✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. మన దృష్టి - అంతర్యామి అనుకూలత 🌻
ఎదుటనున్న వాడు ఎట్టివాడను దృష్టి మనకక్కరలేదు. అతనిలో లోపములున్నచో అవి మనకు సంబంధించినవి కావు.
మనకన్న పెద్దవారిలో ఈ లోపములు కన్పించినచో సహించి వారిలోని సజ్జనత్వముతోనే సంబంధము పెట్టుకొనవలెను. మనతో సమానమైన వారి యెడల మిత్రభావమును పెంపొందించుకొనవలెను.
మనకన్న తక్కువవారు తప్పు చేసినచో దయచూపవలసి యుండును. మిగిలిన సమస్త జంతువుల యందును సమానమైన అంతర్యామి భావన కలిగి వర్తింపవలెను.
అట్లు వర్తించిన వానియందు అంతర్యామి అనుకూలుడగును. దానితో వ్యక్తిగత ప్రకృతి గుణములు తొలగిపోయి, లింగశరీరము భస్మమై బ్రహ్మానందమనుభవించును.
భాగవతము 4-357
వైవస్వత మనువు బోధలు
ధ్రువోపాఖ్యానము
🌹 🌹 🌹 🌹 🌹
19 May 2021
No comments:
Post a Comment