దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 3. చంద్రఘంట - అన్నపూర్ణ దేవి Devi Navratra - Nav Durgas Sadhana - 3. Chandraghanta - Annapurna Devi

🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 3. చంద్రఘంట - అన్నపూర్ణ దేవి 🌹

📚 . ప్రసాద్ భరద్వాజ

🌷. ప్రార్ధనా శ్లోకము :

పిండజప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా ।
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ॥

🌷. అలంకారము : అన్నపూర్ణ దేవి - లేత రంగు

🌷. నివేదనం : కొబ్బరి అన్నం

🌷. మహిమ :

దుర్గామాత మూడవ నామమైన చంద్రఘంటా స్వరూపం మిక్కిలి శాంతిప్రదము, కల్యాణకారకము. తన శిరస్సుపై అర్ధచంద్రుడు ఘంటాకృతిగా వుండడం వల్ల ఈ నామం ఏర్పడింది. ఈమెని ఆరాధిస్తే సింహపరాక్రమముతో నిర్భయంగా ఉంటారు. జపమాల,ఘంట, బాణం, పదునైన ఖడ్గం, శ్వేత పద్మం, పానపాత్ర, త్రిశూలం, ధనుస్సు, కమలం, గద ధరించి మహాలావణ్య శోభతో ప్రకాశిస్తుంది.

🌷. చరిత్ర :

దుర్గామాతయొక్క మూడవ శక్తి నామము ‘చంద్రఘంట’. నవరాత్రి ఉత్సవాలలో మూడవరోజున ఈమె విగ్రహానికే పూజాపురస్కారాలు జరుగుతాయి. ఈ స్వరూపము మిక్కిలి శాంతిప్రదము, కల్యాణ కారకము. ఈమె తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘాంటాకృతిలో ఉండటంవల్ల ఈమెకు ‘చంద్రఘంట’ అనే పేరు స్థిరపడింది.

ఈమె శరీర కాంతి బంగారు వన్నెలో మిలమిల లాడుతుటుంది. తన పది చేతులలో – ఖడ్గము మొదలయిన శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించి ఉంటుంది. సర్వదా సమర సన్నాహయై యుద్ధ ముద్రలో ఉండే దివ్య మంగళ స్వరూపం. ఈమె గంటనుండి వెలువడే భయంకర ధ్వనులను విన్నంతనే క్రూరులైన దుష్టులు గడగడలాడిపోతారు.

నవరాత్రి దుర్గాపూజలలో మూడవ రోజు సేవ మిక్కిలి మహిమోపేతమైనది. ఆ రోజు సాధకుని మనస్సు మణిపూరక చక్రాన్ని ప్రవేశిస్తుంది. చంద్రఘంటా దేవి కృపవలన ఉపాసకునికి దివ్య వస్తు సందర్శనం కలుగుతుందని చెబుతారు. దివ్య సుగంధ అనుభవము కూడా సిద్ధిస్తుంది. అలాగే వివిధాలైన దివ్యధ్వనులు కూడా వినిపిస్తాయి. ఈ దివ్యానుభవ అనుభూతికొరకు, సాధకుడు సావధానుడై ఉండాలి.

ఈ మాత కృపవలన సాధకుని సమస్త పాపాలూ, బాధలూ తొలగిపోతాయి. ఈమె ఆరాధన సద్యః ఫలదాయకము. ఈమె నిరంతరమూ యుద్దసన్నద్ధురాలై ఉన్నట్లు దర్శనమిస్తుంది కనుక భక్తుల కష్టాలను అతి శీఘ్రముగా నివారిస్తుంది. ఈ సింహవాహనను ఉపాసించేవారు సింహసదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉంటారు. ఈమె ఘాంటానాదము సంతతము భక్తులను భూతప్రేతాది బాధలనుండి కాపాడుతూ ఉంటుంది. ఈమెను సేవించినంతనే శరణాగతుల రక్షణకై అభయఘంట ధ్వనిస్తూ ఉంటుంది.

ఈ దేవీ స్వరూపము దుష్టులను అణచివేయటంలో, హతమార్చుటంలో అను క్షణమూ సన్నద్ధురాలై ఉండునదే; అయినప్పటికీ భక్తులకూ, ఉపాసకులకూ ఈమె స్వరూపము మిక్కిలి సౌమ్యముగానూ, ప్రశాంతముగానూ కనబడుతూ ఉంటుంది. ఈమెను ఆరాధించడం వల్ల సాధకులలో వీరత్వ నిర్భయత్వములతో పాటు సౌమ్యతా, వినమ్రతలు పెంపొందుతుంటాయి.

వారి నేత్రాలలోని కాంతులు, ముఖవర్చస్సు, శరీర శోభలు ఇనుమడిస్తూ, సద్గుణములు వృద్ధిచెందుతుంటాయి. వారి కంఠస్వరములలో అలౌకికమైన దివ్యమాధుర్యము రాశిగా ఏర్పడుతుంది. చంద్రఘంటాదేవిని భజించేవారు, ఉపాసించేవారు ఎక్కడికి వెళ్ళినా వారిని దర్శించిన వారందరూ సుఖశాంతులను పొందుతారు. ఇలాంటి ఉత్తమ సాధకుల శరీరాలనుండి దివ్యమూ, ప్రకాశవంతమూ అయిన తేజస్సు బహిర్గతము అవుతూ ఉంటుంది. ఈ దివ్య ప్రక్రియ సామాన్యులదృష్టికి గోచరించదు. కానీ ఉత్తమ సాధకులూ, వారి అనుయాయులు మాత్రము వీటిని గ్రహించి, అనుభూతిని పొందగలరు.

మనము త్రికరణశుద్ధిగా విధ్యుక్తకర్మలను ఆచరిస్తూ, పవిత్రమైన అంతఃకరణ కలిగి చంద్రఘాంటాదేవిని శరణుజొచ్చి, ఆమెను ఉపాసించడానికీ, ఆరాధించడానికీ తత్పరులమై ఉండాలి. అలాంటి ఉపాసన ప్రభావము వల్ల, మనము సమస్త సాంసారిక కష్టములనుండి విముక్తులమై, సహజంగానే పరమపద ప్రాప్తికి అర్హులమవుతాము. నిరంతరమూ ఈ దేవి పవిత్రమూర్తిని ధ్యానిస్తూ మనము సాధనలో అగ్రగణ్యులమవ్వటానికి ప్రయత్నిస్తూ ఉండాలి. దేవి ధ్యానము మనకు ఇహపర లోకాలలో పరమ కల్యాణదాయకమై సద్గతులను ప్రాప్తింపజేస్తుంది.

🌹 🌹 🌹 🌹 🌹

08 Oct 2021

08-OCTOBER-2021

🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 2. బ్రహ్మచారిణి 🌹
📚 . ప్రసాద్ భరద్వాజ

🌷. ప్రార్ధనా శ్లోకము :
దధానా కరపద్మాభ్యాం అక్షమాలాకమండలూ ।
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ॥

🌷. అలంకారము : గాయత్రీ దేవి - పసుపు రంగు
🌷. నివేదనం : పులిహోర  

🌷. మహిమ :
ఒక చేత జపమాల, మరో చేత జలపాత్ర ధరించిన బ్రహ్మచారిణీ మాత సాధకునిలో సదాచారాన్ని ప్రవేశపెడుతుంది. ఈమె నామస్మరణతో కర్మబంధాలు చెదిరిపోయి మోక్షం సంప్రాప్తిస్తుంది.
శివుణ్ణి పతిగా పొందేందుకు తపించిపోయిన రాజకన్య . ఈమెను ఆరాధిస్తే మనస్సుకు ఏకాగ్రత కలుగుతుంది .

దుర్గామాతయొక్క నవశక్తులలో రెండవది ‘బ్రహ్మచారిణి’ స్వరూపము. ఈ సందర్భంలో ‘బ్రహ్మ’ అనగా తపస్సు. ‘బ్రహ్మచారిణి’ అనగా తపమాచరించునది. ‘వేదస్తత్త్వం తపోబ్రహ్మ’ – ‘బ్రహ్మ’ యనగా వేదము, తత్త్వము, తపస్సు. బ్రహ్మచారిణీదేవి స్వరూపము పూర్తిగా జ్యోతిర్మయము, మిక్కిలి శుభంకరమూ, భవ్యము. ఈ దేవి కుడిచేతిలో జపమాలను, ఎడమ చేతిలో కమండలాన్నీ ధరించి ఉంటుంది.

🌷. చరిత్ర :
హిమవంతుని కూతురైన పార్వతియే ఈ బ్రహ్మచారిణీ దేవి. ఈమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందటానికి నారదుడి ఉపదేశాన్ని అనుసరించి ఘోరతపము ఆచరిస్తుంది. ఈ కఠిన తపశ్చర్య కారణానే ఈమెకు ‘తపశ్చారిణి’ అనగా ‘బ్రహ్మచారిణీ’ అనే పేరు స్థిరపడింది. తపశ్చర్యకాలములో ఈమె కేవలము ఫల, కంద మూలములను మాత్రమే ఆరగిస్తూ లెక్కలేనన్ని సంవత్సరాలు గడుపుతుంది. కేవలము పచ్చికాయగూరలనే తింటూ మరికొన్ని సంవత్సరాలూ, కఠినోపవాసములతో ఎలాంటి ఆచ్ఛాదనమూ లేకుండా ఎండలలో ఎండుతూ, వానలలో తడుస్తూ కొంత కాలంపాటూ తపస్సును ఆచరిస్తుంది. ఇలాంటి కఠినతరమైన తపస్సును ఆచరించిన తరువాత, మరింకెన్నో సంవత్సరాలపాటు నేలపై రాలిన ఎండుటాకులను మాత్రమే స్వీకరిస్తూ పరమేశ్వరుణ్ణి అహర్నిశలూ ఆరాధిస్తుంది. మెల్లిగా ఎండుటాకులనుకూడా తినటం మానివేసి ‘అపర్ణ’యై చాలాకాలంపాటు ఆహారమూ, నీళ్ళు కూడా ముట్టకుండా ఘోరమైన తపస్సును ఆచరిస్తుంది.

ఇలా చాలాకాలంపాటు కఠినమైన తపస్సును కొనసాగించటం కారణాన, బ్రహ్మచారిణిదేవి శరీరము పూర్తిగా కృశించి పోతుంది. ఈవిడ స్థితిని చూసి తల్లియైన మేనాదేవి ఎంతగానో దుఃఖిస్తుంది. ఈమెను ఈ కఠిన తపస్సునుండి మరలించడానికి తల్లి ‘ఉ మా’ – ‘బిడ్డా! వలదు, వలదు’ అని పలికినందున, బ్రహ్మచారిణిదేవి పేరు ‘ఉమా’ అని ప్రసిద్ధి కెక్కింది.

బ్రహ్మచారిణీదేవి చేసిన ఘోరతపస్సు కారణాన, ముల్లోకాలలో హాహాకారాలు చెలరేగుతాయి. దేవతలూ, ఋషులూ, సిద్ధులూ, మునులూ మొదలైనవారందరూ ఈవిడ తపస్సు కనీవినీ యెరుగనటువంటి పుణ్యకార్యమని పలుకుతూ ఈవిడను కొనియాడతారు. చివరికి పితామహుడైన బ్రహ్మదేవుడు, అశరీరవాణి ద్వారా ఈమెను సంబోధిస్తూ ప్రసన్నమైన స్వరంలో ఇలా పలుకుతారు “దేవీ! ఇట్టి కఠోర తపస్సును ఇంతవరకునూ ఎవ్వర్రునూ ఆచరింపలేదు. ఇది నీకే సాధ్యమైనది. అలౌకికమైన నీ తపశ్చర్య సర్వత్ర శ్లాఘించబడుచున్నది. నీ మనోవాంఛ సంపూర్ణముగా నెరవేరును. చంద్రమౌళియైన పరమేశ్వరుడు అవశ్యముగా నీకు పతియగును. ఇక నీవు తపస్సును విరమించి ఇంటికి మరలుము. త్వరలోనే నీ తండ్రి నిన్ను ఇంటికి తీసికొనిపోవుటకై వచ్చును.“

దుర్గామాతయొక్క ఈ రెండవ స్వరూపము భక్తులకూ, సిద్ధులకూ అనంతఫలప్రదము. ఈమెను ఉపాసించటంవల్ల మానవులలో తపస్సూ, త్యాగమూ, వైరాగ్యమూ, సదాచారమూ, సంయమమూ వృద్ధి చెందుతాయి. జీవితంలో ఎలాంటి ఒడుదొడుకులు ఎదురైనా దేవి అనుగ్రహముతో వారి మనస్సులు కర్తవ్యమార్గం నుండి మరలవు. లోకమాత అయిన బ్రహ్మచారిణీదేవి కృపవలన ఉపాసకులకు సర్వత్ర సిద్ధీ, విజయాలూ ప్రాప్తిస్తాయి. దుర్గానవరాత్రి పూజలలో రెండవరోజున ఈమె స్వరూపము ఉపాసించబడుతుంది. ఈ రోజు సాధకుని మనస్సు స్వాధిష్ఠాన చక్రములో స్థిరమవుతుంది. ఈ చక్రంలో స్థిరమైన మనస్సుగల యోగి, ఈమె కృపకు పాత్రుడగుతాడు. అతనికి ఈమె యెడల భక్తి ప్రపత్తులు దృఢమవుతాయి.
🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ గాయత్రీ కవచం Sri Gayatri Kavacham

🌹. శ్రీ గాయత్రీ కవచం 🌹

ఓం శ్రీగణేశాయ నమః !!

యాజ్ఞవల్క్య ఉవాచ:-

1) స్వామిన్ సర్వజగన్నాథ సంశయోఽస్తి మహాన్మమ ! చతుఃషష్ఠికలానం చ పాతకానాం చ తద్వద !!

2) ముచ్యతే కేన పుణ్యేన బ్రహ్మరూపం కథం భవేత్ .! దేహం చ దేవతారూపం మంత్రరూపం విశేషతః !!

3) క్రమతః శ్రోతుమిచ్ఛామి కవచం విధిపూర్వకం ! బ్రహ్మోవాచ ! గాయత్ర్యాః కవచస్యాస్య బ్రహ్మా విష్ణుః శివో ఋషిః !!

4) ఋగ్యజుః సామాథర్వాణి ఛందాంసి పరికీర్తితాః ! పరబ్రహ్మస్వరూపా సా గాయత్రీ దేవతా స్మృతా !!

5) రక్షాహీనం తు యత్స్థానం కవచేన వినా కృతం ! సర్వం సర్వత్ర సంరక్షేత్సర్వాంగం భువనేశ్వరీ !!

6) బీజం భర్గశ్చ యుక్తిశ్చ ధియః కీలకమేవ చ ! పురుషార్థవినియోగో యో నశ్చ పరికీర్త్తితః !!

7) ఋషిం మూర్ధ్ని న్యసేత్పూర్వం ముఖే ఛంద ఉదీరితం ! దేవతాం హృది విన్యస్య గుహ్యే బీజం నియోజ యేత్ !!

8) శక్తిం విన్యస్య పదయోర్నాభౌ తు కీలకం న్యసేత్ ! ద్వాత్రింశత్తు మహావిద్యాః సాంఖ్యాయనస గోత్రజాః !!

9) ద్వాదశ లక్ష సంయుక్తా వినియోగాః పృథక్పృథక్ ! ఏవం న్యాసవిధిం కృత్వా కరాంగం విధిపూర్వకం !!

10) వ్యాహృతి త్రయముచ్చార్య హ్యనులోమ విలోమతః ! చతురక్షరసంయుక్తం కరాంగన్యాసమాచరేత్ !!

11) ఆవాహనాది భేదం చ దశ ముద్రాః ప్రదర్శయేత్ ! సా పాతు వరదా దేవీ అంగప్రత్యంగసంగమే !!

12) ధ్యానం ముద్రాం నమస్కారం గురుమంత్రం తథైవ చ ! సంయోగమాత్మసిద్ధిం చ షడ్విధం కిం విచారయేత్ !!

అస్య శ్రీగాయత్రీ కవచస్య బ్రహ్మవిష్ణురుద్రా ఋషయః,

ఋగ్యజుఃసామాధర్వాణి ఛందాంసి,
పరబ్రహ్మస్వరూపిణీ గాయత్రీ దేవతా,
భూర్బీజం, భువః శక్తిః, స్వాహా కీలకం,

శ్రీగాయత్రీప్రీత్యర్థే జపే వినియోగః !! ఓం భూర్భువః స్వః తత్సవితురితి హృదయాయ నమః !

ఓం భూర్భువః స్వః వరేణ్యమితి శిరసే స్వాహా ! ఓం భూర్భువః స్వః భర్గో దేవస్యేతి శిఖాయై వషట్ ! ఓం భూర్భువః స్వః ధీమహీతి కవచాయ హుం ! ఓం భూర్భువః స్వః ధియో యో నః ఇతి నేత్రత్రయాయ వౌషట్ ! ఓం భూర్భువః స్వః ప్రచోదయాదితి అస్త్రాయ ఫట్ !!

13) వర్ణాస్త్రాం కుండికాహస్తాం శుద్ధనిర్మలజ్యోతిషీమ్మ్ ! సర్వతత్త్వమయీం వందే గాయత్రీం వేదమాతరం !!

. అథ ధ్యానం:-

14) ముక్తా విద్రుమహేమనీలధవలచ్ఛాయైర్ముఖైస్త్రీక్షణై- ర్యుక్తామిందు నిబద్ధరత్నముకుటాం తత్త్వార్థ వర్ణాత్మికాం ! గాయత్రీం వరదాభయాంకుశ కశాం శూలం కపాలం గుణం శంఖం చక్రమథారవిందయుగలం హస్తైర్వహంతీం భజే !!

15) ఓం గాయత్రీ పూర్వతః పాతు సావిత్రీ పాతు దక్షిణే ! బ్రహ్మవిద్యా చ మే పశ్చాదుత్తరే మాం సరస్వతీ !!

16) పావకీ మే దిశం రక్షేత్పావకోజ్జ్వలశాలినీ ! యాతుధానీం దిశం రక్షేద్యాతు ధానగణార్దినీ !!

17) పావమానీం దిశం రక్షేత్పవమాన విలాసినీ ! దిశం రౌద్రీమవతు మే రుద్రాణీ రుద్రరూపిణీ !!

18) ఊర్ధ్వం బ్రహ్మాణీ మే రక్షేదధస్తాద్వైష్ణవీ తథా ! ఏవం దశ దిశో రక్షేత్ సర్వతో భువనేశ్వరీ !!

19) బ్రహ్మాస్త్ర స్మరణాదేవ వాచాం సిద్ధిః ప్రజాయతే ! బ్రహ్మదండశ్చ మే పాతు సర్వశస్త్రాస్త్ర భక్షక్రః !!

20) బ్రహ్మశీర్షస్తథా పాతు శత్రూణాం వధకారకః ! సప్త వ్యాహృతయః పాంతు సర్వదా బిందుసంయుతాః !!

21) వేదమాతా చ మాం పాతు సరహస్యా సదైవతా ! దేవీసూక్తం సదా పాతు సహస్రాక్షర దేవతా !!

22) చతుఃషష్టికలా విద్యా దివ్యాద్యా పాతు దేవతా ! బీజశక్తిశ్చ మే పాతు పాతు విక్రమ దేవతా !!

23) తత్పదం పాతు మే పాదౌ జంఘే మే సవితుఃపదం ! వరేణ్యం కటిదేశం తు నాభిం భర్గస్తథైవ చ !!

24)దేవస్య మే తు హృదయం ధీమహీతి గలం తథా ! ధియో మే పాతు జిహ్వాయాం యఃపదం పాతు లోచనే !!

25) లలాటే నః పదం పాతు మూర్ధానం మే ప్రచోదయాత్ ! తద్వర్ణః పాతు మూర్ధానం సకారః పాతు భాలకం !!

26) చక్షుషీ మే వికారస్తు శ్రోత్రం రక్షేత్తు కారకః ! నాసాపుటేర్వకారో మే రేకారస్తు కపోలయోః !!

27) ణికారస్త్వ ధరోష్ఠే చ యకారస్తూర్ధ్వ ఓష్ఠకే ! ఆత్యమధ్యే భకారస్తు గోకారస్తు కపోలయోః !!

28) దేకారః కంఠదేశే చ వకారః స్కంధదేశయోః ! స్యకారో దక్షిణం హస్తం ధీకారో వామహస్తకం !!

29) మకారో హృదయం రక్షేద్ధికారో జఠరం తథా ! ధికారో నాభిదేశం తు యోకారస్తు కటిద్వయం !!

30) గుహ్యం రక్షతు యోకార ఊరూ మే నః పదాక్షరం ! ప్రకారో జానునీ రక్షేచ్చోకారో జంఘదేశయోః !!

31) దకారో గుల్భదేశం తు యాత్కారః పాదయుగ్మకం ! జాతవేదేతి గాయత్రీ త్ర్యంబకేతి దశాక్షరా !!

32) సర్వతః సర్వదా పాతు ఆపోజ్యోతీతి షోడశీ ! ఇదం తు కవచం దివ్యం బాధాశతవినాశకం !!

33) చతుఃషష్ఠి కలావిద్యాసకలైశ్వర్యసిద్ధిదం ! జపారంభే చ హృదయం జపాంతే కవచం పఠేత్ !!

34) స్త్రీగోబ్రాహ్మణ మిత్రాదిద్రోహాద్యఖిలపాతకైః ! ముచ్యతే సర్వపాపేభ్యః పరం బ్రహ్మాధిగచ్ఛతి !!

35) పుష్పాంజలిం చ గాయత్ర్యా మూలేనైవ పఠేత్సకృత్ ! శతసాహస్రవర్షాణాం పూజాయాః ఫలమాప్నుయాత్ !!

36) భూర్జపత్రే లిఖిత్వైతత్ స్వకంఠే ధారయేద్యది ! శిఖాయాం దక్షిణే బాహౌ కంఠే వా ధారయేద్బుధః !!

37) త్రైలోక్యం క్షోభయేత్సర్వం త్రైలోక్యం దహతి క్షణాత్ ! పుత్రవాన్ ధనవాన్ శ్రీమాన్నానావిద్యానిధిర్భవేత్ !!

38) బ్రహ్మాస్త్రాదీని సర్వాణి తదంగ స్పర్శనాత్తతః ! భవంతి తస్య తుచ్ఛని కిమన్యత్కథయామి తే !!

39) అభిమంత్రిత గాయత్రీకవచం మానసం పఠేత్ ! తజ్జలం పిబతో నిత్యం పురశ్చర్యాఫలం భవేత్ !!

40)లఘుసామాన్యకం మంత్రం, మహామంత్రం తథైవ చ ! యో వేత్తి ధారణాం యుంజన్, జీవన్ముక్తః స ఉచ్యతే !!

41)సప్తావ్యాహృతివిప్రేంద్ర సప్తావస్థాః ప్రకీర్తితాః ! సప్తజీవశతా నిత్యం వ్యాహృతీ అగ్నిరూపిణీ !!

42) ప్రణవే నిత్యయుక్తస్య వ్యాహృతీషు చ సప్తసు ! సర్వేషామేవ పాపానాం సంకరే సముపస్థితే !!

43) శతం సహస్రమభ్యర్చ్య గాయత్రీ పావనం మహత్ ! దశశతమష్టోత్తరశతం గాయత్రీ పావనం మహత్ !!

44) భక్తియుక్తో భవేద్విప్రః సంధ్యాకర్మ సమాచరేత్ ! కాలే కాలే ప్రకర్తవ్యం సిద్ధిర్భవతి నాన్యథా !!

45) ప్రణవం పూర్వముద్ధృత్య భూర్భువస్వస్తథైవ చ ! తుర్యం సహైవ గయత్రీజప ఏవముదాహృతం !!

46) తురీయ పాదముత్సృజ్య గాయత్రీం చ జపేద్ద్విజః ! స మూఢో నరకం యాతి కాలసూత్రమధోగతిః !!

47) మంత్రాదౌ జననం ప్రోక్తం మత్రాంతే మృతసూత్రకం ! ఉభయోర్దోషనిర్ముక్తం గాయత్రీ సఫలా భవేత్ !!

48) మత్రాదౌ పాశబీజం చ మంత్రాంతే కుశబీజకం ! మంత్రమధ్యే తు యా మాయా గాయత్రీ సఫలా భవేత్ !!

49) వాచికస్త్వహ మేవ స్యాదుపాంశు శతముచ్యతే ! సహస్రం మానసం ప్రోక్తం త్రివిధం జపలక్షణం !!

50)అక్షమాలాం చ ముద్రాం చ గురోరపి న దర్శయేత్ ! జపం చాక్షస్వరూభేణానామికామధ్యపర్వణి !!

51)అనామా మధ్యయా హీనా కనిష్ఠాదిక్రమేణ తు ! తర్జనీమూలపర్యంతం గాయత్రీ జపలక్షణం !!

52) పర్వభిస్తు జపేదేవమన్యత్ర నియమః స్మృతః ! గాయత్రీ వేదమూలత్వాద్వేదః పర్వసు గీయతే !!

53) దశభిర్జన్మ జనితం శతేనైవ పురా కృతం ! త్రియుగం తు సహస్రాణి గాయత్రీ హంతి కిల్బిషం !!

54) ప్రాతఃకాలేయు కర్తవ్యం సిద్ధిం విప్రో య ఇచ్ఛతి ! నాదాలయే సమాధిశ్చ సంధ్యాయాం సముపాసతే !!

55) అంగుల్యగ్రేణ యజ్జప్తం యజ్జప్తం మేరులంఘనే ! అసంఖ్యయా చ యజ్జప్తం తజ్జప్తం నిష్ఫలం భవేత్ !!

56) వినా వస్త్రం ప్రకుర్వీత గాయత్రీ నిష్ఫలా భవేత్ ! వస్త్రపుచ్ఛం న జానాతి వృథా తస్య పరిశ్రమః !!

57) గాయత్రీం తు పరిత్యజ్య అన్యమంత్రముపాసతే ! సిద్ధాన్నం చ పరిత్యజ్య భిక్షామటతి దుర్మతిః !!

58) ఋషిశ్ఛందో దేవతాఖ్యా బీజం శక్తిశ్చ కీలకం ! నియోగం న చ జానాతి గాయత్రీ నిష్ఫలా భవేత్ !!

59)వర్ణముద్రాధ్యానపదమావాహనవిసర్జనం ! దీపం చక్రం న జానాతి గాయత్రీ నిషఫలా భవేత్ !!

60) శక్తిర్న్యాస స్తథా స్థానం మంత్రసంబోధనం పరం ! త్రివిధం యో న జానాతి గాయత్రీ తస్య నిష్ఫలా !!

61) పంచోపచార కాంశ్చైవ హోమద్రవ్యం తథైవ చ ! పంచాంగం చ వినా నిత్యం గాయత్రీ నిష్ఫలా భవేత్ !!

62) మంత్రసిద్ధిర్భవే జ్జాతు విశ్వామిత్రేణ భాషిం ! వ్యాసో వాచస్పతిర్జీవస్తుతా దేవీ తపఃస్మృతౌ!!

63) సహస్రజప్తా సా దేవీ హ్యుప పాతకనాశినీ ! లక్షజాప్యే తథా తచ్చ మహా పాతక నాశినీ ! కోటిజాప్యేన రాజేంద్ర యదిచ్ఛతి తదాప్నుయాత్ !!

64)న దేయం పరశిష్యేభ్యో హ్యభక్తేభ్యో విశేషతః ! శిష్యేభ్యో భక్తియుక్తేభ్యో హ్యన్యథా మృత్యు మాప్నుయాత్ !!

ఇతి శ్రీమద్వసిష్ఠ సంహితోక్తం శ్రీ గాయత్రీ కవచం సంపూర్ణం.

🌹 🌹 🌹 🌹 🌹

08 Oct 2021

దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 2. బ్రహ్మచారిణి Devi Navratras - Nava Durgas Sadhana - 2. Brahmacharini

🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 2. బ్రహ్మచారిణి 🌹

📚 . ప్రసాద్ భరద్వాజ

🌷. ప్రార్ధనా శ్లోకము :

దధానా కరపద్మాభ్యాం అక్షమాలాకమండలూ ।
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ॥

🌷. అలంకారము : గాయత్రీ దేవి - పసుపు రంగు

🌷. నివేదనం : పులిహోర

🌷. మహిమ :

ఒక చేత జపమాల, మరో చేత జలపాత్ర ధరించిన బ్రహ్మచారిణీ మాత సాధకునిలో సదాచారాన్ని ప్రవేశపెడుతుంది. ఈమె నామస్మరణతో కర్మబంధాలు చెదిరిపోయి మోక్షం సంప్రాప్తిస్తుంది.

శివుణ్ణి పతిగా పొందేందుకు తపించిపోయిన రాజకన్య . ఈమెను ఆరాధిస్తే మనస్సుకు ఏకాగ్రత కలుగుతుంది .

దుర్గామాతయొక్క నవశక్తులలో రెండవది ‘బ్రహ్మచారిణి’ స్వరూపము. ఈ సందర్భంలో ‘బ్రహ్మ’ అనగా తపస్సు. ‘బ్రహ్మచారిణి’ అనగా తపమాచరించునది. ‘వేదస్తత్త్వం తపోబ్రహ్మ’ – ‘బ్రహ్మ’ యనగా వేదము, తత్త్వము, తపస్సు. బ్రహ్మచారిణీదేవి స్వరూపము పూర్తిగా జ్యోతిర్మయము, మిక్కిలి శుభంకరమూ, భవ్యము. ఈ దేవి కుడిచేతిలో జపమాలను, ఎడమ చేతిలో కమండలాన్నీ ధరించి ఉంటుంది.

🌷. చరిత్ర :

హిమవంతుని కూతురైన పార్వతియే ఈ బ్రహ్మచారిణీ దేవి. ఈమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందటానికి నారదుడి ఉపదేశాన్ని అనుసరించి ఘోరతపము ఆచరిస్తుంది. ఈ కఠిన తపశ్చర్య కారణానే ఈమెకు ‘తపశ్చారిణి’ అనగా ‘బ్రహ్మచారిణీ’ అనే పేరు స్థిరపడింది. తపశ్చర్యకాలములో ఈమె కేవలము ఫల, కంద మూలములను మాత్రమే ఆరగిస్తూ లెక్కలేనన్ని సంవత్సరాలు గడుపుతుంది. కేవలము పచ్చికాయగూరలనే తింటూ మరికొన్ని సంవత్సరాలూ, కఠినోపవాసములతో ఎలాంటి ఆచ్ఛాదనమూ లేకుండా ఎండలలో ఎండుతూ, వానలలో తడుస్తూ కొంత కాలంపాటూ తపస్సును ఆచరిస్తుంది. ఇలాంటి కఠినతరమైన తపస్సును ఆచరించిన తరువాత, మరింకెన్నో సంవత్సరాలపాటు నేలపై రాలిన ఎండుటాకులను మాత్రమే స్వీకరిస్తూ పరమేశ్వరుణ్ణి అహర్నిశలూ ఆరాధిస్తుంది. మెల్లిగా ఎండుటాకులనుకూడా తినటం మానివేసి ‘అపర్ణ’యై చాలాకాలంపాటు ఆహారమూ, నీళ్ళు కూడా ముట్టకుండా ఘోరమైన తపస్సును ఆచరిస్తుంది.

ఇలా చాలాకాలంపాటు కఠినమైన తపస్సును కొనసాగించటం కారణాన, బ్రహ్మచారిణిదేవి శరీరము పూర్తిగా కృశించి పోతుంది. ఈవిడ స్థితిని చూసి తల్లియైన మేనాదేవి ఎంతగానో దుఃఖిస్తుంది. ఈమెను ఈ కఠిన తపస్సునుండి మరలించడానికి తల్లి ‘ఉ మా’ – ‘బిడ్డా! వలదు, వలదు’ అని పలికినందున, బ్రహ్మచారిణిదేవి పేరు ‘ఉమా’ అని ప్రసిద్ధి కెక్కింది.

బ్రహ్మచారిణీదేవి చేసిన ఘోరతపస్సు కారణాన, ముల్లోకాలలో హాహాకారాలు చెలరేగుతాయి. దేవతలూ, ఋషులూ, సిద్ధులూ, మునులూ మొదలైనవారందరూ ఈవిడ తపస్సు కనీవినీ యెరుగనటువంటి పుణ్యకార్యమని పలుకుతూ ఈవిడను కొనియాడతారు. చివరికి పితామహుడైన బ్రహ్మదేవుడు, అశరీరవాణి ద్వారా ఈమెను సంబోధిస్తూ ప్రసన్నమైన స్వరంలో ఇలా పలుకుతారు “దేవీ! ఇట్టి కఠోర తపస్సును ఇంతవరకునూ ఎవ్వర్రునూ ఆచరింపలేదు. ఇది నీకే సాధ్యమైనది. అలౌకికమైన నీ తపశ్చర్య సర్వత్ర శ్లాఘించబడుచున్నది. నీ మనోవాంఛ సంపూర్ణముగా నెరవేరును. చంద్రమౌళియైన పరమేశ్వరుడు అవశ్యముగా నీకు పతియగును. ఇక నీవు తపస్సును విరమించి ఇంటికి మరలుము. త్వరలోనే నీ తండ్రి నిన్ను ఇంటికి తీసికొనిపోవుటకై వచ్చును.“

దుర్గామాతయొక్క ఈ రెండవ స్వరూపము భక్తులకూ, సిద్ధులకూ అనంతఫలప్రదము. ఈమెను ఉపాసించటంవల్ల మానవులలో తపస్సూ, త్యాగమూ, వైరాగ్యమూ, సదాచారమూ, సంయమమూ వృద్ధి చెందుతాయి. జీవితంలో ఎలాంటి ఒడుదొడుకులు ఎదురైనా దేవి అనుగ్రహముతో వారి మనస్సులు కర్తవ్యమార్గం నుండి మరలవు. లోకమాత అయిన బ్రహ్మచారిణీదేవి కృపవలన ఉపాసకులకు సర్వత్ర సిద్ధీ, విజయాలూ ప్రాప్తిస్తాయి. దుర్గానవరాత్రి పూజలలో రెండవరోజున ఈమె స్వరూపము ఉపాసించబడుతుంది. ఈ రోజు సాధకుని మనస్సు స్వాధిష్ఠాన చక్రములో స్థిరమవుతుంది. ఈ చక్రంలో స్థిరమైన మనస్సుగల యోగి, ఈమె కృపకు పాత్రుడగుతాడు. అతనికి ఈమె యెడల భక్తి ప్రపత్తులు దృఢమవుతాయి.

🌹 🌹 🌹 🌹 🌹

08 Oct 2021

దేవీ నవరాత్రులు - నవ దుర్గలు - 1. శైలపుత్రి Devi Navratras - Nava Durgas - 1. Shailputri

🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు - 1. శైలపుత్రి🌹

📚 . ప్రసాద్ భరద్వాజ

🌷. ప్రార్ధనా శ్లోకము :

వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరామ్ ।
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్ ॥

🌷. అలంకారము : బాలా త్రిపుర సుందరి - నీలి రంగు

🌷 నివేదనం : ఉప్పు పొంగల్

🌷. మహిమ :

కుడిచేతిలో త్రిశూలాన్ని, వామహస్తంలో పద్మాన్ని, వృషభవాహినిగా అవతరించిన శైలపుత్రిని స్మరించినంతనే, శ్రవణం చేసినంత మాత్రాన విజయోత్సాహం కలుగుతుంది.

దుర్గామాత మొదటి స్వరూపము ‘శైలపుత్రి’ నామముతో ప్రసిద్ధికెక్కినది. పర్వత రాజైన హిమవంతుని ఇంట పుత్రికయై అవతరించినందున ఆమెకు ‘శైలపుత్రి’ అనే నామము ఏర్పడినది.

వృషభవాహననారూఢయైన ఈ మాత కుడి చేతిలో త్రిశూలమూ, ఎడమచేతిలో కమలమూ విరాజిల్లుతుంటాయి. ఈ అవతారమే నవదుర్గలలో మొదటిది.

నవదుర్గలలో మొదటి అవతారమైన ‘శైలపుత్రి’ యొక్క మహిమలూ, శక్తులూ అనంతములు. మొదటి రోజున యోగులు ఉపాసన ద్వారా తమ మనస్సులను మూలాధార చక్రంలో స్థిరపరుచుకుంటారు. దీనితోనే వారి యోగ సాధనలు ఆరంభమవుతాయి.

🌷. చరిత్ర :

పూర్వజన్మలో ఈమె దక్ష ప్రజాపతికి పుత్రిక – దాక్షాయని. అ జన్మలో ఈమె పేరు సతీదేవి. ఈమె పరమేశ్వరుని పరిణయమాడినది. ఒకసారి దక్షుడొక మహాయజ్ఞమును ఆచరిస్తాడు. దేవతలు తమతమ యజ్ఞభాగములను స్వీకరించటానికై దక్షుడు వారిని ఆహ్వానిస్తాడు. కానీ పరమశివుని మాత్రము ఆ యజ్ఞానికి పిలువడు. తన తండ్రి ఒక మహాయజ్ఞమును సంకల్పించిన విషయం ఆమెకు తెలుస్తుంది. ఆ యజ్ఞాన్ని వీక్షించటానికై ఆమె మసస్సు ఉబలాటపడుతుంది. అప్పుడు ఆమె పరమేశ్వరునికి తన కోరికను తెలియజేస్తుంది. బాగా ఆలోచించి పరమేశ్వరుడు “కారణము ఏమోగానీ, దక్షుడు మనపై కినుకుబూనినాడు. అతడు తన యజ్ఞమునకు దేవతలందరినీ ఆహ్వానించినాడు. యజ్ఞభాగములనుగూడ వారికి సమర్పించుచున్నాడు. కానీ ఉద్దేశ్యపూర్వకముగానే మనలను పిలువలేదు. కనీసము సమాచారమునైననూ తెలుపలేదు. ఇట్టి పరిస్థితిలో నీవు అచటికి వెళ్ళుట ఏ విధముగను మంచిదిగాదు” అని హితవు బోధించారు. శంకరుని ఈ హితవచనము ఆమె చెవికెక్కలేదు. ఈ యజ్ఞమిషతోనైనా అక్కడికి వెళ్ళి తన తల్లినీ, తోబుట్టువులనూ చూడవచ్చునన్న కోరిక ప్రబలంగా ఉండటంతో అనుమతికై ఆమె పట్టుబడుతుంది. ఆమె పట్టుదలను చూసి, చివరకు శంకరుడు అనుమతిస్తారు.

సతీదేవి తన తండ్రియింటికి చేరినప్పుడు అక్కడివారెవ్వరూ ఆమెతో మాట్లాడరు, ఆదరించరు. అందరూ ముఖాలను పక్కకు తిప్పుకొంటారు. తల్లి మాత్రము ఆమెను ప్రేమతో కౌగిలించుకొంటుంది. తోబుట్టువుల పలుకులలో వ్యంగ్యం, పరిహాసమూ నిండి ఉంటాయి. తనవారి ప్రవర్తనకు ఆమె మనస్సు కలత చెందుతుంది. అందరిలోనూ శంకరుని పట్ల నిరాదరణభావమే ఉండటం ఆమె గమనిస్తుంది. తండ్రియైన దక్షుడు ఆమెతో అవమానకరంగా మాట్లాడతాడు. ఇదంతా అనుభవించిన పిమ్మట, సతీదేవి హృదయము క్షోభతో, గ్లానితో, క్రోధముతో ఉడికిపోతుంది. ‘పరమేశ్వరుని మాటను పాటింపక నేను ఇచ్చటికివచ్చి పెద్ద పొరబాటే చేసితిని‘ అని ఆమె భావిస్తుంది.

తన పతియైన పరమేశ్వరునికి జరిగిన ఈ అవమానమును ఆమె సహించలేక పోతుంది. వెంటనే ఆమె తన రూపమును అక్కడికక్కడే యోగాగ్నిలో భస్మము గావిస్తుంది. భరింపలేని ఈ దారుణదుఃఖకరమైన సంఘటనను గురించి విని, పరమశివుడు మిక్కిలి క్రోధితుడవుతాడు. ఆయన తన ప్రమథగణాలను పంపి దక్షుని యజ్ఞాన్ని పూర్తిగా ద్వంసం చేయిస్తారు.

సతీదేవి యోగాగ్నిలో తన తనువును చాలించి, మరుజన్మలో శైలరాజైన హిమవంతునికి పుత్రికగా అవతరిస్తుంది. అప్పుడామె ‘శైలపుత్రి’గా ప్రసిద్ధికెక్కుతుంది. పార్వతి, హైమవతి అన్నవి కూడా ఆమె పేర్లే. ఉపనిషత్తులోని ఒక కథను అనుసరించి, ఆమె హైమవతీ రూపంలో దేవతల గర్వాన్ని ఆణచివేస్తుంది.

‘శైలపుత్రి’ అవతారములో ఆమె పరమేశ్వరుణ్ణే పరిణయమాడుతుంది. పూర్వజన్మలో లాగానే ఈ అవతారంలో కూడా శంకరునికి ‘అర్ధాంగి’ అవుతుంది.

నవరాత్రి ఉత్సవములలో మొదటిరోజున ఈ దేవికై పూజలూ, ఉపవాసాలూ జరుపబడుతాయి.

🌹 🌹 🌹 🌹 🌹

07 Oct 2021

శ్రీ దుర్గా నవరాత్రి వ్రతం - సాధనాపర విశిష్టత Sri Durga Navratri Vrat - Importance of Sadhna

🌹. శ్రీ దుర్గా నవరాత్రి వ్రతం - సాధనాపర విశిష్టత 🌹

📚 . ప్రసాద్ భరద్వాజ

ప్రకృతిలోని చైతన్యశక్తి. ప్రకృతి స్వరూపాల నన్నింటినీ జీవుడు తన మనస్సులో లయం చేసి, ఒకే ఒక చైతన్య పర తత్త్వ శక్తియందు నిలిపితే జన్మసాఫల్యాన్ని పొందుతాడు. తనలో ఉండే ఆ చైతన్య శక్తి సర్వజీవులయందు ఉంటుందనే సత్యాన్ని గుర్తించి, చైతన్యాద్వైత శక్తిని అర్థం చేసికొంటే దివ్యానుభూతిని పొందుతాడు.

‘‘సర్వరోగోపశమనం సర్వోపద్రవ నాశనం
శాన్తిదం సర్వారిష్టానాం నవరాత్ర వ్రతం శుభమ్’’

సర్వ రోగములను, సర్వ ఉపద్రవములను పోగొట్టి, సర్వారిష్టాల్ని పారద్రోలి సుఖశాంతుల్ని కటాక్షించేది- నవరాత్రి వ్రతం అని పేర్కొన్నది స్కాంధ పురాణం.

‘నవ’ అంటే తొమ్మిదని, క్రొత్త అని సామాన్యార్థాలు. కానీ, నవ అంటే పరమేశ్వరుడని, ‘రాత్రి’ అంటే పరమేశ్వరి అని నిర్ణయ సింధువు తెలుపుతోంది.

కనుక, నవరాత్రి వ్రతమంటే- పార్వతీ పరమేశ్వరుల, శివశక్తుల, ప్రకృతీ పురుషుల ఆరాధన లేక వ్రతము, పూజ అని అర్థము. నవరాత్రి వ్రతమంటే తొమ్మిది రాత్రులు చేయు వ్రతమని చెపుతారు. ‘‘సూయతే స్తూయతే ఇతి నవః’’ అనగా నవ శబ్దమునకు స్తుతిం పబడుచున్నవాడని అర్థము. పరమాత్మ ‘నవ’ స్వరూపుడు. శబ్దరూపమైన వేదం- ప్రకృష్టమైన ‘నవ్య స్వరూపం’. అదే ప్రణవ స్వరూపం. ‘‘నవో నవో భవతి జాయ మానః’’ పరమాత్మ నిత్య నూతనుడు. అందరి చేత స్తోత్రింపబడుచున్నవాడు. శివశక్తులకు భేదం లేదు. అం దుకే జగన్మాతకు ‘శివా’ అనే నామం కూడా ఉంది.

జగజ్జనని- ‘రాత్రి’ రూపిణి. పరమేశ్వరుడు-ప గలు. జగన్మాత ఆరాధనే- రాత్రి వ్రతం. రాత్రి దేవియే- మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి వంటి రూపనామములతో పూజింపబడుతోంది. అందుకే మాతకు ‘కాళరాత్రి’ అని పేరు. నవ అహోరాత్ర దీక్షగా రాత్రి, పగలు తొమ్మిది రోజులు చేస్తారు. ‘రాత్రి శబ్దస్య తిథి వాచకత్వాత్’ అనే దాన్ని బట్టి రాత్రి అనగా తిథి అని అర్థము తీసికొని తొమ్మిది తిథులు అనగా పాడ్యమి మొదలు నవమి వరకు శ్రీదేవికి పూజ చేస్తారు.

‘పాడ్యమి’ అంటే ‘బుద్ధి’ అని చెప్పబడింది. మనుష్యుల బుద్ధియే శారదాదేవి. పాడ్యమి నుండి శారదా దేవిని ఆరాధిస్తే మంచి బుద్ధిని ప్రసాదిస్తుంది. సర్వ శుభములను చేకూర్చుతుంది. మనలో ఉన్న ఉత్సాహాన్ని పైకి వ్యక్తీకరించటమే ‘ఉత్సవం’ అంటారు. ఇది పెద్ద ఉత్సవం- మహోత్సవం. ఇది- దేవీ శరన్నవరాత్రి పూజా మహోత్సవాల అంతరార్థం.

పసుపు, కుంకుమ, పూలు, పరిమళ సుగంధ ద్రవ్యములు మొదలైన మంగళకరమైన వస్తువుల యందు, ఆవు నేతి యందు ప్రజ్వలిస్తూ ప్రకాశించే ‘జ్యోతి’ స్వరూపంలోనూ, గో మాత యందు, ముత్తయదువల యందు, త్యాగబుద్ధి కలవారి యందు భాసిల్లుతుంది- మంగళగౌరీ దేవి.సర్వ కార్య దిగ్విజయమునకు మంగళగౌరీ పూజ చెప్పబడింది. అందుకే వివాహంలో నూతన వధువు చేత గౌరీ పూజ చేయిస్తారు.

త్రిపురాసుర సంహారానికి బయలుదేరే ముందు గౌరీదేవిని అర్చించి విజయాన్ని పొందాడు పరమ శివుడు. ‘గౌరీ కల్యాణం వైభోగమే’ అంటూ అనాదిగా పెద్ద ముత్తయదువలు శుభములు పల్కుతూ కల్యాణ సమయంలో గానం చేయటం మన సంప్రదాయం.

హిమాలయ పర్వత శ్రేణిలో తెల్లని కాంతితో ఆవిర్భవించిన చల్లని తల్లి గౌరీదేవి. ‘గౌరీ గిరి రాజ కుమారీ గాన వన మయూరీ గంభీర కౌమారీ...’ అంటూ ‘గౌరీ’ రాగంలో, ముత్తుస్వామి దీక్షితులు గానం చేసిన కీర్తన నవరాత్రి పూజలో మొదటి రోజు అర్చనకు స్ఫూర్తినిస్తుంది.

చలించని మనస్సు, భ్రమించని దృష్టివలన ఏకాగ్రత సాధ్యమవుతుంది. నిష్కామబుద్ధితో తోటివారికి తోడ్పడుతూ, సమస్త జీవులపట్ల దయ, ప్రేమ, కరుణలను చూపిస్తూ, విద్యుక్త్ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ విశ్వకల్యాణాన్ని కాంక్షిస్తే- ఏకాగ్రత సాధ్యమవుతుంది. అదే ‘ధ్యానం’. ధ్యానయోగాన్ని ప్రసాదించేది - జగన్మాత శరన్నవరాత్రి పూజ.

యాదేవి సర్వ భూతేషు మాతృరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై సమస్తస్యై నమో నమః

ఆర్తితో అమ్మా అని పిలిస్తే నేనున్నానంటూ ఆప్యాయంగా అక్కు జేర్చుకునే ఆ తల్లికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం... త్రికరణ శుద్ధిగా మనలను మనం అర్పించుకోవడం తప్ప. ఆ జగన్మాతకు సేవచేసే భాగ్యం నవరాత్రుల రూపంలో లభించడం మన జన్మకు లభించిన అద్భుత వరం.

నవరాత్రులలో దేవిని నవ మూర్తులుగానూ, నవశక్తులుగానూ ఆరాధిస్తారు. అయినా ఏ రోజు ఏ స్వరూపం అనేది నిర్ధిష్ట నిర్ణయంగా కనిపించదు. వరుస క్రమంలో మార్పులు ఉంటాయి. తిథి, నక్షత్రాలను బట్టి ఆనాటి రూపవిశేషం ఉంటుంది. ఆ తల్లి రూపాలు ప్రాంతీయ ఆచరాలను బట్టి వేరువేరుగా ఉంటాయి. అంటే శృంగేరి పీఠంలో, విజయవాడ కనకదుర్గ దేవి సన్నిధిలో దసరా ఉత్సవాలు, అలాగే తిరుపతి శ్రీవారి సన్నిధిలో బ్రహ్మూెత్సవాలు జరుగుతుంటాయి కాబట్టి, ఆయా ప్రాంతాలవారీగా అమ్మవారి రూపాలు మారుతుంటాయి.

🌻. నవదుర్గలు :-

హిందూ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతి అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించినదని, ప్రతి అవతారం నుండి మరొక రెండు రూపాలు వెలువడినాయని కథనం. ఇలా 3 + 6 = 9 స్వరూపిణులుగా, అనగా నవ దుర్గలుగా, దుర్గను పూజిస్తారు.

🌻. ధ్యానం :-

యస్యాం బింబిత మాత్మ తత్వమగమత్ సర్వేశ్వరాఖ్యాం శుభాం యా విష్వగ్జగదాత్మనా పరిణతా యా నామరూపాశ్రయా యా మూలప్రకృతి ర్గుణ త్రయవతీ యానంత శక్తి స్స్వయం నిత్యావృత్త నవాత్మికా జయతు సా దుర్గా నవాకారిణీ

ఎవతె యందు ప్రతిబింబించిన ఆత్మతత్వం సర్వేశ్వరుడనే శుభనామాన్ని పొందిందో, ఎవతె తనే జగదాకారంగా పరిణామం చెందిందో, ఎవతె నామరూపాలకు ఆశ్రయమో, ఎవతె మూడు గుణాలు గవ మూల ప్రకృతియో, ఎవతెయే స్వయంగా అనంత రూపాలైన శక్తియో, ఎవతె నిత్యమూ మళ్ళీ మళ్ళీ ఆవృత్తమయ్యే తొమ్మిది రూపాలు (నూతన రూపాలు) కలదియో, అట్టి నవరూపాలుగా ఉన్న దుర్గాదేవి జయుంచుగాక.

నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసినీం
నవరూప ధరాం శక్తిం, నవదుర్గాముపాశ్రయే

నవరాత్రులలో ఆరాధింపదగినది, (శ్రీ చక్రం లోని) నవచక్రాలలో నివసించేది, శక్తి రూపిణి, అయిన నవదుర్గను ఆశ్రయిస్తున్నాను. దుర్గాదేవి గురించి మార్కండేయ మహర్షి బ్రహ్మగారిని అడిగితే వచ్చిన సంభాషణ లోంచి దుర్గాదేవి వివరాలు మనకు వరాహ పురాణాం నుంచి ఈ క్రింది విధంగా తెలుస్తుంది.

ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ |
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ ||
పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ |
సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ ||
నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః |
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ||

ఇలా దుర్గాదేవి తొమ్మిది రూపాలతో విరాజిల్లుతుంది.

🌻 నవ దుర్గలు :-

సప్తశతీ మహా మంత్రానికి అంగభూతమైన దేవీకవచంలోనవదుర్గలు అనే పదం స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ ఇలా ఉంది.

ప్రథమం శైల పుత్రీతి
ద్వితీయం బ్రహ్మచారిణీ
తృతీయం చంద్ర ఘంటేతి
కూష్మాండేతి చతుర్థకం
పంచమం స్కందమాతేతి
షష్ఠం కాత్యాయనీతి చ
సప్తమం కాలరాత్రీతి
మహాగౌరీతి చాష్టమం

నవమం సిద్ధిదా ప్రోక్తా నవదుర్గా ప్రకీర్తితా ఇక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా 

ఈ 9 నామాలను సాక్షాత్తు బ్రహ్మ దేవుడే చెప్పాడని వుంది.

మహా శక్తిస్వరూపిణి అయిన దుర్గా మాతని మనం అనేక రూపాలాలో కొలుచుకుంటాము. ఐతే వాటిలో ముఖ్యమైనవి 9 అవతారాలు. వారినే మనం నవదుర్గలని అంటుంటాం.

దుర్గా మాత ముఖ్యమైన అవతారాలు మూడు. మాహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి. వీరు శ్రీమహావిష్ణువు, పరబ్రహ్మ, పరమశివుని అర్ధాంగినులుగా మనకు తెలుసు. వీరిలో ఒక్కొక్కరూ తిరిగి 3 అవతారాలు పొందారు. ఆ విధంగా నవదుర్గలుగా ప్రసిద్ధి చెందారు.

🌻 1. శైలపుత్రి :- బాలా త్రిపుర సుందరి

నవదుర్గలలో ప్రధమమైన శైలపుత్రి హిమవంతుని పుత్రిక. ఈమెయే వెనుకజన్మలో దక్షప్రజాపతి కుమార్తె సతి. హిమవంతుడు పర్వతరాజు. కనుక ఈమెకు శైలపుత్రి అనే పేరు కలిగింది. ఈమె వాహనం నంది. ఒక చేతిలో త్రిశూలం రెండో చేతిలో కలువ, నుదుటిన చంద్ర వంక ధరించిన ఈమె మహిమలు అపారం. నవరాత్రి సంధర్భంగా మొదటిరోజున ఈమె పూజ జరుగుతుంది.

🌻 2. బ్రహ్మచారిణి :- గాయత్రీ దేవి

దుర్గామాత అవతారాలలో రెండవది అయిన బ్రహ్మచారిణి, తపస్సుకు ప్రతీక. ఇక్కడ బ్రహ్మ అనే పదానికి తపస్సు అని అర్థం. వేదము, తత్వము, తపము అనే పదాలు బ్రహ్మ అనే పదానికి పర్యాయ పదాలుగా వాడుతారు. ఒక చేతిలో కమండలము, మరొక చేతిలో తులసి మాల ధరించే ఈమెను సకల సౌభాగ్యదాయనిగా పూజిస్తారు.

🌻 3. చంద్రఘంట :- అన్నపూర్ణ దేవి

దుర్గామాత మూడవ అవతారమైన చంద్రఘంట మాత శిరసున అర్ధచంద్రుడిని గంటరూపంలో ధరించింది. అందువలననే ఆమెకి ఈ నామధేయం కలిగింది. సింహవాహిని ఐన ఈమె బంగారు దేహఛాయ కలిగి, పది హస్తాలతో ఉంటుంది. ఈమె పది హస్తాలలో శంఖ, ఖడ్గ, గద, కమండలము, విల్లు, కమలం మొదలైనవి కలిగి చూడటానికి ఎంతో మనోహరంగా ఉంటుంది.

🌻 4. కూష్మాండ :- శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి

సూర్యలోక నివాసిని అయిన కూష్మాండదేవి, సూర్యకాంతిని పోలిన దేహఛాయతో ఉంటుంది. ఈమె దేహఛ్ఛయతో దశ దిశంతాలు వెలుగు పొందుతాయి. సింహవాహిని ఐన ఈ దేవికి ఎనిమిది హస్తములలో కమండలము, విల్లు, అమ్ము, కమలము, అమృతభాండము, చక్రము, త్రిశులము, జపమాల ఉంటాయి.

🌻 5. స్కందమాత :- సరస్వతీదేవి

కుమారస్వామి లేక స్కందుని తల్లి అయిన స్కందమాత మహాదుర్గ ఐదవ అవతారం. చతుర్భుజి ఐన ఈ మాత రెండు చేతులలో కమలములనూ కుడి హస్తమందు స్కందుని ధరించి అభయ హస్తి అయి దర్శనమిస్తుంది. ఈమె పద్మములో కూర్చొని ఉండటం చేత పద్మాసన అనే నామధేయం కూడా ఉంది.

🌻 6. కాత్యాయని :- మహాలక్ష్మి దేవి

దుర్గామాత ఆరవ అవతారమైన కాత్యాయనిమాతను సకల వరప్రదాయనిగా పూజిస్తారు. శ్రీకృష్ణుని భర్తగా పొందటానికి గోపికలు ఈమెనే ఆరాధించారు. బంగారు మేనిఛాయతో, అత్యంత ప్రకాశవంతమైన ఈమెకు నాలుగు హస్తములు. ఒక చేత కత్తి, రెండవ చేత కమలం, మిగిలిన రెండుచేతులలో అభయప్రదాన ముద్రలో ఉంటుంది. ఈమె వాహనం సింహం.

🌻 7. కాళరాత్రి :- దుర్గాదేవి

దుర్గమాత ఏడవ అవతారం కాళరాత్రి. ఈమె శరీరఛాయ చిమ్మచీకటిలా నల్లగా ఉంటుంది. చెదరిన జుట్టుతో, మెడలో వాసుకొనిన మాల మెరుపులు చిందిస్తూ ఉంటుంది. ఈమెకు మూడు కళ్ళు. ఈమె ఉచ్వాస నిశ్వాసలు అగ్నిని విరజిమ్ముతుంటాయి. ఈమెకు నాలుగు హస్తములు. కుడి రెండు హస్తములలో ఒకటి అభయాన్ని, రెండవది భాయాలని పారదోలేవిగా ఉంటాయి. ఎడమచేతిలో ఒక చిన్న కత్తి, ఇనుముతోచేసిన రంపంలాంటి అయుధం ఉంటుంది. ఈమె వాహనం గాడిద. ఈమె రూపం ఉగ్రమే ఐనా ఈమెని పూజించిన వారికి అన్ని శుభములని కూరుస్తుంది కనుక ఈమెనే శుభంకరి అని కూడా పిలుస్తారు.

🌻 8. మహాగౌరి :- మహిషాసురమర్ధిని దేవి

దుర్గామాత అష్టమ అవతారం మహాగౌరి. ఈమె చంద్రునిపోలిన మేనిఛాయతో ఉంటుంది. ఈమె పార్వతి రూపంలో ఉన్నప్పుడు, శివునికోసం మహాతపస్సు చేసింది. అప్పుడు ఆమె శరీరఛ్ఛాయ నల్లగా మారిపోయింది. అది గమనించిన మహాశివుడు స్వయంగా ఆమెను పవిత్ర గంగాజలాలతో కడగగా ఆమెకు ఆ మేనిఛ్ఛాయ కలిగిందని ఒక కథ. సర్వకాల సర్వావస్తలలో ఈమెను ఎనిమిది ఏళ్ళ బాలికగానే పూజిస్తారు. అత్యంత ప్రశాంతమైన స్వరూపం కలిగిన ఈమెకు నాలుగు చేతులు. రెండు చేతులలో త్రిశులం, దమరుకము ధరించి మిగిలన రెండుచేతులతో వర, అభయ ముద్రలతో దర్శనమిస్తుంది. ఈమె వాహనం నంది.

🌻 9. సిద్ధిదాత్రి :- రాజరాజేశ్వరీ దేవి

దుర్గాదేవి ఆఖరి అవతారమైన ఈమె భక్తులకు అష్టసిద్దులను (అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఇసిత్వ, మరియు వాసిత్వ అనేవి అష్టసిద్ధులు) ప్రసాదించగలిగే దేవత.

ఈమె ద్వారానే పరమశివుడు ఈ సిద్ధులని సంపాదించాడని, అర్ధనారీశ్వరుడిగా పేరు పొందాడని దేవీ పురాణంలో చెప్పబడింది. కమలంలో కూర్చునే ఈ దేవత వాహనం సింహం. నాలుగు హస్తాలలో శంఖ, చక్ర, గదా, పద్మాలతో విరాజిల్లుతూ భక్తులను అనుగ్రహిస్తుంది.

🌹 🌹 🌹 🌹 🌹

07 Oct 2021

7-OCTOBER-2021 MESSAGES

*🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు - 1. శైలపుత్రి🌹*
*📚 . ప్రసాద్ భరద్వాజ*

యస్యాం బింబిత మాత్మ తత్వమగమత్ సర్వేశ్వరాఖ్యాం శుభాం
యా విష్వగ్జగదాత్మనా పరిణతా యా నామరూపాశ్రయా యా మూలప్రకృతి ర్గుణ త్రయవతీ యానంత శక్తి స్స్వయం
నిత్యావృత్త నవాత్మికా జయతు సా దుర్గా నవాకారిణీ

శ్రీ లలితా సహస్ర నామములు - 135 / Sri Lalita Sahasranamavali - Meaning - 135

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 135 / Sri Lalita Sahasranamavali - Meaning - 135 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 135. రాజ్యలక్ష్మీః, కోశనాథా, చతురంగ బలేశ్వరీ ।
సామ్రాజ్యదాయినీ, సత్యసంధా, సాగరమేఖలా ॥ 135 ॥ 🍀

🍀 691. రాజ్యలక్ష్మి :
రాజ్యలక్ష్మీ రూపిణీ

🍀 692. కోశనాధా :
కోశాగారముకు అధికారిణీ

🍀 693. చతురంగబలేశ్వరీ :
చతురంగ బలాలకు (రధ, గజ, తురగ, పదాదులు) అధిపతి

🍀 694. సామ్రాజ్యదాయినీ :
సామ్రాజ్యమును ఇచ్చునది

🍀 695. సత్యసంధా :
సత్యస్వరూపిణి

🍀 696. సాగరమేఘలా :
సముద్రములే వడ్డాణముగా కలిగినది

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 135 🌹

📚. Prasad Bharadwaj

🌻 135. Rajyalakshmih koshanadha chaturanga baleshvari
Samrajyadaeini satyasandha sagaramekhala ॥ 135 ॥ 🌻

🌻 691 ) Rajya lakshmi -
She who is the wealth of kingdoms

🌻 692 ) Kosa natha -
She who protects the treasury

🌻 693 ) Chathuranga baleswai -
She who is the leader of the four fold army (Mind, brain, thought and ego)

🌻 694 ) Samrajya Dhayini -
She who makes you emperor

🌻 695 ) Sathya Sandha -
She who is truthful

🌻 696 ) Sagara Mekhala -
She who is the earth surrounded by the sea

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

29 Sep 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 78

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 78 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మనం కాంతి నించీ పుట్టాం. కాంతిలో జీవిస్తాం. ఎప్పుడయితే ఆలోచనలన్నీ అదృశ్యమై మనసు నిశ్చలంగా, నిర్మలంగా, నిశ్శబ్దంగా మారుతుందో అప్పుడు లోపలి కాంతి మనకు కనిపిస్తుంది. అదే జ్ఞానోదయం. 🍀

మనం కాంతి నించీ పుట్టాం. కాంతిలో జీవిస్తాం. కాంతిలో మరణిస్తాం. కాంతితో మనం రూపొందాం. అన్ని కాలాల మార్మికుల అంతర్‌ దృష్టి యిది. యిటీవలే శాస్త్రవేత్తలు కూడా అంగీకరించారు. యిరవై ఏళ్ళ క్రితం వాళ్ళు మార్మికుల్ని చూసి నవ్వేవాళ్ళు. వాళ్ళు మార్మికుల మాటల్ని మాలినవనేవాళ్ళు. మనిషి కాంతి నించీ రూపొందాడా? అది యధార్థం కాదు, రూపకార్థంతో వాడారు. అనే వాళ్ళు. రూపకంగా కాదు యథార్థంగా మాట్లాడారు. ఇప్పుడు సైంటిస్టులు మనిషి కాంతి నించీ రూపొందాడంటున్నారు. అంతే కాదు ప్రతిదీ కాంతి నించే పుట్టిందంటున్నారు. ఎలక్ట్రిసిటీ నించీ, ఎలక్ట్రాన్ల నించీ అంటున్నారు. బహుదూరం చుట్టి వచ్చి వాళ్ళు అర్థం చేసుకున్నారు.

భౌతిక మార్గం బహుదూరం. ఆత్మాశ్రయ మార్గం అతి దగ్గర. నువ్వు లోపలికి చూసుకోవాలి. అంతే. అంతకు మించి ఏమీ అక్కర్లేదు. కళ్ళు మూసుకుని లోపలికి చూసే కళను అభ్యసించాలి. ధ్యానమంటే అదే. లోపలికి చూసే కళ. ఎప్పుడయితే ఆలోచనలన్నీ అదృశ్యమై మనసు నిశ్చలంగా, నిర్మలంగా, నిశ్శబ్దంగా మారుతుందో అప్పుడు లోపలి కాంతి మనకు కనిపిస్తుంది. అదే జ్ఞానోదయం. ఒకసారి నీ కాంతిని నువ్వు చూడగలిగితే ఆశ్చర్యపోతావు. అపుడు ప్రతి వారిలో ఆ కాంతిని చూస్తావు. అది పదార్థం కాదు, స్వచ్చమైన శక్తి.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

29 Sep 2021

మైత్రేయ మహర్షి బోధనలు - 11

🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 11 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 8. సమ భావము ముఖ్యలక్షణము - 1 🌻

అపూర్వము, ప్రత్యేకము అయిన శక్తి సామర్థ్యములు కలిగి యుండి భావము నందు తమ గురించిన ప్రత్యేకతను ధరించ కుండుట మైత్రేయ సంఘ సభ్యుని ముఖ్య లక్షణము. ఎంత శక్తి సామర్థ్యములు కలిగినను, రూపలావణ్యములు కలిగినను, సంస్కారములు కలిగినను, తన గురించి తనకు విశిష్ట భావముండుట హానికరము. ఇది అహం భావమునకు దారి తీయును. అందరిలో తానొకడను భావము, అందరి యందొకడే వసియించి యుండుట చేత అందరి యందు సమభావము కలిగి యుండుట శ్రేయస్కరము. సహజీవనముకు ఇది మొదటి మెట్టు.

మైత్రేయ సంఘమున అందరును తమదైన ప్రత్యేక సామర్ధ్యములు కలిగిన వారే. ఎవరి ప్రత్యేకత వారిది అయినను, సంఘ కార్యముల యందు వారి వారి ప్రత్యేకతలను జోడించి కృషి సలుపుదురు కాని, ప్రత్యేక గుర్తింపులకొరకై ఆరాటపడరు. విశిష్టమైన రుచి కలిగిన వివిధ భోజనపదార్థములను భోజనాలయమున చేర్చినట్లు, తత్కారణముగ విందు భోజనము రసోపేతమగునట్లుగ సంఘ సభ్యుల వివిధములైన శక్తి సామర్థ్యములను సమీకరించి మహత్తర కార్యములను చేయుదురు. ఈ ప్రాథమిక సూత్రమును కుటుంబము నందు పాటించినచో కుటుంబజీవనము ఆనందకరముగ నుండును.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

29 Sep 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 494 / Vishnu Sahasranama Contemplation - 494

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 494 / Vishnu Sahasranama Contemplation - 494🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 494. ఉత్తరః, उत्तरः, Uttaraḥ 🌻

ఓం ఉత్తరాయ నమః | ॐ उत्तराय नमः | OM Uttarāya namaḥ

ఉత్తరతి వాసుదేవో జన్మసంసారబంధనాత్ ।
ఇతి సర్వోత్కృష్ట ఇతి వా విశ్వస్మాదితి శ్రుతేః ।
విష్ణురుత్తర ఇత్యుక్తో విద్వద్భిర్వేదపారగైః ॥

జన్మ సంసార బంధనమునుండి దాటియుండువాడు. ఉత్ + తర అను విభాగముచే గొప్పవారందరికంటే గొప్పవాడు అని కూడా చెప్పవచ్చును. ఉత్ అను నిపాతమునకు గొప్పవాడు అని అర్థము. దీనికి ప్రమాణముగా విశ్వస్మాదింద్ర ఉత్తరః అను ఋగ్వేదవచనమును (10.86.1) గ్రహించవచ్చును. ఇందీ - దీప్తా అను ధాతువునుండి నిష్పన్నమగు ఇంద్రశబ్దమునకు స్వయం ప్రకాశమానమగునది అని అర్థము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 494 🌹

📚. Prasad Bharadwaj

🌻 494. Uttaraḥ 🌻

OM Uttarāya namaḥ

उत्तरति वासुदेवो जन्मसंसारबंधनात् ।
इति सर्वोत्कृष्ट इति वा विश्वस्मादिति श्रुतेः ।
विष्णुरुत्तर इत्युक्तो विद्वद्भिर्वेदपारगैः ॥

Uttarati vāsudevo janmasaṃsārabaṃdhanāt,
Iti sarvotkr‌ṣṭa iti vā viśvasmāditi śruteḥ,
Viṣṇuruttara ityukto vidvadbhirvedapāragaiḥ.

He is beyond the bonds of birth and saṃsāra or the worldly existence and hence He is considered Uttaraḥ. The conjoining of ut + tara can also imply superior amongst the greatest vide the Śruti विश्वस्मादिंद्र उत्तरः / Viśvasmādindra uttaraḥ R‌igveda (10.86.1). He is superior to the whole universe. Indī - dīpta means an effulgent divinity or Brahman.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः ।
शरीरभूतभृद् भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः ॥ ५३ ॥

ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః ।
శరీరభూతభృద్ భోక్తా కపీన్ద్రో భూరిదక్షిణః ॥ 53 ॥

Uttaro gopatirgoptā jñānagamyaḥ purātanaḥ,
Śarīrabhūtabhr‌d bhoktā kapīndro bhūridakṣiṇaḥ ॥ 53 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

29 Sep 2021

29-SEPTEMBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 29, బుధవారం, సెప్టెంబర్ 2021 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 97 / Bhagavad-Gita - 97 - 2-50🌹*
3) 🌹. శ్రీమద్భగవద్గీత - 665 / Bhagavad-Gita - 665 -18-76🌹
4) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 494 / Vishnu Sahasranama Contemplation - 494🌹
5) 🌹 DAILY WISDOM - 172🌹 
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 11🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 78🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 135🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ బుధవారం మిత్రులందరికీ 🌹*
*29 బుధవారం, సెప్టెంబర్‌ 2021*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ గణాధీశ స్తోత్రం -2 🍀*

అనామయాయ సర్వాయ సర్వపూజ్యాయ తే నమః |
సగుణాయ నమస్తుభ్యం బ్రహ్మణే నిర్గుణాయ చ || 4

బ్రహ్మభ్యో బ్రహ్మదాత్రే చ గజానన నమోఽస్తు తే |
జ్యేష్ఠాయ చాదిపూజ్యాయ జ్యేష్ఠరాజాయ తే నమః || 5
🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ
దక్షిణాయణం, వర్ష ఋతువు
చాంద్రమానం : బాధ్రపద మాసం
తిథి: కృష్ణ అష్టమి 20:31:36 వరకు తదుపరి కృష్ణ నవమి
పక్షం: కృష్ణ-పక్ష
నక్షత్రం: ఆర్ద్ర 23:26:47 వరకు తదుపరి పునర్వసు
యోగం: వరియాన 18:34:37 వరకు తదుపరి పరిఘ
కరణం: బాలవ 07:26:21 వరకు
వర్జ్యం: 06:05:21 - 07:52:05
దుర్ముహూర్తం: 11:42:11 - 12:30:14
రాహు కాలం: 12:06:12 - 13:36:17
గుళిక కాలం: 10:36:08 - 12:06:12
యమ గండం: 07:36:00 - 09:06:04
అభిజిత్ ముహూర్తం: 11:42 - 12:30
అమృత కాలం: 12:18:55 - 14:05:39
సూర్యోదయం: 06:05:55
సూర్యాస్తమయం: 18:06:30
వైదిక సూర్యోదయం: 06:09:28
వైదిక సూర్యాస్తమయం: 18:02:58
చంద్రోదయం: 00:11:07
చంద్రాస్తమయం: 12:57:26
సూర్య రాశి: కన్య
చంద్ర రాశి: జెమిని
యోగాలు-ఫలితాలు
ఆనందాదియోగం: ముసల యోగం - దుఃఖం 
23:26:47 వరకు తదుపరి గద యోగం - కార్య హాని , చెడు
పండుగలు : 
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 97 / Bhagavad-Gita - 97 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 50 🌴*

50. బుద్ధియుక్తో జహాతీహ 
ఉభే సుకృతదుష్కృతే |
తస్మాద్ యోగాయ యుజ్యస్య 
యోగ: కర్మసు కౌశలమ్ ||

🌷. తాత్పర్యం :
*భక్తియోగ మందు నియుక్తుడైనవాడు ఈ జన్మమందే శుభాశుభఫలముల నుండి ముక్తుడగును. కనుక కర్మ యందలి నేర్పుయైనటువంటి ఆ యోగము కొరకు యత్నింపుము.*

🌷. భాష్యము :
అనంత కాలము నుండి ప్రతిజీవుడు తన శుభాశుభకర్మల ఫలములను ప్రోగుచేసికొని యున్నాడు. అంతియేగాక తన నిజస్థితి సైతము ఎరుగలేకున్నాడు. జీవుని అట్టి అజ్ఞానము భగవద్గీత ఉపదేశముచే నశించిపోగలదు. శ్రీకృష్ణభగవానునికి సంపూర్ణ శరణాగతిని పొంది జన్మ,జన్మల నుండి కలుగుచున్న కర్మలు మరియు వాని ఫలముల శృంఖముల నుండి ముక్తి నొందుమనియే భగవద్గీత జీవునికి భోధించు చున్నది. కనుకనే కర్మఫలములను శుద్ధిచేయు విధానమైనటు వంటి కృష్ణభక్తి రసభావన యందు కర్మనొనరింపుమని అర్జునుడు భోదింపపడినాడు.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Bhagavad-Gita as It is - 97 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada 
📚 Prasad Bharadwaj 

🌴 Chapter 2 - Sankhya Yoga - 50 🌴

50. buddhi-yukto jahātīha ubhe sukṛta-duṣkṛte 
tasmād yogāya yujyasva yogaḥ karmasu kauśalam

🌷Translation :
A man engaged in devotional service rids himself of both good and bad reactions even in this life. Therefore strive for yoga, which is the art of all work.

🌷 Purport :
Since time immemorial each living entity has accumulated the various reactions of his good and bad work. As such, he is continuously ignorant of his real constitutional position. One’s ignorance can be removed by the instruction of the Bhagavad-gītā, which teaches one to surrender unto Lord Śrī Kṛṣṇa in all respects and become liberated from the chained victimization of action and reaction, birth after birth. Arjuna is therefore advised to act in Kṛṣṇa consciousness, the purifying process of resultant action.
🌹🌹🌹🌹🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 665 / Bhagavad-Gita - 665 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 76 🌴*

76. రాజన్ సంస్మృత్య సంస్మృత్య 
సంవాదమిమద్భుతమ్ |
కేశవార్జునయో: పుణ్యం 
హృష్యామి చ ముహుర్ముహు: ||

🌷. తాత్పర్యం : 
ఓ రాజా! శ్రీకృష్ణార్జుణుల నడుమ జరిగిన అద్భుతమును, పవిత్రమును అగు సంవాదమును స్మరించిన కొలది ప్రతిక్షణము పులకించు ఆనదము నొందుచున్నాను.

🌷. భాష్యము :
భగవద్గీత యొక్క అవగాహనము అతి దివ్యమైనట్టిది. శ్రీకృష్ణార్జున సంవాద విషయములను అవగతము చేసికొనగలిగినవాడు మహాత్ముడై ఆ సంవాద విషయములను మరవకుండును. ఇదియే ఆధ్యాత్మికజీవనపు దివ్యస్థితి. 

అనగా భగవద్గీతను ప్రామాణికుడైన (శ్రీకృష్ణుడు) వానినుండి శ్రవణము చేయువాడు పూర్ణ కృష్ణభక్తిభావనను పొందగలడు. అట్టి కృష్ణభక్తిరసభావన ఫలితమేమనగా మనుజుడు నిరంతరము వికాసము నొందుచు, ఏదియో కొంత సమయము గాక ప్రతిక్షణము జీవితమున ఆనందము ననుభవించును.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 665 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 76 🌴*

76. rājan saṁsmṛtya saṁsmṛtya
saṁvādam imam adbhutam
keśavārjunayoḥ puṇyaṁ
hṛṣyāmi ca muhur muhuḥ

🌷 Translation : 
O King, as I repeatedly recall this wondrous and holy dialogue between Kṛṣṇa and Arjuna, I take pleasure, being thrilled at every moment.

🌹 Purport :
The understanding of Bhagavad-gītā is so transcendental that anyone who becomes conversant with the topics of Arjuna and Kṛṣṇa becomes righteous and he cannot forget such talks. 

This is the transcendental position of spiritual life. In other words, one who hears the Gītā from the right source, directly from Kṛṣṇa, attains full Kṛṣṇa consciousness. 

The result of Kṛṣṇa consciousness is that one becomes increasingly enlightened, and he enjoys life with a thrill, not only for some time, but at every moment.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 494 / Vishnu Sahasranama Contemplation - 494🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 494. ఉత్తరః, उत्तरः, Uttaraḥ 🌻*

*ఓం ఉత్తరాయ నమః | ॐ उत्तराय नमः | OM Uttarāya namaḥ*

ఉత్తరతి వాసుదేవో జన్మసంసారబంధనాత్ ।
ఇతి సర్వోత్కృష్ట ఇతి వా విశ్వస్మాదితి శ్రుతేః ।
విష్ణురుత్తర ఇత్యుక్తో విద్వద్భిర్వేదపారగైః ॥

జన్మ సంసార బంధనమునుండి దాటియుండువాడు. ఉత్ + తర అను విభాగముచే గొప్పవారందరికంటే గొప్పవాడు అని కూడా చెప్పవచ్చును. ఉత్ అను నిపాతమునకు గొప్పవాడు అని అర్థము. దీనికి ప్రమాణముగా విశ్వస్మాదింద్ర ఉత్తరః అను ఋగ్వేదవచనమును (10.86.1) గ్రహించవచ్చును. ఇందీ - దీప్తా అను ధాతువునుండి నిష్పన్నమగు ఇంద్రశబ్దమునకు స్వయం ప్రకాశమానమగునది అని అర్థము.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 494 🌹*
📚. Prasad Bharadwaj

*🌻 494. Uttaraḥ 🌻*

*OM Uttarāya namaḥ*

उत्तरति वासुदेवो जन्मसंसारबंधनात् ।
इति सर्वोत्कृष्ट इति वा विश्वस्मादिति श्रुतेः ।
विष्णुरुत्तर इत्युक्तो विद्वद्भिर्वेदपारगैः ॥ 

Uttarati vāsudevo janmasaṃsārabaṃdhanāt,
Iti sarvotkr‌ṣṭa iti vā viśvasmāditi śruteḥ,
Viṣṇuruttara ityukto vidvadbhirvedapāragaiḥ.

He is beyond the bonds of birth and saṃsāra or the worldly existence and hence He is considered Uttaraḥ. The conjoining of ut + tara can also imply superior amongst the greatest vide the Śruti विश्वस्मादिंद्र उत्तरः / Viśvasmādindra uttaraḥ R‌igveda (10.86.1). He is superior to the whole universe. Indī - dīpta means an effulgent divinity or Brahman.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः ।
शरीरभूतभृद् भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः ॥ ५३ ॥

ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః ।
శరీరభూతభృద్ భోక్తా కపీన్ద్రో భూరిదక్షిణః ॥ 53 ॥

Uttaro gopatirgoptā jñānagamyaḥ purātanaḥ,
Śarīrabhūtabhr‌d bhoktā kapīndro bhūridakṣiṇaḥ ॥ 53 ॥

 Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 172 🌹*
*🍀 📖 In the Light of Wisdom 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 20. Is there a Relation of One Link with Another Link? 🌻*

We have been just glibly talking about relation. In this sense, when I touch this desk, my finger is supposed to be in relation with this desk. The question then becomes, what does ‘touch’ mean? Is my finger really in relation with this desk? Is a link in a chain really touching another link? We may say, “Yes, it is touching,” but what is this ‘touch’? Does one link enter into touch with another link? Is there a relation of one link with another link? In a chain, does one link enter into another link, or does it lie outside another link? It does not enter—it remains outside. 

In a relation of this kind, which is perhaps the larger amount of relations in the world, the connected items lie outside each other. The child may be related to the mother, but it does not enter into the mother, or the mother does not enter into the child. They are outside each other and exclusive, even though the child may be so near the mother that she feels it as an inseparable part of herself. Yet, one is outside the other. This sort of exclusive relationship is the so-called relationship of most things in this world. That is why, though things seem to be related to one another, sometimes they depart from one another.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 11 🌹* 
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 8. సమ భావము ముఖ్యలక్షణము - 1 🌻*

అపూర్వము, ప్రత్యేకము అయిన శక్తి సామర్థ్యములు కలిగి యుండి భావము నందు తమ గురించిన ప్రత్యేకతను ధరించ కుండుట మైత్రేయ సంఘ సభ్యుని ముఖ్య లక్షణము. ఎంత శక్తి సామర్థ్యములు కలిగినను, రూపలావణ్యములు కలిగినను, సంస్కారములు కలిగినను, తన గురించి తనకు విశిష్ట భావముండుట హానికరము. ఇది అహం భావమునకు దారి తీయును. అందరిలో తానొకడను భావము, అందరి యందొకడే వసియించి యుండుట చేత అందరి యందు సమభావము కలిగి యుండుట శ్రేయస్కరము. సహజీవనముకు ఇది మొదటి మెట్టు. 

మైత్రేయ సంఘమున అందరును తమదైన ప్రత్యేక సామర్ధ్యములు కలిగిన వారే. ఎవరి ప్రత్యేకత వారిది అయినను, సంఘ కార్యముల యందు వారి వారి ప్రత్యేకతలను జోడించి కృషి సలుపుదురు కాని, ప్రత్యేక గుర్తింపులకొరకై ఆరాటపడరు. విశిష్టమైన రుచి కలిగిన వివిధ భోజనపదార్థములను భోజనాలయమున చేర్చినట్లు, తత్కారణముగ విందు భోజనము రసోపేతమగునట్లుగ సంఘ సభ్యుల వివిధములైన శక్తి సామర్థ్యములను సమీకరించి మహత్తర కార్యములను చేయుదురు. ఈ ప్రాథమిక సూత్రమును కుటుంబము నందు పాటించినచో కుటుంబజీవనము ఆనందకరముగ నుండును. 

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 78 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. మనం కాంతి నించీ పుట్టాం. కాంతిలో జీవిస్తాం. ఎప్పుడయితే ఆలోచనలన్నీ అదృశ్యమై మనసు నిశ్చలంగా, నిర్మలంగా, నిశ్శబ్దంగా మారుతుందో అప్పుడు లోపలి కాంతి మనకు కనిపిస్తుంది. అదే జ్ఞానోదయం. 🍀*

మనం కాంతి నించీ పుట్టాం. కాంతిలో జీవిస్తాం. కాంతిలో మరణిస్తాం. కాంతితో మనం రూపొందాం. అన్ని కాలాల మార్మికుల అంతర్‌ దృష్టి యిది. యిటీవలే శాస్త్రవేత్తలు కూడా అంగీకరించారు. యిరవై ఏళ్ళ క్రితం వాళ్ళు మార్మికుల్ని చూసి నవ్వేవాళ్ళు. వాళ్ళు మార్మికుల మాటల్ని మాలినవనేవాళ్ళు. మనిషి కాంతి నించీ రూపొందాడా? అది యధార్థం కాదు, రూపకార్థంతో వాడారు. అనే వాళ్ళు. రూపకంగా కాదు యథార్థంగా మాట్లాడారు. ఇప్పుడు సైంటిస్టులు మనిషి కాంతి నించీ రూపొందాడంటున్నారు. అంతే కాదు ప్రతిదీ కాంతి నించే పుట్టిందంటున్నారు. ఎలక్ట్రిసిటీ నించీ, ఎలక్ట్రాన్ల నించీ అంటున్నారు. బహుదూరం చుట్టి వచ్చి వాళ్ళు అర్థం చేసుకున్నారు. 

భౌతిక మార్గం బహుదూరం. ఆత్మాశ్రయ మార్గం అతి దగ్గర. నువ్వు లోపలికి చూసుకోవాలి. అంతే. అంతకు మించి ఏమీ అక్కర్లేదు. కళ్ళు మూసుకుని లోపలికి చూసే కళను అభ్యసించాలి. ధ్యానమంటే అదే. లోపలికి చూసే కళ. ఎప్పుడయితే ఆలోచనలన్నీ అదృశ్యమై మనసు నిశ్చలంగా, నిర్మలంగా, నిశ్శబ్దంగా మారుతుందో అప్పుడు లోపలి కాంతి మనకు కనిపిస్తుంది. అదే జ్ఞానోదయం. ఒకసారి నీ కాంతిని నువ్వు చూడగలిగితే ఆశ్చర్యపోతావు. అపుడు ప్రతి వారిలో ఆ కాంతిని చూస్తావు. అది పదార్థం కాదు, స్వచ్చమైన శక్తి.

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 135 / Sri Lalita Sahasranamavali - Meaning - 135 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 135. రాజ్యలక్ష్మీః, కోశనాథా, చతురంగ బలేశ్వరీ ।*
*సామ్రాజ్యదాయినీ, సత్యసంధా, సాగరమేఖలా ॥ 135 ॥ 🍀*

🍀 691. రాజ్యలక్ష్మి : 
రాజ్యలక్ష్మీ రూపిణీ 

🍀 692. కోశనాధా : 
కోశాగారముకు అధికారిణీ 

🍀 693. చతురంగబలేశ్వరీ : 
చతురంగ బలాలకు (రధ, గజ, తురగ, పదాదులు) అధిపతి 

🍀 694. సామ్రాజ్యదాయినీ : 
సామ్రాజ్యమును ఇచ్చునది 

🍀 695. సత్యసంధా : 
సత్యస్వరూపిణి 

🍀 696. సాగరమేఘలా : 
సముద్రములే వడ్డాణముగా కలిగినది

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 135 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 135. Rajyalakshmih koshanadha chaturanga baleshvari*
*Samrajyadaeini satyasandha sagaramekhala ॥ 135 ॥ 🌻*

🌻 691 ) Rajya lakshmi -   
She who is the wealth of kingdoms

🌻 692 ) Kosa natha -   
She who protects the treasury

🌻 693 ) Chathuranga baleswai -   
She who is the leader of the four fold army (Mind, brain, thought and ego)

🌻 694 ) Samrajya Dhayini -   
She who makes you emperor

🌻 695 ) Sathya Sandha -   
She who is truthful

🌻 696 ) Sagara Mekhala -   
She who is the earth surrounded by the sea

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 312-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 312-2

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 312-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 312-2🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 71. రాజరాజార్చితా, రాజ్ఞీ, రమ్యా, రాజీవలోచనా ।
రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా ॥ 71 ॥ 🍀

🌻 312. 'రణత్కింకిణిమేఖలా' - 2🌻

పంచదశి మంత్రమున కూడ మూడు భాగములుగ ఆరాధించుట, ధ్యానించుట 85, 86, 87 నామములలో తెలుప బడినది. వాగ్భవ కూటమునకు క, ఏ, ఈ, ల, హ్రీం అని ఐదు అక్షరములు తెలుపబడినవి. మధ్యకూటమునకు హ, స, క, హ, ల, హ్రీం అను ఆరు అక్షరములు తెలుపబడినవి. శక్తి కూటమైన కటి దిగువ భాగము స, క, ల, హ్రీం అను నాలుగు అక్షరములుగ తెలుప బడినది.

సత్పురుషుల భూలోకశక్తి అంతయూ కటి దిగువ భాగమగు మూలాధారముననే యుండును. అట్టివారు క్రియాశక్తిపరులై సంకల్పించిన కార్యములను అవతరింప జేయుదురు. అట్టి శక్తికూటమునకు మకుటమై, అలంకారప్రాయమై వుండునది శ్రీదేవి మొలనూలు, క్రతుబద్ధమైన ఆనందకరమగు శబ్దములు శ్రీదేవి నడుచు చున్నప్పుడు మొలత్రాటి యొక్క చిరుగంటల నుండి వెలువడు చుండును. అట్లే క్రతు బద్ధమగు కార్యములు దివ్యపురుషుల హృదయము నందు దర్శింపబడి కార్యరూపము దాల్చుచుండును. సంసారబద్దులగు జీవులు ఈ మూడవ భాగముననే శక్తి కూటమున బంధింపబడి యుందురు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 312-2 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🍀 71. rājarājārcitā rājñī ramyā rājīvalocanā |
rañjanī ramaṇī rasyā raṇatkiṅkiṇi-mekhalā || 71 || 🍀

🌻 312-2. Raṇatkiṅkiṇi-mekhalā रणत्किङ्किणि-मेखला (312) 🌻

It is also said that these descriptions enable the beginners to visualise Her gross form. She has four types of forms, gross (sthūla), subtle (sūkṣma rūpa), subtler (sūkṣmatara) which is also known as Her kāmakalā dorm and Her subtlest form is kuṇḍalinī form.

Her gross form is described in nāma-s twelve to fifty one. Her subtle form (mantra-s) is described in nāma-s 85 to 89. Her subtler form (kāmakalā) is described in 88 and 89. (Nāma 322 is kāmakalā rūpa.) Finally, Her subtlest form kuṇḍalinī is described in 90 to 111. (Psychic cakra-s are discussed in 475 to 534).

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

28 Sep 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 87

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 87 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. చేయవలసినది- చేయదలచినది - 3 🌻

ఏ దేశానికి వెళ్లినా, బ్రహ్మ విద్యను అనుష్ఠిస్తున్న వాళ్ళు భగవద్గీతను పారాయణం చేస్తూన్న వాళ్ళు, వేదం ఉపనిషత్తులు అనుష్ఠానం చేస్తున్న వాళ్ళు కనిపిస్తారు. ఇదే ఆరాధన విశేషం అంటే. అది ఈ‌ దేశంలోనే మొట్టమొదట పుట్టింది.

నాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అని అడిగే దరిద్రం ఉన్నన్నాళ్ళు మంచి రోజులు ఏ ఒక్కడికి కూడా రావు. ప్రపంచానికి మనం ఏం చేయగలం? ప్రపంచ శాంతి జరగాలంటే మన కృషి కూడా ఎంత చేయాల్సి ఉన్నది? అని ఆలోచించిన రోజున మనకు రోగాలు తగ్గుతాయి దారిద్ర్యం పోతుంది. దృష్టి అటు మారినపుడు సమస్తము మనలను వరిస్తుంది. మనకు మంచిరోజులు ఎప్పుడు వస్తాయి? అని దృష్టి ఉన్నంతసేపూ ఏనాడూ మంచిరోజులు రాలేదు.

బ్రహ్మవిద్యను అనుష్ఠానం చేస్తున్న వాళ్ళు, క్రమశిక్షణ పొందుతున్న వాళ్ళు చేస్తున్నవి చూస్తే మనకు తెలుస్తుంది. ఇంట్లో ఒక పవిత్రమైన మందిరం ఒకటి పెట్టుకొన్న పాశ్చాత్యులు కొన్ని వేల మంది అనుష్ఠానం చేస్తూ ఉన్నారు. రోజూ ఓంకారం, వేదాధ్యయనములు కూడా వినపడుతున్నవి. ఉదయం 6 నుండి 6.15 వరకు అనేకాశ్రమములలో "ఓం నమో భగవతే రామకృష్ణాయ" అను మంత్రం ఉచ్చరింపబడుతున్నది.

రామకృష్ణ పరమహంస పేరు మనము ఎడాదికొక మాటన్నా, ఎప్పుడన్నా తలచుకొంటున్నామో తలచుకోమో తెలియదు. ప్రతినిత్యము మనం గమనించి చూచినట్లయితే వాళ్ళ ఆశ్రమాల్లో మనకు (వేదాధ్యయనాదులు) వినిపిస్తుంటాయి. స్వామి శివానంద ఆశ్రమములు, స్వామి సచ్చిదానంద ఆశ్రమములు, రామకృష్ణ మఠములు ఒక్క బ్రస్సెల్స్ నగరంలోనే సుమారు 700 ఆశ్రమాలు ఉన్నాయి. లండన్ లోను, ప్యారిస్ లోను, కొన్ని వందల ఆశ్రమాలు కలవు.

ఇన్నింటిలోను ఉదయం 6 గంటలకు ఓంకారనాదం వినిపిస్తుంటుంది. భారత దేశంలోని ఎన్ని దేవాలయాల్లో మనం ఓంకార నాదం విపిస్తున్నాం? తప్పనిసరిగా సుప్రభాతాలు చేయాలి అనే దేవాలయాల్లో కూడా సుప్రభాతం టేప్ రికార్డింగ్ చేసి వినిపిస్తున్నాము‌ శనివారాల్లో రేడియోలో సుప్రభాతం వినిపిస్తుంటుంది‌. మనం ఇళ్ళలో ఎంతమందిమి చేసికొంటున్నాము. మళ్ళీ క్రమశిక్షణ మనం స్థాపనం చేసుకోవాలి. దాని కొరకు మనం ఒక Time పెట్టుకోవాలి. దీని కోసం మన సంస్థవారు యువకులంతా కలిసి మాస్టరు సి.వి.వి. గారు చెప్పిన ప్రకారం ఒక కాలమును నిర్ణయించుకున్నారు..

.....✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹

28 Sep 2021

వివేక చూడామణి - 135 / Viveka Chudamani - 135

🌹. వివేక చూడామణి - 135 / Viveka Chudamani - 135🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 27. విముక్తి - 8 🍀

443. ఎవడైతే వస్తు ప్రపంచముతో సంబంధము పెట్టుకొని వాటి పై కోరికను కలిగి ఉంటాడో అట్టి కోరికలన్ని బ్రహ్మాన్ని తెలుసుకొన్న తరువాత బలహీనమవుతాయి.

444. తన తల్లి ముందు తన అభిలాషలు, స్వేచ్ఛ ఎలా అడ్డుకొనబడతాయో అలానే బ్రహ్మాన్ని తెలుసుకొన్న వ్యక్తి, సత్యాన్ని తెలుసుకొన్న వ్యక్తి ఏ మాత్రము ప్రాపంచిక వస్తు భావన కలిగి ఉండడు.

445. ఎవరైతే ధ్యాన స్థితిని నిరంతరము సాధన చేస్తుంటారో వారిలో కూడా భౌతిక సంబంధ భావనలు కలుగుతుంటాయి. సృతులలో చెప్పినట్లు పూర్వ జన్మ ప్రారబ్దాలు ఉన్నంత వరకు, ఈ జన్మలో శరీరము ఉన్నంత కాలము గత జన్మల ప్రారబ్దములను అనుభవించవలసిందే. శరీరము వదలిన తరువాత అతడు విముక్తిని పొందగలడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 VIVEKA CHUDAMANI - 135 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 27. Redemption - 8 🌻

443. If it be urged that he is still attached to the sense-objects through the momentum of his old desires, the reply is – no, for desires get weakened through the realisation of one’s identity with Brahman.

444. The propensities of even a confirmed libertine are checked in the presence of his mother; just so, when Brahman, the Bliss Absolute, has been realised, the man of realisation has no longer any worldly tendency.

445. One who is constantly practising meditation is observed to have external perceptions. The Shrutis mention Prarabdha work in the case of such a man, and we can infer this from results actually seen.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

28 Sep 2021

శ్రీ శివ మహా పురాణము - 458

🌹 . శ్రీ శివ మహా పురాణము - 458🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 32

🌻. సప్తర్షుల రాక - 2 🌻

ఋషులిట్లు పలికిరి-

మహారాజా! దేవతాసార్వభౌమా! సర్వోత్తమమగు మా భాగ్యమును మేము ఏమని వర్ణింపగలము? (13) పూర్వము శరీరవాఙ్మనస్సులచే తపస్సును చేసితిమి. ఉత్తమమగు వేదాధ్యయనమును చేసితిమి. అగ్నిహోత్రమును చేసితిమి. వివిధ తీర్థములను సేవించితిమి (14).

శరీరవాఙ్మనస్సులచే సిన పుణ్యము, నిన్ను స్మరంచుటచే కలిగిన పుణ్యము అంతయూ జతగూడి నీవు మమ్ములను స్మరించుట అను భాగ్యము మాకీ నాడు కలిగినది (15). నిన్ను ప్రతిదినము స్మరించు మానవుడు కృతార్థుడగును. నీచే స్మరింపబడు వారియొక్క పుణ్యమును ఏమని వర్ణించదగును? (16)

ఓ సదాశివా! నీవు స్మరించుటచే మేము అందిరిలో గొప్పవారమైతిమి. నిన్ను మనస్సులో స్మరించుట యైననూ మానవులకు దుర్లభము (17). పొట్టివానికి పండు అందినట్లు, పుట్టుగుడ్డికి కళ్లు కనబడినట్లు, మూగివానికి మాటలాడుట వచ్చినట్లు, దరిద్రునకు నిధి లభించినట్లు (18), కుంటివాడు గొప్ప పర్వతమును అతిక్రమించినట్లు, గొడ్రాలికి సంతానము కలిగినట్లు, మాకు దుర్లభమగు నీ దర్శనము కలిగినది. హే ప్రభో! (19) ఈనాటి నుండి మేము లోకములో పూజింపబడెదము. గొప్ప మునులచే మాన్యతను పొందెదము. నీ దర్శనము చేత మాకు ఉన్నత పదము లభించినది (20).

ఈ విషయములలో పెక్కు మాటలేల? మాకు అన్నివిధములా మాన్యత కలిగినది. దేవతలందరికి ఈశ్వరుడవగు నీ దర్శనముచే పూజ్యత కలిగినది. ఓ దేవదేవా! (21) పూర్ణులకు కర్తవ్యమేమి ఉండును? నీకు దయ ఉన్నచో సేవకులకు ఈయదగిన శుభకార్యమును మాకు అప్పజెప్పుము (22).

బ్రహ్మ ఇట్లు పలికెను-

మహేశ్వరుడగు శంభుడు వారి ఈ మాటలను విని లోకాచారము ననుసరిస్తూ అందమగు వాక్యము నిట్లు పలికెను (23).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

28 Sep 2021