శ్రీ లలితా సహస్ర నామములు - 162 / Sri Lalita Sahasranamavali - Meaning - 162
🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 162 / Sri Lalita Sahasranamavali - Meaning - 162 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 162. అజాక్షయ వినిర్ముక్తా, ముగ్ధా క్షిప్రప్రసాదినీ ।
అంతర్ముఖ సమారాధ్యా, బహిర్ముఖ సుదుర్లభా ॥ 162 ॥ 🍀
🍀 863. అజా :
పుట్టుక లేనిది
🍀 864. క్షయ వినిర్ముక్తా :
మాయాతేతమైనది
🍀 865. ముగ్ధా :
12 - 16 సంవత్సరముల బాలికా రూపము కలిగినది
🍀 866. క్షిప్రప్రసాదినీ :
వెంటనే అనుగరించునది
🍀 867. అంతర్ముఖసమారాధ్యా :
అంతర్ దృష్టి గల యోగులచే ఆరాధింపబడునది
🍀 868. బహిర్ముఖసుదుర్లభా :
ప్రాపంచిక దృష్టి కలవారికి లభింపనిది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 162 🌹
📚. Prasad Bharadwaj
🌻 162. Ajakshaya vinirmukta mugdha kshipraprasadini
Antarmukha samaradhya bahirmukha sudurlabha ॥ 162 ॥ 🌻
🌻 863 ) Ajha -
She who does not have birth
🌻 864 ) Kshaya nirmuktha -
She who does not have death
🌻 865 ) Gubdha -
She who is beautiful
🌻 866 ) Ksipra prasadhini -
She who is pleased quickly
🌻 867 ) Anthar mukha samaradhya -
She who is worshipped by internal thoughts
🌻 868 ) Bahir mukha sudurlabha -
She who can be attained by external prayers
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
05 Dec 2021
మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 114
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 114 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. జ్ఞానులు- దైత్యులు - 2 🌻
ఇక రెండవ తరగతి వారి దృష్టిలో అంతర్యామికున్న ప్రాధాన్యము మిగిలిన అంశములకు లేదు. అంతర్యామి ఈ రూపముతో ఉండవలెనని వారు భగవంతుని ఆజ్ఞాపింపరు. ఈ వరములు ఇమ్మని ఇరుకున పెట్టరు. ఇంత తపస్సు, యోగ సాధన చేసితిని అని దేవునకు రశీదు చూపించి దబాయించరు. దానికి ఫలితముగా సుఖమను మాటకు నిజమైన అర్థమును వీరు అనుభవించు చుందురు. వీరిని జ్ఞానులు, ముముక్షువులు అని పెద్దలు వ్యవహరింతురు.
వేదము, శాస్త్రము, ప్రకృతి శక్తుల వినియోగము, ఆచారము, ధర్మము, విధి నిషేధములు దైత్యులకును, మోక్ష జనులకును గూడా ఉన్నవి. దైత్యులలో తమ శాస్ర్తాదులకు తామే ప్రమాణము. సుఖము అను మాటకు తాము అనుకున్న అర్థమే తమకు ప్రమాణము. తత్ఫలితముగా సుఖమునకై శ్రమపడుట, సుఖము సాధింప యత్నించుచు కష్ట నష్టముల పాలగుట జరుగుచున్నది.
వీరి జీవితమునందు స్వేచ్ఛ ఉండదు. ఇతరుల అభిప్రాయములను అనుసరించి పట్టుదలతోనో, అంగీకారముతోనో బ్రదకవలసి యుండును. తమ జీవితానుభవమునకు ఇతరులే నాయకులు. తాము ఇతరుల జీవితములకు, పద్ధతులకు నాయకులు. అనగా ఇతరుల మంచి చెడ్డలను గూర్చి తమకు గట్టి అభిప్రాయములు ఉండును. నిర్భీతి ఇట్టి వారి జీవితమునకు ఉండదు...
....✍️ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
05 Dec 2021
వివేక చూడామణి - 162 / Viveka Chudamani - 162
🌹. వివేక చూడామణి - 162 / Viveka Chudamani - 162🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -9 🍀
530. ఇది జాడి అని తెలుసుకొనుటకు ఎట్టి నిబందనలు ఉంటాయి. కేవలము విజ్ఞానము ద్వారా కాక ఎలా వస్తువు యొక్క అసలు స్థితిని తెలుసుకొనగలరు?
531. శాశ్వత సత్యమైన ఈ ఆత్మ సరైన మార్గముల ద్వారా ఆవిష్కరించబడుతుంది. తద్ ద్వారా జ్ఞానము పెంపొంది, ఆ కారణముగా దేని మీద అనగా ప్రదేశము, సమయము, అంతర్గత స్వచ్ఛత అనే వాటి మీద ఆధారపడదు.
532. బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడు ఎఱుకతో ‘నేను దేవతత్తుడను’ అని స్వేచ్ఛతో ఉచ్చరించగలుగుతాడు. అలానే బ్రహ్మాన్ని తెలుసుకొన్న వాడు నేనే బ్రహ్మమునని చెప్పగలడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 162 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 32. I am the one who knows Brahman -9🌻
530. To know that this is a jar, what condition, forsooth, is necessary except that the means of knowledge be free from defect, which alone ensures a cognition of the object ?
531. So this Atman, which is an eternal verity, manifests Itself as soon as the right means of knowledge is present, and does not depend upon either place or time or (internal) purity.
532. The consciousness, "I am Devadatta", is independent of circumstances; similar is the case with the realisation of the knower of Brahman that he is Brahman.
Continues....
05 Dec 2021
శ్రీ శివ మహా పురాణము - 485
🌹 . శ్రీ శివ మహా పురాణము - 485 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 37
🌻. పెళ్ళి హడావుడి - 4 🌻
గొప్ప సంపదతో గూడియున్న కరవీరుడు, మరియు పర్వతశ్రేష్ఠుడగు మహేంద్రుడు హిమవంతుని గృహమునకు విచ్చేసిరి (31). గొప్ప శోభతో ప్రకాశించే పారియాత్రుడు భార్యలు, కుమారులు, బంధువులతో గూడి హర్షముతో నిండిన మనస్సు గలవాడై విచ్చేసెను. మణులకు, రత్నములకు నిధియగు ఆతడు వాటిన దోడ్కెని వచ్చెను (32).
పర్వత శ్రేష్ఠుడగు క్రౌంచుడు పెద్దసైన్యమును, పరివారమును, గణములను దోడ్కొని, బహుమానములను తీసుకొని సాదరముగా హిమవంతుని గృహమునకు విచ్చేసెను (33). పురుషోత్తమ పర్వతుడు కూడ పరివారముతో గూడి గొప్ప బహుమతులను తీసుకొని సాదరముగా హిమవంతుని గృహమునకు విచ్చేసెను (34).
లీలలతో, ఆనందముతో గూడియున్న నీలుడు భార్యలను, కుమారులను దోడ్కొని ధనమును తీసుకొని హిమవంతుని గృహమునకు విచ్చేసెను (35). త్రికూటుడు, చిత్రకూటుడు, వేంకటుడు, శ్రీపర్వతుడు, గోకాముఖుడు మరియు నారదుడు హిమవంతుని గృహమునకు విచ్చేసిరి (36).
అనేక సంపదలతో గూడినవాడు, పర్వతశ్రేష్ఠుడు, శుభకరుడునగు వింధ్యుడు ఆనందముతో నిండిన మనస్సు గలవాడై భార్యతో, కుమారులతో గూడి విచ్చేసెను (37). మహాపర్వతుడు, అనేక కాంతులు గలవాడు అగు కాలంజరుడు మహానందముతో గూడినవాడై, గణములను దోడ్కొని ప్రీతితో హిమవంతుని గృహమునకు విచ్చేసెను (38).
మహాశైలుడు, సర్వపర్వతములకు పైస్థాయిలో ప్రకాశించు ప్రభుడునగు కైలాసుడు మహాహర్షముతో కూడినవాడై దయను చేసి విచ్చేసెను (39). ఓ విప్రా! ఈ ద్వీపములోనే గాక ఇతరద్వీపములలో నున్న పర్వతములు అన్నియూ కూడా హిమవంతుని నగరమునకు విచ్చేసెను (40).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
05 Dec 2021
గీతోపనిషత్తు -286
🌹. గీతోపనిషత్తు -286 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚
శ్లోకము 15-3
🍀 15-3. తత్వ మొక్కటే ! - అఖండమగు జ్ఞానము నిరంతరము జిజ్ఞాసువులకు భక్తి శ్రద్ధలతో బోధించుట జ్ఞాన యజ్ఞమగును. ఉపాసన మనగ జీవప్రజ్ఞను దైవప్రజ్ఞ దరిచేర్చుట ఉప ఆసనమనగ, దగ్గర కూర్చుండుట. ఉపవాసమనగ దగ్గరగ వసించుట. ఆరాధనా విధానమేదైనను జీవప్రజ్ఞ పరమేశ్వరుని దరిచేరి యుండ వలెను. అపుడితర విషయములు అట్టి ప్రజ్ఞను మలినము చేయ లేవు. ఉపాసనములు, ఉపవాసములు అర్థవంతముగ నుండ వలెను కాని, వ్యర్ధముగ శ్రమపడుట, దేహమును శుష్కింప జేయుటగ నుండరాదు. 🍀
జ్ఞానయజ్జెన చాప్యన్యే యజంతో మాముపాసతే |
ఏకత్వేన పృథక్ష్యేవ బహుధా విశ్వతో ముఖమ్ || 15
తాత్పర్యము : అనన్య భావనతో కొందరు, జ్ఞాన యజ్ఞము ద్వారా కొందరు, బహు విధములుగ కొందరు విశ్వరూపుడనగు నన్ను ఉపాసించుచున్నారు.
వివరణము : ఇట్టి అఖండమగు జ్ఞానము నిరంతరము జిజ్ఞాసువులకు భక్తి శ్రద్ధలతో బోధించుట జ్ఞాన యజ్ఞమగును. అట్టి జ్ఞాన యజ్ఞమును నిర్వర్తించుచు దైవమును చేరువారున్నారు. అదే విధముగ అపరిమితమగు దైవమును అనేకానేక విధములుగ ఆరాధించుచు, సేవించుచు, భజించుచు, కీర్తించుచు దైవమును చేరువారున్నారు అని ఈ శ్లోకమున తెలుపబడినది. ఇచ్చట ఉపాసన మనగ జీవప్రజ్ఞను దైవప్రజ్ఞ దరిచేర్చుట ఉప ఆసనమనగ, దగ్గర కూర్చుండుట. ఉపవాసమనగ దగ్గరగ వసించుట.
ఆరాధనా విధానమేదైనను జీవప్రజ్ఞ పరమేశ్వరుని దరిచేరి యుండ వలెను. అపుడితర విషయములు అట్టి ప్రజ్ఞను మలినము చేయ లేవు. ఉపాసనములు, ఉపవాసములు అర్థవంతముగ నుండ వలెను కాని, వ్యర్ధముగ శ్రమపడుట, దేహమును శుష్కింప జేయుటగ నుండరాదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
05 Dec 2021
5-DECEMBER-2021 SUNDAY MESSAGES
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 05, ఆదివారం, డిసెంబర్ 2021 భాను వారము 🌹
మార్గశిర మాసం ప్రారంభం
పోలి పాడ్యమి శుభాకాంక్షలు
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 286 🌹
3) 🌹. శివ మహా పురాణము - 485🌹
4) 🌹 వివేక చూడామణి - 162 / Viveka Chudamani - 162🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -114🌹
6) 🌹 Osho Daily Meditations - 103🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 162 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 162🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹*
*భాను వాసరే, 05, డిసెంబర్ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. సూర్య సూక్తము -3 🍀*
*జ్ఞానైకధామభూతాయ నిర్ధూతతమసే నమః |*
*శుద్ధజ్యోతిస్స్వరూపాయ విశుద్ధాయామలాత్మనే || 5 ||*
*వరిష్ఠాయ వరేణ్యాయ పరస్మై పరమాత్మనే |*
*నమోఽఖిలజగద్వ్యాపిస్వరూపాయాత్మమూర్తయే || 6 ||*
🌻 🌻 🌻 🌻 🌻
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, హేమంత ఋతువు,
మృగశిర మాసం
తిథి: శుక్ల పాడ్యమి 09:28:44
వరకు తదుపరి శుక్ల విదియ
నక్షత్రం, యోగం మరియు కరణం
నక్షత్రం: జ్యేష్ఠ 07:48:30 వరకు
తదుపరి మూల
యోగం: శూల 24:06:53 వరకు
తదుపరి దండ
కరణం: బవ 09:28:44 వరకు
వర్జ్యం: 14:50:20 - 16:14:48
దుర్ముహూర్తం: 16:11:44 - 16:56:18
రాహు కాలం: 16:17:18 - 17:40:53
గుళిక కాలం: 14:53:44 - 16:17:18
యమ గండం: 12:06:35 - 13:30:09
అభిజిత్ ముహూర్తం: 11:44 - 12:28
అమృత కాలం: 00:06:00 - 01:30:00
మరియు 23:17:08 - 24:41:36
సూర్యోదయం: 06:32:16
సూర్యాస్తమయం: 17:40:53
వైదిక సూర్యోదయం: 06:36:09
వైదిక సూర్యాస్తమయం: 17:37:01
చంద్రోదయం: 07:27:45
చంద్రాస్తమయం: 18:46:48
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
కాల యోగం - అవమానం 07:48:30
వరకు తదుపరి సిద్ది యోగం -
కార్య సిధ్ధి , ధన ప్రాప్తి
పండుగలు : చంద్ర దర్శనం,
Chandra Darshan
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -286 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 15-3
*🍀 15-3. తత్వ మొక్కటే ! - అఖండమగు జ్ఞానము నిరంతరము జిజ్ఞాసువులకు భక్తి శ్రద్ధలతో బోధించుట జ్ఞాన యజ్ఞమగును. ఉపాసన మనగ జీవప్రజ్ఞను దైవప్రజ్ఞ దరిచేర్చుట ఉప ఆసనమనగ, దగ్గర కూర్చుండుట. ఉపవాసమనగ దగ్గరగ వసించుట. ఆరాధనా విధానమేదైనను జీవప్రజ్ఞ పరమేశ్వరుని దరిచేరి యుండ వలెను. అపుడితర విషయములు అట్టి ప్రజ్ఞను మలినము చేయ లేవు. ఉపాసనములు, ఉపవాసములు అర్థవంతముగ నుండ వలెను కాని, వ్యర్ధముగ శ్రమపడుట, దేహమును శుష్కింప జేయుటగ నుండరాదు. 🍀*
*జ్ఞానయజ్జెన చాప్యన్యే యజంతో మాముపాసతే |*
*ఏకత్వేన పృథక్ష్యేవ బహుధా విశ్వతో ముఖమ్ || 15*
*తాత్పర్యము : అనన్య భావనతో కొందరు, జ్ఞాన యజ్ఞము ద్వారా కొందరు, బహు విధములుగ కొందరు విశ్వరూపుడనగు నన్ను ఉపాసించుచున్నారు.*
*వివరణము : ఇట్టి అఖండమగు జ్ఞానము నిరంతరము జిజ్ఞాసువులకు భక్తి శ్రద్ధలతో బోధించుట జ్ఞాన యజ్ఞమగును. అట్టి జ్ఞాన యజ్ఞమును నిర్వర్తించుచు దైవమును చేరువారున్నారు. అదే విధముగ అపరిమితమగు దైవమును అనేకానేక విధములుగ ఆరాధించుచు, సేవించుచు, భజించుచు, కీర్తించుచు దైవమును చేరువారున్నారు అని ఈ శ్లోకమున తెలుపబడినది. ఇచ్చట ఉపాసన మనగ జీవప్రజ్ఞను దైవప్రజ్ఞ దరిచేర్చుట ఉప ఆసనమనగ, దగ్గర కూర్చుండుట. ఉపవాసమనగ దగ్గరగ వసించుట.*
*ఆరాధనా విధానమేదైనను జీవప్రజ్ఞ పరమేశ్వరుని దరిచేరి యుండ వలెను. అపుడితర విషయములు అట్టి ప్రజ్ఞను మలినము చేయ లేవు. ఉపాసనములు, ఉపవాసములు అర్థవంతముగ నుండ వలెను కాని, వ్యర్ధముగ శ్రమపడుట, దేహమును శుష్కింప జేయుటగ నుండరాదు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 485 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 37
*🌻. పెళ్ళి హడావుడి - 4 🌻*
గొప్ప సంపదతో గూడియున్న కరవీరుడు, మరియు పర్వతశ్రేష్ఠుడగు మహేంద్రుడు హిమవంతుని గృహమునకు విచ్చేసిరి (31). గొప్ప శోభతో ప్రకాశించే పారియాత్రుడు భార్యలు, కుమారులు, బంధువులతో గూడి హర్షముతో నిండిన మనస్సు గలవాడై విచ్చేసెను. మణులకు, రత్నములకు నిధియగు ఆతడు వాటిన దోడ్కెని వచ్చెను (32).
పర్వత శ్రేష్ఠుడగు క్రౌంచుడు పెద్దసైన్యమును, పరివారమును, గణములను దోడ్కొని, బహుమానములను తీసుకొని సాదరముగా హిమవంతుని గృహమునకు విచ్చేసెను (33). పురుషోత్తమ పర్వతుడు కూడ పరివారముతో గూడి గొప్ప బహుమతులను తీసుకొని సాదరముగా హిమవంతుని గృహమునకు విచ్చేసెను (34).
లీలలతో, ఆనందముతో గూడియున్న నీలుడు భార్యలను, కుమారులను దోడ్కొని ధనమును తీసుకొని హిమవంతుని గృహమునకు విచ్చేసెను (35). త్రికూటుడు, చిత్రకూటుడు, వేంకటుడు, శ్రీపర్వతుడు, గోకాముఖుడు మరియు నారదుడు హిమవంతుని గృహమునకు విచ్చేసిరి (36).
అనేక సంపదలతో గూడినవాడు, పర్వతశ్రేష్ఠుడు, శుభకరుడునగు వింధ్యుడు ఆనందముతో నిండిన మనస్సు గలవాడై భార్యతో, కుమారులతో గూడి విచ్చేసెను (37). మహాపర్వతుడు, అనేక కాంతులు గలవాడు అగు కాలంజరుడు మహానందముతో గూడినవాడై, గణములను దోడ్కొని ప్రీతితో హిమవంతుని గృహమునకు విచ్చేసెను (38).
మహాశైలుడు, సర్వపర్వతములకు పైస్థాయిలో ప్రకాశించు ప్రభుడునగు కైలాసుడు మహాహర్షముతో కూడినవాడై దయను చేసి విచ్చేసెను (39). ఓ విప్రా! ఈ ద్వీపములోనే గాక ఇతరద్వీపములలో నున్న పర్వతములు అన్నియూ కూడా హిమవంతుని నగరమునకు విచ్చేసెను (40).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. వివేక చూడామణి - 162 / Viveka Chudamani - 162🌹*
*✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -9 🍀*
*530. ఇది జాడి అని తెలుసుకొనుటకు ఎట్టి నిబందనలు ఉంటాయి. కేవలము విజ్ఞానము ద్వారా కాక ఎలా వస్తువు యొక్క అసలు స్థితిని తెలుసుకొనగలరు?*
*531. శాశ్వత సత్యమైన ఈ ఆత్మ సరైన మార్గముల ద్వారా ఆవిష్కరించబడుతుంది. తద్ ద్వారా జ్ఞానము పెంపొంది, ఆ కారణముగా దేని మీద అనగా ప్రదేశము, సమయము, అంతర్గత స్వచ్ఛత అనే వాటి మీద ఆధారపడదు.*
*532. బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడు ఎఱుకతో ‘నేను దేవతత్తుడను’ అని స్వేచ్ఛతో ఉచ్చరించగలుగుతాడు. అలానే బ్రహ్మాన్ని తెలుసుకొన్న వాడు నేనే బ్రహ్మమునని చెప్పగలడు.*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 VIVEKA CHUDAMANI - 162 🌹*
*✍️ Sri Adi Shankaracharya*
*Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*
*🌻 32. I am the one who knows Brahman -9🌻*
*530. To know that this is a jar, what condition, forsooth, is necessary except that the means of knowledge be free from defect, which alone ensures a cognition of the object ?*
*531. So this Atman, which is an eternal verity, manifests Itself as soon as the right means of knowledge is present, and does not depend upon either place or time or (internal) purity.*
*532. The consciousness, "I am Devadatta", is independent of circumstances; similar is the case with the realisation of the knower of Brahman that he is Brahman.*
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 VIVEKA CHUDAMANI - 162 🌹*
*✍️ Sri Adi Shankaracharya*
*Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*
*🌻 32. I am the one who knows Brahman -9🌻*
*530. To know that this is a jar, what condition, forsooth, is necessary except that the means of knowledge be free from defect, which alone ensures a cognition of the object ?*
*531. So this Atman, which is an eternal verity, manifests Itself as soon as the right means of knowledge is present, and does not depend upon either place or time or (internal) purity.*
*532. The consciousness, "I am Devadatta", is independent of circumstances; similar is the case with the realisation of the knower of Brahman that he is Brahman.*
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 114 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*సంకలనము : వేణుమాధవ్*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻. జ్ఞానులు- దైత్యులు - 2 🌻*
*ఇక రెండవ తరగతి వారి దృష్టిలో అంతర్యామికున్న ప్రాధాన్యము మిగిలిన అంశములకు లేదు. అంతర్యామి ఈ రూపముతో ఉండవలెనని వారు భగవంతుని ఆజ్ఞాపింపరు. ఈ వరములు ఇమ్మని ఇరుకున పెట్టరు. ఇంత తపస్సు, యోగ సాధన చేసితిని అని దేవునకు రశీదు చూపించి దబాయించరు. దానికి ఫలితముగా సుఖమను మాటకు నిజమైన అర్థమును వీరు అనుభవించు చుందురు. వీరిని జ్ఞానులు, ముముక్షువులు అని పెద్దలు వ్యవహరింతురు.*
*వేదము, శాస్త్రము, ప్రకృతి శక్తుల వినియోగము, ఆచారము, ధర్మము, విధి నిషేధములు దైత్యులకును, మోక్ష జనులకును గూడా ఉన్నవి. దైత్యులలో తమ శాస్ర్తాదులకు తామే ప్రమాణము. సుఖము అను మాటకు తాము అనుకున్న అర్థమే తమకు ప్రమాణము. తత్ఫలితముగా సుఖమునకై శ్రమపడుట, సుఖము సాధింప యత్నించుచు కష్ట నష్టముల పాలగుట జరుగుచున్నది.*
*వీరి జీవితమునందు స్వేచ్ఛ ఉండదు. ఇతరుల అభిప్రాయములను అనుసరించి పట్టుదలతోనో, అంగీకారముతోనో బ్రదకవలసి యుండును. తమ జీవితానుభవమునకు ఇతరులే నాయకులు. తాము ఇతరుల జీవితములకు, పద్ధతులకు నాయకులు. అనగా ఇతరుల మంచి చెడ్డలను గూర్చి తమకు గట్టి అభిప్రాయములు ఉండును. నిర్భీతి ఇట్టి వారి జీవితమునకు ఉండదు...*
....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Osho Daily Meditations - 103 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 103. MAKING A PATH 🍀*
*🕉 When there has been a breakthrough, make it a point to relive it again and again. Just sitting silently, remember it; don't just remember it, relive it. 🕉*
*Start feeling the same as you felt when the breakthrough happened. Let the vibrations surround you. Move into the same space, and allow it to happen so it becomes, by and by, very natural to you. You become so capable of bringing it back that any moment you can do it. Many valuable insights happen, but they need follow-up. Otherwise they become just memories and you will lose contact and will not be able to move into the same world.*
*By and by, one day you yourself will start disbelieving them. You may think that it was a dream or a hypnosis or some trick of the mind. That's how humanity has lost many beautiful experiences. Everybody comes to beautiful spaces in life. But we never try to make a path to those beautiful spaces so that they become as natural as eating, taking a bath, or going to sleep, so that whenever you close your eyes you can be in that space.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 162 / Sri Lalita Sahasranamavali - Meaning - 162 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 162. అజాక్షయ వినిర్ముక్తా, ముగ్ధా క్షిప్రప్రసాదినీ ।*
*అంతర్ముఖ సమారాధ్యా, బహిర్ముఖ సుదుర్లభా ॥ 162 ॥ 🍀*
🍀 863. అజా :
పుట్టుక లేనిది
🍀 864. క్షయ వినిర్ముక్తా :
మాయాతేతమైనది
🍀 865. ముగ్ధా :
12 - 16 సంవత్సరముల బాలికా రూపము కలిగినది
🍀 866. క్షిప్రప్రసాదినీ :
వెంటనే అనుగరించునది
🍀 867. అంతర్ముఖసమారాధ్యా :
అంతర్ దృష్టి గల యోగులచే ఆరాధింపబడునది
🍀 868. బహిర్ముఖసుదుర్లభా :
ప్రాపంచిక దృష్టి కలవారికి లభింపనిది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 162 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 162. Ajakshaya vinirmukta mugdha kshipraprasadini*
*Antarmukha samaradhya bahirmukha sudurlabha ॥ 162 ॥ 🌻*
🌻 863 ) Ajha -
She who does not have birth
🌻 864 ) Kshaya nirmuktha -
She who does not have death
🌻 865 ) Gubdha -
She who is beautiful
🌻 866 ) Ksipra prasadhini -
She who is pleased quickly
🌻 867 ) Anthar mukha samaradhya -
She who is worshipped by internal thoughts
🌻 868 ) Bahir mukha sudurlabha -
She who can be attained by external prayers
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#లలితాసహస్రనామములు #LalithaSahasranam
#PrasadBhardwaj
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ https://mymandir.page.link/wdh7G
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 325 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 325-1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 325 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 325-1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 73. కామ్యా, కామకళారూపా, కదంబ కుసుమ ప్రియా ।
కళ్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా ॥ 73 ॥ 🍀
🌻 325-1. 'జగతీకందా' 🌻
లోకములకు మూలము శ్రీమాత అని అర్థము. 'కంద' అనగా మూలము. 'జగతీకందా' అనగా జగత్తునకు మూలము. 'జగత్' అనగా కదలికలు కలది అని అర్థము. నిత్యము కదలునది జగత్తు. జగత్తు నందు మార్పు సహజము. అంతయూ మారుచునే యుండును కాని మారుచున్నట్లు కనిపించదు. అదియే గమ్మత్తు. భూమి తిరుగుచున్నట్లు అనిపించదు. వాతావరణమున మార్పులు ఋతువుల ద్వారా సున్నితముగ జరుగుచుండును. ఏ క్షణమున మార్పు జరిగినదో తెలియదు.
బీజము అంకురించుట, వృద్ధి చెందుట, మహా వృక్షముగ పుష్టించుట, ఫలించుట కాలక్రమమున జరుగుచున్ననూ స్థూలముగ తెలియును గాని సూక్ష్మముగ తెలియదు. అట్లే జీవుడు గర్భస్థుడగుట, పుట్టుట, పెరుగుట, బాల్యము, యౌవనము నడిమి వయస్సు, వార్థక్యము వంటి మార్పులు ఏ క్షణమున జరుగు చున్నవో స్థూలబుద్ధికి తెలియదు. పగలు రాత్రి అగుట, రాత్రి పగలు అగుట కూడ స్థూలముగనే గుర్తించుచున్నాము. ఇట్లు సమస్తము మార్పు చెందుచుండగ సృష్టి గమనము తెలియుటకు మేధావులు సహితము తలక్రిందులగు చుందురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 325-1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 73. Kamya kamakalarupa kadanba kusumapriya
Kalyani jagatikanda karunarasasagara ॥ 73 ॥ 🌻
🌻 325-1. Jagatī -kandā जगती -कन्दा (325) 🌻
She is the cause of the universe. The cause for the origin of the universe is attributed to the Brahman. Her Brahmanic stature is repeatedly emphasized in this Sahasranāma through various attributes. She is ‘prakāśa vimarśa mahā māyā svarūpinī’ by which She creates the universe.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
04 Dec 2021
నిర్మల ధ్యానాలు - ఓషో - 104
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 104 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. దేవుడు ఒక ఉనికి కాడు. అనంతమయిన అస్తిత్వరాహిత్యం. అతను వ్యక్తి కాడు. కేవలమయిన శూన్యం. దేవుడు కేవలం ప్రత్యక్షం, అనంతం, అపరిమితం. మనమూ అట్లాంటి వాళ్ళమే. 🍀
నీ యథార్థాన్ని అనుభవానికి తెచ్చుకోడానికి ఈ జీవితమొక అవకాశం. నీ వ్యక్తి దైవత్వాన్ని అందుకోకుంటే జీవితం నిష్ఫలం. వ్యక్తి ఆ విషయాన్ని గుర్తించాలి. అది మనిషి జన్మహక్కు. వ్యక్తి దాన్ని అందుకోవాలి. దాని కోసం ప్రయత్నించాలి. దాని పట్ల సృజనాత్మకంగా వుండాలి. ప్రతి అవకాశాన్ని ఎదుగుదలకు ఉపయోగించాలి. మానవత్వాన్ని దాటి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. మానవత్వాన్ని అధిగమించి సాగాలి. దైవత్వంగా మారటానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మన యథార్థతత్వమదే.
మనిషి కనిపించేంత చిన్నవాడు కాడు. అతను విశాలమయిన వాడు. అనంతవిశాలుడు. సముద్రమంత విశాలుడు. సముద్రానికి సరిహద్దులుంటాయి. మనిషికి సరిహద్దులు లేవు. సముద్రం కూడా మనిషంత విశాలం కాదు. మనిషి విశాలత్వానికి దైవమే సాక్షి. మనిషి వైశాల్యానికి మరో పేరు దైవం. మనం శరీరానికి పరిమితులం కాము. మనసుకు పరిమితులం కాము. మనం ఆ రెంటినీ దాటిన వాళ్ళం.
సన్యాసికి సంబంధించిన సమస్త విధానం వుల్లిపాయ పొరలు తీయడం లాంటిది. గుర్తింపుకు సంబంధించిన ఎన్నో పొరలు వుంటాయి. మనం అన్ని పొరల్ని వదిలెయ్యాలి. మెల్లగా మెల్లగా చివరికి ఏమీ మిగలకుండా వదిలెయ్యాలి. ఆ ఏమీలేనితనమే నువ్వు. శూన్యమొకటే విశాలమైంది. పరిమితమయిన దానికి హద్దులుంటాయి. అపరిమితమయిన దానికి హద్దులుండవు. శూన్యమొకటే అనంతమయింది. అందువల్ల దేవుడే అంతిమమయిన శూన్యం. దేవుడు ఒక ఉనికి కాడు. అనంతమయిన అస్తిత్వరాహిత్యం. అతను వ్యక్తి కాడు. కేవలమయిన శూన్యం. దేవుడు కేవలం ప్రత్యక్షం, అనంతం, అపరిమితం. కాబట్టి మనమూ అట్లాంటి వాళ్ళమే. మనం దేవుడి కన్నా వేరు కాము. మనం అనంతంలో భాగాలం.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
04 Dec 2021
మైత్రేయ మహర్షి బోధనలు - 37
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 26. ధర్మ యుద్ధము 🌻
ధర్మమునకై యుద్ధము తప్పనిసరి. జీవితమున ధర్మము నాచరించపూనితివా, ఘర్షణము అను యుద్ధము జీవితకాల మంతయు నీయందు జరుగుచునేయుండును. ప్రశాంతతకు భంగము వాటిల్లు సంఘటనలు తారసిల్లుచునే యుండును. ధర్మయుద్ధము మొదలైనదని గ్రహించి శాంత చిత్తముతో యుద్ధము జరుపు చుండుము. నీవలె లక్షలాది జీవులు ఈ యుద్ధమున పాల్గొని యున్నారు. ఈ సత్యము నీకు ప్రోత్సాహజనకము. బుద్ధి యోగముతో చక్కని నిర్ణయములు గైకొనుచు సాగిపోవుటయే నీ కర్తవ్యము.
జీవన మార్గమున ధర్మాచరణమునకు సత్యమను రెక్కలు ఏర్పడగలవు. అది కారణముగ నీవు అనాయాసముగ ముందుకు సాగగలవు. అట్టి సమయమున గర్వము దరిజేరు అపాయము కలదు. అది నీ నుండి జనించిన కొమ్ములై ఇతరులను బాధ పెట్టగలవు. గర్వమును దరి జేరనీయక దయను పెంపొందించు కొనుచు, మార్గమున సాగవలెను. గర్వము నకిలీ రెక్కలు. వాటిపై ఆధార పడినచో పతనము చెందగలవు. ధర్మము, సత్యము, దయ అను త్రిభుజము నాశ్రయించి ముందుకు సాగినచో విశ్వప్రేమ మార్గమున దైవమును చేరగలవు.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
04 Dec 2021
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 520 / Vishnu Sahasranama Contemplation - 520
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 520 / Vishnu Sahasranama Contemplation - 520 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 520. అన్తకః, अन्तकः, Antakaḥ 🌻
ఓం అన్తకాయ నమః | ॐ अन्तकाय नमः | OM Antakāya namaḥ
అన్తం కరోతి భూతానా మిత్యన్తకః ఉదీరితః ।
తత్కరోతి తదాచష్ట ఇతిణిచ్ప్రత్యయేకృతే ॥
భూతములకు అంతమును కలిగించునుగనుక, అన్తకః. సాత్వతాం పతిః నామవివరణమునందు తత్కోరితి తదాచష్టే అను పాణిని సూత్రమునుబట్టి, ఈ నామ వివరణయందును అన్త + అక = అన్త్ + అక = అన్తకః అగుచున్నది.
:: పోతన భాగవతము - దశమ స్కంధము, ఉత్తర భాగము ::
క. మదిఁ దలపోయఁగ జల బు, ద్బుదములు ధరఁ బుట్టి పొలియు పోలిక గల యీ
త్రిదశాది దేహములలో, వదలక వర్తించు నాత్మవర్గము నోలిన్. (1224)
ఆ. ప్రళయవేళ నీవు భరియింతు వంతకుఁ, గారణంబ వగుటఁ గమలనాభ!
భక్తపారిజాత! భవ భూరి తిమిర ది, నేశ! దుష్టదైత్యనాశ! కృష్ణ! (1225)
నీళ్ళల్లో బుడగలు పుట్టి నశించిపోయే విధంగా ఆత్మ సమూహం దేవతాదుల దేహాలలో ప్రవర్తిస్తూ ఉంటుంది. అటువంటి శరీరాలలో అంతరాత్మవై నీవు వర్తించి ప్రళయ సమయమునందు వాటిని నీలో లీనము చేసుకుంటావు. కృష్ణా! నీవు భక్తుల పాలిటి పారిజాతానివి. భవబంధాలను దూరం చేసేవాడివి. దుష్ట శిక్షకుడవు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 520 🌹
📚. Prasad Bharadwaj
🌻 520. Antakaḥ 🌻
OM Antakāya namaḥ
अन्तं करोति भूताना मित्यन्तकः उदीरितः ।
तत्करोति तदाचष्ट इतिणिच्प्रत्ययेकृते ॥
Antaṃ karoti bhūtānā mityantakaḥ udīritaḥ,
Tatkaroti tadācaṣṭa itiṇicpratyayekrte.
As He brings about the end of all beings, He is Antakaḥ. The 'tatkaroti tadācaṣṭe' rule of pāṇini, as used in the elucidation of the divine name Sāttvatāṃ patiḥ is also applicable here.
:: श्रीमद्भागवते चतुर्थस्कन्धे चतुर्विंशोऽध्यायः ::
प्रमत्तमुच्चैरिति कृत्यचिन्तया प्रवृद्धलोभं विषयेषु लालसम् ।
त्वमप्रमत्तः सहसाभीपद्यसे क्षुल्लेलिहानोऽहिरिवाखुमन्तकः ॥ ६६ ॥
Śrīmad Bhāgavata - Canto 4 Chapter 24
Pramattamuccairiti krtyacintayā pravrddhalobhaṃ viṣayeṣu lālasam,
Tvamapramattaḥ sahasābhīpadyase kṣullelihāno’hirivākhumantakaḥ. 66.
My dear Lord, all living entities within this material world are mad after planning for things, and they are always busy with a desire to do this or that. This is due to uncontrollable greed. The greed for material enjoyment is always existing in the living entity, but Your Lordship is always alert, and in due course of time You strike him, just as a snake seizes a mouse and very easily swallows him.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
जीवो विनयिता साक्षी मुकुन्दोऽमितविक्रमः ।
अम्भोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः ॥ ५५ ॥
జీవో వినయితా సాక్షీ ముకున్దోఽమితవిక్రమః ।
అమ్భోనిధిరనన్తాత్మా మహోదధిశయోఽన్తకః ॥ 55 ॥
Jīvo vinayitā sākṣī mukundo’mitavikramaḥ,
Ambhonidhiranantātmā mahodadhiśayo’ntakaḥ ॥ 55 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
04 Dec 2021
4-DECEMBER-2021 శనివారం MESSAGES
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 04, డిసెంబర్ 2021 శనివారం, స్థిర వారము, కార్తీక మాసం 30వ రోజు 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 123 / Bhagavad-Gita - 123 3-04🌹*
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 520 / Vishnu Sahasranama Contemplation - 520 🌹
4) 🌹 DAILY WISDOM - 198🌹
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 37🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 104🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 325-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 325-1 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ శనివారం మిత్రులందరికీ 🌹*
*స్థిర వాసరే, 04, డిసెంబర్ 2021*
*సూర్య గ్రహణం : ఉ 10.59 గం నుండి మ 3.07 గం వరకు*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. కార్తీక మాసం 30వ రోజు 🍀*
*నిషిద్ధములు : పగటి ఆహారం*
*దానములు : నువ్వులు, తర్పణలు, ఉసిరి*
*పూజించాల్సిన దైవము : సర్వదేవతలు + పితృ దేవతలు*
*జపించాల్సిన మంత్రము :*
*ఓం అమృతాయ స్వాహా మమ సమస్త పితృదేవతాభ్యో నమః*
ఫలితము : ఆత్మస్థయిర్యం, కుటుంబక్షేమం
🌻 🌻 🌻 🌻 🌻
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, శరద్ ఋతువు,
కార్తీక మాసం
తిథి: అమావాశ్య 13:14:00
వరకు తదుపరి శుక్ల పాడ్యమి
నక్షత్రం: అనూరాధ 10:48:21
వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం: సుకర్మ 08:40:53
వరకు తదుపరి ధృతి
కరణం: నాగ 13:13:00 వరకు
వర్జ్యం: 15:42:00 - 17:06:00
దుర్ముహూర్తం: 08:00:52 - 08:45:28
రాహు కాలం: 09:18:55 - 10:42:32
గుళిక కాలం: 06:31:40 - 07:55:18
యమ గండం: 13:29:47 - 14:53:24
అభిజిత్ ముహూర్తం: 11:44 - 12:28
అమృత కాలం: 01:40:42 - 03:04:54
మరియు 24:06:00 - 25:30:00 ?
సూర్యోదయం: 06:31:40
సూర్యాస్తమయం: 17:40:39
వైదిక సూర్యోదయం: 06:35:32
వైదిక సూర్యాస్తమయం: 17:36:47
చంద్రోదయం: 06:18:22
చంద్రాస్తమయం: 17:44:39
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
అమృత యోగం - కార్య సిధ్ది 10:48:21
వరకు తదుపరి ముసల యోగం - దుఃఖం
పండుగలు : మార్గశిర అమావాస్య,
సూర్యగ్రహణం, Margashirsha Amavasya,
Surya Grahan
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 123 / Bhagavad-Gita - 123 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 4 🌴*
4. న కర్మణామనారమ్భాత్
నైష్కర్యం పురుషోశ్నుతే |
న చ సన్న్యసనాదేవ
సిద్ధిం సమధిగచ్ఛతి ||
🌷. తాత్పర్యం :
*కేవలము కర్మను చేయకుండుట ద్వారా ఎవ్వరును కర్మఫలము నుండి ముక్తిని పొందలేరు. అలాగుననే కేవలము సన్న్యాసము ద్వారా ఎవ్వరును సంపూర్ణత్వమును పొందలేరు.*
🌷. భాష్యము :
లౌకికజనుల హృదయములను శుద్ధిపరచుట కొరకై విధింపబడినటువంటి విధ్యక్తధర్మములను నియమముగా పాటించి పవిత్రుడైనపుడు మనుజుడు సన్న్యాసమును స్వీకరించుట ద్వారా జయము సిద్ధింపదు. సాంఖ్య తత్త్వవేత్తల ఉద్దేశ్యము ప్రకారము కేవలము సన్న్యాసము స్వీకరించినంతనే (కామ్యకర్మల నుండి విరమించినంతనే ) మనుజుడు నారాయణునితో సమానుడు కాగలడు. కాని శ్రీకృష్ణభగవానుడు ఈ సిద్ధాంతము అంగీకరించుట లేదు.
హృదయము పవిత్రము కానిదే సన్న్యాసమును స్వీకరించినచో అది కేవలము సాంఘికవ్యవస్థ సంక్షోభమునకే కారణము కాగలదు. కాని ఒకవేళ మనుజడు తన విధ్యుక్తధర్మములను నిర్వర్తింపకున్నను భగవానుని దివ్యసేవను స్వీకరించి తన శక్త్యానుసారము పురోగమించినచో (బుద్ధియోగము) భగవానునిచో ఆమోదింపబడును. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ – అట్టి ధర్మాచరణము కొద్దిగా ఒనరింపబడినను మనుజుని గొప్ప సంకటముల నుండి తరింపజేయగలదు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 123 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 3 - Karma Yoga - 4 🌴*
4. na karmaṇām anārambhān naiṣkarmyaṁ puruṣo ’śnute
na ca sannyasanād eva siddhiṁ samadhigacchati
🌷Translation :
*Not by merely abstaining from work can one achieve freedom from reaction, nor by renunciation alone can one attain perfection.*
🌷 Purport :
The renounced order of life can be accepted when one has been purified by the discharge of the prescribed form of duties which are laid down just to purify the hearts of materialistic men. Without purification, one cannot attain success by abruptly adopting the fourth order of life (sannyāsa). According to the empirical philosophers, simply by adopting sannyāsa, or retiring from fruitive activities, one at once becomes as good as Nārāyaṇa.
But Lord Kṛṣṇa does not approve this principle. Without purification of heart, sannyāsa is simply a disturbance to the social order. On the other hand, if someone takes to the transcendental service of the Lord, even without discharging his prescribed duties, whatever he may be able to advance in the cause is accepted by the Lord (buddhi-yoga). Sv-alpam apy asya dharmasya trāyate mahato bhayāt. Even a slight performance of such a principle enables one to overcome great difficulties.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 520 / Vishnu Sahasranama Contemplation - 520 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻 520. అన్తకః, अन्तकः, Antakaḥ 🌻*
*ఓం అన్తకాయ నమః | ॐ अन्तकाय नमः | OM Antakāya namaḥ*
*అన్తం కరోతి భూతానా మిత్యన్తకః ఉదీరితః ।*
*తత్కరోతి తదాచష్ట ఇతిణిచ్ప్రత్యయేకృతే ॥*
*భూతములకు అంతమును కలిగించునుగనుక, అన్తకః. సాత్వతాం పతిః నామవివరణమునందు తత్కోరితి తదాచష్టే అను పాణిని సూత్రమునుబట్టి, ఈ నామ వివరణయందును అన్త + అక = అన్త్ + అక = అన్తకః అగుచున్నది.*
:: పోతన భాగవతము - దశమ స్కంధము, ఉత్తర భాగము ::
క. మదిఁ దలపోయఁగ జల బు, ద్బుదములు ధరఁ బుట్టి పొలియు పోలిక గల యీ
త్రిదశాది దేహములలో, వదలక వర్తించు నాత్మవర్గము నోలిన్. (1224)
ఆ. ప్రళయవేళ నీవు భరియింతు వంతకుఁ, గారణంబ వగుటఁ గమలనాభ!
భక్తపారిజాత! భవ భూరి తిమిర ది, నేశ! దుష్టదైత్యనాశ! కృష్ణ! (1225)
*నీళ్ళల్లో బుడగలు పుట్టి నశించిపోయే విధంగా ఆత్మ సమూహం దేవతాదుల దేహాలలో ప్రవర్తిస్తూ ఉంటుంది. అటువంటి శరీరాలలో అంతరాత్మవై నీవు వర్తించి ప్రళయ సమయమునందు వాటిని నీలో లీనము చేసుకుంటావు. కృష్ణా! నీవు భక్తుల పాలిటి పారిజాతానివి. భవబంధాలను దూరం చేసేవాడివి. దుష్ట శిక్షకుడవు.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 520 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 520. Antakaḥ 🌻*
*OM Antakāya namaḥ*
अन्तं करोति भूताना मित्यन्तकः उदीरितः ।
तत्करोति तदाचष्ट इतिणिच्प्रत्ययेकृते ॥
Antaṃ karoti bhūtānā mityantakaḥ udīritaḥ,
Tatkaroti tadācaṣṭa itiṇicpratyayekrte.
*As He brings about the end of all beings, He is Antakaḥ. The 'tatkaroti tadācaṣṭe' rule of pāṇini, as used in the elucidation of the divine name Sāttvatāṃ patiḥ is also applicable here.*
:: श्रीमद्भागवते चतुर्थस्कन्धे चतुर्विंशोऽध्यायः ::
प्रमत्तमुच्चैरिति कृत्यचिन्तया प्रवृद्धलोभं विषयेषु लालसम् ।
त्वमप्रमत्तः सहसाभीपद्यसे क्षुल्लेलिहानोऽहिरिवाखुमन्तकः ॥ ६६ ॥
Śrīmad Bhāgavata - Canto 4 Chapter 24
Pramattamuccairiti krtyacintayā pravrddhalobhaṃ viṣayeṣu lālasam,
Tvamapramattaḥ sahasābhīpadyase kṣullelihāno’hirivākhumantakaḥ. 66.
*My dear Lord, all living entities within this material world are mad after planning for things, and they are always busy with a desire to do this or that. This is due to uncontrollable greed. The greed for material enjoyment is always existing in the living entity, but Your Lordship is always alert, and in due course of time You strike him, just as a snake seizes a mouse and very easily swallows him.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
जीवो विनयिता साक्षी मुकुन्दोऽमितविक्रमः ।
अम्भोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः ॥ ५५ ॥
జీవో వినయితా సాక్షీ ముకున్దోఽమితవిక్రమః ।
అమ్భోనిధిరనన్తాత్మా మహోదధిశయోఽన్తకః ॥ 55 ॥
Jīvo vinayitā sākṣī mukundo’mitavikramaḥ,
Ambhonidhiranantātmā mahodadhiśayo’ntakaḥ ॥ 55 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 DAILY WISDOM - 198 🌹*
*🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*
*🌻 16. Everyone Loves a Simple Innocent Child 🌻*
*In the journey of spiritual practice, there are many halting places on the way. It is not a direct flight without any stop in between. At the very inception of this endeavour known as spiritual sadhana, there is an upheaval of the powers of aspiration, an innocent longing for God and a confidence that one would reach God—perhaps the same kind of confidence that a child has in catching the moon.*
*The innocence and the credulity do not permit the acceptance of the difficulties involved in this pursuit. There is simplicity, sincerity and honesty coupled with ignorance, and this is practically the circumstance of every spiritual seeker. There is a humble innocence, very praiseworthy, but it is also attended with ignorance of the problems on the path and the difficulties of attaining God.*
*The innocence of childhood is simplicity incarnate. Everyone loves a simple, innocent child, and everyone is happy about a simple, innocent seeker of truth. The Pandavas—we are studying certain implications of the Mahabharata—were innocent children playing with their own cousins, the Kauravas, and they would never have dreamt, even with the farthest stretch of their imaginations, of the forthcoming catastrophes in the life to come.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. Daily satsang Wisdom 🌹
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 37 🌹*
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ *
*🌻 26. ధర్మ యుద్ధము 🌻*
*ధర్మమునకై యుద్ధము తప్పనిసరి. జీవితమున ధర్మము నాచరించపూనితివా, ఘర్షణము అను యుద్ధము జీవితకాల మంతయు నీయందు జరుగుచునేయుండును. ప్రశాంతతకు భంగము వాటిల్లు సంఘటనలు తారసిల్లుచునే యుండును. ధర్మయుద్ధము మొదలైనదని గ్రహించి శాంత చిత్తముతో యుద్ధము జరుపు చుండుము. నీవలె లక్షలాది జీవులు ఈ యుద్ధమున పాల్గొని యున్నారు. ఈ సత్యము నీకు ప్రోత్సాహజనకము. బుద్ధి యోగముతో చక్కని నిర్ణయములు గైకొనుచు సాగిపోవుటయే నీ కర్తవ్యము.*
*జీవన మార్గమున ధర్మాచరణమునకు సత్యమను రెక్కలు ఏర్పడగలవు. అది కారణముగ నీవు అనాయాసముగ ముందుకు సాగగలవు. అట్టి సమయమున గర్వము దరిజేరు అపాయము కలదు. అది నీ నుండి జనించిన కొమ్ములై ఇతరులను బాధ పెట్టగలవు. గర్వమును దరి జేరనీయక దయను పెంపొందించు కొనుచు, మార్గమున సాగవలెను. గర్వము నకిలీ రెక్కలు. వాటిపై ఆధార పడినచో పతనము చెందగలవు. ధర్మము, సత్యము, దయ అను త్రిభుజము నాశ్రయించి ముందుకు సాగినచో విశ్వప్రేమ మార్గమున దైవమును చేరగలవు.*
*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 104 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. దేవుడు ఒక ఉనికి కాడు. అనంతమయిన అస్తిత్వరాహిత్యం. అతను వ్యక్తి కాడు. కేవలమయిన శూన్యం. దేవుడు కేవలం ప్రత్యక్షం, అనంతం, అపరిమితం. మనమూ అట్లాంటి వాళ్ళమే. 🍀*
*నీ యథార్థాన్ని అనుభవానికి తెచ్చుకోడానికి ఈ జీవితమొక అవకాశం. నీ వ్యక్తి దైవత్వాన్ని అందుకోకుంటే జీవితం నిష్ఫలం. వ్యక్తి ఆ విషయాన్ని గుర్తించాలి. అది మనిషి జన్మహక్కు. వ్యక్తి దాన్ని అందుకోవాలి. దాని కోసం ప్రయత్నించాలి. దాని పట్ల సృజనాత్మకంగా వుండాలి. ప్రతి అవకాశాన్ని ఎదుగుదలకు ఉపయోగించాలి. మానవత్వాన్ని దాటి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. మానవత్వాన్ని అధిగమించి సాగాలి. దైవత్వంగా మారటానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మన యథార్థతత్వమదే.*
*మనిషి కనిపించేంత చిన్నవాడు కాడు. అతను విశాలమయిన వాడు. అనంతవిశాలుడు. సముద్రమంత విశాలుడు. సముద్రానికి సరిహద్దులుంటాయి. మనిషికి సరిహద్దులు లేవు. సముద్రం కూడా మనిషంత విశాలం కాదు. మనిషి విశాలత్వానికి దైవమే సాక్షి. మనిషి వైశాల్యానికి మరో పేరు దైవం. మనం శరీరానికి పరిమితులం కాము. మనసుకు పరిమితులం కాము. మనం ఆ రెంటినీ దాటిన వాళ్ళం.*
*సన్యాసికి సంబంధించిన సమస్త విధానం వుల్లిపాయ పొరలు తీయడం లాంటిది. గుర్తింపుకు సంబంధించిన ఎన్నో పొరలు వుంటాయి. మనం అన్ని పొరల్ని వదిలెయ్యాలి. మెల్లగా మెల్లగా చివరికి ఏమీ మిగలకుండా వదిలెయ్యాలి. ఆ ఏమీలేనితనమే నువ్వు. శూన్యమొకటే విశాలమైంది. పరిమితమయిన దానికి హద్దులుంటాయి. అపరిమితమయిన దానికి హద్దులుండవు. శూన్యమొకటే అనంతమయింది. అందువల్ల దేవుడే అంతిమమయిన శూన్యం. దేవుడు ఒక ఉనికి కాడు. అనంతమయిన అస్తిత్వరాహిత్యం. అతను వ్యక్తి కాడు. కేవలమయిన శూన్యం. దేవుడు కేవలం ప్రత్యక్షం, అనంతం, అపరిమితం. కాబట్టి మనమూ అట్లాంటి వాళ్ళమే. మనం దేవుడి కన్నా వేరు కాము. మనం అనంతంలో భాగాలం.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 325 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 325-1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 73. కామ్యా, కామకళారూపా, కదంబ కుసుమ ప్రియా ।*
*కళ్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా ॥ 73 ॥ 🍀*
*🌻 325-1. 'జగతీకందా' 🌻*
*లోకములకు మూలము శ్రీమాత అని అర్థము. 'కంద' అనగా మూలము. 'జగతీకందా' అనగా జగత్తునకు మూలము. 'జగత్' అనగా కదలికలు కలది అని అర్థము. నిత్యము కదలునది జగత్తు. జగత్తు నందు మార్పు సహజము. అంతయూ మారుచునే యుండును కాని మారుచున్నట్లు కనిపించదు. అదియే గమ్మత్తు. భూమి తిరుగుచున్నట్లు అనిపించదు. వాతావరణమున మార్పులు ఋతువుల ద్వారా సున్నితముగ జరుగుచుండును. ఏ క్షణమున మార్పు జరిగినదో తెలియదు.*
*బీజము అంకురించుట, వృద్ధి చెందుట, మహా వృక్షముగ పుష్టించుట, ఫలించుట కాలక్రమమున జరుగుచున్ననూ స్థూలముగ తెలియును గాని సూక్ష్మముగ తెలియదు. అట్లే జీవుడు గర్భస్థుడగుట, పుట్టుట, పెరుగుట, బాల్యము, యౌవనము నడిమి వయస్సు, వార్థక్యము వంటి మార్పులు ఏ క్షణమున జరుగు చున్నవో స్థూలబుద్ధికి తెలియదు. పగలు రాత్రి అగుట, రాత్రి పగలు అగుట కూడ స్థూలముగనే గుర్తించుచున్నాము. ఇట్లు సమస్తము మార్పు చెందుచుండగ సృష్టి గమనము తెలియుటకు మేధావులు సహితము తలక్రిందులగు చుందురు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 325-1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 73. Kamya kamakalarupa kadanba kusumapriya
Kalyani jagatikanda karunarasasagara ॥ 73 ॥ 🌻*
*🌻 325-1. Jagatī -kandā जगती -कन्दा (325) 🌻*
*She is the cause of the universe. The cause for the origin of the universe is attributed to the Brahman. Her Brahmanic stature is repeatedly emphasized in this Sahasranāma through various attributes. She is ‘prakāśa vimarśa mahā māyā svarūpinī’ by which She creates the universe.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
నవగ్రహ ధ్యాన శ్లోకమలు, బీజాక్షర మంత్రములు జప సంఖ్యతో సహా Navagraha meditation hymns, Bijakshara mantras including japa number
నవగ్రహ ధ్యాన శ్లోకమలు, బీజాక్షర మంత్రములు జప సంఖ్యతో సహా
Navagraha meditation hymns, Bijakshara mantras including japa number
ఆరోగ్యం కోసం సూర్య మంత్రం Surya Mantra for Health
నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే!
ఆయురారోగ్య ఐశ్వర్యo దేహి దేహిదేవః జగత్పతే!!
ఓ సూర్యదేవ!జగత్ పరిపాలకా!నీకిదే నా నమస్కారము.నీవు సర్వరోగములను తొలగించువాడవు.శాంతిని వొసంగువాడవు. మాకు ఆయువును,ఆరోగ్యమును, సంపదను అనుగ్రహించుము...🙏🌹
03 Dec 2021
సంధ్యా దీపం జ్యోతి
🙏🪔🙏 సంధ్యా దీపం జ్యోతి 🙏🪔
నమోస్తుతే
శుభం కరోతి కళ్యాణం
ఆరోగ్యం ధన సంపద,
శత్రు బుద్ధి వినాశాయ
దీప జ్యోతిర్ నమోస్తుతే ,
🪔
దీప-జ్యోతి: పరబ్రహ్మ
దీప జ్యోతి జనార్ధనః,
దీపో హారతి మే పాపం
దీప-జ్యోతిర్-నమోస్తుతే ||
🪔
🙏 ఏ దీపజ్యోతి ఐతే శుభం ,
మంచి , ఆరోగ్యం ధనసంపదలు ప్రసాదిస్తుందో, చెడు తలపులను తొలగిస్తుంది, ఆ దీపజ్యితికి ప్రణమిల్లుతున్నాను .🪔
🙏 ఏ దీపజ్యోతి పరబ్రహ్మమో ,
ఏ దీపజ్యోతి జనార్దనుడో,
ఏ దీపజ్యోతి మనని పాపములు చేయకుండా కాపాడుతుందో,
ఆ దీపజ్యోతి ప్రణమిల్లుతున్నాను.🪔
03 Dec 2021
శ్రీ లలితా సహస్ర నామములు - 161 / Sri Lalita Sahasranamavali - Meaning - 161
🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 161 / Sri Lalita Sahasranamavali - Meaning - 161 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 161.కార్యకారణ నిర్ముక్తా, కామకేళి తరంగితా ।
కనత్-కనకతాటంకా, లీలావిగ్రహ ధారిణీ ॥ 161 ॥ 🍀
🍀 859. కార్యకారణ నిర్ముక్తా :
కార్యాకరణములు లేని శ్రీ మాత
🍀 860. కామకేళీ తరంగితా :
కోరికల తరంగముల యందు విహరించునది.
🍀 861. కనత్కనక తాటంకా :
మనోహరమగు ధ్వని చేయు బంగారు చెవి కమ్మలు కలది.
🍀 862. లీలావిగ్రహ ధారిణి :
లీలకై అనాయాసముగా అద్భుత రూపములను ధరించునది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 161 🌹
📚. Prasad Bharadwaj
🌻 161. Kartakarananirmukta kamakeli tarangita
Kanatkanakatatanka lilavigrahadharini ॥ 161 ॥ 🌻
🌻 859 ) Karya karana nirmuktha -
She who is beyond the action and the cause
🌻 860 ) Kama keli tharangitha -
She who is the waves of the sea of the play of the God
🌻 861 ) Kanath kanaka thadanga -
She who wears the glittering golden ear studs
🌻 862 ) Leela vigraha dharini -
She who assumes several forms as play
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
03 Dec 2021
మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 113
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 113 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. జ్ఞానులు- దైత్యులు - 1 🌻
ఆది నుండియు మానవులలో రెండు తరగతుల వారున్నారు. ప్రకృతి శక్తులను చూచి మోజుపడి వానిని తమ అభిప్రాయముల ప్రకారము వినియోగించుకొనుటకు యత్నించు వారొక జాతి. ఈ ప్రకృతి యందును, తమ యందును గల అంతర్యామి చైతన్యమును నమ్మి దానికి ప్రాధాన్యమిచ్చువారు మరొక జాతి.
అందు మొదటి జాతి వారి దృష్టిలో ప్రకృతిని వశపరచుకొని వినియోగించుకొను స్వార్థ దృష్టి తప్పదు. వారిలో నాస్తికులు, ఆస్తికులు అను రెండు తెగలవారున్నారు. నాస్తికులకు ప్రకృతి శక్తులను వినియోగించుకొను దృష్టియే గాని, వినియోగ పద్ధతిలొ బాధ లేకుండునట్లు తీర్చిదిద్దుకొను నేర్పరితనము ఉండదు. దానితో సాంఘిక దురాచారములను ఎత్తి చూపుటతోనే ఆయుర్దాయము వ్యయమై పోవును.
ఇక మిగిలిన వారు ఆస్తికులు. ఏ దైవము పేరు పెట్టినను వారు తమ వినియోగమునకై దేవుని పేరిట ప్రకృతి శక్తులను కొలుచుచుందురు. ఏ ఇద్దరి దృష్టిలోను వినియోగము ఒక విధముగా ఉండదు.
కనుక ఈ తెగకు చెందిన అస్తికులు మతములను, సంప్రదాయములను, ఆరాధన విధానములను ఎవనికి వాడుగా ఏర్పరచుకొని, తాను మిగిలిన వారి కన్నా ఏ విధముగా జ్ఞానవంతుడో, తన ఆదర్శములు మిగిలిన వారి ఆదర్శముల కన్న ఏ విధముగా శ్రేష్ఠములో గుర్తుంచుకొనుటతోనే సరిపోవును. తత్ఫలితములుగా వర్గములు, పట్టుదలలు, కలహములు తప్పవు. ఈ లక్షణములు కలవారిని ప్రాచీనులు దైత్యులని వ్యవహరింతురు.....
✍️ మాస్టర్ ఇ.కె.🌻
03 Dec 2021
వివేక చూడామణి - 161 / Viveka Chudamani - 161
🌹. వివేక చూడామణి - 161 / Viveka Chudamani - 161🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -8 🍀
527. ఏ వ్యక్తి తన యొక్క నిజ స్వభావాన్ని గుర్తిస్తాడో, అట్టి వాడు ఆత్మావగాహనతో బ్రహ్మానంద స్థితిలో ఏవిధమైన బాహ్య వస్తు ప్రభావము లేకుండా, ప్రశాంత స్థితిలో ఏ విధమైన కోరికలు లేని వాడవుతాడు.
528. ఆత్మావగాహి అయిన యోగి ప్రకాశముతో వెలిగిపోతూ ప్రశాంతముగా, స్వేచ్ఛగా కూర్చున్న, నిల్చున్న, ఎచటకు వెళ్ళిన, అచటనే ఉన్న, ఏ స్థితిలో ఉన్న తన యొక్క అనంత బ్రహ్మానంద స్థితిని కోల్పోడు.
529. ఉన్నతాత్మ ఎవరైతే తనను తాను పూర్తిగా తెలుసుకొన్నాడో, అతని మనో స్థితులు ఏవిధమైన అడ్డంకులు లేకుండా సమయము, ప్రదేశము భేదము లేకండా ఉంటుంది. ఉన్నత ఆత్మ, ఎవరైతే బ్రహ్మము యొక్క సత్యాన్ని పూర్తిగా తెలుసుకున్నారో, అట్టి వారి మానసిక స్థితులు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఏమాత్రము సమయము, ప్రదేశము, స్థితి, నైతిక బాధ్యతులు, నీతి నియమాలు లేకుండా ధ్యాన స్థితిలో స్థిరముగా కొనసాగుతారు. వారు ఎలాంటి నిబంధనల ద్వారా స్వయం ఆత్మను తెలుసుకొనగలరు?
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 161 🌹
✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 32. I am the one who knows Brahman -8🌻
527. To the man who has realised his own nature, and drinks the undiluted Bliss of the Self, there is nothing more exhilarating than the quietude that comes of a state of desirelessness.
528. The illumined sage, whose only pleasure is in the Self, ever lives at ease, whether going or staying, sitting or lying, or in any other condition.
529. The noble soul who has perfectly realised the Truth, and whose mind-functions meet with no obstruction, no more depends upon conditions of place, time, posture, direction, moral disciplines, objects of meditation and so forth. What regulative conditions can there be in knowing one’s own Self ?
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
03 Dec 2021
శ్రీ శివ మహా పురాణము - 484
🌹 . శ్రీ శివ మహా పురాణము - 484 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 37
🌻. పెళ్ళి హడావుడి - 3 🌻
అదే సమయములో బంధువులకు ఆహ్వానమును పంపి, వారి రాక కొరకు ఉత్సాహముతో ప్రీతితో వేచియుండెను (20). బంధువులు, స్త్రీలు, పిల్లలు, పరిచారకులతో సహా విచ్చేసిరి. ఓ దేవర్షీ! ఇతర పర్వతరాజులు వేంచేసిన తీరును శ్రద్ధతో వినుము (21). శివుని ప్రీతిని పెంపొందించుట కొరకై దేవతలకు నిలయమగు మేరువు దివ్యరూపమును ధరించి విచ్చేసిన తీరును సంగ్రహముగా వర్ణించెదను (22).
అనేక రత్నాభరణములతో ప్రకాశించే బంధువర్గము గలవాడై, విలువైన వస్త్రములను ధరించి, అనేకమణులను సారభూతములగు మహారత్నములను శ్రద్ధతో సంపాదించి వాటిని తీసుకుని (23), ఆ మేరుపర్వతుడు చక్కని వేషముతో అలంకరించుకుని ప్రకాశించువాడై హిమవంతుని రాజధానికి వెళ్లెను. భార్యతో కుమారులతో గూడి మందర పర్వతుడు అనేక శోభలతో నిండినవాడై(24), వివిధములగు బహుమతులను సంగ్రహించుకొని వెళ్ళెను.
దేవతా స్వరూపుడు, విశాల హృదయుడు, వివిధశోభలతో కూడినవాడు అగు అస్తాచలుడు కూడా బహుమానములను తీసుకొని (25) ఆనందముతో విచ్చేసెను. ఉదయాచలుడు గొప్ప రత్నములు, మణులను కూడ తీసుకొని విచ్చేసెను (26).
పెద్ద పరివారము గలవాడు, మహాసుఖము గలవాడు అగు మలయ పర్వతుడు ఆదరముతో విచ్చేసెను (27). గొప్ప విన్యాసము గలవాడు, మహాబలశాలి అగు దర్దురుడు భార్యతో గూడి ఆనందముతో శీఘ్రముగా విచ్చేసెను (28).
ఓ కుమారా! గొప్ప శోభగలవాడు, హర్షముతో నిండిన మనస్సు గలవాడు అగు నిషదుడు కూడా నూతన వస్త్రములను ధరించి హిమవంతుని ఇంటికి వచ్చెను (29).మహాభాగ్యవంతుడగు గంధమాదన పర్వతుడు భార్యలతో, కుమారులతో గూడి ప్రీతితో హిమవంతుని గృహమునకు విచ్చేసెను (30).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
03 Dec 2021
గీతోపనిషత్తు -285
🌹. గీతోపనిషత్తు -285 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚
శ్లోకము 15-2
🍀 15-2. తత్వ మొక్కటే ! - రూప ధ్యానమునకు రూపమున కతీతమైన తత్త్వమును రూపము ద్వారా దర్శించు ప్రయత్నమున ఉన్నాను అను భావన యుండ వలెను. అపుడు రూప మేదైనను, నామ మేదైనను ఆరాధకుని చిత్తము అపరిమితమగు తత్త్వముతో ముడిపడును. పై విధమైన అవగాహనతో ఆరాధన చేసినచో దైవప్రాప్తి సత్యమై నిలచును. అట్లు కానిచో, వివిధ దేవతారాధనలు, గురుమూర్తి ఆరాధనములు వివిధత్వమును, భేదములను సృష్టించును. 🍀
జ్ఞానయజ్జెన చాప్యన్యే యజంతో మాముపాసతే |
ఏకత్వేన పృథక్ష్యేవ బహుధా విశ్వతో ముఖమ్ || 15
తాత్పర్యము : అనన్య భావనతో కొందరు, జ్ఞాన యజ్ఞము ద్వారా కొందరు, బహు విధములుగ కొందరు విశ్వరూపుడనగు నన్ను ఉపాసించుచున్నారు.
వివరణము : రూపమున కతీతమైన తత్త్వమును రూపము ద్వారా దర్శించు ప్రయత్నమున ఉన్నాను అను భావన యుండ వలెను. అపుడు రూప మేదైనను, నామ మేదైనను ఆరాధకుని చిత్తము అపరిమితమగు తత్త్వముతో ముడిపడును. అట్లు కానిచో, వివిధ దేవతారాధనలు, గురుమూర్తి ఆరాధనములు వివిధత్వమును, భేదములను సృష్టించును. అట్లు జరుగకుండుటకే ఈ శ్లోకమున భగవానుడు ఆరాధనలు ఎన్ని విధములుగ నున్నను, ఆరాధింపబడు తత్త్వ మొక్కటే అని తెలిసి ఆరాధించవలెనని తెలుపుచున్నాడు.
ఆరాధనము లనేకములై యుండ వచ్చును. కాని ఆరాధ్యమగు దైవమొక్కటే అని తెలిసినచో, భక్తుల నడుమ స్పర్ధలు, ఘర్షణలు, పోరాటములు, యుద్ధములు, హత్యలు, మరణములు యుండవు. రాముడైన, కృష్ణుడైన, శివుడైన, విష్ణువైన, లక్ష్మీ సరస్వతులైన, దుర్గ అయిన, ఆంజనేయుడు, సుబ్రహ్మణ్యుడు, గణపతి మరియే ఇతర దేవతలైన, గురువులైన పై విధమైన అవగాహనతో ఆరాధన చేసినచో దైవప్రాప్తి సత్యమై నిలచును. ఇట్టి అవగాహన యున్నపుడు పారశీయులైన, జైనులైన, సిక్కులైన, కిరస్తానీయులైన, ముసల్మానులైన భేదము చూపవలసిన అగత్య ముండదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
03 Dec 2021
3-DECEMBER-2021 FRIDAY MESSAGES
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 03, శుక్రవారం, డిసెంబర్ 2021 సౌమ్య వారము 🌹
🍀. కార్తీక మాసం 29వ రోజు 🍀
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 285 🌹
3) 🌹. శివ మహా పురాణము - 484🌹
4) 🌹 వివేక చూడామణి - 161 / Viveka Chudamani - 161🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -113🌹
6) 🌹 Osho Daily Meditations - 102🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 161 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 161🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ శుక్రవారం మిత్రులందరికీ 🌹*
*భృగు వాసరే, 03, డిసెంబర్ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. కార్తీక మాసం 29వ రోజు 🍀*
*నిషిద్ధములు :- పగటి ఆహారం*
*దానములు :- శివలింగం, వీభూది పండు, దక్షిణ, బంగారం*
*పూజించాల్సిన దైవము :- శివుడు (మృత్యుంజయుడు)*
*జపించాల్సిన మంత్రము :*
*ఓంత్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం,*
*ఉర్వారుకమివ బంధనాన్తృత్యో ర్ముక్షీయ మామృతాత్*
*ఫలితము :- అకాలమృత్యుహరణం, ఆయుర్వృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం.*
🌻 🌻 🌻 🌻 🌻
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, శరద్ ఋతువు,
కార్తీక మాసం
తిథి: కృష్ణ చతుర్దశి 16:57:06
వరకు తదుపరి అమావాశ్య
నక్షత్రం: విశాఖ 13:45:40
వరకు తదుపరి అనూరాధ
యోగం: అతిగంధ్ 12:56:56
వరకు తదుపరి సుకర్మ
కరణం: విష్టి 06:43:35 వరకు
వర్జ్యం: 17:15:30 - 18:39:42
దుర్ముహూర్తం: 08:44:58 - 09:29:35
మరియు 12:28:05 - 13:12:42
రాహు కాలం: 10:42:06 - 12:05:46
గుళిక కాలం: 07:54:46 - 09:18:26
యమ గండం: 14:53:06 - 16:16:46
అభిజిత్ ముహూర్తం: 11:43 - 12:27
అమృత కాలం: 05:57:08 - 07:22:12
మరియు 25:40:42 - 27:04:54
సూర్యోదయం: 06:31:06
సూర్యాస్తమయం: 17:40:27
వైదిక సూర్యోదయం: 06:34:56
వైదిక సూర్యాస్తమయం: 17:36:35
చంద్రోదయం: 05:10:58
చంద్రాస్తమయం: 16:48:27
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: తుల
మతంగ యోగం - అశ్వ లాభం 13:45:40
వరకు తదుపరి రాక్షస యోగం - మిత్ర కలహం
పండుగలు : లేదు
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -285 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 15-2
*🍀 15-2. తత్వ మొక్కటే ! - రూప ధ్యానమునకు రూపమున కతీతమైన తత్త్వమును రూపము ద్వారా దర్శించు ప్రయత్నమున ఉన్నాను అను భావన యుండ వలెను. అపుడు రూప మేదైనను, నామ మేదైనను ఆరాధకుని చిత్తము అపరిమితమగు తత్త్వముతో ముడిపడును. పై విధమైన అవగాహనతో ఆరాధన చేసినచో దైవప్రాప్తి సత్యమై నిలచును. అట్లు కానిచో, వివిధ దేవతారాధనలు, గురుమూర్తి ఆరాధనములు వివిధత్వమును, భేదములను సృష్టించును. 🍀*
*జ్ఞానయజ్జెన చాప్యన్యే యజంతో మాముపాసతే |*
*ఏకత్వేన పృథక్ష్యేవ బహుధా విశ్వతో ముఖమ్ || 15*
*తాత్పర్యము : అనన్య భావనతో కొందరు, జ్ఞాన యజ్ఞము ద్వారా కొందరు, బహు విధములుగ కొందరు విశ్వరూపుడనగు నన్ను ఉపాసించుచున్నారు.*
*వివరణము : రూపమున కతీతమైన తత్త్వమును రూపము ద్వారా దర్శించు ప్రయత్నమున ఉన్నాను అను భావన యుండ వలెను. అపుడు రూప మేదైనను, నామ మేదైనను ఆరాధకుని చిత్తము అపరిమితమగు తత్త్వముతో ముడిపడును. అట్లు కానిచో, వివిధ దేవతారాధనలు, గురుమూర్తి ఆరాధనములు వివిధత్వమును, భేదములను సృష్టించును. అట్లు జరుగకుండుటకే ఈ శ్లోకమున భగవానుడు ఆరాధనలు ఎన్ని విధములుగ నున్నను, ఆరాధింపబడు తత్త్వ మొక్కటే అని తెలిసి ఆరాధించవలెనని తెలుపుచున్నాడు.*
*ఆరాధనము లనేకములై యుండ వచ్చును. కాని ఆరాధ్యమగు దైవమొక్కటే అని తెలిసినచో, భక్తుల నడుమ స్పర్ధలు, ఘర్షణలు, పోరాటములు, యుద్ధములు, హత్యలు, మరణములు యుండవు. రాముడైన, కృష్ణుడైన, శివుడైన, విష్ణువైన, లక్ష్మీ సరస్వతులైన, దుర్గ అయిన, ఆంజనేయుడు, సుబ్రహ్మణ్యుడు, గణపతి మరియే ఇతర దేవతలైన, గురువులైన పై విధమైన అవగాహనతో ఆరాధన చేసినచో దైవప్రాప్తి సత్యమై నిలచును. ఇట్టి అవగాహన యున్నపుడు పారశీయులైన, జైనులైన, సిక్కులైన, కిరస్తానీయులైన, ముసల్మానులైన భేదము చూపవలసిన అగత్య ముండదు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 484 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 37
*🌻. పెళ్ళి హడావుడి - 3 🌻*
అదే సమయములో బంధువులకు ఆహ్వానమును పంపి, వారి రాక కొరకు ఉత్సాహముతో ప్రీతితో వేచియుండెను (20). బంధువులు, స్త్రీలు, పిల్లలు, పరిచారకులతో సహా విచ్చేసిరి. ఓ దేవర్షీ! ఇతర పర్వతరాజులు వేంచేసిన తీరును శ్రద్ధతో వినుము (21). శివుని ప్రీతిని పెంపొందించుట కొరకై దేవతలకు నిలయమగు మేరువు దివ్యరూపమును ధరించి విచ్చేసిన తీరును సంగ్రహముగా వర్ణించెదను (22).
