31-DECEMBER-2021 శుక్రవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 31, శుక్రవారం, డిసెంబర్ 2021 బృగు వాసరే 
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 299 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 498🌹 
4) 🌹 వివేక చూడామణి - 175 / Viveka Chudamani - 175🌹
🌹 Viveka Chudamani - 175🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -127🌹  
6) 🌹 Osho Daily Meditations - 116 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 175 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 175 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శుక్రవారం మిత్రులందరికీ 🌹*
*బృగు వాసరే, 31, డిసెంబర్‌ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ మహాలక్ష్మి స్తోత్రం-3 🍀*

*నమః క్షీరార్ణవసుతే నమస్త్రైలోక్యధారిణి |*
*వసువృష్టే నమస్తుభ్యం రక్ష మాం శరణాగతమ్ || 5*
*రక్ష త్వం దేవదేవేశి దేవదేవస్య వల్లభే |*
*దరిద్రాత్త్రాహి మాం లక్ష్మి కృపాం కురు మమోపరి || 6*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, హేమంత ఋతువు,
మృగశిర మాసం
తిథి: కృష్ణ ద్వాదశి 10:41:15 వరకు 
తదుపరి కృష్ణ త్రయోదశి
నక్షత్రం: అనూరాధ 22:05:36 వరకు
తదుపరి జ్యేష్ఠ
యోగం: శూల 18:00:40 వరకు 
తదుపరి దండ
కరణం: తైతిల 10:38:14 వరకు
వర్జ్యం: 04:10:00 - 05:36:00
సూర్యోదయం: 06:45:42
సూర్యాస్తమయం: 17:52:21
వైదిక సూర్యోదయం: 06:49:35
వైదిక సూర్యాస్తమయం: 17:48:28
చంద్రోదయం: 03:54:00
చంద్రాస్తమయం: 15:25:08
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: వృశ్చికం
దుర్ముహూర్తం: 08:59:01 - 09:43:28
మరియు 12:41:15 - 13:25:41
రాహు కాలం: 10:55:41 - 12:19:01
గుళిక కాలం: 08:09:02 - 09:32:22
యమ గండం: 15:05:41 - 16:29:01
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:41
అమృత కాలం: 12:46:00 - 14:12:00
రాక్షస యోగం - మిత్ర కలహం 22:05:36 
వరకు తదుపరి చర యోగం - దుర్వార్త శ్రవణం 
పండుగలు : ప్రదోష వ్రతం, Pradosh Vrat
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -299 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 18-5
 
*🍀 18-5. పరతత్వము - మనము నిత్యము మన యందలి ఈశ్వరునుండే మేల్కాంచి కార్యక్రమములొనర్చి, మరల నిద్ర ద్వారా చేరు స్థానము గుర్తించినచో, స్థానము నిధానము అయిన పరమాత్మను తెలియవచ్చును. ఈశ్వరుడు మూలముగనే అంతయు ప్రభవించు చున్నది, లయము చెందుచున్నది. అది మూల స్థానము, నిధానము. ఈ పరతత్త్వము నాశరహితమైన బీజము. అనగ అందుండి అనంతముగ సృష్టి స్థితి లయములు జరుగుచునే యుండును. సృష్టి వ్యక్తమగుచు, వృద్ధి చెందుచు, లయమగుచు సాగుచునే యుండును. 🍀*

*గతి ర్బరా ప్రభు స్పాక్షీ నివాస శ్శరణం సుహృత్ |*
*ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజ మవ్యయమ్ II 18*

*తాత్పర్యము : నేనే సమస్త జీవులకు గతి (లక్ష్యము). సమస్తమును భరించువాడను నేనే. సమస్తమునకు ప్రభువును నేనే. సాక్షియు నేనే. అందరికి నివాస స్థానము నేనే. నీకు హితమొనర్చు వాడను నేనే. నేనే సృష్టి స్థితి లయములకు మూలము. శాశ్వతమగు బీజమును కూడ నేనే.*

