జయ ఏకాదశి భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు అందరికి Jaya Ekadashi & Bheeshma Ekadashi Greetings to All

జయ ఏకాదశి భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు అందరికి 

Jaya Ekadashi Bheeshma Ekadashi Greetings to All

🌹భీష్మ  ఏకాదశి 🌹 

🍀 భీష్మ ఏకాదశి అని ఎందుకంటారు ? 🍀

మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. ఈ రోజునే కురుకుల యోధుడు భగవంతుడిలో ఐక్యమైన రోజు. బీష్ముడు పాండవులకు చేసిన మహోపదేశం విష్ణు సహస్రనామం.

కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉన్నాడు. నెల రోజులు గడిచాక ఒకనాడు పాండవులతో పాచికాలుడుతు గోపాలుడు హఠాత్తుగా ఆగిపోయాడు. దీనికి కలవరపడిన పాండవులు ఏమైందని శ్రీకృష్ణుడిని ప్రశ్నించారు.

మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః" 
కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మపితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడని ఆ జగన్నాటక సూత్రధారి సమాధానం ఇస్తాడు. అందుకే నా మనసు అక్కడికి వెళ్లిపోయింది, మీరు కూడా నాతో రండని పాండవులకు తెలిపాడు. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మశాస్త్రాలను అవపోశణం పట్టి పూర్తిగా ఆకలింపు చేసుకున్న మహనీయుడు. ఏ ధర్మ సందేహాన్నైనా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు దేహం నుంచి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతోంది, ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు కాబట్టి సూక్ష్మ విషయాలను తెలుసుకోడానికి రండి' అని భీష్మపితామహుడి చెంతకు తీసుకు వచ్చాడు. సుమారు మూడు పక్షాల నుంచి అంపశయ్యపై పడి ఉన్నాడు. దేహమంతా బాణాలు గుచ్చుకుని పూర్తిగా శక్తి క్షీణించిపోయింది. మాఘమాసంలో ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ, నీరు, ఆహారం స్వీకరించకుండా ఉన్నాడు. తాను కోరుకుంటే మరణం చెంతకు వస్తుంది, కానీ ఇన్ని బాధలను భరిస్తూ ఉత్తరాయణం వరకు ఉండాలి అని కోరుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుంచి నిష్క్రమించాలని భగవంతుడిని తలచుకున్నాడు.

తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగే వాడు. అంతటి జ్ఞానం కలిగిన మహనీయులకు ఈరోజు ఆరోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది. అలాంటి వాళ్లు ఏ రోజు నిష్క్రమించినా వైకుంఠం ప్రాపిస్తుంది.  భీష్ముడు తనకి మాతా పితా బ్రాతా నివాసః శరణం సుహ్రుత్ గతిః గమ్యం సర్వం నారాయణః అని అనుకున్న మహనీయుడు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు. అయితే తాను చేసిన దోషం ఒకటి స్పష్టంగా గాంగేయుడికి జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి పాపం శరీరం పైనే రాసి ఉంటుందట! అది తొలగితే తప్ప సద్గతి కలగదట. ఇంతకీ భీష్మపితామహుడు చేసిన దోషం ఏంటంటే ? పాండవ పత్ని ద్రౌపదికి నిండు సభలో అంతటి అవమానం జరుగుతున్నా ఏమీ చేయలేక పోయాడు. ద్రౌపదికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువైన వసిష్ఠుడు ఆమెతో ఇలా చెప్పారట "మహత్యాపది సంప్రాప్తే స్మత్తవ్యః భగవాన్ హరిః" హే ద్రౌపతి! ఇతరులు తొలగించలేని ఆపదలు కలిగినపుడు శ్రీహరిని స్మరించుకోమన్నారు.

కురుసభలో వస్త్రాపహరం జరుగుతుంటే అతి పరాక్రమవంతులైన అయిదుగురు భర్తలు ఆమె గౌరవాన్ని కాపాడలేకపోయారు. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు, కాని సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని పక్కనబెట్టారు. కృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు. కాబట్టే అలా చేసినందుకు కౌరవులను మట్టు పెట్టాడు. పాండవులకూ కూడా అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలనుకున్నాడో ఆమెకే నష్టం జరుగుతుందని భావించాడు. ఈ విషయాన్ని సాక్షాత్తు ఆ భగవంతుడే అర్జునుడితో చెప్పాడట. ద్రౌపదికి ఎప్పుడు అవమానం జరిగిందో అప్పుడే వారిని తీసి పాడేశాను, ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితంలా ఉన్నారే తప్ప, ఆ గౌరవాన్ని నీకు కట్టబెట్టాలని యుద్ధం చేయమంటున్నాంటూ అర్జునుడితో శ్రీకృష్ణుడు అన్నాడట.

భీష్ముడు ఆనాడు ధర్మరాజుకు లేవనెత్తిన సందేహాలను తీరుస్తుంటే, పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ 'తాతా! ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమైయ్యాయీ ధర్మాలు' అని ప్రశ్నించిదట. అందుకు భీష్ముడు 'అవును తల్లీ! నా దేహం నా అధీనంలో లేదు, అది ధుర్యోదనుడి సొంతం. నీకు అవమానం జరుగుతుందని తెలిసినా, నా దేహం నా మాట వినలేదని అన్నాడు. అంతటి ఘోరమైన పాపం చేశాను కాబట్టే ప్రక్షాళన కోసం ఇన్ని రోజులు అంపశయ్యపై ఉన్నానని చెప్పాడు. కురు వంశాన్ని కాపాడుతానని తన తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడిపోయిన భీష్ముడు, పరిస్థితుల ప్రభావంతో విశేష ధర్మాన్ని త్వజించాడు. ' హే ద్రౌపతీ! కృష్ణ భక్తిలో ఎలాంటి కల్మషం లేదు, కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోడానికే అంపశయ్యపై పడి ఉన్నాను, అందుకు ఈనాడు నేను ధర్మాలను బోధించవచ్చని పాండవులకు ఎన్నో సూత్రాలను బోధించాడు. శ్రీకృష్ణుడు భీష్ముడికి నొప్పి నుంచి ఉపశమనం కలిగేలా వరాన్ని ప్రసాందించి ధర్మసూత్రాలను చెప్పించాడు.

నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు, నీవే చెప్పొచ్చుకదా అని భీష్ముడు ప్రశ్నించాడు. నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదని కృష్ణుడు బదులిచ్చాడు. నేను చెబితే అది తత్వం, నీవు చెబితే అది తత్వ ద్రష్టం. తత్వాన్ని చూసినవాడు దాని గురించి చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల తన సారాన్ని చెప్పగలదా! అందులో పండిన మొక్క చెబుతుంది ఎంత సారమో. అలాగే అనుభవజ్ఞుడవైన

నీవు ఉపదేశంచేస్తే అది లోకానికి శ్రేయస్సు. భగవంతుడు సముద్రం లాంటి వాడు, నీరు ఉంటుంది కానీ పాన యోగ్యం కాదు. అదే నీటిని మేఘం వర్షిస్తే పనయోగ్యమవుతుంది. అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితమని జగన్నాటక సూత్రధారి భావించాడు. అలా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి, భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత ఆయనే నేరుగా చెప్పాడు, విష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. కాబట్టి విష్ణు సహస్రనామాల వల్ల సులభంగా మోక్షం కలుగుతుంది.
🌹🌹🌹🌹🌹

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 586 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 586 - 1

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 586 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 586 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀

🌻 586. 'కామసేవితా - 1 🌻

కామునిచే సేవింప బడునది శ్రీమాత. కాముడనగా మన్మథుడు. మన్మథుడు అనంగుడు. అనగా శరీరము లేనివాడు. శరీరమే లేనపుడు యింద్రియములు, మనస్సు యుండవు. జీవునికి కేవలము అంతఃకరణములే యుండును. మన్మథుడు శివునిచే శపింపబడెనని పురాణ గాథ. నిజమునకు శివుడు మహత్తరమగు వరము మన్మథునికి ప్రసాదించెను. అతనికి శరీరము లేకుండగ వరమిచ్చుటచే మనస్సు కూడ లేకుండ పోయెను. మనసేంద్రియ శరీరములు లేనపుడు శ్రీమాతను పూజించు టెట్లు? మ్రొక్కుటెట్లు? స్తుతించుట ఎట్లు? చూచు టెట్లు? నిజమునకు మనస్సు, యింద్రియములు, శరీరము బాహ్యమును చూచుటకే గాని అంతరంగమున దివ్యత్వము చూచుటకు వినియోగ పడవు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 586 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita
shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻

🌻 586. 'Kama Sevita' - 1 🌻

Śrī Mātā is served by Kāma. Kāma refers to Manmatha. Manmatha is also known as Ananga, meaning "one without a body." If there is no body, then there are no senses or mind. The individual soul (jīva) possesses only the inner faculties (antaḥkaraṇa). According to the Purāṇas, Manmatha was cursed by Lord Śiva. However, in reality, Śiva granted him the greatest boon. By making him bodiless, he also took away his mind. If there is no mind, senses, or body, how can one worship Śrī Mātā? How can one bow to Her? How can one praise or see Her? In truth, the mind, senses, and body are useful only for perceiving the external world but are not necessary for experiencing divine transcendence within.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 08 FEBRUARY 2025 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹

🍀🌹 08 FEBRUARY 2025 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹🍀 
🌹 జయ ఏకాదశి భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు అందరికి Jaya Ekadashi Bheeshma Ekadashi Greetings to All 🌹
1) 🌹 అష్టావక్ర గీత - 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 9వ శ్లోకము 🌹
🍀 3. అంతఃకరణ శుద్ధి - మనస్సు యొక్క శుద్ధి 🍀
🍀 4. చైతన్యం జ్ఞానానికి మూలం 🍀
2) 🌹 Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 9 🌹
🍀 4. Consciousness is the Source of Knowledge 🍀
3) 🌹 अष्टावक्र गीता - प्रथम अध्याय - आत्मानुभवोपदेश - श्लोक 9 🌹
🍀 4. चेतना ही ज्ञान का स्रोत है 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 586 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 586 - 1 🌹 
🌻 586. 'కామసేవితా - 1 / 586. 'Kama Sevita' - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 జయ ఏకాదశి భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు అందరికి Jaya Ekadashi Bheeshma Ekadashi Greetings to All 🌹*
*Prasad Bharadwaj*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 అష్టావక్ర గీత - 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 9వ శ్లోకము - అజ్ఞానారణ్యాన్ని "నేను శుద్ధ చైతన్యం" అనే జ్ఞానాగ్నితో దగ్ధం చేసి విముక్తుడిగా జీవించు. 🌹*
*🍀 4. చైతన్యం జ్ఞానానికి మూలం 🍀*
*✍️ ప్రసాద్‌ భరధ్వాజ*

