12 - MARCH - 2022 శనివారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 12, మార్చి 2022 శనివారం, స్థిర వాసరే 🌹 
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 171 / Bhagavad-Gita - 171 - 4-09 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 569 / Vishnu Sahasranama Contemplation - 569🌹
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 18 / Agni Maha Purana 18 🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 248 / DAILY WISDOM - 248 🌹 
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 149 🌹
7) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 87 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శనివారం మిత్రులందరికీ 🌹*
*స్థిర వాసరే, 12, మార్చి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు. 🌻*

*🍀. శ్రీ వేంకటేశ అష్టకం-5 🍀*

*9. ఇతీదం కీర్తితం యస్య విష్ణోరమితతేజసః |*
*త్రికాలే యః పఠేన్నిత్యం పాపం తస్య న విద్యతే*
*10. రాజద్వారే పఠేద్ఘోరే సంగ్రామే రిపుసంకటే |*
*భూతసర్పపిశాచాదిభయం నాస్తి కదాచన*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ప్రేమ తత్వమే కృష్ణ తత్వము. ఇది భౌతిక స్థాయిలో పరసువేదిగా, కోరికల స్థాయిలో కల్ప వృక్షముగా, మానసిక స్థాయిలో కామధేనువుగా మారుతుంది. మాస్టర్‌ ఆర్‌.కె. 🍀*
🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం, శశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: శుక్ల-నవమి 08:09:23 వరకు
తదుపరి శుక్ల-దశమి
నక్షత్రం: ఆర్ద్ర 17:32:25 వరకు
తదుపరి పునర్వసు
యోగం: సౌభాగ్య 27:54:02 వరకు
తదుపరి శోభన
కరణం: కౌలవ 08:07:23 వరకు
వర్జ్యం: 00:02:15 - 01:49:55 
మరియు 30:49:00 - 32:35:16
దుర్ముహూర్తం: 08:02:27 - 08:50:21
రాహు కాలం: 09:26:17 - 10:56:07
గుళిక కాలం: 06:26:38 - 07:56:27
యమ గండం: 13:55:47 - 15:25:37
అభిజిత్ ముహూర్తం: 12:02 - 12:48
అమృత కాలం: 06:19:05 - 08:06:45
సూర్యోదయం: 06:26:38
సూర్యాస్తమయం: 18:25:17
చంద్రోదయం: 13:14:22
చంద్రాస్తమయం: 02:02:54
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: జెమిని
ముద్గర యోగం - కలహం 17:32:25 వరకు
తదుపరి ఛత్ర యోగం - స్త్రీ లాభం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 171 / Bhagavad-Gita - 171 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 09 🌴

*09. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్త్వత: |*
*త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున ||*

🌷. తాత్పర్యం :
*ఓ అర్జునా! నా జన్మము మరియు కర్మల దివ్యత్వము నెరిగినవాడు శరీరత్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతికజగమున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు.*

🌻. భాష్యము :
భగవానుని అవతరణము అతని దివ్యధామము నుండియే జరుగుననెడి విషయము ఆరవశ్లోకములలో ఇదివరకే తెలుపబడినది. అట్టి అవతారసత్యము నెరిగినవాడు భవబంధముల నుండి ముక్తిని పొందినట్టివాడే కనుక దేహత్యాగానంతరము అతడు శ్రీఘ్రమే భగవద్దామమును తప్పక చేరగలడు. జీవునికి అటువంటి భవబంధ విముక్తి ఏమాత్రము సులభమైన కార్యము కాదు. నిరాకారవాదులు మరియు యోగులు బహుకష్టములు మరియు జన్మల పిమ్మటయే ముక్తిని పొందగలరు. అయినను వారు పొందెడి ముక్తి (భగవానుని నిరాకార బ్రహ్మజ్యోతి యందు లీనమగుట) కేవలము పాక్షికము మాత్రమే. 

దానిని సాధించిన పిమ్మటయు భౌతికజగమునకు తిరిగి వచ్చు ప్రమాదము కలదు. కాని శ్రీకృష్ణభగవానుని రూపము మరియు కర్మల దివ్యస్వభావమును అవగతము చేసికొనుట ద్వారా భక్తులు దేహత్యాగము పిమ్మట శ్రీకృష్ణదామము పొంది ఈ భౌతికజగమునకు తిరిగి రావలసిన ప్రమాదము నుండి బయటపడుదురు. శ్రీకృష్ణభగవానునకు అనేక రూపములు మరియు అవతారములు కలవని (అద్వైతమచ్యుత మనాది మనంతరూపమ్) బ్రహ్మసంహిత (5.33) యందు తెలుపబడినది. 

ఈ విధముగా భగవానునకు పలురూపములున్నను ఆ రూపములన్నియును ఏవమే అయియున్నవి మరియు ఆ దేవదేవుడు అద్వితీయుడై యున్నాడు. వేదములందు (పురుషబోధినీ ఉపనిషత్తు) ఈ విధముగా తెలుపబడినది. 

ఏకో దేవో నిత్యలీలానురక్తో భక్తవ్యాపీ హృద్యంతరాత్మా |

“తన విశుద్ధభక్తుల సంబంధమున అద్వితీయుడైన భగవానుడు అనేకానేక దివ్యరూపములలో నిత్యముగా వర్తించుచుండును.” ఈ వేదవాక్యము భగవద్గీత యందలి ఈ శ్లోకములో శ్రీకృష్ణభగవానునిచే నిర్ధారింపబడుచున్నది. అనగా ఈ సత్యమును నిస్సందేహముగా మరియు విశ్వాసముతో అంగీకరించువాడు ముక్తిని పొందుచున్నాడు. 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 171 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 4 - Jnana Yoga - 09 🌴*

*09. janma karma ca me divyam evaṁ yo vetti tattvataḥ*
*tyaktvā dehaṁ punar janma naiti mām eti so ’rjuna*

🌷 Translation : 
*One who knows the transcendental nature of My appearance and activities does not, upon leaving the body, take his birth again in this material world, but attains My eternal abode, O Arjuna.*

🌹 Purport :
The Lord’s descent from His transcendental abode is already explained in the sixth verse. One who can understand the truth of the appearance of the Personality of Godhead is already liberated from material bondage, and therefore he returns to the kingdom of God immediately after quitting this present material body.

Such liberation of the living entity from material bondage is not at all easy. The impersonalists and the yogīs attain liberation only after much trouble and many, many births. Even then, the liberation they achieve – merging into the impersonal brahma-jyotir of the Lord – is only partial, and there is the risk of returning to this material world. But the devotee, simply by understanding the transcendental nature of the body and activities of the Lord, attains the abode of the Lord after ending this body and does not run the risk of returning to this material world. In the Brahma-saṁhitā (5.33) it is stated that the Lord has many, many forms and incarnations: advaitam acyutam anādim ananta-rūpam. 

Although there are many transcendental forms of the Lord, they are still one and the same Supreme Personality of Godhead. As stated in the Vedas (Puruṣa-bodhinī Upaniṣad):

eko devo nitya-līlānurakto
bhakta-vyāpī hṛdy antar-ātmā

“The one Supreme Personality of Godhead is eternally engaged in many, many transcendental forms in relationships with His unalloyed devotees.” Simply by accepting this truth on faith, one can, without a doubt, attain liberation. 
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 569 / Vishnu Sahasranama Contemplation - 569 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 569. దారుణః, दारुणः, Dāruṇaḥ 🌻*

*ఓం దారుణాయ నమః | ॐ दारुणाय नमः | OM Dāruṇāya namaḥ*

*దారుణో దారుణత్వాత్స సన్మార్గస్య విరోధినామ్*

*సన్మార్గమునకు విరోధులగు వారికి దారుణుడు లేదా భయంకరుడు.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 569 🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻 569. Dāruṇaḥ 🌻*

*OM Dāruṇāya namaḥ*

दारुणो दारुणत्वात्स सन्मार्गस्य विरोधिनाम् / 
*Dāruṇo dāruṇatvātsa sanmārgasya virodhinām*  

*As being hard on the enemies of the righteous path.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सुधन्वा खण्डपरशुर्दारुणो द्रविणप्रदः ।दिविस्पृक् सर्वदृग् व्यासो वाचस्पतिरयोनिजः ॥ ६१ ॥

సుధన్వా ఖణ్డపరశుర్దారుణో ద్రవిణప్రదః ।దివిస్పృక్ సర్వదృగ్ వ్యాసో వాచస్పతిరయోనిజః ॥ 61 ॥

Sudhanvā khaṇḍaparaśurdāruṇo draviṇapradaḥ,Divispr‌k sarvadr‌g vyāso vācaspatirayonijaḥ ॥ 61 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 18 / Agni Maha Purana - 18 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 7*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. అయోధ్యాకాండ వర్ణనము - 1 🌻*

నారద ఇట్లు పలికెను:

రాముడు వసిష్ఠుని, తల్లులను నమస్కరించి వారిని తిరిగి పంపి వేసి చిత్రకూటమునుండి బయలుదేరి దండకారణ్యము వైపు వెళ్ళుచు మార్గ మధ్యమున అత్రిమహామునిని, ఆతని భార్య యైన అనసూయను, శరభంగుని, సుతీక్‌ష్ణని, అగస్త్యభ్రాతను, అగస్త్యుని చూచి నమస్కరించెను. ఆగస్త్యుని అనుగ్రహము వలన ధనస్సును, ఖడ్గమును పొంది, దండకారణ్యము చేరెను.

జనస్థానమునందు గోదావరీతీరమున, పంచవటిలో నివసించెను. భయంకరులా లైన శూర్పణఖ వారిని భక్షించుటకై అచటికి వచ్చెను. మంచి రూపము గల రాముని చూచి ఆమె కామమోహితురాలై ఇట్లు పలికెను.

శూర్పణఖ ఇట్లు పలికెను. '' నీవు ఎవరవు ? ఎక్కడనుండి వచ్చినావు ? నేను కోరుచున్నాను. నాకు భర్త వగుము. ఈ ఇద్దరినీ భక్షించెదను. ఇట్లు పలికి ఆమె సీతాలక్ష్మణులను భక్షించుటకు ఉద్యమించెను. అపుడు రాముడు ఆజ్ఞాపింపగా లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసివేసెను.

రక్తము స్రవించుచుండగా ఆమె వెళ్ళి సోదరుడైన ఖరునితో ఇట్లనెనను. '' ఖరుడా ! ముక్కు లేని నేను మరణించెదను. కాని రాముని భార్య సీత, సోదరుడు లక్ష్మణుడు ఉన్నారు. నీవు వారి గోరువెచ్చని రక్తమును త్రాగించినచో జీవించెదను.

అట్లే చేసెదను అని పలికి ఖరుడు పదునాలుగు వేలమంది రాక్షసులను, దూషణ - త్రిశిరస్కులను తనతో తీసుకొని రామునితో యుద్ధము చేయుటకు వెళ్ళెను. రాముడు కూడ యుద్ధమునందు బాణములచే రాక్షసులను కొట్టి ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, కాలిబంటులు అను నాలుగు అంగములు గల సైన్యమును, త్రిశిరన్కుని, భయంకరుడైన ఖరుని, యుద్ధము చేయుచున్న దూషణుని యమలోకమునకు పంపెను.

