శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 299 / Sri Lalitha Chaitanya Vijnanam - 299
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 299 / Sri Lalitha Chaitanya Vijnanam - 299 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 70. నారాయణీ, నాదరూపా, నామరూప వివర్జితా ।
హ్రీంకారీ, హ్రీమతీ, హృద్యా, హేయోపాదేయ వర్జితా ॥ 70 ॥ 🍀
🌻 299. 'నాదరూపా' 🌻
నాదరూపము గలది శ్రీదేవి అని అర్థము. సృష్టి సంకల్పింప బడినపుడు ఆ సంకల్పము నాదరూపముగ వ్యక్తమగును. నాదమే తత్త్వమునకు మొదటి శరీరముగ వేదములు కీర్తించుచున్నవి. నాదమున్నంత వరకు సృష్టి యుండును. నాదము నిష్క్రమించిన సృష్టి తిరోధానము చెందును. నాదమే ప్రాణము; నాదమే తెలివి, నాదమే ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులుగ ప్రకటిత మగును. నాద మాధారముగనే సమస్త లోకము లేర్పడి గుత్తిగ కలిసియున్నవి. దైవము నాద స్వరూపము. జీవులును నాద స్వరూపులే. సృష్టికూడ నాద స్వరూపమే.
నాదము కాని దేమియూ లేదు. తత్త్వము నుండి వెలువడిన నాదము అవరోహణ క్రమమున వాక్కై దిగివచ్చును. సృష్టి కాధారమైన ఈ నాద రూపమే పరదేవతయైన శ్రీమాత ప్రథమ రూపము. పరమ శివుని గూడ నాద తనువు గలిగినవాడని ఋషులు కీర్తించిరి. ఈ నాద మొక ఝంకారమువలెనూ, ఓంకారమువలెనూ మనయందు నిత్యము జరుగుచున్నది. అది ఆధారముగనే మన ప్రాణము, తెలివి, మనస్సు, ఇంద్రియములు, శరీరము పనిచేయు చున్నవి.
మన ముండుట యనగా నాద ముండుటయే. నాదము ననుసరించి దేహమును స్వచ్ఛందముగా వీడుట, మరల దేహమందు ప్రవేశించుట "అక్షర పరబ్రహ్మ యోగము” నందు శ్రీకృష్ణుడు బోధించి నాడు. నాదమును అనుస్మరణ చేయుట వలన ఇది సిద్ధించునని తెలిపినాడు.
అవరోహణమునకు, ఆరోహణమునకు నాదమే ఆధారము. సృష్టి మొత్తము నాదమను దారమున కెక్కించిన పూసలగుత్తి వంటిది. దారము ఊడినచో పూసలు రాలినట్లు, నాదమాగినచో సృష్టి నాటక మదృశ్యమగును. శ్రీకృష్ణుని గానము నాదగానమే. అతడు
ఆ గానము ద్వారా జీవులయందలి నాదమును మేల్కొలిపి తనలోనికి ఆకర్షించెడివాడు. అట్టి సమయమున పశుపక్ష్యాదులతో సహా మొత్తము ప్రకృతి తన్మయత్వము చెందెడిది. ఇక మానవుల మాట చెప్పనేల?
శ్రీదేవిని నాదరూపగ ఉపాసించుట మహత్తరమగు యోగము. నాదోపాసనమున సర్వసిద్ధి కలుగును. అది శ్రీమాత అనుగ్రహముగ సాగవలెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 299 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🍀 70. nārāyaṇī nādarūpā nāmarūpa-vivarjitā |
hrīṁkārī hrīmatī hṛdyā heyopādeya-varjitā || 70 || 🍀
🌻 299. Nāda-rūpā नाद-रूपा (299) 🌻
She is in the form of sound. Varivasyā Rahasya, the text that explains Pañcadaśi mantra (I.12 and 13) says, “The form of hrīṃ (ह्रीं) is composed of twelve letters: vyoman (h), agni (r), vāmalocanā (ī), bindu (ṃ), ardhacandra, rodhinī, nāda, nādānta, śaktī, vyāpikā, samanā and unmanī.” The aggregate of the last eight is known as nāda. Out of the last eight, the subtlest is unmanī and they are placed above the bindu (dot).
