద్రోహివగుదువేగాని హరిభక్తుడవెట్లు కాగలవు? శ్రీ హరి బ్రాహణావమానమును సహింపడు. మమ్మే యవమానించుట యనిన శ్రీహరిని అవమానించుటయే. నీవంటి హరినిందాపరుడు మరి యొకడులేడు. నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడవై వున్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వనించి అవమానపరచి నిర్లక్ష్యముగా జలపాన మొనరించితివి. అంబరీషా! నీవెట్లు పవిత్ర రాజకుటుంబములో బుట్టినావురా! నీ వంశము కళంకము కాలేదా?" అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అ౦బరీషుడు, ముని కోపమునకు గడ గడ వణుకుచు, ముకుళిత హస్తములతో "మహానుభావా! నేను ధర్మహీనుడను, నా యజ్ఞానముచే నేనీ కార్యము చేసితిని. నన్ను రక్షింపుడు. బ్రాహణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులూ, దయా దాక్షిణ్యములు గలవారూ కాన, నన్ను కాపాడు" డని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన యెడమకాలితో తన్ని "దోషికీ శాపమీయకుండా వుండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగానూ, మూడవజన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, యైదవజన్మలో వామనుడు గాను, ఆరోవ జన్మలో క్రూరుడవగు బ్రాహణుడవుగాను, యేడవ జన్మలో మూఢుడవైన రాజుగాను, యెనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసనముగానిలేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషండ మతస్తునిగాను, పదవ జన్మలో పాప బుద్ధిగల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టెదవుగాక" అని వెనుక ముందు లాలోచించక శపించెను. ఇంకను కోపము తగ్గనందున మరల శపించుటకు ఉద్యుక్తడగుచుండగా, శ్రీ మహావిష్ణువు బ్రాహణ శాపము వృధాకాకూడదని, తన భక్తునికి ఏ అపాయము కలుగకుండుటకు - అంబరీషుని హృదయములో ప్రవేశించి "మునివర్యా! అటులనే - మీ శాపమనుభవింతు" నని ప్రాధేయపడెను. కాని దూర్వసుడింకనూ కోపము పెంచుకొని శపించబోగా, శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచూ దూర్వసునిపై పడబోయెను. అంత దూర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచటి నుండి "బ్రతుకుజీవుడా" యని పరుగిడెను. మహాతేజస్సుతో చక్రాయుధము దూర్వసుని తరుముచుండెను. దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను, దేవలోకమున కరిగి దేవేంద్రుని, బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని, కైలాసమునకు వెళ్లి పరమేశ్వరునీ యెంత ప్రార్దంచినను వారు సైతము చక్రాయుధము బారినుండి దూర్వాసుని కాపాడలేకపోయిరి.

ఇట్లు స్కాంద పురాణంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి పంచవింశోధ్యాయము - ఇరవయ్యయిదో రోజు పారాయణము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹

कपिल गीता भाग 1 - कपिल और देवहुति संवाद - आध्यात्मिक ज्ञान का महत्व - 3 लघु वीडियो (Kapila Gita - 1 - Lord Kapila Devahuti's Conversation. - 3 short Videos)

🌹कपिल गीता भाग 1 - कपिल और देवहुति संवाद - आध्यात्मिक ज्ञान का महत्व - 3 लघु वीडियो 🌹

प्रसाद भारद्वाज

🌹 कपिल गीता भाग 1 - कपिल और देवहुति संवाद - 1. आध्यात्मिक ज्ञान का महत्व 🌹

प्रसाद भारद्वाज

https://youtube.com/shorts/EiiwRiEB_HI

🌹 कपिल गीता भाग 1 - कपिल और देवहुति संवाद - 2. तीन गुणों का महत्व 🌹

प्रसाद भारद्वाज

https://youtube.com/shorts/2XH9vYNp7TI

🌹 कपिल गीता भाग 1 - कपिल और देवहुति संवाद - 3. गुरु-शिष्य परंपरा में ज्ञान का प्रसार 🌹

प्रसाद भारद्वाज

https://youtube.com/shorts/K6fwmiTnhCA

चैतन्य विज्ञानम चैनल को सब्सक्राइब करें। लाइक करें, शेयर करें । - प्रसाद भारद्वाज.

