విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 441, 442 / Vishnu Sahasranama Contemplation - 441, 442

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 441 / Vishnu Sahasranama Contemplation - 441🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻441. నక్షత్రీ, नक्षत्री, Nakṣatrī🌻

ఓం నక్షత్రిణే నమః | ॐ नक्षत्रिणे नमः | OM Nakṣatriṇe namaḥ

చంద్రరూపేణ నక్షత్రీ నక్షత్రాణా మహంశశీ ।
ఇతి స్వయం భగవతా గీతాసు పరికీర్తనాత్ ॥

చంద్రుడు నక్షత్రీ అనబడును. ఆ చంద్రుడు విష్ణుని విభూతియే.

:: శ్రీమద్భగవద్గీత - విభూతి యోగము ::

ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్ ।
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ ॥ 21 ॥

నేను ఆదిత్యులలో విష్ణుడనువాడను. ప్రకాశింపజేయువానిలో కిరణములుగల సూర్యుడను. మరుత్తులను దేవతలలో మరీచియనువాడను. నక్షత్రములలో చంద్రుడను నేనే అయియున్నాను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 441🌹

📚. Prasad Bharadwaj

🌻441. Nakṣatrī🌻

OM Nakṣatriṇe namaḥ

Candrarūpeṇa nakṣatrī nakṣatrāṇā mahaṃśaśī,
Iti svayaṃ bhagavatā gītāsu parikīrtanāt.

चन्द्ररूपेण नक्षत्री नक्षत्राणा महंशशी ।
इति स्वयं भगवता गीतासु परिकीर्तनात् ॥

In the form of the moon, He is Nakṣatrī.

:: Śrīmad Bhagavad Gīta - Chapter 10 ::

Ādityānāmahaṃ viṣṇurjyotiṣāṃ raviraṃśumān,
Marīcirmarutāmasmi nakṣatrāṇāmahaṃ śaśī. 21.

:: श्रीमद्भगवद्गीत - विभूति योग ::

आदित्यानामहं विष्णुर्ज्योतिषां रविरंशुमान् ।
मरीचिर्मरुतामस्मि नक्षत्राणामहं शशी ॥ २१ ॥

Among the Ādityas, I am Viṣṇu; among the luminaries, I am the radiant sun; among the (forty nine) Maruts, I am the Marīci and among the stars, I am the moon.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

अनिर्विण्णस्स्थविष्ठो भूर्धर्मयूपो महामखः ।नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामस्समीहनः ॥ ४७ ॥

అనిర్విణ్ణస్స్థవిష్ఠో భూర్ధర్మయూపో మహామఖః ।నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామస్సమీహనః ॥ ౪౭ ॥

Anirviṇṇassthaviṣṭho bhūrdharmayūpo mahāmakhaḥ ।Nakṣatranemirnakṣatrī kṣamaḥ kṣāmassamīhanaḥ ॥ 47 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 442 / Vishnu Sahasranama Contemplation - 442 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻442. క్షమః, क्षमः, Kṣamaḥ🌻

ఓం క్షమాయ నమః | ॐ क्षमाय नमः | OM Kṣamāya namaḥ

క్షమః, क्षमः, Kṣamaḥ
క్షమః, क्षमः, Kṣamaḥ

విష్ణుస్సమస్త కార్యేషు సమర్థః క్షమ ఉచ్యతే ।
సర్వాన్ క్షమత ఇతి వా క్షమయా పృథివీ సమః ।
ఇతి వాల్మీకివచనాత్ క్షమోదాశరథీర్హరిః ॥

సర్వ కార్యముల నిర్వహణమునందును సమర్థుడు. లేదా క్షమా గుణము అనగా ఓర్పు కలవాడు. క్షమించును. ఓర్చును.

:: శ్రీమద్రామాయణము - బాలకాండము, సర్గ - 1 ::
విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శనః ।
కాలాగ్నిసదృశః క్రోధో క్షమయా పృథివీసమః ।
ధనదేన సమ స్త్యాగే సత్యే ధర్మ ఇవాపరః ॥ 18 ॥

(శ్రీరాముడు) పరాక్రమమున శ్రీమహావిష్ణు సమానుడు; చంద్రునివలె ఆహ్లాదకరుడు; సుతిమెత్తని హృదయము గలవాడేయైనను తన ఆశ్రితులకు అపకారము చేసినవారియెడల ప్రళయాగ్నివంటివాడు. సహనమున భూదేవి వంటివాడు. కుబేరునివలె త్యాగస్వభావముగలవాడు. సత్యపాలనమున ధర్మదేవతవంటివాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 442🌹

📚. Prasad Bharadwaj

🌻442. Kṣamaḥ🌻

OM Kṣamāya namaḥ

Viṣṇussamasta kāryeṣu samarthaḥ kṣama ucyate,
Sarvān kṣamata iti vā kṣamayā pr̥thivī samaḥ,
Iti vālmīkivacanāt kṣamodāśarathīrhariḥ.

