మైత్రేయ మహర్షి బోధనలు - 122
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 122 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 94. సున్నిత సంబంధము 🌻
మైత్రేయ సంఘము అతి ప్రాచీనమైనది. ఈ సంఘమున ఒకే చైతన్యము చాలా దేహముల యందు పనిచేయుచున్నది. దాని యందు పనిచేయునది కృష్ణచైతన్యమే. అందరి జీవాత్మలు కృష్ణ చైతన్యమునకు వాహికలు. వారి వారి శరీరములు జగత్ కళ్యాణమున కున్ముఖమై యుండును. కృష్ణునికి మేమందరము స్నేహితులమే. అందరి యందు అతనికి మిత్రత్వముండుట చేత ఇది మిత్ర సంఘమైనది. మైత్రేయ సంఘమనగా కృష్ణుని మిత్రుల సంఘమే. కృష్ణుడనగా జగన్నాథుడే. అది విశ్వవ్యాపకమైన చైతన్యము. దాని యందు అహర్నిశలు జీవించు వారు మైత్రేయ సంఘ సభ్యులు.
శ్రీకృష్ణుడు వీరందరి యందును మిత్రత్వము వహించినను, సంఘమందలి సభ్యులు కృష్ణుని మిత్రులనుకొనరు. వారి కతడు గురువు, దైవము. గురువు, దైవము వాత్సల్యకారణముగ మిత్రత్వము చూపుదురు. అంత మాత్రమున కృష్ణ చైతన్యము నందు జీవించుచున్న సభ్యులు కృష్ణునితో మిత్రులవలె ప్రవర్తించక, భక్తులవలెను, శిష్యుల వలెను ప్రవర్తింతురు. మిత్రత్వము చూపుచున్న సద్గురువును మిత్రుడను కొనుట అవివేకము. మిత్రత్వము సలుపుట అతని వాత్సల్యమే కాని తన అర్హత కాదని శిష్యుడెరుగవలెను. అట్లు కానిచో శిష్యుడహంకారమున పడును. ఈ సున్నితమైన గురు శిష్య సంబంధము గమనార్హము.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
22 May 2022
నిర్మల ధ్యానాలు - ఓషో - 183
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 183 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. హృదయం గుండా శక్తి వస్తే హృదయం అధికారిగా వుంటుంది. మనసు సేవకుడిగా వుంటుంది. కానీ మనం విద్యా విధానమని చెప్పుకునేది హృదయాన్ని విస్మరించేలా చేస్తుంది. మేధస్సు సేవకుడుగా వుంటే మంచి పనివాడుగా వుంటుంది. అదే అధికారమిస్తే అసహ్యకరమయిన యజమానిగా వుంటుంది. 🍀
సమాజం ప్రతి బిడ్డని స్కూలు గుండా, కాలేజీ గుండా, యూనివర్సిటీ గుండా వెళ్ళాలంటుంది. అంటే జీవితంలో మూడింట ఒక వంతు నాశనమవుతుంది.. శక్తిని అసహజమైన కేంద్రానికి తొయ్యడం. శక్తిని మనసుపై కేంద్రీకరించడం, హృదయం వేపు మళ్ళకుండా చెయ్యడం! సహజమైన క్రియ శక్తి హృదయంలోకి సాగి అక్కడి నించీ మనసుకు సాగాలి. మనసంటే మేధస్సు. అది సహజ ప్రక్రియ.
హృదయం గుండా శక్తి వస్తే హృదయం అధికారిగా వుంటుంది. మనసు సేవకుడిగా వుంటుంది. కానీ మనం విద్యా విధానమని చెప్పుకునేది హృదయాన్ని విస్మరించేలా చేస్తుంది. అదే మనసు గుండా శక్తి సాగితే మనసు అధికారి అవుతుంది. హృదయం నిర్లక్ష్యం చెయ్యబడుతుంది. మేధస్సు సేవకుడుగా వుంటే మంచి పనివాడుగా వుంటుంది. అదే అధికారమిస్తే అసహ్యకరమయిన యజమానిగా వుంటుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
22 May 2022
నిత్య ప్రజ్ఞా సందేశములు - 283 - 9. ప్రతిదానికీ కొంత ప్రాముఖ్యత ఉంటుంది / DAILY WISDOM - 283 - 9. Everything has Some Importance
🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 283 / DAILY WISDOM - 283 🌹
🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀
📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 9. ప్రతిదానికీ కొంత ప్రాముఖ్యత ఉంటుంది 🌻
శారీరక స్వయం అని పిలువబడే వ్యక్తిగత స్వయం కంటే సామాజిక స్వయ నియంత్రణ సులభం. మన శరీరాన్ని మనం సులభంగా నియంత్రించలేము, ఎందుకంటే కుటుంబ సభ్యులు మొదలైన బాహ్య సంబంధాల పట్ల ఉండే సాన్నిహిత్యం కంటే మన స్వచ్ఛమైన స్థితి లేదా స్పృహతో అది గొప్ప సాన్నిహిత్యాన్ని కలిగి ఉంటుంది. కుటుంబ సభ్యుల ఉనికిని మనం కొన్ని రోజులు మరచిపోవచ్చు, కానీ మనకు శరీరం ఉందని కొన్ని రోజులు మర్చిపోలేము; అది చాలా కష్టం. కాబట్టి, బంధం నుండి చైతన్యాన్ని ఉపసంహరించుకోవడం నేను చెప్పినట్లుగా దశలవారీగా చేయాలి.
చైతన్యం దశలవారీగా బాహ్య బంధాల నుండి క్రమ క్రమంగా తనని తాను ఉపసంహరించుకుంటూ మరల వెనక్కు వెళ్లకుండా, నిశ్చితమైన అడుగులు వేస్తూ, ఒక్క అడుగును సైతం వదలకుండా చేసే ప్రయాణం వల్ల సమస్యలు కూడా క్రమంగా సన్నగిల్లుతాయి. ఈ అభ్యాసంలో మనం దూకుడుని ప్రదర్శించకూడదు, ఎందుకంటే ప్రతి చిన్న వస్తువు ఎంతో ముఖ్యమైన అంశం మరియు మనం తప్పిన ఒకే ఒక్క అడుగు ఏదో ఒక రోజు ఇబ్బందిని సృష్టించవచ్చు. చిన్న కోరికలు చాలా పెద్దవిగా లేదా ఇబ్బందికరంగా కనిపించవు, కానీ వాటిని పూర్తిగా విస్మరిస్తే అవి ఇబ్బందికరంగా మారవచ్చు, ఎందుకంటే ఈ ప్రపంచంలో పూర్తిగా అప్రధానమైనదిగా పరిగణించబడేది ఏదీ లేదు. ప్రతిదానికీ ఎంతో కొంత ప్రాముఖ్యత ఉంది; మరియు సమయానుసారం, అది మనకు సహాయం చేయగలదు లేదా అది మనలను ఇబ్బంది పెట్టగలదు.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 283 🌹
🍀 📖 from The Study and Practice of Yoga 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 9. Everything has Some Importance 🌻
The social self is easier to control than the personal self, known as the bodily self. We cannot easily control our body, because that has a greater intimacy with our pure state or consciousness than the intimacy that is exhibited by external relations like family members, etc. We may for a few days forget the existence of the members of the family, but we cannot forget for a few days that we have a body; that is a greater difficulty.
So, the withdrawal of consciousness from attachment has to be done by degrees, as I mentioned, and the problems have to be gradually thinned out by the coming back of consciousness from its external relationships, stage by stage, taking every step with fixity so that it may not be retraced, and missing not a single link in this chain of steps taken. We should not take jumps in this practice of self-restraint, because every little item is an important item and one single link that we missed may create trouble one day. There may be small desires which do not look very big or troublesome, but they can become troublesome if they are completely ignored because there is nothing in this world which can be regarded as wholly unimportant. Everything has some importance or the other; and if the time comes, it can help us, or it can trouble us.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
22 May 2022
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 604 / Vishnu Sahasranama Contemplation - 604
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 604 / Vishnu Sahasranama Contemplation - 604🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻604. శ్రీమతాం వరః, श्रीमतां वरः, Śrīmatāṃ Varaḥ🌻
ఓం శ్రీమతాం వరాయ నమః | ॐ श्रीमतां वराय नमः | OM Śrīmatāṃ varāya namaḥ
శ్రీమతాం వరః, श्रीमतां वरः, Śrīmatāṃ Varaḥ
బ్రహ్మాదీనాం సమస్తానామ్ ఋగ్యజుస్సామలక్షణా ।
యేషాం శ్రీరస్తి తేషాం చ ప్రధానః శ్రీమతాం వరః ॥
ఋచస్సామాని యజూగ్‍ంషి సా హి శ్రీ రమృతా సతామ్ ।
ఇతి శ్రుతేర్మహావిష్ణుః శ్రీమతాం వర ఉచ్యతే ॥
ఋక్, యజుర్, సామతదంగాది రూపమగు విద్యయే 'శ్రీ' అనబడును. అట్టి శ్రీగల బ్రహ్మ మొదలగువారు శ్రీమంతులు. అట్టి శ్రీమంతులలో శ్రేష్ఠుడు 'శ్రీమతాంవరః'.
ఋచస్సామాని యజూగ్‍ంషి సా హి శ్రీ రమృతా సతామ్ (తైత్తిరీయ బ్రాహ్మణము 1.1.1)
'ఋక్కులు, యజుస్సులు, సామములు - ఈ త్రివిధ రూపము గల విద్యయే 'సత్'జనులకు ఉండు శ్రీ. అది అమృత తుల్యమౌ శాశ్వతమగు శ్రీ.' అను శ్రుతి వచనము ఈ విషయమున ప్రమాణము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 604🌹
📚. Prasad Bharadwaj
🌻604. Śrīmatāṃ Varaḥ🌻
OM Śrīmatāṃ varāya namaḥ
ब्रह्मादीनां समस्तानाम् ऋग्यजुस्सामलक्षणा ।
येषां श्रीरस्ति तेषां च प्रधानः श्रीमतां वरः ॥
ऋचस्सामानि यजूग्ंषि सा हि श्री रमृता सताम् ।
इति श्रुतेर्महाविष्णुः श्रीमतां वर उच्यते ॥
Brahmādīnāṃ samastānām rgyajussāmalakṣaṇā,
Yeṣāṃ śrīrasti teṣāṃ ca pradhānaḥ śrīmatāṃ varaḥ.
Rcassāmāni yajūgˈṃṣi sā hi śrī ramrtā satām,
Iti śrutermahāviṣṇuḥ śrīmatāṃ vara ucyate.
Ruk, Yajur and Sāma are the Śrīḥ of those who possess it like Brahma and others who are hence called Śrīmantaḥ. Since Lord Hari is the best amongst such, He is called Śrīmatāṃ Varaḥ.
ऋचस्सामानि यजूग्ंषि सा हि श्री रमृता सताम् / Rcassāmāni yajūgˈṃṣi sā hi śrī ramrtā satām (तैत्तिरीय ब्राह्मण १.१.१/Taittirīya brāhmaṇa 1.1.1)
Ruk, Yajur and Sāma are the Śrī of the good - making for immortality.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः ।
श्रीवत्सवक्षाश्श्रीवासश्श्रीपतिः श्रीमतां वरः ॥ ६४ ॥
అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।
అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।
శ్రీవత్సవక్షాశ్శ్రీవాసశ్శ్రీపతిః శ్రీమతాం వరః ॥ 64 ॥
Anivartī nivrttātmā saṃkṣeptā kṣemakrcchivaḥ,
Anivartī nivrttātmā saṃkṣeptā kṣemakrcchivaḥ,
Śrīvatsavakṣāśśrīvāsaśśrīpatiḥ śrīmatāṃ varaḥ ॥ 64 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
22 May 2022
Continues....