🌹🌹🌹🌹🌹

కపిల గీత 1వ భాగం - కపిల దేవహూతి సంవాదం - ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యత - 3 లఘు వీడియోలు (Kapila Gita - 1 - Lord Kapila Devahuti's Conversation - 3 Youtube Shorts)

🌹 కపిల గీత 1వ భాగం - కపిల దేవహూతి సంవాదం - ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యత - 3 లఘు వీడియోలు 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

🌹 కపిల గీత 1వ భాగం - కపిల దేవహూతి సంవాదం - 1. ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యత 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

https://youtube.com/shorts/3cg4MqRWs9Y

🌹 కపిల గీత 1వ భాగం - కపిల దేవహూతి సంవాదం - 2. త్రిగుణాల ప్రాముఖ్యత 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

https://youtube.com/shorts/9aqGqMhYMHw

🌹 కపిల గీత 1వ భాగం - కపిల దేవహూతి సంవాదం - 3. గురు శిష్యపరంపరలో జ్ఞాన ప్రసారం 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

https://youtube.com/shorts/NtKD2QD-ITY

సబ్‌స్క్రైబ్‌ చైతన్య విజ్ఞానం చానల్‌. లైక్ చేయండి, షేర్‌ చేయండి. - ప్రసాద్‌ భరధ్వాజ.

🌹🌹🌹🌹🌹

ఏకాదశి తిథి జయంతి - ఉత్పన్న ఏకాదశి శుభాకాంక్షలు మరియు ఆశీస్సులు అందరికి (Ekadashi Tithi Jayanti)

🌹 ఏకాదశి తిథి జయంతి - ఉత్పన్న ఏకాదశి శుభాకాంక్షలు మరియు ఆశీస్సులు అందరికి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

కార్తీక పూర్ణిమ తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈ ఉత్పన్న ఏకాదశి శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన తిథి. ఉపవాసాలు ఆచరించవలసిన ముఖ్యమైన ఏకాదశి ఈ ఉత్పన్న ఏకాదశి. శ్రీమహావిష్ణువు శక్తి స్వరూపాలను తెలిపే ఏకాదశులలో ఇది చాలా ప్రత్యేకమైనదిగా చెబుతారు. ఉత్పన్న ఏకాదశిని కార్తీక మాసంలో విశిష్టమైన ఏకాదశిగా పేర్కొంటారు.

ముర అనే రాక్షసుడిని శ్రీమహావిష్ణువు సంహరించే సందర్భంలో ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి రాక్షసుడైన మురను సంహరించింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరుపెట్టాడు. సప్తమాతృకలలో ఒక స్వరూపమైన వైష్ణవీదేవి కూడా విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి స్వరూపాలలో ఒక స్వరూపమే. అందువల్ల ఉత్పన్న ఏకాదశిని ఏకాదశి తిథి జయంతిగా భావిస్తారు.

ఈరోజు ఉపవాసం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని పురాణ వచనం. ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారి పాపాలు పరిహారమవుతాయి. ముర అంటే తామసిక, రాజసిక, అరిషడ్వర్గాలకు ప్రతీక. ఈ రోజు ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును పూజించిన వారు తమలోని మురను జయించి మిగతా 23 ఏకాదశులలో ఉపవాసం చేసిన ఫలితం కలిగి వైకుంఠప్రాప్తి పొందగలరు.

