13-DECEMBER-2021 సోమవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 13, సోమవారం, డిసెంబర్ 2021 ఇందు వాసరే 🌹
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 290 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 489🌹 
4) 🌹 వివేక చూడామణి - 166 / Viveka Chudamani - 166🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -118🌹  
6) 🌹 Osho Daily Meditations - 107 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 166 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 166🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శుభ సోమవారం మిత్రులందరికీ 🌹*
*ఇందు వాసరే, 13, డిసెంబర్‌ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. రుద్ర నమక స్తోత్రం -2 🍀*

*ఇషుః శివతమా యా తే తయా మృడయ రుద్రమామ్!*
*శివం ధనుర్యద్బభూవ తేనాపి మృడయాధునా!!3!!*

*శరవ్యా యా శివతమా తయాపి మృడయ ప్రభో!*
*యా తే రుద్రశివా నిత్యం సర్వంగల సాధనమ్!!4!!*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, హేమంత ఋతువు,
మృగశిర మాసం
తిథి: శుక్ల-దశమి 21:34:39 
వరకు తదుపరి శుక్ల-ఏకాదశి
నక్షత్రం: రేవతి 26:07:08
వరకు తదుపరి అశ్విని
యోగం: వరియాన 29:55:01 
వరకు తదుపరి పరిఘ
కరణం: తైతిల 08:44:42 వరకు
వర్జ్యం: -
దుర్ముహూర్తం: 12:32:23 - 13:16:49 
మరియు 14:45:40 - 15:30:06
రాహు కాలం: 08:00:16 - 09:23:35
గుళిక కాలం: 13:33:28 - 14:56:46
యమ గండం: 10:46:52 - 12:10:10
అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:32
అమృత కాలం: -
సూర్యోదయం: 06:36:58
సూర్యాస్తమయం: 17:43:22
వైదిక సూర్యోదయం: 06:40:51
వైదిక సూర్యాస్తమయం: 17:39:28
చంద్రోదయం: 13:54:42
చంద్రాస్తమయం: 01:39:04
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: మీనం
మతంగ యోగం - అశ్వ లాభం 
26:07:08 వరకు తదుపరి 
రాక్షస యోగం - మిత్ర కలహం
పండుగలు : లేవు
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -290 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 17-1
 
*🍀 17-1. ప్రణవ స్వరూపుడు - ఈ జగత్తు పుట్టించిన సృష్టికర్త యందు నేనే యున్నాను. అట్లే నిన్ను పుట్టించిన నీ తండ్రి యందు నీ నేనే యున్నాను. నిన్ను ధరించి, భరించిన తల్లి యందు కూడ నేనే యున్నాను. సాధకుని యందు ఇది స్థిరపడవలెను. ఇట్లు స్థిరపడక ఎన్ని తెలిసినను ఒకటే. అజ్ఞానము మిగులును. ఏమి చూచినను, ఏమి విన్నను, ఏమి స్పృశించినను, ఏమి రుచి చూచినను, ఏమి వాసన చూచినను, ఏమి భావించినను, ఏ గ్రంథమందలి విజ్ఞానమైనను, ఏ శాస్త్రమైనను, అన్నిటి యందు తెలియవలసినది ఈశ్వరుడే. ఇంతకన్న ఏమి చెప్పవలెను. 🍀*

పితా హమస్య జగతో మాతా ధాతా పితామహః |
వేద్యం పవిత్ర మోంకార ఋక్సామ యజురేవ చ || 17

*తాత్పర్యము : ఈ జగత్తునకు తండ్రిని నేనే. తల్లి, తండ్రి, తాత కూడ నేనే. ఓంకారము నేనే. అన్నిటి యందు తెలిసికొనదగినది నేనే. పవిత్ర పదార్థముగ నున్నది నేనే. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము నేనే.*

*వివరణము : అన్నియు నేనే. అంతయు నేనే అని తెలిపిన దైవము ముందు తెలిపిన ఉదాహరణలకు తోడుగ మరికొన్ని ఉదాహరణలు తెలుపుచున్నాడు. ఈ జగత్తు పుట్టించిన సృష్టికర్త యందు నేనే యున్నాను. అట్లే నిన్ను పుట్టించిన నీ తండ్రి యందు నీ నేనే యున్నాను. నిన్ను ధరించి, భరించిన తల్లి యందు కూడ నేనే యున్నాను. నీ తల్లిని తండ్రిని పుట్టించిన పితామహుడు, నీ మాతామహుల యందు కూడ నేనే యున్నాను. అందు బంధుత్వమున వీరు ముఖ్యులు కనుక వీరిని ఉదాహరణముగ తెలిపినాడు.*

*అట్లే ఇతర బంధువులు, మిత్రులు, జనులు, జంతువులు అన్నిటియందు తానే యున్నాడని తెలియవలెను. శత్రువు రూపమున కూడ మూలమున తానే యున్నాడు. భార్య, సంతతి ఎన్ని సంబంధము లున్నవో అన్నియు తానే. సాధకుని యందు ఇది స్థిరపడవలెను. ఇట్లు స్థిరపడక ఎన్ని తెలిసినను ఒకటే. అజ్ఞానము మిగులును.*

*ఏమి చూచినను, ఏమి విన్నను, ఏమి స్పృశించినను, ఏమి రుచి చూచినను, ఏమి వాసన చూచినను, ఏమి భావించినను, ఏ గ్రంథమందలి విజ్ఞానమైనను, ఏ శాస్త్రమైనను, అన్నిటి యందు తెలియవలసినది ఈశ్వరుడే. ఇంతకన్న ఏమి చెప్పవలెను. అయినను తెలియజెప్పు చున్నాడు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 488 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 38

*🌻. వివాహ మండపము - 2 🌻*

కొన్నిచోట్ల కృత్రిమ స్త్రీలు కృత్రిమ పురుషులతో కలిసి నృత్యము చేయుచుండగా ఎందరో కృత్రిమ ప్రేక్షకులు పరవశులై తిలకించుచుండిరి (12).మరియు సుందరాకారులగు ద్వారపాలకులు చేతులతో ధనస్సులను ఎక్కుపెట్టి యుండిరి. అవి బొమ్మలే యైననూ ప్రాణము గలవి యన్నట్లుండెను (13). అద్భుతమగు మహాలక్ష్మీ విగ్రహము ద్వారమునందు నిర్మింపబడెను. సర్వలక్షణములతో విలసిల్లు ఆ విగ్రహము క్షీరసముద్రము నుండి ఆవిర్భవించిన లక్ష్మీదేవియా అన్నట్లుండెను (14). అలంకరింపబడిన కృత్రిమ గజములు యధార్థమగు ఏనుగులను పోలియుండెను. గుర్రములు రౌతులతో, గజములు మావటీండ్రతో కూడి యుండెను (15).

కృత్రిమమగు రథములను కృత్రిమసారథులు తోలుచుండిరి. ఇతర వాహనములు కూడ అటులనే అమర్చబడినవి. మరియు కృత్రిమమగు సైనిక దళములు కూడ ఉండెను. ఈ దృశ్యములన్నియూ మహాశ్చర్యమును కలిగించుచుండెను (16). ఓ మునీ! దేవతలను, మునులను మోహింపజేయుటకై విశ్వకర్మ ఉత్సాహముతో ఇట్టి దృశ్యములను నిర్మించెను (17). 

ఓ మహర్షీ! మహాద్వారమునందు ఒక కృత్రిమ నంది నిలబడియుండెను. స్వచ్ఛమగు స్ఫటికము వలె వెలుగొందు ఆ బొమ్మ యథార్థమగు నందివలెనే యుండెను (18). ఆ ద్వారమునకు పైన రత్నములతో, స్వచ్ఛమగు చిగుళ్లతో, మరియు పుష్పములతో అలంకరింపబడిన గొప్ప దివ్యమైన రత్నములతో ప్రకాశించే కృత్రిమ పుష్పక విమానము దేవతలతో గూడి మిక్కిలి శోభిల్లెను (19).

ఎడమవైపు శుద్ధ కాషాయ వర్ణము గల రెండు ఏనుగులు నిర్మింపబడెను. నాల్గు దంతములతో గొప్పగా ప్రకాశించు ఆ ఏనుగులు అరువది సంవత్సరములు వయసు గలవా యున్నట్లు భాసించెను. అవి పరస్పరము స్పృశించుచున్నట్లు భాసించెను (20). మరియు విశ్వకర్మ సూర్యుని వలె ప్రకాశించు రెండు గుర్రములను నిర్మించెను. చామరములచే, మరియు దివ్యాభరణములచే అలంకరింపబడిన ఆ దివ్యాశ్వములు గొప్పగా ప్రకాశించెను (21). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 166 / Viveka Chudamani - 166 🌹*
*✍️ రచన : పేర్నేటి గంగాధర రావు*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ* 

*🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -13 🍀*

*542. ఒక పర్యాయము తెలివి తక్కువ వానిగా, ఇంకొక పర్యాయము యోగి వలె, కొన్ని సార్లు రాజువలె ఉజ్వలముగా, కొన్ని సార్లు సంచారము చేయుచు, కొన్ని సార్లు కొండ శిలువవలె కదలక పడివుండి ఆహారము లభించినపుడే తింటూ స్థబ్దముగా పడివుండుట, కొన్ని సార్లు దయా సాగరునిగా కనిపిస్తూ, కొన్ని సార్లు గౌరవించబడుతూ, మరికొన్ని సార్లు అవమానించబడుతూ, ఇంకొన్ని సార్లు ఎవరికి తెలియనివాడిగా ఇలా ఆత్మ జ్ఞాని అయిన వ్యక్తి జీవిస్తూ ఎల్లపుడు బ్రహ్మానంద స్థితిలో స్థితుడై ఉంటాడు.*

*543. బ్రహ్మజ్ఞాని తనకు సంపదలు లేనప్పటికి ఎపుడూ తృప్తితో జీవిస్తుంటాడు. నిస్సహాయుడైనప్పటికి శక్తి వంతునిగా బాహ్య వస్తు సముదాయమును అనుభవించుచూ, శాశ్వతముగా తృప్తితో అతడు ఇతరులకు ఆదర్శ ప్రాయుడు కాకపోయినను అందరిని సమానముగా సమ దృష్టితో చూస్తుంటాడు.*

*544. అతడు ఎపుడూ ఏదో ఒకటి చేస్తుంటాడు. అయినా ఏమి చేయని వాడిలా ఉంటాడు. గత జన్మల ఫలితాలు అనుభవిస్తున్నప్పటికి, వాటికి అతీతముగా, తనకు శరీరము ఉన్నప్పటికి దానికి ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వకుండా; తాను పరిమితుడైనప్పటికి అన్నింటిలో తానే అయి ఉంటాడు. ఆత్మ దర్శకుని వలె జీవిస్తుంటాడు.*

*సశేషం....*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 166 🌹*
*✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*

*🌻 32. I am the one who knows Brahman -13🌻*

*542. Sometimes a fool, sometimes a sage, sometimes possessed of regal splendour; sometimes wandering, sometimes behaving like a motionless python, sometimes wearing a benignant expression; sometimes honoured, sometimes insulted, sometimes unknown – thus lives the man of realisation, ever happy with Supreme Bliss.*

*543. Though without riches, yet ever content; though helpless, yet very powerful, though not enjoying the sense-objects, yet eternally satisfied; though without an exemplar, yet looking upon all with an eye of equality.*

*544. Though doing, yet inactive; though experiencing fruits of past actions, yet untouched by them; though possessed of a body, yet without identification with it; though limited, yet omnipresent is he.*

*Continues....* 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 VIVEKA CHUDAMANI - 166 🌹*
*✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*

*🌻 32. I am the one who knows Brahman -13🌻*

*542. Sometimes a fool, sometimes a sage, sometimes possessed of regal splendour; sometimes wandering, sometimes behaving like a motionless python, sometimes wearing a benignant expression; sometimes honoured, sometimes insulted, sometimes unknown – thus lives the man of realisation, ever happy with Supreme Bliss.*

*543. Though without riches, yet ever content; though helpless, yet very powerful, though not enjoying the sense-objects, yet eternally satisfied; though without an exemplar, yet looking upon all with an eye of equality.*

*544. Though doing, yet inactive; though experiencing fruits of past actions, yet untouched by them; though possessed of a body, yet without identification with it; though limited, yet omnipresent is he.*

*Continues....* 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 118 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*సంకలనము : వేణుమాధవ్*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. లోకోద్ధరణము- లోక కల్యాణము - 3 🌻*

*లోకంలో కాలధర్మం రాజ్యమేలుతుంటుంది. భూమిపై జీవుల ప్రజ్ఞలను అధిష్ఠించే భూమికి కూడ ప్రజ్ఞ ఉంటుంది. ఆ ప్రజ్ఞా పరిణామంలో భాగంగానే, ఆయాకాలాల్లో జీవుల ప్రవర్తనల్లోని కొన్ని సాధారణ సన్నివేశాలు జరుగుతాయి. కృతయుగంలోను అసుర ధర్మావలంబులున్నారు. కలియుగంలోను దైవధర్మావలంబులున్నారు.*

*కలి అనేది పరస్పరాభిప్రాయ ముద్రలతో ఘర్షణను పుట్టించే ప్రభావం కల ఒక ఇంద్రజాలం. అంతేకాని ఒక యుగం మాత్రమే కాదు. కలి జీవుల ఉద్ధరణకై ప్రయత్నం సాగించేవారు ఈ ఇంద్రజాలానికి వశులై, కలిధర్మ ప్రభావాన్నే పెంచుకుంటూ పోతూ కలికి ఉపకరణాలవుతారు. అలా కాక, జీవుల ప్రవర్తనలు, సమాజగతిలో సన్నివేశాలు మున్నగు అలల వెనుక అనంత కాలమనే సాగరాన్ని దర్శించి, లోక కల్యాణమునకై దీక్ష వహించే వారు విష్ణు ధర్మాన్ని అవలంబించి, ధన్యులవుతారు.*

....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 107 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 107. OUTLANDISH LOVE 🍀*

*🕉 Only fools know what love is, because love is a kind if madness 🕉*
 
*Perhaps you have never reached the peaks of love, and you have a great longing for it. You have been in love, but it has never been outlandish, it has never been fantastic, it has never been far out. It has been Iukewarm. It was not like a fire that consumes. You were in it, but you were not destroyed by it; you managed yourself. You have been clever in it, you have not been a fool. And only fools know what love is, because love is a kind of madness.* 

*If you are too clever, you can allow only so far and then you stop. Your whole mind says, "Now this is too much. Going beyond this point is dangerous." Love knows only one experience that is satisfying, and that is to go to the very peak, to the ultimate peak, even once. Then there is a great change in energy. To know love once at the climax is enough; then there is no need to go into it again and again. The experience simply changes your whole being. So be less clever. Forget about cleverness; be more muddle-headed!* 

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 166 / Sri Lalita Sahasranamavali - Meaning - 166 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 166. విశ్వగ్రాసా విద్రుమాభా వైష్ణవీ విష్ణురూపిణీ ।*
*అయోని ర్యోనినిలయా కూటస్థా కులరూపిణీ ॥ 166 ॥ 🍀*

🍀 887. విశ్వగ్రాసా : 
విశ్వమే ఆహారముగా కలిగినది

🍀 888. విద్రుమాభా : 
పగడము వలె ఎర్రనైన కంతి కలిగినది

🍀 889. వైష్ణవీ : 
వైష్ణవీ దేవి రూపమున అవతరించినది

🍀 890. విష్ణురూపిణీ : 
విష్ణురూపమున జగత్తును రక్షించునది

🍀 891. అయోని: : 
పుట్టుక లేనిది

🍀 892. యోనినిలయా : 
సమస్త సృష్టి కి జన్మస్థానము

🍀 893. కూటస్థా : 
మూలకారణ శక్తి

🍀 894. కులరూపిణీ : 
కుండలినీ రూపిణి

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 166 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 166. Vishvagrasa vidrumabha vaishnavi vishnuruini*
*Ayoniryoninilaya kulasdha kularupini ॥ 166 ॥ 🌻*

🌻 887 ) Viswa grasa -   
She who eats the universe in one handful

🌻 888 ) Vidhrumabha -   
She who has the luster of coral

🌻 889 ) Vaishnavi -   
She who is the power of Vishnu

🌻 890 ) Vishnu roopini -   
She who is Vishnu

🌻 891 ) Ayoni -   
She who does not have a cause or She who is not born

🌻 892 ) Yoni nilaya -   
She who is the cause and source of everything

🌻 893 ) Kootastha -   
She who is stable

🌻 894 ) Kula roopini -   
She who is personification of culture

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామములు #LalithaSahasranam
 #PrasadBhardwaj 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ https://mymandir.page.link/wdh7G
https://t.me/ChaitanyaVijnanam 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. మనలో ఒక వైపు లౌకిక భావాలు, మరో వైపు పరిశుద్ధమైన ఆత్మస్థితి ఒకే నాణానికి రెండు ముఖాల్లా ఉన్నాయి. ఈ రెండింటికి దూరమే లేదు. అలాగే ఇప్పుడు లౌకిక భావాలతో ఉన్న మనకు ఆత్మస్థితి ఎంతో దూరంలో లేదు. మనం దైవానికి భావదూరంలోనే ఉన్నాం. అనుభవ సమయంలో ఎవరికైనా నేను అన్న భావమే ఉండటంలేదు. ఆలోచనలోనే అది వస్తుంది ! 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 328-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 328-1







🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 328-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 328-1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 74. కళావతీ, కళాలాపా, కాంతా, కాదంబరీప్రియా ।
వరదా, వామనయనా, వారుణీమదవిహ్వలా ॥ 74 ॥ 🍀

🌻 328-1. 'కళాలాపా'🌻

కళల రూపమున ప్రకటింపబడునది శ్రీదేవి అని అర్థము. 'ఆలాప' మనగా మధుర ధ్వని. 'కళ' లనగా విద్యలని కూడ భావము. మధురముగా విద్యలను ప్రకటించునది శ్రీమాత అని తెలియ

వలెను. విద్యలన్నియూ వికాసము కొరకే. అట్టి వికాసము మధురముగ సాగినచో తదనుగుణమైన ఆనందముకూడ ప్రకటింపబడును. విద్యా లేక కళ ప్రకటింపబడుచున్నప్పుడు, ప్రకటించువానికి దర్శించువానికి కూడ ఆనందము కలుగవలెను. వికాసము కలుగవలెను. ఇట్లు ఆనంద వికాసములు కలాపములుగ విద్యలు సాగవలెను. తన్మూలమున జీవులు చైతన్య స్వరూపులై ఆనందించుచు నుండవలెను. ఇది అంతయూ శ్రీమాత ప్రణాళిక.

జీవుల నుద్ధరించు ప్రణాళిక యందు కళాలాపము ప్రధానకార్యమై యుండును. ఏ విద్యయూ లేని మానవుడు పశువు గాని పశువు. అట్టి వానిని వింత పశువు అని పెద్దలు నిర్వచించిరి. శ్రీమాత అనుగ్రహము వలన నోటియందు లాలాజలము మారినట్లు విద్యలన్నియూ ఊరగలవు. కళాలాప అను పదమును కళ ఆలాప అని ముందు వివరించ బడినది. ఆ పదమును కం, లాలాప అని కూడ వివరించవచ్చును. 'కం' అనగా సృష్టికర్త లేక చతుర్ముఖ బ్రహ్మ.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 328-1🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 74. Kalavati kalalapa kanta kadanbari priya
Varada vamanayana varunimadavihvala ॥ 74 ॥ 🌻

🌻 328-1. Kalālāpā कलालापा (328) 🌻

Her speech itself is an art. Lalitā Triśatī nāma 156 is also ‘Kalālāpā’. Kalā generally means sixty four types of fine arts. But, kala refers melodious voice. Ālāpa also means speech. This nāma refers to Her melodious voice as art or Kalā.

Saundarya Laharī (verse 38) mentions eighteen types of arts “as a result of whose conversation, the maturation of the eighteen arts takes place”. These eighteen arts are interpreted in different ways. The first one says, that the sixteen bīja-s of ṣodaśī mahā mantra, Devi and one’s guru make the eighteen. This is called aṣṭādaśaguṇitavidyā अष्टादशगुणितविद्या. Another interpretation refers to eighteen types of vidyā-s - śikṣā, kalpa, vyākaraṇa, nirukta, jyotiṣa, candas, Rig Veda, Yajur Veda, Sāma Veda, Atharva Veda, pūva and uttara mīmāṁsā, nyāya, purāṇa, dharma śāstra, Āyurveda, dhaṇurveda, gāndharva and nīti śāstra. This means, that from the melodious speech of Devi, the eighteen vidya-s originate and by attaining these vidya-s a person is able to distinguish between good and bad through the means of his mind.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


12 Dec 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 108


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 108 🌹

✍️. సౌభాగ్య

📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ప్రేమకు సంబంధించిన సమస్త రహస్యమదే. లక్ష్యాలు లేని ప్రేమ. నీ సమస్త అస్తిత్వాన్ని ప్రేమ శక్తిగా మారుస్తుంది. ప్రేమ శక్తి దైవశక్తిగా మారుతుంది అంతకు మించి ఏమీ అవసరం లేదు. 🍀

ప్రేమ అన్నది నీ లక్షణం కావాలి. నువ్వు ప్రేమిస్తే ఒక రోజు నువ్వు కేవలం ప్రేమగా మారుతావు. ప్రేమించడంగా గాక ప్రేమగా మారుతావు. అది నీ గొప్ప రోజు. జ్ఞానోదయమయిన రోజు. ఏ క్షణం మంచుబిందువు మాయమై సముద్రంలో అప్పుడది సముద్రంగా మారుతుంది.


ప్రేమకు సంబంధించిన సమస్త రహస్యమదే. లక్ష్యాలు లేని ప్రేమ. నీ సమస్త అస్తిత్వాన్ని ప్రేమ శక్తిగా మారుస్తుంది. ప్రేమ శక్తి దైవశక్తిగా మారుతుంది అంతకు మించి ఏమీ అవసరం లేదు. మనిషి కోరదగింది అదే. మనిషి స్వప్నించాల్సింది అదే. అది కేవలమైన సంపూర్ణతని , సమగ్రతని యిస్తుంది. అది చివుళ్ళు తొడుగుతుంది. పూలు పూస్తుంది. నీలో చైతన్య సుమాలు వికసించడం ఆరంభిస్తాయి.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


12 Dec 2021

మైత్రేయ మహర్షి బోధనలు - 41


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 41 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 29. దాన యజ్ఞము 🌻

తనకున్నది పంచువాడు పుణ్యమూర్తి. తనను కూడా పంచు వాడు సాధువు. అతడు పంచుటకు ప్రకృతి కూడా తోడ్పడి అనంతమైన సంపదను పంచగలదు. సాధువు సంపద అపారము. అనగా హద్దులు లేనిది. ఆ సంపద పదార్థమయమే కాదు, వాజ్మయము, విజ్ఞాన, జ్ఞానమయము గూడ. తనకు లేనిది పంచువాడు డంబాచారి. తనది కాని సంపదను, తనకు లేని జ్ఞానమును యితరులకు పంచు ప్రయత్నము మోసముతో కూడినదే. అందుండి పుట్టునది ప్రకోపమే.

దాన యజ్ఞము గొప్పది. మహత్తరమైనది. దానిని నిర్వర్తించు టకు వలసినది అంతః శుచి. హృదయమున దైవమును అనునిత్యము ప్రతిపాదించుకొనుట వలన అట్టి శుచి ఏర్పడగలదు. అట్టివాని హృదయమున దైవము ప్రతిష్ఠితుడై దానమును నిర్వర్తించును. దానము చేయువాడు, హృదయమున దైవమును ప్రతిపాదించు కొనుట వలన విశేషమైన దాన యజ్ఞమును నిర్వర్తింపగలడు. బలిచక్రవర్తి అట్టివాడు.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


12 Dec 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 524 / Vishnu Sahasranama Contemplation - 524


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 524 / Vishnu Sahasranama Contemplation - 524🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 524. జితాఽమిత్రః, जिताऽमित्रः, Jitā’mitraḥ 🌻

ఓం జితామిత్రాయ నమః | ॐ जितामित्राय नमः | OM Jitāmitrāya namaḥ

జితా అమిత్రా యేనాం తర్వర్తినో దుఃఖహేతవః ।
రాగద్వేషాదయో బాహ్యాశ్చాపి వా రావణాదయః ।
స శ్రీ విష్ణుర్జితామిత్ర ఇతి సఙ్కీర్త్యతే బుధైః ॥

అంతఃకరణవర్తులైన రాగద్వేషాదులును, బాహ్యులగు రావణాది శత్రువులను జయించిన శ్రీ విష్ణుదేవుడు జితాఽమిత్రః అని చెప్పబడును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 524🌹

🌻 524. Jitā’mitraḥ 🌻

OM Jitāmitrāya namaḥ

जिता अमित्रा येनां तर्वर्तिनो दुःखहेतवः ।
रागद्वेषादयो बाह्याश्चापि वा रावणादयः ।
स श्री विष्णुर्जितामित्र इति सङ्कीर्त्यते बुधैः ॥

Jitā amitrā yenāṃ tarvartino duḥkhahetavaḥ,
Rāgadveṣādayo bāhyāścāpi vā rāvaṇādayaḥ,
Sa śrī viṣṇurjitāmitra iti saṅkīrtyate budhaiḥ.


Since He has conquered the internal enemies of attachment, aversion etc., and also the external enemies like Rāvaṇa, Lord Viṣṇu is called Jitā’mitraḥ.


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

अजो महार्हस्स्वाभाव्यो जितामित्रः प्रमोदनः ।आनन्दो नन्दनोऽनन्दस्सत्यधर्मा त्रिविक्रमः ॥ ५६ ॥

అజో మహార్హస్స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।ఆనన్దో నన్దనోఽనన్దస్సత్యధర్మా త్రివిక్రమః ॥ 56 ॥

Ajo mahārhassvābhāvyo jitāmitraḥ pramodanaḥ,Ānando nandano’nandassatyadharmā trivikramaḥ ॥ 56 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


12 Dec 2021

12-DECEMBER-2021 శనివారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 12, డిసెంబర్ 2021 శనివారం, భాను వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 127 / Bhagavad-Gita - 127 3-08🌹*
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 524 / Vishnu Sahasranama Contemplation - 524 🌹
4) 🌹 DAILY WISDOM - 202🌹 
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 41🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 108🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 328-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 328-1 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹*
*భాను వాసరే, 12, డిసెంబర్‌ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ సూర్య స్తుతిః - 3 🍀*

*జ్ఞానైకధామభూతాయ నిర్ధూతతమసే నమః |*
*శుద్ధజ్యోతిస్స్వరూపాయ విశుద్ధాయామలాత్మనే || 5 ||*

*వరిష్ఠాయ వరేణ్యాయ పరస్మై పరమాత్మనే |*
*నమోఽఖిలజగద్వ్యాపి స్వరూపాయాత్మమూర్తయే || 6 ||*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, హేమంత ఋతువు,
మృగశిర మాసం
తిథి: శుక్ల-నవమి 20:04:32 వరకు
తదుపరి శుక్ల-దశమి
నక్షత్రం: ఉత్తరాభద్రపద 24:01:00
వరకు తదుపరి రేవతి
యోగం: వ్యతీపాత 29:45:20 వరకు
తదుపరి వరియాన
కరణం: బాలవ 07:33:20 వరకు
వర్జ్యం: 08:43:12 - 10:25:04
దుర్ముహూర్తం: 16:14:07 - 16:58:33
రాహు కాలం: 16:19:40 - 17:42:59
గుళిక కాలం: 14:56:21 - 16:19:40
యమ గండం: 12:09:42 - 13:33:01
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:31
అమృత కాలం: 18:54:24 - 20:36:16
సూర్యోదయం: 06:36:24
సూర్యాస్తమయం: 17:42:59
వైదిక సూర్యోదయం: 06:40:18
వైదిక సూర్యాస్తమయం: 17:39:06
చంద్రోదయం: 13:20:20
చంద్రాస్తమయం: 00:49:24
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: మీనం
స్థిర యోగం - శుభాశుభ మిశ్రమ ఫలం 
24:01:00 వరకు తదుపరి 
వర్ధమాన యోగం - ఉత్తమ ఫలం
పండుగలు : లేవు
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 127 / Bhagavad-Gita - 127 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 8 🌴*

*నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణ: |*
*శరీరయత్రాపి చ తే న ప్రసిద్ధ్యేదకర్మణ: ||*

🌷. తాత్పర్యం :
*నీ విధ్యుక్తధర్మమును నీవు నిర్వర్తింపుము. ఏలయన అది అకర్మ కన్నను ఉత్తమమైనది. కర్మ నొనరింపకుండా దేహపోషణము సైతము మనుజుడు చేసికొనజాలడు.*

🌷. భాష్యము :
ఉత్తమవంశమునకు చెందినవారమని తప్పుగా ప్రకటించుకొను కపటధ్యానపరులు మరియు ఆధ్యాత్మికోన్నతికై సర్వమును త్యాగము చేసినట్లుగా మిథ్యాప్రదర్శనమును కావించు ఘనులు పలువురు కలరు. కాని అర్జునుడు ఆ విధమైన మిథ్యావాది కారాదని శ్రీకృష్ణభగవానుడు తలచెను. పైగా క్షత్రియులకు నిర్దేశింపబడిన కర్మలను అర్జునుడు పాటింపవలెనని భగవానుడు కోరెను. 

అర్జునుడు గృహస్థుడు మరియు క్షత్రియోధుడు కావున తన స్థానమందే నిలిచి, గృహస్థుడైన క్షత్రియునకు విధింపబడిన ధర్మములను పాటించుట ఉత్తమకార్యము. అట్టి కర్మలు లౌకికుని హృదయమును శుభ్రపరచి భౌతికకల్మషము నుండి అతనిని ముక్తుని చేయగలదు. జీవనార్థమై ఆచరింపబడు నామమాత్ర సన్యాసము శ్రీకృష్ణభగవానుడు కాని, ఏ ధర్మశాస్త్రము కాని అంగీకరించు అవకాశము లేదు. 

