6-APRIL-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 181🌹  
2) 🌹. శివ మహా పురాణము - 381🌹 
3) 🌹 Light On The Path - 130🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -9 🌹
5) 🌹 Seeds Of Consciousness - 328🌹   
6) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 203🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 58 / Lalitha Sahasra Namavali - 58🌹 
8) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 58 / Sri Vishnu Sahasranama - 58🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -181 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 22

*🍀 22. ఆత్మరతి - నిశ్చలస్థితి స్థితి యందు స్థిరపడునటు వంటి యోగిని ఎంతటి దుఃఖమైనను విచలనము కలిగించలేదు. చిత్తము ఇంద్రియ ప్రవృత్తులనుండి నిరోధింపబడి, నేను అను వెలుగును అంతర్ముఖముగ దర్శించుచు, ఆ వెలుగునందు రమించుచు, స్థిరముగ నిలచి, ఆద్యంతములు లేని నిష్కారణమగు సుఖము అనుభవించుట నేర్చినపుడు, ఇక యితర విషయము లందు ఆసక్తిగొనుట కష్టము. అంతరానందము వృద్ధి కలిగిన యోగికి ఇతరమగు విషయము లేవియు తత్తుల్యమగు ఆనందమును కలిగించలేవు. అంతకు మించిన ఆనందము ఉన్నదని చెప్పినను అతడు విశ్వసింపడు. ఆత్మరతి కన్న ఆనందము కలిగించు విషయ మేముండ గలదు? 🍀*

లబ్ద్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః |
యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే || 22

పై విధముగ నిశ్చలస్థితి యందు నిలచి 'నేను-తాను' అను వెలుగును దర్శించు యోగికి కలుగు ఆత్యంతికమగు సుఖమును మించిన సుఖము మరియొకటి యుండదు. అట్టి స్థితియందు స్థిరపడునటు వంటి యోగిని ఎంతటి దుఃఖమైనను విచలనము కలిగించలేదు. చిత్తము ఇంద్రియ ప్రవృత్తులనుండి నిరోధింపబడి, నేను అను వెలుగును అంతర్ముఖముగ దర్శించుచు, ఆ వెలుగునందు రమించుచు, స్థిరముగ నిలచి, ఆద్యంతములు లేని నిష్కారణమగు సుఖము అనుభవించుట నేర్చినపుడు, ఇక యితర విషయము లందు ఆసక్తిగొనుట కష్టము. అట్లని యోగికి అనాసక్తి యుండదు. 

బాహ్యమున కర్తవ్యమును నిర్వర్తించుచు, విరామము చిక్కు నపుడెల్ల అంతర్ముఖుడై, అంతరానందము చెందుచు నుండును. అంతరానందము వృద్ధి కలిగిన యోగికి ఇతరమగు విషయము లేవియు తత్తుల్యమగు ఆనందమును కలిగించలేవు. అంతకు మించిన ఆనందము ఉన్నదని చెప్పినను అతడు విశ్వసింపడు. ఆత్మరతి కన్న ఆనందము కలిగించు విషయ మేముండ గలదు? కావున ఇతర సుఖములుగాని, దుఃఖములుగాని అతని స్థిర చిత్తమునకు చికాకు కలిగింపలేవు. 

సనక సనందనాదులు, నారదుడు, ప్రహ్లాద అంబరీషులు, బృందావనమందలి గోపికలు ఇట్టి ఆనందమునే రుచి చూచిరి. వారికి త్రిభువనములు కన్న ఆత్మరతియే ఆనందదాయకము. ఈ రుచులు గొన్న బలిచక్రవర్తి తన సమస్తమును, తనను దైవదత్తము గావించి బ్రహ్మానందమున నిలచెను. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 381🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 14

*🌻. వజ్రాంగుడు - 1 🌻*

నారుదుడిట్లు పలికెను-

హే విష్ణు శిష్యా! నీవు శివ భక్తులలో శ్రేష్ఠుడవు హే విధీ! నీవు ఈ శివాశివుల పరమచరితమును చక్కగా వివరించితివి. (1) హే. బ్రహ్మన్‌! దేవతలను తీవ్రముగా పీడించిన తారకాసురుడెవ్వరు? అతడెవని కుమారుడు? శివునిచుట్టూ తిరిగే ఆ గాథము చెప్పుము (2) ఆ జితేంద్రియుడగు శంకరుడు మన్మథుని భస్మము చేసిన విధమెట్టిది పరమేశ్వరుని ఆ అద్భుతగాథను గూడ మిక్కిలి ప్రీతితో చెప్పుము. (3) జగత్స్వరూపిణి, ఆదిశక్తి యగు శివాదేవి శంభుని భర్తగా పొంది ఆ నందించుట కొరకై మిక్కిలి తీవ్రముగు తపస్సును చేసిన విధం బెయ్యది? (4) హే మహాప్రాజ్ఞా! శివభక్తుడను, నీ పుత్రుడను, శ్రద్ధ గలవాడను అగు నాకు ఈ గాథనంతనూ వివరించి చెప్పుము(5).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ దేవర్షీ! నీవు నా కుమారులలో శ్రేష్ఠుడవు. మహాజ్ఞానివి. నీ భక్తి ముల్లోకములలో ప్రసిద్ది గాంచినది. నేను శంకరుని స్మరించి ఆయన చరితమునంతనూ చెప్పెదను వినుము. (6) ఓ నారదా! ముందుగా తారకుని జన్మ వృత్తాంతమును వినుము. తారకుని వధ కొరకై దేవతలు శివుని ఆశ్రయించి గొప్ప యత్నమును చేసిరి. (7) నా మానస పుత్రుడు మరీచి. అతని కుమారుడు కశ్యపుడు. అతడు దక్షుని పదముగ్గురు కుమార్తెలను వివాహమాడెను. (8) వారిలో దితి పెద్ద భార్య. ఆమెకు ఇద్దరు కుమారులు గలరు. వారిలో హిరణ్య కశిపుడు జ్యేష్ఠుడు. వాని తమ్ముడు హిరణ్యాక్షుడు(9).

దేవతలకు మిక్కిలి దుఃఖమును కలిగించిన ఆ రాక్షసులనిద్దరినీ విష్ణువు క్రమముగా నృసింహవరాహ రూపములతో సంహరించెను. అపుడు దేవతలు భయమును వీడి సుఖించిరి. (10) . దితి దుఃఖితురాలై కశ్యపుని శరణు పొందెను. ఆమె ఆయనను మరల భక్తితో చక్కగా సేవించెను. గొప్ప దీక్ష గల ఆమె గర్భమును ధరించెను. (11). ఆ విషయమునెరింగి గొప్ప యత్నశీలుడగు మహేంద్రుడు దోషమును కనిపెట్టి, ఆమె యందు ప్రవేశించి వజ్రముతో పలుమార్లు ఆమె గర్భమును భేదించెను. (12). ఆమె వ్రతమహిమచే నిద్రించుచున్న ఆమె గర్భము మరణించలేదు. దైవాను గ్రహముచే ఆమెకు నలుభై తొమ్మిది మంది కుమారులు పుట్టిరి.(13).

మరుత్తులను పేరుగల ఆ కుమారులందరు దేవతలై స్వర్గమును పొందిరి. ఆపుడు దేవరాజగు ఇంద్రుడు వారిని తన వారినిగా చేసుకొనెను. (14). దితి తాను చేసిన దోషమునకు పరితపించి మరల భర్త వద్దకు వెళ్లి గొప్ప సేవను చేసి, ఆ మహర్షిని మిక్కిలి ప్రసన్నునిగా చేసెను.(15).

కశ్యపుడిట్లు పలికెను-

నీవు శుచివై పదివేల సంవత్సరములు బ్రహ్మను గురించి తపస్సును చేయుము. నీ వ్రతము పూర్ణము కాగలగినచో, నీకు అపుడు కుమారుడు జన్మించగలడు (16). ఓ మహర్షీ! దితి అటులనే పూర్ణమగు తపస్సును శ్రద్ధతో చేసెను. తరువాత ఆమె భర్తనుండి గర్భమును పొంది గొప్ప కుమారుని గనెను(17). దేవతలతో సమానుడగు ఆ దితి పుత్రుడు వజ్రాంగుడను పేరు గల వాడాయెను. అతడు పేరుకు తగ్గ దేహము గలవాడు, వీరుడు, గొప్ప పరాక్రమశాలి, మరియు పుట్టిన నాటినుండియూ బలశాలి (18). ఆ దితి పుత్రుడు తల్లి ఆజ్ఞచే వెను వెంటనే ఇంద్రుని, కొందరు దేవతలను కూడ బలాత్కారముగా తీసుకొని వచ్చి అనేక విధములుగా దండించెను(19).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 LIGHT ON THE PATH - 130 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 10 - THE Note on 20th RULE
*🌻 20. Do not condemn the man that yields - 2 🌻*

491. A.B. – When we look up to the region of atma and worship the light within, we shall see the light as it grows stronger. When you first see that light you get a touch of consciousness by which you see the darkness in which it burns; the contrast shows it to you. It is then that darkness within that will help you to understand the helplessness of those who have seen no light. It is for them that real compassion is necessary. 

There is no need to feel suffering for people after they know that there is light. Compassion is needed for those who do not know that they are in darkness, but are immersed in trivial things, and yet think themselves wise. Their darkness is so great that they really do not know what causes them so much suffering. They are the people to whom the Great Ones send compassion.

492. Those who have seen even a little light are making progress in things of which men in the world have not caught a glimpse. When once the light is seen this kind of compassion is not wanted. If such a man is seen to be suffering, it is recognized that he is breaking down the wall quickly, and that it is good for him that he is able to do it.

493. C.W.L. – When we begin to have knowledge of the existence of the soul, we realize a great fact of which the vast majority of mankind knows nothing. Most people – even so-called religious people – have no certainty of the existence of the soul. Most of them are living entirely with a view to this world. They may hold a theoretical belief in the immortality of the soul, but the things of the world are more important to them and their lives are only in comparatively few cases guided by this belief.

494. That the “star of the soul” may show itself we must first be sure of the existence of the soul, we must know it as within ourselves. When we have set our affections on things above, when we know certain truths within ourselves and nothing can shake their reality for us, the star is beginning to show its light – there is a faint reflection of it. By that tiny gleam we see how densely ignorant we have been and still are; that is the first feeling we get when we gain a little more knowledge.

495. “The first great battle” is the battle with the senses. In his steady fight against them the man has arrayed himself against his lower nature, and has won through. When the gleam of light comes we see how dark the way has been, how all our actions, and even our affections, have been without that direction which makes them real. The little light makes all seem hopelessly wrong; it makes us feel helpless, but we must not be appalled by the sight.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 9 🌹*
✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : పవన్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌸. మహాపూర్ణవాణి 🌸*

అనుష్ఠానం అంటే,‌ ఒక నియమిత‌ సమయంలో జపమాల‌ త్రిప్పుతూ జపం చేయటం మాత్రమే అని పొరపడి, దానితో‌ మాత్రమే తృప్తి పడబోకు. ఈ అనుష్ఠానం నీ నిత్యజీవితంలో భాగమై విలీనమైపోవాలి. 

అనుష్ఠాన సమయంలో నీకు కలిగే పవిత్ర భావములూ, నీవు జపించే మంత్రం యొక్క అర్థంలోని పవిత్రతా నీవు లోకులతో వ్యవహరించేటప్పుడు ఆచరణలో కనిపించాలి. అదే సరియైన అనుష్ఠానం.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్‌ఇకెసందేశములు
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Seeds Of Consciousness - 328 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 177. It is the 'I am' that investigates the 'I am'. Realizing its falsehood it disappears and merges into Eternity..🌻*

In this very moment as you are reading through these lines, or as you ponder over them, who is it that is doing so? It is the knowledge 'I am' investigating the 'I am'. All this that you are doing has the 'I am' in the background. 

The 'I am' is the driving force behind this entire undertaking; it desperately wants to know what it is. As the understanding grows and it realizes its falsehood, it disappears. This done, there is nothing more left to do, you are then in Eternity.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #SeedsofConsciousness #Nisargadatta
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 203 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. సమీక్ష - 1 🌻*

751. ఆత్మలన్నియు ఆ పరమాత్మలో ఉండెను, ఉన్నవి, ఉండును.

752. ఆత్మలన్నియు ఒకటే.అన్ని ఆత్మలు ఒక్కటే. 

753. ఆత్మలన్నియు అనంతమైనవి. శాశ్వతమైనవి.నిరాకారమైనవి.

754. ఆత్మలన్నియు వాటి జీవనములో ఉనికిలో ఒకటిగనే యున్నవి. కాని అత్మలలో వ్యత్యాసములేదు.

755. కానీ -- ఆత్మలయొక్క చైతన్యములో,
ప్రపంచనుభావములో, భూమికలలో,
బంధములలో, స్థితిలో, తాదాత్మ్యతలో మాత్రము వ్యత్యాసములున్నవి. ఈ వ్యత్యాసములు గల ఆత్మలన్నియు పరమాత్మలోనే యున్నవి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
Join and share
🌹 Meher Baba అవతార్‌ మెహర్‌ బాబా 🌹
www.facebook.com/groups/avataarmeherbaba/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 58 / Sri Lalita Sahasranamavali - Meaning - 58 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 58. చతుఃషష్ట్యుపచారాఢ్యా, చతుష్షష్టి కళామయీ ।*
*మహా చతుష్షష్టి కోటి యోగినీ గణసేవితా ॥ 58 ॥ 🍀*

🍀 235. చతుష్షష్ట్యుపచారాఢ్యా - 
అరువది నాలుగు ఉపచారములతో సేవింపబడునది.

🍀 236. చతుష్షష్టి కళామయీ - 
అరువది నాలుగు కళలు గలది.

🍀 237. మహాచతుష్షష్టి కోటియోగినీ గణసేవితా - 
గొప్పదైన అరువది కోట్ల యోగినీ బృందముచే సేవింపబడునది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 58 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 58. catuḥṣaṣṭyupacārāḍhyā catuḥṣaṣṭikalāmayī |*
*mahācatuḥ-ṣaṣṭikoṭi-yoginī-gaṇasevitā || 58 || 🌻*

🌻 235 ) Chatustatyupacharadya -   
She who should be worshipped with sixty four offerings

🌻 236 ) Chathu sashti kala mayi -   
She who has sixty four sections

🌻 237 ) Maha Chathusashti kodi yogini gana sevitha -   
She who is being worshipped by the sixty four crore yoginis in the nine different charkas.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 58 / Sri Vishnu Sahasra Namavali - 58 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*🌻. 58. మహావరాహో గోవిన్దః సుషేణః కానాకాంగదీ|*
*గుహ్యోగభీరో గహనో గుప్తశ్చక్ర గదాధరః|| 58 🌻*

స్వాతి నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం     

🍀 538) మహావరాహ: - 
మహిమగల వరాహమూర్తి.

🍀 539) గోవింద: - 
గోవులకు ఆనందాన్నిచ్చువాడు. భూమికి ఆధార భూతమైనవాడు.

🍀 540) సుషేణ: - 
శోభనమైన సేన గలవాడు.

🍀 541) కనకాంగదీ - 
సువర్ణమయములైన భుజకీర్తులు కలవాడు.

🍀 542) గుహ్య: - 
హృదయగుహలో దర్శించదగినవాడు.

🍀 543) గభీర: - 
జ్ఞానము, ఐశ్వర్యము, బలము, వీర్యము మొదలగువానిచే 
గంభీరముగా నుండువాడు.

🍀 544) గహన: - 
సులభముగా గ్రహించుటకు వీలుకానివాడు.

🍀 545) గుప్త: - 
నిగూఢమైన ఉనికి గలవాడు.

🍀 546) చక్రగదాధర: - 
సుదర్శనమను చక్రమును, కౌమోదకీయను గదను ధరించినవాడు.

*🌹 Vishnu Sahasra Namavali - 58 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*
*Sloka for Swathi 2nd Padam*

*🌻 58. mahāvarāhō gōvindaḥ suṣeṇaḥ kanakāṅgadī |*
*guhyō gabhīrō gahanō guptaścakragadādharaḥ || 58 || 🌻*

🌻 538. Mahā-varāhaḥ: 
The great Cosmic Boar.

🌻 539. Gōvindaḥ: '
Go' means Words, that is the Vedic sentences. He who is known by them is Gōvindaḥ.

🌻 540. Suṣeṇaḥ: 
One who has got about Him an armed guard in the shape of His eternal associates.

🌻 541. Kanakāṅgadī: 
One who has Angadas (armlets) made of gold.

🌻 542. Guhyaḥ: 
One who is to be known by the Guhya or the esoteric knowledge conveyed by the Upanishads. Or one who is hidden in the Guha or heart.

🌻 543. Gabhīraḥ: 
One who is of profound majesty because of attributes like omniscience, lordliness, strength, prowess, etc.

🌻 544. Gahanaḥ: 
One who could be entered into only with great difficulty. One who is the witness of the three states of waking, dreams and sleep as also their absence.

🌻 545. Guptaḥ: 
One who is not an object of words, thought, etc.

🌻 546. Chakra-gadā-dharaḥ: 
One who has discus and Gada in hand.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment