28-MAY-2021 MESSAGES
శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 270 / Sri Lalitha Chaitanya Vijnanam - 270
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 270 / Sri Lalitha Chaitanya Vijnanam - 270 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 64. సంహారిణీ, రుద్రరూపా, తిరోధానకరీశ్వరీ ।
సదాశివానుగ్రహదా, పంచకృత్య పరాయణా ॥ 64 ॥ 🍀
🌻270. 'తిరోధానకరి' 🌻
బ్రహ్మ దుఃఖమును పోగొట్టుటకై ఫాల భాగమునుండి రుద్రుడుదయించి ఏకాదశ రుద్రులుగ మారి చీకటులను తొలగించి అంతరిక్షము నేర్పరచెను. అవరోధము లేని శక్తి రుద్ర శక్తి. అట్టి శక్తి రూపమును దాల్చునది శ్రీమాతయే. సృష్టి యందు అవరోధము లేర్పడినప్పుడు, అసుర శక్తులు విజృంభించినపుడు, పెనుమార్పులు అవసరమైనపుడు శ్రీమాతయే రుద్రరూపమును దాల్చి కావ్యములను చక్కబెట్టును.
సృష్టిని తనలోనికి లయము చేసుకొనుట తిరోధానము. ఇట్టి తిరోధానమునకు రౌద్రము, రుద్ర రూపము అవసరము. అట్టి రూపమును ధరించి ప్రళయకాల రుద్రుని వలె సృష్టిని ప్రళయములోనికి నడుపునది శ్రీదేవి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 270 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🍀 64. saṁhāriṇī rudrarūpā tirodhāna-karīśvarī |
sadāśivā'nugrahadā pañcakṛtya-parāyaṇā || 64 || 🍀
🌻 Tirodhānakarī तिरोधानकरी (270)🌻
She causes annihilation and makes the universe disappear. Tirodhāna is the fourth act of the Brahman, which is called the great dissolution or the pralaya. Why this dissolution is necessary when every living being is subjected to death? The presence of ego makes a man live, as ego is a part of antaḥkaraṇa (mind, consciousness, intellect and ego). Without ego the man cannot exist.
The ego is present in the soul and not in the physical body. The presence of ego in the soul hides the Brahman from realization. The souls never get destroyed and subject to their karmic account either they are re-born or merge with the Brahman. The law of karma says that a soul can have only three solutions. One is to merge with the Brahman, second is to reborn and the third is to get dissolved during the great dissolution. A majority of the souls are re-reborn.
To remove the evil effects of ego in the souls, the great dissolution takes place. Such great dissolutions take place after billions of years. The soul can be destroyed only by the Supreme Brahman. The Supreme Brahman simply acts as a witness and does not get involved in the actions associated with the souls. At one point of time, He wakes up and causes the great dissolution by taking back all the atoms of the universe.
The great dissolution happens when lesser number of souls merges with the Brahman and more souls are reborn. Such a situation arises, only when more sins are committed. In fact the great dissolution means the total destruction of ego from the universe. Not even a single life exists after the great dissolution. The Brahman draws the entire universe unto him and at the time of recreation, this takes the shape of the golden egg or hiraṇyagarbha.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
27 May 2021
నిర్మల ధ్యానాలు - ఓషో - 22
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 22 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. జీవితం మనకు యివ్వబడింది. మనమేమీ కాము, అంతా దైవమే. 🍀
మనం మొదట గుర్తించాల్సిన విషయం జీవితం మనకు యివ్వబడింది. అది మనం సాధించింది కాదు. నిజం చెప్పాలంటే మనకు ఆ అర్హత లేదనుకోండి. ఉనికిని సంబంధించిన బలమైన నియమమున్నది దానికి అర్హత వున్న వాళ్ళ పట్ల వుంటుంది. ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక బుద్ధుడు, అక్కడ జీవితం నించీ అదృశ్యం కావడమన్నది వుంటుంది. అర్హత లేని వాళ్ళు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ వుంటారు.
ఒకసారి నీకు అర్హత కలిగితే నువ్వు అనంతం కేసి అదృశ్యమవుతావు. నీకు అర్హత లేకుంటే తిరిగి వెనక్కి వస్తావు. గుర్తుంచుకోవాల్సిన రెండో విషయం చైతన్యానికి సంబంధించిన శక్తి. అది నీకు సంబంధించింది కాదు. దేవుడి నించీ నిరంతరం నీలోకి ప్రవహించేది. నువ్వు అతన్ని అనుక్షణం శ్వాసిస్తున్నావు. ఆ స్పృహ లేకుండా అంటే ఆ విషయం నీకు తెలీకుండానే అనుకో.