*వివరణము : స్థానం, నిధానం : మనము నిత్యము మన యందలి ఈశ్వరునుండే మేల్కాంచి కార్యక్రమములొనర్చి, మరల నిద్ర ద్వారా చేరు స్థానము గుర్తించినచో, స్థానము నిధానము అయిన పరమాత్మను తెలియవచ్చును. నిద్ర యందు మనమున్నది ఈశ్వరుని యందే. మనలను మేల్కొల్పునది ఈశ్వరుడే. మనము కార్యము లొనర్చు చుండగ ప్రజా ప్రాణములను నిరంతరము అందించు చున్నది ఈశ్వరుడే. మరల మనలను నిద్రలోనికి గొనిపోవునది ఈశ్వరుడే. ఈశ్వరుడు మూలముగనే అంతయు ప్రభవించు చున్నది, లయము చెందుచున్నది. అది మూల స్థానము, నిధానము.*

*బీజమవ్యయమ్ : ఈ పరతత్త్వము నాశరహితమైన బీజము. అనగ అందుండి అనంతముగ సృష్టి స్థితి లయములు జరుగుచునే యుండును. సృష్టి వ్యక్తమగుచు, వృద్ధి చెందుచు, లయమగుచు సాగుచునే యుండును. ఇట్లెన్నిమార్లు సృష్టి జరిగినదో ఎవ్వరును చెప్పలేరు. ఎంతమంది సృష్టి కర్తలు వచ్చిపోయి, వారి నామము లేమియో ఎవ్వరును చెప్పలేరు. ఇట్లవ్యయముగ, అనంతముగ సృష్టులు వచ్చిపోవుటకు ఆధారమైయున్న పరతత్త్వముగ నన్నెరుగు మని భగవానుడు అర్జునునకు బోధించినాడు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 497 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 40

*🌻. శివుని యాత్ర - 2 🌻*

సన్నాహుడు, కుముదుడు, అమోఘుడు, మరియు కోకిలుడను గణనాయకులు వందకోట్ల చొప్పున గణములతో బయలు దేరిరి (15). సుమంత్రుడను గణనాయకుడు ఒక కోటి, కాకపాదోదరుడు, సంతానకుడు అరైవ కోట్ల చొప్పున (16), మహాబలుడు తొమ్మిది, మధుపింగుడు తొమ్మిది, నీలుడు తొంభై, పూర్ణ భద్రుడు తొంభై (17), చతుర్వక్త్రుడు ఏడు, కరణుడు ఇరవై, అహిరోమకుడు తొంభై కోట్ల గణములతో బయలు దేరిరి (18). 

ఓ నారదా! యజ్వాశుడు, శతమన్యుడు, మేఘమన్యుడు అను గణనాయకులు కోటి చొప్పున (19), కాష్ఠాంగుష్ఠుడనే గణనాయకుడు అరవై నాలుగు కోట్లు గణములతో బయలు దేరిరి. విరూపాక్షుడు, సుకేశుడు, వృషాభుడు, సనాతనుడు (20), తాలకేతుడు, షడాస్యుడు, చంచ్వాస్యుడు సంవర్తకుడు, చైత్రుడు, లకులీశుడను గణపతి (21), ప్రకాశించే దేహము గల లోకాంతకుడు, దైత్యాంతకుడు, శోభాసంపన్నుడు దేవ దేవునకు ప్రియుడు అగు భృంగిరిటి దేవుడు బయలు దేరిరి (22).

