
సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్ డాక్ట్రిన్) - 38
సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్ డాక్ట్రిన్) - 37

37 వ భాగము
✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🍃 శరీరావస్థలు 2 🍃
260. తురీయ స్థితి పొందాలంటే నిరంతర శాస్త్ర పఠనము సజ్జన సాంగత్యము గురుశుశ్రూష, నిరంతర అభ్యాసము అవసరము.
261. తురీయ స్థితిలో సంకల్పములు ఉద్భవించవు. జఢత్వముండదు. వికల్పముండదు. మిగిలిన జాగ్రత్, స్వప్న, సుషుప్తులు, చిత్తము యొక్క రూపములు. అసత్యములు. తురీయము వాస్తవ రూపము. ఈ మూడవస్థలకు సాక్షిమాత్రుడే తురీయుడు.
262. నాలుగు అవస్థలు ప్రతి అవస్థలోనూ ఉండును. అలానే తురీయములోనూ నాలుగు అవస్థలు ఉండును. అని మొత్తము షోడశావస్థలు (16).
263. మనస్సు మృతి చెందిన స్థితియె సమాధి స్థితి. ఈ స్థితియె యోగి యొక్క పరమావధి. సమాధి స్థితి నిద్రావస్థ కాదు, మగత కాదు, స్వప్నము కాదు, అజ్ఞానము కాదు. పూర్ణ ప్రజ్ఞయె సమాధి. ఇది ఊరక కూర్చుండుటయె. ఆత్మ తత్త్వ బోధయె సమాధి.
264. సమాధి స్థితికి చేరడానికి చేయు నిరంతర సాధనయె యోగము. యోగమనగా సమాధి. సమాధి అనగా సమత్వ స్థితి. బ్రహ్మ కపాలము, భ్రూమధ్యము నందు, హృదయ కవాటము నందు బాహ్య ప్రపంచమును మరచి అంతరంగమున సంచరించుటను సమాధి అందురు. గాలి లేని చోట ఉన్న దీపమువలె నున్న నిశ్చలస్థితియె సమాధి స్థితి.
265. సమాధికి సంయమమని పేరు. భోగేచ్ఛ లేకపోవుట, ఔదార్యము, సౌందర్యము, వైరాగ్యములలో కూడా పరమానంద స్థితిలో నుండుటయె సమాధి స్థితి.
266. ఎవరు నిత్యము ఆత్మ విచార తత్పరులై ఉండునో, బాహ్య దృష్టి శూన్యుడై, అంతర్ముఖుడై ఉండునో , వారికి అదే సమాధి స్థితి.
267. యోగ సిద్ధులు సమాధి స్థితికి ప్రతిబంధకాలు వాటిని కోరరాదు. అరిషడ్వర్గాలు అంతరించి పోవాలి. ఆత్మ, మనస్సు కలిసిపోగా, మనోలయమగును. ఆత్మ అద్వయమై యుండును. .
268. సమాధి అనగా నిష్ఠ. ఈ స్థితిలో ధ్యానము, మంత్రము, జపము, పూజలు అనేవి ఆగి పోవును. దీనికే ఆత్మ నిష్ఠ, జ్ఞాన నిష్ఠ, యోగ నిష్ఠ, బ్రహ్మ నిష్ఠ అని పేర్లు. చిత్త స్వాధీనము, మనోక్షయమే సమాధి.
269. సమాధి స్థితిలో అనేక రకములు: 1) సవికల్ప సమాధి: ఇది ఎరుతో కూడి ఉండును. 2) నిర్వికల్ప సమాధి స్థితి: సాధకుడు శాంత స్థితిలో ఉండును. సత్వ, రజో, తమో గుణములు నశించి ఉండును. 3) నిర్బీజ సమాధి స్థితి: ఈ స్థితిలో కర్మ బీజాలు నశిస్తాయి. సంస్కారములు నశిస్తాయి. మిగిలిన అనేక సమాధి స్థితులు సవితర్న, శబ్దానువిద్ధ, దృశ్యానువిద్ధ మొదలగునవన్నీ సవికల్పమే.
270. సమాధి వలన ప్రయోజనములు:- 1) సంస్కారములు నశించును. 2) అతీంద్రియ జ్ఞాన మేర్పడును. 3) జ్ఞాన నేత్రము తెరుచుకొనును. వివిధ లోకాల దర్శనమవుతుంది. 4) కుండలిని యొక్క ఊర్ధ్వ అధో ప్రయాణాలను గమనించవచ్చు. 5) వ్యక్తి జీవన్ముక్తుడగును. 6) ఇదే బ్రహ్మానంద స్థితి. 7) మోహము నశించును. 8) దేహమందలి సూక్ష్మ శరీరములు తెలియబడును. 9) సోమరితనము, భోగ లాలసత్వము, తమో గుణము తొలగును. ప్రజ్ఞ కేవలమగును.
🌹 🌹 🌹 🌹 🌹
సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్ డాక్ట్రిన్) - 36

🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్ డాక్ట్రిన్) - 36 🌹
36 వ భాగము
✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🍃 శరీరావస్థలు 1 🍃
254. యోగులు సాధనలో చేరవల్సిన చివరి స్థితి ''తురీయ'' స్థితి. అది సాధించుటకు ముందు క్రమముగా 1) జాగ్రదావస్థ 2) స్వప్నావస్థ 3) సుషుప్తావస్థ నాల్గవది తురీయావస్థ. తురీయావస్థకు చేరిన తర్వాత అతని స్థితి 'సమాధి' స్థితి. ఇది అపుడు సహజముగా ఏర్పడి యుండును.
255. జాగ్రదావస్థలో; దర్శనము, స్పర్శ, కర్తృత్వముతో సకల వ్యవహారములు చేయుచుండును. ఇందులో నేత్రములు ప్రధానమైనవి. ఈ స్థితిలో మనస్సు అనేక విషయములందు ఆసక్తి, అభిమానము, ప్రీతి, కలిగి విహరించును. ఇంద్రియముల ద్వారా బాహ్యసంస్కారములను అనుభవించుట జాగ్రత్ స్థితి. ఈ స్థితిలో, అంతిమ సమాధి స్థితికి కావల్సిన సమస్త విషయములు గ్రహించి ఎల్లప్పుడు ఎరుకలో వుండును. పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయముల ద్వారా ఎరిగుచున్న ఎరుకయె జాగ్రత్స్థితి.
256. స్వప్నావస్థ: ఈ అవస్థలో సాధకుడు మనోరూపుడు, భావరూపుడై ఉండును. అతనిని ''తైజసుడు'' అని అందురు. ఈ స్థితిలో జాగ్రత్ వస్తు సముదాయమంతా మనోభావరూపములో దర్శించును. తెలిసీ తెలియని స్థితి, జ్ఞాపకము ఉండి లేని స్థితి ఉండును. శ్వాస ప్రాణవాయువుతో కలిసినప్పుడు స్వప్నజాగ్రత్ స్థితి ఏర్పడును.
