శ్రీ దత్త దర్శనం - 1985 Sri Datta Darshanam - 1985


శ్రీ దత్త దర్శనం - 1985


నేనే సత్యం.. నేనే నిత్యం.. నేనే జీవం నేనే దైవం..

నేను అనంతం.. అమేయం.. అఖండం..

నాదే జగతికి అమోఘ చైతన్యం..


ఆత్మభువును నేను.. స్వయంభువును నేను..

ధర్మదీపకుడను.. కర్మకారకుడను..

సర్వ కర్తను..సర్వ భర్తను..సర్వ హర్తను..సర్వ జిత్తును

సర్వధారినై ఉన్నాను...సర్వాంతర్యామిని నేనూ...

నేనే సత్యం.. నేనే నిత్యం.. నేనే జీవం.. నేనే దైవం


చతుర్వేదముల ఘోషలు..రచనలేని నా భాషలు

ఉపనిషత్తులు గీతలు..నేను చేసినా బోధలు

సృష్టిని నేను..స్థితిని నేను..లయం నేను..లాస్యం నేను


అహమేవ బ్రహ్మా..అహమేవ విష్ణువు..అహమేవ మహేశ్వరః...

అహమేవహి సచ్చిదానంద స్వరూపః.. పరబ్రహ్మా...






Sri Datta Darshanam - 1985


I am the truth .. I am the eternity .. I am the life, I am the God ..

I am infinite .. indestructible .. absolute ..

Awesome consciousness for my world ..


I am self .. I am self ..

Dharmadeepakudanu .. Karmakarakudanu ..

All Lord..all Sarva Husband..Sarva Hartanu..Sarva Jittunu

I am omnipresent ... I am omnipresent ...

I am the truth .. I am the eternity .. I am the life .. I am the God


Ghoshas of the Chaturvedas..my languages ​​that cannot be written

Upanishads Gitalu .. Teachings I did

I am the creation..I am the status..I am the rhythm..I am the lass


Ahameva Brahma..Ahameva Vishnu..Ahameva Maheshwarah ...

Ahamevahi Sachchidananda Swarupah .. Parabrahma ...


02 May 2022


మైత్రేయ మహర్షి బోధనలు - 112


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 112 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 88. రుచికర బోధనము 🌻

మా బోధనలు సంప్రదాయక బోధనలకన్న భిన్నముగ నున్నవని చాల మంది భావింతురు. సృష్టి పరిణామ కథలో బోధనలు కూడ పరిణామము చెందుచున్నవి. కాలమును, దేశమును, ప్రజల సంస్కృతిని బట్టి బోధనలు అందించు విధానమున కొంత మార్పు జరుగుచుండును. బోధనల ఆశయము జీవులకు జ్ఞానాసక్తి కలిగించుటయే. ఆసక్తి కలుగవలెనన్నచో, బోధనలయందు కొంత ఆకర్షణ యుండవలెను. ఆకర్షితులైన జీవులు జ్ఞానమున ప్రవేశించుటకు వీలగును. జీవులను చైతన్య మార్గమున ముందునకు నడుపుటయే మా ఏకైక ఆశయము. ఆశయ నిర్వహణమునకై మా బృందము రకరకములగ బోధనలను చేయును.

బోధనల ముఖ్య ఉద్దేశ్యము, శ్రద్ధను కలిగించి జ్ఞానమున ప్రవేశపెట్టుట. ఆకలి తీర్చుటకై ఆహారము భుజించుట అవశ్యకము. ఆహారము పోషకాహారమై యుండవలెను. పోషణమునకు విరుద్ధము కాని రుచి భుజించువారికి ఆహారమునందాసక్తి కలిగించును. రుచికాకర్షింపబడి పోషకమగు ఆహారమును భుజించువాడు శరీర పుష్టినెట్లు పొందునో, అట్లే బోధనలు రుచికరము చేయవలెను. అనుసరించు వారికి రుచి కలుగవలెను. రుచి అనగా వెలుగు అని కూడ అర్థమున్నది. బోధనలయందు రుచి జ్ఞానముగ ఆవిర్భ వించును.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


02 May 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 173


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 173 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. నువ్వు నరకం కావచ్చు. నువ్వు స్వర్గం కావచ్చు. అదంతా నువ్వే. అది నీ నిర్ణయం. నరకం సృష్టించినట్లే స్వర్గాన్ని నువ్వే సృష్టించావు. అది ఒక మానసిక స్థితి. నువ్వు దాని సృష్టికర్త అని ఎప్పుడు గుర్తిస్తావో, గొప్ప స్వేచ్ఛని అప్పుడు పొందుతావు. 🍀


జీన్పాల్ సార్రేది విలువైన స్టేట్ మెంట్ వుంది. యితరమైన ప్రతిదీ నరకమే! దాదాపు ప్రపంచంలోని అందరి అభిప్రాయమదే. కేవలం కొందరు 'బుద్ధుల అభిప్రాయం మాత్రమే దానికి భిన్నమైంది. 'యితరమైన ప్రతిదీ నరకమే' నేను అతన్తో ఏకీభవించను. అది లక్షల మంది అనుభవం ఐనా కావచ్చు. అది కరక్టే అనిపిస్తుంది. కానీ కరెక్టు కాదు. అది కేవలం నువ్వు. నువ్వు నరకం కావచ్చు. నువ్వు స్వర్గం కావచ్చు. అదంతా నువ్వే. అది నీ నిర్ణయం.

స్వర్గం ఎక్కడో లేదు. నరకం సృష్టించినట్లే స్వర్గాన్ని నువ్వే సృష్టించావు. అది ఒక మానసిక స్థితి. నువ్వు దాని సృష్టికర్త అని ఎప్పుడు గుర్తిస్తావో. గొప్ప స్వేచ్ఛని అప్పుడు పొందుతావు. యితరులు బాధ్యులయితే నీకు స్వేచ్చ వుండదు. నువ్వొక దాస్యంలో వున్నావు. అందువల్ల యితరులు నీకు సుఖదు:ఖాలు సృష్టిస్తున్నారను కుంటున్నావు. రెండు రకాలుగా నువ్వు ఆధారపడి వున్నావు. కానీ ఎవ్వరూ ఆధారపడి వుండాలనుకోరు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


02 May 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 273 - 29. ప్రకృతిని కాపాడడం మన తక్షణ కర్తవ్యం / DAILY WISDOM - 273 - 29. Nature, the First and Immediate Neighbour



🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 273 / DAILY WISDOM - 273 🌹

🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 29. ప్రకృతిని కాపాడడం మన తక్షణ కర్తవ్యం 🌻


పౌర విధులలో పర్యావరణ పరిగణనలు మరియు ప్రకృతి యొక్క వాస్తవ రూపాన్ని, స్వచ్ఛతను రక్షించే బాధ్యత కూడా ఉన్నాయి. పర్వతాలు నిలబడనివ్వండి, నదులు ప్రవహించనివ్వండి, చెట్లు పెరగనివ్వండి, స్వచ్ఛమైన గాలి వీచనివ్వండి మరియు వారి స్వేచ్ఛ, తాజాదనం మరియు నిర్మలత్వం లో ఎవరూ అడ్డు పడకూడదు. పొగ మరియు ధూళితో గాలిని కలుషితం చేయడం, నీటిపై వ్యర్థాలు మరియు ధూళిని వేయడం ద్వారా నీటిని నాశనం చేయడం, తాము నిలబడి ఉన్న నేల యొక్క బలానికి కారణమై మరియు తగిన ఋతువులో వర్షపాతానికి కారణమయ్యే చెట్లను నాశనం చేయడం మనిషి యొక్క పౌర నేరాలు. బహిరంగ మైదానంలో చెత్త వేయటం ప్రకృతికి మరియు ప్రజల ఆరోగ్యానికి నిషిద్ధం.

ఒక వ్యక్తి తనలా భావించి ప్రేమించవలసిన మొదటి సహోదరి ప్రకృతి కాదా? జీవం తనలో తాను నిర్వహించుకునే ఆర్థిక సూత్రాల ద్వారా మనుగడ సాగిస్తుంది. జీవం అనేది తన లక్షణాలలో హెచ్చుతగ్గులు లేకుండా సామరస్యతతో కూడిన వ్యవస్థ. ఆర్థిక పరిస్థితులు అంటే కేవలం బంగారం మరియు వెండి, భూమి మరియు ఆస్తులతో ఆగిపోవు. అర్థసాస్త్రం అనేది జీవితం మరియు శక్తి యొక్క పరిరక్షణ యొక్క , అంతర్గత సమతుల్యత నిర్వహణ యొక్క సూత్రం. శరీరం తన యొక్క సాధారణ అవసరాలు పెరగటం మరియు తగ్గటం వల్ల ఏ విధంగా అనారోగ్యం పాలవుతుందో అదే విధంగా మనసు కూడా అవసరమైన దానికంటే ఎక్కువ లేదా తక్కువ పనిచేయటం వల్ల తన శక్తిని కోల్పోతుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 273 🌹

🍀 📖 from Essays in Life and Eternity 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 29. Nature, the First and Immediate Neighbour 🌻


Civic duties also include ecological considerations and the obligation to protect nature in its originality and purity. Let mountains stand, let rivers flow, let trees grow, let fresh air blow, and let no one interfere with their freedom, freshness and innocence. Polluting air with smoke and dust, vitiating water by dumping waste and dirt on it, destroying living trees which are responsible for the strength of the ground on which they stand and are also responsible for rainfall in the suitable season, are civic offences on the part of man. Throwing garbage on open ground is prohibitory to commonweal and health of people.