అశని, భానుకుడు అరవై నాల్గువేల గణములతో గూడి శివుని వివాహము కొరకై ఉత్సాహముతో శివుని వెంట నడిచిరి (23). వీర భద్రుడు వేయు కోట్ల ప్రమథ గణములతో, మరియు రోమముల నుండి జన్మించిన అరవై ఏడు కోట్ల గణములతో నడచెను (24). నంది మొదలగు గణాధ్యక్షులు శంకరుని వివాహమహోత్సవము నందు పదకొండు వందల ఇరవై కోట్ల గణములతో విచ్చేసిరి (25). క్షేత్రపాలుడగు భైరవుడు శంకరుని వివాహమహోత్సవమునకు కోటి గణములతో గూడి ఆనందముతో విచ్చేసెను (26). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 175 / Viveka Chudamani - 175 🌹*
*✍️ రచన : పేర్నేటి గంగాధర రావు*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍀 33. బంధనాలు -1 🍀*

*568. తమ యొక్క శరీర భాగాలు మాయతో కూడి ఉండి, అది బ్రహ్మమును పొందిన తరువాత బ్రహ్మముగా ఎలా మారతాయో, అలానే జీవుడు బ్రహ్మమును తెలుసుకొని బ్రహ్మముగా మారి తిరిగి ఎలా జన్మించగలడు?*

*569. బంధనాలు మరియు విముక్తి అనునవి తొలగి పోయినపుడు అవి ఆత్మలో లేనివే అవుతాయి. ఎపుడైతే తన సత్య జ్ఞానమును తెలుసు కుంటాడో అపుడు పాము మాయమై, తాడు వ్యక్తమవుతుంది. అపుడు మార్పుకు అవకాశ ముండదు.*

*570. బంధనాలు, విముక్తి అనేవి ఎపుడైతే వాటి పై ఉన్న మాయ అనే తెర తొలగి పోతుందో. అంతకాలముంటాయి. ఎపుడైతే మాయ తొలగిపోతుందో, బ్రహ్మము వ్యక్తమై అవన్ని తొలగిపోతాయి. అపుడు రెండవది ఏదీలేని మిగిలినది బ్రహ్మము మాత్రమే. సృతులు కూడా బ్రహ్మము రెండవది ఏదీ లేనిదని చెప్పి యున్నాయి.*

*సశేషం....*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 175 🌹*
*✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*

*🌻 33. Attachments -1 🌻*

*568. For his bodies, consisting of Nescience etc., having been burnt by the realisation of the identity of the Jiva and Brahman, he becomes Brahman Itself; and how can Brahman ever have rebirth ?*

*569. Bondage and Liberation, which are conjured up by Maya, do not really exist in the Atman, one’s Reality, as the appearance and exit of the snake do not abide in the rope, which suffers no change.*

*570. Bondage and Liberation may be talked of when there is the presence or absence of a covering veil. But there can be no covering veil for Brahman, which is always uncovered for want of a second thing besides Itself. If there be, the non-duality of Brahman will be contradicted, and the Shrutis can never brook duality.*

*Continues....*
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 VIVEKA CHUDAMANI - 175 🌹*
*✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*

*🌻 33. Attachments -1 🌻*

*568. For his bodies, consisting of Nescience etc., having been burnt by the realisation of the identity of the Jiva and Brahman, he becomes Brahman Itself; and how can Brahman ever have rebirth ?*

*569. Bondage and Liberation, which are conjured up by Maya, do not really exist in the Atman, one’s Reality, as the appearance and exit of the snake do not abide in the rope, which suffers no change.*

*570. Bondage and Liberation may be talked of when there is the presence or absence of a covering veil. But there can be no covering veil for Brahman, which is always uncovered for want of a second thing besides Itself. If there be, the non-duality of Brahman will be contradicted, and the Shrutis can never brook duality.*

*Continues....*
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 127 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*సంకలనము : వేణుమాధవ్*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. శ్రీ కృష్ణుని లీలలు మనకు పాఠాలు -1 🌻*

*సాందీపని మహర్షి యొక్క శిష్యునిగా చేరి శ్రీకృష్ణుడు నాలుగు వేదములను , ఆరు వేదాంగములతో అభ్యసించెను. మరియు అరువది నాలుగు విద్యలను గురువు వలన వినినంతనే పూర్తిగా గ్రహించెను.*