నువ్వు చైతన్యంతో వున్న క్షణం ఆశ్చర్యపోతావు. మనం దేవుణ్ణి తింటాం, దేవుణ్ణి శ్వాసిస్తాం. అక్కడ దైవం తప్ప ఎవరూ వుండరు. ఆయన మన సంపద. ఆయన మన పునాది. ఆయన మన పునాది. ఆయన మనలో చివురించే కొమ్మ, ఆయనే చివుళ్ళు, ఆయనే పూలు, పళ్ళు అన్నీ ఆయనే, మనమేమీ కాం.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
27 May 2021
వివేక చూడామణి - 79 / Viveka Chudamani - 79
🌹. వివేక చూడామణి - 79 / Viveka Chudamani - 79🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 20. శరీర బంధనాలు - 5 🍀
276. ఎపుడైతే మనస్సు క్రమముగా అంతర్గత ఆత్మపై స్థిరపడుతుందో అపుడు తదనుగుణంగా బాహ్యమైన వస్తుపరమైన కోరికలు క్రమముగా వదిలివేయబడతాయి. ఎపుడైతే బాహ్యపరమైన కోరికలు తొలగిపోతాయో అపుడు ఏవిధమైన అడ్డంకులు లేని ఆత్మ జ్ఞానము ఏర్పడుతుంది.
277. ఎపుడైతే యోగి మనస్సు ఆత్మ పై లగ్నమవుతుందో, అపుడు అతని మనస్సు అంతమవుతుంది. అపుడు కోరికలు ఆగిపోవుట మొదలవుతుంది. అందువలన ఇతరమైన వస్తుభావనలు తొలగిపోతాయి.
278. తామస భావములు సత్వ, రజో గుణాల వలన నాశనం కాగా, రాజస గుణము సత్వ గుణము వలన స్వచ్ఛమైన బ్రహ్మ జ్ఞానము పొంది తొలగిపోతుంది. అందువలన సత్వ గుణమును అవలంభించుట ద్వారా బాహ్య వస్తు భావములు తొలగించుకోవాలి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 79 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 20. Bondages of Body - 5 🌻
276. As the mind becomes gradually established in the Inmost Self, it proportionately gives up the desires for external objects. And when all such desires have been eliminated, there takes place the unobstructed realisation of the Atman.
277. The Yogi’s mind dies, being constantly fixed on his own Self. Thence follows the cessation of desires. Therefore do away with thy superimposition.
278. Tamas is destroyed by both Sattva and Rajas, Rajas by Sattva, and Sattva dies when purified. Therefore do way with thy superimposition through the help of Sattva.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
27 May 2021
దేవాపి మహర్షి బోధనలు - 90
🌹. దేవాపి మహర్షి బోధనలు - 90 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 71. అసూయాగ్ని-2 🌻
అసూయ నిన్ను సూదివలె అనుశ్యుతము పొడుచుచుండును. అసూయ హృదయాన్ని దహించుచుండును. అసూయతో చేసిన సత్కార్యములు ఫలించవు. అసూయ పునాదిగా చేయు దైవారాధనము దైవము నాకర్షించలేదు.
అసూయాపరునికి సత్సంకల్పములు కలుగవు. కావున పరివర్తన యుండదు. అసూయ మనస్సును, దేహమునకు అమిత తాపము కలిగించును. అసూయ మనిషిని నిలువెల్ల విషముతో నింపును. అసూయాపరునికి సమస్తము అంధకారమే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
27 May 2021
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 404, 405 / Vishnu Sahasranama Contemplation - 404, 405
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 404 / Vishnu Sahasranama Contemplation - 404🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻404. ధర్మవిదుత్తమః, धर्मविदुत्तमः, Dharmaviduttamaḥ🌻
ఓం ధర్మవిదుత్తమాయ నమః | ॐ धर्मविदुत्तमाय नमः | OM Dharmaviduttamāya namaḥ
ఆజ్ఞాభూతా హి యద్విష్ణోః శ్రుతయస్మృతయశ్చతత్ ।
సర్వధర్మవిదాంశ్రేష్ఠ ఇత్ ధర్మవిదుత్తమః ॥
ధర్మవేత్తలలోనెల్ల ఉత్తముడు. శ్రుతులును, స్మృతులును అన్నియును ఎవని ఆజ్ఞలుగా నున్నవో అట్టి పరమాత్మ ధర్మ్వవేత్తలందరిలో ఉత్తముడే కదా!
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 404🌹
📚. Prasad Bharadwaj
🌻404. Dharmaviduttamaḥ🌻
OM Dharmaviduttamāya namaḥ
Ājñābhūtā hi yadviṣṇoḥ śrutayasmr̥tayaścatat,
Sarvadharmavidāṃśreṣṭha it dharmaviduttamaḥ.
आज्ञाभूता हि यद्विष्णोः श्रुतयस्मृतयश्चतत् ।
सर्वधर्मविदांश्रेष्ठ इत् धर्मविदुत्तमः ॥
He whose commands are śrutis and smr̥tis is alone the greates of those who knows dharmas; hence He is Dharmaviduttamaḥ.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
रामो विरामो विरजो मार्गोनेयोनयोऽनयः ।वीरश्शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः ॥ ४३ ॥
రామో విరామో విరజో మార్గోనేయోనయోఽనయః ।వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః ॥ ౪౩ ॥
Rāmo virāmo virajo mārgoneyonayo’nayaḥ ।Vīraśśaktimatāṃ śreṣṭho dharmo dharmaviduttamaḥ ॥ 43 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 405 / Vishnu Sahasranama Contemplation - 405🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 405. వైకుంఠః, वैकुण्ठः, Vaikuṇṭhaḥ🌻
ఓం వైకుంఠాయ నమః | ॐ वैकुण्ठाय नमः | OM Vaikuṇṭhāya namaḥ
వైకుంఠః, वैकुण्ठः, Vaikuṇṭhaḥ
గతేః ప్రతిహతిః కుంఠా వివిధాం తాం కరోతి యః ।
భూతాని జగదారంభే విశ్లిష్టాని పరస్పరం ॥
సంశ్లేషయన్ గతిం తేషాం ప్రతిబధ్నాతి యత్ హరిః ।
తతస్స వైకుంఠ ఇతి ప్రోచ్యతే విబుదోత్తమైః ॥
కుంఠః అనగా నడక. వివిధా కుంఠా - వికుంఠా వివిధమగు గతిప్రతిహతి అనగా నడకలో కలుగు ఆటంకము వికుంఠా అనబడును. వివిధమగు గతిప్రతిహతిని కలిగించు విష్ణువు వైకుంఠః అనబడును. ఏలయన ఆతడు సృష్టికి ముందు విడి విడిగా నుండిన భూతములను జగత్తు సృష్టి ఆరంభమున పరస్పరము కలిపినవాడగుచు వాని స్వతంత్రగమనమును ప్రతిబంధించుచున్నాడు.
విగతా కుంఠా యస్య సః వికుంఠః, వికుంఠః ఏవ వైకుంఠః అనియు వ్యుత్పత్తి. అనగా నడకలోని ఆటంకము ఎవనినుండి తొలగినదో ఆతడు వికుంఠుడు అనదగును. అదే యర్థమున 'అణ్' ప్రత్యయము వచ్చుటచే 'వికుంఠ' శబ్దమే వైకుంఠః అగుచున్నది.
:: శ్రీమహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మపర్వణి ద్విచత్వారింశదధికత్రిశతతమోఽధ్యాయః ::
మయా సంశ్లేషితా భూమిరద్భిర్వ్యోమ చ వాయునా ।
వాయుశ్చ తేజసా సార్ధం వైకుణ్ఠత్వం తతో మమ ॥ 80 ॥
నాచే భూమిజలములతోను, ఆకాశము వాయువుతోను, వాయువు అగ్నితోను కలిపివేయబడెను. దానివలననే నాకు వైకుంఠః అను నామముతో వ్యవహారము ఏర్పడెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 405🌹
📚. Prasad Bharadwaj
🌻 405. Vaikuṇṭhaḥ🌻
OM Vaikuṇṭhāya namaḥ
Gateḥ pratihatiḥ kuṃṭhā vividhāṃ tāṃ karoti yaḥ,
Bhūtāni jagadāraṃbhe viśliṣṭāni parasparaṃ.
Saṃśleṣayan gatiṃ teṣāṃ pratibadhnāti yat hariḥ,
Tatassa vaikuṃṭha iti procyate vibudottamaiḥ.
गतेः प्रतिहतिः कुंठा विविधां तां करोति यः ।
भूतानि जगदारंभे विश्लिष्टानि परस्परं ॥
संश्लेषयन् गतिं तेषां प्रतिबध्नाति यत् हरिः ।
ततस्स वैकुंठ इति प्रोच्यते विबुदोत्तमैः ॥
Kuṇṭhaḥ / कुण्ठः means path. Vividhā kuṇṭhā - Vikuṇṭhā / विविधा कुण्ठा - विकुण्ठा The obstruction of path or natural inclinations is Vikuṇṭha. He who causes Vikuṇṭha is Vaikuṇṭhaḥ. During the creation of universe, obstructing their independent movement, He united the elements that had a tendency to get scattered at random. So, He is called Vaikuṇṭhaḥ.
Vigatā kuṇṭhā yasya saḥ vikuṇṭhaḥ, vikuṇṭhaḥ eva vaikuṇṭhaḥ / विगता कुंठा यस्य सः विकुंठः, विकुंठः एव वैकुंठः The word Vaikuṇṭhaḥ can also mean One who is without any limitation or opposing factor.
Mahābhārata Śānti Parva, Mokṣadharma Parva - Chapter 343
Mayā saṃśleṣitā bhūmiradbhirvyoma ca vāyunā,
Vāyuśca tejasā sārdhaṃ vaikuṇṭhatvaṃ tato mama. 80.
:: श्रीमहाभारते शान्तिपर्वणि मोक्षधर्मपर्वणि द्विचत्वारिंशदधिकत्रिशततमोऽध्यायः ::
मया संश्लेषिता भूमिरद्भिर्व्योम च वायुना ।
वायुश्च तेजसा सार्धं वैकुण्ठत्वं ततो मम ॥ ८० ॥
By Me was the earth united with waters, the ether with the air and air with fire. Hence being Vaikuṇṭha, the name Vaikuṇṭhaḥ pertained to Me.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः ।हिरण्यगर्भश्शत्रुघ्नोव्याप्तो वायुरधोक्षजः ॥ ४४ ॥
వైకుణ్ఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః ।హిరణ్యగర్భశ్శత్రుఘ్నోవ్యాప్తో వాయురధోక్షజః ॥ ౪౪ ॥
Vaikuṇṭhaḥ puruṣaḥ prāṇaḥ prāṇadaḥ praṇavaḥ pr̥thuḥ ।Hiraṇyagarbhaśśatrughnovyāpto vāyuradhokṣajaḥ ॥ 44 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
27 May 2021
27-MAY-2021 MESSAGES
శ్రీ లలితా సహస్ర నామములు - 80 / Sri Lalita Sahasranamavali - Meaning - 80
🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 80 / Sri Lalita Sahasranamavali - Meaning - 80 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 80. చితి, స్తత్పదలక్ష్యార్థా, చిదేక రసరూపిణీ ।
స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః ॥ 80 ॥ 🍀
🍀 362. చితిః -
కూర్పు, జ్ఞానబిందు సమీకరణ.
🍀 363. తత్పదలక్ష్యార్థా -
తత్ పదముచే నిర్దేశింపబడు లక్ష్యము యొక్క ప్రయోజనముగా నున్నది.
🍀 364. చిదేకరసరూపిణీ -
🍀 365. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః -
తనకు సంబంధించిన ఆనందముతో లేశమాత్రమైన బ్రహ్మానందము, ప్రజాపతి ఆనందము - మొదలైన ఆనందముల సమూహము గలది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 80 🌹
📚. Prasad Bharadwaj
🌻 80. citistatpada-lakṣyārthā cidekarasa-rūpiṇī |
svātmānanda-lavībhūta-brahmādyānanda-santatiḥ || 80 || 🌻
🌻 362 ) Chithi -
She who is personification of wisdom
🌻 363 ) Thatpada lakshyartha -
She who is the indicative meaning of the word “thath” which is the first word of vedic saying “that thou art”.
🌻 364 ) Chidekara swaroopini -
She who is wisdom through out
🌻 365 ) Swathmananda lavi bhootha brahmadyanantha santhathi -
She who in her ocean of wisdom makes Wisdom about Brahmam look like a wave.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
26 May 2021
మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 31
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 31 🌹
✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనం : వేణుమాధవ్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. వైశాఖ పూర్ణిమ 🌻
🌻సంవత్సరమునందు పూర్ణిమ, అమావాస్య పర్వములని పేర్కొనబడుచున్నవి. అమావాస్యనాడు చంద్రుడు సూర్యునివైపు అభిముఖుడై ఉండును. భూమిపై గల జీవులకు కనపడడు.
సాధకుని మనస్సు భౌతికకక్ష్య నుండి మరలి ఆత్మాభిముఖమై యుండుటను అమావాస్య సంకేతించును. పూర్ణిమనాడు చంద్రుడు భూమిపైకి నిండుగా అభిముఖుడై వెన్నెలలను కురిపించును.
అనగా జీవుల మనస్సు అంతర్ముఖమై తాను స్వీకరించిన ఆత్మానుభూతిని, బహిరంగ జీవితమునందు వ్యక్తము చేయుటను పౌర్ణమి సంకేతించును.
కావున పూర్ణిమ, అమావాస్యలు సాధకుడు ఉన్నత దివ్య పథమును చేరుటకు వలయు ద్వారములు. సాధకులెల్లరు పూర్ణిమనాడు ధ్యానము చేసి పరమగురువుల సాన్నిధ్యమున వారి ప్రణాళికలో భాగస్వాములగుటకు సంసిద్ధులు కావలెను.
వైశాఖ పూర్ణిమ విశిష్టమైనది, సూర్యుడు వృషభరాశి యందును, చంద్రుడు వృశ్చికరాశి యందును నెలకొని యుండగా ఈ పూర్ణిమ తటస్థించుచున్నది.
మూలాధారమందు దాగిన కామమను భౌతిక ఆకర్షణ నుండి మరలి సాధకుని మనస్సు సర్వాంతర్యామి యగు పరమేశ్వరుని యందు పొందు ఆకర్షణ అనబడు దివ్యప్రేమ యొక్క ఆవిష్కరణమును వృషభపూర్ణిమ సూచించుచున్నది.