{Further reading on sound: The supreme divine energy is called Parā-Śaktī. Parā-Śaktī is the divine Mother and naturally has concern for the universe. In the state of parā (nāma 366), Śaktī is in the initial stage of manifestation. The next higher stage of parā is paśyantī (nāma 368) where there are questions and answers. Questions and answers leads to knowledge. In stage of paśyantī, there exists no difference between the word and the object of reference. The next stage is madhyamā (nāma 370) where the difference begins to arise between the word and the object of reference, but only in the levels of antaḥkaraṇa.
In other words, the difference between the paśyantī and madhyamā is only subtle and not reflected at the gross level (meaning delivery of speech). In the last and final stage called vaikharī (nāma 371), the difference becomes gross and the sound is deciphered. But it should be understood that Parā-Śaktī Herself does not undergo these changes, but such changes happen at Her command in the inward psychic apparatus of an individual.
She is known by these names during the different stages of evolution of speech. These stages are discussed in the subsequent nāma-s. The transition between madhyamā and vaikharī contains eight stages and the third stage is called nāda and their samaṣṭi (aggregate) is also known as nāda. In general this nāma says that She is in the form of sound. She is Śabda Brahman. Further details are discussed in the respective nāma-s.}
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
10 Aug 2021
నిర్మల ధ్యానాలు - ఓషో - 56
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 56 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అహమన్నది గొప్ప మోసకారీ. అదెప్పుడూ వెనక దారి నించీ రావడానికి ప్రయత్నిస్తూ వుంటుంది. అది ఎంతో వినమ్రంగా వుంటుంది. అన్ని ఆటలూ ఆడుతుంది. పరిశీలనాత్మకంగా వుండు. 🍀
అదృశ్యం కావడాన్ని అభ్యసించు. ఆవిరి కావడాన్ని అభ్యసించు. లేనితనంగా మారడం నేర్చుకో. అది జీవితంలోని అత్యున్నత కళ. ఎందుకంటే అహమన్నది గొప్ప మోసకారీ. అదెప్పుడూ వెనక దారి నించీ రావడానికి ప్రయత్నిస్తూ వుంటుంది. అది ఎంతో వినయంగా, వినమ్రంగా వుంటుంది. భక్తి పూర్వకంగా వుంటుంది. సన్యాసిలా వుంటుంది. పవిత్రంగా వుంటుంది. అన్ని ఆటలూ ఆడుతుంది. పరిశీలనాత్మకంగా వుండు.
ఎంతగా అహం మార్గాల్ని కనిపెడితే అంతగా స్వేచ్ఛగా వుంటావు. నువ్వు తెలుసుకునే కొద్దీ దాని కుట్రలు పని చెయ్యవు. క్రమంగా తలుపులు మూసుకుంటాయి. అప్పుడు నీ నించి స్వేచ్ఛ పొందుతావు. అదే స్వేచ్ఛ. అన్ని మతాలకూ అంతిమ లక్ష్యమదే. ఆ స్వేచ్ఛ పొందిన దశలోనే సత్యమంటే ఏమిటో తెలుస్తుంది. అవి నిజానికి రెండు స్థాయిలు కావు. ఒకే నాణేనికి రెండు ముఖాలు. ఒకటి స్వేచ్చ, రెండోది సత్యం.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
10 Aug 2021
దేవాపి మహర్షి బోధనలు - 124
🌹. దేవాపి మహర్షి బోధనలు - 124 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 101. నిస్పృహ 🌻
మీలో కొంత మంది సద్గురువు నాహ్వానించి (ధ్యానమున) మీకున్న సమస్తమైనటువంటి బాధల్ని కుండపోతగా వారి ముందు పోస్తూ వుంటారు. చాలా సేవ చేస్తున్నాము కదా! “మా కెందుకీ బాధలు, కష్టాలు” అని ప్రశ్నించెదరు. ఇటువంటి సత్యభామ బుద్ధి (ఆరోపణ బుద్ధి) మానుకోవటము ఉత్తమము. ఆరోపణలు చేయటానికి ఆవాహన మెందుకు? ఎప్పుడూ ఆరోపణలు చేసే వారి దగ్గరికి మీకు వెళ్ళబుద్ధి అవుతుందా? మాకు వెళ్ళ బుద్ధి అవుతుంది. పిలుస్తే వస్తాము, కాని మీ బాధలు ఆరోపణలు మా రాకను గుర్తింపనీయవు.
