నిర్మల ధ్యానాలు - ఓషో - 224


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 224 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ప్రేమ గురించి తెలిసిన వాడికి దేవుడి గురించి తెలుస్తుంది. లేకుంటే తెలీదు. వ్యక్తి దేవుణ్ణి నమ్ముతూ పోవచ్చు గాక. అతనికి ప్రేమ గురించి తెలీదు. ప్రేమించే వ్యక్తి దైవం నించీ పారిపోడు. అతను మాత్రమే దేవుణ్ణి కనిపెడతాడు. అది అనివార్యం. 🍀


నాకు దేవుడి పట్ల, స్వర్గం పట్ల ఆసక్తి లేదు. నాకు ప్రేమ పట్ల మాత్రమే గాఢమైన ఆసక్తి. కారణం ప్రేమ గురించి తెలిసిన వాడికి దేవుడి గురించి తెలుస్తుంది. లేకుంటే తెలీదు. వ్యక్తి దేవుణ్ణి నమ్ముతూ పోవచ్చు గాక. అతనికి ప్రేమ గురించి తెలీదు. దేవుణ్ణి నమ్ముతూ పోయిన వాళ్ళు ప్రపంచంలో ఎంతో ద్వేషాన్ని పుట్టించారు. వాళ్ళంత దారుణాల్ని ఎవరూ సృష్టించలేదు. వాళ్ళందరూ గొప్ప కుట్రలో భాగస్వాములే. వాళ్ళు దేవుడి గురించి, శాంతి గురించి, ప్రేమ గురించి మాట్లాడతారు. కానీ వాళ్ళు ఎంతో రక్తపాతాన్ని సృష్టిస్తారు.

శతాబ్దాలుగా జరుగుతున్నదదే. అది వాళ్ళు ప్రత్యక్షంగా చెయ్యరు. జనాల్ని రెచ్చగొట్టి చేయిస్తారు. మనిషి కొంత చైతన్యంతో వుంటే ఈ జరిగిందంతా ఎంత పనికిమాలిన వ్యవహారమో గుర్తిస్తారు. అది ఎంత ఆటవికమో తెలుసుకుంటాడు. యిదంతా మతం పేరున జరుగుతుంది. అందువల్ల నేను ఒత్తి చెప్పేది, నొక్కి చెప్పేది ప్రేమ గురించే. ప్రేమ సంభవిస్తే అన్నీ జరుగుతాయి. ప్రేమించే వ్యక్తి దైవం నించీ పారిపోడు. అతను మాత్రమే దేవుణ్ణి కనిపెడతాడు. అది అనివార్యం.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


12 Aug 2022

No comments:

Post a Comment