శూర్పణఖ లంకకు వెళ్ళి రావణుని ఎదుట నేలపై బడి, క్రుద్ధురాలై రావణునితో ఇట్లు పలికెను. ''నీవు రాజువు కావు. రక్షకుడవు కావు. ఖరాదులను చంపిన రాముని భార్య యైన సీతను హరించి భార్యను చేసికొనుము. రామలక్ష్మణుల రక్తము త్రాగిన యడలనే జీవించెదను. అట్లు కానిచో జీవింపను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana -18 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

Chapter 7
*🌻 Ayodhya Kand - Vishnu as Rama - 1 🌻*

Nārada said:

1-2. Rāma bowed to Vasiṣṭha, the mothers, (sage) Atri and his wife Anasūyā, (sages) Śarabhaṅga[1] and Sutīkṣṇa, the brother of Agastya and Agastya and reached the Daṇḍaka forest having obtained the bow and sword by the grace of (Agastya).

3. He was staying at Pañcavaṭī in the Janasthāna on the banks of the (river) Godāvarī. The awful (demoness) Śūrpaṇakhā[2] came there to devour them all.

4-5. Seeing the beautiful form of Rāma, that lustful (woman) said to him, “Who are you? Whence have you come? You become my husband being entreated by me. I shall eat these two.” So saying to him she approached them. On the words of Rāma, Lakṣmaṇa cut off her nose and ears.

6-7. She returned to her brother Khara with blood oozing out (and) said, “I shall die without a nose. I would live, O Khara! only when you would make me drink the hot blood of Sītā, the wife of Rāma and Lakṣmaṇa, his brother.

8. Khara said to her that he will do so and went there with Dūṣaṇa, Triśiras and 14000 demons in order to fight (with. Rāma).

9-10. Rāma also fought well and killed the demons with his. arrows and led the army consisting of the elephants, cavalry,. chariots and infantry together with the fighting Triśiras, Khara and Dūṣaṇa[3] to death. Śūrpaṇakhā went to Laṅkā and fell down, on the earth in front of Rāvaṇa.

11-12. (And) said to Rāvaṇa angrily, “You are neither a king, nor a protector. You abduct Sītā, the wife of Rāma, the killer of Khara and others. I will live only after drinking the blood of Rāma and Lakṣmaṇa and not by anything else.” 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join 
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 248 / DAILY WISDOM - 248 🌹*
*🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻4. విశ్వచైతన్యపు ఉనికి వివరాల కంటే భిన్నమైనది 🌻*

*చాలా కాలంగా, సాధారణ బాహ్య వివరాల నుండి స్వతంత్రంగా ఉన్న విశ్వ చైతన్య ఉనికిని ఊహించటం తత్వవేత్తలకి కష్టమైంది. ఎందుకంటే ఇది సార్వత్రికమని ఒక సంగ్రహణ తప్పుగా ఊహించబడింది కనుక. బాహ్య వివరాలలో కనిపించే కొన్ని సాధారణ లక్షణాల నుండి ఉత్పన్నమయ్యే సంభావిత సాధారణీకరణ వలన. ఉదాహరణకి గుర్రపుస్వారీ లాంటి సార్వత్రిక సూత్రం ప్రతి గుర్రం విషయంలోనూ కనిపిస్తుంది. కానీ వ్యక్తిని పదార్ధంగా చూసినప్పుడు విశ్వ చైతన్యం అంతే నాణ్యతగా ప్రతివ్యక్తిలో ఉండవలసిన అవసరం కానీ ఉన్నట్టుగా గానీ కనబడదు. ఈ విశ్వచైతన్య ఉనికి అనేది అన్ని ఆకులలో కనిపించే పచ్చదనం లేదా గులాబీలలో కనిపించే ఎరుపు వంటిదిగా, వేరే పదార్ధం యొక్క నాణ్యతగా గానీ ఉండదు.*

*సార్వత్రిక నిర్వచనంలో అంతకంటే లోతైన విషయాలు ఉన్నాయనే అవగాహన పూర్తిగా విస్మరించబడినప్పుడు మాత్రమే నామమాత్రపు దృక్పథం అనేది ఉత్పన్నమవుతుంది. స్పృహ-గ్రహణం అనే ముందస్తు మూలకం విశ్వచైతన్య ఉనికిలో ఉంటే తప్ప ఒకే చర్యలో గల అన్నింటినీ తెలిసికో గలగడం సాధ్యం కాదు. అటువంటి స్పృహతో కూడిన గ్రహింపు సామర్థ్యమే రుజువు చేస్తుంది, విశ్వచైతన్యం బాహ్య వివరాల కంటే పరిమాణంలో పెద్దదని, ప్రతిదానిలో అంతర్లీనంగా ఉంటూనే, వాటికి అతీతంగా కూడా ఉంటుదని, దాని ద్వారా అది అన్నింటినీ తెలుసు కుంటుందని, అన్నింటికంటే భిన్నమైనదని.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 248 🌹*
*🍀 📖 from Essays in Life and Eternity 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 4. A Universal Independent of Particulars 🌻*

*Philosophers, many a time, have found it difficult to imagine the existence of a universal independent of particulars. This difficulty arises because it is wrongly assumed that the universal is an abstraction, a conceptual generalisation arising from some common features seen in particulars, such as the universal principle of horseness seen to be present in each individual case of a horse. But the Universal need not be a quality depending upon an isolated individual as a substance.*

*The Universal is not like the greenness seen in all leaves or the redness seen in roses. That is to say, the Universal is not a quality of a substance other than itself. Such a nominalism of outlook in the definition of the Universal can arise only if one is completely oblivious of the fact that even the awareness of there being such things as particulars would not be possible unless there is a prior element of consciousness-grasp which knows all the particulars in a single act of attention, proving thereby that such a consciousness is larger in dimension than the particulars, is immanent in them, by which immanence it knows them, and is also transcendent to them due to which it is none of the particulars.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 149 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. నీకు ప్రయాణానికి అవసరమైన వన్నీ పరమాత్ముడు లోపలే సమకూర్చిపెట్టాడు. అది నీలో నువ్వు వెతకాలి. మనిషి తనకు తనే దీపం. పవిత్ర గ్రంథాలు నీకు మార్గదర్శక మవుతాయన్న అభిప్రాయాన్ని వదిలిపెట్టు. వాటి నించి జ్ఞానం వస్తుంది. ఆధ్యాత్మిక అన్వేషణకు అది పెద్ద అడ్డంకి. 🍀*

*మనిషి తనకు తనే దీపం. పవిత్ర గ్రంథాలు నీకు మార్గదర్శక మవుతాయన్న అభిప్రాయాన్ని వదిలిపెట్టు. వాటి నించి జ్ఞానం వస్తుంది. ఆధ్యాత్మిక అన్వేషణకు అది పెద్ద అడ్డంకి. దానికి బయటి నించీ ఏమీ అక్కర్లేదు. నీకు ప్రయాణానికి అవసరమైన వన్నీ పరమాత్ముడు లోపలే సమకూర్చిపెట్టాడు. అది నీలో నువ్వు వెతకాలి.*

*పొరపాటును వదిలి సరియినది కనిపెట్టడానికి నీ లోపలి కాంతి నీకు ఉపకరిస్తుంది. ఉనికి కేసి సాగడానికి నీకు దారి చూపిస్తుంది. యితరుల మీద ఆధారపడిన వాళ్ళు అవకాశాన్ని చేజార్చు కుంటారు. నేను మీకు దారి ఎలాంటిదో చెబుతాను. దారి చూపను. ఏ విధంగా ఏ పద్దతిలో వుంటే మీరు సత్యాన్ని అందుకుంటారో చెప్పను. మీరు మీరుగా ఉండడానికి మాత్రమే సహకరిస్తాను.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 87 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 73. వ్యర్ధులు 🌻*

*వేగవంతముగ పురుగులను తిను పక్షికిని, పెద్ద పెద్ద జంతువులను తిను రాబందులకు తేడా తెలియుట అవసరము. చిన్న చిన్న తప్పులు చేయు బలహీనులకు, భయంకరమగు తప్పులు చేయు దుష్టులకు గల వ్యత్యాసము తెలియవలెను. ప్రస్తుత కాలమున దుష్టులు వారి దౌష్ట్య నిర్వహణమున చిన్నవారి తప్పులు పెద్దవి చేసి దండించు చున్నారు. బలవంతులు బలహీనులపై ఆరోపణలు మోపి దండించు చున్నారు. ఈ బలవంతులు భూమిపై అత్యంత ధనికులుగను, భయంకరమగు శక్తివంతులుగను ఏర్పడుచు జాతిని కబళించు చున్నారు.*

*ఆధ్యాత్మికులు కూడ వీరి పంచన చేరి వారి మోచేతి నీరు త్రాగుచు దివ్యపురుషులమని తమని తాము గౌరవించుకొనుచున్నారు. పేదలకన్న ధనికులను, సామాన్యునికన్న అధికారులను ఎక్కువగా ఆదరించు సత్పురుషులందరును కలికి అమ్ముడు పోయిన వారే. వీరి వలన సామాన్య జనజీవనమునకు ఉపయోగమేమియు లేదు. గాడిదల వలె ధనికుల కర్మములను మోయుచు, పుణ్యము క్షీణింప చేసుకొనుచున్నారు. వీరిది వ్యర్థ ప్రయత్నము.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

A Living Master . . .



A living master is bound to happen to the person who is in search of truth, who wants to know the meaning of life, who wants to go to the innermost core of his being, who wants to know the depth and the height of existence. He will have to hold hands with a master.

The master is one who has already known. The master is one who has been to the other shore and has come to this shore to show you the path. But only a master can show the path - a living master, remember.


11 Mar 2022

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 355-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 355-1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 355-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 355-1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 78. భక్తిమత్-కల్పలతికా, పశుపాశ విమోచనీ ।
సంహృతాశేష పాషండా, సదాచార ప్రవర్తికా ॥ 78 ॥ 🍀


🌻 355-1. 'సంహృతాశేష పాషండా' 🌻


శేషము లేకుండ పాషండులను నశింప జేయునది శ్రీమాత అని అర్థము. పాషండత్వము కరడుగట్టిన అజ్ఞానము. ఇట్టి వారికి జ్ఞానము బోధించిననూ రుచింపదు. వీరు జ్ఞానమునం దరుచి, అజ్ఞానము నందు రుచి కలిగియుందురు. ధర్మము, శాస్త్రము, సదాచారము వంటి విషయముల యందు ఏవగింపు కలిగి యుందురు. కేవలము ఆహార నిద్రా మైథునాదులలో మునిగి యుందురు. వాని విషయమున కూడ అశుచి మెండుగ నుండును. చేయకూడని పనులయందు ఆసక్తి మెండుగ నుండును. వితండ వాదములు చేయుచు పెద్దలను అవమానించుచు వికృతముగ ప్రవర్తించు చుందురు.

ప్రస్తుతము భరత ప్రజలను కలిధర్మము ఆక్రమించి యున్నది. రహదారులలోను, వాక్కుల యందు, విద్యాలయముల యందు కూడ యువతీ యువకులు స్వేచ్ఛ పేరున చాలా వికృతముగ ప్రవర్తించు చున్నారు. సిగ్గు, ల లేక సదాచారమును వర్ణించి అడ్డగోలుగ ప్రవర్తించు చున్నారు. ఇది అంతయూ పాషండ తత్వమే.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 355-1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 78. Bhaktimatkalpalatika pashupasha vimochani
Sanhruta sheshapashanda sadachara pravartika ॥ 78 ॥ 🌻


🌻 355-1. Saṃhṛtāśeṣa-pāṣaṇḍā संहृताशेष-पाषण्डा 🌻


She is referred in this nāma as the destroyer of heretics. Heretics are those who do not follow the principles laid down by Veda-s. Fourteen places (which include the four Veda-s and their extensions are referred to as the principle domains of dharma.

Those men who cross the boundaries of the principles of dharma are called pāṣaṇḍa or heresy. She destroys all those who act against the principles of Veda-s.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


11 Mar 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 151. విమర్శ / Osho Daily Meditations - 151. CRITICISM


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 151 / Osho Daily Meditations - 151 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 151. విమర్శ 🍀


🕉. మీరు దేనినైనా విమర్శించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, దానికి సానుకూల ప్రత్యామ్నాయంగా మీరు ఏమి ఇవ్వబోతున్నారో మొదట నిర్ణయించుకోండి. 🕉

మీ విమర్శకు ప్రత్యామ్నాయం గురించి మీరు ఆలోచించ లేకపోతే, వేచి ఉండండి. విమర్శలు చేయవద్దు, ఎందుకంటే అది వ్యర్థం. సరైన ఔషధం ఎక్కడ ఉంది అని చెప్పకుండా ఈ ఔషధం సరైనది కాదని మీరు చెబితే, మీరు చెప్పింది నిజమే అయినా అది సరైనదిగా మారదు. విమర్శలు ఎప్పుడూ విప్లవాన్ని కలిగించవు. సానుకూల కార్యక్రమంలో భాగంగా మాత్రమే విమర్శలు బాగుంటాయి.

కాబట్టి మొదట సానుకూల కార్యక్రమం గురించి నిర్ణయించుకోండి, ఆపై, ఆ కార్యక్రమంపై నిఘా ఉంచండి, అప్పుడు విమర్శించండి. అప్పుడు మీ విమర్శ, మీరు విమర్శించే వారిచే చాలా విలువైనది అని ప్రశంసించ బడుతుంది. దీనివల్ల ఎవరూ బాధపడరు. ఎందుకంటే మీరు విమర్శిస్తున్నప్పుడు, మీరు నిరంతరం కొంత సానుకూల ప్రత్యామ్నాయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆపై ఏదో ప్రతిపాదిస్తున్నారు కనుక.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹





🌹 Osho Daily Meditations - 151 🌹

📚. Prasad Bharadwaj

🍀 151. CRITICISM 🍀

🕉 Whenever you are ready to criticize something, first decide what you are going to give as a positive alternative to it. 🕉


If you can't think of an alternative to your criticism, wait. Don't make the criticism, because it is futile. If you say that this medicine is not right, maybe you are right, but then where is the right medicine? Criticism never brings revolution. Criticism is good as part of a positive program.

So first decide about the positive program and then, keeping an eye on the positive program, criticize. Then your criticism will be very valuable, appreciated even, by those whom you are criticizing. Nobody will feel offended by it, because while you are criticizing, you are continuously keeping some positive alternative in mind and then proposing something.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


11 Mar 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 162


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 162 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. విషువత్ - 2 🌻


సంవత్సరాదిని నిర్ణయించుటకు వేదఋషులు ఒక పుల్లను పాతి దాని నీడను కొలిచి ఈ దినమును స్థాపించెడి వారు. ఈ బిందువు నుండి సమస్త ఖగోళ గణితములను లెక్కించెడివారు. ఈ బిందువు ప్రతి సంవత్సరము భూమధ్యరేఖపై కొంచెము వెనుకకు నడుచు చుండును. ఈ నడచుటనే "గవామయము" అను యజ్ఞముగా వేద ఋషులు గుర్తించిరి. ఈ బిందువుతోపాటు సంవత్సరాది కూడ వెనుకకు నడచు చుండును. దీనినే కాలస్వరూపుడగు శంకరుడు మృగరూపమైన యజ్ఞమును వేటాడుటగా కవులు వర్ణించిరి.

'నల్లలేడి యందు దృష్టి నిలిపి వింటియందెక్కు పెట్టిన బాణమును చూచుకొనుచున్న నీవు మృగము వెంట పరుగెత్తుచున్న పినాకపాణి వలె నున్నావు.' అని కాళిదాస కృతమగు శాకుంతల నాటకమున మాతలి దుష్యంతుని ప్రశంసించును. నాటకము మొత్తము నందును చాంద్ర సంవత్సరము యొక్క కథ అంతర్వాహినిగా నడచును. కనుకనే దుష్యంతుడు చాంద్రవంశపు రాజుగా చమత్కరింపబడెను.

ఈ బిందువునకై భూమధ్యరేఖ ఖండింపబడుటకు కావలసిన సూర్యగతి‌ ధ్రువుని కాలముననే పుట్టినది.


....✍🏼 మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


11 Mar 2022

శ్రీ శివ మహా పురాణము - 532 / Sri Siva Maha Purana - 532


🌹 . శ్రీ శివ మహా పురాణము - 532 / Sri Siva Maha Purana - 532 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 47

🌻.శివుని అంతఃపుర ప్రవేశము - 2 🌻


ఇంతలో జ్యోతిశ్శాస్త్ర పండితుడగు గర్గుడు పర్వతరాజగు హిమవంతుని వద్దకు వచ్చి ఇట్లనెను (13).

ఓ పర్వత రాజా! హిమాలయా! స్వామీ! ప్రభూ! కాళీపతియగు శంభుని పాణి గ్రహణము కొరకు నీ మందిరమునకు దోడ్కొని రమ్ము(14).


బ్రహ్మ ఇట్లు పనికెను-

కన్యా దానమునకు సమయ మాసన్నమైనది గుర్తించి గర్గుడు నివేదించగా అపుడు హిమవంతుడు మనస్సులో చాల సంతసించెను (15). అపుడు ఆ హిమవంతుడు పర్వతులను, బ్రాహ్మణులను, మరియు ఇతరులను శివుని తీసుకొని వచ్చుట కొరకై ఆనందముతో పంపెను (16). ఆపర్వతులు మరియు బ్రాహ్మణులు మంగళ ద్రవ్యములన్నిటినీ చేతుల యందు పట్టుకొని ఉత్సాహముతో మహేశ్వరుడు నివసించిన స్ధానమునకు వెళ్లిరి(17). అపుడచట వాద్య ఘోష, విస్తారమగు వేదఘోష మరియు గీతములతో నృత్యములతో మహోత్సాహము వర్ధిల్లెను(18).

వాద్యముల శబ్దమును విని శంకరుని గణములు,దేవతలు ,ఋషులు అందరు ఒక్కసారిగా ఆనందముతో లేచి నిలబడిరి (19). ఆనందముతో నిండిన మనస్సు గల వారందరు వారిలో వారు ఇట్లు మాటలాడు కొనిరి. శివుని దోడ్కొని వెళ్లుటకై ఇచటకు పర్వతులు వచ్చు చున్నారు (20). పాణి గ్రహణ ముహూర్తము చాల తొందరగా ఆసన్నమైనది. మనందరికి మహాభాగ్యము సంపన్న మైనదని భావించుచున్నాము(21).మనము చాల ధన్యులము. సందేహము లేదు. ఏలయన,లోకములకు మంగళములను కలిగించే పార్వతీ పరమేశ్వరుల వివాహమును పరమానందముతో చూడబోయెదము(22).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 532 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 47 🌴

🌻 The ceremonious entry of Śiva - 2 🌻


13. In the meantime Garga, a great expert in the science of astrology, spoke to Himavat, the lord of mountains.

Garga said:—

14. O Himavat, O lord, O father of Pārvatī, now fetch Śiva to your palace for the marriage rites.

Brahmā said:—

15. On realising that the auspicious time for the marriage rites had been intimated by Garga, the mountain rejoiced much.

16. With the desire to bring Śiva there, the mountain gladly sent mountains, brahmins and others.

17. The mountains and brahmins with auspicious holy objects in their hands jubilantly went to the place where lord Śiva stood.

18. Then the sound of the Vedic chants, musical instruments, songs and dances jubilantly arose there.

19. On hearing the loud sound of musical instruments trumpets etc. the attendants of Śiva simultaneously got up joyously along with the gods and sages.

20. With great joy m their minds they said to one another—“O here come the mountains to take Śiva over there!

21. The auspicious hour for marriage rites has come. We consider that our fortune is imminent.

22. Indeed we are highly blessed as to witness the marriage ceremony of Śiva and Pārvatī, highly portentous of the good fortune of all the worlds.”


Continues....

🌹🌹🌹🌹🌹


11 Mar 2022

గీతోపనిషత్తు -334


🌹. గీతోపనిషత్తు -334 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 28-1 📚


🍀 28-1. సన్యాస యోగము - సన్యాస యోగమనగా కర్మఫలములను సన్యసించుట, కర్మములను సన్యసించుట కాదు. కర్తవ్యకర్మలను నిర్వర్తించుచు అందుండి ఏర్పడు ఫలములను సన్యసింపవలెను. ఫలముల యందాసక్తితో కర్మము నిర్వర్తించువారు బద్దులగుచునే యుందురు. ఫలాసక్తి లేక నిత్యనైమిత్తిక కర్మలను నిర్వర్తించు చుండుటచే జీవుడు స్థితప్రజ్ఞు డగును. ఇదియే నిష్కామ కర్మయోగము లేక కర్మఫల సన్యాస యోగము. 🍀


28. శుభాశుభఫలై రేవం మోక్ష్యసే కర్మబంధనైః |
సన్న్యాసయోగయుక్తాత్మా విముక్తో మా ముపైష్యసి ||

🌻. తాత్పర్యము : పై విధముగ సర్వమును నాకు సమర్పణ చేసుకొనిన వానికి పాపపుణ్య ఫలముల బంధము విడువబడును. నాతో సమ్య జ్ఞాన యోగమున సమస్తము నుండి విముక్తి చెంది నన్ను పొందిన వాడగును.

🌻. వివరణము : ఈ శ్లోకమున ప్రధానముగ రెండు విషయములు భగవానుడు తెలియజేయు చున్నాడు.

1. సన్యాస యోగము. 2. కర్మబంధము నుండి విముక్తి.

సన్యాస యోగమనగా కర్మఫలములను సన్యసించుట, కర్మము లను సన్యసించుట కాదు. కర్తవ్యకర్మలను నిర్వర్తించుచు అందుండి ఏర్పడు ఫలములను సన్యసింపవలెను. ఫలముల యందాసక్తితో కర్మము నిర్వర్తించువారు బద్దులగుచునే యుందురు. కర్తవ్య కర్మలను నిర్వర్తింపకున్నచో కూడ బంధము లేర్పడును. నిర్వర్తించు నపుడు ఫలములందాసక్తి యున్నచో బంధము లుండును.

ఫలాసక్తి లేక నిత్యనైమిత్తిక కర్మలను నిర్వర్తించు చుండుటచే జీవుడు స్థితప్రజ్ఞు డగును. ఇదియే నిష్కామ కర్మయోగము లేక కర్మఫల సన్యాస యోగము. ఫలముల యందాసక్తి లేక చేయవలసిన పనియందే శ్రద్ధా భక్తులు గలవారు క్రమముగ ఫల సన్యాసమేగాక సంకల్ప సన్యాసము గూడ నిర్వర్తింతురు. స్వంత సంకల్పములు గలవానికి, వానిని సిద్ధింప చేసుకొన వలెనను ఆకాంక్ష యుండును. దాని వలన కర్మబంధ మేర్పడు చుండును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


11 Mar 2022

11 - MARCH - 2022 శుక్రవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 11, శుక్రవారం, మార్చి 2022 భృగు వాసరే 🌹
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 28-1 - 334 - సన్యాస యోగము 🌹 
3) 🌹. శివ మహా పురాణము - 532 / Siva Maha Purana - 532 🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -162 🌹  
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 151 / Osho Daily Meditations - 151 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 355-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 355-1 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శుక్రవారం మిత్రులందరికీ 🌹*
*భృగు వాసరే, 11, మార్చి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. శ్రీ మహాలక్ష్మి స్తోత్రం - 13 🍀*

25. ఏతచ్ఛ్రుత్వాఽగస్తివాక్యం హృష్యమాణా హరిప్రియా |
ఉవాచ మధురాం వాణీం తుష్టాహం తవ సర్వదా
26. యత్త్వయోక్తమిదం స్తోత్రం యః పఠిష్యతి మానవః |
శృణోతి చ మహాభాగః తస్యాహం వశవర్తినీ

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : వివేకం, సంకల్పం, బలం అనే మూడు శక్తులు కలిసి ఉంటే ఎంతటి పనులైనా సాధించ వచ్చు. సాఫల్యత తధ్యం. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం, శిశిర ఋతువు, 
ఫాల్గుణ మాసం
తిథి: శుక్ల-నవమి 32:09:29 వరకు
తదుపరి శుక్ల-దశమి
నక్షత్రం: మృగశిర 14:36:23 వరకు
తదుపరి ఆర్ద్ర
యోగం: ఆయుష్మాన్ 27:10:07 వరకు
తదుపరి సౌభాగ్య
కరణం: బాలవ 18:51:39 వరకు
వర్జ్యం: 24:01:36 - 25:49:20
దుర్ముహూర్తం: 08:50:55 - 09:38:45
మరియు 12:50:08 - 13:37:59
రాహు కాలం: 10:56:30 - 12:26:13
గుళిక కాలం: 07:57:05 - 09:26:48
యమ గండం: 15:25:38 - 16:55:21
అభిజిత్ ముహూర్తం: 12:03 - 12:49
అమృత కాలం: 04:40:32 - 06:28:48
మరియు 30:18:40 - 32:06:24
సూర్యోదయం: 06:27:23
సూర్యాస్తమయం: 18:25:04
చంద్రోదయం: 12:23:56
చంద్రాస్తమయం: 01:11:02
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: జెమిని
మానస యోగం - కార్య లాభం 14:36:23
వరకు తదుపరి పద్మ యోగం
 - ఐశ్వర్య ప్రాప్తి 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -334 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 28-1 📚*
 
*🍀 28-1. సన్యాస యోగము - సన్యాస యోగమనగా కర్మఫలములను సన్యసించుట, కర్మములను సన్యసించుట కాదు. కర్తవ్యకర్మలను నిర్వర్తించుచు అందుండి ఏర్పడు ఫలములను సన్యసింపవలెను. ఫలముల యందాసక్తితో కర్మము నిర్వర్తించువారు బద్దులగుచునే యుందురు. ఫలాసక్తి లేక నిత్యనైమిత్తిక కర్మలను నిర్వర్తించు చుండుటచే జీవుడు స్థితప్రజ్ఞు డగును. ఇదియే నిష్కామ కర్మయోగము లేక కర్మఫల సన్యాస యోగము. 🍀*

*28. శుభాశుభఫలై రేవం మోక్ష్యసే కర్మబంధనైః |*
*సన్న్యాసయోగయుక్తాత్మా విముక్తో మా ముపైష్యసి ||*

*🌻. తాత్పర్యము : పై విధముగ సర్వమును నాకు సమర్పణ చేసుకొనిన వానికి పాపపుణ్య ఫలముల బంధము విడువబడును. నాతో సమ్య జ్ఞాన యోగమున సమస్తము నుండి విముక్తి చెంది నన్ను పొందిన వాడగును.*

*🌻. వివరణము : ఈ శ్లోకమున ప్రధానముగ రెండు విషయములు భగవానుడు తెలియజేయు చున్నాడు.*
*1. సన్యాస యోగము. 2. కర్మబంధము నుండి విముక్తి.*

*సన్యాస యోగమనగా కర్మఫలములను సన్యసించుట, కర్మము లను సన్యసించుట కాదు. కర్తవ్యకర్మలను నిర్వర్తించుచు అందుండి ఏర్పడు ఫలములను సన్యసింపవలెను. ఫలముల యందాసక్తితో కర్మము నిర్వర్తించువారు బద్దులగుచునే యుందురు. కర్తవ్య కర్మలను నిర్వర్తింపకున్నచో కూడ బంధము లేర్పడును. నిర్వర్తించు నపుడు ఫలములందాసక్తి యున్నచో బంధము లుండును.*

*ఫలాసక్తి లేక నిత్యనైమిత్తిక కర్మలను నిర్వర్తించు చుండుటచే జీవుడు స్థితప్రజ్ఞు డగును. ఇదియే నిష్కామ కర్మయోగము లేక కర్మఫల సన్యాస యోగము. ఫలముల యందాసక్తి లేక చేయవలసిన పనియందే శ్రద్ధా భక్తులు గలవారు క్రమముగ ఫల సన్యాసమేగాక సంకల్ప సన్యాసము గూడ నిర్వర్తింతురు. స్వంత సంకల్పములు గలవానికి, వానిని సిద్ధింప చేసుకొన వలెనను ఆకాంక్ష యుండును. దాని వలన కర్మబంధ మేర్పడు చుండును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 532 / Sri Siva Maha Purana - 532 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 47

*🌻.శివుని అంతఃపుర ప్రవేశము - 2 🌻*

 ఇంతలో జ్యోతిశ్శాస్త్ర పండితుడగు గర్గుడు పర్వతరాజగు హిమవంతుని వద్దకు వచ్చి ఇట్లనెను (13).

ఓ పర్వత రాజా! హిమాలయా! స్వామీ! ప్రభూ! కాళీపతియగు శంభుని పాణి గ్రహణము కొరకు నీ మందిరమునకు దోడ్కొని రమ్ము(14).

బ్రహ్మ ఇట్లు పనికెను-

కన్యా దానమునకు సమయ మాసన్నమైనది గుర్తించి గర్గుడు నివేదించగా అపుడు హిమవంతుడు మనస్సులో చాల సంతసించెను (15). అపుడు ఆ హిమవంతుడు పర్వతులను, బ్రాహ్మణులను, మరియు ఇతరులను శివుని తీసుకొని వచ్చుట కొరకై ఆనందముతో పంపెను (16). ఆపర్వతులు మరియు బ్రాహ్మణులు మంగళ ద్రవ్యములన్నిటినీ చేతుల యందు పట్టుకొని ఉత్సాహముతో మహేశ్వరుడు నివసించిన స్ధానమునకు వెళ్లిరి(17). అపుడచట వాద్య ఘోష, విస్తారమగు వేదఘోష మరియు గీతములతో నృత్యములతో మహోత్సాహము వర్ధిల్లెను(18).

వాద్యముల శబ్దమును విని శంకరుని గణములు,దేవతలు ,ఋషులు అందరు ఒక్కసారిగా ఆనందముతో లేచి నిలబడిరి (19). ఆనందముతో నిండిన మనస్సు గల వారందరు వారిలో వారు ఇట్లు మాటలాడు కొనిరి. శివుని దోడ్కొని వెళ్లుటకై ఇచటకు పర్వతులు వచ్చు చున్నారు (20). పాణి గ్రహణ ముహూర్తము చాల తొందరగా ఆసన్నమైనది. మనందరికి మహాభాగ్యము సంపన్న మైనదని భావించుచున్నాము(21).మనము చాల ధన్యులము. సందేహము లేదు. ఏలయన,లోకములకు మంగళములను కలిగించే పార్వతీ పరమేశ్వరుల వివాహమును పరమానందముతో చూడబోయెదము(22).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 532 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 47 🌴*

*🌻 The ceremonious entry of Śiva - 2 🌻*

13. In the meantime Garga, a great expert in the science of astrology, spoke to Himavat, the lord of mountains.
Garga said:—

14. O Himavat, O lord, O father of Pārvatī, now fetch Śiva to your palace for the marriage rites.
Brahmā said:—

15. On realising that the auspicious time for the marriage rites had been intimated by Garga, the mountain rejoiced much.

16. With the desire to bring Śiva there, the mountain gladly sent mountains, brahmins and others.

17. The mountains and brahmins with auspicious holy objects in their hands jubilantly went to the place where lord Śiva stood.

18. Then the sound of the Vedic chants, musical instruments, songs and dances jubilantly arose there.

19. On hearing the loud sound of musical instruments trumpets etc. the attendants of Śiva simultaneously got up joyously along with the gods and sages.

20. With great joy m their minds they said to one another—“O here come the mountains to take Śiva over there!

21. The auspicious hour for marriage rites has come. We consider that our fortune is imminent.

22. Indeed we are highly blessed as to witness the marriage ceremony of Śiva and Pārvatī, highly portentous of the good fortune of all the worlds.”

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 162 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. విషువత్ - 2 🌻*

*సంవత్సరాదిని నిర్ణయించుటకు వేదఋషులు ఒక పుల్లను పాతి దాని నీడను కొలిచి ఈ దినమును స్థాపించెడి వారు. ఈ బిందువు నుండి సమస్త ఖగోళ గణితములను లెక్కించెడివారు. ఈ బిందువు ప్రతి సంవత్సరము భూమధ్యరేఖపై కొంచెము వెనుకకు నడుచు చుండును. ఈ నడచుటనే "గవామయము" అను యజ్ఞముగా వేద ఋషులు గుర్తించిరి. ఈ బిందువుతోపాటు సంవత్సరాది కూడ వెనుకకు నడచు చుండును. దీనినే కాలస్వరూపుడగు శంకరుడు మృగరూపమైన యజ్ఞమును వేటాడుటగా కవులు వర్ణించిరి.*

*'నల్లలేడి యందు దృష్టి నిలిపి వింటియందెక్కు పెట్టిన బాణమును చూచుకొనుచున్న నీవు మృగము వెంట పరుగెత్తుచున్న పినాకపాణి వలె నున్నావు.' అని కాళిదాస కృతమగు శాకుంతల నాటకమున మాతలి దుష్యంతుని ప్రశంసించును. నాటకము మొత్తము నందును చాంద్ర సంవత్సరము యొక్క కథ అంతర్వాహినిగా నడచును. కనుకనే దుష్యంతుడు చాంద్రవంశపు రాజుగా చమత్కరింపబడెను.*

*ఈ బిందువునకై భూమధ్యరేఖ ఖండింపబడుటకు కావలసిన సూర్యగతి‌ ధ్రువుని కాలముననే పుట్టినది.*

....✍🏼 *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 151 / Osho Daily Meditations - 151 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 151. విమర్శ 🍀*

*🕉. మీరు దేనినైనా విమర్శించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, దానికి సానుకూల ప్రత్యామ్నాయంగా మీరు ఏమి ఇవ్వబోతున్నారో మొదట నిర్ణయించుకోండి. 🕉*
 
*మీ విమర్శకు ప్రత్యామ్నాయం గురించి మీరు ఆలోచించ లేకపోతే, వేచి ఉండండి. విమర్శలు చేయవద్దు, ఎందుకంటే అది వ్యర్థం. సరైన ఔషధం ఎక్కడ ఉంది అని చెప్పకుండా ఈ ఔషధం సరైనది కాదని మీరు చెబితే, మీరు చెప్పింది నిజమే అయినా అది సరైనదిగా మారదు. విమర్శలు ఎప్పుడూ విప్లవాన్ని కలిగించవు. సానుకూల కార్యక్రమంలో భాగంగా మాత్రమే విమర్శలు బాగుంటాయి.*

*కాబట్టి మొదట సానుకూల కార్యక్రమం గురించి నిర్ణయించుకోండి, ఆపై, ఆ కార్యక్రమంపై నిఘా ఉంచండి, అప్పుడు విమర్శించండి. అప్పుడు మీ విమర్శ, మీరు విమర్శించే వారిచే చాలా విలువైనది అని ప్రశంసించ బడుతుంది. దీనివల్ల ఎవరూ బాధపడరు. ఎందుకంటే మీరు విమర్శిస్తున్నప్పుడు, మీరు నిరంతరం కొంత సానుకూల ప్రత్యామ్నాయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆపై ఏదో ప్రతిపాదిస్తున్నారు కనుక.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 151 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 151. CRITICISM 🍀*

*🕉 Whenever you are ready to criticize something, first decide what you are going to give as a positive alternative to it. 🕉*
 
*If you can't think of an alternative to your criticism, wait. Don't make the criticism, because it is futile. If you say that this medicine is not right, maybe you are right, but then where is the right medicine? Criticism never brings revolution. Criticism is good as part of a positive program.*

*So first decide about the positive program and then, keeping an eye on the positive program, criticize. Then your criticism will be very valuable, appreciated even, by those whom you are criticizing. Nobody will feel offended by it, because while you are criticizing, you are continuously keeping some positive alternative in mind and then proposing something.*
  
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 355-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 355-1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 78. భక్తిమత్-కల్పలతికా, పశుపాశ విమోచనీ ।*
*సంహృతాశేష పాషండా, సదాచార ప్రవర్తికా ॥ 78 ॥ 🍀*

*🌻 355-1. 'సంహృతాశేష పాషండా' 🌻* 

*శేషము లేకుండ పాషండులను నశింప జేయునది శ్రీమాత అని అర్థము. పాషండత్వము కరడుగట్టిన అజ్ఞానము. ఇట్టి వారికి జ్ఞానము బోధించిననూ రుచింపదు. వీరు జ్ఞానమునం దరుచి, అజ్ఞానము నందు రుచి కలిగియుందురు. ధర్మము, శాస్త్రము, సదాచారము వంటి విషయముల యందు ఏవగింపు కలిగి యుందురు. కేవలము ఆహార నిద్రా మైథునాదులలో మునిగి యుందురు. వాని విషయమున కూడ అశుచి మెండుగ నుండును. చేయకూడని పనులయందు ఆసక్తి మెండుగ నుండును. వితండ వాదములు చేయుచు పెద్దలను అవమానించుచు వికృతముగ ప్రవర్తించు చుందురు.*

*ప్రస్తుతము భరత ప్రజలను కలిధర్మము ఆక్రమించి యున్నది. రహదారులలోను, వాక్కుల యందు, విద్యాలయముల యందు కూడ యువతీ యువకులు స్వేచ్ఛ పేరున చాలా వికృతముగ ప్రవర్తించు చున్నారు. సిగ్గు, ల లేక సదాచారమును వర్ణించి అడ్డగోలుగ ప్రవర్తించు చున్నారు. ఇది అంతయూ పాషండ తత్వమే.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 355-1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 78. Bhaktimatkalpalatika pashupasha vimochani*
*Sanhruta sheshapashanda sadachara pravartika ॥ 78 ॥ 🌻*

*🌻 355-1. Saṃhṛtāśeṣa-pāṣaṇḍā संहृताशेष-पाषण्डा 🌻*

*She is referred in this nāma as the destroyer of heretics. Heretics are those who do not follow the principles laid down by Veda-s. Fourteen places (which include the four Veda-s and their extensions are referred to as the principle domains of dharma.*

*Those men who cross the boundaries of the principles of dharma are called pāṣaṇḍa or heresy. She destroys all those who act against the principles of Veda-s.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

గురువు ఓ అనంత శక్తి, తేజోమయ దీప్తి !! Guru is Infinite Power, Tejomaya Deepti !!


గురువు పలికే ప్రతివాక్యం ఓ సత్యకావ్యమవుతుంది.

గురువు ఓ అనంత శక్తి, తేజోమయ దీప్తి!! 🌹🙏🏻🙏🏻


గురువు పలికే ప్రతి పలుకు భావికి ఓ పిలుపు అవుతుంది. జీవితానికో మలుపు అవుతుంది.

గురువుబోధ అమృత బిందువుల్ని కురిపిస్తుంది.

గురువు అనురాగంలో ఓ ప్రత్యేకత , ఓ విశిష్టత ఉంటుంది.

ఆయన దృష్టి- మనలో పరివర్తన కోసం. ప్రయత్నిస్తుంది. పరిశీలన చేస్తుంది. మనల్ని జ్ఞానమూర్తులుగా, మార్చి జీవిత గమ్యం వైపు నడిపిస్తాడు. అంతిమ లక్ష్యాలను దర్శింపజేస్తాడు . మనలో పరివర్తనని తెప్పిస్తాడు. కర్తవ్యం బోధిస్తాడు. మనల్ని ‘పర’తత్త్వం వైపు పయనించేలా చేస్తాడు.

జీవితాలకు గురువు ఓ అర్థాన్ని, పరమార్థాన్ని, పర అర్థాన్ని, ఆపాదింపజేసి మనల్ని తరింపజేస్తాడు. పూర్ణత్వాన్ని ప్రసాదిస్తాడు. పరిపూర్ణత్వాన్ని అనుగ్రహిస్తాడు.


అతడు- గురువు సద్గురువు జగద్గురువు.

అతడు గీతాకారుడు కావచ్చును. మరొకరు కావచ్చు. రూపాలే వేరు స్వరూపం



10 Mar 2022

మైత్రేయ మహర్షి బోధనలు - 86


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 86 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 72. సౌందర్య ఉపాసనము 🌻



విసుగు, చిరాకు, కోపము మనిషియందు విషమును పుట్టించును. పుట్టిన విషము నాడులగుండా ప్రవహించి దేహ మంతయు మలినము చేయును. అట్టి వారికి రకరకములైన మందులు వేయుటతో మరికొంత ప్రమాదము జరుగును. వారికి తగిన చికిత్స విశ్రాంతి. వారికి ఎంత విశ్రాంతి ఏర్పరచిన అంత స్వస్థత చేకూరును.

సుందరము, పవిత్రము, ప్రశాంతము అయిన ప్రదేశములలో జీవించుట ఇట్టి రోగులకు అతిముఖ్యము. ప్రకృతి సహజ సౌందర్యము నుండి ఉద్భవించు తరంగములు ఎట్టి విషపూరిత రోగమునైనను పరిష్కరించ గలదు. సౌందర్యోపాసన ప్రాణమునకు బలము నిచ్చును. ఈ ఉపాసన సహజముగ సాగవలెను.



సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


10 Mar 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 148


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 148 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. అవసరమయిన ఏకైక విషయం మెలకువ. మనుషులు అక్కర్లేని వాటిల్లో పడికొట్టుకు పోతూ వుంటారు. అనవసరమయిన వాటి కోసం ఆత్మను అమ్ముకుంటారు. 🍀


అవసరమయిన ఏకైక విషయం మెలకువ. మనుషులు అక్కర్లేని వాటిల్లో పడికొట్టుకుపోతూ వుంటారు. అవసరమయిన వాటి పట్ల అప్రమత్తంగా వుండాలి. వాళ్ళు అవసరం అయిన వాటిని అనవసరమయిన వాటి కోసం ఖర్చు పెడతారు.

అనవసరమయిన వాటి కోసం ఆత్మను అమ్ముకుంటారు. అందువల్లే ఆత్మని అమ్ముకుని ఆత్మలేని వాళ్ళుగా మిగుల్తారు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


10 Mar 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 247 - 3. భౌతిక అవయవాల వైవిధ్యాన్ని అధిగమించి అస్థిత్వాన్ని కలిగి ఉన్నవాడు మానవుడు / DAILY WISDOM - 247 - 3. A Human Being Transcends the Diversity of the Physical Limbs



🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 247 / DAILY WISDOM - 247 🌹

🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 3. భౌతిక అవయవాల వైవిధ్యాన్ని అధిగమించి అస్థిత్వాన్ని కలిగి ఉన్నవాడు మానవుడు. 🌻


ఆత్మ సార్వత్రికమైనది కనుక- విశ్వజనీనత కానిది దానిని నశింప జేస్తుంది. కాబట్టి ప్రపంచంలోని దేనిలోనైనా ఆత్మ యొక్క ఉనికి, సార్వత్రిక ఉనికి ప్రత్యేకించి అన్నింటిలోనూ అంతర్లీనంగా ఉంటుంది. ఈ విశ్వజనీనత ఏ రకమైన ప్రదేశాలలో ఎంత మేరకు ఉందనే అవగాహనా కొలమానంలో ఆధ్యాత్మికత, లేదా మతంలో సాధారణంగా చెప్పబడే జీవితంలోని ఉన్నత విలువలను సూచించడానికి వర్తించే హోదా ఉంటుంది. మానవ శరీరం, కుటుంబం, సమాజం, దేశం లేదా మొత్తం ప్రపంచం మన ముందు వివిధ స్థాయిలలో ఈ విశ్వజనీనత యొక్క కార్యకలాపాలకు ఉదాహరణగా నిలుస్తుంది.

మానవ వ్యక్తిత్వం, శారీరకంగా చెప్పాలంటే, శరీర నిర్మాణ శాస్త్రం మరియు శరీరధర్మ శాస్త్రం, భౌతిక మరియు రసాయన లక్షణాల కలయికగా చెప్పబడినప్పటికీ మొత్తం విశ్వ నమూనాలో కూడా ఉంటుంది. మొత్తం వ్యవస్థను విస్తరించి ఉన్న జీవశక్తితో, మానవుడు ఎముక మరియు మాంసం మాత్రమే కాదు అంతకు మించి మొత్తం వ్యాపించి ఉంటాడు. వాస్తవాన్ని మరింత లోతుగా పరిశోధించినప్పుడు శరీరంలోని కొన్ని అవయవాలను వైద్య చర్య ద్వారా తీసివేసినప్పటికీ, మనిషి భౌతిక అవయవాల వైవిధ్యాన్ని కూడా మించిపోయి, మొత్తం స్వీయ-సమాన అస్తిత్వంగా ఉన్నాడనే జ్ఞానం స్పష్టమవుతుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 DAILY WISDOM - 247 🌹

🍀 📖 from Essays in Life and Eternity 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj


🌻 3. A Human Being Transcends the Diversity of the Physical Limbs 🌻

Since Spirit is universal—because non-universality would make it perishable—the presence of the Spirit in anything is, in fact, the Universal Existence being immanent in the particular. Spirituality, or religion, a designation that has generally been applied to signify the higher values of life, consists, then, in the measure of awareness of the extent to which the Universal Principle inhabits locations of any kind. The human body, the family, the community, the province, the nation, or the world as a whole stands before us as an example of the operation of the Universal in different degrees of particularity.

Human individuality, physically speaking, is all anatomy and physiology, a combination of physical and chemical properties cohering into the pattern of a whole, with vitality pervading the whole system, so that the human being is not just bone and flesh and it transcends the diversity of the physical limbs. This is common knowledge, and it becomes clear when one investigates into the fact of man remaining a whole as a self-identical entity even if some limbs of the body are to be taken away by medical operation.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


10 Mar 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 17 / Agni Maha Purana - 17


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 17 / Agni Maha Purana - 17 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 6

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. అయోధ్యాకాండ వర్ణనము - 4 🌻

గోళ్ళచే సీతను గీరిన కాకి నేత్రమును, రాముడు ఐషీకాస్త్రము ప్రయోగించి పోగొట్టెను. ఆ కాకి దేవతలను విడచి మరల రామునే శరణుజొచ్చినది. రాముడు అరణ్యమునకు వెళ్ళిన ఆరవ దినమున దశరథుడు పూర్వము జరిగిన కథను చెప్పెను. నేను కౌమారవయస్సులో ఉన్నప్పుడు సరయూ తీరమునందు కుంభమును నీటిలో ముంచి శబ్దము చేయుచున్న యజ్ఞదత్తుడనే పిల్లవానిని శబ్ధవేధిని ఉపయోగించి చంపితిని. అతని తల్లిదండ్రులు చాల విలపించిరి. అతని తండ్రి ''మే మిరువురము పుత్ర శోకముతో మరణించుచన్నాము. నీవు కూడ పుత్రశోకముతో పుత్రుని స్మరించుచు మరణించెదవు '' అని నన్ను శపించెను. కౌసల్యా ! నా కీ విధముగ మణము రానున్నది. '' ఈ విధముగ కథను చెప్పి హా రామా! అని అనుచు రాజు స్వర్గము పొందెను.

అతడు శోకపీడితుడై నిద్రించినా డని తలచి కౌసల్య నిద్రించెను. ప్రాతఃకాలమున సూతమాగధబందులు మేల్కొలుపుటకై వచ్చి శయనించి ఉన్న ఆతనిని మేల్కొలిపిరి. మరణించిన ఆతడు లేవలేదు. ఆతడు మరణించినా డని గ్రహించి కౌసల్య ''అయ్యో! చచ్చితిని '' చచ్చితిని అనుచు ఏడ్చెను. పురుషులును స్త్రీలును ఏడ్వ మొదలిడిరి.

వసిష్ఠాదులు మేనమామ ఇంటిలోనున్న శత్రుఘ్న సమేతుడైన భరతుని శీఘ్రముగా ఆయోధ్యకు రప్పించిరి. శోకముతో నిండిన ఆ నగరిని చూచి, దుఃఖితుడై, బరతుడు ''అపకీర్తి వచ్చి నెత్తిమీద పడినది కదా!'' అని కై కేయిని నిందించెను. కౌసల్యను ప్రశంసించి, నూనె తొట్టెలో పెట్టిన తండ్రికి సరయూనదీ తీరమున సంస్కారము చేసెను. ''రాజ్యము చేయుము' అని వసిష్ఠాదులు పలుకగా ఇట్లనెను.

రాముని తీసికొని వచ్చుటకు వెళ్లెదను. బలశాలియైన రాముడే ఆందరిచేత రాజుగా అంగీకరింపబడినవాడు. శృంగి చేరము వెళ్ళి, అచ్చటినుండి ప్రయాగవెళ్ళి భరద్వాజుని విందు స్వీకరించి భరద్వాజునికి నమస్కరించి రామలక్ష్మణుల వద్దకు చేరెను. ''రామా! మన తండ్రిగారు స్వర్గస్థులైనారు. నీవు అయోధ్యలో రాజువగుము. నేను నీ ఆదేశమును ఎదురు చూచుచు వనమునకు వెళ్లెదను '' అని పలికెను.

రాముడా మాటలు విని తండ్రికి తర్పణములు చేసి, భరతునితో ఇట్లనెను. ''నీవు పాదుకలు తీసికొని వెళ్ళుము. సత్యపాలనమునకై జటలను నార చీరలును ధరించిన నేను రాజ్యము చేయుటకై రాను.'' రాముడు ఈ విధముగా పలుకగా భరతుడు తిరిగి వెళ్ళి, అయోధ్యను విడచి, నందిగ్రామములో నివసించుచు, ఆ పాదుకలను పూజించుచు రాజ్యమును పాలించెను.

ఆగ్ని మహాపురాణములో రామాయనకథలోని అయోధ్యాకాండ వర్ణన మను షష్ఠాధ్యాయము సమాప్తము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Agni Maha Purana -17 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 6

🌻 Ayodhya Kand - Vishnu as Rama -4 🌻


36. With an arrow (Rāma) plucked one of the eyes of the crow which was tearing her (Sītā) with (its) nails. Then the crow sought refuge in the celestials.

37-40. On the sixth day after Rāma had gone to the forest, the king told Kauśalyā in the night the past story of how in (his) youth he had killed unknowingly with (his) Śabdabheda[5] (weapon) the ascetic youth Yajñadatta as (he was filling) the pot raising a sound. Lamenting his father cursed (Daśaratha). His mother felt grief-stricken and wept again and again and the (two) said, “We will die without the son. You will also die of grief.” “O Kauśalyā! without the son and remembering (the past) my death (will come off now) on account of grief.” After narrating this story and uttering (the words) “Alas! Rāma!”, the king passed away.

41-42. Thinking that the king was sleeping, Kauśalyā also slept on account of pangs of grief. Early in the morning the singers and bards such as the sūtas, māgadhas, the awakeners attempt ed to wake him up. He did not wake up and was dead. Knowing him as dead, Kauśalyā said, “O I have been ruined.”

43. The men and women then wept. Then Bharata along with Śatrughna was hurriedly brought to the city from the royal palace by Vasiṣṭha and others.

44. Having seen the grief-stricken Kaikeyī he reproached (her) out of grief. “(You) have made censure fall on the head” and praised Kauśalyā.

45-46. Having done the funeral rites of his father when (he) was asked by Vasiṣṭha and others to rule the kingdom, he said, “I go now to bring back Rāma. Rāma is the king stronger than myself”. (He went) to Śṛṅgavera and to Prayāga where he was entertained by Bharadvāja.

47-48. Having saluted Bharadvāja, (Bharata) came to Rāma and Lakṣmaṇa (and said), “O Rāma! Our father has reached the heaven. You become the king of Ayodhyā. I will go to the forest adhering to your command.” Having heard this, Rāma (after) giving him water asked him to go (back) taking the sandals.

49. (Bharata said), “I will not go to the city. I swear, I will be remaining with matted locks.” On being urged by Rāma, Bharata returned to Nandigrāma and stationed there with his army, leaving the sandal at Ayodhyā and worshipping it ruled over the kingdom.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


10 Mar 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 568 / Vishnu Sahasranama Contemplation - 568


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 568 / Vishnu Sahasranama Contemplation - 568 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 568. ఖణ్డపరశుః, खण्डपरशुः, Khaṇḍaparaśuḥ 🌻

ఓం ఖణ్డపరశవే నమః | ॐ खण्डपरशवे नमः | OM Khaṇḍaparaśave namaḥ

ఖణ్డపరశుః, खण्डपरशुः, Khaṇḍaparaśuḥ

శత్రూణాం ఖణ్డనాత్ఖణ్డః జామద్గ్న్యాకృతేర్హరేః ।
విద్యతే పరశురితి స ఖణ్డపరశుర్హరిః ।
అఖణ్డః పరశురితి వాఽఖణ్డపరశుర్హరిః ॥

శత్రువులను ఖండిచునది ఖండః అనబడును. ఖండము అనగా శత్రువులను ఖండిచునదియగు పరశువు లేదా గొడ్డలి - జమదగ్ని కుమారుడగు పరశురామ రూపుడిగా ఈతనికి కలదు. లేదా 'అఖణ్డ పరశుః' అను విభాగము చేయగా అఖండితమగు అనగా ఎవరిచేతనూ ఖండిచబడని పరశువు ఎవనికి కలదో అట్టివాడు ఖణ్డపరశుః.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 568 🌹

📚. Prasad Bharadwaj

🌻 568. Khaṇḍaparaśuḥ 🌻

OM Khaṇḍaparaśave namaḥ

शत्रूणां खण्डनात्खण्डः जामद्ग्न्याकृतेर्हरेः ।
विद्यते परशुरिति स खण्डपरशुर्हरिः ।
अखण्डः परशुरिति वाऽखण्डपरशुर्हरिः ॥

Śatrūṇāṃ khaṇḍanātkhaṇḍaḥ jāmadgnyākr‌terhareḥ,
Vidyate paraśuriti sa khaṇḍaparaśurhariḥ,
Akhaṇḍaḥ paraśuriti vā’khaṇḍaparaśurhariḥ.


By the reason of punishing the evildoers He is Khaṇḍaḥ. In the form of son of R‌ṣi Jamadagni - Paraśurāma He wielded a Paraśu or Axe and hence His incarnation as Paraśurāma is Khaṇḍaparaśuḥ. Or it may be taken as 'Akhaṇḍa Paraśuḥ' i.e., unbreakable axe and the One who wields such 'Khaṇḍaparaśuḥ'.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

सुधन्वा खण्डपरशुर्दारुणो द्रविणप्रदः ।
दिविस्पृक् सर्वदृग् व्यासो वाचस्पतिरयोनिजः ॥ ६१ ॥

సుధన్వా ఖణ్డపరశుర్దారుణో ద్రవిణప్రదః ।
దివిస్పృక్ సర్వదృగ్ వ్యాసో వాచస్పతిరయోనిజః ॥ 61 ॥

Sudhanvā khaṇḍaparaśurdāruṇo draviṇapradaḥ,
Divispr‌k sarvadr‌g vyāso vācaspatirayonijaḥ ॥ 61 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹


10 Mar 2022

Self-Control, Calmness, Emotions


Self-control is strength. Calmness is mastery.

You have to get to a point where your mood doesn't shift based on the insignificant actions of someone else.

Don't allow others to control the direction of your life.

Don't allow your emotions to empower your intelligence.




10 Mar 2022

10 - MARCH - 2022 గురువారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 10, మార్చి 2022 గురువారం, బృహస్పతి వాసరే 🌹 
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 170 / Bhagavad-Gita - 170 - 4-08 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 568 / Vishnu Sahasranama Contemplation - 568🌹
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 17 / Agni Maha Purana 17 🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 247 / DAILY WISDOM - 247 🌹 
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 148 🌹
7) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 86 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ గురువారం మిత్రులందరికీ 🌹*
*బృహస్పతి వాసరే, 10, మార్చి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాస దుర్గాష్టమి, రోహిణి వ్రతం, Masik Durgashtami, Rohini Vrat🌻*

*🍀. శ్రీ కల్కి స్తోత్రం - 7 🍀*

*7. తవ గుణాలయం నామ పావనం కలిమలాపహం కీర్తయంతి యే |*
*భవభయక్షయం తాపతాపితా ముహురహో జనాః సంసరంతి నో*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ధ్యానం ద్వారా అలవడే సుగుణాలు: ప్రేమ అంగీకారం, వినమ్రత, సేవాతత్పరత, దయ, సహానుభూతి; వీటన్నిటి కంటే ముఖ్యంగా జీవిత పరమార్థం. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
ఉత్తరాయణం, శిశిర ఋతువు, 
ఫాల్గుణ మాసం
తిథి: శుక్ల-అష్టమి 29:35:40 వరకు
తదుపరి శుక్ల-నవమి
నక్షత్రం: రోహిణి 11:30:14 వరకు
తదుపరి మృగశిర
యోగం: ప్రీతి 26:14:15 వరకు
తదుపరి ఆయుష్మాన్
కరణం: విష్టి 16:15:40 వరకు
వర్జ్యం: 02:30:40 - 04:18:32 
మరియు 17:49:24 - 19:37:48
దుర్ముహూర్తం: 10:27:01 - 11:14:48
మరియు 15:13:42 - 16:01:29
రాహు కాలం: 13:56:04 - 15:25:39
గుళిక కాలం: 09:27:18 - 10:56:53
యమ గండం: 06:28:08 - 07:57:43
అభిజిత్ ముహూర్తం: 12:03 - 12:49
అమృత కాలం: 07:54:16 - 09:42:08
మరియు 28:39:48 - 30:28:12
సూర్యోదయం: 06:28:08
సూర్యాస్తమయం: 18:24:49
చంద్రోదయం: 11:36:35
చంద్రాస్తమయం: 00:18:33
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: వృషభం
ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య 
నాశనం 11:30:14 వరకు తదుపరి
మృత్యు యోగం - మృత్యు భయం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 170 / Bhagavad-Gita - 170 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 08 🌴*

*08. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ |*
*ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ||*

🌷. తాత్పర్యం :
*సాధువులను రక్షించుటకు, దుర్మార్గులను నశింప జేయుటకు మరియు ధర్మమును పున:స్థాపించుటకు ప్రతియుగము నందును నేను అవతరించు చుందును.*

🌻. భాష్యము :
భగవద్గీత ప్రకారము సాధువనగా కృష్ణభక్తిభావనాపూర్ణుడని భావము. ఒక వ్యక్తి అధర్మవర్తునునిగా గోచరించినను, కృష్ణభక్తిభావన లక్షణములను సంపూర్ణముగా కలిగియున్నచో అతనిని సాధువుగా అవగతము చేసికొనవలెను. కృష్ణభక్తిభావనను లెక్కజేయనివారే దుష్కృతులనబడుదురు. అట్టి దుష్కృతులు లౌకిక విద్యాపారంగతులైనను మూడులుగును మరియు నరాధములుగును వర్ణింపబడినారు. 

కాని కృష్ణభక్తి యందు నూటికి నూరుపాళ్ళు మగ్నుడైనవాడు విద్యావంతుడు లేదా నాగరికుడు కాకపోయినను సాధువుగా అంగీకరింపబడును. రావణ,కంసులను వధించిన రీతి నాస్తికులను నశింపజేయుటకు భగవానుడు స్యయముగా అవతరింపవలసిన అవసరము లేదు. ఏలయన దానవులను సంహరించుటకు యోగ్యులైన ప్రతినిధులు అతనికి పెక్కుమంది గలరు. అయినను దానవులచే పీడింపబడు తన శుద్ధభక్తులకు ఆనదింపజేయుట కొరకే అతడు ప్రత్యేకముగా అవతరించును. దానవప్రవృత్తి కలవాడు భక్తుని సదా పీడించుచుండును. పీడింపబడెడి భక్తుడు స్వజనుడే అయినప్పటికిని అతడు ఆ కార్యమునకు వెనుదీయడు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని తనయుడు. 

అయినను ఆ దానవుడు ప్రహ్లాదుని మిగుల పీడించెను. కృష్ణుని తల్లియైన దేవకి కంసుని సోదరియైనను, కృష్ణునికి జన్మనొసగనున్నందున ఆమె మరియు వసుదేవుడు ఇరువురును కష్టములకు గురిచేయబడిరి. కనుక కంసుని వధించుట కన్నను ముఖ్యముగా దేవకిని రక్షించుట కొరకే శ్రీకృష్ణభగవానుడు ఆవిర్భవించెను. అయినను ఆ రెండుకార్యములు ఏకకాలముననే ఒనరింపబడెను. కనుకనే సాధువులైనవారిని రక్షించి, దుష్టులను నశింపజేయుటకే శ్రీకృష్ణభగవానుడు వివిధ అవతారములకు స్వీకరించునని ఇచ్చట తెలుపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 170 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 4 - Jnana Yoga - 08 🌴*

*08. paritrāṇāya sādhūnāṁ vināśāya ca duṣkṛtām*
*dharma-saṁsthāpanārthāya sambhavāmi yuge yuge*

🌷 Translation : 
*To deliver the pious and to annihilate the miscreants, as well as to reestablish the principles of religion, I Myself appear, millennium after millennium.*

🌹 Purport :
According to Bhagavad-gītā, a sādhu (holy man) is a man in Kṛṣṇa consciousness. A person may appear to be irreligious, but if he has the qualifications of Kṛṣṇa consciousness wholly and fully, he is to be understood to be a sādhu. And duṣkṛtām applies to those who do not care for Kṛṣṇa consciousness. Such miscreants, or duṣkṛtām, are described as foolish and the lowest of mankind, even though they may be decorated with mundane education, whereas a person who is one hundred percent engaged in Kṛṣṇa consciousness is accepted as a sādhu, even though such a person may be neither learned nor well cultured. A

s far as the atheistic are concerned, it is not necessary for the Supreme Lord to appear as He is to destroy them, as He did with the demons Rāvaṇa and Kaṁsa. The Lord has many agents who are quite competent to vanquish demons. But the Lord especially descends to appease His unalloyed devotees, who are always harassed by the demoniac. 

The demon harasses the devotee, even though the latter may happen to be his kin. Although Prahlāda Mahārāja was the son of Hiraṇyakaśipu, he was nonetheless persecuted by his father; although Devakī, the mother of Kṛṣṇa, was the sister of Kaṁsa, she and her husband Vasudeva were persecuted only because Kṛṣṇa was to be born of them. So Lord Kṛṣṇa appeared primarily to deliver Devakī rather than kill Kaṁsa, but both were performed simultaneously. Therefore it is said here that to deliver the devotee and vanquish the demon miscreants, the Lord appears in different incarnations.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 568 / Vishnu Sahasranama Contemplation - 568 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 568. ఖణ్డపరశుః, खण्डपरशुः, Khaṇḍaparaśuḥ 🌻*

*ఓం ఖణ్డపరశవే నమః | ॐ खण्डपरशवे नमः | OM Khaṇḍaparaśave namaḥ*

ఖణ్డపరశుః, खण्डपरशुः, Khaṇḍaparaśuḥ

శత్రూణాం ఖణ్డనాత్ఖణ్డః జామద్గ్న్యాకృతేర్హరేః ।
విద్యతే పరశురితి స ఖణ్డపరశుర్హరిః ।
అఖణ్డః పరశురితి వాఽఖణ్డపరశుర్హరిః ॥

శత్రువులను ఖండిచునది ఖండః అనబడును. ఖండము అనగా శత్రువులను ఖండిచునదియగు పరశువు లేదా గొడ్డలి - జమదగ్ని కుమారుడగు పరశురామ రూపుడిగా ఈతనికి కలదు. లేదా 'అఖణ్డ పరశుః' అను విభాగము చేయగా అఖండితమగు అనగా ఎవరిచేతనూ ఖండిచబడని పరశువు ఎవనికి కలదో అట్టివాడు ఖణ్డపరశుః.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 568 🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻 568. Khaṇḍaparaśuḥ 🌻*

*OM Khaṇḍaparaśave namaḥ*

शत्रूणां खण्डनात्खण्डः जामद्ग्न्याकृतेर्हरेः ।
विद्यते परशुरिति स खण्डपरशुर्हरिः ।
अखण्डः परशुरिति वाऽखण्डपरशुर्हरिः ॥

Śatrūṇāṃ khaṇḍanātkhaṇḍaḥ jāmadgnyākr‌terhareḥ,
Vidyate paraśuriti sa khaṇḍaparaśurhariḥ,
Akhaṇḍaḥ paraśuriti vā’khaṇḍaparaśurhariḥ.

By the reason of punishing the evildoers He is Khaṇḍaḥ. In the form of son of R‌ṣi Jamadagni - Paraśurāma He wielded a Paraśu or Axe and hence His incarnation as Paraśurāma is Khaṇḍaparaśuḥ. Or it may be taken as 'Akhaṇḍa Paraśuḥ' i.e., unbreakable axe and the One who wields such 'Khaṇḍaparaśuḥ'.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सुधन्वा खण्डपरशुर्दारुणो द्रविणप्रदः ।दिविस्पृक् सर्वदृग् व्यासो वाचस्पतिरयोनिजः ॥ ६१ ॥

సుధన్వా ఖణ్డపరశుర్దారుణో ద్రవిణప్రదః ।
దివిస్పృక్ సర్వదృగ్ వ్యాసో వాచస్పతిరయోనిజః ॥ 61 ॥

Sudhanvā khaṇḍaparaśurdāruṇo draviṇapradaḥ,
Divispr‌k sarvadr‌g vyāso vācaspatirayonijaḥ ॥ 61 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 17 / Agni Maha Purana - 17 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 6*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. అయోధ్యాకాండ వర్ణనము - 4 🌻*

గోళ్ళచే సీతను గీరిన కాకి నేత్రమును, రాముడు ఐషీకాస్త్రము ప్రయోగించి పోగొట్టెను. ఆ కాకి దేవతలను విడచి మరల రామునే శరణుజొచ్చినది. రాముడు అరణ్యమునకు వెళ్ళిన ఆరవ దినమున దశరథుడు పూర్వము జరిగిన కథను చెప్పెను. నేను కౌమారవయస్సులో ఉన్నప్పుడు సరయూ తీరమునందు కుంభమును నీటిలో ముంచి శబ్దము చేయుచున్న యజ్ఞదత్తుడనే పిల్లవానిని శబ్ధవేధిని ఉపయోగించి చంపితిని. అతని తల్లిదండ్రులు చాల విలపించిరి. అతని తండ్రి ''మే మిరువురము పుత్ర శోకముతో మరణించుచన్నాము. నీవు కూడ పుత్రశోకముతో పుత్రుని స్మరించుచు మరణించెదవు '' అని నన్ను శపించెను. కౌసల్యా ! నా కీ విధముగ మణము రానున్నది. '' ఈ విధముగ కథను చెప్పి హా రామా! అని అనుచు రాజు స్వర్గము పొందెను.

అతడు శోకపీడితుడై నిద్రించినా డని తలచి కౌసల్య నిద్రించెను. ప్రాతఃకాలమున సూతమాగధబందులు మేల్కొలుపుటకై వచ్చి శయనించి ఉన్న ఆతనిని మేల్కొలిపిరి. మరణించిన ఆతడు లేవలేదు. ఆతడు మరణించినా డని గ్రహించి కౌసల్య ''అయ్యో! చచ్చితిని '' చచ్చితిని అనుచు ఏడ్చెను. పురుషులును స్త్రీలును ఏడ్వ మొదలిడిరి. 

వసిష్ఠాదులు మేనమామ ఇంటిలోనున్న శత్రుఘ్న సమేతుడైన భరతుని శీఘ్రముగా ఆయోధ్యకు రప్పించిరి. శోకముతో నిండిన ఆ నగరిని చూచి, దుఃఖితుడై, బరతుడు ''అపకీర్తి వచ్చి నెత్తిమీద పడినది కదా!'' అని కై కేయిని నిందించెను. కౌసల్యను ప్రశంసించి, నూనె తొట్టెలో పెట్టిన తండ్రికి సరయూనదీ తీరమున సంస్కారము చేసెను. ''రాజ్యము చేయుము' అని వసిష్ఠాదులు పలుకగా ఇట్లనెను.

రాముని తీసికొని వచ్చుటకు వెళ్లెదను. బలశాలియైన రాముడే ఆందరిచేత రాజుగా అంగీకరింపబడినవాడు. శృంగి చేరము వెళ్ళి, అచ్చటినుండి ప్రయాగవెళ్ళి భరద్వాజుని విందు స్వీకరించి భరద్వాజునికి నమస్కరించి రామలక్ష్మణుల వద్దకు చేరెను. ''రామా! మన తండ్రిగారు స్వర్గస్థులైనారు. నీవు అయోధ్యలో రాజువగుము. నేను నీ ఆదేశమును ఎదురు చూచుచు వనమునకు వెళ్లెదను '' అని పలికెను. 

రాముడా మాటలు విని తండ్రికి తర్పణములు చేసి, భరతునితో ఇట్లనెను. ''నీవు పాదుకలు తీసికొని వెళ్ళుము. సత్యపాలనమునకై జటలను నార చీరలును ధరించిన నేను రాజ్యము చేయుటకై రాను.'' రాముడు ఈ విధముగా పలుకగా భరతుడు తిరిగి వెళ్ళి, అయోధ్యను విడచి, నందిగ్రామములో నివసించుచు, ఆ పాదుకలను పూజించుచు రాజ్యమును పాలించెను.
ఆగ్ని మహాపురాణములో రామాయనకథలోని అయోధ్యాకాండ వర్ణన మను షష్ఠాధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana -17 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

Chapter 6
*🌻 Ayodhya Kand - Vishnu as Rama -4 🌻*

36. With an arrow (Rāma) plucked one of the eyes of the crow which was tearing her (Sītā) with (its) nails. Then the crow sought refuge in the celestials.

37-40. On the sixth day after Rāma had gone to the forest, the king told Kauśalyā in the night the past story of how in (his) youth he had killed unknowingly with (his) Śabdabheda[5] (weapon) the ascetic youth Yajñadatta as (he was filling) the pot raising a sound. Lamenting his father cursed (Daśaratha). His mother felt grief-stricken and wept again and again and the (two) said, “We will die without the son. You will also die of grief.” “O Kauśalyā! without the son and remembering (the past) my death (will come off now) on account of grief.” After narrating this story and uttering (the words) “Alas! Rāma!”, the king passed away.

41-42. Thinking that the king was sleeping, Kauśalyā also slept on account of pangs of grief. Early in the morning the singers and bards such as the sūtas, māgadhas, the awakeners attempt ed to wake him up. He did not wake up and was dead. Knowing him as dead, Kauśalyā said, “O I have been ruined.”

43. The men and women then wept. Then Bharata along with Śatrughna was hurriedly brought to the city from the royal palace by Vasiṣṭha and others.

44. Having seen the grief-stricken Kaikeyī he reproached (her) out of grief. “(You) have made censure fall on the head” and praised Kauśalyā.

45-46. Having done the funeral rites of his father when (he) was asked by Vasiṣṭha and others to rule the kingdom, he said, “I go now to bring back Rāma. Rāma is the king stronger than myself”. (He went) to Śṛṅgavera and to Prayāga where he was entertained by Bharadvāja.

47-48. Having saluted Bharadvāja, (Bharata) came to Rāma and Lakṣmaṇa (and said), “O Rāma! Our father has reached the heaven. You become the king of Ayodhyā. I will go to the forest adhering to your command.” Having heard this, Rāma (after) giving him water asked him to go (back) taking the sandals.

49. (Bharata said), “I will not go to the city. I swear, I will be remaining with matted locks.” On being urged by Rāma, Bharata returned to Nandigrāma and stationed there with his army, leaving the sandal at Ayodhyā and worshipping it ruled over the kingdom.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join 
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 247 / DAILY WISDOM - 247 🌹*
*🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 3. భౌతిక అవయవాల వైవిధ్యాన్ని అధిగమించి అస్థిత్వాన్ని కలిగి ఉన్నవాడు మానవుడు. 🌻*

*ఆత్మ సార్వత్రికమైనది కనుక- విశ్వజనీనత కానిది దానిని నశింప జేస్తుంది. కాబట్టి ప్రపంచంలోని దేనిలోనైనా ఆత్మ యొక్క ఉనికి, సార్వత్రిక ఉనికి ప్రత్యేకించి అన్నింటిలోనూ అంతర్లీనంగా ఉంటుంది. ఈ విశ్వజనీనత ఏ రకమైన ప్రదేశాలలో ఎంత మేరకు ఉందనే అవగాహనా కొలమానంలో ఆధ్యాత్మికత, లేదా మతంలో సాధారణంగా చెప్పబడే జీవితంలోని ఉన్నత విలువలను సూచించడానికి వర్తించే హోదా ఉంటుంది. మానవ శరీరం, కుటుంబం, సమాజం, దేశం లేదా మొత్తం ప్రపంచం మన ముందు వివిధ స్థాయిలలో ఈ విశ్వజనీనత యొక్క కార్యకలాపాలకు ఉదాహరణగా నిలుస్తుంది.*

*మానవ వ్యక్తిత్వం, శారీరకంగా చెప్పాలంటే, శరీర నిర్మాణ శాస్త్రం మరియు శరీరధర్మ శాస్త్రం, భౌతిక మరియు రసాయన లక్షణాల కలయికగా చెప్పబడినప్పటికీ మొత్తం విశ్వ నమూనాలో కూడా ఉంటుంది. మొత్తం వ్యవస్థను విస్తరించి ఉన్న జీవశక్తితో, మానవుడు ఎముక మరియు మాంసం మాత్రమే కాదు అంతకు మించి మొత్తం వ్యాపించి ఉంటాడు. వాస్తవాన్ని మరింత లోతుగా పరిశోధించినప్పుడు శరీరంలోని కొన్ని అవయవాలను వైద్య చర్య ద్వారా తీసివేసినప్పటికీ, మనిషి భౌతిక అవయవాల వైవిధ్యాన్ని కూడా మించిపోయి, మొత్తం స్వీయ-సమాన అస్తిత్వంగా ఉన్నాడనే జ్ఞానం స్పష్టమవుతుంది.

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 247 🌹*
*🍀 📖 from Essays in Life and Eternity 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 3. A Human Being Transcends the Diversity of the Physical Limbs 🌻*

*Since Spirit is universal—because non-universality would make it perishable—the presence of the Spirit in anything is, in fact, the Universal Existence being immanent in the particular. Spirituality, or religion, a designation that has generally been applied to signify the higher values of life, consists, then, in the measure of awareness of the extent to which the Universal Principle inhabits locations of any kind. The human body, the family, the community, the province, the nation, or the world as a whole stands before us as an example of the operation of the Universal in different degrees of particularity.*

*Human individuality, physically speaking, is all anatomy and physiology, a combination of physical and chemical properties cohering into the pattern of a whole, with vitality pervading the whole system, so that the human being is not just bone and flesh and it transcends the diversity of the physical limbs. This is common knowledge, and it becomes clear when one investigates into the fact of man remaining a whole as a self-identical entity even if some limbs of the body are to be taken away by medical operation.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 148 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. అవసరమయిన ఏకైక విషయం మెలకువ. మనుషులు అక్కర్లేని వాటిల్లో పడికొట్టుకు పోతూ వుంటారు. అనవసరమయిన వాటి కోసం ఆత్మను అమ్ముకుంటారు. 🍀*

*అవసరమయిన ఏకైక విషయం మెలకువ. మనుషులు అక్కర్లేని వాటిల్లో పడికొట్టుకుపోతూ వుంటారు. అవసరమయిన వాటి పట్ల అప్రమత్తంగా వుండాలి. వాళ్ళు అవసరం అయిన వాటిని అనవసరమయిన వాటి కోసం ఖర్చు పెడతారు.*

*అనవసరమయిన వాటి కోసం ఆత్మను అమ్ముకుంటారు. అందువల్లే ఆత్మని అమ్ముకుని ఆత్మలేని వాళ్ళుగా మిగుల్తారు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 86 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 72. సౌందర్య ఉపాసనము 🌻*

*విసుగు, చిరాకు, కోపము మనిషియందు విషమును పుట్టించును. పుట్టిన విషము నాడులగుండా ప్రవహించి దేహ మంతయు మలినము చేయును. అట్టి వారికి రకరకములైన మందులు వేయుటతో మరికొంత ప్రమాదము జరుగును. వారికి తగిన చికిత్స విశ్రాంతి. వారికి ఎంత విశ్రాంతి ఏర్పరచిన అంత స్వస్థత చేకూరును.*

*సుందరము, పవిత్రము, ప్రశాంతము అయిన ప్రదేశములలో జీవించుట ఇట్టి రోగులకు అతిముఖ్యము. ప్రకృతి సహజ సౌందర్యము నుండి ఉద్భవించు తరంగములు ఎట్టి విషపూరిత రోగమునైనను పరిష్కరించ గలదు. సౌందర్యోపాసన ప్రాణమునకు బలము నిచ్చును. ఈ ఉపాసన సహజముగ సాగవలెను.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