మీరు బాధలలో నున్నప్పుడు మీరు చేయవలసినదల్లా మేమందించిన బోధనలు చదువుకొనుచు, మనో ప్రశాంతత మనో వైశాల్యతను పొందుచుండవలెను. అట్లుకానిచో క్రమముగ మీకు భక్తి తగ్గును. అనుమానము పెరుగును. మీ చేతన ఘర్షణకు గురి అగును. మేము అనంత ప్రేమను, ఆదరణను ఎప్పుడూ ప్రసరించుచునే యుందుము.
మీరు యోగమున నిలచి సేవను పెంచుడు. మాతో అనుసంధానము కూడ పెంచుడు. అప్పుడు మీ సమస్యలకు పరిష్కారములు దొరకును. మాతో మీ అనుసంధానమును యిట్టి సమయమున పెంచుకొనవలెను కాని ఆరోపణలతో తెంపుకొనరాదు. ప్రతినిత్యము కత్తిపీట ముందు కూర్చుని ఉల్లిపాయలు కోయుచు ఏడ్చుచున్న వారి వలె మీరు మాకు గోచరించుదురు. దీని వలన ఎట్టి ప్రయోజనము లేదు. పై తెలిపిన సూత్రములను పాటింపుడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
10 Aug 2021
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 472 / Vishnu Sahasranama Contemplation - 472
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 472 / Vishnu Sahasranama Contemplation - 472🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 472. వత్సీ, वत्सी, Vatsī 🌻
ఓం వత్సినే నమః | ॐ वत्सिने नमः | OM Vatsine namaḥ
జగత్పితు స్తస్య వత్స భూతాః సర్వాః ప్రజా ఇతి ।
వత్సానాం పాలనాద్వాపి వత్సీతి హరిరుచ్యతే ॥
గోవత్సములు ఈతనిచే పాలించ బడినవగుచు ఈతనికి కలవు. లేదా ఈతడు జగత్పిత కావున ప్రాణులన్నియు ఈతనికి బిడ్డలుగా ఉన్నవి కావున ఆ హరి 'వత్సీ'.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 472🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 472. Vatsī 🌻
OM Vatsine namaḥ
Jagatpitu stasya vatsa bhūtāḥ sarvāḥ prajā iti,
Vatsānāṃ pālanādvāpi vatsīti harirucyate.
जगत्पितु स्तस्य वत्स भूताः सर्वाः प्रजा इति ।
वत्सानां पालनाद्वापि वत्सीति हरिरुच्यते ॥
As He is the protector of calves and cowherds, He is called Vatsī. Or because in His aspect as the father of the worlds, all the beings are His calves or children.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
स्वापनस्स्ववशो व्यापी नैकात्मा नैककर्मकृत् ।वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः ॥ ५० ॥
స్వాపనస్స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ ।వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః ॥ ౫౦ ॥
Svāpanassvavaśo vyāpī naikātmā naikakarmakrt ।Vatsaro vatsalo vatsī ratnagarbho dhaneśvaraḥ ॥ 50 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
10 Aug 2021
24 గాయత్రీ శక్తి ధారలు 24 Gayatri Shakthi Dharalu - వివరణ Description
24 గాయత్రీ శక్తి ధారలు 24 Gayatri Shakthi Dharalu - వివరణ :
సమర్ధ సద్గురు శ్రీ మారెళ్ల శ్రీరామకృష్ణ గారిచే
1 గాయత్రీ మాత యొక్క 24 శక్తి ధారలులో 12 జ్ఞానమార్గానికి సంబంధించినవి, 12 వామమార్గానికి సంబంధించినవి. ఆదిశక్తి మూడు లక్షణాలు కలిగి ఉంటుంది, అవి జాగృత, స్వప్న & సుషుప్తి. అపరిగ్రహ వ్రతాన్ని ఈ మూడు స్ధితులలోనూ పాటించాలి. అపరిగ్రహ వ్రతాన్ని సరిగ్గా అర్ధం చేసుకుని పాటించాలి.
గాయత్రీ యొక్క జ్ఞాన పక్షములోని 12 శక్తులు : 1.ఆదిశక్తి, 2. బ్రాహ్మీ శక్తి, 3. వైష్ణవీ శక్తి, 4. శాంభవీ శక్తి, 5. వేదమాతా శక్తి, 6. దేవమాతా శక్తి, 7. విశ్వమాత శక్తి,8. ఋతుంభరా శక్తి, 9. మందాకిని శక్తి, 10. అజపా శక్తి 11.రిధ్ధి శక్తి, 12. సిధ్ధి శక్తి.
వామమార్గీ శక్తులు:
1.సావిత్రీ శక్తి, 2.సరస్వతి శక్తి, 3.లక్ష్మి శక్తి, 4.దుర్గా శక్తి, 5.కుండలిని శక్తి 6.ప్రాణాగ్ని శక్తి 7.భవాని శక్తి,8.భువనేశ్వరీ శక్తి, 9. అన్నపూర్ణ శక్తి, 10.మహామాయ శక్తి 11.పయశ్విని శక్తి, 12 త్రిపురా శక్తి.
Master R K
స్వర విజ్ఞానం (Svara Vijnanam / Vocal Knowlege) - పనులు విజయవంతంగా పూర్తి అవడానికి శ్వాస ప్రక్రియ
మన పనులు విజయవంతంగా పూర్తి అవడానికి , ఎవరితోనైనా మన పని విజయవంతంగా పూర్తి చేయించాలనుకుంటే వారి వద్దకు బయల్దేరేటప్పుడు ఏ ముక్కు లోంచి శ్వాస వస్తుందో ఆ వైపు కాలినే ముందుకు పెట్టి బయల్దేరి వెళ్ళాలి. బయటకు వెళ్ళేటప్పుడు పృథ్వి తత్వం గానీ, జల తత్వం గానీ లేక ఆ రెండూ గానీ నీ శ్వాసతో కలిసి ఉండాలి. మీరు వారి వద్దకు వెళ్ళినప్పుడు మీ శ్వాస వచ్చే నాసికా రంద్రం వైపు అతనిని కూర్చో పెట్టుకొని మాట్లాడాలి. ... తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్రలేచి ఏ నాసిక రంద్రం నుంచి శ్వాస వస్తుందో ఆ వైపు అరచేతితో ముఖం తేలికగా మసాజ్ చేయడం మంచిది. మంచం దిగేటప్పుడు కూడా ఆ వైపు కాలినే మొదటగా కింద పెట్టాలి. ఇలా రోజూ ప్రయత్నం చేస్తే పనులు అనుకూలంగా మారుతాయి అని స్వర విజ్ఞానం చెబుతోంది.
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
10-AUGUST-2021 MESSAGES
శ్రీ లలితా సహస్ర నామములు - 113 / Sri Lalita Sahasranamavali - Meaning - 113
🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 113 / Sri Lalita Sahasranamavali - Meaning - 113 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 113. అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ |
కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ‖ 113 ‖ 🍀
🍀 553. అగ్రగణ్యా -
దేవతలందరిలో ముందుగా గణింపబడేది.
🍀 554. అచింత్యరూపా -
చింతన ద్వారా తెలుసుకొనుటకు అలవికానిది.
