శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 324 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 324-2

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 324 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 324-2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 73. కామ్యా, కామకళారూపా, కదంబ కుసుమ ప్రియా ।
కళ్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా ॥ 73 ॥ 🍀

🌻 324-2. 'కళ్యాణీ' 🌻

లౌక్యము, అసత్యభాషణము, పనికి మాలిన తెలివి వాక్కుల ద్వారా ప్రకటించువారు పతనము చెందుచు నుందురు. వాక్కు సంకల్ప రూపముగ పరతత్త్వము నుండి వ్యక్తమగును. చతుర్ముఖ బ్రహ్మయందు ఇచ్ఛగ ప్రకటింపబడి సృష్టి నిర్మాణము చేయును. విష్ణువుయందు జ్ఞానముగ ప్రకటింపబడి సృష్టి, వృద్ధి, రక్షణ చేయును. రుద్రుల నుండి ప్రకటింపబడి హద్దులు పెట్టుచుండును.

వాక్కే ఇచ్ఛా, జ్ఞాన క్రియా శక్తులుగ ప్రకటింప బడుచున్నది. జీవులన్నియును సంకల్పానుసారమే నడచుచున్నవి. సంకల్పములు వ్యక్తి గతములు గాక దివ్యమై యున్నచో జీవితములు కళ్యాణమయ మగును. లేనిచో మిశ్రమ ఫలితములను, దుఃఖములను కలిగించును. కళ్యాణీ నామము అత్యంత శుభప్రదమైనది. వాక్కు కల్యాణ ప్రదము అని తెలిసినవారు కొందరే.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 324-2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 73. Kamya kamakalarupa kadanba kusumapriya
Kalyani jagatikanda karunarasasagara ॥ 73 ॥ 🌻

🌻 324-2. Kalyāṇī कल्याणी (324) 🌻

She is the embodiment of auspiciousness. Kalyāṇa means illustrious, noble, generous, virtuous, good etc. Rig-Veda (ऋग्वेद) I.31.9 uses the word Kalyāṇa. The Veda says, “तनूक्र्द बोधि परमतिश्च कारवे तवं कल्याण वसु विश्वमोपिषे tanūkrda bodhi paramatiśca kārave tavaṃ kalyāṇa vasu viśvamopiṣe”, where Kalyāṇa is used to mean worthy. The same nāma appears in Lalitā Triśatī as nāma 2. The power of auspiciousness in the form of positive energy can be realised through powerful vibrations.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

02 Dec 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 103

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 103 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. నీ నిజమైన యథార్థతత్వం దైవత్వం. నువ్వు బిచ్చగాడని నువ్వు భావించినా, నిద్రలో నువ్వు కలగన్నా నీ అసలు తత్వమదే. మనసు కలగనడం మానేసినపుడు మాత్రమే దైవత్వమొక్కటే నిలిచి వుంటుంది. అది తెలుసుకోకుండా మరణించడం నిష్పలత్వమే. 🍀

నీ నిజమైన యథార్థతత్వం దైవత్వం. నువ్వు బిచ్చగాడని నువ్వు భావించినా, నిద్రలో నువ్వు కలగన్నా నీ అసలు తత్వమదే. నువ్వు పురుషడనుకున్నా స్త్రీ అనుకున్నా అసలు లక్షణం దైవత్వమే. నువ్వు నల్లవాడివని, తెల్లవాడివని యిదనీ అదనీ, ధనవంతుడని పేదవాడని అనుకున్నా అవన్నీ కలలే. మనసు కలగనడం మానేసినపుడు మాత్రమే దైవత్వమొక్కటే నిలిచి వుంటుంది. అది తెలుసుకోకుండా మరణించడం నిష్పలత్వమే. అది తెలుసుకోవడమే నిజమైన సంపూర్ణత. అక్కడ విశ్వాసమన్నది ముఖ్యం కాదు. దైవరాజ్యం మనలో వుందని వందల సంవత్సరాల నించీ మత గురువులు చెబుతున్నారు. ఆ మాటలు మనకెట్లాంటి సాయం చేయడం లేదు. అది నీ అంతకు నువ్వు పొందాల్సిన అనుభవం.

విశ్వసించడం సులభం. నువ్వు దేవుడివని విశ్వసించడం ఆరంభిస్తావు. అది నేనే గొప్పవాడిననే అహంకారం, పిచ్చితనం. అది అనుభవానికి సంబంధించిన సంగతి. నువ్వు దేవుడని అహంకరించడం మొదలెపెడితే దేవుడు నీకు నీడ అవుతాడు. నువ్వు ముఖ్యుడవుతావు. అదే నువ్వు అనుభవంతో 'నేను దేవుడు' అని చెబితే అది అర్థవంతమవుతుంది. దేవుడు నిజమైన దేవుడుగా వుంటాడు. అక్కడ నీ అహముండదు. ఒక మార్మికుడు ఎప్పుడయితే నేను దేవుణ్ణి అంటాడో అదే సమయంలో 'నేను లేను' అంటాడు. కాబట్టి నేను మిమ్మల్ని విశ్వసించమని అనడం లేదు. ఆ విషయాన్ని అనుభవంలోకి తెచ్చుకోమంటాను. దాన్ని అనుభవంలోకి తెచ్చుకోకుండా ఈ జీవితాన్ని వదిలిపెట్టకు.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

02 Dec 2021

మైత్రేయ మహర్షి బోధనలు - 36

🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 36 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 25. ఉట్టి - స్వర్గము 🌻

జాతి పునర్నిర్మాణమునకు పూనుకొనువారు మున్ముందుగ తమ తమ గృహ (కుటుంబ) నిర్మాణమును నిర్వర్తింపవలెను. చక్కని కుటుంబము సోదరత్వమునకు, ప్రేమకు, సహకారమునకు, త్యాగమునకు, సహజీవనమునకు ప్రతీక. ఇదివరలో సోదరత్వమునకు కుటుంబము చక్కని విద్యాలయమని తెలుపుచుండెడివారము. చక్కని కుటుంబములే అరుదైన ఈ రోజులలో ఈ మాటలు చెప్పుట కూడ నిరర్థకమే అగుచున్నది. కుటుంబముల యందు ద్వేషములు, ఘర్షణలు తాండవముచేయుచుండ, జాతి యను పెద్ద కుటుంబ పునర్నిర్మాణమునకు పూనుకొనుట వెళితనము.

“ఉట్టి కెక్కలేనివాడు స్వర్గమున కెక్కుదును” అనినట్లుండును. నాగరికత పేరున మానవుడు కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్న మొనర్చెను. అట్టివాడు భౌగోళికముగ మార్పులు తీసుకుని రాగలడు అని నమ్ముట కరడుగట్టిన అజ్ఞానము. ఈ కాలపు నాయకులెవ్వరును కూడ జాతి పునర్నిర్మాణమునకు అర్హులుగ గోచరించుట లేదు. అర్హులకు అవకాశము లేక, అవకాశము కలవారికి అర్హతలేక జాతిమొత్తము ఒక విషవలయమున తిరుగు చున్నది. కాలక్రమమున దైవమే పరిష్కార మొసంగగలడు. అంత వఱకు ఓర్పు వహించి ఉండుటయే కర్తవ్యము.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

02 Dec 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 519/ Vishnu Sahasranama Contemplation - 519

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 519/ Vishnu Sahasranama Contemplation - 519🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 519. మహోదధిశయః, महोदधिशयः, Mahodadhiśayaḥ 🌻

ఓం మహోదధిశయాయ నమః | ॐ महोदधिशयाय नमः | OM Mahodadhiśayāya namaḥ

మహోదధిశయః, महोदधिशयः, Mahodadhiśayaḥ

సర్వభూతాని సంహృత్య కృత్వా చైకార్ణవం జగత్ ।
తస్మిన్ మహోదధౌ శేతే మహోదధిశయస్తతః ॥

సర్వభూతములను సంహరించి జగత్తును ఏకార్ణవమునుగా చేసి, ఆ మహా సముద్రమును ఆశ్రయించి శయనించువాడు మహోదధిశయః.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 519 🌹

📚. Prasad Bharadwaj

🌻 519. Mahodadhiśayaḥ 🌻

OM Mahodadhiśayāya namaḥ

सर्वभूतानि संहृत्य कृत्वा चैकार्णवं जगत् ।
तस्मिन् महोदधौ शेते महोदधिशयस्ततः ॥

Sarvabhūtāni saṃhr‌tya kr‌tvā caikārṇavaṃ jagat,
Tasmin mahodadhau śete mahodadhiśayastataḥ.