*ఈ వీడియోలో, అష్టావక్ర గీత యొక్క 1వ అధ్యాయంలోని 9వ శ్లోకాన్ని పరిశీలిస్తాము, ఇది ఆత్మానుభవం యొక్క సారాంశాన్ని బోధిస్తుంది. "నేనే శుద్ధ చైతన్యం" అనే జ్ఞాన అగ్నితో అజ్ఞానం అనే అరణ్యాన్ని దహించి, మనస్సును శుద్ధి చేసి, మానసిక బాధలను అధిగమించి, విముక్తి పొందిన, దుఃఖం లేని జీవితాన్ని ఎలా గడపాలో తెలుసుకోండి. జ్ఞానాగ్ని – "నేనే శుద్ధ చైతన్యం" అన్న అవగాహన – అజ్ఞాన మహారణ్యాన్ని దహించి వేస్తుంది. అజ్ఞానాన్ని దహించడం అనేది శారీరక చర్య కాదు, ఇది ఆత్మజ్ఞానంలో పరిపూర్ణమైన ఆధ్యాత్మిక మార్పు. ఇందులో అహంకారం, ఆసక్తులు, మరియు కోరికల పరిమితులు ఆత్మ సాక్షాత్కార కాంతిలో కరిగిపోతాయి. - ప్రసాద్ భరద్వాజ*
*చైతన్య విజ్ఞానం ఛానెల్‌కు సభ్యత్వాన్ని పొందండి. లైక్ చేయండి మరియు షేర్ చేయండి. - ప్రసాద్ భరద్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 9 - Burn the forest of ignorance with the fire of "I am pure consciousness," and live liberated. 🌹*
*🍀 4. Consciousness is the Source of Knowledge 🍀*
*✍️ Prasad Bharadwaj*

*In this video, we explore the 9th verse of Chapter 1 from the Ashtavakra Gita, which teaches the essence of Self-Realization. Learn how to purify the mind and overcome the mental suffering and burn the forest of ignorance with the fire of "I am pure consciousness" and live a liberated, sorrow-free life. The fire of this knowledge – the awareness that "I am pure consciousness" – destroys the forest of ignorance. This burning away of ignorance is not a physical act, but a spiritual transformation where the limitations of the ego, attachments, and desires are dissolved in the light of self-realization. - Prasad Bharadwaj*
*Subscribe to the Chaitanya Vijnaanam channel. Like, and share. - Prasad Bhardwaj*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 अष्टावक्र गीता - प्रथम अध्याय - आत्मानुभवोपदेश - श्लोक 9 - अज्ञान के जंगल को "मैं शुद्ध चैतन्य हूं" की ज्ञानाग्नि से जलाकर मुक्त होकर जीवन जियो। 🌹*
*🍀 4. चेतना ही ज्ञान का स्रोत है 🍀*
*✍️ प्रसाद भारद्वाज*

*इस वीडियो में, हम अष्टावक्र गीता के पहले अध्याय के 9वें श्लोक का विश्लेषण करते हैं, जो आत्मज्ञान का सार सिखाता है। "मैं शुद्ध चैतन्य हूं" की ज्ञानाग्नि से अज्ञान रूपी जंगल को जलाकर, मन को शुद्ध कर, मानसिक पीड़ा को पार करते हुए, कैसे मुक्त और दुखरहित जीवन जिया जा सकता है, यह जानें। इस ज्ञान की अग्नि – "मैं शुद्ध चेतना हूँ" की जागरूकता – अज्ञान के विशाल वन को जला देती है। यह अज्ञान को जलाना कोई भौतिक क्रिया नहीं है, बल्कि यह आत्मज्ञान में एक पूर्ण आध्यात्मिक परिवर्तन है, जिसमें अहंकार, आसक्ति और इच्छाओं की सीमाएं आत्मसाक्षात्कार की ज्योति में विलीन हो जाती हैं।. प्रसाद भारद्वाज.*
*चैतन्य विज्ञानम चैनल को सब्सक्राइब करें। लाइक करें, शेयर करें । - प्रसाद भारद्वाज.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 586 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 586 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।*
*శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀*

*🌻 586. 'కామసేవితా - 1 🌻*

*కామునిచే సేవింప బడునది శ్రీమాత. కాముడనగా మన్మథుడు. మన్మథుడు అనంగుడు. అనగా శరీరము లేనివాడు. శరీరమే లేనపుడు యింద్రియములు, మనస్సు యుండవు. జీవునికి కేవలము అంతఃకరణములే యుండును. మన్మథుడు శివునిచే శపింపబడెనని పురాణ గాథ. నిజమునకు శివుడు మహత్తరమగు వరము మన్మథునికి ప్రసాదించెను. అతనికి శరీరము లేకుండగ వరమిచ్చుటచే మనస్సు కూడ లేకుండ పోయెను. మనసేంద్రియ శరీరములు లేనపుడు శ్రీమాతను పూజించు టెట్లు? మ్రొక్కుటెట్లు? స్తుతించుట ఎట్లు? చూచు టెట్లు? నిజమునకు మనస్సు, యింద్రియములు, శరీరము బాహ్యమును చూచుటకే గాని అంతరంగమున దివ్యత్వము చూచుటకు వినియోగ పడవు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 586 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita*
*shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻*

*🌻 586. 'Kama Sevita' - 1 🌻*

*Śrī Mātā is served by Kāma. Kāma refers to Manmatha. Manmatha is also known as Ananga, meaning "one without a body." If there is no body, then there are no senses or mind. The individual soul (jīva) possesses only the inner faculties (antaḥkaraṇa). According to the Purāṇas, Manmatha was cursed by Lord Śiva. However, in reality, Śiva granted him the greatest boon. By making him bodiless, he also took away his mind. If there is no mind, senses, or body, how can one worship Śrī Mātā? How can one bow to Her? How can one praise or see Her? In truth, the mind, senses, and body are useful only for perceiving the external world but are not necessary for experiencing divine transcendence within.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h

Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 9 - Burn the forest of ignorance with....

🌹 Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 9 - Burn the forest of ignorance with the fire of "I am pure consciousness," and live liberated. 🌹

🍀 3. Antahkarana Shuddhi – Purification of the Mind 🍀

✍️ Prasad Bharadwaj

https://www.youtube.com/shorts/j3wLvBNsVQc

In this video, we explore the 9th verse of Chapter 1 from the Ashtavakra Gita, which teaches the essence of Self-Realization. Learn how to purify the mind and overcome the mental suffering and burn the forest of ignorance with the fire of "I am pure consciousness" and live a liberated, sorrow-free life. In silence, it begins to recognize its true nature – pure, unchanging, and eternal consciousness.

Subscribe to the Chaitanya Vijnaanam channel. Like, and share. - Prasad Bhardwaj

🌹🌹🌹🌹🌹

अष्टावक्र गीता - प्रथम अध्याय - आत्मानुभवोपदेश - श्लोक 9 - अज्ञान के जंगल को.... (Youtube Short #3) (Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 9)

🌹 अष्टावक्र गीता - प्रथम अध्याय - आत्मानुभवोपदेश - श्लोक 9 - अज्ञान के जंगल को "मैं शुद्ध चैतन्य हूं" की ज्ञानाग्नि से जलाकर मुक्त होकर जीवन जियो। 🌹

🍀 3. अंतःकरण शुद्धि - मन की शुद्धि. 🍀

प्रसाद भारद्वाज.

इस वीडियो में, हम अष्टावक्र गीता के पहले अध्याय के 9वें श्लोक का विश्लेषण करते हैं, जो आत्मज्ञान का सार सिखाता है। "मैं शुद्ध चैतन्य हूं" की ज्ञानाग्नि से अज्ञान रूपी जंगल को जलाकर, मन को शुद्ध कर, मानसिक पीड़ा को पार करते हुए, कैसे मुक्त और दुखरहित जीवन जिया जा सकता है, यह जानें। मौन में, यह अपने वास्तविक स्वरूप को पहचानने लगता है – जो कि शुद्ध, अचल, और शाश्वत चेतना है।

चैतन्य विज्ञानम चैनल को सब्सक्राइब करें। लाइक करें, शेयर करें । - प्रसाद भारद्वाज.

🌹🌹🌹🌹🌹

అష్టావక్ర గీత - 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 9వ శ్లోకము - అజ్ఞానారణ్యాన్ని.... (Youtube Short #3) (Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 9)

🌹 అష్టావక్ర గీత - 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 9వ శ్లోకము - అజ్ఞానారణ్యాన్ని "నేను శుద్ధ చైతన్యం" అనే జ్ఞానాగ్నితో దగ్ధం చేసి విముక్తుడిగా జీవించు. 🌹

🍀 3. అంతఃకరణ శుద్ధి - మనస్సు యొక్క శుద్ధి 🍀

✍️ ప్రసాద్‌ భరధ్వాజ

https://youtube.com/shorts/CEXW09Rhebk

ఈ వీడియోలో, అష్టావక్ర గీత యొక్క 1వ అధ్యాయంలోని 9వ శ్లోకాన్ని పరిశీలిస్తాము, ఇది ఆత్మానుభవం యొక్క సారాంశాన్ని బోధిస్తుంది. "నేనే శుద్ధ చైతన్యం" అనే జ్ఞాన అగ్నితో అజ్ఞానం అనే అరణ్యాన్ని దహించి, మనస్సును శుద్ధి చేసి, మానసిక బాధలను అధిగమించి, విముక్తి పొందిన, దుఃఖం లేని జీవితాన్ని ఎలా గడపాలో తెలుసుకోండి. ఆత్మ సాధనలో మనస్సు, ధ్యానం ద్వారా అంతర్ముఖమై, మౌనంలో ప్రశాంతంగా నిలుస్తుంది. ఈ మౌనంలో, అది తన నిజ స్వరూపాన్ని – శాశ్వతం, శుద్ధం, మరియు మార్పు చెందని చైతన్యం అని గుర్తించడం ప్రారంభిస్తుంది.