🍀 555. కలికల్మషనాశినీ -
కలియుగ మలినములను పోగొట్టునది.
🍀 556. కాత్యాయనీ -
కతుని ఆశ్రమంలో పుట్టి పెరిగింది.
🍀 557. కాలహంత్రీ -
కాలమును హరించునది.
🍀 558. కమలాక్ష నిషేవితా -
విష్ణుమూర్తిచే నిశ్శేషంగా సేవింపబడునది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 113 🌹
📚. Prasad Bharadwaj
🌻 113. agragaṇyā'cintyarūpā kalikalmaṣa-nāśinī |
kātyāyanī kālahantrī kamalākṣa-niṣevitā || 113 ||
🌻 553 ) Agra ganya -
She who is at the top
🌻 554 ) Achintya roopa -
She who is beyond thought
🌻 555 ) Kali kalmasha nasini -
She who removes the ills of the dark age
🌻 556 ) Kathyayini -
She who is Kathyayini in Odyana peetha or She who is the daughter of sage Kathyayana
🌻 557 ) Kala hanthri -
She who kills god of death
🌻 558 ) Kamalaksha nishevitha -
She who is being worshipped by the lotus eyed Vishnu
🌻 559 ) Thamboola pooritha mukhi -
She whose mouth is filled with betel leaves , betel nut and lime
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
09 Aug 2021
మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 64
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 64 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. సుఖజీవనము 🌻
మానవుడు సుఖముగా జీవించవలెనన్న ఏది ప్రదానము- ధనమా? ఆరోగ్యమా? సత్ సంతానమా?
ధనము వలన మానవుడు శారీరకముగా సుఖమును అనుభవించగలడే కానీ, మానసికముగా శాంతిని పొందలేడు. ఇక ఆరోగ్యము మానవునకు ముఖ్యమయినది. ఆరోగ్యవంతుడు కష్టపడి ధనము సంపాదించగలడు. కానీ, ఒక ధనవంతుడు ఆరోగ్యమును పొందలేడు.
అయితే, ఈ ఆరోగ్యము శరీరానికా? మనస్సుకా? ఆరోగ్యవంతమయిన శరీరము కన్నా ఆరోగ్యవంతమయిన మనస్సు ప్రధానము.
శారీరక రుగ్మతలకు కారణము కేవలము భౌతిక పరిస్థితులే కాక, మానసిక పరిస్థితులు కూడా కారణము అని పెద్దలు సూచించి ఉండిరి. ఇదే విధముగా రోగమునకు కాక, రోగికి చికిత్స చేయు విధానము హోమియోలో సూచించబడినది.
కామక్రోధాదులు మానవుని ఆధ్యాత్మిక పురోగతికి మాత్రమే కాక శారీరక ఆరోగ్యమునకు కూడ శత్రువులే. కోపము, అసూయ, ద్వేషము మొదలగునవి శరీరములోని గ్రంథులపై ఎక్కువ ప్రభావమును చూపును.
ఒకరిపై ద్వేషము, పగ, చికాకు కలిగిన వ్యక్తికి అన్నము హితముగా ఉండదు. నిద్రపోలేడు. ఆలోచనలతో సతమతమవుతూ ఉండును.
ఈ ప్రభావము వలన నరములకు ఒత్తిడి కలిగి రక్తపు పోటు వచ్చును. గుండె, ఊపిరితిత్తులు దీని ప్రభావమునకు లోనయి రోగముల రూపముగా పరిణమించును.
నేటి కాలమున మూడువంతుల రోగులు మానసిక కారణముల వ్యాధులకు లోనగుచున్నవారే.
✍️ మాస్టర్ ఇ.కె.
