11) 🌹. శివ మహా పురాణము - 368🌹
12) 🌹 Light On The Path - 117🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 250🌹
14) 🌹 Seeds Of Consciousness - 315🌹
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 190🌹
16) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 45 / Lalitha Sahasra Namavali - 45🌹
17) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 45 / Sri Vishnu Sahasranama - 45🌹
18) 🌹. భగవద్గీత యథాతథం - 1 - 019 🌹*
AUDIO - VIDEO
🌹. దత్తాత్రేయ మంత్రాత్మక శ్లోకములు :- 🌹*
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -168 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 11
*🍀 11. స్థిరాసనము -2 - ఆసన మనగ కూర్చుండు పద్దతి. అది స్థిరముగ, నిశ్చలముగ నుండవలె నన్నచో దేహమునకు సుఖమిచ్చునదిగ నుండవలెను. లేనిచో సాధకు డటునిటు కదలుట తప్పనిసరియై, మనస్సును ఆత్మపై లగ్నము చేయుటకు వీలుపడదు. ధ్యానమునకు ప్రధానముగ వలసినది, మనస్సును ఆత్మపై లగ్నము చేయుట. అటుపైన మనస్సును స్థిరమగు ప్రదేశమున అంత రంగమున లగ్నము చేయుట నిజమగు ఆసన మగును. మనసును హృదయము నందు గాని, భ్రూమధ్యము నందు గాని స్థిరముగ లగ్నము చేయుటకు ప్రయత్నము సాగవలెను. 🍀*
3. సాధకుడు స్థిరాసనమును ఏర్పరచుకొనవలెను. ఆసన మనగ కూర్చుండు పద్దతి. అది స్థిరముగ, నిశ్చలముగ నుండవలె నన్నచో దేహమునకు సుఖమిచ్చునదిగ నుండవలెను. లేనిచో సాధకు డటునిటు కదలుట తప్పనిసరియై, మనస్సును ఆత్మపై లగ్నము చేయుటకు వీలుపడదు. పూర్వకాలమున పద్మాసనము వేసు కొనెడివారు.
అట్లే వీరాసనము కూడ వాడుక యందుండెడిది. ప్రస్తుతము జీవన విధానము ననుసరించి నేలపై కూర్చుండు అలవాటు తప్పుటచే, ఎవ్వరును పై తెలిపిన విధముగ కూర్చుండుట లేదు.
ఆసన మేదైనను అది ప్రధానముగ దేహమునకు స్థిరత్వము నీయవలెను. భగవద్గీత యందు స్థిరమాసనమే తెలిపిరి గాని, ప్రత్యేకముగ ఏ ఆసనమును నిర్దేశించ లేదు. ధ్యానమునకు ప్రధానముగ వలసినది, మనస్సును ఆత్మపై లగ్నము చేయుట.
ఆ ప్రయత్నమున దేహమున కంతరాయము కలిగింపరాదు. ఇది ప్రధానమని సాధకుడు తెలియవలెను. దేహస్థిరత్వము, మనో స్థిరత్వము ధ్యానమునకు ప్రధానమగు లక్షణములు.
అందువలన కొందరు సద్గురువులు పరుండబెట్టి ధ్యానము నిత్తురు. మరి కొందరు కూర్చుండబెట్టి నిత్తురు. ఆసన మేదైనను ఒక గంట సమయము దేహమును కదపనవసరము లేనిదై యుండవలెను.
అటుపైన మనస్సును స్థిరమగు ప్రదేశమున అంత రంగమున లగ్నము చేయుట నిజమగు ఆసన మగును. మనసును హృదయమునందు గాని, భ్రూమధ్యమునందు గాని స్థిరముగ
లగ్నము చేయుటకు ప్రయత్నము సాగవలెను.
అట్టి స్థిరత్వము మనస్సునకు కలుగుటకు వలసిన లక్షణము లన్నియు ముందు శ్లోకములలో ఇప్పటికే తెలుపబడినవి. వాటిని పాటించినపుడే మనస్సునకు స్థిరాసనము ఏర్పడును. ఇట్లు ఈ శ్లోకమున స్థిరాసనము దేహమునకు, మనస్సునకు కూడ సూచింపబడినది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, WA, FB Groups 🌹
https://t.me/BhagavadGita_Telugu_English
https://chat.whatsapp.com/BzCAiTrm6X9K1NsjyGWzlg
www.facebook.com/groups/bhagavadgeetha/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 368🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
96. అధ్యాయము - 08
*🌻. నారద హిమాలయ సంవాదము - 3 🌻*
ఓ మహర్షీ!ఇచటకు విచ్చేసి నాతో ప్రీతిగా మాటలాడే కిన్నరుల ముఖము నుండి నేను అనేక పర్యాయములు ఇట్లు వినియుంటిని. ఈ మాట అసత్యము అనుట నిశ్చయమేనా? (40). ఆయనకు హరుడని పేరు గలదు. ఆ పేరును బట్టి (హరించువాడ హరుడు) ఆయన అట్టి వాడే అయి ఉండునని లోకములో వినబడు చున్నది. ఆయన పూర్వము ఒక ప్రతిజ్ఞను చేసినాడట. దానిని చెప్పెదను వినుము (41).