257. సుషుప్తావస్థ: చిత్తము దృశ్యరహితమైనపుడు, క్షీణ చిత్తము కలవారికి జాగ్రత్తునందే సుషిప్తి అగును. వాస్తవముగా విషయములు జ్ఞాపకము లేకుండా మరపు స్థితిలో వుండును. జడ స్థితిలో ఉండును. సుషుప్తిలో ఇది ఏమీ తెలియని స్థితి. జగత్ వస్తు వృత్తుల యొక్క నివృత్తి, తురీయదృశ్యమే జాగ్రత్తలో సుషుప్తి స్థితి. సుషుప్తిలో జాగ్రత్ స్థితిని పొందినవాడు జీవన్ముక్తుడు. సాధకుడు జాగ్రత్లో కూడా సుషుప్తిలో ఉండును. స్వప్నములేని నిద్రావస్థ సుషిప్తి ఈ స్థితిలో సర్వవృత్తులు అణగి ఉండును.
258. తురీయావస్థ: అవస్థలన్నింటిలో తురీయావస్థ ఉన్నతమైనది. సమాధి స్థితి పొందిన సాధకుడు ఆనందమయ జ్యోతి స్వరూపుడగుచున్నాడు. అదియె తురీయము. అభ్యాస యోగము స్థిరపడినచో ఏర్పడిన నిస్సంకల్ప స్థితియె తురీయము. మేల్కొని ఉన్నను, సుషిప్తిలో ఉన్నను తురీయ స్థితిని అనుభవించవలెను. ఆ స్థితిని పొందుటకు అహంకారం విడువ వలెను. సమత్వము పొంది దృఢ చిత్తము కల్గి ఉండవలెను. తురీయ స్థితి నిలకడ పొందినపుడు ఒకప్పుడు జాగ్రత్తు స్వప్నం వలె కనబడును. అందులో భిన్నత్వములోనూ అద్వైత భావనలు నిలకడ పొందవలెను. జాగ్రత్తు సుషుప్తివలె ఉన్నవాడు విదేహ ముక్తుడు.
259. తురీయ స్థితి సదా స్వీయ జ్ఞానము చింతించుట వలన ఏర్పడును. బ్రహ్మనిష్ఠయందు చలించకుండుట, స్వప్నంలోనే స్వప్న విషయము స్వీయ జ్ఞాపకము ఉండుట, గాఢ నిద్రలో నిద్రించుటను తెలియుటయే గాక తురీయ స్థితిలో ఆత్మ జ్ఞానము కలిగి ఉండవలెను. అదియె తురీయ స్థితి. ఈ స్థితిలో ద్వంద్వ రహితుడై సదా బ్రహ్మమునే ధ్యానించుచూ తరువాత విదేహ ముక్తి పొంది పరమాత్మలో లీనమగును.
🌹 🌹 🌹 🌹 🌹
సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్ డాక్ట్రిన్) - 35

35 వ భాగము
✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🍃 వసనలు 2 🍃
245. (మనిషి) జీవుడు జనన మరణములందు శరీరములు మారి పోయినప్పటికి, తన యొక్క వాసనలు మాత్రము అలానే ఉంటాయి. దానిని కారణ శరీరము అంటారు. వాటిని ఈ జన్మలోనే సత్కర్మల ద్వారా క్షయింప చేసుకోవాలి.
246. వాసనలు సత్కర్మల ద్వారా పూర్తిగా క్షయించినప్పుడు అతనికి పునఃజన్మ ఉండదు.
247. మానవులకు భార్య, పుత్ర, ధన, ధాన్యాదులందు, విషయములందు, ప్రాపంచిక వస్తువులందు ఆశ ఉన్నచో అవే మరు జన్మకు బీజములుగా ఉండి జనన మరణములకు కారణమగుచున్నవి.
248. మాయా ప్రభావము వలన జీవుడు అజ్ఞానముచే మాయను తెలుసుకోలేక మరణ కాలములో కూడా ఆ వాసనలు మరువకుండుటచే అవి అతని పునర్జన్మలకు కారణమగుచున్నవి.
249. ఎవరు వాసనలు అను త్రాళ్ళచే బంధింపబడి ఉన్నారో, వారందరు ఆశాపాశమున తగుల్కొని వాటికి వశులై ఉన్నారో అట్టి వారు తాళ్ళచే బంధింపబడిన పశువులవలె లోకములోనికి ఈడ్వబడతారు. వాసనారాహిత్యమే అమనస్కము.
250. వాసనలు లేని సాధకుని లక్షణములు: ఆశరాహిత్యము, నిర్భయము, సమత్వము, జ్ఞానము, నిష్కామత్వము, నైష్కర్మ్యము, సౌమ్యత, నిర్వికల్పము, ధీరత్వము, మైత్రి, సంతోషము, మృదుత్వము, మృదుభాషణము మొదలగున్నవి.
251. వాసనల ఫలితము: మహాదుఃఖము, రాగద్వేషములు, సంసార బంధనములు, దృశ్యపదార్థముల సంగమము, మోహము మొదలగునవి.
252. వాసనా రాహిత్య ఫలితములు: వాసనా రాహిత్యము శ్రేష్ఠమైన యోగ లక్షణము. శాంత స్థితి. మోక్షపదమును పొందును. మనస్సు సంకల్ప రహితమగును. అమనస్క స్థితిలో మనస్సు ఆత్మయందు లయమగును. అతడు కర్మలు చేసినను, చేయకున్నను సచ్చిదానంద స్థితిలో ఉండును. ముక్తుడగును.
253. వాసనా క్షయమునకు యోగ సాధన: ఎట్టి వారికైనను వాసనలు జయించుట చాలా కష్టము. అయినను వాసననలు జయించిన యోగులు కలరు. అందుకు మార్గము చిరకాలము యోగసాధన. లేనిచో సంసార వాసనలు, పూర్వ వాసనలు నశించవు. మిగిలిన సంస్కారములు మరుజన్మకు కారణమగును. వాసనలు ఆత్మతో ఏకము చేసిన, మనో నాశము, వాసన క్షయము కల్గి ఫలితములు లభించును. వాసనా బీజము నశించునంతవరకు అభ్యాసం చేయవలెను. బియ్యపు గింజపై పొట్టు, రాగి పాత్రపై చిలుమును ప్రయత్నపూర్వకముగా తొలగించునట్లు, హృదయ మందలి అజ్ఞానవాసనను తొలగించవలెను. అందుకు ప్రాప్తించిన, ప్రాప్తించని భోగములను త్యజించవలెను. చీడ పురుగులవలె నున్న వాసనలను వృద్ధికానివ్వక, నిరంతర అభ్యాసంతో వాసనలను నశింపచేయవలెను. వేరు మార్గము లేదు.
నిజానికి వాసనా క్షయమనగా ద్వైత భావన నశించుట, అద్వైత భావన నిలుచుట, సంసారము స్వప్న తుల్యమగుట. ఇట్టి లయ యోగమే ప్రధానము.