*లోకమునకే గురువైన తాను మరియొక గురుని దగ్గర నేర్చుట మిగిలిన వారనుకరించి నేర్చుకొనుటకు మాత్రమే. కానిచో జగద్గురువగు తనకు ఇతరులు గురువులు కాగలరా !*

*ఇవి యన్నియు అతని లీలలు.*

*దేహములు త్రిగుణముల వెలుగులని మరువని వారికి దేహసౌఖ్యము అప్రయత్నముగా సిద్ధించినను దాని బంధములు, దుఃఖములు కలుగవు.*

.... ✍🏼. *మాస్టర్ ఇ.కె.* 🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 117 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 117. A REAL MARRIAGE 🍀*

*🕉 The whole process of tantra is joining opposites together, helping polarities dissolve into one being. And when one is whole, one is holy. 🕉*
 
*The man and the woman cannot meet eternally; their meeting can only be momentary. That is the misery of love, and the joy too. The joy, the ecstasy, is because of the momentary meeting. At least for a moment one feels whole; nothing is missing; everything falls into one harmony. There is great joy, but soon it is lost. Tantra says, use this as a key-that the meeting with the outer can only be momentary. But there is an inner woman, an inner man; the meeting with the inner can be permanent, eternal. So learn the secret from the outside and apply it inside. No man is just man and no woman is just woman. This is one of the greatest insights of tantra ... because a man is born out of man and woman, out of the meeting of these two polarities. *

*He carries something from the father and something from the mother. It is also the case with the woman. So deep down each of us is the opposite, too; if the conscious mind is man, then the unconscious is woman, and vice versa. Unless you learn the art of meeting with the other inside, love will remain a misery, and joy a vicious circle, and you will be torn apart. That inner meeting is possible just as the outer meeting is possible. But the inner meeting has one thing special about it: It need not end; it can be a real marriage.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 175 / Sri Lalita Sahasranamavali - Meaning - 175 🌹*
*🌻. మంత్రము - అర్ధం 🌻*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 175. పంచమీ, పంచభూతేశీ, పంచ సంఖ్యోపచారిణీ ।*
*శాశ్వతీ, శాశ్వతైశ్వర్యా, శర్మదా, శంభుమోహినీ ॥ 175 ॥ 🍀*

🍀 947. పంచమే : 
పంచకృత్యపరాయణి

🍀 948. పంచభూతేశే : 
పంచభూతములను ఆఙ్ఞాపించునది

🍀 949. పంచసంఖ్యోపచారిణి :
 శ్రీవిద్యోపాసకులచే 5 విధములుగా ఆరాధింప బడునది

🍀 950. శాశ్వతీ : 
శాశ్వతముగా ఉండునది

🍀 951. శాశ్వతైశ్వర్యా : 
శాశ్వతమైన ఐశ్వర్యము కలది

🍀 952. శర్మదా : 
ఓర్పు ను ఇచ్చునది

🍀 953. శంభుమోహినీ : 
ఈశ్వరుని మోహింప జేయునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 175 🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻 175. Panchami panchabhuteshi pancha sankhyopacharini*
*Shashvati shashvataishvarya sarmada shanbhumohini ॥ 175 ॥ 🌻*

🌻 947 ) Panchami -   
She who is the consort of Sadshiva - the fifth of the pancha brahmas

🌻 948 ) Pancha bhoothesi -   
She who is the chief of Pancha bhoothas viz earth, sky, fire, air. And water

🌻 949 ) Pancha sankhyopacharini -   
She who is to be worshipped by five methods of Gandha(sandal wood), Pushpa(flower), Dhoopa(incense), dheepa(light), Naivedya(offering)

🌻 950 ) Saswathi -   
She who is permanent

🌻 951 ) Saswathaiswarya -  
 She who gives perennial wealth

🌻 952 ) Sarmadha -   
She who gives pleasure

🌻 953 ) Sambhu mohini -  
 She who bewitches Lord Shiva

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామములు #LalithaSahasranamam
 #PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/  
https://t.me/ChaitanyaVijnanam 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment