16-MARCH-2021 MESSAGES

10) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 171🌹  
11) 🌹. శివ మహా పురాణము - 371🌹 
12) 🌹 Light On The Path - 120🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 253🌹 
14) 🌹 Seeds Of Consciousness - 318🌹   
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 193🌹
16) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 48 / Lalitha Sahasra Namavali - 48🌹 
17) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 48 / Sri Vishnu Sahasranama - 48🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -171 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 14

*🍀 14. పూర్ణ జిజ్ఞాస - జీవుల యందలి దైవముతో అనుసంధానము చెందుట యోగము. జీవుడహంకార ప్రజ్ఞ. అతడు త్రిగుణాత్మకుడు. నే నున్నానను ప్రత్యేక భావము కలవాడు. జీవులయందున్న దేవుడు త్రిగుణాతీతుడు. అంతర్యామి. అన్నిటియందు గుణముల కావల ఉండువాడు. కావున సర్వాంతర్యామి. అతడాధారముగ గుణము లేర్పడి, అందుండి ప్రత్యగాత్మగ జీవుడేర్పడు చున్నాడు. నిజమునకు జీవుడు స్థితి మార్పు చెందిన దైవమే. జీవుని పేరు నేను. దైవము పేరు కూడ నేనే. నేనను జీవుడు, నేను అను దైవముతో అనుసంధానము చెందుటకు చేయు ప్రయత్నమే యోగాభ్యాసము. నేనను ప్రత్యేక ప్రజ్ఞ, నేనను అంతర్యామి ప్రజ్ఞతో జతపడవలెను. 🍀*

ప్రశాంతాత్మా విగతజీ ర్ర్బహ్మచారిత్రతే స్థితః |
మన స్సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః || 14

ప్రశాంతమైన మనస్సు కలవాడై, భయము వీడినవాడై బ్రహ్మ యందు చరించుట స్థిరమగు వ్రతము కలవాడై, సంయమము చెందిన ఇంద్రియములతో కూడిన మనస్సు కలవాడై, 'నా' యందు ఆసక్తి, ప్రేమ కల చిత్తము కలవాడై, మత్పరుడై 'నా'తో ముడిపడిన వాడై ఉండవలెను.
శ్రీకృష్ణుడు అందించిన ఈ ఉపదేశము ధ్యానమున మణి పూస వంటిది. ఇచ్చట 'నేను' అని కృష్ణుడు వాడిన పదము సాధకుని యందు అంతర్యామిగనున్న నేను. అనగ జీవుని యందలి దైవము. 

జీవుల యందలి దైవముతో అనుసంధానము చెందుట యోగము. జీవుడహంకార ప్రజ్ఞ. అతడు త్రిగుణాత్మకుడు. నే నున్నానను ప్రత్యేక భావము కలవాడు. జీవులయందున్న దేవుడు త్రిగుణాతీతుడు. అంతర్యామి. అన్నిటియందు గుణముల కావల ఉండువాడు. కావున సర్వాంతర్యామి. అతడాధారముగ గుణము లేర్పడి, అందుండి ప్రత్యగాత్మగ జీవుడేర్పడు చున్నాడు. నిజమునకు జీవుడు స్థితి మార్పు చెందిన దైవమే. 

జీవుని పేరు నేను. దైవము పేరు కూడ నేనే. నేనను జీవుడు, నేను అను దైవముతో అనుసంధానము చెందుటకు చేయు ప్రయత్నమే యోగాభ్యాసము. నేనను ప్రత్యేక ప్రజ్ఞ, నేనను అంతర్యామి ప్రజ్ఞతో జతపడవలెను. ఇది అంటు కట్టుట వంటిది. అట్లు భావనతో కట్టివుంచుటచే, క్రమముగ రెండుగ నున్నవి ఒకటిగ నేర్పడగలవు. “యుక్త ఆసి" అని శ్లోకము చెప్పుచున్నది. అనగ కలిపి యుంచవలెనని అర్థము. ఇట్లు చాల కాలము కలిపియుంచుటకు ప్రయత్నము సాగవలెను.

ఈ ప్రయత్నమున శ్రద్ధ, భక్తి దైనందినముగ నున్నచో క్రమముగ ప్రశాంతత చిక్కును. భయము తొలగును. అంతర్యామి యందే చరించు దినచర్య ఆరంభమగును. ఇంద్రియములు మనస్సు అనుకూలము లగును. ఇది ఒక పద్ధతి. ఈ పద్ధతి యందు దైవమే కర్తయై నిలచును. 

మరియొక పద్ధతి ప్రశాంతమగు మనస్సు నేర్పరచుకొనుట, భయమును తొలగించు కొనుట, మనస్సు ఇంద్రియములను మచ్చిక చేసుకొనుట, బ్రహ్మము నందు చరించుట తానుగ స్వప్రయత్నమున నిర్వర్తించుకొనుచు, తన యందలి అంతర్యామితో యోగించుట. 

ఇందు మొదటి పద్ధతి భక్తునకు సహజము. అతడు దైవమే ఉపాయమని, అంతట, అన్నిట దైవమునే చూచుచు, దైవ యుక్తుడగు చుండును. జ్ఞాని పురుష ప్రయత్నమున తనను తాను సమకూర్చుకొని దేవునితో యోజించుటకు ప్రయత్నించును. ఇరువురికిని ఫలప్రదాత దైవమే. ప్రతినిత్యము పై తెలిపిన మూడు శ్లోకముల ననుసరించుచు, నిర్ణీత సమయమున ధ్యానము నాచరించుట ప్రధానమని తెలియవలెను. 

కేవలము దైవమునందే ఆసక్తి, ప్రేమ కల వారు ఆత్మ సంయమమును సులభముగ బడయుదురు. వారి దినచర్య యంతయు కూడ దైవదర్శనమునే అంతట, అన్నిట చేయుచు నిర్వర్తించుకొను చుందురు. అట్టి వారికి ఆత్మ సంయమము శీఘ్రగతిని సిద్ధించును. 

ఇతరములు గోచరించు వారికి సిద్ధించుట కష్టము. చిత్త మెంతవరకు దైవము నాశించునో అంతవరకు యోగము జరుగుచుండును. చిత్త మితర విషయములపై ఆసక్తిని చూపినపుడు యోగ మాగును. కావున పూర్ణ జిజ్ఞాసువులకే ఆత్మ సంయమము సాధ్యమగునని తెలియవలెను. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, WA, FB Groups 🌹
https://t.me/BhagavadGita_Telugu_English
www.facebook.com/groups/bhagavadgeetha/
https://chat.whatsapp.com/BzCAiTrm6X9K1NsjyGWzlg

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 371🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 10

*🌻. కుజ గ్రహోత్పత్తి - 1 🌻*

నారదుడిట్లు పలికెను -

ఓ విష్ణు శిష్యా! మహాత్మా! విధీ! ప్రభూ! నీవు శివ భక్తులలో శ్రేష్ఠుడవు. ఈ శివలీలను నాకు సంగ్రహముగా ప్రీతితో నీవు చెప్పదగుదువు(1). సతీ విరహముతో కూడి యున్న శివుడు ఏమి చేసెను? శివుడు తపస్సును చేయుటకై హిమవత్పర్వతాగ్ర భాగమునకు ఎప్పుడు వచ్చెను? ఆ చరితమును చెప్పుము (2). శివశివులకు మధ్య జరిగిన సంభాషణ ఎట్టిది? మన్మథుడు నశించిన తీరు ఏది? పార్వతి తపస్సును చేసి మంగళ స్వరూపుడగు శివుని పొందిన విధమెట్టిది? (3) ఓ బ్రహ్మా! ఈ వృత్తాంతమునంపతనూ చెప్పి, ఇతరమగు శివచరితమును కూడ నీవు చెప్పదగుదువు. ఈ శుభ చరితము నాకు మహానందమును కలిగించుచున్నది. (4).

సూతుడిట్లు పలికెను-

నారదుని ఈప్రశ్నను విని, లోకపాలురందరిలో శ్రేష్ఠుడగు బ్రహ్మశివుని పాదపద్మమునలు స్మరించి మిక్కిలి ప్రీతితో ఇట్లనెను (5)

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ దేవర్షీ! నీవు శివభక్తులలో శ్రేష్ఠుడవు. పవిత్రము చేయునది, మంగళములనిచ్చునది, భక్తిని పెంచునది అగు శివుని ఉత్తమకీర్తిని ఇపుడు శ్రధ్ధగా వినుము (6). ప్రియురాలి వియోగముచే దుఃఖితుడై యున్న శంభుడు తన నివాసమగు కైలాసమునకు తిరిగి వచ్చి, ప్రాణముల కంటె అధికముగా తనకు ప్రియురాలైన సతీదేవిని మనస్సులోస్మరించెను(7). ఆయన లోకపు పోకడను అనుకరించువాడై గణములను పిలిచి వారి యెదట ప్రేమను పెంపొందిచు ఆమె గుణములను మిక్కిలి ప్రీతితో వర్ణించెను(8). లీలా పండితుడగు ఆ శివుడు సద్గతినిచ్చు గృహస్థాశ్రమమును విడిచి పెట్టి దిగంబరుడై లోకములనన్నిటినీ తిరుగాడెను(9).

భక్తులకు మంగళమునిచ్చు ఆ శంకరుడు సతీ వియోగముచే దుఃఖితుడై అమెను ఎక్కడను గాన జాలక కైలాస పర్వతమునకు తిరిగి వచ్చెను(10). అయన ప్రయత్నపూర్వకముగా మనస్సును నిగ్రహించి దుఃఖానాశకమగు సమాధిని పొంది నాశరహితమగు ఆత్మ స్వరూపమును దర్శించు చుండెను(11).మూడు గుణములకు అతీతమైన వాడు, వికారములు లేనివాడు, పరబ్రహ్మ స్వరూపుడు, మాయను వశము చేసుకున్నవాడు అగు ఆశివప్రభుడు ఈ తీరున చిరకాలము సమాధియందుడెను (12). ఆయన అనేక సంవత్సరములు ఇట్లు గడిపి తరువాత సమాధి నుండి బయటకు వచ్చెను. అపుడు జరిగిన వృత్తాంతమును మీకు చెప్పెదను (13).

ఆ ప్రభుని లలాట భాగమునుండి శ్రమ వలన చెమట పుట్టి నేలపై బడగా, అది వెంటనే ఒక శిశువాయెను(14). ఓమహార్షీ! ఆ శిశువు నాల్గు భుజములతో, అరుణ వర్ణముతో, సుందరమగు ఆకారముతో, దివ్యకాంతులీనుచూ, శోభాయుక్తమై, ఇతరులు చూడ శక్యము కాని తేజస్సుతో వెలుగొందెను(15). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 LIGHT ON THE PATH - 120 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 8 - THE 20th RULE
*🌻 20. Seek it not by any one road. - 13 🌻*

455. When in addition to this there is complete control of the astral and mental bodies, progress may be swift indeed. Normally, when the ego wants to deal with one thing through his lower vehicles they persist in bringing in a hundred others, in sending in reports which are not asked for and not desired by the ego. Control of the mind has to be gained so that it will report to the ego only what he wants to know. 

Then, when the ego turns some problem over to his mind, and says: “Think that out and give me the information I want,” the controlled mind obeys perfectly, whereas under similar circumstances the average mind reports a hundred things which are useless to the ego, because all sorts of wandering thoughts break in and assert themselves.

456. The system of yielding up the results of the lower work, but not the detailed experience, is going on all the time until we attain Adeptship. As the ego develops, the first decided change that the man makes is to draw up the intellect, the manas, to the buddhic level; he still remains triple, but instead, of being on the three planes he is now on two, with atma developed on its own plane, buddhi on its own plane, and manas level with buddhi, drawn up into the intuition. 

Then he discards the causal body because he has no further need of it. When he wishes to come down and manifest on the mental plane again he has to make a new causal body, but otherwise he does not need one.

457. Much in the same way those two manifestations on the buddhic plane – the buddhi and the glorified intellect which is intuition – will be drawn up presently into the nirvanic or atmic plane, and the triple spirit on that plane will be fully vivified. Then the three manifestations will converge into one. That is a power within the reach of the Adept, because He unifies the Monad and the ego, just as the disciple is trying to unite the ego with the personality.

458. This drawing up of the higher manas from the causal body, so that it is on the buddhic plane side by side with the buddhi, is the aspect or condition of the ego which Madame Blavatsky called the spiritual ego. It is used to call ‘ spiritual illumination” – that is, the state of the Arhat. 

It is the unfolding of the Krishna principle. We speak of the birth of the Christ principle when there is the first stirring of the buddhic consciousness in the man, but when it is said the Krishna is fully unfolded within him, I think it must mean this state.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 251 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. కాశ్యప మహర్షి - 2 🌻*

9. ఈ విషయం చాలా చమత్కారంగా ఉంది. మనసును శంకించటం ఎలాగ అంటారు. ఉదాహరణకు ఒక బ్రహ్మరాక్షసుడున్నాడు. వాడు ఒకడిని పట్టుకున్నడనుకోండి. అలా పట్టుకుని అతడి వశంలో ఉండి, ఘడియ ఘడియకూ తనకు ఏదయినా పని చెప్పమని, “నీవు నాకు చేతినిండా పనిచెప్పు, అట్లాగైతే నేను నిన్ను సేవిస్తూ ఉంటాను. 

10. నాకు ఎప్పుడయితే పని చెప్పలేకపోతావో అప్పుడు నేను నిన్ను తినేస్తాను.” అని, పని అడగడం మొదలు పెట్టాడు. వీడు ఏం చేస్తాడు! కాశీనుంచి గనగను తెమ్మన్నాడు. అరక్షణంలో పట్టుకొచ్చాడు వాడు. తనవద్ద పదార్తాలులేవు, అగ్నిహోత్రంలేదు, ఉన్నాట్టుండి బ్రహ్మాండమైన భోజనం కల్పించమని అడిగాడు. అంతే, భోజనం వచ్చేసింది! ఏ పని చెప్పినా, వాడు క్షణంలో చేసేస్తున్నాడు! 

11. ఈ బ్రహ్మరాక్షసుడికి పని చెప్పకపోతే తనను తినేస్తాడు. ఏమీ తోచలేదు. ఇక వాడికి పనిచెప్పలేక పారిపోతున్నాడు. అలా పోతుంటే ఒక పెద్ద అరణ్యం కనబడింది. “ఇక్కడి చెట్లన్నీ శుభ్రంగా నరికేసెయ్యి, నేలఅంతా చదును చేసెయ్యి అంటే, అర ఘడియలో అలాచేసి వచ్చేసాడు! అక్కడ ఒక పట్టణనిర్మాణం చెయ్యమంటే, అదీ చేసాడు. ఒక పెద్ద చెరువును, నదిని నిర్మించమంటే, క్షణంలో అది అయిపోయింది. మళ్ళీ పనిచెప్పమన్నాడు వాడు! ఇక చేసేది లేక మళ్ళో పారిపోవటం మొదలెట్టాడు. 

12. చివరిగా ఆగి అక్కడ పెద్ద తాడిచెట్టు ఉన్నది, నువ్వు ఆ చెట్టును కింది నుంచి పైకి, పైనుంచి కిందికి, మళ్ళీ పైకి, కిందికి ఎక్కిదిగుతూ ఉండు, నేను చెప్పేవరకూ అలాగే చేస్తూఉండు. ఇంకే పనీ చెయ్యకు అన్నాడు. కొంతసేపు అలా చేసిన తరువాత, “బాబోయ్! నన్ను రక్షించు. ఈ తాటిచెట్టు నుంచి నన్ను వదిలిపెట్టు. ఇక నువ్వు స్మరిస్తేనే వస్తాను. నిన్ను చంపను, నీ జోలికిరాను అని వెళ్ళిపోయాడు.

13. అపరిమితమైన శక్తి గల వారికి ఏ పని చెప్పినా, అంతులేని పని చెప్పాలి. అలాగే మనసు కూడా! మనసుకు కూడా ఏ పని చెప్పినా, అది చేసి వెనక్కు వచ్చేస్తుంది. ఆ బ్రహ్మరాక్షసుడి లాంటిదే మనసుకూడా. దానికి సాధ్యం కానిది ఒకటి అప్పగిస్తే, అంతలోనే అది నశిస్తుంది. 

14. మనసు నశించాలి కదా! “ఆత్మ ఎక్కడ ఉందో చూచిపెట్టు” అని మనస్సును అడగాలి. అంటే అన్ని రకాల పనులూ చేస్తుంది ఈ మనస్సు. దానికి సాధ్యం కానిది లేదు. “ఆత్మ వస్తువు ఎక్కడ ఉందో వెతికిపెట్టు” అని అన్నరనుకోండి! ఏంచేస్తుంది మనస్సు? దానికి అది దొరకక, విసిగివేసారి ఎక్కడో నశిస్తుంది అది.

15. అంటే, మనస్సు, “హృదయంలోని జ్యోతిని చూడు” అంటే, చూచి ఇవతలికి వస్తుంది ఆ బ్రహ్మరాక్షసుడివలె. అలాగే, “ఒకమాటు శ్రీహరిని ధ్యానం చెయ్యి” అంటే. చేసి, “ధ్యానం అయిపోయింది” అంటుంది. “కాసేపు రుద్రుణ్ణి ధ్యానం చెయ్యి” అంటే, చేసి వచ్చేస్తుంది. చెప్పినపనినల్లా చేసి వచ్చేస్తుంది. 

16. అందుకని, దానికి అంతులేని పనిచెప్పాలి. ఇంక దాని అంతు ఆ కార్యమే కనుక్కుంటుంది. అది ఒక్కక్షణమే. అందువల్ల. మనస్సు ఎక్కడ నిల్సుతుందో, అక్కడ దానిని నిలుపమన్నాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM
www.facebook.com/groups/maharshiwisdom/
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Seeds Of Consciousness - 318 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 167. The 'I am' is there even without your saying so. Once you understand the 'I am', there is nothing further to understand. 🌻*

The knowledge 'I am' is ever there, residing in all at all times. Not a single thing exists which is devoid of the 'I am'. It expresses itself through the five elements and three qualities. As the combination of the elements and qualities is, so the expression of 'I am'. This expression could be good or bad depending on the combination, but the 'I am' itself stands in its purity. 

Understanding the 'I am' is the very basis of the teaching, that done, there remains nothing further to be understood. What follows hereafter is the 'Sadhana' (practice), which is the meditation on the 'I am'. Your earnestness, sincerity and intensity of the practice will determine further progress.
 
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #SeedsofConsciousness #Nisargadatta
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 193 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - నాల్గవ దివ్య యానము - సద్గురువు -అవతార పురుషుడు. - 7 🌻*

*మహిమా ప్రదర్శనములు. వివిధములైన సిద్ధులు, లేక చమత్కారములు.* 

723. 
1. అవతార పురుషుడు చేయు మహిమలు
2. సద్గురువు చేయు మహిమలు
3. మహాపురుషుడు (5వ భూమిక) సత్పరుషుడు (6వ భూమిక) చేయు మహిమలు.
4. 1, 2, 3, 4 భూమికలలో నుండు యోగులు చేయు మహిమలు.

1. సార్వజనీనముగా అవసరమైనప్పుడు, అవతార పురుషుడు విశ్వాత్మక లక్షణముతో మహిమలు చేయును. పరిస్థితుల ననుసరించి, అవతార పురుషుడు అంతవరకు 6, 5 లేక 4 భూమికలలో నుండును. ఆ మహిమలు చాల ఉధృతముగ నున్నప్పుడు అంతవరకు 4వ భూమికలో నుండును.

2. సద్గురువు కూడా మానవుల ఆధ్యాత్మిక శ్రేయస్సుకై మహిమలు చేయును. కాని అవతార పురుషుడు చేసినట్లు, విశ్వమంతటికి సంబంధించి యుండవు. అవసర పరిస్థితులను బట్టి, అవతార పురుషుని వలెనే, అంతవరకు 6, 5, 4 భూమికలలో నుండును. 7వ భూమికలో బ్రహ్మీభూతుడు మహిమలు చేయడు. ఎందుచేత ననగా ఆతనికి యీ సృష్టిలేదు. కాబట్టి. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #భగవద్ధర్శిని #అవతారమెహర్
Join and share
Meher Baba అవతార్‌ మెహర్‌ బాబా
www.facebook.com/groups/avataarmeherbaba/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 48 / Sri Lalita Sahasranamavali - Meaning - 48 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 48. నిష్క్రోధా, క్రోధశమనీ, నిర్లోభా, లోభనాశినీ ।*
*నిఃసంశయా, సంశయఘ్నీ, నిర్భవా, భవనాశినీ ॥ 48 ॥🍀*

🍀 168. నిష్క్రోధా - 
క్రోధము లేనిది.

🍀 169. క్రోధశమనీ - 
క్రోధమును పోగొట్టునది.

🍀 170. నిర్లోభా - 
లోభము లేనిది.

🍀 171. లోభనాశినీ -
 లోభమును పోగొట్టునది.

🍀 172. నిస్సంశయా - 
సందేహములు, సంశయములు లేనిది.

🍀 173. సంశయఘ్నీ - 
సంశయములను పోగొట్టునది.

🍀 174. నిర్భవా - 
పుట్టుక లేనిది.

🍀 175. భవనాశినీ -
 పుట్టుకకు సంబంధించిన సంసార బంధక్లేశములు లేకుండా చేయునది.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 48 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 48. niṣkrodhā krodhaśamanī nirlobhā lobhanāśinī |*
*niḥsaṁśayā saṁśayaghnī nirbhavā bhavanāśinī || 48 ||🌻*

🌻168 ) Nishkrodha -  
 She who is devoid of anger

🌻 169 ) Krodha - samani -   
She who destroys anger

🌻 170 ) Nir Lobha -   
She who is not miserly

🌻 171 ) Lobha nasini -   
She who removes miserliness

🌻 172 ) Nissamsaya -   
She who does not have any doubts

🌻 173 ) Samsayagni -   
She who clears doubts

🌻 174 ) Nirbhava -   
She who does not have another birth

🌻 175 ) Bhava nasini -   
She who helps us not have another birth.

Continues..
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/SriMataChaitanyam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 48 / Sri Vishnu Sahasra Namavali - 48 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*

*కన్యా రాశి- ఉత్తర నక్షత్ర 4వ పాద శ్లోకం*

*🍀 48. యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుస్సత్రం సతాంగతిః।*
*సర్వదర్శీ నివృత్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం॥ 🍀*

🍀 445) యజ్ఞ: - 
యజ్ఞ స్వరూపుడు.

🍀 446) ఇజ్య: - 
యజ్ఞములచే ఆరాధించుబడువాడు.

🍀 447) మహేజ్య: - 
గొప్పగా పూజింపదగినవాడు.

🍀 448) క్రతు: - 
యజ్ఞముగా నున్నవాడు.

🍀 449) సత్రమ్ - 
సజ్జనులను రక్షించువాడు.

🍀 450) సతాంగతి: - 
సజ్జనులకు పరమాశ్రయ స్థానమైనవాడు.

🍀 451) సర్వదర్శీ - 
సకలమును దర్శించువాడు.

🍀 452) విముక్తాత్మా - 
స్వరూపత: ముక్తి నొందినవాడు.

🍀 453) సర్వజ్ఞ: - 
సర్వము తెలిసినవాడు.

🍀 454) జ్ఞానముత్తమమ్ - 
ఉత్తమమైన జ్ఞానము కలవాడు భగవానుడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 48 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

*Sloka for Kanya Rasi, Uttara 4th Padam*

*🌻 48. yajña ijyō mahejyaśca kratuḥ satraṁ satāṁ gatiḥ |*
*sarvadarśī vimuktātmā sarvajñō jñānamuttamam || 48 || 🌻*

🌻 445. Yajñaḥ: 
One who is all-knowing.

🌻 446. Ijayaḥ: 
One who is fit to be worshipped in sacrifices.

🌻 447. Mahejyaḥ: 
He who, of all deities worshipped, is alone capable of giving the blessing of liberation.

🌻 448. Kratuḥ: 
A Yajna in which there is a sacrificial post is Kratu.

🌻 449. Satraṁ: 
One who is of the nature of ordained Dharma.

🌻 450. Satāṁ-gatiḥ: 
One who is the sole support for holy men who are seekers of Moksha.

🌻 451. Sarva-darśī: 
One who by His inborn insight is able to see all good and evil actions of living beings.

🌻 452. Vimuktātmā: 
One who is naturally free.

🌻 453. Sarvagñaḥ: 
One who is all and also the knower of all.

🌻 454. Jñānam-uttamam: 
That consciousness which is superior to all, birthless, unlimited by time and space and the cause of all achievements.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasra
www.facebook.com/groups/vishnusahasranam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

నడు భౌమాశ్విని యోగం

🌷 నడు భౌమాశ్విని యోగం 🌷

అశ్విని నక్షత్రంతో కూడిన మంగళవారం ను భౌమాశ్విని యోగం అంటారు.... ఇది అరుదుగా లభ్యమయ్యే యోగం..... ఈ రోజు దేవీ అధర్వశీర్షం ప్రకారం దేవీమంత్రపారాయణ చేయడం ద్వారా మహామృత్యువును కూడా తరమవచ్చు అనేది ఆర్యోక్తి! అమ్మవారి కి ఇష్టమైన నవమి తిధితో కలసి రావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.....

భౌమాశ్విన్యాం మహాదేవీసన్నిధౌ జప్త్వా మహామృత్యుం తరతి !
స మహామృత్యుం తరతి ! య ఏవం వేద ! ఇత్యుపనిషత్!

భౌమాశ్విని పర్వదినం నాడు అనగా 16మార్చి 2021మంగళవారం, తృతీయా తిథి, అశ్విని నక్షత్రం నాడు అమ్మవారి అనుగ్రహం కోసం అందరూ, శంకరులు కైలాసం నుండి తెచ్చిన మంత్రరూపమైన స్తోత్రం సౌందర్యలహరి, లలితా సహస్ర నామ పారాయణం, విరాట పర్వంలోని అమ్మవారి స్తోత్ర పారాయణం, సప్తశ్లోకి పారాయణం, దుర్గా చంద్రకళా స్తుతి పారాయణం, అచ్యుతానంతగోవింద నామ జపం, మన్యుసూక్త పారాయణ, సుబ్రహ్మణ్య స్వామి మాలమంత్ర జపం... ఇలా ఏది వీలు అయితే అది వారి శక్త్యానుసారం చేసుకోవచ్చు..... చండీమూలమన్త్ర జపం, హోమం ఇంట్లోకానీ, గుడిలోకాని ప్రజలు ఎక్కువ గుమిగూడకుండా, ప్రజా క్షేమం కోరి నిర్వహించిన కూడా మంచిదే! ఈ భౌమాశ్వని పర్వకాలంలో చేసే అనుష్ఠానానికి మన నిత్య అనుష్ఠానానికన్నా ఎక్కువ ఫలితాలుంటాయి....

యా దేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థితా!నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః !!

రోగానశేషా నపహంసి తుష్టారుష్టాతుకామాన్ సకలాబభీష్టాన్!
త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాహ్యా శ్రయతాం ప్రయాంతి !!

స్వర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి!
ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనం !!

ఈ సందర్భంగా పరాశక్తి అనుగ్రహం తో మహాశక్తిమంతులుగా మంచి కార్యక్రమాలు చేయడానికి ప్రార్థన – ప్రయత్నం రెండూ చేసుకోవాలి…

సర్వేజనాసుఖినో భవంతు...

16 Mar 2021

శ్రీ లలితా సహస్ర నామములు - 48 / Sri Lalita Sahasranamavali - Meaning - 48

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 48 / Sri Lalita Sahasranamavali - Meaning - 48 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 48. నిష్క్రోధా, క్రోధశమనీ, నిర్లోభా, లోభనాశినీ ।
నిఃసంశయా, సంశయఘ్నీ, నిర్భవా, భవనాశినీ ॥ 48 ॥🍀

🍀 168. నిష్క్రోధా -
క్రోధము లేనిది.

🍀 169. క్రోధశమనీ -
క్రోధమును పోగొట్టునది.

🍀 170. నిర్లోభా -
లోభము లేనిది.

🍀 171. లోభనాశినీ -
లోభమును పోగొట్టునది.

🍀 172. నిస్సంశయా -
సందేహములు, సంశయములు లేనిది.

🍀 173. సంశయఘ్నీ -
సంశయములను పోగొట్టునది.

🍀 174. నిర్భవా -
పుట్టుక లేనిది.

🍀 175. భవనాశినీ -
పుట్టుకకు సంబంధించిన సంసార బంధక్లేశములు లేకుండా చేయునది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 48 🌹

📚. Prasad Bharadwaj

🌻 48. niṣkrodhā krodhaśamanī nirlobhā lobhanāśinī |
niḥsaṁśayā saṁśayaghnī nirbhavā bhavanāśinī || 48 ||🌻

🌻168 ) Nishkrodha -
She who is devoid of anger

🌻 169 ) Krodha - samani -
She who destroys anger

🌻 170 ) Nir Lobha -
She who is not miserly

🌻 171 ) Lobha nasini -
She who removes miserliness

🌻 172 ) Nissamsaya -
She who does not have any doubts

🌻 173 ) Samsayagni -
She who clears doubts

🌻 174 ) Nirbhava -
She who does not have another birth

🌻 175 ) Bhava nasini -
She who helps us not have another birth.

Continues..

🌹 🌹 🌹 🌹 🌹

16 Mar 2021

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 193

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 193 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - నాల్గవ దివ్య యానము - సద్గురువు -అవతార పురుషుడు. - 7 🌻

మహిమా ప్రదర్శనములు. వివిధములైన సిద్ధులు, లేక చమత్కారములు.

723.

1. అవతార పురుషుడు చేయు మహిమలు

2. సద్గురువు చేయు మహిమలు

3. మహాపురుషుడు (5వ భూమిక) సత్పరుషుడు (6వ భూమిక) చేయు మహిమలు.

4. 1, 2, 3, 4 భూమికలలో నుండు యోగులు చేయు మహిమలు.

1. సార్వజనీనముగా అవసరమైనప్పుడు, అవతార పురుషుడు విశ్వాత్మక లక్షణముతో మహిమలు చేయును. పరిస్థితుల ననుసరించి, అవతార పురుషుడు అంతవరకు 6, 5 లేక 4 భూమికలలో నుండును. ఆ మహిమలు చాల ఉధృతముగ నున్నప్పుడు అంతవరకు 4వ భూమికలో నుండును.

2. సద్గురువు కూడా మానవుల ఆధ్యాత్మిక శ్రేయస్సుకై మహిమలు చేయును. కాని అవతార పురుషుడు చేసినట్లు, విశ్వమంతటికి సంబంధించి యుండవు. అవసర పరిస్థితులను బట్టి, అవతార పురుషుని వలెనే, అంతవరకు 6, 5, 4 భూమికలలో నుండును. 7వ భూమికలో బ్రహ్మీభూతుడు మహిమలు చేయడు. ఎందుచేత ననగా ఆతనికి యీ సృష్టిలేదు. కాబట్టి.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

16 Mar 2021

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 251

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 251 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. కాశ్యప మహర్షి - 2 🌻

9. ఈ విషయం చాలా చమత్కారంగా ఉంది. మనసును శంకించటం ఎలాగ అంటారు. ఉదాహరణకు ఒక బ్రహ్మరాక్షసుడున్నాడు. వాడు ఒకడిని పట్టుకున్నడనుకోండి. అలా పట్టుకుని అతడి వశంలో ఉండి, ఘడియ ఘడియకూ తనకు ఏదయినా పని చెప్పమని, “నీవు నాకు చేతినిండా పనిచెప్పు, అట్లాగైతే నేను నిన్ను సేవిస్తూ ఉంటాను.

10. నాకు ఎప్పుడయితే పని చెప్పలేకపోతావో అప్పుడు నేను నిన్ను తినేస్తాను.” అని, పని అడగడం మొదలు పెట్టాడు. వీడు ఏం చేస్తాడు! కాశీనుంచి గనగను తెమ్మన్నాడు. అరక్షణంలో పట్టుకొచ్చాడు వాడు. తనవద్ద పదార్తాలులేవు, అగ్నిహోత్రంలేదు, ఉన్నాట్టుండి బ్రహ్మాండమైన భోజనం కల్పించమని అడిగాడు. అంతే, భోజనం వచ్చేసింది! ఏ పని చెప్పినా, వాడు క్షణంలో చేసేస్తున్నాడు!

11. ఈ బ్రహ్మరాక్షసుడికి పని చెప్పకపోతే తనను తినేస్తాడు. ఏమీ తోచలేదు. ఇక వాడికి పనిచెప్పలేక పారిపోతున్నాడు. అలా పోతుంటే ఒక పెద్ద అరణ్యం కనబడింది. “ఇక్కడి చెట్లన్నీ శుభ్రంగా నరికేసెయ్యి, నేలఅంతా చదును చేసెయ్యి అంటే, అర ఘడియలో అలాచేసి వచ్చేసాడు! అక్కడ ఒక పట్టణనిర్మాణం చెయ్యమంటే, అదీ చేసాడు. ఒక పెద్ద చెరువును, నదిని నిర్మించమంటే, క్షణంలో అది అయిపోయింది. మళ్ళీ పనిచెప్పమన్నాడు వాడు! ఇక చేసేది లేక మళ్ళో పారిపోవటం మొదలెట్టాడు.

12. చివరిగా ఆగి అక్కడ పెద్ద తాడిచెట్టు ఉన్నది, నువ్వు ఆ చెట్టును కింది నుంచి పైకి, పైనుంచి కిందికి, మళ్ళీ పైకి, కిందికి ఎక్కిదిగుతూ ఉండు, నేను చెప్పేవరకూ అలాగే చేస్తూఉండు. ఇంకే పనీ చెయ్యకు అన్నాడు. కొంతసేపు అలా చేసిన తరువాత, “బాబోయ్! నన్ను రక్షించు. ఈ తాటిచెట్టు నుంచి నన్ను వదిలిపెట్టు. ఇక నువ్వు స్మరిస్తేనే వస్తాను. నిన్ను చంపను, నీ జోలికిరాను అని వెళ్ళిపోయాడు.

13. అపరిమితమైన శక్తి గల వారికి ఏ పని చెప్పినా, అంతులేని పని చెప్పాలి. అలాగే మనసు కూడా! మనసుకు కూడా ఏ పని చెప్పినా, అది చేసి వెనక్కు వచ్చేస్తుంది. ఆ బ్రహ్మరాక్షసుడి లాంటిదే మనసుకూడా. దానికి సాధ్యం కానిది ఒకటి అప్పగిస్తే, అంతలోనే అది నశిస్తుంది.

14. మనసు నశించాలి కదా! “ఆత్మ ఎక్కడ ఉందో చూచిపెట్టు” అని మనస్సును అడగాలి. అంటే అన్ని రకాల పనులూ చేస్తుంది ఈ మనస్సు. దానికి సాధ్యం కానిది లేదు. “ఆత్మ వస్తువు ఎక్కడ ఉందో వెతికిపెట్టు” అని అన్నరనుకోండి! ఏంచేస్తుంది మనస్సు? దానికి అది దొరకక, విసిగివేసారి ఎక్కడో నశిస్తుంది అది.

15. అంటే, మనస్సు, “హృదయంలోని జ్యోతిని చూడు” అంటే, చూచి ఇవతలికి వస్తుంది ఆ బ్రహ్మరాక్షసుడివలె. అలాగే, “ఒకమాటు శ్రీహరిని ధ్యానం చెయ్యి” అంటే. చేసి, “ధ్యానం అయిపోయింది” అంటుంది. “కాసేపు రుద్రుణ్ణి ధ్యానం చెయ్యి” అంటే, చేసి వచ్చేస్తుంది. చెప్పినపనినల్లా చేసి వచ్చేస్తుంది.

16. అందుకని, దానికి అంతులేని పనిచెప్పాలి. ఇంక దాని అంతు ఆ కార్యమే కనుక్కుంటుంది. అది ఒక్కక్షణమే. అందువల్ల. మనస్సు ఎక్కడ నిల్సుతుందో, అక్కడ దానిని నిలుపమన్నాడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

16 Mar 2021

శ్రీ శివ మహా పురాణము - 371

🌹 . శ్రీ శివ మహా పురాణము - 371 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 10

🌻. కుజ గ్రహోత్పత్తి - 1 🌻

నారదుడిట్లు పలికెను -

ఓ విష్ణు శిష్యా! మహాత్మా! విధీ! ప్రభూ! నీవు శివ భక్తులలో శ్రేష్ఠుడవు. ఈ శివలీలను నాకు సంగ్రహముగా ప్రీతితో నీవు చెప్పదగుదువు(1). సతీ విరహముతో కూడి యున్న శివుడు ఏమి చేసెను? శివుడు తపస్సును చేయుటకై హిమవత్పర్వతాగ్ర భాగమునకు ఎప్పుడు వచ్చెను? ఆ చరితమును చెప్పుము (2). శివశివులకు మధ్య జరిగిన సంభాషణ ఎట్టిది? మన్మథుడు నశించిన తీరు ఏది? పార్వతి తపస్సును చేసి మంగళ స్వరూపుడగు శివుని పొందిన విధమెట్టిది? (3) ఓ బ్రహ్మా! ఈ వృత్తాంతమునంపతనూ చెప్పి, ఇతరమగు శివచరితమును కూడ నీవు చెప్పదగుదువు. ఈ శుభ చరితము నాకు మహానందమును కలిగించుచున్నది. (4).

సూతుడిట్లు పలికెను-

నారదుని ఈప్రశ్నను విని, లోకపాలురందరిలో శ్రేష్ఠుడగు బ్రహ్మశివుని పాదపద్మమునలు స్మరించి మిక్కిలి ప్రీతితో ఇట్లనెను (5)

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ దేవర్షీ! నీవు శివభక్తులలో శ్రేష్ఠుడవు. పవిత్రము చేయునది, మంగళములనిచ్చునది, భక్తిని పెంచునది అగు శివుని ఉత్తమకీర్తిని ఇపుడు శ్రధ్ధగా వినుము (6). ప్రియురాలి వియోగముచే దుఃఖితుడై యున్న శంభుడు తన నివాసమగు కైలాసమునకు తిరిగి వచ్చి, ప్రాణముల కంటె అధికముగా తనకు ప్రియురాలైన సతీదేవిని మనస్సులోస్మరించెను(7). ఆయన లోకపు పోకడను అనుకరించువాడై గణములను పిలిచి వారి యెదట ప్రేమను పెంపొందిచు ఆమె గుణములను మిక్కిలి ప్రీతితో వర్ణించెను(8). లీలా పండితుడగు ఆ శివుడు సద్గతినిచ్చు గృహస్థాశ్రమమును విడిచి పెట్టి దిగంబరుడై లోకములనన్నిటినీ తిరుగాడెను(9).

