శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 356-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 356-1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 356-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 356-1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 78. భక్తిమత్-కల్పలతికా, పశుపాశ విమోచనీ ।
సంహృతాశేష పాషండా, సదాచార ప్రవర్తికా ॥ 78 ॥ 🍀

🌻 356-1. 'సదాచార ప్రవర్తికా' 🌻


వేదశాస్త్రము నందు తెలుపబడిన సదాచారమును వర్తింప చేయునది శ్రీమాత అని అర్థము. యజ్ఞము, దానము, తపస్సు సదాచారముగ తెలుపబడినవి. యజ్ఞార్థ జీవనము ఒక్కటియే జీవులకు బంధ విమోచనము కలిగించును. జీవిత సన్నివేశముల యందు స్వార్థ చింతనము బంధ కారణమై నిలచును. పరార్థ చింతన పరమునకు దారి చూపును. లోకహిత జీవనమే యజ్ఞార్థ జీవనము. జీవితము యజ్ఞార్థము కాకున్నప్పుడు చిక్కుపడి జీవుని బద్ధుని జేయును.

బద్ధుడైన జీవుడు బంధ మోచనమునకై ప్రయత్నించును. క్రమముగ యజ్ఞార్థ జీవనమే బంధ మోచనమునకు పరిష్కారమని తెలిసికొనును. స్వహితము కొఱకు గాక పరహితము కొఱకు జీవించుట ఆరంభించును. ఇట్టి క్రియా జ్ఞానము స్థిరపడు చుండగా తన యందలి ఇచ్ఛ పరహితేచ్చగా మారును. ఇచ్ఛ, క్రియలు పరహితమునకే సమర్పింప బడగ జీవుడు సాత్త్విక అహంకారమున స్థిరపడినపుడు జ్ఞానమను గ్రహింపబడును. అట్టివాడు తన వద్ద జేరిన సమస్త విద్యలను, శక్తిని, ద్రవ్యమును పరహితమునకే సమర్పించుట దానమగును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 356-1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 78. Bhaktimatkalpalatika pashupasha vimochani
Sanhruta sheshapashanda sadachara pravartika ॥ 78 ॥ 🌻

🌻 356-1. Sadācāra-pravartikā सदाचार-प्रवर्तिका 🌻


She removes the innate ignorance of the soul to realize the Brahman. In this nāma, She is said to induce the ignorant men to perform noble acts. Sat refers those who perform noble deeds and ācāra means the righteous acts performed by them. She makes the ignorant people (ignorant means lack of knowledge of the Brahman.

It could also mean the concept of duality) to pursue the righteous path to realize the Brahman. The principles of righteousness are expounded in epics. These principles form the basis of dharma śāstra (refer previous nāma).


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


15 Mar 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 153. పీడకలలు / Osho Daily Meditations - 153. NIGHTMARES


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 153 / Osho Daily Meditations - 153 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 153. పీడకలలు 🍀

🕉. మీ మనస్సు మీ స్వభావానికి విరుద్ధంగా ఏదైనా చేస్తున్నప్పుడు, అంతఃచేతన మీకు సందేశాన్ని- మొదట మర్యాదగా ఇస్తుంది, కానీ మీరు చేయకపోతే: వినండి అని పీడకలగా ఇస్తుంది. 🕉

ఒక పీడకల అనేది మీ అంతఃచేతన యొక్క అరవడం తప్ప మరొకటి కాదు. మీరు మీ నుండి చాలా దూరం వెళుతున్నారని మరియు మీ మొత్తం జీవిని మీరు కోల్పోతారు, ఇంటికి తిరిగి రండి అని చెప్పడమే అది! ఒక పిల్లవాడు అడవుల్లో తప్పిపోయినప్పుడు, తల్లి అరుస్తూ పిల్లల పేరును పిలుస్తుంది. ఒక పీడకల అంటే అదే. కాబట్టి మీ కలలతో స్నేహం చేయడం ప్రారంభించండి. మీరు, మీ అంతఃచేతనత్వ స్థితికి దగ్గరగా మరింత దగ్గరగా వస్తున్నట్లు మీరు తెలుసుకుంటారు. మీరు దానికి ఎంత దగ్గరగా వస్తారో, మీకు అంత తక్కువ కలలు ఉంటాయి, ఎందుకంటే అప్పుడు కల అవసరం లేదు.

మీరు మేల్కొని ఉన్నప్పుడు కూడా అంతఃచేతనత్వం దాని సందేశాన్ని ఇవ్వగలదు. మీరు నిద్రపోయే వరకు వేచి ఉండవలసిన అవసరం లేదు; ఇది మీకు ఎప్పుడైనా దాని సందేశాన్ని ఇవ్వగలదు. మీరు దగ్గరగా మరింత దగ్గరగా ఎప్పుడైతే వస్తారో, మీ చేతన మరియు అంతఃచేతన ఒకదానిలోకి మరొక దానిలో వ్యాప్తి చెందుతుంది. అది గొప్ప అనుభవం. మీరు మొదటిసారి, ఏకత్వాన్ని అనుభూతి చెందుతారు. మీ ఉనికిలో ఏ భాగాన్ని తిరస్కరించలేదు. మీరు మీ సంపూర్ణతను అంగీకరించారు. మీరు మొత్తం ఒకటిగా కావడం ప్రారంభించారు.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Osho Daily Meditations - 153 🌹

📚. Prasad Bharadwaj

🍀 153. NIGHTMARES 🍀

🕉 Whenever your mind is doing something that goes against your nature, the unconscious gives you the message--first politely, but if you don't: listen, nightmarishly. 🕉


A nightmare is nothing but the shouting of the unconscious, a cry of desperation that you are going too far away from yourself and you will miss your whole being. Come back home! It is as if a child is lost in the woods and the mother screams and shouts the name of the child. That is exactly what a nightmare is. So start befriending your dreams. By and by you will see that you and your unconscious are coming closer and closer together.

The closer you come, the fewer dreams you will have, because then there is no need for the dream. The unconscious can deliver its message even when you are awake. There is no need for it to wait for when you are asleep; it can give you its message any time. The closer and closer you come, the more the conscious and unconscious start overlapping. That's a great experience. You feel, for the first time, one. No part of your being is denied. You have accepted your wholeness. You start becoming whole.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


15 Mar 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 164


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 164 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. సర్వాంతర్యామి 🌻


లోకమున దుఃఖమునకు కారణము ఎవ్వరని మానవులు అనేక సిద్ధాంతములను కనిపెట్టిరి. తమకు సుఖదుఃఖములను ఇచ్చు ప్రభువుగా దేవునిపై కొందరు నిందారోపణము చేసిరి. తప్పు చేయుట అనగా హాని కల్గించుటయే తన చెడునడవడిని సరిచేసికొనుట తన చేతిలోని పనియే. దానిని అంగీకరించుటకు భయపడి తనకన్న శక్తిమంతమైనదేదో తన చేత చేయించుచున్నదని నమ్ముట దౌర్భల్యము గాని సత్యముకాదు. జీవుడు మంచిగా గాని, చెడుగా గాని ప్రవర్తించుటకు గ్రహస్థితులు కారణమని సిద్ధాంతము చేసికొందురు. ఆత్మ వంచనము చేసికొనుచున్నారు.

చేసిన కర్మయొక్క ఫలమే మనచేత నిత్యము మంచి చెడ్డ పనులు చేయించుచున్నదని కొందరు నిర్ణయింప జూచుచున్నారు. కొందరి ప్రకారము సృష్టి అంతయు స్వాభావికముగా జరుగుచున్నది. దీనిని గ్రహించుట సాధ్యము కాదు నిరోధించుటకు అధికారము లేదు. మానవుని ప్రవర్తనలో గల మంచి చెడ్డలు కూడ స్వాభావికముగా జరుగుచున్నవని వారి మతము. దీని వలన ఒకరితో ఒకరు కలహించుకొని జాతి నశించును. ఇతరుల వలన మనకు దుఃఖము కలిగినపుడు వారు చేసిరని దుఃఖింప పనిలేదు. తర్కమునకు, నిర్ణయమునకు లొంగని వాడు సర్వాంతర్యామి. వాని లీలయే సర్వము. ఇంతకన్నా సత్యము లేదు.

✍️. మాస్టర్ ఇ.కె. 🌻

🌹 🌹 🌹 🌹 🌹


15 Mar 2022

శ్రీ శివ మహా పురాణము - 534 / Sri Siva Maha Purana - 534


🌹 . శ్రీ శివ మహా పురాణము - 534 / Sri Siva Maha Purana - 534 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 47

🌻.శివుని అంతఃపుర ప్రవేశము - 4 🌻


తరువాత శంఖములు, భేరీలు, పటహములు, ఆనకములు, గోముఖములు ఆ మహోత్సవములో అనేక పర్యాయములు మ్రోగించబడినవి (33). మరియు గాయకులందరు పరమ మంగళకరమగు పాటలను పాడిరి. నాట్యకత్తెలందరు అనేక తాళములతో గూడి నాట్యమును చేసిరి (34).

జగదేక బంధువగు శివుడు వీరతో గూడి అప్పుడు పరమేశ్వర తేజస్సుతో ముందుకు సాగెను. లోకపాలకులందరు ఆయనను సేవిస్తూ ఆనందముతో పుష్పములను చల్లు చుండిరి (35). ఈ విదముగా పూజింప బడిన శంభు పరమేశ్వరుడు అనేక స్తుతులచే కొనియాడబడుచున్న వాడై యజ్ఞ మండపములోనికి ప్రవేశించెను (36). పర్వతశ్రేష్ఠులు మహోత్సవ పురస్సరముగా మహేశ్వరుని వృషభము నుండి దింపి ప్రీతితో గృహము లోపలికి దోడ్కొని వెళ్లిరి(37). హిమవంతుడు కూడ దేవతలతో గణములతో కూడి విచ్చేసిన ఈశ్వరునకు భక్తితో ప్రణమిల్లి యథావిధిగా నీరాజన మొసంగెను (38).

హిమవంతుడు తన భాగ్యమును కొనియాడుచూ దేవతలను, మునులను, ఇతరులను అందరినీ నమస్కరించి మహోత్సాహముతో సన్మానించెను (39). ఆ హిమవంతుడు అచ్యుతునితో, ముఖ్యులగు దేవతలతో గూడి యున్న ఈశ్వరునికి అర్ఘ్యపాద్యముల నిచ్చి తన గృహము లోపలికి తీసుకొని వెళ్లెను (40). నన్ను, విష్ణువును, ఈశ్వరుని ఇతర పెద్దలను వాకిటి యందు రత్న సింహాసనములపై ప్రత్యేకముగా కూర్చుండబెట్టెను(41). చెలికత్తెలు, మేన, మరియు బ్రాహ్మణ స్త్రీలు, ఇతర ముత్తయిదవలు ఆనందముతో నీరాజనమిచ్చిరి (42).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 SRI SIVA MAHA PURANA - 534 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 47 🌴

🌻 The ceremonious entry of Śiva - 4 🌻

33. In that great festivity conches were blown, drums were beaten and the musical instruments, paṭaha, Ānaka and Gomukha were played on, repeatedly.