వాస్తవమునకు ఏదియో ఒక కర్మ ద్వారా మనుజుడు దేహమును పోషింపవలసియుండును. భౌతికభావనల నునిడ్ శుద్ధిపరుపకనే కర్మను చపలత్వముతో త్యజింపరాదు. భౌతికజగము నందున్న ప్రతియోక్కరికిని ప్రకృతిపై ఆధిపత్యము వహింపవలెననెడి కల్మషభవములు ( వేరుమాటలలో ఇంద్రియభోగవాంచలు) తప్పకయుండును. అటువంటి కలుషితభవములు తప్పక నశింపవలెను. విధ్యుక్తధర్మముల ద్వారా అట్టి కార్యము సాధింపక మునుపే కర్మను త్యజించి ఇతరులపై ఆధారపడి జీవించు కపటయోగి వలె అగుటకు ఎవ్వరును యత్నింపరాదు. 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 127 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 3 - Karma Yoga - 8 🌴*

*8. niyataṁ kuru karma tvaṁ karma jyāyo hy akarmaṇaḥ*
*śarīra-yātrāpi ca te na prasidhyed akarmaṇaḥ*

🌷Translation :
*Perform your prescribed duty, for doing so is better than not working. One cannot even maintain one’s physical body without work.*

🌷 Purport :
There are many pseudo meditators who misrepresent themselves as belonging to high parentage, and great professional men who falsely pose that they have sacrificed everything for the sake of advancement in spiritual life. Lord Kṛṣṇa did not want Arjuna to become a pretender. Rather, the Lord desired that Arjuna perform his prescribed duties as set forth for kṣatriyas. 

Arjuna was a householder and a military general, and therefore it was better for him to remain as such and perform his religious duties as prescribed for the householder kṣatriya. Such activities gradually cleanse the heart of a mundane man and free him from material contamination. So-called renunciation for the purpose of maintenance is never approved by the Lord, nor by any religious scripture. After all, one has to maintain one’s body and soul together by some work. Work should not be given up capriciously, without purification of materialistic propensities. 

Anyone who is in the material world is certainly possessed of the impure propensity for lording it over material nature, or, in other words, for sense gratification. Such polluted propensities have to be cleared. Without doing so, through prescribed duties, one should never attempt to become a so-called transcendentalist, renouncing work and living at the cost of others.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 524 / Vishnu Sahasranama Contemplation - 524🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 524. జితాఽమిత్రః, जिताऽमित्रः, Jitā’mitraḥ 🌻*

*ఓం జితామిత్రాయ నమః | ॐ जितामित्राय नमः | OM Jitāmitrāya namaḥ*

*జితా అమిత్రా యేనాం తర్వర్తినో దుఃఖహేతవః ।*
*రాగద్వేషాదయో బాహ్యాశ్చాపి వా రావణాదయః ।*
*స శ్రీ విష్ణుర్జితామిత్ర ఇతి సఙ్కీర్త్యతే బుధైః ॥*

*అంతఃకరణవర్తులైన రాగద్వేషాదులును, బాహ్యులగు రావణాది శత్రువులను జయించిన శ్రీ విష్ణుదేవుడు జితాఽమిత్రః అని చెప్పబడును.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 524🌹*

*🌻 524. Jitā’mitraḥ 🌻*

*OM Jitāmitrāya namaḥ*

जिता अमित्रा येनां तर्वर्तिनो दुःखहेतवः ।
रागद्वेषादयो बाह्याश्चापि वा रावणादयः ।
स श्री विष्णुर्जितामित्र इति सङ्कीर्त्यते बुधैः ॥

Jitā amitrā yenāṃ tarvartino duḥkhahetavaḥ,
Rāgadveṣādayo bāhyāścāpi vā rāvaṇādayaḥ,
Sa śrī viṣṇurjitāmitra iti saṅkīrtyate budhaiḥ.

*Since He has conquered the internal enemies of attachment, aversion etc., and also the external enemies like Rāvaṇa, Lord Viṣṇu is called Jitā’mitraḥ.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अजो महार्हस्स्वाभाव्यो जितामित्रः प्रमोदनः ।आनन्दो नन्दनोऽनन्दस्सत्यधर्मा त्रिविक्रमः ॥ ५६ ॥

అజో మహార్హస్స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।ఆనన్దో నన్దనోఽనన్దస్సత్యధర్మా త్రివిక్రమః ॥ 56 ॥

Ajo mahārhassvābhāvyo jitāmitraḥ pramodanaḥ,Ānando nandano’nandassatyadharmā trivikramaḥ ॥ 56 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 202 🌹*
*🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 20. The World is the Face of God 🌻*

*In the Ramayana, Tulsidas gives a beautiful description of Rama, Sita and Lakshmana walking, with Sita in the middle, and gives the image by saying that Sita was there as maya between brahma and jiva. Likewise, there is this world before us, which we are likely to unintelligently ignore in our enthusiastic aspiration for God.*

*The world is the face of God; it is the fingers of the hands of God Himself moving, and the so-called appearance of the world is rooted in the reality of the Absolute. There is a very unfortunate aftermath of this interesting analysis, namely, we ourselves are a part of this appearance; and to put on the unwarranted status of the reality in ourselves, while we are looked at as appearance, would be to disregard the law that operates in the realm in which we are placed.*

*Appearance is, after all, an appearance of reality—it is not an appearance of nothing. If it had been nothing, the appearance itself would not be there. Inasmuch as the appearance is of reality, it borrows the sense of reality. The snake is in the rope, yes, but we must know that the rope is not absent. Though the way in which the rope is seen may be an erroneous perception, the fact of the rope being there cannot be ignored—that is the reason why the snake is seen at all.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 41 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
 *సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 29. దాన యజ్ఞము 🌻*

*తనకున్నది పంచువాడు పుణ్యమూర్తి. తనను కూడా పంచు వాడు సాధువు. అతడు పంచుటకు ప్రకృతి కూడా తోడ్పడి అనంతమైన సంపదను పంచగలదు. సాధువు సంపద అపారము. అనగా హద్దులు లేనిది. ఆ సంపద పదార్థమయమే కాదు, వాజ్మయము, విజ్ఞాన, జ్ఞానమయము గూడ. తనకు లేనిది పంచువాడు డంబాచారి. తనది కాని సంపదను, తనకు లేని జ్ఞానమును యితరులకు పంచు ప్రయత్నము మోసముతో కూడినదే. అందుండి పుట్టునది ప్రకోపమే.*

*దాన యజ్ఞము గొప్పది. మహత్తరమైనది. దానిని నిర్వర్తించు టకు వలసినది అంతః శుచి. హృదయమున దైవమును అనునిత్యము ప్రతిపాదించుకొనుట వలన అట్టి శుచి ఏర్పడగలదు. అట్టివాని హృదయమున దైవము ప్రతిష్ఠితుడై దానమును నిర్వర్తించును. దానము చేయువాడు, హృదయమున దైవమును ప్రతిపాదించు కొనుట వలన విశేషమైన దాన యజ్ఞమును నిర్వర్తింపగలడు. బలిచక్రవర్తి అట్టివాడు.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 108 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. ప్రేమకు సంబంధించిన సమస్త రహస్యమదే. లక్ష్యాలు లేని ప్రేమ. నీ సమస్త అస్తిత్వాన్ని ప్రేమ శక్తిగా మారుస్తుంది. ప్రేమ శక్తి దైవశక్తిగా మారుతుంది అంతకు మించి ఏమీ అవసరం లేదు. 🍀*

*ప్రేమ అన్నది నీ లక్షణం కావాలి. నువ్వు ప్రేమిస్తే ఒక రోజు నువ్వు కేవలం ప్రేమగా మారుతావు. ప్రేమించడంగా గాక ప్రేమగా మారుతావు. అది నీ గొప్ప రోజు. జ్ఞానోదయమయిన రోజు. ఏ క్షణం మంచుబిందువు మాయమై సముద్రంలో అప్పుడది సముద్రంగా మారుతుంది.*

*ప్రేమకు సంబంధించిన సమస్త రహస్యమదే. లక్ష్యాలు లేని ప్రేమ. నీ సమస్త అస్తిత్వాన్ని ప్రేమ శక్తిగా మారుస్తుంది. ప్రేమ శక్తి దైవశక్తిగా మారుతుంది అంతకు మించి ఏమీ అవసరం లేదు. మనిషి కోరదగింది అదే. మనిషి స్వప్నించాల్సింది అదే. అది కేవలమైన సంపూర్ణతని , సమగ్రతని యిస్తుంది. అది చివుళ్ళు తొడుగుతుంది. పూలు పూస్తుంది. నీలో చైతన్య సుమాలు వికసించడం ఆరంభిస్తాయి.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 328-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 328-1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 74. కళావతీ, కళాలాపా, కాంతా, కాదంబరీప్రియా ।*
*వరదా, వామనయనా, వారుణీమదవిహ్వలా ॥ 74 ॥ 🍀*

*🌻 328-1. 'కళాలాపా'🌻* 

*కళల రూపమున ప్రకటింపబడునది శ్రీదేవి అని అర్థము. 'ఆలాప' మనగా మధుర ధ్వని. 'కళ' లనగా విద్యలని కూడ భావము. మధురముగా విద్యలను ప్రకటించునది శ్రీమాత అని తెలియ
వలెను. విద్యలన్నియూ వికాసము కొరకే. అట్టి వికాసము మధురముగ సాగినచో తదనుగుణమైన ఆనందముకూడ ప్రకటింపబడును. విద్యా లేక కళ ప్రకటింపబడుచున్నప్పుడు, ప్రకటించువానికి దర్శించువానికి కూడ ఆనందము కలుగవలెను. వికాసము కలుగవలెను. ఇట్లు ఆనంద వికాసములు కలాపములుగ విద్యలు సాగవలెను. తన్మూలమున జీవులు చైతన్య స్వరూపులై ఆనందించుచు నుండవలెను. ఇది అంతయూ శ్రీమాత ప్రణాళిక.*

*జీవుల నుద్ధరించు ప్రణాళిక యందు కళాలాపము ప్రధానకార్యమై యుండును. ఏ విద్యయూ లేని మానవుడు పశువు గాని పశువు. అట్టి వానిని వింత పశువు అని పెద్దలు నిర్వచించిరి. శ్రీమాత అనుగ్రహము వలన నోటియందు లాలాజలము మారినట్లు విద్యలన్నియూ ఊరగలవు. కళాలాప అను పదమును కళ ఆలాప అని ముందు వివరించ బడినది. ఆ పదమును కం, లాలాప అని కూడ వివరించవచ్చును. 'కం' అనగా సృష్టికర్త లేక చతుర్ముఖ బ్రహ్మ.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 328-1🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 74. Kalavati kalalapa kanta kadanbari priya*
*Varada vamanayana varunimadavihvala ॥ 74 ॥ 🌻*

*🌻 328-1. Kalālāpā कलालापा (328) 🌻*

*Her speech itself is an art. Lalitā Triśatī nāma 156 is also ‘Kalālāpā’. Kalā generally means sixty four types of fine arts. But, kala refers melodious voice. Ālāpa also means speech. This nāma refers to Her melodious voice as art or Kalā.*

*Saundarya Laharī (verse 38) mentions eighteen types of arts “as a result of whose conversation, the maturation of the eighteen arts takes place”. These eighteen arts are interpreted in different ways. The first one says, that the sixteen bīja-s of ṣodaśī mahā mantra, Devi and one’s guru make the eighteen. This is called aṣṭādaśaguṇitavidyā अष्टादशगुणितविद्या. Another interpretation refers to eighteen types of vidyā-s - śikṣā, kalpa, vyākaraṇa, nirukta, jyotiṣa, candas, Rig Veda, Yajur Veda, Sāma Veda, Atharva Veda, pūva and uttara mīmāṁsā, nyāya, purāṇa, dharma śāstra, Āyurveda, dhaṇurveda, gāndharva and nīti śāstra. This means, that from the melodious speech of Devi, the eighteen vidya-s originate and by attaining these vidya-s a person is able to distinguish between good and bad through the means of his mind.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

శ్రీ లలితా సహస్ర నామములు - 165 / Sri Lalita Sahasranamavali - Meaning - 165


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 165 / Sri Lalita Sahasranamavali - Meaning - 165 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 165. ధర్మాధారా, ధనాధ్యక్షా, ధనధాన్య వివర్ధినీ ।
విప్రప్రియా, విప్రరూపా, విశ్వభ్రమణ కారిణీ ॥ 165 ॥ 🍀


🍀 881. ధర్మాధారా :
ధర్మమునకు ఆధారభూతమైనది

🍀 882. ధనాధ్యక్షా :
సర్వసంపదలకు అధికారిణి

🍀 883. ధనధాన్యవివర్ధినీ :
ధనము, ధాన్యము వర్ధిల్లచేయునది

🍀 884. విప్రప్రియా :
వేదాధ్యయన సంపన్నులైన వారియందు ప్రీతి కలిగినది

🍀 885. విప్రరూప :
వేదవిదులైనవారి యెందు ఉండునది

🍀 886. విశ్వభ్రమణకారిణీ :
విశ్వమును నడిపించునది


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 165 🌹

📚. Prasad Bharadwaj

🌻 165. Dharmadhara dhanadhyaksha dhanadhanya vivardhini
Viprapriya viprarupa vishvabhramanakarini ॥ 165 ॥ 🌻

🌻 881 ) Dharma dhara -
She who is the basis of Dharma-the rightful action

🌻 882 ) Dhanadyaksha -
She who presides over wealth

🌻 883 ) Dhanadhanya vivardhani -
She who makes wealth and grain to grow

🌻 884 ) Vipra priya -
She who likes those who learn Vedas

🌻 885 ) Vipra roopa -
She who is the learner of Vedas

🌻 886 ) Viswa brhamana karini -
She who makes the universe to rotate


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


11 Dec 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 117


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 117 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. లోకోద్ధరణము- లోక కల్యాణము - 2 🌻

లోకమంతా విష్ణుమయం. లోకంలోని వ్యక్తుల స్వభావాలనే అలల ఆటు, పోటుల వెనుక నేపథ్యంగా ఉన్నది అంతర్యామి చైతన్యమనే మహా సాగరము. ఇది అవ్యక్తము‌ ఈ సాగరమే వాసుదేవుడు. ఈ సాగరాన్ని దర్శించి, జీవుల రూపంలోని వాసుదేవుని సేవకై కడంగి ఆనందించుటే మన కర్తవ్యము.

దీన్ని ఆచరించే వాని మనస్సులో వాసుదేవుడు అను ముద్ర ఒకటే ఉంటుంది. ఇదియే ప్రభుముద్ర. ఆంజనేయుని వలె ఈ ముద్ర ధరించినవారు సంసార సముద్రాన్ని తరిస్తారు. జీవుల స్వభావాలను గూర్చి వీరికి ఎట్టి ముద్ర ఉండదు. ఆయా వ్యక్తుల కష్టాలు, ఆపదలు, రోగాలు వీరికి గుర్తుంటాయి. జీవుల ఆనందానికి, శాంతికి, ఆరోగ్యానికి తమ వంతు సేవ చేస్తారు. లోకకళ్యాణము కొరకు తమ వంతు కర్తవ్యాన్ని అనుష్ఠిస్తారు.

....✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


11 Dec 2021

వివేక చూడామణి - 165 / Viveka Chudamani - 165


🌹. వివేక చూడామణి - 165 / Viveka Chudamani - 165 🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -12 🍀

539. ఆత్మను తెలుసుకొన్న వారు ఎలాంటి బాహ్య దుస్తులను ధరించరు. వారు బాహ్య వస్తువులకు అతీతముగా తమ శరీరమునకు ఎట్టి గుర్తింపుతో పనిలేకుండా ఉంటారు. బాహ్య వస్తు సముదాయములను వారు కోరకుండా ఎవరైన ఇచ్చినపుడు వాటిని తమ అవసరాలకు మాత్రమే చిన్న పిల్లల వలె వాడుకుంటారు. పిల్లలు వస్తువులతో ఆడుకున్న తరువాత వాటిని వదలివేసి వాటిని గూర్చి మరచిపోతారు. అలానే జ్ఞానులు జీవిస్తారు.

540. అంతరిక్ష సంబంధమైన జ్ఞాన ప్రపంచములో స్థిరపడి ఆత్మను తెలుసుకొన్న వాడు కొన్ని సార్లు పిచ్చివానిగా, కొన్ని సార్లు చిన్న పిల్ల వానిగా, మరికొన్ని సార్లు దయ్యాల్లాగా ఎలాంటి దుస్తులు లేకుండా, శరీరాన్ని నగ్నముగా ఉంచుకొని మరికొన్ని సార్లు దుస్తులు ధరించి, మరికొన్ని సార్లు చెట్ల ఆకులతో ఇలా తన ఇష్టం వచ్చినట్లు బాహ్యముగా కనబడుతూ, అంతరములో బ్రహ్మానంద స్థితిలో ఓలలాడుతుంటారు.

541. సాధువు ఒంటరిగా జీవిస్తూ, ప్రాపంచిక వస్తు
సముదాయమును ఏవిధమైన కోరిక, ఆపేక్ష లేకుండా అనుభవిస్తుంటారు. ఎల్లపుడు తన ఆత్మలోనే, ఆత్మతోనే ఉంటూ అన్నింటిలో తానే అయి జీవిస్తాడు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 VIVEKA CHUDAMANI - 165 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj


🌻 32. I am the one who knows Brahman -12🌻

539. The knower of the Atman, who wears no outward mark and is unattached to external things, rests on this body without identification, and experiences all sorts of sense-objects as they come, through others’ wish, like a child.

540. Established in the ethereal plane of Absolute Knowledge, he wanders in the world, sometimes like a madman, sometimes like a child and at other times like a ghoul, having no other clothes on his person except the quarters, or sometimes wearing clothes, or perhaps skins at other times.

541. The sage, living alone, enjoys the sense-objects, being the very embodiment of desirelessness – always satisfied with his own Self, and himself present at the All.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


11 Dec 2021

శ్రీ శివ మహా పురాణము - 489


🌹 . శ్రీ శివ మహా పురాణము - 489 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 38

🌻. వివాహ మండపము - 3 🌻

విశ్వకర్మ కవచములతో, శ్రేష్ఠ రత్నములతో ఒప్పారు లోకపాలురను, దేవతలనందరినీ వాస్తవమేనా యున్నట్లు నిర్మించెను (22). మరియు భృగువు మొదలగు తపోనిష్ఠులగు ఋషులందరినీ, ఇతరులగు ఉపదేవతలను, సిద్ధులను బొమ్మలరూపములో ప్రదర్శించెను (23).

గరుడులను పేరుగల గణములందరితో గూడియున్న కృత్రిమ విష్ణువు నిర్మింపబడి యుండెను. ఆ బొమ్మ మహాశ్చర్యమును కలిగించెను (24). అదే విధముగా వేదములచే, ప్రజాపతులచే, మరియు సిద్ధులచే చుట్టువారబడి సూక్తములను పఠించుచున్న నాయొక్క కృత్రిమ శిల్పము కూడా అచట నిర్మింపబడి యుండెను. ఓ నారదా! అదేవిధముగా, ఐరావత గజమునధిష్ఠించి పూర్ణచంద్రుని బోలియున్న కృత్రిమ ఇంద్రుడు తన సైన్యముతో గూడి యున్నట్లు నిర్మింపబడెను. (25)

ఓ దేవర్షీ! ఇన్ని మాటలేల? హిమవంతునిచే ప్రేరితుడైన విశ్వకర్మ దేవ సమాజమునంతనూ అచట అనతికాలములో నిర్మించెను (27). దివ్యమగు రూపము గలది, అనేకములగు అచ్చెరువులతో గూడియున్నది, చాల పెద్దది, దేవతలను కూడ మోహింప జేయునది అగు ఇట్టి మండపమును విశ్వకర్మ నిర్మించెను (28). తరువాత హిమవంతుని ఆజ్ఞచే మహాబుద్ధిశాలియగు విశ్వకర్మ, దేవతలు మొదలగు వారి నివాసము కొరకై ప్రయత్నపూర్వకముగా ఆయా లోకములను నిర్మించెను (29).