विष्णुस्समस्त कार्येषु समर्थः क्षम उच्यते ।
सर्वान् क्षमत इति वा क्षमया पृथिवी समः ।
इति वाल्मीकिवचनात् क्षमोदाशरथीर्हरिः ॥

Expert in all actions. So Kṣamaḥ. One who is patient and forgives.

Śrīmad Rāmāyaṇa - Book 1, Chapter 1

Viṣṇunā sadr̥śo vīrye somavat priyadarśanaḥ,
Kālāgnisadr̥śaḥ krodho kṣamayā pr̥thivīsamaḥ,
Dhanadena sama styāge satye dharma ivāparaḥ. 18.

:: श्रीमद्रामायण - बालकांड, सर्ग - १ ::

विष्णुना सदृशो वीर्ये सोमवत् प्रियदर्शनः ।
कालाग्निसदृशः क्रोधो क्षमया पृथिवीसमः ।
धनदेन सम स्त्यागे सत्ये धर्म इवापरः ॥ १८ ॥

In valour Rama is comparable with Vishnu, and in his looks he is attractive like full-moon, he equals the earth in his perseverance, but he is matchable with era-end-fire in his wrath... and in benevolence he is identical to Kubera, God of Wealth-Management, and in his candour he is like Dharma itself, the other God Probity on earth.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

अनिर्विण्णस्स्थविष्ठो भूर्धर्मयूपो महामखः ।नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामस्समीहनः ॥ ४७ ॥

అనిర్విణ్ణస్స్థవిష్ఠో భూర్ధర్మయూపో మహామఖః ।నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామస్సమీహనః ॥ ౪౭ ॥

Anirviṇṇassthaviṣṭho bhūrdharmayūpo mahāmakhaḥ ।Nakṣatranemirnakṣatrī kṣamaḥ kṣāmassamīhanaḥ ॥ 47 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

04 Jul 2021

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 286-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 286-1

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 286-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 286-1 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 67. ఆబ్రహ్మ కీటజననీ, వర్ణాశ్రమ విధాయినీ ।
నిజాజ్ఞారూపనిగమా, పుణ్యాపుణ్య ఫలప్రదా ॥ 67 ॥ 🍀

🌻 286. 'వర్ణాశ్రమవిధాయినీ' -1🌻

వర్ణాశ్రమ ధర్మములను ఏర్పరచి ఆయా ధర్మములను విధించినది శ్రీమాత అని అర్థము. వర్ణములు నాలుగు. ఆశ్రమములు నాలుగు. వర్ణములనగా స్వభావములు. ప్రధానముగ నాలుగు స్వభావములు కలవు. జీవుల గుణములను బట్టి, చేయు కర్మను బట్టి నాలుగు వర్ణములు దైవమే ఏర్పరచునని తెలియవలెను. కొందరియందు మేధాశక్తి అధికముగ నుండును. వారు కాలమును, దేశమునుబట్టి దైవ నిర్ణయము ననుసరించుచు ఇతరులకు హితము చేయుటయే ప్రధానముగ జీవింతురు. తపస్సు, స్వాధ్యాయము, పరహితము ప్రధాన లక్షణము లుగ వీరు జీవితమును గడుపుచుందురు. ఇట్టివారు గుణముచేత, కర్మచేత బ్రాహ్మణు లనబడుదురు.

కొందరు శౌర్యము, ధైర్యము, సాహసము స్వభావమున కలిగి యుండి ఇతరులను రక్షించుటలో నిమగ్నమై యుందురు. ఇట్టివారు స్వభావపరముగ క్షత్రియు లనబడుదురు. మరికొందరు వినిమయ శక్తి కలిగి సృష్టి సంపదను, మానవ మేధస్సును మానవ సంఘమునకు వినిమయ పడునట్లు కార్యము లాచరింతురు. ఇట్టివారు వైశ్య ప్రవృత్తి కలవారు. వినిమయ వినియోగ కార్యక్రమములకు ధనమును ప్రధాన వాహికగ ఏర్పరచుకొని కార్యము చేయుదురు.

మరికొందరు కేవలము శరీర శ్రమనే చేయగలరుగాని పై తెలిపిన మూడు స్వభావములు లేక యుందురు. వీరిని శూద్రులందురు. ఇట్లు ప్రధానముగ నాలుగు వర్ణములు గోచరించును. ఈ విభాగము గుణ కర్మ విభాగమే కాని జాతి భేదము కాదు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 286 -1🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🍀 67. ābrahma-kīṭa-jananī varṇāśrama-vidhāyinī |
nijājñārūpa-nigamā puṇyāpuṇya-phalapradā || 67 || 🍀

🌻 Varṇāśrama-vidhāyinī वर्णाश्रम-विधायिनी (286) 🌻

Varṇāśrama means the order of life as expounded in Vedās. Veda-s classify people based upon their knowledge and capabilities. For example, soldiers are needed to protect borders of countries, agriculturists are needed to grow grains for consumption to make a living, traders are needed to buy requirements, and priests are needed to perform rituals.

Veda-s say that the classification is not based upon their birth, but on the ability of a person to perform certain duties. It would not be logical to expect a trader to protect borders effectively. Therefore the inclination, capacity, knowledge and experience are the parameters by which a person is classified.

