🌹. గీతోపనిషత్తు -299 🌹


*🌹. గీతోపనిషత్తు -299 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 18-5
 
*🍀 18-5. పరతత్వము - మనము నిత్యము మన యందలి ఈశ్వరునుండే మేల్కాంచి కార్యక్రమములొనర్చి, మరల నిద్ర ద్వారా చేరు స్థానము గుర్తించినచో, స్థానము నిధానము అయిన పరమాత్మను తెలియవచ్చును. ఈశ్వరుడు మూలముగనే అంతయు ప్రభవించు చున్నది, లయము చెందుచున్నది. అది మూల స్థానము, నిధానము. ఈ పరతత్త్వము నాశరహితమైన బీజము. అనగ అందుండి అనంతముగ సృష్టి స్థితి లయములు జరుగుచునే యుండును. సృష్టి వ్యక్తమగుచు, వృద్ధి చెందుచు, లయమగుచు సాగుచునే యుండును. 🍀*

*గతి ర్బరా ప్రభు స్పాక్షీ నివాస శ్శరణం సుహృత్ |*
*ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజ మవ్యయమ్ II 18*

*తాత్పర్యము : నేనే సమస్త జీవులకు గతి (లక్ష్యము). సమస్తమును భరించువాడను నేనే. సమస్తమునకు ప్రభువును నేనే. సాక్షియు నేనే. అందరికి నివాస స్థానము నేనే. నీకు హితమొనర్చు వాడను నేనే. నేనే సృష్టి స్థితి లయములకు మూలము. శాశ్వతమగు బీజమును కూడ నేనే.*

*వివరణము : స్థానం, నిధానం : మనము నిత్యము మన యందలి ఈశ్వరునుండే మేల్కాంచి కార్యక్రమములొనర్చి, మరల నిద్ర ద్వారా చేరు స్థానము గుర్తించినచో, స్థానము నిధానము అయిన పరమాత్మను తెలియవచ్చును. నిద్ర యందు మనమున్నది ఈశ్వరుని యందే. మనలను మేల్కొల్పునది ఈశ్వరుడే. మనము కార్యము లొనర్చు చుండగ ప్రజా ప్రాణములను నిరంతరము అందించు చున్నది ఈశ్వరుడే. మరల మనలను నిద్రలోనికి గొనిపోవునది ఈశ్వరుడే. ఈశ్వరుడు మూలముగనే అంతయు ప్రభవించు చున్నది, లయము చెందుచున్నది. అది మూల స్థానము, నిధానము.*

*బీజమవ్యయమ్ : ఈ పరతత్త్వము నాశరహితమైన బీజము. అనగ అందుండి అనంతముగ సృష్టి స్థితి లయములు జరుగుచునే యుండును. సృష్టి వ్యక్తమగుచు, వృద్ధి చెందుచు, లయమగుచు సాగుచునే యుండును. ఇట్లెన్నిమార్లు సృష్టి జరిగినదో ఎవ్వరును చెప్పలేరు. ఎంతమంది సృష్టి కర్తలు వచ్చిపోయి, వారి నామము లేమియో ఎవ్వరును చెప్పలేరు. ఇట్లవ్యయముగ, అనంతముగ సృష్టులు వచ్చిపోవుటకు ఆధారమైయున్న పరతత్త్వముగ నన్నెరుగు మని భగవానుడు అర్జునునకు బోధించినాడు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

No comments:

Post a Comment