When having reduced all beings to their primal state and having converted the world to one expanse of water, He reclines in it and hence He is Mahodadhiśayaḥ.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

जीवो विनयिता साक्षी मुकुन्दोऽमितविक्रमः ।
अम्भोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः ॥ ५५ ॥

జీవో వినయితా సాక్షీ ముకున్దోఽమితవిక్రమః ।
అమ్భోనిధిరనన్తాత్మా మహోదధిశయోఽన్తకః ॥ 55 ॥

Jīvo vinayitā sākṣī mukundo’mitavikramaḥ,
Ambhonidhiranantātmā mahodadhiśayo’ntakaḥ ॥ 55 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

02 Dec 2021

2-DECEMBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 02, డిసెంబర్ 2021 గురు వారం, భృహస్పతి వారము, కార్తీక మాసం 28వ రోజు 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 122 / Bhagavad-Gita - 122 3-03🌹*
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 519 / Vishnu Sahasranama Contemplation - 519 🌹
4) 🌹 DAILY WISDOM - 197🌹 
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 36🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 103 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 324-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 324-2 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ గురువారం మిత్రులందరికీ 🌹*
*బృహస్పతి వారం, 02, డిసెంబర్‌ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. కార్తీక మాసం 28వ రోజు 🍀*

*నిషిద్ధములు : ఉల్లి, సొర, గుమ్మడి, వంకాయ*
*దానములు :- నువ్వులు, ఉసిరి*
*పూజించాల్సిన దైవము : ధర్ముడు*
*జపించాల్సిన మంత్రము : ఓం ధర్మాయ, కర్మనాశాయ స్వాహా*
*ఫలితము : దీర్ఘకాల వ్యాధీహరణం*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, శరద్‌ ఋతువు,
కార్తీక మాసం
తిథి: కృష్ణ త్రయోదశి 20:27:14
వరకు తదుపరి కృష్ణ చతుర్దశి
నక్షత్రం: స్వాతి 16:28:55 వరకు
తదుపరి విశాఖ
యోగం: శోభన 17:00:47 వరకు
తదుపరి అతిగంధ్
 కరణం: గార 10:02:40 వరకు
వర్జ్యం: 21:25:58 - 22:51:06
దుర్ముహూర్తం: 10:13:45 - 10:58:24
మరియు 14:41:39 - 15:26:18
రాహు కాలం: 13:29:05 - 14:52:48
గుళిక కాలం: 09:17:56 - 10:41:39
యమ గండం: 06:30:30 - 07:54:13
అభిజిత్ ముహూర్తం: 11:43 - 12:27
అమృత కాలం: 08:31:20 - 09:58:00
మరియు 29:56:46 - 31:21:54
సూర్యోదయం: 06:30:30
సూర్యాస్తమయం: 17:40:15
వైదిక సూర్యోదయం: 06:34:20
వైదిక సూర్యాస్తమయం: 17:36:24
చంద్రోదయం: 04:07:15
చంద్రాస్తమయం: 15:58:31
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: తుల
స్థిర యోగం - శుభాశుభ మిశ్రమ ఫలం 
16:28:55 వరకు తదుపరి వర్ధమాన 
యోగం - ఉత్తమ ఫలం
పండుగలు : ప్రదోష వ్రతం, మాస శివరాత్రి
Pradosh Vratై, Masik Shivaratri

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత -122 / Bhagavad-Gita - 122 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 3 🌴*

3. శ్రీభగవానువాచ
లోకేస్మిన్ ద్వివిధా నిష్టా 
పురా ప్రోక్తా మయానఘ |
జ్ఞానయోగేన సాంఖ్యనాం 
కర్మయోగేన యోగినామ్ ||

🌷. తాత్పర్యం :
*దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను: పాపరహితుడవైన ఓ అర్జునా! ఆత్మానుభూతిని పొందగోరు మానవుల రెండు రకములని ఇదివరకే నేను వివిరించితివి. కొందరు దానిని సాంఖ్యము మరియు తాత్విక కల్పన ద్వారా అవగతము చేసికొనగోరగా, మరికొందరు భక్తియోగము ద్వారా దానిని అర్థము చేసికొనగోరుదురు.*

🌷. భాష్యము :
 ద్వితీయాధ్యయపు ముప్పది తొమ్మిదవ శ్లోకమున సాంఖ్యయోగము మరియు కర్మయోగము (బుద్ధియోగము) లనెడి రెండు విధానములను శ్రీకృష్ణభగవానుడు వివరించెను. అదే విషయమును భగవానుడు ఈ శ్లోకమున మరింత విశదముగా వివరించుచున్నాడు. 

ఆత్మ మరియు భౌతికపదార్థముల విశ్లేషణాత్మక అధ్యయనమైన సాంఖ్యయోగము మానసిక కల్పనలను కావించుట యందును మరియు ఏదేని విషయము పయోగాత్మక జ్ఞానము, తాత్విక చింతన ద్వారా ఎరుగుట యందును అభిరుచిని కలిగినట్టి మనుజులకు చెందినట్టిది. ఇక రెండవ రకము వారు కృష్ణభక్తిభావన యందు కర్మనొనరించెడి వారు. 

ఈ విషయమును ద్వితీయాధ్యాయపూ అరువదియెకటక శ్లోకమునందు వివరింపబడినది. బుద్ధియోగము (కృష్ణభక్తిభావన) ననుసరించి కర్మచేయుట ద్వారా మనుజుడు కర్మబంధము నుండి విడివడగలడనియు, పైగా కర్మయందు ఎటువంటి దోషము కలుగాదనియు శ్రీకృష్ణభగవానుడు ద్వితియాద్యయపు ముప్పదితొమ్మిదవ శ్లోకమున తెలిపియే యున్నాడు. 

బుద్ధియోగామనగా భగవానుని పైననే (మరింత విశదముగా చెప్పవలెనన్న శ్రీకృష్ణుని పైననే ) సంపూర్ణముగా ఆధారపడుటయనియు, తద్ద్వారా ఇంద్రియములన్నియు సులభముగా అదుపులోనికి రాగాలవనియు ఆ అధ్యాయపు అరువదియెకటవ శ్లోకమున స్పష్టముగా వివరింపబడినది. అనగా ధర్మము మరియు తత్త్వముల వలె ఈ రెండుయోగములు ఒకదానిపై మరొకటి ఆధారపడియున్నవి. 

తత్త్వము లేనటువంటి ధర్మము కేవలము సిద్ధాంతము లేదా మూడవిశ్వాసము కాగా, ధర్మము లేనటువంటి తత్త్వము కేవలము మానసిక కల్పనము కాగలదు. పరతత్త్వమును అనుభూతమొనర్చుకొనుటకు నిష్టగా యత్నించువారు సైతము అంత్యమున కృష్ణభక్తిభావననే పొందుదురు కావున శ్రీకృష్ణుడే పరమలక్ష్యమై యున్నాడు. ఈ విషయము భగవద్గీత యందును తెలుపబడినది. భగవానునితో పోల్చినచో జీవుని నిజస్థితి ఎట్టిదని అవగతము చేసికొనుటయే అన్నింటి యందును ముఖ్యాంశమై యున్నది. 

పరోక్షమార్గామైన మనోకల్పనను కావించుచు మనుజుడు క్రమముగా కృష్ణభక్తిభావనాస్థితికి రావచ్చును లేదా రెండవమార్గమున కృష్ణభక్తి యందు ప్రత్యక్షసంబంధము నేర్పరచుకొనవచ్చను. ఈ రెండింటిలో కృష్ణభక్తిభావనా మార్గము ఉత్తమమైనది. తాత్వికవిధానము ద్వారా ఇంద్రియములను శుద్ధిపరచుకొనవలసిన అవసరం దాని యందు లేకపోవుటయే అందులకు కారణము. కృష్ణభక్తియే సాక్షాత్తుగా అతి పవిత్రమొనర్చు విధానము. భక్తియుక్తసేవ యనెడి ప్రత్యక్ష విధానము వలన ఆ కార్యము సులభమును మరియు ఉదాత్తమును అయి యున్నది. 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 122 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 3 - Karma Yoga -3 🌴*

3. śrī-bhagavān uvāca 
loke ’smin dvi-vidhā niṣṭhā purā proktā mayānagha 
jñāna-yogena sāṅkhyānāṁ karma-yogena yoginām

🌷Translation :
*The Supreme Personality of Godhead said: O sinless Arjuna, I have already explained that there are two classes of men who try to realize the self. Some are inclined to understand it by empirical, philosophical speculation, and others by devotional service.*

🌷 Purport :
In the Second Chapter, verse 39, the Lord explained two kinds of procedures – namely sāṅkhya-yoga and karma-yoga, or buddhi-yoga. In this verse, the Lord explains the same more clearly. Sāṅkhya-yoga, or the analytical study of the nature of spirit and matter, is the subject matter for persons who are inclined to speculate and understand things by experimental knowledge and philosophy. 

The other class of men work in Kṛṣṇa consciousness, as it is explained in the sixty-first verse of the Second Chapter. The Lord has explained, also in the thirty-ninth verse, that by working by the principles of buddhi-yoga, or Kṛṣṇa consciousness, one can be relieved from the bonds of action; and, furthermore, there is no flaw in the process. 

The same principle is more clearly explained in the sixty-first verse – that this buddhi-yoga is to depend entirely on the Supreme (or more specifically, on Kṛṣṇa), and in this way all the senses can be brought under control very easily.

🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 519/ Vishnu Sahasranama Contemplation - 519🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 519. మహోదధిశయః, महोदधिशयः, Mahodadhiśayaḥ 🌻*

*ఓం మహోదధిశయాయ నమః | ॐ महोदधिशयाय नमः | OM Mahodadhiśayāya namaḥ*

మహోదధిశయః, महोदधिशयः, Mahodadhiśayaḥ

*సర్వభూతాని సంహృత్య కృత్వా చైకార్ణవం జగత్ ।*
*తస్మిన్ మహోదధౌ శేతే మహోదధిశయస్తతః ॥*

*సర్వభూతములను సంహరించి జగత్తును ఏకార్ణవమునుగా చేసి, ఆ మహా సముద్రమును ఆశ్రయించి శయనించువాడు మహోదధిశయః.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 519 🌹*
📚. Prasad Bharadwaj

*🌻 519. Mahodadhiśayaḥ 🌻*

*OM Mahodadhiśayāya namaḥ*

सर्वभूतानि संहृत्य कृत्वा चैकार्णवं जगत् ।
तस्मिन् महोदधौ शेते महोदधिशयस्ततः ॥

Sarvabhūtāni saṃhr‌tya kr‌tvā caikārṇavaṃ jagat,
Tasmin mahodadhau śete mahodadhiśayastataḥ.

*When having reduced all beings to their primal state and having converted the world to one expanse of water, He reclines in it and hence He is Mahodadhiśayaḥ.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
जीवो विनयिता साक्षी मुकुन्दोऽमितविक्रमः ।
अम्भोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः ॥ ५५ ॥

జీవో వినయితా సాక్షీ ముకున్దోఽమితవిక్రమః ।
అమ్భోనిధిరనన్తాత్మా మహోదధిశయోఽన్తకః ॥ 55 ॥

Jīvo vinayitā sākṣī mukundo’mitavikramaḥ,
Ambhonidhiranantātmā mahodadhiśayo’ntakaḥ ॥ 55 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 197 🌹*
*🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 15. It is not Easy for Us to Love God Wholly 🌻*

The decision is taken by God Himself—man cannot take the decision. And Sri Krishna took up the lead in this path of what decision is to be taken finally. Is the universe as an object to be retained, even in a subtle form, or is it to be abolished altogether? Is it to be absorbed totally? 

And do we have to see to the deathbed of the entire objective existence, or is it necessary to strike a lesser note and come to an agreement with factors which are far below this level of extreme expectation? Yudhishthira was wavering, and could not come to a conclusion; and we too are wavering. It is not easy for us to love God wholly, because that would mean the acceptance of the necessity to dissolve the whole world itself in the existence of God, and one would not easily be prepared for this ordeal. 

“It is true that Krishna is my saviour and my friend, philosopher and guide, but Duryodhana is my brother-in-law and my cousin—how can I deal a blow to him? Bhishma is my grandsire and Drona is my Guru. My own blood flows through the veins of these that seem to be harnessed against me in the arena of battle.” So there is a double game that the spirit plays.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 36 🌹* 
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 25. ఉట్టి - స్వర్గము 🌻*

*జాతి పునర్నిర్మాణమునకు పూనుకొనువారు మున్ముందుగ తమ తమ గృహ (కుటుంబ) నిర్మాణమును నిర్వర్తింపవలెను. చక్కని కుటుంబము సోదరత్వమునకు, ప్రేమకు, సహకారమునకు, త్యాగమునకు, సహజీవనమునకు ప్రతీక. ఇదివరలో సోదరత్వమునకు కుటుంబము చక్కని విద్యాలయమని తెలుపుచుండెడివారము. చక్కని కుటుంబములే అరుదైన ఈ రోజులలో ఈ మాటలు చెప్పుట కూడ నిరర్థకమే అగుచున్నది. కుటుంబముల యందు ద్వేషములు, ఘర్షణలు తాండవముచేయుచుండ, జాతి యను పెద్ద కుటుంబ పునర్నిర్మాణమునకు పూనుకొనుట వెళితనము.*

*“ఉట్టి కెక్కలేనివాడు స్వర్గమున కెక్కుదును” అనినట్లుండును. నాగరికత పేరున మానవుడు కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్న మొనర్చెను. అట్టివాడు భౌగోళికముగ మార్పులు తీసుకుని రాగలడు అని నమ్ముట కరడుగట్టిన అజ్ఞానము. ఈ కాలపు నాయకులెవ్వరును కూడ జాతి పునర్నిర్మాణమునకు అర్హులుగ గోచరించుట లేదు. అర్హులకు అవకాశము లేక, అవకాశము కలవారికి అర్హతలేక జాతిమొత్తము ఒక విషవలయమున తిరుగు చున్నది. కాలక్రమమున దైవమే పరిష్కార మొసంగగలడు. అంత వఱకు ఓర్పు వహించి ఉండుటయే కర్తవ్యము.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 103 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. నీ నిజమైన యథార్థతత్వం దైవత్వం. నువ్వు బిచ్చగాడని నువ్వు భావించినా, నిద్రలో నువ్వు కలగన్నా నీ అసలు తత్వమదే. మనసు కలగనడం మానేసినపుడు మాత్రమే దైవత్వమొక్కటే నిలిచి వుంటుంది. అది తెలుసుకోకుండా మరణించడం నిష్పలత్వమే. 🍀*

*నీ నిజమైన యథార్థతత్వం దైవత్వం. నువ్వు బిచ్చగాడని నువ్వు భావించినా, నిద్రలో నువ్వు కలగన్నా నీ అసలు తత్వమదే. నువ్వు పురుషడనుకున్నా స్త్రీ అనుకున్నా అసలు లక్షణం దైవత్వమే. నువ్వు నల్లవాడివని, తెల్లవాడివని యిదనీ అదనీ, ధనవంతుడని పేదవాడని అనుకున్నా అవన్నీ కలలే. మనసు కలగనడం మానేసినపుడు మాత్రమే దైవత్వమొక్కటే నిలిచి వుంటుంది. అది తెలుసుకోకుండా మరణించడం నిష్పలత్వమే. అది తెలుసుకోవడమే నిజమైన సంపూర్ణత. అక్కడ విశ్వాసమన్నది ముఖ్యం కాదు. దైవరాజ్యం మనలో వుందని వందల సంవత్సరాల నించీ మత గురువులు చెబుతున్నారు. ఆ మాటలు మనకెట్లాంటి సాయం చేయడం లేదు. అది నీ అంతకు నువ్వు పొందాల్సిన అనుభవం.*

*విశ్వసించడం సులభం. నువ్వు దేవుడివని విశ్వసించడం ఆరంభిస్తావు. అది నేనే గొప్పవాడిననే అహంకారం, పిచ్చితనం. అది అనుభవానికి సంబంధించిన సంగతి. నువ్వు దేవుడని అహంకరించడం మొదలెపెడితే దేవుడు నీకు నీడ అవుతాడు. నువ్వు ముఖ్యుడవుతావు. అదే నువ్వు అనుభవంతో 'నేను దేవుడు' అని చెబితే అది అర్థవంతమవుతుంది. దేవుడు నిజమైన దేవుడుగా వుంటాడు. అక్కడ నీ అహముండదు. ఒక మార్మికుడు ఎప్పుడయితే నేను దేవుణ్ణి అంటాడో అదే సమయంలో 'నేను లేను' అంటాడు. కాబట్టి నేను మిమ్మల్ని విశ్వసించమని అనడం లేదు. ఆ విషయాన్ని అనుభవంలోకి తెచ్చుకోమంటాను. దాన్ని అనుభవంలోకి తెచ్చుకోకుండా ఈ జీవితాన్ని వదిలిపెట్టకు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 324 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 324-2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 73. కామ్యా, కామకళారూపా, కదంబ కుసుమ ప్రియా ।*
*కళ్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా ॥ 73 ॥ 🍀*

*🌻 324-2. 'కళ్యాణీ' 🌻* 

*లౌక్యము, అసత్యభాషణము, పనికి మాలిన తెలివి వాక్కుల ద్వారా ప్రకటించువారు పతనము చెందుచు నుందురు. వాక్కు సంకల్ప రూపముగ పరతత్త్వము నుండి వ్యక్తమగును. చతుర్ముఖ బ్రహ్మయందు ఇచ్ఛగ ప్రకటింపబడి సృష్టి నిర్మాణము చేయును. విష్ణువుయందు జ్ఞానముగ ప్రకటింపబడి సృష్టి, వృద్ధి, రక్షణ చేయును. రుద్రుల నుండి ప్రకటింపబడి హద్దులు పెట్టుచుండును.*

*వాక్కే ఇచ్ఛా, జ్ఞాన క్రియా శక్తులుగ ప్రకటింప బడుచున్నది. జీవులన్నియును సంకల్పానుసారమే నడచుచున్నవి. సంకల్పములు వ్యక్తి గతములు గాక దివ్యమై యున్నచో జీవితములు కళ్యాణమయ మగును. లేనిచో మిశ్రమ ఫలితములను, దుఃఖములను కలిగించును. కళ్యాణీ నామము అత్యంత శుభప్రదమైనది. వాక్కు కల్యాణ ప్రదము అని తెలిసినవారు కొందరే.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 324-2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 73. Kamya kamakalarupa kadanba kusumapriya
Kalyani jagatikanda karunarasasagara ॥ 73 ॥ 🌻*

*🌻 324-2. Kalyāṇī कल्याणी (324) 🌻*

*She is the embodiment of auspiciousness. Kalyāṇa means illustrious, noble, generous, virtuous, good etc. Rig-Veda (ऋग्वेद) I.31.9 uses the word Kalyāṇa. The Veda says, “तनूक्र्द बोधि परमतिश्च कारवे तवं कल्याण वसु विश्वमोपिषे tanūkrda bodhi paramatiśca kārave tavaṃ kalyāṇa vasu viśvamopiṣe”, where Kalyāṇa is used to mean worthy. The same nāma appears in Lalitā Triśatī as nāma 2. The power of auspiciousness in the form of positive energy can be realised through powerful vibrations.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

Sri Veerabhoga Vasantharaya Maharaj Jayanthi Subhaknkshalu శ్రీ వీరభోగ వసంతరాయ మహరాజ్‌ జయంతి శుభాకాంక్షలు

🌹. శ్రీ వీరభోగ వసంతరాయ మహరాజ్‌ జయంతి శుభాకాంక్షలు 🌹

🍀 Sri Veerabhoga Vasantharaya Maharaj Jayanthi Subhaknkshalu 🍀

1-12-2021

🌻 The life of Kalki avataram: 🌻

As per 'kalaguyanam' predictions: The avatar have born at 'Deccan peat bhoomi' at where we get abundant lime stone.

South India is called as Deccan peat bhoomi, in south India abundant lime stone is located in the water at Nalgonda (Dist.) in Andhra Pradesh (State) in India (Country).

SRI SRI SRI VEERA BHOGA VASANTA RAYALU Maharaj was born on 1stDec1946 to, where we get similar name for father and mother like venkatadri and venkatama. At the age of 25 years Maharaj worships his guru Manikeshwari matha.

Manikeshwari matha says about 'Ahimso paramo darmaha' (don't be cruel as animals and don't hurt any living beings or animal) and matha live at yanagundi (taluka), in Karnataka (State) in India. Manikeshwari matha is nirahari means (who don't eat food or drink water) for whole life.

How (Maharaj) has meet his guru (Manikeshwari matha) is also given in kalaguyanam, the life on the earth of (Maharaj) is 108 years and (Manikeshwari matha)is 120years. The age difference between (Maharaj) and guru (Manikeshwari matha) is 12 years (Manikeshwari matha) is older than (Maharaj) why we are discussing about matha because up to now from Treta yuga and dwapara yuga the two powers together form avatar.

🌹 🌹 🌹 🌹 🌹

01 Dec 2021

శ్రీ లలితా సహస్ర నామములు - 160 / Sri Lalita Sahasranamavali - Meaning - 160

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 160 / Sri Lalita Sahasranamavali - Meaning - 160 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 160. గంభీరా, గగనాంతఃస్థా, గర్వితా, గానలోలుపా ।
కల్పనారహితా, కాష్ఠా, కాంతా, కాంతార్ధ విగ్రహా ॥ 160 ॥ 🍀

🍀 851. గంభీరా :
లోతైనది (అమ్మణ్ణి తత్వము తెల్సుకొనుట కష్టము)

🍀 852. గగనాంతస్తా :
ఆకాశమునందు ఉండునది

🍀 853. గర్వితా :
గర్వము కలిగినది

🍀 854. గానలోలుపా :
సంగీతమునందు ప్రీతి కలిగినది

🍀 855. కల్పనారహితా :
ఎట్టి కల్పన లేనిది

🍀 856. కాష్ఠా :
కాలపరిగణన లో అత్యంత స్వల్పభాగము (రెప్పపాటుకన్న తక్కువ సమయం)

🍀 857. కాంతా :
కాంతి కలిగినది

🍀 858. కాంతార్ధ విగ్రహ :
కాంతుడైన ఈశ్వరునిలో అర్ధభాగము

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 160 🌹

📚. Prasad Bharadwaj

🌻 160. Ganbhira gaganantahsdha garvita ganalolupa
Kalpanarahita kashtakanta kantardha vigraha ॥ 160 ॥ 🌻

🌻 851 ) Gambheera -
She whose depth cannot be measured

🌻 852 ) Gagananthastha -
She who is situated in the sky

🌻 853 ) Garvitha -
She who is proud

🌻 854 ) Gana lolupa -
She who likes songs

🌻 855 ) Kalpana rahitha -
She who does not imagine

🌻 856 ) Kashta - 
She who is in the ultimate boundary

🌻 857 ) Akantha - 
She who removes sins

🌻 858 ) Kanthatha vigraha -
She who is half of her husband (kantha)

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

01 Dec 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 112

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 112 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. నరకము 🌻

మనము చేయు పనిని అనుసరించి మనము అనుభవించు ఫలితముండును. అయినచో మంచి పనులు చెడ్డపనులు అను విభాగము ఎట్లు ఏర్పడునుచున్నది? తనకు గాని ఇతరులకు గాని దుఃఖానుభవము కలిగించు పనులు చెడ్డవి అని, సుఖము కలిగించు పనులు మంచివి అని నిర్ణయించుకొనవలెను.

ఇది ఎట్లు తెలియును? తెలియుటకే దుష్కర్మలకు దుఃఖము ఫలితముగా ప్రకృతి నిర్ణయించుచున్నది. కలిగిన దుఃఖము వలన జీవుడు ఆ పని మాని మంచి పని చేయుటకై యత్నించుటయే జీవితమున దుఃఖానుభవమునకు ప్రయోజనము. ఇట్లు అధర్మ బుద్ధి నుండి ధర్మ బుద్ధికి జీవుడు మరలుటకే దుఃఖము సృష్టింపబడినది. దానినే నరకమందురు.

.....✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹

01 Dec 2021

వివేక చూడామణి - 160 / Viveka Chudamani - 160

🌹. వివేక చూడామణి - 160 / Viveka Chudamani - 160 🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -7 🍀

524. ఆత్మను దర్శించిన వ్యక్తి అన్నింటిలో బ్రహ్మాన్ని చూస్తూ, ఆ బ్రహ్మానంద స్థితిని ఆనందముగా అనుభవిస్తూ, తన సమయాన్ని కొనసాగిస్తుంటాడు.

525. ఆత్మలో ద్వంద్వ భావనను గ్రహించుట అనేది గాలిలో మేడలు కట్టుటతో సమానము. అందువలన ఎల్లపుడు నీవు బ్రహ్మానందములో స్థిరముగా ఉండి, ఆ ఉన్నతమైన ఆత్మలో ప్రశాంత స్థితిని పొందవలెను.

526. బ్రహ్మాన్ని తెలుసుకొన్న యోగికి మనస్సు అసత్యమైన విషయాలలో చిక్కుకొని ఊగిసలాడుతుంటే అది, తన యొక్క సమ స్థితిలో బ్రహ్మాన్ని దర్శించి తాను స్థిరముగా బ్రహ్మానంద స్థితిలో నిమగ్నమై ఉంటాడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 VIVEKA CHUDAMANI - 160 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 32. I am the one who knows Brahman -7🌻

524. Beholding the Self alone in all circumstances, thinking of the Self, the One without a second, and enjoying the Bliss of the Self, pass thy time, O noble soul !

525. Dualistic conceptions in the Atman, the Infinite Knowledge, the Absolute, are like imagining castles in the air. Therefore, always identifying thyself with the Bliss Absolute, the One without a second, and thereby attaining Supreme Peace, remain quiet.

526. To the sage who has realised Brahman, the mind, which is the cause of unreal fancies, becomes perfectly tranquil. This verily is his state of quietude, in which, identified with Brahman, he has constant enjoyment of the Bliss Absolute, the One without a second.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

01 Dec 2021

శ్రీ శివ మహా పురాణము - 483

🌹 . శ్రీ శివ మహా పురాణము - 483 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 37

🌻. పెళ్ళి హడావుడి - 2 🌻

పాలు, నేయి మరియు పెరుగును దిగుడు బావుల వంటి పాత్రలలో నింపియుంచిరి. యవలు మొదలగు ధాన్యములు, వాటి పిండి, మిఠాయి (12), చేగోడీలు, స్వస్తికలు, ఇతర మధుర పదార్థములు గుట్టలుగా పోయబడెను. మరియు అమృతమువంటి చెరుకు రసము నూతుల రూపములో లభింపచేయబడెను (13).

తాజా నెయ్యి, ఆసవములు సమృద్ధిగా సరఫరా చేయబడెను. గొప్ప రుచిగల వివిధ రకముల అన్నము సమృద్ధముగా లభించుచుండెను (14). శివగణములకు, దేవతలకు అభీష్టములగు అనేకరకముల పచ్చళ్లు సిద్ధమయ్యెను. గొప్ప విలువైన అనేక వస్త్రములుసిద్ధముగా నుంచబడెను. అగ్నియందు శుద్ధి చేయబడిన వెండి బంగారములు భద్రపరుప బడెను (15).

ఆయన వివిధ మణులను, రత్నములను, బంగారమును, వెండిని, ఇతర ద్రవ్యములను యథావిధిగా సంపాదించి సిద్ధము చేసెను (16). మంగళ కార్యములను చేయవలసిన రోజున ఆయన ఆ కార్యములను మొదలు పెట్టించెను. పర్వతుని అంతః పురస్త్రీలు పార్వతికి స్నానాది సంస్కారములను చేయించిరి (17).

ఆ నగరములోని బ్రాహ్మణ స్త్రీలు తాము అలంకరించుకొని లోకాచారము ననుసరించి ఆనందముతో మంగళ కర్మల ననుష్ఠించిరి (18). హిమవంతుడు ఆనందముతో నిండిన మనస్సు గలవాడై మంగళకర్మలను, ఉత్సవమును ఆచారముననుసరించి చేయించెను (19).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

01 Dec 2021

గీతోపనిషత్తు -284

🌹. గీతోపనిషత్తు -284 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚

శ్లోకము 15-1

🍀 15-1. తత్వ మొక్కటే ! - దైవమొక తత్త్వము. ఆ మూలతత్త్వ మాధారము గనే సర్వమును పుట్టుచు, పెరుగుచు పూర్ణముగ వృద్ధి చెంది, మరల కృశించి అందులోనికే లయమగు చుండును. అట్టి తత్త్వము నుండి పుట్టినదంతయు అతని రూపమే. మనయందలి సర్వాంగముల యందు మనమే వ్యాపించి యున్నట్లు, విశ్వ మందలి సమస్త అంశముల యందు దైవమే వ్యాప్తి చెంది యున్నాడు. రూప ధ్యానమున ఒక మెలకువ అవసరము. సమస్త సృష్టి వ్యాప్తి చెందియున్న దైవమును ఈ రూపము ద్వారా ఆరాధించు చున్నామని భావింప వలెను. 🍀

జ్ఞానయజ్జెన చాప్యన్యే యజంతో మాముపాసతే |
ఏకత్వేన పృథక్ష్యేవ బహుధా విశ్వతో ముఖమ్ || 15

తాత్పర్యము : అనన్య భావనతో కొందరు, జ్ఞాన యజ్ఞము ద్వారా కొందరు, బహు విధములుగ కొందరు విశ్వరూపుడనగు నన్ను ఉపాసించుచున్నారు.

వివరణము : సనాతన ధర్మమును అద్దము పట్టి చూపించు శ్లోకమిది. దైవము విశ్వతోముఖుడు. అనగా విశ్వరూపుడు. విశ్వముగ గోచరించువాడు. విశ్వమంతయు దైవముతోనే నిండి యున్నది. అతనికి ఇతమిద్ధమగు రూపము లేదు. అన్ని రూపములు అతని నుండి ఏర్పడినవే. నిజమునకు దైవ మతడు కాదు, ఆమె కాదు. రెండును. దైవమొక తత్త్వము. ఆ మూలతత్త్వ మాధారము గనే సర్వమును పుట్టుచు, పెరుగుచు పూర్ణముగ వృద్ధి చెంది, మరల కృశించి అందులోనికే లయమగు చుండును. అట్టి తత్త్వము నుండి పుట్టినదంతయు అతని రూపమే. మనయందలి సర్వాంగముల యందు మనమే వ్యాపించి యున్నట్లు, విశ్వ మందలి సమస్త అంశముల యందు దైవమే వ్యాప్తి చెంది యున్నాడు.

మన శరీరమున ఎవరు ఎక్కడ స్పృశించినను మనలను స్పృశించినట్లే కదా! అట్లే దైవమును ఏ రూపమున భావించినను అతనిని భావించినట్లే. రూప ధ్యానమున ఒక మెలకువ అవసరము. సమస్త సృష్టి వ్యాప్తి చెందియున్న దైవమును ఈ రూపము ద్వారా ఆరాధించు చున్నామని భావింపవలెను. ఆ రూపమునకే పరిమితము కాకుండ, రూపము నిమిత్తముగ విశ్వరూపు నారాధించు చున్నాను అని తెలిసి ఆరాధించ వలెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

01 Dec 2021

1-DECEMBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 01, బుధవారం, డిసెంబర్ 2021  సౌమ్య వారము 🌹
🍀. కార్తీక మాసం 27వ రోజు 🍀 
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 284 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 483🌹 
4) 🌹 వివేక చూడామణి - 160 / Viveka Chudamani - 160🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -112🌹  
6) 🌹 Osho Daily Meditations - 101🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 160 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 160🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శుభ బుధవారం మిత్రులందరికీ 🌹*
*01, డిసెంబర్‌ 2021, సౌమ్య వారము*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. కార్తీక మాసం 27వ రోజు 🍀*

*నిషిద్ధములు : ఉల్లి, వంకాయ*
*దానములు : ఉసిరి, వెండి, బంగారం, ధనం, దీపాలు*
*పూజించాల్సిన దైవము : కార్తీక దామోదరుడు*
జపించాల్సిన మంత్రము : ఓం శ్రీభూతులసీ ధాత్రీసమేత కార్తీక *దామోదరాయ స్వాహా*
*ఫలితము : మహాయోగం, రాజభోగం, మోక్షసిద్ధి*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
దక్షిణాయణం, శరద్‌ ఋతువు,  
కార్తీక మాసం 
తిథి: కృష్ణ ద్వాదశి 23:36:40 
వరకు తదుపరి కృష్ణ త్రయోదశి
నక్షత్రం: చిత్ర 18:47:01 
వరకు తదుపరి స్వాతి
యోగం: సౌభాగ్య 20:44:12 
వరకు తదుపరి శోభన
కరణం: కౌలవ 12:55:09 వరకు
వర్జ్యం: 03:59:00 - 05:27:48 
మరియు 23:50:34 - 25:17:18
దుర్ముహూర్తం: 11:42:39 - 12:27:19
రాహు కాలం: 12:04:59 - 13:28:45
గుళిక కాలం: 10:41:13 - 12:04:59
యమ గండం: 07:53:40 - 09:17:26
అభిజిత్ ముహూర్తం: 11:42 - 12:26
అమృత కాలం: 12:51:48 - 14:20:36
సూర్యోదయం: 06:29:53
సూర్యాస్తమయం: 17:40:05
వైదిక సూర్యోదయం: 06:33:45
వైదిక సూర్యాస్తమయం: 17:36:14
చంద్రోదయం: 03:07:27
చంద్రాస్తమయం: 15:13:46
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: కన్య
కాలదండ యోగం - మృత్యు భయం 
18:47:01 వరకు తదుపరి ధూమ్ర 
యోగం - కార్య భంగం, సొమ్ము నష్టం
పండుగలు : లేదు
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -284 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 15-1
 
*🍀 15-1. తత్వ మొక్కటే ! - దైవమొక తత్త్వము. ఆ మూలతత్త్వ మాధారము గనే సర్వమును పుట్టుచు, పెరుగుచు పూర్ణముగ వృద్ధి చెంది, మరల కృశించి అందులోనికే లయమగు చుండును. అట్టి తత్త్వము నుండి పుట్టినదంతయు అతని రూపమే. మనయందలి సర్వాంగముల యందు మనమే వ్యాపించి యున్నట్లు, విశ్వ మందలి సమస్త అంశముల యందు దైవమే వ్యాప్తి చెంది యున్నాడు. రూప ధ్యానమున ఒక మెలకువ అవసరము. సమస్త సృష్టి వ్యాప్తి చెందియున్న దైవమును ఈ రూపము ద్వారా ఆరాధించు చున్నామని భావింప వలెను. 🍀*

జ్ఞానయజ్జెన చాప్యన్యే యజంతో మాముపాసతే |
ఏకత్వేన పృథక్ష్యేవ బహుధా విశ్వతో ముఖమ్ || 15

తాత్పర్యము : అనన్య భావనతో కొందరు, జ్ఞాన యజ్ఞము ద్వారా కొందరు, బహు విధములుగ కొందరు విశ్వరూపుడనగు నన్ను ఉపాసించుచున్నారు.

వివరణము : సనాతన ధర్మమును అద్దము పట్టి చూపించు శ్లోకమిది. దైవము విశ్వతోముఖుడు. అనగా విశ్వరూపుడు. విశ్వముగ గోచరించువాడు. విశ్వమంతయు దైవముతోనే నిండి యున్నది. అతనికి ఇతమిద్ధమగు రూపము లేదు. అన్ని రూపములు అతని నుండి ఏర్పడినవే. నిజమునకు దైవ మతడు కాదు, ఆమె కాదు. రెండును. దైవమొక తత్త్వము. ఆ మూలతత్త్వ మాధారము గనే సర్వమును పుట్టుచు, పెరుగుచు పూర్ణముగ వృద్ధి చెంది, మరల కృశించి అందులోనికే లయమగు చుండును. అట్టి తత్త్వము నుండి పుట్టినదంతయు అతని రూపమే. మనయందలి సర్వాంగముల యందు మనమే వ్యాపించి యున్నట్లు, విశ్వ మందలి సమస్త అంశముల యందు దైవమే వ్యాప్తి చెంది యున్నాడు. 

మన శరీరమున ఎవరు ఎక్కడ స్పృశించినను మనలను స్పృశించినట్లే కదా! అట్లే దైవమును ఏ రూపమున భావించినను అతనిని భావించినట్లే. రూప ధ్యానమున ఒక మెలకువ అవసరము. సమస్త సృష్టి వ్యాప్తి చెందియున్న దైవమును ఈ రూపము ద్వారా ఆరాధించు చున్నామని భావింపవలెను. ఆ రూపమునకే పరిమితము కాకుండ, రూపము నిమిత్తముగ విశ్వరూపు నారాధించు చున్నాను అని తెలిసి ఆరాధించ వలెను. 

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 483 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 37

*🌻. పెళ్ళి హడావుడి - 2 🌻*

పాలు, నేయి మరియు పెరుగును దిగుడు బావుల వంటి పాత్రలలో నింపియుంచిరి. యవలు మొదలగు ధాన్యములు, వాటి పిండి, మిఠాయి (12), చేగోడీలు, స్వస్తికలు, ఇతర మధుర పదార్థములు గుట్టలుగా పోయబడెను. మరియు అమృతమువంటి చెరుకు రసము నూతుల రూపములో లభింపచేయబడెను (13).

తాజా నెయ్యి, ఆసవములు సమృద్ధిగా సరఫరా చేయబడెను. గొప్ప రుచిగల వివిధ రకముల అన్నము సమృద్ధముగా లభించుచుండెను (14). శివగణములకు, దేవతలకు అభీష్టములగు అనేకరకముల పచ్చళ్లు సిద్ధమయ్యెను. గొప్ప విలువైన అనేక వస్త్రములుసిద్ధముగా నుంచబడెను. అగ్నియందు శుద్ధి చేయబడిన వెండి బంగారములు భద్రపరుప బడెను (15). 