Such classifications are applicable only to the human race. Since She is not different from Veda-s and all the Veda-s originated from Her, it is said that She has made these classifications.

Having created the universe, She also created the Veda-s to effectively administer the universe. Veda-s lay down rules and regulations to be followed in a human life. Path shown by Veda-s is known as dharma or righteousness. If one trespasses prescribed righteousness by Veda-s, he gets afflicted by karma-s that leads to several transmigrations.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

04 Jul 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 40

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 40 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. నిశ్శబ్దం అనుమతిస్తే నువ్వెవరో నీకు తెలుస్తుంది. దేవుణ్ణి కూడా తెలుసుకుంటావు. 🍀

మరింత మరింత నిశ్శబ్దంగా వుండు. నీకు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు నిశ్శబ్దంగా కూచో. ఏమీ చెయ్యకు. ధ్యానం కూడా చెయ్యకు. ప్రయోజనంతో పని లేకుండా, కారణం లేకుండా అలా నిశ్శబ్దంగా కూచో. మెల్లమెల్లగా నిశ్శబ్దం ఎదుగుతుంది.

అది పరవశం పొంగులు వారే అపూర్వ అనుభవం. అప్పుడు నిశ్శబ్దం నిన్ను అనుమతిస్తుంది. తనలోకి అనుమతిస్తుంది. నువ్వెవరో నీకు తెలుస్తుంది. ఈ జీవితమంటే ఏమిటో నీకు తెలుస్తుంది. ఇది తెలుసుకుంటే మనిషి దేవుణ్ణి తెలుసుకుంటాడు.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

04 Jul 2021

దేవాపి మహర్షి బోధనలు - 108

🌹. దేవాపి మహర్షి బోధనలు - 108 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 89. ప్రదర్శన - దర్శనము 🌻

పునర్జన్మను గూర్చి నీ వెన్నడైన భావింతువా? మరణమును గూర్చి భావింతువా? జన్మించక ముందు మరణించిన వెనుక నీ వెట్లుంటివో ఎప్పుడైన ఆలోచించితివా? ఆలోచించుట సత్సాధకున కవసరము. నీ విప్పటికే లక్షలాది సార్లు పుట్టితివి చచ్చితివికూడ. అన్నిసార్లు పుట్టిచచ్చిననూ, చచ్చిపుట్టిననూ దాని అనుభవము నీకు లేదు కదా! నీవెట్లు పుట్టితివి? ఎట్లు చచ్చితివి? నీకు తెలియనే లేదు కదా!

ఈ రెండు సన్నివేశములు జరుగునప్పుడు నీ వున్నావు. నిద్రకు ముందు, నిద్ర తరువాత నిద్రయందును, మేల్కాంచుట యందును స్వప్నమునందుకూడ నీవున్నావు. ఉండుట సత్యమే. కాని సన్నివేశములు జరుగుచున్నప్పుడు నీవున్నను పరికించలేక పోవుచున్నావు. దీనికి కారణమేమి? కారణ మొకటియే.

నీ యందు సాక్షిగ గమనించు బుద్ధి జనించ లేదు. ఈ సాక్షిత్వము నీయందు జనించవలె నన్నచో దైనందినముగ జరుగు సన్నివేశము లలో గమనించుట నేర్వవలెను. సన్నివేశము నందిమిడి పోవుట కాక దానిని గమనించువానిగ, సన్నివేశమునకీవలగ నుండవలెను.

అన్ని సన్నివేశములయందు నీవు సాక్షిగ నుండి జరుగుచున్న సన్నివేశమును సినిమా చూచినట్లు చూచుటవలె చూడవలెను. చిన్ని చిన్న విషయముల యందు దీనిని ముందు ప్రయత్నింపుము. ఇది అభ్యాసముగ స్థిరపడినచో క్రమముగ నీవు నీ జీవితమును నందలి సన్నివేశములను, నీ సినిమాగ చూడగలవు. ఇట్లు చూచుట నేర్చుటయే తారణమునకు మార్గము. అలసత్వము లేక ప్రయత్నింపుము.

మేమీ విద్య శ్రీకృష్ణుని నుండి నేర్చితిమి. ఆయన సాక్షీభూతులై యుండి కర్తవ్యమును అప్రమత్తతో నిర్వర్తించుచుండిరి. అన్ని మార్పులను చూచుచు వాని యందు మాకర్తవ్యములను నిర్వర్తించుచున్నాము. మా పుట్టుకలు మరణముల కూడ చూచితిమి. మీ పుట్టుకలు మరణములు కూడ చూచుచున్నాము. మీ రూపములు మారుచున్ననూ, జీవులుగ మేము గుర్తించుటకిదియే రహస్యము. మీరు మాకు పరిచితులే. మా సినిమాకథ, మీ సినిమాకథ కూడ చూచుచునుందుము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

04 Jul 2021

వివేక చూడామణి - 97 / Viveka Chudamani - 97

🌹. వివేక చూడామణి - 97 / Viveka Chudamani - 97🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 22. కోరికలు, కర్మలు - 7 🍀

330. ఎపుడైతే వ్యక్తి ఏ కొంచము బ్రహ్మము నుండి విడిపోయిన, వెంటనే అతడు తాను చేసిన పొరపాటు గమనించి భయానికి లోనవుతాడు.

331. ఎవరైతే తాను విశ్వములోని బాహ్య వస్తు విశేషములకు అనుగుణముగా నడుచుకుంటాడో అతడు దుఃఖాలకు ఒకటి తరువాత ఇంకొకటి ఎదుర్కొంటూ, దొంగ తాను చేసిన తప్పుకు భయపడినట్లు, చిక్కుల్లో పడతాడు. ఈ విషయాలు సృతులలోనూ, అనుభవాల ద్వారా గ్రహించగలరు.

332. ఎవరైతే ధ్యానవిధానమునకు విధేయులై ఉంటారో వారు మాయకు అతీతులవుతారు. మరియు ఉన్నతమైన ఆత్మోన్నతిని పొందగలరు. అయితే ఎవరైతే అశాశ్వతమైన విశ్వ పదార్థములకు, కోరికలకు లోనవుతారో వారు నాశనం అవుతారు. అందుకు ఉదాహరణగా దొంగతనము చేసినవాడు భయపడుతూ ఉంటే చేయని వాడు నిర్భయముగా సంచరించగలడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 VIVEKA CHUDAMANI - 97 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 22. Desires and Karma - 7 🌻

330. Whenever the wise man sees the least difference in the infinite Brahman, at once that which he sees as different through mistake, becomes a source of terror to him.

331. He who identifies himself with the objective universe which has been denied by hundreds of Shrutis, Smritis and reasonings, experiences misery after misery, like a thief, for he does something forbidden.

332. He who has devoted himself to meditation on the Reality (Brahman) and is free from Nescience, attains to the eternal glory of the Atman. But he who dwells on the unreal (the universe) is destroyed. That this is so is evidenced in the case of one who is not a thief and one who is a thief.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

04 Jul 2021

4-JULY-2021 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 1-59 / Bhagavad-Gita - 1-59 - 2 - 12🌹
2) 🌹 శ్రీమద్భగవద్గీత - 627 / Bhagavad-Gita - 627 - 18-38🌹 
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 441, 442 / Vishnu Sahasranama Contemplation - 441, 442🌹
4) 🌹 Daily Wisdom - 135🌹
5) 🌹. వివేక చూడామణి - 97🌹
6) 🌹Viveka Chudamani - 97🌹
7) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 108🌹
8) 🌹. నిర్మల ధ్యానములు - 40🌹
9) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 286-1 / Sri Lalita Chaitanya Vijnanam - 286 -1 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీమద్భగవద్గీత - 59 / Bhagavad-gita - 59 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ 

🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 12 🌴

12. న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపా: |
న చైవ న భవిష్యామ: సర్వే వయమత: పరమ్ ||

తాత్పర్యం :
నేను గాని, నీవు గాని, ఈ రాజులందరు గాని నిలిచియుండని సమయమేదియును లేదు. అలాగుననే భవిష్యత్తు నందు మనమెవ్వరు ఉండకపోము.

భాష్యము :
దేవదేవుడు అసంఖ్యాకములైన జీవులకు వారి వారి వ్యక్తిగత కర్మలు మరియు కర్మఫలములు ననుసరించి పోషకుడై యున్నాడని కటోపనిషత్తు మరియు శ్వేతాశ్వతరోపనిషత్తు (వేదముల) నందు తెలుపబడినది. అదే దేవదేవుడు ప్రతిజీవి హృదయములో తన ప్రధానాంశ రూపమున సదా నిలిచియుండును . అట్టి భగవానుని బాహ్యాభ్యంతరములలో గాంచగలిగిన సాధుపురుషులే పూర్ణమును మరియు శాశ్వతమును అగు శాంతిని నిజముగా పొందుచున్నారు.

నిత్యో నిత్యానం చేతనశ్చేతనానాం
ఏకో బహూనాం యో విధధాతి కామాన్ |
త మాత్మస్థం యే(ను పశ్యన్తి ధీరా:
తేషాం శాన్తి: శాశ్వతీ నేతరేషామ్ ||

(కతోపనిషత్తు 2.2.13)

అర్జునునకు తెలుపబడిన ఈ వేదసత్యము నిజమునకు జ్ఞానరహితులైనను జ్ఞానవంతులుగా తమను ప్రదర్శించుకొను జనులందరికీ తెలుపబడుచున్నది.* *తాను, అర్జునుడు మరియు రణరంగమున సమాకుడిన రాజులందరును నిత్యులైన జీవులనియు మరియు బంధముక్తస్థితులు రెండింటి యందును జీవులకు తానూ నిత్య పోషకుడననియు శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట స్పష్టముగా తెలియజేయుచున్నాడు. దేవదేవుడైన శ్రీకృష్ణుడు దివ్యపురుషుడు, అతని నిత్య సహచరుడైన అర్జునుడు మరియు రణరగమునందు సమాకుడిన రాజులు నిత్యులగు జీవులై యున్నారు. అది భవిష్యత్తు నందును ఉండకపోదు. అనగా వారి యొక్క వ్యక్తిత్త్వము గతమునందును నిలిచియున్నది. అది భవిష్యత్తు నందును ఎటువంటి అవరోధము లేకుండా కొనసాగుచున్నది. అట్టి యెడ ఎవరి కొరకును చింతించుటకు ఎట్టి కారణము లేదు.

మోక్షము పిమ్మట ఆత్మ మయావరణము నుండి బయటపడి నిరాకారబ్రహ్మముతో కలసి తన వ్యక్తిత్వమును కోల్పోవునని పలుకు మాయావాద సిద్ధాంతమును పరమప్రామణికుడైన శ్రీకృష్ణభగవానుడు సమర్థించుట లేదు. అలాగుననే వ్యక్తిత్వమనునది కేవలము బద్ధస్థితి యందే అనెడి సిద్ధాంతము సైతము సమర్ధించలేదు. ఉపనిషత్తులలో నిర్దారింపబడిన రీతి తన వ్యక్తిత్వము మరియు ఇతరులందరి వ్యక్తిత్వము శాశ్వతముగా భవిష్యత్తు నందును నిలిచి యుండునని శ్రీకృష్ణభగవానుడు స్పష్టముగా తెలియజేయుచున్నాడు. మయాతీతుడైనందున శ్రీకృష్ణుని ఈ వచనము అత్యంత ప్రామాణికమై యున్నది. 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 59 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada 
📚. Prasad Bharadwaj 

🌴 Chapter 2 - Sankhya Yoga - 12 🌴

12. na tv evāhaṁ jātu nāsaṁ
na tvaṁ neme janādhipāh
na caiva na bhaviṣyāmaḥ
sarve vayam ataḥ param

🌷 Translation : 
Never was there a time when I did not exist, nor you, nor all these kings; nor in the future shall any of us cease to be.

🌷 Purport :
In the Vedas – in the Kaṭha Upaniṣad as well as in the Śvetāśvatara Upaniṣad – it is said that the Supreme Personality of Godhead is the maintainer of innumerable living entities, in terms of their different situations according to individual work and reaction of work. 

That Supreme Personality of Godhead is also, by His plenary portions, alive in the heart of every living entity. Only saintly persons who can see, within and without, the same Supreme Lord can actually attain to perfect and eternal peace.

nityo nityānāṁ cetanaś cetanānām
eko bahūnāṁ yo vidadhāti kāmān
tam ātma-sthaṁ ye ’nupaśyanti dhīrās
teṣāṁ śāntiḥ śāśvatī netareṣām
(Kaṭha Upaniṣad 2.2.13)

The same Vedic truth given to Arjuna is given to all persons in the world who pose themselves as very learned but factually have but a poor fund of knowledge. The Lord says clearly that He Himself, Arjuna and all the kings who are assembled on the battlefield are eternally individual beings and that the Lord is eternally the maintainer of the individual living entities both in their conditioned and in their liberated situations. 

The Supreme Personality of Godhead is the supreme individual person, and Arjuna, the Lord’s eternal associate, and all the kings assembled there are individual eternal persons. It is not that they did not exist as individuals in the past, and it is not that they will not remain eternal persons. Their individuality existed in the past, and their individuality will continue in the future without interruption. Therefore, there is no cause for lamentation for anyone.
🌹🌹🌹🌹🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 627 / Bhagavad-Gita - 627 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 38 🌴*

38. విషయేన్ద్రియ సంయోగాద్యత్తదగ్రే మృతోపమమ్ |
పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతమ్ ||

🌷. తాత్పర్యం : 
ఇంద్రియములు ఇంద్రియార్థములతో సంపర్కము నొందగా లభించునటు వంటిదియు మరియు ఆదిలో అమృతమువలె, అంత్యమున విషమువలె తోచునదియు నైన సుఖము రజోగుణ ప్రధానమైనదని భావింపబడును.

🌷. భాష్యము :
యువతీయువకులు కలసినప్పుడు ఆమెను తదేకముగా చూచుటకు, తాకుటకు, ఆమెతో భోగించుటకు ఇంద్రియములు యువకుని ప్రేరేపించుచుండును. 

ఆదిలో ఇట్టి కార్యములు ఇంద్రియములకు అత్యంత ప్రీతికరముగా తోచినను అంత్యమున లేదా కొంతకాలమునకు అవి విషప్రాయములే కాగలవు. వారు విడిపోవుటయో లేదా విడాకులు పొందుటయో జరిగి దుఃఖము, విచారము కలుగుచుండును. అట్టి సుఖము సదా రజోగుణ ప్రధానమై యుండును. 

అనగా ఇంద్రియములు మరియు ఇంద్రియార్థములు సంయోగముచే లభించు సుఖము చివరకు దుఃఖకారణమే కాగలదు. కావున అది సర్వదా వర్ణింపదగినదై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 627 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 38 🌴*

38. viṣayendriya-saṁyogād
yat tad agre ’mṛtopamam
pariṇāme viṣam iva
tat sukhaṁ rājasaṁ smṛtam

🌷 Translation : 
That happiness which is derived from contact of the senses with their objects and which appears like nectar at first but poison at the end is said to be of the nature of passion.

🌹 Purport :
A young man and a young woman meet, and the senses drive the young man to see her, to touch her and to have sexual intercourse. In the beginning this may be very pleasing to the senses, but at the end, or after some time, it becomes just like poison. 

They are separated or there is divorce, there is lamentation, there is sorrow, etc. Such happiness is always in the mode of passion. Happiness derived from a combination of the senses and the sense objects is always a cause of distress and should be avoided by all means.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 441, 442 / Vishnu Sahasranama Contemplation - 441, 442 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻441. నక్షత్రీ, नक्षत्री, Nakṣatrī🌻*

*ఓం నక్షత్రిణే నమః | ॐ नक्षत्रिणे नमः | OM Nakṣatriṇe namaḥ*

చంద్రరూపేణ నక్షత్రీ నక్షత్రాణా మహంశశీ ।
ఇతి స్వయం భగవతా గీతాసు పరికీర్తనాత్ ॥

చంద్రుడు నక్షత్రీ అనబడును. ఆ చంద్రుడు విష్ణుని విభూతియే.

:: శ్రీమద్భగవద్గీత - విభూతి యోగము ::
ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్ ।
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ ॥ 21 ॥

నేను ఆదిత్యులలో విష్ణుడనువాడను. ప్రకాశింపజేయువానిలో కిరణములుగల సూర్యుడను. మరుత్తులను దేవతలలో మరీచియనువాడను. నక్షత్రములలో చంద్రుడను నేనే అయియున్నాను.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 441🌹*
📚. Prasad Bharadwaj

*🌻441. Nakṣatrī🌻*

*OM Nakṣatriṇe namaḥ*

Candrarūpeṇa nakṣatrī nakṣatrāṇā mahaṃśaśī,
Iti svayaṃ bhagavatā gītāsu parikīrtanāt.

चन्द्ररूपेण नक्षत्री नक्षत्राणा महंशशी ।
इति स्वयं भगवता गीतासु परिकीर्तनात् ॥

In the form of the moon, He is Nakṣatrī.

:: Śrīmad Bhagavad Gīta - Chapter 10 ::
Ādityānāmahaṃ viṣṇurjyotiṣāṃ raviraṃśumān,
Marīcirmarutāmasmi nakṣatrāṇāmahaṃ śaśī. 21.

:: श्रीमद्भगवद्गीत - विभूति योग ::
आदित्यानामहं विष्णुर्ज्योतिषां रविरंशुमान् ।
मरीचिर्मरुतामस्मि नक्षत्राणामहं शशी ॥ २१ ॥

Among the Ādityas, I am Viṣṇu; among the luminaries, I am the radiant sun; among the (forty nine) Maruts, I am the Marīci and among the stars, I am the moon.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अनिर्विण्णस्स्थविष्ठो भूर्धर्मयूपो महामखः ।नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामस्समीहनः ॥ ४७ ॥

అనిర్విణ్ణస్స్థవిష్ఠో భూర్ధర్మయూపో మహామఖః ।నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామస్సమీహనః ॥ ౪౭ ॥

Anirviṇṇassthaviṣṭho bhūrdharmayūpo mahāmakhaḥ ।Nakṣatranemirnakṣatrī kṣamaḥ kṣāmassamīhanaḥ ॥ 47 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 442 / Vishnu Sahasranama Contemplation - 442 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻442. క్షమః, क्षमः, Kṣamaḥ🌻*

*ఓం క్షమాయ నమః | ॐ क्षमाय नमः | OM Kṣamāya namaḥ*

క్షమః, क्षमः, Kṣamaḥ
క్షమః, क्षमः, Kṣamaḥ

విష్ణుస్సమస్త కార్యేషు సమర్థః క్షమ ఉచ్యతే ।
సర్వాన్ క్షమత ఇతి వా క్షమయా పృథివీ సమః ।
ఇతి వాల్మీకివచనాత్ క్షమోదాశరథీర్హరిః ॥

సర్వ కార్యముల నిర్వహణమునందును సమర్థుడు. లేదా క్షమా గుణము అనగా ఓర్పు కలవాడు. క్షమించును. ఓర్చును.

:: శ్రీమద్రామాయణము - బాలకాండము, సర్గ - 1 ::
విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శనః ।
కాలాగ్నిసదృశః క్రోధో క్షమయా పృథివీసమః ।
ధనదేన సమ స్త్యాగే సత్యే ధర్మ ఇవాపరః ॥ 18 ॥

(శ్రీరాముడు) పరాక్రమమున శ్రీమహావిష్ణు సమానుడు; చంద్రునివలె ఆహ్లాదకరుడు; సుతిమెత్తని హృదయము గలవాడేయైనను తన ఆశ్రితులకు అపకారము చేసినవారియెడల ప్రళయాగ్నివంటివాడు. సహనమున భూదేవి వంటివాడు. కుబేరునివలె త్యాగస్వభావముగలవాడు. సత్యపాలనమున ధర్మదేవతవంటివాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 442🌹*
📚. Prasad Bharadwaj 

*🌻442. Kṣamaḥ🌻*

*OM Kṣamāya namaḥ*

Viṣṇussamasta kāryeṣu samarthaḥ kṣama ucyate,
Sarvān kṣamata iti vā kṣamayā prthivī samaḥ,
Iti vālmīkivacanāt kṣamodāśarathīrhariḥ.

विष्णुस्समस्त कार्येषु समर्थः क्षम उच्यते ।
सर्वान् क्षमत इति वा क्षमया पृथिवी समः ।
इति वाल्मीकिवचनात् क्षमोदाशरथीर्हरिः ॥

Expert in all actions. So Kṣamaḥ. One who is patient and forgives.

Śrīmad Rāmāyaṇa - Book 1, Chapter 1
Viṣṇunā sadrśo vīrye somavat priyadarśanaḥ,
Kālāgnisadrśaḥ krodho kṣamayā prthivīsamaḥ,
Dhanadena sama styāge satye dharma ivāparaḥ. 18.

:: श्रीमद्रामायण - बालकांड, सर्ग - १ ::
विष्णुना सदृशो वीर्ये सोमवत् प्रियदर्शनः ।
कालाग्निसदृशः क्रोधो क्षमया पृथिवीसमः ।
धनदेन सम स्त्यागे सत्ये धर्म इवापरः ॥ १८ ॥

In valour Rama is comparable with Vishnu, and in his looks he is attractive like full-moon, he equals the earth in his perseverance, but he is matchable with era-end-fire in his wrath... and in benevolence he is identical to Kubera, God of Wealth-Management, and in his candour he is like Dharma itself, the other God Probity on earth.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अनिर्विण्णस्स्थविष्ठो भूर्धर्मयूपो महामखः ।नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामस्समीहनः ॥ ४७ ॥

అనిర్విణ్ణస్స్థవిష్ఠో భూర్ధర్మయూపో మహామఖః ।నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామస్సమీహనః ॥ ౪౭ ॥

Anirviṇṇassthaviṣṭho bhūrdharmayūpo mahāmakhaḥ ।Nakṣatranemirnakṣatrī kṣamaḥ kṣāmassamīhanaḥ ॥ 47 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 DAILY WISDOM - 134 🌹*
*🍀 📖 The Philosophy of Life 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 13. Teaching in an Appealing Way is the Task of Philosophy 🌻*

Philosophy is a complete world-view, a Weltanschauung, a general attitude of intellect, will and feeling, to life. It gives an explanation of the universe at large, by appealing to what is discoverable as the deepest of known facts. It is not a mere description of the details or bits of physical observation. 

We call an explanation philosophical when it is broad enough to be harmoniously related to the other views of life and fulfils the needs of all the faculties of man to the highest degree of satisfaction, using ultimate principles, and not mere empirical facts, in establishing its validity. “Philosophy, indeed, in one sense of the term, is only a compendious name for the spirit in education,” says William James. 

It is only in this sense of the process of the education and unfoldment of the spiritual spark in man that philosophy is worth its name. To teach a doctrine in a dogmatic and forced way is one thing, and to do it in a rational and appealing way in its greatest fullness is another. The latter is the task and the way of philosophy.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. వివేక చూడామణి - 97 / Viveka Chudamani - 97🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 22. కోరికలు, కర్మలు - 7 🍀*

330. ఎపుడైతే వ్యక్తి ఏ కొంచము బ్రహ్మము నుండి విడిపోయిన, వెంటనే అతడు తాను చేసిన పొరపాటు గమనించి భయానికి లోనవుతాడు. 

331. ఎవరైతే తాను విశ్వములోని బాహ్య వస్తు విశేషములకు అనుగుణముగా నడుచుకుంటాడో అతడు దుఃఖాలకు ఒకటి తరువాత ఇంకొకటి ఎదుర్కొంటూ, దొంగ తాను చేసిన తప్పుకు భయపడినట్లు, చిక్కుల్లో పడతాడు. ఈ విషయాలు సృతులలోనూ, అనుభవాల ద్వారా గ్రహించగలరు. 

332. ఎవరైతే ధ్యానవిధానమునకు విధేయులై ఉంటారో వారు మాయకు అతీతులవుతారు. మరియు ఉన్నతమైన ఆత్మోన్నతిని పొందగలరు. అయితే ఎవరైతే అశాశ్వతమైన విశ్వ పదార్థములకు, కోరికలకు లోనవుతారో వారు నాశనం అవుతారు. అందుకు ఉదాహరణగా దొంగతనము చేసినవాడు భయపడుతూ ఉంటే చేయని వాడు నిర్భయముగా సంచరించగలడు. 

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 97 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 22. Desires and Karma - 7 🌻*

330. Whenever the wise man sees the least difference in the infinite Brahman, at once that which he sees as different through mistake, becomes a source of terror to him.

331. He who identifies himself with the objective universe which has been denied by hundreds of Shrutis, Smritis and reasonings, experiences misery after misery, like a thief, for he does something forbidden.

