ऋषि चिंतन - समर्थता का सदुपयोग‼ Sage Musings - Good use of Capabilities

 🌴०९ दिसम्बर २०२१ गुरुवार 🌴

 ॥ मार्गशीर्षशुक्लपक्ष षष्ठी २०७८ ॥ 

➖➖➖➖‼️➖➖➖➖

             ‼ऋषि चिंतन‼

➖➖➖➖‼️➖➖➖➖

〰️〰️〰️〰️🌼〰️〰️〰️〰️

    🦁 समर्थता का सदुपयोग 🦁

〰️〰️〰️〰️🌼〰️〰️〰️〰️

👉 बेल पेड़ से लिपटकर ऊँची तो उठ सकती है, पर उसे अपना अस्तित्व बनाए रखने के लिए आवश्यक रस भूमि के भीतर से ही प्राप्त करना होगा ।पेड़ बेल को सहारा भर दे सकता है पर उसे जीवित नहीं रख सकता । अमरबेल जैसे अपवाद उदाहरण या नियम नहीं बन सकते ।

👉 व्यक्ति का "गौरव" या "वैभव" बाहर बिखरा दीखता है । उसका बड़प्पन आँकने के लिए उसके साधन एवं सहायक आधारभूत कारण प्रतीत होते हैं, पर वस्तुत: बात ऐसी है नहीं । "मानवी प्रगति" के मूलभूत तत्त्व उसके अंतराल की गहराई में ही रहते हैं ।

👉 "परिश्रमी", "व्यवहारकुशल" और "मिलनसार" प्रकृति के व्यक्ति संपत्ति उपार्जन में समर्थ होते हैं । जिनमें इन गुणों का अभाव है,वे पूर्वजों की छोड़ी हुई संपदा की रखवाली तक नहीं कर सकते । भीतर का खोखलापन उन्हें बाहर से भी दरिद्र ही बनाए रहता है ।

👉 गरिमाशील व्यक्ति किसी देवी-देवता के अनुग्रह से महान नहीं बनते । "संयमशीलता", "उदारता" और "सज्जनता" से मनुष्य सुदृढ़ बनता है, पर आवश्यक यह भी है कि उस दृढ़ता का उपयोग लोकमंगल के लिए किया जाए । "आत्मशोधन" की उपयोगिता तभी है, जब वह "चंदन" की तरह अपने समीपवर्ती वातावरण में सत्प्रवृत्तियों की सुगंध फैला सके ।

〰️〰️〰️〰️🌺〰️〰️〰️〰️

॥अखण्डज्योति अप्रेल १९८७पृष्ठ १॥

    💦पं.श्रीराम शर्मा आचार्य💦

              ☘संस्थापक☘

  🍁अखिल विश्व गायत्री परिवार🍁

〰️〰️〰️〰️🌺〰️〰️〰️〰️


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 


10 Dec 2021


శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 327 / Sri Lalitha Chaitanya Vijnanam - 327


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 327 / Sri Lalitha Chaitanya Vijnanam - 327 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 73. కామ్యా, కామకళారూపా, కదంబ కుసుమ ప్రియా ।
కళ్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా ॥ 73 ॥ 🍀

🌻 327. 'కళావతి'🌻

అరువది నాలుగు కళలు గలది శ్రీమాత అని అర్థము. అరువది నాలుగు కళలు గూడిననేగాని కళావతి అని పిలుచుటకు సాధ్యపడదు. సృష్టియందు శ్రీమాత, శ్రీకృష్ణుడు మాత్రమే అట్టివారు. ఈ అరువది నాలుగు కళలను గూర్చి 'చతుషష్టి కళామయీ' అను నామమున వివరించుట జరిగినది. (రెండువందల ముప్పది ఆరవ నామము - 236)

శ్రీమాత తత్త్వము అరువది నాలుగు కళల మయమని అర్థము. కళలనగా కాంతులు. శ్రీమాత కాంతులు అరువది నాలుగు. ఆమెకు జరుపు ఆరాధనము అరువది నాలుగు ఉపచారములతో కూడి యున్నది. ఈ ఉపచారములు నేర్చుటకు అరువది నాలుగు విద్యలున్నవి. ఈ విద్యలన్నియూ కలవాడు పూర్ణ పురుషుడే. శ్రీకృష్ణుడు అన్ని విద్యలను ప్రదర్శించి చూపెను. ధర్మరాజాదులు, భీష్మ ద్రోణాదులు, ఇతర మహావీరులు, యిందలి కొన్ని విద్యలే యెరిగి యున్నారు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 327 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 73. Kamya kamakalarupa kadanba kusumapriya
Kalyani jagatikanda karunarasasagara ॥ 73 ॥ 🌻

🌻 327. Kalāvatī कलावती (327) 🌻

She has sixty four types of arts or She is the possessor of these sixty four types of arts, which have been already discussed in nāma 236 and the interpretation is reproduced here. (She is the embodiment of sixty four types of arts. Kalā means art. There are sixty four types of arts in tantra śāstra-s. No concrete evidence is available either to confirm or dispute these sixty four arts (arts can be explained as either science or art or doctrine. They are all in the form of dialogue between Śiva and His consort Pārvatī. But, these sixty four types of arts originate from aṣṭama siddhi-s (the eight super human powers). Śiva himself tells Pārvatī about these sixty four arts.

Saundarya Laharī verse 31 says, “catuḥ-ṣaṣṭyā tantraiḥ sakalm” meaning that the sixty four tantra-s constitute everything. The sixty four tantra-s originate from the Pañcadaśī mantra and culminate in the Pañcadaśī mantra. This is evident from the fact that the same Saundarya Laharī verse says ‘idam te tantraṃ’ possibly meaning the Pañcadaśī mantra that is declared in the next verse of Saundarya Laharī. Since there is no differentiation between Her and the Pañcadaśī mantra, She is said to be in the form of all the sixty four types of tantric arts. These sixty four types of tantric arts are declared to the world by Śiva at the instance of His consort. The difference between nāma-s 236 and 327 is very subtle. The former says that She is in the form of these sixty four fine arts and this nāma says that She has these sixty four types of arts. The difference is between possession and reflection or prākaśa (Self illuminating) and vimarśa (reflecting).


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


10 Dec 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 107


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 107 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ప్రేమ అన్నది పరిమళం లాంటిది. ఎవరయినా దాన్ని గుర్తించినా గుర్తించకున్నా అది పట్టించుకోదు. ప్రేమ అన్నది నీ లక్షణం కావాలి. నువ్వు ప్రేమిస్తే ఓక రోజు కేవలం ప్రేమగా మారుతావు. అది నీ జ్ఞానోదయమయిన రోజు 🍀

ప్రేమ ప్రత్యేకించి ఎవర్నీ వుద్దేశించి ఉపన్యసించదు. కేవలం ప్రేమిస్తుంది. అది నీ లక్షణం. అనుబంధంతో దానికి సంబంధం లేదు. ప్రేమ అన్నది పరిమళం లాంటిది. ఎవరయినా దాన్ని గుర్తించినా గుర్తించకున్నా అది పట్టించుకోదు. సుదూర హిమాలయాల్లో జన సంచారమే లేని ప్రదేశాల్లో వేల పూలు వికసించి పరిమళాన్ని వెదజల్లుతూ వుంటాయి. హిమాలయాల్లో ఒక లోయ నిండుగా వింత పూలు వుంటాయి. జనం కొంత పైనించి వాటిని చూస్తారు. వెళ్ళరు. ఎందుకంటే ఆక్కడికి వెళ్ళడం ప్రమాదకరం.

జనాలకు ఆ పూల గురించి తెలుసు. కానీ వాటి పరిమళాన్ని ఎవరూ ఆస్వాదించి వుండరు. వాటి వర్ణాలు వూహించదగినవి. ఎందుకంటే అవి ఎంతో దూరంలో వున్నాయి. ఆ విషయం గురించి అవి పట్టించుకోవు . ఆ పూలు ఎంతో అనందంగా వుంటాయి. ప్రేమ అన్నది నీ లక్షణం కావాలి. నువ్వు ప్రేమిస్తే ఒక రోజు నువ్వు కేవలం ప్రేమగా మారుతావు. ప్రేమించడంగా గాక ప్రేమగా మారుతావు. అది నీ గొప్ప రోజు. జ్ఞానోదయమయిన రోజు. ఏ క్షణం మంచుబిందువు మాయమై సముద్రంలో అప్పుడది సముద్రంగా మారుతుంది.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


10 Dec 2021

మైత్రేయ మహర్షి బోధనలు - 40


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 40 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 28. నిజమైన సాధువు - 2 🌻

శాస్త్రజ్ఞుని మనోతత్వము దేశ, కాల, మత, ఆచారములందు బందీ యగుటచే పారదర్శకములగు శాస్త్ర సిద్ధాంతములు వెలుగునకు వచ్చుట లేదు. చంద్రునిపై జీవము లేదని ఒకప్పుడు, ఉన్నదని మరియొ కప్పుడు, కుజునిపై జీవమున్నదని, లేదని, మరల ఉన్నదని శాస్త్రజ్ఞులు చెప్పుట హాస్యాస్పదము. మన సూర్యమండలమును దాటి మరొక సూర్యమండలమును నిరాకరించిన శాస్త్రము, యిపుడు మరియొక సూర్యమండలమును గుర్తించుచున్నది. మనకు తెలియనిది లేదనుట అజ్ఞానము.

