19 - MAY - 2022 గురువారం, బృహస్పతి వాసరే MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 19, గురువారం, మే 2022 బృహస్పతి వాసరే 🌹
🌹 కపిల గీత - 10 / Kapila Gita - 10🌹
2) 🌹. శివ మహా పురాణము - 566 / Siva Maha Purana - 566🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 50 / Agni Maha Purana - 50🌹
4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 185 / Osho Daily Meditations - 185🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 372-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 372-2 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ గురువారం మిత్రులందరికీ 🌹*
*బృహస్పతి వాసరే, 19, మే 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : సంకష్టి చతుర్థి, Sankashti Chaturthi 🌻*

*🍀. దక్షిణామూర్తి స్తోత్రము - 5 🍀*

*దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః*
*స్త్రీబాలాంధజడోపమాస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః*
*మాయాశక్తివిలాసకల్పితమహా వ్యామోహసంహారిణే*
*తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే*

*తాత్పర్యము: కొంత మంది తత్త్వవేత్తలు శరీరము, ఇంద్రియములు, ప్రాణము, శ్వాస మరియు శూన్యమును ఆత్మగా వాదిస్తున్నారు. అది జ్ఞానము లేని స్త్రీలు, పిల్లలు, గుడ్డివారు, బలహీనుల వాదన కన్నా లోకువైనది. మాయ వలన కలిగే భ్రాంతిని తొలగించి సత్యమును తెలియచేసే, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : దివ్యాత్మలు ఎవరితోనైనా సంబంధం పెట్టుకునే ముందు, తమ శక్తి-కాలము వారి యందు వెచ్చించే ముందు ఆ వ్యక్తిని పూర్తిగా పరిక్షిస్తారు. - సద్గురు శ్రీరామశర్మ 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, వైశాఖ మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిథి: కృష్ణ చవితి 20:25:03 వరకు
తదుపరి కృష్ణ పంచమి
నక్షత్రం: పూర్వాషాఢ 27:18:12 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
యోగం: సద్య 14:57:33 వరకు తదుపరి శుభ
కరణం: బవ 10:00:35 వరకు
వర్జ్యం: 14:17:24 - 15:44:08
దుర్ముహూర్తం: 10:02:44 - 10:54:40
మరియు 15:14:26 - 16:06:23
రాహు కాలం: 13:50:00 - 15:27:25
గుళిక కాలం: 08:57:47 - 10:35:12
యమ గండం: 05:42:59 - 07:20:23
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:37
అమృత కాలం: 22:57:48 - 24:24:32
సూర్యోదయం: 05:42:59
సూర్యాస్తమయం: 18:42:13
చంద్రోదయం: 22:23:17
చంద్రాస్తమయం: 08:33:19
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
ధాత్రి యోగం - కార్య జయం 27:18:12
వరకు తదుపరి సౌమ్య యోగం 
- సర్వ సౌఖ్యం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 10 / Kapila Gita - 10🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴. అతీంద్రియ జ్ఞానాన్ని కోరుకున్న దేవహూతి - 4 🌴*

*10. అథ మే దేవ సమ్మోహమపాక్రష్టుం త్వమర్హసి*
*యోऽవగ్రహోऽహం మమేతీత్యేతస్మిన్యోజితస్త్వయా*

*నాలో ఉన్న సమోహాన్ని ( చక్కని మోహాన్ని) తొలగించాలి. వర్షం రాకుండా ఆపే పాపాన్ని అవగ్రహం అంటారు. అలాగే నేనూ నాది అనే అవగ్రహాన్ని నీవు పోగొట్టాలి . ఎందుకంటే ఇది నువ్వేర్పరచినదే కదా.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 10 🌹*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*

*🌴 Devahuti Desires Transcendental Knowledge - 4 🌴*

*10. atha me deva sammoham apakrastum tvam arhasi*
*yo 'vagraho 'ham mametity etasmin yojitas tvaya*

*Now be pleased, my Lord, to dispel my great delusion. Due to my feeling of false ego, I have been engaged by Your maya and have identified myself with the body and consequent bodily relations.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#కపిలగీత #KapilaGita
#కపిలగీతKapilaGita
 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 566 / Sri Siva Maha Purana - 566 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 54 🌴*

*🌻. పతివ్రతా ధర్మములు - 4 🌻*

స్నానము చేసిన తరువాత భర్త ముఖమునే చూడవలెను. ఇతరుల ముఖమును చూడరాదు. భర్త దగ్గర లేనిచో, భర్తను మనస్సులో ధ్యానించి సూర్యుని చూడవలెను (33). భర్త యొక్క ఆయుష్షును గోరు పతివ్రత పసుపును, కుంకుమను, సిందూరమును, కాటుకను, తాంబూలమును, మంగళసూత్రమును, ఆభరణములను, రవికెను, కేశసంస్కారమును, కేశాభరణములను, చేతులకు గాజులను, కర్ణాభరణములను, ఇటువంటి ఇతర ఆభరణములను విడనాడరాదు (34, 35). చాకలితో, కులటతో, సన్న్యాసినితో మరియు భాగ్యహీనురాలితో ఎన్నడునూ ఎక్కడనైననూ స్నేహము చేయరాదు (36).

భర్తను ద్వేషించు స్త్రీతో పతివ్రత ఎన్నడునూ సంభాషించరాదు. ఎక్కడైనననూ ఒంటరిగా నుండరాదు. నగ్నముగా ఎన్నడైననూ స్నానము చేయరాదు (37). పతివ్రత రోటిపైన, రోకలిపైన, చీపురు కట్టపైన,రాతిపైన, తిరగలిపైన, గడప పైన ఎన్నడునూ కూర్చుండరాదు (38). సంభోగసమయమునందు తక్క ఇతరత్రా ప్రగల్భముగ నుండరాదు. భర్తకు దేని యందు అభిరుచి గలదో, దానియందామె ప్రేమను కలిగి ఉండవలెను (39). భర్త ఆనందముగ నున్నచో, భార్య ఆనందించవలెను. ప్రియుడగు భర్త విషాదమును పొందినచో ప్రియురాలగు భార్య కూడ విషాదమును పొందవలెను. పతివ్రత సర్వకాలములయందు భర్త యొక్క హితమును గోరవలెను (40).

భార్య సంపద కల్గినపుడు, ఆపద వచ్చినప్పుడు కూడ ఏకరూపముగ పుణ్య భావమును కలిగి యుండవలెను. ఆమె ధైర్యమును కలిగియుండి తనలో ఎట్టి వికారమునకైననూ తావీయరాదు (41). పోపు సామగ్రి, ఉప్పు, నూనె మొదలగునవి లేక పోయిననూ, పతివ్రత భర్తతో 'లేదు' అని చెప్పరాదు. భర్తకు ఆయాసమును కలిగించరాదు (42). 

భర్త విష్ణువు కంటె, బ్రహ్మకంటె, శివుని కంటె గొప్పవాడని పెద్దలు చెప్పెదరు. ఓ దేవదేవీ! పతివ్రతకు తన భర్త శివుడే యగును (43). భర్తను కాదని వ్రతములను, ఉపవాసములను, నియమములను అనుష్టించు స్త్రీ భర్త ఆయుష్షును క్షయము చేయుటయే గాక, మరణించిన పిదప నరకమును పొందును (44).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 566 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 54 🌴*

*🌻 Description of the duties of the chaste wife - 4 🌻*

33. After her bath she shall see her husband’s face and not that of anyone else. Or after thinking on her husband she shall then gaze at the sun.

34-35. If a chaste lady wishes for the longevity of her husband she shall not forsake turmeric, vermilion, saffron, collyrium, a blouse, the betel, the necklace, ornaments, brushing and plaiting the hair bangles and earrings.

36. A chaste woman shall never associate intimately with a washerwoman, a harlot, a female ascetic or a fallen woman.

37. She shall not talk to any woman who disparages or hates her husband. She shall not stand alone anywhere nor shall she take bath in the nude.

38. A chaste lady shall never sleep on a mortar threshing rod, a broom, a grinding stone, a machine or on the threshold.

39. Except at the time of sexual intercourse she shall never show her maturity and initiative. She shall like whatever her husband is interested in.

40. A chaste lady shall be delighted when her husband is delighted and dejected when he is dejected. She shall always wish for his benefit.

41. She shall be virtuous and equanimous in affluence and adversity. She shall have fortitude and shall never go astray.

42. Even when ghee, salt, oil or other things are exhausted she shall not tell her husband openly about it lest he should be subjected to undue strain.

43. O Goddess, the husband is superior to Brahmā, Viṣṇu or Śiva, for a chaste lady her husband is on a par with Śiva.

44. She who transgresses her husband and observes fast and other rites wrecks the longevity of her husband and after death goes to hell.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 50 / Agni Maha Purana - 50 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 18*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. స్వాయంభువ వంశ వర్ణనము - 4 🌻*

యమధర్మరాజునకు తన పదిమంది భార్యల వలన కలిగిన సంతానమును గూర్చి చెప్పెదను. విశ్వకు విశ్వేదేవతలు, సాధ్యకు సాధ్యులు, మరుత్వలకి ఇద్దరు మరుత్వంవతులు, వసువునకు వసువులు భానువుకు బానువలు, ముహూర్తకు ముహూర్తులు, లంబకు ఘోషుడు, యామికి నాగవీధి, మరుత్వతికి పృథివీ సంబద్దమగు సకల వస్తుజాతము, సంకల్పకు సంకల్పులు జనించిరి. చంద్రునకు నక్షత్రముల వలన ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు, ఎనమండుగురు వసువులను జనించిరి.

ఆపుని కుమారులు వైతండ్యుడు, శ్రముడు, శాంతుడు, ముని అనువారు. లోకాంతుడైన కాలుడు ధ్రువుని కుమారుడు. వర్చసుడు సోముని కుమారుడు. ద్రవిణుడు, హుతహవ్యవహుడు శిశిరుడు, ప్రాణుడు, రమణుడు అనువారు ధరునికి మనోహరయ దు కుమారులుగా జనించిరి. అనిలుని కుమారుడు పురోజపుడు. అనలుని కుమారుడు అవిజ్ఞాతుడు. కుమారుడు అగ్నిపుత్రుడుగా శరస్తంబమునందు జనించెను. ఆతని తరువాత శాఖుడు, విశాఖుడు, నైగమేయుడును పట్టిరి కృత్తిక నుండి కార్తి కీయుడును, యతియైన సనత్కుమారుడును పుట్టిరి.

వేలకొలది శిల్పములను చేయువాడును, దేవతల వడ్రంగియు, కాంతిమంతుడును ఆగు విశ్వకర్మయను దేవలుడు ప్రత్యుషునినుండి జనించెను. మనుష్యులు భూషణాది శిల్పములను జీవనాధారముగా చేసి కొనుచుందురు.

సురభి తపస్సుచే పవిత్రీకృతురాలై, మహాదేవుని ప్రసాదముచే ఏకాదశరుద్రులను కనెను. మేక పాదము వంటి ఒక పాదము గల అహిర్బుధ్న్యుడు, త్వష్టయను రుద్రుడు, బహురూపుడు, హరుడు, పరాజితుడు కాని త్ర్యంబకుడు, వృషాకమియు, కపర్ద (జటా) ధారియగు శంభువు, రైవతుడు, మృగవ్యాధుడు, సర్పుడు, పదకొండవవాడైన కపాలియు, చరాచర జగుత్తును వ్యాపించిన కోట్లకొలది రుద్రులు జనించిరి. శ్రీమంతుడును, మహా యశః శాలియు అగు విశ్వరూపుడు త్వష్ట కుమారుడు.

అగ్ని మహాపురాణములో స్వాయంభువమనువంశకర్ణన మన అష్టాదశాధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 50 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

*Chapter 18*
*🌻 Genealogy of Svāyambhuva Manu - 4 🌻*

31. By mental intercourse the celestials, serpents and others (were born) to them in the past. I shall describe (you) the creation of Dharma through his ten wives.

32. The Viśvedevas (were born) to Viśvā, Sādhyā gave birth to the Sādhyas. The Maruts came into being from the Marut and the Vasus from Vasu.

33. The Bhānus (were) the sons of Bhānu and the Muhūrtas (were born) to Muhūrtā. Ghoṣa (was born) to Dharma through Lambā. Nāgavīthī was born of Yāmī.

34. All that belonged to the earth were born of Arundhati. Saṅkalpā (was born) from Saṅkalpā. The stars were the sons of moon.

35. The eight Vasus[15] are known by the names—Āpa, Dhruva, Soma, Dhara[16], Anila, Anala, Pratyūṣa and Prabhāsa.

36. Vaitaṇḍya, Śrama, Śānta, and Muni[17] (were) the sons of Āpa. Kāla, the destroyer of the Universe (was the son) of Dhruva. Varcā was the son of Soma.

37. Dhara had the sons Draviṇa, Hutahavyavāha, Śiśira, Prāṇa and Ramaṇa through Manoharā.

38. Purojava[18] was (the son) of Anila and Avijñāta of Anala. Kumāra, the son of Agni, was born in a clump of reeds.

39. Śākha, Viśākha and Naigameya were his younger brothers. (He was known as) Kārttikeya (as he was the son) of Kṛttikā. (He is also known as) the ascetic Sanatkumāra.

40. Devala was born from Pratyūṣa. Viśvakarman (was born) from Prabhā, and was the architect of thousands of sculptures and the architect of celestials.

41. Men earn their livelihood by this art of architecture and of (making) ornaments. Surabhi begot eleven Rudras[19] from Kaśyapa.

42. O Most pious man! By the favour of Mahādeva (Śiva) (who was) thought of (by her) in her ascetic observances. Satī gave birth to Ajaikapād, Ahirbudhnya, Tvaṣṭṛ and Rudra.

43-44. Viśvarūpa, the great illustrious and fortunate (was) the son of Tvaṣṭṛ. Hara, Bahurūpa, Tryambaka, Aparājita, Vṛṣākapi, Śambhu, Kapardin, Raivata, Mṛgavyādha, Sarpa and Kapālin were the eleven forms by which the entire world, both movable and immovable were pervaded by hundreds and thousands of Rudras.[20]

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join 
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 185 / Osho Daily Meditations - 185 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 185. గొప్ప ఆశయం 🍀*

*🕉. ప్రతి మనిషి పుట్టని ప్రేమ రూపం కనుకనే దుఃఖం, వేదన. విత్తనం విత్తనం వలె సంతృప్తి చెందదు. చెట్టుగా మారాలని, గాలితో ఆడుకోవాలని, ఆకాశానికి ఎత్తాలని కోరుకుంటుంది-- అది ఆశయాత్మకమైనది! ప్రతిష్టాత్మకమైనది. 🕉*
 
*ప్రతి మానవుడు గొప్ప ఆశయంతో జన్మించాడు. ప్రేమలో పుష్పించే, ప్రేమలో వికసించాలనే ఆశయం. కాబట్టి నేను ప్రతి మనిషిని ఒక అవకాశంగా, ఒక సంభావ్యతగా, వాగ్దానంగా చూస్తాను. జరగనిది ఇంకా జరగవలసి ఉంది, అది జరిగితే తప్ప సంతృప్తి, శాంతి ఉండదు; వేదన, బాధ, బాధ ఉంటుంది.*

*మీరు వికసించే స్థితికి వచ్చినప్పుడు మాత్రమే, మీరు దేని కోసం జన్మించారో, మీరు మీ విధిని సాధించి నప్పుడు మాత్రమే, మీ ఆశయం నెరవేరినట్లు మీరు భావిస్తారు. ఆశయం పూర్తిగా అదృశ్యమైనప్పుడు మాత్రమే అది నెరవేరుతుంది. ఇక ఏమీ మిగలని స్థితి అప్పుడే వుంటుంది. మునుపెన్నడూ లేని ఆనందంలో ఉన్న వ్యక్తిగా నువ్వు మారతావు.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 185 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 185. THE GREAT AMBITION 🍀*

*🕉 Every human being is love unborn, hence the misery, the anguish. The seed cannot be contented as the seed. It wants to become a tree, it wants to play with the wind, it wants to rise to the sky-- it is ambitious! 🕉*
 
*Each human being is born with a great ambition-the ambition to flower in love, to bloom in love. So I see each human being as a possibility, as a potentiality, as a promise. Something that has not happened has yet to happen, and unless it happens there can be no contentment, no peace; there will be agony, suffering, misery.*

*Only when you have come to a blooming where you feel that now you are fulfilled-now you have become that for which you were born, you have attained your destiny, now there is nothing left anymore--only when ambition completely disappears because it is fulfilled, is a person in bliss, never before.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 372 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 372 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 81. పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా ।*
*మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥ 🍀*

*🌻 372 -2. 'భక్తమానస హంసికా'🌻* 

*నిశ్చలులు, నిర్మలురు అగు చిత్తము గలవారి యందు శ్రీమాత వసించి అంతరంగానుభూతిని కలిగించు చుండును. నిర్మల చిత్తము కోరువారు శారీరకము, వాఙ్మయము, మనోమయము అగు తపస్సు నాచరించవలెను. అనగా మనస్సు, ఇంద్రియములు, శరీరము యజ్ఞారమై వినియోగించవలెను. లోకహిత కార్యములే యజ్ఞములు. వాని యందు నిమగ్నమగు వానికి క్రమముగ చిత్తము నిర్మలమగుట తథ్యము.*

*భక్తి సాధనమున గాని, యోగ సాధనమున గాని నిర్మల చిత్తమును పొందుట ప్రధానమగు కార్యముగ నిలచి యున్నది. నిర్మల చిత్తము లేనివారు ఎన్ని దైవకార్యములు చేసిననూ ఫలితము శూన్యమే. అహింస, సత్యము, బ్రహ్మచర్యము, దొంగబుద్ధి లేకుండుట, ఇతరుల సొమ్మున కాశపడకుండుట, బహిరంతర శుచి, సంతోషము, స్వాధ్యాయము, మనస్సును ఈశ్వరునికి సమర్పణము చేసి జీవించుట నిర్మలత్వమున కుపాయములుగ తెలుపబడినవి.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 372 -2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 81.Parapratyakchitirupa pashyanti paradevata*
*Madhyama vaikharirupa bhaktamanasa hansika ॥ 81 ॥ 🌻*

*🌻 372-2. Bhakta-mānasa-haṁsikā भक्त-मानस-हंसिका 🌻*

*Saundarya Laharī verse 38 provides further information on this nāma. In Hinduism, highly evolved souls are called paramahaṃsa-s (a religious man who has subdued all his senses by abstract meditation) which refers to the qualities of swans. The swans have a few exceptional qualities. If water and milk is mixed, swans consume only the milk leaving water alone.*

*This is interpreted as that one should take cognizance of only good things, leaving bad things aside, though the world exists as the mixture of the two. Whenever swans are mentioned, they are always referred to in pairs, out of which one represents sense of hearing and another sense of seeing. Out of all the senses, only these two cause serious erosion of moral values. Like swans one should take notice of good things in life. That is why She is referred as swan.*
*Nāma 816 is muni-mānasa-haṁsikā.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

కపిల గీత - 10 / Kapila Gita - 10

🌹. కపిల గీత - 10 / Kapila Gita - 10🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴. అతీంద్రియ జ్ఞానాన్ని కోరుకున్న దేవహూతి - 4 🌴

10. అథ మే దేవ సమ్మోహమపాక్రష్టుం త్వమర్హసి
యోऽవగ్రహోऽహం మమేతీత్యేతస్మిన్యోజితస్త్వయా

నాలో ఉన్న సమోహాన్ని ( చక్కని మోహాన్ని) తొలగించాలి. వర్షం రాకుండా ఆపే పాపాన్ని అవగ్రహం అంటారు. అలాగే నేనూ నాది అనే అవగ్రహాన్ని నీవు పోగొట్టాలి . ఎందుకంటే ఇది నువ్వేర్పరచినదే కదా.

సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Kapila Gita - 10 🌹

✍️ Swami Prabhupada.
📚 Prasad Bharadwaj

🌴 Devahuti Desires Transcendental Knowledge - 4 🌴

10. atha me deva sammoham apakrastum tvam arhasi
yo 'vagraho 'ham mametity etasmin yojitas tvaya

Now be pleased, my Lord, to dispel my great delusion. Due to my feeling of false ego, I have been engaged by Your maya and have identified myself with the body and consequent bodily relations.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

19 May 2022

శ్రీ శివ మహా పురాణము - 566 / Sri Siva Maha Purana - 566

🌹 . శ్రీ శివ మహా పురాణము - 566 / Sri Siva Maha Purana - 566 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 54 🌴

🌻. పతివ్రతా ధర్మములు - 4 🌻

స్నానము చేసిన తరువాత భర్త ముఖమునే చూడవలెను. ఇతరుల ముఖమును చూడరాదు. భర్త దగ్గర లేనిచో, భర్తను మనస్సులో ధ్యానించి సూర్యుని చూడవలెను (33). భర్త యొక్క ఆయుష్షును గోరు పతివ్రత పసుపును, కుంకుమను, సిందూరమును, కాటుకను, తాంబూలమును, మంగళసూత్రమును, ఆభరణములను, రవికెను, కేశసంస్కారమును, కేశాభరణములను, చేతులకు గాజులను, కర్ణాభరణములను, ఇటువంటి ఇతర ఆభరణములను విడనాడరాదు (34, 35). చాకలితో, కులటతో, సన్న్యాసినితో మరియు భాగ్యహీనురాలితో ఎన్నడునూ ఎక్కడనైననూ స్నేహము చేయరాదు (36).

భర్తను ద్వేషించు స్త్రీతో పతివ్రత ఎన్నడునూ సంభాషించరాదు. ఎక్కడైనననూ ఒంటరిగా నుండరాదు. నగ్నముగా ఎన్నడైననూ స్నానము చేయరాదు (37). పతివ్రత రోటిపైన, రోకలిపైన, చీపురు కట్టపైన,రాతిపైన, తిరగలిపైన, గడప పైన ఎన్నడునూ కూర్చుండరాదు (38). సంభోగసమయమునందు తక్క ఇతరత్రా ప్రగల్భముగ నుండరాదు. భర్తకు దేని యందు అభిరుచి గలదో, దానియందామె ప్రేమను కలిగి ఉండవలెను (39). భర్త ఆనందముగ నున్నచో, భార్య ఆనందించవలెను. ప్రియుడగు భర్త విషాదమును పొందినచో ప్రియురాలగు భార్య కూడ విషాదమును పొందవలెను. పతివ్రత సర్వకాలములయందు భర్త యొక్క హితమును గోరవలెను (40).

భార్య సంపద కల్గినపుడు, ఆపద వచ్చినప్పుడు కూడ ఏకరూపముగ పుణ్య భావమును కలిగి యుండవలెను. ఆమె ధైర్యమును కలిగియుండి తనలో ఎట్టి వికారమునకైననూ తావీయరాదు (41). పోపు సామగ్రి, ఉప్పు, నూనె మొదలగునవి లేక పోయిననూ, పతివ్రత భర్తతో 'లేదు' అని చెప్పరాదు. భర్తకు ఆయాసమును కలిగించరాదు (42).

భర్త విష్ణువు కంటె, బ్రహ్మకంటె, శివుని కంటె గొప్పవాడని పెద్దలు చెప్పెదరు. ఓ దేవదేవీ! పతివ్రతకు తన భర్త శివుడే యగును (43). భర్తను కాదని వ్రతములను, ఉపవాసములను, నియమములను అనుష్టించు స్త్రీ భర్త ఆయుష్షును క్షయము చేయుటయే గాక, మరణించిన పిదప నరకమును పొందును (44).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 SRI SIVA MAHA PURANA - 566 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 54 🌴

🌻 Description of the duties of the chaste wife - 4 🌻

33. After her bath she shall see her husband’s face and not that of anyone else. Or after thinking on her husband she shall then gaze at the sun.

34-35. If a chaste lady wishes for the longevity of her husband she shall not forsake turmeric, vermilion, saffron, collyrium, a blouse, the betel, the necklace, ornaments, brushing and plaiting the hair bangles and earrings.

36. A chaste woman shall never associate intimately with a washerwoman, a harlot, a female ascetic or a fallen woman.

37. She shall not talk to any woman who disparages or hates her husband. She shall not stand alone anywhere nor shall she take bath in the nude.

38. A chaste lady shall never sleep on a mortar threshing rod, a broom, a grinding stone, a machine or on the threshold.

39. Except at the time of sexual intercourse she shall never show her maturity and initiative. She shall like whatever her husband is interested in.