🌹 🌹 🌹 🌹🌹
22 May 2022
22 - MAY - 2022 ఆదివారం, భాను వాసరే MESSAGES
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 22, మే 2022 ఆదివారం, భాను వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 205 / Bhagavad-Gita - 205 - 5- 01 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 604 / Vishnu Sahasranama Contemplation - 604🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 283 / DAILY WISDOM - 283🌹
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 183 🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 122🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹*
*భాను వాసరే, 22, మే 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : కాలాష్టమి, Kalashtami 🌻*
*🍀. శ్రీ సూర్య పంజర స్తోత్రం - 6 🍀*
*7. ఓం రుద్రతేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుమ్భాయ హుం ఫట్ స్వాహా ।*
*ఓం భవాయ రుద్రరూపిణే ఉత్తరదిగ్భాగే సర్వమృత్యోపశమనార్థం మాం రక్షతు ॥ 7 ॥*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : గురుదేవుల స్మరణలో శిష్యుల సమర్పణ శక్తి ఇమిడి ఉన్నది. స్మరణ, సమర్పణ ఎంత తీవ్రముగా ఉంటే అనుగ్రహము అంత ఎక్కువుగా వుంటుంది. - సద్గురు శ్రీరామశర్మ 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, వైశాఖ మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిథి: కృష్ణ సప్తమి 13:01:21 వరకు
తదుపరి కృష్ణ అష్టమి
నక్షత్రం: ధనిష్ట 22:48:24 వరకు
తదుపరి శతభిషం
యోగం: ఇంద్ర 26:58:16 వరకు
తదుపరి వైధృతి
కరణం: బవ 13:04:20 వరకు
వర్జ్యం: 03:37:00 - 05:09:00
మరియు 29:51:30 - 31:25:50
దుర్ముహూర్తం: 16:59:10 - 17:51:14
రాహు కాలం: 17:05:41 - 18:43:18
గుళిక కాలం: 15:28:03 - 17:05:41
యమ గండం: 12:12:47 - 13:50:25
అభిజిత్ ముహూర్తం: 11:46 - 12:38
అమృత కాలం: 12:49:00 - 14:21:00
సూర్యోదయం: 05:42:15
సూర్యాస్తమయం: 18:43:18
చంద్రోదయం: 00:13:44
చంద్రాస్తమయం: 11:46:47
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: మకరం
మతంగ యోగం - అశ్వ లాభం 22:48:24
వరకు తదుపరి రాక్షస యోగం
- మిత్ర కలహం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PanchangDaily
#DailyTeluguCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 205 / Bhagavad-Gita - 205 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 01 🌴*
*01. అర్జున ఉవాచ*
*సన్న్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి |*
*యచ్చ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్సితమ్ ||*
🌷. తాత్పర్యం :
*అర్జునుడు ఇట్లు పలికెను: ఓ కృష్ణ! తొలుత నన్ను కర్మత్యాగము చేయుమని చెప్పి తిరిగి భక్తియుతకర్మను ఉపదేశించుచున్నావు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ శ్రేయోదాయకమో దయతో నాకు నిశ్చయముగా తెలియజేయుము.*
🌷. భాష్యము :
భక్తితో చేయబడు కర్మ శుష్కమైన మానసికకల్పనల కన్నను ఉత్తమమైనదని శ్రీకృష్ణభగవానుడు భగవద్గీత యందలి ఈ పంచమాధ్యాయమున తెలియజేయు చున్నాడు. ప్రకృతికి పరముగా నుండి మనుజుని కర్మఫలముల నుండి ముక్తిని చేయగలిగినందున భక్తియోగము వాస్తవమునాకు మానసికకల్పనల కన్నును సులభమైన మార్గమై యున్నది. ఆత్మను గూర్చిన ప్రాథమిక జ్ఞానము మరియు అది దేహమునందు బంధింపబడిన వైనము ద్వితీయాధ్యాయమున వివరింపబడినది.
ఏ విధముగా ఆత్మ అట్టి భవబంధము నుండి బుద్ధియోగము(భక్తియోగము) ద్వారా ముక్తినొందగలదో కూడా ఆ అధ్యాయముననే వివరింపబడినది. జ్ఞానస్థితిలో నిలిచియున్నవాడు ఒనరింపవలసిన ధర్మములేవియును ఉండవని తృతీయాధ్యాయమున వివరింపబడినది. సర్వవిధ యజ్ఞములు అంత్యమున జ్ఞానమునందే పరిసమాప్తి నొందునని అర్జునునకు శ్రీకృష్ణభగవానుడు చతుర్థాధ్యాయమున బోధించెను. అయినను పూర్ణజ్ఞానమునందు స్థితిని కలిగి యుద్ధము చేయుటకు సంసిద్ధుడగుమని చతుర్థాధ్యాయపు అంత్యమున భగవానుడు అర్జునునకు ఉపదేశించెను. అనగా భక్తియుతకర్మ మరియు జ్ఞానముతో కూడిన అకర్మల ప్రాముఖ్యమును ఏకమారు నొక్కిచెప్పుచు శ్రీకృష్ణుడు అర్జునుని భ్రమకు గురుచేసి అతని స్థిరత్వమును కలవరపరచెను.
జ్ఞానపూర్వక త్యాగమనగా ఇంద్రియప్రీతికర కర్మలనన్నింటిని విరమించుట యని అర్జునుడు ఎరిగియుండెను. కాని ఎవరేని భక్తియోగమునందు కర్మనొనరించుచున్నదో కర్మ ఎట్లు ఆగిపోగలదు? అనగా కర్మ మరియు త్యాగము రెండింటికిని పొత్తు కుదరదు కనుక సన్న్యాసముగా (జ్ఞానపూర్వక త్యాగము) అన్నిరకముల నుండి విడివడియుండుట యని అర్జునుడు భావించెను. జ్ఞానపూర్వక కర్మ బంధమును కలుగజేయదు కనుక అకర్మతో ససమానమని అర్జునుడు అవగతము చేసికొననట్లుగా ఇచ్చట కనిపించుచున్నది. కనుకనే తానూ కర్మను విరమింపవలెనో లేదా జ్ఞానయుతుడై కర్మనొనరింపవలెనో అతడు తెలియగోరుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 205 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 5 - Karma Yoga - 01 🌴*
*01. arjuna uvāca*
*sannyāsaṁ karmaṇāṁ kṛṣṇa punar yogaṁ ca śaṁsasi*
*yac chreya etayor ekaṁ tan me brūhi su-niścitam*
🌷 Translation :
*Arjuna said: O Kṛṣṇa, first of all You ask me to renounce work, and then again You recommend work with devotion. Now will You kindly tell me definitely which of the two is more beneficial?*
🌹 Purport :
In this Fifth Chapter of the Bhagavad-gītā, the Lord says that work in devotional service is better than dry mental speculation. Devotional service is easier than the latter because, being transcendental in nature, it frees one from reaction. In the Second Chapter, preliminary knowledge of the soul and its entanglement in the material body were explained.
How to get out of this material encagement by buddhi-yoga, or devotional service, was also explained therein. In the Third Chapter, it was explained that a person who is situated on the platform of knowledge no longer has any duties to perform. And in the Fourth Chapter the Lord told Arjuna that all kinds of sacrificial work culminate in knowledge. However, at the end of the Fourth Chapter, the Lord advised Arjuna to wake up and fight, being situated in perfect knowledge. Therefore, by simultaneously stressing the importance of both work in devotion and inaction in knowledge, Kṛṣṇa has perplexed Arjuna and confused his determination. Arjuna understands that renunciation in knowledge involves cessation of all kinds of work performed as sense activities.
But if one performs work in devotional service, then how is work stopped? In other words, he thinks that sannyāsa, or renunciation in knowledge, should be altogether free from all kinds of activity, because work and renunciation appear to him to be incompatible. He appears not to have understood that work in full knowledge is nonreactive and is therefore the same as inaction. He inquires, therefore, whether he should cease work altogether or work with full knowledge.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 604 / Vishnu Sahasranama Contemplation - 604🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻604. శ్రీమతాం వరః, श्रीमतां वरः, Śrīmatāṃ Varaḥ🌻*
*ఓం శ్రీమతాం వరాయ నమః | ॐ श्रीमतां वराय नमः | OM Śrīmatāṃ varāya namaḥ*
*శ్రీమతాం వరః, श्रीमतां वरः, Śrīmatāṃ Varaḥ*
*బ్రహ్మాదీనాం సమస్తానామ్ ఋగ్యజుస్సామలక్షణా ।*
*యేషాం శ్రీరస్తి తేషాం చ ప్రధానః శ్రీమతాం వరః ॥*
*ఋచస్సామాని యజూగ్‍ంషి సా హి శ్రీ రమృతా సతామ్ ।*
*ఇతి శ్రుతేర్మహావిష్ణుః శ్రీమతాం వర ఉచ్యతే ॥*
*ఋక్, యజుర్, సామతదంగాది రూపమగు విద్యయే 'శ్రీ' అనబడును. అట్టి శ్రీగల బ్రహ్మ మొదలగువారు శ్రీమంతులు. అట్టి శ్రీమంతులలో శ్రేష్ఠుడు 'శ్రీమతాంవరః'.
*ఋచస్సామాని యజూగ్‍ంషి సా హి శ్రీ రమృతా సతామ్ (తైత్తిరీయ బ్రాహ్మణము 1.1.1)*
*'ఋక్కులు, యజుస్సులు, సామములు - ఈ త్రివిధ రూపము గల విద్యయే 'సత్'జనులకు ఉండు శ్రీ. అది అమృత తుల్యమౌ శాశ్వతమగు శ్రీ.' అను శ్రుతి వచనము ఈ విషయమున ప్రమాణము.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 604🌹*
*📚. Prasad Bharadwaj*
*🌻604. Śrīmatāṃ Varaḥ🌻*
*OM Śrīmatāṃ varāya namaḥ*
ब्रह्मादीनां समस्तानाम् ऋग्यजुस्सामलक्षणा ।
येषां श्रीरस्ति तेषां च प्रधानः श्रीमतां वरः ॥
ऋचस्सामानि यजूग्ंषि सा हि श्री रमृता सताम् ।
इति श्रुतेर्महाविष्णुः श्रीमतां वर उच्यते ॥
*Brahmādīnāṃ samastānām rgyajussāmalakṣaṇā,*
*Yeṣāṃ śrīrasti teṣāṃ ca pradhānaḥ śrīmatāṃ varaḥ.*
*Rcassāmāni yajūgˈṃṣi sā hi śrī ramrtā satām,*
*Iti śrutermahāviṣṇuḥ śrīmatāṃ vara ucyate.*
*Ruk, Yajur and Sāma are the Śrīḥ of those who possess it like Brahma and others who are hence called Śrīmantaḥ. Since Lord Hari is the best amongst such, He is called Śrīmatāṃ Varaḥ.*
*ऋचस्सामानि यजूग्ंषि सा हि श्री रमृता सताम् / Rcassāmāni yajūgˈṃṣi sā hi śrī ramrtā satām (तैत्तिरीय ब्राह्मण १.१.१/Taittirīya brāhmaṇa 1.1.1)*
*Ruk, Yajur and Sāma are the Śrī of the good - making for immortality.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः ।श्रीवत्सवक्षाश्श्रीवासश्श्रीपतिः श्रीमतां वरः ॥ ६४ ॥
అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।శ్రీవత్సవక్షాశ్శ్రీవాసశ్శ్రీపతిః శ్రీమతాం వరః ॥ 64 ॥
Anivartī nivrttātmā saṃkṣeptā kṣemakrcchivaḥ,Śrīvatsavakṣāśśrīvāsaśśrīpatiḥ śrīmatāṃ varaḥ ॥ 64 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 283 / DAILY WISDOM - 283 🌹*
*🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻 9. ప్రతిదానికీ కొంత ప్రాముఖ్యత ఉంటుంది 🌻*
*శారీరక స్వయం అని పిలువబడే వ్యక్తిగత స్వయం కంటే సామాజిక స్వయ నియంత్రణ సులభం. మన శరీరాన్ని మనం సులభంగా నియంత్రించలేము, ఎందుకంటే కుటుంబ సభ్యులు మొదలైన బాహ్య సంబంధాల పట్ల ఉండే సాన్నిహిత్యం కంటే మన స్వచ్ఛమైన స్థితి లేదా స్పృహతో అది గొప్ప సాన్నిహిత్యాన్ని కలిగి ఉంటుంది. కుటుంబ సభ్యుల ఉనికిని మనం కొన్ని రోజులు మరచిపోవచ్చు, కానీ మనకు శరీరం ఉందని కొన్ని రోజులు మర్చిపోలేము; అది చాలా కష్టం. కాబట్టి, బంధం నుండి చైతన్యాన్ని ఉపసంహరించుకోవడం నేను చెప్పినట్లుగా దశలవారీగా చేయాలి.*
*చైతన్యం దశలవారీగా బాహ్య బంధాల నుండి క్రమ క్రమంగా తనని తాను ఉపసంహరించుకుంటూ మరల వెనక్కు వెళ్లకుండా, నిశ్చితమైన అడుగులు వేస్తూ, ఒక్క అడుగును సైతం వదలకుండా చేసే ప్రయాణం వల్ల సమస్యలు కూడా క్రమంగా సన్నగిల్లుతాయి. ఈ అభ్యాసంలో మనం దూకుడుని ప్రదర్శించకూడదు, ఎందుకంటే ప్రతి చిన్న వస్తువు ఎంతో ముఖ్యమైన అంశం మరియు మనం తప్పిన ఒకే ఒక్క అడుగు ఏదో ఒక రోజు ఇబ్బందిని సృష్టించవచ్చు. చిన్న కోరికలు చాలా పెద్దవిగా లేదా ఇబ్బందికరంగా కనిపించవు, కానీ వాటిని పూర్తిగా విస్మరిస్తే అవి ఇబ్బందికరంగా మారవచ్చు, ఎందుకంటే ఈ ప్రపంచంలో పూర్తిగా అప్రధానమైనదిగా పరిగణించబడేది ఏదీ లేదు. ప్రతిదానికీ ఎంతో కొంత ప్రాముఖ్యత ఉంది; మరియు సమయానుసారం, అది మనకు సహాయం చేయగలదు లేదా అది మనలను ఇబ్బంది పెట్టగలదు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 283 🌹*
*🍀 📖 from The Study and Practice of Yoga 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*
*🌻 9. Everything has Some Importance 🌻*
*The social self is easier to control than the personal self, known as the bodily self. We cannot easily control our body, because that has a greater intimacy with our pure state or consciousness than the intimacy that is exhibited by external relations like family members, etc. We may for a few days forget the existence of the members of the family, but we cannot forget for a few days that we have a body; that is a greater difficulty.*
*So, the withdrawal of consciousness from attachment has to be done by degrees, as I mentioned, and the problems have to be gradually thinned out by the coming back of consciousness from its external relationships, stage by stage, taking every step with fixity so that it may not be retraced, and missing not a single link in this chain of steps taken. We should not take jumps in this practice of self-restraint, because every little item is an important item and one single link that we missed may create trouble one day. There may be small desires which do not look very big or troublesome, but they can become troublesome if they are completely ignored because there is nothing in this world which can be regarded as wholly unimportant. Everything has some importance or the other; and if the time comes, it can help us, or it can trouble us.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
#PrasadBhardwaj
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 183 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. హృదయం గుండా శక్తి వస్తే హృదయం అధికారిగా వుంటుంది. మనసు సేవకుడిగా వుంటుంది. కానీ మనం విద్యా విధానమని చెప్పుకునేది హృదయాన్ని విస్మరించేలా చేస్తుంది. మేధస్సు సేవకుడుగా వుంటే మంచి పనివాడుగా వుంటుంది. అదే అధికారమిస్తే అసహ్యకరమయిన యజమానిగా వుంటుంది. 🍀*
*సమాజం ప్రతి బిడ్డని స్కూలు గుండా, కాలేజీ గుండా, యూనివర్సిటీ గుండా వెళ్ళాలంటుంది. అంటే జీవితంలో మూడింట ఒక వంతు నాశనమవుతుంది.. శక్తిని అసహజమైన కేంద్రానికి తొయ్యడం. శక్తిని మనసుపై కేంద్రీకరించడం, హృదయం వేపు మళ్ళకుండా చెయ్యడం! సహజమైన క్రియ శక్తి హృదయంలోకి సాగి అక్కడి నించీ మనసుకు సాగాలి. మనసంటే మేధస్సు. అది సహజ ప్రక్రియ.*
*హృదయం గుండా శక్తి వస్తే హృదయం అధికారిగా వుంటుంది. మనసు సేవకుడిగా వుంటుంది. కానీ మనం విద్యా విధానమని చెప్పుకునేది హృదయాన్ని విస్మరించేలా చేస్తుంది. అదే మనసు గుండా శక్తి సాగితే మనసు అధికారి అవుతుంది. హృదయం నిర్లక్ష్యం చెయ్యబడుతుంది. మేధస్సు సేవకుడుగా వుంటే మంచి పనివాడుగా వుంటుంది. అదే అధికారమిస్తే అసహ్యకరమయిన యజమానిగా వుంటుంది.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://oshodailymeditations.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 122 🌹*
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻 94. సున్నిత సంబంధము 🌻*
*మైత్రేయ సంఘము అతి ప్రాచీనమైనది. ఈ సంఘమున ఒకే చైతన్యము చాలా దేహముల యందు పనిచేయుచున్నది. దాని యందు పనిచేయునది కృష్ణచైతన్యమే. అందరి జీవాత్మలు కృష్ణ చైతన్యమునకు వాహికలు. వారి వారి శరీరములు జగత్ కళ్యాణమున కున్ముఖమై యుండును. కృష్ణునికి మేమందరము స్నేహితులమే. అందరి యందు అతనికి మిత్రత్వముండుట చేత ఇది మిత్ర సంఘమైనది. మైత్రేయ సంఘమనగా కృష్ణుని మిత్రుల సంఘమే. కృష్ణుడనగా జగన్నాథుడే. అది విశ్వవ్యాపకమైన చైతన్యము. దాని యందు అహర్నిశలు జీవించు వారు మైత్రేయ సంఘ సభ్యులు.*
*శ్రీకృష్ణుడు వీరందరి యందును మిత్రత్వము వహించినను, సంఘమందలి సభ్యులు కృష్ణుని మిత్రులనుకొనరు. వారి కతడు గురువు, దైవము. గురువు, దైవము వాత్సల్యకారణముగ మిత్రత్వము చూపుదురు. అంత మాత్రమున కృష్ణ చైతన్యము నందు జీవించుచున్న సభ్యులు కృష్ణునితో మిత్రులవలె ప్రవర్తించక, భక్తులవలెను, శిష్యుల వలెను ప్రవర్తింతురు. మిత్రత్వము చూపుచున్న సద్గురువును మిత్రుడను కొనుట అవివేకము. మిత్రత్వము సలుపుట అతని వాత్సల్యమే కాని తన అర్హత కాదని శిష్యుడెరుగవలెను. అట్లు కానిచో శిష్యుడహంకారమున పడును. ఈ సున్నితమైన గురు శిష్య సంబంధము గమనార్హము.*
*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 373 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 373 - 1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 373 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 373 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 82. కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా ।
శృంగార రససంపూర్ణా, జయా, జాలంధరస్థితా ॥ 82 ॥ 🍀
🌻 373 -1. ‘కామేశ్వరప్రాణనాడీ’🌻
కామేశ్వరుని యొక్క ప్రాణనాడియే శ్రీమాత అని అర్థము. ప్రజ్ఞ పురుషుడు కాగా అందుండి యేర్పడునది ప్రాణము. ప్రాణమునకు ప్రజ్ఞ ఆధారము. ప్రజ్ఞకు ప్రాణమాధారము. సృష్టియం
దిరువురును ప్రముఖులే. వారి యందు హెచ్చుతగ్గులు లేవు. ఒకే తత్వము నుండి దిగి వచ్చినవారు. ప్రాణ మున్ననే ప్రజ్ఞ ఉపాధి యందు స్థితిగొని యుండును. ప్రాణము నిష్క్రమించినచో ప్రజ్ఞ నిష్క్రమించును. ప్రాణ మవతరించినచో ప్రజ్ఞ అవతరించును. అమ్మ లేక సృష్టియందు ప్రాణము లేదు. ఆమెయే ప్రాణేశ్వరి. ఆమెయే ప్రాణదాత్రి. ఆమెయే ప్రాణము. సృష్టియందు, జీవులయందు ప్రాణ నాడిగ వర్తించును. స్పందనాత్మకమై నిలచును.
కామేశ్వరుని యందు కూడ ప్రాణనాడి శ్రీమాతయే. కనుకనే పరమశివుడు సాగర మథన సమయమున పరమేశ్వరి అనుజ్ఞగొని హాలాహలమును స్వీకరించెను. శ్రీమాత ప్రాణనాడి యగుట చేత శివుడు మహాక్రూరమైన కాలకూట విషమును త్రాగిననూ శ్రీమాత మహిమచే కాలవశుడు కాలేదు. అమ్మ అనుగ్రహ మున్నవారికి ప్రాణ భయము లేదు. మన యందలి ప్రాణనాడి ఆమెయే. శరీరము నుండి ప్రాణము నిష్క్రమించినచో ప్రజ్ఞ కూడ నిష్క్రమించును. ఒకానొకప్పుడు ప్రజ్ఞ నిష్క్రమించిననూ ప్రాణము దేహము నంటిపెట్టుకొని యుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 373 -1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 82. Kameshari prananadi krutagyna kamapujita
Shrungararasa sanpurna jaya jalandharasdhita ॥ 82 ॥ 🌻
🌻 373-1. Kāmeśvara-prāna-nāḍī कामेश्वर-प्रान-नाडी 🌻
She is the vital force of Kāmeśvara, the Supreme form of Śiva. This nāma is taken from Veda-s. Śrī Rudraṁ says (Yajur Veda IV.v.10) “Oh! Rudra! We invoke the auspicious form of yours, that is auspicious and ever healing along with the great auspicious form of Śaktī”.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
21 May 2022
ఓషో రోజువారీ ధ్యానాలు - 186. అసలు ప్రశ్న / Osho Daily Meditations - 186. THE REAL QUESTION
🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 186 / Osho Daily Meditations - 186 🌹
📚. ప్రసాద్ భరద్వాజ్
🍀 186. అసలు ప్రశ్న 🍀
🕉. ప్రశ్న ఎప్పుడు కేవలం ఒక గుళిక వంటిది. దీనిలో సమాధానం దాచబడి ఉంటుంది, మృదువైన సమాధానాన్ని రక్షించే గట్టి పెంకు. ఇది ఒక విత్తనాన్ని చుట్టుముట్టి వుండే కవచం మాత్రమే. 🕉
నేడు వందలో తొంభై-తొమ్మిది ప్రశ్నలు చెత్తగా ఉన్నాయి. ఈ తొంభై-తొమ్మిది ప్రశ్నల కారణంగా మీరు నిజంగా విలువైన ప్రశ్నను అడగలేరు. మీ చుట్టూ ఉన్న ఈ తొంభై తొమ్మిది కోలాహలం, అరుపులు, చాలా సందడిగా ఉన్నందున, అవి మీలో అసలు ప్రశ్న తలెత్తడానికి అనుమతించవు. అసలు ప్రశ్న చాలా నిశ్శబ్దంగా, నిశ్చలంగా, చిన్న స్వరాన్ని కలిగి ఉంటుంది. ఈ అవాస్తవమైనవి గొప్పగా నటిస్తూ ఉంటాయి. వాటి కారణంగా మీరు సరైన ప్రశ్న అడగలేరు మరియు మీరు సరైన సమాధానం కనుగొనలేరు.
కాబట్టి చెత్తను చెత్తగా తెలుసుకోవడం గొప్ప అంతర్దృష్టి. అప్పుడు అది మీ చేతుల్లోంచి జారిపోవడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇది చెత్త అని మీకు తెలిస్తే మీరు దానిని ఎక్కువసేపు పట్టుకోలేరు. మీ చేతులు ఖాళీగా మారడం ప్రారంభించటానికి ఇది చెత్త అని అర్థం చేసుకోవడం సరిపోతుంది. మీ చేతులు చెత్త నుండి శుభ్ర పడినప్పుడు, అసలు ప్రశ్న ఒక్కటే మిగిలిపోతుంది. మరి దీనిలోని సౌందర్యం ఏమిటంటే.. అసలు ప్రశ్నే మిగిలి ఉంటే సమాధానం ఎంతో దూరంలో లేదు. ప్రశ్నలోనే సమాధానం దాగి ఉంది. ప్రశ్నకు కేంద్రమే సమాధానం.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations - 186 🌹
📚. Prasad Bharadwaj
🍀 186. THE REAL QUESTION 🍀
🕉 The real question is just a capsule in which the answer is hidden, a hard shell that protects the soft answer within. It is just a crust that surrounds a seed. 🕉
Ninety-nine questions out of a hundred are rubbish, and because of these ninety-nine questions you cannot manage to ask the really valuable question. Because these ninety-nine clamor around you, shout, are very noisy, they don't allow the real question to arise in you. The real question has a very silent, still, small voice, and these unreal ones are great pretenders. Because of them you cannot ask the right question and you cannot find the right answer.