చైతన్య విజ్ఞానం ఛానెల్‌కు సభ్యత్వాన్ని పొందండి. లైక్ చేయండి మరియు షేర్ చేయండి. - ప్రసాద్ భరద్వాజ

🌹🌹🌹🌹🌹

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 585 - 7 / Sri Lalitha Chaitanya Vijnanam - 585 - 7

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 585 - 7 / Sri Lalitha Chaitanya Vijnanam - 585 - 7 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀

🌻 585. 'శ్రీవిద్యా’ - 7 🌻

శ్రీమాత స్వతః పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరిగా అవతరించు చుండును. ఈ నాలుగు స్థితులను శ్రీ మహా విష్ణువు నాలుగు వ్యూహములుగ కూడ తెలుపుదురు. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహము లందురు. ఈ నాలుగు స్థితులను నిర్దేశించుటకే నాలుగు కాలములు, నాలుగు వర్ణములు, నాలుగు ఆశ్రమములు వాఙ్మయమున వివరింప బడినవి. శ్రీ విద్యా ఉపాసనమున శ్రీమాత సమగ్ర సృష్టి స్వరూపమును అనుభూతి చెందు మార్గము ఒక క్రమముతో కూడి విస్తారమై యున్నది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 585 - 7 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita
shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻

🌻 585. 'Shree Vidya' - 7 🌻

Sri Mata manifests herself naturally in four states: Para (transcendental), Pashyanti (perceptive), Madhyama (intermediate), and Vaikhari (expressed speech). These four states correspond to the four Vyuhas (manifestations) of Sri Maha Vishnu: Vasudeva, Sankarshana, Pradyumna, and Aniruddha. To represent these states, the scriptures describe the four Yugas (epochs), four Varnas (social classes), and four Ashramas (stages of life). In Sri Vidya worship, Sri Mata’s universal form is experienced through a structured and expansive path, enabling the seeker to realize the essence of creation in its entirety.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 06 FEBRUARY 2025 THURSDAY ALL MESSAGES గురువారం, బృగు వాసర సందేశాలు🌹

🍀🌹 06 FEBRUARY 2025 THURSDAY ALL MESSAGES గురువారం, బృగు వాసర సందేశాలు 🌹🍀 
1) 🌹 అష్టావక్ర గీత - 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 9వ శ్లోకము 🌹
🍀 3. అంతఃకరణ శుద్ధి - మనస్సు యొక్క శుద్ధి 🍀
2) 🌹 Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 9 🌹
🍀 3. Antahkarana Shuddhi – Purification of the Mind 🍀
3) 🌹 अष्टावक्र गीता - प्रथम अध्याय - आत्मानुभवोपदेश - श्लोक 9 🌹
🍀 3. अंतःकरण शुद्धि - मन की शुद्धि. 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 585 - 7 / Sri Lalitha Chaitanya Vijnanam - 585 - 7 🌹 
🌻 585. 'శ్రీవిద్యా’ - 7 / 585. 'Shree Vidya' - 7 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 అష్టావక్ర గీత - 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 9వ శ్లోకము - అజ్ఞానారణ్యాన్ని "నేను శుద్ధ చైతన్యం" అనే జ్ఞానాగ్నితో దగ్ధం చేసి విముక్తుడిగా జీవించు. 🌹*
*🍀 3. అంతఃకరణ శుద్ధి - మనస్సు యొక్క శుద్ధి 🍀*
*✍️ ప్రసాద్‌ భరధ్వాజ*

*ఈ వీడియోలో, అష్టావక్ర గీత యొక్క 1వ అధ్యాయంలోని 9వ శ్లోకాన్ని పరిశీలిస్తాము, ఇది ఆత్మానుభవం యొక్క సారాంశాన్ని బోధిస్తుంది. "నేనే శుద్ధ చైతన్యం" అనే జ్ఞాన అగ్నితో అజ్ఞానం అనే అరణ్యాన్ని దహించి, మనస్సును శుద్ధి చేసి, మానసిక బాధలను అధిగమించి, విముక్తి పొందిన, దుఃఖం లేని జీవితాన్ని ఎలా గడపాలో తెలుసుకోండి. ఆత్మ సాధనలో మనస్సు, ధ్యానం ద్వారా అంతర్ముఖమై, మౌనంలో ప్రశాంతంగా నిలుస్తుంది. ఈ మౌనంలో, అది తన నిజ స్వరూపాన్ని – శాశ్వతం, శుద్ధం, మరియు మార్పు చెందని చైతన్యం అని గుర్తించడం ప్రారంభిస్తుంది.*
*చైతన్య విజ్ఞానం ఛానెల్‌కు సభ్యత్వాన్ని పొందండి. లైక్ చేయండి మరియు షేర్ చేయండి. - ప్రసాద్ భరద్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹 Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 9 - Burn the forest of ignorance with the fire of "I am pure consciousness," and live liberated. 🌹*
*🍀 3. Antahkarana Shuddhi – Purification of the Mind 🍀*
*✍️ Prasad Bharadwaj*

*In this video, we explore the 9th verse of Chapter 1 from the Ashtavakra Gita, which teaches the essence of Self-Realization. Learn how to purify the mind and overcome the mental suffering and burn the forest of ignorance with the fire of "I am pure consciousness" and live a liberated, sorrow-free life. In silence, it begins to recognize its true nature – pure, unchanging, and eternal consciousness.*
*Subscribe to the Chaitanya Vijnaanam channel. Like, and share. - Prasad Bhardwaj*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹 अष्टावक्र गीता - प्रथम अध्याय - आत्मानुभवोपदेश - श्लोक 9 - अज्ञान के जंगल को "मैं शुद्ध चैतन्य हूं" की ज्ञानाग्नि से जलाकर मुक्त होकर जीवन जियो। 🌹
*🍀 3. अंतःकरण शुद्धि - मन की शुद्धि. 🍀*
प्रसाद भारद्वाज.

*इस वीडियो में, हम अष्टावक्र गीता के पहले अध्याय के 9वें श्लोक का विश्लेषण करते हैं, जो आत्मज्ञान का सार सिखाता है। "मैं शुद्ध चैतन्य हूं" की ज्ञानाग्नि से अज्ञान रूपी जंगल को जलाकर, मन को शुद्ध कर, मानसिक पीड़ा को पार करते हुए, कैसे मुक्त और दुखरहित जीवन जिया जा सकता है, यह जानें। मौन में, यह अपने वास्तविक स्वरूप को पहचानने लगता है – जो कि शुद्ध, अचल, और शाश्वत चेतना है।*
*चैतन्य विज्ञानम चैनल को सब्सक्राइब करें। लाइक करें, शेयर करें । - प्रसाद भारद्वाज.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 585 - 7 / Sri Lalitha Chaitanya Vijnanam  - 585 - 7 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।*
*శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀*

*🌻 585. 'శ్రీవిద్యా’ - 7 🌻*

*శ్రీమాత స్వతః పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరిగా అవతరించు చుండును. ఈ నాలుగు స్థితులను శ్రీ మహా విష్ణువు నాలుగు వ్యూహములుగ కూడ తెలుపుదురు. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహము లందురు. ఈ నాలుగు స్థితులను నిర్దేశించుటకే నాలుగు కాలములు, నాలుగు వర్ణములు, నాలుగు ఆశ్రమములు వాఙ్మయమున వివరింప బడినవి. శ్రీ విద్యా ఉపాసనమున శ్రీమాత సమగ్ర సృష్టి స్వరూపమును అనుభూతి చెందు మార్గము ఒక క్రమముతో కూడి విస్తారమై యున్నది.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 585 - 7 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita*
*shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻*

*🌻 585. 'Shree Vidya' - 7 🌻*

*Sri Mata manifests herself naturally in four states: Para (transcendental), Pashyanti (perceptive), Madhyama (intermediate), and Vaikhari (expressed speech). These four states correspond to the four Vyuhas (manifestations) of Sri Maha Vishnu: Vasudeva, Sankarshana, Pradyumna, and Aniruddha. To represent these states, the scriptures describe the four Yugas (epochs), four Varnas (social classes), and four Ashramas (stages of life). In Sri Vidya worship, Sri Mata’s universal form is experienced through a structured and expansive path, enabling the seeker to realize the essence of creation in its entirety.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h

దైవీసంపదలు (Divine Wealth - 26 qualities that are divine wealth)

🌹 దైవీసంపదలు 🌹

26 గుణములు దైవీసంపదలు అని చెప్పాడు పరమాత్మ. ఎవరైతే క్రితం జన్మలో జ్ఞానమును సంపాదిస్తారో, వారు మరుజన్మలో దైవీసంపదలతో పుడతారు. వారికి పైన చెప్పబడిన దైవీ సంబంధమైన గుణాలు ఉంటాయి. వాటిని మననం చేసుకుందాము.

1. భయం లేకపోవడం.

2. సత్వగుణం కలిగి ఉండటం, మనస్సు నిర్మలంగా ఉంచుకోవడం.

3. జ్ఞానమును సంపాదించడం.

4. విద్యాదానము, జ్ఞానదానము, భూదానము, అన్నదానము మొదలగు దానములు శక్తికొద్దీ చేయడం.

5. ఇంద్రియనిగ్రహము.

6. జ్ఞాన యజ్ఞము చేయడం.

7. పురాణములు శాస్త్రములు చదవడం.

8. ప్రతిపనీ ఒక తపస్సులాగా చేయడం.

9. మంచి ప్రవర్తన.

10. అహింస వ్రతమును పాటించడం. అహింసా పరమోధర్మః.

11. సత్యము పలకడం. సత్యమేవ జయతే.

12. కోపము విడిచిపెట్టడం.

13. దుర్గుణములను త్యాగము చేయడం.

14. ప్రశాంతంగా ఉండటం.

15. ఇతరులను విమర్శించకుండా ఉండటం.

16. భూతదయ కలిగిఉండటం.

17. ఇంద్రియలోలత్వము స్త్రీలోలత్వము లేకుండా ఉండటం.

18. మృదువుగా మాట్లాడటం.

19. చెడ్డ పనులు చేసినపుడు సిగ్గుపడటం.

20. చిత్తచాంచల్యము వదిలిపెట్టడం.

21. ముఖంలో మనస్సులో తేజస్సు కలిగి ఉండటం.

22. ఓర్పుకలిగి ఉండటం.

23. అన్ని వేళలలో ధైర్యంగా ఉండటం.

24. శరీరము మనస్సు శుచిగా ఉంచుకోవడం.

25. ద్రోహబుద్ధి లేకుండా ఉండటం.

26. స్వాభిమానము వదిలిపెట్టడం.

ఈ గుణములను దైవీసంపదగా పరిగణించారు.

🌹🌹🌹🌹🌹

Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 9 - Burn the forest of ignorance with.... (Youtube Short #2)

🌹 2. Eternal Consciousness 🌹

🍀 Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 9 - Burn the forest of ignorance with the fire of "I am pure consciousness," and live liberated. 🍀

✍️ Prasad Bharadwaj

https://www.youtube.com/shorts/GjMKqc0l4Zw

In this video, we explore the 9th verse of Chapter 1 from the Ashtavakra Gita, which teaches the essence of Self-Realization. Learn how to purify the mind and overcome the mental suffering and burn the forest of ignorance with the fire of "I am pure consciousness" and live a liberated, sorrow-free life. In silence, it begins to recognize its true nature – pure, unchanging, and eternal consciousness.

Subscribe to the Chaitanya Vijnaanam channel. Like, and share. - Prasad Bhardwaj

🌹🌹🌹🌹🌹

అష్టావక్ర గీత - 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 9వ శ్లోకము - అజ్ఞానారణ్యాన్ని.... (Youtube Short #2) (Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 9)

🌹 2. మార్పు చెందని చైతన్యం 🌹

🍀 అష్టావక్ర గీత - 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 9వ శ్లోకము - అజ్ఞానారణ్యాన్ని "నేను శుద్ధ చైతన్యం" అనే జ్ఞానాగ్నితో దగ్ధం చేసి విముక్తుడిగా జీవించు. 🍀

✍️ ప్రసాద్‌ భరధ్వాజ

https://www.youtube.com/shorts/HswNT-yiIuI

ఈ వీడియోలో, అష్టావక్ర గీత యొక్క 1వ అధ్యాయంలోని 9వ శ్లోకాన్ని పరిశీలిస్తాము, ఇది ఆత్మానుభవం యొక్క సారాంశాన్ని బోధిస్తుంది. "నేనే శుద్ధ చైతన్యం" అనే జ్ఞాన అగ్నితో అజ్ఞానం అనే అరణ్యాన్ని దహించి, మనస్సును శుద్ధి చేసి, మానసిక బాధలను అధిగమించి, విముక్తి పొందిన, దుఃఖం లేని జీవితాన్ని ఎలా గడపాలో తెలుసుకోండి. ఆత్మ సాధనలో మనస్సు, ధ్యానం ద్వారా అంతర్ముఖమై, మౌనంలో ప్రశాంతంగా నిలుస్తుంది. ఈ మౌనంలో, అది తన నిజ స్వరూపాన్ని – శాశ్వతం, శుద్ధం, మరియు మార్పు చెందని చైతన్యం అని గుర్తించడం ప్రారంభిస్తుంది.

చైతన్య విజ్ఞానం ఛానెల్‌కు సభ్యత్వాన్ని పొందండి. లైక్ చేయండి మరియు షేర్ చేయండి. - ప్రసాద్ భరద్వాజ

🌹🌹🌹🌹🌹

अष्टावक्र गीता - प्रथम अध्याय - आत्मानुभवोपदेश - श्लोक 9 - अज्ञान के जंगल को.... (Youtube Short #2) (Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 9)

🌹 2. शाश्वत चेतना है 🌹

🍀 अष्टावक्र गीता - प्रथम अध्याय - आत्मानुभवोपदेश - श्लोक 9 - अज्ञान के जंगल को "मैं शुद्ध चैतन्य हूं" की ज्ञानाग्नि से जलाकर मुक्त होकर जीवन जियो। 🍀

प्रसाद भारद्वाज.

https://www.youtube.com/shorts/JTtUqoy5n1I

इस वीडियो में, हम अष्टावक्र गीता के पहले अध्याय के 9वें श्लोक का विश्लेषण करते हैं, जो आत्मज्ञान का सार सिखाता है। "मैं शुद्ध चैतन्य हूं" की ज्ञानाग्नि से अज्ञान रूपी जंगल को जलाकर, मन को शुद्ध कर, मानसिक पीड़ा को पार करते हुए, कैसे मुक्त और दुखरहित जीवन जिया जा सकता है, यह जानें। मौन में, यह अपने वास्तविक स्वरूप को पहचानने लगता है – जो कि शुद्ध, अचल, और शाश्वत चेतना है।

चैतन्य विज्ञानम चैनल को सब्सक्राइब करें। लाइक करें, शेयर करें । - प्रसाद भारद्वाज.

🌹🌹🌹🌹🌹

రధసప్తమి, నర్మదా జయంతి శుభాకాంక్షలు - Good Wishes on Ratha Saptami, Narmada Jayanti

🌹. రధసప్తమి, నర్మదా జయంతి శుభాకాంక్షలు అందరికి - Ratha Saptami, Narmada Jayanti, Good Wishes to all 🌹

ప్రసాద్ భరద్వాజ

☀️. రథసప్తమి విశిష్టత ☀️

సప్త సప్త మహా సప్త, సప్త ద్వీపా వసుంధరా
సప్తార్క పర్ణ మాధాయ సప్తమి రధ సప్తమి

ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి జన్మదినమే రథసప్తమి. సూర్యుని గమనం ఏడు గుర్రములు పూన్చిన బంగారు రథం మీద సాగుతుందని వేదము "హిరణ్యయేన సవితారథేన" అని తెలుపుతుంది. సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనము, దక్షిణాయనము అని రెండు విధములు. ఆషాఢమాసము నుండి పుష్యమాసము వరకు దక్షిణాయనము. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకముగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్ర దినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. "భా" అంటే సూర్యకాంతి, "రతి" అంటే సూర్యుడు, కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీయులు. అని పిలువబడతారు."

రధసప్తమి ఒక్కటేకాక, కల్యాణ సప్తమి, కమలసప్తమి, శర్కరాసప్తమి, అచలాసప్తమి, రధాంకసప్తమి, మహసప్తమి, జయాసప్తమి, విజయాసప్తమి, నందాసప్తమి, సిద్ధార్ధికాది సప్తమి, సాక్షుభార్యా సప్తమి, సర్షపసప్తమి, మార్తాండసప్తమి, సూర్యవ్రతసప్తమి, సప్తసప్తి సప్తమి, అర్కసంపుటసప్తమి, నింబసప్తమి, మరీచసప్తమి, ఫలసప్తమి - మున్నగు అనేక సప్తమీ వ్రతాలను గురించి గ్రంధాలు పేర్కొన్నాయి. ఇవ్వన్నీ సూర్యుణ్ణి గుర్తించిన వ్రతాలే! ఇందులో కొన్ని రధసప్తమినాడు ఆచరించేవి పంచాంగకర్తలు రధసప్తమిని ' సూర్యజయంతి ' అన్నారు.

జననీ త్వం హి లోకానాం సప్తమీ సప్తసస్తికే,
సప్తవ్యాహృతికే దేవి! నమస్తే సూర్యమాతృకే.

"సస్తాశ్వాలుండే ఓ సప్తమీ! నీవు సకల లోకాలకూ తల్లివి. సూర్యునికి తల్లివైన నీకు నమస్కారం"- అని చెప్తూ, సూర్యునికి అర్ఘ్యమివ్వాలి.

రథసప్తమి అంటే సూర్యభగవానుని పూజించే పండగ. మాఘమాస శుక్ల పక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. రథసప్తమి మహా తేజం. మన ఆథ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నేండుగురు సూర్యులు.

సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు.

1. చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు 'ధాత'

2. వైశాఖంలో అర్యముడు,

3. జ్యేష్టం - మిత్రుడు,

4. ఆషాఢం - వరుణుడు,

5. శ్రావణంలో ఇంద్రుడు,

6. భాద్రపదం - వివస్వంతుడు,

7. ఆశ్వయుజం - త్వష్ణ,

8. కార్తీకం - విష్ణువు,

9. మార్గశిరం - అంశుమంతుడు,

10. పుష్యం - భగుడు,

11. మాఘం - పూషుడు,

12. ఫాల్గుణం - పర్జజన్యుడు.

ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది.

ఆ ఏడు గుర్రాల పేర్లు

1. గాయత్రి, 2. త్రిష్ణుప్పు, 3. అనుష్టుప్పు, 4. జగతి, 5. పంక్తి, 6. బృహతి, 7. ఉష్ణిక్కు. వీటి రూపాలు సప్త వర్ణాలకు సరి పోలుతాయి.

🌻. సూర్య స్తోత్రం 🌻

ధ్యాయేత్సూర్య మనంత కోటి కిరణం తేజోమయం భాస్కరం

భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్

ఆదిత్యం జగదీశ మచ్యుతమజం త్రైలోక్య చూడామణిం

భక్తాభీష్ట వరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్

☘️ ఈ రోజున స్నానం చేసేటప్పుడు చదువ వలసిన శ్లోకం ☘️

నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః !

అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే !!

యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు !

తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ !!

ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్ !

మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః !!

ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే !

సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ !!

💧నర్మదా నది జయంతి విశిష్టత 💧

శ్రీ నర్మదే సకల దుఃఖహరే పవిత్రే ఈశాన నందిని కృపాకరి దేవి ధన్యే

రేవే గిరీన్ద్ర తనయాతనయే వదాన్యే ధర్మానురాగ రసికే సతతం నమస్తే

నర్మదా జయంతి ప్రతి సంవత్సరం మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి నాడు జరుపుకుంటారు. మధ్యప్రదేశ్‌లో ఉన్న అమర్‌కంటక్, నర్మదా నదికి మూలం. ఇక్కడ నర్మదా జయంతిని అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. మాఘ శుక్ల పక్షం సప్తమి తిథి నాడు నర్మదా నది ఉనికిలోకి వచ్చిందని నమ్ముతారు. నర్మదా నదిని పూజించిన భక్తుల జీవితాల్లో శాంతి, శ్రేయస్సు లభిస్తాయని భక్తుల విశ్వాసం. అమృతం కోసం సముద్ర మధనం జరిగినప్పుడు వెలువడిన గరళం స్వీకరించిన మహాశివుని చెమట బిందువు నుండి నర్మదానది ఆవిర్భవించిందని అంటారు. భక్తుడు తన పాపాల నుండి విముక్తి పొందుతాడు అనే నమ్మకం నర్మదా జయంతి యొక్క ప్రాముఖ్యత. నర్మదానది భవ్య ఫలదాయిని- దివ్య శుభకారిణి. గంగానదిని జ్ఞాన తరంగిణిగా వ్యవహరిస్తే నర్మదను తపోవాహినిగా పేర్కొంటారు.

🌹🌹🌹🌹🌹

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 585 - 6 / Sri Lalitha Chaitanya Vijnanam - 585 - 6

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 585 - 6 / Sri Lalitha Chaitanya Vijnanam - 585 - 6 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀

🌻 585. 'శ్రీవిద్యా’ - 6 🌻

అటుపైన సూక్ష్మతమమైన వాగ్భవ కూటము వ్యాప్తి చెందును. అపుడు శ్రీమాత ప్రజ్ఞా స్వరూపము ఆవిష్కరింప బడి పరమానందము పొందును. ఇట్లు ప్రజ్ఞ శక్తి, సూక్ష్మ పదార్థముగ తన స్వరూపము వ్యాప్తి చెందుచూ, శ్రీమాత అద్భుత దర్శనమును పొంది అమితానందముతో సాయుజ్యమును పొందును. శ్రీమాత వాగ్భవకూటమే పంచాక్షరి. క, ఎ, ఐ, ల, హ్రీం. ఇట్లు పంచాక్షరి, షడాక్షరి, చతురాక్షరిగా వ్యాప్తి చెందిన తత్త్వము అనుభూతి యగును. తత్వ స్వరూపిణిగా ఆమె ఈ మూడు కూటములను మించి యుండును. అట్టి తత్త్వమే మూడు కూటములుగ దిగి వచ్చును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 585 - 6 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita
shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻

🌻 585. 'Shree Vidya' - 6 🌻

Following this, the "Vagbhava Kuta", the subtlest of all clusters, unfolds. At this stage, Sri Mata, in her form as Pragya Swaroopa (embodiment of supreme wisdom), is revealed, and the seeker attains supreme bliss. As the power of wisdom spreads, merging with the essence of subtle elements, the seeker beholds the wondrous vision of Sri Mata and experiences boundless joy, ultimately achieving "Sayujya" (oneness with the divine). The Vagbhava Kuta, which is also the Panchakshari mantra, consists of the syllables "ka, e, ai, la, hreem". In this way, the divine principle is experienced as the "Panchakshari (five syllables)", "Shadakshari (six syllables)", and "Chaturakshari (four syllables)" mantras. As the embodiment of the ultimate principle, Sri Mata transcends these three clusters, while simultaneously descending into them to manifest her divine essence.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 04 FEBRUARY 2025 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు🌹

🍀🌹 04 FEBRUARY 2025 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹🍀 
1) 🌹 అష్టావక్ర గీత - 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 9వ శ్లోకము 🌹
🍀 2. మార్పు చెందని చైతన్యం 🍀
2) 🌹 Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 9 🌹
🍀 2. Eternal Consciousness 🍀
3) 🌹 अष्टावक्र गीता - प्रथम अध्याय - आत्मानुभवोपदेश - श्लोक 9 🌹
🍀 2. शाश्वत चेतना है 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 585 - 6 / Sri Lalitha Chaitanya Vijnanam - 585 - 6 🌹 
🌻 585. 'శ్రీవిద్యా’ - 6 / 585. 'Shree Vidya' - 6 🌻
5) 🌹. రధసప్తమి, నర్మదా జయంతి శుభాకాంక్షలు అందరికి - Ratha Saptami, Narmada Jayanti, Good Wishes to all 🌹
☀️. రథసప్తమి విశిష్టత / నర్మదా జయంతి విశిష్టత ☀️
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 2. మార్పు చెందని చైతన్యం 🌹*
*🍀 అష్టావక్ర గీత - 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 9వ శ్లోకము - అజ్ఞానారణ్యాన్ని "నేను శుద్ధ చైతన్యం" అనే జ్ఞానాగ్నితో దగ్ధం చేసి విముక్తుడిగా జీవించు. 🍀*
*✍️ ప్రసాద్‌ భరధ్వాజ*

*ఈ వీడియోలో, అష్టావక్ర గీత యొక్క 1వ అధ్యాయంలోని 9వ శ్లోకాన్ని పరిశీలిస్తాము, ఇది ఆత్మానుభవం యొక్క సారాంశాన్ని బోధిస్తుంది. "నేనే శుద్ధ చైతన్యం" అనే జ్ఞాన అగ్నితో అజ్ఞానం అనే అరణ్యాన్ని దహించి, మనస్సును శుద్ధి చేసి, మానసిక బాధలను అధిగమించి, విముక్తి పొందిన, దుఃఖం లేని జీవితాన్ని ఎలా గడపాలో తెలుసుకోండి. ఆత్మ సాధనలో మనస్సు, ధ్యానం ద్వారా అంతర్ముఖమై, మౌనంలో ప్రశాంతంగా నిలుస్తుంది. ఈ మౌనంలో, అది తన నిజ స్వరూపాన్ని – శాశ్వతం, శుద్ధం, మరియు మార్పు చెందని చైతన్యం అని గుర్తించడం ప్రారంభిస్తుంది.*
*చైతన్య విజ్ఞానం ఛానెల్‌కు సభ్యత్వాన్ని పొందండి. లైక్ చేయండి మరియు షేర్ చేయండి. - ప్రసాద్ భరద్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 2. Eternal Consciousness 🌹*
*🍀 Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 9 - Burn the forest of ignorance with the fire of "I am pure consciousness," and live liberated. 🍀*
*✍️ Prasad Bharadwaj*

*In this video, we explore the 9th verse of Chapter 1 from the Ashtavakra Gita, which teaches the essence of Self-Realization. Learn how to purify the mind and overcome the mental suffering and burn the forest of ignorance with the fire of "I am pure consciousness" and live a liberated, sorrow-free life. In silence, it begins to recognize its true nature – pure, unchanging, and eternal consciousness.*
*Subscribe to the Chaitanya Vijnaanam channel. Like, and share. - Prasad Bhardwaj*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 2. शाश्वत चेतना है 🌹*
*🍀 अष्टावक्र गीता - प्रथम अध्याय - आत्मानुभवोपदेश - श्लोक 9 - अज्ञान के जंगल को "मैं शुद्ध चैतन्य हूं" की ज्ञानाग्नि से जलाकर मुक्त होकर जीवन जियो। 🍀*
*प्रसाद भारद्वाज.*

*इस वीडियो में, हम अष्टावक्र गीता के पहले अध्याय के 9वें श्लोक का विश्लेषण करते हैं, जो आत्मज्ञान का सार सिखाता है। "मैं शुद्ध चैतन्य हूं" की ज्ञानाग्नि से अज्ञान रूपी जंगल को जलाकर, मन को शुद्ध कर, मानसिक पीड़ा को पार करते हुए, कैसे मुक्त और दुखरहित जीवन जिया जा सकता है, यह जानें। मौन में, यह अपने वास्तविक स्वरूप को पहचानने लगता है – जो कि शुद्ध, अचल, और शाश्वत चेतना है।*
*चैतन्य विज्ञानम चैनल को सब्सक्राइब करें। लाइक करें, शेयर करें । - प्रसाद भारद्वाज.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 585 - 6 / Sri Lalitha Chaitanya Vijnanam  - 585 - 6 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।*
*శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀*

*🌻 585. 'శ్రీవిద్యా’ - 6 🌻*

*అటుపైన సూక్ష్మతమమైన వాగ్భవ కూటము వ్యాప్తి చెందును. అపుడు శ్రీమాత ప్రజ్ఞా స్వరూపము ఆవిష్కరింప బడి పరమానందము పొందును. ఇట్లు ప్రజ్ఞ శక్తి, సూక్ష్మ పదార్థముగ తన స్వరూపము వ్యాప్తి చెందుచూ, శ్రీమాత అద్భుత దర్శనమును పొంది అమితానందముతో సాయుజ్యమును పొందును. శ్రీమాత వాగ్భవకూటమే పంచాక్షరి. క, ఎ, ఐ, ల, హ్రీం. ఇట్లు పంచాక్షరి, షడాక్షరి, చతురాక్షరిగా వ్యాప్తి చెందిన తత్త్వము అనుభూతి యగును. తత్వ స్వరూపిణిగా ఆమె ఈ మూడు కూటములను మించి యుండును. అట్టి తత్త్వమే మూడు కూటములుగ దిగి వచ్చును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 585 - 6 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita*
*shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻*

*🌻 585. 'Shree Vidya' - 6 🌻*

*Following this, the "Vagbhava Kuta", the subtlest of all clusters, unfolds. At this stage, Sri Mata, in her form as Pragya Swaroopa (embodiment of supreme wisdom), is revealed, and the seeker attains supreme bliss. As the power of wisdom spreads, merging with the essence of subtle elements, the seeker beholds the wondrous vision of Sri Mata and experiences boundless joy, ultimately achieving "Sayujya" (oneness with the divine). The Vagbhava Kuta, which is also the Panchakshari mantra, consists of the syllables "ka, e, ai, la, hreem". In this way, the divine principle is experienced as the "Panchakshari (five syllables)", "Shadakshari (six syllables)", and "Chaturakshari (four syllables)" mantras. As the embodiment of the ultimate principle, Sri Mata transcends these three clusters, while simultaneously descending into them to manifest her divine essence.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. రధసప్తమి, నర్మదా జయంతి శుభాకాంక్షలు అందరికి -  Ratha Saptami, Narmada Jayanti, Good Wishes to all 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*☀️. రథసప్తమి విశిష్టత ☀️*

*సప్త సప్త మహా సప్త, సప్త ద్వీపా వసుంధరా*
*సప్తార్క పర్ణ మాధాయ సప్తమి రధ సప్తమి*

*ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి జన్మదినమే రథసప్తమి.  సూర్యుని గమనం ఏడు గుర్రములు పూన్చిన బంగారు రథం మీద సాగుతుందని వేదము "హిరణ్యయేన సవితారథేన" అని తెలుపుతుంది. సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనము, దక్షిణాయనము అని రెండు విధములు. ఆషాఢమాసము నుండి పుష్యమాసము వరకు దక్షిణాయనము. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకముగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్ర దినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. "భా" అంటే సూర్యకాంతి, "రతి" అంటే సూర్యుడు, కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీయులు. అని పిలువబడతారు."*

*రధసప్తమి ఒక్కటేకాక, కల్యాణ సప్తమి, కమలసప్తమి, శర్కరాసప్తమి, అచలాసప్తమి, రధాంకసప్తమి, మహసప్తమి, జయాసప్తమి, విజయాసప్తమి, నందాసప్తమి, సిద్ధార్ధికాది సప్తమి, సాక్షుభార్యా సప్తమి, సర్షపసప్తమి, మార్తాండసప్తమి, సూర్యవ్రతసప్తమి, సప్తసప్తి సప్తమి, అర్కసంపుటసప్తమి, నింబసప్తమి, మరీచసప్తమి, ఫలసప్తమి - మున్నగు అనేక సప్తమీ వ్రతాలను గురించి గ్రంధాలు పేర్కొన్నాయి. ఇవ్వన్నీ సూర్యుణ్ణి గుర్తించిన వ్రతాలే! ఇందులో కొన్ని రధసప్తమినాడు ఆచరించేవి పంచాంగకర్తలు రధసప్తమిని ' సూర్యజయంతి ' అన్నారు.*

*జననీ త్వం హి లోకానాం సప్తమీ సప్తసస్తికే,*
*సప్తవ్యాహృతికే దేవి! నమస్తే సూర్యమాతృకే.*

*"సస్తాశ్వాలుండే ఓ సప్తమీ! నీవు సకల లోకాలకూ తల్లివి. సూర్యునికి తల్లివైన నీకు నమస్కారం"- అని చెప్తూ, సూర్యునికి అర్ఘ్యమివ్వాలి.*

*రథసప్తమి అంటే సూర్యభగవానుని పూజించే పండగ. మాఘమాస శుక్ల పక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. రథసప్తమి మహా తేజం. మన ఆథ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నేండుగురు సూర్యులు.*

*సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు.*

*1. చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు 'ధాత'*
*2. వైశాఖంలో అర్యముడు,*
*3. జ్యేష్టం - మిత్రుడు,*
*4. ఆషాఢం - వరుణుడు,*
*5. శ్రావణంలో ఇంద్రుడు,*
*6. భాద్రపదం - వివస్వంతుడు,*
*7. ఆశ్వయుజం - త్వష్ణ,*
*8. కార్తీకం - విష్ణువు,*
*9. మార్గశిరం - అంశుమంతుడు,*
*10. పుష్యం - భగుడు,*
*11. మాఘం - పూషుడు,*
*12. ఫాల్గుణం - పర్జజన్యుడు.*

*ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది.*

*ఆ ఏడు గుర్రాల పేర్లు
1. గాయత్రి, 2. త్రిష్ణుప్పు, 3. అనుష్టుప్పు, 4. జగతి, 5. పంక్తి, 6. బృహతి, 7. ఉష్ణిక్కు. వీటి రూపాలు సప్త వర్ణాలకు సరి పోలుతాయి.*

*🌻. సూర్య స్తోత్రం 🌻*
*ధ్యాయేత్సూర్య మనంత కోటి కిరణం తేజోమయం భాస్కరం*
*భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్*
*ఆదిత్యం జగదీశ మచ్యుతమజం త్రైలోక్య చూడామణిం*
*భక్తాభీష్ట వరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్*

*☘️ ఈ రోజున స్నానం చేసేటప్పుడు చదువ వలసిన శ్లోకం ☘️*

*నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః !*
*అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే !!*
*యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు !*
*తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ !!*
*ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్ !*
*మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః !!*
*ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే !*
*సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ !!*

*💧నర్మదా నది జయంతి విశిష్టత 💧*

*శ్రీ నర్మదే సకల దుఃఖహరే పవిత్రే ఈశాన నందిని కృపాకరి దేవి ధన్యే*
*రేవే గిరీన్ద్ర తనయాతనయే వదాన్యే ధర్మానురాగ రసికే సతతం నమస్తే*

*నర్మదా జయంతి ప్రతి సంవత్సరం మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి నాడు జరుపుకుంటారు. మధ్యప్రదేశ్‌లో ఉన్న అమర్‌కంటక్, నర్మదా నదికి మూలం. ఇక్కడ నర్మదా జయంతిని అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. మాఘ శుక్ల పక్షం సప్తమి తిథి నాడు నర్మదా నది ఉనికిలోకి వచ్చిందని నమ్ముతారు.  నర్మదా నదిని పూజించిన భక్తుల జీవితాల్లో శాంతి, శ్రేయస్సు లభిస్తాయని భక్తుల విశ్వాసం. అమృతం కోసం సముద్ర మధనం  జరిగినప్పుడు వెలువడిన గరళం స్వీకరించిన మహాశివుని చెమట బిందువు నుండి నర్మదానది ఆవిర్భవించిందని అంటారు. భక్తుడు తన పాపాల నుండి విముక్తి పొందుతాడు అనే నమ్మకం నర్మదా జయంతి యొక్క ప్రాముఖ్యత. నర్మదానది భవ్య ఫలదాయిని- దివ్య శుభకారిణి. గంగానదిని జ్ఞాన తరంగిణిగా వ్యవహరిస్తే నర్మదను తపోవాహినిగా పేర్కొంటారు.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h

Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 9 - Burn the forest of ... (Youtube Short #1)

🌹 Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 9 - Burn the forest of ignorance with the fire of "I am pure consciousness," and live liberated. 🌹

🍀 1. I am the Pure Consciousness 🍀

✍️ Prasad Bharadwaj

https://www.youtube.com/shorts/uFaFGZRFJyg

In this video, we explore the 9th verse of Chapter 1 from the Ashtavakra Gita, which teaches the essence of Self-Realization. Learn how to purify the mind and overcome the mental suffering and burn the forest of ignorance with the fire of "I am pure consciousness" and live a liberated, sorrow-free life.

Subscribe to the Chaitanya Vijnaanam channel. Like, and share. - Prasad Bhardwaj

🌹🌹🌹🌹🌹

అష్టావక్ర గీత - 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 9వ శ్లోకము - అజ్ఞానారణ్యాన్ని.... (Youtube Short #1) (Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 9)

🌹 అష్టావక్ర గీత - 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 9వ శ్లోకము - అజ్ఞానారణ్యాన్ని "నేను శుద్ధ చైతన్యం" అనే జ్ఞానాగ్నితో దగ్ధం చేసి విముక్తుడిగా జీవించు. 🌹

🍀 1. నేను శుద్ధ చైతన్యం 🍀

✍️ ప్రసాద్‌ భరధ్వాజ

https://www.youtube.com/shorts/mOxT59pKxZU

ఈ వీడియోలో, అష్టావక్ర గీత యొక్క 1వ అధ్యాయంలోని 9వ శ్లోకాన్ని పరిశీలిస్తాము, ఇది ఆత్మానుభవం యొక్క సారాంశాన్ని బోధిస్తుంది. "నేనే శుద్ధ చైతన్యం" అనే జ్ఞాన అగ్నితో అజ్ఞానం అనే అరణ్యాన్ని దహించి, మనస్సును శుద్ధి చేసి, మానసిక బాధలను అధిగమించి, విముక్తి పొందిన, దుఃఖం లేని జీవితాన్ని ఎలా గడపాలో తెలుసుకోండి.

చైతన్య విజ్ఞానం ఛానెల్‌కు సభ్యత్వాన్ని పొందండి. లైక్ చేయండి మరియు షేర్ చేయండి. - ప్రసాద్ భరద్వాజ

🌹🌹🌹🌹🌹

अष्टावक्र गीता - प्रथम अध्याय - आत्मानुभवोपदेश - श्लोक 9 - अज्ञान के जंगल को.... (Youtube Short #1) (Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 9)

🌹 अष्टावक्र गीता - प्रथम अध्याय - आत्मानुभवोपदेश - श्लोक 9 - अज्ञान के जंगल को "मैं शुद्ध चैतन्य हूं" की ज्ञानाग्नि से जलाकर मुक्त होकर जीवन जियो। 🌹

🍀 1. मैं शुद्ध चेतना हूँ. 🍀

प्रसाद भारद्वाज.

https://www.youtube.com/shorts/BXjOUOg0TAA

इस वीडियो में, हम अष्टावक्र गीता के पहले अध्याय के 9वें श्लोक का विश्लेषण करते हैं, जो आत्मज्ञान का सार सिखाता है। "मैं शुद्ध चैतन्य हूं" की ज्ञानाग्नि से अज्ञान रूपी जंगल को जलाकर, मन को शुद्ध कर, मानसिक पीड़ा को पार करते हुए, कैसे मुक्त और दुखरहित जीवन जिया जा सकता है, यह जानें।

चैतन्य विज्ञानम चैनल को सब्सक्राइब करें। लाइक करें, शेयर करें । - प्रसाद भारद्वाज.

🌹🌹🌹🌹🌹

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 585 - 5 / Sri Lalitha Chaitanya Vijnanam - 585 - 5

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 585 - 5 / Sri Lalitha Chaitanya Vijnanam - 585 - 5 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀

🌻 585. 'శ్రీవిద్యా’ - 5 🌻

ప్రథమమున శక్తి కూటమి యగు స, క, ల, హ్రీం అను కూటమి నుండి విడుదల లభించును. అపుడు స్థూలము నుండి సూక్ష్మమునకు సాధకుడు వ్యాప్తి చెందును. అప్పుడతడు శక్తివంతుడగును. అటుపైన కామముపై ధర్మాచరణము కారణముగ స్వామిత్వము కలుగును. అపుడు మధ్యకూటమగు అ, స, క, హ, ల, హ్రీం అను బీజాక్షరములు తత్త్వమవగాహన యగును. అట్లగుటచే మధ్య కూటమును దాటును. సూక్ష్మతరమైన శ్రీమాత తత్త్వ మవగాహన యగును. అపుడు మహత్తు సహకరించును. తత్కారణముగ లోక కల్యాణార్థమై మహత్కార్యములు ఉపాసకుని నుండి జరుగును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 585 - 5 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita
shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻

🌻 585. 'Shree Vidya' - 5 🌻

Initially, the Shakti Kuta cluster, consisting of the syllables "sa, ka, la, hreem", brings about liberation. At this stage, the seeker transitions from the gross (physical) to the subtle realm, gaining immense strength. Subsequently, by practicing Dharma in relation to desires, the seeker attains mastery over the self. This leads to the realization of the Madhya Kuta cluster, represented by the syllables "a, sa, ka, ha, la, hreem", which embodies the deeper understanding of truth. By transcending the Madhya Kuta, the seeker perceives the subtler essence of Sri Mata’s principle. At this stage, Mahat (the great principle) supports the seeker, enabling them to perform great deeds for the welfare of the world, inspired by divine will.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

Happy Vasant Panchami and Saraswati Pooja to all

Facebook - Vasant Panchmi and Saraswati Pooja

Facebook - Chaitanya Vijnanam

🌹 03 FEBRUARY 2025 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు🌹

🍀🌹 03 FEBRUARY 2025 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు🌹🍀 
1) 🌹 అష్టావక్ర గీత - 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 9వ శ్లోకము 🌹
🍀 1. నేను శుద్ధ చైతన్యం 🍀
2) 🌹 Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 9 🌹
🍀 1. I am the Pure Consciousness 🍀
3) 🌹 अष्टावक्र गीता - प्रथम अध्याय - आत्मानुभवोपदेश - श्लोक 9 🌹
🍀 1. मैं शुद्ध चेतना हूँ. 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 585 - 5 / Sri Lalitha Chaitanya Vijnanam - 585 - 5 🌹 
🌻 585. 'శ్రీవిద్యా’ - 5 / 585. 'Shree Vidya' - 5 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹వసంత పంచమి శుభాకాంక్షలు అందరికి Vasanta Panchami Good Wishes to All 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹సరస్వతి పూజ శుభాకాంక్షలు అందరికి Saraswathi Pooja Good Wishes to All 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 అష్టావక్ర గీత - 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 9వ శ్లోకము - అజ్ఞానారణ్యాన్ని "నేను శుద్ధ చైతన్యం" అనే జ్ఞానాగ్నితో దగ్ధం చేసి విముక్తుడిగా జీవించు. 🌹*
*🍀 1. నేను శుద్ధ చైతన్యం 🍀*
*✍️ ప్రసాద్‌ భరధ్వాజ*

*ఈ వీడియోలో, అష్టావక్ర గీత యొక్క 1వ అధ్యాయంలోని 9వ శ్లోకాన్ని పరిశీలిస్తాము, ఇది ఆత్మానుభవం యొక్క సారాంశాన్ని బోధిస్తుంది. "నేనే శుద్ధ చైతన్యం" అనే జ్ఞాన అగ్నితో అజ్ఞానం అనే అరణ్యాన్ని దహించి, మనస్సును శుద్ధి చేసి, మానసిక బాధలను అధిగమించి, విముక్తి పొందిన, దుఃఖం లేని జీవితాన్ని ఎలా గడపాలో తెలుసుకోండి.*
*చైతన్య విజ్ఞానం ఛానెల్‌కు సభ్యత్వాన్ని పొందండి. లైక్ చేయండి మరియు షేర్ చేయండి. - ప్రసాద్ భరద్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 9 - Burn the forest of ignorance with the fire of "I am pure consciousness," and live liberated. 🌹*
*🍀 1. I am the Pure Consciousness 🍀*
*✍️ Prasad Bharadwaj*

*In this video, we explore the 9th verse of Chapter 1 from the Ashtavakra Gita, which teaches the essence of Self-Realization. Learn how to purify the mind and overcome the mental suffering and burn the forest of ignorance with the fire of "I am pure consciousness" and live a liberated, sorrow-free life.*
*Subscribe to the Chaitanya Vijnaanam channel. Like, and share. - Prasad Bhardwaj*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 अष्टावक्र गीता - प्रथम अध्याय - आत्मानुभवोपदेश - श्लोक 9 - अज्ञान के जंगल को "मैं शुद्ध चैतन्य हूं" की ज्ञानाग्नि से जलाकर मुक्त होकर जीवन जियो। 🌹*
*🍀 1. मैं शुद्ध चेतना हूँ. 🍀*
*प्रसाद भारद्वाज.*

*इस वीडियो में, हम अष्टावक्र गीता के पहले अध्याय के 9वें श्लोक का विश्लेषण करते हैं, जो आत्मज्ञान का सार सिखाता है। "मैं शुद्ध चैतन्य हूं" की ज्ञानाग्नि से अज्ञान रूपी जंगल को जलाकर, मन को शुद्ध कर, मानसिक पीड़ा को पार करते हुए, कैसे मुक्त और दुखरहित जीवन जिया जा सकता है, यह जानें।*
*चैतन्य विज्ञानम चैनल को सब्सक्राइब करें। लाइक करें, शेयर करें । - प्रसाद भारद्वाज.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 585 - 5 / Sri Lalitha Chaitanya Vijnanam  - 585 - 5 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।*
*శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀*

*🌻 585. 'శ్రీవిద్యా’ - 5 🌻*

*ప్రథమమున శక్తి కూటమి యగు స, క, ల, హ్రీం అను కూటమి నుండి విడుదల లభించును. అపుడు స్థూలము నుండి సూక్ష్మమునకు సాధకుడు వ్యాప్తి చెందును. అప్పుడతడు శక్తివంతుడగును. అటుపైన కామముపై ధర్మాచరణము కారణముగ స్వామిత్వము కలుగును. అపుడు మధ్యకూటమగు అ, స, క, హ, ల, హ్రీం అను బీజాక్షరములు తత్త్వమవగాహన యగును. అట్లగుటచే మధ్య కూటమును దాటును. సూక్ష్మతరమైన శ్రీమాత తత్త్వ మవగాహన యగును. అపుడు మహత్తు సహకరించును. తత్కారణముగ లోక కల్యాణార్థమై మహత్కార్యములు ఉపాసకుని నుండి జరుగును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 585 - 5 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita*
*shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻*

*🌻 585. 'Shree Vidya' - 5 🌻*

*Initially, the Shakti Kuta cluster, consisting of the syllables "sa, ka, la, hreem", brings about liberation. At this stage, the seeker transitions from the gross (physical) to the subtle realm, gaining immense strength. Subsequently, by practicing Dharma in relation to desires, the seeker attains mastery over the self. This leads to the realization of the Madhya Kuta cluster, represented by the syllables "a, sa, ka, ha, la, hreem", which embodies the deeper understanding of truth. By transcending the Madhya Kuta, the seeker perceives the subtler essence of Sri Mata’s principle. At this stage, Mahat (the great principle) supports the seeker, enabling them to perform great deeds for the welfare of the world, inspired by divine will.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube, Facebook, WhatsApp, Telegram, Instagram, twitter, Thread. 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom https://chat.whatsapp.com/DAOnpFo48vL3EXEz7SL77D
https://www.instagram.com/prasad.bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
https://x.com/YhsPrasad https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h

శ్యామలా దేవి నవరాత్రులు - విశిష్టత, స్తుతి, దండకం (Shyamala Devi Navaratri - Significance, Stuti, Dandkam)

🌹 శ్యామలా దేవి నవరాత్రులు శుభాకాంక్షలు అందరికి Shyamala Devi Navaratri Good Wishes to All 🌹

ప్రసాద్ భరద్వాజ

🍀 శ్యామలాదేవి నవరాత్రుల విశిష్టత 🍀

మాఘ శుద్ధ పాడ్యమి నుంచి మాఘ శుద్ధ నవమి వరకు శ్యామలా నవరాత్రులు అని పిలుస్తారు.

శ్యామల సరస్వతీ రూపం జ్ఞాన స్వరూపం ఈమెను మంత్రిని అంటారు..అమ్మవారికి శ్యామల దేవి మంత్రి వారాహిమాత సేనాధిపతి.

శ్యామలా ఉపాసన అనేది దశమహావిద్యలలో ఒక విద్య. ఈ తల్లిని మాతంగి (మాతంగ ముని కుమార్తె)రాజా మతాంగి, రాజశ్యామల అని కూడా అంటారు.. దశమహావిద్య లో ప్రధానంగా శ్రీ విద్యను ఉపాసిస్తే తర్వాత అంత ప్రసిద్ధ గా చెప్పుకునేది మాతాంగి శ్యామలా ఉపాసన. ఈ ఉపాసన వామాచారం, దక్షణాచారం రెండు పద్ధతులలో ఆరాధిస్తారు, ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో ఈ దశమహావిద్య సాధన మహా ప్రసిద్ధి ఈ పది విద్యలో ఏది ఉపాసించిన మిగతా తొమిది విద్యలు అందులో కలిసి ఉంటాయి కనుక దశమహావిద్య లో ఒక్క విద్య సాధన చేసిన మిగిలిన అన్నిటిలో ఉపాసన విధి తెలిసిపోతుంది త్వరగా సిద్ధిస్తుంది , అయితే ఈ దశమహావిద్యాలో శ్రీవిద్య ప్రధానంగా శంకరులు వారు వ్యాప్తిలో కి తెచ్చారు దానికి కారణం శ్రీ విద్యలో బ్రహ్మజ్ఞాన తత్వం గురించి ఉంటుంది. ముఖ్యంగా తాంత్రిక ఉపాసకులు ఈ శ్యామలా నవరాత్రి ని విశేషంగా జరుపుకుంటారు..

విశుక్రుడు అనే రాక్షసుడిని సంహరించిన దేవతలలో వారాహి శ్యామల రూపాలు ప్రధానమైనవి గా లలితా నామ వివరణలో తెలుసుకున్నాము ఇంకా అనేక సందర్భాలలో శ్యామలా దేవి గురించి సహస్త్ర నామంలో ప్రస్తావించబడినది, అమ్మవారి కుడివైపు శ్యామలా దేవి, యడమవైపు వారాహి దేవి ఉంటారు..అమ్మవారు ఆమె అనామిక ఉంగరమును రాజముద్రగా శ్యామలా దేవికి అలంకరించి ఆమెను ప్రతినిధిగా రాజ్య భారమంతా అప్పగించింది.. అందుకే రాజశ్యామల అంటారు..

శ్యామలా దేవిని ఉపాసించిన వారికి విద్యలో రాణిస్తారు, కోల్పోయిన పదవులు ,కొత్త పదవులు ఉద్యోగాలు పొందుతారు..త్వరగా మంత్ర సిద్ధి పొందడానికి ఏదైనా చెడు ప్రయోగాలనుండి రక్షించడానికి, ఈ తల్లి ఉపాసన ప్రసిద్దిగా చేస్తారు.

ప్రధానంగా , ప్రసంగం మరియు “నాడా” కంపించే ప్రతిధ్వని, మాతంగి మన చెవులను మరియు వినే సామర్థ్యాన్ని కూడా నియంత్రిస్తాయి. మాతంగి రుద్రవీణ మ్రోగిస్తూ ప్రదర్శించబడుతుంది, పాటలు మరియు రాగాల యొక్క స్పష్టమైన రూపంగా ఆమెను సూచిస్తుంది. సరస్వతి యొక్క తాంత్రిక రూపం శ్యామల , అభివృద్ధికి , ఎందులోనైనా విజయప్రాప్తికి ఈమెను ఉపాసిస్తారు. సంగీతంతో ఈమెను ఆరాధిస్తే త్వరగా అనుగ్రహిస్తుంది. గురుముకంగా దీక్షను పొందితే త్వరగా సిద్ధిస్తుంది.

శ్రీ శ్యామలా దండకం, శ్రీ శ్యామలా స్తుతి చాలా ప్రసిద్ధమైనవి. వీటిలో మంత్ర యంత్ర తంత్ర సంకేతాలు, శ్యామలా విద్య రహస్యము కనిపిస్తుంది. పిల్లలకు ఖచ్చితంగా నేర్పవలసినది శ్యామల దండకం.

ఈ తొమ్మిది రోజులూ శ్యామలాదేవిని శ్రీ శ్యామలా స్తుతితో, దండకంతో ఆరాధించు కుందాం.

🌷. శ్రీ శ్యామలా స్తుతి 🌷

మాణిక్యవీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసం |

మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసాస్మరామి 1

చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగాశోణే |

పుండ్రీక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాతః 2

మాతా మరకతశ్యామ మాతంగి మధుశాలినీ

కుర్యాత్కటాక్షం కళ్యాణీ కడంబవనవాసినీ |

జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే

జయ సంగీతరసికే జయ లీలా శుక ప్రియే 3

శ్రీ స్స్వయం సర్వతీర్దాత్మికే సర్వామంత్రాత్మికే

సర్వతంత్రాత్మికే సర్వాముద్రాత్మికే |

సర్వశక్త్యాత్మికే సర్వ వర్ణాత్మికే సర్వరూపే జగన్మాతృకే

పాహిమాం పాహిమాం పాహి 4

ఇతి శ్రీ శ్యామలా స్తుతి సంపూర్ణం ||

🌹 🌹 🌹 🌹 🌹

🌹 శ్యామలా దేవి దండకం 🌹

శ్యామలా దేవి అనుగ్రహం లభిస్తే సర్వ విద్యలు భాసిస్తాయి. అధ్యయనాదులు లేనివారిని కూడా అమ్మవారు అనుగ్రహించగలదు. అలా అనుగ్రహిస్తే "అశ్రుత గ్రంధ భోధః" అనే సిద్ధిని ఇస్తుంది. అంటే ఎప్పుడు విని కూడా ఉండని గ్రంధంలోని విఙ్ఞానం బుద్ధికి స్ఫురింపజేస్తుంది. కనుక చిన్నతనం నుండి పిల్లల చేత శ్యామాలా దండకం చదివించినా, వినిపించినా చదువు, ఆరోగ్యం బాగుంటాయి. పదాలు పలుకుతున్నప్పుడు ఎక్కడ ప్రాణశక్తి స్పందిస్తుందో తెలియదు కానీ కొన్ని పదుల ప్రాణాయామములు చేసిన ఫలితం ఒక్క శ్యామలా దండకం చదివితే వస్తుంది.

🍀 శ్యామలా దండకం 🍀

ధ్యానమ్-

మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసామ్ |

మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి ౧

చతుర్భుజే చంద్రకలావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే |

పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః ౨

వినియోగః-

మాతా మరకతశ్యామా మాతంగీ మదశాలినీ |

కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ ౩

స్తుతి-

జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే |

జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే ౪

దండకమ్-

జయ జనని సుధాసముద్రాంతరుద్యన్మణీద్వీపసంరూఢ బిల్వాటవీమధ్యకల్పద్రుమాకల్పకాదంబకాంతారవాసప్రియే కృత్తివాసప్రియే సర్వలోకప్రియే,సాదరారబ్ధసంగీతసంభావనాసంభ్రమాలోలనీపస్రగాబద్ధచూలీసనాథత్రికే సానుమత్పుత్రికే, శేఖరీభూతశీతాంశురేఖామయూఖావలీబద్ధసుస్నిగ్ధనీలాలకశ్రేణిశృంగారితే లోకసంభావితే కామలీలాధనుస్సన్నిభభ్రూలతాపుష్పసందోహసందేహకృల్లోచనే వాక్సుధాసేచనే చారుగోరోచనాపంకకేళీలలామాభిరామే సురామే రమే, ప్రోల్లసద్వాలికామౌక్తికశ్రేణికాచంద్రికామండలోద్భాసి లావణ్యగండస్థలన్యస్తకస్తూరికాపత్రరేఖాసముద్భూత సౌరభ్యసంభ్రాంతభృంగాంగనాగీతసాంద్రీభవన్మంద్రతంత్రీస్వరే సుస్వరే భాస్వరే, వల్లకీవాదనప్రక్రియాలోలతాలీదలాబద్ధ-తాటంకభూషావిశేషాన్వితే సిద్ధసమ్మానితే, దివ్యహాలామదోద్వేలహేలాలసచ్చక్షురాందోలనశ్రీసమాక్షిప్తకర్ణైకనీలోత్పలే శ్యామలే పూరితాశేషలోకాభివాంఛాఫలే శ్రీఫలే, స్వేదబిందూల్లసద్ఫాలలావణ్య నిష్యందసందోహసందేహకృన్నాసికామౌక్తికే సర్వవిశ్వాత్మికే సర్వసిద్ధ్యాత్మికే కాలికే ముగ్ధమందస్మితోదారవక్త్రస్ఫురత్ పూగతాంబూలకర్పూరఖండోత్కరే జ్ఞానముద్రాకరే సర్వసంపత్కరే పద్మభాస్వత్కరే శ్రీకరే, కుందపుష్పద్యుతిస్నిగ్ధదంతావలీనిర్మలాలోలకల్లోలసమ్మేలన స్మేరశోణాధరే చారువీణాధరే పక్వబింబాధరే,

సులలిత నవయౌవనారంభచంద్రోదయోద్వేలలావణ్యదుగ్ధార్ణవావిర్భవత్కంబుబింబోకభృత్కంథరే సత్కలామందిరే మంథరే దివ్యరత్నప్రభాబంధురచ్ఛన్నహారాదిభూషాసముద్యోతమానానవద్యాంగశోభే శుభే, రత్నకేయూరరశ్మిచ్ఛటాపల్లవప్రోల్లసద్దోల్లతారాజితే యోగిభిః పూజితే విశ్వదిఙ్మండలవ్యాప్తమాణిక్యతేజస్స్ఫురత్కంకణాలంకృతే విభ్రమాలంకృతే సాధుభిః పూజితే వాసరారంభవేలాసముజ్జృంభ

మాణారవిందప్రతిద్వంద్విపాణిద్వయే సంతతోద్యద్దయే అద్వయే దివ్యరత్నోర్మికాదీధితిస్తోమ సంధ్యాయమానాంగులీపల్లవోద్యన్నఖేందుప్రభామండలే సన్నుతాఖండలే చిత్ప్రభామండలే ప్రోల్లసత్కుండలే,

తారకారాజినీకాశహారావలిస్మేర చారుస్తనాభోగభారానమన్మధ్యవల్లీవలిచ్ఛేద వీచీసముద్యత్సముల్లాససందర్శితాకారసౌందర్యరత్నాకరే వల్లకీభృత్కరే కింకరశ్రీకరే, హేమకుంభోపమోత్తుంగ వక్షోజభారావనమ్రే త్రిలోకావనమ్రే లసద్వృత్తగంభీర నాభీసరస్తీరశైవాలశంకాకరశ్యామరోమావలీభూషణే మంజుసంభాషణే, చారుశించత్కటీసూత్రనిర్భత్సితానంగలీలధనుశ్శించినీడంబరే దివ్యరత్నాంబరే,

పద్మరాగోల్లస న్మేఖలామౌక్తికశ్రోణిశోభాజితస్వర్ణభూభృత్తలే చంద్రికాశీతలే వికసితనవకింశుకాతామ్రదివ్యాంశుకచ్ఛన్న చారూరుశోభాపరాభూతసిందూరశోణాయమానేంద్రమాతంగ హస్తార్గలే వైభవానర్గలే శ్యామలే కోమలస్నిగ్ధ నీలోత్పలోత్పాదితానంగతూణీరశంకాకరోదార జంఘాలతే చారులీలాగతే నమ్రదిక్పాలసీమంతినీ కుంతలస్నిగ్ధనీలప్రభాపుంచసంజాతదుర్వాంకురాశంక సారంగసంయోగరింఖన్నఖేందూజ్జ్వలే ప్రోజ్జ్వలే నిర్మలే ప్రహ్వ దేవేశ లక్ష్మీశ భూతేశ తోయేశ వాణీశ కీనాశ దైత్యేశ యక్షేశ వాయ్వగ్నికోటీరమాణిక్య సంహృష్టబాలాతపోద్దామ లాక్షారసారుణ్యతారుణ్య లక్ష్మీగృహితాంఘ్రిపద్మే సుపద్మే ఉమే,

సురుచిరనవరత్నపీఠస్థితే సుస్థితే రత్నపద్మాసనే రత్నసింహాసనే శంఖపద్మద్వయోపాశ్రితే విశ్రుతే తత్ర విఘ్నేశదుర్గావటుక్షేత్రపాలైర్యుతే మత్తమాతంగ కన్యాసమూహాన్వితే భైరవైరష్టభిర్వేష్టితే మంచులామేనకాద్యంగనామానితే దేవి వామాదిభిః శక్తిభిస్సేవితే ధాత్రి లక్ష్మ్యాదిశక్త్యష్టకైః సంయుతే మాతృకామండలైర్మండితే యక్షగంధర్వసిద్ధాంగనా మండలైరర్చితే, భైరవీ సంవృతే పంచబాణాత్మికే పంచబాణేన రత్యా చ సంభావితే ప్రీతిభాజా వసంతేన చానందితే భక్తిభాజం పరం శ్రేయసే కల్పసే యోగినాం మానసే ద్యోతసే ఛందసామోజసా భ్రాజసే గీతవిద్యా వినోదాతి తృష్ణేన కృష్ణేన సంపూజ్యసే భక్తిమచ్చేతసా వేధసా స్తూయసే విశ్వహృద్యేన వాద్యేన విద్యాధరైర్గీయసే, శ్రవణహరదక్షిణక్వాణయా వీణయా కిన్నరైర్గీయసే యక్షగంధర్వసిద్ధాంగనా మండలైరర్చ్యసే సర్వసౌభాగ్యవాంఛావతీభిర్ వధూభిస్సురాణాం సమారాధ్యసే సర్వవిద్యావిశేషత్మకం చాటుగాథా సముచ్చారణాకంఠమూలోల్లసద్వర్ణరాజిత్రయం

కోమలశ్యామలోదారపక్షద్వయం తుండశోభాతిదూరీభవత్ కింశుకం తం శుకం లాలయంతీ పరిక్రీడసే,

పాణిపద్మద్వయేనాక్షమాలామపి స్ఫాటికీం జ్ఞానసారాత్మకం పుస్తకంచంకుశం పాశమాబిభ్రతీ తేన సంచింత్యసే తస్య వక్త్రాంతరాత్ గద్యపద్యాత్మికా భారతీ నిస్సరేత్ యేన వాధ్వంసనాదా కృతిర్భావ్యసే తస్య వశ్యా భవంతిస్తియః పూరుషాః యేన వా శాతకంబద్యుతిర్భావ్యసే సోపి లక్ష్మీసహస్రైః పరిక్రీడతే, కిన్న సిద్ధ్యేద్వపుః శ్యామలం కోమలం చంద్రచూడాన్వితం తావకం ధ్యాయతః తస్య లీలా సరోవారిధీః తస్య కేలీవనం నందనం తస్య భద్రాసనం భూతలం తస్య గీర్దేవతా కింకరి తస్య చాజ్ఞాకరీ శ్రీ స్వయం,

సర్వతీర్థాత్మికే సర్వ మంత్రాత్మికే, సర్వ యంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే, సర్వ చక్రాత్మికే సర్వ శక్త్యాత్మికే, సర్వ పీఠాత్మికే సర్వ వేదాత్మికే, సర్వ విద్యాత్మికే సర్వ యోగాత్మికే, సర్వ వర్ణాత్మికే సర్వగీతాత్మికే, సర్వ నాదాత్మికే సర్వ శబ్దాత్మికే, సర్వ విశ్వాత్మికే సర్వ వర్గాత్మికే, సర్వ సర్వాత్మికే సర్వగే సర్వ రూపే, జగన్మాతృకే పాహి మాం పాహి మాం పాహి మాం దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః ||

🌹🌹🌹🌹🌹