40. A chaste lady shall be delighted when her husband is delighted and dejected when he is dejected. She shall always wish for his benefit.

41. She shall be virtuous and equanimous in affluence and adversity. She shall have fortitude and shall never go astray.

42. Even when ghee, salt, oil or other things are exhausted she shall not tell her husband openly about it lest he should be subjected to undue strain.

43. O Goddess, the husband is superior to Brahmā, Viṣṇu or Śiva, for a chaste lady her husband is on a par with Śiva.

44. She who transgresses her husband and observes fast and other rites wrecks the longevity of her husband and after death goes to hell.

Continues....

🌹🌹🌹🌹🌹

19 May 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 50 / Agni Maha Purana - 50

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 50 / Agni Maha Purana - 50 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 18

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. స్వాయంభువ వంశ వర్ణనము - 4 🌻

యమధర్మరాజునకు తన పదిమంది భార్యల వలన కలిగిన సంతానమును గూర్చి చెప్పెదను. విశ్వకు విశ్వేదేవతలు, సాధ్యకు సాధ్యులు, మరుత్వలకి ఇద్దరు మరుత్వంవతులు, వసువునకు వసువులు భానువుకు బానువలు, ముహూర్తకు ముహూర్తులు, లంబకు ఘోషుడు, యామికి నాగవీధి, మరుత్వతికి పృథివీ సంబద్దమగు సకల వస్తుజాతము, సంకల్పకు సంకల్పులు జనించిరి. చంద్రునకు నక్షత్రముల వలన ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు, ఎనమండుగురు వసువులను జనించిరి.

ఆపుని కుమారులు వైతండ్యుడు, శ్రముడు, శాంతుడు, ముని అనువారు. లోకాంతుడైన కాలుడు ధ్రువుని కుమారుడు. వర్చసుడు సోముని కుమారుడు. ద్రవిణుడు, హుతహవ్యవహుడు శిశిరుడు, ప్రాణుడు, రమణుడు అనువారు ధరునికి మనోహరయ దు కుమారులుగా జనించిరి. అనిలుని కుమారుడు పురోజపుడు. అనలుని కుమారుడు అవిజ్ఞాతుడు. కుమారుడు అగ్నిపుత్రుడుగా శరస్తంబమునందు జనించెను. ఆతని తరువాత శాఖుడు, విశాఖుడు, నైగమేయుడును పట్టిరి కృత్తిక నుండి కార్తి కీయుడును, యతియైన సనత్కుమారుడును పుట్టిరి.

వేలకొలది శిల్పములను చేయువాడును, దేవతల వడ్రంగియు, కాంతిమంతుడును ఆగు విశ్వకర్మయను దేవలుడు ప్రత్యుషునినుండి జనించెను. మనుష్యులు భూషణాది శిల్పములను జీవనాధారముగా చేసి కొనుచుందురు.

సురభి తపస్సుచే పవిత్రీకృతురాలై, మహాదేవుని ప్రసాదముచే ఏకాదశరుద్రులను కనెను. మేక పాదము వంటి ఒక పాదము గల అహిర్బుధ్న్యుడు, త్వష్టయను రుద్రుడు, బహురూపుడు, హరుడు, పరాజితుడు కాని త్ర్యంబకుడు, వృషాకమియు, కపర్ద (జటా) ధారియగు శంభువు, రైవతుడు, మృగవ్యాధుడు, సర్పుడు, పదకొండవవాడైన కపాలియు, చరాచర జగుత్తును వ్యాపించిన కోట్లకొలది రుద్రులు జనించిరి. శ్రీమంతుడును, మహా యశః శాలియు అగు విశ్వరూపుడు త్వష్ట కుమారుడు.

అగ్ని మహాపురాణములో స్వాయంభువమనువంశకర్ణన మన అష్టాదశాధ్యాయము సమాప్తము.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Agni Maha Purana - 50 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 18

🌻 Genealogy of Svāyambhuva Manu - 4 🌻

31. By mental intercourse the celestials, serpents and others (were born) to them in the past. I shall describe (you) the creation of Dharma through his ten wives.

32. The Viśvedevas (were born) to Viśvā, Sādhyā gave birth to the Sādhyas. The Maruts came into being from the Marut and the Vasus from Vasu.

33. The Bhānus (were) the sons of Bhānu and the Muhūrtas (were born) to Muhūrtā. Ghoṣa (was born) to Dharma through Lambā. Nāgavīthī was born of Yāmī.

34. All that belonged to the earth were born of Arundhati. Saṅkalpā (was born) from Saṅkalpā. The stars were the sons of moon.

35. The eight Vasus[15] are known by the names—Āpa, Dhruva, Soma, Dhara[16], Anila, Anala, Pratyūṣa and Prabhāsa.

36. Vaitaṇḍya, Śrama, Śānta, and Muni[17] (were) the sons of Āpa. Kāla, the destroyer of the Universe (was the son) of Dhruva. Varcā was the son of Soma.

37. Dhara had the sons Draviṇa, Hutahavyavāha, Śiśira, Prāṇa and Ramaṇa through Manoharā.

38. Purojava[18] was (the son) of Anila and Avijñāta of Anala. Kumāra, the son of Agni, was born in a clump of reeds.

39. Śākha, Viśākha and Naigameya were his younger brothers. (He was known as) Kārttikeya (as he was the son) of Kṛttikā. (He is also known as) the ascetic Sanatkumāra.

40. Devala was born from Pratyūṣa. Viśvakarman (was born) from Prabhā, and was the architect of thousands of sculptures and the architect of celestials.

41. Men earn their livelihood by this art of architecture and of (making) ornaments. Surabhi begot eleven Rudras[19] from Kaśyapa.

42. O Most pious man! By the favour of Mahādeva (Śiva) (who was) thought of (by her) in her ascetic observances. Satī gave birth to Ajaikapād, Ahirbudhnya, Tvaṣṭṛ and Rudra.

43-44. Viśvarūpa, the great illustrious and fortunate (was) the son of Tvaṣṭṛ. Hara, Bahurūpa, Tryambaka, Aparājita, Vṛṣākapi, Śambhu, Kapardin, Raivata, Mṛgavyādha, Sarpa and Kapālin were the eleven forms by which the entire world, both movable and immovable were pervaded by hundreds and thousands of Rudras.[20]

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

19 May 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 185. గొప్ప ఆశయం / Osho Daily Meditations - 185. THE GREAT AMBITION

🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 185 / Osho Daily Meditations - 185 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 185. గొప్ప ఆశయం 🍀

🕉. ప్రతి మనిషి పుట్టని ప్రేమ రూపం కనుకనే దుఃఖం, వేదన. విత్తనం విత్తనం వలె సంతృప్తి చెందదు. చెట్టుగా మారాలని, గాలితో ఆడుకోవాలని, ఆకాశానికి ఎత్తాలని కోరుకుంటుంది-- అది ఆశయాత్మకమైనది! ప్రతిష్టాత్మకమైనది. 🕉

ప్రతి మానవుడు గొప్ప ఆశయంతో జన్మించాడు. ప్రేమలో పుష్పించే, ప్రేమలో వికసించాలనే ఆశయం. కాబట్టి నేను ప్రతి మనిషిని ఒక అవకాశంగా, ఒక సంభావ్యతగా, వాగ్దానంగా చూస్తాను. జరగనిది ఇంకా జరగవలసి ఉంది, అది జరిగితే తప్ప సంతృప్తి, శాంతి ఉండదు; వేదన, బాధ, బాధ ఉంటుంది.

మీరు వికసించే స్థితికి వచ్చినప్పుడు మాత్రమే, మీరు దేని కోసం జన్మించారో, మీరు మీ విధిని సాధించి నప్పుడు మాత్రమే, మీ ఆశయం నెరవేరినట్లు మీరు భావిస్తారు. ఆశయం పూర్తిగా అదృశ్యమైనప్పుడు మాత్రమే అది నెరవేరుతుంది. ఇక ఏమీ మిగలని స్థితి అప్పుడే వుంటుంది. మునుపెన్నడూ లేని ఆనందంలో ఉన్న వ్యక్తిగా నువ్వు మారతావు.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Osho Daily Meditations - 185 🌹

📚. Prasad Bharadwaj

🍀 185. THE GREAT AMBITION 🍀

🕉 Every human being is love unborn, hence the misery, the anguish. The seed cannot be contented as the seed. It wants to become a tree, it wants to play with the wind, it wants to rise to the sky-- it is ambitious! 🕉

Each human being is born with a great ambition-the ambition to flower in love, to bloom in love. So I see each human being as a possibility, as a potentiality, as a promise. Something that has not happened has yet to happen, and unless it happens there can be no contentment, no peace; there will be agony, suffering, misery.

Only when you have come to a blooming where you feel that now you are fulfilled-now you have become that for which you were born, you have attained your destiny, now there is nothing left anymore--only when ambition completely disappears because it is fulfilled, is a person in bliss, never before.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

19 May 2022

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 372 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 372 - 2

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 372 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 372 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 81. పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా ।
మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥ 🍀

🌻 372 -2. 'భక్తమానస హంసికా'🌻

నిశ్చలులు, నిర్మలురు అగు చిత్తము గలవారి యందు శ్రీమాత వసించి అంతరంగానుభూతిని కలిగించు చుండును. నిర్మల చిత్తము కోరువారు శారీరకము, వాఙ్మయము, మనోమయము అగు తపస్సు నాచరించవలెను. అనగా మనస్సు, ఇంద్రియములు, శరీరము యజ్ఞారమై వినియోగించవలెను. లోకహిత కార్యములే యజ్ఞములు. వాని యందు నిమగ్నమగు వానికి క్రమముగ చిత్తము నిర్మలమగుట తథ్యము.

భక్తి సాధనమున గాని, యోగ సాధనమున గాని నిర్మల చిత్తమును పొందుట ప్రధానమగు కార్యముగ నిలచి యున్నది. నిర్మల చిత్తము లేనివారు ఎన్ని దైవకార్యములు చేసిననూ ఫలితము శూన్యమే. అహింస, సత్యము, బ్రహ్మచర్యము, దొంగబుద్ధి లేకుండుట, ఇతరుల సొమ్మున కాశపడకుండుట, బహిరంతర శుచి, సంతోషము, స్వాధ్యాయము, మనస్సును ఈశ్వరునికి సమర్పణము చేసి జీవించుట నిర్మలత్వమున కుపాయములుగ తెలుపబడినవి.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 372 -2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 81.Parapratyakchitirupa pashyanti paradevata
Madhyama vaikharirupa bhaktamanasa hansika ॥ 81 ॥ 🌻

🌻 372-2. Bhakta-mānasa-haṁsikā भक्त-मानस-हंसिका 🌻

Saundarya Laharī verse 38 provides further information on this nāma. In Hinduism, highly evolved souls are called paramahaṃsa-s (a religious man who has subdued all his senses by abstract meditation) which refers to the qualities of swans. The swans have a few exceptional qualities. If water and milk is mixed, swans consume only the milk leaving water alone.

This is interpreted as that one should take cognizance of only good things, leaving bad things aside, though the world exists as the mixture of the two. Whenever swans are mentioned, they are always referred to in pairs, out of which one represents sense of hearing and another sense of seeing. Out of all the senses, only these two cause serious erosion of moral values. Like swans one should take notice of good things in life. That is why She is referred as swan.

Nāma 816 is muni-mānasa-haṁsikā.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

19 May 2022

The Transition

🌹The Transition 🌹

The transition we are making
is that your soul is going to
have a clearer place in
your life.

Your soul is multidimensional,
which means that you can
be in multiple dimensions.

Your soul is already doing that,
only are you're not always aware
of it, being in your physical body.

When you are only seeing yourself
as a body with a head and a heart,
then you are only living in 3d.

Opening up to your soul,
recognizing that you have a soul,
that you have multiple bodies
emotional body, spiritual body,
mental body etcetera and
that you are that too,
is the beginning of the
multidimensional consciousness.

Other dimensions have
other vibrations and frequencies.
In these frequencies live
many other energies.

When you make a shift
in your frequency, it is possible to
make contact with these
energies.

We remain in this body,
which is at this time
adapting to all the
new light frequencies that
are coming in.

You are inwardly changing,
you're going to resonate with
that which is coming in and
that can be felt.

This shift that is going on
has to do with opening up
to your own soul and all of its
knowledge and wisdom.
And through that you will open
to your own multidimensionality.

We are living in a special time.
And your soul has chosen to
be on Earth to experience
this change into a body.

🌹 🌹 🌹 🌹 🌹

18 May 2022

మైత్రేయ మహర్షి బోధనలు - 120

🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 120 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 92. ఆత్మ హంతకులు -2 🌻

ప్రవచనమున కాకర్షింబడక, ప్రవర్తనకు ఆకర్షింపబడుటకు శ్రద్ధయొక్కటియే పునాదికాగలదు. శ్రద్ధ కలిగి ప్రవర్తనయందు నిమగ్నమైన వానిని నిర్లక్ష్యము, మోసము అను శక్తులు స్పృశింప జాలవు. ఎట్టి సాధకునైనను ఈ రెండు శక్తులును మ్రింగి వేయగలవు. తనయందు మోసమున్నదో? లేదో? తెలియుటకు తనకన్న మించిన వారు లేరు. అట్టి వారికి సాక్ష్యమే అవసరములేదు. అంతరాత్మయే అన్నిటికిని సాక్ష్యము, అది మరుగున పడినచో, అట్టివారు ఆత్మహంతకులే!

ఆత్మహంతకులకు సాక్ష్యము చూపినను చూడలేరు. ఆత్మవంతులకు సాక్ష్యమే అక్కర లేదు. సాక్ష్యము ఒక మాయ. అందులకే నిజమైన భక్తులు ఎవరూ సాక్ష్యము కోరలేదు. ఆత్మయే సాక్షిగ నిలబడినారు. వారు ఆత్మవంతులు. ఆత్మహంతకులకు, ఆత్మవంతులు అర్థము కారు. కృష్ణుడు, రాముడు లాంటి దివ్యులు అర్థమగుటకు ఆవగింజంత ఆత్మ చైతన్యము ఉండవలెను..

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

18 May 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 181

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 181 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మనం ఈ ప్రపంచంలోకి స్వచ్ఛంగా, అమాయకంగా అడుగుపెట్టాం. వ్యక్తి పెరిగి నిర్ణయాలు తీసుకునే దశకు వచ్చేసరికి అప్పటికే సమాజం అతన్ని నాశనం చేసి వుంటుంది. 🍀

మనం ఈ ప్రపంచంలోకి స్వచ్ఛంగా, అమాయకంగా అడుగుపెట్టాం. స్వచ్ఛ స్ఫటికంగా, శుభ్రంగా అడుగు పెట్టాం. అప్పుడు ప్రపంచం మన చైతన్యం మీద తన రాతలు మొదలు పెట్టింది. అదుపు చెయ్యడం ఆరంభించింది. మలిన పరిచింది, విషపూరితం చేసింది. వ్యక్తి పెరిగి నిర్ణయాలు తీసుకునే దశకు వచ్చేసరికి అప్పటికే సమాజం అతన్ని నాశనం చేసి వుంటుంది.

అంతర్దృష్టిని అంధకారమయం చేసి వుంటుంది. అతను తన కాళ్ళ మీద తను నిలబడలేడు. అది అతన్ని ఆధారపడేలా చేస్తుంది. మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన గొప్ప కుట్ర అది. ఆధ్యాత్మిక పతనం సమాజం నీ మనసును ఆలోచనల్తో, కోరికల్తో, అత్యాశల్తో నింపి వుంటుంది. అహంకారంతో నింపి వుంటుంది. ఒక పొరపై ఒక పొర పేరుకుని వుంటుంది.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

18 May 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 281 - 7. చిన్న అనుబంధాలను ముందుగా పరిష్కరించు కోవాలి. / DAILY WISDOM - 281 - 7. The Least of Attachments should be Tackled First

🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 281 / DAILY WISDOM - 281 🌹

🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 7. చిన్న అనుబంధాలను ముందుగా పరిష్కరించు కోవాలి. 🌻

మన బాహ్య ప్రకటితమైన స్వయంలో భాగమైన సంబంధబాంధవ్యాలు మన చైతన్యం యొక్క అనుభవంలో అవిభాజ్య భాగంగా ఉన్నాయి. కొన్ని తెలివైన మార్గాల ద్వారా ఈ స్వీయ పొరలను జాగ్రత్తగా తొలగించడం అవసరం. అత్యల్ప తీవ్రత ఉన్న బంధాలను ముందుగా జయించాలి. తీవ్రత కలిగిన అనుబంధాలను ప్రారంభంలోనే జయించ ప్రయత్నం చేయకూడదు. మనకు అనేక రకాల అనుబంధాలు ఉన్నాయి-యాభై, అరవై, వందలు ఉండవచ్చు- కానీ అవన్నీ ఒకే తీవ్రతతో ఉండవు.

మనలో కొన్ని కీలకమైన భాగాలు ఉన్నాయి, వాటిని తాకలేము. అవి చాలా పటిష్టంగా ఉంటాయి మరియు ప్రారంభంలో వాటిని ముట్టుకోకపోవడమే మంచిది. కానీ ముందుగా పరిష్కరించగల కొన్ని తేలికపాటి అంశాలు ఉన్నాయి మరియు ఈ బంధాల స్థాయిని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఎన్ని అనుబంధాలు, ఎన్ని ఆప్యాయతలు? మనసును వేధించే, వేదన కలిగించే బంధాలు ఏవి? మీకు నచ్చితే, మీ స్వంత డైరీలో వాటి జాబితాను వ్యక్తిగతంగా రూపొందించండి. స్వామి రామతీర్థ అలా చేసేవారని చెప్తారు. ఆయన తన కోరికల జాబితాను తయారు చేసి వాటిలో ఎన్ని నెరవేరాయో చూసుకునేవారు.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 DAILY WISDOM - 281 🌹

🍀 📖 from The Study and Practice of Yoga 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 7. The Least of Attachments should be Tackled First 🌻

Inasmuch as our external relationships—which constitute the outward form of the relative self—have become part and parcel of our experience, they are inseparable from our consciousness. It requires a careful peeling out of these layers of self by very intelligent means. The lowest attachment, or the least of attachments, should be tackled first. The intense attachments should not be tackled in the beginning. We have many types of attachment—there may be fifty, sixty, a hundred—but all of them are not of the same intensity.

There are certain vital spots in us which cannot be touched. They are very vehement, and it is better not to touch them in the beginning. But there are some milder aspects which can be tackled first, and the gradation of these attachments should be understood properly. How many attachments are there, and how many affections? What are the loves that are harassing the mind and causing agony? Make a list of them privately in your own diary, if you like. They say Swami Rama Tirtha used to do that. He would make a list of all the desires and find out how many of them had been fulfilled.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

18 May 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 602/ Vishnu Sahasranama Contemplation - 602

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 602/ Vishnu Sahasranama Contemplation - 602🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻602. శ్రీవాసః, श्रीवासः, Śrīvāsaḥ🌻

ఓం శ్రీవాసాయ నమః | ॐ श्रीवासाय नमः | OM Śrīvāsāya namaḥ

శ్రీవాసః, श्रीवासः, Śrīvāsaḥ

వక్షస్యస్య భగవతో విష్ణోః శ్రీరనసాయినీ ।
వసతీతి బుధైరేష శ్రీవాస ఇతి కథ్యతే ॥

లక్ష్మికి నివాసము అగువాడు. ఈతని వక్షమునందు ఎన్నడును విడువనిదగుచు శ్రీ ఉన్నదిగనుక ఆ విష్ణుదేవునకు శ్రీవాసః అను నామము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 602🌹

📚. Prasad Bharadwaj

🌻602. Śrīvāsaḥ🌻

OM Śrīvāsāya namaḥ

वक्षस्यस्य भगवतो विष्णोः श्रीरनसायिनी ।
वसतीति बुधैरेष श्रीवास इति कथ्यते ॥

Vakṣasyasya bhagavato viṣṇoḥ śrīranasāyinī,
Vasatīti budhaireṣa śrīvāsa iti kathyate.

He in whom Śrī i.e., goddess Lakṣmi resides; who is permanent abode of goddess Lakṣmi. Since Lakṣmi resides in His chest forever without separation, Lord Viṣṇu is called Śrīvāsaḥ.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः ।
श्रीवत्सवक्षाश्श्रीवासश्श्रीपतिः श्रीमतां वरः ॥ ६४ ॥

అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।
శ్రీవత్సవక్షాశ్శ్రీవాసశ్శ్రీపతిః శ్రీమతాం వరః ॥ 64 ॥

Anivartī nivr‌ttātmā saṃkṣeptā kṣemakr‌cchivaḥ,
Śrīvatsavakṣāśśrīvāsaśśrīpatiḥ śrīmatāṃ varaḥ ॥ 64 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

18 May 2022

18 - MAY - 2022 బుధవారం, సౌమ్య వాసరే MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 18, మే 2022 బుధవారం, సౌమ్య వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 203 / Bhagavad-Gita - 203 - 4- 41 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 602 / Vishnu Sahasranama Contemplation - 602🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 281 / DAILY WISDOM - 281🌹  
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 181 🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 120🌹 
🍀. The Transition 🍀 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ బుధవారం మిత్రులందరికీ 🌹*
*సౌమ్య వాసరే, 18, మే 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*పండుగలు మరియు పర్వదినాలు : లేవు.*

*🍀. శ్రీ నారాయణ కవచం - 4 🍀*

*ఓం నమో నారాయణాయేతి విపర్యయమథాపి వా |*
*కరన్యాసం తతః కుర్యాద్ద్వాదశాక్షరవిద్యయా*
*ప్రణవాదియకారాన్తమంగుల్యంగుష్ఠపర్వసు |*
*న్యసేద్ధృదయ ఓంకారం వికారమను మూర్ధని*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : మహానుభావుల దగ్గరికి, దైవ సన్నిధికి వెళ్ళేటప్పుడు ఒక స్థిర నిర్ణయాన్ని కలిగి, లక్ష్యసిధ్ధి కల్గి ఉండాలి. అది నీ జీవితములో సువర్ణావకాశముగా భావించి , జ్ఞాన మార్గము లక్ష్యముగా వెళ్ళాలి. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, వైశాఖ మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిథి: కృష్ణ తదియ 23:38:26 వరకు
తదుపరి కృష్ణ చవితి
నక్షత్రం: జ్యేష్ఠ 08:10:56 వరకు
తదుపరి మూల
యోగం: సిధ్ధ 18:43:49 వరకు
తదుపరి సద్య
కరణం: వణిజ 13:19:20 వరకు
వర్జ్యం: 15:19:00 - 16:44:48
దుర్ముహూర్తం: 11:46:37 - 12:38:31
రాహు కాలం: 12:12:34 - 13:49:54
గుళిక కాలం: 10:35:14 - 12:12:34
యమ గండం: 07:20:35 - 08:57:55
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:37
అమృత కాలం: 00:19:34 - 01:45:06
మరియు 23:53:48 - 25:19:36
సూర్యోదయం: 05:43:15
సూర్యాస్తమయం: 18:41:52
చంద్రోదయం: 21:18:28
చంద్రాస్తమయం: 07:29:18
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
ధ్వాo క్ష యోగం - ధన నాశనం, కార్య హాని
08:10:56 వరకు తదుపరి ధ్వజ యోగం 
- కార్య సిధ్ధి 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 203 / Bhagavad-Gita - 203 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 41 🌴*

*41. యోగసన్న్యస్తకర్మాణాం జ్ఞానసంఛిన్నసంశయమ్ |*
*ఆత్మవన్తం న కర్మాణి నిబధ్నన్తి ధనంజయ ||*

🌷. తాత్పర్యం :
*కర్మఫలముల నన్నింటిని త్యచించి భక్తియోగము నందు వర్తించుచు దివ్యజ్ఞానముచే సందేహములు నశించి యున్నవాడు వాస్తవముగా ఆత్మ యందే స్థితుడైనట్టి వాడు. ఓ ధనంజయా! ఆ విధముగా అతడు కర్మఫలములచే బంధితుడు కాడు.*

🌷. భాష్యము :
దేవదేవుడైన శ్రీకృష్ణునిచే తెలుపబడినరీతిగా భగవద్గీతోపదేశమును అనుసరించువాడు దివ్యజ్ఞానము ద్వారా సర్వసంశయముల నుండి విముక్తుడగును. సంపూర్ణ కృష్ణభక్తిభావనలో భగవానుని అంశరూపమున అతడు ఆత్మజ్ఞానమునందు స్థితిని పొందినవాడే యగును. అందుచే అతడు నిస్సందేహముగా కర్మబంధమునకు అతీతుడైయుండును. 

🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 203 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 4 - Jnana Yoga - 41 🌴*

*41. yoga-sannyasta-karmāṇaṁ jñāna-sañchinna-saṁśayam*
*ātmavantaṁ na karmāṇi nibadhnanti dhanañ-jaya*

🌷 Translation : 
*One who acts in devotional service, renouncing the fruits of his actions, and whose doubts have been destroyed by transcendental knowledge, is situated factually in the self. Thus he is not bound by the reactions of work, O conqueror of riches.*

🌹 Purport :
One who follows the instruction of the Bhagavad-gītā, as it is imparted by the Lord, the Personality of Godhead Himself, becomes free from all doubts by the grace of transcendental knowledge. He, as a part and parcel of the Lord, in full Kṛṣṇa consciousness, is already established in self-knowledge. As such, he is undoubtedly above bondage to action.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 602/ Vishnu Sahasranama Contemplation - 602🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻602. శ్రీవాసః, श्रीवासः, Śrīvāsaḥ🌻*

*ఓం శ్రీవాసాయ నమః | ॐ श्रीवासाय नमः | OM Śrīvāsāya namaḥ*

*శ్రీవాసః, श्रीवासः, Śrīvāsaḥ*

*వక్షస్యస్య భగవతో విష్ణోః శ్రీరనసాయినీ ।*
*వసతీతి బుధైరేష శ్రీవాస ఇతి కథ్యతే ॥*

*లక్ష్మికి నివాసము అగువాడు. ఈతని వక్షమునందు ఎన్నడును విడువనిదగుచు శ్రీ ఉన్నదిగనుక ఆ విష్ణుదేవునకు శ్రీవాసః అను నామము.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 602🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻602. Śrīvāsaḥ🌻*

*OM Śrīvāsāya namaḥ*

वक्षस्यस्य भगवतो विष्णोः श्रीरनसायिनी ।
वसतीति बुधैरेष श्रीवास इति कथ्यते ॥

*Vakṣasyasya bhagavato viṣṇoḥ śrīranasāyinī,*
*Vasatīti budhaireṣa śrīvāsa iti kathyate.*

*He in whom Śrī i.e., goddess Lakṣmi resides; who is permanent abode of goddess Lakṣmi. Since Lakṣmi resides in His chest forever without separation, Lord Viṣṇu is called Śrīvāsaḥ.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः ।श्रीवत्सवक्षाश्श्रीवासश्श्रीपतिः श्रीमतां वरः ॥ ६४ ॥

అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।శ్రీవత్సవక్షాశ్శ్రీవాసశ్శ్రీపతిః శ్రీమతాం వరః ॥ 64 ॥

Anivartī nivr‌ttātmā saṃkṣeptā kṣemakr‌cchivaḥ,Śrīvatsavakṣāśśrīvāsaśśrīpatiḥ śrīmatāṃ varaḥ ॥ 64 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 281 / DAILY WISDOM - 281 🌹*
*🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 7. చిన్న అనుబంధాలను ముందుగా పరిష్కరించు కోవాలి. 🌻*

*మన బాహ్య ప్రకటితమైన స్వయంలో భాగమైన సంబంధబాంధవ్యాలు మన చైతన్యం యొక్క అనుభవంలో అవిభాజ్య భాగంగా ఉన్నాయి. కొన్ని తెలివైన మార్గాల ద్వారా ఈ స్వీయ పొరలను జాగ్రత్తగా తొలగించడం అవసరం. అత్యల్ప తీవ్రత ఉన్న బంధాలను ముందుగా జయించాలి. తీవ్రత కలిగిన అనుబంధాలను ప్రారంభంలోనే జయించ ప్రయత్నం చేయకూడదు. మనకు అనేక రకాల అనుబంధాలు ఉన్నాయి-యాభై, అరవై, వందలు ఉండవచ్చు- కానీ అవన్నీ ఒకే తీవ్రతతో ఉండవు.*

*మనలో కొన్ని కీలకమైన భాగాలు ఉన్నాయి, వాటిని తాకలేము. అవి చాలా పటిష్టంగా ఉంటాయి మరియు ప్రారంభంలో వాటిని ముట్టుకోకపోవడమే మంచిది. కానీ ముందుగా పరిష్కరించగల కొన్ని తేలికపాటి అంశాలు ఉన్నాయి మరియు ఈ బంధాల స్థాయిని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఎన్ని అనుబంధాలు, ఎన్ని ఆప్యాయతలు? మనసును వేధించే, వేదన కలిగించే బంధాలు ఏవి? మీకు నచ్చితే, మీ స్వంత డైరీలో వాటి జాబితాను వ్యక్తిగతంగా రూపొందించండి. స్వామి రామతీర్థ అలా చేసేవారని చెప్తారు. ఆయన తన కోరికల జాబితాను తయారు చేసి వాటిలో ఎన్ని నెరవేరాయో చూసుకునేవారు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 281 🌹*
*🍀 📖 from The Study and Practice of Yoga 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 7. The Least of Attachments should be Tackled First 🌻*

*Inasmuch as our external relationships—which constitute the outward form of the relative self—have become part and parcel of our experience, they are inseparable from our consciousness. It requires a careful peeling out of these layers of self by very intelligent means. The lowest attachment, or the least of attachments, should be tackled first. The intense attachments should not be tackled in the beginning. We have many types of attachment—there may be fifty, sixty, a hundred—but all of them are not of the same intensity.*

*There are certain vital spots in us which cannot be touched. They are very vehement, and it is better not to touch them in the beginning. But there are some milder aspects which can be tackled first, and the gradation of these attachments should be understood properly. How many attachments are there, and how many affections? What are the loves that are harassing the mind and causing agony? Make a list of them privately in your own diary, if you like. They say Swami Rama Tirtha used to do that. He would make a list of all the desires and find out how many of them had been fulfilled.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 181 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. మనం ఈ ప్రపంచంలోకి స్వచ్ఛంగా, అమాయకంగా అడుగుపెట్టాం. వ్యక్తి పెరిగి నిర్ణయాలు తీసుకునే దశకు వచ్చేసరికి అప్పటికే సమాజం అతన్ని నాశనం చేసి వుంటుంది. 🍀*

*మనం ఈ ప్రపంచంలోకి స్వచ్ఛంగా, అమాయకంగా అడుగుపెట్టాం. స్వచ్ఛ స్ఫటికంగా, శుభ్రంగా అడుగు పెట్టాం. అప్పుడు ప్రపంచం మన చైతన్యం మీద తన రాతలు మొదలు పెట్టింది. అదుపు చెయ్యడం ఆరంభించింది. మలిన పరిచింది, విషపూరితం చేసింది. వ్యక్తి పెరిగి నిర్ణయాలు తీసుకునే దశకు వచ్చేసరికి అప్పటికే సమాజం అతన్ని నాశనం చేసి వుంటుంది. *

*అంతర్దృష్టిని అంధకారమయం చేసి వుంటుంది. అతను తన కాళ్ళ మీద తను నిలబడలేడు. అది అతన్ని ఆధారపడేలా చేస్తుంది. మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన గొప్ప కుట్ర అది. ఆధ్యాత్మిక పతనం సమాజం నీ మనసును ఆలోచనల్తో, కోరికల్తో, అత్యాశల్తో నింపి వుంటుంది. అహంకారంతో నింపి వుంటుంది. ఒక పొరపై ఒక పొర పేరుకుని వుంటుంది.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 120 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 92. ఆత్మ హంతకులు -2 🌻*

*ప్రవచనమున కాకర్షింబడక, ప్రవర్తనకు ఆకర్షింపబడుటకు శ్రద్ధయొక్కటియే పునాదికాగలదు. శ్రద్ధ కలిగి ప్రవర్తనయందు నిమగ్నమైన వానిని నిర్లక్ష్యము, మోసము అను శక్తులు స్పృశింప జాలవు. ఎట్టి సాధకునైనను ఈ రెండు శక్తులును మ్రింగి వేయగలవు. తనయందు మోసమున్నదో? లేదో? తెలియుటకు తనకన్న మించిన వారు లేరు. అట్టి వారికి సాక్ష్యమే అవసరములేదు. అంతరాత్మయే అన్నిటికిని సాక్ష్యము, అది మరుగున పడినచో, అట్టివారు ఆత్మహంతకులే!*

*ఆత్మహంతకులకు సాక్ష్యము చూపినను చూడలేరు. ఆత్మవంతులకు సాక్ష్యమే అక్కర లేదు. సాక్ష్యము ఒక మాయ. అందులకే నిజమైన భక్తులు ఎవరూ సాక్ష్యము కోరలేదు. ఆత్మయే సాక్షిగ నిలబడినారు. వారు ఆత్మవంతులు. ఆత్మహంతకులకు, ఆత్మవంతులు అర్థము కారు. కృష్ణుడు, రాముడు లాంటి దివ్యులు అర్థమగుటకు ఆవగింజంత ఆత్మ చైతన్యము ఉండవలెను..*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹The Transition 🌹*

The transition we are making
is that your soul is going to 
have a clearer place in
your life.

Your soul is multidimensional,
which means that you can
be in multiple dimensions.

Your soul is already doing that,
only are you're not always aware 
of it, being in your physical body.

When you are only seeing yourself
as a body with a head and a heart,
then you are only living in 3d.

Opening up to your soul,
recognizing that you have a soul,
that you have multiple bodies
emotional body, spiritual body, 
mental body etcetera and 
that you are that too, 
is the beginning of the 
multidimensional consciousness.

Other dimensions have
other vibrations and frequencies.
In these frequencies live
many other energies.

When you make a shift 
in your frequency, it is possible to 
make contact with these
energies.

We remain in this body,
which is at this time
adapting to all the
new light frequencies that
are coming in.

You are inwardly changing, 
you're going to resonate with
that which is coming in and
that can be felt.

This shift that is going on
has to do with opening up 
to your own soul and all of its 
knowledge and wisdom.
And through that you will open
to your own multidimensionality.

We are living in a special time.
And your soul has chosen to 
be on Earth to experience 
this change into a body.

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 372-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 372-1

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 372-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 372-1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 81. పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా ।
మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥ 🍀

🌻 372 -1. 'భక్తమానస హంసికా'🌻

భక్తుల చిత్తమందు హంసవలె నుండునది శ్రీదేవి అని అర్ధము. భక్తు లనగా నిర్మల చిత్తము కలవారు. నిర్మల చిత్త మనగా ఎట్టి మలములు లేనిది. దీనిని మానస సరోవరమని కూడ అందురు. అచట ప్రశాంతత ప్రధానముగ నుండును. చల్లదనము, నిశ్శబ్దము సతత ముండును. ఇట్టి చిత్తము లందు హంసవలె శ్రీదేవి వసించి యుండును. హృదయ మందలి స్పందనాత్మక చైతన్యముగ తేలియాడు చుండును. 'సో హం' అను శబ్దము నిరంతరము నిర్మల చిత్తమున దర్శించవచ్చును. ఇట్లు దర్శించువారు హంసదర్శను లగుదురు. క్రమముగ హంస లగుదురు.

ఇట్టి హంసలైన భక్తులు ప్రపంచ ప్రభావమునకు లొంగరు. వారు చరమగు ప్రపంచము నుండి విడివడి ఆ ప్రపంచమున తేలియాడు చుందురు. వారు ముముక్షువులు. చిత్తమున హంసలై నిలచిన వారి ప్రజ్ఞలు సూక్ష్మస్పందనమును గూర్చిన ధ్యానములో నిమగ్నమై యుండును. వీరు సహజముగ అంతర్ముఖులు. కర్తవ్యములను బట్టి బహిర్ముఖు లగుచుందురు. కర్తవ్యము లేనిచో వారి ఇంద్రియములు గాని, కర్మేంద్రియములుగాని కదలవు. ఊరకే తిరుగుట, కదలుట, మాటాడుట యుండవు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 372 -1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 81.Parapratyakchitirupa pashyanti paradevata
Madhyama vaikharirupa bhaktamanasa hansika ॥ 81 ॥ 🌻

🌻 372-1. Bhakta-mānasa-haṁsikā भक्त-मानस-हंसिका 🌻

There is a small story about associated with this nāma. Brahma, the God of creation created a lake called Mānasarovar at the top of mount Kailāsa. The water in this lake is known for its highest purity. The lake exists even today. Swans always prefer purity and hence flock around this lake.