🌹 🌹 🌹 🌹 🌹
సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్ డాక్ట్రిన్) - 34

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🍃 వసనలు 1 🍃
236. వాసనలు మాయాజాలము పిశాచములవలె జన్మ జన్మలుగా వెంబడించి మనిషిని మింగి వేయచున్నవి. ప్రతి సాధకుడు తీవ్రముగా విచారణ అభ్యాసము ద్వారా వాటి స్వభావములను తెలుసుకొని ఎవరికి వారు తమ జన్మలను, సంస్కారములను ఉద్ధరించుకొనవలెను. ఇదే సృష్టి రహస్యము, జన్మ రహస్యము, మాయాతత్వము.
237. వ్యక్తి ఎంత పండితుడైనను, గొప్ప జాతి వారైనను, వాసనల వలననె బంధింపబడి పునఃజన్మలకు ఈడ్వబడుచున్నాడు. జననమరణ హేతువైన సంస్కారముల నుండి విడుదలయినవాడే ధీరుడనబడును.
238. పంచేంద్రియములు, మనస్సు ద్వారా విషయ భోగములపై వ్యామోహము కల్గిన మనిషికి దుఃఖము కలుగుచున్నది.
239. వాసనలకు పుట్టుక, ఆది లేదు. అనాదిగా ఇది మానవుని వెంబడిస్తూ ఉన్నాయి. ఇవి వాటంతట అవె నశించవు. అది నశించాలంటే యోగ సాధన, యోగ విజ్ఞానము, సత్గ్రంధ పఠనము, దృఢ చిత్తముతో వాటి రహస్యమును తెలుసుకొని అంతము చేయాలి.
240. ఈ భౌతిక శరీరము వాసనలచే నిండియున్నది. మానవ దేహముచే, ఇంద్రియములచే, సూక్ష్మ శరీరములు చేయు కర్మల ఫలితములే వాసనలు. పూర్వవాసనలు ప్రారబ్ధాను భవమునిచ్చునప్పుడు సంస్కారములని పిలువబడును. జన్మ జన్మలుగా వెంబడించు కోరికలు, అలవాట్లు, అభ్యాసములతో కూడిన సంస్కారములు ఒకదానితో ఒకటి పెనవేసుకొనిపోయి బలపడి వాసనా రూపములుగా ఉంటున్నవి.
241. వాసనలు మూడు రకములు: 1) కర్మ వాసనలు 2) స్మృతి మాత్ర వాసనలు 3) కర్మలను అనుభవించుట వలన కలుగునవి (ఆగామి).
242. అనేక జన్మలందు అభ్యాసము చేతను, సంసార బంధముల చేతను, భోగముల చేతను, కోరికలు మొదలగు లౌకిక కార్యములే వాసనలగుచున్నవి.
243. విషయ వాసనలనే విషము, అవిద్యా, అజ్ఞానము వలన ప్రోగై దృఢపడి వాటితో నిండిన ఈ శరీరమే శాశ్వతమని భావన కలుగుటచే, అజ్ఞానములో కర్మలకు, బద్ధులగుచున్నారు.
244. వాసనలు అనేక రకములు.
1.లోకవాసన: అనగా లోకముచే గుర్తింపబడవలెనని కోరిక.
2.శాస్త్రవాసన: తాను గొప్ప శాస్త్రవేత్తననే భావన.
3. దేహవాసన: దేహమునందు ప్రీతి.
4.శుద్ధవాసన: సాధన ద్వారా తనలోని దుర్గుణములను వదలివేయుట.
5.అశుద్ధవాసన: కామ క్రోధాదుల ద్వారా, వస్తు భోగముల ద్వారా ఏర్పడునది.
6. శుభవాసన: సాధన ద్వారా శుద్ధుడై శాశ్వతమైన మోక్షమునకు అర్హుడగుట.
7. సంచితవాసన: గత జన్మల వాసనలే సంచిత వాసనలు.
8. ప్రారబ్ధవాసన: తన యొక్క తన పూర్వికుల ద్వారా ఏర్పడిన వాసన ఈ జన్మలో వెంటవచ్చును.
9. ఆగామివాసన: కొత్తగా చేసినది రాబోవు జన్మలకు ప్రోగుపడినది.
10. ఇహలోక వాసనలు: ఈ లోకములోని ప్రసిద్ధ దృశ్యముల భావనలు.
11. పరలోక వాసనలు: సత్కర్మల ద్వారా పుణ్యలోక(స్వర్గ), దుష్కర్మల ద్వారా పాపలోక (నరక) అనుభవముల వాసనలు.
🌹 🌹 🌹 🌹 🌹
సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్ డాక్ట్రిన్) - 33

🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్ డాక్ట్రిన్) - 33 🌹
33 వ భాగము
✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🍃 అహంకారము 2 🍃
229. నరకాసురుడు, భస్మాసురుడు, దుర్యోధనుడు, కార్తవీర్యార్జునుడు, శిశుపాలుడు, పరశురాముడు, హిరణ్యాక్షుడు, రావణాసురుడు, మహిషాసురుడు ఇలా అనేక మంది అహంకారమువలననె అణచివేయబడిరి, నశించిరి.
230. అహంకార లక్షణాలు:ధన మదము, విద్యా మదము, జాతి, భోగ, శీల, రూప, బల, జ్ఞాన, కీర్తి, రాజ మదములు, ఇవన్నీ అహంకార లక్షణములె.
231. అహంకారము మూడు రకములు:
1.ఉత్తమ అహంకారము: ఇందు వ్యక్తి తానే పరమాత్మనని తనకంటే అన్యమెదీ లేదని భావించును.
2. అతిసూక్ష్మమైన వాడను తాను అని తాను అవయవ రహితుడనని భావించుట శుభ ప్రధ అహంకారము.
3. మూడవదైన లౌకిక అహంకారములో దేహమె నేనని తలచును. ఇది బంధానికి సంసార వృక్షానికి మూలమైనది. దీనిని విసర్జించవలెను. ఇది దుఃఖ హేతువు.
232. అహంకారము వలన బాధలు పెరుగును. అశాంతి, దుఃఖము, ఒంటరి తనము, వినాశనము, అనర్ధములు, పునర్జన్మలు, మాయ, అంధకారము, అనేక విపత్తులు, భయము, స్వార్థము, విషయాసక్తి, దుష్కర్మలు, నిర్దయ, శత్రుత్వము, వ్యామోహాలు పెంపొందును.
233. అహంకారమును జయించాలంటే అహంకారాన్నె ఆయుధంగా వాడాలి. ముల్లును ముల్లుతోనూ, వజ్రాన్ని వజ్రంతోనే ఛేదించినట్లు, అహంకారమును అహంకారముతోనే జయించాలి. మోక్షమునకు అహంకారము ప్రతిబంధకము. ఆత్మ స్వరూపమును స్మరించుట, విషయముల యెడల రాగ ద్వేషముల యెడల విముఖత, ఆధ్యాత్మిక గ్రంధ పఠనము, శ్రవణము, విచారణ, గురుబోధ, సాధు సంగమము వలన అహంకారము నశించును. సత్య, ఆత్మ జ్ఞానము వలన అహంకారము నశించును. అహంకారి యొక్క మాటలు, ప్రార్థనలు, క్రియలు భగవంతునికి చేరవు. ఆత్మార్పణయె అహంకార క్షయము.
234. ఫలితాన్ని ఆశించకుండా నిరంతర యోగ సాధన చేయుట వలన అహంకారము నశిస్తుంది. స్వార్థ రహిత, ఫలాపేక్ష రహిత, వాంచా రహిత కార్యములు నిర్వహించుట వలన అహంకారము తొలగి అపార శక్తి సామర్థ్యాలు పెంపొందుతాయి.
🌹 🌹 🌹 🌹 🌹
సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్ డాక్ట్రిన్) - 32

32 వ భాగము
✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🍃 అహంకారము 1 🍃
221. చిత్తము వలె అహంకారము కూడా అంతఃకరణ చతుష్టయములో ఒకటి. అహంకారము ఢాంభికము, మదము, గర్వముల ద్వారా వ్యక్తమవుతుంది. ఇవి శరీరానికి సంబంధించినవి. ఇది ఒక మాయాతత్వము. అరిషడ్వర్గాలు, దర్పం, డంబం మొదలగునవి అహంకార లక్షణములు.
222. అహంకార రూపములు: ధన మదము, విద్యా మదము, భోగ మదము, శీలము, రూపము, బలము, జ్ఞానము, కీర్తి మొదలగునవి కూడా అహంకార రూపములే. దేహ స్మృతి ఉన్నంత కాలము అహంకార స్మృతి ఉంటుంది. నేను నాది నావారు అనేది, నాకొరకు అనేవి అహంకార వ్యక్తీకరణములే.
223. బిరుదులు, డాంబికములు, పొగడ్తలు, అభినందనలపై ఆసక్తి కలవారు అహంకారము ఉన్నవారే. ఇట్టి డాంబిక, నామరూపాల ఆసక్తి కల్గి ఉండుట సాధనకు అడ్డంకులే. యోగి అయిన వాడు బాహ్యాలకు భ్రమపడరాదు.
224. మనస్సు యొక్క అంధకారమే అహంకారము. అహంకారము యొక్క బీజము అజ్ఞానమే. అవిద్యకు కారణము అహంకారము. అవిద్య తొలగించిన అహం అంతరించి పోతుంది. అహంకారము ఆత్మానుభవమునకు అడ్డుగా ఉన్నది. ''నేను'' పోతే ఉన్నది ఆత్మే.
225. అహంకారమునకు ఉనికి లేదు, స్పర్శకు అందనిది. అది పదార్థము కాదు. దాని స్వరూప లక్షణాలు తీవ్రముగా ఆలోచించి అన్వేషించవల్సి ఉంటుంది. ఇది అసుర రాజులను, సిద్ధులను, యోగులను, కూడా అధోగతిపాలు చేసినది. గాఢ నిద్రలో ఉన్నప్పుడు అహంకారము ఉండదు. స్వప్న జాగ్రత్తులలోనే అహంకారము ఉంటుంది. మరుపు, మరణము, మూర్ఛ, సుషుప్తి, సమాధులలో ''నేను'' తాత్కాలికముగా ఉండదు. ''నేను'' శాశ్వతముగా పోవాలి. తిరిగి రాకూడదు.
226. నేను, నాది, నా శరీరము, నా ఇల్లు, నా చెవులు, ప్రాణము, మనస్సు, బుద్ధి అని వేరువేరుగా భావించుచున్నారు. ఇవన్నీ ఆత్మకు వేరుగా ఉన్నవి.
227. నిజమైన భోగి ఫలాపేక్షరహితముగా సర్వం భగవంతునికి సమర్పించినప్పుడు సత్ఫలితములన్నీ తనవే. యోగ లక్షణం ''నేను'' అనేది పూర్తిగా తొలగిపోవాలి. సర్వం ''బ్రహ్మ'' అను భావం కలిగి ఉండాలి.
228. శరీరము ''నేనే'' అను భావము వలన కర్మలతో బంధం ఏర్పడి పునర్జన్మలందు ఆసక్తి కల్గి ఉండును. అహంకార రూపమే జీవుడు. శరీరాభిమానము ఒక విష రోగము. అహంకారం మాటల ద్వారా, పనుల ద్వారా, సంబంధాల ద్వారా వ్యక్తమవుతుంది. అహంకారము వలననె కర్మలు ఏర్పడతాయి. అహంకారము అసుర గుణము. పాప కర్మలకు దారితీయును. యోగ సాధనకు తగినది కాదు. కామ క్రోధాదులె అహంకార చిహ్నములు. కర్తృత్వము అహంకారమే. భోక్తృత్వము అహంకారమే.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 49 వాయువులు—మరుత్తులు 🌹
🌹 49 వాయువులు—మరుత్తులు 🌹
క్రియాయోగి శ్రీ కౌతా మార్కండేయ శాస్త్రి వ్రాసిన గీత అంతరార్థము అను గ్రంథము నుండి ఇవ్వబడినది.
వాయువులు—మరుత్తులు:
ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం.రవిరంశుమాన్
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహంశశీ
నేను ఆదిత్యులలోవిష్ణువును, ప్రకాశింపజేయువానిలో కిరణములు గల సూర్యుడను,మరుత్తులను దేవతలలో మరీచిని, నక్షత్రములలో చంద్రుడను.
ఈ సందర్భముగా మహేశ్వర సూత్రములను ఉటంకించడమైనది.
మహేశ్వర సూత్రములు:
అయిఉణ్ ఋలుక్ ఏ ఓయ్ ఐఓచ్ హయవరాట్ లణ్ జ్ఞమణ్ణనమ్ జభగడదస్ ఖఫచఠదవ్ కపయ్
అనే శబ్దములవలన అచ్చులు, హల్లులు, హల్లులు మరియు అచ్చులు, హల్లులతో కూడిన సంయుక్తాక్షరములు ఏర్పడినవి.
జ్ఞానము మరియు శక్తి రెండునూ గలది సూక్ష్మప్రాణశక్తి. దీని మూలము సహస్రారచక్రము. ఈ 49 ముఖ్యఉపవాయువుల మూలము సహస్రారచక్రము మూలముగాగల సూక్ష్మప్రాణశక్తి.
ప్రతి ఉపవాయువునకు అద్భుతమైన తన తన ప్రత్యేకమైన విధులున్నాయి. అవి ఆజ్ఞా చక్రముద్వారా విశుద్ధ, అనాహత, మణిపుర, స్వాధిష్ఠాన మరియు మూలాదారచక్రములకు పంచ/పంప బడినవి. ఈ చక్రములనుండి నరకేంద్రములకు, వాటిద్వారా వివిధ అవయవములకు పంపబడును.
