వైశాఖ పౌర్ణమి, బుద్ధ జయంతి శుభాకాంక్షలు Greetings on Vaishakha Purnima and Buddha Jayanti


🌹. వైశాఖ పౌర్ణమి, బుద్ధ జయంతి శుభాకాంక్షలు మరియు శుభ సోమవారం మిత్రులందరికీ 🌹

ఇందు వాసరే, 16, మే 2022

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ



🌻. పండుగలు మరియు పర్వదినాలు : వైశాఖ పౌర్ణమి, బుద్ధ జయంతి, చంద్రగహణము, Vaishakha Purnima, Buddha Jayanti, Chandra Grahan🌻


16 May 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 601/ Vishnu Sahasranama Contemplation - 601


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 601/ Vishnu Sahasranama Contemplation - 601🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻601. శ్రీవత్సవక్షాః, श्रीवत्सवक्षाः, Śrīvatsavakṣāḥ🌻

ఓం శ్రీవత్సవక్షే నమః | ॐ श्रीवत्सवक्षे नमः | OM Śrīvatsavakṣe namaḥ

శ్రీవత్సవక్షాః, श्रीवत्सवक्षाः, Śrīvatsavakṣāḥ

చిహ్నం శ్రీవత్ససఙ్జ్ఞం హి వక్షస్యస్య స్థితం హరేః ।
ఇతి శ్రీవత్సవక్షా ఇత్యుచ్యతే విదుషం వరైః ॥

శ్రీవత్సము అను సంజ్ఞ కల చిహ్నము ఈతని వక్షమునందు కలదుగనుక హరికి శ్రీవత్సవక్షాః అను నామముగలదు.


:: పోతన భాగవతము అష్టమ స్కంధము ::

వ.మఱియు న ద్దేవుండు శంఖచక్రగదా కమల కలిత చతుర్భుజుండును, బిశంగవర్ణవస్త్రుండును, మకర కుండల మండిత గండ భాగుండును, శ్రీవత్సవక్షుండును, నలిన చక్షుండును, నిరంతర శ్రీవిరాజిత రోలంబ కదంబాలంబిత వనమాలికా పరిష్కృతుండును, మణికనక కాంచిత కాంచీవలయాంగద కిరీటహార నూపురాలంకృతుండునుఁ, కమనీయ కంఠ కౌస్తుభాభరణుండును, నిఖిలజన మనోహరణుండునునై యవతరించిన సమయంబున. (507)శా.చింతం బాసిరి యక్షతార్క్ష్యసుమనస్సిద్ధోరగాధీశ్వరుల్సంతోషించిరి సాధ్యచారణ మునీశ బ్రహ్మ విద్యాధరుల్గాంతిం జెందిరి భానుచంద్రములు; రంగద్గీత వాద్యంబులన్గంతుల్ వైచిరి మింటఁ గింపురుషులున్ గంధర్వులుం గిన్నరుల్. (508)

వామనుడు జన్మించినపుడు అతనికి నాలుగు చేతులూ, ఆ చేతులలో శంఖమూ, చక్రమూ, గదాపద్మములు ఉన్నాయి. గోరోజనరంగు వస్త్రమూ, మకర కుండలాలలతో మెరిసే చెక్కిళ్ళు, రొమ్ముపై శ్రీవత్సమూ, కమలాలవంటి కన్నులూ కలిగి ఉన్నాడు. తుమ్మెదలు మూగిన అందమైన వనమాల మెడలో కదులుతున్నది. రత్నములు కూర్చిన బంగారు ఒడ్డాణము, బాహుపురులూ, కిరీటమూ, హారములూ, కాలి అందెలు కాంతులు వెదజల్లుతున్నాయి. కమనీయమైన కంఠభాగాన, కౌస్తుభమణి మెరుస్తున్నది. అతని రూపము అఖిల జనుల మనస్సులను ఆకర్షిస్తున్నది.

వామనుడు పుట్టగానే, యక్షులూ, గరుడులూ, సిద్ధులూ, నాగులూ, చింతలు విడిచినారు. సాధ్యులూ, చారణులూ, ఋషులూ, ఋత్విజులూ, విద్యాధరులూ, సంతోషించినారు. సూర్యచంద్రులు కాంతులు విరజిమ్మినారు. గంధర్వులూ, కిన్నరులూ, కింపురుషులూ వాద్యాలు మ్రోగిస్తూ ఆటపాటలతో ఆకాశములో నాట్యములుజేసినారు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 601🌹

📚. Prasad Bharadwaj

🌻601. Śrīvatsavakṣāḥ🌻


OM Śrīvatsavakṣe namaḥ

चिह्नं श्रीवत्ससङ्ज्ञं हि वक्षस्यस्य स्थितं हरेः ।
इति श्रीवत्सवक्षा इत्युच्यते विदुषं वरैः ॥

Cihnaṃ śrīvatsasaṅjñaṃ hi vakṣasyasya sthitaṃ hareḥ,
Iti śrīvatsavakṣā ityucyate viduṣaṃ varaiḥ.

Since there is a mark called Śrīvatsa on His bosom, He is called Śrīvatsavakṣāḥ.

:: श्रीमद्भागवते अष्टमस्कन्धे अष्टादशोऽध्यायः ::

श्यामावदातो झषराजकुण्डलत्विषोल्लसच्छ्रीवदनाम्बुजः पुमान् ।
श्रीवत्सवक्षा बलयाङ्गदोल्लसत्किरीटकाञ्चीगुणचारुनूपुरः ॥ २ ॥


Śrīmad Bhāgavata - Canto 8, Chapter 18

Śyāmāvadāto jhaṣarājakuṇḍalatviṣollasacchrīvadanāmbujaḥ pumān,
Śrīvatsavakṣā balayāṅgadollasatkirīṭakāñcīguṇacārunūpuraḥ. 2.

The body of the Lord, blackish in complexion, was free from all inebrieties. His lotus face, decorated with earrings resembling sharks, appeared very beautiful, and on His bosom was the mark of Śrīvatsa. He wore bangles on His wrists, armlets on His arms, a helmet on His head, a belt on His waist, a sacred thread across His chest, and ankle bells decorating His lotus feet.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः ।
श्रीवत्सवक्षाश्श्रीवासश्श्रीपतिः श्रीमतां वरः ॥ ६४ ॥

అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।
శ్రీవత్సవక్షాశ్శ్రీవాసశ్శ్రీపతిః శ్రీమతాం వరః ॥ 64 ॥

Anivartī nivr‌ttātmā saṃkṣeptā kṣemakr‌cchivaḥ,
Śrīvatsavakṣāśśrīvāsaśśrīpatiḥ śrīmatāṃ varaḥ ॥ 64 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


16 May 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 280 - 6. స్వయం అనేది గుర్తింపు యొక్క సూత్రం / DAILY WISDOM - 280 - 6. The Self is a Principle of Identity


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 280 / DAILY WISDOM - 280 🌹

🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 6. స్వయం అనేది గుర్తింపు యొక్క సూత్రం 🌻


నేను, లేదా ఆత్మగా పిలవబడేది స్వయమైనది, అవిభాజ్యమైనది, నిష్పాక్షికమైనది మరియు అద్వితీయమైనది. ఇది చైతన్యం అలా కాక వెరొకలా ఉండలేని స్థితి, ఎట్టి పరిస్థితిలో కొల్పోని స్థితి. అది ప్రేమించబడదు మరియు ద్వేషించబడదు, ఎందుకంటే అది మన స్వయమే. దీనినే ఆత్మ అంటారు. ఆత్మని ప్రేమించడం లేదా ద్వేషించడం వంటివి ఏవీ ఉండవు.

ఎవరూ ఒకరి ఆత్మని ప్రేమించరు లేదా ద్వేషించరు, ఎందుకంటే ప్రేమ మరియు ద్వేషం మానసిక క్రియలు, మరియు ప్రతి మానసిక క్రియ దేశం మరియు కాలంలో మనస్సు యొక్క కదలిక. తానే స్వయంగా గా ఉన్న ఆత్మ లో అలాంటి విషయం అసాధ్యం. కాబట్టి మనకు అలవాటైన సందర్భానుసారమైన స్వయం, కుటుంబ స్వయం, జాతి స్వయం, లోక స్వయం మొదలైన ఈ తప్పుడు స్వభావాలకి ఆత్మ అనే నిర్వచనం వర్తించదు. అలాగే, మిథ్యాత్మన్ అని పిలువబడే శరీరం కూడా తప్పుడు స్వయమే. శరీరం ఆత్మ కాదు. ప్రతి ఒక్కరికి ఇది చాలా బాగా తెలుసు, ఎందుకంటే ఆత్మ లక్షణాలైన శాశ్వతత్వం , అవిభాజ్యత మొదలైనవి-శరీరానికి వర్తించవు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 DAILY WISDOM - 280 🌹

🍀 📖 from The Study and Practice of Yoga 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 6. The Self is a Principle of Identity 🌻


The Self, or the Atmanas we call it, is a principle of identity, indivisibility and non-externality or objectivity. It is that state of consciousness or awareness which is incapable of becoming other than what it is, and incapable of being lost under any circumstance. It cannot be loved and it cannot be hated, because it is what we are. This is what is called the Self. There is no such thing as loving the Self or hating the Self.

No one loves one's Self or hates one's Self, because love and hatred are psychological functions, and every psychological function is a movement of the mind in space and time. Such a thing is impossible in respect of the Self, which is Self-identity. Thus the definition of the Self as Self-identity will not apply to this false self which is the circumstantial self, the family self, the nation self, the world self, etc., as we are accustomed to. Also, there is another self which is known as the mithyatman—the false self which is the body. The body is not the Self. Everyone knows it very well, for various reasons, because the character of Self-identity—indestructibility, indivisibility, etc.—does not apply to the body.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


16 May 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 180


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 180 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. వ్యక్తి మరింత మరింత చైతన్యంగా వుండడానికి ప్రయత్నించాలి. చైతన్యపు లోతులు పెరిగే కొద్దీ సంతోషం కూడా పెరుగుతుంది. 🍀


కేవలం కొంతమంది మాత్రమే ఆధ్యాత్మిక స్థితిని అందుకున్న వాళ్ళు. వాళ్ళే నిజమైన మనుషులు. అందరి దగ్గరా శక్తి వుంది. అందరూ అందుకోసం ప్రయత్నించరు. అందువల్ల ఆ శక్తి నిర్వీర్యమవుతుంది. కాబట్టి వ్యక్తి మరింత మరింత చైతన్యంగా వుండడానికి ప్రయత్నించాలి.

మొదట నీలో చైతన్యపు మెరుపులు మెరిసినపుడు నువ్వు ఆశ్చర్యానికి లోనవుతావు. ప్రతి చైతన్యపు మెరుపుల్ని సంతోషం అనుసరిస్తుంది. చైతన్యపు లోతులు పెరిగే కొద్దీ సంతోషం కూడా పెరుగుతుంది. ఆనందమన్నది దాని గుండా ఆవిర్భవించేది. చైతన్యపు నీడ.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


16 May 2022

మైత్రేయ మహర్షి బోధనలు - 119


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 119 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 92. ఆత్మ హంతకులు -1🌻


మేమందించు బోధనలు ఏమి చేయవలెను? అనునది ప్రశ్న. కేవలము మౌనముగ ఆచరింపవలెను అనునది సమాధానము. ఆచరించుట ప్రథమ కర్తవ్యము. దాని ఫలము అనుభూతి. అనుభూతి ఆచరణకు సువాసన కలిగించును. అట్టి సువాసనకు అన్వేషకులాకర్షింప బడుదురు. ఆకర్షింపబడినవారికి వారి శ్రద్ధననుసరించి మా బోధలందించ వలెను.