'దక్షపుత్రీ! సతీ! ప్రియురాలా! నిన్ను తక్క మరియొక స్త్రీని నేను భార్యగా స్వీకరించను. వరించను. నేను సత్యమును చెప్పుచున్నాను' (42). ఇట్లు ఆయన పూర్వమే సతీదేవి ఎదుట ప్రతిజ్ఞను చేసియున్నాడు. ఆమె మరణించినది. ఇపుడాతడు మరియొక స్త్రీని ఎట్లు వివాహమాడగలడు? (43)
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఆ హిమవంతుడు నీ ఎదుట ఇట్లు పలికి మిన్నకుండెను. ఓ దేవర్షీ! నీవా మాటను విని,యధార్ధమును నిశ్చయించి, అతనితో నిట్లంటివి (44).
నారదుడిట్లు పనికెను-
ఓ పర్వతరాజా! మహాత్మా! నీవు చింతిల్లకుము.న నీ కుమార్తె యగు ఈ కాళియే పుర్వము దక్ష పుత్రియై జన్మించెను (45) సర్వకాలములలో సర్వమంగళములనిచ్చే సతియను పేర ఆమె అపుడు ప్రసిద్ధిగాంచెను. ఆ సతి దక్ష పుత్రియై రుద్రునకు పత్ని ఆయెను (46).
ఆ సతి తండ్రి చేసిన యజ్ఞములో శంకరునకు అనాదరము జరుగుటను గాంచి కోపమును చెంది దేహమును త్యజించెను (47). జగన్మాతయగు ఆ శివాదేవియే మరల నీ గృహములో జన్మించినది. ఈ పార్వతి శివుని పత్ని యగుననుటలో సందేహము లేదు(48).
ఓ సహర్షీ! నీవు ఈ వృత్తాంతమునంతనూ ఆ పర్వత రాజునకు చెప్పితివి. నీవు చెప్పిన ఆ పూర్వ చరిత్ర పార్వతికి మహానందమును కలిగించెను(49). హిమవంతుడు. ఆయన భార్య,కుమారులు మహర్షి ముఖము నుండి కాళిక యెక్క ఆ పూర్వ వృత్తాంతము నంతయూ విని, సంశయములను వీడిరి (50).
అపుడు నారదుని ముఖము నుండి ఆ గాధను విని కాళిక సిగ్గుతో తలను వంచుకొనెను.ఆమె ముఖము చిరునవ్వుతో విప్పారెను (51). ఆ చరిత్రను విని హిమవంతుడు ఆమెను చేతితో స్పృశించి, శిరస్సు పై ముద్దాడి తన ఆసన సమీపములో కూర్చుండబెట్టు కొనెను (52).
ఓ మహర్షీ! అచటనున్న అమెను చూచి నీవు మరల ఇట్లు పలికితివి. నీ పులుకులు హిమవంతునకు, మేనకు, వారి కుమారులకు ఆనందమును కలిగించినవి(53).
ఓ పర్వతరాజా! ఈ పైన ఈమె యొక్క సింహాసనము సర్వదా శివుని ఊరువులు కాగలవు(54). నీ కుమార్తె శవుని ఊరువులు అనే ఆసనమును సర్వకాలముల యందు పొంది, ఎవ్వరి తృష్టికి గాని, మనస్సుల కైననూ గాని గోచరము గాని స్ధానమును పొందగలదు (55).
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఓ నారదా! నీవు ఈ విధముగా పర్వతరాజుతో ఉదారమగు వచనములను పలికి వెంటనే ఆనందముతో స్వర్గమునకు వెళ్లి యుంటివి. ఆ హిమవంతుడు ఆనందముతో నిండిన హృదము గలవాడై సర్వ సంపదలతో నలరారు తన గృహమునకు వెళ్లెను(56).
శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో నారద హిమాలయ సంవాద వర్ణనమనే ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (8).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 LIGHT ON THE PATH - 117 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj
CHAPTER 8 - THE 20th RULE
*🌻 20. Seek it not by any one road. - 10 🌻*
445. In the same way the intellectual people must not destroy intellect, but must bridle it and guide it. It is quite true that intellect like devotion may run away with people. They do not always realize that; they say that the intellect in itself is a guarantee against anything extreme, but I am afraid it is not. Many people make a kind of god of intellect; they say:
“Our reason is the only thing we have to guide us and we must always follow that out to its logical conclusion.” That would be quite true if all their premises were always right to begin with, but usually they are remarkably deficient. They are generally considering the physical side of the problem only and leaving out of account the far more important hidden side, and therefore their conclusions are inevitably wrong.
As I said before, we must be balanced; we must learn to see all sides of a question, and we must endeavour to avoid developing any one quality, however good, to such excess that it is altogether out of proportion to all the other qualities, because often the most admirable quality may become dangerous if it is taken in that way apart from the whole.
The man who possesses keen intellect is much to be congratulated because of that intellectual development, but all the more if he has that should he be careful that the other side, that of love and sympathy, is not neglected nor forgotten.
446. In exactly the same way those who possess the power of love and sympathy must see to it that they develop the intellectual side of their natures, so that they will not be led away by their sympathy into foolish action which will not help, but hinder.
A person with the keenest sympathy but no knowledge is often perfectly helpless, just as many a man would be in the presence of some sad accident, lacking the knowledge which a doctor would have. Many people, though full of sympathy and anxious to help, do not know what to do, and the efforts which they make, if ignorant, may be just as likely to do harm as good. Very clearly, there is the need of knowledge as well as emotion.
447. Emotion is the driving force in our natures. It is said in the old Indian books that the emotions are the horses, but the mind is the guide; the mind takes the reins; therefore we need to develop both. We must have our horses, because they are the means of progress, our storage of force; but we must also have reasonable guidance, or else they will run away with us.
All that is perpetually inculcated in all occult study, yet it cannot be said too often, because people forget. There are always those who develop one side only and are sadly lacking in the other, and that is one of the ways in which even an advanced person may come to grief.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 248 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. జడమహర్షి - 3 🌻*
12. మనలో ఎవరికైనా చావు గురించి జ్ఞాపకం ఉందా? ఎవరికీ లేదు. అందుకనే సుఖంగా ఉన్నాము. కానీ దాని లక్షణము ఇలా ఉంటుందని పెద్దలు చెప్పినప్పుడు, పునర్జన్మ తనకు వద్దు అనేటటువంటి తీవ్రమయిన సంకల్పం మినిషికి కలగాలి. అదే వివేకం.
13. అందుకనే జడమహర్షి చెపుతున్నాడు ఇదంతా. “మోక్షం కోసమయినా, మృత్యువాతను తప్పించుకోవటం కోసమయినా మనుష్యుడు పురంజన్మ లేకుండా చేసుకోవాలి. మృత్యువు యొక్క బాధ అంత భయంకరమైనది.
14. ముక్తి యందు ఆసక్తి అనేది ఉన్నాలేక పోయినా, అది వేరే విషయం. మృత్యువు యొక్క బాధ ఇలా ఉంటుందని పెద్దలు చెపుతున్నారు. ఏమయినప్పటికీ మరణించిన తరువాత యముడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన పుణ్యానికి పుణ్యఫలం, పాపానికి పాపఫలం ఇస్తాడు. అదెట్లాగూ తప్పదు.
15. కానీ, ఇది అయిపోయిన తరువాత జీవుడు మళ్ళీ ఇంకొక పురుషుడి వీర్యంలో ప్రవేశిస్తాడు. స్త్రీగర్భంలోకి వెళతాడు, మళ్ళీ పుడతాడు. అప్పటికే అంతా మరచిపోతాడు. యమదర్శనం, చావు, దుఃఖము, కష్టము, పోయిన జన్మలో తల్లి తండ్రులు, వళ్ళెవరు వీళ్ళెవరు – అన్నీపోతాయి. మరచిపోతాడు. అవి ఏవీ మిగలవు. పలక మీద వ్రాసి, తడితో చెరిపేస్తే ఏం మిగులుతుందో, ఇదీ అంతే! అతడి మనస్సులో ఏమీ ఉండదు.
16. “కాబట్టి ఇదంతా ఒక భయంకరమయిన మాయాజాలం. ఈ వలలో తగులుకున్న వాళ్ళు బయటికి రాలేరు. ఎప్పుడయితే గురువును ఆశ్రయించి బోధ పొందుతాడో, అప్పుడే ఇది తప్పుతుంది. గురువును ఆశ్రయిస్తే, మార్గాన్ని అన్వేషించమనేదే ఆయన చెప్పవలసింది. ఎందుకంటే హితబోధ ఎవ్వరయినా చేయగలరు.
17. హితైషి ఏం చెపుతాడంటే, నీ విషయం అన్వేషించుకో! నీ మంచి, నీ భవిష్యత్తు ఆలోచించుకో! సమయం ఆసన్నమవుతున్నది. దినదినము మృత్యువు దగ్గరికి వెళుతున్నావు. జాగ్రత్తపడు – చెప్పినవాడే నీకు ఆప్తుడనుకో.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM
www.facebook.com/groups/maharshiwisdom/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Seeds Of Consciousness - 315 🌹*
✍️ Nisargadatta Maharaj
Nisargadatta Gita
📚. Prasad Bharadwaj
*🌻 164. That 'Brahman' or 'I am' state alone embraces everything and is all the manifestation. You have to forget everything and merge with 'Brahman'. 🌻*
Whatever you see or feel has the 'I am' as its basis, the 'I am' and 'Brahman' are the same. All is the creation of the 'I am' or 'Brahman' state, this you can also say from your own experience.
Prior to the arrival of the 'I am', or in the deep sleep state, did you know of your existence or the world and the rest? It was only with the rising of the 'I am' that space, which engulfs everything, came.
As a part of the 'Sadhana' (practice) you have to forget everything - that is, all externalities and become one with the 'Brahman'.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #SeedsofConsciousness #Nisargadatta
Join and Share
🌹. Daily satsang Wisdom 🌹
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 190 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - నాల్గవ దివ్య యానము - సద్గురువు -అవతార పురుషుడు. - 4 🌻*
714 - 717. మిగిలిన 48 గురూ బ్రహ్మి భూతులు 7000 ల లో వారు కాదు .ఈ 48 గురు దూరంగా అజ్ఞాతముగా నుందురు. వీరి దివ్యత్వము పట్ల ప్రజలు ,ఆజ్ఞలై యుందురు. వీరందరూ తక్కిన 8 గురు వలె "అహం బ్రహ్మాస్మి" దివ్య స్థితిని అనుభవించు చందురు.
ఈ 48 గురూ సమయ నిరీక్షణ జాబితాలో నుందురు. ఉద్యోగము ను నిర్వహించు 8 గురిలో ఒకరు గాని ఇద్దరు గాని మరణించినచో ,వారి స్థానంలో వీరు ప్రవేశించుటకు సంసిద్ధులై యుందురు .
7000 మంది సభ్యులు గల మహీ పీఠంలో ఈ 8 గురును ఉన్నత పదవి యందుందురు . 8 గురి లో ఐదుగురు సద్గురువులు. ఈ పంచ సద్గురువులు యావత్తు మానవ జాతి యొక్క ఆధ్యాత్మిక విమోచనకై పాటుపడుచుందురు.
మిగిలిన ముగ్గురును బ్రహ్మీ భూతులు వీరు దేహదారులై ఉన్నప్పటికీ వారికి మానవుల పట్ల ఆధ్యాత్మిక కర్తవ్యం లేదు. అయినప్పటికీ వారిని దరి చేరిన వారికి వీరు ఆధ్యాత్మిక ప్రయోజనమును కలిగించు మూల స్థానమై యుందురు.
718. ప్రతి యుగమందును పదునొకండవ కాలము లో వచ్చు అవతారములో కలసి 700 మంది సంఖ్య.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
Join and share
Meher Baba అవతార్ మెహర్ బాబా
www.facebook.com/groups/avataarmeherbaba/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 45 / Sri Lalita Sahasranamavali - Meaning - 45 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 45. నిత్యముక్తా, నిర్వికారా, నిష్ప్రపంచా, నిరాశ్రయా ।*
*నిత్యశుద్ధా, నిత్యబుద్ధా, నిరవద్యా, నిరంతరా ॥ 45 ॥ 🍀*
🍀 144. నిత్యముక్తా -
ఎప్పుడును సంగము లేనిది.
🍀 145. నిర్వికారా -
ఏ విధమైన వికారములు లేనిది.
🍀146. నిష్ప్రపంచా -
ప్రపంచముతో ముడి లేనిది.
🍀 147. నిరాశ్రయా -
ఆశ్రయము లేనిది లేదా అవసరము లేనిది.
🍀 148. నిత్యశుద్ధా -
ఎల్లప్పుడు శుద్ధమైనది.
🍀 149. నిత్యబుద్ధా -
ఎల్లప్పుడు జ్ఞాన స్వరూపురాలు.
🍀 150. నిరవద్యా -
చెప్పరానిది అంటూ ఏమీ లేనిది లేదా నిందించుటకూ ఏదీ లేనిది.
🍀 151. నిరంతరా - ఏ మాత్రము సందు లేకుండా అంతటా వ్యాపించింది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 45 🌹
📚. Prasad Bharadwaj
*🌻 45. nityamuktā nirvikārā niṣprapañcā nirāśrayā |*
*nityaśuddhā nityabuddhā niravadyā nirantarā || 45 || 🌻*
🌻 144 ) Nithya muktha -
She who is forever free of the ties of the world
🌻 145 ) Nirvikara -
She never undergoes alteration
🌻 146 ) Nishprapancha -
She who is beyond this world
🌻 147 ) Nirasraya -
She who does not need support
🌻 148 ) Nithya shuddha -
She who is forever clean
🌻 149 ) Nithya bhuddha -
She who is for ever knowledge
🌻 150 ) Niravadhya -
She who can never be accused
🌻 151 ) Niranthara -
She who is forever continuous
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/SriMataChaitanyam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 45 / Sri Vishnu Sahasra Namavali - 45 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*
*సింహ రాశి- ఉత్తర నక్షత్ర 1వ పాద శ్లోకం*
*🍀. 45. ఋతుస్సుదర్శనః కాలః పరమేష్ఠి పరిగ్రహః।*
*ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః॥ 🍀*
🍀 416) ఋతు: -
కాలరూపమై తెలియబడు ఋతువులై భాసించువాడు.
🍀 417) సుదర్శన: -
భక్తులకు మనోహరమగు దర్శనము నొసంగువాడు.
🍀 418) కాల: -
శతృవులను మృత్యురూపమున త్రోయువాడు.
🍀 419) పరమేష్ఠీ -
హృదయగుహలో తన మహిమచే ప్రకాశించువాడు.
🍀 420) పరిగ్రహ: -
గ్రహించువాడు.
🍀 421) ఉగ్ర: -
ఉగ్రరూపధారి
🍀 422) సంవత్సర: -
సర్వజీవులకు వాసమైనవాడు.
🍀 423) దక్ష: -
సమస్త కర్మలను శీఘ్రముగా సమర్థతతో నిర్వర్తించువాడు.
🍀 424) విశ్రామ: -
జీవులకు పరమ విశ్రాంతి స్థానము అయినవాడు.
🍀 425) విశ్వదక్షిణ: - అశ్వమేధయాగములో విశ్వమునే దక్షిణగా ఇచ్చినవాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Vishnu Sahasra Namavali - 45 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*
*Sloka for Simha Rasi, Uttara 1st Padam*
*🌻 45. Rtuḥ sudarśanaḥ kālaḥ parameṣṭhī parigrahaḥ |*
*ugraḥ saṁvatsarō dakṣō viśrāmō viśvadakṣiṇaḥ || 45 || 🌻*
🌻 416. Ṛtuḥ:
One who is of the nature of Kala (time) which is indicated by the word Ritu or season.
🌻 417. Sudarśanaḥ:
One whose Darshana or vision that is knowledge, bestows the most auspicious fruit Moksha.
🌻 418. Kālaḥ:
One who measures and sets a limit to everything.
🌻 419. Parameṣṭhī: One who dwells in his supreme greatness in the sky of the heart.
🌻 420. Parigrahaḥ:
One who, being everywhere, is grasped on all sides by those who seek refuge in Him. Or one who grasps or receives the offerings made by devotees.
🌻 421. Ugraḥ:
One who is the cause of fear even to beings like Sun.
🌻 422. Saṁvatsaraḥ:
One in whom all beings reside.
🌻 423. Dakṣaḥ:
One who augments in the form of the world.
🌻 424. Viśrāmaḥ:
One who bestows Vishrama or liberation to aspirants who seek relief from the ocean of Samsara with its waves of various tribulations in the from of Hunger, Thirst etc., and difficulties like Avidya, pride, infatuation etc.
🌻 425. Viśvadakṣiṇaḥ:
One who is more skilled (Daksha) than every one. Or One who is proficient in everything.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
https://t.me/vishnusahasra
www.facebook.com/groups/vishnusahasranam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్గీత యథాతథం - 1 - 019 🌹*
AUDIO - VIDEO
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻. విషాదయోగం - అధ్యాయము 1 - శ్లోకము 19 🌻*
19
స ఘోషో ధార్తరాష్ట్రాణాం
హృదయాని వ్యదారయత్ |
నభశ్చ పృథివీం చైవ
తుములో వ్యనునాదయన్ ||
తాత్పర్యము :
ఆ వివిధ శంఖముల ధ్వని అతిభీకరమయ్యెను. భీమ్యాకాశములు రెండింటిని కంపించుచు అది ధృతరాష్ట్ర తనయుల హృదయాలను బ్రద్ధలు చేసెను.
భాష్యము :
ఈ శ్లోకములో పాండవుల పక్షము వారి శం ఖానాదముల శబ్ధము ధృతరాష్ట్ర తనయుల హృదయము లందు భయమును కలుగజేసినవని తెలియజేయ బడినది. కానీ భీష్‌ముడు, ఇతర కౌరవులు శంఖువులను పూరించినపుడు పాండవుల వైపున అటువంటి సూచనలేమీ కనబడలేదు. దీనికి కారణం శ్రీ కృష్ణుని మీద పాండవులకు ఉన్న విశ్వాసమేనని అర్థమగుచున్నది. కాబట్టి భగవంతుడిని శరణుజొచ్చిన వ్యక్తి గొప్ప విపత్తులకు సైతము భయపడవలసిన అవసరం లేదు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ….
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita #గీతాసారం #GitaSaram
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, WA, FB Groups 🌹
https://t.me/BhagavadGita_Telugu_English
https://chat.whatsapp.com/BzCAiTrm6X9K1NsjyGWzlg
www.facebook.com/groups/bhagavadgeetha/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. దత్తాత్రేయ మంత్రాత్మక శ్లోకములు :- 🌹*
సర్వబాధా నివారణకు :-
సమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయఛ్ఛ మే ||
#సర్వరోగ నివారణకు :-
సమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో సర్వరోగ ప్రశమనం కురు శాంతిం ప్రయఛ్ఛ మే ||
#సర్వకష్ట నివారణకు :-
అనసూయాత్రిసంభూతో దత్తాత్రేయో దిగంబరః స్మర్తృగామీ స్వభక్తానాం ఉద్దర్తా భవసంకటాత్ ||
#దారిద్ర్య నివారణ కోసం :-
దరిద్రవిప్రగేహే యః శాకం భుక్త్వోత్తమశ్రియం దదౌ శ్రీదత్తదేవ సదా దారిద్ర్యాత్ శ్రీప్రదోఽవతు ||
#సంతానము కోసం :-
దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వా మృతం సుతం యో భూదభీష్టదః పాతు సఽనః సంతానవృద్దికృత్ ||
#సౌభాగ్యము కోసం :-
|| జీవయామాస భర్తారం మృతం సత్యాహి మృత్యుహ మృత్యుంజయః స యోగీంద్రః సౌభాగ్యం మే ప్రయఛ్ఛతు ||
#ఋణ విముక్తి కోసం :-
|| అత్రేరాత్మ ప్రదానేన యో ముక్తో భగవాన్ ఋణాత్ దత్తాత్రేయం తమీశానం నమామి ఋణముక్తయే ||
#సర్వపాప నివారణకు :-
|| అత్రిపుత్రో మహాతేజా దత్తాత్రేయో మహమునిః తస్యస్మరణమాత్రేన సర్వపాపైః ప్రయచ్యతే ||
#దత్తాత్రేయ అనుగ్రహం కోసం :-
|| అనసూయాసుత శ్రీశ జనపాతకనాశన దిగంబర నమో నిత్యం తుభ్యం మే వరదో భవ ||
#విద్య కోసం :-
|| విద్యత్సుత మవిద్యం య ఆగతం లోకనిందితం భిన్నజిహ్వం బుధం చక్రే శ్రీదత్తః శరణం మమ ||
#పోయిన సొమ్ము తిరిగి దొరకడం కోసం :-
|| కార్తవీర్యార్జునో నామ రాజా బాహుసహస్రవాన్ తస్యస్మరణమాత్రేణ హృతం నష్టంచ లభ్యతే ||
ప్రతీ రోజూ వేయి జపం చేయాలి, 40 రోజుల పాటు చేయాలి. అన్ని కోరికలు తీరుతాయి.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment