20-JANUARY-2022 గురువారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 20, గురువారం, జనవరి 2022 బృహస్పతి వాసరే 🌹 
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 309 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 507🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -137🌹  
5) 🌹 Osho Daily Meditations - 126🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 341-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 341-2 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ గురువారం మిత్రులందరికీ 🌹*
*బృహస్పతి వాసరే, 20, జనవరి 2022*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ రాధాకృష్ణాష్టకం - 6 🍀*

*6. యస్య శ్రీనందసూనోః వ్రజయువతి జనాశ్చాగతా భర్తృపుత్రాం-*
*స్త్యక్త్వా శ్రుత్వా సమీపే విచకిత నయనాః సప్రమోదాః స్వగేహే |*
*రంతుం రాసాదిలీలా మనసిజ దలితా వేణునాదం చ రమ్యం*
*కృష్ణో రాధాసమేతో విలసతు హృదయే సోఽస్మదీయే సదైవ*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
ఉత్తరాయణం, హేమంత ఋతువు, పౌష్య మాసం
తిథి: కృష్ణ విదియ 08:06:52 వరకు తదుపరి కృష్ణ తదియ
నక్షత్రం: ఆశ్లేష 08:25:37 వరకు తదుపరి మఘ
యోగం: ఆయుష్మాన్ 15:45:44 వరకు తదుపరి సౌభాగ్య
కరణం: గార 08:04:52 వరకు 
సూర్యోదయం: 06:49:30
సూర్యాస్తమయం: 18:04:33
వైదిక సూర్యోదయం: 06:53:18
వైదిక సూర్యాస్తమయం: 18:00:46
చంద్రోదయం: 20:13:04
చంద్రాస్తమయం: 08:34:33
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
వర్జ్యం: 21:04:00 - 22:45:12
దుర్ముహూర్తం: 10:34:31 - 11:19:32 
మరియు 15:04:33 - 15:49:33
రాహు కాలం: 13:51:25 - 15:15:48
గుళిక కాలం: 09:38:16 - 11:02:39
యమ గండం: 06:49:30 - 08:13:53
అభిజిత్ ముహూర్తం: 12:05 - 12:49
అమృత కాలం: 06:42:16 - 08:25:00
అమృత యోగం - కార్య సిధ్ది 08:25:37
వరకు తదుపరి ముసల యోగం - దుఃఖం 
పండుగలు : లేదు
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -309 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 21 -2 📚*
 
*🍀 21-2. జనన మరణ చక్రము - భోగమార్గమున పుణ్యము త్వరితగతిని క్షీణించును. భూలోకమున 30 దినముల పుణ్యము పితృలోకమున ఒక రోజు భోగముతో సమానము. అట్లే భూలోకమున ఒక సంవత్సర మంతయు చేసిన పుణ్యము దేవలోకమున ఒక రోజు భోగముతో సమానము. కనుక ఎంత పుణ్యమార్జించినను, దాని ఫలము ఊర్ధ్వ లోకము లందు శీఘ్రముగ హరింప బడి, మరల జీవులు మరణముతో కూడినటు వంటి భూలోకమున చేరుదురు. ఇది ఎంత అవివేకమగు కార్యక్రమము. 🍀*

*21. తే తం భుక్యా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి |*
*ఏవం త్రయీధర్మ మమప్రపన్నా గతాగతం కామకామా లభంతే ||*

*తాత్పర్యము : దివ్యలోకములందు విస్తృతముగ దివ్య భోగానుభవము అనుభవింపగనే, చేసిన పుణ్యము క్షీణించుట వలన మరల జీవులు మర్త్యలోకములందు ప్రవేశించుచున్నారు. అర్థకామములను ధర్మము నాశ్రయంచి పొందుచున్నవారు ఇట్లు స్వర్గలోకమునకు, మర్త్యలోకమునకు నడుమ రాకపోకలను పొందుచు నున్నారు.*

*వివరణము : భోగాసక్తి గలవానికి ఎంత ఆర్జనమైనను చాలదు. భోగమార్గమున పుణ్యము త్వరితగతిని క్షీణించును. స్వదేశమున పది సంవత్సరములు సంపాదించినది. విదేశములలో ఒక సంవత్సరములో ఖర్చు కాగలదు. అట్లే మరణము గల భూలోకమున సంపాదించిన పుణ్యము పితృలోకము నందు, దేవలోకమునందు త్వరితగతిని హరింప బడును. భూలోకమున 30 దినముల పుణ్యము పితృలోకమున ఒక రోజు భోగముతో సమానము. అట్లే భూలోకమున ఒక సంవత్సర మంతయు చేసిన పుణ్యము దేవలోకమున ఒక రోజు భోగముతో సమానము.*

*వంద సంవత్సరములు అనుస్యూతముగ పుణ్య మొనర్చిన మానవుడు వందరోజులు మాత్రమే ఇంద్రలోక భోగము లనుభవించి మరల భూమిని చేరును. అధోలోకము నందలి పుణ్యము ఊర్ధ్వలోకముల భోగము ఇట్టి నిష్పత్తిలో నుండును. కనుక ఎంత పుణ్యమార్జించినను, దాని ఫలము ఊర్ధ్వ లోకము లందు శీఘ్రముగ హరింపబడి, మరల జీవులు మరణముతో కూడినటువంటి భూలోకమున చేరుదురు. ఇది ఎంత అవివేకమగు కార్యక్రమము.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 507 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 42

*🌻. పెళ్లి వారికి ఎదురేగుట - 2 🌻*

ఆభరణములుగా మారి పోయిన పాములతో నిండిన దేహము గలవాడు, అద్భుతమగు అవయవ కాంతులు గలవాడు, దివ్యమగు కాంతి గలవాడు, లోకపాలకులచే వింజామరలను చేతబట్టి సేవింపబడువాడు (11), ఎడమవైపున అచ్యుతుడు గలవాడు, కుడివైపున బ్రహ్మ గలవాడు, వెనుక ఇంద్రుడు గలవాడు, ప్రక్కన వెనుక దేవతలు మొదలగు వారితో కూడి యుండువాడు అగు శివ ప్రభుని చూచిరి (12).

దేవతలు మొదలగు వారందరిచే స్తుతింపబడువాడు, లోకములకు మంగళముల నిచ్చువాడు, స్వేచ్ఛచే స్వీకరింపబడిన దేహము గలవాడు, పరబ్రహ్మ స్వరూపుడు, సర్వేశ్వరుడు, వరములనిచ్చువాడు (13), సగుణుడు, మరియు నిర్గుణుడు, భక్తుల ఆధీనములో నుండువాడు, దయను చూపువాడు, ప్రకృతి పురుషులిద్దరికీ అతీతుడు, సచ్చిదానందఘనుడు అగు శివుని చూచిరి (14). 

హిమవంతుడు ఆ ప్రభువు యొక్క కుడివైపున గరుడుని అధిష్ఠించిన వాడు, అనేక భూషణములచే అలంకరించుకున్నవాడు, పాపములను హరించువాడు అగు అచ్యుతుని చూచెను (15). ఓ మునీ! ఆ ప్రభుని ఎడమవైపున నాల్గు మోములు గలవాడు, తన పరివారముతో గూడి అధికముగా శోభిల్లువాడునగు నన్ను చూచెను (16).

శివునకు సదా మిక్కిలి ప్రియులైన ఈ దేవతోత్తములనిద్దరినీ చూచి హిమవంతుడు పరివారముతో గూడి సాదరముగా వారికి ప్రణమిల్లెను (17). పర్వత రాజగు హిమవంతుడు శివునకు ఇరువైపుల, ప్రక్కల యందు విరాజలిల్లుతున్న దేవతలు మొదలగు వారిని చూచి ప్రణమిల్లెను (18). హిమవంతుడు శివుని ఆజ్ఞచే ముందు నడుస్తూ తన నగరమునకు దారితీసెను. విష్ణవు, బ్రహ్మ వెంటనే మునులతో దేవతలతో గూడి వెనుక నడిచిరి (19). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 137 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. సదవగాహన - 1 🌻*

*ఆధునిక మానవుడు ఎంతో అభివృద్ధిని విజ్ఞాన శాస్త్రపరము గాను, నాగరికత పరము గాను సాధించు చున్నాడు. ప్రాచీనులకన్న మిక్కిలి తెలివిగల వాడనని కూడ విర్రవీగుచున్నాడు. ధనము, అధికారము, విజ్ఞానము, ప్రసిద్ధి ఇట్టి విషయములు సాధించుటలో శ్రమించుచు, ఈ శ్రమకు ప్రయోజనమయిన ఆనందమును మాత్రము పొందలేకున్నాడు.*

*తన స్వరూపమయిన ఆనందమునందు నిలుచుటకు అవరోధములుగా మానవ మనస్సునందు, వికారములు రేకెత్తి, అతని బ్రతుకు అను నావను తుఫానుతోడి సముద్రపు కెరటముల వలె ఊపుచున్నవి.*

*నిజమునకు సమస్యలు తనకు వెలుపల లేవు‌ తనలోనే నెలకొనియున్నవి. ఉదాహరణకు, ఒరుల యందు జుగుప్స. ఇతరుల లోపముల యందే చూపు నిలిపి, వారి సద్గుణములను మరచుట వలన ఇట్టి జుగుప్స పెరుగును.*

....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻 
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 126 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 126. EGO 🍀*

*🕉 Do you worry that if you accept yourself, you will become egoistic? Forget about the ego! 🕉*
 
*Accept yourself. We will see about the ego later; first accept yourself totally. Let the ego come; the ego is not such a big problem, and the bigger it is, the easier it is burst. It is like a balloon-it becomes big, then with just a prick it is gone! Let the ego be there, that is allowed, but accept yourself, and things will start changing. In fact total acceptance means acceptance of the ego too. Start by accepting. The world needs a few great egoists too. We need all kinds of People.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 341-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 341 -2🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 76. క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ ।*
*క్షయవృద్ధి వినిర్ముక్తా, క్షేత్రపాల సమర్చితా ॥ 76 ॥ 🍀*

*🌻 341-2. 'క్షేత్రస్వరూప'🌻* 

*కురుక్షేత్ర మందు జీవులు వారి వారి ధర్మము ననుసరించి ప్రవర్తింతురు. అందువలన ఆ క్షేత్రము ధర్మక్షేత్రము కూడ. పై తెలిపిన క్షేత్రమున జీవులు స్థూల సూక్ష్మరూపులై వారి ఇచ్ఛ ననుసరించి జీవించుచూ, అనుభవమూ అనుభూతి గణించుచూ పరిణతి చెందుచు నుందురు. ఇందు క్షేత్ర మనగా లోకముల యందు వెలిగింపబడిన చోటు, జీవుల కేర్పరచిన దేహములు. ఈ క్షేత్రము లన్నియూ శ్రీమాతయే. దేహములను, రూపములను, ప్రకృతిని ఆధారముగ జేసుకొని జీవుడు అనేకానేక అనుభూతులను పొందుచున్నాడు.*

*జీవులు పూర్ణత్వము చెందుటకు ఇట్లు క్షేత్రములు సాధనములై నిలచినవి. కావున దేహాదికములను, ప్రకృతిని నిరసించుట, అశ్రద్ధ చేయుట, తుచ్ఛములని భావించుట మెట్టవేదాంతమే అగును గాని సరియగు అవగాహన మాత్రము కాదు. క్షేత్రరూపమున శ్రీమాత యుండగ ఆమెను మన్నించి గౌరవించి తగుమాత్రముగ పోషించుచూ జీవుడు సాగవలెను. అట్లు కానిచో దేహములు, ప్రదేశములు బంధించి జీవుని దురవస్థ పాలు చేయును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 341-2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 76. Kshetra-svarupa kshetreshi kshetra kshetragynapalini*
*Kshaya-vrudhi vinirmukta kshetrapala smarchita ॥ 76 ॥ 🌻*

*🌻 341-2. Kṣetra-svarūpā क्षेत्र-स्वरूपा (341) 🌻*

*Since the next few nāma-s deal with Her Kṣetra form, understanding Kṣetra becomes important. Kṣetra is the physical body and kṣetrajña is the soul. Kṣetra is made up of thirty six tattva-s (some take only twentyfour) or principles. There is an exclusive chapter (XIII) in Bhagavad Gīta on this subject.*

*Kṛṣṇa opens this chapter by saying that “the body is called kṣetra (where karma-s are created and its effect executed) and which cognizes this is called kṣetrajña”. Liṇga Purāna also says ‘the Goddess (Śaktī), the beloved of the slayer of the three cities (Śiva) is Kṣetra while the Lord (Śiva) is Kṣetrajña’. Kṣetra is gross and kṣetrajña is subtle. Kṣetra is perishable, whereas the knower of Kṣetra, kṣetrajña is eternal and imperishable.*

*Kṛṣṇa concludes chapter XIII by saying, “Those who know the difference between kṣetra and kṣetrajña and the phenomenon of liberation from Prakṛti with her evolutes, reach the supreme eternal spirit.”*

*She is said to be in the form of such kṣetra. This nāma means that She is the embodiment of all gross forms of this universe.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

మైత్రేయ మహర్షి బోధనలు - 60

🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 60 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 47. వస్తు సంపద -1 🌻

వస్తు సంపదను పోగుచేసు కొనుటలో గల అపాయమును ఏ విద్యాలయముల యందును బోధించుట లేదు. అందరును నీతులు బోధింతురు కాని, వస్తువులను పోగు వేసుకొను అభ్యాసము ఎంత దురవస్థను కలిగించునో తెలుపరు. అస్తేయము (ఒకరి సంపదల నాశింపకుండుట), అపరిగ్రహము అను విలువైన విషయములు చిన్నతనముననే బోధింపవలెను. “తాతకు కుర్చీ యున్నది, నాకేది?" అను భావము ఏర్పడిన మనుమడు సన్మార్గమున పయనించుట లేదని తెలియవలెను.

వస్తువులను కోరు తెలివి క్రమశః వికసింపక కుంచించుకొనిపోవును. హక్కులను కోరు పసివారు బాధ్యతల యందు అప్రమత్తులై యుండలేరు. ఈ కాలమున వస్తు ఉత్పత్తి విపరీతముగ నున్నది. వస్తువులను విపరీతముగ జన సామాన్యులకు అంటగట్టుచున్నారు. పనికిరాని వస్తువులన్నియు కూడ పనికివచ్చు వస్తువులని నమ్మించి, ఆకర్షించి, కామోద్రిక్తులను చేయుచున్నారు. వ్యాపారము శ్రేయోదాయకము కాక ప్రజా పీడితముగ మార్పు చెందినది. ఇది కలి ప్రభావము.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

19 Jan 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 125 -1

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 125 -1 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. జీవితం సమగ్రం. మన సున్నితత్వం శూన్యం. మరింత సజీవంగా, మరింతగా మనసు విప్పి స్వీకరించే గుణంతో వుండాలి. అప్పుడు వ్యక్తి తన చుట్టూ వున్న జీవితాన్ని గ్రహిస్తాడు. మనం జీవితాన్ని సమీపిస్తే అదే దైవత్వం. 🍀

జీవితం అపూర్వ సౌందర్యభరితమైంది. కానీ మనం ఆ సంగతి గుర్తించం. ఆ సంగతి గురించి మనకు తెలీదు. కళ్ళు మూసుకుని వుంటాం. అదెంతో ఔన్నత్యం నిండింది. కానీ ఆ సంగతి గ్రహించే సున్నితత్వం మనకుండదు. జీవితం సమగ్రం. మన సున్నితత్వం శూన్యం. అందువల్ల సున్నితత్వాన్ని సృష్టించడమెలా? అన్నది సమస్య.

మరింత సజీవంగా, మరింతగా మనసు విప్పి స్వీకరించే గుణంతో వుండాలి. అప్పుడు వ్యక్తి తన చుట్టూ వున్న జీవితాన్ని గ్రహిస్తాడు. మనం జీవితాన్ని సమీపిస్తే అదే దైవత్వం. వేరే దేవుడంటూ లేడు. జీవితానికి జననమంటూ లేదు. మరణమంటూ లేదు. అది శాశ్వతమైంది. మనం ఆ శాశ్వతత్వంలో భాగాలం. మనం మన చుట్టూ దుమ్ము పేర్చుకున్నాం. అద్దలాంటి మన అస్తిత్వం పై దుమ్ము పేరుకుపోయింది. అందువల్ల అదేమీ ప్రతిఫలించదు.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

19 Jan 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 543 / Vishnu Sahasranama Contemplation - 543

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 543 / Vishnu Sahasranama Contemplation - 543 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 543. గభీరః, गभीरः, Gabhīraḥ 🌻

ఓం గభీరాయ నమః | ॐ गभीराय नमः | OM Gabhīrāya namaḥ

గభీరః, गभीरः, Gabhīraḥ

జ్ఞానైశ్వర్యాదిభిర్విష్ణోర్గమ్భీరత్వాత్ గభీరతః

జ్ఞానము, ఐశ్వర్యము, బలము, వీర్యము మొదలగు ఉత్తమ లక్షణములచే గంభీరుడు.

:: పోతన భాగవతము - చతుర్థ స్కంధము ::

చ. చతురత నట్టి యీశ్వరుఁడు సజ్జనలోక నిరస్త సర్వ కా
మిత విమలాంతరంగమున మిశ్రిత భావనఁ జేసి సన్నిధా
పితుఁ డగుచున్ దయాకర గభీర గుణంబులఁ జాల నొప్పి యా
శ్రిత జన పారతంత్ర్యమును జేకొని పాయక యుండు నిచ్చలున్‍. (960)

భగవంతుడు ఆశ్రితజన వత్సలుడు. కాబట్టి పరిశుద్ధమైన సజ్జనుల మనస్సులో చేరి విడవకుండా నిత్యమూ అక్కడే ఉంటాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 543🌹

📚. Prasad Bharadwaj

🌻 543. Gabhīraḥ 🌻

OM Gabhīrāya namaḥ

ज्ञानैश्वर्यादिभिर्विष्णोर्गम्भीरत्वात् गभीरतः /

Jñānaiśvaryādibhirviṣṇorgambhīratvāt gabhīrataḥ

The unfathomable or Supreme in wisdom, wealth, strength, valor etc., and hence He is Gabhīraḥ.

:: श्रीमद्भागवते एकादशस्कन्धे षष्ठोऽद्यायः ::

अस्यासि हेतुरुदयस्थितिसंयमानाम्
आव्यक्तजीवमहतामपि कालमाहुः ।
सोऽयं त्रिणाभिरखिलापचये प्रवृत्तः
कालो गभीररय उत्तमपूरुषस्त्वम् ॥ १५ ॥

Śrīmad Bhāgavata - Canto 11, Chapter 6

Asyāsi heturudayasthitisaṃyamānām
Āvyaktajīvamahatāmapi kālamāhuḥ,
So’yaṃ triṇābhirakhilāpacaye pravr‌ttaḥ
Kālo gabhīraraya uttamapūruṣastvam. 15.

You are the cause of the creation, maintenance and destruction of this universe. As time, You regulate the subtle and manifest states of material nature and control every living being. As the threefold wheel of time You diminish all things by Your imperceptible actions, and thus You are the Supreme Lord.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

महावराहो गोविन्दस्सुषेणः कनकाङ्गदी ।
गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः ॥ ५८ ॥

మహావరాహో గోవిన్దస్సుషేణః కనకాఙ్గదీ ।
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః ॥ 58 ॥

Mahāvarāho govindassuṣeṇaḥ kanakāṅgadī,
Guhyo gabhīro gahano guptaścakragadādharaḥ ॥ 58 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

19 Jan 2022

19-JANUARY-2022 బుధవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 19, జనవరి 2022 బుధవారం, సౌమ్య వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 146 / Bhagavad-Gita - 146 - 3-27 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 543 / Vishnu Sahasranama Contemplation - 543 🌹
4) 🌹 DAILY WISDOM - 220య1🌹 
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 126🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 60 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ బుధవారం మిత్రులందరికీ 🌹*
*సౌమ్య వాసరే, 19, జనవరి 2022*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ హేరంబగణపతి ధ్యానం 🍀*

*11. అభయవరదహస్తః పాశదంతాక్షమాలా*
*సృణిపరశుదధానో ముద్గరం మోదకం చ |*
*ఫలమధిగతసింహః పంచమాతంగవక్త్రో*
*గణపతి రతిగౌరః పాతు హేరంబనామా*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం,  
హేమంత ఋతువు, పౌష్య మాసం
తిథి: కృష్ణ పాడ్యమి 06:55:09 వరకు
తదుపరి కృష్ణ విదియ
నక్షత్రం: ఆశ్లేష 32:25:58 వరకు
తదుపరి మఘ
యోగం: ప్రీతి 16:06:52 వరకు
తదుపరి ఆయుష్మాన్
కరణం: కౌలవ 06:54:09 వరకు
వర్జ్యం: 20:25:24 - 22:08:12
దుర్ముహూర్తం: 12:04:15 - 12:49:12
రాహు కాలం: 12:26:44 - 13:51:02
గుళిక కాలం: 11:02:25 - 12:26:44
యమ గండం: 08:13:48 - 09:38:07
అభిజిత్ ముహూర్తం: 12:04 - 12:48
అమృత కాలం: 30:42:12 - 32:25:00
సూర్యోదయం: 06:49:30
సూర్యాస్తమయం: 18:03:58
వైదిక సూర్యోదయం: 06:53:18
వైదిక సూర్యాస్తమయం: 18:00:09
చంద్రోదయం: 19:19:39
చంద్రాస్తమయం: 07:52:02
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
రాక్షస యోగం - మిత్ర కలహం 32:25:58
వరకు తదుపరి చర యోగం - దుర్వార్త శ్రవణం
పండుగలు : లేవు
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత -146 / Bhagavad-Gita - 146 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 27 🌴*

*27. ప్రకృతే: క్రియమాణాని గుణై: కర్మాణి సర్వశ: |*
*అహంకారవిమూఢాత్మా కర్తాహమితి మన్యతే ||*

🌷. తాత్పర్యం :
*మిథ్యాహంకారముచే మోహపరవశుడగు జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తనను కర్తగా భావించును.*

🌷. భాష్యము :
కృష్ణభక్తిభావనాయుతుడు, భౌతికభావన యందున్నవాడు అను ఇరువురు వ్యక్తులు ఒకే స్థాయిలో కర్మనొనరించుచు ఒకే పదము నందున్నట్లుగా గోచరింతురు. కాని వాస్తవమునకు వారి స్థితుల నడుమ విశేష వ్యత్యాసమున్నది. భౌతికభావన యందున్నవాడు మిథ్యాహంకారము చేత తననే ప్రతిదానికి కర్తగా భావించును. దేహము ప్రకృతిచే సృష్టించ బడినదనియు మరియు అట్టి ప్రకృతి భగవానుని నిర్దేశము నందు వర్తించుననియు అతడు ఎరుగడు. అనగా అట్టి లౌకికుడు తాను అంత్యమున శ్రీకృష్ణభగవానుని అదుపులోనే ఉన్నాననెడి జ్ఞానమును కలిగియుండడు. మిథ్యాహంకారపూరితుడగు తాను స్వతంత్రముగా వర్తించుచున్నానని భావించును. అది అతని అజ్ఞానమునకు చిహ్నము. 

అట్టివాడు స్థూల, సూక్ష్మదేహములు రెండును భగవానుని ఆదేశానుసారము ప్రకృతిచే సృష్టింపబడినవనియు మరియు తన మానసికకర్మలు, దేహపరకర్మలన్నియును భక్తిభావనలో శ్రీకృష్ణభగవానుని సేవ యందు నియుక్తము కావలెననియు ఎరుగడు. అజ్ఞానియైనవాడు బహుకాలము తన ఇంద్రియములను ఇంద్రియభోగములందు దురుపయోగము కావించినందున శ్రీకృష్ణభగవానుడు హృషీకేశుడని (దేహేంద్రియములకు ప్రభువు) తెలిసికొనలేడు. అట్టివాడు శ్రీకృష్ణభగవానునితో గల నిత్య సంబంధమును మరపింపచేయు మిథ్యాహంకారముచే నిక్కముగా మోహపరవశుడైనట్టి వాడే.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 146 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 3 - Karma Yoga - 27 🌴*

*27. prakṛteḥ kriyamāṇāni guṇaiḥ karmāṇi sarvaśaḥ*
*ahaṅkāra-vimūḍhātmā kartāham iti manyate*

🌷Translation :
*The spirit soul bewildered by the influence of false ego thinks himself the doer of activities that are in actuality carried out by the three modes of material nature.*

🌷 Purport :
Two persons, one in Kṛiṣhṇa consciousness and the other in material consciousness, working on the same level, may appear to be working on the same platform, but there is a wide gulf of difference in their respective positions. The person in material consciousness is convinced by false ego that he is the doer of everything. He does not know that the mechanism of the body is produced by material nature, which works under the supervision of the Supreme Lord. 

The materialistic person has no knowledge that ultimately he is under the control of Kṛiṣhṇa. The person in false ego takes all credit for doing everything independently, and that is the symptom of his nescience. He does not know that this gross and subtle body is the creation of material nature, under the order of the Supreme Personality of Godhead, and as such his bodily and mental activities should be engaged in the service of Kṛṣṇa, in Kṛiṣṇa consciousness. 

The ignorant man forgets that the Supreme Personality of Godhead is known as Hṛṣīkeśa, or the master of the senses of the material body, for due to his long misuse of the senses in sense gratification, he is factually bewildered by the false ego, which makes him forget his eternal relationship with Kṛiṣhṇa.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 543 / Vishnu Sahasranama Contemplation - 543 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 543. గభీరః, गभीरः, Gabhīraḥ 🌻*

*ఓం గభీరాయ నమః | ॐ गभीराय नमः | OM Gabhīrāya namaḥ*

*గభీరః, गभीरः, Gabhīraḥ*

*జ్ఞానైశ్వర్యాదిభిర్విష్ణోర్గమ్భీరత్వాత్ గభీరతః*

*జ్ఞానము, ఐశ్వర్యము, బలము, వీర్యము మొదలగు ఉత్తమ లక్షణములచే గంభీరుడు.*

:: పోతన భాగవతము - చతుర్థ స్కంధము ::
చ. చతురత నట్టి యీశ్వరుఁడు సజ్జనలోక నిరస్త సర్వ కా
     మిత విమలాంతరంగమున మిశ్రిత భావనఁ జేసి సన్నిధా
     పితుఁ డగుచున్ దయాకర గభీర గుణంబులఁ జాల నొప్పి యా
     శ్రిత జన పారతంత్ర్యమును జేకొని పాయక యుండు నిచ్చలున్‍. (960)

భగవంతుడు ఆశ్రితజన వత్సలుడు. కాబట్టి పరిశుద్ధమైన సజ్జనుల మనస్సులో చేరి విడవకుండా నిత్యమూ అక్కడే ఉంటాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 543🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻 543. Gabhīraḥ 🌻*

*OM Gabhīrāya namaḥ*

ज्ञानैश्वर्यादिभिर्विष्णोर्गम्भीरत्वात् गभीरतः /
*Jñānaiśvaryādibhirviṣṇorgambhīratvāt gabhīrataḥ*

*The unfathomable or Supreme in wisdom, wealth, strength, valor etc., and hence He is Gabhīraḥ.*

:: श्रीमद्भागवते एकादशस्कन्धे षष्ठोऽद्यायः ::
अस्यासि हेतुरुदयस्थितिसंयमानाम्
     आव्यक्तजीवमहतामपि कालमाहुः ।
सोऽयं त्रिणाभिरखिलापचये प्रवृत्तः
     कालो गभीररय उत्तमपूरुषस्त्वम् ॥ १५ ॥

Śrīmad Bhāgavata - Canto 11, Chapter 6
Asyāsi heturudayasthitisaṃyamānām
     Āvyaktajīvamahatāmapi kālamāhuḥ,
So’yaṃ triṇābhirakhilāpacaye pravr‌ttaḥ
     Kālo gabhīraraya uttamapūruṣastvam. 15.

You are the cause of the creation, maintenance and destruction of this universe. As time, You regulate the subtle and manifest states of material nature and control every living being. As the threefold wheel of time You diminish all things by Your imperceptible actions, and thus You are the Supreme Lord.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
महावराहो गोविन्दस्सुषेणः कनकाङ्गदी ।
गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः ॥ ५८ ॥

మహావరాహో గోవిన్దస్సుషేణః కనకాఙ్గదీ ।
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః ॥ 58 ॥

Mahāvarāho govindassuṣeṇaḥ kanakāṅgadī,
Guhyo gabhīro gahano guptaścakragadādharaḥ ॥ 58 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 221 🌹*
*🍀 📖 from Lessons on the Upanishads 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 8. We can Never be Happy if There is Another Person Near Us 🌻*

*The Brihadaranyaka Upanishad tells us in one little passage: dvitiyad vai bhayam bhavati (Brih. Up. 1.4.2). We can never be happy if there is another person near us. Always we have to adjust ourselves with that person and we do not know what to expect from that person. We cannot keep even a mouse in front of us; we will be very disturbed because the mouse is sitting in front. The mouse cannot do any harm to us, but we do not like the presence of even a little ant.*

*“Oh, another thing has come.” This “another thing” is what is troubling us. The difficulty arising out of the cognition of another is because of the fact that the basic Reality, that unchanging Eternity, has no “another” outside It. Because of the absence of another in the basic reality of our own Self—the Truth of this cosmos—we feel a discomfiture at the perception of anything outside, human or otherwise. Whatever it is, we would like to be alone. Finally, we would like to be alone because that Aloneness, which is spaceless and timeless, is telling us: “You are really alone.”*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 125 -1 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. జీవితం సమగ్రం. మన సున్నితత్వం శూన్యం. మరింత సజీవంగా, మరింతగా మనసు విప్పి స్వీకరించే గుణంతో వుండాలి. అప్పుడు వ్యక్తి తన చుట్టూ వున్న జీవితాన్ని గ్రహిస్తాడు. మనం జీవితాన్ని సమీపిస్తే అదే దైవత్వం. 🍀*

*జీవితం అపూర్వ సౌందర్యభరితమైంది. కానీ మనం ఆ సంగతి గుర్తించం. ఆ సంగతి గురించి మనకు తెలీదు. కళ్ళు మూసుకుని వుంటాం. అదెంతో ఔన్నత్యం నిండింది. కానీ ఆ సంగతి గ్రహించే సున్నితత్వం మనకుండదు. జీవితం సమగ్రం. మన సున్నితత్వం శూన్యం. అందువల్ల సున్నితత్వాన్ని సృష్టించడమెలా? అన్నది సమస్య.*

*మరింత సజీవంగా, మరింతగా మనసు విప్పి స్వీకరించే గుణంతో వుండాలి. అప్పుడు వ్యక్తి తన చుట్టూ వున్న జీవితాన్ని గ్రహిస్తాడు. మనం జీవితాన్ని సమీపిస్తే అదే దైవత్వం. వేరే దేవుడంటూ లేడు. జీవితానికి జననమంటూ లేదు. మరణమంటూ లేదు. అది శాశ్వతమైంది. మనం ఆ శాశ్వతత్వంలో భాగాలం. మనం మన చుట్టూ దుమ్ము పేర్చుకున్నాం. అద్దలాంటి మన అస్తిత్వం పై దుమ్ము పేరుకుపోయింది. అందువల్ల అదేమీ ప్రతిఫలించదు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 60 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 47. వస్తు సంపద -1 🌻*

*వస్తు సంపదను పోగుచేసు కొనుటలో గల అపాయమును ఏ విద్యాలయముల యందును బోధించుట లేదు. అందరును నీతులు బోధింతురు కాని, వస్తువులను పోగు వేసుకొను అభ్యాసము ఎంత దురవస్థను కలిగించునో తెలుపరు. అస్తేయము (ఒకరి సంపదల నాశింపకుండుట), అపరిగ్రహము అను విలువైన విషయములు చిన్నతనముననే బోధింపవలెను. “తాతకు కుర్చీ యున్నది, నాకేది?" అను భావము ఏర్పడిన మనుమడు సన్మార్గమున పయనించుట లేదని తెలియవలెను.*

*వస్తువులను కోరు తెలివి క్రమశః వికసింపక కుంచించుకొనిపోవును. హక్కులను కోరు పసివారు బాధ్యతల యందు అప్రమత్తులై యుండలేరు. ఈ కాలమున వస్తు ఉత్పత్తి విపరీతముగ నున్నది. వస్తువులను విపరీతముగ జన సామాన్యులకు అంటగట్టుచున్నారు. పనికిరాని వస్తువులన్నియు కూడ పనికివచ్చు వస్తువులని నమ్మించి, ఆకర్షించి, కామోద్రిక్తులను చేయుచున్నారు. వ్యాపారము శ్రేయోదాయకము కాక ప్రజా పీడితముగ మార్పు చెందినది. ఇది కలి ప్రభావము.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 341-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 341 -1

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 341-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 341 -1🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 76. క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ ।
క్షయవృద్ధి వినిర్ముక్తా, క్షేత్రపాల సమర్చితా ॥ 76 ॥ 🍀

🌻 341-1. 'క్షేత్రస్వరూప'🌻

క్షేత్ర రూపము శ్రీదేవియే అని అర్థము. సృష్టి యందు జీవులను వసింప జేయుటకు సృష్టి క్షేత్ర మొకటి యేర్పడవలెను. ఏడులోకముల యందు జీవులు వసించుటకు వలసిన చోటు, జీవులు వసించుటకు వలసిన రూపములు కావలెను. ప్రదేశ మేర్పడవలెను. మరియు జీవులకు రూపము లేర్పడవలెను. అట్లు ఏర్పడిననేగాని సృష్టి కథ లేదు. జీవుల పరిణామ కథ కూడ లేదు. శ్రీమాతయే ఏడు లోకముల యందలి ప్రదేశముగ ఏర్పడును.

ఆమె మూల ప్రకృతి. ఆమె నుండి అష్ట ప్రకృతులు యేర్పడి నవావరణములతో కూడిన చోటు ఏర్పడును. మొత్తము సృష్టి కథ అంతయూ ఈ ఆవరణములలోనే జరుగును. మొత్తము చోటులో నవావరణముల మేరకు చోటు వెలిగింపబడును. ఒక మహారణ్యమున కొంత చోటును చదను చేసి శుభ్రపరచి ఆశ్రమము నిర్మాణము చేసినట్లుగ అనంతమైన చోటులో కొంత చోటు ఒక సృష్టిగ ఏర్పడును. సమస్త జీవ వ్యాపారములును ఈ వెలిగింపబడిన చోటులో జరుగు చుండును. ఇదియే కురు క్షేత్రము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 341-1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 76. Kshetra-svarupa kshetreshi kshetra kshetragynapalini
Kshaya-vrudhi vinirmukta kshetrapala smarchita ॥ 76 ॥ 🌻

🌻 341-1. Kṣetra-svarūpā क्षेत्र-स्वरूपा (341) 🌻

Since the next few nāma-s deal with Her Kṣetra form, understanding Kṣetra becomes important. Kṣetra is the physical body and kṣetrajña is the soul. Kṣetra is made up of thirty six tattva-s (some take only twentyfour) or principles. There is an exclusive chapter (XIII) in Bhagavad Gīta on this subject.

Kṛṣṇa opens this chapter by saying that “the body is called kṣetra (where karma-s are created and its effect executed) and which cognizes this is called kṣetrajña”. Liṇga Purāna also says ‘the Goddess (Śaktī), the beloved of the slayer of the three cities (Śiva) is Kṣetra while the Lord (Śiva) is Kṣetrajña’. Kṣetra is gross and kṣetrajña is subtle. Kṣetra is perishable, whereas the knower of Kṣetra, kṣetrajña is eternal and imperishable.

Kṛṣṇa concludes chapter XIII by saying, “Those who know the difference between kṣetra and kṣetrajña and the phenomenon of liberation from Prakṛti with her evolutes, reach the supreme eternal spirit.”

She is said to be in the form of such kṣetra. This nāma means that She is the embodiment of all gross forms of this universe.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

18 Jan 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 136

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 136 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. బ్రహ్మజ్ఞానము 🌻

బ్రహ్మజ్ఞానమనగా ఒక బాధ్యతయే గాని యొక పదవి కాదు. అది పొందిన వాడు బ్రహ్మవలె సృష్టిని చక్కబెట్టుచుండ వలయును.

అందందు సంచరించుచు మానవుల అజ్ఞానము తొలగు మార్గములలో విహరింపవలెను గాని, దాని ననుభవించుచు కూర్చుండుటకు వీలులేదు. ఇట్టి బాధ్యతకు సిద్ధమైన వానికి మాత్రమే బ్రహ్మజ్ఞానము ప్రసాదింపబడునని భాగవతము ఉపదేశించుచున్నది.

✍🏼 మాస్టర్ ఇ.కె. 🌻

🌹 🌹 🌹 🌹 🌹

18 Jan 2022

శ్రీ శివ మహా పురాణము - 506

🌹 . శ్రీ శివ మహా పురాణము - 506 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 42

🌻. పెళ్లి వారికి ఎదురేగుట - 1 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను-

సర్వ వ్యాపి యగు ఈశ్వరుడు తన నగరము యొక్క శివార్లకు వచ్చి యున్నాడని విని పర్వత రాజగు హిమవంతుడు మిక్కిలి ఆనందించెను (1). అపుడాతడు ఈశ్వరునితో మాటలాడుటకై పర్వతములను, మరియు బ్రాహ్మణులను సంభారములనిచ్చి పంపించెను (2). హిమవంతుడు భక్తితో నిండిన మనస్సు గలవాడై ప్రాణప్రియుడగు ఈశ్వరుడు దర్శించుట కొరకై తన భాగ్యమును ప్రశంసిస్తూ గొప్ప భక్తితో స్వయముగా ఎదురేగెను (3). అపుడు హిమవంతుడు దేవ సేనను చూచి విస్మయమును పొందెను. 'నేను ధన్యుడను ' అని తలపోయుచూ ఆతడచట ఎదురేగెను (4).

దేవతలు హిమవంతుని పరివారమునుచూచి మిక్కిలి విస్మయమును పొందిరి. దేవతలు మరియు పర్వతులు పరమానందమును పొందిరి (5). ఓ మునీ! పర్వతుల మహాసేన దేవతల పెద్ద సేనతో కలిసి తూర్పు పడమర సముద్రముల కలయిక వలె భాసిల్లెను (6). ఆ దేవతలు, పర్వతులు ఒకరితో మరియొకరు కలసి పరమానందమును పొంది కృతార్థులమైతి మని భావించిరి (7).

అపుడు హిమవంతుడు ముందుగా శివుని చూచి ప్రణమిల్లెను. పర్వతములు, బ్రాహ్మణులు అందరు సదాశివునకు నమస్కరించిరి (8). వృషభము నధిష్ఠించి యున్నవాడు, ప్రసన్నమగు ముఖము గలవాడు, అనేకములగు ఆభరణములతో అలంకరింపబడిన వాడు, దివ్యమగు అవయవముల కాంతిచే ప్రకాశింప చేయబడిన దిక్కులు గలవాడు (9). అతి సూక్ష్మమగు దారములతో నేసిన మంచి పట్టు వస్త్రముతో శోభిల్లు దేహము గలవాడు, మంచి రత్నములతో ప్రకాశించే శిరస్సు గలవాడు, స్వచ్ఛమగు కాంతులతో నవ్వు చున్నవాడు (10),

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

18 Jan 2022

గీతోపనిషత్తు -308

🌹. గీతోపనిషత్తు -308 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 21 -1 📚

🍀 21-1. జనన మరణ చక్రము - విశేషమగు పుణ్యమార్జించిన వారు సుఖ భోగములను పొందుచు నుండగ పుణ్యము క్షీణించుచు నుండును. పుణ్యము క్షీణించగనె సుఖము, భోగము అంతరించును. అపుడు మరల సుఖమునకై, భోగమునకై ప్రయత్నించుట యుండును. ధన మనగా కేవలము రూపాయి నోట్లు కాదు. సుఖప్రాప్తి నిచ్చు ప్రయత్నము లన్నియు ధనార్జనము వంటివే. 🍀

21. తే తం భుక్యా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి |
ఏవం త్రయీధర్మ మమప్రపన్నా గతాగతం కామకామా లభంతే ||

తాత్పర్యము : దివ్యలోకములందు విస్తృతముగ దివ్య భోగానుభవము అనుభవింపగనే, చేసిన పుణ్యము క్షీణించుట వలన మరల జీవులు మర్త్యలోకములందు ప్రవేశించు చున్నారు. అర్థకామములను ధర్మము నాశ్రయంచి పొందుచున్నవారు ఇట్లు స్వర్గలోకమునకు, మర్త్యలోకమునకు నడుమ రాకపోకలను పొందుచు నున్నారు.

వివరణము : భోగముల ననుభవించుచుండగ చేసిన పుణ్యము క్షీణించుచు నుండును. విశేషమగు పుణ్యమార్జించిన వారు సుఖ భోగములను పొందుచు నుండగ పుణ్యము క్షీణించుచు నుండును. పుణ్యము క్షీణించగనె సుఖము, భోగము అంతరించును. అపుడు మరల సుఖమునకై, భోగమునకై ప్రయత్నించుట యుండును. ధనము కూడబెట్టిన వాడు ఆ ధనమును వెచ్చించుట వలన భోగములు లభించుచు నుండును.

ధన మనగా కేవలము రూపాయి నోట్లు కాదు. సుఖప్రాప్తి నిచ్చు ప్రయత్నము లన్నియు ధనార్జనము వంటివే. ఆర్జించునది ఖర్చు కాగానే మరల ఆర్జింపవలెను. ఆదాయము, ఖర్చుగ చక్రము తిరుగుచు నుండును. ఒక మాసమంతయు ఆర్జించినది, ఒక రోజులో ఖర్చుకాగలదు. ఒక సంవత్సర మంతయు ఆర్జించినది కూడ ఒక రోజు ఖర్చునకే సరిపోగలదు. భోగములట్టివి.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

18 Jan 2022

18-JANUARY-2022 మంగళవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 18, మంగళవారం, జనవరి 2022 భౌమ వాసరే 🌹 
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 308 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 506🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -136🌹  
5) 🌹 Osho Daily Meditations - 125🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 341-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 341-1 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹*
*భౌమ వాసరే, 18, జనవరి 2022*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ ఆంజనేయ స్తోత్రం - 1 🍀*

*1. మహేశ్వర ఉవాచ |*
*శృణు దేవి ప్రవక్ష్యామి స్తోత్రం సర్వభయాపహమ్ |*
*సర్వకామప్రదం నౄణాం హనూమత్ స్తోత్రముత్తమమ్*

*2. తప్తకాంచనసంకాశం నానారత్నవిభూషితమ్ |*
*ఉద్యద్బాలార్కవదనం త్రినేత్రం కుండలోజ్జ్వలమ్*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం,
హేమంత ఋతువు, పౌష్య మాసం
తిథి: కృష్ణ పాడ్యమి 30:55:14 వరకు
తదుపరి కృష్ణ విదియ
నక్షత్రం: పుష్యమి 30:43:19 వరకు
తదుపరి ఆశ్లేష
యోగం: వషకుంభ 16:08:35 వరకు
తదుపరి ప్రీతి
కరణం: బాలవ 18:06:41 వరకు
సూర్యోదయం: 06:49:29
సూర్యాస్తమయం: 18:03:21
వైదిక సూర్యోదయం: 06:53:17
వైదిక సూర్యాస్తమయం: 17:59:32
చంద్రోదయం: 18:25:37
చంద్రాస్తమయం: 07:06:18
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
వర్జ్యం: 13:19:40 - 15:04:00
దుర్ముహూర్తం: 09:04:15 - 09:49:11
రాహు కాలం: 15:14:53 - 16:39:07
గుళిక కాలం: 12:26:25 - 13:50:39
యమ గండం: 09:37:57 - 11:02:11
అభిజిత్ ముహూర్తం: 12:04 - 12:48
అమృత కాలం: 23:45:40 - 25:30:00
మరియు 30:42:12 - 32:25:00
వర్ధమాన యోగం - ఉత్తమ ఫలం
30:43:19 వరకు తదుపరి ఆనంద
యోగం - కార్య సిధ్ధి
పండుగలు : లేవు
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -308 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 21 -1 📚*
 
*🍀 21-1. జనన మరణ చక్రము - విశేషమగు పుణ్యమార్జించిన వారు సుఖ భోగములను పొందుచు నుండగ పుణ్యము క్షీణించుచు నుండును. పుణ్యము క్షీణించగనె సుఖము, భోగము అంతరించును. అపుడు మరల సుఖమునకై, భోగమునకై ప్రయత్నించుట యుండును. ధన మనగా కేవలము రూపాయి నోట్లు కాదు. సుఖప్రాప్తి నిచ్చు ప్రయత్నము లన్నియు ధనార్జనము వంటివే. 🍀*

*21. తే తం భుక్యా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి |*
*ఏవం త్రయీధర్మ మమప్రపన్నా గతాగతం కామకామా లభంతే ||* 

*తాత్పర్యము : దివ్యలోకములందు విస్తృతముగ దివ్య భోగానుభవము అనుభవింపగనే, చేసిన పుణ్యము క్షీణించుట వలన మరల జీవులు మర్త్యలోకములందు ప్రవేశించు చున్నారు. అర్థకామములను ధర్మము నాశ్రయంచి పొందుచున్నవారు ఇట్లు స్వర్గలోకమునకు, మర్త్యలోకమునకు నడుమ రాకపోకలను పొందుచు నున్నారు.*

*వివరణము : భోగముల ననుభవించుచుండగ చేసిన పుణ్యము క్షీణించుచు నుండును. విశేషమగు పుణ్యమార్జించిన వారు సుఖ భోగములను పొందుచు నుండగ పుణ్యము క్షీణించుచు నుండును. పుణ్యము క్షీణించగనె సుఖము, భోగము అంతరించును. అపుడు మరల సుఖమునకై, భోగమునకై ప్రయత్నించుట యుండును. ధనము కూడబెట్టిన వాడు ఆ ధనమును వెచ్చించుట వలన భోగములు లభించుచు నుండును.*

*ధన మనగా కేవలము రూపాయి నోట్లు కాదు. సుఖప్రాప్తి నిచ్చు ప్రయత్నము లన్నియు ధనార్జనము వంటివే. ఆర్జించునది ఖర్చు కాగానే మరల ఆర్జింపవలెను. ఆదాయము, ఖర్చుగ చక్రము తిరుగుచు నుండును. ఒక మాసమంతయు ఆర్జించినది, ఒక రోజులో ఖర్చుకాగలదు. ఒక సంవత్సర మంతయు ఆర్జించినది కూడ ఒక రోజు ఖర్చునకే సరిపోగలదు. భోగములట్టివి.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 506 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 42

*🌻. పెళ్లి వారికి ఎదురేగుట - 1 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను-

సర్వ వ్యాపి యగు ఈశ్వరుడు తన నగరము యొక్క శివార్లకు వచ్చి యున్నాడని విని పర్వత రాజగు హిమవంతుడు మిక్కిలి ఆనందించెను (1). అపుడాతడు ఈశ్వరునితో మాటలాడుటకై పర్వతములను, మరియు బ్రాహ్మణులను సంభారములనిచ్చి పంపించెను (2). హిమవంతుడు భక్తితో నిండిన మనస్సు గలవాడై ప్రాణప్రియుడగు ఈశ్వరుడు దర్శించుట కొరకై తన భాగ్యమును ప్రశంసిస్తూ గొప్ప భక్తితో స్వయముగా ఎదురేగెను (3). అపుడు హిమవంతుడు దేవ సేనను చూచి విస్మయమును పొందెను. 'నేను ధన్యుడను ' అని తలపోయుచూ ఆతడచట ఎదురేగెను (4). 

దేవతలు హిమవంతుని పరివారమునుచూచి మిక్కిలి విస్మయమును పొందిరి. దేవతలు మరియు పర్వతులు పరమానందమును పొందిరి (5). ఓ మునీ! పర్వతుల మహాసేన దేవతల పెద్ద సేనతో కలిసి తూర్పు పడమర సముద్రముల కలయిక వలె భాసిల్లెను (6). ఆ దేవతలు, పర్వతులు ఒకరితో మరియొకరు కలసి పరమానందమును పొంది కృతార్థులమైతి మని భావించిరి (7). 

అపుడు హిమవంతుడు ముందుగా శివుని చూచి ప్రణమిల్లెను. పర్వతములు, బ్రాహ్మణులు అందరు సదాశివునకు నమస్కరించిరి (8). వృషభము నధిష్ఠించి యున్నవాడు, ప్రసన్నమగు ముఖము గలవాడు, అనేకములగు ఆభరణములతో అలంకరింపబడిన వాడు, దివ్యమగు అవయవముల కాంతిచే ప్రకాశింప చేయబడిన దిక్కులు గలవాడు (9). అతి సూక్ష్మమగు దారములతో నేసిన మంచి పట్టు వస్త్రముతో శోభిల్లు దేహము గలవాడు, మంచి రత్నములతో ప్రకాశించే శిరస్సు గలవాడు, స్వచ్ఛమగు కాంతులతో నవ్వు చున్నవాడు (10), 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 136 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. బ్రహ్మజ్ఞానము 🌻*

*బ్రహ్మజ్ఞానమనగా ఒక బాధ్యతయే గాని యొక పదవి కాదు. అది పొందిన వాడు బ్రహ్మవలె సృష్టిని చక్కబెట్టుచుండ వలయును.*

*అందందు సంచరించుచు మానవుల అజ్ఞానము తొలగు మార్గములలో విహరింపవలెను గాని, దాని ననుభవించుచు కూర్చుండుటకు వీలులేదు. ఇట్టి బాధ్యతకు సిద్ధమైన వానికి మాత్రమే బ్రహ్మజ్ఞానము ప్రసాదింపబడునని భాగవతము ఉపదేశించుచున్నది.*

✍🏼 *మాస్టర్ ఇ.కె.* 🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 125 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 125. DOUBT AND NEGATIVITY 🍀*

*🕉 Doubt means that you don't have any position; you are ready to inquire. with an open mind. Doubt is the best point from where to begin. 🕉*
 
*Doubt is not bad. Negativity is a totally different thing. Negativity means you have already taken a position-against. Doubt means you don't have any position; you are ready to inquire, with open mind. Doubt is the best point from where to begin. Doubt simply means a quest, a question; negativity means you already have a prejudice, you are bigoted. You have already decided. Now all that you have to do is somehow to prove your prejudice right. Doubt is immensely spiritual. But negativity is something sick.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 341-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 341 -1🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 76. క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ ।*
*క్షయవృద్ధి వినిర్ముక్తా, క్షేత్రపాల సమర్చితా ॥ 76 ॥ 🍀*

*🌻 341-1. 'క్షేత్రస్వరూప'🌻* 

*క్షేత్ర రూపము శ్రీదేవియే అని అర్థము. సృష్టి యందు జీవులను వసింప జేయుటకు సృష్టి క్షేత్ర మొకటి యేర్పడవలెను. ఏడులోకముల యందు జీవులు వసించుటకు వలసిన చోటు, జీవులు వసించుటకు వలసిన రూపములు కావలెను. ప్రదేశ మేర్పడవలెను. మరియు జీవులకు రూపము లేర్పడవలెను. అట్లు ఏర్పడిననేగాని సృష్టి కథ లేదు. జీవుల పరిణామ కథ కూడ లేదు. శ్రీమాతయే ఏడు లోకముల యందలి ప్రదేశముగ ఏర్పడును.*

*ఆమె మూల ప్రకృతి. ఆమె నుండి అష్ట ప్రకృతులు యేర్పడి నవావరణములతో కూడిన చోటు ఏర్పడును. మొత్తము సృష్టి కథ అంతయూ ఈ ఆవరణములలోనే జరుగును. మొత్తము చోటులో నవావరణముల మేరకు చోటు వెలిగింపబడును. ఒక మహారణ్యమున కొంత చోటును చదను చేసి శుభ్రపరచి ఆశ్రమము నిర్మాణము చేసినట్లుగ అనంతమైన చోటులో కొంత చోటు ఒక సృష్టిగ ఏర్పడును. సమస్త జీవ వ్యాపారములును ఈ వెలిగింపబడిన చోటులో జరుగు చుండును. ఇదియే కురు క్షేత్రము.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 341-1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 76. Kshetra-svarupa kshetreshi kshetra kshetragynapalini*
*Kshaya-vrudhi vinirmukta kshetrapala smarchita ॥ 76 ॥ 🌻*

*🌻 341-1. Kṣetra-svarūpā क्षेत्र-स्वरूपा (341) 🌻*

*Since the next few nāma-s deal with Her Kṣetra form, understanding Kṣetra becomes important. Kṣetra is the physical body and kṣetrajña is the soul. Kṣetra is made up of thirty six tattva-s (some take only twentyfour) or principles. There is an exclusive chapter (XIII) in Bhagavad Gīta on this subject.*

*Kṛṣṇa opens this chapter by saying that “the body is called kṣetra (where karma-s are created and its effect executed) and which cognizes this is called kṣetrajña”. Liṇga Purāna also says ‘the Goddess (Śaktī), the beloved of the slayer of the three cities (Śiva) is Kṣetra while the Lord (Śiva) is Kṣetrajña’. Kṣetra is gross and kṣetrajña is subtle. Kṣetra is perishable, whereas the knower of Kṣetra, kṣetrajña is eternal and imperishable.*

*Kṛṣṇa concludes chapter XIII by saying, “Those who know the difference between kṣetra and kṣetrajña and the phenomenon of liberation from Prakṛti with her evolutes, reach the supreme eternal spirit.”*

*She is said to be in the form of such kṣetra. This nāma means that She is the embodiment of all gross forms of this universe.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 340 / Sri Lalitha Chaitanya Vijnanam - 340

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 340 / Sri Lalitha Chaitanya Vijnanam - 340 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 75. విశ్వాధికా, వేదవేద్యా, వింధ్యాచల నివాసినీ ।
విధాత్రీ, వేదజననీ, విష్ణుమాయా, విలాసినీ ॥ 75 ॥ 🍀

🌻 340. 'విలాసినీ' 🌻

విక్షేపశక్తి గలది శ్రీమాత అని అర్థము. శ్రీమాత విలాసిని శక్తి మహత్తర మహిమ కలది. విలాసమనగా రహస్య గమనము. శ్రీమాత గమనము అనూహ్యము. జరిగిన వెనుకనే మహాత్ములైనా తెలియగలరు. జరిగిన పిదప ఇట్లు జరిగినదని సంభ్రమాశ్చర్యములతో వివరించుకొనుటయే గాని, ఇట్లు జరుగ గలదని ఎవ్వరునూ ఊహించలేరు. శ్రీమాత విలాసినీ శక్తి క్షణకాలమున జీవునికి ముక్తి నివ్వగలదు. ఆమె తలచినచో ఎట్టివారినైనా అద్భుతముగ ఉద్దరించగలదు. కోట్లకొలది రుద్రుల శక్తి ఊహించగలిగినచో అది విలాసిని శక్తిగ పరిగణింపబడును.

శ్రీమాత విలాసిని శక్తి బ్రహ్మరంధ్రమున చరించుచు నుండును. ఆమె అనుగ్రహ విశేషముచే ఆమె విలాసముగ యోగులు ఊర్ధ్వ లోకముల నుండి అధోలోకములకు, అధోలోకముల నుండి ఊర్ధ్వ

లోకములకు సంచరించుచు సృష్టికార్యమును చక్కబెట్టుచు నుందురు. నారదాదులు, సనక సనందనాదులు, సప్త ఋషులు అట్టివారు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 340 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 75. Vishvadhika vidavidya vindhyachala nivasini
Vidhatri vidajanani vishnu maya vilasini ॥ 75 ॥ 🌻

🌻 340. Vilāsinī विलासिनी (340) 🌻

Vilāsa means playful. One interpretation is that She is interested in fun, associated with lusty acts with Śiva. Possibly this could mean that such acts are not considered as sins, as projected. If such acts do not exist, where is the question of procreation? If no procreation is happening, one of the God’s acts, the creation itself will be in jeopardy. Even the ancient scriptures do not advocate abstaining from such acts. But, at the same time they do prescribe certain rigorous rules and regulations that are to be strictly adhered to.

Vilāsa also means the power of projection which is called vikṣepa śakti (power of projection, through which the projection of the world is possible). This is the true act of māyā, veiling the Ultimate Truth and projecting It is as something else, thereby causing illusion. This interpretation seems to be appropriate as this nāma follows the earlier nāma Viṣṇu-māyā’. When She is in the form Viṣṇu’s māyā, (Viṣṇu is all-pervading) naturally She causes illusion.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

17 Jan 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 124

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 124 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మనుషులు వేల కొద్దీ యితర పనులు చేస్తూ వుంటారు. దు: ఖంలో పడి బాధ్యతని యితర్ల మీదకు తోస్తూ వుంటారు. సత్యమొక్కటే నీకు పరిష్కారం. ఎప్పుడు నువ్వు బాధల్లో వుంటే అప్పుడు ధ్యానంలో వెళ్ళు. నువ్వు సంపూర్ణ సాక్షీభూతంగా మారితే బాధ అదృశ్యమయి పోతుంది. 🍀

మనుషులు యింటికి తిరిగి రావడాన్ని వదిలిపెట్టు. వేల కొద్దీ యితర పనులు చేస్తూ వుంటారు. దు: ఖంలో పడి బాధ్యతని యితర్ల మీదకు తోస్తూ వుంటారు. భార్య యిబ్బంది పెడుతుంది. తను అందువల్లే బాధల్లో వున్నా ననుకుంటాడు భర్త. భార్య కాకుంటే సమాజం లేదా దేశం! దానికి సవాలక్ష సంగతులు సిద్ధంగా వుంటాయి. మనిషికి నింద మోపడానికి లెక్కలేనన్ని సిద్ధంగా వుంటాయి. లేకుంటే వ్యక్తి వాటిని సృష్టిస్తాడు. అవి బాధల్ని కొనసాగిస్తాయి. పరిష్కారాల్నివ్వవు. మరిన్ని బాధల్ని తెస్తాయి. సత్యమొక్కటే నీకు పరిష్కారం. నిన్ను క్షమించేది అదే.

కానీ నువ్వు సత్యానికి బహుదూరంలో వున్నావు. కాబట్టి ఎప్పుడు నువ్వు బాధల్లో వుంటే అప్పుడు ధ్యానంలో వెళ్ళు. నిశ్శబ్దంగా మారు. నీ బాధల్ని పరిశీలించు. సాక్షిగా మారు. ఆ బాధలో కలిసిపోకు. నువ్వు పరిశీలించే కొద్దీ ఆ బాధ మెల్లమెల్లగా తరిగిపోతుంది. నువ్వు సంపూర్ణ సాక్షీభూతంగా మారితే బాధ అదృశ్యమయిపోతుంది. అసలాబాధ అక్కడ లేనట్లే వుంటుంది. దాని జాడలు కూడా కనిపించవు. ఆ బాధలో దాగున్న శక్తే నీ మీద పరవశంగా మారి వర్షిస్తుంది. నువ్వు నీ యింటికి తిరిగి వచ్చావు.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

17 Jan 2022

మైత్రేయ మహర్షి బోధనలు - 59

🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 59 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 46. సూక్తులు 🌻

మూర్ఖునితో వాదింపకుము. బాధ్యత లేని వాని యందు మౌనము వహింపుము. నీ విచక్షణా జ్ఞానమును ఇతరుల అభిప్రాయములనే మేఘములతో మరగుపరచు కొనకుము. అవగాహన లేనివారితో దీర్ఘ సంభాషణములు చేయకుము. పై సూత్రములను పాటించినచో నీవు అవమానింపబడవు. పాండిత్యము ప్రదర్శించు వారి ఎడల నిశ్శబ్దమును పాటించుము. పాండిత్య ప్రకర్ష వెనుక గల, వారి ఆవేదనను అవగాహన చేసుకొనుటకు ప్రయత్నింపుము.

అతిగ మాట్లాడినవారి విషయమున కూడ, ఆ జీవుల ఆవేదనను గుర్తింపుము. వీరందరికిని కావలసిన దేదియోయుండి బైటికి మరియొకటి ఏదియో పలుకుచుందురు. జీవులను గుర్తించి, వారి నర్తనములను గమనించుట దైనందిన చర్యగ ఏర్పరచు కొనుము. ఎక్కువమంది లోతులేని బావివంటి వారే. లోతుగల బావుల యందు నీరు నిశ్చలముగ నుండును. అట్టి వారి సాన్నిధ్యమున నీవు కూడ అప్రయత్నముగ నిశ్చలుడవగుదువు.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

17 Jan 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 542 / Vishnu Sahasranama Contemplation - 542

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 542 / Vishnu Sahasranama Contemplation - 542 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 542. గుహ్యః, गुह्यः, Guhyaḥ 🌻

ఓం గుహ్యాయ నమః | ॐ गुह्याय नमः | OM Guhyāya namaḥ

గుహ్యః, गुह्यः, Guhyaḥ

రహస్యోపనిషద్వేద్యో గుహాయాం పరమేశ్వరః ।
హృదయాకాశే నిహిత ఇతి వా గుహ్య ఉచ్యతే ॥

రహస్యమైన ఉపనిషద్ వచనములచే తెలియబడువాడు పరమేశ్వరుడు. లేదా హృదయాకాశము అనగా హృదయము అనబడే గుహయందు ఉండెడివాడు గనుక ఆ దేవ దేవుడు గుహ్యుడు.

:: పోతన భాగవతము - ద్వితీయ స్కంధము ::

సీ. కలలోన జీవుండు కౌతూహలంబునఁ బెక్కు దేహంబులఁ బేరు వడసి
యింద్రియంబుల వెంట నెల్లవృత్తంబులు నీక్షించి మఱి తన్ను నెరుఁగుకరణి
నఖిలాంతరాత్మకుఁడగు పరమేశ్వరుఁ డఖిలజీవుల హృదయముల నుండి
బుద్ధి వృత్తుల నెల్ల బొద్ధయై వీక్షించు బద్ధుండు గాఁడు ప్రాభవము వలన
తే. సత్యుఁ డానందబాహుళ విజ్ఞానమూర్తి, యతని సేవింప నగుఁగాక, యన్యసేవఁ
గలుగనేరవు కైవల్య గౌరవములు, పాయ దెన్నఁడు సంసారబంధ మధిప! (18)

జీవుడు కలలో ఉబలాటంతో పలు శరీరాలు దాలుస్తాడు. పలుపేర్లతో వ్యవహరింప బడతాడు. ఇంద్రియాల ద్వారా విశేషాలన్నీ గ్రహిస్తాడు. ఆ తరువాత తన్ను తాను తెలుసుకుంటాడు. ఇలాగే అంతటికీ అంతరాత్మగా ఉన్న పరమేశ్వరుడు అన్ని ప్రాణుల హృదయాలలో ఉండి ప్రజ్ఞావంతుడై బుద్ధివ్యాపారాలన్నింటినీ పరిశీలిస్తూ ఉంటాడు. తానే అన్నిటికీ ప్రభువు కాబట్టి దేనికీ బద్ధుడు కాడు. తాను సత్యరూపుడు. ఆనందంతో నిండిన విజ్ఞానమూర్తి. ఆయన సేవ వల్లే మోక్షం సిద్ధిస్తుంది. ఇతరులను కొలిస్తే మోక్షం లభించదు. ఈ సంసార బంధము వదలదు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 542🌹

📚. Prasad Bharadwaj

🌻 542. Guhyaḥ 🌻

OM Guhyāya namaḥ

रहस्योपनिषद्वेद्यो गुहायां परमेश्वरः ।
हृदयाकाशे निहित इति वा गुह्य उच्यते ॥

Rahasyopaniṣadvedyo guhāyāṃ parameśvaraḥ,
Hr‌dayākāśe nihita iti vā guhya ucyate.

One who is to be known by the Guhya or the esoteric knowledge conveyed by the Upanishads. Or since He dwells in the guha i.e., cave of the heart, He is Guhyaḥ.

:: श्रीमद्भागवते तृतीयस्कन्धे षोडशोऽध्यायः ::

त्वत्तः सनातनो धर्मो रक्ष्यते तनुभिस्तव ।
धर्मस्य परमो गुह्यो निर्विकारो भवान्मतः ॥ १८ ॥

Śrīmad Bhāgavata - Canto 3, Chapter 16

Tvattaḥ sanātano dharmo rakṣyate tanubhistava,
Dharmasya paramo guhyo nirvikāro bhavānmataḥ. 18.

You are the source of the eternal occupation of all living entities, and by Your multiple manifestations, You have always protected religion. You are the supreme objective of religious principles, and in our opinion You are inexhaustible and unchangeable eternally.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

महावराहो गोविन्दस्सुषेणः कनकाङ्गदी ।
गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः ॥ ५८ ॥

మహావరాహో గోవిన్దస్సుషేణః కనకాఙ్గదీ ।
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః ॥ 58 ॥

Mahāvarāho govindassuṣeṇaḥ kanakāṅgadī,
Guhyo gabhīro gahano guptaścakragadādharaḥ ॥ 58 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

17 Jan 2022

17-JANUARY-2022 సోమవారం MESSAGES శాకంబరి పౌర్ణమి

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 17, జనవరి 2022 సోమవారం, ఇందు వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 145 / Bhagavad-Gita - 145 - 3-26 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 542 / Vishnu Sahasranama Contemplation - 542 🌹
4) 🌹 DAILY WISDOM - 220🌹 
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 59 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 125🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 340 / Sri Lalitha Chaitanya Vijnanam - 340 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ సోమవారం మిత్రులందరికీ 🌹*
*ఇందు వాసరే, 17, జనవరి 2022*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. రుద్రనమక స్తోత్రం - 7 🍀*

*ఉభయోగార్త్ని యోర్జ్యా యా ధన్వన స్తాం ప్రముంచతామ్!*
*సంప్రాప్య ధనురన్యేషాం భయాయ ప్రభవిష్యతి!!13*
*అస్మద్భయ వినాశార్థ మధునాభయద ప్రభో!*
*యాశ్చతే హస్త ఇషవః పరాతా భగవో వాప!!14*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం,
హేమంత ఋతువు, పౌష్య మాసం
తిథి: పూర్ణిమ 29:19:50 వరకు
తదుపరి కృష్ణ పాడ్యమి
నక్షత్రం: పునర్వసు 28:38:20 వరకు
తదుపరి పుష్యమి
యోగం: వైధృతి 15:51:12 వరకు
తదుపరి వషకుంభ
కరణం: విష్టి 16:19:06 వరకు
సూర్యోదయం: 06:49:26
సూర్యాస్తమయం: 18:02:46
వైదిక సూర్యోదయం: 06:53:15
వైదిక సూర్యాస్తమయం: 17:58:56
చంద్రోదయం: 17:31:47
చంద్రాస్తమయం: 06:17:34
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: జెమిని
వర్జ్యం: 15:24:00 - 17:09:52
దుర్ముహూర్తం: 12:48:32 - 13:33:26
మరియు 15:03:12 - 15:48:06
రాహు కాలం: 08:13:35 - 09:37:46
గుళిక కాలం: 13:50:16 - 15:14:26
యమ గండం: 11:01:56 - 12:26:06
అభిజిత్ ముహూర్తం: 12:04 - 12:48
అమృత కాలం: 25:59:12 - 27:45:04
ధూమ్ర యోగం - కార్య భంగం, 
సొమ్ము నష్టం 28:38:20 వరకు
తదుపరి ధాత్రి యోగం - కార్య జయం 
పండుగలు : పుష్య పౌర్ణమి, 
శాకంబరి పౌర్ణమి, Paush Purnima
Shakambhari Purnima
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 145 / Bhagavad-Gita - 145 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 26 🌴*

*26. న బుద్ధిభేదం జనయేద జ్ఞానాం కర్మసజ్గినామ్ |*
*జోష యేత్సర్వకర్మాణి విద్వాన్ యుక్త: సమాచరన్ ||*

🌷. తాత్పర్యం :
*విధ్యుక్తధర్మపు ఫలముల యెడ ఆసక్తిని కలిగిన పామరుల మనస్సు కలతపడురీతిగా విద్వాంసుడు వారిని కర్మ యందు నిగ్రహింపరాదు. అందుకు భిన్నముగా అతడు భక్తిభావముతో కర్మనొనరించును (కృష్ణభక్తి వృద్ది యగుటకు) వారిని వివిధ కర్మల యందు నియుక్తులను చేయవలెను.*

🌷. భాష్యము :
“వేదైశ్చ సర్వైరహమేవ వేద్య:” సమస్త వేదకర్మల అంతిమ ప్రయోజనమిదియే. వేదములందు తెలుపబడిన సర్వకర్మలు, సర్వయజ్ఞములు (లౌకిక కర్మలకు సంబంధించిన నిర్దేశములతో సహా) ఇతరములైన అన్ని విషయములు జీవితగమ్యమైన శ్రీకృష్ణభగవానుని అవగతము చేసికొనుట కొరకే ఉద్దేశింప బడియున్నవి. కాని బద్ధజీవులు ఇంద్రియభోగము కన్నను అన్యమైనది ఎరుగనందున అట్టి ప్రయోజనముకే వేదాధ్యయనమును గావింతురు. 

అయినను వేదకర్మల ద్వారా నియమింపబడిన కామ్యకర్మలు మరియు ఇంద్రియ భోగములచే మనుజుడు క్రమముగా కృష్ణభక్తిభావనా స్థాయికి చేరగలడు. కనుకనే కృష్ణభక్తి భావనాయుతుడు ఇతరుల కర్మల యందు లేదా అవగాహన యందు కలతకు కలిగించరాదు. దానికి బదులు ఏ విధముగా కర్మ ఫలమును శ్రీకృష్ణుని సేవకు అంకితము చేయవచ్చునో తెలియ జేయు రీతిలో అతడు కర్మ నొనరింపవలెను. అనగా ఇంద్రియ భోగము కొరకై కర్మనొనరించు అజ్ఞాని వాస్తవమునకు ఏ విధముగా కర్మనొనరించవలెనో మరియు ఏ విధముగా వర్తించవలెనో తెలిసికొనగలిగే రీతిలో కృష్ణభక్తిభావనాయుతుడు వర్తింపవలెను. 

అజ్ఞానియైన వానిని వాని కర్మల యందు కలత పెట్టకుండుట సరియైనదే అయినను, కొద్దిగా కృష్ణభక్తిభావన కలిగినవానిని ఇతర వేదప్రక్రియలకై ఎదురు చూడక నేరుగా కృష్ణ సేవ యందు నియుక్తుని చేయవచ్చును. అటువంటి అదృష్టభాగుని వేదవిహిత కర్మల ననుసరింపవలసిన అవసరము ఏదియును లేదు. ఏలయన విధ్యుక్తధర్మ నిర్వాహణము ద్వారా కలుగు ఫలములన్నింటిని మనుజుడు కృష్ణభక్తి యందు ప్రత్యక్షముగా నిలుచుట వలన సాధింపగలుగును.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 145 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 3 - Karma Yoga - 26 🌴*

*26. na buddhi-bhedaṁ janayed ajñānāṁ karma-saṅginām*
*joṣayet sarva-karmāṇi vidvān yuktaḥ samācaran*

🌷Translation :
*So as not to disrupt the minds of ignorant men attached to the fruitive results of prescribed duties, a learned person should not induce them to stop work. Rather, by working in the spirit of devotion, he should engage them in all sorts of activities [for the gradual development of Kṛṣṇa consciousness].*

🌷 Purport :
Vedaiś ca sarvair aham eva vedyaḥ. That is the end of all Vedic rituals. All rituals, all performances of sacrifices, and everything that is put into the Vedas, including all direction for material activities, are meant for understanding Kṛṣṇa, who is the ultimate goal of life. 

But because the conditioned souls do not know anything beyond sense gratification, they study the Vedas to that end. But through fruitive activities and sense gratification regulated by the Vedic rituals one is gradually elevated to Kṛṣṇa consciousness. Therefore a realized soul in Kṛṣṇa consciousness should not disturb others in their activities or understanding, but he should act by showing how the results of all work can be dedicated to the service of Kṛṣṇa. 

The learned Kṛṣṇa conscious person may act in such a way that the ignorant person working for sense gratification may learn how to act and how to behave. Although the ignorant man is not to be disturbed in his activities, a slightly developed Kṛṣṇa conscious person may directly be engaged in the service of the Lord without waiting for other Vedic formulas. For this fortunate man there is no need to follow the Vedic rituals, because by direct Kṛṣṇa consciousness one can have all the results one would otherwise derive from following one’s prescribed duties.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 542 / Vishnu Sahasranama Contemplation - 542 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 542. గుహ్యః, गुह्यः, Guhyaḥ 🌻*

*ఓం గుహ్యాయ నమః | ॐ गुह्याय नमः | OM Guhyāya namaḥ*

*గుహ్యః, गुह्यः, Guhyaḥ*

*రహస్యోపనిషద్వేద్యో గుహాయాం పరమేశ్వరః ।*
*హృదయాకాశే నిహిత ఇతి వా గుహ్య ఉచ్యతే ॥*

*రహస్యమైన ఉపనిషద్ వచనములచే తెలియబడువాడు పరమేశ్వరుడు. లేదా హృదయాకాశము అనగా హృదయము అనబడే గుహయందు ఉండెడివాడు గనుక ఆ దేవ దేవుడు గుహ్యుడు.*

:: పోతన భాగవతము - ద్వితీయ స్కంధము ::
సీ. కలలోన జీవుండు కౌతూహలంబునఁ బెక్కు దేహంబులఁ బేరు వడసి
యింద్రియంబుల వెంట నెల్లవృత్తంబులు నీక్షించి మఱి తన్ను నెరుఁగుకరణి
నఖిలాంతరాత్మకుఁడగు పరమేశ్వరుఁ డఖిలజీవుల హృదయముల నుండి
బుద్ధి వృత్తుల నెల్ల బొద్ధయై వీక్షించు బద్ధుండు గాఁడు ప్రాభవము వలన
తే. సత్యుఁ డానందబాహుళ విజ్ఞానమూర్తి, యతని సేవింప నగుఁగాక, యన్యసేవఁ
గలుగనేరవు కైవల్య గౌరవములు, పాయ దెన్నఁడు సంసారబంధ మధిప! (18)

జీవుడు కలలో ఉబలాటంతో పలు శరీరాలు దాలుస్తాడు. పలుపేర్లతో వ్యవహరింప బడతాడు. ఇంద్రియాల ద్వారా విశేషాలన్నీ గ్రహిస్తాడు. ఆ తరువాత తన్ను తాను తెలుసుకుంటాడు. ఇలాగే అంతటికీ అంతరాత్మగా ఉన్న పరమేశ్వరుడు అన్ని ప్రాణుల హృదయాలలో ఉండి ప్రజ్ఞావంతుడై బుద్ధివ్యాపారాలన్నింటినీ పరిశీలిస్తూ ఉంటాడు. తానే అన్నిటికీ ప్రభువు కాబట్టి దేనికీ బద్ధుడు కాడు. తాను సత్యరూపుడు. ఆనందంతో నిండిన విజ్ఞానమూర్తి. ఆయన సేవ వల్లే మోక్షం సిద్ధిస్తుంది. ఇతరులను కొలిస్తే మోక్షం లభించదు. ఈ సంసార బంధము వదలదు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 542🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻 542. Guhyaḥ 🌻*

*OM Guhyāya namaḥ*

रहस्योपनिषद्वेद्यो गुहायां परमेश्वरः ।
हृदयाकाशे निहित इति वा गुह्य उच्यते ॥

*Rahasyopaniṣadvedyo guhāyāṃ parameśvaraḥ,*
*Hr‌dayākāśe nihita iti vā guhya ucyate.*

*One who is to be known by the Guhya or the esoteric knowledge conveyed by the Upanishads. Or since He dwells in the guha i.e., cave of the heart, He is Guhyaḥ.*

:: श्रीमद्भागवते तृतीयस्कन्धे षोडशोऽध्यायः ::
त्वत्तः सनातनो धर्मो रक्ष्यते तनुभिस्तव ।
धर्मस्य परमो गुह्यो निर्विकारो भवान्मतः ॥ १८ ॥ 

Śrīmad Bhāgavata - Canto 3, Chapter 16
Tvattaḥ sanātano dharmo rakṣyate tanubhistava,
Dharmasya paramo guhyo nirvikāro bhavānmataḥ. 18.

You are the source of the eternal occupation of all living entities, and by Your multiple manifestations, You have always protected religion. You are the supreme objective of religious principles, and in our opinion You are inexhaustible and unchangeable eternally.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
महावराहो गोविन्दस्सुषेणः कनकाङ्गदी ।
गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः ॥ ५८ ॥

మహావరాహో గోవిన్దస్సుషేణః కనకాఙ్గదీ ।
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః ॥ 58 ॥

Mahāvarāho govindassuṣeṇaḥ kanakāṅgadī,
Guhyo gabhīro gahano guptaścakragadādharaḥ ॥ 58 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 220 🌹*
*🍀 📖 from Lessons on the Upanishads 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 7. The Infinite is Summoning Every Finite Individual 🌻*

*The non-finite is what we call the Infinite. The Infinite is masquerading in us, which is another way of saying that the Unchanging is present in us. The Infinite is summoning every finite individual. The Unchanging is calling us moment to moment: “Don't sleep, get up!” One of the passages of the Katha Upanishad is uttisthata jagrata prapya varan nibodhata (Katha 1.3.14): “Wake up. Sleeping mankind, stand up!” Are we slumbering? Are we seeing only what we are able to cognise through the sense organs or are we also aware of something that is deeply rooted in our own self?*

*Prapya varan: “Go to the Masters.” Go to the wise ones in this world—masters and teachers and guiding lights of mankind—and nibodhata: “know the secret”. The Bhagavadgita also has this great teaching for us: tad viddhi pranipatena pariprasnena sevaya (Gita 4.34): “Go to the Masters.” How do we gain knowledge? Pranipatena: “Go and prostrate yourself before the great Masters.” Pariprasnena: “and question them”. “Great Master, this is the problem before me. I am not able to understand the solution for this. Please condescend to come down to my level and satisfy my inquisitiveness.” Serve that great Master; prostrate yourself; question the Master.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 59 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 46. సూక్తులు 🌻*

*మూర్ఖునితో వాదింపకుము. బాధ్యత లేని వాని యందు మౌనము వహింపుము. నీ విచక్షణా జ్ఞానమును ఇతరుల అభిప్రాయములనే మేఘములతో మరగుపరచు కొనకుము. అవగాహన లేనివారితో దీర్ఘ సంభాషణములు చేయకుము. పై సూత్రములను పాటించినచో నీవు అవమానింపబడవు. పాండిత్యము ప్రదర్శించు వారి ఎడల నిశ్శబ్దమును పాటించుము. పాండిత్య ప్రకర్ష వెనుక గల, వారి ఆవేదనను అవగాహన చేసుకొనుటకు ప్రయత్నింపుము.*

*అతిగ మాట్లాడినవారి విషయమున కూడ, ఆ జీవుల ఆవేదనను గుర్తింపుము. వీరందరికిని కావలసిన దేదియోయుండి బైటికి మరియొకటి ఏదియో పలుకుచుందురు. జీవులను గుర్తించి, వారి నర్తనములను గమనించుట దైనందిన చర్యగ ఏర్పరచు కొనుము. ఎక్కువమంది లోతులేని బావివంటి వారే. లోతుగల బావుల యందు నీరు నిశ్చలముగ నుండును. అట్టి వారి సాన్నిధ్యమున నీవు కూడ అప్రయత్నముగ నిశ్చలుడవగుదువు.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 124 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. మనుషులు వేల కొద్దీ యితర పనులు చేస్తూ వుంటారు. దు: ఖంలో పడి బాధ్యతని యితర్ల మీదకు తోస్తూ వుంటారు. సత్యమొక్కటే నీకు పరిష్కారం. ఎప్పుడు నువ్వు బాధల్లో వుంటే అప్పుడు ధ్యానంలో వెళ్ళు. నువ్వు సంపూర్ణ సాక్షీభూతంగా మారితే బాధ అదృశ్యమయి పోతుంది. 🍀*

*మనుషులు యింటికి తిరిగి రావడాన్ని వదిలిపెట్టు. వేల కొద్దీ యితర పనులు చేస్తూ వుంటారు. దు: ఖంలో పడి బాధ్యతని యితర్ల మీదకు తోస్తూ వుంటారు. భార్య యిబ్బంది పెడుతుంది. తను అందువల్లే బాధల్లో వున్నా ననుకుంటాడు భర్త. భార్య కాకుంటే సమాజం లేదా దేశం! దానికి సవాలక్ష సంగతులు సిద్ధంగా వుంటాయి. మనిషికి నింద మోపడానికి లెక్కలేనన్ని సిద్ధంగా వుంటాయి. లేకుంటే వ్యక్తి వాటిని సృష్టిస్తాడు. అవి బాధల్ని కొనసాగిస్తాయి. పరిష్కారాల్నివ్వవు. మరిన్ని బాధల్ని తెస్తాయి. సత్యమొక్కటే నీకు పరిష్కారం. నిన్ను క్షమించేది అదే.*

*కానీ నువ్వు సత్యానికి బహుదూరంలో వున్నావు. కాబట్టి ఎప్పుడు నువ్వు బాధల్లో వుంటే అప్పుడు ధ్యానంలో వెళ్ళు. నిశ్శబ్దంగా మారు. నీ బాధల్ని పరిశీలించు. సాక్షిగా మారు. ఆ బాధలో కలిసిపోకు. నువ్వు పరిశీలించే కొద్దీ ఆ బాధ మెల్లమెల్లగా తరిగిపోతుంది. నువ్వు సంపూర్ణ సాక్షీభూతంగా మారితే బాధ అదృశ్యమయిపోతుంది. అసలాబాధ అక్కడ లేనట్లే వుంటుంది. దాని జాడలు కూడా కనిపించవు. ఆ బాధలో దాగున్న శక్తే నీ మీద పరవశంగా మారి వర్షిస్తుంది. నువ్వు నీ యింటికి తిరిగి వచ్చావు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 340 / Sri Lalitha Chaitanya Vijnanam - 340 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 75. విశ్వాధికా, వేదవేద్యా, వింధ్యాచల నివాసినీ ।*
*విధాత్రీ, వేదజననీ, విష్ణుమాయా, విలాసినీ ॥ 75 ॥ 🍀*

*🌻 340. 'విలాసినీ' 🌻* 

*విక్షేపశక్తి గలది శ్రీమాత అని అర్థము. శ్రీమాత విలాసిని శక్తి మహత్తర మహిమ కలది. విలాసమనగా రహస్య గమనము. శ్రీమాత గమనము అనూహ్యము. జరిగిన వెనుకనే మహాత్ములైనా తెలియగలరు. జరిగిన పిదప ఇట్లు జరిగినదని సంభ్రమాశ్చర్యములతో వివరించుకొనుటయే గాని, ఇట్లు జరుగ గలదని ఎవ్వరునూ ఊహించలేరు. శ్రీమాత విలాసినీ శక్తి క్షణకాలమున జీవునికి ముక్తి నివ్వగలదు. ఆమె తలచినచో ఎట్టివారినైనా అద్భుతముగ ఉద్దరించగలదు. కోట్లకొలది రుద్రుల శక్తి ఊహించగలిగినచో అది విలాసిని శక్తిగ పరిగణింపబడును.*

*శ్రీమాత విలాసిని శక్తి బ్రహ్మరంధ్రమున చరించుచు నుండును. ఆమె అనుగ్రహ విశేషముచే ఆమె విలాసముగ యోగులు ఊర్ధ్వ లోకముల నుండి అధోలోకములకు, అధోలోకముల నుండి ఊర్ధ్వ
లోకములకు సంచరించుచు సృష్టికార్యమును చక్కబెట్టుచు నుందురు. నారదాదులు, సనక సనందనాదులు, సప్త ఋషులు అట్టివారు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 340 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 75. Vishvadhika vidavidya vindhyachala nivasini*
*Vidhatri vidajanani vishnu maya vilasini ॥ 75 ॥ 🌻*

*🌻 340. Vilāsinī विलासिनी (340) 🌻*

*Vilāsa means playful. One interpretation is that She is interested in fun, associated with lusty acts with Śiva. Possibly this could mean that such acts are not considered as sins, as projected. If such acts do not exist, where is the question of procreation? If no procreation is happening, one of the God’s acts, the creation itself will be in jeopardy. Even the ancient scriptures do not advocate abstaining from such acts. But, at the same time they do prescribe certain rigorous rules and regulations that are to be strictly adhered to.*

*Vilāsa also means the power of projection which is called vikṣepa śakti (power of projection, through which the projection of the world is possible). This is the true act of māyā, veiling the Ultimate Truth and projecting It is as something else, thereby causing illusion. This interpretation seems to be appropriate as this nāma follows the earlier nāma Viṣṇu-māyā’. When She is in the form Viṣṇu’s māyā, (Viṣṇu is all-pervading) naturally She causes illusion.*