The lake is compared to the mind (which has to be pure) and the swans (normally a pair of swan) are compared to jīvātma-s (souls) and Paramātma (the Brahman)} are compared to Lalitāmbikā. This story says that Brahman has a great liking for a pure mind and chooses to stay there forever, guiding the aspirant from within.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

17 May 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 184. అంతర్గత ఐక్యత / Osho Daily Meditations - 184. ORGANIC UNITY

🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 184 / Osho Daily Meditations - 184 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 184. అంతర్గత ఐక్యత 🍀

🕉. మీరు అంతర్గతంగా ఏకీకృతం కాకపోతే, మీరు ఏమి చేస్తున్నా నిజమైన ఏకీకరణ ఉండదు; అది ఉపరితలంగా మాత్రమే కలపబడుతుంది. అది అలాగే ఉంటే ఫలితం కేవలం యాంత్రిక ఐక్యత అవుతుంది, నిజమైన ఐక్యత కాదు. 🕉

మీరు ఒక కారులో అనేక భాగాలు కలిపి ఉంచవచ్చు- కాని మీరు ఒక పువ్వును ఒకే విధంగా ఉంచలేరు; ఒక పువ్వు పెంచాలి. ఇది సేంద్రీయ ఐక్యతను కలిగి ఉంది, అంతర్గత ఐక్యత ఉంది-దీనికి ఒక కేంద్రం ఉంది మరియు 'కేంద్రం మొదట వస్తుంది, తర్వాత రేకులు వస్తాయి. యాంత్రిక ఐక్యతలో, భాగాలు మొదట వస్తాయి, తరువాత మొత్తం. సేంద్రీయ ఐక్యతలో, మొత్తం మొదట వస్తుంది మరియు తరువాత భాగాలు. కవిత్వం లేకుండా కవిత్వం రాయవచ్చు. ఎవరైనా ఏమీ పెద్దగా ఆలోచించకుండా కథను వ్రాయవచ్చు, ఒక మూర్ఖుడు చెప్పిన కథ, ఆవేశం మరియు శబ్దంతో నిండి ఉంటుంది, అది దేనినీ సూచించదు. దాని ప్రాముఖ్యత ఒక వ్యక్తి, ఒక కవి నుండి వస్తుంది; అది కవిత్వంలో లేదు.

కవి నుండి ఏదో అప్రయత్నంగా పొంగి పొర్లితే, కవిత్వం ప్రకాశవంతం అవుతుంది, దానిలో ఒక మెరుపు ఉంటుంది, దానిలో సూక్ష్మమైన ఐక్యత ఉంటుంది. అది ప్రాణంతో కొట్టుమిట్టాడుతుంది, దానికి గుండె ఉంది, అది కొట్టుకుంటుంది ... మీరు ఆ గుండె చప్పుడు వినవచ్చు. అప్పుడు అది జీవిస్తుంది మరియు పెరుగుతుంది మరియు అది పెరుగుతూనే ఉంటుంది. ఇది దాదాపు మీకు ఒక బిడ్డ పుట్టినప్పుడు వంటిది; మీరు చనిపోవచ్చు, కానీ బిడ్డ పెరుగుతూనే ఉంటుంది. కవి పోయినా నిజమైన కవిత్వం పెరుగుతూనే ఉంటుంది. ఒక కాళిదాసు లేదా షేక్స్పియర్ ఈనాటికీ ఎలా జీవిస్తున్నారు. కవిత్వంలో ఏదో ఆంతర్గత ఐక్యత ఉంది; ఇది కేవలం బాహ్య పదాలు కలపడం కాదు.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Osho Daily Meditations - 184 🌹

📚. Prasad Bharadwaj

🍀 184. ORGANIC UNITY 🍀

🕉 If you are not integrated, whatever you are doing cannot have real integration; it can only be put together superficially. And the result if that putting together will be just a mechanical unity, not an organic unity. 🕉

You can put a car together-but you cannot put a flower together in the same way; a flower has to be grown. It has an organic unity, an inner unity-it has a center, and the 'center comes first, then the petals. In a mechanical unity, parts come first, then the whole. In an organic unity, the whole comes first and then the parts. One can write poetry with no poetry in it. And one can write a story without any center-much ado about nothing, a tale told by an idiot, full of fury and noise, signifying nothing. The significance comes from the person, the poet; it is not in the poetry.

If the poet has something overflowing, then the poetry becomes luminous, then it has a glow, it has a subtle unity. It throbs with life, it has a heart, it beats ... you can hear the beat of the heart. Then it lives and grows and it goes on growing. It is almost like when a child is born to you; you may die, but the child keeps on growing. The real poetry will go on growing even when the poet is gone. That's how a Kalidas or a Shakespeare goes on living. The poetry has something organic in it; it is not just put together.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

17 May 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 49 / Agni Maha Purana - 49

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 49 / Agni Maha Purana - 49 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 18

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. స్వాయంభువ వంశ వర్ణనము - 3 🌻

యజ్ఞము చేయుచున్నప్పుడు కుశలు, వాటి అగ్రములు తూర్పు వైపున కుండు నట్లు భూమిపై పరవబడెను. అందుచే పూజ్యు డైన ఆ ప్రజాపతికి ''ప్రాచీన బర్హిస్సు'' అను పేరు వచ్చెను.

సముద్రుని కుమార్తె యైన సవర్ణ ప్రాచీనబర్హిస్సువలన పదిమంది కుమారులను కనెను వారందరికిని ప్రచేతను లనియే పేరు. వారందరును ధనుర్వేదమునందు పరిపూర్ణప్రజ్ఞ కలవారు.

ఒకే విధముగా ధర్మము నాచరించుచున్న వారందరును సముద్ర జలమున నివసించి పది వేల సంవత్సరములు గొప్ప తపస్సు చేసిరి.

వారు విష్ణువునుండి ప్రజాపతిత్వమును పొంది, సంతసించినవారై సముద్రజలమునుండి లేచిరి అపుడు భూమ్యాకాశములు వృక్షములచే వ్యాప్తములై యుండెను వారు తమ ముఖమునుండి పుట్టిన అగ్ని వాయువులచే ఆ వృక్షములను దహింపచేయ మొదలిడిరి. అపుడు రాజైన సోముడు ప్రజాపతుల దగ్గరికి వెళ్లి-- ''కోపమును ఉపసంహరింపుడు భవిష్యత్తును గూర్చి తెలిసిన నేను తపశ్శాలి యగ కండుముని కుమార్తె యైన ప్రవ్లూెచయందు ఉత్తమురాలగు మారిషయను కన్యను జనింపచేసితిని ఆమెను మీకు ఇచ్చెదరు. ఆమె మీ వంశమును వృద్ది పొందించు బార్య యగుగాక. ఆమెయందు పట్టిన దక్షుడు ప్రజలను వృద్దిపొందించును.

ప్రచేతసులు ఆమెను స్వీకరించిరి. ఆమెకు దక్షుడును కుమారుడు జనించెను. ఆతడు మనస్సుచే స్థావరజంగమములకు, ద్విపాత్తులను (మనుష్యులు మొదలగువారిన) చతుష్పాత్తులను (నాలుగు కాళ్ళుగల పశ్వాదులను.) సృజించి పిమ్మట స్త్రీలను సృజించెను. వారిలో పదిమందిని యమధర్మరాజునకును, పదముగ్గురిని కశ్యపునకును, సోమునకు ఇరువది యేడుగురిని, అరిష్టనేమికి నలుగురిని, బహుపుత్రునకు ఇద్దరిని, ఆంగిరసునకు ఇద్దరిని ఇచ్చెను. పూర్వము వారియందు మానస మైథునముచే దేవతలును నాగాదులను జనించిరి.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Agni Maha Purana - 49 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 18

🌻 Genealogy of Svāyambhuva Manu - 3 🌻

21. (He was known as Prācīnabarhis) because the kuśa grass were facing the east as he was praying on the earth.[13] The lord Prācīnabarhis was a great progenitor.

22. Savarṇā, the daughter of Samudra (the lord of the ocean) bore ten Prācīnabarhis. All of them were known as Pracetas and were proficient in archery.

23. Practising the same religious austerities, they all did severe penance, remaining in the waters of the ocean for ten thousand years.

24. Having got the status of a progenitor and pleased Viṣṇu, they came out (of waters) (and found) that the earth and the sky were overspread with trees. They burnt them down.

25. Beholding the destruction of trees _by the fire and wind produced from their mouths, Soma, the king (of plants) approached these progenitors and said:

26-27. “Renounce (your) anger, I will get you this most excellent maiden Māriṣā, (born to) (the nymph) Pramlocā and the ascetic sage Kaṇḍu (who was nourished) by me. Having known the future (I have) created (her). Let (she) be your wife, capable of multiplying the family. Dakṣa will be born to her who will multiply progeny.”

28-30. The Pracetas married her and Dakṣa was born through her. That Dakṣa, having mentally created the immovables, movables, hi-footed beings and the quadrupeds, then created the (sixty) daughters (of whom) he gave[14] ten to Dharma, thirteen to Kaśyapa, twenty-seven to Soma, four to Ariṣṭanemin, two to Bahuputra, two to Aṅgiras.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

17 May 2022

శ్రీ శివ మహా పురాణము - 565 / Sri Siva Maha Purana - 565

🌹 . శ్రీ శివ మహా పురాణము - 565 / Sri Siva Maha Purana - 565 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 54 🌴

🌻. పతివ్రతా ధర్మములు - 3 🌻

'నాథా! ఏల పిలిచితిరి? పని చెప్పి అను గ్రహించుడు' అని పలికి ఆయన ఆదేశించిన పనిని ప్రసన్నమగు మనస్సుతో చేయవలెను (21). ద్వారము వద్ద చిరకాలము నిలబడరాదు. ఇతరుల గృహమునకు పోరాదు. భర్త హృదయములోని భావము నెరింగి ప్రవర్తించవలెను. దేనిని పడితే దానిని ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వారికి ఈయరాదు (22). పూజాసామగ్రిని భర్త చెప్పకుండగనే స్వయముగా సర్వమును సంపాదించవలెను. హితమును చేయు అవకాశము కొరకు ఎదురు చూస్తూ సందర్భమునకు తగినట్లుగా హితమును ఆచరించవలెను (23). భర్త అనుమతి లేనిదే తీర్థయాత్రకు ఎచ్చటికైననూ వెళ్లరాదు. పతివ్రత సమాజోత్సవములకు దూరముగా నుండవలెను (24)

తీర్థములను సేవించ గోరు స్త్రీభర్తపాదోదకము త్రాగవలెను. సర్వక్షేత్రములు, తీర్థములు దానియందే గలవనుటలో సందేహము లేదు (25). భర్త భుజించిన తరువాత మిగిలిన మృష్టాన్నమును, ఇతర భోజ్యములను భర్త ఇచ్చిన మహా ప్రసాదము అను భావనతో స్వీకరించి భుజించవలెను (26).

పతివ్రత దేవతలకు, పితృదేవతలకు, అతిథులకు, పరిచారకులకు, గోవులకు మరియు భిక్షుకులకు, పెట్టకుండగా తాను తినరాదు (27). పతివ్రతా ధర్మమునందు నిష్ఠగల దేవి గృహవస్తవులను పొందికగా భద్రముగా నుంచుకొనవలెను. ఆమె సామర్థ్యముతో ఇంటిని పొదుపుగా నిర్వహించవలెను. ఆమె సర్వదా ఆనందముగా నుండి దుర్వ్యయమును విసర్జించవలెను (28).

భర్త అనుజ్ఞ లేనిచో ఉపవాసములు, వ్రతములు మొదలగు వాటిని చేయరాదు. అట్లు చేసినచో ఆ ఫలము లభించక పోవుటయే గాక, మరు జన్మలో నరకము లభించును (29). సుఖముగా భర్త కూర్చుని యుండగా, లేక స్వేచ్ఛచే క్రీడించుచుండగా ఆటంకమును కలిగించరాదు. భర్త నిద్రించుచున్న సమయములో ఆవశ్యకమగు కార్యము ఉన్ననూ నిద్ర లేపరాదు (30).

భర్త అసమర్థుడైననూ, దురవస్థలో నున్ననూ, వ్యాధిగ్రస్తుడైననూ, వృద్ధుడే అయిననూ, సుఖము గలవాడైననూ, లేక దుఃఖియైననూ, పతివ్రత భర్తను ఉల్లంఘించరాదు (31). రజస్వలా సమయములో భర్తకు దూరముగా నుండవలెను. స్నానము అగువరకు కబుర్లాడరాదు (32).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 SRI SIVA MAHA PURANA - 565 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 54 🌴

🌻 Description of the duties of the chaste wife - 3 🌻

21. “O lord, be pleased to say what I have been called for.” Whenever ordered by him to do any job she shall do it gladly.

22. She shall not stand near the entrance for a long time. She shall not go to other people’s house. She shall not take his money, even though it be a little, and give it to others.

23. Without being told she shall arrange the necessary requisities for his daily worship. She shall wait for the opportunity to do him a timely service.

24. Without the permission of her husband she shall not go even on pilgrimage. She shall eschew the desire to attend social festivities.

25. If a women wants holy water she shall drink the same with which her husband’s feet have been washed. All holy rivers are present in that water.

26. She shall partake of the leavings of her husband’s food or whatever is given by him saying “This is thy great grace.”

27. She shall never take food without first offering due share to the gods, the Pitṛs, the guests, the servants, cows and saintly mendicants.

28. A gentle lady of chaste rites shall always be clever to manage the household with limited requisites. She shall be averse to spend unnecessarily.

29. Without being permitted by her husband she shall not observe fast and other rites. Should it be so, she will derive no benefit. She may fall into hell in other worlds.

30. While the husband is sportively engaged or seated comfortably she shall not worry him to get up under the pretext of attending to some household work.

31. Whether he is impotent, distressed, sick or senile, happy or unhappy, the husband shall never be transgressed.

32. During the three days of her monthly course she shall neither show her face nor speak to him. She shall not speak within his hearing till she becomes pure after her bath.

Continues....

🌹🌹🌹🌹🌹

17 May 2022

కపిల గీత - 9 / Kapila Gita - 9

🌹. కపిల గీత - 9 / Kapila Gita - 9🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴. అతీంద్రియ జ్ఞానాన్ని కోరుకున్న దేవహూతి-3 🌴

9. య ఆద్యో భగవాన్పుంసామీశ్వరో వై భవాన్కిల
లోకస్య తమసాన్ధస్య చక్షుః సూర్య ఇవోదితః

లోకములో ఉన్న అన్ని బ్రహ్మాండములలో ఈశ్వరుడూ (ఐశ్వర్య కలవాడు ఈశ్వరుడు. ఐశ్వర్యం అంటే లోపల ఉండి శాసించే వాడు. ఎక్కడ లోపాలు ఉన్నాయో తెలుసుకోగలగాలి, తెలుసుకుని వాటిని తొలగించగలగాలి. ఈ రెండూ చేయగలవాడు ఈశ్వరుడు.) భగవంతుడూ ఆది పురుషుడూ నీవే కదా. అజ్ఞ్యానమనే చీకటిలో ఉన్న ఈ లోకానికి కన్ను వంటి వాడివి. సూర్యుడు ఎలా ఐతే లోకానికి వెలుగో అలాగే నీవు కూడా ఈ లోకానికి వెలుగు. (సూర్య చంద్రాగ్ని నేత్రవాన్ అని పరమాత్మకి పేరు. ఈ మూడు కళ్ళతో పరమాత్మ చూస్తాడు )

సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Kapila Gita - 9 🌹

✍️ Swami Prabhupada.
📚 Prasad Bharadwaj

🌴 Devahuti Desires Transcendental Knowledge -3 🌴

9. ya adyo bhagavan pumsam isvaro vai bhavan kila
lokasya tamasandhasya caksuh surya ivoditah

You are the Supreme Personality of Godhead, the origin and Supreme Lord of all living entities. You have arisen to disseminate the rays of the sun in order to dissipate the darkness of the ignorance of the universe.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

17 May 2022

17 - MAY - 2022 మంగళవారం, భౌమ వాసరే MESSAGES నారద జయంతి శుభాకాంక్షలు

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 17, మంగళవారం, మే 2022 భౌమ వాసరే 🌹
🌹 కపిల గీత - 9 / Kapila Gita - 9🌹
2) 🌹. శివ మహా పురాణము - 565 / Siva Maha Purana - 565🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 49 / Agni Maha Purana - 49🌹
4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 184 / Osho Daily Meditations - 184🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 372-1/ Sri Lalitha Chaitanya Vijnanam - 372-1🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నారద జయంతి శుభాకాంక్షలు మరియు శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹*
*భౌమ వాసరే, 17, మే 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : నారద జయంతి, Narada Jayanti🌻*

*🍀. హనుమ భుజంగ స్తోత్రం-2 🍀*

భజే పామరం భావనీ నిత్యవాసం
భజే బాలభాను ప్రభాచారుభాసం
భజే చంద్రికా కుందమందారహాసం
భజే సంతతం రామ భూపలహాసమ్ |2|
భజే లక్ష్మణ ప్రాణ రక్షాతి దక్షం
భజే తోషితానేక గౌర్వాణ పక్షం
భజే ఘోర సంగ్రామసీమా హతాక్షం
భజే రామనామాతి సంప్రాప్తరక్షమ్ |3|

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : జీవన్ముక్తుని సన్నిధిలో నీ మనసుని ఒక నియమానికి, ఒక లక్ష్యానికి లోబరచుకొని ఉండాలి. ఆయన దగ్గర నిరంతరమూ ఆ దేవతా సాన్నిధ్యము ఉంటుంది. తధాస్తు అంటాయవి. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, వైశాఖ మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిథి: కృష్ణ పాడ్యమి 06:26:52 వరకు
తదుపరి కృష్ణ విదియ
నక్షత్రం: అనూరాధ 10:47:56 వరకు
తదుపరి జ్యేష్ఠ
యోగం: శివ 22:38:54 వరకు
తదుపరి సిధ్ధ
కరణం: కౌలవ 06:25:52 వరకు
వర్జ్యం: 15:46:22 - 17:11:54
దుర్ముహూర్తం: 08:19:08 - 09:11:00
రాహు కాలం: 15:27:02 - 17:04:17
గుళిక కాలం: 12:12:32 - 13:49:47
యమ గండం: 08:58:02 - 10:35:17
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:37
అమృత కాలం: 01:28:52 - 02:54:44
మరియు 24:19:34 - 25:45:06
సూర్యోదయం: 05:43:32
సూర్యాస్తమయం: 18:41:32
చంద్రోదయం: 20:10:23
చంద్రాస్తమయం: 06:30:28
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
వజ్ర యోగం - ఫల ప్రాప్తి 10:47:56
వరకు తదుపరి ముద్గర యోగం 
- కలహం  

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 9 / Kapila Gita - 9🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴. అతీంద్రియ జ్ఞానాన్ని కోరుకున్న దేవహూతి-3 🌴*

*9. య ఆద్యో భగవాన్పుంసామీశ్వరో వై భవాన్కిల*
*లోకస్య తమసాన్ధస్య చక్షుః సూర్య ఇవోదితః*

*లోకములో ఉన్న అన్ని బ్రహ్మాండములలో ఈశ్వరుడూ (ఐశ్వర్య కలవాడు ఈశ్వరుడు. ఐశ్వర్యం అంటే లోపల ఉండి శాసించే వాడు. ఎక్కడ లోపాలు ఉన్నాయో తెలుసుకోగలగాలి, తెలుసుకుని వాటిని తొలగించగలగాలి. ఈ రెండూ చేయగలవాడు ఈశ్వరుడు.) భగవంతుడూ ఆది పురుషుడూ నీవే కదా. అజ్ఞ్యానమనే చీకటిలో ఉన్న ఈ లోకానికి కన్ను వంటి వాడివి. సూర్యుడు ఎలా ఐతే లోకానికి వెలుగో అలాగే నీవు కూడా ఈ లోకానికి వెలుగు. (సూర్య చంద్రాగ్ని నేత్రవాన్ అని పరమాత్మకి పేరు. ఈ మూడు కళ్ళతో పరమాత్మ చూస్తాడు )*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 9 🌹*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*

*🌴 Devahuti Desires Transcendental Knowledge -3 🌴*

*9. ya adyo bhagavan pumsam isvaro vai bhavan kila*
*lokasya tamasandhasya caksuh surya ivoditah*

*You are the Supreme Personality of Godhead, the origin and Supreme Lord of all living entities. You have arisen to disseminate the rays of the sun in order to dissipate the darkness of the ignorance of the universe.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#కపిలగీత #KapilaGita
#కపిలగీతKapilaGita
 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 565 / Sri Siva Maha Purana - 565 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 54 🌴*

*🌻. పతివ్రతా ధర్మములు - 3 🌻*

'నాథా! ఏల పిలిచితిరి? పని చెప్పి అను గ్రహించుడు' అని పలికి ఆయన ఆదేశించిన పనిని ప్రసన్నమగు మనస్సుతో చేయవలెను (21). ద్వారము వద్ద చిరకాలము నిలబడరాదు. ఇతరుల గృహమునకు పోరాదు. భర్త హృదయములోని భావము నెరింగి ప్రవర్తించవలెను. దేనిని పడితే దానిని ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వారికి ఈయరాదు (22). పూజాసామగ్రిని భర్త చెప్పకుండగనే స్వయముగా సర్వమును సంపాదించవలెను. హితమును చేయు అవకాశము కొరకు ఎదురు చూస్తూ సందర్భమునకు తగినట్లుగా హితమును ఆచరించవలెను (23). భర్త అనుమతి లేనిదే తీర్థయాత్రకు ఎచ్చటికైననూ వెళ్లరాదు. పతివ్రత సమాజోత్సవములకు దూరముగా నుండవలెను (24)

తీర్థములను సేవించ గోరు స్త్రీభర్తపాదోదకము త్రాగవలెను. సర్వక్షేత్రములు, తీర్థములు దానియందే గలవనుటలో సందేహము లేదు (25). భర్త భుజించిన తరువాత మిగిలిన మృష్టాన్నమును, ఇతర భోజ్యములను భర్త ఇచ్చిన మహా ప్రసాదము అను భావనతో స్వీకరించి భుజించవలెను (26). 

పతివ్రత దేవతలకు, పితృదేవతలకు, అతిథులకు, పరిచారకులకు, గోవులకు మరియు భిక్షుకులకు, పెట్టకుండగా తాను తినరాదు (27). పతివ్రతా ధర్మమునందు నిష్ఠగల దేవి గృహవస్తవులను పొందికగా భద్రముగా నుంచుకొనవలెను. ఆమె సామర్థ్యముతో ఇంటిని పొదుపుగా నిర్వహించవలెను. ఆమె సర్వదా ఆనందముగా నుండి దుర్వ్యయమును విసర్జించవలెను (28).

భర్త అనుజ్ఞ లేనిచో ఉపవాసములు, వ్రతములు మొదలగు వాటిని చేయరాదు. అట్లు చేసినచో ఆ ఫలము లభించక పోవుటయే గాక, మరు జన్మలో నరకము లభించును (29). సుఖముగా భర్త కూర్చుని యుండగా, లేక స్వేచ్ఛచే క్రీడించుచుండగా ఆటంకమును కలిగించరాదు. భర్త నిద్రించుచున్న సమయములో ఆవశ్యకమగు కార్యము ఉన్ననూ నిద్ర లేపరాదు (30). 

భర్త అసమర్థుడైననూ, దురవస్థలో నున్ననూ, వ్యాధిగ్రస్తుడైననూ, వృద్ధుడే అయిననూ, సుఖము గలవాడైననూ, లేక దుఃఖియైననూ, పతివ్రత భర్తను ఉల్లంఘించరాదు (31). రజస్వలా సమయములో భర్తకు దూరముగా నుండవలెను. స్నానము అగువరకు కబుర్లాడరాదు (32).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 565 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 54 🌴*

*🌻 Description of the duties of the chaste wife - 3 🌻*

21. “O lord, be pleased to say what I have been called for.” Whenever ordered by him to do any job she shall do it gladly.

22. She shall not stand near the entrance for a long time. She shall not go to other people’s house. She shall not take his money, even though it be a little, and give it to others.

23. Without being told she shall arrange the necessary requisities for his daily worship. She shall wait for the opportunity to do him a timely service.

24. Without the permission of her husband she shall not go even on pilgrimage. She shall eschew the desire to attend social festivities.

25. If a women wants holy water she shall drink the same with which her husband’s feet have been washed. All holy rivers are present in that water.

26. She shall partake of the leavings of her husband’s food or whatever is given by him saying “This is thy great grace.”

27. She shall never take food without first offering due share to the gods, the Pitṛs, the guests, the servants, cows and saintly mendicants.

28. A gentle lady of chaste rites shall always be clever to manage the household with limited requisites. She shall be averse to spend unnecessarily.

29. Without being permitted by her husband she shall not observe fast and other rites. Should it be so, she will derive no benefit. She may fall into hell in other worlds.

30. While the husband is sportively engaged or seated comfortably she shall not worry him to get up under the pretext of attending to some household work.

31. Whether he is impotent, distressed, sick or senile, happy or unhappy, the husband shall never be transgressed.

32. During the three days of her monthly course she shall neither show her face nor speak to him. She shall not speak within his hearing till she becomes pure after her bath.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 49 / Agni Maha Purana - 49 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 18*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. స్వాయంభువ వంశ వర్ణనము - 3 🌻*

యజ్ఞము చేయుచున్నప్పుడు కుశలు, వాటి అగ్రములు తూర్పు వైపున కుండు నట్లు భూమిపై పరవబడెను. అందుచే పూజ్యు డైన ఆ ప్రజాపతికి ''ప్రాచీన బర్హిస్సు'' అను పేరు వచ్చెను.

సముద్రుని కుమార్తె యైన సవర్ణ ప్రాచీనబర్హిస్సువలన పదిమంది కుమారులను కనెను వారందరికిని ప్రచేతను లనియే పేరు. వారందరును ధనుర్వేదమునందు పరిపూర్ణప్రజ్ఞ కలవారు.

ఒకే విధముగా ధర్మము నాచరించుచున్న వారందరును సముద్ర జలమున నివసించి పది వేల సంవత్సరములు గొప్ప తపస్సు చేసిరి.

వారు విష్ణువునుండి ప్రజాపతిత్వమును పొంది, సంతసించినవారై సముద్రజలమునుండి లేచిరి అపుడు భూమ్యాకాశములు వృక్షములచే వ్యాప్తములై యుండెను వారు తమ ముఖమునుండి పుట్టిన అగ్ని వాయువులచే ఆ వృక్షములను దహింపచేయ మొదలిడిరి. అపుడు రాజైన సోముడు ప్రజాపతుల దగ్గరికి వెళ్లి-- ''కోపమును ఉపసంహరింపుడు భవిష్యత్తును గూర్చి తెలిసిన నేను తపశ్శాలి యగ కండుముని కుమార్తె యైన ప్రవ్లూెచయందు ఉత్తమురాలగు మారిషయను కన్యను జనింపచేసితిని ఆమెను మీకు ఇచ్చెదరు. ఆమె మీ వంశమును వృద్ది పొందించు బార్య యగుగాక. ఆమెయందు పట్టిన దక్షుడు ప్రజలను వృద్దిపొందించును.

ప్రచేతసులు ఆమెను స్వీకరించిరి. ఆమెకు దక్షుడును కుమారుడు జనించెను. ఆతడు మనస్సుచే స్థావరజంగమములకు, ద్విపాత్తులను (మనుష్యులు మొదలగువారిన) చతుష్పాత్తులను (నాలుగు కాళ్ళుగల పశ్వాదులను.) సృజించి పిమ్మట స్త్రీలను సృజించెను. వారిలో పదిమందిని యమధర్మరాజునకును, పదముగ్గురిని కశ్యపునకును, సోమునకు ఇరువది యేడుగురిని, అరిష్టనేమికి నలుగురిని, బహుపుత్రునకు ఇద్దరిని, ఆంగిరసునకు ఇద్దరిని ఇచ్చెను. పూర్వము వారియందు మానస మైథునముచే దేవతలును నాగాదులను జనించిరి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 49 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

*Chapter 18*
*🌻 Genealogy of Svāyambhuva Manu - 3 🌻*

21. (He was known as Prācīnabarhis) because the kuśa grass were facing the east as he was praying on the earth.[13] The lord Prācīnabarhis was a great progenitor.

22. Savarṇā, the daughter of Samudra (the lord of the ocean) bore ten Prācīnabarhis. All of them were known as Pracetas and were proficient in archery.

23. Practising the same religious austerities, they all did severe penance, remaining in the waters of the ocean for ten thousand years.

24. Having got the status of a progenitor and pleased Viṣṇu, they came out (of waters) (and found) that the earth and the sky were overspread with trees. They burnt them down.

25. Beholding the destruction of trees _by the fire and wind produced from their mouths, Soma, the king (of plants) approached these progenitors and said:

26-27. “Renounce (your) anger, I will get you this most excellent maiden Māriṣā, (born to) (the nymph) Pramlocā and the ascetic sage Kaṇḍu (who was nourished) by me. Having known the future (I have) created (her). Let (she) be your wife, capable of multiplying the family. Dakṣa will be born to her who will multiply progeny.”

28-30. The Pracetas married her and Dakṣa was born through her. That Dakṣa, having mentally created the immovables, movables, hi-footed beings and the quadrupeds, then created the (sixty) daughters (of whom) he gave[14] ten to Dharma, thirteen to Kaśyapa, twenty-seven to Soma, four to Ariṣṭanemin, two to Bahuputra, two to Aṅgiras.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join 
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 184 / Osho Daily Meditations - 184 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 184. అంతర్గత ఐక్యత 🍀*

*🕉. మీరు అంతర్గతంగా ఏకీకృతం కాకపోతే, మీరు ఏమి చేస్తున్నా నిజమైన ఏకీకరణ ఉండదు; అది ఉపరితలంగా మాత్రమే కలపబడుతుంది. అది అలాగే ఉంటే ఫలితం కేవలం యాంత్రిక ఐక్యత అవుతుంది, నిజమైన ఐక్యత కాదు. 🕉*
 
*మీరు ఒక కారులో అనేక భాగాలు కలిపి ఉంచవచ్చు- కాని మీరు ఒక పువ్వును ఒకే విధంగా ఉంచలేరు; ఒక పువ్వు పెంచాలి. ఇది సేంద్రీయ ఐక్యతను కలిగి ఉంది, అంతర్గత ఐక్యత ఉంది-దీనికి ఒక కేంద్రం ఉంది మరియు 'కేంద్రం మొదట వస్తుంది, తర్వాత రేకులు వస్తాయి. యాంత్రిక ఐక్యతలో, భాగాలు మొదట వస్తాయి, తరువాత మొత్తం. సేంద్రీయ ఐక్యతలో, మొత్తం మొదట వస్తుంది మరియు తరువాత భాగాలు. కవిత్వం లేకుండా కవిత్వం రాయవచ్చు. ఎవరైనా ఏమీ పెద్దగా ఆలోచించకుండా కథను వ్రాయవచ్చు, ఒక మూర్ఖుడు చెప్పిన కథ, ఆవేశం మరియు శబ్దంతో నిండి ఉంటుంది, అది దేనినీ సూచించదు. దాని ప్రాముఖ్యత ఒక వ్యక్తి, ఒక కవి నుండి వస్తుంది; అది కవిత్వంలో లేదు.*

*కవి నుండి ఏదో అప్రయత్నంగా పొంగి పొర్లితే, కవిత్వం ప్రకాశవంతం అవుతుంది, దానిలో ఒక మెరుపు ఉంటుంది, దానిలో సూక్ష్మమైన ఐక్యత ఉంటుంది. అది ప్రాణంతో కొట్టుమిట్టాడుతుంది, దానికి గుండె ఉంది, అది కొట్టుకుంటుంది ... మీరు ఆ గుండె చప్పుడు వినవచ్చు. అప్పుడు అది జీవిస్తుంది మరియు పెరుగుతుంది మరియు అది పెరుగుతూనే ఉంటుంది. ఇది దాదాపు మీకు ఒక బిడ్డ పుట్టినప్పుడు వంటిది; మీరు చనిపోవచ్చు, కానీ బిడ్డ పెరుగుతూనే ఉంటుంది. కవి పోయినా నిజమైన కవిత్వం పెరుగుతూనే ఉంటుంది. ఒక కాళిదాసు లేదా షేక్స్పియర్ ఈనాటికీ ఎలా జీవిస్తున్నారు. కవిత్వంలో ఏదో ఆంతర్గత ఐక్యత ఉంది; ఇది కేవలం బాహ్య పదాలు కలపడం కాదు.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 184 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 184. ORGANIC UNITY 🍀*

*🕉 If you are not integrated, whatever you are doing cannot have real integration; it can only be put together superficially. And the result if that putting together will be just a mechanical unity, not an organic unity. 🕉*
 
*You can put a car together-but you cannot put a flower together in the same way; a flower has to be grown. It has an organic unity, an inner unity-it has a center, and the 'center comes first, then the petals. In a mechanical unity, parts come first, then the whole. In an organic unity, the whole comes first and then the parts. One can write poetry with no poetry in it. And one can write a story without any center-much ado about nothing, a tale told by an idiot, full of fury and noise, signifying nothing. The significance comes from the person, the poet; it is not in the poetry.*

*If the poet has something overflowing, then the poetry becomes luminous, then it has a glow, it has a subtle unity. It throbs with life, it has a heart, it beats ... you can hear the beat of the heart. Then it lives and grows and it goes on growing. It is almost like when a child is born to you; you may die, but the child keeps on growing. The real poetry will go on growing even when the poet is gone. That's how a Kalidas or a Shakespeare goes on living. The poetry has something organic in it; it is not just put together.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 372-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 372-1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 81. పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా ।*
*మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥ 🍀*

*🌻 372 -1. 'భక్తమానస హంసికా'🌻* 

*భక్తుల చిత్తమందు హంసవలె నుండునది శ్రీదేవి అని అర్ధము. భక్తు లనగా నిర్మల చిత్తము కలవారు. నిర్మల చిత్త మనగా ఎట్టి మలములు లేనిది. దీనిని మానస సరోవరమని కూడ అందురు. అచట ప్రశాంతత ప్రధానముగ నుండును. చల్లదనము, నిశ్శబ్దము సతత ముండును. ఇట్టి చిత్తము లందు హంసవలె శ్రీదేవి వసించి యుండును. హృదయ మందలి స్పందనాత్మక చైతన్యముగ తేలియాడు చుండును. 'సో హం' అను శబ్దము నిరంతరము నిర్మల చిత్తమున దర్శించవచ్చును. ఇట్లు దర్శించువారు హంసదర్శను లగుదురు. క్రమముగ హంస లగుదురు.*

*ఇట్టి హంసలైన భక్తులు ప్రపంచ ప్రభావమునకు లొంగరు. వారు చరమగు ప్రపంచము నుండి విడివడి ఆ ప్రపంచమున తేలియాడు చుందురు. వారు ముముక్షువులు. చిత్తమున హంసలై నిలచిన వారి ప్రజ్ఞలు సూక్ష్మస్పందనమును గూర్చిన ధ్యానములో నిమగ్నమై యుండును. వీరు సహజముగ అంతర్ముఖులు. కర్తవ్యములను బట్టి బహిర్ముఖు లగుచుందురు. కర్తవ్యము లేనిచో వారి ఇంద్రియములు గాని, కర్మేంద్రియములుగాని కదలవు. ఊరకే తిరుగుట, కదలుట, మాటాడుట యుండవు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 372 -1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 81.Parapratyakchitirupa pashyanti paradevata*
*Madhyama vaikharirupa bhaktamanasa hansika ॥ 81 ॥ 🌻*

*🌻 372-1. Bhakta-mānasa-haṁsikā भक्त-मानस-हंसिका 🌻*

*There is a small story about associated with this nāma. Brahma, the God of creation created a lake called Mānasarovar at the top of mount Kailāsa. The water in this lake is known for its highest purity. The lake exists even today. Swans always prefer purity and hence flock around this lake.*

*The lake is compared to the mind (which has to be pure) and the swans (normally a pair of swan) are compared to jīvātma-s (souls) and Paramātma (the Brahman)} are compared to Lalitāmbikā. This story says that Brahman has a great liking for a pure mind and chooses to stay there forever, guiding the aspirant from within.*