Is not nature the first and immediate neighbour whom one has to love as one's own self? Life survives by the principle of economy it maintains in itself. Life is a system of harmony without excess in any of its features. Economic conditions do not exhaust themselves merely in gold and silver, land and property. Economy is the principle of the conservation of life and energy, the proper maintenance of balance in its internally adjusted parts. As more than the normal or less than the normal needs of the body may turn it sick and make it droop in weakness, so can the mind lose its power and become ill by either excessive activity or inactivity.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


02 May 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 594 / Vishnu Sahasranama Contemplation - 594


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 594 / Vishnu Sahasranama Contemplation - 594🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 594. వృషభాక్షః, वृषभाक्षः, Vr‌ṣabhākṣaḥ 🌻


ఓం వృషభాక్షాయ నమః | ॐ वृषभाक्षाय नमः | OM Vr‌ṣabhākṣāya namaḥ

వృషభాక్షః, वृषभाक्षः, Vr‌ṣabhākṣaḥ


వార్షుకేఽఖిలకామానామక్షిణీహ్యస్య మాపతేః ।
యస్మాత్తస్వాద్వృషభాక్ష ఇతి విష్ణుస్సమీర్యతే ॥
అథవా వృషభో ధర్మః దృష్టిరస్యేతి వా హరిః ।
వృషభాక్ష ఇతి ప్రోక్తో వేదవిద్యావిశారదైః ॥

వర్షతి ఇతి వృషః, వృషభః అను అర్థమున వర్షించునది. సర్వ కామములను వర్షించు కనులు ఈతనికి కలవు. లేదా వృషభము అనగా సర్వ కామములను వర్షించునదియగు ధర్మము ఈతనికి అక్షి అనగా దృష్టి లేదా కన్నుగా నున్నది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 594🌹

📚. Prasad Bharadwaj

🌻594. Vr‌ṣabhākṣaḥ🌻

OM Vr‌ṣabhākṣāya namaḥ



वार्षुकेऽखिलकामानामक्षिणीह्यस्य मापतेः ।
यस्मात्तस्वाद्वृषभाक्ष इति विष्णुस्समीर्यते ॥
अथवा वृषभो धर्मः दृष्टिरस्येति वा हरिः ।
वृषभाक्ष इति प्रोक्तो वेदविद्याविशारदैः ॥


Vārṣuke’khilakāmānāmakṣiṇīhyasya māpateḥ,
Yasmāttasvādvr‌ṣabhākṣa iti viṣṇussamīryate.
Athavā vr‌ṣabho dharmaḥ dr‌ṣṭirasyeti vā hariḥ,
Vr‌ṣabhākṣa iti prokto vedavidyāviśāradaiḥ.


वर्षति इति वृषः, वृषभः / Varṣati iti vr‌ṣaḥ, vr‌ṣabhaḥ from this derivation, as rain or bestow in abundance. Thus Vr‌ṣabhākṣaḥ is the One whose eyes bestow all that is desired in abundance.

Or the One with eye or sight that bestows all that is desired in abundance.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

शुभाङ्गश्शान्तिदस्स्रष्टा कुमुदः कुवलेशयः ।
गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः ॥ ६३ ॥

శుభాఙ్గశ్శాన్తిదస్స్రష్టా కుముదః కువలేశయః ।
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ 63 ॥

Śubhāṅgaśśāntidassraṣṭā kumudaḥ kuvaleśayaḥ,
Gohito gopatirgoptā vr‌ṣabhākṣo vr‌ṣapriyaḥ ॥ 63 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


02 May 2022

02 - MAY - 2022 సోమవారం, ఇందు వాసరే MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 02, మే 2022 సోమవారం, ఇందు వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 195 / Bhagavad-Gita - 195 - 4-33 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 594 / Vishnu Sahasranama Contemplation - 594🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 273 / DAILY WISDOM - 273 🌹  
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 173 🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 112 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ సోమవారం మిత్రులందరికీ 🌹*
*ఇందు వాసరే, 02, మే 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. రుద్రనమక స్తోత్రం - 21 🍀*

*41. నమశ్శష్ప్యాయ ఫేన్యాయ సికత్యాయ నమోనమః!*
*ప్రవాహ్యాయ నమస్తేస్తు హ్రస్వాయాస్తు నమోనమః!!*
*42. వామనాయ నమస్తేస్తు బృహతేచ నమోనమః!*
*వర్షీయసే నమస్తేస్తు నమో వృద్ధాయతే నమః!!*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : మీకు వచ్చిన కష్టంలో ఏ సుఖాన్ని దైవం దాచాడో గమనించుకోండి. ఈ కష్టం వద్దు అంటే దానిలో దాచిన వరదానం కూడా పోతుంది. - మాస్టర్‌ ఆర్‌.కె. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, వైశాఖ మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిధి : శుద్ధ పాడ్యమి తె.3:28 వరకు,
శుద్ధ విదియ 03తా తె.5:21 వరకు
నక్షత్రం : కృత్తిక 03తా తె.0:34 వరకు
యోగం : సౌభాగ్య మ.3:37 వరకు,
కరణం : బల తె.3:28 వరకు
బాలవ సా.4:22 వరకు, 
కౌలువ 03తా తె.5:21వరకు
సూర్యోదయం : ఉ.5:54
సూర్యాస్తమయం : సా.6:34
అభిజత్ ముహూర్తం : ఉ.11:48-మ.12:39
బ్రహ్మ ముహూర్తం : తె.4:17ల తె.5:05
అమృత కాలం : సా.5:56ల రా.7:56
వర్జ్య కాలం : ఉ.11:20ల మ.1:20
గుళిక : మ.1:49ల మ.3:24
దుర్ముహూర్తం : మ.12:39ల మ.1:30,  
మ.3:11ల సా.4:01
రాహు కాలం : ఉ.7:28ల ఉ.9:04
యమగండం : ఉ.10:39ల మ.12:13
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: వృషభం
స్థిర యోగం - శుభాశుభ మిశ్రమ ఫలం
24:35:03 వరకు తదుపరి వర్ధమాన యోగం
- ఉత్తమ ఫలం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 195 / Bhagavad-Gita - 195 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 33 🌴

*33. శ్రేయాన్ ద్రవ్యమాయాద్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ: పరన్తప |*
*సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే ||*

🌷. తాత్పర్యం :
*ఓ పరంతపా! జ్ఞానయజ్ఞము ద్రవ్యమయజ్ఞము కన్నను మహత్తరమైనది. ఓ పార్థా! కర్మయజ్ఞము లన్నియును చివరికి దివ్యజ్ఞానమునందే పరిసమాప్తి నొందును.*

🌷. భాష్యము :
సంపూర్ణ జ్ఞానస్థితిని సాధించి తద్ద్వారా భౌతికక్లేశముల నుండి బయటపడి అంత్యమున శ్రీకృష్ణభగవానుని ప్రేమయుక్తసేవ యందు (కృష్ణభక్తిరసభావనము) నియుక్తమగుటయే సర్వయజ్ఞముల ముఖ్యోద్దేశ్యమై యున్నది. అయినను ఈ యజ్ఞములకు సంబంధించిన ఒక రహస్యము కలదు. దానిని ప్రతియొక్కరు తప్పక ఎరుగవలెను. 

అదియే మన కర్త యొక్క శ్రద్ధ ననుసరించి యజ్ఞములు వివిధరూపములను దాల్చుచుండును. కర్తకు గల శ్రద్ధ దివ్యజ్ఞానస్థితికి చేరినప్పుడు, అట్టి కర్త జ్ఞానరహితముగా కేవలము తన సంపత్తులను త్యాగము చేయువాని కన్నను శ్రేష్టుడుగా గుర్తింపబడును. ఏలయన జ్ఞానప్రాప్తి కలుగనపుడు యజ్ఞములు భౌతికపరధికే చెంది ఎట్టి ఆధ్యాత్మికలాభమును గూర్చకుండును. అట్టి నిజమైన జ్ఞానము చివరికి దివ్యజ్ఞానపు ఉత్కృష్టస్థితియైన కృష్ణభక్తిరసభావనగా మార్పుచెందును. 

జ్ఞానవృద్ధి లేకుండా చేయబడు యజ్ఞములు కేవలము భౌతికకర్మలే కాగలవు. కాని అవి జ్ఞానస్థితికి చేరినప్పుడు సంపూర్ణ ఆధ్యాత్మిక స్థాయికి చేరగలవు. ఈ యజ్ఞములు వాటి ఉద్దేశ్యముల ననుసరించి కొన్నిమార్లు కర్మకాండగా( కామ్యకర్మములు), మరికొన్నిమార్లు జ్ఞానకాండగా (పరమాత్మాన్వేషణ జ్ఞానము) పిలువబడును. వాటి అంతిమలక్ష్యము జ్ఞానమే యగుట అత్యంత శ్రేష్టము.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 195 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 4 - Jnana Yoga - 33 🌴*

*33. śreyān dravya-mayād yajñāj jñāna-yajñaḥ paran-tapa*
*sarvaṁ karmākhilaṁ pārtha jñāne parisamāpyate*

🌷 Translation : 
*O chastiser of the enemy, the sacrifice performed in knowledge is better than the mere sacrifice of material possessions. After all, O son of Pṛthā, all sacrifices of work culminate in transcendental knowledge.*

🌹 Purport :
The purpose of all sacrifices is to arrive at the status of complete knowledge, then to gain release from material miseries and, ultimately, to engage in loving transcendental service to the Supreme Lord (Kṛṣṇa consciousness). Nonetheless, there is a mystery about all these different activities of sacrifice, and one should know this mystery. Sacrifices sometimes take different forms according to the particular faith of the performer. 

When one’s faith reaches the stage of transcendental knowledge, the performer of sacrifices should be considered more advanced than those who simply sacrifice material possessions without such knowledge, for without attainment of knowledge, sacrifices remain on the material platform and bestow no spiritual benefit. 

Real knowledge culminates in Kṛṣṇa consciousness, the highest stage of transcendental knowledge. Without the elevation of knowledge, sacrifices are simply material activities. When, however, they are elevated to the level of transcendental knowledge, all such activities enter onto the spiritual platform. Depending on differences in consciousness, sacrificial activities are sometimes called karma-kāṇḍa (fruitive activities) and sometimes jñāna-kāṇḍa (knowledge in the pursuit of truth). It is better when the end is knowledge.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 594 / Vishnu Sahasranama Contemplation - 594🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 594. వృషభాక్షః, वृषभाक्षः, Vr‌ṣabhākṣaḥ 🌻*

*ఓం వృషభాక్షాయ నమః | ॐ वृषभाक्षाय नमः | OM Vr‌ṣabhākṣāya namaḥ*

*వృషభాక్షః, वृषभाक्षः, Vr‌ṣabhākṣaḥ*

*వార్షుకేఽఖిలకామానామక్షిణీహ్యస్య మాపతేః ।*
*యస్మాత్తస్వాద్వృషభాక్ష ఇతి విష్ణుస్సమీర్యతే ॥*
*అథవా వృషభో ధర్మః దృష్టిరస్యేతి వా హరిః ।*
*వృషభాక్ష ఇతి ప్రోక్తో వేదవిద్యావిశారదైః ॥*

*వర్షతి ఇతి వృషః, వృషభః అను అర్థమున వర్షించునది. సర్వ కామములను వర్షించు కనులు ఈతనికి కలవు. లేదా వృషభము అనగా సర్వ కామములను వర్షించునదియగు ధర్మము ఈతనికి అక్షి అనగా దృష్టి లేదా కన్నుగా నున్నది.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 594🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻594. Vr‌ṣabhākṣaḥ🌻*

*OM Vr‌ṣabhākṣāya namaḥ*

वार्षुकेऽखिलकामानामक्षिणीह्यस्य मापतेः ।
यस्मात्तस्वाद्वृषभाक्ष इति विष्णुस्समीर्यते ॥
अथवा वृषभो धर्मः दृष्टिरस्येति वा हरिः ।
वृषभाक्ष इति प्रोक्तो वेदविद्याविशारदैः ॥

Vārṣuke’khilakāmānāmakṣiṇīhyasya māpateḥ,
Yasmāttasvādvr‌ṣabhākṣa iti viṣṇussamīryate.
Athavā vr‌ṣabho dharmaḥ dr‌ṣṭirasyeti vā hariḥ,
Vr‌ṣabhākṣa iti prokto vedavidyāviśāradaiḥ.