So to know rubbish as rubbish is a great insight. Then it starts slipping out of your hands-because you cannot hold it long if you know it is rubbish. The very understanding that it is rubbish is enough for your hands to start becoming empty, and when your hands are empty of the rubbish, only the one, the real question, is left. And the beauty is that if only the real question is left, the answer is not far away. It is just inside the question. The very center of the question is the answer.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
21 May 2022
శ్రీ మదగ్ని మహాపురాణము - 51 - కశ్యప వంశ వర్ణనము - 1 / Agni Maha Purana - 51 - The progeny of Kaśyapa - 1
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 51 / Agni Maha Purana - 51 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 19
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
🌻. కశ్యప వంశ వర్ణనము - 1 🌻
అగ్ని పలికెను : ఓ మునీశ్వరుడా! అపుడు కశ్యపునకు అదిత్యాదుల యందు పుట్టిన సంతానమును గూర్చి చెప్పెదను. చాక్షుష మన్వంతరము నందు తుషిత దేవతలుగా ఉన్నవారే మరల వైవస్వత మన్వంతరము నందు - విష్ణువు, శక్రుడు, త్వష్ట, ధాత అర్యముడు, పూష, వివస్వంతుడు, సవిత, మిత్రుడు, వరుణుడు, భగుడు, అంశువు అను ద్వాదశాదిత్యులుగా అదితి యందు కశ్యపునకు జనించిరి. అరిష్టనేమి భార్యలకు పదునారుగురు పుత్రులు జనించిరి.
విద్వాంసుడైన బహుపుత్రునకు నలుగురు విద్యుత్తులు కుమార్తెలుగా పుట్టిరి. కృశాశ్వుని శ్రేష్ఠమైన సురాయుధములు ప్రత్యంగిరసుని వలన జనించినవి. ప్రతియుగమునందును, సూర్యుని ఉదయాస్త మనముల వలె, వీరి ఉదయాన్తమనములు (పుట్టుక, తిరోధానము) జరుగు చుండును.
దితికి క్యపుని వలన హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అను కుమారులును, విప్రచిత్తి భార్యయైన సంహికయను కుమార్తెయు జనించిరి. ఆమెకు రాహువు మొదలగు పుత్రులు పుట్టి స్తెంహినేయులని ప్రసిద్ది పొందిరి.
హిరణకశిపునకు ప్రసిద్దమైన తేజస్సుగల అనుహ్రాదుడు, హ్రాదుడు, గొప్ప విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు, సంహ్రాదుడు అను నలుగరు పుత్తరులు జనించిరి. హ్రాదుని పుత్రుడు హ్రదుడు, ఆయుష్మంతుడు, éశిబి, బాష్కలుడు అనువారు సంహ్రాదుని కుమారులు ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. విరోచనునకు బలి అను పుత్రుడు కలిగెను. బలికి నూర్గురు కుమారులు జనించిరి. వారిలో బాణుడు జ్యేష్ఠుడు.
పూర్వకల్పమునందు బాణుడు ఉమాపతిని అనుగ్రహింప చేసికొని ఆతనినుండి ఆతని సమీపముననే విహరించుట అను వరమును పొందెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 51 🌹
✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj
Chapter 19
🌻 The progeny of Kaśyapa - 1 🌻
Agni said:
1-3. O Sage! I describe the creation (made) by Kaśyapa through Aditi and others. Those devas who were (known) as Tuṣita in the Cākṣuṣa manvantara, again became (the sons) of Kaśyapa through Aditi in the Vaivasvata manvantara as the twelve Ādityas (with the names) Viṣṇu, Śakra, Tvaṣṭṛ, Dhātṛ, Aryaman, Pūṣan, Vivasvat, Savitṛ, Mitra, Varuṇa, Bhaga, and Aṃśu. The progeny of the wives of Ariṣṭanemi were sixteen.
4. The four lightnings were the daughters of the learned Bahuputra. Those born of Aṅgiras were excellent. (The progeny) of Kṛśāśva were the celestial weapons.[1]
5. Just as the sun rises and sets, similarly these (do) in every yuga. From Kaśyapa, Hiraṇyakaśipu and Hiraṇyākṣa (were born) through Diti.
6. Siṃhikā was also their daughter, who was married by Vipracitti. Rāhu and others born to her were known as Saiṃhikeyas.
7-8. The four sons of Hiraṇyakaśipu (were) very effulgent. (They were) Anuhrāda, Hrāda, Prahrāda a staunch devotee of Viṣṇu; and Saṃhrāda was the fourth (son). Hrada (was) the son of Hrāda. Āyuṣmat, Śibi, and Bāṣkala (were) the sons of Hrada.
9. Virocana (was) the son of Prahrāda. Bali was born to Virocana. Bali had hundred sons. Bāṇa was the foremost among them, O great sage!
10. Having propitiated the consort of Umā (Śiva) in the past kalpa, a boon was obtained by Bāṇa from the lord that he would always wander by the side (of the lord).
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
21 May 2022
శ్రీ శివ మహా పురాణము - 567 / Sri Siva Maha Purana - 567
🌹 . శ్రీ శివ మహా పురాణము - 567 / Sri Siva Maha Purana - 567 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 54 🌴
🌻. పతివ్రతా ధర్మములు - 5 🌻
భర్త చెప్పిన మాటకు కోపముతో మండి పడుతూ బదులిడే స్త్రీ గ్రామములో కుక్కయైగాని, నిర్జనారణ్యములో నక్కయైగాని జన్మించును (45). పతివ్రత ఎత్తైన ఆసనముపై కూర్చుండరాదు. దుష్టుల సన్నిధికి పోరాదు. భర్తతో ఎక్కడనైననూ పిరికి దనమును, భయమును కలిగించు మాటలను చెప్పరాదు (46). కొండెములను చెప్పరాదు.కలహములకు దూరముగా నుండవలెను. పెద్దల సన్నధిలో బిగ్గరగా మాటలాడరాదు, నవ్వరాదు(47).
బయట నుండి వచ్చిన భర్తను గాంచి వెంటనే నీటిని ఇచ్చి, వస్త్రములనిచ్చి, భోజనము పెట్టి, తాంబూలమునిచ్చి పాదములను నొక్కి సేవించవలెను (48). మరియు ప్రేమతో నిండిన మాటలను చెప్పి శ్రమను తొలగింపజేసి ప్రీతిని కలిగించు స్త్రీ ముల్లోకములను సంతోష పెట్టిన పుణ్యమును పొందును (49).
తండ్రిగాని, సోదరుడు గాని, కుమారుడుగాని, స్త్రీకి పరిమితముగనే ఇచ్చును. కాని సర్వస్వమును ఇచ్చే భర్తను స్త్రీసదా పూజించవలెను (50). దైవము, గురువు, ధర్మము, తీర్థము, వ్రతము అన్నియూ భర్తయే. కావున అన్నిటినీ విడిచి ఒక్క భర్తను మాత్రము సేవించవలెను (51). భర్తను విడిచి రహస్యముగా తిరుగాడు దుష్టస్త్రీ చెట్టు తొర్రలో నివసించే క్రూరమగు గుడ్లగూబయై పుట్టును (52). భర్తను కొట్టబోవు స్త్రీపెద్దపులి, లేక పిల్లియై పుట్టును. ఇతర పురుషులను ఓర చూపుతో చూచే స్త్రీ మెల్లకన్ను గలది యగును (53).
ఏ స్త్రీ భర్తను విడిచి పెట్టి తాను ఒక్కతెయే మృష్టాన్నమును భుజించునో ఆమె గ్రామసూకరమైగాని, మేకయై గాని పుట్టును (54). ఏ స్త్రీ భర్తను నిరాకరించి మాటలాడునో ఆమె మూగియై జన్మించును. ఎల్లవేళలా సవతితో కొట్లాడు స్త్రీ భాగ్యహీనురాలిగా అనేక జన్మలను పొందును (55).
భర్తను చూచుట మాని ఇతర పురుషుని చూచు స్త్రీకురూపి, గ్రుడ్డి, వికృతమగు ముఖము గలది అయి పుట్టును (56). ప్రాణము లేని దేహము అశుచి గనుక మానవులు దానిని వెంటనే తగులబెట్టెదరు. అదే తీరున భర్తను విడిచిన స్త్రీ చక్కగా స్నానము చేసినా అశుచియే యగును (57). ఏ గృహములో పతివ్రతా దేవి ఉండునో, ఆమె తల్లిదండ్రులు ధన్యులు. ఆమె భర్త ధన్యుడు (58).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 567 🌹
✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 54 🌴
🌻 Description of the duties of the chaste wife - 5 🌻
45. If she furiously retorts to her husband she is born as a bitch in a village or as a vixen in a secluded place.
46. The chaste lady shall never take a higher seat never approach a defiled person, never speak to her husband in agitation.
47. She should avoid slanderous words, shun quarrels and shall not speak aloud or laugh in the presence of elders.
48-49. She who delights her husband delights all the worlds. When she sees her husband coming home she shall hasten to serve him food and water, hand him betel and change of garments, and serve him by massaging his feet. By pleasing words she shall fascinate him and dispel his gloom.
50. What father gives is limited, what brother gives is limited and what the son gives is also limited. A chaste lady shall worship her husband who gives what has no limit.
51. To a wife the husband is god, preceptor, virtue, holy centre and sacred rite. She should cast off everything and adore him alone.
52. She who forsakes her husband and secretly violates her fidelity is born as a she-owl of cruel nature wasting its days in the hollow of a tree.
53. If she desires to beat her husband in retaliation, she becomes a tiger or a wild cat. She who ogles at another man becomes squint-eyed.
54. She who partakes of sweet dish denying the same to her husband becomes a pig in the village or a wild goat eating its own dung.
55. She who addresses her husband in singular becomes dumb. She who is jealous of a co-wife becomes ill-fated in matrimony again and again.
56. She who casts glance on another person hiding it from her husband becomes one-eyed, twisted-faced or ugly.
57. Just as a body bereft of the soul becomes unclean in a moment, similarly a woman without a husband is always unclean even though she may take a neat bath.
58. The mother, the father and the husband are blessed if there is a chaste lady in the house.
Continues....
🌹🌹🌹🌹🌹
21 May 2022
కపిల గీత - 11 / Kapila Gita - 11
🌹. కపిల గీత - 11 / Kapila Gita - 11🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
📚. ప్రసాద్ భరధ్వాజ
🌴. అతీంద్రియ జ్ఞానాన్ని కోరుకున్న దేవహూతి - 5 🌴
11. తం త్వా గతాహం శరణం శరణ్యం స్వభృత్య సంసారతరోః కుఠారమ్
జిజ్ఞాసయాహం ప్రకృతేః పూరుషస్య నమామి సద్ధర్మవిదాం వరిష్ఠమ్
అన్ని లోకాలకు రక్షకుడవైన నిన్ను శరణు వేడుతున్నాను. భక్తుల యొక్క సంసారమనే వృక్షాన్ని కూలగొట్టడానికి గొడ్డలి వంటి వాడవు. ప్రకృతి యొక్క పురుషుడి యొక్క తత్వం తెలుసుకోవాలని, సద్ధరం తెలుసుకోవాలి.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 11 🌹
✍️ Swami Prabhupada.