ఆ మండపము వద్ద గొప్పగా వెలుగొందే, పరమాద్భుతములైన సుఖకరములైన, దివ్యములగు పెద్ద ఆసనములను వారికొరకు విశ్వకర్మ నిర్మించెను (30). మరియు నాతడు అద్భుతము, గొప్ప ప్రకాశముతో కూడినది అగు కృత్రిమ సత్యలోకమును స్వయంభువునగు నా నివాసము కొరకు క్షణములో నిర్మించెను (31).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


11 Dec 2021

కాలభైరవ అష్టమి శుభాకాంక్షలు


🌹. కాలభైరవ అష్టమి శుభాకాంక్షలు 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🍀. కాలభైరవస్వామి అలా ఆవిర్భవించాడు? 🍀

కాలభైరవ స్వామి.. ఆయన దిగంబరంగా దర్శన మిస్తారు. దిగంబరంగా అంటే సత్యం ధర్మం.

ప్రాచీనకాలం నాటి శైవక్షేత్రాలకి వెళితే అక్కడ తప్పనిసరిగా కన్పించే దర్శనం ఇచ్చే స్వరూపం భైరవ. మనలో ఉన్న భయాన్ని బాధలను పోగిట్టెలా, మనలో దాగిఉన్న శక్తి ని మేలుకొలిపేలా ఆయన రూపం వుంటుంది. కాశీ క్షేత్రపాలకుడిగానే కాకుండా అనేక క్షేత్రాల్లో ఆయన క్షేత్ర పాలకుడిగా ఆ క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటారు. అసితాంగ భైరవుడు .. రురు భైరవుడు .. చండ భైరవుడు .. క్రోధ భైరవుడు .. ఉన్మత్త భైరవుడు .. కపాల భైరవుడు .. భీషణ భైరవుడు .. సంహార భైరవుడు .. అనే ఎనిమిది నామాలతో ... వివిధ ముద్రలతో భైరవుడు దర్శనమిస్తూ వుంటాడు.

భైరవ అనే పేరే ఆయనలోని అపారమైన శక్తిని ఆవిష్కరిస్తున్నట్టుగా వుంటుంది. ఆయా క్షేత్రాలకి భైరవుడు పాలకుడని తెలిసినప్పుడు ... శునకాన్ని వాహనంగా కలిగిన ఆయన రూపాన్ని చూసినప్పుడు ఆయన గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలగకపోదు. కాలభైరవుడు శివుడు నుంచి ఆవిర్భవించిన రుద్రాంశ సంభూతుడు.

శివ ఉవాచ!! "నాకు సతీ వియోగం అయినప్పుడు నా దుఃఖాన్ని నిలువరించాడానికి నేనే కాలభైరవ అశ్రయించాను. భైరవున్ని స్మరిస్తే నన్ను పుజించినట్లే" అని సాక్షాత్తు శివుడే స్వయంగా తెలియజేస్తారు. కాశీ ఖండంలో.. అనుచితంగా గర్వంతో వ్యవహరించిన బ్రహ్మదేవుడి కి గర్వభంగం చేసి, పంచమ శిరస్సును ఖండిస్తాడు భైరవస్వరూపంతో..

మహా పరాక్రమవంతుడైన రుద్రాంశ సంభూతుడు భైరవుడు క్షణమైనా ఆలస్యం చేయకుండా బ్రహ్మదేవుడికి గల అయిదు శిరస్సుల్లో, ఏ శిరస్సు అయితే శివుడిని అవమానపరుస్తూ గర్వంతో మాట్లాడిందో ఆ శిరస్సును ఖండించి వేస్తాడు. ఆ తరువాత ధర్మ స్థాపన కోసం, బ్రహ్మహత్యాపాతకం నుంచి బయటపడటానికి తాను ఖండించినటు వంటి బ్రహ్మదేవుడి యొక్క కపాలంతో అనేక లోకాలు దర్శిస్తూ.. భూలోకం కాశీ క్షేత్రం అడుగిడగానే భైరవుడి చేతిలోని బ్రహ్మదేవుడి కపాలం కిందపడిన ప్రదేశమే నేడు 'బ్రహ్మ కపాలం' గా పిలవబడుతోంది. కాశీక్షేత్రానికి భైరవుడు అక్కడ క్షేత్రపాలకుడిగా ఉండిపోతాడు. అంటే ఆయన క్షేత్రానికి ఆయనే క్షేత్ర పాలకుడు. ఆ తరువాత అనేక శైవక్షేత్రాల్లో ఆయన మూర్తిని క్షేత్రపాలక స్వామి గా ప్రతిష్ఠించారు. ఆ క్షేత్రాల్లో భైరవుడు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించబడుతూ వుంటాడు. ఈ స్వామిని ఆరాధించడం వలన దుష్ట శక్తుల నుంచి రక్షణ లభిస్తుందనీ, గ్రహ శాపాలు, శత్రు శాపాలు, రోగ బాధలు, ఈతి బాధలు, దుఃఖ దారిద్ర్యములు, తొలగి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు చేకూరుతాయని, పాడిపంటలు వృద్ధి చెందుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.

🌹 🌹 🌹 🌹 🌹


11 Dec 2021

గీతోపనిషత్తు -289


🌹. గీతోపనిషత్తు -289 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚

శ్లోకము 16-3

🍀 16-3. సమస్తమును నేనే ! - సృష్టి యందలి అన్ని వస్తువుల యందు దైవమే నిండి యున్నపుడు దైవమును చూడక, ఇతరము చూచుట అజ్ఞానము. దైవమునే చూచుట రాజవిద్య. ఎంత తెలిసిన వానికైనను ప్రకృతిచే ఆవరింపబడిన ఈశ్వరుని దర్శనము చేయుటకు దీక్ష కావలెను. ఈశ్వరు నాశ్రయించియే ప్రకృతి అనేక విధములుగ ఆవిర్భవించు చున్నది. అట్టి అనేక మందు ఏకత్వమును దర్శించుట అనుక్షణ ప్రయత్నముననే సాధ్యము. ఎందరో మునులు, ఋషులు క్రతువుల యందు, యజ్ఞముల యందు నిమగ్నమై, అచటనే తిరుగాడుచున్న కృష్ణ పరమాత్మను చూడలేకపోయిరి. 🍀

అహం క్రతు రహం యజ్ఞః స్వధాహ మహ మౌషధమ్ |
మంత్రోం హ మహమే వాణ్య మహమగ్ని రహం హుతమ్ || 16

తాత్పర్యము : క్రతువును నేనే. యజ్ఞమును నేనే. ఓషధులును నేనే. మంత్రము కూడ నేనే. హోమ ద్రవ్యమును నేనే. హోమమును నేనే. అందు హుతమగు ద్రవ్యము నేనే.

వివరణము : పురుషుడు ధరించు లుంగీ, స్త్రీ ధరించు చీరలో యున్నది పత్తియే యని గుర్తువచ్చునా? వచ్చుట లో దృష్టి, ఇట్టి లో దృష్టి లేకుండ ఎన్ని యజ్ఞములు చేసినను, యాగములు చేసినను, ఈశ్వర సాన్నిధ్యము లభింపదు. సృష్టి యందలి అన్ని వస్తువుల యందు దైవమే నిండి యున్నపుడు దైవమును చూడక, ఇతరము చూచుట అజ్ఞానము. దైవమునే చూచుట రాజవిద్య.

ఎంత తెలిసిన వానికైనను ప్రకృతిచే ఆవరింపబడిన ఈశ్వరుని దర్శనము చేయుటకు దీక్ష కావలెను. ఈశ్వరు నాశ్రయించియే ప్రకృతి అనేక విధములుగ ఆవిర్భవించు చున్నది. అట్టి అనేక మందు ఏకత్వమును దర్శించుట అనుక్షణ ప్రయత్నముననే సాధ్యము. ఎందరో మునులు, ఋషులు క్రతువుల యందు, యజ్ఞముల యందు నిమగ్నమై, అచటనే తిరుగాడుచున్న కృష్ణ పరమాత్మను చూడలేకపోయిరి. కారణము, క్రతు ద్రవ్యములను, మంత్రములను, స్వాహాకారములను, ఓషధులను, అగ్ని జ్వాల లను, హుతకార్యమును ఈశ్వరునిగ దర్శింపక పోవుటయే!

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


11 Dec 2021

11-DECEMBER-2021 శనివారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 11, శనివారం, డిసెంబర్ 2021 స్థిర వాసరే 🌹
🌹. కాలభైరవ జయంతి శుభాకాంక్షలు 🌹
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 289 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 488🌹 
4) 🌹 వివేక చూడామణి - 165 / Viveka Chudamani - 165🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -117🌹  
6) 🌹 Osho Daily Meditations - 106 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 165 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 165🌹
🌹 Vedic Wisdom 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శనివారం మిత్రులందరికీ 🌹*
*స్థిర వాసరే, 11, డిసెంబర్‌ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. దుర్గ శత్రు శాంతి మంత్రం 🍀*

