దేవాపి మహర్షి బోధనలు - 60
🌹. దేవాపి మహర్షి బోధనలు - 60 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 41. సాధన - శరీరము 🌻
ఆత్మ సాధనము కొన్ని రోజులకు సంబంధించినది కాదు. ఆత్మానుభూతి కలుగుటకు సాధకుని పరిశుద్ధిని బట్టి కొన్ని సంవత్సర ములు లేదా కొన్ని జన్మలు పట్టవచ్చును. జీవితమున శిశు ప్రాయము ననే సాధన మొదలగువానికి, ఆ జన్మ యందే సిద్ధి లభించుట కవకాశము కలదు.
ఉత్తరార్థమున యోగసాధన గూర్చి తాపత్రయ పడువారు ఆ శుభవాసనను ముందు జన్మలలోనికి కొనిపోయి, మరుజన్మలో చిరుప్రాయముననే యోగానుష్ఠాన బుద్ధిని పొందుదురు.
మానవ శరీరము ఏడు సంవత్సరముల ప్రాయము నుండి యోగ మార్గము ననుసరించుటకు అనువుగ నుండును. ఇది శ్రేష్ఠమైన సమయము.
అచటి నుండి ప్రతి యేడు సంవత్సరములకు శరీర కణములు స్థూల మగుచుండగ శ్రేష్ఠమైన సాధనకు దేహము సహకారము నందించుట తగ్గును. ముప్పది. ఐదు సంవత్సరముల వరకు శరీరమున మార్దవ ముండుట కవకాశమున్నది.
నలభై రెండు సంవత్సరముల తరువాత శరీరము బిరుసెక్కి సాధనకు ఉపయుక్తము కాక యుండును. చిన్నతనముననే శరీరమునకు యోగాంగములైన యమ నియమములను నేర్పినచో జీవితమంతయు యోగ సాధనమునకు శరీరము అనుకూలముగ వరించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
22 Mar 2021
మీరే సమీక్షించుకోవాలి
🌹. మీరే సమీక్షించుకోవాలి 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
✍️. భరత్,
📚. ప్రసాద్ భరద్వాజ
ఏదో ఒకటి వెతికేందుకు, అన్వేషించేందుకు, సృష్టించేందుకు మీరు సిద్ధంగా ఉండాలి. కానీ, చాలా కొద్దిమంది మాత్రమే తీర్థయాత్రకు వెళ్ళాలని లేదా గుండె లోతుల్లోని నిశ్శబ్దంలోకి వెళ్ళాలని లేదా ప్రేమ బాధ్యతను స్వీకరించాలని కోరుకుంటారు. ఎందుకంటే, వాటివల్ల ఎదురయ్యే చిక్కులు చాలా గొప్పగా ఉంటాయి.
మీరు బాధను భరించలేరు. కాబట్టి, వెంటనే మీరు దానిని తరిమెయ్యాలి. లేకపోతే, అది భరించ లేనంతగా తయారై మిమ్మల్ని బానిసత్వపు బందిఖానాలోకి బలవంతంగా నెట్టేస్తుంది. అలా మీరు అతి త్వరలో ఏదో ఒక జైలులోకి ప్రవేశిస్తారు. అలా జరగక ముందు మీరు సృజనాత్మకమైన వ్యక్తిగా మారి పరిస్థితిని పూర్తిగా చక్కదిద్దాలి.
జీవితంలో మీకు ఏది ఆనందాన్నిస్తుందో, మీరు ఏది సృష్టించాలనుకుంటున్నారో, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో, జీవితానికి నిర్వచనం ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో ముందుగా మీరు తెలుసుకోండి. అసలైన, ప్రామాణికమైన మీరేమిటో, మీ వ్యక్తిత్వమేమిటో తెలుసుకునేందుకు స్వేచ్ఛ ఒక చక్కని అవకాశం.
మీ చుట్టూఉన్న ప్రపంచాన్ని మరి కాస్త మెరుగ్గా, మరింత సుందరంగా చెయ్యడంలో ఉన్న ఆనందం మీ జీవితాన్ని మరిన్ని ఒయాసిస్సులతో పచ్చదనాన్ని సంతరించుకున్న తోటగా మార్చి, అందులో అందరి కోసం మరిన్ని గులాబీలు వికసించేలా చేస్తుంది.
ఈ సందర్భంగా థియొసాఫికల్ సొసైటీని స్థాపించిన ‘‘మేడమ్ బ్లావట్‌స్కీ’’ నాకు గుర్తుకొస్తోంది. ఆమె దగ్గర ఎప్పుడూ ఒక సంచీ నిండా పూలమొక్కల విత్తనాలుండేవి. ఆమె ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నా నడిచే దారికి రెండు వైపులా ఆ విత్తనాలను చల్లేది. ‘‘ఎందుకలా చేస్తున్నారు?’’ అని అడిగిన వారితో ఆవిడ ‘‘అది నా అలవాటు. నేను మళ్ళీ ఈ దారిలో రాకపోవచ్చు.
కానీ, ఒకటి మాత్రం కచ్చితంగా జరుగుతుంది. నేను చల్లిన విత్తనాలు మొక్కలై ఈ దారిలో వెళ్ళేవారికి వికసించిన రంగురంగుల పువ్వులతో స్వాగతం పలుకుతూ ఆనందం కలిగిస్తాయి. అలాగే వాటిలో కొన్ని పువ్వులు ప్రేమికుల బహుమతులు కావచ్చు. కొంతమంది పిల్లలు వాటిని కోసుకుని ఇంటికి తీసుకెళ్ళచ్చు లేదా వాటితో ఆడుకోవచ్చు.
అలా నేను ఎక్కడో ఒకచోట కొంత మందికి ఆనందం కలిగిస్తాను. నేనెవరో వారికి తెలియదు. అయినా పరవాలేదు. ఎందుకంటే, ఆ రకంగా నేను కొంతమంది ప్రేమలో, కొంతమంది ఆనందంలో వారికే తెలియకుండా భాగస్వామవుతాను. అదే నాకు ఆనందం’’ అనేది.
ఈ ప్రపంచాన్ని మరికాస్త సుందరంగా మరికాస్త చైతన్యవంతంగా చేసేందుకు స్వేచ్ఛ ఒక చక్కని అవకాశమని అర్థం చేసుకునేవారికి ఎలాంటి బాధ ఉండదు. మీరు నన్ను ప్రశ్నించడం మంచికే జరిగింది. లేకపోతే ఆ బాధను మీరు భరించక తప్పదు. ప్రతికూల ధోరణి మెల్లమెల్లగా మీ స్వేచ్ఛను విషతుల్యం చేస్తుంది కాబట్టి అదృశ్యమై పోయే ప్రతికూల స్వేచ్చకు ఏమాత్రం ప్రాముఖ్యత లేదు. ఎందుకంటే దానికి ఉనికి లేదు. కాబట్టి స్వేచ్ఛ సానుకూలంగా మారాలి.
నిరంకుశత్వం నుంచి స్వదేశానికి స్వేచ్ఛ కలిగించడం సత్యమార్గాన్ని అన్వేషించడం సాధ్యమేనా? రాజకీయ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా మీరు చేసే పోరాటం ఆధ్యాత్మిక స్వేచ్ఛ కోసం మీరు చేసే సత్యాన్వేషణలు మరింత క్లిష్టమైన విషయాలుగా తయారైనప్పటికీ వాటి మధ్య ఎలాంటి సంఘర్షణ లేదు. ముఖ్యంగా మీరు ఆధ్యాత్మిక స్వేచ్ఛ కోసమే సాధన చేయాలి. ఎందుకంటే రాజకీయ నిరంకుశత్వాలు వస్తూ పోతూ ఉంటాయి.
- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
22 Mar 2021
వివేక చూడామణి - 49 / Viveka Chudamani - 49
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 15. మనస్సు - 3 🍀
174. అందువలన మనస్సే బంధనాలకు విముక్తికి కారణమవుతుంది. రాజస గుణాలకు కళంకము ఏర్పడినపుడు అవి బంధనాలకు కారణమవుతాయి. రాజస, తామస గుణాలను పవిత్ర మార్గాలకు మళ్ళించినపుడు అవి విముక్తికి దారిచూపుతాయి.
175. ఆత్మ, అనాత్మల భేదమును గ్రహించి అజ్ఞాన కర్మలను వదలివేసిన మనస్సు విముక్తికి దారి చూపుతుంది. అందువలన తెలివైన సాధకుడు విముక్తిని సాధించిన తరువాత ఆత్మ, అనాత్మలను శక్తివంతము చేయాలి. అనగా వాటి జ్ఞానాన్ని పొందాలి.
176. ఇంద్రియ సుఖాలనే అరణ్యములో పయనించేటపుడు మనస్సను పులి చెలరేగుతుంది. అందువలన తెలివి గల వ్యక్తులు ఎవరైతే విముక్తిని కోరుచున్నారో వారు ఆ కోరికలనే అరణ్య మార్గములో ప్రవేశించరాదు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 49 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 The Mind - 3 🌻
174. Therefore the mind is the only cause that brings about man’s bondage or Liberation: when tainted by the effects of Rajas it leads to bondage, and when pure and divested of the Rajas and Tamas elements it conduces to Liberation.
175. Attaining purity through a preponderance of discrimination and renunciation, the mind makes for Liberation. Hence the wise seeker after Liberation must first strengthen these two.
176. In the forest-tract of sense-pleasures there prowls a huge tiger called the mind. Let good people who have a longing for Liberation never go there.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
22 Mar 2021
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 344, 345 / Vishnu Sahasranama Contemplation - 344, 345
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 344 / Vishnu Sahasranama Contemplation - 344 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻344. పద్మీ, पद्मी, Padmī🌻
"ఓం పద్మినే నమః | ॐ पद्मिने नमः | OM Padmine namaḥ
పద్మీ, पद्मी, Padmī
పద్మం హస్తే విద్యత ఇత్యతః పద్మీతి కీర్త్యతే ఈ భగవానుని హస్తమునందు పద్మము ఉన్నది.
:: పోతన భాగవతము - తృతీయ స్కంధము ::
సీ. తరణి సుధాకర కిరణ సమంచిత సరసీరుహోత్పల స్రగ్విలాసుఁ
గంకణ నూపుర గ్రైవేయ ముద్రికా హార కుండల కిరీటాభిరాముఁ
గమనీయ సాగర కన్యకా కౌస్తుభ మణి భూషణోద్భాసమాన వక్షు
సలలిత దరహాస చంద్రికా ధవళిత చారు దర్పణ విరాజత్కపోలు
తే. శంఖ చక్ర గదా పద్మ చారు హస్తు, నలికులాలక రుచి భాస్వదలిక ఫలకుఁ
బీత కౌశేయవాసుఁ గృపాతరంగి, త స్మితేక్షణుఁ బంకజోదరుని హరిని. (750)
సూర్య కిరణాలు సోకి వికసించిన తామరపూలతోనూ, చంద్రకిరణాలు సోకి వికసించిన కలువపూలతోనూ కట్టిన సుందరమైన పూలమాలలను ధరించి ఉన్నాడు. చేతులకు కంకణాలనూ, పాదాలకు నూపురాలనూ, కంఠాభరణాలనూ, అంగుళీయకాలనూ, రత్నహారాలనూ, మకరకుండలాలనూ, కిరీటాన్నీ, ధరించి ప్రకాశించుతున్నాడు. లావణ్యరాశియైన లక్ష్మీదేవితో కౌస్తుభమణితో ధగధగ మెరిసే వక్షస్స్థలం కలిగి ఉన్నాడు. సొగసైన చిరునవ్వు వెన్నెలలతో ముద్దులొలికే చెక్కుటద్దాలతో విరాజిల్లుతున్నాడు. శంఖం, చక్రం, గద, పద్మం చేతుల్లో ధరించి ఉన్నాడు. తుమ్మెదల వంటి నల్లని ముంగురులతో అందంగా ప్రకాశించే ఫాలఫలకం కలవాడై ఉన్నాడు. ఇంకా ఆ పంకజనాభుడైన హరి పచ్చని పట్టు వస్త్రం ధరించి సుందరమందహాసంతో దాక్షిణ్యం పొంగిపొరలే కటాక్ష వీక్షణాలతో అలరుతున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 344🌹
📚. Prasad Bharadwaj
🌻344. Padmī🌻
OM Padmine namaḥ
Padmaṃ haste vidyata ityataḥ padmīti kīrtyate / पद्मं हस्ते विद्यत इत्यतः पद्मीति कीर्त्यते There is a Lotus flower in His hand and hence He is known as Padmī.