📚 Prasad Bharadwaj
🌴 Devahuti Desires Transcendental Knowledge - 5 🌴
11. tam tva gataham saranam saranyam sva-bhrtya-samsara-taroh kutharam
jijna-sayaham prakrteh purusasya namami sad-dharma-vidam varistham
Devahuti continued: I have taken shelter of Your lotus feet because You are the only person of whom to take shelter. You are the ax which can cut the tree of material existence. I therefore offer my obeisances unto You, who are the greatest of all transcendentalists, and I inquire from You as to the relationship between man and woman and between spirit and matter.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
21 May 2022
21 - MAY - 2022 శనివారం, స్థిర వాసరే MESSAGES
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 21, శనివారం, మే 2022 స్థిర వాసరే 🌹
🌹 కపిల గీత - 11 / Kapila Gita - 11🌹
2) 🌹. శివ మహా పురాణము - 567 / Siva Maha Purana - 567🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 51 / Agni Maha Purana - 51🌹
4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 186 / Osho Daily Meditations - 186🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 373-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 373-1 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ శనివారం మిత్రులందరికీ 🌹*
*స్థిర వాసరే, 21, మే, 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*
*🍀. శ్రీ వేంకటేశ్వర రక్షా స్తోత్రం - 5 🍀*
*5) సాలగ్రామతులసీమాలాధరం*
*సాలంకృతాభరణభూషితాంగం*
*సాయంకాలసహస్రదీపాలంకరణం*
*శ్రీవేంకటేశ రక్షమాం శ్రీధరనిశం*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడు కలకసిమెలసి జీవించేవారికి, ఉన్నది పంచుకుని తినేవారికి తప్పక లభిస్తుంది. - సద్గురు శ్రీరామశర్మ 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, వైశాఖ మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిథి: కృష్ణ షష్టి 15:00:00 వరకు
తదుపరి కృష్ణ సప్తమి
నక్షత్రం: శ్రవణ 23:48:34 వరకు
తదుపరి ధనిష్ట
యోగం: శుక్ల 08:11:23 వరకు
తదుపరి బ్రహ్మ
కరణం: వణిజ 15:04:00 వరకు
వర్జ్యం: 05:03:40 - 06:33:32
మరియు 27:37:00 - 29:09:00
దుర్ముహూర్తం: 07:26:32 - 08:18:34
రాహు కాలం: 08:57:36 - 10:35:09
గుళిక కాలం: 05:42:29 - 07:20:02
యమ గండం: 13:50:17 - 15:27:50
అభిజిత్ ముహూర్తం: 11:46 - 12:38
అమృత కాలం: 14:02:52 - 15:32:44
సూర్యోదయం: 05:42:29
సూర్యాస్తమయం: 18:42:58
చంద్రోదయం: 00:13:44
చంద్రాస్తమయం: 10:44:50
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: మకరం
స్థిర యోగం - శుభాశుభ మిశ్రమ ఫలం
23:48:34 వరకు తదుపరి వర్ధమాన
యోగం - ఉత్తమ ఫలం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PanchangDaily
#DailyTeluguCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 11 / Kapila Gita - 11🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴. అతీంద్రియ జ్ఞానాన్ని కోరుకున్న దేవహూతి - 5 🌴*
*11. తం త్వా గతాహం శరణం శరణ్యం స్వభృత్య సంసారతరోః కుఠారమ్*
*జిజ్ఞాసయాహం ప్రకృతేః పూరుషస్య నమామి సద్ధర్మవిదాం వరిష్ఠమ్*
*అన్ని లోకాలకు రక్షకుడవైన నిన్ను శరణు వేడుతున్నాను. భక్తుల యొక్క సంసారమనే వృక్షాన్ని కూలగొట్టడానికి గొడ్డలి వంటి వాడవు. ప్రకృతి యొక్క పురుషుడి యొక్క తత్వం తెలుసుకోవాలని, సద్ధరం తెలుసుకోవాలి.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 11 🌹*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*
*🌴 Devahuti Desires Transcendental Knowledge - 5 🌴*
*11. tam tva gataham saranam saranyam sva-bhrtya-samsara-taroh kutharam*
*jijna-sayaham prakrteh purusasya namami sad-dharma-vidam varistham*
*Devahuti continued: I have taken shelter of Your lotus feet because You are the only person of whom to take shelter. You are the ax which can cut the tree of material existence. I therefore offer my obeisances unto You, who are the greatest of all transcendentalists, and I inquire from You as to the relationship between man and woman and between spirit and matter.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#కపిలగీత #KapilaGita
#కపిలగీతKapilaGita
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 567 / Sri Siva Maha Purana - 567 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 54 🌴*
*🌻. పతివ్రతా ధర్మములు - 5 🌻*
భర్త చెప్పిన మాటకు కోపముతో మండి పడుతూ బదులిడే స్త్రీ గ్రామములో కుక్కయైగాని, నిర్జనారణ్యములో నక్కయైగాని జన్మించును (45). పతివ్రత ఎత్తైన ఆసనముపై కూర్చుండరాదు. దుష్టుల సన్నిధికి పోరాదు. భర్తతో ఎక్కడనైననూ పిరికి దనమును, భయమును కలిగించు మాటలను చెప్పరాదు (46). కొండెములను చెప్పరాదు.కలహములకు దూరముగా నుండవలెను. పెద్దల సన్నధిలో బిగ్గరగా మాటలాడరాదు, నవ్వరాదు(47).
బయట నుండి వచ్చిన భర్తను గాంచి వెంటనే నీటిని ఇచ్చి, వస్త్రములనిచ్చి, భోజనము పెట్టి, తాంబూలమునిచ్చి పాదములను నొక్కి సేవించవలెను (48). మరియు ప్రేమతో నిండిన మాటలను చెప్పి శ్రమను తొలగింపజేసి ప్రీతిని కలిగించు స్త్రీ ముల్లోకములను సంతోష పెట్టిన పుణ్యమును పొందును (49).
తండ్రిగాని, సోదరుడు గాని, కుమారుడుగాని, స్త్రీకి పరిమితముగనే ఇచ్చును. కాని సర్వస్వమును ఇచ్చే భర్తను స్త్రీసదా పూజించవలెను (50). దైవము, గురువు, ధర్మము, తీర్థము, వ్రతము అన్నియూ భర్తయే. కావున అన్నిటినీ విడిచి ఒక్క భర్తను మాత్రము సేవించవలెను (51). భర్తను విడిచి రహస్యముగా తిరుగాడు దుష్టస్త్రీ చెట్టు తొర్రలో నివసించే క్రూరమగు గుడ్లగూబయై పుట్టును (52). భర్తను కొట్టబోవు స్త్రీపెద్దపులి, లేక పిల్లియై పుట్టును. ఇతర పురుషులను ఓర చూపుతో చూచే స్త్రీ మెల్లకన్ను గలది యగును (53).
ఏ స్త్రీ భర్తను విడిచి పెట్టి తాను ఒక్కతెయే మృష్టాన్నమును భుజించునో ఆమె గ్రామసూకరమైగాని, మేకయై గాని పుట్టును (54). ఏ స్త్రీ భర్తను నిరాకరించి మాటలాడునో ఆమె మూగియై జన్మించును. ఎల్లవేళలా సవతితో కొట్లాడు స్త్రీ భాగ్యహీనురాలిగా అనేక జన్మలను పొందును (55).
భర్తను చూచుట మాని ఇతర పురుషుని చూచు స్త్రీకురూపి, గ్రుడ్డి, వికృతమగు ముఖము గలది అయి పుట్టును (56). ప్రాణము లేని దేహము అశుచి గనుక మానవులు దానిని వెంటనే తగులబెట్టెదరు. అదే తీరున భర్తను విడిచిన స్త్రీ చక్కగా స్నానము చేసినా అశుచియే యగును (57). ఏ గృహములో పతివ్రతా దేవి ఉండునో, ఆమె తల్లిదండ్రులు ధన్యులు. ఆమె భర్త ధన్యుడు (58).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 567 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 54 🌴*
*🌻 Description of the duties of the chaste wife - 5 🌻*
45. If she furiously retorts to her husband she is born as a bitch in a village or as a vixen in a secluded place.
46. The chaste lady shall never take a higher seat never approach a defiled person, never speak to her husband in agitation.
47. She should avoid slanderous words, shun quarrels and shall not speak aloud or laugh in the presence of elders.
48-49. She who delights her husband delights all the worlds. When she sees her husband coming home she shall hasten to serve him food and water, hand him betel and change of garments, and serve him by massaging his feet. By pleasing words she shall fascinate him and dispel his gloom.
50. What father gives is limited, what brother gives is limited and what the son gives is also limited. A chaste lady shall worship her husband who gives what has no limit.
51. To a wife the husband is god, preceptor, virtue, holy centre and sacred rite. She should cast off everything and adore him alone.
52. She who forsakes her husband and secretly violates her fidelity is born as a she-owl of cruel nature wasting its days in the hollow of a tree.
53. If she desires to beat her husband in retaliation, she becomes a tiger or a wild cat. She who ogles at another man becomes squint-eyed.
54. She who partakes of sweet dish denying the same to her husband becomes a pig in the village or a wild goat eating its own dung.
55. She who addresses her husband in singular becomes dumb. She who is jealous of a co-wife becomes ill-fated in matrimony again and again.
56. She who casts glance on another person hiding it from her husband becomes one-eyed, twisted-faced or ugly.
57. Just as a body bereft of the soul becomes unclean in a moment, similarly a woman without a husband is always unclean even though she may take a neat bath.
58. The mother, the father and the husband are blessed if there is a chaste lady in the house.
Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 51 / Agni Maha Purana - 51 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 19*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*🌻. కశ్యప వంశ వర్ణనము - 1 🌻*
అగ్ని పలికెను : ఓ మునీశ్వరుడా! అపుడు కశ్యపునకు అదిత్యాదుల యందు పుట్టిన సంతానమును గూర్చి చెప్పెదను. చాక్షుష మన్వంతరము నందు తుషిత దేవతలుగా ఉన్నవారే మరల వైవస్వత మన్వంతరము నందు - విష్ణువు, శక్రుడు, త్వష్ట, ధాత అర్యముడు, పూష, వివస్వంతుడు, సవిత, మిత్రుడు, వరుణుడు, భగుడు, అంశువు అను ద్వాదశాదిత్యులుగా అదితి యందు కశ్యపునకు జనించిరి. అరిష్టనేమి భార్యలకు పదునారుగురు పుత్రులు జనించిరి.
విద్వాంసుడైన బహుపుత్రునకు నలుగురు విద్యుత్తులు కుమార్తెలుగా పుట్టిరి. కృశాశ్వుని శ్రేష్ఠమైన సురాయుధములు ప్రత్యంగిరసుని వలన జనించినవి. ప్రతియుగమునందును, సూర్యుని ఉదయాస్త మనముల వలె, వీరి ఉదయాన్తమనములు (పుట్టుక, తిరోధానము) జరుగు చుండును.
దితికి క్యపుని వలన హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అను కుమారులును, విప్రచిత్తి భార్యయైన సంహికయను కుమార్తెయు జనించిరి. ఆమెకు రాహువు మొదలగు పుత్రులు పుట్టి స్తెంహినేయులని ప్రసిద్ది పొందిరి.
హిరణకశిపునకు ప్రసిద్దమైన తేజస్సుగల అనుహ్రాదుడు, హ్రాదుడు, గొప్ప విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు, సంహ్రాదుడు అను నలుగరు పుత్తరులు జనించిరి. హ్రాదుని పుత్రుడు హ్రదుడు, ఆయుష్మంతుడు, éశిబి, బాష్కలుడు అనువారు సంహ్రాదుని కుమారులు ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. విరోచనునకు బలి అను పుత్రుడు కలిగెను. బలికి నూర్గురు కుమారులు జనించిరి. వారిలో బాణుడు జ్యేష్ఠుడు.
పూర్వకల్పమునందు బాణుడు ఉమాపతిని అనుగ్రహింప చేసికొని ఆతనినుండి ఆతని సమీపముననే విహరించుట అను వరమును పొందెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 51 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *
*Chapter 19*
*🌻 The progeny of Kaśyapa - 1 🌻*
Agni said:
1-3. O Sage! I describe the creation (made) by Kaśyapa through Aditi and others. Those devas who were (known) as Tuṣita in the Cākṣuṣa manvantara, again became (the sons) of Kaśyapa through Aditi in the Vaivasvata manvantara as the twelve Ādityas (with the names) Viṣṇu, Śakra, Tvaṣṭṛ, Dhātṛ, Aryaman, Pūṣan, Vivasvat, Savitṛ, Mitra, Varuṇa, Bhaga, and Aṃśu. The progeny of the wives of Ariṣṭanemi were sixteen.
4. The four lightnings were the daughters of the learned Bahuputra. Those born of Aṅgiras were excellent. (The progeny) of Kṛśāśva were the celestial weapons.[1]
5. Just as the sun rises and sets, similarly these (do) in every yuga. From Kaśyapa, Hiraṇyakaśipu and Hiraṇyākṣa (were born) through Diti.
6. Siṃhikā was also their daughter, who was married by Vipracitti. Rāhu and others born to her were known as Saiṃhikeyas.
7-8. The four sons of Hiraṇyakaśipu (were) very effulgent. (They were) Anuhrāda, Hrāda, Prahrāda a staunch devotee of Viṣṇu; and Saṃhrāda was the fourth (son). Hrada (was) the son of Hrāda. Āyuṣmat, Śibi, and Bāṣkala (were) the sons of Hrada.
9. Virocana (was) the son of Prahrāda. Bali was born to Virocana. Bali had hundred sons. Bāṇa was the foremost among them, O great sage!
10. Having propitiated the consort of Umā (Śiva) in the past kalpa, a boon was obtained by Bāṇa from the lord that he would always wander by the side (of the lord).