*రిపవ: సంక్షయం యాంతి కళ్యాణం చోపపద్యతే ! నందతే చ కులం పుంసాం మహాత్మ్యం మమశృణ్వతామ్ !!* *శాంతికర్మాణి సర్వత్ర తథా దు:స్వప్న దర్శనే ! గ్రహపీడాసు చోద్రాసు మహాత్మ్యం శృణుయాన్మము!!*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, హేమంత ఋతువు,
మృగశిర మాసం
తిథి: శుక్ల-అష్టమి 19:14:50 వరకు 
తదుపరి శుక్ల-నవమి
నక్షత్రం: పూర్వాభద్రపద 22:33:24 
వరకు తదుపరి ఉత్తరాభద్రపద
యోగం: వజ్ర 06:54:40 వరకు 
తదుపరి సిధ్ధి  
కరణం: విష్టి 07:05:57 వరకు
వర్జ్యం: 04:23:44 - 06:02:40
దుర్ముహూర్తం: 08:04:44 - 08:49:11
రాహు కాలం: 09:22:32 - 10:45:53
గుళిక కాలం: 06:35:50 - 07:59:11
యమ గండం: 13:32:35 - 14:55:56  
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:31
అమృత కాలం: 14:17:20 - 15:56:16
సూర్యోదయం: 06:35:50
సూర్యాస్తమయం: 17:42:39
వైదిక సూర్యోదయం: 06:39:43
వైదిక సూర్యాస్తమయం: 17:38:45
చంద్రోదయం: 12:44:37
చంద్రాస్తమయం: 00:49:24
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: కుంభం
కాలదండ యోగం - మృత్యు భయం 
22:33:24 వరకు తదుపరి ధూమ్ర యోగం - 
కార్య భంగం, సొమ్ము నష్టం 
పండుగలు : మాస దుర్గాష్టమి,
Masik Durgashtami
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కాలభైరవ అష్టమి శుభాకాంక్షలు 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. కాలభైరవస్వామి అలా ఆవిర్భవించాడు? 🍀*

*కాలభైరవ స్వామి.. ఆయన దిగంబరంగా దర్శన మిస్తారు. దిగంబరంగా అంటే సత్యం ధర్మం.*

*ప్రాచీనకాలం నాటి శైవక్షేత్రాలకి వెళితే అక్కడ తప్పనిసరిగా కన్పించే దర్శనం ఇచ్చే స్వరూపం భైరవ. మనలో ఉన్న భయాన్ని బాధలను పోగిట్టెలా, మనలో దాగిఉన్న శక్తి ని మేలుకొలిపేలా ఆయన రూపం వుంటుంది. కాశీ క్షేత్రపాలకుడిగానే కాకుండా అనేక క్షేత్రాల్లో ఆయన క్షేత్ర పాలకుడిగా ఆ క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటారు. అసితాంగ భైరవుడు .. రురు భైరవుడు .. చండ భైరవుడు .. క్రోధ భైరవుడు .. ఉన్మత్త భైరవుడు .. కపాల భైరవుడు .. భీషణ భైరవుడు .. సంహార భైరవుడు .. అనే ఎనిమిది నామాలతో ... వివిధ ముద్రలతో భైరవుడు దర్శనమిస్తూ వుంటాడు.*

*భైరవ అనే పేరే ఆయనలోని అపారమైన శక్తిని ఆవిష్కరిస్తున్నట్టుగా వుంటుంది. ఆయా క్షేత్రాలకి భైరవుడు పాలకుడని తెలిసినప్పుడు ... శునకాన్ని వాహనంగా కలిగిన ఆయన రూపాన్ని చూసినప్పుడు ఆయన గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలగకపోదు. కాలభైరవుడు శివుడు నుంచి ఆవిర్భవించిన రుద్రాంశ సంభూతుడు.*

*శివ ఉవాచ!! "నాకు సతీ వియోగం అయినప్పుడు నా దుఃఖాన్ని నిలువరించాడానికి నేనే కాలభైరవ అశ్రయించాను. భైరవున్ని స్మరిస్తే నన్ను పుజించినట్లే" అని సాక్షాత్తు శివుడే స్వయంగా తెలియజేస్తారు. కాశీ ఖండంలో.. అనుచితంగా గర్వంతో వ్యవహరించిన బ్రహ్మదేవుడి కి గర్వభంగం చేసి, పంచమ శిరస్సును ఖండిస్తాడు భైరవస్వరూపంతో..*

*మహా పరాక్రమవంతుడైన రుద్రాంశ సంభూతుడు భైరవుడు క్షణమైనా ఆలస్యం చేయకుండా బ్రహ్మదేవుడికి గల అయిదు శిరస్సుల్లో, ఏ శిరస్సు అయితే శివుడిని అవమానపరుస్తూ గర్వంతో మాట్లాడిందో ఆ శిరస్సును ఖండించి వేస్తాడు. ఆ తరువాత ధర్మ స్థాపన కోసం, బ్రహ్మహత్యాపాతకం నుంచి బయటపడటానికి తాను ఖండించినటు వంటి బ్రహ్మదేవుడి యొక్క కపాలంతో అనేక లోకాలు దర్శిస్తూ.. భూలోకం కాశీ క్షేత్రం అడుగిడగానే భైరవుడి చేతిలోని బ్రహ్మదేవుడి కపాలం కిందపడిన ప్రదేశమే నేడు 'బ్రహ్మ కపాలం' గా పిలవబడుతోంది. కాశీక్షేత్రానికి భైరవుడు అక్కడ క్షేత్రపాలకుడిగా ఉండిపోతాడు. అంటే ఆయన క్షేత్రానికి ఆయనే క్షేత్ర పాలకుడు. ఆ తరువాత అనేక శైవక్షేత్రాల్లో ఆయన మూర్తిని క్షేత్రపాలక స్వామి గా ప్రతిష్ఠించారు. ఆ క్షేత్రాల్లో భైరవుడు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించబడుతూ వుంటాడు. ఈ స్వామిని ఆరాధించడం వలన దుష్ట శక్తుల నుంచి రక్షణ లభిస్తుందనీ, గ్రహ శాపాలు, శత్రు శాపాలు, రోగ బాధలు, ఈతి బాధలు, దుఃఖ దారిద్ర్యములు, తొలగి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు చేకూరుతాయని, పాడిపంటలు వృద్ధి చెందుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -289 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 16-3
 
*🍀 16-3. సమస్తమును నేనే ! - సృష్టి యందలి అన్ని వస్తువుల యందు దైవమే నిండి యున్నపుడు దైవమును చూడక, ఇతరము చూచుట అజ్ఞానము. దైవమునే చూచుట రాజవిద్య. ఎంత తెలిసిన వానికైనను ప్రకృతిచే ఆవరింపబడిన ఈశ్వరుని దర్శనము చేయుటకు దీక్ష కావలెను. ఈశ్వరు నాశ్రయించియే ప్రకృతి అనేక విధములుగ ఆవిర్భవించు చున్నది. అట్టి అనేక మందు ఏకత్వమును దర్శించుట అనుక్షణ ప్రయత్నముననే సాధ్యము. ఎందరో మునులు, ఋషులు క్రతువుల యందు, యజ్ఞముల యందు నిమగ్నమై, అచటనే తిరుగాడుచున్న కృష్ణ పరమాత్మను చూడలేకపోయిరి. 🍀*

*అహం క్రతు రహం యజ్ఞః స్వధాహ మహ మౌషధమ్ |*
*మంత్రోం హ మహమే వాణ్య మహమగ్ని రహం హుతమ్ || 16*

*తాత్పర్యము : క్రతువును నేనే. యజ్ఞమును నేనే. ఓషధులును నేనే. మంత్రము కూడ నేనే. హోమ ద్రవ్యమును నేనే. హోమమును నేనే. అందు హుతమగు ద్రవ్యము నేనే.*

*వివరణము : పురుషుడు ధరించు లుంగీ, స్త్రీ ధరించు చీరలో యున్నది పత్తియే యని గుర్తువచ్చునా? వచ్చుట లో దృష్టి, ఇట్టి లో దృష్టి లేకుండ ఎన్ని యజ్ఞములు చేసినను, యాగములు చేసినను, ఈశ్వర సాన్నిధ్యము లభింపదు. సృష్టి యందలి అన్ని వస్తువుల యందు దైవమే నిండి యున్నపుడు దైవమును చూడక, ఇతరము చూచుట అజ్ఞానము. దైవమునే చూచుట రాజవిద్య.*

*ఎంత తెలిసిన వానికైనను ప్రకృతిచే ఆవరింపబడిన ఈశ్వరుని దర్శనము చేయుటకు దీక్ష కావలెను. ఈశ్వరు నాశ్రయించియే ప్రకృతి అనేక విధములుగ ఆవిర్భవించు చున్నది. అట్టి అనేక మందు ఏకత్వమును దర్శించుట అనుక్షణ ప్రయత్నముననే సాధ్యము. ఎందరో మునులు, ఋషులు క్రతువుల యందు, యజ్ఞముల యందు నిమగ్నమై, అచటనే తిరుగాడుచున్న కృష్ణ పరమాత్మను చూడలేకపోయిరి. కారణము, క్రతు ద్రవ్యములను, మంత్రములను, స్వాహాకారములను, ఓషధులను, అగ్ని జ్వాల లను, హుతకార్యమును ఈశ్వరునిగ దర్శింపక పోవుటయే!*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 489 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 38

*🌻. వివాహ మండపము - 3 🌻*

విశ్వకర్మ కవచములతో, శ్రేష్ఠ రత్నములతో ఒప్పారు లోకపాలురను, దేవతలనందరినీ వాస్తవమేనా యున్నట్లు నిర్మించెను (22). మరియు భృగువు మొదలగు తపోనిష్ఠులగు ఋషులందరినీ, ఇతరులగు ఉపదేవతలను, సిద్ధులను బొమ్మలరూపములో ప్రదర్శించెను (23).

గరుడులను పేరుగల గణములందరితో గూడియున్న కృత్రిమ విష్ణువు నిర్మింపబడి యుండెను. ఆ బొమ్మ మహాశ్చర్యమును కలిగించెను (24). అదే విధముగా వేదములచే, ప్రజాపతులచే, మరియు సిద్ధులచే చుట్టువారబడి సూక్తములను పఠించుచున్న నాయొక్క కృత్రిమ శిల్పము కూడా అచట నిర్మింపబడి యుండెను. ఓ నారదా! అదేవిధముగా, ఐరావత గజమునధిష్ఠించి పూర్ణచంద్రుని బోలియున్న కృత్రిమ ఇంద్రుడు తన సైన్యముతో గూడి యున్నట్లు నిర్మింపబడెను. (25) 

ఓ దేవర్షీ! ఇన్ని మాటలేల? హిమవంతునిచే ప్రేరితుడైన విశ్వకర్మ దేవ సమాజమునంతనూ అచట అనతికాలములో నిర్మించెను (27). దివ్యమగు రూపము గలది, అనేకములగు అచ్చెరువులతో గూడియున్నది, చాల పెద్దది, దేవతలను కూడ మోహింప జేయునది అగు ఇట్టి మండపమును విశ్వకర్మ నిర్మించెను (28). తరువాత హిమవంతుని ఆజ్ఞచే మహాబుద్ధిశాలియగు విశ్వకర్మ, దేవతలు మొదలగు వారి నివాసము కొరకై ప్రయత్నపూర్వకముగా ఆయా లోకములను నిర్మించెను (29). 

ఆ మండపము వద్ద గొప్పగా వెలుగొందే, పరమాద్భుతములైన సుఖకరములైన, దివ్యములగు పెద్ద ఆసనములను వారికొరకు విశ్వకర్మ నిర్మించెను (30). మరియు నాతడు అద్భుతము, గొప్ప ప్రకాశముతో కూడినది అగు కృత్రిమ సత్యలోకమును స్వయంభువునగు నా నివాసము కొరకు క్షణములో నిర్మించెను (31).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 165 / Viveka Chudamani - 165 🌹*
*✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -12 🍀*

*539. ఆత్మను తెలుసుకొన్న వారు ఎలాంటి బాహ్య దుస్తులను ధరించరు. వారు బాహ్య వస్తువులకు అతీతముగా తమ శరీరమునకు ఎట్టి గుర్తింపుతో పనిలేకుండా ఉంటారు. బాహ్య వస్తు సముదాయములను వారు కోరకుండా ఎవరైన ఇచ్చినపుడు వాటిని తమ అవసరాలకు మాత్రమే చిన్న పిల్లల వలె వాడుకుంటారు. పిల్లలు వస్తువులతో ఆడుకున్న తరువాత వాటిని వదలివేసి వాటిని గూర్చి మరచిపోతారు. అలానే జ్ఞానులు జీవిస్తారు.*

*540. అంతరిక్ష సంబంధమైన జ్ఞాన ప్రపంచములో స్థిరపడి ఆత్మను తెలుసుకొన్న వాడు కొన్ని సార్లు పిచ్చివానిగా, కొన్ని సార్లు చిన్న పిల్ల వానిగా, మరికొన్ని సార్లు దయ్యాల్లాగా ఎలాంటి దుస్తులు లేకుండా, శరీరాన్ని నగ్నముగా ఉంచుకొని మరికొన్ని సార్లు దుస్తులు ధరించి, మరికొన్ని సార్లు చెట్ల ఆకులతో ఇలా తన ఇష్టం వచ్చినట్లు బాహ్యముగా కనబడుతూ, అంతరములో బ్రహ్మానంద స్థితిలో ఓలలాడుతుంటారు.*

*541. సాధువు ఒంటరిగా జీవిస్తూ, ప్రాపంచిక వస్తు 
సముదాయమును ఏవిధమైన కోరిక, ఆపేక్ష లేకుండా అనుభవిస్తుంటారు. ఎల్లపుడు తన ఆత్మలోనే, ఆత్మతోనే ఉంటూ అన్నింటిలో తానే అయి జీవిస్తాడు.*

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 165 🌹*
*✍️ Sri Adi Shankaracharya*
*Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*

*🌻 32. I am the one who knows Brahman -12🌻*

*539. The knower of the Atman, who wears no outward mark and is unattached to external things, rests on this body without identification, and experiences all sorts of sense-objects as they come, through others’ wish, like a child.*

*540. Established in the ethereal plane of Absolute Knowledge, he wanders in the world, sometimes like a madman, sometimes like a child and at other times like a ghoul, having no other clothes on his person except the quarters, or sometimes wearing clothes, or perhaps skins at other times.*

*541. The sage, living alone, enjoys the sense-objects, being the very embodiment of desirelessness – always satisfied with his own Self, and himself present at the All.*

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 VIVEKA CHUDAMANI - 165 🌹*
*✍️ Sri Adi Shankaracharya*
*Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*

*🌻 32. I am the one who knows Brahman -12🌻*

*539. The knower of the Atman, who wears no outward mark and is unattached to external things, rests on this body without identification, and experiences all sorts of sense-objects as they come, through others’ wish, like a child.*

*540. Established in the ethereal plane of Absolute Knowledge, he wanders in the world, sometimes like a madman, sometimes like a child and at other times like a ghoul, having no other clothes on his person except the quarters, or sometimes wearing clothes, or perhaps skins at other times.*

*541. The sage, living alone, enjoys the sense-objects, being the very embodiment of desirelessness – always satisfied with his own Self, and himself present at the All.*

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 117 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*సంకలనము : వేణుమాధవ్*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. లోకోద్ధరణము- లోక కల్యాణము - 2 🌻*

*లోకమంతా విష్ణుమయం. లోకంలోని వ్యక్తుల స్వభావాలనే అలల ఆటు, పోటుల వెనుక నేపథ్యంగా ఉన్నది అంతర్యామి చైతన్యమనే మహా సాగరము. ఇది అవ్యక్తము‌ ఈ సాగరమే వాసుదేవుడు. ఈ సాగరాన్ని దర్శించి, జీవుల రూపంలోని వాసుదేవుని సేవకై కడంగి ఆనందించుటే మన కర్తవ్యము.*

*దీన్ని ఆచరించే వాని మనస్సులో వాసుదేవుడు అను ముద్ర ఒకటే ఉంటుంది. ఇదియే ప్రభుముద్ర. ఆంజనేయుని వలె ఈ ముద్ర ధరించినవారు సంసార సముద్రాన్ని తరిస్తారు. జీవుల స్వభావాలను గూర్చి వీరికి ఎట్టి ముద్ర ఉండదు. ఆయా వ్యక్తుల కష్టాలు, ఆపదలు, రోగాలు వీరికి గుర్తుంటాయి. జీవుల ఆనందానికి, శాంతికి, ఆరోగ్యానికి తమ వంతు సేవ చేస్తారు. లోకకళ్యాణము కొరకు తమ వంతు కర్తవ్యాన్ని అనుష్ఠిస్తారు.*

....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 106 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 106. THE UNPLANNED LIFE 🍀*

*🕉 There is no planning in existence. An unplanned life has tremendous beauty, because there is always some surprise waiting in the future. 🕉*
 
*The future is not just going to be a repetition; something new is always happening, and one can never take it for granted. Secure people live a bourgeois life. A bourgeois life means getting up at seven-thirty, taking your breakfast at eight, at eight-thirty catching the train to the town, returning home at five-thirty, taking your tea, reading your newspaper, watching TV, having supper, making love to your partner without any love, and going to bed. Again the same thing starts the next day.*

*Everything is settled, and there is no surprise: The future will be nothing but the past repeated again and again. Naturally there is no fear. You have done these things so many times that you have become skillful. You can do them again. With the new comes fear, because one never knows whether one will be able to do it. One is doing always for the first time, so one is always shaky, uncertain about whether one is going to make it or not. But in that very thrill, in that adventure, is life-aliveness, let us say, rather than life, because life has also become a dull and dead wordaliveness, the flow.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 165 / Sri Lalita Sahasranamavali - Meaning - 165 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 165. ధర్మాధారా, ధనాధ్యక్షా, ధనధాన్య వివర్ధినీ ।*
*విప్రప్రియా, విప్రరూపా, విశ్వభ్రమణ కారిణీ ॥ 165 ॥ 🍀*

🍀 881. ధర్మాధారా : 
ధర్మమునకు ఆధారభూతమైనది

🍀 882. ధనాధ్యక్షా : 
సర్వసంపదలకు అధికారిణి

🍀 883. ధనధాన్యవివర్ధినీ : 
ధనము, ధాన్యము వర్ధిల్లచేయునది

🍀 884. విప్రప్రియా : 
వేదాధ్యయన సంపన్నులైన వారియందు ప్రీతి కలిగినది

🍀 885. విప్రరూప : 
వేదవిదులైనవారి యెందు ఉండునది

🍀 886. విశ్వభ్రమణకారిణీ : 
విశ్వమును నడిపించునది

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 165 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 165. Dharmadhara dhanadhyaksha dhanadhanya vivardhini*
*Viprapriya viprarupa vishvabhramanakarini ॥ 165 ॥ 🌻*

🌻 881 ) Dharma dhara -   
She who is the basis of Dharma-the rightful action

🌻 882 ) Dhanadyaksha -   
She who presides over wealth

🌻 883 ) Dhanadhanya vivardhani -   
She who makes wealth and grain to grow

🌻 884 ) Vipra priya -   
She who likes those who learn Vedas

🌻 885 ) Vipra roopa -   
She who is the learner of Vedas

🌻 886 ) Viswa brhamana karini -   
She who makes the universe to rotate

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామములు #LalithaSahasranam
 #PrasadBhardwaj 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ https://mymandir.page.link/wdh7G
https://t.me/ChaitanyaVijnanam 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

SURRENDER

 


🌹 SURRENDER 🌹

📚. Prasad Bharadwaj

Be willing to accept that things were supposed to happen the way they did, whether or not you can understand why.

You may be aching over the intricate details, fighting against the pain and devastation it has caused you. If you keep battling with reality, you'll always end up losing. Let go of your attachment to what you think should have happened, and surrender to what is right now.

You may not know where you're heading, but trust that you're being guided towards a place that serves you well.

🌹🌹🌹🌹🌹


10 Dec 2021

LOVE



God said to the Sun" I exist ", The Sun Said: “Yes I exist"

God Said to the Sea; " I am", The sea said: "Yes I am"

God said to the bird: "I am" The bird Agreed: "yes I am"

God Said to the Beast: " I am ", The beast Agreed: "yes I am"

God said to the man: "I am" ... The man exclaimed:" Please explain!" ...

And then man created a huge din, noise and destruction, constantly affirming and negating who God is!

Then God sent, a God-realised master and he came and said to the clueless man, "I love you, will you love me?"

Experiencing the soothing love the weary man said:" Yes I love you, will you love me for ever ?"

The guru smiled and said:"In Love, do you see that I and you are one?"

"Yes yes" The relieved man said.

Lovingly the guru said:

"Do you see that I love God?

'In love', do you see that I and God are one?

Do you see that there is only love? And only Love exists?

Love is what 'I AM' "




Good morning friends, have a fabulous day, much love and joy to all..

Jyothirmayi