శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 233 / Sri Lalitha Chaitanya Vijnanam - 233
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 233 / Sri Lalitha Chaitanya Vijnanam - 233 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము
🍀 57. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ ।
మహాకామేశ మహిషీ, మహాత్రిపుర సుందరీ ॥ 57 ॥🍀
🌻 233. 'మహాకామేశమహిషీ' 🌻
మహా కామేశుని పట్టపురాణి శ్రీదేవి అని అర్థము. సృష్టికి మూలకారణము కామమే. అనగా ఇచ్ఛ. కోటాను కోట్ల జీవుల యిచ్ఛయే కారణముగ సృష్టికి దైవము యిచ్ఛగించును. తత్ఫలితమే సృష్టి. దేవేచ్ఛ లేనిదే సృష్టి జరుగదు. అతడు సహజముగ కాముడు కాదు.
ఇతరుల యిచ్ఛలను మన్నించుటయే పెద్దరికము. స్వంత యిచ్ఛ కలవారు పెద్దలు కారు. తమకుగ ఏ యిచ్ఛయు లేకున్నను ఇతరుల యిచ్ఛలను పరిపూర్తి గావించుచు వారిని కూడ పరిపూర్ణులను చేయుట పెద్దరికము. అట్టి యిచ్చ కామమున బడదు.
అది కామమును మించిన యిచ్ఛ. అందువలన మహా కామము. అట్టి మహా కామము కలవాడు శివుడు. దానిని పరిపూర్తి గావించుటకు సహకరించునది శ్రీమాత. సంకల్పము శ్రీమాతదైనపుడు, సహకారము శివుని దగును. కావున మహాకాముని కామె పట్టమహిషి.
శివ సంకల్పమగు మహాకామమునకు స్వరూపము, స్వభావము ఆమెయే. సంకల్పము కూడ ఆమెయే. శివుని హృదయము న ఆమెదే అగ్రస్థానము కావున పట్టమహిషి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 233 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Mahā-kāmeśa-mahiṣī महा-कामेश-महिषी (233) 🌻
The consort of Mahā Kāmeśvara is known as Mahā Kāmeśvarī. Mahiṣī means queen, the queen of Śiva.
Vāc Devi-s after describing the great and terrible dissolution immediately mention about an auspicious scene, the Kāmeśvarī form of Lalitāmbikā. But who is that Kāmeśvarī? The next nāma answers this.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
10 Mar 2021
కావాల్సింది సృజనాత్మకత
🌹. కావాల్సింది సృజనాత్మకత 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
✍️. భరత్, 📚. ప్రసాద్ భరద్వాజ
క్రొత్తవాటి కోసం పాతవి కచ్చితంగా అంతరించాలి. దయచేసి, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఆ పాతవి మీలో ఉన్నవే కానీ, లేనివి కాదు. అంటే, నేను చెప్పేది మీ లోపల ఉన్న కుళ్ళిన పాత భావాలు అంతరించాలని మాత్రమే.
కానీ, మీలో లేని వాటి గురించి, పాత సామాజిక నిర్మాణం గురించి నేను మాట్లాడట్లేదు. పాత భావాలతో నిండిన మీ మానసిక స్థితి గురించి నేను మాట్లాడుతున్నాను. నూతన భావాలతో కూడుకున్న మానసిక స్థితి మీలో కలిగేందుకు ఆ పాత మానసిక స్థితి అంతరించాలి.
అలా ఒక్క మనిషి మారినా, అతని ఉనికి అనేకమంది తమ జీవితాలను ఊహించలేనంత, నమ్మలేనంత అపురూపంగా మార్చుకునేందుకు ప్రేరేపిస్తుంది. అప్పుడు అనేకమంది అలా మారడం ప్రారంభిస్తారు.
కాబట్టి, పేరాశల నుంచి, పురాతన ఆదర్శవాదాల నుంచి బయటపడి, నిశ్శబ్దంగా, ధ్యాన పూర్వకంగా, ప్రేమాస్పదునిగా మారి, ఆనందంగా నాట్యం చేస్తూ జరిగే దానిని గమినించండి. త్వరలో అనేకమంది, ఆ తరువాత ఇంకా చాలామంది మీతో కలిసి నాట్యం చేస్తారు. ఇదే నేను మీకు బోధించే తిరుగుబాటు.
నేను రాజకీయాలకు పూర్తిగా వ్యతిరేకిని, కాబట్టి, వాటిపై నాకు ఎలాంటి ఆసక్తిలేదు. అవును, కొత్త వాటికోసం పాతవి నశించాలి. అది మీలో జరగాలి. అప్పుడే అక్కడ కొత్తవి పుట్టుకొస్తాయి. కొత్తవి ఎప్పుడూ అంటువ్యాధి లాంటివే. అందుకే అవి త్వరగా ఇతరులకు వ్యాపిస్తాయి.
ఆనందం ఒక అంటువ్యాధి. మీరు నవ్వడం ప్రారంభిస్తే మీతో పాటు ఇతరులు కూడా నవ్వడం ప్రారంభిస్తారు. అలాగే ఏడుపు కూడా. మనం విడిగా లేము. అందరం కలిసే ఉన్నాం. కాబట్టి, ఎవరి హృదయం ఉప్పొంగినా అది ఇతరుల హృదయాలను- ఒక్కొక్క సారి సుదూర తీరాలలో ఉన్న హృదయాలను కూడా- తాకుతుంది.
ఏదో విధంగా మార్మికమైన మార్గంలో నా నవ్వు, నా ప్రేమ మిమ్మల్ని చేరింది, నా ఉనికి మీ ఉనికిని తాకింది. అందుకే అనేక ప్రయాసలుపడి చాలా దూరాలనుంచి కూడా మీరు ఇక్కడకొచ్చారు. ప్రతి దానికి వ్యతిరేకంగా పోరాడమని నేను మీకు బోధించట్లేదు. అలా చేస్తే మీరొక అభివృద్ధి నిరోధకునిగా మారతారు.
ఎందుకంటే, మీ చర్యకు ప్రతి చర్య అదే. అప్పుడు మీకు వ్యతిరేకమైన దాని ఉచ్చులో మీరు చిక్కుకుంటారు. అది మిమ్మల్ని శాసిస్తుంది- బహుశా ప్రతికూల మార్గంలో కావచ్చు. అయినా అది మిమ్మల్ని శాసిస్తుంది.
నేను దేనికీ, ఎవరికీ వ్యతిరేకిని కాను. మీరు పూర్తి స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటానే కానీ, ‘‘దేని నుంచో స్వేచ్ఛ’’ పొందాలని నేను కోరుకోను. తేడాను గమనించండి.
- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
10 Mar 2021
దేవాపి మహర్షి బోధనలు - 54
🌹. దేవాపి మహర్షి బోధనలు - 54 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 36. మహర్షి దేవాపి సాన్నిధ్యము - 10 🌻
మహర్షి జ్వాలాకూలుని బోధనలను ఆరంభదశలో యథా తథముగా పదములను, వాక్యములను వ్రాయుచుండెడి దానను. ఆయన ఎక్కడి నుండి తమ బోధనలను ప్రసారము చేయుచుండిరో నాకు తెలిసెడిది కాదు. ఆయన వాగ్ధ్వని మాత్రము స్పష్టముగా నాలోన వినిపించెడిది. ఈ విధముగా నా మెదడును శ్రమతో తీర్చిదిద్దిన నా గురుదేవులు దేవాపి మహర్షికి సదా నేను కృతజ్ఞురాలిని.
నా పిన్నతనమునుండి నన్ను రకరకములుగా తీర్చిదిద్ది సాంప్రదాయపు ఊబిలో నున్న నా మనోతత్వము నుద్ధరించి, నా మెదడును చైతన్యవంతము గావించి, దానికి దూరశ్రవణము చేయగల అర్హత నేర్పరచినారు. పదుల సంవత్సరముల వినయ పూర్వక శిక్షణము కారణముగా నే నీనాడు దూరశ్రవణము చేయుచూ మహత్తరమైన జ్ఞానమును విని, వ్రాయగలుగుట నేర్చితిని.
జ్ఞానమాత బ్లావెట్ స్కీ యిట్లే ముందు తరమున 'తెర తొలగింపు', 'గుప్తవిద్య' అను యుద్రంథములను ప్రపంచమున కందించినది. అదే కోవలో నేను కూడ పయనించు చుంటినని తెలిసి కృతజ్ఞతా పూర్వకముగా, భక్తి, వినయము, శ్రద్ధలతో వ్రాతపని చేయుచుంటిని. వ్రాతపని బాగుగా ముందుకు సాగిన సమయమున నా మనస్సు మహర్షి జ్వాలాకూలుని మనస్సుతో పూర్తిగా అనుసంధానమైనది. అది కారణముగా పదములు, వాక్యములు అందుకొను స్థితినుండి భావము నందుకొని భాషను ఏర్పరచు స్థితికి ఎదిగితిని.
అటుపైన బీజప్రాయమైన భావములను జ్వాలాకూలులందించు చుండగా పేరాలుగా వ్రాయుట వరకూ ఎదిగితిని. ఇందు నా కృషి, నా గురువనుగ్రహము రెండునూ సమపాళ్ళలో ప్రాముఖ్యము కలిగియున్నవని కూడా తెలిసినది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
10 Mar 2021
వివేక చూడామణి - 43 / Viveka Chudamani - 43
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
🍀. 14. శరీరము - 1 🍀
154. మన శరీరము ఆహార సేవనము వలన ఉత్పత్తి అయినది. అది భౌతిక పదార్థములతో కప్పబడినది. ఈ శరీరము ఆహారముతో జీవించి, ఆహారము సేవించనిచో నశిస్తుంది. ఇది చర్మము, మాంసము, ఎముకలు మరియు వ్యర్థములతో నిండి ఎప్పటికీ స్వచ్ఛతను పొందలేదు. ఆత్మను తెలుసుకొనలేదు.
155. ఈ శరీరము జన్మించక ముందు లేదు. మరణించిన తరువాత కూడా లేదు. కేవలము కొద్ది కాలము మాత్రమే జీవించి ఉంటుంది. అది ఎల్లప్పుడు మార్పుచెందుతూ అస్థిరముగా ఉంటుంది. ఇది సామాన్యమైనది కాదు. ఎల్లప్పుడు మార్పు చెందుతూ ఉంటుంది. ఇది ఇంద్రియాలతో నిండిన ఒక పింగాణి జాడి వంటింది. అలాంటిది ఎలా ఆత్మ స్థితిని కలిగి ఉంటుంది. మార్పులు అన్ని శరీర భాగాలలో కన్పిస్తుంటవి.
156. ఈ శరీరము కాళ్ళు, చేతులు మొదలగు అంగములతో కూడి ఉన్నది. ఇది ఆత్మ కాదు. ఎవరైతే ఈ శరీరములోని ఒకటిరెండు భాగాలు లేనప్పటికి అతడు జీవించి ఉంటాడు, అతని ఇతరశరీర భాగాలు పనిచేస్తూనే ఉంటాయి. ఈ శరీరము ఇతరుల పాలనలో నడుచుట వలన అది ఆత్మ కాదు. ఆత్మయే అన్నింటిని పరిపాలించేది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 43 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 The Body - 1 🌻
154. This body of ours is the product of food and comprises the material sheath; it lives on food and dies without it; it is a mass of skin, flesh, blood, bones and filth, and can never be the eternally pure, self-existent Atman.
155. It does not exist prior to inception or posterior to dissolution, but lasts only for a short (intervening) period; its virtues are transient, and it is changeful by nature; it is manifold, inert, and is a sense-object, like a jar; how can it be one’s own Self, the Witness of changes in all things ?
156. The body, consisting of arms, legs, etc., cannot be the Atman, for one continues to live even when particular limbs are gone, and the different functions of the organism also remain intact. The body which is subject to another’s rule cannot be the Self which is the Ruler of all.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 332, 333 / Vishnu Sahasranama Contemplation - 332, 333
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 332, 333 / Vishnu Sahasranama Contemplation - 332, 333 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻332. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ🌻
ఓం వాసుదేవాయ నమః | ॐ वासुदेवाय नमः | OM Vāsudevāya namaḥ
వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ
వాసుర్వసతి వాసయత్యాచ్ఛాదయతి వా జగత్ ।
దీవ్యతీక్రీడతే దేవః కేశవో విజిగీషతే ॥
అన్నిటియందును తాను అంతర్యామిగా వసించును. అన్నిటినీ తనయందు వసింపజేయును. అన్నిటినీ తన రక్షణతో కప్పియుంచును. ఈ వ్యుత్పత్తులచే 'వాసుః' అను శబ్దము నిష్పన్నమగును. 'దివ్' అను ధాతువునకుగల అర్థములను బట్టి 'దీవ్యతి' అనగా జగత్సృష్టి స్థితి లయాదివ్యాపారము నిర్వర్తించుట రూపమున క్రీడించుచుండును. దుష్టులను జయింపగోరుచుండును. జగములందు జీవరూపమున వ్యవహరించుచుండును. స్వయంప్రకాశుడుగా ప్రకాశించుచుండును. స్తుతించబడుచుండును. సంచరించుచుండును. అను వీనిలో ఏయర్థముతోనైననూ 'దేవః' అను వ్యవహారము విష్ణునందు చెల్లును.
:: మహాభారతము - శాంతి పర్వణి మోక్షధర్మ పర్వ ఏకచత్వారింశదధికత్రిశతతమోఽధ్యాయః ::
ఛాయదామి నారా ఇతి ప్రోక్తా ఆపో వై నరసూనవః ।
సర్వభూతాధివాసశ్చ వాసుదేవస్తతో హ్యహమ్ ॥ 41 ॥
నేనే సూర్యునివలె అయి సూర్యుడు తన కిరణములతోవలె సర్వ జగత్తును కప్పివేయుచున్నాను. నేను సర్వ భూతములకును అధివసించు ఆశ్రయస్థానము కూడా అయి యున్నాను. అందువలన నేను వాసుదేవుడనుగా తత్త్వజ్ఞులచే తలచబడుచున్నాను.
:: మహాభారతము - ఉద్యోగ పర్వణి యానసంధి పర్వ సప్తతితమోఽధ్యాయః ::
వసనాత్ సర్వభూతానాం వసుత్వాద్ దేవయోనితః ।
వాసుదేవస్తతో వేద్యో బృహత్త్వాద్ విష్ణురుచ్యతే ॥ 3 ॥
సర్వభూతములను వాసించుట లేదా కప్పివేయుట వలనను (వసువు), అన్ని భూతములును తనయందు వసించువాడగుటచే (వాసు), దేవతలకును మూలస్థానము అగుటవలననూ (దేవః) - ఈ హేతువులచే అతడు 'వాసుదేవః' అనబడుచున్నాడని తెలియదగినది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 332🌹
📚. Prasad Bharadwaj
🌻332. Vāsudevaḥ🌻
OM Vāsudevāya namaḥ
695. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ
709. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ
वासुर्वसति वासयत्याच्छादयति वा जगत् ।
दीव्यतीक्रीडते देवः केशवो विजिगीषते ॥
Vāsurvasati vāsayatyācchādayati vā jagat,
Dīvyatīkrīḍate devaḥ keśavo vijigīṣate.
Vāsuḥ/वासुः implies that He is all pervading and everything is resting in Him. It also means that He envelopes everything in His protection. From meanings of the root 'Div/दिव्' we can infer 'Divyati/दिव्यति' or the One who is engaged in creation, sustenance and dissolution of universe. As the One who is ever wanting to subdue demonic forces or He being the life of creation or He being effulgent or as the One who is eulogized or as being a Pervador - the word 'Devaḥ/देवः' is aptly suitable for addressing Lord Viṣṇu.
:: महाभारते शान्ति पर्वणि मोक्षधर्म पर्वणि एकचत्वारिंशदधिकत्रिशततमोऽध्यायः ::
छायदामि नारा इति प्रोक्ता आपो वै नरसूनवः ।
सर्वभूताधिवासश्च वासुदेवस्ततो ह्यहम् ॥ ४१ ॥
Mahābhāra - Book 12, Mokṣadharma Section, Chapter 341
Chāyadāmi nārā iti proktā āpo vai narasūnavaḥ,
Sarvabhūtādhivāsaśca vāsudevastato hyaham. 41.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
स्कन्दः स्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः ।वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः ॥ ३६ ॥
స్కన్దః స్కన్దధరో ధుర్యో వరదో వాయువాహనః ।వాసుదేవో బృహద్భానురాదిదేవః పురన్దరః ॥ ౩౬ ॥
Skandaḥ skandadharo dhuryo varado vāyuvāhanaḥ ।Vāsudevo br̥hadbhānurādidevaḥ purandaraḥ ॥ 36 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 333 / Vishnu Sahasranama Contemplation - 333🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻333. బృహద్భానుః, बृहद्भानुः, Br̥hadbhānuḥ🌻
ఓం బృహద్భానవే నమః | ॐ बृहद्भानवे नमः | OM Br̥hadbhānave namaḥ
బృహంతో భావనో యస్య చంద్రసూర్యాతిగామినః ।
తైర్విశ్వం భాసయతి యఃసబృహద్భానురుచ్యతే ॥
చంద్ర సూర్యాదులను కూడా చేరునట్టి పెద్ద కిరణములు ఎవనికి కలవో - వానిచే ఎవడు విశ్వమును భాసింపజేయుచున్నాడో అట్టి ఆ విష్ణుపరమాత్మ 'బృహద్భానుః' అని చెప్పబడును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 333🌹
📚. Prasad Bharadwaj
🌻333. Br̥hadbhānuḥ🌻
OM Br̥hadbhānave namaḥ
Br̥haṃto bhāvano yasya caṃdrasūryātigāminaḥ,
Tairviśvaṃ bhāsayati yaḥsabr̥hadbhānurucyate.
बृहंतो भावनो यस्य चंद्रसूर्यातिगामिनः ।
तैर्विश्वं भासयति यःसबृहद्भानुरुच्यते ॥
His mighty powerful rays penetrate into sun, moon and illumine them. He illumines universe by them. So, He is said to be 'Br̥hadbhānuḥ'.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
स्कन्दः स्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः ।वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः ॥ ३६ ॥
స్కన్దః స్కన్దధరో ధుర్యో వరదో వాయువాహనః ।వాసుదేవో బృహద్భానురాదిదేవః పురన్దరః ॥ ౩౬ ॥
Skandaḥ skandadharo dhuryo varado vāyuvāhanaḥ ।Vāsudevo br̥hadbhānurādidevaḥ purandaraḥ ॥ 36 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
10 Mar 2021
10-MARCH-2021 MORNING
దత్తాత్రేయ మంత్రాత్మక శ్లోకములు
దత్తాత్రేయ మంత్రాత్మక శ్లోకములు :-
సర్వబాధా నివారణకు :-
సమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయఛ్ఛ మే ||
#సర్వరోగ నివారణకు :-
సమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో సర్వరోగ ప్రశమనం కురు శాంతిం ప్రయఛ్ఛ మే ||
#సర్వకష్ట నివారణకు :-
అనసూయాత్రిసంభూతో దత్తాత్రేయో దిగంబరః స్మర్తృగామీ స్వభక్తానాం ఉద్దర్తా భవసంకటాత్ ||
#దారిద్ర్య నివారణ కోసం :-
దరిద్రవిప్రగేహే యః శాకం భుక్త్వోత్తమశ్రియం దదౌ శ్రీదత్తదేవ సదా దారిద్ర్యాత్ శ్రీప్రదోఽవతు ||
#సంతానము కోసం :-
దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వా మృతం సుతం యో భూదభీష్టదః పాతు సఽనః సంతానవృద్దికృత్ ||
#సౌభాగ్యము కోసం :-
|| జీవయామాస భర్తారం మృతం సత్యాహి మృత్యుహ మృత్యుంజయః స యోగీంద్రః సౌభాగ్యం మే ప్రయఛ్ఛతు ||
#ఋణ విముక్తి కోసం :-
|| అత్రేరాత్మ ప్రదానేన యో ముక్తో భగవాన్ ఋణాత్ దత్తాత్రేయం తమీశానం నమామి ఋణముక్తయే ||
#సర్వపాప నివారణకు :-
|| అత్రిపుత్రో మహాతేజా దత్తాత్రేయో మహమునిః తస్యస్మరణమాత్రేన సర్వపాపైః ప్రయచ్యతే ||
#దత్తాత్రేయ అనుగ్రహం కోసం :-
|| అనసూయాసుత శ్రీశ జనపాతకనాశన దిగంబర నమో నిత్యం తుభ్యం మే వరదో భవ ||
#విద్య కోసం :-
|| విద్యత్సుత మవిద్యం య ఆగతం లోకనిందితం భిన్నజిహ్వం బుధం చక్రే శ్రీదత్తః శరణం మమ ||
#పోయిన సొమ్ము తిరిగి దొరకడం కోసం :-
|| కార్తవీర్యార్జునో నామ రాజా బాహుసహస్రవాన్ తస్యస్మరణమాత్రేణ హృతం నష్టంచ లభ్యతే ||
ప్రతీ రోజూ వేయి జపం చేయాలి, 40 రోజుల పాటు చేయాలి. అన్ని కోరికలు తీరుతాయి.
- - - - - - - --- - - - - - - - - - - - -- - - - - - - - - - -
www.incarnation14.wordpress.com
www.dailybhakthimessages.blogspot.com
www.eternal-wisdom-teachings.blogspot.com
www.prasadtheosophy.blogspot.com
www.gita-telugu-english.blogspot.com
Search these Hastags on Facebook: #ChaitanyaVijnanam #PrasadBhardwaj
#ChaitanyaVijnanam : www.facebook.com/hashtag/chaitanyavijnanam
#PrasadBhardwaj : www.facebook.com/hashtag/prasadbhardwaj
శ్రీ లలితా సహస్ర నామములు - 45 / Sri Lalita Sahasranamavali - Meaning - 45
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 45. నిత్యముక్తా, నిర్వికారా, నిష్ప్రపంచా, నిరాశ్రయా ।
నిత్యశుద్ధా, నిత్యబుద్ధా, నిరవద్యా, నిరంతరా ॥ 45 ॥ 🍀
🍀 144. నిత్యముక్తా -
ఎప్పుడును సంగము లేనిది.
🍀 145. నిర్వికారా -
ఏ విధమైన వికారములు లేనిది.
🍀146. నిష్ప్రపంచా -
ప్రపంచముతో ముడి లేనిది.
🍀 147. నిరాశ్రయా -
ఆశ్రయము లేనిది లేదా అవసరము లేనిది.
🍀 148. నిత్యశుద్ధా -
ఎల్లప్పుడు శుద్ధమైనది.
🍀 149. నిత్యబుద్ధా -
ఎల్లప్పుడు జ్ఞాన స్వరూపురాలు.
🍀 150. నిరవద్యా -
చెప్పరానిది అంటూ ఏమీ లేనిది లేదా నిందించుటకూ ఏదీ లేనిది.
🍀 151. నిరంతరా -
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 45 🌹
📚. Prasad Bharadwaj
🌻 45. nityamuktā nirvikārā niṣprapañcā nirāśrayā |
nityaśuddhā nityabuddhā niravadyā nirantarā || 45 || 🌻
🌻 144 ) Nithya muktha -
She who is forever free of the ties of the world
🌻 145 ) Nirvikara -
She never undergoes alteration
🌻 146 ) Nishprapancha -
She who is beyond this world
🌻 147 ) Nirasraya -
She who does not need support
🌻 148 ) Nithya shuddha -
She who is forever clean
🌻 149 ) Nithya bhuddha -
She who is for ever knowledge
🌻 150 ) Niravadhya -
She who can never be accused
🌻 151 ) Niranthara -
She who is forever continuous
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
09 Mar 2021
భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 190
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - నాల్గవ దివ్య యానము - సద్గురువు -అవతార పురుషుడు. - 4 🌻
714 - 717. మిగిలిన 48 గురూ బ్రహ్మి భూతులు 7000 ల లో వారు కాదు .ఈ 48 గురు దూరంగా అజ్ఞాతముగా నుందురు. వీరి దివ్యత్వము పట్ల ప్రజలు ,ఆజ్ఞలై యుందురు. వీరందరూ తక్కిన 8 గురు వలె "అహం బ్రహ్మాస్మి" దివ్య స్థితిని అనుభవించు చందురు.
ఈ 48 గురూ సమయ నిరీక్షణ జాబితాలో నుందురు. ఉద్యోగము ను నిర్వహించు 8 గురిలో ఒకరు గాని ఇద్దరు గాని మరణించినచో ,వారి స్థానంలో వీరు ప్రవేశించుటకు సంసిద్ధులై యుందురు .
7000 మంది సభ్యులు గల మహీ పీఠంలో ఈ 8 గురును ఉన్నత పదవి యందుందురు . 8 గురి లో ఐదుగురు సద్గురువులు. ఈ పంచ సద్గురువులు యావత్తు మానవ జాతి యొక్క ఆధ్యాత్మిక విమోచనకై పాటుపడుచుందురు.
మిగిలిన ముగ్గురును బ్రహ్మీ భూతులు వీరు దేహదారులై ఉన్నప్పటికీ వారికి మానవుల పట్ల ఆధ్యాత్మిక కర్తవ్యం లేదు. అయినప్పటికీ వారిని దరి చేరిన వారికి వీరు ఆధ్యాత్మిక ప్రయోజనమును కలిగించు మూల స్థానమై యుందురు.
718. ప్రతి యుగమందును పదునొకండవ కాలము లో వచ్చు అవతారములో కలసి 700 మంది సంఖ్య.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
09 Mar 2021
భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 248
🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 248 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. జడమహర్షి - 3 🌻
12. మనలో ఎవరికైనా చావు గురించి జ్ఞాపకం ఉందా? ఎవరికీ లేదు. అందుకనే సుఖంగా ఉన్నాము. కానీ దాని లక్షణము ఇలా ఉంటుందని పెద్దలు చెప్పినప్పుడు, పునర్జన్మ తనకు వద్దు అనేటటువంటి తీవ్రమయిన సంకల్పం మినిషికి కలగాలి. అదే వివేకం.
13. అందుకనే జడమహర్షి చెపుతున్నాడు ఇదంతా. “మోక్షం కోసమయినా, మృత్యువాతను తప్పించుకోవటం కోసమయినా మనుష్యుడు పురంజన్మ లేకుండా చేసుకోవాలి. మృత్యువు యొక్క బాధ అంత భయంకరమైనది.
14. ముక్తి యందు ఆసక్తి అనేది ఉన్నాలేక పోయినా, అది వేరే విషయం. మృత్యువు యొక్క బాధ ఇలా ఉంటుందని పెద్దలు చెపుతున్నారు. ఏమయినప్పటికీ మరణించిన తరువాత యముడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన పుణ్యానికి పుణ్యఫలం, పాపానికి పాపఫలం ఇస్తాడు. అదెట్లాగూ తప్పదు.
15. కానీ, ఇది అయిపోయిన తరువాత జీవుడు మళ్ళీ ఇంకొక పురుషుడి వీర్యంలో ప్రవేశిస్తాడు. స్త్రీగర్భంలోకి వెళతాడు, మళ్ళీ పుడతాడు. అప్పటికే అంతా మరచిపోతాడు. యమదర్శనం, చావు, దుఃఖము, కష్టము, పోయిన జన్మలో తల్లి తండ్రులు, వళ్ళెవరు వీళ్ళెవరు – అన్నీపోతాయి. మరచిపోతాడు. అవి ఏవీ మిగలవు. పలక మీద వ్రాసి, తడితో చెరిపేస్తే ఏం మిగులుతుందో, ఇదీ అంతే! అతడి మనస్సులో ఏమీ ఉండదు.
16. “కాబట్టి ఇదంతా ఒక భయంకరమయిన మాయాజాలం. ఈ వలలో తగులుకున్న వాళ్ళు బయటికి రాలేరు. ఎప్పుడయితే గురువును ఆశ్రయించి బోధ పొందుతాడో, అప్పుడే ఇది తప్పుతుంది. గురువును ఆశ్రయిస్తే, మార్గాన్ని అన్వేషించమనేదే ఆయన చెప్పవలసింది. ఎందుకంటే హితబోధ ఎవ్వరయినా చేయగలరు.
17. హితైషి ఏం చెపుతాడంటే, నీ విషయం అన్వేషించుకో! నీ మంచి, నీ భవిష్యత్తు ఆలోచించుకో! సమయం ఆసన్నమవుతున్నది. దినదినము మృత్యువు దగ్గరికి వెళుతున్నావు. జాగ్రత్తపడు – చెప్పినవాడే నీకు ఆప్తుడనుకో.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
09 Mar 2021
శ్రీ శివ మహా పురాణము - 368
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
96. అధ్యాయము - 08
🌻. నారద హిమాలయ సంవాదము - 3 🌻
ఓ మహర్షీ!ఇచటకు విచ్చేసి నాతో ప్రీతిగా మాటలాడే కిన్నరుల ముఖము నుండి నేను అనేక పర్యాయములు ఇట్లు వినియుంటిని. ఈ మాట అసత్యము అనుట నిశ్చయమేనా? (40). ఆయనకు హరుడని పేరు గలదు. ఆ పేరును బట్టి (హరించువాడ హరుడు) ఆయన అట్టి వాడే అయి ఉండునని లోకములో వినబడు చున్నది. ఆయన పూర్వము ఒక ప్రతిజ్ఞను చేసినాడట. దానిని చెప్పెదను వినుము (41).
'దక్షపుత్రీ! సతీ! ప్రియురాలా! నిన్ను తక్క మరియొక స్త్రీని నేను భార్యగా స్వీకరించను. వరించను. నేను సత్యమును చెప్పుచున్నాను' (42). ఇట్లు ఆయన పూర్వమే సతీదేవి ఎదుట ప్రతిజ్ఞను చేసియున్నాడు. ఆమె మరణించినది. ఇపుడాతడు మరియొక స్త్రీని ఎట్లు వివాహమాడగలడు? (43)
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఆ హిమవంతుడు నీ ఎదుట ఇట్లు పలికి మిన్నకుండెను. ఓ దేవర్షీ! నీవా మాటను విని,యధార్ధమును నిశ్చయించి, అతనితో నిట్లంటివి (44).
నారదుడిట్లు పనికెను-
ఓ పర్వతరాజా! మహాత్మా! నీవు చింతిల్లకుము.న నీ కుమార్తె యగు ఈ కాళియే పుర్వము దక్ష పుత్రియై జన్మించెను (45) సర్వకాలములలో సర్వమంగళములనిచ్చే సతియను పేర ఆమె అపుడు ప్రసిద్ధిగాంచెను. ఆ సతి దక్ష పుత్రియై రుద్రునకు పత్ని ఆయెను (46).
ఆ సతి తండ్రి చేసిన యజ్ఞములో శంకరునకు అనాదరము జరుగుటను గాంచి కోపమును చెంది దేహమును త్యజించెను (47). జగన్మాతయగు ఆ శివాదేవియే మరల నీ గృహములో జన్మించినది. ఈ పార్వతి శివుని పత్ని యగుననుటలో సందేహము లేదు(48).
ఓ సహర్షీ! నీవు ఈ వృత్తాంతమునంతనూ ఆ పర్వత రాజునకు చెప్పితివి. నీవు చెప్పిన ఆ పూర్వ చరిత్ర పార్వతికి మహానందమును కలిగించెను(49). హిమవంతుడు. ఆయన భార్య,కుమారులు మహర్షి ముఖము నుండి కాళిక యెక్క ఆ పూర్వ వృత్తాంతము నంతయూ విని, సంశయములను వీడిరి (50).
అపుడు నారదుని ముఖము నుండి ఆ గాధను విని కాళిక సిగ్గుతో తలను వంచుకొనెను.ఆమె ముఖము చిరునవ్వుతో విప్పారెను (51). ఆ చరిత్రను విని హిమవంతుడు ఆమెను చేతితో స్పృశించి, శిరస్సు పై ముద్దాడి తన ఆసన సమీపములో కూర్చుండబెట్టు కొనెను (52).
ఓ మహర్షీ! అచటనున్న అమెను చూచి నీవు మరల ఇట్లు పలికితివి. నీ పులుకులు హిమవంతునకు, మేనకు, వారి కుమారులకు ఆనందమును కలిగించినవి(53).
ఓ పర్వతరాజా! ఈ పైన ఈమె యొక్క సింహాసనము సర్వదా శివుని ఊరువులు కాగలవు(54). నీ కుమార్తె శవుని ఊరువులు అనే ఆసనమును సర్వకాలముల యందు పొంది, ఎవ్వరి తృష్టికి గాని, మనస్సుల కైననూ గాని గోచరము గాని స్ధానమును పొందగలదు (55).
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఓ నారదా! నీవు ఈ విధముగా పర్వతరాజుతో ఉదారమగు వచనములను పలికి వెంటనే ఆనందముతో స్వర్గమునకు వెళ్లి యుంటివి. ఆ హిమవంతుడు ఆనందముతో నిండిన హృదము గలవాడై సర్వ సంపదలతో నలరారు తన గృహమునకు వెళ్లెను(56).
శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో నారద హిమాలయ సంవాద వర్ణనమనే ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (8).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
09 Mar 2021
గీతోపనిషత్తు -168
🌹. గీతోపనిషత్తు -168 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚
శ్లోకము 11
🍀 11. స్థిరాసనము -2 - ఆసన మనగ కూర్చుండు పద్దతి. అది స్థిరముగ, నిశ్చలముగ నుండవలె నన్నచో దేహమునకు సుఖమిచ్చునదిగ నుండవలెను. లేనిచో సాధకు డటునిటు కదలుట తప్పనిసరియై, మనస్సును ఆత్మపై లగ్నము చేయుటకు వీలుపడదు. ధ్యానమునకు ప్రధానముగ వలసినది, మనస్సును ఆత్మపై లగ్నము చేయుట. అటుపైన మనస్సును స్థిరమగు ప్రదేశమున అంత రంగమున లగ్నము చేయుట నిజమగు ఆసన మగును. మనసును హృదయము నందు గాని, భ్రూమధ్యము నందు గాని స్థిరముగ లగ్నము చేయుటకు ప్రయత్నము సాగవలెను. 🍀
3. సాధకుడు స్థిరాసనమును ఏర్పరచుకొనవలెను. ఆసన మనగ కూర్చుండు పద్దతి. అది స్థిరముగ, నిశ్చలముగ నుండవలె నన్నచో దేహమునకు సుఖమిచ్చునదిగ నుండవలెను. లేనిచో సాధకు డటునిటు కదలుట తప్పనిసరియై, మనస్సును ఆత్మపై లగ్నము చేయుటకు వీలుపడదు. పూర్వకాలమున పద్మాసనము వేసు కొనెడివారు.
అట్లే వీరాసనము కూడ వాడుక యందుండెడిది. ప్రస్తుతము జీవన విధానము ననుసరించి నేలపై కూర్చుండు అలవాటు తప్పుటచే, ఎవ్వరును పై తెలిపిన విధముగ కూర్చుండుట లేదు.
ఆసన మేదైనను అది ప్రధానముగ దేహమునకు స్థిరత్వము నీయవలెను. భగవద్గీత యందు స్థిరమాసనమే తెలిపిరి గాని, ప్రత్యేకముగ ఏ ఆసనమును నిర్దేశించ లేదు. ధ్యానమునకు ప్రధానముగ వలసినది, మనస్సును ఆత్మపై లగ్నము చేయుట.
ఆ ప్రయత్నమున దేహమున కంతరాయము కలిగింపరాదు. ఇది ప్రధానమని సాధకుడు తెలియవలెను. దేహస్థిరత్వము, మనో స్థిరత్వము ధ్యానమునకు ప్రధానమగు లక్షణములు.
అందువలన కొందరు సద్గురువులు పరుండబెట్టి ధ్యానము నిత్తురు. మరి కొందరు కూర్చుండబెట్టి నిత్తురు. ఆసన మేదైనను ఒక గంట సమయము దేహమును కదపనవసరము లేనిదై యుండవలెను.
అటుపైన మనస్సును స్థిరమగు ప్రదేశమున అంత రంగమున లగ్నము చేయుట నిజమగు ఆసన మగును. మనసును హృదయమునందు గాని, భ్రూమధ్యమునందు గాని స్థిరముగ
లగ్నము చేయుటకు ప్రయత్నము సాగవలెను.
అట్టి స్థిరత్వము మనస్సునకు కలుగుటకు వలసిన లక్షణము లన్నియు ముందు శ్లోకములలో ఇప్పటికే తెలుపబడినవి. వాటిని పాటించినపుడే మనస్సునకు స్థిరాసనము ఏర్పడును. ఇట్లు ఈ శ్లోకమున స్థిరాసనము దేహమునకు, మనస్సునకు కూడ సూచింపబడినది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
09 Mar 2021
శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 232 / Sri Lalitha Chaitanya Vijnanam - 232
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 232 / Sri Lalitha Chaitanya Vijnanam - 232 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
🍀 57. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ ।
మహాకామేశ మహిషీ, మహాత్రిపుర సుందరీ ॥ 57 ॥🍀
🌻 232. 'మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ' 🌻
మహా కల్పమునందు మహేశ్వరుడు చేయు మహా తాండవమునకు సాక్షిణి శ్రీమాత అని అర్థము.
శివ నర్తనమే సృష్టి స్థితి లయ వర్తనము. శివ నర్తనము ఆగక సాగుచునే యుండును. సృష్టికి మూల కారణము శివ నర్తనము. స్థితికి, పోషణమునకు ఆధారము శివ నర్తనము. సృష్టి లయమగుటకు కూడ శివ నర్తనమే కారణము. లయమగు సృష్టి మరల సృష్టిగ నేర్పడు విరామ సమయము నందు కూడ శివ నర్తన మున్నది.
అందులకే శివుని నర్తనము మహా నర్తనమైనది. త్రికాలములను మించి వర్తించు నర్తన మిది. నర్తించువాడు మహేశ్వరుడు. అతని నర్తనము మహా తాండవము. ప్రళయ కాలమున కూడ వుండునది ఈ నర్తనము.
శ్రీమాత మహేశ్వరి అనగా ఆమె కూడ ప్రళయ కాలమున వుండునదియే. వీరిరువురును శాశ్వతులు. కావున ప్రళయ కాలమున శివుని తాండవమునకు ఆమె ఒక్కతియే సాక్షిణి. ఇక ఎవ్వరునూ ఆ నర్తనమునకు సాక్ష్యము లేరు. ఏకైక సాక్షిణి కావున ఈ నామము కలిగినది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 232 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Maheśvara-mahākalpa-mahātāṇḍava-sakṣiṇī महेश्वर-महाकल्प-महाताण्डव-सक्षिणी (232) 🌻
Śiva dances fiercely at the time of great dissolution (mahākalpa) and none was around except Lalitāmbikā, who just witnesses this terrible act of Śiva. The great dissolution means the universe ceases to exist and nothing remains except Śiva and Śaktī.
The dissolution is called the fourth act of the Brahman, the other three being creation, sustenance and destruction. The difference between destruction and dissolution is noteworthy. Destruction is transmigration of a soul. The soul leaves the body to be born again.
Death is only for the physical body. Dissolution or annihilation or the deluge means the death of entire physical body as well as all the souls. When dissolution happens, nothing exists. Everything dissolves into Śiva in the presence of Śaktī, who witnesses the great dissolution.
In some of the texts Kālarātrī is referred to as the wife of Bhairava. Kālarātrī Devi is both a destructor and a protector. Her mantra is considered as extremely powerful and said to give immediate results (refer nāma 491 for further details on Kālarātrī).
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
09 Mar 2021
‘‘ఎంపిక లేని ఎరుకతోనే పూర్తి స్వేచ్ఛ’’
🌹.‘‘ఎంపిక లేని ఎరుకతోనే పూర్తి స్వేచ్ఛ’’ 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
✍️. భరత్, 📚. ప్రసాద్ భరద్వాజ
ఒకడు ఒక గురువును కలిసి ‘‘మనిషి పూర్తి స్వతంత్రుడు, స్వేచ్ఛాపరుడేనా లేక అందుకు పరిమితులేమైనా ఉన్నాయా లేక స్వేచ్ఛను హరించే అలాంటి పరిమితులను మించిన దేవుడు, విధి, అదృష్టం, ప్రారబ్ధం లాంటివి ఉన్నాయా?’ ’అని అడిగాడు.
వెంటనే ఆ గురువు తనదైన పద్ధతిలో ‘‘లేచి నిలబడు’’ అన్నాడు.
వెంటనే అతను గురువు చెప్పినట్లు లేచి నిలబడ్డాడు.
‘‘ఇప్పుడు నీ రెండు కాళ్ళలో ఒక కాలు పైకెత్తు’’అన్నాడు గురువు.
వెంటనే అతను కుడి కాలు పైకెత్తి ఒంటి కాలిపై నిలబడ్డాడు.
‘‘ఇప్పుడు ఆ రెండవ కాలు కూడా పైకెత్తు’’ అన్నాడు గురువు. వెంటనే అతను ‘‘నేను చెయ్యలేని పనిని మీరు చెయ్యమంటున్నారు’’ అన్నాడు.
ఇంతకుముందు ‘‘నీ రెండు కాళ్ళలో ఒక కాలు పైకెత్తు’’ అని నేను అన్నప్పుడు నీకు పూర్తిస్వేచ్ఛ ఉంది కాబట్టి నీ కుడి కాలును పైకెత్తావు. నువ్వు తీసుకున్న ఆ నిర్ణయమే ఇప్పుడు నీ ఎడమ కాలును పైకెత్తలేకుండా చేసింది.
కాబట్టి, మీరు ఏ పనిచేసినా అది దానికి వ్యతిరేకమైన పని చెయ్యకుండా మిమ్మల్ని అడ్డుకుంటుంది. అంటే ప్రతి పనికి పరిమితి ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది కదా! కానీ, జీవితంలో ఎవరూ ఒంటి కాలిపై నిలబడలేరు కాబట్టి, అది అంత స్పష్టంగా కనిపించదు. అయినా ప్రతి పనికి, ప్రతి నిర్ణయానికి పరిమితులుంటాయి.
కాబట్టి, దేవుడు, విధి, ప్రారబ్ధం, అదృష్టాల గురించి అనవసరంగా చింతించకుండా మామూలు విషయాలపై మనసు పెట్టు’ అన్నాడు గురువు అతనితో.
నిర్ణయం తీసుకునేముందు మీకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఒకసారి నిర్ణయం తీసుకోగానే, ఆ నిర్ణయమే, ఆ ఎంపికే దాని పరిమితులను మీ ముందు ఉంచుతుంది. అది సహజం.
అంతేకానీ, పరస్పర విరుద్ధమైన నిర్ణయాలను మీరు ఏక కాలంలో ఒక్కసారిగా తీసుకోలేరు. అలా తీసుకోలేక పోవడం మంచిదే. అది కేవలం అస్తిత్వపరమైన సురక్షిత కొలమానం. లేకపోతే అసలే గందరగోళంలో ఉన్న మీరు మరింత గందరగోళంలో పడతారు. అప్పుడు మీకు పిచ్చెక్కుతుంది. కాబట్టి, మీ నిర్ణయానికి ఎవరూ బాధ్యులు కారు.
ఎంపిక విషయంలో మౌలికంగా మీరు పూర్తి స్వేచ్ఛాపరులే అయినా, ఆ ఎంపికే మీకు పరిమితులను విధిస్తుంది. కాబట్టి, మీరు పూర్తి స్వేచ్ఛాపరులుగా ఉండాలనుకుంటే ఎంపిక చెయ్యడం మానండి. అప్పుడే ఎలాంటి ఎంపికలు లేని ఎరుకకు సంబంధించిన బోధనలు మీ తలకెక్కుతాయి.
‘‘ఎంపికలు మాని ఎప్పుడూ ఎరుకలో ఉండండి’’ అని గొప్ప గొప్ప గురువులందరూ ఎందుకన్నారో తెలుసా? ఎంపిక చేసిన మరుక్షణం మీరు మీ స్వేచ్ఛను పూర్తిగా కోల్పోతారు. అప్పుడు ఎంపిక చేసుకున్నది మాత్రమే మీ దగ్గర మిగులుతుంది.
కాబట్టి, మీరు ఎలాంటి ఎంపికలు లేని వారైతే, మీ స్వేచ్ఛ మీకు పూర్తిగా దక్కుతుంది. కాబట్టి, ఎలాంటి ఎంపికలులేని ఎరుకకు మాత్రమే పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. మిగిలినవన్నీ పరిమితులతో కూడుకున్నవే.
మీ ముందు చాలా అందమైన నిరుపేద స్త్రీ, చాలా వికారంగా ఉండే ధనవంతురాలైన స్త్రీ ఉన్నారు. వారిలో ఒకరిని ఎంచుకుని ఆమెను మీరు ప్రేమించాలి. ఎవరిని ఎంచుకున్నా మీకు బాధ తప్పదు. ఎందుకంటే, ఒకవేళ మీరు చాలా అందంగా ఉండే నిరుపేద స్త్రీని ఎంచుకుంటే దరిద్ర బాధలు తప్పవు. మీరు కారు కొనలేరు, ఇల్లు కొనలేరు, ఏమీ చెయ్యలేరు. పైగా, అనవసరంగా అనేక సంపదలు వచ్చే అవకాశాన్ని కోల్పోయారని తరువాత బాధపడతారు.
ఎందుకంటే, కొన్ని రోజుల తరువాత ఆ అందం పాతదైపోతుంది. తరువాత దానితో ఏం చెయ్యాలో తెలియక తల బాదుకుంటారు. అంతకన్నా మీరు ఏమి చెయ్యగలరు? అప్పుడు మీ మనసు ‘‘అనవసరంగా తప్పుగా ఎంచుకున్నాను’’ అని భావించడం ప్రారంభిస్తుంది.
ఒకవేళ మీరు చాలా అసహ్యంగా ఉండే ధనవంతురాలైన స్ర్తిని ఎంచుకుంటే ఆమె డబ్బుతో మీ కోరికలన్నీ తీర్చుకోవచ్చు. కానీ, చాలా వికారంగా ఉండే ఆమె రూపాన్ని మీరు ఏమాత్రం అసహ్యించుకోకుండా భరించాల్సి వస్తుంది.
ఎందుకంటే, అసహ్యించుకోవడం కూడా ఒక రకమైన అనుబంధమే. అంతేకాదు, ‘‘నిన్ను ప్రేమిస్తున్నాను’’ అని కూడా ఆమెతో చెప్పాల్సివస్తుంది. కానీ, ఆమె డబ్బుతో కొన్నవాటితో మీరు ఏమాత్రం ఆనందించ లేరు. ఎందుకంటే, ఆమె వికార రూపం మిమ్మల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. మీరు కేవలం డబ్బుకోసమే ఆమెను పెళ్ళిచేసుకున్నారన్న సంగతి ఆమెకు తెలుసు.
అందువల్ల ఆమె మిమ్మల్ని ఒక పనిమనిషిగానే చూస్తుంది తప్ప, ప్రియునిగా చూడలేదు. అప్పుడు మీరు ఆమెను ప్రేమించలేదని, అందంగా ఉండే డబ్బులేని అమ్మాయిని ప్రేమిస్తే కనీసం ఆమె అందమైనా దక్కేదని, కేవలం డబ్బుకోసం కురూపిని కోరుకోవడం మూర్ఖత్వమని భావిస్తారు. ఇది సత్యం.
కాబట్టి, వారిలో ఎవరిని ఎంచుకున్నా మరొకరు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటారు. అందువల్ల మీకు పశ్చాత్తాపం తప్పదు. కాబట్టి, పూర్తి స్వేచ్ఛ కోరుకునే వారికి ఉన్న ఏకైక మార్గం ‘‘ఎంపికలేని ఎరుక’’ ఒక్కటే.
- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
09 Mar 2021
దేవాపి మహర్షి బోధనలు - 53
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 35. మహర్షి దేవాపి సాన్నిధ్యము - 9🌻
“అశరీరుడగు మహాపురుషుడు నీతో సంభాషించుట, నీ సహకారమును కోరుట నేనెఱిగిన విషయమే. నీ వెట్టి అపాయమునకూ గురి కాబడలేదు. ఈ కార్యము వలన నీవు భౌతికముగా కాని, మానసికముగా కాని, అనారోగ్యము పొందవు. పై విషయమున నీవు నిశ్చింతగ నుండవచ్చును. అత్యంత పవిత్రమగు మహాయజ్ఞమున నీకొక నిర్దిష్టమైన కర్తవ్య మిప్పుడేర్పడినది. ఇది ఒక సువర్ణావకాశము!
ముందు తరములకు ఎంతయో ఉపయోగపడు విజ్ఞానము ఆ మహాపురుషుడు అందించుటకు నిన్నెన్నుకొనెను. నిజమునకు, అతనికి నేనే నీగురించి తెలిపి నిన్ను యీ మహత్కార్యమున వినియోగించు కొనమని సూచించితిని. అతడు నీకూ చిరపరిచితుడే.
చేయబోవు కార్యక్రమముల కారణముగా నిన్ను నేను అతని శిక్షణమునకు బదిలీ చేయుట లేదు సుమా! నిన్నెప్పటికినీ నా శిక్షణముననే యుంచెదను. నేను నీకిచ్చు శిక్షణములో భాగముగ ఆ మహాత్ముని కార్యము పరిపూర్తి గావించుము. నీకు శుభము కలుగును.” అని నా గురుదేవులు దేవాది మహర్షి నా మనస్సునగల సందేహముల నన్నింటినీ నివృత్తి చేయుచూ విశదముగా పలికిరి.
వారికి నేను కృతజ్ఞతాభివందనములు తెలుపుచుండగా వారదృశ్యులై నారు. నా హృదయము ఆ క్షణమున పొంగినది. నా గురుదేవులు నన్ను అనుగ్రహించుటకై దివ్య ప్రణాళికయందు నాకు కూడా వ్రాయసకర్తెగా ఒక బాధ్యత నప్పగించినారు. త్రికరణ శుద్ధిగ నేను జ్వాల కూల్ మహర్షిగారికి స్టెనోగ్రాఫర్ గా పనిచేయుటకు నిశ్చయించు కొంటిని. ఈ విషయము జ్వాల కూల్ మహర్షిగారికి తెలిపితిని. వారు అంగీకారముగ తమ చిరునవ్వును ప్రసరింపజేసిరి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
09 Mar 2021
వివేక చూడామణి - 42 / Viveka Chudamani - 42
🌹. వివేక చూడామణి - 42 / Viveka Chudamani - 42 🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
🍀. ఆత్మ స్వభావము - 10 🍀
151. ఎపుడైతే పంచకోశములు తొలగిపోతాయో అపుడు మనిషి యొక్క ఆత్మ వ్యక్తమవుతుంది. స్వచ్ఛమైన అనంతమైన ఏవిధమైన అడ్డంకులు లేని బ్రహ్మానంద స్థితి హృదయములో ఏర్పడుతుంది.
152. బంధాలను తొలగించుకోవాలంటే తెలివి గల వ్యక్తి ఆత్మ, అనాత్మల భేదమును గ్రహించగలగాలి. అప్పుడు మాత్రమే తన ఆత్మను తెలుసుకో గలుగుతాడు. అపుడు పొందిన ఆత్మ జ్ఞానము వలన నిరంతర ఆనందము లభించును.
153. అన్ని విధములైన జ్ఞానేంద్రియాలను తెలుసుకొన్నప్పుడు వాటి అవగాహన కలిగినప్పుడు, తన అధీనములోని అంతర్గత ఆత్మవాటికి అతీతముగా ఉండి, వాటిని నిస్తేజము చేసినపుడే ఆత్మ విముక్తి చెంది దానికి అడ్డుగా ఉన్న పంచకోశములు ఆత్మలో లీనమై ఆత్మతో సమానమవుతాయి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 42 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 Nature of Soul - 10 🌻
151. When all the five sheaths have been eliminated, the Self of man appears – pure, of the essence of everlasting and unalloyed bliss, indwelling, supreme and self-effulgent.
152. To remove his bondage the wise man should discriminate between the Self and thenon-Self. By that alone he comes to know his own Self as Existence-Knowledge-Bliss Absolute and becomes happy.
153. He indeed is free who discriminates between all sense-objects and the indwelling, unattached and inactive Self – as one separates a stalk of grass from its enveloping sheath – and merging everything in It, remains in a state of identity with That.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
09 Mar 2021
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 330, 331 / Vishnu Sahasranama Contemplation - 330, 331
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 330 / Vishnu Sahasranama Contemplation - 330 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻330. వరదః, वरदः, Varadaḥ🌻
ఓం వరదాయ నమః | ॐ वरदाय नमः | OM Varadāya namaḥ
వరాన్ దదాత్యభిమతాన్ వరంగాం దక్షిణామూత ।
ఇత్యచ్యుతః స వరదో గౌర్వై వర ఇతి శ్రుతేః ॥
యజమాన స్వరూపేణ హరిద్వరద ఉచ్యతే ॥
భక్తులకు అభిమతములగు వరములను ఇచ్చును. లేదా వరము అనగా యజ్ఞమునందు యజమానుడు ఋత్విజులకు ఇచ్చు దక్షిణ అని శ్రౌత సంప్రదాయము. యజ్ఞమున విష్ణువే యజమాన రూపమున నుండి ఋత్విజులకు గోరూపదక్షిణను ఇచ్చుచున్నాడు అని అర్థము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 330🌹
📚. Prasad Bharadwaj
🌻330. Varadaḥ🌻
OM Varadāya namaḥ
Varān dadātyabhimatān varaṃgāṃ dakṣiṇāmūta,
Ityacyutaḥ sa varado gaurvai vara iti śruteḥ.
Yajamāna svarūpeṇa haridvarada ucyate.
वरान् ददात्यभिमतान् वरंगां दक्षिणामूत ।
इत्यच्युतः स वरदो गौर्वै वर इति श्रुतेः ॥
यजमान स्वरूपेण हरिद्वरद उच्यते ॥
He bestows the boons that are desired. Or Vara can also mean the remuneration or honorarium paid by the yajamāna i.e., the master/organizer of sacrifice. Lord Viṣṇu in the form of the yajamāna of a yajña offers the remuneration in the form of cows to the priests who perform the same.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
स्कन्दः स्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः ।वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः ॥ ३६ ॥
స్కన్దః స్కన్దధరో ధుర్యో వరదో వాయువాహనః ।వాసుదేవో బృహద్భానురాదిదేవః పురన్దరః ॥ ౩౬ ॥
Skandaḥ skandadharo dhuryo varado vāyuvāhanaḥ ।Vāsudevo br̥hadbhānurādidevaḥ purandaraḥ ॥ 36 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 331 / Vishnu Sahasranama Contemplation - 331🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻331. వాయువాహనః, वायुवाहनः, Vāyuvāhanaḥ🌻
ఓం వాయువాహనాయ నమః | ॐ वायुवाहनाय नमः | OM Vāyuvāhanāya namaḥ
ఆవహాదీన్ సప్తవాయూన్ యో వాహయతి కేశవః ।
స వాయువాహన ఇతి ప్రోచ్యతే విబుధోత్తమైః ॥
ఆవహము మొదలగు సప్తవాయువులను తమ తమ స్కంధములయందు చలించునట్లు చేయునుగనుక ఆ కేశవునకు వాయువాహనః అను నామముగలదు.
సప్తవాయువులు: 1. పృథివికినీ మేఘమండలమునకును నడుమ 'ఆవహము'. 2. మేఘమండలమూ, రవిమండలముల నడుమ 'ప్రవహము'. 3. రవిమండలమూ చంద్రమందలముల నడుమ 'అనువహము'. చంద్రమండల నక్షత్రమండలముల నడుమ 'సంవహము'. 5. నక్షత్రములకూ, గ్రహములకూ నడుమ 'వివహము'. 6. గ్రములకూ సప్తర్షిమండలముల నడుమ 'పరావహము'. 7. సప్తర్షి మండలమూ, ధ్రువమండలముల నడుమ 'పరివహము'లు వీచుచుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 331🌹
📚. Prasad Bharadwaj
🌻331. Vāyuvāhanaḥ🌻
OM Vāyuvāhanāya namaḥ
Āvahādīn saptavāyūn yo vāhayati keśavaḥ,
Sa vāyuvāhana iti procyate vibudhottamaiḥ.
आवहादीन् सप्तवायून् यो वाहयति केशवः ।
स वायुवाहन इति प्रोच्यते विबुधोत्तमैः ॥
Since Lord Keśava vibrates the seven āvahas or winds/atmospheres (1. Āvaha, 2. Pravaha, 3. Anuvaha, 4. Saṃvaha, 5. Vivaha, 6. Parāvaha and 7. Parivaha), He is called Vāyuvāhanaḥ.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
स्कन्दः स्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः ।वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः ॥ ३६ ॥
స్కన్దః స్కన్దధరో ధుర్యో వరదో వాయువాహనః ।వాసుదేవో బృహద్భానురాదిదేవః పురన్దరః ॥ ౩౬ ॥
Skandaḥ skandadharo dhuryo varado vāyuvāhanaḥ ।Vāsudevo br̥hadbhānurādidevaḥ purandaraḥ ॥ 36 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
09 Mar 2021

