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 186 / Osho Daily Meditations - 186 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*
*🍀 186. అసలు ప్రశ్న 🍀*
*🕉. ప్రశ్న ఎప్పుడు కేవలం ఒక గుళిక వంటిది. దీనిలో సమాధానం దాచబడి ఉంటుంది, మృదువైన సమాధానాన్ని రక్షించే గట్టి పెంకు. ఇది ఒక విత్తనాన్ని చుట్టుముట్టి వుండే కవచం మాత్రమే. 🕉*
*నేడు వందలో తొంభై-తొమ్మిది ప్రశ్నలు చెత్తగా ఉన్నాయి. ఈ తొంభై-తొమ్మిది ప్రశ్నల కారణంగా మీరు నిజంగా విలువైన ప్రశ్నను అడగలేరు. మీ చుట్టూ ఉన్న ఈ తొంభై తొమ్మిది కోలాహలం, అరుపులు, చాలా సందడిగా ఉన్నందున, అవి మీలో అసలు ప్రశ్న తలెత్తడానికి అనుమతించవు. అసలు ప్రశ్న చాలా నిశ్శబ్దంగా, నిశ్చలంగా, చిన్న స్వరాన్ని కలిగి ఉంటుంది. ఈ అవాస్తవమైనవి గొప్పగా నటిస్తూ ఉంటాయి. వాటి కారణంగా మీరు సరైన ప్రశ్న అడగలేరు మరియు మీరు సరైన సమాధానం కనుగొనలేరు.*
*కాబట్టి చెత్తను చెత్తగా తెలుసుకోవడం గొప్ప అంతర్దృష్టి. అప్పుడు అది మీ చేతుల్లోంచి జారిపోవడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇది చెత్త అని మీకు తెలిస్తే మీరు దానిని ఎక్కువసేపు పట్టుకోలేరు. మీ చేతులు ఖాళీగా మారడం ప్రారంభించటానికి ఇది చెత్త అని అర్థం చేసుకోవడం సరిపోతుంది. మీ చేతులు చెత్త నుండి శుభ్ర పడినప్పుడు, అసలు ప్రశ్న ఒక్కటే మిగిలిపోతుంది. మరి దీనిలోని సౌందర్యం ఏమిటంటే.. అసలు ప్రశ్నే మిగిలి ఉంటే సమాధానం ఎంతో దూరంలో లేదు. ప్రశ్నలోనే సమాధానం దాగి ఉంది. ప్రశ్నకు కేంద్రమే సమాధానం.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 186 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 186. THE REAL QUESTION 🍀*
*🕉 The real question is just a capsule in which the answer is hidden, a hard shell that protects the soft answer within. It is just a crust that surrounds a seed. 🕉*
*Ninety-nine questions out of a hundred are rubbish, and because of these ninety-nine questions you cannot manage to ask the really valuable question. Because these ninety-nine clamor around you, shout, are very noisy, they don't allow the real question to arise in you. The real question has a very silent, still, small voice, and these unreal ones are great pretenders. Because of them you cannot ask the right question and you cannot find the right answer.*
*So to know rubbish as rubbish is a great insight. Then it starts slipping out of your hands-because you cannot hold it long if you know it is rubbish. The very understanding that it is rubbish is enough for your hands to start becoming empty, and when your hands are empty of the rubbish, only the one, the real question, is left. And the beauty is that if only the real question is left, the answer is not far away. It is just inside the question. The very center of the question is the answer.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://oshodailymeditations.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 373 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 373 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 82. కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా ।*
*శృంగార రససంపూర్ణా, జయా, జాలంధరస్థితా ॥ 82 ॥ 🍀*
*🌻 373 -1. ‘కామేశ్వరప్రాణనాడీ’🌻*
*కామేశ్వరుని యొక్క ప్రాణనాడియే శ్రీమాత అని అర్థము. ప్రజ్ఞ పురుషుడు కాగా అందుండి యేర్పడునది ప్రాణము. ప్రాణమునకు ప్రజ్ఞ ఆధారము. ప్రజ్ఞకు ప్రాణమాధారము. సృష్టియం
దిరువురును ప్రముఖులే. వారి యందు హెచ్చుతగ్గులు లేవు. ఒకే తత్వము నుండి దిగి వచ్చినవారు. ప్రాణ మున్ననే ప్రజ్ఞ ఉపాధి యందు స్థితిగొని యుండును. ప్రాణము నిష్క్రమించినచో ప్రజ్ఞ నిష్క్రమించును. ప్రాణ మవతరించినచో ప్రజ్ఞ అవతరించును. అమ్మ లేక సృష్టియందు ప్రాణము లేదు. ఆమెయే ప్రాణేశ్వరి. ఆమెయే ప్రాణదాత్రి. ఆమెయే ప్రాణము. సృష్టియందు, జీవులయందు ప్రాణ నాడిగ వర్తించును. స్పందనాత్మకమై నిలచును.*
*కామేశ్వరుని యందు కూడ ప్రాణనాడి శ్రీమాతయే. కనుకనే పరమశివుడు సాగర మథన సమయమున పరమేశ్వరి అనుజ్ఞగొని హాలాహలమును స్వీకరించెను. శ్రీమాత ప్రాణనాడి యగుట చేత శివుడు మహాక్రూరమైన కాలకూట విషమును త్రాగిననూ శ్రీమాత మహిమచే కాలవశుడు కాలేదు. అమ్మ అనుగ్రహ మున్నవారికి ప్రాణ భయము లేదు. మన యందలి ప్రాణనాడి ఆమెయే. శరీరము నుండి ప్రాణము నిష్క్రమించినచో ప్రజ్ఞ కూడ నిష్క్రమించును. ఒకానొకప్పుడు ప్రజ్ఞ నిష్క్రమించిననూ ప్రాణము దేహము నంటిపెట్టుకొని యుండును.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 373 -1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 82. Kameshari prananadi krutagyna kamapujita*
*Shrungararasa sanpurna jaya jalandharasdhita ॥ 82 ॥ 🌻*
*🌻 373-1. Kāmeśvara-prāna-nāḍī कामेश्वर-प्रान-नाडी 🌻*
*She is the vital force of Kāmeśvara, the Supreme form of Śiva. This nāma is taken from Veda-s. Śrī Rudraṁ says (Yajur Veda IV.v.10) “Oh! Rudra! We invoke the auspicious form of yours, that is auspicious and ever healing along with the great auspicious form of Śaktī”.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
How to spot Divinity in flesh?
They serve others selflessly and fearlessly. And tirelessly. They only give, give and give even when it hurts, they still continue give. Even when they are judged and ridiculed, and misunderstood - they still give.
They work harder than most people because they don't only give to family and friends. They give to strangers, people they do not know, people who will not even be able to thank them personally. People who will never see their faces nor know their name. They do this because it is who they are.
They do not serve to receive blessings, not even expect good fortune. They do not give because it is good and right. They do it because they can't help it. They do it even if no one does to them what they do to others.
They can only imagine what it is like to love like them.They cannot breathe without loving.
That's because they are Love Personified.
మైత్రేయ మహర్షి బోధనలు - 121
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 121 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 93. సర్వహుత యజ్ఞము 🌻
ఆత్మవంతులు కొందరు బోధన చేయుదురు. కొందరు మౌనముగ నుందురు. కొందరు ప్రేమ, దయ పంచుచుందురు. కొందరంతర్ముఖులై యుందురు. దేహాభిమానము గల జీవుడు దైవాభిమానము కారణముగ పరిణితి చెంది ఆత్మవంతుడగును. దేహాత్మ భావనను వీడి జీవాత్మ భావనను పొంది పరమాత్మతో అనుసంధానము గావించుచున్నాడు. పరమాత్మానుసంధానము కారణముగ అతని యందు కొన్ని శక్తులుద్భవించును. వచ్చిన శక్తులను సిద్ధులను వినియోగించుటలో అతనికి బాధ్యత యున్నది.
సర్వజన శ్రేయోదాయకముగ నిర్వర్తించుట కర్తవ్యము. అట్టి కర్తవ్య నిర్వహణమున జీవుడు పురుషమేధ యజ్ఞము నిర్వర్తించుట జరుగును. తన దగ్గర చేరిన వాని నన్నంటిని జీవ శ్రేయస్సుకై సమర్పణ చేయుట చేసి, అటుపైన తనను కూడ సమర్పణ చేసుకొనుట పురుషమేధ యజ్ఞము. ఇది సర్వహుత యజ్ఞము. ఇందు జీవుడు తనతో సహా సమస్తమును సమర్పణ చేయును. సర్వము ఆహుతి యగుటయే సర్వహుత యజ్ఞము. వేదమున ఈ యజ్ఞము కీర్తింపబడినది. శ్రీకృష్ణుని జీవితమట్లు సాగినది.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
20 May 2022
నిర్మల ధ్యానాలు - ఓషో - 182
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 182 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మనసు సమాజానికి చెందింది. ధ్యానం నీకు చెందింది. ధ్యానం వల్ల నువ్వు పూర్తి స్వేచ్ఛగా వుంటావు. మనిషి మనసు నించీ, మంచి చెడ్డల నించీ బయట పడాలి. అప్పుడు నువ్వు హఠాత్తుగా అపారమయిన నిధిని దర్శిస్తావు. 🍀
అహం, కాంక్ష, సిద్ధాంతం, రాజకీయం, మతం యిట్లా ఎన్నో పొరలు అద్దం లాంటి నీ చైతన్యం మనక బారి వుంటుంది. అందులో ఏదీ ప్రతి ఫలించదు. నువ్వు చెయ్యాల్సిందల్లా మసకబారిన అద్దాన్ని, మలిన పడిన అద్దాన్ని శుభ్రం చెయ్యాలి. మనసు నించీ నువ్వు బయటపడాలి. మంచి చెడ్డల నించీ బయట పడాలి.
మనసు సమాజానికి చెందింది. ధ్యానం నీకు చెందింది. ధ్యానం వల్ల నువ్వు పూర్తి స్వేచ్ఛగా వుంటావు. అప్పుడు నువ్వు హఠాత్తుగా అపారమయిన నిధిని దర్శిస్తావు. ఆనంద మార్గాల్ని కనిపెడతావు. అందం, గానం, ఉత్సవం నిన్ను చుట్టు ముడతాయి. ఇది అనంతంగా కొనసాగుతుంది. నీలోని అనంత ఆకాశాన్ని ఆవిష్కరిస్తుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
20 May 2022
నిత్య ప్రజ్ఞా సందేశములు - 282 - 8. ఇది మితవాదం యొక్క తత్వశాస్త్రం / DAILY WISDOM - 282 - 8. This is the Philosophy of Moderation
🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 282 / DAILY WISDOM - 282 🌹
🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀
📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 8. ఇది మితవాదం యొక్క తత్వశాస్త్రం 🌻
చాలా నిరాడంబరమైన మరియు వైరాగ్య వైఖరి ద్వారా, ఒకరి సౌకర్యవంతమైన జీవితానికి అవసరం లేని విషయాలతో ఒకరి సంబంధాలను తగ్గించుకోవచ్చు. సౌకర్యవంతమైన జీవితం ఒక ఆవశ్యకత అని అనుకుందాం; సౌకర్యవంతమైన జీవితాన్ని విలాసాలు లేకుండా కూడా గడపవచ్చు. మీకు ఎన్ని చేతి గడియారాలు ఉన్నాయి? ఎన్ని కోట్లు? మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి? మీకు ఎంత భూమి ఉంది? ఎన్ని ఎకరాలు?. ఇవి మన యోగాభ్యాసానికి ఆటంకం కలిగించే అనేక వెర్రి విషయాలు, ఎందుకంటే మనం వాటిని తాకినప్పుడు లేదా వాటితో జోక్యం చేసుకున్నప్పుడు లేదా వాటిని నివారించడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే అవి సృష్టించగల ఇబ్బంది యొక్క పరిధి మన దృష్టికి వస్తుంది.
మనం విషయాలతో స్నేహపూర్వకంగా ఉన్నంత కాలం, అవి కూడా స్నేహపూర్వకంగా కనిపిస్తాయి, కానీ మనం వాటిని నివారించడానికి ప్రయత్నించినప్పుడు, వాటి ప్రతిచర్యలు పూర్తిగా భిన్నమైన రీతిలో ఉంటాయి. అనవసరమైన వాటిని నివారించడంలో కూడా యుక్తిని ఉపయోగించడం చాలా అవసరం; లేకపోతే, ఆ విషయాలపై ఒక అప్రసన్నత ఉండవచ్చు. ఇదే తత్వం మరియు యోగం చెప్పే మధ్యేమార్గం. ఇక్కడ బాహ్యమైన, బంధమైన స్వయం, పరమ లక్ష్యం అయిన సంపూర్ణ స్వయానికి లోబడి ఉండాలి.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 282 🌹
🍀 📖 from The Study and Practice of Yoga 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 8. This is the Philosophy of Moderation 🌻
By a very dispassionate and unattached attitude, one can diminish one's relationships with things which are really not essential for one's comfortable existence. Let us assume that a comfortable existence is a necessity; even that comfortable life can be led without these luxuries. How many wrist watches have you got? How many coats? How many rooms are you occupying? How much land have you? How many acres?—and so on. These are various silly things which come in the way of our yoga practice because the extent of trouble that they can create will come to our notice only when we actually touch them, or interfere with them, or try to avoid them.
As long as we are friendly with things, they also look friendly, but when we try to avoid them, we will see their reactions are of a different type altogether. It is very necessary to use tact even in avoiding the unnecessary things; otherwise, there can be a resentment on the part of those things. This is the philosophy of moderation—the via media and the golden mean of philosophy and yoga—where the self that is redundant, external and related has to be made subservient to the ultimate goal which is the Absolute Self.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
20 May 2022
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 603 / Vishnu Sahasranama Contemplation - 603
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 603 / Vishnu Sahasranama Contemplation - 603 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 603. శ్రీపతిః, श्रीपतिः, Śrīpatiḥ 🌻
ఓం శ్రీపతయే నమః | ॐ श्रीपतये नमः | OM Śrīpataye namaḥ
శ్రీపతిః, श्रीपतिः, Śrīpatiḥ
అమృతమథనే సర్వాన్ త్రిదివేశాన్ శ్రియః ।
విహాయ శ్రీః పతిత్వేన వరయామాస యం హరిమ్ ॥
స శ్రీపతిరితి ప్రోక్తః పరాశక్తేరుత శ్రియః ।
పతిరితి వా శ్రీపతిరితి స ప్రోచ్యతే బుధైః ।
పరాఽస్య శక్తిర్విధైవేతిశ్రుతిసమీరణాత్ ॥
లక్ష్మికి పతి. అమృత మథనమునందు సురాసురాదులను అందరను కాదని శ్రీ ఈతనిని తన పతిగా వరించెను. లేదా 'శ్రీ' అనగా పరాశక్తి. ఆమెకు పతి శ్రీ విష్ణువు.
:: శ్వేతాశ్వతరోపనిషత్ షష్ఠోఽధ్యాయః ::
న తస్య కార్యం కరణఞ్చ విద్యతే న తత్సమ శ్చాభ్యధికశ్చదృశ్యతే ।
పరాఽస్య శక్తిర్వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞానబల క్రియా చ ॥ 8 ॥
ఆ పరమేశ్వరునకు శరీరము, ఇంద్రియ సమూహములు లేవు. ఆ దేవునకు సముడుగానీ, అధికుడుగానీ కనిపించుటలేదు. ఆ పరమేశ్వరునికి పరాశక్తి నానా విధములుగా ఉన్నదని వేదములు ప్రతిపాదించుచున్నవి. ఆ దేవుని పరాశక్తి స్వభావసిద్ధమయినది. జ్ఞాన క్రియా బలములు గలది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 603🌹
📚. Prasad Bharadwaj
🌻603. Śrīpatiḥ🌻
OM Śrīpataye namaḥ
अमृतमथने सर्वान् त्रिदिवेशान् श्रियः ।
विहाय श्रीः पतित्वेन वरयामास यं हरिम् ॥
स श्रीपतिरिति प्रोक्तः पराशक्तेरुत श्रियः ।
पतिरिति वा श्रीपतिरिति स प्रोच्यते बुधैः ।
पराऽस्य शक्तिर्विधैवेतिश्रुतिसमीरणात् ॥
Amrtamathane sarvān tridiveśān śriyaḥ,
Vihāya śrīḥ patitvena varayāmāsa yaṃ harim.
Sa śrīpatiriti proktaḥ parāśakteruta śriyaḥ,
Patiriti vā śrīpatiriti sa procyate budhaiḥ,
Parā’sya śaktirvidhaivetiśrutisamīraṇāt.
The husband of Śrī. At the time of churning the ocean, rejecting the devās and asurās, Śrī i.e., goddess Lakṣmi chose Him for Her husband. Or 'Śrīḥ' may mean parā śakti. Since Lord Viṣṇu is Her husband, He is Śrīpatiḥ.
:: श्वेताश्वतरोपनिषत् षष्ठोऽध्यायः ::
न तस्य कार्यं करणञ्च विद्यते न तत्सम श्चाभ्यधिकश्चदृश्यते ।
पराऽस्य शक्तिर्विविधैव श्रूयते स्वाभाविकी ज्ञानबल क्रिया च ॥ ८ ॥
Śvetāśvataropaniṣat - Chapter 6
Na tasya kāryaṃ karaṇañca vidyate na tatsama ścābhyadhikaścadrśyate,
Parā’sya śaktirvividhaiva śrūyate svābhāvikī jñānabala kriyā ca. 8.
He is without a body or organs; none like unto Him is seen, or better than He. The Vedas speak of parā śakti i.e., His exalted power, which is innate and capable of producing diverse effects and also of His omniscience and might.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः ।
श्रीवत्सवक्षाश्श्रीवासश्श्रीपतिः श्रीमतां वरः ॥ ६४ ॥
అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।
అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।
శ్రీవత్సవక్షాశ్శ్రీవాసశ్శ్రీపతిః శ్రీమతాం వరః ॥ 64 ॥
Anivartī nivrttātmā saṃkṣeptā kṣemakrcchivaḥ,
Anivartī nivrttātmā saṃkṣeptā kṣemakrcchivaḥ,
Śrīvatsavakṣāśśrīvāsaśśrīpatiḥ śrīmatāṃ varaḥ ॥ 64 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
20 May 2022
Continues....
🌹 🌹 🌹 🌹🌹
20 May 2022
20 - MAY - 2022 శుక్రవారం, భృగు వాసరే MESSAGES
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 20, మే 2022 శుక్రవారం, భృగు వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 204 / Bhagavad-Gita - 204 - 4- 42 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 603 / Vishnu Sahasranama Contemplation - 603🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 282 / DAILY WISDOM - 282🌹
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 182 🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 121🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ శుక్రవారం మిత్రులందరికీ 🌹*
*భృగు వాసరే, 20, మే 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*
*🍀. 6. విజయలక్ష్మి స్త్రోత్రం 🍀*
*జయ కమలాసిని సద్గతి దాయిని, జ్ఞానవికాసిని గానమయే*
*అనుదిన మర్చిత కుంకుమ ధూసర, భూషిత వాసిత వాద్యనుతే |*
*కనకధరాస్తుతి వైభవ వందిత, శంకరదేశిక మాన్యపదే*
*జయ జయహే మధుసూదన కామిని, విజయలక్ష్మీ పరిపాలయ మామ్*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక మార్గములో పయనించే వారికి లోభం, మోహం అనే భవబంధనాలు సంకెళ్ళ వంటివి. - సద్గురు శ్రీరామశర్మ 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, వైశాఖ మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిథి: కృష్ణ పంచమి 17:30:25 వరకు
తదుపరి కృష్ణ షష్టి
నక్షత్రం: ఉత్తరాషాఢ 25:19:24 వరకు
తదుపరి శ్రవణ
యోగం: శుభ 11:24:55 వరకు
తదుపరి శుక్ల
కరణం: కౌలవ 06:54:52 వరకు
వర్జ్యం: 10:38:20 - 12:06:24
మరియు 29:03:40 - 30:33:32
దుర్ముహూర్తం: 08:18:42 - 09:10:41
మరియు 12:38:39 - 13:30:39
రాహు కాలం: 10:35:11 - 12:12:40
గుళిక కాలం: 07:20:13 - 08:57:41
యమ గండం: 15:27:37 - 17:05:06
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:37
అమృత కాలం: 19:26:44 - 20:54:48
సూర్యోదయం: 05:42:44
సూర్యాస్తమయం: 18:42:36
చంద్రోదయం: 23:22:01
చంద్రాస్తమయం: 09:39:36
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
ఆనంద యోగం - కార్య సిధ్ధి 19:45:59 వరకు
తదుపరి కాలదండ యోగం - మృత్యు భయం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PanchangDaily
#DailyTeluguCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 204 / Bhagavad-Gita - 204 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 42 🌴*
*42. తస్మాదజ్ఞానసంభూతం హృత్థ్సం జ్ఞానాసినాత్మన: |*
*ఛిత్వైనం సంశయం యోగమాతి ష్ఠోత్తిష్ట భారత ||*
🌷. తాత్పర్యం :
*కావున అజ్ఞానము వలన హృదయమునందు కలిగిన సంశయములను జ్ఞానఖడ్గముచే ఛేదించి వేయుము. ఓ భారతా! యోగసమన్వితుడవై యుద్ధము చేయుటకు లెమ్ము!*
🌷. భాష్యము :
ఈ అధ్యాయమున ఉపదేశింపబడిన యోగపద్ధతి సనాతనయోగము (జీవునిచే నిర్వహింపబడు నిత్యకర్మలు) అని పిలువబడును. ఈ యోగవిధానము రెండువిధములైన యజ్ఞకర్మలను కూడియుండును. అందు ఒకటి ద్రవ్యమయయజ్ఞమని పిలువబడగా, రెండవది శుద్ధ ఆధ్యాత్మిక కర్మయైనటువంటి ఆత్మజ్ఞానముగా పిలువబడును. ద్రవ్యమయయజ్ఞము ఆత్మానుభవముతో సంధింపబడనిచో అది భౌతికకర్మగా పరిణమించును. కాని అట్టి యజ్ఞములను ఆధ్యాత్మిక ఉద్దేశ్యముతో (భక్తియోగమునందు) నిర్వహించువాడు పూర్ణయజ్ఞమును కావించినవాడగును.
ఇక మనము ఆధ్యాత్మిక కర్మలను గూర్చి తెలిసికొనుట (స్వీయస్థితి) కాగా, రెండవది దేవదేవుడైన శ్రీకృష్ణభగవానుని గూర్చిన సత్యమును ఎరుగుట కాగలదు. భగవద్గీత మార్గమును యథాతథముగా అనుసరించువాడు ఆధ్యాత్మికజ్ఞానమునందలి ఈ రెండు ముఖ్యవిభాగవములను సులభముగా అవగతము చేసికొనగలడు. అట్టివానికి ఆత్మ శ్రీకృష్ణభగవానుని దివ్యకర్మలను సులభముగా అవగతము చేసికొనగలడు కావున అతనికి గల జ్ఞానము లాభదాయకము కాగలదు. ఈ అధ్యాయపు ఆరంభములో భగవానుని దివ్యకర్మలు అతని చేతనే చర్చించబడియున్నవి.
అట్టి గీతోపదేశమును అవగాహన చేసికొనలేనివాడు శ్రద్ధారహితునిగను మరియు భగవానునిచే ఒసగబడిన కొద్దిపాటి స్వాతంత్ర్యమును దుర్వినియోగాపరచినవాడుగను భావింపబడును. అట్టి ఉపదేశము లభించిన పిమ్మటయు సత్, చిత్, జ్ఞానస్వరూపునిగా శ్రీకృష్ణభగవానుని నిజతత్త్వమును తెలిసికొనలేనివాడు నిక్కముగా గొప్ప మూర్ఖుడే. అట్టి అజ్ఞానము కృష్ణభక్తిభావన యందలి నియమములను పాటించుట ద్వారా క్రమముగా తొలగిపోగలదు.
శ్రీమధ్భగవద్గీత యందలి “దివ్యజ్ఞానము” అను చతుర్థాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 204 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 4 - Jnana Yoga - 42 🌴*
*42. tasmād ajñāna-sambhūtaṁ hṛt-sthaṁ jñānāsinātmanaḥ*
*chittvainaṁ saṁśayaṁ yogam ātiṣṭhottiṣṭha bhārata*
🌷 Translation :
*Therefore the doubts which have arisen in your heart out of ignorance should be slashed by the weapon of knowledge. Armed with yoga, O Bhārata, stand and fight.*
🌹 Purport :
The yoga system instructed in this chapter is called sanātana-yoga, or eternal activities performed by the living entity. This yoga has two divisions of sacrificial actions: one is called sacrifice of one’s material possessions, and the other is called knowledge of self, which is pure spiritual activity. If sacrifice of one’s material possessions is not dovetailed for spiritual realization, then such sacrifice becomes material. But one who performs such sacrifices with a spiritual objective, or in devotional service, makes a perfect sacrifice. When we come to spiritual activities, we find that these are also divided into two: namely, understanding of one’s own self (or one’s constitutional position), and the truth regarding the Supreme Personality of Godhead.
One who follows the path of Bhagavad-gītā as it is can very easily understand these two important divisions of spiritual knowledge. For him there is no difficulty in obtaining perfect knowledge of the self as part and parcel of the Lord. And such understanding is beneficial, for such a person can easily understand the transcendental activities of the Lord. In the beginning of this chapter, the transcendental activities of the Lord were discussed by the Supreme Lord Himself. One who does not understand the instructions of the Gītā is faithless, and is to be considered to be misusing the fragmental independence awarded to him by the Lord. In spite of such instructions, one who does not understand the real nature of the Lord as the eternal, blissful, all-knowing Personality of Godhead is certainly fool number one. Ignorance can be removed by gradual acceptance of the principles of Kṛṣṇa consciousness.
Thus end the Bhaktivedanta Purports to the Fourth Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of Transcendental Knowledge.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 603 / Vishnu Sahasranama Contemplation - 603 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻 603. శ్రీపతిః, श्रीपतिः, Śrīpatiḥ 🌻*
*ఓం శ్రీపతయే నమః | ॐ श्रीपतये नमः | OM Śrīpataye namaḥ*
శ్రీపతిః, श्रीपतिः, Śrīpatiḥ
*అమృతమథనే సర్వాన్ త్రిదివేశాన్ శ్రియః ।*
*విహాయ శ్రీః పతిత్వేన వరయామాస యం హరిమ్ ॥*
*స శ్రీపతిరితి ప్రోక్తః పరాశక్తేరుత శ్రియః ।*
*పతిరితి వా శ్రీపతిరితి స ప్రోచ్యతే బుధైః ।*
*పరాఽస్య శక్తిర్విధైవేతిశ్రుతిసమీరణాత్ ॥*
*లక్ష్మికి పతి. అమృత మథనమునందు సురాసురాదులను అందరను కాదని శ్రీ ఈతనిని తన పతిగా వరించెను. లేదా 'శ్రీ' అనగా పరాశక్తి. ఆమెకు పతి శ్రీ విష్ణువు.*
:: శ్వేతాశ్వతరోపనిషత్ షష్ఠోఽధ్యాయః ::
న తస్య కార్యం కరణఞ్చ విద్యతే న తత్సమ శ్చాభ్యధికశ్చదృశ్యతే ।
పరాఽస్య శక్తిర్వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞానబల క్రియా చ ॥ 8 ॥
*ఆ పరమేశ్వరునకు శరీరము, ఇంద్రియ సమూహములు లేవు. ఆ దేవునకు సముడుగానీ, అధికుడుగానీ కనిపించుటలేదు. ఆ పరమేశ్వరునికి పరాశక్తి నానా విధములుగా ఉన్నదని వేదములు ప్రతిపాదించుచున్నవి. ఆ దేవుని పరాశక్తి స్వభావసిద్ధమయినది. జ్ఞాన క్రియా బలములు గలది.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 603🌹*
*📚. Prasad Bharadwaj*
*🌻603. Śrīpatiḥ🌻*
*OM Śrīpataye namaḥ*
अमृतमथने सर्वान् त्रिदिवेशान् श्रियः ।
विहाय श्रीः पतित्वेन वरयामास यं हरिम् ॥
स श्रीपतिरिति प्रोक्तः पराशक्तेरुत श्रियः ।
पतिरिति वा श्रीपतिरिति स प्रोच्यते बुधैः ।
पराऽस्य शक्तिर्विधैवेतिश्रुतिसमीरणात् ॥
*Amrtamathane sarvān tridiveśān śriyaḥ,*
*Vihāya śrīḥ patitvena varayāmāsa yaṃ harim.*
*Sa śrīpatiriti proktaḥ parāśakteruta śriyaḥ,*
*Patiriti vā śrīpatiriti sa procyate budhaiḥ,*
*Parā’sya śaktirvidhaivetiśrutisamīraṇāt.*
*The husband of Śrī. At the time of churning the ocean, rejecting the devās and asurās, Śrī i.e., goddess Lakṣmi chose Him for Her husband. Or 'Śrīḥ' may mean parā śakti. Since Lord Viṣṇu is Her husband, He is Śrīpatiḥ.*
:: श्वेताश्वतरोपनिषत् षष्ठोऽध्यायः ::
न तस्य कार्यं करणञ्च विद्यते न तत्सम श्चाभ्यधिकश्चदृश्यते ।
पराऽस्य शक्तिर्विविधैव श्रूयते स्वाभाविकी ज्ञानबल क्रिया च ॥ ८ ॥
Śvetāśvataropaniṣat - Chapter 6
Na tasya kāryaṃ karaṇañca vidyate na tatsama ścābhyadhikaścadrśyate,
Parā’sya śaktirvividhaiva śrūyate svābhāvikī jñānabala kriyā ca. 8.
*He is without a body or organs; none like unto Him is seen, or better than He. The Vedas speak of parā śakti i.e., His exalted power, which is innate and capable of producing diverse effects and also of His omniscience and might.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः ।श्रीवत्सवक्षाश्श्रीवासश्श्रीपतिः श्रीमतां वरः ॥ ६४ ॥
అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।శ్రీవత్సవక్షాశ్శ్రీవాసశ్శ్రీపతిః శ్రీమతాం వరః ॥ 64 ॥
Anivartī nivrttātmā saṃkṣeptā kṣemakrcchivaḥ,Śrīvatsavakṣāśśrīvāsaśśrīpatiḥ śrīmatāṃ varaḥ ॥ 64 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 282 / DAILY WISDOM - 282 🌹*
*🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻 8. ఇది మితవాదం యొక్క తత్వశాస్త్రం 🌻*
*చాలా నిరాడంబరమైన మరియు వైరాగ్య వైఖరి ద్వారా, ఒకరి సౌకర్యవంతమైన జీవితానికి అవసరం లేని విషయాలతో ఒకరి సంబంధాలను తగ్గించుకోవచ్చు. సౌకర్యవంతమైన జీవితం ఒక ఆవశ్యకత అని అనుకుందాం; సౌకర్యవంతమైన జీవితాన్ని విలాసాలు లేకుండా కూడా గడపవచ్చు. మీకు ఎన్ని చేతి గడియారాలు ఉన్నాయి? ఎన్ని కోట్లు? మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి? మీకు ఎంత భూమి ఉంది? ఎన్ని ఎకరాలు?. ఇవి మన యోగాభ్యాసానికి ఆటంకం కలిగించే అనేక వెర్రి విషయాలు, ఎందుకంటే మనం వాటిని తాకినప్పుడు లేదా వాటితో జోక్యం చేసుకున్నప్పుడు లేదా వాటిని నివారించడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే అవి సృష్టించగల ఇబ్బంది యొక్క పరిధి మన దృష్టికి వస్తుంది.*
*మనం విషయాలతో స్నేహపూర్వకంగా ఉన్నంత కాలం, అవి కూడా స్నేహపూర్వకంగా కనిపిస్తాయి, కానీ మనం వాటిని నివారించడానికి ప్రయత్నించినప్పుడు, వాటి ప్రతిచర్యలు పూర్తిగా భిన్నమైన రీతిలో ఉంటాయి. అనవసరమైన వాటిని నివారించడంలో కూడా యుక్తిని ఉపయోగించడం చాలా అవసరం; లేకపోతే, ఆ విషయాలపై ఒక అప్రసన్నత ఉండవచ్చు. ఇదే తత్వం మరియు యోగం చెప్పే మధ్యేమార్గం. ఇక్కడ బాహ్యమైన, బంధమైన స్వయం, పరమ లక్ష్యం అయిన సంపూర్ణ స్వయానికి లోబడి ఉండాలి.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 282 🌹*
*🍀 📖 from The Study and Practice of Yoga 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*
*🌻 8. This is the Philosophy of Moderation 🌻*
*By a very dispassionate and unattached attitude, one can diminish one's relationships with things which are really not essential for one's comfortable existence. Let us assume that a comfortable existence is a necessity; even that comfortable life can be led without these luxuries. How many wrist watches have you got? How many coats? How many rooms are you occupying? How much land have you? How many acres?—and so on. These are various silly things which come in the way of our yoga practice because the extent of trouble that they can create will come to our notice only when we actually touch them, or interfere with them, or try to avoid them.*
*As long as we are friendly with things, they also look friendly, but when we try to avoid them, we will see their reactions are of a different type altogether. It is very necessary to use tact even in avoiding the unnecessary things; otherwise, there can be a resentment on the part of those things. This is the philosophy of moderation—the via media and the golden mean of philosophy and yoga—where the self that is redundant, external and related has to be made subservient to the ultimate goal which is the Absolute Self.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
#PrasadBhardwaj
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 182 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. మనసు సమాజానికి చెందింది. ధ్యానం నీకు చెందింది. ధ్యానం వల్ల నువ్వు పూర్తి స్వేచ్ఛగా వుంటావు. మనిషి మనసు నించీ, మంచి చెడ్డల నించీ బయట పడాలి. అప్పుడు నువ్వు హఠాత్తుగా అపారమయిన నిధిని దర్శిస్తావు. 🍀*
*అహం, కాంక్ష, సిద్ధాంతం, రాజకీయం, మతం యిట్లా ఎన్నో పొరలు అద్దం లాంటి నీ చైతన్యం మనక బారి వుంటుంది. అందులో ఏదీ ప్రతి ఫలించదు. నువ్వు చెయ్యాల్సిందల్లా మసకబారిన అద్దాన్ని, మలిన పడిన అద్దాన్ని శుభ్రం చెయ్యాలి. మనసు నించీ నువ్వు బయటపడాలి. మంచి చెడ్డల నించీ బయట పడాలి.*
*మనసు సమాజానికి చెందింది. ధ్యానం నీకు చెందింది. ధ్యానం వల్ల నువ్వు పూర్తి స్వేచ్ఛగా వుంటావు. అప్పుడు నువ్వు హఠాత్తుగా అపారమయిన నిధిని దర్శిస్తావు. ఆనంద మార్గాల్ని కనిపెడతావు. అందం, గానం, ఉత్సవం నిన్ను చుట్టు ముడతాయి. ఇది అనంతంగా కొనసాగుతుంది. నీలోని అనంత ఆకాశాన్ని ఆవిష్కరిస్తుంది.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://oshodailymeditations.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 121 🌹*
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻 93. సర్వహుత యజ్ఞము 🌻*
*ఆత్మవంతులు కొందరు బోధన చేయుదురు. కొందరు మౌనముగ నుందురు. కొందరు ప్రేమ, దయ పంచుచుందురు. కొందరంతర్ముఖులై యుందురు. దేహాభిమానము గల జీవుడు దైవాభిమానము కారణముగ పరిణితి చెంది ఆత్మవంతుడగును. దేహాత్మ భావనను వీడి జీవాత్మ భావనను పొంది పరమాత్మతో అనుసంధానము గావించుచున్నాడు. పరమాత్మానుసంధానము కారణముగ అతని యందు కొన్ని శక్తులుద్భవించును. వచ్చిన శక్తులను సిద్ధులను వినియోగించుటలో అతనికి బాధ్యత యున్నది.*
*సర్వజన శ్రేయోదాయకముగ నిర్వర్తించుట కర్తవ్యము. అట్టి కర్తవ్య నిర్వహణమున జీవుడు పురుషమేధ యజ్ఞము నిర్వర్తించుట జరుగును. తన దగ్గర చేరిన వాని నన్నంటిని జీవ శ్రేయస్సుకై సమర్పణ చేయుట చేసి, అటుపైన తనను కూడ సమర్పణ చేసుకొనుట పురుషమేధ యజ్ఞము. ఇది సర్వహుత యజ్ఞము. ఇందు జీవుడు తనతో సహా సమస్తమును సమర్పణ చేయును. సర్వము ఆహుతి యగుటయే సర్వహుత యజ్ఞము. వేదమున ఈ యజ్ఞము కీర్తింపబడినది. శ్రీకృష్ణుని జీవితమట్లు సాగినది.*
*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Subscribe to:
Posts (Atom)