మరుత్తులు ఏడుగురు. వారు:
1)ఆవహుడు, 2)ప్రవహుడు,3)వివహుడు, 4)పరావహుడు, 5)ఉద్వహుడు, 6)సంవహుడు, మరియు 7)పరివహుడు(మరీచి).
ఈ 49 ముఖ్య ఉపవాయువులు పైన పేర్కొన్నట్లుగా ఏడు విధములుగా విభజించబడ్డాయి. ఈవాయువులు మన లోపల ఉన్నవి మరియు మన వెలుపలి బ్రహ్మాండములోను యున్నవి. అందువలననే బ్రహ్మాండము, మనస్సు మరియు శరీరమునకు సంబంధము ఏర్పడుచున్నది.
బ్రహ్మపదార్థమే ఈవిధముగా 49 ముఖ్యఉపవాయువులుగా వ్యక్తమైనది. ఇది తెలిసుకోకనే ఈ అస్తవ్యస్తము అయోమయము. ఇది తెలిసుకుంటే ఏ వ్యాకులతయుండదు.
ఆరు చక్రములలో ఉన్న అన్ని అక్షరములు కలిపి సహస్రారములో ఉండును.
ఆయా చక్రమునకు సంబంధించిన అక్షరములు, వాయువులు ఈ క్రింద ఇవ్వబడినవి.
A)అజ్ఞా
1)ప్రవహ శ్వాసిని టానా మహాబల్
B)విశుద్ధ
2) పరివహ విహగ ఉడ్డీయాన ఋతవాహ
3) పరివహ సప్తస్వర శబ్ద స్థితి,
4) పరివహ ప్రాణ నిమీళన బహిర్గమన త్రిశక్ర
5) పరావహ మాతరిశ్వా అణు సత్యజిత్,
6) పరావహ జగత్ ప్రాణ బ్రహ్మఋత
7) పరావహ పవమాన క్రియార్ పరావస్థఋతజిత్
8) పరావహ నవప్రాణ ప్రాణరూపో చిత్వహిత్ ధాతా
9) పరావహ హమి మోక్ష అస్తిమిత్ర
10) పరావహ సారఙ్ నిత్య పతివాస
11) పరావహ స్తంభన సర్వవ్యాపిమిత
12) ప్రవహ శ్వసనశ్వాస ప్రశ్వాసాదిఇంద్ర
13) ప్రవహ సదాగతి గమనాదౌ గతి
14) ప్రవహపృవదశ్యస్పర్శశక్తిఅదృశ్యగతి
15) ప్రవహగంధ వాహ అనుష్ణ అశీతఈదృక్ష
16) ప్రవహ వాహ చలన వృతిన
17) ప్రవహవేగికంతభోగకామ
C)అనాహత
18) ఉద్వహ వ్యాన జృంభణ ఆకుంచన ప్రసారణ ద్విశక్ర
19) ఆవహ గంధవహ గంధేర్ అణుకే ఆనే త్రిశక్ర
20) ఆవహ ఆశుగ శైఘ్రం అదృక్ష
21) ఆవహ మారుత భిత్తరేర్ వాయు అపాత్
22) ఆవహ పవన పవన అపరాజిత
23) ఆవహ ఫణిప్రియ ఊర్ధ్వగతి ధృవ
24) ఆవహ నిశ్వాసక త్వగింద్రియ వ్యాపి యుతిర్గ
25) ఆవహ ఉదాన ఉద్గీరణ సకృత్
26) పరివహ అనిల్ అనుష్ణ అశీత అక్షయ
27) పరివహ సమిరణపశ్చిమేర్ వాయు సుసేన
28) పరివహ అనుష్ణ శీతస్పర్శ పసదీక్ష
29) పరివహ సుఖాస సుఖదా దేవదేవ
D)మణిపుర
30) వివహ వాతివ్యక్ సంభవ
31) వివహ ప్రణతి ధారనా అనమిత్ర
32) వివహ ప్రకంపన కంపన భీమ
33) వివహ సమాన పోషణ ఏక జ్యోతి
34) ఉద్వహ మరుత ఉత్తరదిగేర్ వాయుసేనాజిత్
35) ఉద్వహ నభస్థాన అపంకజ అభియుక్త
36) ఉద్వహ ధునిధ్వజ ఆదిమిత
37) ఉద్వహ కంపనా సేచనా ధర్తా
38) ఉద్వహ వాస దేహవ్యాపి విధారణ
39) ఉద్వహ మృగవాహన విద్యుత్ వరణ
E)స్వాధిష్ఠాన
40) సంవహ చంచల ఉత్క్షేపణ ద్విజ్యోతి
41) సంవహ పృషతాంపతి బలంమహాబల
42) సంవహ అపాన క్షుధాకర అధోగమన ఏకశక్ర
43) వివహ స్పర్శన స్పర్శ విరాట్
44) వివహ వాత తిర్యక్ గమన పురాణహ్య
45) వివహ ప్రభంజన మన పృథక్ సుమిత
F)మూలాధారము
46) సంవహ అజగత్ ప్రాణ జన్మమరణ అదృశ్య
47) సంవహ ఆవక్ ఫేలా పురిమిత్ర
48) సంవహ సమిర ప్రాతఃకాలేర్ వాయుసఙ్ మిత
49) సంవహ ప్రకంపన గంధేర్ అణుకే ఆనే మితాసన
🌹🌹🌹🌹🌹
🙏 ప్రసాద్
సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్ డాక్ట్రిన్) - 31
31 వ భాగము
✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🍃 చత్తము ఒక మాయా చక్రము 3 🍃
211. చిత్తము ఆత్మ జ్ఞానము చేతను, పరమాత్మ చింతన చేతను నిండియుండిన దానిని ఆధ్యాత్మిక చిత్తము అంటారు. అట్టి చిత్తములో భక్తి, సమర్పణ, అనన్య సాధన, కర్మల సమర్పణ, అసూయ లేకుండుట, అహంకార రహితము మొదలగు లక్షణములతో కూడి ఉంటుంది.
212. ప్రాపంచిక భావములు, దృశ్యములు, వస్తువులు, శబ్దములు, భోగములు, వికారములతో నిండి ఉండును.
213. చిత్త లక్షణములు: సంకటములో పడదోయుట, గాఢాంధకారము, భ్రమ, సంసారము, ద్వేషము, కామము, క్రోధము, విశ్రాంతి, స్వప్న, శారీరక ఆసక్తి, రాగము, సమస్త ఇంద్రియములకు నాయకుడిగా ఉండును.
214. చిత్తమును జయించాలంటే సూక్ష్మ బుద్ధి అవసరము. ఆత్మ దృష్టి, నివృత్తి సాధన ద్వారా చిత్తమాలిన్యమును నశింపజేయాలి.
215. అంతఃకరణ వృత్తులను అవగాహన చేసుకుంటూ దానిని నిరోధించవలెను. చిరకాలము ఆత్మ యందె మనస్సును లగ్నం చేయాలి. అందుకు నిరంతర అభ్యాసము చేయాలి.
216. నాశికాగ్రములో చిత్తాన్ని ఏకాగ్రము చేస్తే దివ్య పరిమళాలు వ్యక్తమవుతాయి. బ్రహ్మనాదాలు వినిపిస్తాయి, పదార్థములు లేకనే రుచులు, వాసనలు తెలుస్తుంటాయి. అష్టాంగ మార్గాలను అభ్యాసం చేసిన చిత్త మాలిన్యాలు తొలగుతాయి. ప్రాణాయామం అందుకు బాగా తోడ్పడుతుంది. దివ్యానుభవాలు, దివ్యానందము కలుగుతుంది.
217. బుద్ధిచే చిత్తమును విచారణ చేసి నిరోధించవలెను. చిత్తమును చిత్తము చేతనే నిరోధించవలెను. చిత్త వృత్తులను నిరోధించినప్పుడే మనస్సు నశించును. లేనిచో సంసార బంధములు ఏర్పడును.
218. ఈ జగత్తు అభావమని భావించి చిత్తము నశింపజేయు యోగ సాధనయె చిత్త క్షయము. ఆలోచన, విచారణ, జిజ్ఞాస అను మంత్రములతో, ఔషధములతో చిత్తమును చంపివేయవలెను. నిర్మల చిత్తమే పరమాత్మ. మనస్సు ఏర్పడటానికి మూలము చిత్తము.
219. సాధనా మార్గములు: శాస్త్ర పఠనము, పురుష ప్రయత్నము, శ్రవణము, నిరంతర సాధన, విచారణ, గురుశుశ్రూష, సజ్జన సాంగత్యము ఆత్మావలోకన, మనోనిగ్రహము, వైరాగ్యము, దృఢ నిశ్చయము అవసరము.
220. చిత్తము నశించిన వారి లక్షణములు: జ్ఞానాగ్నిచే పాపము క్షయించును. మైత్రి, కరుణ, సంతోష లక్షణములు, కోపము క్షీణించుట, వాసనాగ్రంథులు క్రమముగా విచ్ఛిన్నమగుట, మోహము తొలగుట, దుఃఖము తగ్గిపోవుట, లోభము పారిపోవుట, ఇంద్రియములు విషయ రహిత మగుట, కామము శిధిలమగుట, సమత్వ బుద్ధి, భోగాసక్తి నశించుట జరుగును.
🌹 🌹 🌹 🌹 🌹
సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్ డాక్ట్రిన్) - 30
30 వ భాగము
✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🍃 చత్తము ఒక మాయా చక్రము 2 🍃
201. చిత్తము ఉన్నచో మూడు లోకములు ఉండును. చిత్తము నశించిన జగత్తు నశించును. రాగద్వేషములే చిత్త సంస్కారములు. ఆ సంస్కారములే సంసారము. లోకములు, లోకేశులు, లోకస్థులు, అన్నీ చిత్తభ్రాంతియే. వీటి మిథ్యాభావమే చిత్త శాంతి.
202. శరీరాభిమానము గల యోగి ఇతరుల అభిప్రాయములను గ్రహించలేడు. అందుకు యోగ సాధన అవసరము.
203. యోగాగ్నిలో పూర్వ సంస్కారములను భస్మం గావించుచూ, చిత్త శుద్ధి ద్వారా నూతన సంస్కారములు ఏర్పడకుండా చూడాలి. చిత్తములో విషయాకార వృత్తులు నశించి, ఆత్మాకార వృత్తులేర్పడవలెను. అద్వైత సిద్ధిలో అన్ని వృత్తులు నశించును.
204. కర్మ రాహిత్యము పొందినప్పుడు చిత్తము సమాధి స్థితి నొందుచున్నది. దానినే చిత్తలయము అంటారు.
205. అనేక వాంఛలు, విషయాల, కోరికల సంయోగమైన చిత్తము పురుషుని (ఆత్మ) కొరకు ఏర్పడినది. పురుషుడు లేనిచో చిత్తము లేదు. చిత్తము లేనిచో పురుషుడుండడు. ఇంద్రియాలు చిత్తానికి ప్రేరణ కలిగిస్తాయి. బుద్ధిని ఉపయోగించి ఇంద్రియాలను జయించాలి. చిత్త శాంతి కలిగితే పురుషుడే బ్రహ్మము.
206. చిత్తము శుద్ధ సాత్వికమైనప్పటికి దాని చుట్టూ రజోగుణములు, తమోగుణములు కప్పి ఉంటాయి.
207. ప్రకృతిలో గల అనేక శక్తులను గ్రహించే శక్తి చిత్తానికి మాత్రమే ఉంది.
208. చిత్త స్త్థెర్యము లభించాలంటే ఆత్మ జ్యోతిని ధ్యానించాలి. విషయ వాసనలు త్యజించాలి.
209. అనన్య చిత్తుడైనవాడు చిత్తమునందు నిరంతర బ్రహ్మ చింతన, సంకల్పములు లేకుండా అనంత భావంతో నిరంతరం ఆత్మ చింతన చేసిన అనన్యత సిద్ధించును.
210. మనస్సు కేవలము విషయములను సేకరించిన, బుద్ధి వాటిని గ్రహించి విశ్లేషణ చేయగా, చిత్తము ఆ విషయములను తనలో నిక్షిప్తము చేస్తుంది. అదే చిత్రగుప్తుని ఖాతా. దాన్ని బట్టి మనం తిరిగి కర్మలు చేస్తుంటాము. సంఘటనలన్నీ విషయాలుకాదు. విషయీకరించుకొన్నవి మాత్రమే విషయాలు. ఉదాసీన చిత్తము నిర్విషయ మగును.