భక్తులకు మంగళమునిచ్చు ఆ శంకరుడు సతీ వియోగముచే దుఃఖితుడై అమెను ఎక్కడను గాన జాలక కైలాస పర్వతమునకు తిరిగి వచ్చెను(10). అయన ప్రయత్నపూర్వకముగా మనస్సును నిగ్రహించి దుఃఖానాశకమగు సమాధిని పొంది నాశరహితమగు ఆత్మ స్వరూపమును దర్శించు చుండెను(11).మూడు గుణములకు అతీతమైన వాడు, వికారములు లేనివాడు, పరబ్రహ్మ స్వరూపుడు, మాయను వశము చేసుకున్నవాడు అగు ఆశివప్రభుడు ఈ తీరున చిరకాలము సమాధియందుడెను (12). ఆయన అనేక సంవత్సరములు ఇట్లు గడిపి తరువాత సమాధి నుండి బయటకు వచ్చెను. అపుడు జరిగిన వృత్తాంతమును మీకు చెప్పెదను (13).

ఆ ప్రభుని లలాట భాగమునుండి శ్రమ వలన చెమట పుట్టి నేలపై బడగా, అది వెంటనే ఒక శిశువాయెను(14). ఓమహార్షీ! ఆ శిశువు నాల్గు భుజములతో, అరుణ వర్ణముతో, సుందరమగు ఆకారముతో, దివ్యకాంతులీనుచూ, శోభాయుక్తమై, ఇతరులు చూడ శక్యము కాని తేజస్సుతో వెలుగొందెను(15).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

16 Mar 2021

గీతోపనిషత్తు -171

🌹. గీతోపనిషత్తు -171 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 14

🍀 14. పూర్ణ జిజ్ఞాస - జీవుల యందలి దైవముతో అనుసంధానము చెందుట యోగము. జీవుడహంకార ప్రజ్ఞ. అతడు త్రిగుణాత్మకుడు. నే నున్నానను ప్రత్యేక భావము కలవాడు. జీవులయందున్న దేవుడు త్రిగుణాతీతుడు. అంతర్యామి. అన్నిటియందు గుణముల కావల ఉండువాడు. కావున సర్వాంతర్యామి. అతడాధారముగ గుణము లేర్పడి, అందుండి ప్రత్యగాత్మగ జీవుడేర్పడు చున్నాడు. నిజమునకు జీవుడు స్థితి మార్పు చెందిన దైవమే. జీవుని పేరు నేను. దైవము పేరు కూడ నేనే. నేనను జీవుడు, నేను అను దైవముతో అనుసంధానము చెందుటకు చేయు ప్రయత్నమే యోగాభ్యాసము. నేనను ప్రత్యేక ప్రజ్ఞ, నేనను అంతర్యామి ప్రజ్ఞతో జతపడవలెను. 🍀

ప్రశాంతాత్మా విగతజీ ర్ర్బహ్మచారిత్రతే స్థితః |
మన స్సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః || 14

ప్రశాంతమైన మనస్సు కలవాడై, భయము వీడినవాడై బ్రహ్మ యందు చరించుట స్థిరమగు వ్రతము కలవాడై, సంయమము చెందిన ఇంద్రియములతో కూడిన మనస్సు కలవాడై, 'నా' యందు ఆసక్తి, ప్రేమ కల చిత్తము కలవాడై, మత్పరుడై 'నా'తో ముడిపడిన వాడై ఉండవలెను.

శ్రీకృష్ణుడు అందించిన ఈ ఉపదేశము ధ్యానమున మణి పూస వంటిది. ఇచ్చట 'నేను' అని కృష్ణుడు వాడిన పదము సాధకుని యందు అంతర్యామిగనున్న నేను. అనగ జీవుని యందలి దైవము.

జీవుల యందలి దైవముతో అనుసంధానము చెందుట యోగము. జీవుడహంకార ప్రజ్ఞ. అతడు త్రిగుణాత్మకుడు. నే నున్నానను ప్రత్యేక భావము కలవాడు. జీవులయందున్న దేవుడు త్రిగుణాతీతుడు. అంతర్యామి. అన్నిటియందు గుణముల కావల ఉండువాడు. కావున సర్వాంతర్యామి. అతడాధారముగ గుణము లేర్పడి, అందుండి ప్రత్యగాత్మగ జీవుడేర్పడు చున్నాడు. నిజమునకు జీవుడు స్థితి మార్పు చెందిన దైవమే.

జీవుని పేరు నేను. దైవము పేరు కూడ నేనే. నేనను జీవుడు, నేను అను దైవముతో అనుసంధానము చెందుటకు చేయు ప్రయత్నమే యోగాభ్యాసము. నేనను ప్రత్యేక ప్రజ్ఞ, నేనను అంతర్యామి ప్రజ్ఞతో జతపడవలెను. ఇది అంటు కట్టుట వంటిది. అట్లు భావనతో కట్టివుంచుటచే, క్రమముగ రెండుగ నున్నవి ఒకటిగ నేర్పడగలవు. “యుక్త ఆసి" అని శ్లోకము చెప్పుచున్నది. అనగ కలిపి యుంచవలెనని అర్థము. ఇట్లు చాల కాలము కలిపియుంచుటకు ప్రయత్నము సాగవలెను.

ఈ ప్రయత్నమున శ్రద్ధ, భక్తి దైనందినముగ నున్నచో క్రమముగ ప్రశాంతత చిక్కును. భయము తొలగును. అంతర్యామి యందే చరించు దినచర్య ఆరంభమగును. ఇంద్రియములు మనస్సు అనుకూలము లగును. ఇది ఒక పద్ధతి. ఈ పద్ధతి యందు దైవమే కర్తయై నిలచును.

మరియొక పద్ధతి ప్రశాంతమగు మనస్సు నేర్పరచుకొనుట, భయమును తొలగించు కొనుట, మనస్సు ఇంద్రియములను మచ్చిక చేసుకొనుట, బ్రహ్మము నందు చరించుట తానుగ స్వప్రయత్నమున నిర్వర్తించుకొనుచు, తన యందలి అంతర్యామితో యోగించుట.

ఇందు మొదటి పద్ధతి భక్తునకు సహజము. అతడు దైవమే ఉపాయమని, అంతట, అన్నిట దైవమునే చూచుచు, దైవ యుక్తుడగు చుండును. జ్ఞాని పురుష ప్రయత్నమున తనను తాను సమకూర్చుకొని దేవునితో యోజించుటకు ప్రయత్నించును. ఇరువురికిని ఫలప్రదాత దైవమే. ప్రతినిత్యము పై తెలిపిన మూడు శ్లోకముల ననుసరించుచు, నిర్ణీత సమయమున ధ్యానము నాచరించుట ప్రధానమని తెలియవలెను.

కేవలము దైవమునందే ఆసక్తి, ప్రేమ కల వారు ఆత్మ సంయమమును సులభముగ బడయుదురు. వారి దినచర్య యంతయు కూడ దైవదర్శనమునే అంతట, అన్నిట చేయుచు నిర్వర్తించుకొను చుందురు. అట్టి వారికి ఆత్మ సంయమము శీఘ్రగతిని సిద్ధించును.

ఇతరములు గోచరించు వారికి సిద్ధించుట కష్టము. చిత్త మెంతవరకు దైవము నాశించునో అంతవరకు యోగము జరుగుచుండును. చిత్త మితర విషయములపై ఆసక్తిని చూపినపుడు యోగ మాగును. కావున పూర్ణ జిజ్ఞాసువులకే ఆత్మ సంయమము సాధ్యమగునని తెలియవలెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

16 Mar 2021

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 236 / Sri Lalitha Chaitanya Vijnanam - 236

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 236 / Sri Lalitha Chaitanya Vijnanam - 236 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

🍀 58. చతుఃషష్ట్యుపచారాఢ్యా, చతుష్షష్టి కళామయీ ।
మహా చతుష్షష్టి కోటి యోగినీ గణసేవితా ॥ 58 ॥🍀

🌻236. 'చతుషష్టి కళామయీ' 🌻

శ్రీమాత తత్త్వము అరువది నాలుగు కళల మయమని అర్థము. కళలనగా కాంతులు. శ్రీమాత కాంతులు అరువది నాలుగు. ఆమెకు జరుపు ఆరాధనము అరువది నాలుగు ఉపచారములతో కూడి యున్నది. ఈ ఉపచారములు నేర్చుటకు అరువది నాలుగు విద్యలున్నవి. అవి ఈ విధముగ నున్నవి.

1) అక్షరజ్ఞానము (ఇదియే అక్షరాభ్యాసముగ ప్రథమ విద్య, 2) 2) చదువుట, 3) వ్రాయుట, 4) బహు భాషా జ్ఞానము, 5) పై భాషల యందు కవిత్వము చెప్పుట, 6) విన్నదానిని విన్నట్లు చెప్పుట, 7) జూదము, 8) వేదములు, 9) వేదాంగములు ఆరు, 10) శాస్త్రములు,

11) శాస్త్రాంగములు, 12) తంత్రములు - 6, 13) పురాణములు, 14) స్మృతులు, 15) కావ్యములు, 16) అలంకారములు, 17) నాటకములు, 18) శాంతము, 19) వశ్యము, 20) ఆకర్షణము,b
21) విద్వేషణము, 22) ఉచ్ఛాటనము, 23) మారణము 6 విధములు 24) గతి స్తంభనము, 25) జల స్తంభనము, 26) వృష్టి స్తంభనము, 27) అగ్ని స్తంభనము, 28) ఆయుధ స్తంభనము, 29) భాషా స్తంభనము, 30) వీర్య స్తంభనము, 31) శిల్ప విద్య, 32) గజహయ శిక్షణము, 33) రథ శిక్షణము, 34) నర శిక్షణము, 35) సాముద్రికము, 36) మల్లయుద్ధము, 37) పాక శిక్షణము, 38) విష శాస్త్రము, 39) సుషిరము, 40) అనద్ధము, 41) ఘనము, 42) ఇంద్రజాలము, 43) నృత్యము, 44) గీతము, 42) రసవాదము, 46) రత్న పరీక్ష, 47) చౌర్యము, 48) ధాతు పరీక్ష, 49) అదృశ్యము మొత్తము అరువది నాలుగు.

ఈ విద్యలన్నియూ కలవాడు పూర్ణ పురుషుడే. శ్రీకృష్ణుడు అన్ని విద్యలను ప్రదర్శించి చూపెను. ధర్మరాజాదులు, భీష్మ ద్రోణాదులు, ఇతర మహావీరులు, యిందలి కొన్ని విద్యలే యెరిగి యున్నారు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 236 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Catuḥṣaṣṭi-kalāmayī चतुःषष्टि-कलामयी (236) 🌻

She is in the form of sixty four types of arts. Kalā means art. There are sixty four types of arts in tantra śāstra-s. No concrete evidence is available to confirm or dispute these sixty four types. But these arts originate from aṣṭama siddhi (the eight super human powers). Śiva Himself declares to Pārvatī about these arts. Saundarya Laharī (verse 31) says Catuḥ-ṣaṣṭyā tantraiḥ sakalam meaning that these sixty four tantra-s constitute everything.

The above referred verse says, “Having deluded the entire universe with the sixty four tantra-s, which are devoted to producing various siddhis relating to each, the Lord of jīva-s (souls) again brought into this universe, due to Your compulsion, Your mantra (Pañcadaśī), which is the sole means of achieving, by itself all the objects of human desires.” These tantras originate from the Pañcadaśī mantra and culminate in the Pañcadaśī mantra.

Following are the sixty four arts: gītam, vādyam, nṛtyam, nātyam, ālekhyam, viśeṣaka-cchedyam, taṇḍula-kusuma-balivikārāḥ, puṣpāstaranam, daśana-vasanāṅgarāgāḥ, maṇi-bhūmikā-karma, śayana-racanam, udaka-vādyam, udaka-ghātaḥ, citrā_yogāḥ, mālya-granthana-vikalpāḥ, keśa-śekharāpīḍayojanam, nepathya-yogāḥ, karṇa-pattra-bhaṅgāḥ, gandha-yuktiḥ, bhūṣaṇa-yojanam, indrajālam, kaucumāra-yogāḥ, hasta-lāghavam, citraśākāpūpa-bhakṣya-vikāra-kriyā, pānaka-rasarāgāsava-yojanam, sūcīvāpa-karma, vīṇā-ḍama-ruka-sūtra-krīḍā, prahelikā, pratimā, durvacakayogāḥ, pustaka-vācanam, nāṭakākhyāyikā-darśanam, kāvya-samasyā-pūraṇam, paṭṭikā-vetrabāṇa-vikalpāḥ, tarkū-karmāṇi, takṣaṇam, vāstu-vidyā, rūpya-ratna-parīkṣā, dhātu-vādaḥ, maṇi-rāga-jñānam, ākara-jñānam, vṛkṣāyur-veda-yogāḥ, meṣa-kukkuṭa-lāvaka-yuddha-vidhiḥ, śuka-sārikā-pralāpanam, utsādanam, keśa-mārjana-kauśalam, akṣara-muṣṭikā-kathanam, mlechitaka-vikalpāḥ, deśa-bhāṣā-jñānam, puṣpa-śakaṭikā-nimitta-jñānam, yantra-mātṛkā, dhāraṇa-mātṛkā, saṃpāṭyam, mānasī_kāvya-kriyā, kriyā-vikalpāḥ, chalitakayogāḥ, abhidhāna-koṣa-cchando-jñānam, vastra-gopanāni, dyūta-viśeṣaḥ, ākarṣaṇa-krīḍā, bālaka-krīḍanakāni, vaināyikīnāṃ-vidyāṇāṃ-ñānam, vaijayikīnāṃ-vidyānāṃ-jñānam. However, the list varies from text to text.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

15 Mar 2021

బాహ్య పరస్పరాధీనత తప్పదు

🌹. బాహ్య పరస్పరాధీనత తప్పదు 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌,
📚. ప్రసాద్ భరద్వాజ

భారతదేశం ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. కాబట్టి, భారతదేశంలో మీరు ఏమైనా చెయ్యొచ్చు. మీరు స్వేచ్ఛగా ఉండండి. కానీ, అది ఇతరులకు సమస్యగా మారకూడదు. అలాగే మీరు ఇతరుల జీవితాలలో ఎప్పుడూ జోక్యం చేసుకోకండి. అవగాహన కలిగిన వ్యక్తి ఇతరుల స్వేచ్ఛను ఎంత గౌరవిస్తాడో తన స్వేచ్ఛను కూడా అంతగానే గౌరవిస్తాడు.

ఎందుకంటే, ఇతరులు మీ స్వేచ్ఛను గౌరవించకపోతే మీ స్వేచ్ఛ నాశనమైనట్లేకదా! కాబట్టి, అది పరస్పర అవగాహనపై ఆధారపడి ఉంటుంది. ‘‘నేను మీ స్వేచ్ఛను గౌరవిస్తాను, మీరు నా స్వేచ్ఛను గౌరవించండి. అప్పుడు ఇద్దరమూ స్వేచ్ఛగా ఉంటాం’’అనేది ఎవరూ హద్దులు మీరని రాజీవ్యవహారం. ఉదాహరణకు, మీ సొంత ఇంట్లో మీరు అర్థరాత్రి గట్టిగా పాడాలనుకున్నా పాడలేరు. ఎందుకంటే, అది పొరుగువారికి నిద్రాభంగం కలిగిస్తుంది. కాబట్టి, మీరు రాజీపడక తప్పదు.

బాహ్య ప్రపంచంలో మనం మనుషులతో మాత్రమే కాదు, అన్ని విషయాలలోనూ పరస్పరాధీనులమే. చెట్లు మీరు వదిలిన కార్బన్ డైయాక్సైడ్‌ను పీల్చుకుని మీకు కావలసిన ఆక్సిజన్‌ను అందిస్తాయి. వాటిని నరికేస్తే మీరు చనిపోతారు. ధూమపానం ద్వారా మీరు చెట్లకు కావలసిన కార్బన్ డైయాక్సైడ్‌ను అందించినప్పుడు అవి చాలా సంతోష పడతాయి. అందుకు మూలకారణం తెలుసుకోమని నేను మీకు చెప్తే వెంటనే మీరు ధూమపానం మానేస్తారు. అప్పుడు చెట్లు చాలా బాధపడతాయి.

కాబట్టి, మన పరస్పరాధీనత కేవలం చెట్లతో మాత్రమే కాదు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలతో కూడా ఉంది. నిజానికి, అన్నీ పరస్పరాధీనమైనవే. ఆ పరస్పరాధీనతను ఆనందించండి. అంతేకానీ, దానిని బానిసత్వంగా భావించకండి. పరస్పరాధీనత బానిసత్వంకాదు. మీరు ఇతరులపై, ఇతరులు మీపై ఆధారపడి ఉన్నారు. అది సోదరభావ సంబంధం. చిన్న గడ్డిపరకకు కూడా నక్షత్రాలతో సంబంధముంది.

కానీ, మీ అంతర్గత ప్రపంచంలో, మీ అంతర్గత సామ్రాజ్యంలో మీరు పూర్తి స్వేచ్ఛగా ఉండగలరు. అక్కడ మీరు దేనికోసమో బాధపడవలసిన, దేనిపైనో తిరుగుబాటు చెయ్యవలసిన అవసరముండదు. బాహ్య పరస్పరాధీనత తప్పదని, అనివార్యమని తెలుసుకోండి. జరిగే వాటిలో అది ఒక భాగం. దానిని ఏమీ చెయ్యలేము. ఏమీ చెయ్యలేని దానిని అంగీకరించడమొక్కటే మార్గం.

కాబట్టి, ఏదో ఇష్టం లేని రాజీనామా ఇచ్చినట్లు కాకుండా, మనస్ఫూర్తిగా, ఆనందంగా దానిని అంగీకరించండి. ఇది మన విశ్వం. మనం అందులో భాగం. మనం ద్వీపాలం కాదు, మొత్తం ఖండంలో భాగం.

మీ స్వేచ్ఛ్భావన మీ అహంభావం మూలాలలో ఎక్కడో నాటుకుని ఉంది. మనం అహాలం కాదు. అహానిది అవాస్తవ అస్తిత్వం. ఎందుకంటే, మనం విడిగా లేము. అప్పుడు మనకు అహాలు ఎలా ఉంటాయి?

‘‘నేను’’ అనేది కేవలం భాషకు ఉపయోగపడే పదం మాత్రమే. అంతేకానీ, దానికి ఎలాంటి సారంలేదు, వాస్తవికత లేదు. అది కేవలం ఏమీలేని నీడ మాత్రమే.

మీరు మీ ఎరుక లోతుల్లోకి వెళ్తున్నప్పుడు అంతర్గత స్వేచ్ఛ మీకు తప్పక లభిస్తుంది. మీరు మీ శరీరాన్ని, ఆలోచనా పద్ధతులను నిశితంగా పరిశీలిస్తూ సాక్షిగా ఉండండి.

అప్పుడు మెల్లమెల్లగా మీరు హిందు, మహమ్మదీయ, క్రైస్తవ, సామ్యవాదులు కాదని, అసలు మీరు ఎలాంటి ఆలోచన కాదని, చివరికి మీరు మనసు, కోపము, దురాశలు కూడా కాదని మీకు తెలుస్తుంది.

నిర్మల సాక్షీతత్వానుభవమే సంపూర్ణ స్వేచ్చానుభవం. కానీ, అది అంతర్గతానికి సంబంధించిన విషయం. అంతర్గతంలో పూర్తి స్వేచ్ఛతో ఉన్న వ్యక్తి బాహ్య స్వేచ్ఛను ఆశించడు. అలాంటి వ్యక్తికి ప్రకృతిని యథాతథంగా స్వీకరించగల సామర్థ్యముంటుంది.

సాక్షిగా ఉండడం ద్వారా అంతర్గత స్వేచ్ఛను సృష్టించి అందులో జీవించండి. అప్పుడు మీరు బాహ్య పరస్పరాధీనతను తెలుసుకో గలుగుతారు. అది ఒక అందమైన ఆశీర్వాదం. దానికి తల వొంచి అందులో విశ్రాంతి పొందండి. అంతేకానీ, దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చెయ్యవలసిన అవసరంలేదు. గుర్తుంచుకోండి: అసలైన స్వేచ్ఛాపరుడు మాత్రమే తల వొంచగలడు.

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹

15 Mar 2021

వివేక చూడామణి - 46 / Viveka Chudamani - 46

🌹. వివేక చూడామణి - 46 / Viveka Chudamani - 46 🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 14. శరీరము - 4 🍀

165. ప్రాణ శక్తి పంచ కర్నేంద్రియాలతో జత కలిపినపుడు గొప్ప పొర ఏర్పడి దాని వలన మరియొక కోశము తయారై, అది అన్ని కార్యక్రమాలలో తన ప్రత్యేకతను కనపరుస్తుంది.

166. ఆత్మ ఒక్కటే ఈ శరీరమునకు అతి శక్తివంతమైన కవచము. ఎందువలనంటే అది ప్రాణ వాయువుతో కూడి ఉన్నది. ఆ వాయువు ఈ శరీరము లోపల, బయటకు శ్వాస రూపంలో వ్యక్తమవుతుంది. కాని దానికి తెలియదు. తన యొక్క కష్ట సుఖాలతో ఇతరుల కష్ట సుఖాలకు శాశ్వతముగా ఆత్మ పై ఆధారపడి ఉంటుందని.

167. మనస్సుతో కూడిన జ్ఞానేంద్రియాలు మానసికమైన ఒక పొరగా ఏర్పడి, వివిధ విషయాలలో చలిస్తూ ‘నేను’ ‘నాది’ అని భావిస్తుంటుంది. అది శక్తివంతమైనది మరియు అనేకమైన పేర్లు, పనులలో భేదాలను సృష్టిస్తుంది. అది శక్తివంతమైన పొరలతో గత జన్మల స్మృతులతో నిండి ఉంటుంది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 VIVEKA CHUDAMANI - 46 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 The Body - 4 🌻

165. The Prana, with which we are all familiar, coupled with the five organs of action, forms the vital sheath, permeated by which the material sheath engages itself in all activities as if it were living.

166. Neither is the vital sheath the Self – because it is a modification of Vayu, and like the air it enters into and comes out of the body, and because it never knows in the least either its own weal and woe or those of others, being eternally dependent on the Self.

167. The organs of knowledge together with the mind form the mental sheath – the cause of the diversity of things such as "I" and "mine". It is powerful and endued with the faculty of creating differences of name etc., It manifests itself as permeating the preceding, i.e. the vital sheath.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

15 Mar 2021

దేవాపి మహర్షి బోధనలు - 57

🌹. దేవాపి మహర్షి బోధనలు - 57 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 38. మహర్షి దేవాపి సాన్నిధ్యము - 12 🌻

“శ్రీమతి బెయిలీ గారూ! మీ రెవరు? మీ రేమి చేయు చుందురు? మనమిదివరకు కలసినపుడు కూడా మీ గురించి నా కేమీ తెలుపలేదు. మిమ్ము గూర్చి మాకేమీ తెలియదు." అనిరి. నే నిట్లు పలికితిని, "నే నొక సామాన్య స్త్రీని, జన్మతః ఆంగ్లేయురాలను. ప్రస్తుతం అమెరికా దేశస్థురాలను. సామాన్యుల గూర్చి ఎవరికి మాత్రము ఏమి తెలియును? నా గురించి మీ కేమీ తెలియకపోవుట సహజము.

చెప్పుకొనుటకు కూడా నేను ఏ ప్రత్యేకతలూ లేని దానిని. నేను సంఘమున ఒక అజ్ఞాత వ్యక్తిని.” రాజుగారు మౌనముగా తలయూపి, నేనేమయినా కోరినచో తన సహచరులతో దానిని తప్పక నిర్వర్తించగలనని తెలిపి వెడలి పోయిరి. అటుపైన మామధ్య పరిచయము పెరిగినది.

ఒక రోజున కలిసి కారులో ప్రయాణము చేయుచుండగా అకస్మాత్తుగా రాజుగారు నావంక ప్రేమపూర్వకముగా చూసి, “శ్రీమతి బెయిలీ! నాకు కూడా జ్వాల కూల్ మహర్షిగారు వ్యక్తిగతముగా తెలియునని మీకు తెలుపు చున్నాను. ఈ వార్త మీకేమైనా సంతోషము కలిగించునా?” అని చిరునవ్వు నవ్విరి.

మరల బిత్తరపోవుట నావంతైనది. అప్రయత్న ముగ నిఠారుగ కూర్చొని “యస్ సర్” అని పలికితిని. ఒక క్షణమాగి “మీరు తెలిపిన వార్త నన్ను ఆశ్చర్యపరచుటయే గాక, హృదయమును తబ్బిబ్బు చేయుచున్నది. నా ఆనందమునకు అవధులు లేవు. మీరు మరల మరల నన్ను కలియుటలో యింత గంభీరమైన ఆంతర్యము కలదని నేనూహించలేదు. ఎంతైననూ మీరు గంభీరులు.” అని పలికితిని.