కామము, అసూయ, కాపట్యము స్థానమున ప్రేమ, సహనము, విశ్వాసపాత్రత, సేవానిష్ఠలను వృషభపూర్ణిమా ధ్యానము మనయందు ప్రతిష్ఠించును....
🌹 🌹 🌹 🌹 🌹
26 May 2021
శ్రీ శివ మహా పురాణము - 403
🌹 . శ్రీ శివ మహా పురాణము - 403🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 21
🌻. పార్వతికి నారదుని ఉపదేశము - 2 🌻
ఈ తీరున శంభుని విరహముచే గొప్ప క్లేశమును పొందిన మనస్సు గల ఆ పార్వతి లేశమైననూ సుఖమును పొందజాలక, శివా! శివా! అని పలుకజొచ్చెను (16). వత్సా! ఆ పార్వతి తండ్రిగారి ఇంటివద్ద ఉన్ననూ, ఆమె మనస్సు శివునిపై నుండెను. ఆమె తీవ్రమగు దుఃఖము గలదై అనేక పర్యాయములు స్పృహను గోల్పోయెను (17).
దైన్యము నెరుంగని దృఢచిత్తులైన హిమవంతుడు, మేనక, మరియు మైనాకుడు హిమవత్పుత్రులందరు ఆమెను ఓదార్చిరి. కాని ఆమె శివుని మరువలేకపోయెను (18). ఓ దేవర్షీ! ఓ బుద్ధిశాలీ! అపుడు నీవు యథేచ్ఛగా సంచరించుచున్నవాడవై, ఇంద్రునిచే నియోగింపబడి హిమవత్పర్వమునకు విచ్చేసితివి (19).
అపుడు మహాత్ముడగు ఆ హిమవంతుడు నిన్ను పూజించి శ్రేష్ఠమగు ఆసనమునందు గూర్చుండబెట్టి కుశల ప్రశ్నల నడిగెను (20). పార్వతి ప్రారంభము నుండియూ శివుని సేవలో లగ్నమై యుండుట, శివుడు మన్మథుని దహించుట మొదలగు వృత్తాంతమును హిమవంతుడు ఆ తరువాత నీకు వివరించెను (21).
ఓ మహర్షీ! నీవా మాటలను విని హిమవంతునితో 'శివుని సేవింపుము' అని బోధించి, మనస్సులో శివుని స్మరిస్తూ లేచివచ్చితివి (22). ఓ మహర్షీ! లోకములకు ఉపకారమును చేయునట్టియు, శివునకు ప్రీతి పాత్రుడవైనట్టియు, జ్ఞాని యగు నీవు హిమవంతుని విడిచిపెట్టి, వెంటనే ఏకాంతములో పార్వతిని కలుసుకొంటివి (23).
జ్ఞానులందరిలో శ్రేష్ఠుడవగు నీవు పార్వతీ దేవి యొక్క హితమును గోరి ఆమెను ఆదరముతో సమీపించి సంబోధించి సత్యమును ఇట్లు పలికితివి (24).
నారదుడిట్లు పలికెను-
ఓ పార్వతీ! నా మాటము వినుము. దయామయుడనగు నేను నీకు అన్ని విధములుగా హితమును చేగూర్చునది, రాగద్వేషాది దోషములు లేనిది, కోర్కెలనీడేర్చునది అగు సత్యమును చెప్పెదను (25). దీనులను అనుగ్రహించే మహాదేవుని నీవిచట సేవించి యుంటివి. కాని నీవు తపస్సును చేయలేదు. మరియు గర్వమును కలిగియుంటివి. దానితో సర్వము ధ్వంసమాయోను (26).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
గీతోపనిషత్తు -204
🌹. గీతోపనిషత్తు -204 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 45
*🍀 44. యోగ సంసిద్ధి - యోగాభ్యాసము సాగుచుండగ జీవుని అంతఃకరణ బహిఃకరణములు పరిశుద్ధి చెందవలెను. వాని నడుమ సంయమ మేర్పడవలెను. కర్మ; కర్తవ్య కర్మమే కావలెను. కామ్యకర్మ కారాదు. కర్మలందాసక్తి జనించుట కూడ తరింప బడవలెను. అహింస, ఆస్తేయము, అపరిగ్రహము ఆదిగా గల గుణములు సహజమై యుండవలెను. దానధర్మాదులు దినచర్యలో భాగమై పోవలయును. ఇష్టాయిష్టములు కరుగవలెను. ఇత్యాది అంశములు సిద్ధించుటకు జన్మలు పట్టుటలో ఆశ్చర్యము లేదు. 🍀*
ప్రయత్నా ద్యతమానసు యోగీ సంశుద్ధ కిల్బిషః |
అనేకజన్మ సంసిద్ధ స్తతో యాతి పరాం గతిమ్ || 45
యత మానసుడై జన్మల తరబడి ప్రయత్నము చేయుచున్న యోగాభ్యాసి కిల్బిషము లన్నియు హరింపబడగ, సంశుద్ధుడై యోగ సంసిద్ధిని చెంది తరించును. శ్రీ కృష్ణుడు తెలుపుచున్న యోగవిద్య జీవులకు జన్మజన్మల అభ్యాసముగ సాగునని అంతకంతకును స్పష్టమగుచున్నది. క్రమ బద్దముగ నేర్చు యోగవిద్య సిద్ధించుటకు ఎన్ని సంవత్సరములు పట్టినను భయము లేదు. అభ్యాసము ఆరోహణ క్రమమున సాగవలెను.