మనకు తెలియనిది తెలియ వచ్చును. తెలియదు అని తెలియుట కూడా జ్ఞానమే. శాస్త్ర పరిశోధకుల యందుగల సాధువులు యిట్టి దురాచారములకు పాల్పడరు. వారే శాస్త్రజ్ఞానమును సమగ్రముగ అందివ్వగలరు. తత్వశాస్త్రము నైనను, విజ్ఞానశాస్త్రము నైనను, సాధువే చక్కగ నిర్వర్తించి జ్ఞానోదయ మేర్పరచ గలడు. సాధువు మానవజాతికి ధృవతార వంటి వాడు. కాషాయము ధరించిన ప్రతి వ్యక్తియు సాధువు కాడు. సశాస్త్రముగ వివరించు వాడు, శోధనా మార్గమున ప్రవేశపెట్టువాడు నిజమైన సాధువు.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


10 Dec 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 523 / Vishnu Sahasranama Contemplation - 523


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 523 / Vishnu Sahasranama Contemplation - 523🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 523. స్వాఽభావ్యః, स्वाऽभाव्यः, Svā’bhāvyaḥ 🌻

ఓం స్వాభావ్యాయ నమః | ॐ स्वाभाव्याय नमः | OM Svābhāvyāya namaḥ

నిత్యనిష్పన్నరూపత్వాత్ స్వాభావ్యో యస్స్వభావతః ।
మహావిష్ణు స్స విద్వద్భిః స్వాభావ్య ఇతి కథ్యతే ॥

జన్మ అన్నదే లేక శాశ్వతముగా సిద్ధించిన స్వయం ప్రకాశ చిద్రూపము కలవాడుగావున తన స్వభావము చేతనే 'అభావ్యుడు' లేదా జనింప జేయబడనివాడుగనుక ఆ శ్రీ మహావిష్ణువు స్వాఽభావ్యః.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 523 🌹

📚. Prasad Bharadwaj

🌻 523. Svā’bhāvyaḥ 🌻

OM Svābhāvyāya namaḥ

नित्यनिष्पन्नरूपत्वात् स्वाभाव्यो यस्स्वभावतः ।
महाविष्णु स्स विद्वद्भिः स्वाभाव्य इति कथ्यते ॥

Nityaniṣpannarūpatvāt svābhāvyo yassvabhāvataḥ,
Mahāviṣṇu ssa vidvadbhiḥ svābhāvya iti kathyate.

As He is eternal and self-existent, He is by nature such that He cannot be born (Svabhāvena abhāvyaḥ).


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

अजो महार्हस्स्वाभाव्यो जितामित्रः प्रमोदनः ।आनन्दो नन्दनोऽनन्दस्सत्यधर्मा त्रिविक्रमः ॥ ५६ ॥

అజో మహార్హస్స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।ఆనన్దో నన్దనోఽనన్దస్సత్యధర్మా త్రివిక్రమః ॥ 56 ॥

Ajo mahārhassvābhāvyo jitāmitraḥ pramodanaḥ,Ānando nandano’nandassatyadharmā trivikramaḥ ॥ 56 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


10 Dec 20201

10-DECEMBER-2021 శుక్రవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 10, డిసెంబర్ 2021 శుక్రవారం, భృగు వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 126 / Bhagavad-Gita - 126 3-07🌹*
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 523 / Vishnu Sahasranama Contemplation - 523 🌹
4) 🌹 DAILY WISDOM - 201🌹 
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 40🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 107🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 327 / Sri Lalitha Chaitanya Vijnanam - 327 🌹
🌹. SURRENDER 🌹
🌹समर्थता का सदुपयोग 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శుక్రవారం మిత్రులందరికీ 🌹*
*భృగు వాసరే, 10, డిసెంబర్‌ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ మహాలక్ష్మీ చతుర్వింశతినామ స్తోత్రం-4 🍀*

*ప్రసీదాస్మాన్ కృపాదృష్టిపాతైరాలోకయాబ్ధిజే |*
*యే దృష్టాస్తే త్వయా బ్రహ్మరుద్రేంద్రత్వం సమాప్నుయుః || 7 ||*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, హేమంత ఋతువు,
మృగశిర మాసం
తిథి: శుక్ల-సప్తమి 19:10:55 
వరకు తదుపరి శుక్ల-అష్టమి
నక్షత్రం: శతభిషం 21:49:13 
వరకు తదుపరి పూర్వాభద్రపద  
యోగం: హర్షణ 08:21:44 వరకు 
తదుపరి వజ్ర
కరణం: గార 07:26:53 వరకు
వర్జ్యం: 05:02:06 - 06:37:54 
మరియు 28:23:44 - 30:02:40
దుర్ముహూర్తం: 08:48:39 - 09:33:08 
మరియు 12:31:01 - 13:15:29
రాహు కాలం: 10:45:24 - 12:08:47
గుళిక కాలం: 07:58:37 - 09:22:00
యమ గండం: 14:55:32 - 16:18:55
అభిజిత్ ముహూర్తం: 11:46 - 12:30
 అమృత కాలం: 14:36:54 - 16:12:42
సూర్యోదయం: 06:35:14
సూర్యాస్తమయం: 17:42:18
వైదిక సూర్యోదయం: 06:39:08
వైదిక సూర్యాస్తమయం: 17:38:24
చంద్రోదయం: 12:06:10
చంద్రాస్తమయం: 23:57:32
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: కుంభం
సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం 21:49:13 
వరకు తదుపరి ధ్వాo క్ష యోగం - 
ధన నాశనం, కార్య హాని 
పండుగలు : లేవు
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత -126 / Bhagavad-Gita - 126 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 7 🌴*

*యస్త్విన్ద్రియాణి మనసా నియమ్యారభతేర్జున |*
*కర్మేన్ద్రియై: కర్మయోగమసక్త: స విశిష్యతే ||*

🌷. తాత్పర్యం :
*అట్లు గాక మనస్సు చేత క్రియాశీలక ఇంద్రియములను నిగ్రహించుట యత్నించి సంగత్వము లేనివాడై కర్మయోగమును (కృష్ణభక్తిరసభావన యందు) ఆరంభించు శ్రద్దావంతుడు అత్యుత్తముడు.*

🌷. భాష్యము :
యథేచ్చాజీవనము మరియు ఇంద్రియభోగముల కొరకు కపటయోగిగా వర్తించుట కన్నను, భవబంధము నుండి ముక్తిని కలిగించి భగవద్దామమును ప్రవేశింపచేయు స్వధర్మమున నిలిచి జీవితలక్ష్యము కొరకై ప్రయత్నించుట అత్యంత ఉత్తమము. వాస్తమునకు నిజమైన స్వార్థగతి లేదా జీవితపరమార్థము విష్ణువును చేరుటయే. ఈ జీవితలక్ష్యమును సాధించుటలో మనకు తోడ్పడు విధముగనే వర్ణాశ్రమపద్ధతులు ఏర్పాటు చేయబడినవి. 

అనగా గృహస్థుడు కుడా కృష్ణభక్తిభావన యందలి నియమిత సేవ ద్వారా ఈ గమ్యమును చేరగలడు. ఆత్మానుభావము కొరకై ప్రతియొక్కరు శాస్త్రములలో తెలుపబడిన రీతి నియమిత జీవనమును సాగించుచు సంగరహితముగా తమ కర్మ నొనరించినచో పురోభివృద్ధిని పొందగలరు. 

ఈ విధానము అనుసరించు శ్రద్దావంతుడు అమాయకులను మోసగించుటకై కపటభక్తిని ప్రదర్శించు కపటయోగి కన్నను అత్యంత ఉత్తముడు. కేవలము జీవనార్థమై కపటధ్యానము చేయువాని కన్నను శ్రద్ధగా వీధులను శుభ్రపరచువాడు ఉత్తముడు.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 126 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 3 - Karma Yoga - 7 🌴*
 
*yas tv indriyāṇi manasā niyamyārabhate ’rjuna*
*karmendriyaiḥ karma-yogam asaktaḥ sa viśiṣyate*

🌷Translation :
*On the other hand, if a sincere person tries to control the active senses by the mind and begins karma-yoga [in Kṛṣṇa consciousness] without attachment, he is by far superior.*

🌷 Purport :
Instead of becoming a pseudo transcendentalist for the sake of wanton living and sense enjoyment, it is far better to remain in one’s own business and execute the purpose of life, which is to get free from material bondage and enter into the kingdom of God. The prime svārtha-gati, or goal of self-interest, is to reach Viṣṇu. 

The whole institution of varṇa and āśrama is designed to help us reach this goal of life. A householder can also reach this destination by regulated service in Kṛṣṇa consciousness. For self-realization, one can live a controlled life, as prescribed in the śāstras, and continue carrying out his business without attachment, and in that way make progress. 

A sincere person who follows this method is far better situated than the false pretender who adopts show-bottle spiritualism to cheat the innocent public. A sincere sweeper in the street is far better than the charlatan meditator who meditates only for the sake of making a living.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 523 / Vishnu Sahasranama Contemplation - 523🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 523. స్వాఽభావ్యః, स्वाऽभाव्यः, Svā’bhāvyaḥ 🌻*

*ఓం స్వాభావ్యాయ నమః | ॐ स्वाभाव्याय नमः | OM Svābhāvyāya namaḥ*

నిత్యనిష్పన్నరూపత్వాత్ స్వాభావ్యో యస్స్వభావతః ।
మహావిష్ణు స్స విద్వద్భిః స్వాభావ్య ఇతి కథ్యతే ॥

*జన్మ అన్నదే లేక శాశ్వతముగా సిద్ధించిన స్వయం ప్రకాశ చిద్రూపము కలవాడుగావున తన స్వభావము చేతనే 'అభావ్యుడు' లేదా జనింప జేయబడనివాడుగనుక ఆ శ్రీ మహావిష్ణువు స్వాఽభావ్యః.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 523 🌹*
📚. Prasad Bharadwaj

*🌻 523. Svā’bhāvyaḥ 🌻*

*OM Svābhāvyāya namaḥ*

नित्यनिष्पन्नरूपत्वात् स्वाभाव्यो यस्स्वभावतः ।
महाविष्णु स्स विद्वद्भिः स्वाभाव्य इति कथ्यते ॥

Nityaniṣpannarūpatvāt svābhāvyo yassvabhāvataḥ,
Mahāviṣṇu ssa vidvadbhiḥ svābhāvya iti kathyate.