సత్యాన్వేషకులు అన్వేషణ మార్గమున మా బోధనల సమీపమునకు చేరుదురు. అన్వేషణ లేనివారు చేరలేరు. బోధనలనాచరించుటయే ప్రమాణము కాని జీవుల నాకర్షించుట ప్రమాణము కాదు. జీవులు ఆకర్షింపబడినపుడు బోధనము చేయుటకు ఉత్సహింపక, ఆచరణమార్గమున చూపుటయే నిజమైన బోధన. నిజమునకు ప్రవర్తనయే ప్రవచనము. కేవలము ప్రవచనములో ఉపయోగ మేమియును లేదు.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


16 May 2022

16 - MAY - 2022 సోమవారం, ఇందు వాసరే MESSAGES బుధ్ద జయంతి, వైశాఖ పౌర్ణమి శుభాకాంక్షలు

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 16, మే 2022 సోమవారం, ఇందు వాసరే 🌹
🍀. బుద్ధ జయంతి, వైశాఖ పౌర్ణమి శుభాకాంక్షలు 🍀
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 202 / Bhagavad-Gita - 202 - 4- 40 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 601 / Vishnu Sahasranama Contemplation - 601🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 280 / DAILY WISDOM - 280🌹  
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 180 🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 119 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. వైశాఖ పౌర్ణమి, బుద్ధ జయంతి శుభాకాంక్షలు మరియు శుభ సోమవారం మిత్రులందరికీ 🌹*
*ఇందు వాసరే, 16, మే 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : వైశాఖ పౌర్ణమి, బుద్ధ జయంతి, చంద్రగహణము, Vaishakha Purnima, Buddha Jayanti, Chandra Grahan🌻*

*🍀. రుద్రనమక స్తోత్రం - 23 🍀*

*45. స్రోతస్యాయ నమస్తుభ్యం ద్వీప్యాయచ నమోనమః!*
*జ్యేష్ఠాయ చ నమస్తుభ్యం కనిష్ఠాయ నమోనమః!!*
*46. పూర్వజాయ నమస్తుభ్యం నమోస్త్వవరజాయచ!*
*మధ్యమాయ నమస్తుభ్యమపగల్భాయ తే నమః!!*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : నీలో ఉన్న అహంకారము రుద్ర స్వరూపము. అది లేకపోతే జీవితమే లేదు. ఈ అహంకారమనే పంతాన్ని తీవ్ర మోక్షేచ్చగా మార్చుకోవాలి. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, వైశాఖ మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిథి: పూర్ణిమ 09:45:48 వరకు
తదుపరి కృష్ణ పాడ్యమి
నక్షత్రం: విశాఖ 13:18:58 వరకు
తదుపరి అనూరాధ
యోగం: వరియాన 06:17:30 వరకు
తదుపరి పరిఘ
కరణం: బవ 09:42:48 వరకు
వర్జ్యం: 16:52:50 - 18:18:46
దుర్ముహూర్తం: 12:38:26 - 13:30:15
మరియు 15:13:53 - 16:05:43
రాహు కాలం: 07:21:01 - 08:58:11
గుళిక కాలం: 13:49:41 - 15:26:51
యమ గండం: 10:35:21 - 12:12:31
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:37
అమృత కాలం: 05:20:36 - 06:47:24 
మరియు 25:28:26 - 26:54:22
సూర్యోదయం: 05:43:51
సూర్యాస్తమయం: 18:41:10
చంద్రోదయం: 19:02:35
చంద్రాస్తమయం: 05:37:59
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: తుల
మిత్ర యోగం - మిత్ర లాభం 13:18:58
వరకు తదుపరి మానస యోగం
- కార్య లాభం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 202 / Bhagavad-Gita - 202 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 40 🌴*

*40. అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి |*
*నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మన: ||*

🌷. తాత్పర్యం :
*శాస్త్రములను శంకించు అజ్ఞానులు మరియు శ్రద్ధారహితులు భగవత్ జ్ఞానమును పొందజాలక పతనము చెందుదురు. సంశయాత్ములైనవారికి ఈ లోకమున గాని, పరలోకమున గాని సుఖము లేదు.*

🌷. భాష్యము :
అధికారికములు మరియు ప్రామాణికములు అగు పెక్కు శాస్తములలో భగవద్గీత శ్రేష్ఠమైనది. జంతుప్రాయులైన మనుజులకు శాస్త్రములందు శ్రద్ధకాని, జ్ఞానము కాని ఉండదు. కొందరికి అట్టి శాస్త్రముల యెడ కొంత జ్ఞానమున్నను మరియు సందర్భోచితముగా వాని నుండి కొన్ని విషయములను ఉదహరించగలిగినను ఆ శాస్త్రవచనములపై సంపూర్ణ విశ్వాసముండదు. 

మరికొందరు భగవద్గీత వంటి గ్రంథముల యెడ శ్రద్ధను కలిగియున్నను దేవదేవుడైన శ్రీకృష్ణుని విశ్వసించుట గాని, అతనిని అర్చించుట గాని చేయరు. అట్టి శ్రద్ధాహీనులు మరియు సంశయాత్ములైనవారు ఎన్నడును పురోభివృద్ధిని పొందలేరు. దైవమునందు, అతని వచనమునందు శ్రద్ధలేనివారు ఇహపరములందు ఎట్టి శుభమును బడయజాలరు. కనుక ప్రతియొక్కరు శాస్త్రనియమములను పాటించుచు జ్ఞానస్థాయికి ఎదుగవలెను. 

కేవలము అట్టి జ్ఞానమే ఆధ్యాత్మికావగాహనపు దివ్యస్థితికి చేరుటలో వారికి తోడ్పడగలదు. అనగా సందేహస్థులకు ఆధ్యాత్మికరంగమునందు ఎట్టి స్థానము లేదు. కనుక ప్రతియొక్కరు పరంపరానుగతముగా వచ్చుచున్న గొప్ప ఆచార్యల అడుగుజాడల ననుసరించి విజయమును సాధింపవలెను.

🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 202 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 4 - Jnana Yoga - 40 🌴*

*40. ajñaś cāśraddadhānaś ca saṁśayātmā vinaśyati*
*nāyaṁ loko ’sti na paro na sukhaṁ saṁśayātmanaḥ*

🌷 Translation : 
*But ignorant and faithless persons who doubt the revealed scriptures do not attain God consciousness; they fall down. For the doubting soul there is happiness neither in this world nor in the next.*

🌹 Purport :
Out of many standard and authoritative revealed scriptures, the Bhagavad-gītā is the best. Persons who are almost like animals have no faith in, or knowledge of, the standard revealed scriptures; and some, even though they have knowledge of, or can cite passages from, the revealed scriptures, have actually no faith in these words. 

And even though others may have faith in scriptures like Bhagavad-gītā, they do not believe in or worship the Personality of Godhead, Śrī Kṛṣṇa. Such persons cannot have any standing in Kṛṣṇa consciousness. They fall down. Out of all the above-mentioned persons, those who have no faith and are always doubtful make no progress at all. Men without faith in God and His revealed word find no good in this world, nor in the next. For them there is no happiness whatsoever. 

One should therefore follow the principles of revealed scriptures with faith and thereby be raised to the platform of knowledge. Only this knowledge will help one become promoted to the transcendental platform of spiritual understanding. In other words, doubtful persons have no status whatsoever in spiritual emancipation. One should therefore follow in the footsteps of great ācāryas who are in the disciplic succession and thereby attain success.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 601/ Vishnu Sahasranama Contemplation - 601🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻601. శ్రీవత్సవక్షాః, श्रीवत्सवक्षाः, Śrīvatsavakṣāḥ🌻*

*ఓం శ్రీవత్సవక్షే నమః | ॐ श्रीवत्सवक्षे नमः | OM Śrīvatsavakṣe namaḥ*

శ్రీవత్సవక్షాః, श्रीवत्सवक्षाः, Śrīvatsavakṣāḥ

*చిహ్నం శ్రీవత్ససఙ్జ్ఞం హి వక్షస్యస్య స్థితం హరేః ।*
*ఇతి శ్రీవత్సవక్షా ఇత్యుచ్యతే విదుషం వరైః ॥*

*శ్రీవత్సము అను సంజ్ఞ కల చిహ్నము ఈతని వక్షమునందు కలదుగనుక హరికి శ్రీవత్సవక్షాః అను నామముగలదు.*

:: పోతన భాగవతము అష్టమ స్కంధము ::
వ.మఱియు న ద్దేవుండు శంఖచక్రగదా కమల కలిత చతుర్భుజుండును, బిశంగవర్ణవస్త్రుండును, మకర కుండల మండిత గండ భాగుండును, శ్రీవత్సవక్షుండును, నలిన చక్షుండును, నిరంతర శ్రీవిరాజిత రోలంబ కదంబాలంబిత వనమాలికా పరిష్కృతుండును, మణికనక కాంచిత కాంచీవలయాంగద కిరీటహార నూపురాలంకృతుండునుఁ, కమనీయ కంఠ కౌస్తుభాభరణుండును, నిఖిలజన మనోహరణుండునునై యవతరించిన సమయంబున. (507)శా.చింతం బాసిరి యక్షతార్క్ష్యసుమనస్సిద్ధోరగాధీశ్వరుల్సంతోషించిరి సాధ్యచారణ మునీశ బ్రహ్మ విద్యాధరుల్గాంతిం జెందిరి భానుచంద్రములు; రంగద్గీత వాద్యంబులన్గంతుల్ వైచిరి మింటఁ గింపురుషులున్ గంధర్వులుం గిన్నరుల్. (508)

*వామనుడు జన్మించినపుడు అతనికి నాలుగు చేతులూ, ఆ చేతులలో శంఖమూ, చక్రమూ, గదాపద్మములు ఉన్నాయి. గోరోజనరంగు వస్త్రమూ, మకర కుండలాలలతో మెరిసే చెక్కిళ్ళు, రొమ్ముపై శ్రీవత్సమూ, కమలాలవంటి కన్నులూ కలిగి ఉన్నాడు. తుమ్మెదలు మూగిన అందమైన వనమాల మెడలో కదులుతున్నది. రత్నములు కూర్చిన బంగారు ఒడ్డాణము, బాహుపురులూ, కిరీటమూ, హారములూ, కాలి అందెలు కాంతులు వెదజల్లుతున్నాయి. కమనీయమైన కంఠభాగాన, కౌస్తుభమణి మెరుస్తున్నది. అతని రూపము అఖిల జనుల మనస్సులను ఆకర్షిస్తున్నది.*

*వామనుడు పుట్టగానే, యక్షులూ, గరుడులూ, సిద్ధులూ, నాగులూ, చింతలు విడిచినారు. సాధ్యులూ, చారణులూ, ఋషులూ, ఋత్విజులూ, విద్యాధరులూ, సంతోషించినారు. సూర్యచంద్రులు కాంతులు విరజిమ్మినారు. గంధర్వులూ, కిన్నరులూ, కింపురుషులూ వాద్యాలు మ్రోగిస్తూ ఆటపాటలతో ఆకాశములో నాట్యములుజేసినారు.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 601🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻601. Śrīvatsavakṣāḥ🌻*

*OM Śrīvatsavakṣe namaḥ*

चिह्नं श्रीवत्ससङ्ज्ञं हि वक्षस्यस्य स्थितं हरेः ।
इति श्रीवत्सवक्षा इत्युच्यते विदुषं वरैः ॥

*Cihnaṃ śrīvatsasaṅjñaṃ hi vakṣasyasya sthitaṃ hareḥ,*
*Iti śrīvatsavakṣā ityucyate viduṣaṃ varaiḥ.*

*Since there is a mark called Śrīvatsa on His bosom, He is called Śrīvatsavakṣāḥ.*

:: श्रीमद्भागवते अष्टमस्कन्धे अष्टादशोऽध्यायः ::
श्यामावदातो झषराजकुण्डलत्विषोल्लसच्छ्रीवदनाम्बुजः पुमान् ।
श्रीवत्सवक्षा बलयाङ्गदोल्लसत्किरीटकाञ्चीगुणचारुनूपुरः ॥ २ ॥

Śrīmad Bhāgavata - Canto 8, Chapter 18
Śyāmāvadāto jhaṣarājakuṇḍalatviṣollasacchrīvadanāmbujaḥ pumān,
Śrīvatsavakṣā balayāṅgadollasatkirīṭakāñcīguṇacārunūpuraḥ. 2.

*The body of the Lord, blackish in complexion, was free from all inebrieties. His lotus face, decorated with earrings resembling sharks, appeared very beautiful, and on His bosom was the mark of Śrīvatsa. He wore bangles on His wrists, armlets on His arms, a helmet on His head, a belt on His waist, a sacred thread across His chest, and ankle bells decorating His lotus feet.*


🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः ।श्रीवत्सवक्षाश्श्रीवासश्श्रीपतिः श्रीमतां वरः ॥ ६४ ॥

అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।శ్రీవత్సవక్షాశ్శ్రీవాసశ్శ్రీపతిః శ్రీమతాం వరః ॥ 64 ॥

Anivartī nivr‌ttātmā saṃkṣeptā kṣemakr‌cchivaḥ,Śrīvatsavakṣāśśrīvāsaśśrīpatiḥ śrīmatāṃ varaḥ ॥ 64 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 280 / DAILY WISDOM - 280 🌹*
*🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 6. స్వయం అనేది గుర్తింపు యొక్క సూత్రం 🌻*

*నేను, లేదా ఆత్మగా పిలవబడేది స్వయమైనది, అవిభాజ్యమైనది, నిష్పాక్షికమైనది మరియు అద్వితీయమైనది. ఇది చైతన్యం అలా కాక వెరొకలా ఉండలేని స్థితి, ఎట్టి పరిస్థితిలో కొల్పోని స్థితి. అది ప్రేమించబడదు మరియు ద్వేషించబడదు, ఎందుకంటే అది మన స్వయమే. దీనినే ఆత్మ అంటారు. ఆత్మని ప్రేమించడం లేదా ద్వేషించడం వంటివి ఏవీ ఉండవు.*

*ఎవరూ ఒకరి ఆత్మని ప్రేమించరు లేదా ద్వేషించరు, ఎందుకంటే ప్రేమ మరియు ద్వేషం మానసిక క్రియలు, మరియు ప్రతి మానసిక క్రియ దేశం మరియు కాలంలో మనస్సు యొక్క కదలిక. తానే స్వయంగా గా ఉన్న ఆత్మ లో అలాంటి విషయం అసాధ్యం. కాబట్టి మనకు అలవాటైన సందర్భానుసారమైన స్వయం, కుటుంబ స్వయం, జాతి స్వయం, లోక స్వయం మొదలైన ఈ తప్పుడు స్వభావాలకి ఆత్మ అనే నిర్వచనం వర్తించదు. అలాగే, మిథ్యాత్మన్ అని పిలువబడే శరీరం కూడా తప్పుడు స్వయమే. శరీరం ఆత్మ కాదు. ప్రతి ఒక్కరికి ఇది చాలా బాగా తెలుసు, ఎందుకంటే ఆత్మ లక్షణాలైన శాశ్వతత్వం , అవిభాజ్యత మొదలైనవి-శరీరానికి వర్తించవు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 280 🌹*
*🍀 📖 from The Study and Practice of Yoga 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 6. The Self is a Principle of Identity 🌻*

*The Self, or the Atmanas we call it, is a principle of identity, indivisibility and non-externality or objectivity. It is that state of consciousness or awareness which is incapable of becoming other than what it is, and incapable of being lost under any circumstance. It cannot be loved and it cannot be hated, because it is what we are. This is what is called the Self. There is no such thing as loving the Self or hating the Self.*

*No one loves one's Self or hates one's Self, because love and hatred are psychological functions, and every psychological function is a movement of the mind in space and time. Such a thing is impossible in respect of the Self, which is Self-identity. Thus the definition of the Self as Self-identity will not apply to this false self which is the circumstantial self, the family self, the nation self, the world self, etc., as we are accustomed to. Also, there is another self which is known as the mithyatman—the false self which is the body. The body is not the Self. Everyone knows it very well, for various reasons, because the character of Self-identity—indestructibility, indivisibility, etc.—does not apply to the body.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 180 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. వ్యక్తి మరింత మరింత చైతన్యంగా వుండడానికి ప్రయత్నించాలి. చైతన్యపు లోతులు పెరిగే కొద్దీ సంతోషం కూడా పెరుగుతుంది. 🍀*

*కేవలం కొంతమంది మాత్రమే ఆధ్యాత్మిక స్థితిని అందుకున్న వాళ్ళు. వాళ్ళే నిజమైన మనుషులు. అందరి దగ్గరా శక్తి వుంది. అందరూ అందుకోసం ప్రయత్నించరు. అందువల్ల ఆ శక్తి నిర్వీర్యమవుతుంది. కాబట్టి వ్యక్తి మరింత మరింత చైతన్యంగా వుండడానికి ప్రయత్నించాలి.*

*మొదట నీలో చైతన్యపు మెరుపులు మెరిసినపుడు నువ్వు ఆశ్చర్యానికి లోనవుతావు. ప్రతి చైతన్యపు మెరుపుల్ని సంతోషం అనుసరిస్తుంది. చైతన్యపు లోతులు పెరిగే కొద్దీ సంతోషం కూడా పెరుగుతుంది. ఆనందమన్నది దాని గుండా ఆవిర్భవించేది. చైతన్యపు నీడ.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 119 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 92. ఆత్మ హంతకులు -1🌻*

*మేమందించు బోధనలు ఏమి చేయవలెను? అనునది ప్రశ్న. కేవలము మౌనముగ ఆచరింపవలెను అనునది సమాధానము. ఆచరించుట ప్రథమ కర్తవ్యము. దాని ఫలము అనుభూతి. అనుభూతి ఆచరణకు సువాసన కలిగించును. అట్టి సువాసనకు అన్వేషకులాకర్షింప బడుదురు. ఆకర్షింపబడినవారికి వారి శ్రద్ధననుసరించి మా బోధలందించ వలెను.*

*సత్యాన్వేషకులు అన్వేషణ మార్గమున మా బోధనల సమీపమునకు చేరుదురు. అన్వేషణ లేనివారు చేరలేరు. బోధనలనాచరించుటయే ప్రమాణము కాని జీవుల నాకర్షించుట ప్రమాణము కాదు. జీవులు ఆకర్షింపబడినపుడు బోధనము చేయుటకు ఉత్సహింపక, ఆచరణమార్గమున చూపుటయే నిజమైన బోధన. నిజమునకు ప్రవర్తనయే ప్రవచనము. కేవలము ప్రవచనములో ఉపయోగ మేమియును లేదు.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 371-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 371-2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 371-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 371-2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 81. పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా ।
మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥ 🍀

🌻 371 -2. ‘వైఖరీ రూపా’🌻


ఆధునికము, నాగరికము అయిన జనులు అశ్లీలమగు పదములు ప్రయోగించుటకు జంకుట లేదు. విమర్శ కుటిలత్వము, మోసము, డంభము, రాగ ద్వేషములు, క్రోధము వైఖరి ద్వారా ప్రదర్శింపబడు చున్నది. వైఖరీ వాక్కులకు ప్రధాన సాధనము భాష, భాషా వినియోగము క్రమముగ పతనము చెందుచున్నదే గాని ఉత్తమ భాషణము గోచరించుట లేదు. అక్షరములు కూడ సరిగ పలుకలేని స్థితిలో మానవులున్నారు. భాషణమును సంస్కరించు కొనినచో మానవుడు తనకు తాను చాలమటుకు సంస్కారి కాగలడు. వైఖరి మారినచో దాని ప్రభావము క్రమముగ మధ్యమ పశ్యంతిపై కూడా ప్రసరించి సత్యగ్రహణము అవగాహనము పొందుటకు వీలగును.

“వాక్కు మూడు భాగములు గుహలో నుండగ, నాలుగవది యగు వైఖరి ప్రకటింపబడు చున్నది" అని ఋగ్వేదము పలుకుచున్నది. మనిషి మాటను బట్టి భావములు తెలియనగును. భావమును బట్టి అతని అవగాహనము తెలియనగును. అతని అవగాహనను బట్టి అతని స్థితి తెలియనగును. ఇట్లు వాక్కు ద్వారా జీవుని తెలియుట తెలిసినవారికి మాత్రమే సాధ్యపడును. వాక్కే సర్వస్వము. దానిని ఋగ్వేదమని కీర్తించినది. అట్టి వాక్కు పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరీ అను నాలుగు స్థితులను పొందుచున్నది. పరా వాక్కునకు, పశ్యంతి వాక్కునకు నడుమ ప్రత్యక్చితీ రూపమున కూడ వాగ్దేవిని దర్శించ వచ్చును. ఇట్లు ఈ సహస్ర నామమునందు వాక్కు పంచముఖిగ పేర్కొనబడినది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 371 -2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 81.Parapratyakchitirupa pashyanti paradevata
Madhyama vaikharirupa bhaktamanasa hansika ॥ 81 ॥ 🌻

🌻 371-2. Vaikhari-rūpā वैखरि-रूपा 🌻


In fact the theory of evolution of speech purely depends upon the materialistic treatment of prāṇa or life energy. The whispering sound in the stage of madhyama fully transforms into speech and delivered in the form of vaikhari.

It is said that will (icchā) forms the basis of speech to finally merge with consciousness. Importance of consciousness is repeatedly emphasised.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


15 May 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 183. తత్వశాస్త్రం / Osho Daily Meditations - 183. PHILOSOPHY


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 183 / Osho Daily Meditations - 183 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 183. తత్వశాస్త్రం 🍀

🕉. మీరు అనుకున్నది ఏదైనా దొకరనప్పుడు దాని గురించి ఆలోచన ప్రారంభించడం, తరువాత దాని గురించి ఒక తత్వశాస్త్రం సృష్టించడం దాదాపు ఎల్లప్పుడూ జరుగుతుంది. 🕉


ప్రేమించని వారు ప్రేమ గురించి పుస్తకాలు రాస్తారని నా పరిశీలన; ఇది ఒక రకమైన ప్రత్యామ్నాయం. ప్రేమించలేని వారు కవిత్వం రాస్తారు, చాలా గొప్పగా ప్రేమ కవిత్వం రాస్తారు, కానీ వారికి ప్రేమ అనుభవం లేదు కాబట్టి వారి కవిత్వం అంతా ఊహాగానాలే.

వారు గొప్ప ఊహాశక్తిని కలిగి ఉండవచ్చు, కానీ దీనికి ప్రేమ యొక్క వాస్తవికతతో సంబంధం లేదు. ప్రేమ వాస్తవికత పూర్తిగా భిన్నమైనది; అది అనుభవించాలి.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 183 🌹

📚. Prasad Bharadwaj

🍀 183. PHILOSOPHY 🍀

🕉 It almost always happens that when you are missing something you start thinking about it, you start creating a philosophy about it. 🕉


It is my observation that people who have not loved write books about love; it is a kind of substitute. People who have not been able to love write poetry, they write very great love poetry, but they don't have any experience of love, so all their poetry is just speculation.

They may have great flights of imagination, but this has nothing to do with the reality of love. Love's reality is totally different; it has to be experienced.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


15 May 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 48 / Agni Maha Purana - 48


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 48 / Agni Maha Purana - 48 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 18

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. స్వాయంభువ వంశ వర్ణనము - 2 🌻


అంగునకు సునీథుని కుమార్తెయందు రేను డను ఒక కుమారుడు జనించెను. పాపాసక్తుడై ప్రజారక్షణము చేయని ఆ వేనుని మునులు కుశములను ప్రయోగించి సంహరించిరి.

పిమ్మట మునులు సంతానము కొరకై వేనుని కుడిచేతిని మధించగా దానినుండి పృథుచక్రవర్తి జనించెను. మునులందరును ఆతనిని చూచి - ''మహాతేజశ్శాతి యైన ఇతడు ప్రజలను రంజింపచేయగలడు. గొప్ప కీర్తిని కూడ పొందగలడు'' అని పలికిరి.

క్షత్రియుల పూర్వపురుషుడును, వైన్యుని కుమారుడును, తేజస్సుచే దహింపచేయుచున్నట్లు కనబడుచున్నవాడును అగు ఆ పృథువు దనస్సును, కవచమును ధరించి ప్రజ లందరిని రక్షించెను.

ఆ రాజు రాజసూయ యాగము చేసి అభిషేకము పొందిన వారిలో మొదటివాడు. ఆతని నుండి పుట్టిన-నేర్పరులైన వీరులైన సూతమాగథులు ఆతనిని స్తుతించిరి. ఆతడు ప్రజల జీవనమున కుపయోగించు సస్యములను సంపాదించుటకై భూమిని సిదికెను.

దేవతలును మునిగణములను, గంధర్వులును, అప్సరోగణములను, పితృదేవతలును, దానవులును, సర్పములును, లతలును, పర్వతములను, జనులును, ఆ యా పాత్రలలో పిదుకగా భూమి వారివారికి కావలసిన క్షీరము నిచ్చెను. దానిచే వారందరును ప్రాణధారణము చేసిరి.

పృథుచక్రవర్తికి ఆంతర్ది, పాలితుడు అను ధర్మవేత లైన ఇరువురు కుమారులు నించిరి. శిఖండిని అంతర్ధ నుండి హవిర్ధాను దనెడు కుమారుని కనెను. అగ్ని పుత్రి యగు ధిషణ హవిర్దానుని వలన ప్రాచీనబర్హిస్సు, శుక్రుడు, గయుడు. కృష్ణుడు, వ్రజుడు, అజినుడు అను ఆరుగురు కమారులను కనెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 48 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 18

🌻 Genealogy of Svāyambhuva Manu - 2 🌻


11. Sunīthā bore only Vena[11] from Aṅga. He, who was not a protector, and was delighted in doing sins was killed by the sages with their kuśa grass.

12. Then for the sake of progeny, the sages churned his. right hand. When the hand of Veṇa was churned King Pṛthu came into being.

13. Having seen him, the sages said, “This person will make the subjects happy and will attain great valour and fame.

14. He was born with a bow and an armour as if consuming (everything) by his lustre. Pṛthu, the son of Vena, the predecessor of the kṣatriyas, protected the subjects.

15. That lord of the earth is the first among those coronated. after the Rājasūya (sacrifice). From that (ceremony) were born the clever (singers) sūta and māgadha.

16-1 7. The two heroes praised him. He became a king by pleasing the people. For the sake of (getting) grains and for the existence of the subjects, the cow (earth) was milked by him along with the celestials, sages, gandharvas, nymphs, manes, demons, snakes, plants, mountains and people.

18. The earth being milked in their respective vessels gave milk as much as (they) wished. (All) sustained their lives with that.

19. Antardhāna and Pālita[12], the two righteous sons were born to Pṛthu. From Antardhāna, Sikhaṇḍinī begot Havirdhāna.

20. Dhiṣaṇā, of the family of Agni gave birth to the six sons—Prācīnabarhiṣ, Śukra, Gaya, Kṛṣṇa, Vraja and Ajina from Havirdhāna.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


15 May 2022

శ్రీ శివ మహా పురాణము - 564 / Sri Siva Maha Purana - 564

🌹 . శ్రీ శివ మహా పురాణము - 564 / Sri Siva Maha Purana - 564 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 54 🌴

🌻. పతివ్రతా ధర్మములు - 2 🌻


సావిత్రి లోపాముద్ర, అరుంధతి, శాండిల్య, శతరూప, అనసూయ, లక్ష్మి స్వధా, సతీదేవి అనువారు గొప్ప పతివ్రతలు (11). సంజ్ఞ, సుమతి, శ్రద్ధ, మేన, స్వాహా అను వారలే గాక ఇంకనూ ఎందరో సాధ్వీమణులు గలరు. వారి పేర్ల నన్నిటిని విస్తరభీతిచే చెప్పుట లేదు (12). పాతివ్రత్య ధర్మము చేతనే వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు, మునీశ్వరులకు మరియు సర్వులకు పూజింపదగిన వారు, సమ్మానింపదగిన వారు అయినారు (13).

కావున నీవు సర్వకాలముల యందు నీభర్తయగు శంకర ప్రభుని సేవింపుము. ఆయన దీనులను గ్రహించువాడు, సర్వులచే సేవింపబడువాడు, సత్పురుషులకు ఆశ్రయమైనవాడు (14). పతివ్రతా ధర్మము చాల గొప్పది యని శ్రుతిస్మృతులు చెప్పుచున్నవి. దీనితో సమానమగు శ్రేష్ఠత గల ధర్మము మరియొకటి లేదనుట నిశ్చతము (15).

పాతివ్రత్య ధర్మమునందు నిష్ఠగల స్త్రీ భర్త భుజించిన తరువాత భుజించవలెను. ఓ పార్వతీ! భర్త నిలబడియున్న సమయమంతయూ పతివ్రత నిలబడియే ఉండవలెను (16). సద్బుద్ధి గల స్త్రీ భర్త నిద్రించిన తరువాత నిద్రించి, నిత్యము ఆతని కంటె ముందుగా నిద్ర లేవవలెను. ఆమె ప్రవర్తనలో కపటము లేనిదై సర్వవిధములుగా భర్తకు హితమును చేయుచూ ఆతనికి ప్రియురాలు కావలెను (17).

ఓ పార్వతీ! భర్త యెదుట అలంకారము లేకుండగా కనబడరాదు. భర్త కార్యార్థియై పొరుగూరు వెళ్లినచో ఆమె అలంకారములను ఆ సమయములో ధరించరాదు (18). పతివ్రత ఏ సమయము నందైననూ భర్త పేరును ఉచ్చరించరాదు. భర్త తిట్టిననూ, కొట్టిననూ తిరిగి తిట్టకుండగా ప్రసన్నురాలై ఉండవలెను (19). భర్త పిలిచినచో ఆమె వెంటనే ఇంటి పనులను విడనాడి ప్రేమతో ఆతని వద్దకు వెళ్లి చేతులు జోడించి నమస్కరించి ఇట్లు పలుకవలెను (20).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 564 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 54 🌴

🌻 Description of the duties of the chaste wife - 2 🌻


11-13. The chaste ladies—Sāvitrī, Lopāmudrā, Arundhatī, Śāṇḍilyā, Śatarūpā, Anasūyā, Lakṣmī, Svadhā, Satī, Saṃjña, Sumati, Śraddhā, Menā, Svāhā and several others whose names are not mentioned lest the list should be too detailed have attained adoration from all people by their virtue of chastity. They have been honoured by Brahmā, Viṣṇu, Śiva and great sages.

14. Lord Śiva, benefactor of the depressed, worthy of worship and the goal of the good shall be served by you always.

15. The duty of a chaste lady is very important and it has been mentioned in the Vedas and Smṛtis. No other duty is so admirable as this.

16. A chaste lady shall take food only after her husband has taken it. O Śivā, if he stands, the woman too shall remain standing.

17. When he sleeps she can also sleep. But she must intelligently wake up before him. She shall do what is beneficial to him. She shall love him without any sort of deception.

18. O Śivā, she shall never show herself unembellished to him. If for any important work he is on exile she shall never adorn herself.

19. A chaste lady shall never mention her husband’s name. If the husband scolds or rebukes her she shall not abuse him in return. Even when beaten by him she shall remain glad and say “I may even be killed, O lord. Be kind to me.”

20. When called by him she shall leave the work she is engaged in and approach him immediately. With palms joined in reverence and love she shall bow to him and say as follows.


Continues....

🌹🌹🌹🌹🌹


15 May 2022

కపిల గీత - 8 / Kapila Gita - 8


🌹. కపిల గీత - 8 / Kapila Gita - 8🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴. అతీంద్రియ జ్ఞానాన్ని కోరుకున్న దేవహూతి-2 🌴


8. తస్య త్వం తమసోऽన్ధస్య దుష్పారస్యాద్య పారగమ్
సచ్చక్షుర్జన్మనామన్తే లబ్ధం మే త్వదనుగ్రహాత్

నాకు నేనుగా ఈ అజ్ఞ్యానాన్ని దాటలేను. అది దాటి తీరమును చేర్చే నిన్ను పొందాను. ఎన్నో జన్మల తరువాత ఇంత కాలానికి ఒక చక్కని నేత్రం దొరికింది. (చూడవలసిన దాన్ని చూపితే మంచి కన్ను, చూడకూడని దన్ని చూపితే చెడ్డ కన్ను). ఇన్ని జన్మల తరువాత చక్కని నేత్రం లభించింది. నా గొప్పదనముతో కాదు. నీ అనుగ్రహం వలన. ఈ నేత్రము నీవే. నీవే ప్రసాదించావు.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Kapila Gita - 8 🌹

✍️ Swami Prabhupada.
📚 Prasad Bharadwaj

🌴 Devahuti Desires Transcendental Knowledge -2 🌴


8. tasya tvam tamaso 'ndhasya dusparasyadya paragam
sac-caksur janmanam ante labdham me tvad-anugrahat

Your Lordship is my only means of getting out of this darkest region of ignorance because You are my transcendental eye, which, by Your mercy only, I have attained after many, many births.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


15 May 2022

కూర్మావతార విశిష్టత - కూర్మ జయంతి శుభాకాంక్షలు - Greetings on Kurma Avatar Jayanti


🌹. కూర్మావతార విశిష్టత - కూర్మ జయంతి శుభాకాంక్షలు -🌹

ప్రసాద్‌ భరధ్వాజ

విశ్వస్య జన్మస్థితిసంయమార్థే కృతావతారస్య పదాంబుజం తే |
వ్రజేమ సర్వే శరణం యదీశ స్మృతం ప్రయచ్ఛత్యభయం స్వపుంసామ్ ||

విష్ణువు యొక్క తాబేలు రూప అవతారము. హిందూమత పురాణాల లో శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాల లో రెండవ అవతారం కూర్మావతారము. కూర్మము అనగా తాబేలు. దేవదానవులు అమృతము కోసము పాలసముద్రాన్ని మథించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా నిర్ణయించి, పాలసముద్రంలో వేస్తే అది కాస్తా ఆ బరువుకి పాలసముద్రంలో మునిగిపోతుంటే, విష్ణుమూర్తి కూర్మావతారములో దానిని భరిస్తాడు. ఇది కృతయుగం లో సంభవించిన అవతారం.


🍀. అవతార గాథ 🍀

ఒకమారు దేవేంద్రుని ప్రవర్తనకు కోపించిన దూర్వాస మహర్షి "దేవతలు శక్తిహీనులగుదురు" అని శపించాడు. అందువలన దానవులచేతిలో దేవతలు పరాజయం పొందసాగారు. వారు విష్ణువుతో మొరపెట్టుకోగా "సకల ఔషధులకు నిలయమైన పాలకడలిని చిలికి అమృతాన్ని సాధించండి" అని విష్ణువు ఉపాయాన్ని ఉపదేశించాడు. దేవతలు ఆ బృహత్కార్యం కోసం అందుకు తమకంటె శక్తివంతులుగా ఉన్న దానవులతో సంధి కుదుర్చుకొన్నారు. మందర పర్వతం కవ్వంగా, వాసుకి త్రాడుగా క్షీరసముద్ర మథనం మొదలయ్యింది. కాని మందరగిరి బరువుకి మునిగిపోసాగింది. కార్యం నిష్ఫలమయ్యే పరిస్థితి ఉత్పన్నమైంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారమును ధరించి ఆ కొండను భరించెను. అలా దేవదేవుని అండతో సముద్రమథన కార్యం కొనసాగింది. ముందుగా జగములను నాశనము చేయగల హాలాహలము ఉద్భవించినది. దేవతల మొర విని, కరుణించి, పరమశివుడు హాలాహలాన్ని భక్షించి, తన కంఠంలోనే నిలిపాడు. అందుచేత ఆయనను గరళకంఠుడు అనీ, నీలకంఠుడు అనీ అంటారు. తరువాత సుర (మధువు), ఆపై అప్సరసలు, కౌస్తుభము, ఉచ్ఛైశ్రవము, కల్పవృక్షము, కామధేనువు, ఐరావతము వచ్చాయి. ఆ తరువాత త్రిజన్మోహినియైన శ్రీలక్ష్మీదేవి ఉద్భవించింది. సకలదేవతలు ఆమెను అర్చించి, కీర్తించి, కానుకలు సమర్పించుకొన్నారు. ఆమె శ్రీమహావిష్ణువును వరించింది. చివరకు ధన్వంతరి అమృత కలశాన్ని చేతబట్టుకొని బయటకు వచ్చాడు. తరువాత విష్ణువే మోహినిగా ఆ అమృతం దేవతలకు దక్కేలా చేశాడు.


🍀. కూర్మ జయంతి నాడు "శ్రీకూర్మం" క్షేత్రాన్ని దర్శించుకోండి! 🍀

శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పట్ణానికి 15 కి.మీ. దూరంలో శ్రీకూర్మం అనే పుణ్య క్షేత్రం ఉంది. శ్రీమహావిష్ణువు కూర్మావతారం రూపంలో ఇక్కడ పూజింపబడుతాడు. కూర్మావతారం మందిరం దేశంలో ఇదొక్కటే.

కూర్మావతారుడు తన భక్తుని కోరికపై స్వయంగా వెలసిన క్షేత్రమే శ్రీకూర్మం. కృతయుగంలో శ్వేతరాజు, అతని భార్య వంశధారల తపస్సుకు, భక్తికి మెచ్చుకున్న కూర్మనాధుడు వారి కోరిక ప్రకారం ఈ క్షేత్రంలో పశ్చిమ ముఖంగా వెలిశాడట. ఈ క్షేత్ర ప్రస్తావన కూర్మ, బ్రహ్మాండ, పద్మ పురాణాలలో వుంది. శ్రీరాముడు, బలరాముడు, జమదగ్ని మొదలైన పురాణ పురుషులెందరో ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామిని ఆరాధించారని పురాణాలు చెబుతున్నాయి. ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ ఆలయంలో శిల్ప సౌందర్యం అందరినీ ఆకట్టుకుంటుంది. మరే దేవాలయంలోను లేనివిధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలను ఈ ఆలయంలో చూడవచ్చు. ఈ స్తంభాలు రెండూ శివ కేశవులకు ప్రతీకలుగా చెప్తారు. చెప్పడానికి ఇది వైష్ణవ క్షేత్రమే. అయినా శివ కేశవులకు చిహ్నాలుగా చెప్పే ఈ ధ్వజస్తంభాలు శివకేశవుల అభేద తత్వాన్ని సూచిస్తున్నాయి. ఈ క్షేత్రం కృతయుగం నాటిది. దేవాలయంలోని మూలవిరాట్టు సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి చేత ప్రతిష్టించబడిందట.

దేవతలచే నిర్మించబడిన ఆలయం ప్రతిరోజు రాత్రివేళల్లో దేవతలు వచ్చి దేవాలయ నిర్మాణం చేసి సూర్యోదయం అయ్యే వేళకు అదృశ్యం అయిపోయేవారట. అందుకనే ఆలయంలోని స్తంభాలు ఒకదానికి మరొకటి పోలికలేని విధంగా వుంటాయని ఒక కథనం. శ్రీ కూర్మంలోని స్వామి వారి పుష్కరిణిని శ్వేతగుండం అని పిలుస్తారు. ఇది అత్యంత విశిష్టమైంది. ఆ స్వామి చేతిలోని సుదర్శనచక్రం చేత పుష్కరిణి ఆవిష్కరించబడిందనీ, అందుకే ఈ గుండంలో స్నానం చేస్తే కలిదోషాలు తొలగిపోతాయని చెప్తారు. మరణించినవారి అస్థికలను ఈ గుండంలో నిమజ్జనం చేస్తారు.

🌹 🌹 🌹 🌹 🌹


15 May 2022

15 - MAY - 2022 ఆదివారం, భాను వాసరే MESSAGES కూర్మ జయంతి విశిష్టత శుభాకాంక్షలు

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 15, ఆదివారం, మే 2022 భాను వాసరే 🌹
🌹కూర్మ జయంతి విశిష్టత - శుభాకాంక్షలు 🌹
🌹 కపిల గీత - 8 / Kapila Gita - 8🌹
2) 🌹. శివ మహా పురాణము - 564 / Siva Maha Purana - 564🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 48 / Agni Maha Purana - 48🌹
4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 183 / Osho Daily Meditations - 183🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 371-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 371-2 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కూర్మ జయంతి శుభాకాంక్షలు మరియు శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹*
*భాను వాసరే, 15, మే 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : కూర్మ జయంతి, వృషభ సంక్రాంతి, Kurma Jayanti, Vrishabha Sankranti 🌻*

*🍀. శ్రీ సూర్య పంజర స్తోత్రం - 5 🍀*

*6. ఓం విష్ణుతేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుమ్భాయ హుం ఫట్ స్వాహా ।*
*ఓం ప్రచణ్డమార్తాణ్డ ఉగ్రతేజోరూపిణే ముకురవర్ణాయ తేజోవర్ణాయ మమ*
*సర్వరాజస్త్రీపురుష-వశీకరణార్థం పశ్చిమదిగ్భాగే మాం రక్షతు ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : శుధ్ధ సాత్విక బలం చేత మాత్రమే మోక్ష మార్గములో ప్రయాణము చెయ్యగలరు. సత్వము- శాంతము- సమరసత్వము అనేవి సాధకుడు ముందుగా పొందగలగాలి. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, వైశాఖ మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిథి: శుక్ల చతుర్దశి 12:47:00 వరకు
తదుపరి పూర్ణిమ
నక్షత్రం: స్వాతి 15:35:12 వరకు
తదుపరి విశాఖ
యోగం: వ్యతీపాత 09:49:21 వరకు
తదుపరి వరియాన
కరణం: వణిజ 12:43:00 వరకు
వర్జ్యం: 20:39:02 - 22:05:54
దుర్ముహూర్తం: 16:57:16 - 17:49:03
రాహు కాలం: 17:03:45 - 18:40:50
గుళిక కాలం: 15:26:40 - 17:03:45
యమ గండం: 12:12:30 - 13:49:35
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:37
అమృత కాలం: 07:28:48 - 08:57:12
మరియు 29:20:14 - 30:47:06
సూర్యోదయం: 05:44:10
సూర్యాస్తమయం: 18:40:50
చంద్రోదయం: 17:57:43
చంద్రాస్తమయం: 04:51:26
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: తుల
లంబ యోగం - చికాకులు, అపశకునం
15:35:12 వరకు తదుపరి ఉత్పాద యోగం
- కష్టములు, ద్రవ్య నాశనం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కూర్మావతార విశిష్టత - కూర్మ జయంతి శుభాకాంక్షలు -🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*విశ్వస్య జన్మస్థితిసంయమార్థే కృతావతారస్య పదాంబుజం తే |*
*వ్రజేమ సర్వే శరణం యదీశ స్మృతం ప్రయచ్ఛత్యభయం స్వపుంసామ్ ||*

*విష్ణువు యొక్క తాబేలు రూప అవతారము. హిందూమత పురాణాల లో శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాల లో రెండవ అవతారం కూర్మావతారము. కూర్మము అనగా తాబేలు. దేవదానవులు అమృతము కోసము పాలసముద్రాన్ని మథించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా నిర్ణయించి, పాలసముద్రంలో వేస్తే అది కాస్తా ఆ బరువుకి పాలసముద్రంలో మునిగిపోతుంటే, విష్ణుమూర్తి కూర్మావతారములో దానిని భరిస్తాడు. ఇది కృతయుగం లో సంభవించిన అవతారం.*

*🍀. అవతార గాథ 🍀*

*ఒకమారు దేవేంద్రుని ప్రవర్తనకు కోపించిన దూర్వాస మహర్షి "దేవతలు శక్తిహీనులగుదురు" అని శపించాడు. అందువలన దానవులచేతిలో దేవతలు పరాజయం పొందసాగారు. వారు విష్ణువుతో మొరపెట్టుకోగా "సకల ఔషధులకు నిలయమైన పాలకడలిని చిలికి అమృతాన్ని సాధించండి" అని విష్ణువు ఉపాయాన్ని ఉపదేశించాడు. దేవతలు ఆ బృహత్కార్యం కోసం అందుకు తమకంటె శక్తివంతులుగా ఉన్న దానవులతో సంధి కుదుర్చుకొన్నారు. మందర పర్వతం కవ్వంగా, వాసుకి త్రాడుగా క్షీరసముద్ర మథనం మొదలయ్యింది. కాని మందరగిరి బరువుకి మునిగిపోసాగింది. కార్యం నిష్ఫలమయ్యే పరిస్థితి ఉత్పన్నమైంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారమును ధరించి ఆ కొండను భరించెను. అలా దేవదేవుని అండతో సముద్రమథన కార్యం కొనసాగింది. ముందుగా జగములను నాశనము చేయగల హాలాహలము ఉద్భవించినది. దేవతల మొర విని, కరుణించి, పరమశివుడు హాలాహలాన్ని భక్షించి, తన కంఠంలోనే నిలిపాడు. అందుచేత ఆయనను గరళకంఠుడు అనీ, నీలకంఠుడు అనీ అంటారు. తరువాత సుర (మధువు), ఆపై అప్సరసలు, కౌస్తుభము, ఉచ్ఛైశ్రవము, కల్పవృక్షము, కామధేనువు, ఐరావతము వచ్చాయి. ఆ తరువాత త్రిజన్మోహినియైన శ్రీలక్ష్మీదేవి ఉద్భవించింది. సకలదేవతలు ఆమెను అర్చించి, కీర్తించి, కానుకలు సమర్పించుకొన్నారు. ఆమె శ్రీమహావిష్ణువును వరించింది. చివరకు ధన్వంతరి అమృత కలశాన్ని చేతబట్టుకొని బయటకు వచ్చాడు. తరువాత విష్ణువే మోహినిగా ఆ అమృతం దేవతలకు దక్కేలా చేశాడు.*

*🍀. కూర్మ జయంతి నాడు "శ్రీకూర్మం" క్షేత్రాన్ని దర్శించుకోండి! 🍀*

*శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పట్ణానికి 15 కి.మీ. దూరంలో శ్రీకూర్మం అనే పుణ్య క్షేత్రం ఉంది. శ్రీమహావిష్ణువు కూర్మావతారం రూపంలో ఇక్కడ పూజింపబడుతాడు. కూర్మావతారం మందిరం దేశంలో ఇదొక్కటే.*

*కూర్మావతారుడు తన భక్తుని కోరికపై స్వయంగా వెలసిన క్షేత్రమే శ్రీకూర్మం. కృతయుగంలో శ్వేతరాజు, అతని భార్య వంశధారల తపస్సుకు, భక్తికి మెచ్చుకున్న కూర్మనాధుడు వారి కోరిక ప్రకారం ఈ క్షేత్రంలో పశ్చిమ ముఖంగా వెలిశాడట. ఈ క్షేత్ర ప్రస్తావన కూర్మ, బ్రహ్మాండ, పద్మ పురాణాలలో వుంది. శ్రీరాముడు, బలరాముడు, జమదగ్ని మొదలైన పురాణ పురుషులెందరో ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామిని ఆరాధించారని పురాణాలు చెబుతున్నాయి. ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ ఆలయంలో శిల్ప సౌందర్యం అందరినీ ఆకట్టుకుంటుంది. మరే దేవాలయంలోను లేనివిధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలను ఈ ఆలయంలో చూడవచ్చు. ఈ స్తంభాలు రెండూ శివ కేశవులకు ప్రతీకలుగా చెప్తారు. చెప్పడానికి ఇది వైష్ణవ క్షేత్రమే. అయినా శివ కేశవులకు చిహ్నాలుగా చెప్పే ఈ ధ్వజస్తంభాలు శివకేశవుల అభేద తత్వాన్ని సూచిస్తున్నాయి. ఈ క్షేత్రం కృతయుగం నాటిది. దేవాలయంలోని మూలవిరాట్టు సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి చేత ప్రతిష్టించబడిందట.*

*దేవతలచే నిర్మించబడిన ఆలయం ప్రతిరోజు రాత్రివేళల్లో దేవతలు వచ్చి దేవాలయ నిర్మాణం చేసి సూర్యోదయం అయ్యే వేళకు అదృశ్యం అయిపోయేవారట. అందుకనే ఆలయంలోని స్తంభాలు ఒకదానికి మరొకటి పోలికలేని విధంగా వుంటాయని ఒక కథనం. శ్రీ కూర్మంలోని స్వామి వారి పుష్కరిణిని శ్వేతగుండం అని పిలుస్తారు. ఇది అత్యంత విశిష్టమైంది. ఆ స్వామి చేతిలోని సుదర్శనచక్రం చేత పుష్కరిణి ఆవిష్కరించబడిందనీ, అందుకే ఈ గుండంలో స్నానం చేస్తే కలిదోషాలు తొలగిపోతాయని చెప్తారు. మరణించినవారి అస్థికలను ఈ గుండంలో నిమజ్జనం చేస్తారు.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 8 / Kapila Gita - 8🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴. అతీంద్రియ జ్ఞానాన్ని కోరుకున్న దేవహూతి-2 🌴*

*8. తస్య త్వం తమసోऽన్ధస్య దుష్పారస్యాద్య పారగమ్*
*సచ్చక్షుర్జన్మనామన్తే లబ్ధం మే త్వదనుగ్రహాత్*

*నాకు నేనుగా ఈ అజ్ఞ్యానాన్ని దాటలేను. అది దాటి తీరమును చేర్చే నిన్ను పొందాను. ఎన్నో జన్మల తరువాత ఇంత కాలానికి ఒక చక్కని నేత్రం దొరికింది. (చూడవలసిన దాన్ని చూపితే మంచి కన్ను, చూడకూడని దన్ని చూపితే చెడ్డ కన్ను). ఇన్ని జన్మల తరువాత చక్కని నేత్రం లభించింది. నా గొప్పదనముతో కాదు. నీ అనుగ్రహం వలన. ఈ నేత్రము నీవే. నీవే ప్రసాదించావు.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 8 🌹*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*

*🌴 Devahuti Desires Transcendental Knowledge -2 🌴*

*8. tasya tvam tamaso 'ndhasya dusparasyadya paragam*
*sac-caksur janmanam ante labdham me tvad-anugrahat*

*Your Lordship is my only means of getting out of this darkest region of ignorance because You are my transcendental eye, which, by Your mercy only, I have attained after many, many births.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#కపిలగీత #KapilaGita
#కపిలగీతKapilaGita
 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 564 / Sri Siva Maha Purana - 564 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 54 🌴*

*🌻. పతివ్రతా ధర్మములు - 2 🌻*

సావిత్రి లోపాముద్ర, అరుంధతి, శాండిల్య, శతరూప, అనసూయ, లక్ష్మి స్వధా, సతీదేవి అనువారు గొప్ప పతివ్రతలు (11). సంజ్ఞ, సుమతి, శ్రద్ధ, మేన, స్వాహా అను వారలే గాక ఇంకనూ ఎందరో సాధ్వీమణులు గలరు. వారి పేర్ల నన్నిటిని విస్తరభీతిచే చెప్పుట లేదు (12). పాతివ్రత్య ధర్మము చేతనే వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు, మునీశ్వరులకు మరియు సర్వులకు పూజింపదగిన వారు, సమ్మానింపదగిన వారు అయినారు (13). 

కావున నీవు సర్వకాలముల యందు నీభర్తయగు శంకర ప్రభుని సేవింపుము. ఆయన దీనులను గ్రహించువాడు, సర్వులచే సేవింపబడువాడు, సత్పురుషులకు ఆశ్రయమైనవాడు (14). పతివ్రతా ధర్మము చాల గొప్పది యని శ్రుతిస్మృతులు చెప్పుచున్నవి. దీనితో సమానమగు శ్రేష్ఠత గల ధర్మము మరియొకటి లేదనుట నిశ్చతము (15).

పాతివ్రత్య ధర్మమునందు నిష్ఠగల స్త్రీ భర్త భుజించిన తరువాత భుజించవలెను. ఓ పార్వతీ! భర్త నిలబడియున్న సమయమంతయూ పతివ్రత నిలబడియే ఉండవలెను (16). సద్బుద్ధి గల స్త్రీ భర్త నిద్రించిన తరువాత నిద్రించి, నిత్యము ఆతని కంటె ముందుగా నిద్ర లేవవలెను. ఆమె ప్రవర్తనలో కపటము లేనిదై సర్వవిధములుగా భర్తకు హితమును చేయుచూ ఆతనికి ప్రియురాలు కావలెను (17). 

ఓ పార్వతీ! భర్త యెదుట అలంకారము లేకుండగా కనబడరాదు. భర్త కార్యార్థియై పొరుగూరు వెళ్లినచో ఆమె అలంకారములను ఆ సమయములో ధరించరాదు (18). పతివ్రత ఏ సమయము నందైననూ భర్త పేరును ఉచ్చరించరాదు. భర్త తిట్టిననూ, కొట్టిననూ తిరిగి తిట్టకుండగా ప్రసన్నురాలై ఉండవలెను (19). భర్త పిలిచినచో ఆమె వెంటనే ఇంటి పనులను విడనాడి ప్రేమతో ఆతని వద్దకు వెళ్లి చేతులు జోడించి నమస్కరించి ఇట్లు పలుకవలెను (20). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 564 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 54 🌴*

*🌻 Description of the duties of the chaste wife - 2 🌻*

11-13. The chaste ladies—Sāvitrī, Lopāmudrā, Arundhatī, Śāṇḍilyā, Śatarūpā, Anasūyā, Lakṣmī, Svadhā, Satī, Saṃjña, Sumati, Śraddhā, Menā, Svāhā and several others whose names are not mentioned lest the list should be too detailed have attained adoration from all people by their virtue of chastity. They have been honoured by Brahmā, Viṣṇu, Śiva and great sages.

14. Lord Śiva, benefactor of the depressed, worthy of worship and the goal of the good shall be served by you always.

15. The duty of a chaste lady is very important and it has been mentioned in the Vedas and Smṛtis. No other duty is so admirable as this.

16. A chaste lady shall take food only after her husband has taken it. O Śivā, if he stands, the woman too shall remain standing.

17. When he sleeps she can also sleep. But she must intelligently wake up before him. She shall do what is beneficial to him. She shall love him without any sort of deception.

18. O Śivā, she shall never show herself unembellished to him. If for any important work he is on exile she shall never adorn herself.

19. A chaste lady shall never mention her husband’s name. If the husband scolds or rebukes her she shall not abuse him in return. Even when beaten by him she shall remain glad and say “I may even be killed, O lord. Be kind to me.”

20. When called by him she shall leave the work she is engaged in and approach him immediately. With palms joined in reverence and love she shall bow to him and say as follows.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 48 / Agni Maha Purana - 48 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 18*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. స్వాయంభువ వంశ వర్ణనము - 2 🌻*

అంగునకు సునీథుని కుమార్తెయందు రేను డను ఒక కుమారుడు జనించెను. పాపాసక్తుడై ప్రజారక్షణము చేయని ఆ వేనుని మునులు కుశములను ప్రయోగించి సంహరించిరి.

పిమ్మట మునులు సంతానము కొరకై వేనుని కుడిచేతిని మధించగా దానినుండి పృథుచక్రవర్తి జనించెను. మునులందరును ఆతనిని చూచి - ''మహాతేజశ్శాతి యైన ఇతడు ప్రజలను రంజింపచేయగలడు. గొప్ప కీర్తిని కూడ పొందగలడు'' అని పలికిరి.

క్షత్రియుల పూర్వపురుషుడును, వైన్యుని కుమారుడును, తేజస్సుచే దహింపచేయుచున్నట్లు కనబడుచున్నవాడును అగు ఆ పృథువు దనస్సును, కవచమును ధరించి ప్రజ లందరిని రక్షించెను.

ఆ రాజు రాజసూయ యాగము చేసి అభిషేకము పొందిన వారిలో మొదటివాడు. ఆతని నుండి పుట్టిన-నేర్పరులైన వీరులైన సూతమాగథులు ఆతనిని స్తుతించిరి. ఆతడు ప్రజల జీవనమున కుపయోగించు సస్యములను సంపాదించుటకై భూమిని సిదికెను.

దేవతలును మునిగణములను, గంధర్వులును, అప్సరోగణములను, పితృదేవతలును, దానవులును, సర్పములును, లతలును, పర్వతములను, జనులును, ఆ యా పాత్రలలో పిదుకగా భూమి వారివారికి కావలసిన క్షీరము నిచ్చెను. దానిచే వారందరును ప్రాణధారణము చేసిరి.

పృథుచక్రవర్తికి ఆంతర్ది, పాలితుడు అను ధర్మవేత లైన ఇరువురు కుమారులు నించిరి. శిఖండిని అంతర్ధ నుండి హవిర్ధాను దనెడు కుమారుని కనెను. అగ్ని పుత్రి యగు ధిషణ హవిర్దానుని వలన ప్రాచీనబర్హిస్సు, శుక్రుడు, గయుడు. కృష్ణుడు, వ్రజుడు, అజినుడు అను ఆరుగురు కమారులను కనెను. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 48 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

*Chapter 18*
*🌻 Genealogy of Svāyambhuva Manu - 2 🌻*

11. Sunīthā bore only Vena[11] from Aṅga. He, who was not a protector, and was delighted in doing sins was killed by the sages with their kuśa grass.

12. Then for the sake of progeny, the sages churned his. right hand. When the hand of Veṇa was churned King Pṛthu came into being.

13. Having seen him, the sages said, “This person will make the subjects happy and will attain great valour and fame.

14. He was born with a bow and an armour as if consuming (everything) by his lustre. Pṛthu, the son of Vena, the predecessor of the kṣatriyas, protected the subjects.

15. That lord of the earth is the first among those coronated. after the Rājasūya (sacrifice). From that (ceremony) were born the clever (singers) sūta and māgadha.

16-1 7. The two heroes praised him. He became a king by pleasing the people. For the sake of (getting) grains and for the existence of the subjects, the cow (earth) was milked by him along with the celestials, sages, gandharvas, nymphs, manes, demons, snakes, plants, mountains and people.

18. The earth being milked in their respective vessels gave milk as much as (they) wished. (All) sustained their lives with that.

19. Antardhāna and Pālita[12], the two righteous sons were born to Pṛthu. From Antardhāna, Sikhaṇḍinī begot Havirdhāna.

20. Dhiṣaṇā, of the family of Agni gave birth to the six sons—Prācīnabarhiṣ, Śukra, Gaya, Kṛṣṇa, Vraja and Ajina from Havirdhāna.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join 
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 183 / Osho Daily Meditations - 183 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 183. తత్వశాస్త్రం 🍀*

*🕉. మీరు అనుకున్నది ఏదైనా దొకరనప్పుడు దాని గురించి ఆలోచన ప్రారంభించడం, తరువాత దాని గురించి ఒక తత్వశాస్త్రం సృష్టించడం దాదాపు ఎల్లప్పుడూ జరుగుతుంది. 🕉*
 
*ప్రేమించని వారు ప్రేమ గురించి పుస్తకాలు రాస్తారని నా పరిశీలన; ఇది ఒక రకమైన ప్రత్యామ్నాయం. ప్రేమించలేని వారు కవిత్వం రాస్తారు, చాలా గొప్పగా ప్రేమ కవిత్వం రాస్తారు, కానీ వారికి ప్రేమ అనుభవం లేదు కాబట్టి వారి కవిత్వం అంతా ఊహాగానాలే.*

*వారు గొప్ప ఊహాశక్తిని కలిగి ఉండవచ్చు, కానీ దీనికి ప్రేమ యొక్క వాస్తవికతతో సంబంధం లేదు. ప్రేమ వాస్తవికత పూర్తిగా భిన్నమైనది; అది అనుభవించాలి.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 183 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 183. PHILOSOPHY 🍀*

*🕉 It almost always happens that when you are missing something you start thinking about it, you start creating a philosophy about it. 🕉*
 
*It is my observation that people who have not loved write books about love; it is a kind of substitute. People who have not been able to love write poetry, they write very great love poetry, but they don't have any experience of love, so all their poetry is just speculation.*

*They may have great flights of imagination, but this has nothing to do with the reality of love. Love's reality is totally different; it has to be experienced.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 371-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 371-2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 81. పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా ।*
*మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥ 🍀*

*🌻 371 -2. ‘వైఖరీ రూపా’🌻* 

*ఆధునికము, నాగరికము అయిన జనులు అశ్లీలమగు పదములు ప్రయోగించుటకు జంకుట లేదు. విమర్శ కుటిలత్వము, మోసము, డంభము, రాగ ద్వేషములు, క్రోధము వైఖరి ద్వారా ప్రదర్శింపబడు చున్నది. వైఖరీ వాక్కులకు ప్రధాన సాధనము భాష, భాషా వినియోగము క్రమముగ పతనము చెందుచున్నదే గాని ఉత్తమ భాషణము గోచరించుట లేదు. అక్షరములు కూడ సరిగ పలుకలేని స్థితిలో మానవులున్నారు. భాషణమును సంస్కరించు కొనినచో మానవుడు తనకు తాను చాలమటుకు సంస్కారి కాగలడు. వైఖరి మారినచో దాని ప్రభావము క్రమముగ మధ్యమ పశ్యంతిపై కూడా ప్రసరించి సత్యగ్రహణము అవగాహనము పొందుటకు వీలగును.*

*“వాక్కు మూడు భాగములు గుహలో నుండగ, నాలుగవది యగు వైఖరి ప్రకటింపబడు చున్నది" అని ఋగ్వేదము పలుకుచున్నది. మనిషి మాటను బట్టి భావములు తెలియనగును. భావమును బట్టి అతని అవగాహనము తెలియనగును. అతని అవగాహనను బట్టి అతని స్థితి తెలియనగును. ఇట్లు వాక్కు ద్వారా జీవుని తెలియుట తెలిసినవారికి మాత్రమే సాధ్యపడును. వాక్కే సర్వస్వము. దానిని ఋగ్వేదమని కీర్తించినది. అట్టి వాక్కు పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరీ అను నాలుగు స్థితులను పొందుచున్నది. పరా వాక్కునకు, పశ్యంతి వాక్కునకు నడుమ ప్రత్యక్చితీ రూపమున కూడ వాగ్దేవిని దర్శించ వచ్చును. ఇట్లు ఈ సహస్ర నామమునందు వాక్కు పంచముఖిగ పేర్కొనబడినది.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 371 -2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 81.Parapratyakchitirupa pashyanti paradevata*
*Madhyama vaikharirupa bhaktamanasa hansika ॥ 81 ॥ 🌻*

*🌻 371-2. Vaikhari-rūpā वैखरि-रूपा 🌻*

*In fact the theory of evolution of speech purely depends upon the materialistic treatment of prāṇa or life energy. The whispering sound in the stage of madhyama fully transforms into speech and delivered in the form of vaikhari.*

*It is said that will (icchā) forms the basis of speech to finally merge with consciousness. Importance of consciousness is repeatedly emphasised.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

కైలాశ పర్వతం నుండి జాలువారే విభూతి ధార....!! Vibhuti Dhara falls from Mount Kailash..!!




🎻🌹🙏 కైలాశ పర్వతం నుండి జాలువారే విభూతి ధార....!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

కైలాస పర్వత ప్రదక్షిణం చేస్తుంటారు కొంతమంది యాత్రికులు ,

కానీ మరీ దగ్గరగా వెళ్లేవారు మాత్రమే మాటల్లో వర్ణించలేని ఈ అనుభూతి పొందగలరు.

కైలాస పర్వతాన్ని సమీపిస్తున్న కొద్దీ సుగంధ పరిమళాల సువాసనలు వీస్తుంటాయట.

అక్కడ మంచు బదులు విభూతి ఉంటుందట. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరవలసిన క్షేత్రాలలో ఇదీ ఒకటి.

దయచేసి మీకు తెలిసిన పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి . దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో ,

ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో మన ఊహకు అందదు.అందరికీ దర్శనభాగ్యం కలగాలనే మా ప్రయత్నం...🚩🌞🙏🌹🎻


🙏" సంభవామి యుగే యుగే "🙏


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


14 May 2022


మిత్రులందరికి నృసింహ జయంతి శుభాకాంక్షలు Happy Narasimha Jayanti to all



🌹. మిత్రులందరికి నృసింహ జయంతి శుభాకాంక్షలు 🌹


🍀. శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం  Sri Lakshminarasimha Karavalamba Stotram🍀

శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్రభోగమణిరాజిత పుణ్యమూర్తే |
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౧

బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత |
లక్ష్మీలసత్కుచసరోరుహరాజహంస లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౨

సంసారదావదహనాకరభీకరోరు-జ్వాలావళీభిరతిదగ్ధతనూరుహస్య |
త్వత్పాదపద్మసరసీరుహమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౩

సంసారజాలపతితతస్య జగన్నివాస సర్వేంద్రియార్థ బడిశాగ్ర ఝషోపమస్య |
ప్రోత్కంపిత ప్రచురతాలుక మస్తకస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౪

సంసారకూమపతిఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖశతసర్పసమాకులస్య |
దీనస్య దేవ కృపయా పదమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౫

సంసారభీకరకరీంద్రకరాభిఘాత నిష్పీడ్యమానవపుషః సకలార్తినాశ |
ప్రాణప్రయాణభవభీతిసమాకులస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౬

సంసారసర్పవిషదిగ్ధమహోగ్రతీవ్ర దంష్ట్రాగ్రకోటిపరిదష్టవినష్టమూర్తేః |
నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౭

సంసారవృక్షబీజమనంతకర్మ-శాఖాయుతం కరణపత్రమనంగపుష్పమ్ |
ఆరుహ్య దుఃఖఫలితః చకితః దయాళో లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౮

సంసారసాగరవిశాలకరాళకాళ నక్రగ్రహగ్రసితనిగ్రహవిగ్రహస్య |
వ్యగ్రస్య రాగనిచయోర్మినిపీడితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౯

సంసారసాగరనిమజ్జనముహ్యమానం దీనం విలోకయ విభో కరుణానిధే మామ్ |
ప్రహ్లాదఖేదపరిహారపరావతార లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౧౦

సంసారఘోరగహనే చరతో మురారే మారోగ్రభీకరమృగప్రచురార్దితస్య |
ఆర్తస్య మత్సరనిదాఘసుదుఃఖితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౧౧

బద్ధ్వా గలే యమభటా బహు తర్జయంత కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మామ్ |
ఏకాకినం పరవశం చకితం దయాళో లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౧౨

లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప |
బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౧౩

ఏకేన చక్రమపరేణ కరేణ శంఖ-మన్యేన సింధుతనయామవలంబ్య తిష్ఠన్ |
వామేతరేణ వరదాభయపద్మచిహ్నం లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౧౪

అంధస్య మే హృతవివేకమహాధనస్య చోరైర్మహాబలిభిరింద్రియనామధేయైః |
మోహాంధకారకుహరే వినిపాతితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౧౫

ప్రహ్లాదనారదపరాశరపుండరీక-వ్యాసాదిభాగవతపుంగవహృన్నివాస |
భక్తానురక్తపరిపాలనపారిజాత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౧౬

లక్ష్మీనృసింహచరణాబ్జమధువ్రతేన స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ |
యే తత్పఠంతి మనుజా హరిభక్తియుక్తా-స్తే యాంతి తత్పదసరోజమఖండరూపమ్ ౧౭

🌹 🌹 🌹 🌹 🌹


14 May 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 600 / Vishnu Sahasranama Contemplation - 600


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 600 / Vishnu Sahasranama Contemplation - 600🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 600. శివః, शिवः, Śivaḥ 🌻

ఓం శివాయ నమః | ॐ शिवाय नमः | OM Śivāya namaḥ

శివః, शिवः, Śivaḥ

స్వనామస్మృతిమాత్రేణ పావయన్ శివ ఉచ్యతే

తన నామమును స్మరించినంతనే స్మరించినవారిని పవిత్రులునుగా చేయువాడుగనుక ఆ పరమాత్మకు శివః అను నామము.


:: పోతన భాగవతము - తృతీయ స్కంధము ::

చ. అలరు భవత్పదాంబుజ యుగార్పితమై పొలుపొందునట్టి యీ
తులసి పవిత్రమైన గతిఁ దోయజనాభ! భవత్కథాసుధా
కలితములైన వాక్కుల నకల్మషయుక్తుని విన్నఁ గర్ణముల్‍
విలసిత లీలమై భువిఁ బవిత్రములై విలసిల్లు మాధవా! (551)


ఓ పద్మనాభా! ఓ రమావల్లభా! నీ పాదారవిందములపై అర్పింపబడిన ఈ తులసి పవిత్రమైనట్లు నీ కథామృతంతో కూడిన వాక్కులను కల్మషం లేకుండా విన్న మా చెవులుకూడా పరమ పవిత్రాలై భాసిల్లుతాయి.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 600🌹

📚. Prasad Bharadwaj

🌻600. Śivaḥ🌻

OM Śivāya namaḥ


स्वनामस्मृतिमात्रेण पावयन् शिव उच्यते / Svanāmasmr‌timātreṇa pāvayan śiva ucyate

Because of remembrance of His name, He purifies those who have uttered His name and hence He is called Śivaḥ.


:: श्रीमद्भागवते द्वितीय स्कन्धे द्वितीयोऽध्यायः ::

न ह्यन्तोऽन्यः शिवः पन्था विषतः संसृताविह ।
वासुदेवो भगवति भक्तियोगो यतो भवेत् ॥ ३३ ॥


Śrīmad Bhāgavata - Canto 2, Chapter 2

Na hyanto’nyaḥ śivaḥ panthā viṣataḥ saṃsr‌tāviha,
Vāsudevo bhagavati bhaktiyogo yato bhavet. 33.


For those who are wandering in the material universe, there is no more auspicious means of deliverance than what is aimed at in the direct devotional service of Lord Kr‌s‌n‌a.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः ।
श्रीवत्सवक्षाश्श्रीवासश्श्रीपतिः श्रीमतां वरः ॥ ६४ ॥

అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।
శ్రీవత్సవక్షాశ్శ్రీవాసశ్శ్రీపతిః శ్రీమతాం వరః ॥ 64 ॥

Anivartī nivr‌ttātmā saṃkṣeptā kṣemakr‌cchivaḥ,
Śrīvatsavakṣāśśrīvāsaśśrīpatiḥ śrīmatāṃ varaḥ ॥ 64 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹


14 May 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 279 - 5. మనం ఒక స్వంత ప్రపంచాన్ని సృష్టించుకుంటాము / DAILY WISDOM - 279 - 5. We Create a World of Our Own


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 279 / DAILY WISDOM - 279 🌹

🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 5. మనం ఒక స్వంత ప్రపంచాన్ని సృష్టించుకుంటాము 🌻


అనుబంధం లేదా ఆప్యాయత అనేది చైతన్యం యొక్క విచిత్రమైన ద్వంద్వ వైఖరి. ఏదైనా నిర్దిష్ట వస్తువుతో జతచేయబడినప్పుడు అది ఏకకాలంలో రెండంచుల కత్తిలా పని చేస్తుంది. తాను కోరుకునే వస్తువు లేదా దానికి అనుబంధంగా ఉన్న వస్తువులు తన ఉనికిలో భాగం కాదనే భావన సూక్ష్మంగా ఉంటుంది - ఎందుకంటే ఒక వస్తువు మన స్వయంలో భాగమైతే, దానిని కోరుకునే ప్రశ్నే తలెత్తదు. మన ఉనికిలో భాగమైన దేనినైనా ప్రేమించాల్సిన అవసరం లేదు, కాబట్టి అది మనలో భాగం కాదనే సూక్ష్మ భావన మనకు ఉంటుంది. నిజంగా చెప్పాలంటే కుటుంబ సభ్యులు మనకు చెందరు. అది మనకు బాగా తెలుసు.

అందువల్ల, ఆప్యాయత, ప్రేమ లేదా అనుబంధం అని పిలువబడే ఒక మానసిక స్థితి ద్వారా మన ఉనికితో వారి ఉనికిని కృత్రిమంగా గుర్తించేలా చేస్తాము. మూర్ఖుల స్వర్గం అని పిలవబడే మన స్వంత ప్రపంచాన్ని మనం సృష్టిస్తాము. కుటుంబ పెద్ద నివసించే స్వర్గం ఇది. “ఓహ్, నా ఈ కుటుంబం ఎంత అందంగా ఉంది. నాకు పెద్ద కుటుంబం ఉంది. ” అసలు దాని అర్థం ఏమిటో అతనికి తెలియదు. అలాగే, అది ఏమిటో తెలుసుకోవడం చాలా ప్రమాదకరం కూడా. ఎందుకంటే ఇది నిజంగా ఏమిటో తెలిస్తే, మన నరాలు గగుర్పొడిచేలా వెంటనే భయపడిపోతాము.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 DAILY WISDOM - 279 🌹

🍀 📖 from The Study and Practice of Yoga 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 5. We Create a World of Our Own 🌻


Attachment, or affection, is a peculiar double attitude of consciousness. It is simultaneously working like a double-edged sword when it is attached to any particular object. It has a feeling that the things which it loves, or to which it is attached, are not really a part of its being—because if a thing is a part of our own being, the question of desiring it will not arise. There is no need to love something which is a part of our being, so we have a subtle feeling that it is not a part of us. The members of the family do not belong to us, really speaking. We know it very well.

Therefore, we create an artificial identification of their being with our being by means of a psychological movement or a function known as affection, love or attachment. We create a world of our own which may be called a fool's paradise. This is the paradise in which the head of the family lives. “Oh, how beautiful it is. I have got a large family.” He does not know what it actually means. Also, it is very dangerous to know what it is because if we know what it really is, we will be horrified immediately, to the shock of our nerves.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


14 May 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 179


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 179 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. కేవలం చైతన్యం ద్వారా మాత్రమే నువ్వు యాంత్రికతని అధిగమించగలవు. గురువు ద్వారా మాత్రమే ఆధ్యాత్మిక జన్మ వీలవుతుంది. గురువు ద్వారా మాత్రమే పూర్తిగా విభిన్నమయిన ప్రయాణం ఆరంభమవుతుంది. 🍀


మనిషి, సాధారణ మనిషి, మంద, గుంపు తరతరాలుగా వునికిలో వున్నారు. అది యాంత్రికం. కేవలం చైతన్యం ద్వారా మాత్రమే నువ్వు యాంత్రికతని అధిగమించగలవు. అదే నిజమైన జన్మ. అప్పుడు నువ్వు రెండోసారి జన్మిస్తావు. నీ తల్లిదండ్రుల ద్వారా పొందిన జన్మ శారీరక జన్మ. ఆధ్యాత్మిక జన్మ కాదు.

గురువు ద్వారా మాత్రమే ఆధ్యాత్మిక జన్మ వీలవుతుంది. గురువు ద్వారా మాత్రమే పూర్తిగా విభిన్నమయిన ప్రయాణం ఆరంభమవుతుంది. అది నీ కొత్త జన్మ కొత్తకోణం. ఆధ్యాత్మిక కోణం. వ్యక్తి తన పట్ల తను స్పృహతో వుండేలా చైతన్యం కలిగించడమే గురువు చేసే పని.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


14 May 2022

మైత్రేయ మహర్షి బోధనలు - 118


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 118 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 91. జీవుని అశ్రద్ధ -2🌻

మానవులకు మాత్రమే ఆలోచన, వివేచన, భాషణ యీయబడినవి. కాని వాని విలువ తెలియక అతడు ప్రవర్తించుచున్నాడు. శ్రద్ధ సహజ గుణము కాబడినది. కొన్ని విషయములపై శ్రద్ధ, మరికొన్ని విషయముల యందు అశ్రద్ధ గలవారు శ్రద్ధాళువులు కాలేరు.

శ్రద్ధ సహజగుణమైనచో అన్ని విషయము లందును అది భాసించగలదు. శ్రీరాముని జీవితము శ్రద్ధకు పరిపూర్ణ సంకేతము. శ్రద్ధ లేనివారు ఇపుడాధ్యాత్మిక బోధన కెగబడుట కలియుగ ప్రభావమే. వారు ఆచరణము నందు శ్రద్ధలేక, ప్రచారముననే శ్రద్ధ గలిగి యున్నారు.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


14 May 2022