34. Musicians sang auspicious songs. Dancing girls danced to the tune.

35. Accompanied by these, attended upon by all important gods and with flowers showered on Him delightedly, the sole kinsman of the universe walked ahead shedding lordly splendour.

36. Lord Śiva, eulogised with many hymns of praise, entered the sacrificial altar. He was duly worshipped.

37. The excellent mountains jubilantly made Śiva dismount the bull and lovingly took Him within.

38. After duly bowing to Śiva who arrived there with the gods and Gaṇas, Himavat performed the Nīrājana with great devotion.

39. Praising his own good luck and bowing to all the gods, sages and others jubilantly he honoured them suitably.

40. The mountain, after offering Pādya and Arghya to them, took Śiva along with Viṣṇu and the important gods, within.

41. In the quadrangle inside he made us, Viṣṇu, Śiva and other important persons sit on gemset thrones.

42. The Nīrājana rites was then performed by Mena, her maids and the brahmin women as well as other ladies of the city with joy.


Continues....

🌹🌹🌹🌹🌹


15 Mar 2022

గీతోపనిషత్తు -336


🌹. గీతోపనిషత్తు -336 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 28-3 📚


🍀 28-3. సన్యాస యోగము - శుభకర్మలు శుభ ఫలముల నిచ్చు చుండును. అశుభ కర్మలు అశుభ ఫలముల నిచ్చుచుండును. పుణ్యకార్యములు చేయువారు పుణ్యఫలములచే బంధింప బడుదురు. పాపకార్యములు చేయువారు పాపఫలములచే బంధింపబడు చుందురు. ఫలాసక్తి లేకుండ కర్మలాచరించుటయే నిజమగు మార్గము. తమదగు సంకల్పములు కూడ చేయని వారు మహాత్ములు. ఆరంభ పరిత్యాగము వారి సహజ స్వభావము. 🍀

శుభాశుభఫలై రేవం మోక్ష్యసే కర్మబంధనైః |
సన్న్యాసయోగయుక్తాత్మా విముక్తో మా ముపైష్యసి || 28

🌻. తాత్పర్యము : పై విధముగ సర్వమును నాకు సమర్పణ చేసుకొనిన వానికి పాపపుణ్య ఫలముల బంధము విడువబడును. నాతో సమ్య జ్ఞాన యోగమున సమస్తము నుండి విముక్తి చెంది నన్ను పొందిన వాడగును.

🌻. వివరణము : విముక్తి అనగా విశిష్టమగు ముక్తి. అట్టివాడే తనను చేరగలడని దైవము స్పష్టము చేసినాడు. ధీమంతు లెవరైనను ఇట్టిమార్గమున పయనింపవలెను. ఇతర మార్గములలో బంధవిమోచన ముండదు. ఇది సత్యము. మరియొక విషయము. శుభకర్మలు శుభ ఫలముల నిచ్చు చుండును. అశుభ కర్మలు అశుభ ఫలముల నిచ్చుచుండును. పుణ్యకార్యములు చేయువారు పుణ్యఫలములచే బంధింప బడుదురు. పాపకార్యములు చేయువారు పాపఫలములచే బంధింపబడు చుందురు. ఫలాసక్తి లేకుండ కర్మలాచరించుటయే నిజమగు మార్గము. దుష్కర్మ లెట్లు బంధించునో, సత్కర్మలు కూడ అట్లే బంధించును. కారణము ఫలాసక్తియే.

తండ్రి ఆజ్ఞగా పరశురాముడు తల్లి శిరస్సును ఖండించెను. తల్లి శిరస్సు ఖండించుట దుష్కర్మ. తండ్రి ఆజ్ఞను పరిపాలించుట కర్తవ్యము. పరశురాముడు కర్తవ్యమునే నమ్మెను. తల్లిగదా యని ఉపేక్షించ లేదు. తండ్రియగు జమదగ్ని మహర్షితో వాదింపలేదు. కర్తవ్యమున మాత్రమే నిలబడెను. అట్లే దశరథ రాముడు కూడ కర్తవ్యమునే పాలించెను. ఫలము లాసింపలేదు. తమదగు సంకల్పములు కూడ చేయనివారు మహాత్ములు. ఆరంభ పరిత్యాగము వారి సహజ స్వభావము. ఇట్టి కర్మ స్వరూపము స్పష్టముగ తెలిసిన మానవునకు ఈ క్షేత్రము కురుక్షేత్రము గాను, ధర్మ క్షేత్రముగాను గోచరించును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


15 Mar 2022

15 - MARCH - 2022 మంగళవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 15, మంగళవారం, మార్చి 2022 భౌమ వాసరే 🌹
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 28-3 - 336 - సన్యాస యోగము 🌹 
3) 🌹. శివ మహా పురాణము - 534 / Siva Maha Purana - 534 🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -164 🌹  
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 153 / Osho Daily Meditations - 153🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 356-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 356-1 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹*
*భౌమ వాసరే, 15, మార్చి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : ప్రదోష వ్రతం, Pradosh Vrat 🌻*

*🍀. అంజని పుత్ర స్తోత్రం - 1 🍀*

*అంజని నందన హనుమంత*
*అద్భుత వేగ హనుమంత*
*జయ బజరంగబలి *
*జయజయ జయ బజరంగబలి*

*ఇహపర దాత హనుమంత*
*ఈప్సితదాత హనుమంత*
*జయ బజరంగబలి *
*జయజయ జయ బజరంగబలి*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ప్రారబ్దకర్మ నిత్య జీవితములో కొనసాగుతూనే ఉంటుంది. దానిని సరిగ్గా అనుష్ఠించాలి. అప్పుడు మాత్రమే ఆ కర్మ నుండి విముక్తి పొందగలము. - మాస్టర్‌ ఆర్‌.కె. 🍀*
🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం, శశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: శుక్ల ద్వాదశి 13:13:46 వరకు
తదుపరి శుక్ల త్రయోదశి
నక్షత్రం: ఆశ్లేష 23:33:20 వరకు
తదుపరి మఘ
యోగం: సుకర్మ 27:41:47 వరకు
తదుపరి ధృతి
కరణం: బాలవ 13:08:46 వరకు
వర్జ్యం: 11:41:48 - 13:23:24
దుర్ముహూర్తం: 08:48:39 - 09:36:45
రాహు కాలం: 15:25:32 - 16:55:44
గుళిక కాలం: 12:25:08 - 13:55:20
యమ గండం: 09:24:44 - 10:54:56
అభిజిత్ ముహూర్తం: 12:01 - 12:49
అమృత కాలం: 21:51:24 - 23:33:00
సూర్యోదయం: 06:24:20
సూర్యాస్తమయం: 18:25:57
చంద్రోదయం: 15:55:49
చంద్రాస్తమయం: 04:26:05
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
ఆనంద యోగం - కార్య సిధ్ధి 23:33:20
వరకు తదుపరి కాలదండ యోగం
- మృత్యు భయం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -336 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 28-3 📚*
 
*🍀 28-3. సన్యాస యోగము - శుభకర్మలు శుభ ఫలముల నిచ్చు చుండును. అశుభ కర్మలు అశుభ ఫలముల నిచ్చుచుండును. పుణ్యకార్యములు చేయువారు పుణ్యఫలములచే బంధింప బడుదురు. పాపకార్యములు చేయువారు పాపఫలములచే బంధింపబడు చుందురు. ఫలాసక్తి లేకుండ కర్మలాచరించుటయే నిజమగు మార్గము. తమదగు సంకల్పములు కూడ చేయని వారు మహాత్ములు. ఆరంభ పరిత్యాగము వారి సహజ స్వభావము. 🍀*

శుభాశుభఫలై రేవం మోక్ష్యసే కర్మబంధనైః |
సన్న్యాసయోగయుక్తాత్మా విముక్తో మా ముపైష్యసి || 28

*🌻. తాత్పర్యము : పై విధముగ సర్వమును నాకు సమర్పణ చేసుకొనిన వానికి పాపపుణ్య ఫలముల బంధము విడువబడును. నాతో సమ్య జ్ఞాన యోగమున సమస్తము నుండి విముక్తి చెంది నన్ను పొందిన వాడగును.*

*🌻. వివరణము : విముక్తి అనగా విశిష్టమగు ముక్తి. అట్టివాడే తనను చేరగలడని దైవము స్పష్టము చేసినాడు. ధీమంతు లెవరైనను ఇట్టిమార్గమున పయనింపవలెను. ఇతర మార్గములలో బంధవిమోచన ముండదు. ఇది సత్యము. మరియొక విషయము. శుభకర్మలు శుభ ఫలముల నిచ్చు చుండును. అశుభ కర్మలు అశుభ ఫలముల నిచ్చుచుండును. పుణ్యకార్యములు చేయువారు పుణ్యఫలములచే బంధింప బడుదురు. పాపకార్యములు చేయువారు పాపఫలములచే బంధింపబడు చుందురు. ఫలాసక్తి లేకుండ కర్మలాచరించుటయే నిజమగు మార్గము. దుష్కర్మ లెట్లు బంధించునో, సత్కర్మలు కూడ అట్లే బంధించును. కారణము ఫలాసక్తియే.*

*తండ్రి ఆజ్ఞగా పరశురాముడు తల్లి శిరస్సును ఖండించెను. తల్లి శిరస్సు ఖండించుట దుష్కర్మ. తండ్రి ఆజ్ఞను పరిపాలించుట కర్తవ్యము. పరశురాముడు కర్తవ్యమునే నమ్మెను. తల్లిగదా యని ఉపేక్షించ లేదు. తండ్రియగు జమదగ్ని మహర్షితో వాదింపలేదు. కర్తవ్యమున మాత్రమే నిలబడెను. అట్లే దశరథ రాముడు కూడ కర్తవ్యమునే పాలించెను. ఫలము లాసింపలేదు. తమదగు సంకల్పములు కూడ చేయనివారు మహాత్ములు. ఆరంభ పరిత్యాగము వారి సహజ స్వభావము. ఇట్టి కర్మ స్వరూపము స్పష్టముగ తెలిసిన మానవునకు ఈ క్షేత్రము కురుక్షేత్రము గాను, ధర్మ క్షేత్రముగాను గోచరించును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 534 / Sri Siva Maha Purana - 534 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 47

*🌻.శివుని అంతఃపుర ప్రవేశము - 4 🌻*

తరువాత శంఖములు, భేరీలు, పటహములు, ఆనకములు, గోముఖములు ఆ మహోత్సవములో అనేక పర్యాయములు మ్రోగించబడినవి (33). మరియు గాయకులందరు పరమ మంగళకరమగు పాటలను పాడిరి. నాట్యకత్తెలందరు అనేక తాళములతో గూడి నాట్యమును చేసిరి (34).

జగదేక బంధువగు శివుడు వీరతో గూడి అప్పుడు పరమేశ్వర తేజస్సుతో ముందుకు సాగెను. లోకపాలకులందరు ఆయనను సేవిస్తూ ఆనందముతో పుష్పములను చల్లు చుండిరి (35). ఈ విదముగా పూజింప బడిన శంభు పరమేశ్వరుడు అనేక స్తుతులచే కొనియాడబడుచున్న వాడై యజ్ఞ మండపములోనికి ప్రవేశించెను (36). పర్వతశ్రేష్ఠులు మహోత్సవ పురస్సరముగా మహేశ్వరుని వృషభము నుండి దింపి ప్రీతితో గృహము లోపలికి దోడ్కొని వెళ్లిరి(37). హిమవంతుడు కూడ దేవతలతో గణములతో కూడి విచ్చేసిన ఈశ్వరునకు భక్తితో ప్రణమిల్లి యథావిధిగా నీరాజన మొసంగెను (38).

హిమవంతుడు తన భాగ్యమును కొనియాడుచూ దేవతలను, మునులను, ఇతరులను అందరినీ నమస్కరించి మహోత్సాహముతో సన్మానించెను (39). ఆ హిమవంతుడు అచ్యుతునితో, ముఖ్యులగు దేవతలతో గూడి యున్న ఈశ్వరునికి అర్ఘ్యపాద్యముల నిచ్చి తన గృహము లోపలికి తీసుకొని వెళ్లెను (40). నన్ను, విష్ణువును, ఈశ్వరుని ఇతర పెద్దలను వాకిటి యందు రత్న సింహాసనములపై ప్రత్యేకముగా కూర్చుండబెట్టెను(41). చెలికత్తెలు, మేన, మరియు బ్రాహ్మణ స్త్రీలు, ఇతర ముత్తయిదవలు ఆనందముతో నీరాజనమిచ్చిరి (42).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 534 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 47 🌴*

*🌻 The ceremonious entry of Śiva - 4 🌻*

33. In that great festivity conches were blown, drums were beaten and the musical instruments, paṭaha, Ānaka and Gomukha were played on, repeatedly.

34. Musicians sang auspicious songs. Dancing girls danced to the tune.

35. Accompanied by these, attended upon by all important gods and with flowers showered on Him delightedly, the sole kinsman of the universe walked ahead shedding lordly splendour.

36. Lord Śiva, eulogised with many hymns of praise, entered the sacrificial altar. He was duly worshipped.

37. The excellent mountains jubilantly made Śiva dismount the bull and lovingly took Him within.

38. After duly bowing to Śiva who arrived there with the gods and Gaṇas, Himavat performed the Nīrājana with great devotion.

39. Praising his own good luck and bowing to all the gods, sages and others jubilantly he honoured them suitably.

40. The mountain, after offering Pādya and Arghya to them, took Śiva along with Viṣṇu and the important gods, within.

41. In the quadrangle inside he made us, Viṣṇu, Śiva and other important persons sit on gemset thrones.

42. The Nīrājana rites was then performed by Mena, her maids and the brahmin women as well as other ladies of the city with joy.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 164 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. సర్వాంతర్యామి 🌻*

*లోకమున దుఃఖమునకు కారణము ఎవ్వరని మానవులు అనేక సిద్ధాంతములను కనిపెట్టిరి. తమకు సుఖదుఃఖములను ఇచ్చు ప్రభువుగా దేవునిపై కొందరు నిందారోపణము చేసిరి. తప్పు చేయుట అనగా హాని కల్గించుటయే తన చెడునడవడిని సరిచేసికొనుట తన చేతిలోని పనియే. దానిని అంగీకరించుటకు భయపడి తనకన్న శక్తిమంతమైనదేదో తన చేత చేయించుచున్నదని నమ్ముట దౌర్భల్యము గాని సత్యముకాదు. జీవుడు మంచిగా గాని, చెడుగా గాని ప్రవర్తించుటకు గ్రహస్థితులు కారణమని సిద్ధాంతము చేసికొందురు. ఆత్మ వంచనము చేసికొనుచున్నారు.*

*చేసిన కర్మయొక్క ఫలమే మనచేత నిత్యము మంచి చెడ్డ పనులు చేయించుచున్నదని కొందరు నిర్ణయింప జూచుచున్నారు. కొందరి ప్రకారము సృష్టి అంతయు స్వాభావికముగా జరుగుచున్నది. దీనిని గ్రహించుట సాధ్యము కాదు నిరోధించుటకు అధికారము లేదు. మానవుని ప్రవర్తనలో గల మంచి చెడ్డలు కూడ స్వాభావికముగా జరుగుచున్నవని వారి మతము. దీని వలన ఒకరితో ఒకరు కలహించుకొని జాతి నశించును. ఇతరుల వలన మనకు దుఃఖము కలిగినపుడు వారు చేసిరని దుఃఖింప పనిలేదు. తర్కమునకు, నిర్ణయమునకు లొంగని వాడు సర్వాంతర్యామి. వాని లీలయే సర్వము. ఇంతకన్నా సత్యము లేదు.*

*✍️. మాస్టర్ ఇ.కె. 🌻*
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 153 / Osho Daily Meditations - 153 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 153. పీడకలలు 🍀*

*🕉. మీ మనస్సు మీ స్వభావానికి విరుద్ధంగా ఏదైనా చేస్తున్నప్పుడు, అంతఃచేతన మీకు సందేశాన్ని- మొదట మర్యాదగా ఇస్తుంది, కానీ మీరు చేయకపోతే: వినండి అని పీడకలగా ఇస్తుంది. 🕉*
 
*ఒక పీడకల అనేది మీ అంతఃచేతన యొక్క అరవడం తప్ప మరొకటి కాదు. మీరు మీ నుండి చాలా దూరం వెళుతున్నారని మరియు మీ మొత్తం జీవిని మీరు కోల్పోతారు, ఇంటికి తిరిగి రండి అని చెప్పడమే అది! ఒక పిల్లవాడు అడవుల్లో తప్పిపోయినప్పుడు, తల్లి అరుస్తూ పిల్లల పేరును పిలుస్తుంది. ఒక పీడకల అంటే అదే. కాబట్టి మీ కలలతో స్నేహం చేయడం ప్రారంభించండి. మీరు, మీ అంతఃచేతనత్వ స్థితికి దగ్గరగా మరింత దగ్గరగా వస్తున్నట్లు మీరు తెలుసుకుంటారు. మీరు దానికి ఎంత దగ్గరగా వస్తారో, మీకు అంత తక్కువ కలలు ఉంటాయి, ఎందుకంటే అప్పుడు కల అవసరం లేదు.*

*మీరు మేల్కొని ఉన్నప్పుడు కూడా అంతఃచేతనత్వం దాని సందేశాన్ని ఇవ్వగలదు. మీరు నిద్రపోయే వరకు వేచి ఉండవలసిన అవసరం లేదు; ఇది మీకు ఎప్పుడైనా దాని సందేశాన్ని ఇవ్వగలదు. మీరు దగ్గరగా మరింత దగ్గరగా ఎప్పుడైతే వస్తారో, మీ చేతన మరియు అంతఃచేతన ఒకదానిలోకి మరొక దానిలో వ్యాప్తి చెందుతుంది. అది గొప్ప అనుభవం. మీరు మొదటిసారి, ఏకత్వాన్ని అనుభూతి చెందుతారు. మీ ఉనికిలో ఏ భాగాన్ని తిరస్కరించలేదు. మీరు మీ సంపూర్ణతను అంగీకరించారు. మీరు మొత్తం ఒకటిగా కావడం ప్రారంభించారు.* 
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 153 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 153. NIGHTMARES 🍀*

*🕉 Whenever your mind is doing something that goes against your nature, the unconscious gives you the message--first politely, but if you don't: listen, nightmarishly. 🕉*
 
*A nightmare is nothing but the shouting of the unconscious, a cry of desperation that you are going too far away from yourself and you will miss your whole being. Come back home! It is as if a child is lost in the woods and the mother screams and shouts the name of the child. That is exactly what a nightmare is. So start befriending your dreams. By and by you will see that you and your unconscious are coming closer and closer together.*

*The closer you come, the fewer dreams you will have, because then there is no need for the dream. The unconscious can deliver its message even when you are awake. There is no need for it to wait for when you are asleep; it can give you its message any time. The closer and closer you come, the more the conscious and unconscious start overlapping. That's a great experience. You feel, for the first time, one. No part of your being is denied. You have accepted your wholeness. You start becoming whole.* 
  
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 356-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 356-1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 78. భక్తిమత్-కల్పలతికా, పశుపాశ విమోచనీ ।*
*సంహృతాశేష పాషండా, సదాచార ప్రవర్తికా ॥ 78 ॥ 🍀*

*🌻 356-1. 'సదాచార ప్రవర్తికా' 🌻* 

*వేదశాస్త్రము నందు తెలుపబడిన సదాచారమును వర్తింప చేయునది శ్రీమాత అని అర్థము. యజ్ఞము, దానము, తపస్సు సదాచారముగ తెలుపబడినవి. యజ్ఞార్థ జీవనము ఒక్కటియే జీవులకు బంధ విమోచనము కలిగించును. జీవిత సన్నివేశముల యందు స్వార్థ చింతనము బంధ కారణమై నిలచును. పరార్థ చింతన పరమునకు దారి చూపును. లోకహిత జీవనమే యజ్ఞార్థ జీవనము. జీవితము యజ్ఞార్థము కాకున్నప్పుడు చిక్కుపడి జీవుని బద్ధుని జేయును.*

*బద్ధుడైన జీవుడు బంధ మోచనమునకై ప్రయత్నించును. క్రమముగ యజ్ఞార్థ జీవనమే బంధ మోచనమునకు పరిష్కారమని తెలిసికొనును. స్వహితము కొఱకు గాక పరహితము కొఱకు జీవించుట ఆరంభించును. ఇట్టి క్రియా జ్ఞానము స్థిరపడు చుండగా తన యందలి ఇచ్ఛ పరహితేచ్చగా మారును. ఇచ్ఛ, క్రియలు పరహితమునకే సమర్పింప బడగ జీవుడు సాత్త్విక అహంకారమున స్థిరపడినపుడు జ్ఞానమను గ్రహింపబడును. అట్టివాడు తన వద్ద జేరిన సమస్త విద్యలను, శక్తిని, ద్రవ్యమును పరహితమునకే సమర్పించుట దానమగును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 356-1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 78. Bhaktimatkalpalatika pashupasha vimochani*
*Sanhruta sheshapashanda sadachara pravartika ॥ 78 ॥ 🌻*

*🌻 356-1. Sadācāra-pravartikā सदाचार-प्रवर्तिका 🌻*

*She removes the innate ignorance of the soul to realize the Brahman. In this nāma, She is said to induce the ignorant men to perform noble acts. Sat refers those who perform noble deeds and ācāra means the righteous acts performed by them. She makes the ignorant people (ignorant means lack of knowledge of the Brahman.*

*It could also mean the concept of duality) to pursue the righteous path to realize the Brahman. The principles of righteousness are expounded in epics. These principles form the basis of dharma śāstra (refer previous nāma).*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

FAITH in Him

Do not allow faith to falter when failure comes to your door. Meet it as a new challenge and triumph over it. Your faith must not be like your breath; for the breath comes in and goes out every moment. Let your faith be firm, with no alternations of entrances and exits. If faith is in one continuous stream, then Grace will be showered on you in one full continuous stream. God is with you at all stages and in all situations. Love Him from the depths of your heart. Take refuge in Him, He will definitely protect you. It is said 'Yad Bhaavam Tad Bhavathi.' meaning, "as is the feeling, so is the result". God will come to your rescue if you have total FAITH in Him.




14 Mar 2022

మైత్రేయ మహర్షి బోధనలు - 88 / Teachings of Maitreya Maharshi - 88


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 88 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 74. ధన వ్యామోహము 🌻


జీవితమున ధనము ఆవశ్యకత తగ్గించుకొను నేర్పు కలవాడు ముక్తి పథమున నడువగలడు. ధనమను మాయ జీవుని దృష్టిని చెదరగొట్టును. ప్రస్తుతము మానవజాతి యంతయు ధనపిశాచిచే పీడింప బడుచున్న వారే. సంస్కారవంతులు గూడ ధనాశ కారణముగ సంస్కారములకు తిలోదకములు వదలుచున్నారు. భారతీయ సంస్కృతికన్న మించిన సంస్కృతి ప్రపంచమున లేకున్నను ధనమునకు లోబడి సంపన్న దేశములకు వలసలు పోవుచు, బానిస జీవితములు గడుపుచున్న వారెందరో గలరు.

ధన సంపాదనమునకు, ఆత్మ స్వాతంత్య్రమునకు పరస్పర వైరుధ్యము కన్పట్టుచున్నది. మానవుడేర్పరచుకున్న ధనము మానవునే బంధించినది. ఈ కారణముగ మానవుడు పిరికివాడైనాడు. సాటి మనిషిపై విశ్వాసము తగ్గి ధనముపై విశ్వాసము పెరిగినది. నీవు సత్సాధకుడ వైనచో ధనవాంఛ, అధికార వాంఛల నుండి స్వతంత్రుడవు కమ్ము. ఇవి మాయకు రెండు రెక్కలవంటివి. నిన్నెత్తు కొనిపోయి నడిసముద్రములో వదలగలవు.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Teachings of Maitreya Maharshi - 88 🌹

✍️ . Sadguru K. Parvati Kumar
Collection: Prasad Bhardwaj

🌻 74. Money Craze 🌻

He who has the skill to reduce the need for money in life can walk the path of salvation. Money distracts the attention of the illusory creature. At present all mankind are being persecuted by the vampire. Cultivators are abandoning cults for the sake of niche. There is no culture in the world other than Indian culture that can emigrate to rich countries for the sake of wealth and those who lead slave lives.

There seems to be a contradiction between earning money and self-independence. Man-made money is captured by man himself. For this reason man became cowardly. Confidence in man diminished and confidence in money increased. If you are a creator, do not be free from the lust for money and power. These are like two wings of magic. Can be washed away and left in the ocean.


Continues .....

🌹 🌹 🌹 🌹 🌹


14 Mar 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 150


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 150 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మనిషి కలల గురించి తెలుసుకోవాలి, గుర్తించాలి. అదెంత సన్నిహితంగా వుంటుందంటే అది తెలుసుకోకుండా జనం దాన్ని చేజార్చుకుంటారు. అంతిమమయిన స్వప్నం పరవశం, పరమానందం. 🍀


మనిషి కలల గురించి తెలుసుకోవాలి. అన్ని కలలని గుర్తించాలి. అంతిమమయిన స్వప్నం పరవశం, పరమానందం, అదెంత సన్నిహితంగా వుంటుందంటే అది తెలుసుకోకుండా జనం దాన్ని చేజార్చుకుంటారు. అది అందరూ అందుకోదగింది.

అందరిలో వున్నది. కొద్దిగా వెతికి చూడాలి. అదక్కడ వుంది. అందుతుంది. కానీ మనుషులు వెతకరు. లేదా పొరపాటు మార్గాల్లో వెతుకుతారు. సమగ్రమయిన జీవితం, సంపూర్ణంగా జీవించని జీవితం వ్యర్థం. అది నరకం. నరకమంటే అదే. అదేదో భౌగోళిక ప్రదేశం కాదు. అసంపూర్ణమయిన మానసిక స్థితి. అది పరిపూర్ణమయితే అదే స్వర్గం.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


14 Mar 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 249 - 5. అన్ని వైవిధ్యాల వెనుక ఉన్న మద్దతు ఇదే / DAILY WISDOM - 249 - 5. It is the Support Behind All Diversity

 

🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 249 / DAILY WISDOM - 249 🌹

🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀

📝 . స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 5. అన్ని వైవిధ్యాల వెనుక ఉన్న మద్దతు ఇదే🌻


ధ్యానం అంటే జీవితంలో క్రమంగా వివరాల మధ్య, ప్రతి స్థాయిలో, ప్రతి దశలో, ప్రతి పరిణామంలోనూ సంపూర్ణతను స్థాపించడం. బ్రహ్మంగా పేర్కొనబడిన చైతన్యం ప్రతిచోటా చేతులు మరియు కాళ్ళు కలిగి ఉంది, ప్రతిచోటా కళ్ళు, ముఖాలు మరియు తలలు కలిగి ఉందని, మరియు ఇదంతా మాయచే కప్పబడి ఉందని భగవద్గీత ఒక గంభీరమైన పురాణ పద్ధతిలో ప్రకటించింది. ఇది అన్ని ఇంద్రియ అవయవాలకు ప్రకాశంగా ఉంటుంది, కానీ అది వాటిలో ఏదీ కాదు. ఇది అన్ని వైవిధ్యాల వెనుక ఉన్న మద్దతు. కానీ వీటిలో దేనితోనైనా దానిని గుర్తించలేము. ఇది అన్నీ వాస్తవిక ప్రదర్శనల వెనుక ఉన్న చైతన్యము, శక్తి.

పదార్థాలు మరియు లక్షణాలు, సంబంధాలు మరియు మార్పులకు పైన ఉన్నందున, దీనికి ఎటువంటి లక్షణాలు ఉన్నాయని చెప్పలేము, అయినప్పటికీ నాణ్యత లేదా లక్షణం అనేది ప్రాథమిక ఆధారంగా లేకుండా జీవించదు. ఇది అన్ని విషయాల లోపల మరియు వెలుపల ఉంది; కానీ అది లోపల మరియు వెలుపల లేదు. అన్ని కదలికలు మరియు కార్యకలాపాలకు పునాది కావడంతో, ఇది ఏ కదలిక లేదా కార్యకలాపాల ద్వారా వర్గీకరించబడదు. ప్రాథమిక దర్శకత్వం వహించేది మరియు అన్నీ తెలుసుకునేది అయిన దీనిని మనస్సుతో చూడలేము, వినలేము లేదా ఆలోచించలేము. అంతులేని మరియు అనంతం కావడంతో, ఇది ప్రతిచోటా అపరిమితమైన విస్తరణ కలిగినది; ప్రతీదానికి స్వయం అయి ఉన్నది కనుక, దీని ఉనికి కంటే దగ్గరగా దేనికైనా ఏదీ ఉండదు.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 249 🌹

🍀 📖 from Essays in Life and Eternity 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 5. It is the Support Behind All Diversity 🌻


The meditation of life, then, is the gradual establishment of wholeness in the midst of particulars, in every level, in every stage, in every degree of evolution. Grandly has it been proclaimed by the Bhagavadgita, in a majestic epic fashion, that the Universal, designated as Brahman, has hands and feet everywhere, has eyes, faces and heads everywhere, and it exists enveloping everything. It is the illuminator of all the sense organs, but in itself it is none of them. It is the support behind all diversity, but it cannot be identified with any one of these.

It is the reality behind appearances. Being above substances and qualities, relations and modifications, it cannot be said to have any attributes, though no quality or attribute can subsist without it being there as the basic substratum. It is inside and outside all things; but it has itself no inside and outside. Being the foundation for all movement and activity, it cannot be characterised by any movement or activity. Being the very Seer and Knower, as the basic Subject, it cannot be seen, heard or even thought by the mind. Being endless and infinite, it is everywhere like a limitless expanse; but as the Self of everything, nothing can be nearer than its presence.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


14 Mar 2022


శ్రీ మదగ్ని మహాపురాణము - 19 / Agni Maha Purana - 19


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 19 / Agni Maha Purana - 19 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 7

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. అయోధ్యాకాండ వర్ణనము - 2 🌻


ఆ మాటలను విని రావణుడు ''అటులనే చేసెదను'' అని పలికి మారీచునితో ఇట్లు పలికెను. బంగారు చిత్రవర్ణమైన మృగ రూపము ధరించి, రామలక్ష్మణులను దూరముగా తీసికొను బోవువాడవై సీత ఎదుటకు వెళ్ళుము. నే నామెను హరించెదను. ఇట్లు చేయ కున్నచో నీకు మరణమే. ''

మారీచుడు రావణునితో ఇట్లు పలికెను (అనుకొనెను). ధనుర్దారియైన రాముడు సాక్షాత్తు మృత్యుదేవతయే. రావణుని చేతిలో నైనను మరణింపవలసినదే; రాముని చేతిలో నైనను మరణించవలసినదే. మరణము తప్పనప్పుడు రాముని చేతిలో మరణము మంచిది. రావణుని చేతిలో కాదు. ఈ విధముగ తలచి, మృగరూపము ధరించి మాటిమాటికిని సీత ఎదుట సంచరించెను.

సీతచే ప్రేరితుడైన రాముడు (కొంత దూరము దానిని వెంబడించి) బాణము చేత దానిని చంపెను. మరణించుచు ఆ మృగము హా సీతా! హా లక్ష్మణా! అని అరచెను.

పిమ్మట సీత ప్రేరేపింపగా లక్ష్మణుడు, తన కిష్టము లేకున్నను రాముని వద్దకు వెళ్లెను రావణుడు జటాయువును చంపి సీతను హరించెను.

జటాయువుచే చీల్చబడిన శరీరము గల ఆతడు జానకిని అంకముపై కూర్చుండ బెట్టుకొని తీసికొని పోయి లంకచేరి, ఆమెను అశోకమను వనమున బందీగా ఉంచి ఇట్లు పలికెను.

రావణుడు పలికెను. ''నీవు నాకు ప్రముఖురాలైన భార్యవగుము''. ''ఓ రాక్షసస్త్రీలలారా! ఈమెను రక్షింపుడు.'' రాముడు మారీచుని చంపి, లక్ష్మణుని చూచి ఇట్లు పలికెను.

శ్రీ రాముడు పలికెను. ''లక్ష్మణా! అది మాయామృగము. నీవు కూడ వచ్చివేసినావు. అందుచే సీతను తప్పక అపహరించి యుందురు. '' పిమ్మట ఆతనికి సీత ఆశ్రమమున కనబడలేదు.

రాముడు దుఃఖించుచు ''నన్ను విడచి ఎక్కడికి పోతివి'' అని పలుకుచు దుఃఖార్తుడై విలపించెను. లక్ష్మణునిచే ఊరడింపబడి జానకిని అన్వేషించెను.

జటాయువు రాముని చూచి ''సీతను రావణుడు అపహరించెను'' అని చెప్పి ప్రాణములు విడచెను. రాముడు ఆతనికి అంత్య సంస్కారములు చేసెను. పిమ్మట కబంధుని సంహరించెను. ఆతడు శాపవిముక్తుడై ''సుగ్రీవుని వద్దకు వెళ్లుము'' అని రామునితో పలికెను.

అగ్ని మహాపురాణములోని రామాయణ కథలో ఆరణ్యకాండవర్ణన మనెడు సప్తమాధ్యాయము సమాప్తము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Agni Maha Purana -19 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 7

🌻 Ayodhya Kand - 2 🌻

13. Having heard her Rāvaṇa also said yes and said to Mārīca, “You move in front of Sītā in the form of a golden deer drawing Rāma and Lakṣmaṇa away. I will carry her away. Otherwise you will be dead.”

14-15. Mārīca[4] said to Rāvaṇa, “Rāma with his bow is verily the god of death himself.” “Either I have to die at the hands of Rāvaṇa or at the hands of Rāghava (Rāma). If I have to die, it is better (to die at the hands of) Rāma than Rāvaṇa. Having thought so (Mārīca) became a deer and roamed in front of Sītā again and again.

16. Being entreated by Sītā, Rāma (ran after that deer and) then killed that with an arrow. As it was dying, the deer said "O Sītā and O Lakṣmaṇa.”[5]

17-20. Then Saumitri (Lakṣmaṇa) being told inconsistent (words) by Sītā went (in search) of Rāma. Rāvaṇa also abducted Sītā, having wounded the vulture Jaṭāyu,[6] and being wounded by Jaṭāyu, carrying Sītā on the lap reached Laṅkā, kept (her) guarded in the Aśoka (grove) and said (to her), “You become my wife. You will be kept as the foremost.” Having killed Mārīca, Rāma saw Lakṣmaṇa and said (to him), “O Saumitri! this is a phantom deer. By the time you had come here, Sītā would have been taken away certainly.” Then he did not find her as he returned (to that place).

21. He lamented with grief (and said), “Where have you (Sītā) gone discarding me?” Being comforted by Lakṣmaṇa, Rama began to search for Jānaki (Sītā).

22. Having seen him, Jaṭāyu told that Rāvaṇa had carried her away. He (Jaṭāyu) then died. (Rāma) performed his obsequies. He then killed (the demon) Kabandha.[7] Getting free from a curse, he (Kabandha) said to Rāma, “You go to Sugrīva.”


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


14 Mar 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 570 / Vishnu Sahasranama Contemplation - 570


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 570 / Vishnu Sahasranama Contemplation - 570 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 570. ద్రవిణప్రదః, द्रविणप्रदः, Draviṇapradaḥ 🌻


ఓం ద్రవిణప్రదాయ నమః | ॐ द्रविणप्रदाय नमः | OM Draviṇapradāya namaḥ

ద్రవిణం దదాతి విష్ణుః ప్రకర్షేణ సుమార్గిణే ।
తస్మాద్ ద్రవిణప్రద ఇత్యుచ్యతే విధుషాం వరైః ॥

వాంఛితమగు ద్రవిణమును అనగా ధనమును భక్తులకు మిక్కిలిగా అనుగ్రహించునుగనుక, ఆ విష్ణుదేవుని 'ద్రవిణప్రదః' అని విద్వాంసులు కీర్తించుచుందురు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 570 🌹

📚. Prasad Bharadwaj

🌻 570. Draviṇapradaḥ 🌻

OM Draviṇapradāya namaḥ

द्रविणं ददाति विष्णुः प्रकर्षेण सुमार्गिणे ।
तस्माद् द्रविणप्रद इत्युच्यते विधुषां वरैः ॥

Draviṇaṃ dadāti viṣṇuḥ prakarṣeṇa sumārgiṇe,
Tasmād draviṇaprada ityucyate vidhuṣāṃ varaiḥ.

Since He bestows desired wealth upon His devotees, He is called Draviṇapradaḥ by the learned.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

सुधन्वा खण्डपरशुर्दारुणो द्रविणप्रदः ।दिविस्पृक् सर्वदृग् व्यासो वाचस्पतिरयोनिजः ॥ ६१ ॥

సుధన్వా ఖణ్డపరశుర్దారుణో ద్రవిణప్రదః ।దివిస్పృక్ సర్వదృగ్ వ్యాసో వాచస్పతిరయోనిజః ॥ 61 ॥

Sudhanvā khaṇḍaparaśurdāruṇo draviṇapradaḥ,Divispr‌k sarvadr‌g vyāso vācaspatirayonijaḥ ॥ 61 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


14 Mar 2022

14 - MARCH - 2022 సోమవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 14, మార్చి 2022 సోమవారం, ఇందు వాసరే 🌹 
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 172 / Bhagavad-Gita - 172 - 4-10 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 570 / Vishnu Sahasranama Contemplation - 570🌹
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 19 / Agni Maha Purana 19 🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 249 / DAILY WISDOM - 249 🌹 
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 150 🌹
7) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 88 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ సోమవారం మిత్రులందరికీ 🌹*
*ఇందు వాసరే, 14, మార్చి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : అమలకి ఏకాదశి, మీన సంక్రాంతి, Amalaki Ekadashi, Meena Sankranti🌻*

*🍀. రుద్రనమక స్తోత్రం - 14 🍀*

*27. తద్వారి వస్కృతాయాస్తు మహాదేవాయ తే నమః!*
*ఓషధీనాం చ పతయే నమస్తుభ్యం మహాత్మనే!!*
*28. ఉచ్చైర్ఘోషాయ ధీరాయ ధీరాన్ క్రందయతే నమః!*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : నేను చెప్పిన మార్గములోనే నడవాలి అనే వత్తిడి అధ్యాత్మికతలో ఉండదు. అందుకే కృష్ణుడు చెప్పవలసింది చెప్పాను. చెయదలచినది చెయ్యి. నిర్ణయం నీదే అన్నాడు. మాస్టర్‌ ఆర్‌.కె.🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం, శశిర ఋతువు, 
ఫాల్గుణ మాసం 
తిథి: శుక్ల-ఏకాదశి 12:06:52 వరకు
తదుపరి శుక్ల ద్వాదశి
నక్షత్రం: పుష్యమి 22:08:03 వరకు
తదుపరి ఆశ్లేష
యోగం: అతిగంధ్ 28:14:22 వరకు
తదుపరి సుకర్మ
కరణం: విష్టి 12:02:52 వరకు
వర్జ్యం: 04:47:20 - 06:31:24
దుర్ముహూర్తం: 12:49:26 - 13:37:28
మరియు 15:13:33 - 16:01:36
రాహు కాలం: 07:55:10 - 09:25:15
గుళిక కాలం: 13:55:29 - 15:25:34
యమ గండం: 10:55:20 - 12:25:24
అభిజిత్ ముహూర్తం: 12:01 - 12:49
అమృత కాలం: 15:11:44 - 16:55:48
సూర్యోదయం: 06:25:06
సూర్యాస్తమయం: 18:25:43
చంద్రోదయం: 15:01:19
చంద్రాస్తమయం: 03:41:04
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
ధాత్రి యోగం - కార్య జయం 22:08:03
వరకు తదుపరి సౌమ్య యోగం
- సర్వ సౌఖ్యం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 172 / Bhagavad-Gita - 172 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 10 🌴*

*10. వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితా: |*
*బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతా: ||*

🌷. తాత్పర్యం :
*రాగము, భయము, క్రోధము నుండి విడివాడి, నా యందు సంపూర్ణముగా మగ్నులై నాకు శరణుజొచ్చిన కారణముగా పూర్వము పలువురు నా యొక్క జ్ఞానముచే పవిత్రులై నా దివ్యప్రేమను పొందగలిగిరి.*

🌻. భాష్యము :
పైన వర్ణింపబడినట్లు భౌతికభావన యందు మగ్నమైనవానికి పరతత్త్వము యొక్క రూపసహితత్వమును అవగతము చేసికొనుట అత్యంత కఠిన విషయము. దేహాత్మభావన యందే ఆసక్తమైన జనులు సాధారణముగా భౌతికతత్త్వమునందే మునిగి యున్నందున పరతత్త్వము ఏ విధముగా రూపసహితమై యున్నదో అవగతము చేసికొనజాలరు. అట్టి లౌకికులు నాశము పొందనిదియు, జ్ఞానపూర్ణమైనదనియు, ఆనంద స్వరూపమైనదనియు నైన ఆధ్యాత్మిక దేహమొకటి కలదని ఊహింపలేరు. 

భౌతికభావన యందు దేహము నశించునది, అజ్ఞానపూర్ణమైనది మరియు దుఃఖభూయిష్టమైనది అయియున్నది. కనుకనే భగవానుని దేహమును గూర్చి తెలుపగనే సాధారణముగా జనసామాన్యము అదే దేహభావనను మనస్సులో అన్వయించుకొందురు. అటువంటి లౌకికులకు విశ్వరూపమే పరతత్త్వము. తత్కారణముగా వారు పరతత్త్వమును నిరాకారమని భావింతురు. అదియును గాక భౌతికభావనలో సంపూర్ణముగా మునిగియున్నందున ముక్తి పిదపయు వ్యక్తిత్వమును నిలుపుకొనుట యనెడి భావన వారికి అత్యంత భయమును కలుగజేయును. అట్టి వారికి ఆధ్యాత్మిక జీవనమనగా వ్యక్తిగతము మరియు రూప సహితమని తెలిపినపుడు తిరిగి రూపమును పొందుట మిక్కిలి జంకి నిరాకారత్వము నందు లీనమగుటనే వాంచింతురు.

కొందరు భౌతికత్వము నందు ఆసక్తులై ఆధ్యాత్మిక జీవనము నెడ అనాసక్తులు కాగా, కొందరు పరబ్రహ్మములో లీనము కాగోరుదురు. మరికొందరు విసుగుతో సర్వవిధములైన తాత్వికకల్పనల యెడ క్రోధాముపూని దేనిని కుడా విశ్వసింపరు. ఇటువంటి చివరి తెగవారు మాదకద్రవ్యములను ఆశ్రయించి, వాటి ద్వారా కలిగెడి మత్తునే కొన్నిమార్లు ఆధ్యాత్మికానుభుతిగా భావింతురు. ఈ విధమైన ఆధ్యాత్మికజీవనము నెడ భయము, విసుగు చెందిన జీవనము కలిగెడి శూన్యభావనము అనెడి మూడుస్థితుల భౌతిక ప్రపంచాసక్తిని మనుజుడు త్యజించవలెను. 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 172 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 4 - Jnana Yoga - 10 🌴*

*10. vīta-rāga-bhaya-krodhā man-mayā mām upāśritāḥ*
*bahavo jñāna-tapasā pūtā mad-bhāvam āgatāḥ*

🌷 Translation : 
*Being freed from attachment, fear and anger, being fully absorbed in Me and taking refuge in Me, many, many persons in the past became purified by knowledge of Me – and thus they all attained transcendental love for Me.*

🌹 Purport :
As described above, it is very difficult for a person who is too materially affected to understand the personal nature of the Supreme Absolute Truth. Generally, people who are attached to the bodily conception of life are so absorbed in materialism that it is almost impossible for them to understand how the Supreme can be a person. Such materialists cannot even imagine that there is a transcendental body which is imperishable, full of knowledge and eternally blissful. In the materialistic concept, the body is perishable, full of ignorance and completely miserable. 

Therefore, people in general keep this same bodily idea in mind when they are informed of the personal form of the Lord. For such materialistic men, the form of the gigantic material manifestation is supreme. Consequently they consider the Supreme to be impersonal. And because they are too materially absorbed, the conception of retaining the personality after liberation from matter frightens them. When they are informed that spiritual life is also individual and personal, they become afraid of becoming persons again, and so they naturally prefer a kind of merging into the impersonal void.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 570 / Vishnu Sahasranama Contemplation - 570 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 570. ద్రవిణప్రదః, द्रविणप्रदः, Draviṇapradaḥ 🌻*

*ఓం ద్రవిణప్రదాయ నమః | ॐ द्रविणप्रदाय नमः | OM Draviṇapradāya namaḥ*

*ద్రవిణం దదాతి విష్ణుః ప్రకర్షేణ సుమార్గిణే ।*
*తస్మాద్ ద్రవిణప్రద ఇత్యుచ్యతే విధుషాం వరైః ॥*

*వాంఛితమగు ద్రవిణమును అనగా ధనమును భక్తులకు మిక్కిలిగా అనుగ్రహించునుగనుక, ఆ విష్ణుదేవుని 'ద్రవిణప్రదః' అని విద్వాంసులు కీర్తించుచుందురు.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 570 🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻 570. Draviṇapradaḥ 🌻*

*OM Draviṇapradāya namaḥ*

द्रविणं ददाति विष्णुः प्रकर्षेण सुमार्गिणे ।
तस्माद् द्रविणप्रद इत्युच्यते विधुषां वरैः ॥

*Draviṇaṃ dadāti viṣṇuḥ prakarṣeṇa sumārgiṇe,*
*Tasmād draviṇaprada ityucyate vidhuṣāṃ varaiḥ.*

*Since He bestows desired wealth upon His devotees, He is called Draviṇapradaḥ by the learned.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सुधन्वा खण्डपरशुर्दारुणो द्रविणप्रदः ।दिविस्पृक् सर्वदृग् व्यासो वाचस्पतिरयोनिजः ॥ ६१ ॥

సుధన్వా ఖణ్డపరశుర్దారుణో ద్రవిణప్రదః ।దివిస్పృక్ సర్వదృగ్ వ్యాసో వాచస్పతిరయోనిజః ॥ 61 ॥

Sudhanvā khaṇḍaparaśurdāruṇo draviṇapradaḥ,Divispr‌k sarvadr‌g vyāso vācaspatirayonijaḥ ॥ 61 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 19 / Agni Maha Purana - 19 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 7*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. అయోధ్యాకాండ వర్ణనము - 2 🌻*

ఆ మాటలను విని రావణుడు ''అటులనే చేసెదను'' అని పలికి మారీచునితో ఇట్లు పలికెను. బంగారు చిత్రవర్ణమైన మృగ రూపము ధరించి, రామలక్ష్మణులను దూరముగా తీసికొను బోవువాడవై సీత ఎదుటకు వెళ్ళుము. నే నామెను హరించెదను. ఇట్లు చేయ కున్నచో నీకు మరణమే. ''

మారీచుడు రావణునితో ఇట్లు పలికెను (అనుకొనెను). ధనుర్దారియైన రాముడు సాక్షాత్తు మృత్యుదేవతయే. రావణుని చేతిలో నైనను మరణింపవలసినదే; రాముని చేతిలో నైనను మరణించవలసినదే. మరణము తప్పనప్పుడు రాముని చేతిలో మరణము మంచిది. రావణుని చేతిలో కాదు. ఈ విధముగ తలచి, మృగరూపము ధరించి మాటిమాటికిని సీత ఎదుట సంచరించెను.

సీతచే ప్రేరితుడైన రాముడు (కొంత దూరము దానిని వెంబడించి) బాణము చేత దానిని చంపెను. మరణించుచు ఆ మృగము హా సీతా! హా లక్ష్మణా! అని అరచెను.

పిమ్మట సీత ప్రేరేపింపగా లక్ష్మణుడు, తన కిష్టము లేకున్నను రాముని వద్దకు వెళ్లెను రావణుడు జటాయువును చంపి సీతను హరించెను.

జటాయువుచే చీల్చబడిన శరీరము గల ఆతడు జానకిని అంకముపై కూర్చుండ బెట్టుకొని తీసికొని పోయి లంకచేరి, ఆమెను అశోకమను వనమున బందీగా ఉంచి ఇట్లు పలికెను.

రావణుడు పలికెను. ''నీవు నాకు ప్రముఖురాలైన భార్యవగుము''. ''ఓ రాక్షసస్త్రీలలారా! ఈమెను రక్షింపుడు.'' రాముడు మారీచుని చంపి, లక్ష్మణుని చూచి ఇట్లు పలికెను.

శ్రీ రాముడు పలికెను. ''లక్ష్మణా! అది మాయామృగము. నీవు కూడ వచ్చివేసినావు. అందుచే సీతను తప్పక అపహరించి యుందురు. '' పిమ్మట ఆతనికి సీత ఆశ్రమమున కనబడలేదు.

రాముడు దుఃఖించుచు ''నన్ను విడచి ఎక్కడికి పోతివి'' అని పలుకుచు దుఃఖార్తుడై విలపించెను. లక్ష్మణునిచే ఊరడింపబడి జానకిని అన్వేషించెను.

జటాయువు రాముని చూచి ''సీతను రావణుడు అపహరించెను'' అని చెప్పి ప్రాణములు విడచెను. రాముడు ఆతనికి అంత్య సంస్కారములు చేసెను. పిమ్మట కబంధుని సంహరించెను. ఆతడు శాపవిముక్తుడై ''సుగ్రీవుని వద్దకు వెళ్లుము'' అని రామునితో పలికెను.

అగ్ని మహాపురాణములోని రామాయణ కథలో ఆరణ్యకాండవర్ణన మనెడు సప్తమాధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana -19 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

Chapter 7
*🌻 Ayodhya Kand - 2 🌻*

13. Having heard her Rāvaṇa also said yes and said to Mārīca, “You move in front of Sītā in the form of a golden deer drawing Rāma and Lakṣmaṇa away. I will carry her away. Otherwise you will be dead.”

14-15. Mārīca[4] said to Rāvaṇa, “Rāma with his bow is verily the god of death himself.” “Either I have to die at the hands of Rāvaṇa or at the hands of Rāghava (Rāma). If I have to die, it is better (to die at the hands of) Rāma than Rāvaṇa. Having thought so (Mārīca) became a deer and roamed in front of Sītā again and again.

16. Being entreated by Sītā, Rāma (ran after that deer and) then killed that with an arrow. As it was dying, the deer said "O Sītā and O Lakṣmaṇa.”[5]

17-20. Then Saumitri (Lakṣmaṇa) being told inconsistent (words) by Sītā went (in search) of Rāma. Rāvaṇa also abducted Sītā, having wounded the vulture Jaṭāyu,[6] and being wounded by Jaṭāyu, carrying Sītā on the lap reached Laṅkā, kept (her) guarded in the Aśoka (grove) and said (to her), “You become my wife. You will be kept as the foremost.” Having killed Mārīca, Rāma saw Lakṣmaṇa and said (to him), “O Saumitri! this is a phantom deer. By the time you had come here, Sītā would have been taken away certainly.” Then he did not find her as he returned (to that place).

21. He lamented with grief (and said), “Where have you (Sītā) gone discarding me?” Being comforted by Lakṣmaṇa, Rama began to search for Jānaki (Sītā).

22. Having seen him, Jaṭāyu told that Rāvaṇa had carried her away. He (Jaṭāyu) then died. (Rāma) performed his obsequies. He then killed (the demon) Kabandha.[7] Getting free from a curse, he (Kabandha) said to Rāma, “You go to Sugrīva.”

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join 
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 249 / DAILY WISDOM - 249 🌹*
*🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀*
*📝 . స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 5. అన్ని వైవిధ్యాల వెనుక ఉన్న మద్దతు ఇదే🌻*

*ధ్యానం అంటే జీవితంలో క్రమంగా వివరాల మధ్య, ప్రతి స్థాయిలో, ప్రతి దశలో, ప్రతి పరిణామంలోనూ సంపూర్ణతను స్థాపించడం. బ్రహ్మంగా పేర్కొనబడిన చైతన్యం ప్రతిచోటా చేతులు మరియు కాళ్ళు కలిగి ఉంది, ప్రతిచోటా కళ్ళు, ముఖాలు మరియు తలలు కలిగి ఉందని, మరియు ఇదంతా మాయచే కప్పబడి ఉందని భగవద్గీత ఒక గంభీరమైన పురాణ పద్ధతిలో ప్రకటించింది. ఇది అన్ని ఇంద్రియ అవయవాలకు ప్రకాశంగా ఉంటుంది, కానీ అది వాటిలో ఏదీ కాదు. ఇది అన్ని వైవిధ్యాల వెనుక ఉన్న మద్దతు. కానీ వీటిలో దేనితోనైనా దానిని గుర్తించలేము. ఇది అన్నీ వాస్తవిక ప్రదర్శనల వెనుక ఉన్న చైతన్యము, శక్తి.*

*పదార్థాలు మరియు లక్షణాలు, సంబంధాలు మరియు మార్పులకు పైన ఉన్నందున, దీనికి ఎటువంటి లక్షణాలు ఉన్నాయని చెప్పలేము, అయినప్పటికీ నాణ్యత లేదా లక్షణం అనేది ప్రాథమిక ఆధారంగా లేకుండా జీవించదు. ఇది అన్ని విషయాల లోపల మరియు వెలుపల ఉంది; కానీ అది లోపల మరియు వెలుపల లేదు. అన్ని కదలికలు మరియు కార్యకలాపాలకు పునాది కావడంతో, ఇది ఏ కదలిక లేదా కార్యకలాపాల ద్వారా వర్గీకరించబడదు. ప్రాథమిక దర్శకత్వం వహించేది మరియు అన్నీ తెలుసుకునేది అయిన దీనిని మనస్సుతో చూడలేము, వినలేము లేదా ఆలోచించలేము. అంతులేని మరియు అనంతం కావడంతో, ఇది ప్రతిచోటా అపరిమితమైన విస్తరణ కలిగినది; ప్రతీదానికి స్వయం అయి ఉన్నది కనుక, దీని ఉనికి కంటే దగ్గరగా దేనికైనా ఏదీ ఉండదు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 249 🌹*
*🍀 📖 from Essays in Life and Eternity 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 5. It is the Support Behind All Diversity 🌻*

*The meditation of life, then, is the gradual establishment of wholeness in the midst of particulars, in every level, in every stage, in every degree of evolution. Grandly has it been proclaimed by the Bhagavadgita, in a majestic epic fashion, that the Universal, designated as Brahman, has hands and feet everywhere, has eyes, faces and heads everywhere, and it exists enveloping everything. It is the illuminator of all the sense organs, but in itself it is none of them. It is the support behind all diversity, but it cannot be identified with any one of these.*

*It is the reality behind appearances. Being above substances and qualities, relations and modifications, it cannot be said to have any attributes, though no quality or attribute can subsist without it being there as the basic substratum. It is inside and outside all things; but it has itself no inside and outside. Being the foundation for all movement and activity, it cannot be characterised by any movement or activity. Being the very Seer and Knower, as the basic Subject, it cannot be seen, heard or even thought by the mind. Being endless and infinite, it is everywhere like a limitless expanse; but as the Self of everything, nothing can be nearer than its presence.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 150 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. మనిషి కలల గురించి తెలుసుకోవాలి, గుర్తించాలి. అదెంత సన్నిహితంగా వుంటుందంటే అది తెలుసుకోకుండా జనం దాన్ని చేజార్చుకుంటారు. అంతిమమయిన స్వప్నం పరవశం, పరమానందం. 🍀*

*మనిషి కలల గురించి తెలుసుకోవాలి. అన్ని కలలని గుర్తించాలి. అంతిమమయిన స్వప్నం పరవశం, పరమానందం, అదెంత సన్నిహితంగా వుంటుందంటే అది తెలుసుకోకుండా జనం దాన్ని చేజార్చుకుంటారు. అది అందరూ అందుకోదగింది.*

*అందరిలో వున్నది. కొద్దిగా వెతికి చూడాలి. అదక్కడ వుంది. అందుతుంది. కానీ మనుషులు వెతకరు. లేదా పొరపాటు మార్గాల్లో వెతుకుతారు. సమగ్రమయిన జీవితం, సంపూర్ణంగా జీవించని జీవితం వ్యర్థం. అది నరకం. నరకమంటే అదే. అదేదో భౌగోళిక ప్రదేశం కాదు. అసంపూర్ణమయిన మానసిక స్థితి. అది పరిపూర్ణమయితే అదే స్వర్గం.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 88 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 74. ధన వ్యామోహము 🌻*

*జీవితమున ధనము ఆవశ్యకత తగ్గించుకొను నేర్పు కలవాడు ముక్తి పథమున నడువగలడు. ధనమను మాయ జీవుని దృష్టిని చెదరగొట్టును. ప్రస్తుతము మానవజాతి యంతయు ధనపిశాచిచే పీడింప బడుచున్న వారే. సంస్కారవంతులు గూడ ధనాశ కారణముగ సంస్కారములకు తిలోదకములు వదలుచున్నారు. భారతీయ సంస్కృతికన్న మించిన సంస్కృతి ప్రపంచమున లేకున్నను ధనమునకు లోబడి సంపన్న దేశములకు వలసలు పోవుచు, బానిస జీవితములు గడుపుచున్న వారెందరో గలరు.*

*ధన సంపాదనమునకు, ఆత్మ స్వాతంత్య్రమునకు పరస్పర వైరుధ్యము కన్పట్టుచున్నది. మానవుడేర్పరచుకున్న ధనము మానవునే బంధించినది. ఈ కారణముగ మానవుడు పిరికివాడైనాడు. సాటి మనిషిపై విశ్వాసము తగ్గి ధనముపై విశ్వాసము పెరిగినది. నీవు సత్సాధకుడ వైనచో ధనవాంఛ, అధికార వాంఛల నుండి స్వతంత్రుడవు కమ్ము. ఇవి మాయకు రెండు రెక్కలవంటివి. నిన్నెత్తు కొనిపోయి నడిసముద్రములో వదలగలవు.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Teachings of Maitreya Maharshi - 88 🌹*
*✍️ . Sadguru K. Parvati Kumar*
*Collection: Prasad Bhardwaj*

*🌻 74. Money Craze 🌻*

*He who has the skill to reduce the need for money in life can walk the path of salvation. Money distracts the attention of the illusory creature. At present all mankind are being persecuted by the vampire. Cultivators are abandoning cults for the sake of niche. There is no culture in the world other than Indian culture that can emigrate to rich countries for the sake of wealth and those who lead slave lives.*

*There seems to be a contradiction between earning money and self-independence. Man-made money is captured by man himself. For this reason man became cowardly. Confidence in man diminished and confidence in money increased. If you are a creator, do not be free from the lust for money and power. These are like two wings of magic. Can be washed away and left in the ocean.*

*Continues .....*
🌹 🌹 🌹 🌹 🌹 
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 355-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 355-2








🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 355-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 355-2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 78. భక్తిమత్-కల్పలతికా, పశుపాశ విమోచనీ ।
సంహృతాశేష పాషండా, సదాచార ప్రవర్తికా ॥ 78 ॥ 🍀

🌻 355-2. 'సంహృతాశేష పాషండా' 🌻


అట్లే సనాతనమగు ధర్మమును, ఆచారమును పాలకులు సహితము కించపరచు చున్నారు. పవిత్ర గ్రంథములను బహిరంగముగ ధ్వంసము చేయుచున్నారు. శ్రీరాముని విగ్రహ మూర్తులను కూడ చెప్పుల దండతో అలంకరించి ఊరేగించుట జరిగినది. ఇది అంతయూ పాషండ తత్వమే. సజ్జనులు బలహీనులై చేయునది లేక మనస్థాపముతో వ్యధ చెందుచున్నారు. స్వేచ్ఛ స్వాతంత్ర్యము అను పదములకు నూతన నిర్వచనముల నేర్పరచి ఇంద్రియలోలురై దేహబద్దులై దేహమే తామనుకొనుచు జీవించు చున్నారు.

ఇట్టి పాషండత్వము తొలగించుట మానవ సాధ్యము కాదు. దైవమే దిగివచ్చి ఈ పాషండత్వమును సంహరింపవలెను. రామ కృష్ణాది అవతారముల యందు ఇట్టి సంస్కరణమే జరిగినది. ప్రస్తుత కాలమున సదాచార ప్రవర్తకులు దివ్యావతరణమునకే ప్రార్థనలు సలపవలెను. శ్రీమాత సంకల్పమే రూపము దాల్చిన దివ్యత్వము. పూర్వము సృష్టి యందు ఎందరినో పాషండులను సంహరించి ఆమె జీవుల నుద్ధరించినది. ప్రతి మానవుడు సదాచారమున రక్షింపబడినచో తన యందలి పాషండత్వమును నిర్మూలించు కొనవలెను. అందులకే ఈ నామము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 355-2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 78. Bhaktimatkalpalatika pashupasha vimochani
Sanhruta sheshapashanda sadachara pravartika ॥ 78 ॥ 🌻

🌻 355-2. Saṃhṛtāśeṣa-pāṣaṇḍā संहृताशेष-पाषण्डा 🌻


She is referred in this nāma as the destroyer of heretics. Heretics are those who do not follow the principles laid down by Veda-s. Fourteen places (which include the four Veda-s and their extensions are referred to as the principle domains of dharma.

Those men who cross the boundaries of the principles of dharma are called pāṣaṇḍa or heresy. She destroys all those who act against the principles of Veda-s.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


13 Mar 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 152. నిద్ర / Osho Daily Meditations - 152. SLEEP


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 152 / Osho Daily Meditations - 152 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 152. నిద్ర 🍀


🕉. నిద్ర అనేది దైవికం. మరే సమయంలోనైనా కంటే ఎక్కువ దైవికం. ఒకరు ధ్యానం చేస్తూ నిద్రపోతే, ధ్యానం వారి అవ్యక్త స్థితి యొక్క పొరలలోకి దూసుకు పోతుంది. 🕉

మీరు ఎప్పుడైనా గమనించారా? రాత్రి మీ చివరి ఆలోచన ఏదైతే, ఉదయం అదే మీ మొదటి ఆలోచన అవుతుంది. మీరు నిద్రలోకి ప్రవేశించినప్పుడు చివరిదయిన ఆలోచనను గమనించండి. మీరు నిద్ర యొక్క ప్రవేశద్వారం మీద నిలబడి ఉన్నారు- మీరు మళ్ళీ ప్రవేశద్వారం మీద నిలబడినప్పుడు, అంటే మీరు నిద్ర నుండి బయటకు వచ్చేటప్పుడు మీ చివరి ఆలోచన ఎల్లప్పుడూ మళ్లీ మీ మొదటి ఆలోచన అయి ఉంటుంది.

అందుకే అన్ని మతాలు నిద్రపోయే ముందు ప్రార్థన చేయమని పట్టుబట్టాయి. అంటే చివరి ఆలోచన ప్రార్థన అయి ఉంటే, అది మీ హృదయంలోకి దిగిపోతుంది. రాత్రంతా అది మీ చుట్టూ సుగంధంలాగా ఉంటుంది- అది మీ లోపలి స్థలాన్ని దివ్యత్వంతో నింపుతుంది. ఉదయం మీరు మేల్కొన్నప్పుడు, అదే మీ చుట్టూ ఉంటుంది. ఎనిమిది గంటల నిద్రను ధ్యానంగా ఉపయోగించవచ్చు. ఈ రోజుల్లో ప్రజలకు ఎక్కువ సమయం లేదు, కానీ ఈ ఎనిమిది గంటల నిద్రను ధ్యాన సమయంగా ఉపయోగించ వచ్చు. నా మొత్తం విధానం ఏమిటంటే, ప్రతిదీ ఉపయోగించ వచ్చు. అలాగే నిద్రని కూడా ఉపయోగించు కోవాలి.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 152 🌹

📚. Prasad Bharadwaj

🍀 152. SLEEP 🍀

🕉 Sleep is divine, more divine than any other time. And if one falls asleep meditating, the meditation keeps resounding down into the layers of one’s unconscious. 🕉

Have you ever noticed? Whatever is your last thought in the night will be your first thought in the morning. Watch it-the last, the very last, when you enter into sleep. You are standing just on the threshold-the last thought will always be the first thought when you again stand on the threshold and you are coming out of sleep.

That's why all the religions have insisted on praying before one goes to sleep, so the last thought remains of prayer, and it sinks into one's heart. The whole night it remains like an aroma around you-it fills your inner space, and in the morning when you awake, again it is there. Eight hours of sleep can be used as meditation. Nowadays people don't have much time, but these eight hours of sleep can be used as meditation time. My whole approach is that everything can be used and should be used---even sleep!


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


13 Mar 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 163


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 163 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. సర్వాంతర్యామి సాక్షాత్కారం 🌻


మహనీయులు దేవుని అస్తిత్వమునందు‌ శరణాగతి చెంది, జీవయాత్ర సాగింతురు. వీరు తమ‌ హృదయములందు ఎనిమిది అంగుళముల‌ కొలత కలిగిన దివ్యదేహునిగా సర్వాంతర్యామిని ధ్యానింతురు. అనగా ఎనిమిది ప్రకృతులలోని వానిని తెలియుదురు. చూపుడు వ్రేలు‌ కొలతగా హృదయమున శ్రీహరిని ధ్యానింతురు. అనగా చూపడు వ్రెలితో ఎవ్వనిని చూపినను, ఏ వస్తువును చూపినను, వాని యందు భగవంతుడు జ్ఞప్తి రావలెను గాని ఆయా వ్యక్తులు, వస్తువులు‌గాదు.

స్వామిని చతుర్భుజుడుగా ధ్యానింపవలెను. అనగా తాను నిలబడిన తావున నుండి నాలుగు దిక్కుల వరకు కనుపించునంతమేర దేవుని బాహువులు రక్షించుచున్నవని తెలియవలెను. మందర ధారియగు కూర్మమూర్తిగా భావింపవలెను. అనగా జగత్తును ధరించు‌ శక్తిగా తెలియవలెను.

దేవుని గూర్చి మనకు ఎంత గొప్ప అభిప్రాయమున్నను, అది అభిప్రాయమే గాని దేవుడు కాదని గ్రహింపవలెను. సాధన చేయుచున్నప్పుడు కలుగు స్వప్న సాక్షాత్కారములు మున్నగు అనుభవములకు మురిసి పొంగినచో, ఇంక ఆ పైకి పోవుట జరుగదు. ఇట్టివి మన కోరికల సాక్షాత్కారములే కాని, దేవుని సాక్షాత్కారములు గావు. భగవంతుని‌ సాక్షాత్కారమనగా సృష్టిలోని జీవుల రూపములోని సాక్షాత్కారమే. మిగిలినదంతయు జీవులల్లుకొన్న పాండిత్యమనియు తెలియవలెను.


.✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


13 Mar 2022

శ్రీ శివ మహా పురాణము - 533 / Sri Siva Maha Purana - 533


🌹 . శ్రీ శివ మహా పురాణము - 533 / Sri Siva Maha Purana - 533 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 47

🌻.శివుని అంతఃపుర ప్రవేశము - 3 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను-

ఇట్లు వారచట సాదరముగా మాటలాడు చుండగనే, ఇంతలో పర్వతరాజు యొక్క మంత్రులు అందరు విచ్చేసిరి(23). వారు శివుని వద్దకు,విష్ణువు మొదలగు వారి వద్దకు వెళ్లి కన్యాదాన సమయము సమీపించు చన్నది గాన, బయలు దేరుడు అని ప్రార్ధించిరి(24). ఓ మునీ! విష్ణువు మొదలగు దేవతలందరు ఆ మాటను విని మనస్సులో చాల సంతసించి వెంటనే హిమవంతుని ఉద్దేశించి జయాధ్వానమును చేసిరి (25). కాళిని పొందవలెననే ఉత్కంఠ గల శివుడు కూడ మిక్కిలి సంతసించెను. కాని ఆ చిహ్నములను మనస్సులందు రహస్యముగ నుంచి గంభీరాకారడై యుండెను(26).

అపుడు శూలధారి, లోకానుగ్రహమును చేయువాడు, మిక్కిలి ప్రసన్నుడు అగు మంగళ ద్రవ్యములతో స్నానమును చేసెను (27). స్నానము చేసి చక్కని వస్త్రమును ధరించిను శివుని వారందరు చుట్టుముట్టిరి. లోకపాలకులు ఆయనను చక్కగా సేవిస్తూ వృషభముపై నెక్కించిరి(28). వారందరు వాద్యములను మ్రోగించుచూ, పండుగను చేసుకొనుచూ ఆ ప్రభుని ముందిడుకొని హిమవంతుని గృహమునకు వెళ్లిరి(29). హిమవంతునిచే పంప బడిన బ్రాహ్ణణులు మరియు శ్రేష్ఠులగు పర్వతులు కుతూహలముతో కూడిన వారై శంభుని యెదుట నడిచిరి(30).

శివుని శిరస్సుపై పెద్ద ఛత్రము ఏర్పాటు చేయబడెను. చామరములు వీచబడెను. వితానము ( వస్త్రముతో చేసిన పందిరి) క్రింద మహేశ్వరుడు శోభిల్లెను(31). నేను, విష్ణువు, ఇంద్రుడు, లోకపాలకులు ముందు నడిచితిమి. మేము కూడ గొప్ప శోభతో ప్రకాశించితిమి (32).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 533 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 47 🌴

🌻 The ceremonious entry of Śiva - 3 🌻


Brahmā said:—

23. Even as these confabulations were going on, the ministers of the lord of mountains came there.

24. They approached Śiva, Viṣṇu and others and made their submission that the time for the celebration of marriage had arrived and that they would please hasten to the palace.

25. On hearing that, O sage, Viṣṇu and others rejoiced much and cried shouts of victory to the mountain.

26. Śiva too rejoiced much eager that he was approaching Pārvatī but kept the signs of joy within his mind alone in a wonderfully serene manner.

27. Then the ceremonial ablution with the sacred articles of toilet, was performed by the delighted tridentbearing lord eager to bless the worlds.

28. The bath being over He wore fine clothes. He was attended upon by the guardians of the quarters and surrounded by several others. He was then seated on the shoulders of the Bull.

29. With the lord in front, all of them entered the palace of Himavat playing on various musical instruments and exhibiting their eagerness.

30. The brahmins sent by Himavat and the excellent mountains enthusiastically went ahead of Śiva.

31. The great royal umbrella was held aloft over the great lord. He was fanned by chowries and a canopy was spread over Him.

32. Viṣṇu, Indra, the other guardians of the quarters and I going ahead shone with great brilliance and splendour.


Continues....

🌹🌹🌹🌹🌹


13 Mar 2022

గీతోపనిషత్తు -335


🌹. గీతోపనిషత్తు -335 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 28-2 📚


🍀 28-2. సన్యాస యోగము - కర్తవ్యము నిర్వర్తింప లేకపోవుట వలన, అనవసరపు కార్యములలో తల దూర్చుకొనుట వలన బంధములు పెరుగుచు నుండును. మొదట సంకల్పములను సన్యసింపవలెను. పిదప కర్మఫలములను కూడ సన్యసింపవలెను. అట్టివాడే నిజమగు సన్యాసి. కర్తవ్యకర్మ నిర్వర్తించుచునే యుండవలెను. అట్టివాడే నిజమగు యోగి. ఇట్టి జ్ఞానము వలన విశిష్టమగు మోక్షస్థితి సద్యోఫలముగ నుండును. కర్తవ్య కర్మయందు యజ్ఞము, దానము, తపస్సు కూడ భగవానుడు పేర్కొనినాడు. 🍀

28. శుభాశుభఫలై రేవం మోక్ష్యసే కర్మబంధనైః |
సన్న్యాస యోగ యుక్తాత్మా విముక్తో మా ముపైష్యసి ||

🌻. తాత్పర్యము : పై విధముగ సర్వమును నాకు సమర్పణ చేసుకొనిన వానికి పాపపుణ్య ఫలముల బంధము విడువబడును. నాతో సమ్య జ్ఞాన యోగమున సమస్తము నుండి విముక్తి చెంది నన్ను పొందిన వాడగును.

🌻. వివరణము : స్వంత సంకల్పములు రజోగుణ దోషముచే కలుగుచు నుండును. అట్లు సంకల్పములు బలీయముగ లాగుచుండగ, కర్తవ్యము మరపునకు వచ్చును. కర్తవ్యము నిర్వర్తింప లేకపోవుట వలన, అనవసరపు కార్యములలో తల దూర్చుకొనుట వలన బంధములు పెరుగుచు నుండును. కనుక నిజమగు సన్యాసము రెండు విధములుగ నున్నది. మొదట సంకల్పములను సన్యసింపవలెను. పిదప కర్మఫలములను కూడ సన్యసింపవలెను.

కర్తవ్యకర్మ నిర్వర్తించుచునే యుండవలెను. అట్టివాడే నిజమగు సన్యాసి. అట్టివాడే నిజమగు యోగి. ఇట్టి జ్ఞానము వలన విశిష్టమగు మోక్షస్థితి సద్యోఫలముగ నుండును. కర్తవ్య కర్మయందు యజ్ఞము, దానము, తపస్సుకూడ భగవానుడు చివరి అధ్యాయమున పేర్కొనినాడు. అనగా పర హితార్థము జీవించుట, అందివచ్చిన సంపదను దానము చేయుట, తన లోపల వెలుపల నిండియున్న ఈశ్వరునితో అనుసంధానము చెందుట కూడ కర్తవ్యములే అని తెలియవలెను. అట్టి కర్తవ్యము లందు కూడ ఫలాసక్తి యుండరాదు. అట్టివాడు విముక్తుడగును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


13 Mar 2022