అనేక రత్నాభరణములతో ప్రకాశించే బంధువర్గము గలవాడై, విలువైన వస్త్రములను ధరించి, అనేకమణులను సారభూతములగు మహారత్నములను శ్రద్ధతో సంపాదించి వాటిని తీసుకుని (23), ఆ మేరుపర్వతుడు చక్కని వేషముతో అలంకరించుకుని ప్రకాశించువాడై హిమవంతుని రాజధానికి వెళ్లెను. భార్యతో కుమారులతో గూడి మందర పర్వతుడు అనేక శోభలతో నిండినవాడై(24), వివిధములగు బహుమతులను సంగ్రహించుకొని వెళ్ళెను.
దేవతా స్వరూపుడు, విశాల హృదయుడు, వివిధశోభలతో కూడినవాడు అగు అస్తాచలుడు కూడా బహుమానములను తీసుకొని (25) ఆనందముతో విచ్చేసెను. ఉదయాచలుడు గొప్ప రత్నములు, మణులను కూడ తీసుకొని విచ్చేసెను (26).
పెద్ద పరివారము గలవాడు, మహాసుఖము గలవాడు అగు మలయ పర్వతుడు ఆదరముతో విచ్చేసెను (27). గొప్ప విన్యాసము గలవాడు, మహాబలశాలి అగు దర్దురుడు భార్యతో గూడి ఆనందముతో శీఘ్రముగా విచ్చేసెను (28).
ఓ కుమారా! గొప్ప శోభగలవాడు, హర్షముతో నిండిన మనస్సు గలవాడు అగు నిషదుడు కూడా నూతన వస్త్రములను ధరించి హిమవంతుని ఇంటికి వచ్చెను (29).మహాభాగ్యవంతుడగు గంధమాదన పర్వతుడు భార్యలతో, కుమారులతో గూడి ప్రీతితో హిమవంతుని గృహమునకు విచ్చేసెను (30).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. వివేక చూడామణి - 161 / Viveka Chudamani - 161🌹*
*✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -8 🍀*
*527. ఏ వ్యక్తి తన యొక్క నిజ స్వభావాన్ని గుర్తిస్తాడో, అట్టి వాడు ఆత్మావగాహనతో బ్రహ్మానంద స్థితిలో ఏవిధమైన బాహ్య వస్తు ప్రభావము లేకుండా, ప్రశాంత స్థితిలో ఏ విధమైన కోరికలు లేని వాడవుతాడు.*
*528. ఆత్మావగాహి అయిన యోగి ప్రకాశముతో వెలిగిపోతూ ప్రశాంతముగా, స్వేచ్ఛగా కూర్చున్న, నిల్చున్న, ఎచటకు వెళ్ళిన, అచటనే ఉన్న, ఏ స్థితిలో ఉన్న తన యొక్క అనంత బ్రహ్మానంద స్థితిని కోల్పోడు.*
*529. ఉన్నతాత్మ ఎవరైతే తనను తాను పూర్తిగా తెలుసుకొన్నాడో, అతని మనో స్థితులు ఏవిధమైన అడ్డంకులు లేకుండా సమయము, ప్రదేశము భేదము లేకండా ఉంటుంది. ఉన్నత ఆత్మ, ఎవరైతే బ్రహ్మము యొక్క సత్యాన్ని పూర్తిగా తెలుసుకున్నారో, అట్టి వారి మానసిక స్థితులు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఏమాత్రము సమయము, ప్రదేశము, స్థితి, నైతిక బాధ్యతులు, నీతి నియమాలు లేకుండా ధ్యాన స్థితిలో స్థిరముగా కొనసాగుతారు. వారు ఎలాంటి నిబంధనల ద్వారా స్వయం ఆత్మను తెలుసుకొనగలరు?*
* సశేషం....*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 VIVEKA CHUDAMANI - 161 🌹*
*✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*
*🌻 32. I am the one who knows Brahman -8🌻*
*527. To the man who has realised his own nature, and drinks the undiluted Bliss of the Self, there is nothing more exhilarating than the quietude that comes of a state of desirelessness.*
*528. The illumined sage, whose only pleasure is in the Self, ever lives at ease, whether going or staying, sitting or lying, or in any other condition.*
*529. The noble soul who has perfectly realised the Truth, and whose mind-functions meet with no obstruction, no more depends upon conditions of place, time, posture, direction, moral disciplines, objects of meditation and so forth. What regulative conditions can there be in knowing one’s own Self ?*
*Continues....*
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 VIVEKA CHUDAMANI - 161 🌹*
*✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*
*🌻 32. I am the one who knows Brahman -8🌻*
*527. To the man who has realised his own nature, and drinks the undiluted Bliss of the Self, there is nothing more exhilarating than the quietude that comes of a state of desirelessness.*
*528. The illumined sage, whose only pleasure is in the Self, ever lives at ease, whether going or staying, sitting or lying, or in any other condition.*
*529. The noble soul who has perfectly realised the Truth, and whose mind-functions meet with no obstruction, no more depends upon conditions of place, time, posture, direction, moral disciplines, objects of meditation and so forth. What regulative conditions can there be in knowing one’s own Self ?*
*Continues....*
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 113 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*సంకలనము : వేణుమాధవ్*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻. జ్ఞానులు- దైత్యులు - 1 🌻*
*ఆది నుండియు మానవులలో రెండు తరగతుల వారున్నారు. ప్రకృతి శక్తులను చూచి మోజుపడి వానిని తమ అభిప్రాయముల ప్రకారము వినియోగించుకొనుటకు యత్నించు వారొక జాతి. ఈ ప్రకృతి యందును, తమ యందును గల అంతర్యామి చైతన్యమును నమ్మి దానికి ప్రాధాన్యమిచ్చువారు మరొక జాతి.*
*అందు మొదటి జాతి వారి దృష్టిలో ప్రకృతిని వశపరచుకొని వినియోగించుకొను స్వార్థ దృష్టి తప్పదు. వారిలో నాస్తికులు, ఆస్తికులు అను రెండు తెగలవారున్నారు. నాస్తికులకు ప్రకృతి శక్తులను వినియోగించుకొను దృష్టియే గాని, వినియోగ పద్ధతిలొ బాధ లేకుండునట్లు తీర్చిదిద్దుకొను నేర్పరితనము ఉండదు. దానితో సాంఘిక దురాచారములను ఎత్తి చూపుటతోనే ఆయుర్దాయము వ్యయమై పోవును.*
*ఇక మిగిలిన వారు ఆస్తికులు. ఏ దైవము పేరు పెట్టినను వారు తమ వినియోగమునకై దేవుని పేరిట ప్రకృతి శక్తులను కొలుచుచుందురు. ఏ ఇద్దరి దృష్టిలోను వినియోగము ఒక విధముగా ఉండదు.*
*కనుక ఈ తెగకు చెందిన అస్తికులు మతములను, సంప్రదాయములను, ఆరాధన విధానములను ఎవనికి వాడుగా ఏర్పరచుకొని, తాను మిగిలిన వారి కన్నా ఏ విధముగా జ్ఞానవంతుడో, తన ఆదర్శములు మిగిలిన వారి ఆదర్శముల కన్న ఏ విధముగా శ్రేష్ఠములో గుర్తుంచుకొనుటతోనే సరిపోవును. తత్ఫలితములుగా వర్గములు, పట్టుదలలు, కలహములు తప్పవు. ఈ లక్షణములు కలవారిని ప్రాచీనులు దైత్యులని వ్యవహరింతురు.....*
✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Osho Daily Meditations - 102 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 102. REMAIN UNEXPLAINED 🍀*
*🕉 Everything in life need not be explained. We have no responsibility to explain anything to anybody. 🕉*
*All that is deep is always unexplained. That which you can explain will be very superficial. There are things that you cannot explain. If you fall in love with a person, how can you explain how you have fallen in love? Whatever you answer will sound stupid because of his nose, because of her face, because of his voice.*
*All those things will not seem worth mentioning, but there is something there in the person. Those things may be part of why you love the person, but that "something" is bigger than everything. That something is more than the total.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 161 / Sri Lalita Sahasranamavali - Meaning - 161 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 161.కార్యకారణ నిర్ముక్తా, కామకేళి తరంగితా ।*
*కనత్-కనకతాటంకా, లీలావిగ్రహ ధారిణీ ॥ 161 ॥ 🍀*
🍀 859. కార్యకారణ నిర్ముక్తా :
కార్యాకరణములు లేని శ్రీ మాత
🍀 860. కామకేళీ తరంగితా :
కోరికల తరంగముల యందు విహరించునది.
🍀 861. కనత్కనక తాటంకా :
మనోహరమగు ధ్వని చేయు బంగారు చెవి కమ్మలు కలది.
🍀 862. లీలావిగ్రహ ధారిణి :
లీలకై అనాయాసముగా అద్భుత రూపములను ధరించునది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 161 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 161. Kartakarananirmukta kamakeli tarangita*
*Kanatkanakatatanka lilavigrahadharini ॥ 161 ॥ 🌻*
🌻 859 ) Karya karana nirmuktha -
She who is beyond the action and the cause
🌻 860 ) Kama keli tharangitha -
She who is the waves of the sea of the play of the God
🌻 861 ) Kanath kanaka thadanga -
She who wears the glittering golden ear studs
🌻 862 ) Leela vigraha dharini -
She who assumes several forms as play
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#లలితాసహస్రనామములు #LalithaSahasranam
#PrasadBhardwaj
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ https://mymandir.page.link/wdh7G
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Subscribe to:
Posts (Atom)