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
09 Aug 2021
వివేక చూడామణి - 113 / Viveka Chudamani - 113
🌹. వివేక చూడామణి - 113 / Viveka Chudamani - 113🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 25. వైరాగ్య స్థితి - 3 🍀
378. మనస్సును స్థిరముగా బ్రహ్మముపై ఉంచి, బాహ్య జ్ఞానేంద్రియములను వాటి వాటి కేంద్రములలో ఉంచి, శరీరమును స్థిరపర్చి ఏవిధమైన ఇతర ఆలోచనలు లేకుండా బ్రహ్మముపై మనస్సును నిల్పి దానితో ఏకత్వమును సాధించుము. అపుడే బ్రహ్మజ్ఞానము యొక్క సారము పూర్తిగా నీ ఆత్మలో ఏవిధమైన అడ్డంకులు లేకుండా ఆస్వాదించగలవు. ఇతరమైన వస్తు సముదాయము వలన ఏమి లాభము? అవి పూర్తిగా డొల్ల మాత్రమే.
379. అనాత్మ భావము యొక్క ఆలోచనను పూర్తిగా తొలగించి, (ఎందువలనంటే అవి చెడును గలిగించి దుఃఖానికి కారణమవుతాయి), నీవు ఆత్మను గూర్చి, దాని ఆనంద స్థితిని గూర్చి ఆలోచించి పూర్తి విముక్తిని సాధించుము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 113 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 25. Vairagya (Dispassion) - 3 🌻
378. Fixing the mind firmly on the Ideal, Brahman, and restraining the external organs in their respective centres; with the body held steady and taking no thought for its maintenance; attaining identity with Brahman and being one with It – always drink joyfully of the Bliss of Brahman in thy own Self, without a break. What is the use of other things which are entirely hollow ?
379. Giving up the thought of the non-Self which is evil and productive of misery, think of the Self, the Bliss Absolute, which conduces to Liberation.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
09 Aug 2021
శ్రీ శివ మహా పురాణము - 436
🌹 . శ్రీ శివ మహా పురాణము - 436🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 27
🌻. బ్రహ్మచారి శివుని నిందించుట - 3 🌻
బ్రాహ్మణుడిట్లు పలికెను-
నీవు సూర్యతేజస్సును విడిచిపెట్టి మిణుగురు పురుగుల కాంతిని గోరుచున్నావు పట్టువస్త్రములను వీడి చర్మవస్త్రములను గోరుచున్నావు(22) నీవు గృహమునందు నివాసమును విడిచిపెట్టి వనమునందు నివసించ గోరుచున్నావు. ఓ దేవదేవీ! నీవు ఉత్తమమగు నిధిని విడిచిపెట్టి ఇనుపముక్కను కోరుచున్నావు '23).
నీవు ఇంద్రుడు మొదలగు లోకపాలురను విడిచిపెట్టి శివుని గురించి వ్రతముననుష్ఠించుచున్నావు. లోకులు ఈ చర్యను మంచిగా చెప్పుకొనరు. నీ చర్య విడ్డూరముగా కన్పట్టుచున్నది(24). పద్మ పత్రముల వంటి కన్నులు గల నీవెక్కడ? ఆ ముక్కంటి యెక్కడ? చంద్రుని వలె ఆహ్లాదకరమగు ముఖముగల నీవెక్కడ ? ఆ అయిదు ముఖముల శివుడెక్కడ? (25)
నీ శిరస్సుపై జడ దివ్య సర్పమువలె భాసించుచున్నది. శివుని జటాజూటము లోకములో చాల ప్రసిద్ధి చెందినట్లున్నది(26). నీ శరీరమునందు చందనము ఉండగా, శివుని శరీరముపై చితాభస్మ ఉండును. నీ పట్టు చీర యెక్కడ? శంకరుని గజచర్మము ఎక్కడ? (27).