*वर्षति इति वृषः, वृषभः / Varṣati iti vr‌ṣaḥ, vr‌ṣabhaḥ from this derivation, as rain or bestow in abundance. Thus Vr‌ṣabhākṣaḥ is the One whose eyes bestow all that is desired in abundance.*

Or the One with eye or sight that bestows all that is desired in abundance.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
शुभाङ्गश्शान्तिदस्स्रष्टा कुमुदः कुवलेशयः ।गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः ॥ ६३ ॥

శుభాఙ్గశ్శాన్తిదస్స్రష్టా కుముదః కువలేశయః ।గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ 63 ॥

Śubhāṅgaśśāntidassraṣṭā kumudaḥ kuvaleśayaḥ,Gohito gopatirgoptā vr‌ṣabhākṣo vr‌ṣapriyaḥ ॥ 63 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 273 / DAILY WISDOM - 273 🌹*
*🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 29. ప్రకృతిని కాపాడడం మన తక్షణ కర్తవ్యం 🌻*

*పౌర విధులలో పర్యావరణ పరిగణనలు మరియు ప్రకృతి యొక్క వాస్తవ రూపాన్ని, స్వచ్ఛతను రక్షించే బాధ్యత కూడా ఉన్నాయి. పర్వతాలు నిలబడనివ్వండి, నదులు ప్రవహించనివ్వండి, చెట్లు పెరగనివ్వండి, స్వచ్ఛమైన గాలి వీచనివ్వండి మరియు వారి స్వేచ్ఛ, తాజాదనం మరియు నిర్మలత్వం లో ఎవరూ అడ్డు పడకూడదు. పొగ మరియు ధూళితో గాలిని కలుషితం చేయడం, నీటిపై వ్యర్థాలు మరియు ధూళిని వేయడం ద్వారా నీటిని నాశనం చేయడం, తాము నిలబడి ఉన్న నేల యొక్క బలానికి కారణమై మరియు తగిన ఋతువులో వర్షపాతానికి కారణమయ్యే చెట్లను నాశనం చేయడం మనిషి యొక్క పౌర నేరాలు. బహిరంగ మైదానంలో చెత్త వేయటం ప్రకృతికి మరియు ప్రజల ఆరోగ్యానికి నిషిద్ధం.*

*ఒక వ్యక్తి తనలా భావించి ప్రేమించవలసిన మొదటి సహోదరి ప్రకృతి కాదా? జీవం తనలో తాను నిర్వహించుకునే ఆర్థిక సూత్రాల ద్వారా మనుగడ సాగిస్తుంది. జీవం అనేది తన లక్షణాలలో హెచ్చుతగ్గులు లేకుండా సామరస్యతతో కూడిన వ్యవస్థ. ఆర్థిక పరిస్థితులు అంటే కేవలం బంగారం మరియు వెండి, భూమి మరియు ఆస్తులతో ఆగిపోవు. అర్థసాస్త్రం అనేది జీవితం మరియు శక్తి యొక్క పరిరక్షణ యొక్క , అంతర్గత సమతుల్యత నిర్వహణ యొక్క సూత్రం. శరీరం తన యొక్క సాధారణ అవసరాలు పెరగటం మరియు తగ్గటం వల్ల ఏ విధంగా అనారోగ్యం పాలవుతుందో అదే విధంగా మనసు కూడా అవసరమైన దానికంటే ఎక్కువ లేదా తక్కువ పనిచేయటం వల్ల తన శక్తిని కోల్పోతుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 273 🌹*
*🍀 📖 from Essays in Life and Eternity 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 29. Nature, the First and Immediate Neighbour 🌻*

*Civic duties also include ecological considerations and the obligation to protect nature in its originality and purity. Let mountains stand, let rivers flow, let trees grow, let fresh air blow, and let no one interfere with their freedom, freshness and innocence. Polluting air with smoke and dust, vitiating water by dumping waste and dirt on it, destroying living trees which are responsible for the strength of the ground on which they stand and are also responsible for rainfall in the suitable season, are civic offences on the part of man. Throwing garbage on open ground is prohibitory to commonweal and health of people.*

*Is not nature the first and immediate neighbour whom one has to love as one's own self? Life survives by the principle of economy it maintains in itself. Life is a system of harmony without excess in any of its features. Economic conditions do not exhaust themselves merely in gold and silver, land and property. Economy is the principle of the conservation of life and energy, the proper maintenance of balance in its internally adjusted parts. As more than the normal or less than the normal needs of the body may turn it sick and make it droop in weakness, so can the mind lose its power and become ill by either excessive activity or inactivity.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 173 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. నువ్వు నరకం కావచ్చు. నువ్వు స్వర్గం కావచ్చు. అదంతా నువ్వే. అది నీ నిర్ణయం. నరకం సృష్టించినట్లే స్వర్గాన్ని నువ్వే సృష్టించావు. అది ఒక మానసిక స్థితి. నువ్వు దాని సృష్టికర్త అని ఎప్పుడు గుర్తిస్తావో, గొప్ప స్వేచ్ఛని అప్పుడు పొందుతావు. 🍀*

*జీన్పాల్ సార్రేది విలువైన స్టేట్ మెంట్ వుంది. యితరమైన ప్రతిదీ నరకమే! దాదాపు ప్రపంచంలోని అందరి అభిప్రాయమదే. కేవలం కొందరు 'బుద్ధుల అభిప్రాయం మాత్రమే దానికి భిన్నమైంది. 'యితరమైన ప్రతిదీ నరకమే' నేను అతన్తో ఏకీభవించను. అది లక్షల మంది అనుభవం ఐనా కావచ్చు. అది కరక్టే అనిపిస్తుంది. కానీ కరెక్టు కాదు. అది కేవలం నువ్వు. నువ్వు నరకం కావచ్చు. నువ్వు స్వర్గం కావచ్చు. అదంతా నువ్వే. అది నీ నిర్ణయం.*

*స్వర్గం ఎక్కడో లేదు. నరకం సృష్టించినట్లే స్వర్గాన్ని నువ్వే సృష్టించావు. అది ఒక మానసిక స్థితి. నువ్వు దాని సృష్టికర్త అని ఎప్పుడు గుర్తిస్తావో. గొప్ప స్వేచ్ఛని అప్పుడు పొందుతావు. యితరులు బాధ్యులయితే నీకు స్వేచ్చ వుండదు. నువ్వొక దాస్యంలో వున్నావు. అందువల్ల యితరులు నీకు సుఖదు:ఖాలు సృష్టిస్తున్నారను కుంటున్నావు. రెండు రకాలుగా నువ్వు ఆధారపడి వున్నావు. కానీ ఎవ్వరూ ఆధారపడి వుండాలనుకోరు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 112 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 88. రుచికర బోధనము 🌻*

*మా బోధనలు సంప్రదాయక బోధనలకన్న భిన్నముగ నున్నవని చాల మంది భావింతురు. సృష్టి పరిణామ కథలో బోధనలు కూడ పరిణామము చెందుచున్నవి. కాలమును, దేశమును, ప్రజల సంస్కృతిని బట్టి బోధనలు అందించు విధానమున కొంత మార్పు జరుగుచుండును. బోధనల ఆశయము జీవులకు జ్ఞానాసక్తి కలిగించుటయే. ఆసక్తి కలుగవలెనన్నచో, బోధనలయందు కొంత ఆకర్షణ యుండవలెను. ఆకర్షితులైన జీవులు జ్ఞానమున ప్రవేశించుటకు వీలగును. జీవులను చైతన్య మార్గమున ముందునకు నడుపుటయే మా ఏకైక ఆశయము. ఆశయ నిర్వహణమునకై మా బృందము రకరకములగ బోధనలను చేయును.*

*బోధనల ముఖ్య ఉద్దేశ్యము, శ్రద్ధను కలిగించి జ్ఞానమున ప్రవేశపెట్టుట. ఆకలి తీర్చుటకై ఆహారము భుజించుట అవశ్యకము. ఆహారము పోషకాహారమై యుండవలెను. పోషణమునకు విరుద్ధము కాని రుచి భుజించువారికి ఆహారమునందాసక్తి కలిగించును. రుచికాకర్షింపబడి పోషకమగు ఆహారమును భుజించువాడు శరీర పుష్టినెట్లు పొందునో, అట్లే బోధనలు రుచికరము చేయవలెను. అనుసరించు వారికి రుచి కలుగవలెను. రుచి అనగా వెలుగు అని కూడ అర్థమున్నది. బోధనలయందు రుచి జ్ఞానముగ ఆవిర్భ వించును.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 367-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 367-1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 367-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 367-1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 81. పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా ।
మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥ 🍀

🌻 367-1.‘ప్రత్యక్చితీ’🌻


అంతర్ముఖముగ ఆత్మదర్శనము చేయుచు నుండునది శ్రీమాత అని అర్థము. ప్రత్యక్చితినే ప్రతీచి యని కూడా అందురు. అవ్యక్తమగు పర తత్త్వము నుండి విడివడి ఎదురుగ నిలచి పరతత్వమునే దర్శనము చేయుట ప్రత్యక్చితి అందురు. పశ్చిమమున నుండి తూర్పును దర్శించుట వలన కూడ ప్రతీచి అని పిలువబడును. శుద్ధ చైతన్యముగ అవ్యక్తము నుండి ప్రత్యేకముగ విడువడినది గనుక ప్రత్యక్చితి అని పిలుతురు. ప్రళయము పిదప సృష్టి ప్రారంభమునకు మొదటి మేలుకొలుపై ఏర్పడు సంకల్పము అని తెలియదగును. నిద్ర నుండి అపుడపుడే యేర్పడుచున్న ప్రాగ్ అవస్థ అనికూడ తెలియవచ్చును.

ఈ అవస్థను విచికీర్ష అని కూడ అనవచ్చును. ఇచ్ఛ కారణముగ నిద్ర నుండి మెలకువ వచ్చును. కావున ప్రథమమగు ఇచ్ఛయే విచికీర్ష అనవచ్చును. విచికీర్ష ఉద్భవించి ఈవలకు వచ్చి అభిముఖమై వున్నప్పుడు ప్రత్యక్చితి అందురు. అనగా చైతన్య రూపమున ప్రత్యేకమై ఎదురుగ నిలబడినది అని అర్థము. విడివడి ప్రత్యేకముగ నున్ననూ ఆత్మనే దర్శించు స్థితి, ఆత్మజ్ఞానము నందున్న స్థితిని ప్రత్యక్చితి అని నిర్వచింప వచ్చును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 367-1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 81.Parapratyakchitirupa pashyanti paradevata
Madhyama vaikharirupa bhaktamanasa hansika ॥ 81 ॥ 🌻


🌻 367-1. Pratyak-citī-rūpā प्रत्यक्-चिती-रूपा 🌻

Pratyak means turned towards the inner soul and cit means consciousness. She is in the form of inner consciousness which is known as inner Self. Pratyak is opposed to parāk, which means turned outwards that happens with the help of senses. Inner consciousness is considered as the supreme level of consciousness. Life energy interacts with internal awareness, paving way for higher level of consciousness.

The lower or higher level of consciousness purely depends upon the purity of the mind. Purity of the mind depends upon the level of usage of sensory organs. Looking within means, the process of interaction between life energy or prāṇa with consciousness or cit. This is called the Supreme Self or the Brahman in un-manifested form, which is the essential nature of the Brahman.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


01 May 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 176. గ్రహ జీవిగా ఉండండి / Osho Daily Meditations - 176. PLANETARY BEING


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 176 / Osho Daily Meditations - 176 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 176. గ్రహ జీవిగా ఉండండి 🍀

🕉. భూమి అవిభాజ్యమైనది. భారతదేశం, పాకిస్తాన్, ఇంగ్లాండ్ మరియు జర్మనీలు మ్యాప్‌లలో మాత్రమే ఉన్నాయి. ఆ మ్యాప్‌లను రాజకీయ నాయకులు, అధికార పిచ్చి ఉన్న వ్యక్తులు సృష్టించారు. ఈ భూమి అంతా నీది. 🕉


భూమి మీద మీరు దేనితోనూ గుర్తింపబడాల్సిన అవసరం లేదు. సంకుచితత్వానికే ఎందుకు పరిమితమయ్యారు? రాజకీయాలకే ఎందుకు పరిమితం కావాలి? భూమి యొక్క మొత్తం వారసత్వాన్ని అందుకోండి. ఇది మీ భూమి. జాతీయ జీవిగా కాకుండా గ్రహ జీవిగా ఉండండి. భారతదేశం మరియు ఇంగ్లండ్ గురించి మరచిపోయి మొత్తం భూగోళం గురించి ఆలోచించండి. ప్రతి ఒక్కరినీ సోదరులు మరియు సోదరీమణులుగా భావించండి; వారు అదే! మీరు భారతీయులైతే ఇతరులకు మీరు వ్యతిరేకం. మీరు ఉండాలి, లేకపోతే మీ భారతీయతను ఎలా నిర్వచించు కుంటారు? మీరు చైనాకు వ్యతిరేకంగా, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా, అన్నిటికీ వ్యతిరేకంగా ఉన్నారు; అన్ని గుర్తింపులు ప్రాథమికంగా వ్యతిరేకత కలిగి ఉన్నాయి. మీరు ఏదైనా ఒక దానికి మాత్రమే పరిమితమైతే, మీరు సహజంగానే మరొకదానికి వ్యతిరేకంగా ఉంటారు.

అనుకూలంగా మరియు వ్యతిరేకంగా ఉండకండి- కేవలం ఉండండి. ఆలోచించడానికి మంచి విషయాలు చాలా ఉన్నాయి. 'క్షయవ్యాధి లేదా క్యాన్సర్‌లో నన్ను నేను ఏ వ్యాధితో గుర్తించు కోవాలి?' అని మీరు అడగకూడదు. ఈ జాతీయ గుర్తింపులు క్షయ మరియు క్యాన్సర్ లాంటివి. మెరుగైన ప్రపంచంలో దేశాలు ఉండవు, ఉన్నత ప్రపంచంలో మతాలు ఉండవు. మనిషిగా ఉండటమే సరిపోతుంది, మరియు ఏదో ఒక్కరోజు దాన్ని కూడా దాటి వెళ్లాలి; అప్పుడు పరమాత్మ అవుతాడు. అప్పుడు ఈ భూమి కూడా నిన్ను పరిమితం చేయడానికి చాలా చిన్నది అయిపోతుంది. అప్పుడు నక్షత్రాలు కూడా నీవే, ఈ విశ్వమంతా నీదే. విశ్వవ్యాప్తం అయినప్పుడే, నువ్వు గమ్యం చేరినట్టు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Osho Daily Meditations - 176 🌹

📚. Prasad Bharadwaj

🍀 176. PLANETARY BEING 🍀

🕉 The earth is undivided. India and Pakistan and England and Germany exist only on maps, and those maps are created by the politicians, the power-mad people. This whole earth is yours. 🕉


There is no need to identify with anything. Why become confined to small territories? Why be confined by politics? Claim the whole heritage of the earth. It is your earth. Be a planetary being rather than a national one. Forget about India and England and think of the whole globe. Think of each and everyone as brothers and sisters; they are! When you are an Indian you are against others. You have to be, otherwise how will you define your Indianhood? You are against China, against Pakistan, and against this and against that; all identifications are basically against. When you are for something, you are against something else, naturally.

Don't be for and against- just be. There are better things to think about. You don't ask, "With what disease should I identify myself-tuberculosis or cancer?"You don't ask that. These national identities are just like tuberculosis and cancer. In a better world there will be no countries, in a higher world there will be no religions. To be human is enough, and one has even to go beyond that one day; then one becomes divine. Then even this earth is too small to contain you, then the stars are also yours, this whole universe is yours. And when one becomes universal, one has arrived.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


01 May 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 41 / Agni Maha Purana - 41


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 41 / Agni Maha Purana - 41 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 15

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. పాండవ చరిత వర్ణనము - 1 🌻


అగ్ని పలికెను: ఓ ద్విజుడా! యుద్ధిష్ఠురుడు రాజ్యము చేయుచుంéడగా ధృతరాష్ట్రడును, గాందారియు, కుంతియు, అరణ్యమునకు వెళ్ళి ఒక ఆశ్రమమునుండి మరి యొక ఆశ్రమమునకు సంచరించుచుండిరి.

విదురుడు దావాగ్నిచే దగ్ధుడై మృతి చెందెను. ఈ విధముగ మహావిష్ణువు పాండవులను నిమిత్తముగ చేసి కొని, ధర్మరక్షణముకొరకును, అధర్మవినాశమునకు, పూనుకొని దానవాదిక మగు భూభారమును హరించెను. విప్రశాప మను వంకచే, ముసలముచే, భూభారకర మగు యాదవకులమును నశింపచేసెను.

శ్రీకృష్ణుడు వజ్రుని రాజ్యాభిషిక్తుని చేసి దేవతల ఆదేశమునే ప్రభాసక్షేత్రమునందు తన దేహమును పరిత్యజించి, ఇంద్రలోక బ్రహ్మలోకములందు స్వర్గవాసులచే పూజింపబడెను. బలరాముడు ఆదిశేషరూపధారి యై పాతాళ స్వర్గము చేరెను.

వినాశరహితు డగు ఆ శ్రీ హరి యోగులచే ధ్యానింపబడు వాడు. అట్టి శ్రీ కృష్ణుడు లేని ద్వారకను సముద్రము ముంచివేసెను.

అర్జునుడు యాదవులకు ప్రేత సంస్కారాదులు చేసి ఉదకధనాదిదానములు చేసెను. అష్టావక్రుని శాపముచే విష్ణుభార్యలుగా అయిన స్త్రీలను, మరల అతని శాపము చేతనే, కఱ్ఱలు ఆయుధములుగా గల రోపాలకులు అర్జునుని ఓడించి తీసికొని పోయిరి. అర్జునుడు చాల శోకించెను. వ్యాసు డాతనిని ఊరడించెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 41 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj


Chapter 15

🌻 Ascendance of Pāṇḍavas to heaven - 1 🌻


Agni said:

1. O Brahmin! When Yudhiṣṭhira was ruling the kingdom, Dhṛtarāṣṭra went to the forest along with Gāndhārī and Pṛthā (Kuntī) and passed from one stage of life to another.

2-5. Vidura was burnt by the forest fire and ascended heavens. Thus, Viṣṇu removed the oppression of demons and others on the earth, for the sake of dharma and for the destruction of adharma and having the Pāṇḍavas as an apparent cause. Having the curse of a brahmin, as a pretext, he destroyed with the club, the race of Yādavas who were oppressing (the world) Then (he) installed Vajra (son of Aniruddha) in the kingdom. On the directive of celestials, Hari himself having discarded his body at Prabhāsa, is being worshipped by the residents of heavens at the worlds of Indra and Brahmā. Balabhadra, (who was) a form of Ananta, reached heavens in the nether world.

6. Hari, the imperishable lord, is always to be contemplated upon by those who meditate (on him). Without him (at Dvārakā), the ocean flooded the city of Dvārakā.

7-8. Pārtha (Arjuna), having performed the obsequies of Yādavas, and having offered the waters of oblation and money, felt grief-stricken when the women, who were the wives of Viṣṇu (Kṛṣṇa), were carried away by the shepherds (using) the clubs as weapons and defeating Arjuna on account of the curse of Aṣṭāvakra.[1]


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


01 May 2022

శ్రీ శివ మహా పురాణము - 557 / Sri Siva Maha Purana - 557


🌹 . శ్రీ శివ మహా పురాణము - 557 / Sri Siva Maha Purana - 557 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 52 🌴

🌻. పెండ్లి వారి భోజనములు - 3 🌻


అందరిచే ఆశ్చర్యముతో చూడబడే ఇట్టి గృహమును చూచి మహేశ్వరుడు హిమవంతుని ప్రశంసించి సంతుష్టుడాయెను (24). ఆ భవనములో ఉత్తమము అతిరమణీయము అగు రత్నపర్యంకముపై పరమేశ్వరుడు ఆనందముతో కూడిన వాడై లీలగా శయనించెను (25).

హిమవంతుడు తన సోదరులను, ఇతరులను చక్కని మృష్టాన్నముతో ఆనందింపజేసి ఇతర కృత్యములను కూడ చేసెను (26). హిమవంతుడు ఇట్లు కార్యమగ్నుడై యుండగా, ప్రియతముడగు ఈశ్వరుడు నిద్రించుచుండగా, రాత్రి గడచిపోయి, ప్రాతఃకాలమయ్యెను (27). అపుడా ప్రభాత సమయములో జనులు ధైర్యోత్సాహములతో నిండినవారై అనేక రకముల వాద్యములను మ్రోయించిరి (28).

విష్ణువు మొదలగు దేవతలందరు ఆనందముతో నిద్రలేచి తమ ఇష్టదైవమగు ఈశ్వరుని స్మరించి తొందరగా సంసిద్ధులైరి (29). వారు కైలాసమునకు వెళ్లుటకై ఉత్సుకత గలవారై తమ వాహనములను సిద్ధము చేసుకొని ధర్ముని శివుని వద్దకు పంపిరి (30). యోగి యగు ధర్ముడు అపుడు వాసగృహమునకు వచ్చి నారాయణుని ఆజ్ఞచే యోగిశ్రేష్ఠుడగు శివునితో సమయానురూపముగా నిట్లు పలికెను (31).

ధర్ముడిట్లు పలికెను-

ఓ ప్రమథ పతీ! లెమ్ము, లెమ్ము, నీకు మంగళమగుగాక! మాకు మంగళములనిమ్ము. జనుల నివాసము వద్దకు రమ్ము. ఆచట వారిని కృతార్థులను చేయుము (32).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 557 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 52 🌴

🌻 The bridegroom’s party is fed and Śiva retires to bed - 3 🌻


24. Seeing all these wonderful representations lord Śiva praised Himavat and was very glad.

25. In that bedchamber, in a beautiful gemset couch lord Śiva lay down with pleasure.

26. Himavat fed all his brothers and others with pleasure and attended to the subsequent duties.

27. While the supreme lord had his sleep and the lord of the mountains was engaged in these duties, the night passed away giving place to dawn.

28. In the morning the enthusiastic people began to play on different kinds of musical instruments.

29. Viṣṇu and the other gods got up with joy, remembered the lord of gods and excitedly got ready.

30. They got their vehicles ready for the departure to Kailāsa and sent Dharma to Śiva.

31. At the bidding of Viṣṇu, Dharma went near the bed chamber. The Yogin Dharma addressed Śiva, the lord of Yogins, in a manner befitting the context.


Dharma said:—

32. Get up, get up O Śiva, O lord of the Pramathas. Please come over to the audience hall. Make the assembled people gratified.


Continues....

🌹🌹🌹🌹🌹


01 May 2022

కపిల గీత - 1 - కపిల భగవానుని ఆగమన ఉద్ధేశ్యము -1 / Kapila Gita - 1 - The Purpose of Lord Kapila's Advent - 1


🌹. కపిల గీత - 1 / Kapila Gita - 1🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴. కపిల భగవానుని ఆగమన ఉద్ధేశ్యము -1 🌴



1. శౌనక ఉవాచ

కపిలస్తత్త్వసఙ్ఖ్యాతా భగవానాత్మమాయయా
జాతః స్వయమజః సాక్షాదాత్మప్రజ్ఞప్తయే నృణామ్


భగవానుడైన కపిలుడు జన్మలేని వాడై ఉండి తన సంకల్పముతో పుట్టి తత్వములను నిరూపించాడు. మానవులకు ఆత్మ బోధ చేయడానికి ఏ పుట్టుకా లేని పరమాత్మ తన సంకల్పముతో పుట్టాడు.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 1 🌹

✍️ Swami Prabhupada.
📚 Prasad Bharadwaj

🌴 The Purpose of Lord Kapila's Advent - 1 🌴


1. saunaka uvaca :

kapilas tattva-sankhyata bhagavan atma-mayaya
jatah svayam ajah saksad atma-prajnaptaye nrnam


1. Sri Saunaka said : Although He is unborn, the Supreme Personality of Godhead took birth as Kapila Muni by His internal potency. He descended to disseminate transcendental knowledge for the benefit of the whole human race.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


01 May 2022

01 - MAY - 2022 ఆదివారం, ఇందు వాసరే MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 01, ఆదివారం, మే 2022 ఇందు వాసరే 🌹 
🌹 కపిల గీత - 1 / Kapila Gita - 1 🌹
2) 🌹. శివ మహా పురాణము - 557 / Siva Maha Purana - 557🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 41 / Agni Maha Purana - 41 🌹
4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 177 / Osho Daily Meditations - 177🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 367-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 367-1 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹*
*భాను వాసరే, 01, మే 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. శ్రీ సూర్య పంజర స్తోత్రం -3 🍀*

*3. ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ।*
*ఓం హంసాం హంసీం హంసూం హంసైం హంసౌం హంసః ॥*
*4. ఓం సత్యతేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుమ్భాయ హుం ఫట్ స్వాహా ।*
*ఓం స్థితిరూపకకారణాయ పూర్వాదిగ్భాగే మాం రక్షతు ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : వనరులు, కాలము మరియు శక్తి ఈ మూడు మనిషి జీవితానికి ఆవశ్యకము. శక్తి లేకపోతే కాలమును, వనరులను ఉపయోగించలేము. శక్తి సంపాదనమే ముఖ్యం. - మాస్టర్‌ ఆర్‌.కె.🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, చైత్ర మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిధి : అమావాస్య - తె.2:01వరకు
నక్షత్రం : భరణి - రా.10:11వరకు
యోగం : ఆయుష్మాన్ -మ.3:18 వరకు
కరణం : నాగవ - తె.2:01 వరకు,
కింస్తుగ్ -మ.2:40 వరకు
సూర్యోదయం : ఉ.5:55 
సూర్యాస్తమయం : సా.6:33
అభిజత్ ముహూర్తం : ఉ.11:48 - 
మ.12:39 వరకు
బ్రహ్మ ముహూర్తం : తె.4:19 - తె.5:07
అమృత కాలం : సా.4:58 - రా.6:56
వర్జ్య కాలం : ఉ.6:34 - ఉ.8:31
గుళిక : మ.3:23 - సా.4:58
దుర్ముహూర్తం : సా.4:51 - సా.5:42
రాహు కాలం : సా.4:58 - సా.6:33
యమగండం : మ.12:13 - మ.1:48
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: మేషం 
కాలదండ యోగం - మృత్యు భయం
22:12:51 వరకు తదుపరి ధూమ్ర
యోగం - కార్య భంగం, సొమ్ము నష్టం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 1 / Kapila Gita - 1🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴. కపిల భగవానుని ఆగమన ఉద్ధేశ్యము -1 🌴*

*1. శౌనక ఉవాచ*
*కపిలస్తత్త్వసఙ్ఖ్యాతా భగవానాత్మమాయయా*
*జాతః స్వయమజః సాక్షాదాత్మప్రజ్ఞప్తయే నృణామ్*

*భగవానుడైన కపిలుడు జన్మలేని వాడై ఉండి తన సంకల్పముతో పుట్టి తత్వములను నిరూపించాడు. మానవులకు ఆత్మ బోధ చేయడానికి ఏ పుట్టుకా లేని పరమాత్మ తన సంకల్పముతో పుట్టాడు.*

సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 1 🌹*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*

*🌴 The Purpose of Lord Kapila's Advent - 1 🌴*

*1. saunaka uvaca :* 
*kapilas tattva-sankhyata bhagavan atma-mayaya*
*jatah svayam ajah saksad atma-prajnaptaye nrnam*

*1. Sri Saunaka said : Although He is unborn, the Supreme Personality of Godhead took birth as Kapila Muni by His internal potency. He descended to disseminate transcendental knowledge for the benefit of the whole human race.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#కపిలగీత #KapilaGita
#కపిలగీతKapilaGita
 #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 557 / Sri Siva Maha Purana - 557 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 52 🌴*

*🌻. పెండ్లి వారి భోజనములు - 3 🌻*

అందరిచే ఆశ్చర్యముతో చూడబడే ఇట్టి గృహమును చూచి మహేశ్వరుడు హిమవంతుని ప్రశంసించి సంతుష్టుడాయెను (24). ఆ భవనములో ఉత్తమము అతిరమణీయము అగు రత్నపర్యంకముపై పరమేశ్వరుడు ఆనందముతో కూడిన వాడై లీలగా శయనించెను (25). 

హిమవంతుడు తన సోదరులను, ఇతరులను చక్కని మృష్టాన్నముతో ఆనందింపజేసి ఇతర కృత్యములను కూడ చేసెను (26). హిమవంతుడు ఇట్లు కార్యమగ్నుడై యుండగా, ప్రియతముడగు ఈశ్వరుడు నిద్రించుచుండగా, రాత్రి గడచిపోయి, ప్రాతఃకాలమయ్యెను (27). అపుడా ప్రభాత సమయములో జనులు ధైర్యోత్సాహములతో నిండినవారై అనేక రకముల వాద్యములను మ్రోయించిరి (28).

విష్ణువు మొదలగు దేవతలందరు ఆనందముతో నిద్రలేచి తమ ఇష్టదైవమగు ఈశ్వరుని స్మరించి తొందరగా సంసిద్ధులైరి (29). వారు కైలాసమునకు వెళ్లుటకై ఉత్సుకత గలవారై తమ వాహనములను సిద్ధము చేసుకొని ధర్ముని శివుని వద్దకు పంపిరి (30). యోగి యగు ధర్ముడు అపుడు వాసగృహమునకు వచ్చి నారాయణుని ఆజ్ఞచే యోగిశ్రేష్ఠుడగు శివునితో సమయానురూపముగా నిట్లు పలికెను (31).

ధర్ముడిట్లు పలికెను-

ఓ ప్రమథ పతీ! లెమ్ము, లెమ్ము, నీకు మంగళమగుగాక! మాకు మంగళములనిమ్ము. జనుల నివాసము వద్దకు రమ్ము. ఆచట వారిని కృతార్థులను చేయుము (32).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 557 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 52 🌴*

*🌻 The bridegroom’s party is fed and Śiva retires to bed - 3 🌻*

24. Seeing all these wonderful representations lord Śiva praised Himavat and was very glad.

25. In that bedchamber, in a beautiful gemset couch lord Śiva lay down with pleasure.

26. Himavat fed all his brothers and others with pleasure and attended to the subsequent duties.

27. While the supreme lord had his sleep and the lord of the mountains was engaged in these duties, the night passed away giving place to dawn.

28. In the morning the enthusiastic people began to play on different kinds of musical instruments.

29. Viṣṇu and the other gods got up with joy, remembered the lord of gods and excitedly got ready.

30. They got their vehicles ready for the departure to Kailāsa and sent Dharma to Śiva.

31. At the bidding of Viṣṇu, Dharma went near the bed chamber. The Yogin Dharma addressed Śiva, the lord of Yogins, in a manner befitting the context.
Dharma said:—

32. Get up, get up O Śiva, O lord of the Pramathas. Please come over to the audience hall. Make the assembled people gratified.
Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 41 / Agni Maha Purana - 41 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 15*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. పాండవ చరిత వర్ణనము - 1 🌻*

అగ్ని పలికెను: ఓ ద్విజుడా! యుద్ధిష్ఠురుడు రాజ్యము చేయుచుంéడగా ధృతరాష్ట్రడును, గాందారియు, కుంతియు, అరణ్యమునకు వెళ్ళి ఒక ఆశ్రమమునుండి మరి యొక ఆశ్రమమునకు సంచరించుచుండిరి.

విదురుడు దావాగ్నిచే దగ్ధుడై మృతి చెందెను. ఈ విధముగ మహావిష్ణువు పాండవులను నిమిత్తముగ చేసి కొని, ధర్మరక్షణముకొరకును, అధర్మవినాశమునకు, పూనుకొని దానవాదిక మగు భూభారమును హరించెను. విప్రశాప మను వంకచే, ముసలముచే, భూభారకర మగు యాదవకులమును నశింపచేసెను.

శ్రీకృష్ణుడు వజ్రుని రాజ్యాభిషిక్తుని చేసి దేవతల ఆదేశమునే ప్రభాసక్షేత్రమునందు తన దేహమును పరిత్యజించి, ఇంద్రలోక బ్రహ్మలోకములందు స్వర్గవాసులచే పూజింపబడెను. బలరాముడు ఆదిశేషరూపధారి యై పాతాళ స్వర్గము చేరెను. 

వినాశరహితు డగు ఆ శ్రీ హరి యోగులచే ధ్యానింపబడు వాడు. అట్టి శ్రీ కృష్ణుడు లేని ద్వారకను సముద్రము ముంచివేసెను.

అర్జునుడు యాదవులకు ప్రేత సంస్కారాదులు చేసి ఉదకధనాదిదానములు చేసెను. అష్టావక్రుని శాపముచే విష్ణుభార్యలుగా అయిన స్త్రీలను, మరల అతని శాపము చేతనే, కఱ్ఱలు ఆయుధములుగా గల రోపాలకులు అర్జునుని ఓడించి తీసికొని పోయిరి. అర్జునుడు చాల శోకించెను. వ్యాసు డాతనిని ఊరడించెను. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 41 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

*Chapter 15*
*🌻 Ascendance of Pāṇḍavas to heaven - 1 🌻*

Agni said:
1. O Brahmin! When Yudhiṣṭhira was ruling the kingdom, Dhṛtarāṣṭra went to the forest along with Gāndhārī and Pṛthā (Kuntī) and passed from one stage of life to another.

2-5. Vidura was burnt by the forest fire and ascended heavens. Thus, Viṣṇu removed the oppression of demons and others on the earth, for the sake of dharma and for the destruction of adharma and having the Pāṇḍavas as an apparent cause. Having the curse of a brahmin, as a pretext, he destroyed with the club, the race of Yādavas who were oppressing (the world) Then (he) installed Vajra (son of Aniruddha) in the kingdom. On the directive of celestials, Hari himself having discarded his body at Prabhāsa, is being worshipped by the residents of heavens at the worlds of Indra and Brahmā. Balabhadra, (who was) a form of Ananta, reached heavens in the nether world.

6. Hari, the imperishable lord, is always to be contemplated upon by those who meditate (on him). Without him (at Dvārakā), the ocean flooded the city of Dvārakā.

7-8. Pārtha (Arjuna), having performed the obsequies of Yādavas, and having offered the waters of oblation and money, felt grief-stricken when the women, who were the wives of Viṣṇu (Kṛṣṇa), were carried away by the shepherds (using) the clubs as weapons and defeating Arjuna on account of the curse of Aṣṭāvakra.[1]

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join 
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 176 / Osho Daily Meditations - 176 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 176. గ్రహ జీవిగా ఉండండి 🍀*

*🕉. భూమి అవిభాజ్యమైనది. భారతదేశం, పాకిస్తాన్, ఇంగ్లాండ్ మరియు జర్మనీలు మ్యాప్‌లలో మాత్రమే ఉన్నాయి. ఆ మ్యాప్‌లను రాజకీయ నాయకులు, అధికార పిచ్చి ఉన్న వ్యక్తులు సృష్టించారు. ఈ భూమి అంతా నీది. 🕉*
 
*భూమి మీద మీరు దేనితోనూ గుర్తింపబడాల్సిన అవసరం లేదు. సంకుచితత్వానికే ఎందుకు పరిమితమయ్యారు? రాజకీయాలకే ఎందుకు పరిమితం కావాలి? భూమి యొక్క మొత్తం వారసత్వాన్ని అందుకోండి. ఇది మీ భూమి. జాతీయ జీవిగా కాకుండా గ్రహ జీవిగా ఉండండి. భారతదేశం మరియు ఇంగ్లండ్ గురించి మరచిపోయి మొత్తం భూగోళం గురించి ఆలోచించండి. ప్రతి ఒక్కరినీ సోదరులు మరియు సోదరీమణులుగా భావించండి; వారు అదే! మీరు భారతీయులైతే ఇతరులకు మీరు వ్యతిరేకం. మీరు ఉండాలి, లేకపోతే మీ భారతీయతను ఎలా నిర్వచించు కుంటారు? మీరు చైనాకు వ్యతిరేకంగా, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా, అన్నిటికీ వ్యతిరేకంగా ఉన్నారు; అన్ని గుర్తింపులు ప్రాథమికంగా వ్యతిరేకత కలిగి ఉన్నాయి. మీరు ఏదైనా ఒక దానికి మాత్రమే పరిమితమైతే, మీరు సహజంగానే మరొకదానికి వ్యతిరేకంగా ఉంటారు.*

*అనుకూలంగా మరియు వ్యతిరేకంగా ఉండకండి- కేవలం ఉండండి. ఆలోచించడానికి మంచి విషయాలు చాలా ఉన్నాయి. 'క్షయవ్యాధి లేదా క్యాన్సర్‌లో నన్ను నేను ఏ వ్యాధితో గుర్తించు కోవాలి?' అని మీరు అడగకూడదు. ఈ జాతీయ గుర్తింపులు క్షయ మరియు క్యాన్సర్ లాంటివి. మెరుగైన ప్రపంచంలో దేశాలు ఉండవు, ఉన్నత ప్రపంచంలో మతాలు ఉండవు. మనిషిగా ఉండటమే సరిపోతుంది, మరియు ఏదో ఒక్కరోజు దాన్ని కూడా దాటి వెళ్లాలి; అప్పుడు పరమాత్మ అవుతాడు. అప్పుడు ఈ భూమి కూడా నిన్ను పరిమితం చేయడానికి చాలా చిన్నది అయిపోతుంది. అప్పుడు నక్షత్రాలు కూడా నీవే, ఈ విశ్వమంతా నీదే. విశ్వవ్యాప్తం అయినప్పుడే, నువ్వు గమ్యం చేరినట్టు.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 176 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 176. PLANETARY BEING 🍀*

*🕉 The earth is undivided. India and Pakistan and England and Germany exist only on maps, and those maps are created by the politicians, the power-mad people. This whole earth is yours. 🕉*
 
*There is no need to identify with anything. Why become confined to small territories? Why be confined by politics? Claim the whole heritage of the earth. It is your earth. Be a planetary being rather than a national one. Forget about India and England and think of the whole globe. Think of each and everyone as brothers and sisters; they are! When you are an Indian you are against others. You have to be, otherwise how will you define your Indianhood? You are against China, against Pakistan, and against this and against that; all identifications are basically against. When you are for something, you are against something else, naturally.*

*Don't be for and against- just be. There are better things to think about. You don't ask, "With what disease should I identify myself-tuberculosis or cancer?"You don't ask that. These national identities are just like tuberculosis and cancer. In a better world there will be no countries, in a higher world there will be no religions. To be human is enough, and one has even to go beyond that one day; then one becomes divine. Then even this earth is too small to contain you, then the stars are also yours, this whole universe is yours. And when one becomes universal, one has arrived.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 367-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 367-1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 81. పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా ।*
*మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥ 🍀*

*🌻 367-1.‘ప్రత్యక్చితీ’🌻* 

*అంతర్ముఖముగ ఆత్మదర్శనము చేయుచు నుండునది శ్రీమాత అని అర్థము. ప్రత్యక్చితినే ప్రతీచి యని కూడా అందురు. అవ్యక్తమగు పర తత్త్వము నుండి విడివడి ఎదురుగ నిలచి పరతత్వమునే దర్శనము చేయుట ప్రత్యక్చితి అందురు. పశ్చిమమున నుండి తూర్పును దర్శించుట వలన కూడ ప్రతీచి అని పిలువబడును. శుద్ధ చైతన్యముగ అవ్యక్తము నుండి ప్రత్యేకముగ విడువడినది గనుక ప్రత్యక్చితి అని పిలుతురు. ప్రళయము పిదప సృష్టి ప్రారంభమునకు మొదటి మేలుకొలుపై ఏర్పడు సంకల్పము అని తెలియదగును. నిద్ర నుండి అపుడపుడే యేర్పడుచున్న ప్రాగ్ అవస్థ అనికూడ తెలియవచ్చును.*

*ఈ అవస్థను విచికీర్ష అని కూడ అనవచ్చును. ఇచ్ఛ కారణముగ నిద్ర నుండి మెలకువ వచ్చును. కావున ప్రథమమగు ఇచ్ఛయే విచికీర్ష అనవచ్చును. విచికీర్ష ఉద్భవించి ఈవలకు వచ్చి అభిముఖమై వున్నప్పుడు ప్రత్యక్చితి అందురు. అనగా చైతన్య రూపమున ప్రత్యేకమై ఎదురుగ నిలబడినది అని అర్థము. విడివడి ప్రత్యేకముగ నున్ననూ ఆత్మనే దర్శించు స్థితి, ఆత్మజ్ఞానము నందున్న స్థితిని ప్రత్యక్చితి అని నిర్వచింప వచ్చును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 367-1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 81.Parapratyakchitirupa pashyanti paradevata*
*Madhyama vaikharirupa bhaktamanasa hansika ॥ 81 ॥ 🌻*

*🌻 367-1. Pratyak-citī-rūpā प्रत्यक्-चिती-रूपा 🌻*

*Pratyak means turned towards the inner soul and cit means consciousness. She is in the form of inner consciousness which is known as inner Self. Pratyak is opposed to parāk, which means turned outwards that happens with the help of senses. Inner consciousness is considered as the supreme level of consciousness. Life energy interacts with internal awareness, paving way for higher level of consciousness.*

*The lower or higher level of consciousness purely depends upon the purity of the mind. Purity of the mind depends upon the level of usage of sensory organs. Looking within means, the process of interaction between life energy or prāṇa with consciousness or cit. This is called the Supreme Self or the Brahman in un-manifested form, which is the essential nature of the Brahman.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

మైత్రేయ మహర్షి బోధనలు - 111


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 111 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 87. అప్రమత్తత 🌻


సద్గురువు చిన్న చిన్న విషయముల యందు అప్రమత్తులై వుండవలెనని బోధించు చుండును. తాను ఆచరించి చూపించును. చిన్న విషయమునకు ఇంత రాద్ధాంతము చేయుట ఏమి? అని సాధకున కనిపించు చుండును. ఏవి చిన్నవో, ఏవి పెద్దవో నిర్ణయించట యెట్లు? చిన్న బెడ్డ మీద కాలువేసి జారినచో, పెద్ద బొమిక విరుగును కదా? చిన్న బోల్టు ఊడినచో పెద్ద యంత్రము ఆగదా? పెద్ద అపాయములు కలిగించువన్నియు కూడ సూక్ష్మముగా తారసపడును. పెద్ద ప్రమాదములు కలిగించును. వేగవంతమైన ప్రయాణములో చిన్న కునుకు ప్రాణమును హరించును. చిన్న చిన్న విషయములలో హెచ్చరిక గావించు వాడే నిజమైన స్నేహితుడు.

హెచ్చరిక నందుకొని అప్రమత్తముగ జీవించేవాడే బుద్ధిమంతుడు. అప్రమత్తత మానవులు జంతువుల నుండి నేర్చుకొనవలసి యుండును. జాతికుక్క వాసన, చప్పుడు విషయముల యందు అప్రమత్తమై యుండును. మృగరాజు తన వారిని రక్షించుకొనుటలో అప్రమత్తుడు. గ్రద్ద ఆకాశములో ఎగురుచున్ననూ నిశితమైన దృష్టికలిగి భూమిపై చరించు ఆహారమును చూచుచునే యుండును. నిశితమైన బుద్ధి ఏర్పడవలెననిన చిన్న, పెద్ద అని భావించక అన్ని విషయములందు అప్రమత్తులై యుండవలెను. అట్టివారే అపాయములను ముందుగ గ్రహించి దాటిపోగలరు. లేనిచో అశ్రద్ధ కారణముగ పతనము చెందుదురు.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


30 Apr 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 172


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 172 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మన గురించి మనకు ఏమీ తెలీదు. 'నీ గురించి తెలుసుకో' అని మహాత్ములు సరిగానే అన్నారు. అందరి ఋషుల అంతస్సారమదే. నిన్ను నువ్వు తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లే. సంపూర్ణతని సాధించినట్లే. 🍀


జీవితంలోని రహస్యమేమిటంటే మనం సంపూర్ణ పరవశంతో జన్మించాం. కాని మనల్ని మనం తెలుసుకోక పోవడం వల్ల బిచ్చగాళ్ళుగా మిగిలాం. అది మన ఖర్మ అనుకుంటాం. అది మన తెలివితక్కువతనం. మనం చంద్రుణ్ణి అందుకున్నాం. అక్కడ ఆనందాన్ని వెతికాం. కానీ మనం మన లోపలికి వెళ్ళం. పరిశీలించం. "అక్కడ ఏముంది?” అంటాం.

మనం దురభిప్రాయాన్ని మోస్తూ వుంటాం. మనకు మనం తెలుసనుకుంటాం. మన గురించి మనకు ఏమీ తెలీదు. 'నీ గురించి తెలుసుకో' అని మహాత్మలు సరిగానే అన్నారు. అందరి ఋషుల అంతస్సారమది. దాన్ని ఖండించారు. కారణం నిన్ను నువ్వు తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లే. సంపూర్ణతని సాధించినట్లే.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


30 Apr 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 272 - 28. ప్రతి ఒక్కరూ తప్పక పని చేయండి / DAILY WISDOM - 272 - 28. Everyone Must Work


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 272 / DAILY WISDOM - 272 🌹

🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 28. ప్రతి ఒక్కరూ తప్పక పని చేయండి🌻


పౌర సంఘం లేదా సమాజంలో ప్రతి ఒక్కరూ ఆ సమాజం యొక్క మనుగడ మరియు సంక్షేమానికి ఏదైనా సహకరించడం తప్పనిసరి, మరియు ఎవరూ ఏమీ చేయకుండా పని లేకుండా ఉండలేరు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పని చేయాలి. సమాజానికి సేవ రూపంలో వ్యక్తి యొక్క భాగస్వామ్యం సమాజంలో వ్యక్తిని ఉంచిన స్థాయిని బట్టి నిర్ణయించబడుతుంది. ఒకరి జీవితంలోని పరిస్థితులు, అతని జ్ఞానం మరియు సామర్థ్యం, అతను చెందిన సమాజం అటువంటి సేవను ఎంతవరకు ఆశించాలో నిర్ణయిస్తుంది. వస్త్రం యొక్క బట్ట అది ఏర్పడే దారపు పోగుల కారణంగా ఎలా ఉంటుందో, సమాజం దాని భాగాల పరస్పర సమన్వయంతో జీవిస్తుంది.

సమాజానికి అవసరమైన ప్రతి దానిని వ్యక్తిగతంగా అందించగల సామర్థ్యం ఏ ఒక్క వ్యక్తికి ఉండదు కాబట్టి, ప్రతి ఒక్కరూ తమ సామర్ధ్యాన్ని అత్యున్నతంగా ఉపయోగించాలని పురాతన న్యాయ వ్యవస్థ నిర్దేశించింది. సమాజాన్ని నిర్వహించడానికి అవసరమైన మార్గాలను, అవసరాలను విశ్లేషిస్తూ, సామాజిక న్యాయ అధికారులు నిర్దేశక శక్తి, కార్యనిర్వాహక శక్తి, వాణిజ్య శక్తి మరియు శారీరకశక్తి అనే నాలుగు రకాల అవసరాలను వివరించారు. సంస్కృతంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్ర గా పిలవబడే ఇవి , వరుసగా జ్ఞానం, పరిపాలన, వాణిజ్యం మరియు పనిని సూచిస్తాయి.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 DAILY WISDOM - 272 🌹

🍀 📖 from Essays in Life and Eternity 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 28. Everyone Must Work 🌻

In civic body or society it is obligatory that everyone should contribute something to the survival and welfare of that body, and no one can remain idle, doing nothing. Work everyone must. The participation of the person in the form of service to society is naturally graded according to the station in which the person is placed in society. The circumstances of one's life, one's knowledge and capacity, will decide the quality and the extent to which such a service would be expected by the society to which one belongs. Society lives by the mutual coordination of its constituents, as a fabric of cloth is what it is because of the threads that go to form it.

Since no single individual can be said to have the ability to contribute individually everything that the society would need, the ancient system of law has laid down that each one should share with the social set-up the highest possibility of which one is capable. Analysing the requirements of society as consisting of the necessary ways and means of maintaining and administering society, the law-givers in terms of the social order spelt out such needs as the fourfold blend of directing power, executive power, commercial power and manpower, known in Sanskrit as Brahmana, Kshatriya, Vaishya and Sudra, representing wisdom, administration, trade and work, respectively.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


30 Apr 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 593 / Vishnu Sahasranama Contemplation - 593


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 593 / Vishnu Sahasranama Contemplation - 593🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 593. గోప్తా, गोप्ता, Goptā 🌻

ఓం గోప్త్రే నమః | ॐ गोप्त्रे नमः | OM Goptre namaḥ


స్వమాయయా స్వమాత్మానం సంవృణోతీతి వా హరిః ।
జగతో రక్షక ఇతి వా గోప్తేత్యుచ్యతే బుధైః ॥

గుపూ, గుప్‍ - రక్షణే అను ధాతువునకు కప్పివేయుట, దాచుట అను అర్థములను గ్రహించినచో - తన మాయ చేత తన స్వరూపమును కప్పివేయువాడు అను అర్థమును చెప్పవచ్చును. లేదా మరి యొక విధముగా చూచినట్లైన జగమును రక్షించువాడు అని కూడా అర్థమును గ్రహించవచ్చును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 593🌹

📚. Prasad Bharadwaj

🌻593. Goptā🌻


OM Goptre namaḥ

स्वमायया स्वमात्मानं संवृणोतीति वा हरिः ।
जगतो रक्षक इति वा गोप्तेत्युच्यते बुधैः ॥

Svamāyayā svamātmānaṃ saṃvr‌ṇotīti vā hariḥ,
Jagato rakṣaka iti vā goptetyucyate budhaiḥ.


He who conceals His ownself by His māya or the illusion. In another form, Goptā can also be interpreted as the protector of the worlds.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

शुभाङ्गश्शान्तिदस्स्रष्टा कुमुदः कुवलेशयः ।
गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः ॥ ६३ ॥

శుభాఙ్గశ్శాన్తిదస్స్రష్టా కుముదః కువలేశయః ।
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ 63 ॥

Śubhāṅgaśśāntidassraṣṭā kumudaḥ kuvaleśayaḥ,
Gohito gopatirgoptā vr‌ṣabhākṣo vr‌ṣapriyaḥ ॥ 63 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


30 Apr 2022

30 - APRIL - 2022 శనివారం, స్థిర వాసరే MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 30, ఏప్రిల్ 2022 శనివారం, స్థిర వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 194 / Bhagavad-Gita - 194 - 4-32 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 593 / Vishnu Sahasranama Contemplation - 593🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 272 / DAILY WISDOM - 272 🌹  
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 172 🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 111🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శనివారం మిత్రులందరికీ 🌹*
*స్థిర వాసరే, 30, ఏప్రిల్‌ 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : చైత్ర అమావాస్య, సూర్య గ్రహణం, Amavasya
Surya Grahan 🌻*

*🍀. శ్రీ వేంకటేశ్వర రక్షా స్తోత్రం -2🍀*

*2) స్వర్భానుకేతుశుక్ర గ్రహాది పూజ్యం*
*స్వయంప్రకాశమాన మాయాతీతం*
*సప్తస్వరాధీశ సప్తాచలాధీశం*
*శ్రీవేంకటేశ రక్షమాం శ్రీధరనిశం*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : మీరెక్కడవున్నా , మీకే పరిస్థితి ఎదురైనా ప్రతి పరిస్థితి నుండి ఉన్నతమైన దాన్ని ఎంచుకోండి. అపుడు ప్రకృతే కర్మ భారం తొలగిస్తుంది.- సద్గురు శ్రీరామశర్మ 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, చైత్ర మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిథి: అమావాశ్య 25:59:47 వరకు
తదుపరి శుక్ల పాడ్యమి
నక్షత్రం: అశ్విని 20:14:43 వరకు
తదుపరి భరణి
యోగం: ప్రీతి 15:18:26 వరకు
తదుపరి ఆయుష్మాన్
కరణం: చతుష్పద 13:27:24 వరకు
వర్జ్యం: 15:58:00 - 17:40:00
దుర్ముహూర్తం: 07:32:51 - 08:23:52
రాహు కాలం: 09:02:07 - 10:37:46
గుళిక కాలం: 05:50:50 - 07:26:28
యమ గండం: 13:49:03 - 15:24:42
అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:38
అమృత కాలం: 12:34:00 - 14:16:00
సూర్యోదయం: 05:50:50
సూర్యాస్తమయం: 18:36:05
వైదిక సూర్యోదయం: 05:54:30
వైదిక సూర్యాస్తమయం: 18:32:20
చంద్రోదయం: 05:26:36
చంద్రాస్తమయం: 18:16:09
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: మేషం
సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం
20:14:43 వరకు తదుపరి 
ధ్వాoక్ష యోగం - ధన నాశనం, 
కార్య హాని 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 194 / Bhagavad-Gita - 194 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 32 🌴*

*32. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రాహ్మణో ముఖే |*
*కర్మజాన్ విద్ధితాన్ సర్వానేవం జ్ఞాత్వా విమోక్ష్యసే ||*

🌷. తాత్పర్యం :
*ఈ వివిధ యజ్ఞములన్నియును వేదములచే ఆమోదింపబడినవి మరియు అవియన్నియు వివిధకర్మల నుండి ఉద్బవించినవి. వానిని యథార్థరూపములో ఎరుగట ద్వారా నీవు ముక్తిని పొందగలవు.*

🌷. భాష్యము :
ఇంతవరకు చర్చింపబడినటువంటి వివిధయజ్ఞములు వివిధకర్తలకు అనుగుణముగా వేదములందు తెలుపబడియున్నవి. మానవుల దేహాత్మభావనలో సంపూర్ణముగా మగ్నులై యుందురు. 

కావున మనుజుడు దేహముతో గాని, మనస్సుతో గాని, బుద్ధితో గాని కర్మనొనరించు రీతిగా యజ్ఞములు నిర్ణయింపబడినవి. కాని అంత్యమున దేహము నుండి ముక్తిని పొందుట కొరకే అవియన్నియును నిర్దేశింపబడియున్నవి. ఈ విషయము శ్రీకృష్ణభగవానుని చేతనే స్వయముగా ఇచ్చట నిర్ధారితమైనది.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 194 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 4 - Jnana Yoga - 32 🌴*

*32. evaṁ bahu-vidhā yajñā vitatā brahmaṇo mukhe*
*karma-jān viddhi tān sarvān evaṁ jñātvā vimokṣyase*

🌷 Translation : 
*All these different types of sacrifice are approved by the Vedas, and all of them are born of different types of work. Knowing them as such, you will become liberated.*

🌹 Purport :
Different types of sacrifice, as discussed above, are mentioned in the Vedas to suit the different types of worker. Because men are so deeply absorbed in the bodily concept, these sacrifices are so arranged that one can work either with the body, with the mind or with the intelligence. But all of them are recommended for ultimately bringing about liberation from the body. This is confirmed by the Lord herewith from His own mouth.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 593 / Vishnu Sahasranama Contemplation - 593🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 593. గోప్తా, गोप्ता, Goptā 🌻*

* ఓం గోప్త్రే నమః | ॐ गोप्त्रे नमः | OM Goptre namaḥ
*

*స్వమాయయా స్వమాత్మానం సంవృణోతీతి వా హరిః ।*
*జగతో రక్షక ఇతి వా గోప్తేత్యుచ్యతే బుధైః ॥*

*గుపూ, గుప్‍ - రక్షణే అను ధాతువునకు కప్పివేయుట, దాచుట అను అర్థములను గ్రహించినచో - తన మాయ చేత తన స్వరూపమును కప్పివేయువాడు అను అర్థమును చెప్పవచ్చును. లేదా మరి యొక విధముగా చూచినట్లైన జగమును రక్షించువాడు అని కూడా అర్థమును గ్రహించవచ్చును.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 593🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻593. Goptā🌻*

*OM Goptre namaḥ*

स्वमायया स्वमात्मानं संवृणोतीति वा हरिः ।
जगतो रक्षक इति वा गोप्तेत्युच्यते बुधैः ॥

*Svamāyayā svamātmānaṃ saṃvr‌ṇotīti vā hariḥ,*
*Jagato rakṣaka iti vā goptetyucyate budhaiḥ.*

*He who conceals His ownself by His māya or the illusion. In another form, Goptā can also be interpreted as the protector of the worlds.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
शुभाङ्गश्शान्तिदस्स्रष्टा कुमुदः कुवलेशयः ।गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः ॥ ६३ ॥

శుభాఙ్గశ్శాన్తిదస్స్రష్టా కుముదః కువలేశయః ।గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ 63 ॥

Śubhāṅgaśśāntidassraṣṭā kumudaḥ kuvaleśayaḥ,Gohito gopatirgoptā vr‌ṣabhākṣo vr‌ṣapriyaḥ ॥ 63 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 272 / DAILY WISDOM - 272 🌹*
*🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 28. ప్రతి ఒక్కరూ తప్పక పని చేయండి🌻*

*పౌర సంఘం లేదా సమాజంలో ప్రతి ఒక్కరూ ఆ సమాజం యొక్క మనుగడ మరియు సంక్షేమానికి ఏదైనా సహకరించడం తప్పనిసరి, మరియు ఎవరూ ఏమీ చేయకుండా పని లేకుండా ఉండలేరు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పని చేయాలి. సమాజానికి సేవ రూపంలో వ్యక్తి యొక్క భాగస్వామ్యం సమాజంలో వ్యక్తిని ఉంచిన స్థాయిని బట్టి నిర్ణయించబడుతుంది. ఒకరి జీవితంలోని పరిస్థితులు, అతని జ్ఞానం మరియు సామర్థ్యం, అతను చెందిన సమాజం అటువంటి సేవను ఎంతవరకు ఆశించాలో నిర్ణయిస్తుంది. వస్త్రం యొక్క బట్ట అది ఏర్పడే దారపు పోగుల కారణంగా ఎలా ఉంటుందో, సమాజం దాని భాగాల పరస్పర సమన్వయంతో జీవిస్తుంది.*

*సమాజానికి అవసరమైన ప్రతి దానిని వ్యక్తిగతంగా అందించగల సామర్థ్యం ఏ ఒక్క వ్యక్తికి ఉండదు కాబట్టి, ప్రతి ఒక్కరూ తమ సామర్ధ్యాన్ని అత్యున్నతంగా ఉపయోగించాలని పురాతన న్యాయ వ్యవస్థ నిర్దేశించింది. సమాజాన్ని నిర్వహించడానికి అవసరమైన మార్గాలను, అవసరాలను విశ్లేషిస్తూ, సామాజిక న్యాయ అధికారులు నిర్దేశక శక్తి, కార్యనిర్వాహక శక్తి, వాణిజ్య శక్తి మరియు శారీరకశక్తి అనే నాలుగు రకాల అవసరాలను వివరించారు. సంస్కృతంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్ర గా పిలవబడే ఇవి , వరుసగా జ్ఞానం, పరిపాలన, వాణిజ్యం మరియు పనిని సూచిస్తాయి.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 272 🌹*
*🍀 📖 from Essays in Life and Eternity 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 28. Everyone Must Work 🌻*

*In civic body or society it is obligatory that everyone should contribute something to the survival and welfare of that body, and no one can remain idle, doing nothing. Work everyone must. The participation of the person in the form of service to society is naturally graded according to the station in which the person is placed in society. The circumstances of one's life, one's knowledge and capacity, will decide the quality and the extent to which such a service would be expected by the society to which one belongs. Society lives by the mutual coordination of its constituents, as a fabric of cloth is what it is because of the threads that go to form it.*

*Since no single individual can be said to have the ability to contribute individually everything that the society would need, the ancient system of law has laid down that each one should share with the social set-up the highest possibility of which one is capable. Analysing the requirements of society as consisting of the necessary ways and means of maintaining and administering society, the law-givers in terms of the social order spelt out such needs as the fourfold blend of directing power, executive power, commercial power and manpower, known in Sanskrit as Brahmana, Kshatriya, Vaishya and Sudra, representing wisdom, administration, trade and work, respectively.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 172 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. మన గురించి మనకు ఏమీ తెలీదు. 'నీ గురించి తెలుసుకో' అని మహాత్ములు సరిగానే అన్నారు. అందరి ఋషుల అంతస్సారమదే. నిన్ను నువ్వు తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లే. సంపూర్ణతని సాధించినట్లే. 🍀*

*జీవితంలోని రహస్యమేమిటంటే మనం సంపూర్ణ పరవశంతో జన్మించాం. కాని మనల్ని మనం తెలుసుకోక పోవడం వల్ల బిచ్చగాళ్ళుగా మిగిలాం. అది మన ఖర్మ అనుకుంటాం. అది మన తెలివితక్కువతనం. మనం చంద్రుణ్ణి అందుకున్నాం. అక్కడ ఆనందాన్ని వెతికాం. కానీ మనం మన లోపలికి వెళ్ళం. పరిశీలించం. "అక్కడ ఏముంది?” అంటాం.*

*మనం దురభిప్రాయాన్ని మోస్తూ వుంటాం. మనకు మనం తెలుసనుకుంటాం. మన గురించి మనకు ఏమీ తెలీదు. 'నీ గురించి తెలుసుకో' అని మహాత్మలు సరిగానే అన్నారు. అందరి ఋషుల అంతస్సారమది. దాన్ని ఖండించారు. కారణం నిన్ను నువ్వు తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లే. సంపూర్ణతని సాధించినట్లే.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 111 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 87. అప్రమత్తత 🌻*

*సద్గురువు చిన్న చిన్న విషయముల యందు అప్రమత్తులై వుండవలెనని బోధించు చుండును. తాను ఆచరించి చూపించును. చిన్న విషయమునకు ఇంత రాద్ధాంతము చేయుట ఏమి? అని సాధకున కనిపించు చుండును. ఏవి చిన్నవో, ఏవి పెద్దవో నిర్ణయించట యెట్లు? చిన్న బెడ్డ మీద కాలువేసి జారినచో, పెద్ద బొమిక విరుగును కదా? చిన్న బోల్టు ఊడినచో పెద్ద యంత్రము ఆగదా? పెద్ద అపాయములు కలిగించువన్నియు కూడ సూక్ష్మముగా తారసపడును. పెద్ద ప్రమాదములు కలిగించును. వేగవంతమైన ప్రయాణములో చిన్న కునుకు ప్రాణమును హరించును. చిన్న చిన్న విషయములలో హెచ్చరిక గావించు వాడే నిజమైన స్నేహితుడు.*

*హెచ్చరిక నందుకొని అప్రమత్తముగ జీవించేవాడే బుద్ధిమంతుడు. అప్రమత్తత మానవులు జంతువుల నుండి నేర్చుకొనవలసి యుండును. జాతికుక్క వాసన, చప్పుడు విషయముల యందు అప్రమత్తమై యుండును. మృగరాజు తన వారిని రక్షించుకొనుటలో అప్రమత్తుడు. గ్రద్ద ఆకాశములో ఎగురుచున్ననూ నిశితమైన దృష్టికలిగి భూమిపై చరించు ఆహారమును చూచుచునే యుండును. నిశితమైన బుద్ధి ఏర్పడవలెననిన చిన్న, పెద్ద అని భావించక అన్ని విషయములందు అప్రమత్తులై యుండవలెను. అట్టివారే అపాయములను ముందుగ గ్రహించి దాటిపోగలరు. లేనిచో అశ్రద్ధ కారణముగ పతనము చెందుదురు.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