*As He is eternal and self-existent, He is by nature such that He cannot be born (Svabhāvena abhāvyaḥ).*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अजो महार्हस्स्वाभाव्यो जितामित्रः प्रमोदनः ।आनन्दो नन्दनोऽनन्दस्सत्यधर्मा त्रिविक्रमः ॥ ५६ ॥

అజో మహార్హస్స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।ఆనన్దో నన్దనోఽనన్దస్సత్యధర్మా త్రివిక్రమః ॥ 56 ॥

Ajo mahārhassvābhāvyo jitāmitraḥ pramodanaḥ,Ānando nandano’nandassatyadharmā trivikramaḥ ॥ 56 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 201 🌹*
*🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 19. Individual Strength is No Strength 🌻*

*People cannot help us, because people are like us. Everyone is made of the same character, a chip off the same block, as they say, and so the help that we receive from people of our own type will be as fallible and unreliable as the passing clouds in the sky.*

*The realities of life started to stare glaringly at the faces of the Pandavas, and they began to realise that there is a gap between the hopes of the mind and the joys that it had experienced earlier. It is not always the playful innocent joy of a child that will pursue us throughout our life. The pains of life are hidden like knives under the armpits of thieves, and they are unleashed at the opportune moment. Every dog has his day, as they say; everything has its own time.*

*Individual strength is no strength; our efforts cannot be regarded as ultimately adequate to the task. We have observed that the world is too vast for us. It is mighty enough—it is all-mighty, we may say. Who can touch the stars, the sun and the moon with the fingers of one's hand? The strength is inexorable; the law is very precise and unrelenting upon people, like the law of gravitation which has no pity for any person.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 40 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
 *సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 28. నిజమైన సాధువు - 2 🌻*

*శాస్త్రజ్ఞుని మనోతత్వము దేశ, కాల, మత, ఆచారములందు బందీ యగుటచే పారదర్శకములగు శాస్త్ర సిద్ధాంతములు వెలుగునకు వచ్చుట లేదు. చంద్రునిపై జీవము లేదని ఒకప్పుడు, ఉన్నదని మరియొ కప్పుడు, కుజునిపై జీవమున్నదని, లేదని, మరల ఉన్నదని శాస్త్రజ్ఞులు చెప్పుట హాస్యాస్పదము. మన సూర్యమండలమును దాటి మరొక సూర్యమండలమును నిరాకరించిన శాస్త్రము, యిపుడు మరియొక సూర్యమండలమును గుర్తించుచున్నది. మనకు తెలియనిది లేదనుట అజ్ఞానము.*

*మనకు తెలియనిది తెలియ వచ్చును. తెలియదు అని తెలియుట కూడా జ్ఞానమే. శాస్త్ర పరిశోధకుల యందుగల సాధువులు యిట్టి దురాచారములకు పాల్పడరు. వారే శాస్త్రజ్ఞానమును సమగ్రముగ అందివ్వగలరు. తత్వశాస్త్రము నైనను, విజ్ఞానశాస్త్రము నైనను, సాధువే చక్కగ నిర్వర్తించి జ్ఞానోదయ మేర్పరచ గలడు. సాధువు మానవజాతికి ధృవతార వంటి వాడు. కాషాయము ధరించిన ప్రతి వ్యక్తియు సాధువు కాడు. సశాస్త్రముగ వివరించు వాడు, శోధనా మార్గమున ప్రవేశపెట్టువాడు నిజమైన సాధువు.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 107 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. ప్రేమ అన్నది పరిమళం లాంటిది. ఎవరయినా దాన్ని గుర్తించినా గుర్తించకున్నా అది పట్టించుకోదు. ప్రేమ అన్నది నీ లక్షణం కావాలి. నువ్వు ప్రేమిస్తే ఓక రోజు కేవలం ప్రేమగా మారుతావు. అది నీ జ్ఞానోదయమయిన రోజు 🍀*

*ప్రేమ ప్రత్యేకించి ఎవర్నీ వుద్దేశించి ఉపన్యసించదు. కేవలం ప్రేమిస్తుంది. అది నీ లక్షణం. అనుబంధంతో దానికి సంబంధం లేదు. ప్రేమ అన్నది పరిమళం లాంటిది. ఎవరయినా దాన్ని గుర్తించినా గుర్తించకున్నా అది పట్టించుకోదు. సుదూర హిమాలయాల్లో జన సంచారమే లేని ప్రదేశాల్లో వేల పూలు వికసించి పరిమళాన్ని వెదజల్లుతూ వుంటాయి. హిమాలయాల్లో ఒక లోయ నిండుగా వింత పూలు వుంటాయి. జనం కొంత పైనించి వాటిని చూస్తారు. వెళ్ళరు. ఎందుకంటే ఆక్కడికి వెళ్ళడం ప్రమాదకరం.*

*జనాలకు ఆ పూల గురించి తెలుసు. కానీ వాటి పరిమళాన్ని ఎవరూ ఆస్వాదించి వుండరు. వాటి వర్ణాలు వూహించదగినవి. ఎందుకంటే అవి ఎంతో దూరంలో వున్నాయి. ఆ విషయం గురించి అవి పట్టించుకోవు . ఆ పూలు ఎంతో అనందంగా వుంటాయి. ప్రేమ అన్నది నీ లక్షణం కావాలి. నువ్వు ప్రేమిస్తే ఒక రోజు నువ్వు కేవలం ప్రేమగా మారుతావు. ప్రేమించడంగా గాక ప్రేమగా మారుతావు. అది నీ గొప్ప రోజు. జ్ఞానోదయమయిన రోజు. ఏ క్షణం మంచుబిందువు మాయమై సముద్రంలో అప్పుడది సముద్రంగా మారుతుంది.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 327 / Sri Lalitha Chaitanya Vijnanam - 327 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 73. కామ్యా, కామకళారూపా, కదంబ కుసుమ ప్రియా ।*
*కళ్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా ॥ 73 ॥ 🍀*

*🌻 327. 'కళావతి'🌻* 

*అరువది నాలుగు కళలు గలది శ్రీమాత అని అర్థము. అరువది నాలుగు కళలు గూడిననేగాని కళావతి అని పిలుచుటకు సాధ్యపడదు. సృష్టియందు శ్రీమాత, శ్రీకృష్ణుడు మాత్రమే అట్టివారు. ఈ అరువది నాలుగు కళలను గూర్చి 'చతుషష్టి కళామయీ' అను నామమున వివరించుట జరిగినది. (రెండువందల ముప్పది ఆరవ నామము - 236)*

*శ్రీమాత తత్త్వము అరువది నాలుగు కళల మయమని అర్థము. కళలనగా కాంతులు. శ్రీమాత కాంతులు అరువది నాలుగు. ఆమెకు జరుపు ఆరాధనము అరువది నాలుగు ఉపచారములతో కూడి యున్నది. ఈ ఉపచారములు నేర్చుటకు అరువది నాలుగు విద్యలున్నవి. ఈ విద్యలన్నియూ కలవాడు పూర్ణ పురుషుడే. శ్రీకృష్ణుడు అన్ని విద్యలను ప్రదర్శించి చూపెను. ధర్మరాజాదులు, భీష్మ ద్రోణాదులు, ఇతర మహావీరులు, యిందలి కొన్ని విద్యలే యెరిగి యున్నారు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 327 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 73. Kamya kamakalarupa kadanba kusumapriya*
*Kalyani jagatikanda karunarasasagara ॥ 73 ॥ 🌻*

*🌻 327. Kalāvatī कलावती (327) 🌻*

*She has sixty four types of arts or She is the possessor of these sixty four types of arts, which have been already discussed in nāma 236 and the interpretation is reproduced here. (She is the embodiment of sixty four types of arts. Kalā means art. There are sixty four types of arts in tantra śāstra-s. No concrete evidence is available either to confirm or dispute these sixty four arts (arts can be explained as either science or art or doctrine. They are all in the form of dialogue between Śiva and His consort Pārvatī. But, these sixty four types of arts originate from aṣṭama siddhi-s (the eight super human powers). Śiva himself tells Pārvatī about these sixty four arts.*

*Saundarya Laharī verse 31 says, “catuḥ-ṣaṣṭyā tantraiḥ sakalm” meaning that the sixty four tantra-s constitute everything. The sixty four tantra-s originate from the Pañcadaśī mantra and culminate in the Pañcadaśī mantra. This is evident from the fact that the same Saundarya Laharī verse says ‘idam te tantraṃ’ possibly meaning the Pañcadaśī mantra that is declared in the next verse of Saundarya Laharī. Since there is no differentiation between Her and the Pañcadaśī mantra, She is said to be in the form of all the sixty four types of tantric arts. These sixty four types of tantric arts are declared to the world by Śiva at the instance of His consort. The difference between nāma-s 236 and 327 is very subtle. The former says that She is in the form of these sixty four fine arts and this nāma says that She has these sixty four types of arts. The difference is between possession and reflection or prākaśa (Self illuminating) and vimarśa (reflecting).*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 SURRENDER 🌹*
*📚. Prasad Bharadwaj*

*Be willing to accept that things were supposed to happen the way they did, whether or not you can understand why.* 

*You may be aching over the intricate details, fighting against the pain and devastation it has caused you. If you keep battling with reality, you'll always end up losing. Let go of your attachment to what you think should have happened, and surrender to what is right now.*

*You may not know where you're heading, but trust that you're being guided towards a place that serves you well.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌴०९ दिसम्बर २०२१ गुरुवार 🌴*
 *॥ मार्गशीर्षशुक्लपक्ष षष्ठी २०७८ ॥* 
➖➖➖➖‼️➖➖➖➖
             *‼ऋषि चिंतन‼*
➖➖➖➖‼️➖➖➖➖
〰️〰️〰️〰️🌼〰️〰️〰️〰️
    *🦁 समर्थता का सदुपयोग 🦁*
〰️〰️〰️〰️🌼〰️〰️〰️〰️
👉 बेल पेड़ से लिपटकर ऊँची तो उठ सकती है, पर उसे अपना अस्तित्व बनाए रखने के लिए आवश्यक रस भूमि के भीतर से ही प्राप्त करना होगा ।पेड़ बेल को सहारा भर दे सकता है पर उसे जीवित नहीं रख सकता । *अमरबेल जैसे अपवाद उदाहरण या नियम नहीं बन सकते ।*
👉 *व्यक्ति का "गौरव" या "वैभव" बाहर बिखरा दीखता है ।* उसका बड़प्पन आँकने के लिए उसके साधन एवं सहायक आधारभूत कारण प्रतीत होते हैं, पर वस्तुत: बात ऐसी है नहीं । *"मानवी प्रगति" के मूलभूत तत्त्व उसके अंतराल की गहराई में ही रहते हैं ।*
👉 *"परिश्रमी", "व्यवहारकुशल" और "मिलनसार" प्रकृति के व्यक्ति संपत्ति उपार्जन में समर्थ होते हैं ।* जिनमें इन गुणों का अभाव है,वे पूर्वजों की छोड़ी हुई संपदा की रखवाली तक नहीं कर सकते । *भीतर का खोखलापन उन्हें बाहर से भी दरिद्र ही बनाए रहता है ।*
👉 *गरिमाशील व्यक्ति किसी देवी-देवता के अनुग्रह से महान नहीं बनते । "संयमशीलता", "उदारता" और "सज्जनता" से मनुष्य सुदृढ़ बनता है,* पर आवश्यक यह भी है कि उस दृढ़ता का उपयोग लोकमंगल के लिए किया जाए । *"आत्मशोधन" की उपयोगिता तभी है, जब वह "चंदन" की तरह अपने समीपवर्ती वातावरण में सत्प्रवृत्तियों की सुगंध फैला सके ।*
〰️〰️〰️〰️🌺〰️〰️〰️〰️
*॥अखण्डज्योति अप्रेल १९८७पृष्ठ १॥*
    *💦पं.श्रीराम शर्मा आचार्य💦*
              *☘संस्थापक☘*
  *🍁अखिल विश्व गायत्री परिवार🍁*
〰️〰️〰️〰️🌺〰️〰️〰️〰️

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

శ్రీ లలితా సహస్ర నామములు - 164 / Sri Lalita Sahasranamavali - Meaning - 164



🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 164 / Sri Lalita Sahasranamavali - Meaning - 164 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 164. సంసారపంక నిర్మగ్న సముద్ధరణ పండితా ।
యజ్ఞప్రియా, యజ్ఞకర్త్రీ, యజమాన స్వరూపిణీ ॥ 164 ॥ 🍀

🍀 877. సంసారపంకనిర్మగ్న సముద్ధరణపండితా :

సంసారము అను ఊబిలో కూరుకొనిపొయిన జనలను
ఉద్ధరించుటకు సామర్ధ్యము కలిగినది.


🍀 878. యఙ్ఞప్రియా :

యఙ్ఞములయందు ప్రీతి కలిగినది


🍀 879. యఙ్ఞకర్త్రీ :

యఙ్ఞము చేయునది


🍀 880. యజమానస్వరూపిణి :

యఙ్ఞము చేయువారి స్వరూపం తానై ఉన్నది.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 164 🌹

📚. Prasad Bharadwaj

🌻 164. Sansara pankanirmagna samudharana sandita
Yagyna priya yagynakartri yajamana svarupini ॥ 164 ॥ 🌻


🌻 877 ) Samsara panga nirmagna - samuddharana panditha -

She who is capable of saving people Who drown in the mud of day today life


🌻 878 ) Yagna priya -

She who likes fire sacrifice


🌻 879 ) Yagna karthree -

She who carries out fire sacrifice


🌻 880 ) Yajamana swaroopini -

She who is the doer of fire sacrifice


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


09 Dec 2021

VEDIC Wisdom..


🌹 VEDIC Wisdom.. 🌹


•What is FEAR..


Un acceptance of

Uncertainty.

•If we accept that

Uncertainty..

It becomes- Adventure.




•What is ENVY..


Un acceptance of Good

in Others.

•If we accept that Good,

It becomes- Inspiration.




•What is ANGER..


Un acceptance of things

which are beyond our

Control.

•If we accept,

It becomes- Tolerance.




•What is HATRED.


Un acceptance of person

as He/ She is.

•If we accept Person

unconditionally,

It becomes- Love.




•It's matter of

ACCEPTANCE.

•It's matter of

ATTITUDE.



🌹 🌹 🌹 🌹 🌹


09 Dec 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 116


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 116 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. లోకోద్ధరణము- లోక కల్యాణము - 1 🌻

లోకము అంటే చూపు అని అర్థము. మనము జగత్తును ఎలా చూస్తే, ఆ లోకంలో మనం ఉంటాము. ఉదాహరణకు లోకమంతా చెడిపోయినట్లు మనం చూస్తే, మనము చెడిపోవడం జరుగుతుంది. లోకంలో మంచిని చూస్తుంటే మనం మంచి వారమే అవుతాం. ఇంతకూ లోకంలో వ్యక్తుల స్వభావం అనేది వారిని గూర్చి మన అభిప్రాయం మాత్రమే సన్నివేశాలను, వ్యక్తులను గూర్చి నచ్చినవారు, నచ్చనివారు అంటూ మనకు రెండురకాల ముద్రలు ఏర్పడతాయి. ఈ ముద్రలతో కూడిన స్థితినే సంసార స-ముద్రమంటారు‌ రాగద్వేషాత్మకములయిన ముద్రలు మనకు సుఖదుఃఖాలను ఇస్తుటాయి‌. మన ప్రజ్ఞ వీని ఆటుపోటులకు లోనై శాంతిని కోల్పోతుంది.

పాడయిన ఈ లోకమును ఉద్ధరించాలనే అభిప్రాయాలు మొలకెత్తుతాయి‌. మనకు మనమే లోకోద్ధరణ అనే బరువును నెత్తిన వేసికొంటాం‌‌. మనం ఇతరులకు ఏది మంచి అనుకుంటామో దాన్ని వారిపై రుద్దుతాం. అయితే ఇతరులు వారి వారి పరణామదశలు, స్వభావాలను బట్టి స్పందిస్తుంటారు. ఈ విధానములో ఒక స్థితిలో ఘర్షణ తప్పదు. కావున లోకోద్ధరణ కార్యక్రమ నిర్వహణలో ఘర్షణలు పెంచడం, మనం అశాంతికి గురి అయి, అశాంతినే లోకానికి పంచడం జరుగుతుంది. ఇతరులను ఉద్ధరించే గురువులము అనుకోవడం అహంకారమవడం వల్ల, ఇట్టి వారు చేపట్టే చర్యలకు వైఫల్యం, అలజడియే ఫలితము. వీనిలో ఇరుక్కుని పోయేవాడు ఇతరులకు ఎట్టి తోడ్పాటును ఈయగలడు?.

....✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


09 Dec 2021

వివేక చూడామణి - 164 / Viveka Chudamani - 164


🌹. వివేక చూడామణి - 164 / Viveka Chudamani - 164🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -11 🍀

536. ఎట్టి నాశనంలేని స్థిరమైన ఆనందాన్ని పొంది సాధకుడు ఎట్టి పరిస్థితులలోనూ దుఃఖము మరియు జ్ఞానేంద్రియాల వస్తు సముదాయము ఎడల కోర్కెలతో బాధపడకుండా అన్ని బంధనాలకు వ్యక్తి వ్యతిరేఖతలకు అతీతుడై ఎల్లపుడు ఆత్మతో ఆటలాడగలడు.

537. ఒక చంటి బిడ్డ ఆకలి, శారీరక బాధలు మరచి ఆట వస్తువులతో ఆటలాడుతాడో, అలానే ఆత్మను తెలుసుకొన్న వ్యక్తి ‘నేను’ ‘నాది’ అనే భేదము లేకుండా ఆనందమయమైన జీవితాన్ని అనుభవిస్తాడు.

538. బ్రహ్మాన్ని తెలుసుకొన్న వ్యక్తులు తమ ఆహారాన్ని ఎలాంటి ఆదుర్దా, ఎలాంటి అవమానము లేకుండా బిచ్చమెత్తుకొని తీసుకుంటారు. వారు త్రాగే నీరు నది ప్రవాహముల నుండి గ్రహిస్తారు. వారు స్వేచ్ఛగా స్వతంత్రముగా జీవిస్తారు. వారు ఎట్టి భయభీతులు లేకుండా అడవులలో, శ్వశానాలలో నిద్రిస్తారు. వారు దుస్తులతో పనిలేకుండా నగ్నంగా జీవిస్తారు. అందువలన వారు బట్టలు ఉతుకుట, ఆరబెట్టుట వంటి పనులు చేయవలసిన పనిలేదు. నేల మీదే వారు పడుకుంటారు. వారు వేదాంత చర్చలలో మునిగి తేలుతుంటారు. వారు తమ సమయమంతా బ్రహ్మానంద స్థితిలో బ్రహ్మములో గడుపుతారు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 VIVEKA CHUDAMANI - 164 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj


🌻 32. I am the one who knows Brahman -11🌻

534. Satisfied with undiluted, constant Bliss, he is neither grieved nor elated by senseobjects, is neither attached nor averse to them, but always disports with the Self and takes pleasure therein.

537. A child plays with its toys forgetting hunger and bodily pains; exactly so does the man of realisation take pleasure in the Reality, without ideas of "I" or "mine", and is happy.

538. Men of realisation have their food without anxiety or humiliation by begging, and their drink from the water of rivers; they live freely and independently, and sleep without fear in cremation grounds or forests; their clothing may be the quarters themselves, which need no washing and drying, or any bark etc., the earth is their bed; they roam in the avenue of the Vedanta; while their pastime is in the Supreme Brahman.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


09 Dec 2021

శ్రీ శివ మహా పురాణము - 487


🌹 . శ్రీ శివ మహా పురాణము - 487 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 38

🌻. వివాహ మండపము - 1 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ మునిశ్రేష్ఠా! తరువాత పర్వతరాజగు హిమవంతుడు ఆనందముతో నగరమునంతనూ రంగు రంగుల శోభ కల్గునట్లు అలంకరింపజేసెను. అచట గొప్ప ఉత్సవము ఆరంభమయ్యెను (1). మార్గములను నీటితో కడిగి శుద్ధి చేసి విలువైన అలంకారములతో శోభిల్లునట్లు చేసిరి. ద్వారములన్నింటి యందు అరటిస్తంభములు మొదలగు మంగళ ద్రవ్యములు అలంకరింపబడెను (2). వాకిటియందు అరటిస్తంభములను పాతి పట్టు దారములతో మామిడి చిగురుల తోరణములు కట్టబడెను (3). సింహద్వారములు మల్లెల మాలలతో శోభిల్లెను. నాల్గుదిక్కుల యందు ఉంచబడిన మంగళ ద్రవ్యములతో ఆ నగరము విరాజిల్లెను (4).

గొప్ప ఆనందముతోకూడిన పర్వతరాజు గర్గుని ముందిడు కొని తన కుమార్తె వివాహము కొరకై గొప్ప ప్రభావశాలి, వర్ణింపయోగ్యమైనది, మంగళకరమైనది అగు వ్యవస్థను సమగ్రముగా చేసెను (5). విశ్వకర్మను సాదరముగా పిలిపించి మిక్కిలి విస్తీర్ణము, అతిమనోహరము అగు వివాహమండపమును నిర్మింపజేసెను (6). ఓ దేవర్షీ! అనేక శుభలక్షణములతో గూడి మహాశ్చర్యమును కలిగించే ఆ మండపము పదివేల యోజనముల విస్తీర్ణమును కలిగియుండెను (7).

ఆ నగరములోని చరాచర ప్రాణులన్నియూ సమానమగు సౌందర్యముతో మనస్సును హరించు చుండెను. సర్వత్రా అద్భుతములతో నిండియున్న ఆ నగరము అనేక చమత్కారకములగు వస్తువులతో నలరారెను (8)? అచట స్థావరములు జంగమములను సౌందర్యములో జయించినవా? లేక జంగములే స్థావరములను జయించినవా? చెప్పవలను పడదు (9). ఆ మండపమునందు జలము స్థలమును జయించినది. కుశలురగు వ్యక్తులైననూ జలస్థల భేదమును నిర్ణయించలేక పోయిరి (10). కొన్నిచోట్ల కృత్రిమ సింహములు, మరికొన్ని చోట్ల కృత్రిమ జల పక్షుల వరుసలు, ఇంకొన్ని చోట్ల కృత్రిమములగు నెమళ్లు అలంకరిపంబడి మనోహరముగా నుండెను (11).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


09 Dec 2021

గీతోపనిషత్తు -288


🌹. గీతోపనిషత్తు -288 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚

శ్లోకము 16-2

🍀 16-2. సమస్తమును నేనే ! - క్రతువు నిర్వర్తించువారు, క్రతువును చూచు వారు, క్రతు ద్రవ్యములు, క్రతు పరికరములు, క్రతు విధానము అంతయు ఈశ్వరుడే. క్రతు సంకల్పము ఈశ్వరుడే. క్రతు నిర్వహణము ఈశ్వరుడే. క్రతు ఫలము ఈశ్వరుడే. ఈశ్వరుడు కాని దేమియు లేదు. అందువలన ఈశ్వరుడగు కృష్ణ పరమాత్మ అన్నియు 'నేనే' అనుచున్నాడు. క్రతువులు, యజ్ఞములు ఆచరించువారు ఈశ్వరుని గూర్చి చేయు దీక్షాయుత కార్యమున సమస్తమును ఈశ్వరునిగనే చూడ వలెను.అలలు చూచునపుడు సముద్రమే అలగ యున్నదని గుర్తుండుట జ్ఞానము. అలల విన్యాసములో సముద్రమును మరచుట అజ్ఞానము. 🍀

అహం క్రతు రహం యజ్ఞః స్వధాహ మహ మౌషధమ్ |
మంత్రోం హ మహమే వాణ్య మహమగ్ని రహం హుతమ్ || 16

తాత్పర్యము : క్రతువును నేనే. యజ్ఞమును నేనే. ఓషధులును నేనే. మంత్రము కూడ నేనే. హోమ ద్రవ్యమును నేనే. హోమమును నేనే. అందు హుతమగు ద్రవ్యము నేనే.

వివరణము : క్రతువులు, యజ్ఞములు ఆచరించు వారు ఈశ్వరుని గూర్చి చేయు దీక్షాయుత కార్యమున సమస్తమును ఈశ్వరునిగనే చూడ వలెను. నిజమునకు క్రతువు నిర్వర్తించువారు, క్రతువును చూచు వారు, క్రతు ద్రవ్యములు, క్రతు పరికరములు, క్రతు విధానము అంతయు ఈశ్వరుడే. క్రతు సంకల్పము ఈశ్వరుడే. క్రతు నిర్వహణము ఈశ్వరుడే. క్రతు ఫలము ఈశ్వరుడే. ఈశ్వరుడు కాని దేమియు లేదు. అందువలన ఈశ్వరుడగు కృష్ణ పరమాత్మ అన్నియు 'నేనే' అనుచున్నాడు. అంతయు 'నేనే' అనుచున్నాడు. క్రతువు నందుగాని, యజ్ఞము నందుగాని తాను కాని వస్తువేదియు లేదు.

విశ్వమంతయు తానే అయినపుడు అందలి భాగములు కూడ నేనే అని తెలుపుటలో ఒక రహస్యమున్నది. మొత్తము నుండి వివరములలోనికి ప్రజ్ఞ దిగినపుడు, వివరములలో మొత్తము అదృశ్యమగును. మొత్తము నందే వివరమున్నది గనుక వివరము నందు గూడ మొత్తమును చూడవలెను. వివరమును చూచునపుడు మొత్తమును మరచుట సహజము. మరువకుండుట జ్ఞానము. అలలు చూచునపుడు సముద్రమే అలగ యున్నదని గుర్తుండుట జ్ఞానము. అలల విన్యాసములో సముద్రమును మరచుట అజ్ఞానము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


09 Dec 2021

శ్రీ సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం Sree Subramanya Aparadha Kshamapana Sthothram


🌹. శ్రీ సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

నమస్తే నమస్తే గుహ తారకారే
నమస్తే నమస్తే గుహ శక్తిపాణే |
నమస్తే నమస్తే గుహ దివ్యమూర్తే
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ || 1 ||

నమస్తే నమస్తే గుహ దానవారే
నమస్తే నమస్తే గుహ చారుమూర్తే |
నమస్తే నమస్తే గుహ పుణ్యమూర్తే
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ || 2 ||

నమస్తే నమస్తే మహేశాత్మపుత్ర
నమస్తే నమస్తే మయూరాసనస్థ |
నమస్తే నమస్తే సరోర్భూత దేవ
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ || 3 ||

నమస్తే నమస్తే స్వయం జ్యోతిరూప
నమస్తే నమస్తే పరం జ్యోతిరూప |
నమస్తే నమస్తే జగం జ్యోతిరూప
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ || 4 ||

నమస్తే నమస్తే గుహ మంజుగాత్ర
నమస్తే నమస్తే గుహ సచ్చరిత్ర |
నమస్తే నమస్తే గుహ భక్తమిత్ర
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ || 5 ||

నమస్తే నమస్తే గుహ లోకపాల
నమస్తే నమస్తే గుహ ధర్మపాల |
నమస్తే నమస్తే గుహ సత్యపాల
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ || 6 ||

నమస్తే నమస్తే గుహ లోకదీప
నమస్తే నమస్తే గుహ బోధరూప |
నమస్తే నమస్తే గుహ గానలోల
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ || 7 ||

నమస్తే నమస్తే మహాదేవసూనో
నమస్తే నమస్తే మహామోహహారిన్ |
నమస్తే నమస్తే మహారోగహారిన్
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ || 8 ||

ఇతి శ్రీ సుబ్రహ్మణ్య అపరాధక్షమాపణ స్తోత్రమ్ ||

🌹 🌹 🌹 🌹 🌹


09 Dec 2021

శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు Sri Subramanya Shashti greetings


_ 🌹. శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు 🌹_

దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో "శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి" గా పరిగణిస్తారు. ఈ స్వామివారి జన్మవృత్తాంత విశిష్టత సమీక్షగా తెలుసుకుందాము !

పూర్వం మూడులోకాలను భయభ్రాంతులను చేస్తూ బాధిస్తున్న "తారకా సురుడు" అను రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై ! దేవతలు బ్రహ్మదేవుని శరణువేడినారు. దానికి బ్రహ్మ వారికి ఒక సూచన చేసినారు. ఈ తారకాసురుడు అమిత తపోబలసంపన్నుడు, అమితబలశాలి , వీనికి ఈశ్వర తేజాంశ సంభవుని వల్లకాని వానికి మరణములేదు. కావున ! మీరు సతివియోగ దుఃఖముతో ఉన్న ఈశ్వరునకు ఆ సతీదేవియే మరుజన్మయందు గిరిరాజు హిమవంతునకు పుత్రికగా అవతరించిన ఆ పార్వతీదేవికి వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు అని తరుణోపాయం శెలవిచ్చారు.

అప్పటికే తపోదీక్షలో ఉన్న పరమశివునకు సేవలు చేస్తున్న ఆ జగన్మాత పార్వతికి , శివునకు అన్యోన్యత చేకూర్చే వాతావరణాన్ని కల్పించేందుకు ! దేవతలు మన్మధుని ఆశ్రయిస్తారు. మొత్తం మీద మన్మధుని పూలబాణాలతో ఈశ్వరుని చలింపచేసి తాను ఈశ్వరుని ఆగ్రహానికి గురు అయినా ! పార్వతి పరమేశ్వరుల కళ్యాణానికి మన్మధుడు కారణ భూతుడవుతాడు. కళ్యాణం అనంతరం దేవతల అభ్యర్ధనమేరకు పునర్జీవింపబడతాడు.

ఇలా ఉండగా ! పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందసమయాన అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గ్రహించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్‌కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక రెల్లుపొదలో విసర్జిస్తారు. అంత ఆ ఆరుతేజస్సులు కలసి ఆరుముఖాలతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఇది తెలిసిన పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు.

ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని , షట్‌కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల మరియు ఆరుముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని , కార్తికేయుడని , అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అనియు , సుబ్రహ్మణ్యస్వామి అనియు నామాలతో పిలువసాగిరి.

కారణజన్ముడైన ఈ స్వామి పార్వతి పరమేశ్వరులు , దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి , వానిని దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు "శూలం" మొదలైన ఆయుధాలను ఇవ్వగా , ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి "శక్తి" అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడ్నిచేసి, తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు.

అంత ఆ స్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపందాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి కొన్ని అక్షౌహిణులను సంహరించి, రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి "సర్పరూపం" దాల్చి వారిని ఉక్కిరి బిక్కిరి చేసి, భీకర యుద్ధము చేసి తారకాసురుని సంహరించి విజయుడైనాడు.

సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి"గా పరిగణిస్తారని , సర్వులకు పూజ్యనీయులైన శ్రీ వేదవ్యాసులవారు దీని విశిష్టతను వివరిస్తారు.

ఈ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్కి గ్రామాలు , పట్టణాలు అనుబేధము లేకుండా దేశం నలుమూలలా దేవాలయాలు కలవు. ఈ రోజున "శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు తీర్ధములు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు.

ఈ స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు , చర్మవ్యాధులు తగ్గుతాయని , పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్‌సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని ప్రజల విశ్వాసం. అలా సంతానం కలిగినవారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినాన శ్రీ స్వామికి పాలు, పండ్లు , వెండి , పూలు పడగలు , వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు.

ఇటువంటి పుణ్యప్రదమైన "శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి" నాడు మనమంతా శ్రీ స్వామి విశేష పూజలు గావించి శ్రీ స్వామివారి కృపాకటాక్ష వీక్షణలు పొందుదాము.

వీలున్న వారందరూ తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధించండి. పెళ్ళి కాని వారికి , సంతానం లేని వారికి ఇది అమృతతుల్యమైన అవకాశం. సుబ్రహ్మణ్యుని అనుగ్రహముతో వివాహ ప్రాప్తి , సత్సంతానం , వంశాభివృద్ధి , జ్ఞానము , తేజస్సు, పాప కర్మల నుండీ విముక్తి కలుగుతుంది. కుండలినీ శక్తిని జాగృతం చేసి జీవితాశయం పొందడానికి కూడా సుబ్రహ్మణ్యుని అనుగ్రహము అతి ముఖ్యము.

🌹 🌹 🌹 🌹 🌹


09 Dec 2021

9-DECEMBER-2021 గురువారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 09, గురువారం, డిసెంబర్ 2021 బృహస్పతి వాసరే 🌹
🌹. శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు 🌹
🌹 శ్రీ సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం 🌹

2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 288 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 487🌹 
4) 🌹 వివేక చూడామణి - 164 / Viveka Chudamani - 164🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -116🌹  
6) 🌹 Osho Daily Meditations - 105🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 164 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 164🌹
🌹 Vedic wisdom 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ గురువారం మిత్రులందరికీ 🌹*
*బృహస్పతి వాసరే, 09, డిసెంబర్‌ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ రాధాకృష్ణాష్టకం -2 🍀*

*యం దృష్ట్వా కంసభూపః స్వకృతకృతి మహో సంస్మరన్మంత్రివర్యాన్*
*కిం వా పూర్వం మయేదం కృతమితి వచనం దుఃఖితః ప్రత్యువాచ |*
ఆజ్ఞప్తో నారదేన స్మితయుతవదనః పూరయన్సర్వకామాన్*
కృష్ణో రాధాసమేతో విలసతు హృదయే సోఽస్మదీయే సదైవ || 2 ||*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, హేమంత ఋతువు,
మృగశిర మాసం
తిథి: శుక్ల షష్టి 19:55:54 వరకు 
తదుపరి శుక్ల-సప్తమి
నక్షత్రం: ధనిష్ట 21:52:15
వరకు తదుపరి శతభిషం
యోగం: వ్యాఘత 10:26:50 
వరకు తదుపరి హర్షణ
 కరణం: కౌలవ 08:36:43 వరకు
వర్జ్యం: 02:31:50 - 04:04:34
మరియు 29:02:06 - 30:37:54
దుర్ముహూర్తం: 10:17:06 - 11:01:35 
మరియు 14:44:01 - 15:28:31
రాహు కాలం: 13:31:44 - 14:55:09
గుళిక కాలం: 09:21:29 - 10:44:54
యమ గండం: 06:34:39 - 07:58:04
అభిజిత్ ముహూర్తం: 11:46 - 12:30
అమృత కాలం: 11:48:14 - 13:20:58
సూర్యోదయం: 06:34:39
సూర్యాస్తమయం: 17:41:59
వైదిక సూర్యోదయం: 06:38:32
వైదిక సూర్యాస్తమయం: 17:38:05
చంద్రోదయం: 11:23:23
చంద్రాస్తమయం: 23:02:15
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: మకరం
శ్రీవత్స యోగం - ధన లాభం , 
సర్వ సౌఖ్యం 21:52:15 వరకు తదుపరి 
వజ్ర యోగం - ఫల ప్రాప్ది
పండుగలు : సుబ్రమణ్యషష్టి, చంపా షష్టి
Subrahmanya Sashti, Champa Shashthi
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*_ 🌹. శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు 🌹_*

దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో *"శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి"* వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన ఈ రోజును *"శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి"* గా పరిగణిస్తారు. ఈ స్వామివారి జన్మవృత్తాంత విశిష్టత సమీక్షగా తెలుసుకుందాము !

పూర్వం మూడులోకాలను భయభ్రాంతులను చేస్తూ బాధిస్తున్న *"తారకా సురుడు"* అను రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై ! దేవతలు బ్రహ్మదేవుని శరణువేడినారు. దానికి బ్రహ్మ వారికి ఒక సూచన చేసినారు. ఈ తారకాసురుడు అమిత తపోబలసంపన్నుడు, అమితబలశాలి , వీనికి ఈశ్వర తేజాంశ సంభవుని వల్లకాని వానికి మరణములేదు. కావున ! మీరు సతివియోగ దుఃఖముతో ఉన్న ఈశ్వరునకు ఆ సతీదేవియే మరుజన్మయందు గిరిరాజు హిమవంతునకు పుత్రికగా అవతరించిన ఆ పార్వతీదేవికి వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు అని తరుణోపాయం శెలవిచ్చారు.
అప్పటికే తపోదీక్షలో ఉన్న పరమశివునకు సేవలు చేస్తున్న ఆ జగన్మాత పార్వతికి , శివునకు అన్యోన్యత చేకూర్చే వాతావరణాన్ని కల్పించేందుకు ! దేవతలు మన్మధుని ఆశ్రయిస్తారు. మొత్తం మీద మన్మధుని పూలబాణాలతో ఈశ్వరుని చలింపచేసి తాను ఈశ్వరుని ఆగ్రహానికి గురు అయినా ! పార్వతి పరమేశ్వరుల కళ్యాణానికి మన్మధుడు కారణ భూతుడవుతాడు. కళ్యాణం అనంతరం దేవతల అభ్యర్ధనమేరకు పునర్జీవింపబడతాడు.
ఇలా ఉండగా ! పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందసమయాన అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గ్రహించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్‌కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక రెల్లుపొదలో విసర్జిస్తారు. అంత ఆ ఆరుతేజస్సులు కలసి ఆరుముఖాలతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఇది తెలిసిన పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు.
ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని , షట్‌కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల మరియు ఆరుముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని , కార్తికేయుడని , అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అనియు , సుబ్రహ్మణ్యస్వామి అనియు నామాలతో పిలువసాగిరి.
కారణజన్ముడైన ఈ స్వామి పార్వతి పరమేశ్వరులు , దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి , వానిని దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు "శూలం" మొదలైన ఆయుధాలను ఇవ్వగా , ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి "శక్తి" అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడ్నిచేసి, తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు.

అంత ఆ స్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపందాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి కొన్ని అక్షౌహిణులను సంహరించి, రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి *"సర్పరూపం"* దాల్చి వారిని ఉక్కిరి బిక్కిరి చేసి, భీకర యుద్ధము చేసి తారకాసురుని సంహరించి విజయుడైనాడు.

సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపిన ఈ రోజును *"శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి"గా* పరిగణిస్తారని , సర్వులకు పూజ్యనీయులైన శ్రీ వేదవ్యాసులవారు దీని విశిష్టతను వివరిస్తారు.

ఈ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్కి గ్రామాలు , పట్టణాలు అనుబేధము లేకుండా దేశం నలుమూలలా దేవాలయాలు కలవు. ఈ రోజున *"శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి"* వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు తీర్ధములు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు.

ఈ స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు , చర్మవ్యాధులు తగ్గుతాయని , పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్‌సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని ప్రజల విశ్వాసం. అలా సంతానం కలిగినవారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినాన శ్రీ స్వామికి పాలు, పండ్లు , వెండి , పూలు పడగలు , వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు.

ఇటువంటి పుణ్యప్రదమైన *"శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి"* నాడు మనమంతా శ్రీ స్వామి విశేష పూజలు గావించి శ్రీ స్వామివారి కృపాకటాక్ష వీక్షణలు పొందుదాము.

వీలున్న వారందరూ తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధించండి. పెళ్ళి కాని వారికి , సంతానం లేని వారికి ఇది అమృతతుల్యమైన అవకాశం. సుబ్రహ్మణ్యుని అనుగ్రహముతో వివాహ ప్రాప్తి , సత్సంతానం , వంశాభివృద్ధి , జ్ఞానము , తేజస్సు, పాప కర్మల నుండీ విముక్తి కలుగుతుంది. కుండలినీ శక్తిని జాగృతం చేసి జీవితాశయం పొందడానికి కూడా సుబ్రహ్మణ్యుని అనుగ్రహము అతి ముఖ్యము.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

నమస్తే నమస్తే గుహ తారకారే
నమస్తే నమస్తే గుహ శక్తిపాణే |
నమస్తే నమస్తే గుహ దివ్యమూర్తే
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ || 1 ||

నమస్తే నమస్తే గుహ దానవారే
నమస్తే నమస్తే గుహ చారుమూర్తే |
నమస్తే నమస్తే గుహ పుణ్యమూర్తే
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ || 2 ||

నమస్తే నమస్తే మహేశాత్మపుత్ర
నమస్తే నమస్తే మయూరాసనస్థ |
నమస్తే నమస్తే సరోర్భూత దేవ
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ || 3 ||

నమస్తే నమస్తే స్వయం జ్యోతిరూప
నమస్తే నమస్తే పరం జ్యోతిరూప |
నమస్తే నమస్తే జగం జ్యోతిరూప
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ || 4 ||

నమస్తే నమస్తే గుహ మంజుగాత్ర
నమస్తే నమస్తే గుహ సచ్చరిత్ర |
నమస్తే నమస్తే గుహ భక్తమిత్ర
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ || 5 ||

నమస్తే నమస్తే గుహ లోకపాల
నమస్తే నమస్తే గుహ ధర్మపాల |
నమస్తే నమస్తే గుహ సత్యపాల
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ || 6 ||

నమస్తే నమస్తే గుహ లోకదీప
నమస్తే నమస్తే గుహ బోధరూప |
నమస్తే నమస్తే గుహ గానలోల
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ || 7 ||

నమస్తే నమస్తే మహాదేవసూనో
నమస్తే నమస్తే మహామోహహారిన్ |
నమస్తే నమస్తే మహారోగహారిన్
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ || 8 ||

ఇతి శ్రీ సుబ్రహ్మణ్య అపరాధక్షమాపణ స్తోత్రమ్ ||
🌹 🌹 🌹 🌹 🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -288 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 16-2
 
*🍀 16-2. సమస్తమును నేనే ! - క్రతువు నిర్వర్తించువారు, క్రతువును చూచు వారు, క్రతు ద్రవ్యములు, క్రతు పరికరములు, క్రతు విధానము అంతయు ఈశ్వరుడే. క్రతు సంకల్పము ఈశ్వరుడే. క్రతు నిర్వహణము ఈశ్వరుడే. క్రతు ఫలము ఈశ్వరుడే. ఈశ్వరుడు కాని దేమియు లేదు. అందువలన ఈశ్వరుడగు కృష్ణ పరమాత్మ అన్నియు 'నేనే' అనుచున్నాడు. క్రతువులు, యజ్ఞములు ఆచరించువారు ఈశ్వరుని గూర్చి చేయు దీక్షాయుత కార్యమున సమస్తమును ఈశ్వరునిగనే చూడ వలెను.అలలు చూచునపుడు సముద్రమే అలగ యున్నదని గుర్తుండుట జ్ఞానము. అలల విన్యాసములో సముద్రమును మరచుట అజ్ఞానము. 🍀*

*అహం క్రతు రహం యజ్ఞః స్వధాహ మహ మౌషధమ్ |*
*మంత్రోం హ మహమే వాణ్య మహమగ్ని రహం హుతమ్ || 16*

*తాత్పర్యము : క్రతువును నేనే. యజ్ఞమును నేనే. ఓషధులును నేనే. మంత్రము కూడ నేనే. హోమ ద్రవ్యమును నేనే. హోమమును నేనే. అందు హుతమగు ద్రవ్యము నేనే.*

*వివరణము : క్రతువులు, యజ్ఞములు ఆచరించు వారు ఈశ్వరుని గూర్చి చేయు దీక్షాయుత కార్యమున సమస్తమును ఈశ్వరునిగనే చూడ వలెను. నిజమునకు క్రతువు నిర్వర్తించువారు, క్రతువును చూచు వారు, క్రతు ద్రవ్యములు, క్రతు పరికరములు, క్రతు విధానము అంతయు ఈశ్వరుడే. క్రతు సంకల్పము ఈశ్వరుడే. క్రతు నిర్వహణము ఈశ్వరుడే. క్రతు ఫలము ఈశ్వరుడే. ఈశ్వరుడు కాని దేమియు లేదు. అందువలన ఈశ్వరుడగు కృష్ణ పరమాత్మ అన్నియు 'నేనే' అనుచున్నాడు. అంతయు 'నేనే' అనుచున్నాడు. క్రతువు నందుగాని, యజ్ఞము నందుగాని తాను కాని వస్తువేదియు లేదు.*

*విశ్వమంతయు తానే అయినపుడు అందలి భాగములు కూడ నేనే అని తెలుపుటలో ఒక రహస్యమున్నది. మొత్తము నుండి వివరములలోనికి ప్రజ్ఞ దిగినపుడు, వివరములలో మొత్తము అదృశ్యమగును. మొత్తము నందే వివరమున్నది గనుక వివరము నందు గూడ మొత్తమును చూడవలెను. వివరమును చూచునపుడు మొత్తమును మరచుట సహజము. మరువకుండుట జ్ఞానము. అలలు చూచునపుడు సముద్రమే అలగ యున్నదని గుర్తుండుట జ్ఞానము. అలల విన్యాసములో సముద్రమును మరచుట అజ్ఞానము.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 487 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 38

*🌻. వివాహ మండపము - 1 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ మునిశ్రేష్ఠా! తరువాత పర్వతరాజగు హిమవంతుడు ఆనందముతో నగరమునంతనూ రంగు రంగుల శోభ కల్గునట్లు అలంకరింపజేసెను. అచట గొప్ప ఉత్సవము ఆరంభమయ్యెను (1). మార్గములను నీటితో కడిగి శుద్ధి చేసి విలువైన అలంకారములతో శోభిల్లునట్లు చేసిరి. ద్వారములన్నింటి యందు అరటిస్తంభములు మొదలగు మంగళ ద్రవ్యములు అలంకరింపబడెను (2). వాకిటియందు అరటిస్తంభములను పాతి పట్టు దారములతో మామిడి చిగురుల తోరణములు కట్టబడెను (3). సింహద్వారములు మల్లెల మాలలతో శోభిల్లెను. నాల్గుదిక్కుల యందు ఉంచబడిన మంగళ ద్రవ్యములతో ఆ నగరము విరాజిల్లెను (4).

గొప్ప ఆనందముతోకూడిన పర్వతరాజు గర్గుని ముందిడు కొని తన కుమార్తె వివాహము కొరకై గొప్ప ప్రభావశాలి, వర్ణింపయోగ్యమైనది, మంగళకరమైనది అగు వ్యవస్థను సమగ్రముగా చేసెను (5). విశ్వకర్మను సాదరముగా పిలిపించి మిక్కిలి విస్తీర్ణము, అతిమనోహరము అగు వివాహమండపమును నిర్మింపజేసెను (6). ఓ దేవర్షీ! అనేక శుభలక్షణములతో గూడి మహాశ్చర్యమును కలిగించే ఆ మండపము పదివేల యోజనముల విస్తీర్ణమును కలిగియుండెను (7).

ఆ నగరములోని చరాచర ప్రాణులన్నియూ సమానమగు సౌందర్యముతో మనస్సును హరించు చుండెను. సర్వత్రా అద్భుతములతో నిండియున్న ఆ నగరము అనేక చమత్కారకములగు వస్తువులతో నలరారెను (8)? అచట స్థావరములు జంగమములను సౌందర్యములో జయించినవా? లేక జంగములే స్థావరములను జయించినవా? చెప్పవలను పడదు (9). ఆ మండపమునందు జలము స్థలమును జయించినది. కుశలురగు వ్యక్తులైననూ జలస్థల భేదమును నిర్ణయించలేక పోయిరి (10). కొన్నిచోట్ల కృత్రిమ సింహములు, మరికొన్ని చోట్ల కృత్రిమ జల పక్షుల వరుసలు, ఇంకొన్ని చోట్ల కృత్రిమములగు నెమళ్లు అలంకరిపంబడి మనోహరముగా నుండెను (11).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 164 / Viveka Chudamani - 164🌹*
*✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -11 🍀*

*536. ఎట్టి నాశనంలేని స్థిరమైన ఆనందాన్ని పొంది సాధకుడు ఎట్టి పరిస్థితులలోనూ దుఃఖము మరియు జ్ఞానేంద్రియాల వస్తు సముదాయము ఎడల కోర్కెలతో బాధపడకుండా అన్ని బంధనాలకు వ్యక్తి వ్యతిరేఖతలకు అతీతుడై ఎల్లపుడు ఆత్మతో ఆటలాడగలడు.*

*537. ఒక చంటి బిడ్డ ఆకలి, శారీరక బాధలు మరచి ఆట వస్తువులతో ఆటలాడుతాడో, అలానే ఆత్మను తెలుసుకొన్న వ్యక్తి ‘నేను’ ‘నాది’ అనే భేదము లేకుండా ఆనందమయమైన జీవితాన్ని అనుభవిస్తాడు.*

*538. బ్రహ్మాన్ని తెలుసుకొన్న వ్యక్తులు తమ ఆహారాన్ని ఎలాంటి ఆదుర్దా, ఎలాంటి అవమానము లేకుండా బిచ్చమెత్తుకొని తీసుకుంటారు. వారు త్రాగే నీరు నది ప్రవాహముల నుండి గ్రహిస్తారు. వారు స్వేచ్ఛగా స్వతంత్రముగా జీవిస్తారు. వారు ఎట్టి భయభీతులు లేకుండా అడవులలో, శ్వశానాలలో నిద్రిస్తారు. వారు దుస్తులతో పనిలేకుండా నగ్నంగా జీవిస్తారు. అందువలన వారు బట్టలు ఉతుకుట, ఆరబెట్టుట వంటి పనులు చేయవలసిన పనిలేదు. నేల మీదే వారు పడుకుంటారు. వారు వేదాంత చర్చలలో మునిగి తేలుతుంటారు. వారు తమ సమయమంతా బ్రహ్మానంద స్థితిలో బ్రహ్మములో గడుపుతారు.*

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 164 🌹*
*✍️ Sri Adi Shankaracharya*
*Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*

*🌻 32. I am the one who knows Brahman -11🌻*

*534. Satisfied with undiluted, constant Bliss, he is neither grieved nor elated by senseobjects, is neither attached nor averse to them, but always disports with the Self and takes pleasure therein.*

*537. A child plays with its toys forgetting hunger and bodily pains; exactly so does the man of realisation take pleasure in the Reality, without ideas of "I" or "mine", and is happy.*

*538. Men of realisation have their food without anxiety or humiliation by begging, and their drink from the water of rivers; they live freely and independently, and sleep without fear in cremation grounds or forests; their clothing may be the quarters themselves, which need no washing and drying, or any bark etc., the earth is their bed; they roam in the avenue of the Vedanta; while their pastime is in the Supreme Brahman.*

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 VIVEKA CHUDAMANI - 164 🌹*
*✍️ Sri Adi Shankaracharya*
*Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*

*🌻 32. I am the one who knows Brahman -11🌻*

*534. Satisfied with undiluted, constant Bliss, he is neither grieved nor elated by senseobjects, is neither attached nor averse to them, but always disports with the Self and takes pleasure therein.*

*537. A child plays with its toys forgetting hunger and bodily pains; exactly so does the man of realisation take pleasure in the Reality, without ideas of "I" or "mine", and is happy.*

*538. Men of realisation have their food without anxiety or humiliation by begging, and their drink from the water of rivers; they live freely and independently, and sleep without fear in cremation grounds or forests; their clothing may be the quarters themselves, which need no washing and drying, or any bark etc., the earth is their bed; they roam in the avenue of the Vedanta; while their pastime is in the Supreme Brahman.*

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 116 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు *
*సంకలనము : వేణుమాధవ్*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. లోకోద్ధరణము- లోక కల్యాణము - 1 🌻*

*లోకము అంటే చూపు అని అర్థము. మనము జగత్తును ఎలా చూస్తే, ఆ లోకంలో మనం ఉంటాము. ఉదాహరణకు లోకమంతా చెడిపోయినట్లు మనం చూస్తే, మనము చెడిపోవడం జరుగుతుంది. లోకంలో మంచిని చూస్తుంటే మనం మంచి వారమే అవుతాం. ఇంతకూ లోకంలో వ్యక్తుల స్వభావం అనేది వారిని గూర్చి మన అభిప్రాయం మాత్రమే సన్నివేశాలను, వ్యక్తులను గూర్చి నచ్చినవారు, నచ్చనివారు అంటూ మనకు రెండురకాల ముద్రలు ఏర్పడతాయి. ఈ ముద్రలతో కూడిన స్థితినే సంసార స-ముద్రమంటారు‌ రాగద్వేషాత్మకములయిన ముద్రలు మనకు సుఖదుఃఖాలను ఇస్తుటాయి‌. మన ప్రజ్ఞ వీని ఆటుపోటులకు లోనై శాంతిని కోల్పోతుంది.*

*పాడయిన ఈ లోకమును ఉద్ధరించాలనే అభిప్రాయాలు మొలకెత్తుతాయి‌. మనకు మనమే లోకోద్ధరణ అనే బరువును నెత్తిన వేసికొంటాం‌‌. మనం ఇతరులకు ఏది మంచి అనుకుంటామో దాన్ని వారిపై రుద్దుతాం. అయితే ఇతరులు వారి వారి పరణామదశలు, స్వభావాలను బట్టి స్పందిస్తుంటారు. ఈ విధానములో ఒక స్థితిలో ఘర్షణ తప్పదు. కావున లోకోద్ధరణ కార్యక్రమ నిర్వహణలో ఘర్షణలు పెంచడం, మనం అశాంతికి గురి అయి, అశాంతినే లోకానికి పంచడం జరుగుతుంది. ఇతరులను ఉద్ధరించే గురువులము అనుకోవడం అహంకారమవడం వల్ల, ఇట్టి వారు చేపట్టే చర్యలకు వైఫల్యం, అలజడియే ఫలితము. వీనిలో ఇరుక్కుని పోయేవాడు ఇతరులకు ఎట్టి తోడ్పాటును ఈయగలడు?.*

....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 105 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 105. CHANGING THE WORLD 🍀*

*🕉 You are your world, so when you change your attitude you change the very world in which you exist. We cannot change the world — that’s what politicians have been trying to do down through the ages, and they have utterly failed. 🕉*
 
*The only way to change the world is to change your vision, and suddenly you will live in a different world. We don't live in the same world, and we are not all contemporaries. Somebody may be living in the past--how can he be your contemporary? He may be sitting by your side and thinking of the past; then he is not your contemporary. Somebody may be in the future, already in that which is not yet. How can he be your contemporary?*

*Only two people who live in the now are contemporaries, but in the now they are no more-because you are your past and your future. The present is not of you, it has nothing to do with you. When two people are absolutely in the here and now, they are not-then God is. We live in the same world only when we live in God.*

*You may live with another person for years, and you live in your world and she lives in hers--hence the continuous clash of two worlds colliding. By and by, one learns how to avoid this collision. That's what we call living together: trying to avoid the collision, trying not to come to a clash. That's what we call family, society, humanity ... all bogus! You cannot really be with a man or a woman unless you both live in God. There is no other love, no other family, and no other society.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 164 / Sri Lalita Sahasranamavali - Meaning - 164 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 164. సంసారపంక నిర్మగ్న సముద్ధరణ పండితా ।*
*యజ్ఞప్రియా, యజ్ఞకర్త్రీ, యజమాన స్వరూపిణీ ॥ 164 ॥ 🍀*

🍀 877. సంసారపంకనిర్మగ్న సముద్ధరణపండితా :  
సంసారము అను ఊబిలో కూరుకొనిపొయిన జనలను
ఉద్ధరించుటకు సామర్ధ్యము కలిగినది. 

🍀 878. యఙ్ఞప్రియా : 
యఙ్ఞములయందు ప్రీతి కలిగినది

🍀 879. యఙ్ఞకర్త్రీ : 
యఙ్ఞము చేయునది

🍀 880. యజమానస్వరూపిణి : 
యఙ్ఞము చేయువారి స్వరూపం తానై ఉన్నది. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 164 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 164. Sansara pankanirmagna samudharana sandita*
*Yagyna priya yagynakartri yajamana svarupini ॥ 164 ॥ 🌻*

🌻 877 ) Samsara panga nirmagna - samuddharana panditha -
 She who is capable of saving people Who drown in the mud of day today life

🌻 878 ) Yagna priya -   
She who likes fire sacrifice

🌻 879 ) Yagna karthree -  
She who carries out fire sacrifice

🌻 880 ) Yajamana swaroopini -   
She who is the doer of fire sacrifice

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామములు #LalithaSahasranam
 #PrasadBhardwaj 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ https://mymandir.page.link/wdh7G
https://t.me/ChaitanyaVijnanam 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 VEDIC Wisdom.. 🌹*

*•What is FEAR..*

   Un acceptance of
   Uncertainty.
•If we accept that
   Uncertainty..
   It becomes- Adventure.

*•What is ENVY..*

   Un acceptance of Good
   in Others.
•If we accept that Good,
   It becomes- Inspiration.

*•What is ANGER..*

   Un acceptance of things
   which are beyond our
   Control.
•If we accept,
   It becomes- Tolerance.

*•What is HATRED.*

   Un acceptance of person
   as He/ She is. 
•If we accept Person
   unconditionally, 
   It becomes- Love.

•It's matter of
   ACCEPTANCE.
•It's matter of 
   ATTITUDE.  
🌹 🌹 🌹 🌹 🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