Śrīmad Bhāgavata - Canto 4, Chapter 24
Prītiprahasitāpāṅgamalakai rūpaśōbhitam,
Lasatpaṅkajakiñjalka dukūlaṃ mr̥iṣṭakuṇḍalam. 47.
Sphuratkirīṭavalaya hāranūpuramēkhalam,
Śaṅkhacakragadāpadma mālāmaṇyuttamarddhimat. 48.
:: श्रीमद्भागवते - चतुर्थ स्कन्दे, चतुर्विंशोऽध्यायः ::
प्रीतिप्रहसितापाङ्गमलकै रूपशोभितम् ।
लसत्पङ्कजकिञ्जल्क दुकूलं मृष्टकुण्डलम् ॥ ४७ ॥
स्फुरत्किरीटवलय हारनूपुरमेखलम् ।
शङ्खचक्रगदापद्म मालामण्युत्तमर्द्धिमत् ॥ ४८ ॥
The Lord is super-excellently beautiful on account of His open and merciful smile and His sidelong glance upon His devotees. His black hair is curly, and His garments, waving in the wind, appear like flying saffron pollen from lotus flowers. His glittering earrings, shining helmet, bangles, garland, ankle bells, waist belt and various other bodily ornaments combine with conchshell, disc, club and lotus flower to increase the natural beauty of the Kaustubha pearl on His chest.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अशोकस्तारणस्तारः शूरश्शौरिर्जनेश्वरः ।अनुकूलश्शतावर्तः पद्मी पद्मनिभेक्षणः ॥ ३७ ॥
అశోకస్తారణస్తారః శూరశ్శౌరిర్జనేశ్వరః ।అనుకూలశ్శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః ॥ ౩౭ ॥
Aśokastāraṇastāraḥ śūraśśaurirjaneśvaraḥ ।Anukūlaśśatāvartaḥ padmī padmanibhekṣaṇaḥ ॥ 37 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 345 / Vishnu Sahasranama Contemplation - 345🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻345. పద్మనిభేక్షణః, पद्मनिभेक्षणः, Padmanibhekṣaṇaḥ🌻
ఓం పద్మనిభేక్షణాయ నమః | ॐ पद्मनिभेक्षणाय नमः | OM Padmanibhekṣaṇāya namaḥ
🌷పద్మనిభేక్షణః, पद्मनिभेक्षणः, Padmanibhekṣaṇaḥ🌷
యస్యేక్షణే పద్మనిభే స హి పద్మనిభేక్షణః పద్మములతో సమానములగు నేత్రములు ఈతనికి కలవు.
:: పోతన భాగవతము - తృతీయ స్కంధము ::
చ. అని యనుకంప దోఁప వినయంబునఁ జాగిఁలి మ్రొక్కి చారు లో
చన సరసీరుహుం డగుచు సర్వజగత్పరికల్పనారతిం
దనరిన నన్ను బ్రోచుటకుఁ దా నిటు సన్నిధియైన యీశ్వరుం
డనయము నాదు దుఃఖము దయామతిఁ బాపెడు మంచు నమ్రుఁడై. (313)
కమల సంభవుడు కనికరం ఉట్టిపడేటట్లు విష్ణుదేవునికి విన్నవించుకొని వినయంతో సాగిలపడి మ్రొక్కాడు. "సర్వ ప్రపంచాన్ని సృష్టించాడనికి పూనుకొన్న నన్ను, అందాలు చిందే కమలాలవంటి కన్నులతో వీక్షించి రక్షించడానికై, ఈ విధంగా సాక్షాత్కరించిన పరాత్పరుడు నా దుఃఖాన్ని దూరం చేయుగాక!" అని తలవంచి నమస్కరించాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 345🌹
📚. Prasad Bharadwaj
Yasyekṣaṇe padmanibhe sa hi padmanibhekṣaṇaḥ / यस्येक्षणे पद्मनिभे स हि पद्मनिभेक्षणः One with eyes resembling the Lotus flowers.
Śrīmad Bhāgavata - Canto 4, Chapter 8
Nānyaṃ tataḥ padmapalāśalocanādduḥkhacchidaṃ te mr̥gayāmi kañcana,
Yo mr̥gyate hastagr̥hītapadmayā śriyetarairaṅga vimr̥gyamāṇayā. 23.
:: श्रीमद्भागवते - चतुर्थ स्कन्धे, अष्टमोऽध्यायः ::
नान्यं ततः पद्मपलाशलोचनाद्दुःखच्छिदं ते मृगयामि कञ्चन ।
यो मृग्यते हस्तगृहीतपद्मया श्रियेतरैरङ्ग विमृग्यमाणया ॥ २३ ॥
I do not find anyone who can mitigate your distress but the Supreme Lord, whose eyes are like lotus petals. Many gods such as Lord Brahmā seek the grace of the goddess of fortune, but the goddess of fortune herself, with a lotus flower in her hand, is always ready to render service to the Supreme Lord.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अशोकस्तारणस्तारः शूरश्शौरिर्जनेश्वरः ।अनुकूलश्शतावर्तः पद्मी पद्मनिभेक्षणः ॥ ३७ ॥
అశోకస్తారణస్తారః శూరశ్శౌరిర్జనేశ్వరః ।అనుకూలశ్శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః ॥ ౩౭ ॥
Aśokastāraṇastāraḥ śūraśśaurirjaneśvaraḥ ।Anukūlaśśatāvartaḥ padmī padmanibhekṣaṇaḥ ॥ 37 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
22 Mar 2021
22-MARCH-2021 MESSAGES
1) 🌹 శ్రీమద్భగవద్గీత - 578 / Bhagavad-Gita - 578🌹
2) 🌹. భగవద్గీత యథాతథం - 1 - 26 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 344, 345 / Vishnu Sahasranama Contemplation - 344, 345🌹
4) 🌹 Daily Wisdom - 86🌹
5) 🌹. వివేక చూడామణి - 49🌹
6) 🌹Viveka Chudamani - 49🌹
7) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 60🌹
8) 🌹. మీరే సమీక్షించుకోవాలి 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
9) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 239 / Sri Lalita Chaitanya Vijnanam - 239 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 578 / Bhagavad-Gita - 578 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 17 🌴*
17. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్ త్రివిధం నరై: |
అఫలాకాంక్షిభిర్యుకై: సాత్త్వికం పరిచక్షతే ||
🌷. తాత్పర్యం :
దివ్యమైన శ్రద్ధతో కేవలము భగవానుని నిమిత్తమై భౌతికవాంఛారహితులైన వారిచే ఒనర్చబడు ఈ త్రివిధ తపస్సులు సాత్త్విక తపస్సనబడును.
🌷. భాష్యము :
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 578 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 17 - The Divisions of Faith - 17 🌴*
17. śraddhayā parayā taptaṁ
tapas tat tri-vidhaṁ naraiḥ
aphalākāṅkṣibhir yuktaiḥ
sāttvikaṁ paricakṣate
🌷 Translation :
This threefold austerity, performed with transcendental faith by men not expecting material benefits but engaged only for the sake of the Supreme, is called austerity in goodness.
🌹 Purport :
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, WA, FB Groups 🌹
https://t.me/BhagavadGita_Telugu_English
www.facebook.com/groups/bhagavadgeetha/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్గీత యథాతథం - 1 - 026 🌹*
AUDIO - VIDEO
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
అధ్యాయం 1, శ్లోకం 26
26
తత్రాపశ్యత్ స్థితాన్ పార్థ:
పితౄనథ పితామహాన్ |
ఆచార్యాన్ మాతులాన్ భ్రాతౄన్
పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా ||
శ్వశురాన్ సుహృదశ్చైవ
సేనయోరుభయోరపి |
తాత్పర్యము :
ఇరుపక్షపు సే నల నడుమ నిలిచిన అర్జునుడు అచ్చట తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను స్నేహితులు, మామలను, శ్రేయోభిలాషులను గాంచెను.
భాష్యము :
అర్జునుడు యుద్ధరంగమునందు అన్ని రకాలైన సంబంధీకులను చూసెను. తన తండ్రిక సమకాలీకులైన భూరీశ్రవుడు, తాతలైన భీష్‌ముడు, సోమదత్తుడు వంటివారిని గురువులైన ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు వంట వారిని మేనమామలైన శల్యుడు, శకుని వంటి వారిని, సోదరులైన దుర్యోధనుడి వంటివారిని, పుత్రులైన లక్ష్మణుడి వంటివారిని, స్నేహితులైన అశ్వద్ధామ వంటి వారిని, శ్రేయోభిలాషులైన కృపాచార్య వంటివారిని, ఇలా ఎందరో ఆత్మీయులను ఆ సైన్యము నందు అర్జునుడు చూసెను.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ….
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita #గీతాసారం #GitaSaram
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, WA, FB Groups 🌹
https://t.me/BhagavadGita_Telugu_English
www.facebook.com/groups/bhagavadgeetha/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 344, 345/ Vishnu Sahasranama Contemplation - 344, 345 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻344. పద్మీ, पद्मी, Padmī🌻*
"ఓం పద్మినే నమః | ॐ पद्मिने नमः | OM Padmine namaḥ*
పద్మీ, पद्मी, Padmī
పద్మం హస్తే విద్యత ఇత్యతః పద్మీతి కీర్త్యతే ఈ భగవానుని హస్తమునందు పద్మము ఉన్నది.
:: పోతన భాగవతము - తృతీయ స్కంధము ::
సీ. తరణి సుధాకర కిరణ సమంచిత సరసీరుహోత్పల స్రగ్విలాసుఁ
గంకణ నూపుర గ్రైవేయ ముద్రికా హార కుండల కిరీటాభిరాముఁ
గమనీయ సాగర కన్యకా కౌస్తుభ మణి భూషణోద్భాసమాన వక్షు
సలలిత దరహాస చంద్రికా ధవళిత చారు దర్పణ విరాజత్కపోలు
తే. శంఖ చక్ర గదా పద్మ చారు హస్తు, నలికులాలక రుచి భాస్వదలిక ఫలకుఁ
బీత కౌశేయవాసుఁ గృపాతరంగి, త స్మితేక్షణుఁ బంకజోదరుని హరిని. (750)
సూర్య కిరణాలు సోకి వికసించిన తామరపూలతోనూ, చంద్రకిరణాలు సోకి వికసించిన కలువపూలతోనూ కట్టిన సుందరమైన పూలమాలలను ధరించి ఉన్నాడు. చేతులకు కంకణాలనూ, పాదాలకు నూపురాలనూ, కంఠాభరణాలనూ, అంగుళీయకాలనూ, రత్నహారాలనూ, మకరకుండలాలనూ, కిరీటాన్నీ, ధరించి ప్రకాశించుతున్నాడు. లావణ్యరాశియైన లక్ష్మీదేవితో కౌస్తుభమణితో ధగధగ మెరిసే వక్షస్స్థలం కలిగి ఉన్నాడు. సొగసైన చిరునవ్వు వెన్నెలలతో ముద్దులొలికే చెక్కుటద్దాలతో విరాజిల్లుతున్నాడు. శంఖం, చక్రం, గద, పద్మం చేతుల్లో ధరించి ఉన్నాడు. తుమ్మెదల వంటి నల్లని ముంగురులతో అందంగా ప్రకాశించే ఫాలఫలకం కలవాడై ఉన్నాడు. ఇంకా ఆ పంకజనాభుడైన హరి పచ్చని పట్టు వస్త్రం ధరించి సుందరమందహాసంతో దాక్షిణ్యం పొంగిపొరలే కటాక్ష వీక్షణాలతో అలరుతున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 344🌹*
📚. Prasad Bharadwaj
*🌻344. Padmī🌻*
*OM Padmine namaḥ*
Padmaṃ haste vidyata ityataḥ padmīti kīrtyate / पद्मं हस्ते विद्यत इत्यतः पद्मीति कीर्त्यते There is a Lotus flower in His hand and hence He is known as Padmī.
Śrīmad Bhāgavata - Canto 4, Chapter 24
Prītiprahasitāpāṅgamalakai rūpaśōbhitam,
Lasatpaṅkajakiñjalka dukūlaṃ mr̥iṣṭakuṇḍalam. 47.
Sphuratkirīṭavalaya hāranūpuramēkhalam,
Śaṅkhacakragadāpadma mālāmaṇyuttamarddhimat. 48.
:: श्रीमद्भागवते - चतुर्थ स्कन्दे, चतुर्विंशोऽध्यायः ::
प्रीतिप्रहसितापाङ्गमलकै रूपशोभितम् ।
लसत्पङ्कजकिञ्जल्क दुकूलं मृष्टकुण्डलम् ॥ ४७ ॥
स्फुरत्किरीटवलय हारनूपुरमेखलम् ।
शङ्खचक्रगदापद्म मालामण्युत्तमर्द्धिमत् ॥ ४८ ॥
The Lord is super-excellently beautiful on account of His open and merciful smile and His sidelong glance upon His devotees. His black hair is curly, and His garments, waving in the wind, appear like flying saffron pollen from lotus flowers. His glittering earrings, shining helmet, bangles, garland, ankle bells, waist belt and various other bodily ornaments combine with conchshell, disc, club and lotus flower to increase the natural beauty of the Kaustubha pearl on His chest.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अशोकस्तारणस्तारः शूरश्शौरिर्जनेश्वरः ।अनुकूलश्शतावर्तः पद्मी पद्मनिभेक्षणः ॥ ३७ ॥
అశోకస్తారణస్తారః శూరశ్శౌరిర్జనేశ్వరః ।అనుకూలశ్శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః ॥ ౩౭ ॥
Aśokastāraṇastāraḥ śūraśśaurirjaneśvaraḥ ।Anukūlaśśatāvartaḥ padmī padmanibhekṣaṇaḥ ॥ 37 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 345 / Vishnu Sahasranama Contemplation - 345🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻345. పద్మనిభేక్షణః, पद्मनिभेक्षणः, Padmanibhekṣaṇaḥ🌻*
*ఓం పద్మనిభేక్షణాయ నమః | ॐ पद्मनिभेक्षणाय नमः | OM Padmanibhekṣaṇāya namaḥ*
🌷పద్మనిభేక్షణః, पद्मनिभेक्षणः, Padmanibhekṣaṇaḥ🌷
యస్యేక్షణే పద్మనిభే స హి పద్మనిభేక్షణః పద్మములతో సమానములగు నేత్రములు ఈతనికి కలవు.
:: పోతన భాగవతము - తృతీయ స్కంధము ::
చ. అని యనుకంప దోఁప వినయంబునఁ జాగిఁలి మ్రొక్కి చారు లో
చన సరసీరుహుం డగుచు సర్వజగత్పరికల్పనారతిం
దనరిన నన్ను బ్రోచుటకుఁ దా నిటు సన్నిధియైన యీశ్వరుం
డనయము నాదు దుఃఖము దయామతిఁ బాపెడు మంచు నమ్రుఁడై. (313)
కమల సంభవుడు కనికరం ఉట్టిపడేటట్లు విష్ణుదేవునికి విన్నవించుకొని వినయంతో సాగిలపడి మ్రొక్కాడు. "సర్వ ప్రపంచాన్ని సృష్టించాడనికి పూనుకొన్న నన్ను, అందాలు చిందే కమలాలవంటి కన్నులతో వీక్షించి రక్షించడానికై, ఈ విధంగా సాక్షాత్కరించిన పరాత్పరుడు నా దుఃఖాన్ని దూరం చేయుగాక!" అని తలవంచి నమస్కరించాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 345🌹*
📚. Prasad Bharadwaj
Yasyekṣaṇe padmanibhe sa hi padmanibhekṣaṇaḥ / यस्येक्षणे पद्मनिभे स हि पद्मनिभेक्षणः One with eyes resembling the Lotus flowers.
Śrīmad Bhāgavata - Canto 4, Chapter 8
Nānyaṃ tataḥ padmapalāśalocanādduḥkhacchidaṃ te mr̥gayāmi kañcana,
Yo mr̥gyate hastagr̥hītapadmayā śriyetarairaṅga vimr̥gyamāṇayā. 23.
:: श्रीमद्भागवते - चतुर्थ स्कन्धे, अष्टमोऽध्यायः ::
नान्यं ततः पद्मपलाशलोचनाद्दुःखच्छिदं ते मृगयामि कञ्चन ।
यो मृग्यते हस्तगृहीतपद्मया श्रियेतरैरङ्ग विमृग्यमाणया ॥ २३ ॥
I do not find anyone who can mitigate your distress but the Supreme Lord, whose eyes are like lotus petals. Many gods such as Lord Brahmā seek the grace of the goddess of fortune, but the goddess of fortune herself, with a lotus flower in her hand, is always ready to render service to the Supreme Lord.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अशोकस्तारणस्तारः शूरश्शौरिर्जनेश्वरः ।अनुकूलश्शतावर्तः पद्मी पद्मनिभेक्षणः ॥ ३७ ॥
అశోకస్తారణస్తారః శూరశ్శౌరిర్జనేశ్వరః ।అనుకూలశ్శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః ॥ ౩౭ ॥
Aśokastāraṇastāraḥ śūraśśaurirjaneśvaraḥ ।Anukūlaśśatāvartaḥ padmī padmanibhekṣaṇaḥ ॥ 37 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
https://t.me/vishnusahasra
www.facebook.com/groups/vishnusahasranam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 DAILY WISDOM - 86 🌹*
*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 26. The Knower Alone Is 🌻*
Everything is known by the knower, but who is to know the knower? If the knower is to be known, there must be a second knower to that knower, and the second knower can be known by a third knower, the third by a fourth, the fourth by a fifth, and so on.
You go on scratching your head, you cannot know the knower. How can the knower be known? We have already designated the knower as the ‘Knower’ and you cannot now call it the ‘known’.
Therefore there is no such thing as knowing of Knowing, or knowing of Knower. Knowing of objects only is there before liberation. With liberation, that object has become part of knowing itself; It has become one with the Knower. The Knower alone is; there is no such thing then as ‘knowing’.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #DailyWisdom #SwamiKrishnananda
Join and Share
🌹. Daily satsang Wisdom 🌹
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. వివేక చూడామణి - 49 / Viveka Chudamani - 49🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🍀. 15. మనస్సు - 3 🍀*
174. అందువలన మనస్సే బంధనాలకు విముక్తికి కారణమవుతుంది. రాజస గుణాలకు కళంకము ఏర్పడినపుడు అవి బంధనాలకు కారణమవుతాయి. రాజస, తామస గుణాలను పవిత్ర మార్గాలకు మళ్ళించినపుడు అవి విముక్తికి దారిచూపుతాయి.
175. ఆత్మ, అనాత్మల భేదమును గ్రహించి అజ్ఞాన కర్మలను వదలివేసిన మనస్సు విముక్తికి దారి చూపుతుంది. అందువలన తెలివైన సాధకుడు విముక్తిని సాధించిన తరువాత ఆత్మ, అనాత్మలను శక్తివంతము చేయాలి. అనగా వాటి జ్ఞానాన్ని పొందాలి.
176. ఇంద్రియ సుఖాలనే అరణ్యములో పయనించేటపుడు మనస్సను పులి చెలరేగుతుంది. అందువలన తెలివి గల వ్యక్తులు ఎవరైతే విముక్తిని కోరుచున్నారో వారు ఆ కోరికలనే అరణ్య మార్గములో ప్రవేశించరాదు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 VIVEKA CHUDAMANI - 49 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
*🌻 The Mind - 3 🌻*
174. Therefore the mind is the only cause that brings about man’s bondage or Liberation: when tainted by the effects of Rajas it leads to bondage, and when pure and divested of the Rajas and Tamas elements it conduces to Liberation.
175. Attaining purity through a preponderance of discrimination and renunciation, the mind makes for Liberation. Hence the wise seeker after Liberation must first strengthen these two.
176. In the forest-tract of sense-pleasures there prowls a huge tiger called the mind. Let good people who have a longing for Liberation never go there.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #వివేకచూడామణి #VivekaChudamani
Join and Share
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. దేవాపి మహర్షి బోధనలు - 60 🌹*
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻 41. సాధన - శరీరము 🌻*
ఆత్మ సాధనము కొన్ని రోజులకు సంబంధించినది కాదు. ఆత్మానుభూతి కలుగుటకు సాధకుని పరిశుద్ధిని బట్టి కొన్ని సంవత్సర ములు లేదా కొన్ని జన్మలు పట్టవచ్చును. జీవితమున శిశు ప్రాయము ననే సాధన మొదలగువానికి, ఆ జన్మ యందే సిద్ధి లభించుట కవకాశము కలదు.
ఉత్తరార్థమున యోగసాధన గూర్చి తాపత్రయ పడువారు ఆ శుభవాసనను ముందు జన్మలలోనికి కొనిపోయి, మరుజన్మలో చిరుప్రాయముననే యోగానుష్ఠాన బుద్ధిని పొందుదురు.
మానవ శరీరము ఏడు సంవత్సరముల ప్రాయము నుండి యోగ మార్గము ననుసరించుటకు అనువుగ నుండును. ఇది శ్రేష్ఠమైన సమయము.
అచటి నుండి ప్రతి యేడు సంవత్సరములకు శరీర కణములు స్థూల మగుచుండగ శ్రేష్ఠమైన సాధనకు దేహము సహకారము నందించుట తగ్గును. ముప్పది. ఐదు సంవత్సరముల వరకు శరీరమున మార్దవ ముండుట కవకాశమున్నది.
నలభై రెండు సంవత్సరముల తరువాత శరీరము బిరుసెక్కి సాధనకు ఉపయుక్తము కాక యుండును. చిన్నతనముననే శరీరమునకు యోగాంగములైన యమ నియమములను నేర్పినచో జీవితమంతయు యోగ సాధనమునకు శరీరము అనుకూలముగ వరించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM
www.facebook.com/groups/maharshiwisdom/
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మీరే సమీక్షించుకోవాలి 🌹*
*🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀*
✍️. భరత్,
📚. ప్రసాద్ భరద్వాజ
ఏదో ఒకటి వెతికేందుకు, అన్వేషించేందుకు, సృష్టించేందుకు మీరు సిద్ధంగా ఉండాలి. కానీ, చాలా కొద్దిమంది మాత్రమే తీర్థయాత్రకు వెళ్ళాలని లేదా గుండె లోతుల్లోని నిశ్శబ్దంలోకి వెళ్ళాలని లేదా ప్రేమ బాధ్యతను స్వీకరించాలని కోరుకుంటారు. ఎందుకంటే, వాటివల్ల ఎదురయ్యే చిక్కులు చాలా గొప్పగా ఉంటాయి.
మీరు బాధను భరించలేరు. కాబట్టి, వెంటనే మీరు దానిని తరిమెయ్యాలి. లేకపోతే, అది భరించ లేనంతగా తయారై మిమ్మల్ని బానిసత్వపు బందిఖానాలోకి బలవంతంగా నెట్టేస్తుంది. అలా మీరు అతి త్వరలో ఏదో ఒక జైలులోకి ప్రవేశిస్తారు. అలా జరగక ముందు మీరు సృజనాత్మకమైన వ్యక్తిగా మారి పరిస్థితిని పూర్తిగా చక్కదిద్దాలి.
జీవితంలో మీకు ఏది ఆనందాన్నిస్తుందో, మీరు ఏది సృష్టించాలనుకుంటున్నారో, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో, జీవితానికి నిర్వచనం ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో ముందుగా మీరు తెలుసుకోండి. అసలైన, ప్రామాణికమైన మీరేమిటో, మీ వ్యక్తిత్వమేమిటో తెలుసుకునేందుకు స్వేచ్ఛ ఒక చక్కని అవకాశం.
మీ చుట్టూఉన్న ప్రపంచాన్ని మరి కాస్త మెరుగ్గా, మరింత సుందరంగా చెయ్యడంలో ఉన్న ఆనందం మీ జీవితాన్ని మరిన్ని ఒయాసిస్సులతో పచ్చదనాన్ని సంతరించుకున్న తోటగా మార్చి, అందులో అందరి కోసం మరిన్ని గులాబీలు వికసించేలా చేస్తుంది.
ఈ సందర్భంగా థియొసాఫికల్ సొసైటీని స్థాపించిన ‘‘మేడమ్ బ్లావట్‌స్కీ’’ నాకు గుర్తుకొస్తోంది. ఆమె దగ్గర ఎప్పుడూ ఒక సంచీ నిండా పూలమొక్కల విత్తనాలుండేవి. ఆమె ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నా నడిచే దారికి రెండు వైపులా ఆ విత్తనాలను చల్లేది. ‘‘ఎందుకలా చేస్తున్నారు?’’ అని అడిగిన వారితో ఆవిడ ‘‘అది నా అలవాటు. నేను మళ్ళీ ఈ దారిలో రాకపోవచ్చు.
కానీ, ఒకటి మాత్రం కచ్చితంగా జరుగుతుంది. నేను చల్లిన విత్తనాలు మొక్కలై ఈ దారిలో వెళ్ళేవారికి వికసించిన రంగురంగుల పువ్వులతో స్వాగతం పలుకుతూ ఆనందం కలిగిస్తాయి. అలాగే వాటిలో కొన్ని పువ్వులు ప్రేమికుల బహుమతులు కావచ్చు. కొంతమంది పిల్లలు వాటిని కోసుకుని ఇంటికి తీసుకెళ్ళచ్చు లేదా వాటితో ఆడుకోవచ్చు.
అలా నేను ఎక్కడో ఒకచోట కొంత మందికి ఆనందం కలిగిస్తాను. నేనెవరో వారికి తెలియదు. అయినా పరవాలేదు. ఎందుకంటే, ఆ రకంగా నేను కొంతమంది ప్రేమలో, కొంతమంది ఆనందంలో వారికే తెలియకుండా భాగస్వామవుతాను. అదే నాకు ఆనందం’’ అనేది.
ఈ ప్రపంచాన్ని మరికాస్త సుందరంగా మరికాస్త చైతన్యవంతంగా చేసేందుకు స్వేచ్ఛ ఒక చక్కని అవకాశమని అర్థం చేసుకునేవారికి ఎలాంటి బాధ ఉండదు. మీరు నన్ను ప్రశ్నించడం మంచికే జరిగింది. లేకపోతే ఆ బాధను మీరు భరించక తప్పదు. ప్రతికూల ధోరణి మెల్లమెల్లగా మీ స్వేచ్ఛను విషతుల్యం చేస్తుంది కాబట్టి అదృశ్యమై పోయే ప్రతికూల స్వేచ్చకు ఏమాత్రం ప్రాముఖ్యత లేదు. ఎందుకంటే దానికి ఉనికి లేదు. కాబట్టి స్వేచ్ఛ సానుకూలంగా మారాలి.
నిరంకుశత్వం నుంచి స్వదేశానికి స్వేచ్ఛ కలిగించడం సత్యమార్గాన్ని అన్వేషించడం సాధ్యమేనా? రాజకీయ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా మీరు చేసే పోరాటం ఆధ్యాత్మిక స్వేచ్ఛ కోసం మీరు చేసే సత్యాన్వేషణలు మరింత క్లిష్టమైన విషయాలుగా తయారైనప్పటికీ వాటి మధ్య ఎలాంటి సంఘర్షణ లేదు. ముఖ్యంగా మీరు ఆధ్యాత్మిక స్వేచ్ఛ కోసమే సాధన చేయాలి. ఎందుకంటే రాజకీయ నిరంకుశత్వాలు వస్తూ పోతూ ఉంటాయి.
- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఓషోబోధనలు #OshoDiscourse
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 239 / Sri Lalitha Chaitanya Vijnanam - 239 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
*🍀 59. మనువిద్యా, చంద్రవిద్యా, చంద్రమండలమధ్యగా ।
చారురూపా, చారుహాసా, చారుచంద్ర కళాధరా ॥ 59 ॥🍀*
*🌻239. 'చంద్రవిద్యా' 🌻*
దేవి చంద్ర విద్యా స్వరూపిణి అని అర్థము. చంద్రుడనగా మనకు కనిపించు చందమామ మాత్రమే కాదు.
ప్రతిబింబించు శక్తి. మొలకెత్తించు శక్తి. పదార్థమును జనింపజేసి రూపముల నేర్పరచు శక్తి. దీనిని ఊర్ధ్వలోకములలో సోమశక్తి అందురు. మరియు ఆకర్షణ శక్తి, సృజనాత్మక శక్తి కూడను. సోమ మనగా ఉమతో కూడిన శివతత్త్వమని అర్థము (స + ఉమ). ఈ శక్తి లేనిదే ఏకమనేకమగుట జరుగదు.
అనేక అద్దములున్న గదిలో నిలబడినపుడు ఒకరే అనేకులై అనంతముగ గోచరింతురు కదా! అట్లే శ్రీదేవి మహా చైతన్యము నుండి, ఆమె చంద్రశక్తి కారణముగ అనేక గ్రహగోళాదులు అనేకానేక కోట్ల జీవుల రూపము లేర్పడుచున్నవి.
ఆమె మనస్సు నుండి పుట్టినది ఆమె చంద్రశక్తి, ఆ చంద్రశక్తి నుండి పుట్టినవి మనువుల మనస్సులు. ఈ కారణముగనే మన మనస్సులలో కూడ అసంఖ్యాకములైన భావములు పుట్టు చుండును. మనమా భావములకు రూపకల్పన చేయుచుందుము. చంద్రవిద్య బలముగ నున్నవారు భావములకు రూపమును అప్పటి కప్పుడేర్పరచగలరు. ఋషులట్టివారు.
మంత్రించిన జలముల నుండి స్మరించిన భావమును రూపు కట్టింపగలరు. ఊర్ధ్వలోక దర్శనమునకు, అంతర్దర్శనమునకు, బాహ్య దర్శనమునకు, అవగాహనకు కూడ మనస్సే ప్రధానము.
శ్రీమాత చంద్రవిద్యను పదహారు కళలుగ ఏర్పాటు చేసి యున్నది. ఈ పదహారు కళలు శూన్యముగ గోచరించు శివ తత్త్వము నుండి, పూర్ణముగ గోచరించు భౌతిక సృష్టి వరకు సృష్టి నిర్మాణమునకు శ్రీమాత ఉపయోగించు చంద్రవిద్య.
చంద్రవిద్యతోనే సృష్టి పురోగమనము, తిరోగమనము నిర్వర్తింపబడుచున్నది. పరిశీలించినచో మానవ జీవితమున కూడ బాహ్యములోనికి పురోగతి చెందుట, బాహ్యము నుండి తిరోగతి చెందుట చంద్రవిద్యపైనే ఆధారపడి యున్నవి.
చంద్రబలము బాగుండిననే యోగసాధన సులభమగును. శుక్ల పక్షమున చంద్రకళలు పెరుగుచుండగ బాహ్యములోనికి పురోగమించుట, కృష్ణ పక్షమున చంద్రకళలు తరుగుచుండగ అంతర్లోకములలోనికి తిరోగమించుట యోగులు చేయుదురు.
తిరోగమనమునకు శివుడు గమ్యము. పురోగమనమునకు అనుభూతి గమ్యము. తిరోగమన పురోగమనములకు శ్రీదేవి అనుగ్రహము గమ్యము.
చంద్రవిద్య అంతయూ చంద్రుని షోడశ కళలయందు యిమిడి యున్నది. షోడశీ మంత్రమును ఉపాసించువారు ఈ విద్యను గ్రహింపగలరు. మరియొక విషయమేమనగా ముందు తెలిపిన మనువిద్య, చంద్రవిద్య పరస్పర సంబంధితములు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 239 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻 Candra-vidyā चन्द्र-विद्या (239) 🌻*
After Manu, the worship by Candra is referred in this nāma.
{There are fifteen main worshippers of Lalitāmbigai and each one of them worshipped Her with their own Pañcadaśī mantra-s without making any changes in the bīja-s. Hence, there are fifteen types of Pañcadaśī mantra-s. (However, different texts provide different versions.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/SriMataChaitanyam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
శ్రీ లలితా సహస్ర నామములు - 50 / Sri Lalita Sahasranamavali - Meaning - 50
🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 50 / Sri Lalita Sahasranamavali - Meaning - 50 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 50. నిస్తులా, నీలచికురా, నిరపాయా, నిరత్యయా ।
దుర్లభా, దుర్గమా, దుర్గా, దుఃఖహంత్రీ, సుఖప్రదా ॥ 50 ॥ 🍀
🍀 184. నిస్తులా -
సాటి లేనిది.
🍀 185. నీలచికురా -
చిక్కని, చక్కని, నల్లని, ముంగురులు గలది.
🍀 186. నిరపాయా -
అపాయములు లేనిది.
🍀 187. నిరత్యయా -
అతిక్రమింప వీలులేనిది.
🍀 188. దుర్లభా -
పొందశక్యము కానిది.
🍀 189. దుర్గమా -
గమింప శక్యము గానిది.
🍀 190. దుర్గా -
దుర్గాదేవి.
🍀 191. దుఃఖహంత్రీ -
దుఃఖములను తొలగించునది.
🍀 192. సుఖప్రదా -
సుఖములను ఇచ్చునది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 50 🌹
📚. Prasad Bharadwaj
🌻 50. nistulā nīlacikurā nirapāyā niratyayā |
durlabhā durgamā durgā duḥkhahantrī sukhapradā || 50 || 🌻
🌻 184 ) Nisthula -
She who does not have anything to be compared to
🌻 185 ) Neela chikura -
She who has dark black hair
🌻 186 ) Nirapaya -
She who is never destroyed
🌻 187 ) Nirathyaya -
She who does not cross limits of rules she herself created
🌻 188 ) Dhurlabha -
She who is difficult to obtain
🌻 189 ) Dhurgama -
She who can not be neared easily
🌻 190 ) Dhurga -
She who is Dhurga who is a nine year old girl
🌻 191 ) Dhuka hanthri -
She who removes sorrows
🌻 192 ) Sukha prada -
She who gives pleasures and happiness
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
21 Mar 2021
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 195
🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 195 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - నాల్గవ దివ్య యానము - సద్గురువు -అవతార పురుషుడు. -9 🌻
726. అవతార పురుషుడు, సద్గురువు ఎందుకు మహిమలు ప్రదర్శింతురు?
ఆధ్యాత్మిక విలువల యందు తమకు గల సంపూర్ణ జ్ఞానం వలన, ప్రజలకు హాని జరుగకుండా వారిని రక్షించుటకై మహిమలను ప్రదర్శింతురు.
727. సద్గురువులు ఉన్నవి ఉన్నట్లుగనే కనిపించునట్లు చేయుచూ, ఇదివరకే యున్న మాయాతెరను చీల్చివైచి సత్యమును చూపింతురు .సృష్టి ,భావనా మాత్రమే యనియు గ్రహింప జేయుదురు.
728. సద్గురువుల శక్తులు స్వయంశక్తులు.ఎందుచేత?తామే అనంతశక్తి స్వరూపులు గనుక.యోగులు అట్లుగాక, శక్తులను అప్పుగొని వాటిద్వారా మహిమలు చేయుదురు.
729. తురీయ అవస్త యందున్న జీవన్ముక్తునకు అధికారము లేదు. కాబట్టి మహిమలు ప్రదర్శించడు.కానీ అతనికి తెలియకనే అతని ద్వారా మహిమలు జరుగు అవకాశం లేకపోలేదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
21 Mar 2021
శ్రీ శివ మహా పురాణము - 373
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 11
🌻. హిమవంతునితో శివుని సమాగమము - 1 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను-
లోకములచే పూజింపబడే ఆ శక్తి హిమవంతుని పుత్రికయై ఆయన గృహములో పెరిగి ఎనిమిది సంవత్సరములు వయస్సు గలది అయెను (1). ఓ నారదా! సతీ వియోగ దుఃఖితుడైన శివుడు ఆమె జన్మించిన వృత్తాంతము నెరింగి అంద్భుతమగు ఆమె మూర్తిని తన హృదయుములో ధ్యానించి మిక్కిలి ఆనందించెను (2).
అదే సమయములో లోకాచారము ననుసరించి శంభుడు మనస్సును నియంత్రించి గొప్ప తపస్సును చేయగోరెను (3). ఆయన నంది మొదలగు శాంతస్వభావము గల కొందరు గణములు వెంటరాగా ఉత్తమమగు హిమవత్పర్వత శిఖరమునందున్న గంగావతార క్షేత్రమును చేరుకొనెను (4).
ఓ మహర్షీ! పరమ పావనియగు గంగ సర్వుల పాపసమూహములను నశింప చేయుట కొరకై పూర్వము బ్రహ్మ పురమునుండి జారి ఇచట పడినది (5). జితేంద్రియుడగు శివుడు అచట నుండి తపమునారంభించెను. ఆయన అలసట ఎరుంగని వాడై ఆత్మస్వరూపమును ఏకాగ్రతతో ధ్యానించెను (6).
నిత్యము, జ్యోతిస్స్వరూపము, నిర్దోషము, చిదానందఘనము, అద్వయము, సర్వాశ్రయము అగు అత్మ మనస్సులో అఖండ ధీరూపముగా గోచరించును. ఆత్మయే జగద్రూపముగా పరిణమించినది(7). శివుడు ధ్యానములో నిమగ్నుడై యుండగా, నంది, భృంగి మొదలగు కొందరు ప్రమథ గణములు కూడా ధ్యానమను చేయ మొదలిడిరి (8).
అపుడు కొందరు గణములు శంభు పరమాత్ముని సేవను చేసిరి. మరి కొందరు శబ్దమును చేయకుండగా మౌనముగా ద్వార పాలురై నిలబడిరి(9). ఇంతలో ఔషధిప్రస్థములో శివుని రాకను గురించి విని హిమవంతుడు ఆదరముతో అచటకు విచ్చేసెను(10). గణములతో కూడియున్న ఆ పర్వతరాజు రుద్ర ప్రభువునకు చేతులొగ్గి నమస్కరించి ప్రేమతో పూజించి స్తుతించెను(11).
హిమాలయుడిట్లు పలికెను-
దేవ దేవా! మహాదేవా! జటాజూట ధారీ! శంకరా! ప్రభో! లోకనాథుడవగు నీవీ ముల్లోకములను పాలించుచున్నావు(12). హే దేవదేవా! ఈశ్వరా! యోగి రూపమును ధరించిన నీకు నమస్కారము. నిర్గుణుడవయ్యు సగుణుడవై విహరించు నీకు నమస్కారము (13).
హే శంభో! కైలాసవాసి అయ్యు సర్వలోకములను సంచరించునట్టియు, లీలచే ఆకారమును స్వీకరించి శూలధారివగు నీకు నమస్కారము. నీవు పరమేశ్వరుడు (14). నీవు సకలగుణ నిధానమవు. వికారములు లేనట్టియు, కామనలు లేనట్టియు, విశిష్టమగు సంకల్ప శక్తి కలిగినట్టియు, జ్ఞానఘనుడైనట్టియు, పరమాత్మవగు నీకు నమస్కారము (15).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
21 Mar 2021
గీతోపనిషత్తు -173
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚
శ్లోకము 16
🍀 16. సమతుల్య ప్రవర్తన - సమతుల్యమే యోగమునకు ప్రధానము. అతిగా భుజించి నను, అతిగా నిద్రించినను సాధకుని యందు మితిమీరిన తమస్సు ఏర్పడును. దేహము బరువెక్కును. సోమరితనము కలుగును. దానివలన మరపు కలుగును. ఆహారము, పని, నిద్ర విషయము లందు సమతుల్యమును ప్రతి సాధకుడు తనకు తానుగ సాధించుకొన వలసినదే. అట్లు కానిచో యోగ సాధనకు అర్హత లేదు. యోగ సాధకుడు సంఘ జీవనమున తనదగు క్రమము నేర్పరచు కొనవలెను. అవసర మగుచో కొన్ని సాంఘిక కార్యములను విసర్జించవలెను. అట్లే ఏకాంతము పేరున సంఘమునకు, కుటుంబమునకు దూరమగుట యోగ సాధనకు పనికిరాదు. అట్లని వారితో మమైకమగుట కూడ సాధన కంతరాయమే. సమతుల్యమే యోగమునకు ప్రధాన సూత్రము. 🍀
నాత్యశ్నతస్తు యోగో స్తి న చై కాంత మనశ్నతః |
న చాతిస్వప్న శీలస్య జాగ్రతో నైవ చార్జున || 16
అతిగా భుజించువాడు, అసలు భుజించనివాడు యోగి కాడు. అతిగా మేల్కొని యుండువాడు మరియు అతిగ నిద్రించు వాడు కూడ యోగి కాడు. సమతుల్యమే యోగమునకు ప్రధానము. అతిగా భుజించి నను, అతిగా నిద్రించినను సాధకుని యందు మితిమీరిన తమస్సు ఏర్పడును. దేహము బరువెక్కును. సోమరితనము కలుగును. దానివలన మరపు కలుగును.
చేయవలసిన పనుల యందు అశ్రద్ధ, ఆలస్యము, వైఫల్యము కలుగుచుండును. సామాన్యముగ మానవునకు దినమున ఆరేడు గంటలకన్న నిద్ర అవసరము కలుగదు. రెండుమూడుసార్లు కన్న అన్నపానీయము లావశ్యకత కలుగదు. ఆకలి, దాహము, నిద్ర అతిగా నున్నచో జీవితమే బరువగును. ఇక యోగ మెక్కడ?
తన దేహ పరిస్థితిని తానే గమనించి, తన దేహమునకు సరిపడు ఆహారము తానే తెలుసుకొని భుజింపవలెను. అజీర్తికి తావియ్యరాదు. పగటి నిద్ర నిషిద్ధమని ఆర్యులు తెలుపుదురు. ఎండలు మండు కాలమున మధ్యాహ్నము నిద్రించుట కన్న, ఇరువది ముప్పది నిమిషములు విశ్రాంతి గొనుట మేలు. శరీరమునకు తగిన వ్యాయామము, స్నానాదిక శుచిత్వము, పరిశుద్ధమగు భోజనము, సౌకర్యమును గూర్చు వస్త్రధారణము ప్రధానములు.
నిజమునకు సూర్యరశ్మి, పీల్చు గాలి, నీరు కూడ ఆహారములే. వీనిని దండిగ గొనువారు ప్రాణశక్తిని చక్కగ నార్జించుకొందురు. ఆ మేరకు భోజనమును తగ్గించుకొందురు. ఏది ఎట్లున్నను శరీరమును ఆరోగ్యవంతముగ నుంచుకొనుట, బరువుగ తనకు అని పించకుండుట ముఖ్యము. పరుగున బోవు గుఱ్ఱము వలె చురుకుగ నున్న శరీరము ప్రధానమని తెలియవలెను.
ఆహారము, పని, నిద్ర విషయము లందు సమతుల్యమును ప్రతి సాధకుడు తనకు తానుగ సాధించుకొన వలసినదే. అట్లు కానిచో యోగ సాధనకు అర్హత లేదు. అదే విధముగ వలసిన భోజనమును భుజింపని వాడు, ఆవశ్యకమగు నిద్రను నిర్జించువాడు కూడ సమతుల్యమును కోల్పోవును. ఇట్టి వాని యందు రజోగుణము మితిమీరును.
దొరికినది తినుట, ఆలస్యముగ నిద్రించుట, ఐదుగంటల కన్న తక్కువ నిద్రించుట, నిద్రపట్టక పోవుట ఇట్టి వన్నియు రజోగుణ దోషములే. దీనివలన శరీరము శుష్కించును. సాధనకు పనికి రాదు. మితి మీరిన పరుగుతో పనులు చేయువారు ఆహారమును, నిద్రను లెక్క చేయరు. వీరును యోగార్హత కోల్పోవుదురు. ప్రస్తుత కాలమున ఆహార వ్యవహార, నిద్రాదులయందు మానవజాతి సమతుల్యమును కోల్పోయినది.
యోగ సాధకుడు సంఘ జీవనమున తనదగు క్రమము నేర్పరచు కొనవలెను. అవసర మగుచో కొన్ని సాంఘిక కార్యములను విసర్జించవలెను. మితిమీరిన పనులు, కార్యములు, కార్యక్రమములు సాధకుని సహజ ప్రశాంతతను హరించును. కావున సాధకుడు విచక్షణతో తనదగు క్రమ శిక్షణను సౌమ్యముగ నేర్పరచుకొనవలెను.
అట్లే ఏకాంతము పేరున సంఘమునకు, కుటుంబమునకు దూరమగుట యోగ సాధనకు పనికిరాదు. అట్లని వారితో మమైకమగుట కూడ సాధన కంతరాయమే. సమతుల్యమే యోగమునకు ప్రధాన సూత్రము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
21 Mar 2021
21-MARCH-2021 MESSAGES
10) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 173🌹
11) 🌹. శివ మహా పురాణము - 373🌹
12) 🌹 Light On The Path - 122🌹
13) 🌹 Seeds Of Consciousness - 320🌹
14) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 195🌹
15) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 50 / Lalitha Sahasra Namavali - 50🌹
16) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 50 / Sri Vishnu Sahasranama - 50🌹
17) వాస్తవానికి దగ్గరగా రండి
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -173 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 16
*🍀 16. సమతుల్య ప్రవర్తన - సమతుల్యమే యోగమునకు ప్రధానము. అతిగా భుజించి నను, అతిగా నిద్రించినను సాధకుని యందు మితిమీరిన తమస్సు ఏర్పడును. దేహము బరువెక్కును. సోమరితనము కలుగును. దానివలన మరపు కలుగును. ఆహారము, పని, నిద్ర విషయము లందు సమతుల్యమును ప్రతి సాధకుడు తనకు తానుగ సాధించుకొన వలసినదే. అట్లు కానిచో యోగ సాధనకు అర్హత లేదు. యోగ సాధకుడు సంఘ జీవనమున తనదగు క్రమము నేర్పరచు కొనవలెను. అవసర మగుచో కొన్ని సాంఘిక కార్యములను విసర్జించవలెను. అట్లే ఏకాంతము పేరున సంఘమునకు, కుటుంబమునకు దూరమగుట యోగ సాధనకు పనికిరాదు. అట్లని వారితో మమైకమగుట కూడ సాధన కంతరాయమే. సమతుల్యమే యోగమునకు ప్రధాన సూత్రము. 🍀*
నాత్యశ్నతస్తు యోగో స్తి న చై కాంత మనశ్నతః |
న చాతిస్వప్న శీలస్య జాగ్రతో నైవ చార్జున || 16
అతిగా భుజించువాడు, అసలు భుజించనివాడు యోగి కాడు. అతిగా మేల్కొని యుండువాడు మరియు అతిగ నిద్రించు వాడు కూడ యోగి కాడు. సమతుల్యమే యోగమునకు ప్రధానము. అతిగా భుజించి నను, అతిగా నిద్రించినను సాధకుని యందు మితిమీరిన తమస్సు ఏర్పడును. దేహము బరువెక్కును. సోమరితనము కలుగును. దానివలన మరపు కలుగును.
చేయవలసిన పనుల యందు అశ్రద్ధ, ఆలస్యము, వైఫల్యము కలుగుచుండును. సామాన్యముగ మానవునకు దినమున ఆరేడు గంటలకన్న నిద్ర అవసరము కలుగదు. రెండుమూడుసార్లు కన్న అన్నపానీయము లావశ్యకత కలుగదు. ఆకలి, దాహము, నిద్ర అతిగా నున్నచో జీవితమే బరువగును. ఇక యోగ మెక్కడ?
తన దేహ పరిస్థితిని తానే గమనించి, తన దేహమునకు సరిపడు ఆహారము తానే తెలుసుకొని భుజింపవలెను. అజీర్తికి తావియ్యరాదు. పగటి నిద్ర నిషిద్ధమని ఆర్యులు తెలుపుదురు. ఎండలు మండు కాలమున మధ్యాహ్నము నిద్రించుట కన్న, ఇరువది ముప్పది నిమిషములు విశ్రాంతి గొనుట మేలు. శరీరమునకు తగిన వ్యాయామము, స్నానాదిక శుచిత్వము, పరిశుద్ధమగు భోజనము, సౌకర్యమును గూర్చు వస్త్రధారణము ప్రధానములు.
నిజమునకు సూర్యరశ్మి, పీల్చు గాలి, నీరు కూడ ఆహారములే. వీనిని దండిగ గొనువారు ప్రాణశక్తిని చక్కగ నార్జించుకొందురు. ఆ మేరకు భోజనమును తగ్గించుకొందురు. ఏది ఎట్లున్నను శరీరమును ఆరోగ్యవంతముగ నుంచుకొనుట, బరువుగ తనకు అని పించకుండుట ముఖ్యము. పరుగున బోవు గుఱ్ఱము వలె చురుకుగ నున్న శరీరము ప్రధానమని తెలియవలెను.
ఆహారము, పని, నిద్ర విషయము లందు సమతుల్యమును ప్రతి సాధకుడు తనకు తానుగ సాధించుకొన వలసినదే. అట్లు కానిచో యోగ సాధనకు అర్హత లేదు. అదే విధముగ వలసిన భోజనమును భుజింపని వాడు, ఆవశ్యకమగు నిద్రను నిర్జించువాడు కూడ సమతుల్యమును కోల్పోవును. ఇట్టి వాని యందు రజోగుణము మితిమీరును.
దొరికినది తినుట, ఆలస్యముగ నిద్రించుట, ఐదుగంటల కన్న తక్కువ నిద్రించుట, నిద్రపట్టక పోవుట ఇట్టి వన్నియు రజోగుణ దోషములే. దీనివలన శరీరము శుష్కించును. సాధనకు పనికి రాదు. మితి మీరిన పరుగుతో పనులు చేయువారు ఆహారమును, నిద్రను లెక్క చేయరు. వీరును యోగార్హత కోల్పోవుదురు. ప్రస్తుత కాలమున ఆహార వ్యవహార, నిద్రాదులయందు మానవజాతి సమతుల్యమును కోల్పోయినది.
యోగ సాధకుడు సంఘ జీవనమున తనదగు క్రమము నేర్పరచు కొనవలెను. అవసర మగుచో కొన్ని సాంఘిక కార్యములను విసర్జించవలెను. మితిమీరిన పనులు, కార్యములు, కార్యక్రమములు సాధకుని సహజ ప్రశాంతతను హరించును. కావున సాధకుడు విచక్షణతో తనదగు క్రమ శిక్షణను సౌమ్యముగ నేర్పరచుకొనవలెను.
అట్లే ఏకాంతము పేరున సంఘమునకు, కుటుంబమునకు దూరమగుట యోగ సాధనకు పనికిరాదు. అట్లని వారితో మమైకమగుట కూడ సాధన కంతరాయమే. సమతుల్యమే యోగమునకు ప్రధాన సూత్రము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, WA, FB Groups 🌹
https://t.me/BhagavadGita_Telugu_English
www.facebook.com/groups/bhagavadgeetha/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 373🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 11
*🌻. హిమవంతునితో శివుని సమాగమము - 1 🌻*
బ్రహ్మ ఇట్లు పలికెను-
లోకములచే పూజింపబడే ఆ శక్తి హిమవంతుని పుత్రికయై ఆయన గృహములో పెరిగి ఎనిమిది సంవత్సరములు వయస్సు గలది అయెను (1). ఓ నారదా! సతీ వియోగ దుఃఖితుడైన శివుడు ఆమె జన్మించిన వృత్తాంతము నెరింగి అంద్భుతమగు ఆమె మూర్తిని తన హృదయుములో ధ్యానించి మిక్కిలి ఆనందించెను (2).
అదే సమయములో లోకాచారము ననుసరించి శంభుడు మనస్సును నియంత్రించి గొప్ప తపస్సును చేయగోరెను (3). ఆయన నంది మొదలగు శాంతస్వభావము గల కొందరు గణములు వెంటరాగా ఉత్తమమగు హిమవత్పర్వత శిఖరమునందున్న గంగావతార క్షేత్రమును చేరుకొనెను (4).
ఓ మహర్షీ! పరమ పావనియగు గంగ సర్వుల పాపసమూహములను నశింప చేయుట కొరకై పూర్వము బ్రహ్మ పురమునుండి జారి ఇచట పడినది (5). జితేంద్రియుడగు శివుడు అచట నుండి తపమునారంభించెను. ఆయన అలసట ఎరుంగని వాడై ఆత్మస్వరూపమును ఏకాగ్రతతో ధ్యానించెను (6).
నిత్యము, జ్యోతిస్స్వరూపము, నిర్దోషము, చిదానందఘనము, అద్వయము, సర్వాశ్రయము అగు అత్మ మనస్సులో అఖండ ధీరూపముగా గోచరించును. ఆత్మయే జగద్రూపముగా పరిణమించినది(7). శివుడు ధ్యానములో నిమగ్నుడై యుండగా, నంది, భృంగి మొదలగు కొందరు ప్రమథ గణములు కూడా ధ్యానమను చేయ మొదలిడిరి (8).
అపుడు కొందరు గణములు శంభు పరమాత్ముని సేవను చేసిరి. మరి కొందరు శబ్దమును చేయకుండగా మౌనముగా ద్వార పాలురై నిలబడిరి(9). ఇంతలో ఔషధిప్రస్థములో శివుని రాకను గురించి విని హిమవంతుడు ఆదరముతో అచటకు విచ్చేసెను(10). గణములతో కూడియున్న ఆ పర్వతరాజు రుద్ర ప్రభువునకు చేతులొగ్గి నమస్కరించి ప్రేమతో పూజించి స్తుతించెను(11).
హిమాలయుడిట్లు పలికెను-
దేవ దేవా! మహాదేవా! జటాజూట ధారీ! శంకరా! ప్రభో! లోకనాథుడవగు నీవీ ముల్లోకములను పాలించుచున్నావు(12). హే దేవదేవా! ఈశ్వరా! యోగి రూపమును ధరించిన నీకు నమస్కారము. నిర్గుణుడవయ్యు సగుణుడవై విహరించు నీకు నమస్కారము (13).
హే శంభో! కైలాసవాసి అయ్యు సర్వలోకములను సంచరించునట్టియు, లీలచే ఆకారమును స్వీకరించి శూలధారివగు నీకు నమస్కారము. నీవు పరమేశ్వరుడు (14). నీవు సకలగుణ నిధానమవు. వికారములు లేనట్టియు, కామనలు లేనట్టియు, విశిష్టమగు సంకల్ప శక్తి కలిగినట్టియు, జ్ఞానఘనుడైనట్టియు, పరమాత్మవగు నీకు నమస్కారము (15).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 LIGHT ON THE PATH - 122 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj
CHAPTER 8 - THE 20th RULE
*🌻 20. Seek it not by any one road. - 15 🌻*
463. A division may be made for purposes of classification, by taking the laws of nature as covering the world of phenomena, the world of observation, the laws of super-nature as those of the higher manas and buddhi, and the laws of being as those of the real existence of nirvana. By the laws of nature we then mean the laws which work on the physical and astral planes and the rupa sub-planes of manas.
464. The laws that are above these, but below those of “being”, may be called the laws of supernature. This includes both the arupa planes of manas and the buddhic plane. That is the region where life expresses itself more than form, where matter is subordinated to life, altering at every moment.
There is nothing there to represent a definitely outlined entity. The entity changes form with every change of thought; matter is an instrument of his life and is no expression of himself; the form is made momentarily – it changes with every change of his life. This is true on the arupa plane of manas, and also in a subtle way on the buddhic plane.
It is true also of the spiritual ego, which is buddhi plus the manasic aspect of the One, which was drawn up into buddhi when the causal vehicle was cast aside. That state is called by Christian mystics that of spiritual illumination; it is the stage of the Arhat, of the Christ in man.
465. The word supernatural is commonly used to cover anything that cannot be explained by the common experience of the- world. Anything that appears irregular or out of accord with the laws of nature has been so ticketed, much to the confusion of thoughtful people.
There is a wide-spread revolt in the world against all that is called supernatural; people feel that there cannot be anything supernatural, because there is no irregularity or disorder in nature, no region where law does not exist. The law is working everywhere and it is one. “As above, so below” is the universal truth.
One nature is expressing itself in different ways, but is itself the same always. But when we come to what is here called supernatural, we arrive at a state beyond all that can be touched by the senses – even using the term in its fullest meaning. We pass altogether beyond everything which is phenomenal, into the spiritual worlds themselves.
466. The plane of atma, beyond that, is nirvana, the region of being, where all is reality, where true consciousness resides. We are to seek this way by study of our inmost being. Not until we can reach the nirvanic plane in higher meditation can we get a touch of true atmic consciousness; but it may be sought for.
We begin to search for it by trying to realize its existence. Think of it as in a region where all is reality, where all limitations have vanished, where unity is recognized. In meditation try to imagine it, try to figure it to yourself. You can only do so by a series of negatives.
You think: “Is it phenomenal? It is not so. Is it intellectual? It is not so.” You seek it by eliminating what it is not. You then say: “It is not a thing that the senses can perceive; it is not what the intelligence can imagine; it is not found even by the illuminated intelligence, with its vast extent,” and so on.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/
https://t.me/Seeds_Of_Consciousness
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Seeds Of Consciousness - 320 🌹*
✍️ Nisargadatta Maharaj
Nisargadatta Gita
📚. Prasad Bharadwaj
*🌻 169. The 'I am' is without ego, you can become its watcher only by getting established in it. 🌻*
When you are established in the 'Turiya' or the fourth state, there is nothing else except the 'I am'. It is the 'I am' in its utmost purity with no add-ons at all, as a result there is no ego either. Ego comes with the verbal 'I am', when you say 'I am so-and-so living in this world'.
With all this gone there is nothing but the 'I am' only; without words, the ego disappears. By getting established in the 'Turiya' or the fourth state you become its watcher and stand apart from it.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #SeedsofConsciousness #Nisargadatta
Join and Share
🌹. Daily satsang Wisdom 🌹
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 195 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - నాల్గవ దివ్య యానము - సద్గురువు -అవతార పురుషుడు. -9 🌻*
726. అవతార పురుషుడు, సద్గురువు ఎందుకు మహిమలు ప్రదర్శింతురు?
ఆధ్యాత్మిక విలువల యందు తమకు గల సంపూర్ణ జ్ఞానం వలన, ప్రజలకు హాని జరుగకుండా వారిని రక్షించుటకై మహిమలను ప్రదర్శింతురు.
727. సద్గురువులు ఉన్నవి ఉన్నట్లుగనే కనిపించునట్లు చేయుచూ, ఇదివరకే యున్న మాయాతెరను చీల్చివైచి సత్యమును చూపింతురు .సృష్టి ,భావనా మాత్రమే యనియు గ్రహింప జేయుదురు.
728. సద్గురువుల శక్తులు స్వయంశక్తులు.ఎందుచేత?తామే అనంతశక్తి స్వరూపులు గనుక.యోగులు అట్లుగాక, శక్తులను అప్పుగొని వాటిద్వారా మహిమలు చేయుదురు.
729. తురీయ అవస్త యందున్న జీవన్ముక్తునకు అధికారము లేదు. కాబట్టి మహిమలు ప్రదర్శించడు.కానీ అతనికి తెలియకనే అతని ద్వారా మహిమలు జరుగు అవకాశం లేకపోలేదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
Join and share
Meher Baba అవతార్ మెహర్ బాబా
www.facebook.com/groups/avataarmeherbaba/
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 50 / Sri Lalita Sahasranamavali - Meaning - 50 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 50. నిస్తులా, నీలచికురా, నిరపాయా, నిరత్యయా ।*
*దుర్లభా, దుర్గమా, దుర్గా, దుఃఖహంత్రీ, సుఖప్రదా ॥ 50 ॥ 🍀*
🍀 184. నిస్తులా -
సాటి లేనిది.
🍀 185. నీలచికురా -
చిక్కని, చక్కని, నల్లని, ముంగురులు గలది.
🍀 186. నిరపాయా -
అపాయములు లేనిది.
🍀 187. నిరత్యయా -
అతిక్రమింప వీలులేనిది.
🍀 188. దుర్లభా -
పొందశక్యము కానిది.
🍀 189. దుర్గమా -
గమింప శక్యము గానిది.
🍀 190. దుర్గా -
దుర్గాదేవి.
🍀 191. దుఃఖహంత్రీ -
దుఃఖములను తొలగించునది.
🍀 192. సుఖప్రదా -
సుఖములను ఇచ్చునది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 50 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 50. nistulā nīlacikurā nirapāyā niratyayā |*
*durlabhā durgamā durgā duḥkhahantrī sukhapradā || 50 || 🌻*
🌻 184 ) Nisthula -
She who does not have anything to be compared to
🌻 185 ) Neela chikura -
She who has dark black hair
🌻 186 ) Nirapaya -
She who is never destroyed
🌻 187 ) Nirathyaya -
She who does not cross limits of rules she herself created
🌻 188 ) Dhurlabha -
She who is difficult to obtain
🌻 189 ) Dhurgama -
She who can not be neared easily
🌻 190 ) Dhurga -
She who is Dhurga who is a nine year old girl
🌻 191 ) Dhuka hanthri -
She who removes sorrows
🌻 192 ) Sukha prada -
She who gives pleasures and happiness
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/SriMataChaitanyam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 50 / Sri Vishnu Sahasra Namavali - 50 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*
*కన్యా రాశి- హస్త నక్షత్రం 2వ పాద శ్లోకం*
*🌻 50. స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్|*
*వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశరః|| 🌻*
🍀 465) స్వాపన: -
తన మాయచేత ప్రాణులను ఆత్మజ్ఞాన రహితులుగాజేసి నిద్రపుచ్చువాడు.
🍀 466) స్వవశ: -
సర్వ స్వతంత్రమైనవాడు.
🍀 467) వ్యాపీ -
సర్వత్ర వ్యాపించియున్నవాడు.
🍀 468) నైకాత్మా -
అనేక రూపములలో విరాజిల్లువాడు.
🍀 469) నైక కర్మకృత్ -
సృష్టి, స్థితి, లయము మున్నగు అనేక కార్యములు చేయువాడు.
🍀 470) వత్సర: -
సర్వులకు వాసమైనవాడు.
🍀 471) వత్సల: -
భక్తులపై అపరిమిత వాత్సల్యము కలవాడు.
🍀 472) వత్సీ -
తండ్రి వంటివాడు.
🍀 473) రత్నగర్భ: -
సాగరము వలె తన గర్భమున రత్నములు గలవాడు.
🍀 474) ధనేశ్వర: -
ధనములకు ప్రభువు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Vishnu Sahasra Namavali - 49 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*
*Sloka for Kanya Rasi, Hasta 2nd Padam*
*🌻 50. svāpanassvavaśō vyāpī naikātmā naikakarmakṛt |*
*vatsarō vatsalō vatsī ratnagarbhō dhaneśvaraḥ || 50 || 🌻*
🌻 465. Svāpanaḥ:
One who enfolds the Jivas in the sleep of Ajnana.
🌻 466. Svavaśaḥ:
One who is dominated by oneself and not anything else, as He is the cause of the whole cosmic process.
🌻 467. Vyāpī:
One who interpenetrates everything like Akasha.
🌻 468. Naikātmā:
One who manifests in different forms as the subsidiary agencies causing the various cosmic processes.
🌻 469. Naikakarmakṛt:
One who engages in innumerable activities in the process of creation, sustentation, etc.
🌻 470. Vatsaraḥ:
One in whom everything dwells.
🌻 471. Vatsalaḥ:
One who has love for His devotees.
🌻 472. Vatsī:
One who protects those who are dear to Him.
🌻 473. Ratnagarbhaḥ:
The Ocean is so called because gems are found in its depths. As the Lord has taken the form of the ocean, He is called by this name.
🌻 474. Dhaneśvaraḥ:
One who is the Lord of all wealth.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
https://t.me/vishnusahasra
www.facebook.com/groups/vishnusahasranam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. వాస్తవానికి దగ్గరగా రండి! 🌹
✍️ - యుగఋషి పండిత శ్రీరామశర్మ ఆచార్య
🙏. ప్రసాద్ భరద్వాజ
"తీర్థయాత్రలు చేసి నదులలో మునకలు వేయడం తప్పనిసరేమీ కాదు. జపం చేయడం, పంచామృతం సేవించడం, మందిరంలోకి వెళ్ళడం వంటివి అంత ఆవశ్యకమైనవేమీ కావు. కానీ అసలైన విషయం ఇది... మీరే ఆలోచించండి. పిల్లిమెడలో గంట కట్టాలంటే కట్టండి, కానీ వాస్తవానికి దగ్గరగా రండి! మీరు కొద్దిగా త్యాగం చేయవలసివస్తే చేయండి. సేవ చేయవలసిన అవసరం ఉంటే ఆలోచించండి. మనసును ఉదారంగా ఉంచవలసివస్తే ఉంచండి.. కొద్దిగా ఇబ్బంది అనిపిస్తే భరించండి.. కొద్దిగా శ్రమ చేయండి... ఏదైనా సరే మీరు చేసి చూపించండి.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఆధ్యాత్మికసందేశాలు #భక్తిసందేశాలు
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
వాస్తవానికి దగ్గరగా రండి!
🌹. వాస్తవానికి దగ్గరగా రండి! 🌹
✍️ - యుగఋషి పండిత శ్రీరామశర్మ ఆచార్య
🙏. ప్రసాద్ భరద్వాజ
"తీర్థయాత్రలు చేసి నదులలో మునకలు వేయడం తప్పనిసరేమీ కాదు. జపం చేయడం, పంచామృతం సేవించడం, మందిరంలోకి వెళ్ళడం వంటివి అంత ఆవశ్యకమైనవేమీ కావు. కానీ అసలైన విషయం ఇది... మీరే ఆలోచించండి. పిల్లిమెడలో గంట కట్టాలంటే కట్టండి, కానీ వాస్తవానికి దగ్గరగా రండి! మీరు కొద్దిగా త్యాగం చేయవలసివస్తే చేయండి. సేవ చేయవలసిన అవసరం ఉంటే ఆలోచించండి. మనసును ఉదారంగా ఉంచవలసివస్తే ఉంచండి.. కొద్దిగా ఇబ్బంది అనిపిస్తే భరించండి.. కొద్దిగా శ్రమ చేయండి... ఏదైనా సరే మీరు చేసి చూపించండి.
🌹 🌹 🌹 🌹 🌹
20 Mar 2021
శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 238 / Sri Lalitha Chaitanya Vijnanam - 238
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 238 / Sri Lalitha Chaitanya Vijnanam - 238 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము
🍀 59. మనువిద్యా, చంద్రవిద్యా, చంద్రమండలమధ్యగా ।
చారురూపా, చారుహాసా, చారుచంద్ర కళాధరా ॥ 59 ॥🍀
🌻238. 'మనువిద్యా' 🌻
మనువిద్యా స్వరూపిణి శ్రీదేవి అని అర్థము. మనువుల యందు భాసించు విద్య శ్రీదేవియే. సర్వ విద్యలు ఆమె నుండియే భాసించును. ప్రత్యేకముగ మనువిద్యా స్వరూపిణి యనుటలో మనువు ప్రాధాన్యత తెలియనగును. మను తత్త్వము పదునాలుగు విధములుగ, పదునాలుగు మనువులుగ తెలియవలెను. పదునాలుగు మనువుల తత్త్వమే పదునాలుగు తిథులుగ తెలియ వలెను.
పౌర్ణమి పూర్ణ స్థితి; అమావాస్య శూన్య స్థితి. ఈ రెంటి నడుమ పదునాలుగు తిథులున్నవి. పదునాలుగు తిథులకు, పదు నాలుగు మనువులకు, పదునాలుగు మన్వంతరములకు సామ్యము తెలియవలెను. శుక్ల, కృష్ణ పక్షములుగ ఆరోహణ, అవరోహణ క్రమము లున్నవి. ఈ తిథులకు వెలుగు నీడ లున్నవి. ఇందు అష్టమి తిథి ఒక ప్రశస్థమైన తిథి, ఈ తిథి యోగసిద్ధిని కలిగించ గలదు.
ఈ తిథి యందు వెలుగు నీడలు సమభావము పొందును. ఈ తిధి అర్ధనారీశ్వర యోగ తత్త్వమును ప్రకటింపజేయును. శ్రీదుర్గ, శ్రీకృష్ణుడు అష్టమి యందు పుట్టుటలో గల రహస్యార్థ మిదియే. వారియందు వెలుగు నీడలు సమభావము చెందును. జ్ఞానము, అజ్ఞానము, దేవతలు, అసురులు, ఉత్తమము, అథమము, మంచి, చెడు అన్నిటిని వారు తమయందు లయము చేసుకొనగలరు. అందరికిని తగు విధమగు ఉర్దారణము కల్పింపగలరు.
కృష్ణ పక్షమున మొదటి ఏడు తిథులలో వెలుగు పెరుగుచు నుండును. అష్టమి నాటికి వెలుగు, నీడ సమ మగును. ఈ ఏడు తిథులును పౌర్ణమి తరువాతి ఏడు తిథులతో సామ్యము చెందును.
ఈ సామ్యము విలోమానుసారము తెలియవచ్చును. అట్లే శుక్ల పక్షపు నవమి నుండి పౌర్ణమి వఱకు కల ఏడు తిథులు పౌర్ణమి నుండి తరువాత కలుగు ఏడు తిథులలో విలోమానుసారము సామ్యము చెందును.
ఉదాహరణకు శుక్ల చతుర్దశి యందు ఎంత వెలుగు వుండునో కృష్ణ పాడ్యమి నందు అంతే వెలుగు వుండును. బుద్ధి మంతులు దీనిని గ్రహింపగలరు. ఇట్లు సామ్యమును గూర్చినచో ఏడు తిథులే పదునాలుగుగ గోచరించును. అందువలన నిజమునకు మనువు లేడుగురే. మిగిలిన వారిని సావర్ణి మనువు లందురు.
వీని ననుసరించియే వారమునకు దినము లేడుగను, రెండు వారములొక పక్షముగను, రెండు పక్షములొక మాసముగను, నాలుగు పక్షములు ఒక ఋతువుగను, ఆరు పక్షము లొక సంవత్సర పాదముగను, 12 పక్షములు ఒక అయనముగను, 24 పక్షములు ఒక సంవత్సరముగను వర్తించు చున్నది.
మనువిద్యా రహస్యములు అత్యంత గంభీరములు. జీవుల అవతరణము, ఉద్గారణము మన్వంతర కథలుగ వివరింపబడినవి. ఇది ఒక విస్తారమగు విద్య. ప్రతి మాసమునందు మనలను స్పృశించు మను స్పర్శను ప్రథమముగ పొందినచో మనువిద్యా ప్రాథమిక విద్యాలయమున ప్రవేశము కలుగును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 238 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Manu-vidyā मनु-विद्या (238) 🌻
Vidya means Śrī Vidya, the ritual worship of Śrī Cakra. The base of Śrī Vidya worship is Pañcadaśī mantra. There are twelve types of Pañcadaśī mantra introduced by Manu, Kubera (the god of wealth), Chandra (moon), Lopāmudrā (wife of sage Agastya), Agastya, Manmatha (the god of love), Agni (the fire god), Surya (sun), Indra (chief of gods), Skanda (Lord Kārttikeya, son of Śiva and Pārvatī, also known as Subrahmaṇya), Śiva (Her consort) and Durvāsa.
The basic mantra in all the twelve remains the same. In this Sahasranāma all these names are referred and the first of such reference is this nāma. This nāma refers to the worship done by Manu.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
19 Mar 2021
ఆనందించే వారు మాత్రమే సృజనాత్మకులవుతారు.
🌹. ఆనందించే వారు మాత్రమే సృజనాత్మకులవుతారు. 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
✍️. భరత్,
📚. ప్రసాద్ భరద్వాజ
స్వేచ్ఛ మీ జీవితంలో ఒక సృజనాత్మక శక్తిగా మారాలి. అంతే కానీ, అది మీ జీవితానికి ప్రతికూలంగా ఉండకూడదు. ఇప్పుడు మీరు జైలులో లేరని, అంతా పోగొట్టుకుని ఆకాశం కింద స్వేచ్ఛగా నిలబడ్డారని తెలుసుకున్నారు.
బందీ ఎప్పుడూ బందీగా ఉండాలనే కోరుకుంటాడు. బహుశా ఈ సత్యాన్ని ఇంతకు ముందెప్పుడూ మీరు తెలుసుకుని ఉండరు. ఎందుకంటే, వాడికి ఎలాంటి బాధ్యత ఉండదు. ఏదీ సృష్టించే పని ఉండదు. వాడికి కావలసినవన్నీ ఇతరులే సమకూరుస్తూ ఉంటారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా అనేక లక్షల మంది జనాలు కులానికో, మతానికో, వర్ణానికో, తెగకో, దేశానికో, సంప్రదాయానికో బందీలుగా ఉండాలనే కోరుకుంటారు.
ఎందుకంటే, ఎలాంటి బాధ్యత స్వీకరించకుండానే వారికి కావలసినవన్నీ ఇతరుల ద్వారా జరిగిపోతూ ఉంటాయి. అందుకే వారు జీవితాంతం ఆ బందిఖానాలను భరిస్తూనే ఉంటారు. కాబట్టి, స్వేచ్ఛకు సంబంధించినంత వరకు ‘‘స్వేచ్ఛ, బాధ్యతలు కలిసే ప్రయాణిస్తాయి’ ’అనే మౌలిక విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. బాధ్యత వద్దనుకుంటే మీకు స్వేచ్ఛ దక్కదు. అవి రెండు కలిస్తే వస్తాయి, కలిసే పోతాయి.
మీరు బాధ్యతను వదిలించు కోవాలనుకుంటే ఏదో విధంగా మీరు బానిసత్వాన్ని అంగీకరించ వలసిందే. తరువాత వచ్చే బృహత్తర బాధ్యత గురించి ఏమాత్రం ఆలోచించకుండా స్వేచ్ఛ గురించి ఇప్పటి వరకు మీరు కలలు కన్నారు. ఇప్పుడు మీకు స్వేచ్ఛ దక్కింది. కానీ, మీరు ఇంతవరకు మీ బాధ్యతను నిర్వర్తించలేదు. అందుకే బాధ మిమ్మల్ని వెంటాడుతోంది. దానిని మీరు నాశనం చెయ్యగలరు.
బానిసత్వం నుంచి మీరు బయట పడగలిగితే కచ్చితంగా మీరు సృజనాత్మకులవుతారు. మీ జైళ్ళను మీరు ధ్వంసం చెయ్యగలిగితే కచ్చితంగా మీరు ఎంతో కొంత అందమైన దానిని సృష్టించగలుగుతారు. ఏదో విధంగా మీరు సృజనాత్మకులు కాకపోతే మీ జీవితం శూన్యంగానే మిగిలిపోతుంది. అప్పుడు మీకు బాధ తప్పదు. ఇది నేను అనుభవ పూర్వకంగా తెలుసుకున్న సత్యం.
ఆనందించే వారు మాత్రమే సృజనాత్మకులవుతారు. అది మరింత చైతన్యమో మరింత సత్యానుభవమో, మరింత ఆనందమో సృష్టించడం కావచ్చు లేదా బాహ్య, అంతర్గత ప్రపంచాల సృజనాత్మకత కావచ్చు. ఏదేమైనా స్వేచ్ఛ ఒక బాధ్యతగా, సానుకూలంగా మారాలి.
మీకు దక్కిన స్వేచ్ఛ ఇంకా ప్రతికూలంగానే ఉంది. మీరు బందిఖానా నుంచి బయటపడడం మంచిదే. కానీ, అది చాలదు. ఇప్పుడు మీ కూడు, గుడ్డ మీరే సంపాదించు కోవాలి. ఇంతవరకు, జైలు అధికారులే వాటిని మీకు సమకూర్చారు. అనేక మంది చర్చిలు, సినగాగులు, దేవాలయాలకు సంబంధించిన వారే. దాదాపు అందరూ ఏదో ఒక మతం, దేశం, కుటుంబం, సంఘం, రాజకీయ పక్షం, రోటరీ లేదా లయన్స్‌క్లబ్‌లలో సభ్యులే. అలా తమని తాము బంధించు కునేందుకు ఎవరికివారే సంకెళ్ళు వెతుక్కుంటారు.
ఎందుకంటే, మీకు ఎలాంటి బాధ్యత ఉండదు. అయినా మీకు పూర్తిరక్షణ ఉంటుంది. అందుకే అలాంటి జైళ్ళలో మీకు హాయిగానే ఉంటుంది. అదే స్వేచ్ఛ విషయంలో అయితే మీరు ఏ పని చేసినా, చెయ్యక పోయినా ప్రతి విషయంలోనూ చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. అందరూ స్వేచ్ఛ గురించి మాట్లాడేవారే. కానీ, నిజానికి, అదంటే అందరికీ భయమే. అందుకే అందరూ సుఖమైన జైలులో హాయిగా ఉండేందుకే సిద్ధపడతారు.
నా అనుభవం మేరకు చాలా కొద్ది మంది మాత్రమే నిజంగా స్వేచ్ఛను కోరుకుంటారు. ఎందుకంటే, స్వేచ్ఛ వల్ల ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా లేమన్న సత్యం వారికి చాలా స్పష్టంగా తెలుసు. మీకున్న స్వేచ్ఛతో మీరు ఏదో ఒకటి చెయ్యడమే దానికి ప్రత్యామ్నాయం.
- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
19 Mar 2021
వివేక చూడామణి - 48 / Viveka Chudamani - 48
🌹. వివేక చూడామణి - 48 / Viveka Chudamani - 48 🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 15. మనస్సు - 2 🍀
171. కలలులేని నిద్రలో మనస్సు పనిచేయనందు వలన నిద్రించుచున్న వ్యక్తి ఏమి అనుభవించుట లేదు. అందువలన మనిషి యొక్క అనుభవాలు, అనుభూతులన్ని మనస్సు యొక్క సృష్టి మాత్రమే. ఏవిధమైన వస్తువు యొక్క సత్యతలేదు.
172. మేఘాలు గాలుల వలననే వస్తుంటాయి, పోతుంటాయి. అదే విధముగా మనిషికి బంధనాలు మనస్సు వలననే ఏర్పడతాయి. మరియు ఆ బంధనాలు మనస్సు వలననే వదలిపోతాయి.
173. ఈ మనస్సు మొదట మనిషిని శరీరమునకు బందీని చేసి క్రమముగా జ్ఞానేంద్రియాలు, మనస్సు యొక్క వశమై తద్వారా బందిపబడతాయి. ఎలానంటే ఒక జంతువు దొరికినపుడు వేటగాడు దానిని తాడుతో బందించినట్లు. తరువాత ఆత్మ మనస్సు ద్వారా జ్ఞానేంద్రియాలను, వస్తుసముదాయమును విషపూరితమని తెలియజేసి వాటిని బంధనాల నుండి విడుదల అవుతుంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 48 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 The Mind - 2 🌻
171. In dreamless sleep, when the mind is reduced to its causal state, there exists nothing (for the person asleep), as is evident from universal experience. Hence man’s relative existence is simply the creation of his mind, and has no objective reality.
172. Clouds are brought in by the wind and again driven away by the same agency. Similarly, man’s bondage is caused by the mind, and Liberation too is caused by that alone.
173. It (first) creates an attachment in man for the body and all other sense-objects, and binds him through that attachment like a beast by means of ropes. Afterwards, the selfsame mind creates in the individual an utter distaste for these sense-objects as if they were poison, and frees him from the bondage.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
19 Mar 2021
దేవాపి మహర్షి బోధనలు - 59
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 40. కర్మ స్వరూపము 🌻
సత్సంకల్పములు కలిగినప్పటికిని అవి కార్యరూపము దాల్చుట అరుదు. కార్యరూపము దాల్చినను పరిపూర్తియగుట ఇంకను అరుదు. దానికి కారణము సంకల్పమున శ్రద్ధ ఒకటికాగ, రెండవది వ్యక్తిగత స్వభావము. వ్యక్తిగత స్వభావమును ఎప్పటికప్పుడు పరిశీలించు కొనుచుండ వలెను. పూర్వకర్మ కారణముగ స్వభావము శుభ, అశుభ మిశ్రమమై యుండును.
శుభ వాసనలను పెంచుకొను చుండుటచే అశుభ వాసనలు బలహీనపడి నశించును. ఇదియే సత్సాధన! కర్మ వ్యక్తిగతమే కాక సామూహికము కూడ. కుటుంబ కర్మ, కులకర్మ, ప్రాంతీయ కర్మ, దేశీయ కర్మ, జాతికర్మ మరియు భౌగోళిక కర్మగా యుండును. అందుచే బద్ధజీవనము కొంత తప్పదు.
కాని సాధకునకు తన వ్యక్తిగత కర్మను సరిచేసుకొనుట ఒక్కటియే కర్తవ్యము. పై విధముగ వ్యక్తిగత కర్మనుండి విముక్తుడు కావలెనన్నచో నిష్కామ కర్మ యోగమే మార్గము. వేరొక మార్గము లేదు. ఈ యోగ మార్గమునకు త్యాగమును జోడించినచో త్వరితగతిని గమ్యమును చేరగలడు. ప్రస్తుత మెప్పుడును కాలగర్భములోనికి కలిసిపోవు చుండును గనుక పై సూత్రముల నాశ్రయించి భవిష్యత్తును తీర్చిదిద్దు కొనుము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
19 Mar 2021
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 342, 343 / Vishnu Sahasranama Contemplation - 342, 343
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 342 / Vishnu Sahasranama Contemplation - 342 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻342. అనుకూలః, अनुकूलः, Anukūlaḥ🌻
ఓం అనుకూలాయ నమః | ॐ अनुकूलाय नमः | OM Anukūlāya namaḥ
అనుకూలః, अनुकूलः, Anukūlaḥ
ఆత్మత్వేన హి సర్వేషా మనుకూల ఇతీర్యతే ।
న హి స్వస్మిన్ ప్రాతికూల్యం కశ్చన స్వయమాచరేత్ ॥
ఎల్ల ప్రాణులకును తానే ఆత్మ కావున, అతడు ఎల్ల ప్రాణులకును అనుకూలుడు. ఏలయన ఎవ్వడును తన విషయమున ప్రతికూలమగు పనిని తానే చేయడు గదా!
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 342🌹
📚. Prasad Bharadwaj
Ātmatvena hi sarveṣā manukūla itīryate,
Na hi svasmin prātikūlyaṃ kaścana svayamācaret.
आत्मत्वेन हि सर्वेषा मनुकूल इतीर्यते ।
न हि स्वस्मिन् प्रातिकूल्यं कश्चन स्वयमाचरेत् ॥
One who, being the Ātma or soul of all beings, is favourable to all; for no one will act against oneself.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अशोकस्तारणस्तारः शूरश्शौरिर्जनेश्वरः ।अनुकूलश्शतावर्तः पद्मी पद्मनिभेक्षणः ॥ ३७ ॥
అశోకస్తారణస్తారః శూరశ్శౌరిర్జనేశ్వరః ।అనుకూలశ్శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః ॥ ౩౭ ॥
Aśokastāraṇastāraḥ śūraśśaurirjaneśvaraḥ ।Anukūlaśśatāvartaḥ padmī padmanibhekṣaṇaḥ ॥ 37 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 343 / Vishnu Sahasranama Contemplation - 343🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 343. శతావర్తః, शतावर्तः, Śatāvartaḥ🌻
ఓం శతావర్తాయ నమః | ॐ शतावर्ताय नमः | OM Śatāvartāya namaḥ
ధర్మత్రాణాయ శతమావర్తనాన్యస్య సంతి యత్ ।
ప్రాదుర్భావాస్తతో విష్ణుః శరవర్తా ఇతీర్యతే ।
ప్రాణరూపేణ యో నాడిఃశతావర్తస్స ఇత్యుతః ॥
ధర్మ రక్షణకై నూర్లకొద్దీ ఆవర్తనములు అనగా పునః పునః ప్రాదుర్భావములు ఈతనికి కలవు. లేదా వందలకొలదీ నాడులయందు ప్రాణ తత్త్వ రూపమున ఆవర్తించుచుండును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 343🌹
📚. Prasad Bharadwaj
🌻343. Śatāvartaḥ🌻
OM Śatāvartāya namaḥ
Dharmatrāṇāya śatamāvartanānyasya saṃti yat,
Prādurbhāvāstato viṣṇuḥ śaravartā itīryate,
Prāṇarūpeṇa yo nāḍiḥśatāvartassa ityutaḥ.
धर्मत्राणाय शतमावर्तनान्यस्य संति यत् ।
प्रादुर्भावास्ततो विष्णुः शरवर्ता इतीर्यते ।
प्राणरूपेण यो नाडिःशतावर्तस्स इत्युतः ॥
His coming to be, incarnation, for upholding Dharma or righteousness is on innumerable occasions. Or He is in hundreds of nerves in the form of prāna or life.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अशोकस्तारणस्तारः शूरश्शौरिर्जनेश्वरः ।अनुकूलश्शतावर्तः पद्मी पद्मनिभेक्षणः ॥ ३७ ॥
అశోకస్తారణస్తారః శూరశ్శౌరిర్జనేశ్వరః ।అనుకూలశ్శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః ॥ ౩౭ ॥
Aśokastāraṇastāraḥ śūraśśaurirjaneśvaraḥ ।Anukūlaśśatāvartaḥ padmī padmanibhekṣaṇaḥ ॥ 37 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
19 Mar 2021
Subscribe to:
Posts (Atom)