యోగాభ్యాసము సాగుచుండగ జీవుని అంతఃకరణ బహిఃకరణములు పరిశుద్ధి చెందవలెను. వాని నడుమ సంయమ మేర్పడవలెను. కర్మ; కర్తవ్య కర్మమే కావలెను. కామ్యకర్మ కారాదు. కర్మలం దాసక్తి జనించుట కూడ తరింపబడవలెను. అహింస, ఆస్తేయము, అపరిగ్రహము ఆదిగా గల గుణములు సహజమై యుండవలెను. దానధర్మాదులు దినచర్యలో భాగమై పోవలయును. ఇష్టాయిష్టములు కరుగవలెను. ఇత్యాది అంశములు సిద్ధించుటకు జన్మలు పట్టుటలో ఆశ్చర్యము లేదు.
పతంజలి మహర్షి తెలిపిన యమ నియమ, ఆసన, ప్రాణాయామాది సూత్రములు, శ్రీకృష్ణ భగవానుడు తెలిపిన కర్మ జ్ఞాన సన్యాస సూత్రములు సిద్ధించుటకు కొన్ని జన్మల పరంపర సాగవచ్చును. కాని ఇవి యన్నియు యోగ మార్గమున సార్థకత నిచ్చునవి, సాఫల్యతను కలిగించునవే.
జీవుని స్వభావములో అనేకానేక జన్మ పరంపరల వాసన లుండును. అట్టి వాసన లన్నియు ఒక్కమారుగ పోవుటకు వీలు పడదు. క్రమ క్రమముగ శుభవాసన లేర్పడి అశుభ వాసనలు తొలగింపబడి జీవుడు ముందుకు సాగును. అతని యందలి భయము, కామము, క్రోధము, మోహ లోభములు, ఈర్ష్య అసూయలు, మదమాత్సర్యములు ఇత్యాది వాసనలను- యోగ సూత్రములను దీర్ఘకాలము అభ్యసించుట ద్వారా మాత్రమే నిర్మూలింప వచ్చును.
అభ్యాసము సాగుతున్నంత కాలము శుద్ధి ఏర్పడుచు నుండును. అశుద్ధి నుండి బయల్పడును. ఇట్లు సంయత్ శుద్ధిని చేరుసరికి సాధకుడు చాల దృఢచిత్తుడై తన మూలముతో యోగము చెందుటకు సంసిద్ధుడు కాగలడు. కనుక యోగము అనేక జన్మల సంసిద్ధి అని తెలియవలెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
26 May 2021
వైశాఖ పూర్ణిమ.. మహా వైశాఖి.. బుద్ధ పూర్ణమి.., కూర్మజయంతి శుభాకాంక్షలు , మీ అందరికి.
🌹. వైశాఖ పూర్ణిమ.. మహా వైశాఖి.. బుద్ధ పూర్ణమి.., కూర్మజయంతి శుభాకాంక్షలు , మీ అందరికి. 🌹
ప్రసాద్ భరధ్వాజ
వైశాఖ పూర్ణిమ.. దీనినే మహా వైశాఖి.. బుద్ధ పూర్ణమిఅని కూడా పిలుస్తారు. ఈరోజు ఆధ్యాత్మిక సాధనలు చేయడం ద్వారా అధిక ఫలితాలను పొందవచ్చని చెబుతుంటారు. ఈ రోజున గౌతమ్ బుద్దుడు జన్మించాడని.. అలాగే ఇదే రోజున జ్ఞానోదయం పొందిన రోజు అని చెబుతుంటారు. బుద్దుడు భూమండల ప్రభువైన సనత్కుమారులు, పరమ గురువుల పరంపర మధ్య వారధిగా ఉంటాడని, అందువల్లే వైశాఖ పూర్ణిమ బుద్ధ పూర్ణిమగా ప్రసిద్ధి చెందింది. భూమండల ప్రభువు ఆవాసమైన ఉత్తర హిమాలయ పుణ్య శ్రేణులలో ఉన్న శంబళ కేంద్రం నుంచి ప్రేరణ వస్తుంది. దశవతారమైన కల్కి శంబళ గ్రామం నుంచి అవతరిస్తాడని భాగవత పురాణంలో ఉంది. మే 26న బుద్ద పౌర్ణమి.
భారత దేశంలో బౌద్ధమతాన్ని స్కీకరించిన ప్రజలు తెల్లని దుస్తువులను ధరించి.. మాంసాహారం తినరు. ఈరోజున కేవలం ఖీర్ మాత్రమే తింటారు. బుద్దుడికి ఒక మహిళ ఒక గిన్నెలో పాలు మాత్రమే సమర్పించిందని చెబుతుంటారు. ఈరోజున బౌద్దులు చుట్టుపక్కల వర్గాల నుంచి పగోడాల వరకు రంగు రంగుల పల్లకిలలో ఉరేగింపులు నిర్వహిస్తారు. అలాగే బోధి చెట్టు మొదట్లో నీరు పోసి.. నైవేధ్యం సమర్పిస్తారు. అక్కడే ధ్యానం చేస్తారు. బుద్ద పూర్ణిమ సందర్భంగా బీహార్ లోని బోధ్ గయాలో ఉన్న యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన మహా బోధి ఆలయాన్ని చాలా మంది భక్తులు సందర్శిస్తారు. ఇక్కడే బుద్ధుడు జ్ఞానోదయం పొందాడని చెబుతుంటారు.
🌹 🌹 🌹 🌹 🌹
మహా పర్వదినమైనటువంటి మహా వైశాఖి అని పిలవబడుతున్నటు వంటి మహా పౌర్ణమి శుభ ఘడియలలోనే మహాత్ములైన వేదవ్యాసమహర్షి, అన్నమాచార్యుల వారు, గౌతమబుద్ధుడు జన్మించారు. శంకరాచార్యులవారి యొక్క ఆవిర్భావము యొక్క ప్రాభవము ఈ పౌర్ణమి నుండి బాగా వ్యాప్తి చెందినది.
భూమి మీద ఉన్న ఋషులు, మహర్షులు, అందరూ ఈ భూమిని నడిపిస్తున్నటువంటి దివ్యశక్తి అయిన సనత్కుమార ప్రజ్ఞతో కూడి, ఒక సమావేశమును వైశాఖ లోయలో ఏర్పాటు చేసుకుంటారు. ఈ లోయ మానస సరోవరమునకు, కైలాస పర్వతమునకు ఉత్తరదిశలో ఉన్నటువంటి లోయ. ఈ భూమి మీద ఉన్న మానవులకు, యితర జీవులకు ఏ విధముగా శ్రేయస్సుని కలిగించాలో, దానికి సంబంధించిన ప్రణాళికను సనత్కుమార మహర్షి ఋషులకు, సిద్ధులకు,బ్రహ్మర్షులకు అందించడము జరుగుతుంది.
పౌర్ణమి రోజు సూర్య చంద్రుల మధ్య 180 డిగ్రీలు ఏర్పడి ప్రతిముఖముగా ఉంటారు. ఈ రోజు పరమగురువులు శ్రద్ధాళువులకు, భక్తి, తపన, ఉన్ముఖత కలిగిన వారికి మార్గదర్శకత్వము, సాన్నిధ్యము ఇస్తామని వాగ్దానము చేసి ఉన్నారు. పౌర్ణమి రోజు పౌర్ణమి తిథి అంతమయ్యే ఘడియలు ముఖ్యము. పౌర్ణమి తిధికి ముందు ఆరు గంటల, తరువాత ఆరు గంటలు అంతరంగము నందు దివ్యత్వముతో అనుసంధానము చెందే ప్రయత్నములో సాధకుడు ఉండాలి.
- Master EK
🌹 🌹 🌹 🌹 🌹
26 May 2021
26-MAY-2021 MESSAGES
శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 269 / Sri Lalitha Chaitanya Vijnanam - 269
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 269 / Sri Lalitha Chaitanya Vijnanam - 269 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 64. సంహారిణీ, రుద్రరూపా, తిరోధానకరీశ్వరీ ।
సదాశివానుగ్రహదా, పంచకృత్య పరాయణా ॥ 64 ॥ 🍀
🌻269. 'రుద్రరూపా' 🌻
బ్రహ్మ దుఃఖమును పోగొట్టుటకై ఫాల భాగమునుండి రుద్రుడుదయించి ఏకాదశ రుద్రులుగ మారి చీకటులను తొలగించి అంతరిక్షము నేర్పరచెను. అవరోధము లేని శక్తి రుద్ర శక్తి. అట్టి శక్తి రూపమును దాల్చునది శ్రీమాతయే. సృష్టి యందు అవరోధము లేర్పడినప్పుడు, అసుర శక్తులు విజృంభించినపుడు, పెనుమార్పులు అవసరమైనపుడు శ్రీమాతయే రుద్రరూపమును దాల్చి కావ్యములను చక్కబెట్టును.
సృష్టిని తనలోనికి లయము చేసుకొనుట తిరోధానము. ఇట్టి తిరోధానమునకు రౌద్రము, రుద్ర రూపము అవసరము. అట్టి రూపమును ధరించి ప్రళయకాల రుద్రుని వలె సృష్టిని ప్రళయములోనికి నడుపునది శ్రీదేవి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 269 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🍀 64. saṁhāriṇī rudrarūpā tirodhāna-karīśvarī |
sadāśivā'nugrahadā pañcakṛtya-parāyaṇā || 64 || 🍀
🌻 Rudra-rūpā रुद्र- रूपा (269) 🌻
She is in the form of Rudra, while causing death. Her form is known as Rudra when She causes the death of individual lives. Rudra does not mean the lord of death.
Rudra is the destroyer of miseries. Ru refers to pains arising out of miseries arising out of improper usage of sensory organs and dra means to disperse. Rudra means driving away miseries.
Chāndogya Upaniṣad (III.13.3) says, “Rudra-s are connected with religious rites. The prāṇa-s are called Rudra-s because they make everyone in this world cry.”
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
25 May 2021
నిర్మల ధ్యానాలు - ఓషో - 21
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మనం దేవతలం కానీ బిచ్చగాళ్ళుగా వుంటున్నాం 🍀
రహస్యాన్ని తెలుసుకోవడం గుండా విజయం రంగంలోకి వస్తుంది. తెలుసుకోవలసిన విలువయిన రహస్యం ఒకటే అది నీ లోలోతుల్లోని నీకు సంబంధించిన నువ్వు. అది అనంత రహస్య ప్రదేశం. జనం అగమ్యంగా అన్ని దిక్కులూ అన్వేషిస్తారు. మనిషి చంద్రుణ్ణి అందుకున్నాడు. అది చాలా సులభం.
అతి కష్టమయిన విషయం తన అంతరంగంలోకి వెళ్ళడం. తన లోపలి కేంద్రాన్ని చేరగం. అక్కడ రహస్యాలకే రహస్యమైనదుంది. అన్ని రహస్యాలనూ తెరిచే 'మాస్టర్ కీ' అక్కడుంది. సన్యాసిగా నిన్ను నువ్వు తెలుసుకునే మార్గంలో వున్నావు. అది అప్పటికే అక్కడ వుంది. నువ్వు కేవలం దాన్ని కనిపెట్టాలి.
అక్కర్లేని వాటిని ఆటంకంగా వున్న వాటిని తొలగించాలి. కొన్ని తెరల్ని పక్కకి జరపాలి. అపుడు మనం దేవుడిలో ముఖాముఖీ కలుస్తాం. దేవుడు మన ఎదురుగా వుంటాడు. రహస్యమేమిటంటే మనం దేవతలం. బాధాకరమైన విషయమేమిటంటే మనం బిచ్చగాళ్ళుగా వున్నాం.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
25 May 2021
వివేక చూడామణి - 78 / Viveka Chudamani - 78
🌹. వివేక చూడామణి - 78 / Viveka Chudamani - 78🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 20. శరీర బంధనాలు - 4 🍀
273. అగరవత్తుల సువాసనలకు లొంగి దాని సంబంధము నీతో కలసి ఉండుటచే, అలాంటి ఇతర వాసనలు పూర్తిగా ఘర్షణ ద్వారా తొలగించాలి.
274. చందనపు సువాసనల వంటి ఆత్మ సుగంధము, అది దుమ్ముతో కప్పబడి అనగా అంతము లేని తీవ్రమైన కోరికల గుర్తులతో నింపబడి, మనస్సులో ముద్రించ బడినపుడు ఆ గుర్తులు విజ్ఞానమనే ఒత్తిడిల వలన పొందిన స్థితులు వివరముగా గ్రహించాలి.
275. ఆత్మను తెలుసుకోవాలనే కోరిక అనేక ఇతర వస్తు సముదాయములపై కోరికచే కప్పివేయబడినది. ఎపుడైతే ఆ ఇతర కోరికలన్నియూ నాశనము చేయబడతాయో, అందుకు స్థిరమైన బంధము ఆత్మ పై ఉంచిన ఆ ఆత్మ స్పష్టముగా దానంత అదే స్థిరపడుతుంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 78 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 20. Bondages of Body - 4 🌻
273. The lovely odour of the Agaru (agalochum) which is hidden by a powerful stench due to its contact with water etc., manifests itself as soon as the foreign smell has been fully removed by rubbing.
274. Like the fragrance of the sandal-wood, the perfume of the Supreme Self, which is covered with the dust of endless, violent impressions imbedded in the mind, when purified by the constant friction of Knowledge, is (again) clearly perceived.
275. The desire for Self-realisation is obscured by innumerable desires for things other than the Self. When they have been destroyed by the constant attachment to the Self, the Atman clearly manifests Itself of Its own accord.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
25 May 2021