పరమగురువుల అనుయాయులందరూ గంభీరులే! పవిత్ర విషయములు రహస్యముగ నుంచగలిగినవారే వారి మార్గాను యాయులు కాగలరు అని తెలిపిరి. వారికే గురుసాన్నిధ్యము అందిన ఫలము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

15 Mar 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 338, 339 / Vishnu Sahasranama Contemplation - 338, 339

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 338/ Vishnu Sahasranama Contemplation - 338 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻338. తారః, तारः, Tāraḥ🌻

ఓం తారాయ నమః | ॐ ताराय नमः | OM Tārāya namaḥ

తారః, तारः, Tāraḥ

గర్భజన్మజరామృత్యు లక్షణాత్తారయన్ భయాత్ ।
తార ఇత్యుచ్యతే విష్ణుః ॥

గర్భవాసము, జన్మము, ముసలితనము, మృత్యువు అను వానివలన కలిగెడి భయమునుండి దాటించును గనుక అ విష్ణుదేవునకు తారః అని ప్రసిద్ధి.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 338🌹

📚. Prasad Bharadwaj

🌻338. Tāraḥ🌻

OM Tārāya namaḥ

Garbhajanmajarāmr̥tyu lakṣaṇāttārayan bhayāt,
Tāra ityucyate viṣṇuḥ.

गर्भजन्मजरामृत्यु लक्षणात्तारयन् भयात् ।
तार इत्युच्यते विष्णुः ॥

Since Lord Viṣṇu liberates beings from the fear of residence in womb, birth, old age, death etc., He is Tāraḥ.

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 2

Na te’bhvasyeśa bhavasya kāraṇaṃ vinā vinodaṃ bata tarkayāmahe,
Bhavo nirodhaḥ stitirpyavidyayā kr̥tā yatastvayyabhayāśrayātmani. 39.

:: श्रीमद्भागवते - दशमस्कन्धे द्वितीयोऽध्यायः ::

न तेऽभ्वस्येश भवस्य कारणं विना विनोदं बत तर्कयामहे ।
भवो निरोधः स्तितिर्प्यविद्यया कृता यतस्त्वय्यभयाश्रयात्मनि ॥ ३९ ॥

O Supreme Lord, You are not an ordinary living entity appearing in this material world as a result of fruitive activities. Therefore Your appearance or birth in this world has no other cause than Your pleasure potency. Similarly, the living entities, who are part of You, have no cause for miseries like birth, death and old age, except when these living entities are conducted by Your external energy.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

अशोकस्तारणस्तारः शूरश्शौरिर्जनेश्वरः ।अनुकूलश्शतावर्तः पद्मी पद्मनिभेक्षणः ॥ ३७ ॥

అశోకస్తారణస్తారః శూరశ్శౌరిర్జనేశ్వరః ।అనుకూలశ్శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః ॥ ౩౭ ॥

Aśokastāraṇastāraḥ śūraśśaurirjaneśvaraḥ ।Anukūlaśśatāvartaḥ padmī padmanibhekṣaṇaḥ ॥ 37 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 339 / Vishnu Sahasranama Contemplation - 339🌹

🌻339. శూరః, शूरः, Śūraḥ🌻

ఓం శూరాయ నమః | ॐ शूराय नमः | OM Śūrāya namaḥ

శూరః, शूरः, Śūraḥ

శూరో విక్రమణాత్ స్మృతః విక్రమమును అనగా పురుష ప్రయత్నమును ప్రదర్శించ సమర్థుడు. అత్యంత పౌరుషశాలి. విక్రమించును.

:: శ్రీమద్రామాయణము - అయోధ్యాకాండము ::

స శూరః పురుషవ్యాఘ్రః స్వబాహుబలమాశ్రితః ।
అసంత్రస్తోఽప్యరణ్యస్థో వేశ్మనీవ నివత్స్యతి ॥ 12 ॥

దివ్యాస్త్రసంపన్నుడును, నరశ్రేష్ఠుడును ఐన ఆ మహాత్ముని బాహుబలము తిరుగులేనిది. అందువలన అతడు అరణ్యమున సైతము స్వగృహమునందువలె ప్రశాంతముగా, నిర్భయముగా నివసింపగలడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 339🌹

🌻339. Śūraḥ🌻

OM Śūrāya namaḥ

Śūro vikramaṇāt smr̥taḥ / शूरो विक्रमणात् स्मृतः One of great prowess.

Śrīmad Rāmāyaṇa - Book II

Sa śūraḥ puruṣavyāghraḥ svabāhubalamāśritaḥ,
Asaṃtrasto’pyaraṇyastho veśmanīva nivatsyati. 12.

:: श्रीमद्रामायण - अयोध्याकांड ::

स शूरः पुरुषव्याघ्रः स्वबाहुबलमाश्रितः ।
असंत्रस्तोऽप्यरण्यस्थो वेश्मनीव निवत्स्यति ॥ १२ ॥

Rama the hero and the tiger among men, relying on the strength of his own arms, will dwell fearlessly in the forest as if in his own palace.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

अशोकस्तारणस्तारः शूरश्शौरिर्जनेश्वरः ।अनुकूलश्शतावर्तः पद्मी पद्मनिभेक्षणः ॥ ३७ ॥

అశోకస్తారణస్తారః శూరశ్శౌరిర్జనేశ్వరః ।అనుకూలశ్శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః ॥ ౩౭ ॥

Aśokastāraṇastāraḥ śūraśśaurirjaneśvaraḥ ।Anukūlaśśatāvartaḥ padmī padmanibhekṣaṇaḥ ॥ 37 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

15 Mar 2021

🌹. 64 కళలు వివరణ సహితం 🌹

 మణిద్వీప వర్ణన తాత్పర్యసహితం - Mani Dweepa Varnana - Telugu Bhaarath -  తెలుగు భారత్

*🌹. 64 కళలు వివరణ సహితం  🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

1.    గీతము (స్వర ప్రధానముగా, పద ప్రధానముగా, లయ ప్రధానముగా మనస్సు యొక్క అవధానము ప్రధానముగా లోలోపల గానము చేయబడునది),

2.    వాద్యము (ఇది తత-ఘన-అనవద్ధ-సుషిర భేదములచే నాలుగు విధములు ),

3.     నృత్యము (భావాభినయము),
4.    అలేఖ్యము (చిత్రలేఖనము),
5.    విశేషకచ్ఛేధ్యము (తిలక-పత్రభంగాది రచన),
6.    తండులకుసుమ బలివికారములు (బియ్యపుపిండితో, పూలతో భూతతృప్తి కొఱకు పెట్టెడి ముగ్గులు),
7.    పుష్పాస్తరణము (పూలశయ్యలను, అసనములను ఏర్పఱచుట),
8.    దశన వసనాంగరాగము (దంతములకు, వస్త్రములకు రంగులద్దుట),
9.    మణిభూమికాకర్మ (మణులతో బొమ్మలను చేయుట),
10.    శయన రచనము (ఋతువుల ననుసరించి శయ్యలను కూర్చుట),
11.    ఉదక వాద్యము (జలతరంగిణి),
12.    ఉదకాఘాతము (వసంతకేళిలో పిచికారుతో నీళ్ళు చిమ్ముట),
13.    చిత్రయోగములు (రకరకముల వేషములతో సంచరించుట),
14.    మాల్యగ్రథన వికల్పములు (చిత్ర విచిత్రములైన పూలమాలలను కూర్చుట),
15.    శేఖరకాపీడ యోజనము (పూలతో కిరీటమును, తలకు చుట్టును అలంకరించుకొనెడి పూల నగిషీని కూర్చుట),
16.    నేపథ్య ప్రయోగము (అలంకరణ విధానములు),
17.    కర్ణపత్రభంగములు (ఏనుగు దంతములతోను శంఖములతోను చెవులకు అలంకారములను కల్పించుకొనుట),
18.    గంధయుక్తి (అత్తరువులు మొదలగునవి చేసే నేర్పు ),
19.    భూషణ యోజనము (సామ్ములు పెట్టుకొను విధానము ),
20.    ఇంద్రజాలములు (చూపఱుల కనులను భ్రమింప జేయుట),
21.    కౌచిమారయోగము (సుభగంకరణాది యోగములు),
22.    హస్త లాఘవము (చేతులలోనున్న వస్తువులను మాయము చేయుట),
23.    విచిత్ర శాఖయూష భక్ష్యవికారములు (రకరకముల తినుబండములను వండుట),
24.    పానక రసరాగాసవ యోజనము (పానకములు, మద్యములు చేయుట),
25.    సూచీవానకర్మ (గుడ్డలు కుట్టుట),
26.    సూత్రక్రీడ (దారములను ముక్కలు చేసి, కాల్చి మరల మామూలుగా చూపుట),
27.    వీణాడమరుక వాద్యములు (ఈవాద్యములందు నేర్పు),
28.    ప్రహేళికలు (సామాన్యార్థము మాత్రము పైకి కనబడునట్లును, గంభీరమైన యర్థము గర్భితమగునట్లును కవిత్వము చెప్పుట),
29.    ప్రతిమాల (కట్టుపద్యములను చెప్పుట),
30.    దుర్వాచక యోగములు (విలాసము కొఱకు క్లిష్ట రచనలను చదువులట),
31.    పుస్తక వాచకము (అర్థవంతముగా చదివెడి నేర్పు),
32.    నాటకాఖ్యాయికా దర్శనము (నాటకములకు, కథలకు సంబంధించిన జ్ఞానము ),
33.    కావ్యసమస్యాపూరణము (పద్యములతో సమస్యలను పూరించుట),
34.    పట్టికా వేత్రవాన వికల్పములు (పేముతో కుర్చీలు, మంచములు అల్లుట),
35.    తక్షకర్మ (విలాసము కొఱకు బొమ్మలు మొదలైనవి చేయుట),
36.    తక్షణము (కఱ్ఱపని యందు నేర్పు),
37.    వాస్తువిద్య (గృహాదినిర్మాణ శాస్త్రము ),
38.    రూప్యరత్నపరీక్ష (రూపాయలలోను, రత్నములలోను మంచి చెడుగులను పరిశీలించుట),
39.    ధాతువాదము (లోహములుండెడి ప్రదేశములను కనుగొనుట),
40.    మణిరాగాకర జ్ఞానము (మణుల గనులను కనిపెట్టుట),
41.    వృక్షాయుర్వేద యోగములు (చెట్లవైద్యము),
42.    మేషకుక్కుటలావక యుద్ధవిధి (పొట్టేళ్ళు, కోళ్ళు, లావుక పిట్టలు మొదలగు వానితో పందెములాడుట),
43.    శుకశారికా ప్రలాపనము (చిలుకలకు, గోరువంకలకు మాటలు నేర్పుట),
44.    ఉత్సాధన, సంవాహన, కేశమర్దన కౌశలము (ఒళ్ళుపట్టుట, పాదములోత్తుట, తలయంటుట వీనియందు నేర్పు),
45.    అక్షరముష్టికా కథనము (అక్షరములను మధ్య మధ్య గుర్తించుచు కవిత్వము చెప్పుట),
46.    మ్లేచ్ఛితక వికల్పములు (సాధుశబ్దమును గూడ అక్షర వ్యత్యయము చేసి అసాధువని భ్రమింపజేయుట),
47.    దేశభాషా విజ్ఞానము (బహుదేశ భాషలను నేర్చియుండుట),
48.    పుష్పశకటిక (పూలతో రథము, పల్లకి మొదలగునవి కట్టుట),
49.    నిమిత్త జ్ఞానము (శుభాశుభ శకునములను తెలిసియుండుట),
50.    యంత్ర మాతృక (యంత్ర నిర్మాణాదులు),
51    ధారణ మాతృక (ఏకసంధా గ్రహణము),
52.    సంపాఠ్యము (ఒకడు చదువుచుండగా పలువురు వానిననుసరించి వల్లించుట),
53.    మానసీక్రియ (మనస్సుయొక్క అవధానమునకు సంబంధించిన క్రియ),
54.    కావ్యక్రియ (కావ్యములను రచించుట),
55.    అభిధాన కోశచ్ఛందో విజ్ఞానము (నిఘంటువులు, ఛందోగ్రంథములు-వీని పరిజ్ఞానము),
56.    క్రియాకల్పము (కావ్యాలంకార శాస్త్ర పరిజ్ఞానము),
57.    ఛలితక యోగములు (మాఱువేషములతో నింకొక వ్యక్తివలె చలామణి యగుట),
58.    ద్యూతవిశేషములు (వస్త్రములను మాయము చేయుట మొదలగు పనులు),
59.    ద్యూతవిశేషములు (జూదము లోని విశేషములను తెలిసికొని యుండుట),
60.    ఆకర్షక్రీడలు (జూదములందలి భేదములు),
61    బాలక్రీడనకములు (పిల్లల ఆటలు),
62.    వైనయిక జ్ఞానము (గజ అశ్వ-శాస్త్ర పరిజ్ఞానము),
63.    వైజయిక విద్యలు (విజయసాధనోపాయములను తెలిసియుండుట),
64.    వ్యాయామిక జ్ఞానము (వ్యాయామపరిజ్ఞానము).
🌹 🌹 🌹 🌹 🌹

15-MARCH-2021 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 575 / Bhagavad-Gita - 575🌹 
2) 🌹. భగవద్గీత యథాతథం - 1 - 23 🌹 
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 338, 339 / Vishnu Sahasranama Contemplation - 338, 339🌹
4) 🌹 Daily Wisdom - 83🌹
5) 🌹. వివేక చూడామణి - 46🌹
6) 🌹Viveka Chudamani - 46🌹
7) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 57🌹
8) 🌹. పరస్పర బాహ్య పరస్పరాధీనత తప్పదు 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
9) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 236 / Sri Lalita Chaitanya Vijnanam - 236 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 575 / Bhagavad-Gita - 575 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 14 🌴*

14. దేవద్విజగురుప్రాజ్ఞపూజనం శౌచమార్జవమ్ |
బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే ||

🌷. తాత్పర్యం : 
దేవదేవుడు, బ్రాహ్మణులు, ఆధ్యాత్మికగురువు, పూజనీయులైన తల్లిదండ్రులు మొదలగువారిని పూజించుట, శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస యనునవి శారీరిక తపస్సని చెప్పబడును.

🌷. భాష్యము :
శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట వివిధ తపస్సులను, నిష్ఠలను వివరింపనెంచి తొలుత దేహసంబంధమైన తపోనిష్ఠలను వివరించుచున్నాడు. ప్రతియొక్కరు దేవదేవునకు లేదా దేవతలకు, పూర్ణులును యోగ్యులును అగు బ్రాహ్మణులకు, గురువునకు, తల్లిదండ్రుల వంటి పెద్దలకు, వేదజ్ఞానపారంగతుడైనవానికి గౌరవమొసగవలెను లేదా గౌరవమొసగుటను నేర్వవలెను. 

వీరందరును నిక్కముగా సరియైన గౌరవమందవలసినవారు. అంతియేగాక మనుజుడు అంతర్బాహ్యముల శుచిత్వమును పాటించుచు,వ్యవహారమున సరళత్వమును నేర్వవలెను.

 శాస్త్రమునందు తెలుపబడనటువంటి దానినెన్నడును అతడు ఆచరించరాదు. శాస్త్రమందు మైథునమన్నది వైవాహిక జీవనమునందు తప్ప అన్యముగా అంగీకరింపబడనందున అతడు అవివాహిక సంబంధమును కలిగియుండరాదు. ఇదియే బ్రహ్మచర్యమనబడును.ఇవియే దేహపరమైన తపోనిష్ఠలు. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 575 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 17 - The Divisions of Faith - 14 🌴*

14. deva-dvija-guru-prājña-
pūjanaṁ śaucam ārjavam
brahmacaryam ahiṁsā ca
śārīraṁ tapa ucyate

🌷 Translation : 
Austerity of the body consists in worship of the Supreme Lord, the brāhmaṇas, the spiritual master, and superiors like the father and mother, and in cleanliness, simplicity, celibacy and nonviolence.

🌹 Purport :
The Supreme Godhead here explains the different kinds of austerity and penance. First He explains the austerities and penances practiced by the body. 

One should offer, or learn to offer, respect to God or to the demigods, the perfect, qualified brāhmaṇas and the spiritual master and superiors like father, mother or any person who is conversant with Vedic knowledge. These should be given proper respect. One should practice cleansing oneself externally and internally, and he should learn to become simple in behavior. 

He should not do anything which is not sanctioned by the scriptural injunctions. He should not indulge in sex outside of married life, for sex is sanctioned in the scripture only in marriage, not otherwise. This is called celibacy. These are penances and austerities as far as the body is concerned.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, WA, FB Groups 🌹
https://t.me/BhagavadGita_Telugu_English
www.facebook.com/groups/bhagavadgeetha/
https://chat.whatsapp.com/BzCAiTrm6X9K1NsjyGWzlg

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. భగవద్గీత యథాతథం - 1 - 023 🌹*
AUDIO - VIDEO
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. విషాదయోగం - అధ్యాయము 1 - శ్లోకము 23 🌻*

23
యోత్స్యమానానవేక్షే హం
య ఏతే త్ర సమాగతా: |
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే:
యుద్ధే ప్రియచికీర్షవ: ||

తాత్పర్యము : 
దుష్టబుద్ధి గల ధృతరాష్ట్ర తనయునికి ప్రియమును గూర్చుటకై యుద్ధము నొనరించుటకు ఇచ్చటకు విచ్చేసిన వారిని నేను చూచెదను.

భాష్యము : 
దుర్యోధనుడు మొదటి నుండీ పాండవులను తొలగించ రాజ్యాన్ని చేజిక్కంచుకొనుటకు తన తండ్రితో కలిసి అనేక పన్నాగాలను పన్నెను. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి ఇవన్నీ తెలిసి కూడా దుర్యోధనుడితో చేతులు కలిపిన వారెవరో అర్జునుడు తెలుసుకోదలచెను. అంతేకాక ఈ యుద్ధములో తాను ఎదుర్కోవలసిన యోధులను, సైన్యమును లెక్కకట్టుటకు వారిని చూడదలచెను. అంతేకాని శాంతి ఒప్పందానికి మాత్రం కాదు. కృష్ణుడు తన పక్షమున ఉండుటచేత అర్జునుడికి తన గెలుపు పట్ల ఎట్టి సందేహము లేదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో ….
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita #గీతాసారం #GitaSaram
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, WA, FB Groups 🌹
https://t.me/BhagavadGita_Telugu_English
www.facebook.com/groups/bhagavadgeetha/
https://chat.whatsapp.com/BzCAiTrm6X9K1NsjyGWzlg

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 338, 339 / Vishnu Sahasranama Contemplation - 338, 339 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻338. తారః, तारः, Tāraḥ🌻*

*ఓం తారాయ నమః | ॐ ताराय नमः | OM Tārāya namaḥ*

తారః, तारः, Tāraḥ

గర్భజన్మజరామృత్యు లక్షణాత్తారయన్ భయాత్ ।
తార ఇత్యుచ్యతే విష్ణుః ॥

గర్భవాసము, జన్మము, ముసలితనము, మృత్యువు అను వానివలన కలిగెడి భయమునుండి దాటించును గనుక అ విష్ణుదేవునకు తారః అని ప్రసిద్ధి.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 338🌹*
📚. Prasad Bharadwaj 

*🌻338. Tāraḥ🌻*

*OM Tārāya namaḥ*

Garbhajanmajarāmr̥tyu lakṣaṇāttārayan bhayāt,
Tāra ityucyate viṣṇuḥ.

गर्भजन्मजरामृत्यु लक्षणात्तारयन् भयात् ।
तार इत्युच्यते विष्णुः ॥

Since Lord Viṣṇu liberates beings from the fear of residence in womb, birth, old age, death etc., He is Tāraḥ.

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 2
Na te’bhvasyeśa bhavasya kāraṇaṃ vinā vinodaṃ bata tarkayāmahe,
Bhavo nirodhaḥ stitirpyavidyayā kr̥tā yatastvayyabhayāśrayātmani. 39.

:: श्रीमद्भागवते - दशमस्कन्धे द्वितीयोऽध्यायः ::
न तेऽभ्वस्येश भवस्य कारणं विना विनोदं बत तर्कयामहे ।
भवो निरोधः स्तितिर्प्यविद्यया कृता यतस्त्वय्यभयाश्रयात्मनि ॥ ३९ ॥

O Supreme Lord, You are not an ordinary living entity appearing in this material world as a result of fruitive activities. Therefore Your appearance or birth in this world has no other cause than Your pleasure potency. Similarly, the living entities, who are part of You, have no cause for miseries like birth, death and old age, except when these living entities are conducted by Your external energy.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अशोकस्तारणस्तारः शूरश्शौरिर्जनेश्वरः ।अनुकूलश्शतावर्तः पद्मी पद्मनिभेक्षणः ॥ ३७ ॥

అశోకస్తారణస్తారః శూరశ్శౌరిర్జనేశ్వరః ।అనుకూలశ్శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః ॥ ౩౭ ॥

Aśokastāraṇastāraḥ śūraśśaurirjaneśvaraḥ ।Anukūlaśśatāvartaḥ padmī padmanibhekṣaṇaḥ ॥ 37 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 339 / Vishnu Sahasranama Contemplation - 339🌹*

*🌻 339. శూరః, शूरः, Śūraḥ🌻*

*ఓం శూరాయ నమః | ॐ शूराय नमः | OM Śūrāya namaḥ*

శూరః, शूरः, Śūraḥ

శూరో విక్రమణాత్ స్మృతః విక్రమమును అనగా పురుష ప్రయత్నమును ప్రదర్శించ సమర్థుడు. అత్యంత పౌరుషశాలి. విక్రమించును.

:: శ్రీమద్రామాయణము - అయోధ్యాకాండము ::
స శూరః పురుషవ్యాఘ్రః స్వబాహుబలమాశ్రితః ।
అసంత్రస్తోఽప్యరణ్యస్థో వేశ్మనీవ నివత్స్యతి ॥ 12 ॥

దివ్యాస్త్రసంపన్నుడును, నరశ్రేష్ఠుడును ఐన ఆ మహాత్ముని బాహుబలము తిరుగులేనిది. అందువలన అతడు అరణ్యమున సైతము స్వగృహమునందువలె ప్రశాంతముగా, నిర్భయముగా నివసింపగలడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 339🌹*

*🌻339. Śūraḥ🌻*

OM Śūrāya namaḥ

Śūro vikramaṇāt smr̥taḥ / शूरो विक्रमणात् स्मृतः One of great prowess. 

Śrīmad Rāmāyaṇa - Book II
Sa śūraḥ puruṣavyāghraḥ svabāhubalamāśritaḥ,
Asaṃtrasto’pyaraṇyastho veśmanīva nivatsyati. 12.

:: श्रीमद्रामायण - अयोध्याकांड ::
स शूरः पुरुषव्याघ्रः स्वबाहुबलमाश्रितः ।
असंत्रस्तोऽप्यरण्यस्थो वेश्मनीव निवत्स्यति ॥ १२ ॥

Rama the hero and the tiger among men, relying on the strength of his own arms, will dwell fearlessly in the forest as if in his own palace.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अशोकस्तारणस्तारः शूरश्शौरिर्जनेश्वरः ।अनुकूलश्शतावर्तः पद्मी पद्मनिभेक्षणः ॥ ३७ ॥

అశోకస్తారణస్తారః శూరశ్శౌరిర్జనేశ్వరః ।అనుకూలశ్శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః ॥ ౩౭ ॥

Aśokastāraṇastāraḥ śūraśśaurirjaneśvaraḥ ।Anukūlaśśatāvartaḥ padmī padmanibhekṣaṇaḥ ॥ 37 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasra
www.facebook.com/groups/vishnusahasranam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 DAILY WISDOM - 83 🌹*
*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 23. All Knowledge is from the Absolute 🌻*

Without the knowledge of the Absolute, not even the smallest of things can be understood. All knowledge is a partial aspect of the Supreme Absolute, which is Knowledge Itself. 

It is not knowledge in the sense of an information about things, but the very existence of all things which is inseparable from the knowledge of things. 

And so, any knowledge or wisdom that is worth mentioning is a fraction, a spark, a ray, of the Supreme Absolute. Even the highest geniuses of the world cannot be compared with a ray of that eternal profundity of knowledge. Everything comes from that.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #DailyWisdom #SwamiKrishnananda
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. వివేక చూడామణి - 46 / Viveka Chudamani - 46🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 14. శరీరము - 4 🍀

165. ప్రాణ శక్తి పంచ కర్నేంద్రియాలతో జత కలిపినపుడు గొప్ప పొర ఏర్పడి దాని వలన మరియొక కోశము తయారై, అది అన్ని కార్యక్రమాలలో తన ప్రత్యేకతను కనపరుస్తుంది. 

166. ఆత్మ ఒక్కటే ఈ శరీరమునకు అతి శక్తివంతమైన కవచము. ఎందువలనంటే అది ప్రాణ వాయువుతో కూడి ఉన్నది. ఆ వాయువు ఈ శరీరము లోపల, బయటకు శ్వాస రూపంలో వ్యక్తమవుతుంది. కాని దానికి తెలియదు. తన యొక్క కష్ట సుఖాలతో ఇతరుల కష్ట సుఖాలకు శాశ్వతముగా ఆత్మ పై ఆధారపడి ఉంటుందని. 

167. మనస్సుతో కూడిన జ్ఞానేంద్రియాలు మానసికమైన ఒక పొరగా ఏర్పడి, వివిధ విషయాలలో చలిస్తూ ‘నేను’ ‘నాది’ అని భావిస్తుంటుంది. అది శక్తివంతమైనది మరియు అనేకమైన పేర్లు, పనులలో భేదాలను సృష్టిస్తుంది. అది శక్తివంతమైన పొరలతో గత జన్మల స్మృతులతో నిండి ఉంటుంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 VIVEKA CHUDAMANI - 46 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 The Body - 4 🌻*

165. The Prana, with which we are all familiar, coupled with the five organs of action, forms the vital sheath, permeated by which the material sheath engages itself in all activities as if it were living.

166. Neither is the vital sheath the Self – because it is a modification of Vayu, and like the air it enters into and comes out of the body, and because it never knows in the least either its own weal and woe or those of others, being eternally dependent on the Self.

167. The organs of knowledge together with the mind form the mental sheath – the cause of the diversity of things such as "I" and "mine". It is powerful and endued with the faculty of creating differences of name etc., It manifests itself as permeating the preceding, i.e. the vital sheath.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #వివేకచూడామణి #VivekaChudamani
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 57 🌹* 
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 38. మహర్షి దేవాపి సాన్నిధ్యము - 12 🌻*

“శ్రీమతి బెయిలీ గారూ! మీ రెవరు? మీ రేమి చేయు చుందురు? మనమిదివరకు కలసినపుడు కూడా మీ గురించి నా కేమీ తెలుపలేదు. మిమ్ము గూర్చి మాకేమీ తెలియదు." అనిరి. నే నిట్లు పలికితిని, "నే నొక సామాన్య స్త్రీని, జన్మతః ఆంగ్లేయురాలను. ప్రస్తుతం అమెరికా దేశస్థురాలను. సామాన్యుల గూర్చి ఎవరికి మాత్రము ఏమి తెలియును? నా గురించి మీ కేమీ తెలియకపోవుట సహజము. 

చెప్పుకొనుటకు కూడా నేను ఏ ప్రత్యేకతలూ లేని దానిని. నేను సంఘమున ఒక అజ్ఞాత వ్యక్తిని.” రాజుగారు మౌనముగా తలయూపి, నేనేమయినా కోరినచో తన సహచరులతో దానిని తప్పక నిర్వర్తించగలనని తెలిపి వెడలి పోయిరి. అటుపైన మామధ్య పరిచయము పెరిగినది. 

ఒక రోజున కలిసి కారులో ప్రయాణము చేయుచుండగా అకస్మాత్తుగా రాజుగారు నావంక ప్రేమపూర్వకముగా చూసి, “శ్రీమతి బెయిలీ! నాకు కూడా జ్వాల కూల్ మహర్షిగారు వ్యక్తిగతముగా తెలియునని మీకు తెలుపు చున్నాను. ఈ వార్త మీకేమైనా సంతోషము కలిగించునా?” అని చిరునవ్వు నవ్విరి. 

మరల బిత్తరపోవుట నావంతైనది. అప్రయత్న ముగ నిఠారుగ కూర్చొని “యస్ సర్” అని పలికితిని. ఒక క్షణమాగి “మీరు తెలిపిన వార్త నన్ను ఆశ్చర్యపరచుటయే గాక, హృదయమును తబ్బిబ్బు చేయుచున్నది. నా ఆనందమునకు అవధులు లేవు. మీరు మరల మరల నన్ను కలియుటలో యింత గంభీరమైన ఆంతర్యము కలదని నేనూహించలేదు. ఎంతైననూ మీరు గంభీరులు.” అని పలికితిని. 

పరమగురువుల అనుయాయులందరూ గంభీరులే! పవిత్ర విషయములు రహస్యముగ నుంచగలిగినవారే వారి మార్గాను యాయులు కాగలరు అని తెలిపిరి. వారికే గురుసాన్నిధ్యము అందిన ఫలము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM
www.facebook.com/groups/maharshiwisdom/
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. బాహ్య పరస్పరాధీనత తప్పదు 🌹*
*🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀*
✍️. భరత్‌,  
📚. ప్రసాద్ భరద్వాజ

భారతదేశం ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. కాబట్టి, భారతదేశంలో మీరు ఏమైనా చెయ్యొచ్చు. మీరు స్వేచ్ఛగా ఉండండి. కానీ, అది ఇతరులకు సమస్యగా మారకూడదు. అలాగే మీరు ఇతరుల జీవితాలలో ఎప్పుడూ జోక్యం చేసుకోకండి. అవగాహన కలిగిన వ్యక్తి ఇతరుల స్వేచ్ఛను ఎంత గౌరవిస్తాడో తన స్వేచ్ఛను కూడా అంతగానే గౌరవిస్తాడు. 

ఎందుకంటే, ఇతరులు మీ స్వేచ్ఛను గౌరవించకపోతే మీ స్వేచ్ఛ నాశనమైనట్లేకదా! కాబట్టి, అది పరస్పర అవగాహనపై ఆధారపడి ఉంటుంది. ‘‘నేను మీ స్వేచ్ఛను గౌరవిస్తాను, మీరు నా స్వేచ్ఛను గౌరవించండి. అప్పుడు ఇద్దరమూ స్వేచ్ఛగా ఉంటాం’’అనేది ఎవరూ హద్దులు మీరని రాజీవ్యవహారం. ఉదాహరణకు, మీ సొంత ఇంట్లో మీరు అర్థరాత్రి గట్టిగా పాడాలనుకున్నా పాడలేరు. ఎందుకంటే, అది పొరుగువారికి నిద్రాభంగం కలిగిస్తుంది. కాబట్టి, మీరు రాజీపడక తప్పదు.

బాహ్య ప్రపంచంలో మనం మనుషులతో మాత్రమే కాదు, అన్ని విషయాలలోనూ పరస్పరాధీనులమే. చెట్లు మీరు వదిలిన కార్బన్ డైయాక్సైడ్‌ను పీల్చుకుని మీకు కావలసిన ఆక్సిజన్‌ను అందిస్తాయి. వాటిని నరికేస్తే మీరు చనిపోతారు. ధూమపానం ద్వారా మీరు చెట్లకు కావలసిన కార్బన్ డైయాక్సైడ్‌ను అందించినప్పుడు అవి చాలా సంతోష పడతాయి. అందుకు మూలకారణం తెలుసుకోమని నేను మీకు చెప్తే వెంటనే మీరు ధూమపానం మానేస్తారు. అప్పుడు చెట్లు చాలా బాధపడతాయి.

కాబట్టి, మన పరస్పరాధీనత కేవలం చెట్లతో మాత్రమే కాదు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలతో కూడా ఉంది. నిజానికి, అన్నీ పరస్పరాధీనమైనవే. ఆ పరస్పరాధీనతను ఆనందించండి. అంతేకానీ, దానిని బానిసత్వంగా భావించకండి. పరస్పరాధీనత బానిసత్వంకాదు. మీరు ఇతరులపై, ఇతరులు మీపై ఆధారపడి ఉన్నారు. అది సోదరభావ సంబంధం. చిన్న గడ్డిపరకకు కూడా నక్షత్రాలతో సంబంధముంది.

కానీ, మీ అంతర్గత ప్రపంచంలో, మీ అంతర్గత సామ్రాజ్యంలో మీరు పూర్తి స్వేచ్ఛగా ఉండగలరు. అక్కడ మీరు దేనికోసమో బాధపడవలసిన, దేనిపైనో తిరుగుబాటు చెయ్యవలసిన అవసరముండదు. బాహ్య పరస్పరాధీనత తప్పదని, అనివార్యమని తెలుసుకోండి. జరిగే వాటిలో అది ఒక భాగం. దానిని ఏమీ చెయ్యలేము. ఏమీ చెయ్యలేని దానిని అంగీకరించడమొక్కటే మార్గం. 

కాబట్టి, ఏదో ఇష్టం లేని రాజీనామా ఇచ్చినట్లు కాకుండా, మనస్ఫూర్తిగా, ఆనందంగా దానిని అంగీకరించండి. ఇది మన విశ్వం. మనం అందులో భాగం. మనం ద్వీపాలం కాదు, మొత్తం ఖండంలో భాగం.

మీ స్వేచ్ఛ్భావన మీ అహంభావం మూలాలలో ఎక్కడో నాటుకుని ఉంది. మనం అహాలం కాదు. అహానిది అవాస్తవ అస్తిత్వం. ఎందుకంటే, మనం విడిగా లేము. అప్పుడు మనకు అహాలు ఎలా ఉంటాయి?

‘‘నేను’’ అనేది కేవలం భాషకు ఉపయోగపడే పదం మాత్రమే. అంతేకానీ, దానికి ఎలాంటి సారంలేదు, వాస్తవికత లేదు. అది కేవలం ఏమీలేని నీడ మాత్రమే.
మీరు మీ ఎరుక లోతుల్లోకి వెళ్తున్నప్పుడు అంతర్గత స్వేచ్ఛ మీకు తప్పక లభిస్తుంది. మీరు మీ శరీరాన్ని, ఆలోచనా పద్ధతులను నిశితంగా పరిశీలిస్తూ సాక్షిగా ఉండండి. 

అప్పుడు మెల్లమెల్లగా మీరు హిందు, మహమ్మదీయ, క్రైస్తవ, సామ్యవాదులు కాదని, అసలు మీరు ఎలాంటి ఆలోచన కాదని, చివరికి మీరు మనసు, కోపము, దురాశలు కూడా కాదని మీకు తెలుస్తుంది.

నిర్మల సాక్షీతత్వానుభవమే సంపూర్ణ స్వేచ్చానుభవం. కానీ, అది అంతర్గతానికి సంబంధించిన విషయం. అంతర్గతంలో పూర్తి స్వేచ్ఛతో ఉన్న వ్యక్తి బాహ్య స్వేచ్ఛను ఆశించడు. అలాంటి వ్యక్తికి ప్రకృతిని యథాతథంగా స్వీకరించగల సామర్థ్యముంటుంది. 

సాక్షిగా ఉండడం ద్వారా అంతర్గత స్వేచ్ఛను సృష్టించి అందులో జీవించండి. అప్పుడు మీరు బాహ్య పరస్పరాధీనతను తెలుసుకో గలుగుతారు. అది ఒక అందమైన ఆశీర్వాదం. దానికి తల వొంచి అందులో విశ్రాంతి పొందండి. అంతేకానీ, దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చెయ్యవలసిన అవసరంలేదు. గుర్తుంచుకోండి: అసలైన స్వేచ్ఛాపరుడు మాత్రమే తల వొంచగలడు.

- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఓషోబోధనలు #OshoDiscourse
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 236 / Sri Lalitha Chaitanya Vijnanam - 236 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*🍀 58. చతుఃషష్ట్యుపచారాఢ్యా, చతుష్షష్టి కళామయీ ।*
*మహా చతుష్షష్టి కోటి యోగినీ గణసేవితా ॥ 58 ॥🍀*

*🌻236. 'చతుషష్టి కళామయీ' 🌻*

శ్రీమాత తత్త్వము అరువది నాలుగు కళల మయమని అర్థము. కళలనగా కాంతులు. శ్రీమాత కాంతులు అరువది నాలుగు. ఆమెకు జరుపు ఆరాధనము అరువది నాలుగు ఉపచారములతో కూడి యున్నది. ఈ ఉపచారములు నేర్చుటకు అరువది నాలుగు విద్యలున్నవి. అవి ఈ విధముగ నున్నవి. 

1) అక్షరజ్ఞానము (ఇదియే అక్షరాభ్యాసముగ ప్రథమ విద్య, 2) 2) చదువుట, 3) వ్రాయుట, 4) బహు భాషా జ్ఞానము, 5) పై భాషల యందు కవిత్వము చెప్పుట, 6) విన్నదానిని విన్నట్లు చెప్పుట, 7) జూదము, 8) వేదములు, 9) వేదాంగములు ఆరు, 10) శాస్త్రములు, 

11) శాస్త్రాంగములు, 12) తంత్రములు - 6, 13) పురాణములు, 14) స్మృతులు, 15) కావ్యములు, 16) అలంకారములు, 17) నాటకములు, 18) శాంతము, 19) వశ్యము, 20) ఆకర్షణము, 

21) విద్వేషణము, 22) ఉచ్ఛాటనము, 23) మారణము 6 విధములు 24) గతి స్తంభనము, 25) జల స్తంభనము, 26) వృష్టి స్తంభనము, 27) అగ్ని స్తంభనము, 28) ఆయుధ స్తంభనము, 29) భాషా స్తంభనము, 30) వీర్య స్తంభనము, 

31) శిల్ప విద్య, 32) గజహయ శిక్షణము, 33) రథ శిక్షణము, 34) నర శిక్షణము, 35) సాముద్రికము, 36) మల్లయుద్ధము, 37) పాక శిక్షణము, 38) విష శాస్త్రము, 39) సుషిరము, 40) అనద్ధము, 

41) ఘనము, 42) ఇంద్రజాలము, 43) నృత్యము, 44) గీతము, 42) రసవాదము, 46) రత్న పరీక్ష, 47) చౌర్యము, 48) ధాతు
పరీక్ష, 49) అదృశ్యము మొత్తము అరువది నాలుగు. 

ఈ విద్యలన్నియూ కలవాడు పూర్ణ పురుషుడే. శ్రీకృష్ణుడు అన్ని విద్యలను ప్రదర్శించి చూపెను. ధర్మరాజాదులు, భీష్మ ద్రోణాదులు, ఇతర మహావీరులు, యిందలి కొన్ని విద్యలే యెరిగి యున్నారు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 236 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Catuḥṣaṣṭi-kalāmayī चतुःषष्टि-कलामयी (236) 🌻*