ఆయన వివిధ మణులను, రత్నములను, బంగారమును, వెండిని, ఇతర ద్రవ్యములను యథావిధిగా సంపాదించి సిద్ధము చేసెను (16). మంగళ కార్యములను చేయవలసిన రోజున ఆయన ఆ కార్యములను మొదలు పెట్టించెను. పర్వతుని అంతః పురస్త్రీలు పార్వతికి స్నానాది సంస్కారములను చేయించిరి (17).

ఆ నగరములోని బ్రాహ్మణ స్త్రీలు తాము అలంకరించుకొని లోకాచారము ననుసరించి ఆనందముతో మంగళ కర్మల ననుష్ఠించిరి (18). హిమవంతుడు ఆనందముతో నిండిన మనస్సు గలవాడై మంగళకర్మలను, ఉత్సవమును ఆచారముననుసరించి చేయించెను (19). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 160 / Viveka Chudamani - 160 🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -7 🍀*

*524. ఆత్మను దర్శించిన వ్యక్తి అన్నింటిలో బ్రహ్మాన్ని చూస్తూ, ఆ బ్రహ్మానంద స్థితిని ఆనందముగా అనుభవిస్తూ, తన సమయాన్ని కొనసాగిస్తుంటాడు.*

*525. ఆత్మలో ద్వంద్వ భావనను గ్రహించుట అనేది గాలిలో మేడలు కట్టుటతో సమానము. అందువలన ఎల్లపుడు నీవు బ్రహ్మానందములో స్థిరముగా ఉండి, ఆ ఉన్నతమైన ఆత్మలో ప్రశాంత స్థితిని పొందవలెను.*

*526. బ్రహ్మాన్ని తెలుసుకొన్న యోగికి మనస్సు అసత్యమైన విషయాలలో చిక్కుకొని ఊగిసలాడుతుంటే అది, తన యొక్క సమ స్థితిలో బ్రహ్మాన్ని దర్శించి తాను స్థిరముగా బ్రహ్మానంద స్థితిలో నిమగ్నమై ఉంటాడు.*

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 160 🌹*
*✍️ Sri Adi Shankaracharya*
*Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*

*🌻 32. I am the one who knows Brahman -7🌻*

*524. Beholding the Self alone in all circumstances, thinking of the Self, the One without a second, and enjoying the Bliss of the Self, pass thy time, O noble soul !*

*525. Dualistic conceptions in the Atman, the Infinite Knowledge, the Absolute, are like imagining castles in the air. Therefore, always identifying thyself with the Bliss Absolute, the One without a second, and thereby attaining Supreme Peace, remain quiet.*

*526. To the sage who has realised Brahman, the mind, which is the cause of unreal fancies, becomes perfectly tranquil. This verily is his state of quietude, in which, identified with Brahman, he has constant enjoyment of the Bliss Absolute, the One without a second.*

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 112 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*సంకలనము : వేణుమాధవ్*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. నరకము 🌻*

*మనము చేయు పనిని అనుసరించి మనము అనుభవించు ఫలితముండును. అయినచో మంచి పనులు చెడ్డపనులు అను విభాగము ఎట్లు ఏర్పడునుచున్నది? తనకు గాని ఇతరులకు గాని దుఃఖానుభవము కలిగించు పనులు చెడ్డవి అని, సుఖము కలిగించు పనులు మంచివి అని నిర్ణయించుకొనవలెను.*

*ఇది ఎట్లు తెలియును? తెలియుటకే దుష్కర్మలకు దుఃఖము ఫలితముగా ప్రకృతి నిర్ణయించుచున్నది. కలిగిన దుఃఖము వలన జీవుడు ఆ పని మాని మంచి పని చేయుటకై యత్నించుటయే జీవితమున దుఃఖానుభవమునకు ప్రయోజనము. ఇట్లు అధర్మ బుద్ధి నుండి ధర్మ బుద్ధికి జీవుడు మరలుటకే దుఃఖము సృష్టింపబడినది. దానినే నరకమందురు.*

.....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 101 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 101. THE ONLY DUTY 🍀*

*🕉 One thing that one should always maintain -- and it is the only duty is to be happy. 🕉*
 
*Make it a religion to be happy. If you are not happy, something must be wrong and some drastic change is needed. Let happiness decide. I am a hedonist. And happiness is the only criterion humankind has.*

*There is no other criterion. Happiness gives you the clue that things are going well. Unhappiness gives you the indication that things are going wrong and that a great change is needed somewhere.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 160 / Sri Lalita Sahasranamavali - Meaning - 160 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 160. గంభీరా, గగనాంతఃస్థా, గర్వితా, గానలోలుపా ।
కల్పనారహితా, కాష్ఠా, కాంతా, కాంతార్ధ విగ్రహా ॥ 160 ॥ 🍀*

🍀 851. గంభీరా : 
లోతైనది (అమ్మణ్ణి తత్వము తెల్సుకొనుట కష్టము) 

🍀 852. గగనాంతస్తా : 
ఆకాశమునందు ఉండునది 

🍀 853. గర్వితా : 
గర్వము కలిగినది 

🍀 854. గానలోలుపా : 
సంగీతమునందు ప్రీతి కలిగినది 

🍀 855. కల్పనారహితా : 
ఎట్టి కల్పన లేనిది 

🍀 856. కాష్ఠా : 
కాలపరిగణన లో అత్యంత స్వల్పభాగము (రెప్పపాటుకన్న తక్కువ సమయం) 

🍀 857. కాంతా : 
కాంతి కలిగినది 

🍀 858. కాంతార్ధ విగ్రహ : 
కాంతుడైన ఈశ్వరునిలో అర్ధభాగము 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 160 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 160. Ganbhira gaganantahsdha garvita ganalolupa
Kalpanarahita kashtakanta kantardha vigraha ॥ 160 ॥ 🌻*

🌻 851 ) Gambheera -   
She whose depth cannot be measured

🌻 852 ) Gagananthastha -   
She who is situated in the sky

🌻 853 ) Garvitha -   
She who is proud

🌻 854 ) Gana lolupa -   
She who likes songs

🌻 855 ) Kalpana rahitha -   
She who does not imagine

🌻 856 ) Kashta - She who is in the ultimate boundary

🌻 857 ) Akantha - She who removes sins

🌻 858 ) Kanthatha vigraha -   
She who is half of her husband (kantha)

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామములు #LalithaSahasranam
 #PrasadBhardwaj 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ https://mymandir.page.link/wdh7G
https://t.me/ChaitanyaVijnanam 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 324 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 324-1

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 324 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 324-1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 73. కామ్యా, కామకళారూపా, కదంబ కుసుమ ప్రియా ।
కళ్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా ॥ 73 ॥ 🍀

🌻 324-1. 'కళ్యాణీ' 🌻

మంగళకరమైన వాక్కులను పలుకునది శ్రీదేవి యని అర్థము. 'కల్య' అనగా శుభాత్మకమైన వాక్కు, 'అణతి' అనగా శబ్దించునది అని అర్థము. శుభాత్మకమైన వాక్కులను శబ్దించునది కళ్యాణి. మానవుడొక్కడే మాటాడువాడు. వాక్కు అతనికి మాత్రమే అనుగ్రహింపబడినది. వాక్కు రూపమున శ్రీదేవియే యున్నది. ఆమెయే పలికినచో మంగళకరముగ నుండును. వారినే సరస్వతీ పుత్రులందురు. వారి నుండి సరస్వతి ప్రవహించుచు నుండును.

మలినములగు భాషణ ములు వారినుండి వ్యక్తము కావు. పరుషమగు వాక్కులు కూడ వ్యక్తము గావు. వారి భాషణము ద్వారా ఇతరులకు ప్రీతియే కలుగును గాని మరి ఏ విధమగు సంచలనము కలిగించదు. వారు కేవలము ప్రీతికే పలుకరు. వారి వాక్కున సత్యము కూడ యుండును. జ్ఞానము సహజ ముగ నుండును. భాషణమున దివ్యత్వము ఆవిష్కరింపబడును. వాక్కును ఎంత కళ్యాణముగ మానవుడు తీర్చిదిద్దుకొనునో అంతమేరకు అతని జీవితము కల్యాణమయ మగును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 324-1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 73. Kamya kamakalarupa kadanba kusumapriya
Kalyani jagatikanda karunarasasagara ॥ 73 ॥ 🌻

🌻 324-1. Kalyāṇī कल्याणी (324)🌻

She is the embodiment of auspiciousness. Kalyāṇa means illustrious, noble, generous, virtuous, good etc. Rig-Veda (ऋग्वेद) I.31.9 uses the word Kalyāṇa. The Veda says, “तनूक्र्द बोधि परमतिश्च कारवे तवं कल्याण वसु विश्वमोपिषे tanūkrda bodhi paramatiśca kārave tavaṃ kalyāṇa vasu viśvamopiṣe”, where Kalyāṇa is used to mean worthy. The same nāma appears in Lalitā Triśatī as nāma 2. The power of auspiciousness in the form of positive energy can be realised through powerful vibrations.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

30 Nov 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 102

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 102 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. పరవశంగా వుండటమంటే కాంతివంతంగా వుండడమే. అప్పటికే జ్వాల అక్కడ వుంది. నువ్వేమి చేయాల్సిన పన్లేదు. నువ్వు కేవలం దాన్ని కనిపెట్టాలి. అది నీలోనే వుంది. 🍀

పరవశంగా వుండటమంటే కాంతివంతంగా వుండడమే. అప్పటికే జ్వాల అక్కడ వుంది. నువ్వేమి చేయాల్సిన పన్లేదు. నువ్వు కేవలం దాన్ని కనిపెట్టాలి. అది నీలోనే వుంది. నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సిన పన్లేదు. నిశ్శబ్దంగా వుండు. నిర్మలంగా వుండు. అన్వేషించు. నువ్వు గుంపుగా వున్న ఆలోచనల గుండా. కోరికల గుండా ప్రయాణించాలి. కానీ ఆ గుంపు బయటి నించే కనిపించినంత పెద్దది కాదు. నువ్వు కొద్దిగా సందు చేసుకుని తలదూర్చాలి.

కానీ అది అందమైన ఆట. తమాషా ఆట. ధ్యానించడం వుల్లాసం కలిగించే ఆట. ఒకసారి కోరికల గుండా విశాలమయిన ఆకాశంలోకి అడుగు పెడితే నువ్వు జ్వాలని చూస్తావు. ఆ జ్వాల అనంత అస్తిత్వ జ్వాలలో భాగంగా చూస్తావు. ఆ జ్వాల నీలో వెలగడాన్ని చూస్తావు. అనంత విశ్వంలో చూస్తావు.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

30 Nov 2021

మైత్రేయ మహర్షి బోధనలు - 35

🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 35 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 24. ఓర్పు 🌻

ఓర్పు, ఓర్పు, ఓర్పు! సాధకుని జీవితమున ఈ పదము అర్థరహితము కారాదు. ఓర్పునకు భూమియే గురువు. ఓర్పు వహించలేని సమయమున భూమిని చూసి మరల స్ఫూర్తి చెందవలెను. ఓర్పు లేనివారికి వాతావరణము నందలి దివ్యశక్తులు సహకారము నందించజాలవు. ఓర్పు గల వానికి కాల క్రమమున సమస్తము అనుకూలింప గలవు. సాధన యందు ఓర్పు వహించుటయే పెద్ద పరీక్ష, ఓర్పును కోల్పోయినచో సమస్తమును కోల్పోయెదవు. అనంత శక్తికి ముఖద్వారము ఓర్పుయే.

ఓర్పుతోనే నలుడు, హరిశ్చంద్రుడు, యుధిష్ఠిరుడు కోల్పోయిన వైభవమును తిరిగి పొందిరి. ఓర్పు వలన మూడు లోకముల యందు జయము లభింపగలదు. ఓర్పు గలవాడే నిజమైన బలవంతుడు. ఓర్పుతో నీ కందించిన సద్విషయములను నిర్వర్తించుచుండుము. మా సోదర బృందముతో పనిచేయుటకు వలసిన నేర్పు, ఓర్పు మాత్రమే.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

30 Nov 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 518 / Vishnu Sahasranama Contemplation - 518

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 518 / Vishnu Sahasranama Contemplation - 518 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻518. అనన్తాఽఽత్మా, अनन्ताऽऽत्मा, Anantā’’tmā🌻

ఓం అనన్తాత్మనే నమః | ॐ अनन्तात्मने नमः | OM Anantātmane namaḥ

అనన్తాత్మేతి సమ్ప్రోక్తో దేశతః కాలతోఽపివా ।
వస్తుతశ్చాపరిచ్ఛిన్నో విష్ణుర్వేదాన్తిభిర్బుధైః ॥

దేశముచే గానీ, కాలముచే గానీ, వస్తువుగా కానీ ఏర్పరచదగు పరిమాణము అంతము; అట్టి అంతము లేనిది అనంతము. పరమాత్మ తత్త్వమునకు ఈ మూడు విధములలో దేని చేతనూ పరిమితి నిర్ణయింప శక్యము కాదు. అనంతమగు ఆత్మ స్వరూపము ఎవనికి కలదో అట్టివాడు. లేదా అనంతమగు ఆత్మ ఎవనిదో అట్టివాడు అనన్తాత్మా.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 518 🌹

📚. Prasad Bharadwaj

🌻 518. Anantā’’tmā 🌻

OM Anantātmane namaḥ

अनन्तात्मेति सम्प्रोक्तो देशतः कालतोऽपिवा ।
वस्तुतश्चापरिच्छिन्नो विष्णुर्वेदान्तिभिर्बुधैः ॥

Anantātmeti samprokto deśataḥ kālato’pivā,
Vastutaścāparicchinno viṣṇurvedāntibhirbudhaiḥ.

That which is confined by space, time or as an object has 'anta'. That which has no anta is Ananta. He who cannot be determined by space, time and causation is Anantātmā.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

जीवो विनयिता साक्षी मुकुन्दोऽमितविक्रमः ।
अम्भोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः ॥ ५५ ॥

జీవో వినయితా సాక్షీ ముకున్దోఽమితవిక్రమః ।
అమ్భోనిధిరనన్తాత్మా మహోదధిశయోఽన్తకః ॥ 55 ॥

Jīvo vinayitā sākṣī mukundo’mitavikramaḥ,
Ambhonidhiranantātmā mahodadhiśayo’ntakaḥ ॥ 55 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

30 Nov 2021

30-NOVMEBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 30, నవంబర్ 2021 మంగళ వారం, భౌమ వారము, కార్తీక మాసం 26వ రోజు 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 121 / Bhagavad-Gita - 121 3-02🌹*
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 518 / Vishnu Sahasranama Contemplation - 518 🌹
4) 🌹 DAILY WISDOM - 196🌹 
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 35🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 102 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 324-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 324-1 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹*
*30, నవంబర్‌ 2021, భౌమవారము*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. కార్తీక మాసం 26వ రోజు 🍀*

*నిషిద్ధములు : సమస్త పదార్ధాలు*
*దానములు : నిలవ వుండే సరుకులు*
*పూజించాల్సిన దైవము : కుబేరుడు*
*జపించాల్సిన మంత్రము : ఓం కుబేరాయవై శ్రవణాయ మహారాజాయ స్వాహా*
*ఫలితము : ధనలబ్ది, లాటరీ విజయం, సిరిసంపదల అభివృద్ధి*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
దక్షిణాయణం, శరద్‌ ఋతువు,  
కార్తీక మాసం 
తిథి: కృష్ణ ఏకాదశి 26:15:37 
వరకు తదుపరి కృష్ణ ద్వాదశి
నక్షత్రం: హస్త 20:34:28 వరకు 
తదుపరి చిత్ర
యోగం: ఆయుష్మాన్ 24:03:02 
వరకు తదుపరి సౌభాగ్య
 కరణం: బవ 15:13:42 వరకు
వర్జ్యం: 05:42:51 - 07:14:15
దుర్ముహూర్తం: 08:43:25 - 09:28:08
రాహు కాలం: 14:52:16 - 16:16:06
గుళిక కాలం: 12:04:36 - 13:28:26
యమ గండం: 09:16:57 - 10:40:47
అభిజిత్ ముహూర్తం: 11:42 - 12:26
అమృత కాలం: 14:51:15 - 16:22:39
సూర్యోదయం: 06:29:17
సూర్యాస్తమయం: 17:39:55
వైదిక సూర్యోదయం: 06:33:09
వైదిక సూర్యాస్తమయం: 17:36:05
చంద్రోదయం: 02:10:46
చంద్రాస్తమయం: 14:32:41
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: కన్య
సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం 
20:34:28 వరకు తదుపరి ధ్వాoక్ష 
యోగం - ధన నాశనం, కార్య హాని
పండుగలు : ఉత్పన్న ఏకాదశి, 
Utpanna Ekadashi
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత -121 / Bhagavad-Gita - 121 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 2 🌴*

2. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మెహయసీవ మే |
తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయో(హమాప్నుయామ్ ||

🌷. తాత్పర్యం :
*అనేకార్థములు కలిగిన నీ భోధలచే నా బుద్ధి మోహము నొందినది. కావున నాకు ఏది అత్యంత శ్రేయోదాయకమో దయతో నిశ్చయముగా తెలియజేయుము.*

🌷. భాష్యము :
 భగవద్గీత ఉపోద్ఘాతముగా గడచిన అధ్యాయములో సాంఖ్యయోగము, బుద్ధియోగము, బుద్ధిచే ఇంద్రియనిగ్రహము, ఫలాపేక్షరహిత కర్మము, ప్రారంభదశలో గల సాధకుని స్థితులనెడి వివిధ విషయములు వర్ణింపబడినవి. కాని అవియన్నియును ఒక క్రమపద్దతిలో వివరింపబడలేదు. వాని సంపూర్ణావగాహనకు మరియు ఆచరణకు ఒక క్రమపద్ధతి అత్యంత అవసరమై యున్నది. 

కనుకనే అర్జునుడు బాహ్యమునకు అస్పష్టముగా గోచరించు ఆ విషయములను సంపూర్ణముగా తెలియనెంచెను. తద్ద్వారా సాధారణవ్యక్తి సైతము వాటిని ఎటువంటి కల్పనలు మరియు వ్యతిరేకవివరణలు లేకుండా అంగీకరించు అవకాశము కలుగును. తన పదప్రయోగాముచే అర్జుని అర్జునుని తన ప్రశ్నల ద్వారా భగవద్గీత అంతరార్థమును తెలిసికొనగోరు నిష్టాపూర్ణులకు కృష్ణభక్తిరసభావనా మార్గము సుగమము చేయుచున్నాడు. 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 121 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 3 - Karma Yoga - 02 🌴*

2. vyāmiśreṇeva vākyena buddhiṁ mohayasīva me
tad ekaṁ vada niścitya yena śreyo ’ham āpnuyām

🌷Translation :
*My intelligence is bewildered by Your equivocal instructions. Therefore, please tell me decisively which will be most beneficial for me.*

🌷 Purport :
In the previous chapter, as a prelude to the Bhagavad-gītā, many different paths were explained, such as sāṅkhya-yoga, buddhi-yoga, control of the senses by intelligence, work without fruitive desire, and the position of the neophyte. This was all presented unsystematically. A more organized outline of the path would be necessary for action and understanding. 

Arjuna, therefore, wanted to clear up these apparently confusing matters so that any common man could accept them without misinterpretation. Although Kṛṣṇa had no intention of confusing Arjuna by any jugglery of words, Arjuna could not follow the process of Kṛṣṇa consciousness – either by inertia or by active service. In other words, by his questions he is clearing the path of Kṛṣṇa consciousness for all students who seriously want to understand the mystery of the Bhagavad-gītā.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 518 / Vishnu Sahasranama Contemplation - 518 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻518. అనన్తాఽఽత్మా, अनन्ताऽऽत्मा, Anantā’’tmā🌻*

*ఓం అనన్తాత్మనే నమః | ॐ अनन्तात्मने नमः | OM Anantātmane namaḥ*

అనన్తాత్మేతి సమ్ప్రోక్తో దేశతః కాలతోఽపివా ।
వస్తుతశ్చాపరిచ్ఛిన్నో విష్ణుర్వేదాన్తిభిర్బుధైః ॥

*దేశముచే గానీ, కాలముచే గానీ, వస్తువుగా కానీ ఏర్పరచదగు పరిమాణము అంతము; అట్టి అంతము లేనిది అనంతము. పరమాత్మ తత్త్వమునకు ఈ మూడు విధములలో దేని చేతనూ పరిమితి నిర్ణయింప శక్యము కాదు. అనంతమగు ఆత్మ స్వరూపము ఎవనికి కలదో అట్టివాడు. లేదా అనంతమగు ఆత్మ ఎవనిదో అట్టివాడు అనన్తాత్మా.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 518 🌹*
📚. Prasad Bharadwaj

*🌻 518. Anantā’’tmā 🌻*

*OM Anantātmane namaḥ*

अनन्तात्मेति सम्प्रोक्तो देशतः कालतोऽपिवा ।
वस्तुतश्चापरिच्छिन्नो विष्णुर्वेदान्तिभिर्बुधैः ॥

Anantātmeti samprokto deśataḥ kālato’pivā,
Vastutaścāparicchinno viṣṇurvedāntibhirbudhaiḥ.

*That which is confined by space, time or as an object has 'anta'. That which has no anta is Ananta. He who cannot be determined by space, time and causation is Anantātmā.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
जीवो विनयिता साक्षी मुकुन्दोऽमितविक्रमः ।
अम्भोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः ॥ ५५ ॥

జీవో వినయితా సాక్షీ ముకున్దోఽమితవిక్రమః ।
అమ్భోనిధిరనన్తాత్మా మహోదధిశయోఽన్తకః ॥ 55 ॥

Jīvo vinayitā sākṣī mukundo’mitavikramaḥ,
Ambhonidhiranantātmā mahodadhiśayo’ntakaḥ ॥ 55 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 196 🌹*
*🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 14. There Seems to be a Ray of Light on the Horizon 🌻*

*Before the Universal takes possession of us, it burnishes us and cleanses us completely. This process of cleansing is the mystical death of the individual spirit. There it does not know what happens to it. That is the wilderness; that is the dark night of the soul; that is the suffering, and that is where we do not know whether we will attain anything or not. We weep silently, but nobody is going to listen to our wails. But the day dawns, the sun shines and there seems to be a ray of light on the horizon. That is towards the end of the Virata Parva of the Mahabharata.*

*After untold suffering for years, which the human mind cannot usually stomach, a peculiar upsurge of fortune miraculously seems to operate in favour of the suffering spirit, and unasked help comes from all sides. In the earlier stages, it appeared that nothing would come even if we asked. We had to cry alone in the forest, and nobody would listen to our cry. Now the tables have turned and help seems to be pouring in from all directions, unrequested.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 35 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
 *సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 24. ఓర్పు 🌻*

*ఓర్పు, ఓర్పు, ఓర్పు! సాధకుని జీవితమున ఈ పదము అర్థరహితము కారాదు. ఓర్పునకు భూమియే గురువు. ఓర్పు వహించలేని సమయమున భూమిని చూసి మరల స్ఫూర్తి చెందవలెను. ఓర్పు లేనివారికి వాతావరణము నందలి దివ్యశక్తులు సహకారము నందించజాలవు. ఓర్పు గల వానికి కాల క్రమమున సమస్తము అనుకూలింప గలవు. సాధన యందు ఓర్పు వహించుటయే పెద్ద పరీక్ష, ఓర్పును కోల్పోయినచో సమస్తమును కోల్పోయెదవు. అనంత శక్తికి ముఖద్వారము ఓర్పుయే.*

*ఓర్పుతోనే నలుడు, హరిశ్చంద్రుడు, యుధిష్ఠిరుడు కోల్పోయిన వైభవమును తిరిగి పొందిరి. ఓర్పు వలన మూడు లోకముల యందు జయము లభింపగలదు. ఓర్పు గలవాడే నిజమైన బలవంతుడు. ఓర్పుతో నీ కందించిన సద్విషయములను నిర్వర్తించుచుండుము. మా సోదర బృందముతో పనిచేయుటకు వలసిన నేర్పు, ఓర్పు మాత్రమే.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 102 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. పరవశంగా వుండటమంటే కాంతివంతంగా వుండడమే. అప్పటికే జ్వాల అక్కడ వుంది. నువ్వేమి చేయాల్సిన పన్లేదు. నువ్వు కేవలం దాన్ని కనిపెట్టాలి. అది నీలోనే వుంది. 🍀*

*పరవశంగా వుండటమంటే కాంతివంతంగా వుండడమే. అప్పటికే జ్వాల అక్కడ వుంది. నువ్వేమి చేయాల్సిన పన్లేదు. నువ్వు కేవలం దాన్ని కనిపెట్టాలి. అది నీలోనే వుంది. నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సిన పన్లేదు. నిశ్శబ్దంగా వుండు. నిర్మలంగా వుండు. అన్వేషించు. నువ్వు గుంపుగా వున్న ఆలోచనల గుండా. కోరికల గుండా ప్రయాణించాలి. కానీ ఆ గుంపు బయటి నించే కనిపించినంత పెద్దది కాదు. నువ్వు కొద్దిగా సందు చేసుకుని తలదూర్చాలి.*

*కానీ అది అందమైన ఆట. తమాషా ఆట. ధ్యానించడం వుల్లాసం కలిగించే ఆట. ఒకసారి కోరికల గుండా విశాలమయిన ఆకాశంలోకి అడుగు పెడితే నువ్వు జ్వాలని చూస్తావు. ఆ జ్వాల అనంత అస్తిత్వ జ్వాలలో భాగంగా చూస్తావు. ఆ జ్వాల నీలో వెలగడాన్ని చూస్తావు. అనంత విశ్వంలో చూస్తావు.*

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 324 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 324-1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 73. కామ్యా, కామకళారూపా, కదంబ కుసుమ ప్రియా ।*
*కళ్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా ॥ 73 ॥ 🍀*

*🌻 324-1. 'కళ్యాణీ' 🌻* 

మంగళకరమైన వాక్కులను పలుకునది శ్రీదేవి యని అర్థము. 'కల్య' అనగా శుభాత్మకమైన వాక్కు, 'అణతి' అనగా శబ్దించునది అని అర్థము. శుభాత్మకమైన వాక్కులను శబ్దించునది కళ్యాణి. మానవుడొక్కడే మాటాడువాడు. వాక్కు అతనికి మాత్రమే అనుగ్రహింపబడినది. వాక్కు రూపమున శ్రీదేవియే యున్నది. ఆమెయే పలికినచో మంగళకరముగ నుండును. వారినే సరస్వతీ పుత్రులందురు. వారి నుండి సరస్వతి ప్రవహించుచు నుండును. 

మలినములగు భాషణ ములు వారినుండి వ్యక్తము కావు. పరుషమగు వాక్కులు కూడ వ్యక్తము గావు. వారి భాషణము ద్వారా ఇతరులకు ప్రీతియే కలుగును గాని మరి ఏ విధమగు సంచలనము కలిగించదు. వారు కేవలము ప్రీతికే పలుకరు. వారి వాక్కున సత్యము కూడ యుండును. జ్ఞానము సహజ ముగ నుండును. భాషణమున దివ్యత్వము ఆవిష్కరింపబడును. వాక్కును ఎంత కళ్యాణముగ మానవుడు తీర్చిదిద్దుకొనునో అంతమేరకు అతని జీవితము కల్యాణమయ మగును. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 324-1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 73. Kamya kamakalarupa kadanba kusumapriya
Kalyani jagatikanda karunarasasagara ॥ 73 ॥ 🌻*

*🌻 324-1. Kalyāṇī कल्याणी (324)🌻*