నీ దివ్యములగు అలంకారములెక్కడ? శంకరుని సర్పములెక్కడ? నిన్ను సేవించుటకు ఉత్సాహపడే అందరు దేవతలెక్కడ? భూతములకు ఇచ్చు ఆహారమును ఇష్టపడే శివుడెక్కడ?(28) మృదంగ ధ్వని ఎక్కడ? ఆ శివుని డమరుకము యొక్క శబ్ధము ఎక్కడ? భేరీ ధ్వనులు ఎక్కడ? అశుభమగు కొమ్ము బూరాల ధ్వని యెక్కడ? (29). ఢక్కా శబ్దమెక్కడ? గలమనే వాద్యము యొక్క అమంగళ ధ్వని ఎక్కడ? నీ ఉత్తమమగు సౌందర్యము శివునకు అర్హమైనది కానే కాదు (30)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
09 Aug 2021
గీతోపనిషత్తు -237
🌹. గీతోపనిషత్తు -237 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚
శ్లోకము 18 - 2
🍀 17 - 2. వ్యక్తా వ్యక్తములు - ఉషః కాలమునుండి క్రమముగ వెలుగేర్పడు చుండగ సమస్త జీవులు ఎట్లు మేల్కాంచునో అట్లే సృష్టి ఉషస్సు నందు క్రమముగ సృష్టి, సృష్టిజీవులు ఏర్పడుచు, సృష్టి నిర్మాణ మగుననియు, మరల సాయంకాలము నుండి సృష్టి తిరోధానము చెందుచు అవ్యక్తము లోనికి చనుననియు తెలుపబడినది. 🍀
అవ్యక్తా ద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే
రాత్ర్యాగమే ప్రలీయంతే తతైవావ్యక్త సంజ్ఞకే || 18
తాత్పర్యము : అహస్సు ఆగమము నందు అవ్యక్తము నుండి సమస్తము క్రమముగ వ్యక్తమగునని, అట్లే సాయం సంధ్యా గమనము నుండి ప్రారంభమగు రాత్రికాలమున అంతయు అవ్యక్తము లోనికి పోవుననియు ఈ శ్లోకము తెలియపరుచు చున్నది.
వివరణము : ఇట్లు వ్యక్తము, అవ్యక్తము జీవులను అనంతముగ నడిపించుచు నుండును. ఎరుక పొందుటవలన వ్యక్తము, ఎరుక పోవుటవలన అవ్యక్తము, ఎరుకలో నున్నపుడు జ్ఞానము, ఎరుక కోల్పోవునపుడు అజ్ఞానము- ఇట్లు బ్రహ్మసృష్టియందు సమస్తము వ్యక్తావ్యక్తముల నడుమ తిరుగాడుచుండును.
ఇట్లనంతముగ సాగును. బ్రహ్మసృష్టి కూడ వ్యక్తములోనికి వచ్చుట, అవ్యక్తములోనికి పోవుట, మరల మరియొక బ్రహ్మ వచ్చుట, అతడి సృష్టికాలము ముగియగనే అతడు, అతడి సృష్టి అవ్యక్తములోనికి చనుట- అనంత కాలమున జరుగుచున్నదని ఋషిదర్శనము. ఇప్పటి కెందరు బ్రహ్మలు వచ్చి వెళ్లిరో ఎవ్వరికిని తెలియదు.
“వెనుకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు, వారెవ్వరో కూడ ఎవ్వరికిని తెలియదు. ఇంకెంతమంది వత్తురో కూడ ఎవ్వరికిని తెలియదు.” సృష్టితోపాటు సృష్టికర్తకూడ అవ్యక్తమున లీనమై పోవును. నిద్రయందు మన మెట్లుండమో, అట్లే ప్రళయమందు సృష్టికర్త కూడ లీనమైపోవును.
కనుకనే భగవానుడు పూర్వము తెలుపబడిన శ్లోకములలో బ్రహ్మసృష్టి యంతయు చక్రాకృతిన తిరుగుతూ జన్మకర్మలతో నిండియుండునని, పునర్జన్మము కర్మము ఉండితీరునని తెలిపెను. సత్యలోకము నుండి భూలోకము వరకు గల అన్ని లోకముల యందలి జీవులు, ఇట్లు అవశ్యులై తిరుగు చుందురని, ఎవ్వరికిని నివృత్తి లేదని తెలుపుచున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
09 Aug 2021