🌹 🌹 🌹 🌹 🌹
గుప్తవిద్య (సీక్రెట్ డాక్ట్రిన్) 29
🌹 *గుప్తవిద్య (సీక్రెట్ డాక్ట్రిన్)* 🌹
*29 వ భాగము*
✍ రచన : *పేర్నేటి గంగాధరరావు*
🍃 *చిత్తము ఒక మాయా చక్రము 1* 🍃
*194. అంతఃకరణ చతుష్టయములో చిత్తము ఒకటి.ఇది జడమైనది. దేహముపై ఆసక్తి, కుటుంబముపై ఆసక్తి, ఆశల చేత ఇది స్థూలత్వమును పొందుచున్నది. సమస్త ఇంద్రియములకు నాయకుడు చిత్తము. మాయా చక్రము యొక్క మాహానాభి (బొడ్డు) యే చిత్తము. ఇది శరీరము యొక్క కేంద్ర భాగము. చిత్తము మానవుని నాభి స్థానము నుండి పనిచేయును. ఇది నిరంతరము పరిభ్రమించుచుండును. విషయాసక్తియే చిత్త వృత్తి.*
*195. జీవికి గల అంతఃకరణ వృత్తియే చిత్తము. సమస్త దుఃఖములకు, సుఖాలకు, చిత్తమే కారణము. దేహము నేను అనెడి చిత్త వృత్తి నశించవలెను. యోగులు చిత్త క్షయానికి సాధన చేస్తుంటారు. దేహము చిత్తముచే చలింపబడుచున్నది.*
*196. అంతఃకరణము, బుద్ధి, మహత్తు, అహంకారము, ప్రాణము, జీవుడు ఇవన్నియూ చిత్తము యొక్క వృత్తి రూపములు.*
*197. చిత్తము ఒక విష వృక్షము. ఇంద్రియ విషయ భోగములు దాని శాఖలు, కొమ్మలు. ధ్యానమునకు చిత్తము యొక్క నిశ్చలత్వము చాలా అవసరము. చిత్తమందు వాసనారహితము కావలెను. ఇది చిత్త వృత్తి నిరోధము వలన జరుగును.*
*198. కర్మానుసారము ఏర్పడిన దేహమె చిత్తము. చిత్తమె జీవుడు. సంసార రాహిత్యమునకు, సంసార బంధనాలకు చిత్తమె కారణము.*
*199. మనస్సు అతి శీఘ్రముగా వివిధ ప్రదేశములు సంచరించి సేకరించిన అనేక ప్రాపంచిక విషయముల సమూహమే చిత్తము. చైతన్యము పై వాసనలు ముద్రించబడితే అతి చిత్తము. చిత్తములో వాసనాక్షయమైతే అది చిత్, అనగా పరమాత్మ.*
*200. చిత్తము శుద్ధమైన అనగా విషయములు నశించిన, చైతన్యము నిర్మలమైన స్థితి ఏది కలదో అదే సత్యము. ఈ చిత్తమును విచారణ ద్వారా, పరిశీలన ద్వారా ప్రయత్న పూర్వకముగా శుద్ధము చేయవలెను. సత్కర్మాచరణ, సత్సంగము ద్వారా చిత్త శుద్ధి కలుగును. అపుడు కర్మలు నశించును, తద్వారా బ్రహ్మానుభూతి కలుగును.*
🌹 🌹 🌹 🌹 🌹
🙏 *ప్రసాద్*
వివేక చూడామణి 30
🌹 *వివేక చూడామణి* 🌹
*30 వ భాగము*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
🍃 *కోరికలు, కర్మలు - 3* 🍃
*330. ఎపుడైతే వ్యక్తి ఏ కొంచము బ్రహ్మము నుండి విడిపోయిన, వెంటనే అతడు తాను చేసిన పొరపాటు గమనించి భయానికి లోనవుతాడు.*
*331. ఎవరైతే తాను విశ్వములోని బాహ్య వస్తు విశేషములకు అనుగుణముగా నడుచుకుంటాడో అతడు దుఃఖాలకు ఒకటి తరువాత ఇంకొకటి ఎదుర్కొంటూ, దొంగ తాను చేసిన తప్పుకు భయపడినట్లు, చిక్కుల్లో పడతాడు. ఈ విషయాలు సృతులలోనూ, అనుభవాల ద్వారా గ్రహించగలరు.*
*332. ఎవరైతే ధ్యానవిధానమునకు విధేయులై ఉంటారో వారు మాయకు అతీతులవుతారు. మరియు ఉన్నతమైన ఆత్మోన్నతిని పొందగలరు. అయితే ఎవరైతే అశాశ్వతమైన విశ్వ పదార్థములకు, కోరికలకు లోనవుతారో వారు నాశనం అవుతారు. అందుకు ఉదాహరణగా దొంగతనము చేసినవాడు భయపడుతూ ఉంటే చేయని వాడు నిర్భయముగా సంచరించగలడు.*
*333. సన్యాసులు తాము అసత్య వ్యవహారములలో పాల్గోనరాదు. అలా జరిగిన అతడు బంధనాలలో చిక్కుకొనును. అందువలన అతడు తన మనస్సును ఎల్లప్పుడు నేనే బ్రహ్మాన్నని, అంత బ్రహ్మమేనని భావిస్తూ ఎల్లప్పుడు బ్రహ్మానంద స్థితిలో ఉంటూ, పాపాలకు, దుఃఖాలకు, మాయకు వ్యతిరేఖముగా జీవిస్తాడు. ఎందువలనంటే అవన్ని అతడు ముందే అజ్ఞానములో ఉన్నప్పుడు అనుభవించాడు.*
*334. బాహ్య వస్తు సముధాయముపై ఆధారపడి జీవించిన, వాటి చెడు ఫలితాలు ఇంకా ఇంకా పెరిగిపోతుంటాయి. ఈ విషయాన్ని గ్రహించి బాహ్య వస్తువులపై వ్యామోహమును తొలగించి, స్థిరముగా వ్యక్తి బ్రహ్మమును గూర్చి ధ్యానములో నిమగ్నుడై ఉండవలెను.*
*335. ఎపుడైతే బాహ్య ప్రపంచము మూసి వేయబడుతుందో, మనస్సు ఆనందముతో నిండి ఉంటుంది. ఆ ఆనంద స్థితిలో మనస్సుకు బ్రహ్మానంద స్థితి లేక పరమాత్మ స్థితి అనుభవమవుతుంది. ఎపుడైతే ఖచ్చితముగా అట్టి అనుభవమవుతుందో అపుడు చావు పుట్టుకల గొలుసు తెగిపోతుంది. అందువలన విముక్తికి మొదటి మెట్టు బాహ్య ప్రపంచము వైపు తెరచి ఉన్న తలుపులను మూసివేయుట.*
*336. విద్యావంతడైన వ్యక్తి ఎచ్చట ఉంటే అచ్చట ఆ వ్యక్తి సత్యాసత్యముల విచక్షణా జ్ఞానముతో వేదాలను నమ్మి తన దృష్టిని అతని వైపు మళ్ళించగలుగుతాడు. అదే అత్యున్నతమైన సత్యము. సాధకుడు అట్టి స్థితిని పొందిన తరువాత చిన్న పిల్లల వలె కాక జాగ్రత్తగా అసత్యమైన విశ్వానికి దూరముగా ఉంటాడు. లేనిచో అది అతని పతనానికి కారణమవుతుంది.*
*337. శరీరానికి కట్టుబడి ఉన్న వ్యక్తికి విముక్తి లేదు. అలానే విముక్తి పొందిన వ్యక్తికి శరీరముతో ఏవిధమైన గుర్తింపు ఉండదు. నిద్రించు వ్యక్తి మెలుకవలో ఉండడు. మెలుకవలో ఉన్న వ్యక్తి నిద్రించడు. ఈ రెండు వ్యతిరేక ప్రభావము కలిగి ఉన్నవి.*
*338. ఎవడైతే తన మనస్సుతో తన ఆత్మను తెలుసుకొంటాడో అతడు స్వేచ్ఛను పొందుతాడు. అలా కాక కదులుచున్న, స్థిరముగా ఉన్న వస్తు సముదాయముపై దృష్టిని ఉంచి గమనిస్తుంటాడో, అది అతని పతనము. అందువలన అన్ని మోసాలను అధికమించి వ్యక్తి తన యొక్క ఆత్మిక స్థితిలో స్థిరపడాలి.*
🌹🌹🌹🌹🌹
🙏 *ప్రసాద్*
గుప్తవిద్య (సీక్రెట్ డాక్ట్రిన్) 30
🌹 గుప్తవిద్య (సీక్రెట్ డాక్ట్రిన్) 🌹
30 వ భాగము
✍ రచన : పేర్నేటి గంగాధరరావు
🍃 చిత్తము ఒక మాయా చక్రము 2 🍃
201. చిత్తము ఉన్నచో మూడు లోకములు ఉండును. చిత్తము నశించిన జగత్తు నశించును. రాగద్వేషములే చిత్త సంస్కారములు. ఆ సంస్కారములే సంసారము. లోకములు, లోకేశులు, లోకస్థులు, అన్నీ చిత్తభ్రాంతియే. వీటి మిథ్యాభావమే చిత్త శాంతి.
202. శరీరాభిమానము గల యోగి ఇతరుల అభిప్రాయములను గ్రహించలేడు. అందుకు యోగ సాధన అవసరము.
203. యోగాగ్నిలో పూర్వ సంస్కారములను భస్మం గావించుచూ, చిత్త శుద్ధి ద్వారా నూతన సంస్కారములు ఏర్పడకుండా చూడాలి. చిత్తములో విషయాకార వృత్తులు నశించి, ఆత్మాకార వృత్తులేర్పడవలెను. అద్వైత సిద్ధిలో అన్ని వృత్తులు నశించును.
204. కర్మ రాహిత్యము పొందినప్పుడు చిత్తము సమాధి స్థితి నొందుచున్నది. దానినే చిత్తలయము అంటారు.
205. అనేక వాంఛలు, విషయాల, కోరికల సంయోగమైన చిత్తము పురుషుని (ఆత్మ) కొరకు ఏర్పడినది. పురుషుడు లేనిచో చిత్తము లేదు. చిత్తము లేనిచో పురుషుడుండడు. ఇంద్రియాలు చిత్తానికి ప్రేరణ కలిగిస్తాయి. బుద్ధిని ఉపయోగించి ఇంద్రియాలను జయించాలి. చిత్త శాంతి కలిగితే పురుషుడే బ్రహ్మము.
206. చిత్తము శుద్ధ సాత్వికమైనప్పటికి దాని చుట్టూ రజోగుణములు, తమోగుణములు కప్పి ఉంటాయి.
207. ప్రకృతిలో గల అనేక శక్తులను గ్రహించే శక్తి చిత్తానికి మాత్రమే ఉంది.
208. చిత్త స్త్థెర్యము లభించాలంటే ఆత్మ జ్యోతిని ధ్యానించాలి. విషయ వాసనలు త్యజించాలి.
209. అనన్య చిత్తుడైనవాడు చిత్తమునందు నిరంతర బ్రహ్మ చింతన, సంకల్పములు లేకుండా అనంత భావంతో నిరంతరం ఆత్మ చింతన చేసిన అనన్యత సిద్ధించును.
210. మనస్సు కేవలము విషయములను సేకరించిన, బుద్ధి వాటిని గ్రహించి విశ్లేషణ చేయగా, చిత్తము ఆ విషయములను తనలో నిక్షిప్తము చేస్తుంది. అదే చిత్రగుప్తుని ఖాతా. దాన్ని బట్టి మనం తిరిగి కర్మలు చేస్తుంటాము. సంఘటనలన్నీ విషయాలుకాదు. విషయీకరించుకొన్నవి మాత్రమే విషయాలు. ఉదాసీన చిత్తము నిర్విషయ మగును.
🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్
30 వ భాగము
✍ రచన : పేర్నేటి గంగాధరరావు
🍃 చిత్తము ఒక మాయా చక్రము 2 🍃
201. చిత్తము ఉన్నచో మూడు లోకములు ఉండును. చిత్తము నశించిన జగత్తు నశించును. రాగద్వేషములే చిత్త సంస్కారములు. ఆ సంస్కారములే సంసారము. లోకములు, లోకేశులు, లోకస్థులు, అన్నీ చిత్తభ్రాంతియే. వీటి మిథ్యాభావమే చిత్త శాంతి.
202. శరీరాభిమానము గల యోగి ఇతరుల అభిప్రాయములను గ్రహించలేడు. అందుకు యోగ సాధన అవసరము.
203. యోగాగ్నిలో పూర్వ సంస్కారములను భస్మం గావించుచూ, చిత్త శుద్ధి ద్వారా నూతన సంస్కారములు ఏర్పడకుండా చూడాలి. చిత్తములో విషయాకార వృత్తులు నశించి, ఆత్మాకార వృత్తులేర్పడవలెను. అద్వైత సిద్ధిలో అన్ని వృత్తులు నశించును.
204. కర్మ రాహిత్యము పొందినప్పుడు చిత్తము సమాధి స్థితి నొందుచున్నది. దానినే చిత్తలయము అంటారు.
205. అనేక వాంఛలు, విషయాల, కోరికల సంయోగమైన చిత్తము పురుషుని (ఆత్మ) కొరకు ఏర్పడినది. పురుషుడు లేనిచో చిత్తము లేదు. చిత్తము లేనిచో పురుషుడుండడు. ఇంద్రియాలు చిత్తానికి ప్రేరణ కలిగిస్తాయి. బుద్ధిని ఉపయోగించి ఇంద్రియాలను జయించాలి. చిత్త శాంతి కలిగితే పురుషుడే బ్రహ్మము.
206. చిత్తము శుద్ధ సాత్వికమైనప్పటికి దాని చుట్టూ రజోగుణములు, తమోగుణములు కప్పి ఉంటాయి.
207. ప్రకృతిలో గల అనేక శక్తులను గ్రహించే శక్తి చిత్తానికి మాత్రమే ఉంది.
208. చిత్త స్త్థెర్యము లభించాలంటే ఆత్మ జ్యోతిని ధ్యానించాలి. విషయ వాసనలు త్యజించాలి.
209. అనన్య చిత్తుడైనవాడు చిత్తమునందు నిరంతర బ్రహ్మ చింతన, సంకల్పములు లేకుండా అనంత భావంతో నిరంతరం ఆత్మ చింతన చేసిన అనన్యత సిద్ధించును.
210. మనస్సు కేవలము విషయములను సేకరించిన, బుద్ధి వాటిని గ్రహించి విశ్లేషణ చేయగా, చిత్తము ఆ విషయములను తనలో నిక్షిప్తము చేస్తుంది. అదే చిత్రగుప్తుని ఖాతా. దాన్ని బట్టి మనం తిరిగి కర్మలు చేస్తుంటాము. సంఘటనలన్నీ విషయాలుకాదు. విషయీకరించుకొన్నవి మాత్రమే విషయాలు. ఉదాసీన చిత్తము నిర్విషయ మగును.
🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్