🌹🌹🌹🌹🌹

🌹 26 NOVEMBER 2024 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు🌹

🍀🌹 26 NOVEMBER 2024 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు🌹🍀
1) 🌹 ఏకాదశి తిథి జయంతి - ఉత్పన్న ఏకాదశి శుభాకాంక్షలు అందరికి 🌹
2) 🌹 కపిల గీత 1వ భాగం - కపిల దేవహూతి సంవాదం - ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యత - 3 లఘు వీడియోలు 🌹
3) 🌹कपिल गीता भाग 1 - कपिल और देवहुति संवाद - आध्यात्मिक ज्ञान का महत्व - 3 लघु वीडियो 🌹
4) 🌹. కార్తీక పురాణం - 25 🌹 
🌻 25వ అధ్యాయము - దూర్వాసుడు అంబరీషుని శపించుట 🌻
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 577 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 577 - 3 🌹 
🌻 577. 'మాతృకా వర్ణరూపిణీ' - 3 / 577. 'Mātr‌kā Varṇarūpiṇī' - 3 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 ఏకాదశి తిథి జయంతి - ఉత్పన్న ఏకాదశి శుభాకాంక్షలు అందరికి 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*కార్తీక పూర్ణిమ తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈ ఉత్పన్న ఏకాదశి శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన తిథి. ఉపవాసాలు ఆచరించవలసిన ముఖ్యమైన ఏకాదశి ఈ ఉత్పన్న ఏకాదశి. శ్రీమహావిష్ణువు శక్తి స్వరూపాలను తెలిపే ఏకాదశులలో ఇది చాలా ప్రత్యేకమైనదిగా చెబుతారు. ఉత్పన్న ఏకాదశిని కార్తీక మాసంలో విశిష్టమైన ఏకాదశిగా పేర్కొంటారు.*

*ముర అనే రాక్షసుడిని శ్రీమహావిష్ణువు సంహరించే సందర్భంలో ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి రాక్షసుడైన మురను సంహరించింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరుపెట్టాడు. సప్తమాతృకలలో ఒక స్వరూపమైన వైష్ణవీదేవి కూడా విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి స్వరూపాలలో ఒక స్వరూపమే. అందువల్ల ఉత్పన్న ఏకాదశిని ఏకాదశి తిథి జయంతిగా భావిస్తారు.*

*ఈరోజు ఉపవాసం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని పురాణ వచనం. ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారి పాపాలు పరిహారమవుతాయి. ముర అంటే తామసిక, రాజసిక, అరిషడ్వర్గాలకు ప్రతీక. ఈ రోజు ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును పూజించిన వారు తమలోని మురను జయించి మిగతా 23 ఏకాదశులలో ఉపవాసం చేసిన ఫలితం కలిగి వైకుంఠప్రాప్తి పొందగలరు.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 కపిల గీత 1వ భాగం - కపిల దేవహూతి సంవాదం - ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యత - 3 లఘు వీడియోలు 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*🌹 కపిల గీత 1వ భాగం - కపిల దేవహూతి సంవాదం - 1. ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యత 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*🌹 కపిల గీత 1వ భాగం - కపిల దేవహూతి సంవాదం - 2. త్రిగుణాల ప్రాముఖ్యత 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*🌹 కపిల గీత 1వ భాగం - కపిల దేవహూతి సంవాదం - 3. గురు శిష్యపరంపరలో జ్ఞాన ప్రసారం 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*సబ్‌స్క్రైబ్‌ చైతన్య విజ్ఞానం చానల్‌. లైక్ చేయండి, షేర్‌ చేయండి. - ప్రసాద్‌ భరధ్వాజ.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹कपिल गीता भाग 1 - कपिल और देवहुति संवाद - आध्यात्मिक ज्ञान का महत्व - 3 लघु वीडियो 🌹*
*प्रसाद भारद्वाज*

*🌹 कपिल गीता भाग 1 - कपिल और देवहुति संवाद - 1. आध्यात्मिक ज्ञान का महत्व 🌹*
*प्रसाद भारद्वाज*

*🌹 कपिल गीता भाग 1 - कपिल और देवहुति संवाद - 2. तीन गुणों का महत्व 🌹*
*प्रसाद भारद्वाज*

*🌹 कपिल गीता भाग 1 - कपिल और देवहुति संवाद - 3. गुरु-शिष्य परंपरा में ज्ञान का प्रसार 🌹*
*प्रसाद भारद्वाज*

*चैतन्य विज्ञानम चैनल को सब्सक्राइब करें। लाइक करें, शेयर करें । - प्रसाद भारद्वाज.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కార్తీక పురాణం - 25 🌹*
*🌻 25వ అధ్యాయము - దూర్వాసుడు అంబరీషుని శపించుట 🌻*
*ప్రసాద్ భరద్వాజ*

"అంబరీషా! పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకీ యనర్ధము వచ్చినది. నీ బుద్దిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించుము" అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు "ఓ పండితోత్తములారా! నానిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశీనిష్టను విడచుట కన్న, విప్రశాపము అధికమయినది కాదు. జలపానము చేయుట వలన బ్రాహణుని అవమానపరచుటగాదు. ద్వాదశిని విడచుటయుగాదు. అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందించును? నిందింపడు. నా తొల్లి పుణ్యఫలము నశింపదు. గాన, జలపాన మొనరించి వూరకుందును" అని వారి యెదుటనే జలపానము నొనరించెను.

అంబరీషుడు జలపాన మొనరించిన మరుక్షణముచే దూర్వాసుడు స్నానజపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై క౦డ్ల వెంట నిప్పులు గ్రక్కుచూ "ఓరీ మదాంధా! నన్ను భోజనానికి రమ్మని, నేను రాకనే నీవేల భుజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము? ఎంతటి ధర్మ పరిత్యాగివి? అతిధికి అన్నము పెట్టెదనని ఆశజూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్ష కుడగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి. అది భోజనముతో సమానమైనదే. నీవు అతిధిని విడిచి భుజించినావు కాన, నీవు నమ్మకద్రోహివగుదువేగాని హరిభక్తుడవెట్లు కాగలవు? శ్రీ హరి బ్రాహణావమానమును సహింపడు. మమ్మే యవమానించుట యనిన శ్రీహరిని అవమానించుటయే. నీవంటి హరినిందాపరుడు మరి యొకడులేడు. నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడవై వున్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వనించి అవమానపరచి నిర్లక్ష్యముగా జలపాన మొనరించితివి. అంబరీషా! నీవెట్లు పవిత్ర రాజకుటుంబములో బుట్టినావురా! నీ వంశము కళంకము కాలేదా?" అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అ౦బరీషుడు, ముని కోపమునకు గడ గడ వణుకుచు, ముకుళిత హస్తములతో "మహానుభావా! నేను ధర్మహీనుడను, నా యజ్ఞానముచే నేనీ కార్యము చేసితిని. నన్ను రక్షింపుడు. బ్రాహణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులూ, దయా దాక్షిణ్యములు గలవారూ కాన, నన్ను కాపాడు" డని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన యెడమకాలితో తన్ని "దోషికీ శాపమీయకుండా వుండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగానూ, మూడవజన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, యైదవజన్మలో వామనుడు గాను, ఆరోవ జన్మలో క్రూరుడవగు బ్రాహణుడవుగాను, యేడవ జన్మలో మూఢుడవైన రాజుగాను, యెనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసనముగానిలేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషండ మతస్తునిగాను, పదవ జన్మలో పాప బుద్ధిగల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టెదవుగాక" అని వెనుక ముందు లాలోచించక శపించెను. ఇంకను కోపము తగ్గనందున మరల శపించుటకు ఉద్యుక్తడగుచుండగా, శ్రీ మహావిష్ణువు బ్రాహణ శాపము వృధాకాకూడదని, తన భక్తునికి ఏ అపాయము కలుగకుండుటకు - అంబరీషుని హృదయములో ప్రవేశించి "మునివర్యా! అటులనే - మీ శాపమనుభవింతు" నని ప్రాధేయపడెను. కాని దూర్వసుడింకనూ కోపము పెంచుకొని శపించబోగా, శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచూ దూర్వసునిపై పడబోయెను. అంత దూర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచటి నుండి "బ్రతుకుజీవుడా" యని పరుగిడెను. మహాతేజస్సుతో చక్రాయుధము దూర్వసుని తరుముచుండెను. దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను, దేవలోకమున కరిగి దేవేంద్రుని, బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని, కైలాసమునకు వెళ్లి పరమేశ్వరునీ యెంత ప్రార్దంచినను వారు సైతము చక్రాయుధము బారినుండి దూర్వాసుని కాపాడలేకపోయిరి.

ఇట్లు స్కాంద పురాణంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి పంచవింశోధ్యాయము - ఇరవయ్యయిదో రోజు పారాయణము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 577 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam  - 577 - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 116. పరాశక్తిః, పరానిష్ఠా, ప్రజ్ఞాన ఘనరూపిణీ ।*
*మాధ్వీపానాలసా, మత్తా, మాతృకా వర్ణ రూపిణీ ॥ 116 ॥ 🍀*

*🌻 577. 'మాతృకా వర్ణరూపిణీ' - 3 🌻*

*(త్రిపాదస్య అమృతందివి) రూపమునకు మరణ మున్నది. శబ్దము, అర్థము, రంగు మరణించవు. ఇట్లు సృష్టి అంతయూ అక్షర స్వరూపమే. మాతృకావర్ణ రూపమే అని తెలియవలెను. సప్త మాతృకలు అనగా సప్త లోకముల నేర్పరచు శబ్దము. వానిని బీజాక్షరములు అని కూడ పిలుతురు. సహ్రసారము నుండి మూలాధారము వరకు యం, హం, సం, కం, లం, రం, డం శబ్దములు కలవు. ఈ శబ్దము లత్యంత కాంతివంతములు. వజ్రకాంతి నుండి భూకాంతి (మట్టిరంగు) వరకు వివిధమగు కాంతులలో సప్తలోకములు ప్రకాశించు చుండును. శబ్దాచ్చారణమును నుండి రంగులు పుట్టును. అవి కాంతి వంతములు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 577 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 116. Parashaktih paranishta pragynana ghanarupini*
*madhvipanalasa matta matrukavarna rupini  ॥116 ॥ 🌻*

*🌻 577. 'Mātr‌kā Varṇarūpiṇī' - 3 🌻*

*Tripādasya Amṛtaṁ Divi - The form is subject to mortality, but sound, meaning, and color are immortal. Thus, the entire creation is essentially of the nature of letters (akṣara-svarūpa). It must be understood that this is the form of Mātr‌kā Varṇa. The term "Sapta Mātr‌kās" refers to the sounds that represent the seven worlds. These are also called Bīja Akṣaras (seed syllables). From Sahasrāra (the crown chakra) to Mūlādhāra (the root chakra), there are the sounds Yaṁ, Haṁ, Saṁ, Kaṁ, Laṁ, Raṁ, Daṁ. These sounds are immensely radiant, shining with diverse forms of light—from the brilliance of diamonds to the earthen hues of the soil. The seven worlds are illuminated through these varied radiances. Colors emerge from the utterance of these sounds, and they possess extraordinary luminosity.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube channel Facebook WhatsApp Channel 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. Chaitanya Vijnaanam YouTube FB Telegram groups 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
Like, Subscribe and Share 👀
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj

కార్తీక పురాణం - 24 - అంబరీషుని ద్వాదశీవ్రతము (Kartika Purana - 24 - Ambarish's Twelve-Year Vow)

🌹. కార్తీక పురాణం - 24 🌹

🌻 24 వ అధ్యాయము - అంబరీషుని ద్వాదశీవ్రతము 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

అత్రి మహాముని మరల అగస్త్యునితో "ఓ కుంభసంభవా! కార్తీకవ్రత ప్రభావము నెంతివిచారించిననూ, యెంత వినిననూ తనివి తీరదు. నాకు తెలిసినంతవరకు వివరింతును. అలకింపుము.

"గంగా, గోదావరీ మొదలగు నదులలో స్నానము చేసినందు వలనను, సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానాదులోనరించినను యెంత ఫలము కలుగునో శ్రీమన్నారయణుని నిజతత్వమును తెలిపెడి కార్తీకవ్రతమందు శుద్ధద్వాదశినాడు భక్తిశ్రద్దలతో దానధర్మములు చేయువారికిని అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశినాడు చేసిన సత్కార్యఫలము యితర దినములలో చేసిన ఫలము కంటె వేయి రెట్లు అధికము కాగలదు. ఆ ద్వాదశీ వ్రతముచేయు విధానమెట్లో చెప్పెదను వినుము.

కార్తీక శుద్ధదశమి రోజున, పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా యేకాదశి రోజున వ్రతమూ చేయక శుష్కోపవాసముండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాతనే భుజింపవలయును. దీనికొక యితిహాసము కాలదు. దానిని కూడ వివరించెదను. సావధానుడవై అలకింపుము"మని యిట్లు చెప్పుచున్నాడు.

పూర్వము అంబరీషుడను రాజు కలడు. అతడు పరమభాగవతోత్తముడు. ద్వాదశీవ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండ వ్రతము చేయుచుండెడివాడు. ఒక ద్వాదశినాడు, ద్వాదశి ఘడియలు స్వల్పముగా నుండెను. అందుచే ఆ రోజు పెందలకడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచి సిద్దముగా నుండెను. అదే సమయమున కచ్చటకు కోపస్వభావుడగు దుర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి, ద్వాదశి ఘడియలలో పారాయణ చేయవలయునుగాన, తొందరగా స్నానమునకేగి రమ్మనమని కోరెను. దుర్వాసుడ౦దుల కంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వెడలెను. అంబరీషుడు యెంత సేపు వేచియున్ననూ దుర్వాసుడు రాలేదు. ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లనుకొనెను. "ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానముకు వెళ్లి యెంతవరకు రాలేదు. బ్రాహ్మణునకాతిధ్యమిత్తునని మాటయిచ్చి భోజనం పెట్టక పోవుట మహాపాపము. అది గృహస్తునకు ధర్మము గాదు. అయన వచ్చువరకు ఆగితినా ద్వాదశీఘడియలు దాటిపొవును. వ్రతభంగమగును. ఈ ముని మహా కోపస్వభావము గలవాడు. ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును. నాకేమియు తోచకున్నది. బ్రాహ్మణ భోజన మతిక్రమించ రాదు. ద్వాదశి ఘడియలు మించి పోకూడదు. ఘడియలు దాటిపోయిన పిదప భుజించినయెడల, హరిభక్తిని వదలిన వాడనగుదను. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్పలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు, భోజనము చేసిన దూర్వాసునకు కోపము వచ్చును. అదియునుగాక, యీ నియమమును నేను అతిక్రమించిన యెడల వెనుకటి జన్మయందు జేసిన పుణ్యములు నశించును. దానికి ప్రాయశ్చితము లేదు." అని అలోచించి "బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయమును శ్రీమహావిష్ణువే బోగట్టగలదు. కావున నేను ద్వాదశి ఘడియలలో భోజనము చేయుటయే వుత్తమము. అయిననూ పెద్దలతో ఆలోచించుట మంచి"దని, సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో యిట్లు చెప్పెను.

"ఓ పండిత శ్రేష్టులారా! నిన్నటి దినమున యేకాదశి యగుటం జేసి నేను కటిక వుపవాసము వుంటిని. ఈ దినమున స్వల్పముగా మత్రమే ద్వాదశి ఘడియలున్నవి. ద్వాదశి ఘడియలలోనే భుజించవలసియున్నది. ఇంతలో నా యింటికి దూర్వాస మహాముని విచ్చేసిరి. అ మహామునిని నేను భోజనమునకు ఆహ్వాని౦చితిని. అందులకాయన అంగీకరించి నదికి స్నానర్ధమై వెళ్లి యింతవరకూ రాకుండెను. ఇప్పుడు ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి ఘడియలలో భుజింపవచ్చునా? లేక, వ్రతభంగమును సమ్మతించి ముని వెచ్చేవరకు వేచియుండవలెనా? ఈ రెండిటిలో యేది ముఖ్యమైనదో తెలుపవలసిన"దని కోరెను. అంతట యా ధర్మజ్ఞులైన పండితులు, ధర్మ శాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసికొని, దీర్ఘముగా అలోచించి "మహా రాజా! సమస్త ప్రాణి కోటుల గర్భకుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనముగావించి దేహేంద్రియాలకు శక్తినొసంగుచున్నాడు. ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షుద్భాధ దప్పిక కలుగును. అ తపము చల్లార్చవలెనన్న అన్నము, నీరు పుచ్చుకొని శాంతపరచవలెను. శరీరమునకు శక్తి కలుగ చేయువాడు అగ్నిదేవుడు, దేవతలందరి కంటే అధికుడై దేవపూజ్యుడైనాడు. ఆ యగ్నిదేవునందరు సదాపూజింపవలెను. గృహస్తు, యింటికి వచ్చిన అతిధి కడజాతివాడైనాను 'భోజన మిడుదు' నని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదవేదాంగ విద్యావిశారదుడును, మహతపశ్శాలియు, సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును. అందువలన అయుక్షిణము కలుగును. దుర్వాసునంతటి వానిని అవమానమొనరించిన పాపము సంప్రాప్తమగను" అని విశదపరచిరి.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్యమందలి చతుర్వింశోధ్యాయము - ఇరవై నాలుగో రోజు పారాయణము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