332. He who has devoted himself to meditation on the Reality (Brahman) and is free from Nescience, attains to the eternal glory of the Atman. But he who dwells on the unreal (the universe) is destroyed. That this is so is evidenced in the case of one who is not a thief and one who is a thief.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 108 🌹* 
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 89. ప్రదర్శన - దర్శనము 🌻*

పునర్జన్మను గూర్చి నీ వెన్నడైన భావింతువా? మరణమును గూర్చి భావింతువా? జన్మించక ముందు మరణించిన వెనుక నీ వెట్లుంటివో ఎప్పుడైన ఆలోచించితివా? ఆలోచించుట సత్సాధకున కవసరము. నీ విప్పటికే లక్షలాది సార్లు పుట్టితివి చచ్చితివికూడ. అన్నిసార్లు పుట్టిచచ్చిననూ, చచ్చిపుట్టిననూ దాని అనుభవము నీకు లేదు కదా! నీవెట్లు పుట్టితివి? ఎట్లు చచ్చితివి? నీకు తెలియనే లేదు కదా! 

ఈ రెండు సన్నివేశములు జరుగునప్పుడు నీ వున్నావు. నిద్రకు ముందు, నిద్ర తరువాత నిద్రయందును, మేల్కాంచుట యందును స్వప్నమునందుకూడ నీవున్నావు. ఉండుట సత్యమే. కాని సన్నివేశములు జరుగుచున్నప్పుడు నీవున్నను పరికించలేక పోవుచున్నావు. దీనికి కారణమేమి? కారణ మొకటియే. 

నీ యందు సాక్షిగ గమనించు బుద్ధి జనించ లేదు. ఈ సాక్షిత్వము నీయందు జనించవలె నన్నచో దైనందినముగ జరుగు సన్నివేశము లలో గమనించుట నేర్వవలెను. సన్నివేశము నందిమిడి పోవుట కాక దానిని గమనించువానిగ, సన్నివేశమునకీవలగ నుండవలెను.

అన్ని సన్నివేశములయందు నీవు సాక్షిగ నుండి జరుగుచున్న సన్నివేశమును సినిమా చూచినట్లు చూచుటవలె చూడవలెను. చిన్ని చిన్న విషయముల యందు దీనిని ముందు ప్రయత్నింపుము. ఇది అభ్యాసముగ స్థిరపడినచో క్రమముగ నీవు నీ జీవితమును నందలి సన్నివేశములను, నీ సినిమాగ చూడగలవు. ఇట్లు చూచుట నేర్చుటయే తారణమునకు మార్గము. అలసత్వము లేక ప్రయత్నింపుము. 

మేమీ విద్య శ్రీకృష్ణుని నుండి నేర్చితిమి. ఆయన సాక్షీభూతులై యుండి కర్తవ్యమును అప్రమత్తతో నిర్వర్తించుచుండిరి. అన్ని మార్పులను చూచుచు వాని యందు మాకర్తవ్యములను నిర్వర్తించుచున్నాము. మా పుట్టుకలు మరణముల కూడ చూచితిమి. మీ పుట్టుకలు మరణములు కూడ చూచుచున్నాము. మీ రూపములు మారుచున్ననూ, జీవులుగ మేము గుర్తించుటకిదియే రహస్యము. మీరు మాకు పరిచితులే. మా సినిమాకథ, మీ సినిమాకథ కూడ చూచుచునుందుము. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 40 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. నిశ్శబ్దం అనుమతిస్తే నువ్వెవరో నీకు తెలుస్తుంది. దేవుణ్ణి కూడా తెలుసుకుంటావు. 🍀*

మరింత మరింత నిశ్శబ్దంగా వుండు. నీకు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు నిశ్శబ్దంగా కూచో. ఏమీ చెయ్యకు. ధ్యానం కూడా చెయ్యకు. ప్రయోజనంతో పని లేకుండా, కారణం లేకుండా అలా నిశ్శబ్దంగా కూచో. మెల్లమెల్లగా నిశ్శబ్దం ఎదుగుతుంది. 

అది పరవశం పొంగులు వారే అపూర్వ అనుభవం. అప్పుడు నిశ్శబ్దం నిన్ను అనుమతిస్తుంది. తనలోకి అనుమతిస్తుంది. నువ్వెవరో నీకు తెలుస్తుంది. ఈ జీవితమంటే ఏమిటో నీకు తెలుస్తుంది. ఇది తెలుసుకుంటే మనిషి దేవుణ్ణి తెలుసుకుంటాడు.

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 286-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 286-1 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 67. ఆబ్రహ్మ కీటజననీ, వర్ణాశ్రమ విధాయినీ ।*
*నిజాజ్ఞారూపనిగమా, పుణ్యాపుణ్య ఫలప్రదా ॥ 67 ॥ 🍀*

*🌻 286. 'వర్ణాశ్రమవిధాయినీ' -1🌻* 

వర్ణాశ్రమ ధర్మములను ఏర్పరచి ఆయా ధర్మములను విధించినది శ్రీమాత అని అర్థము. వర్ణములు నాలుగు. ఆశ్రమములు నాలుగు. వర్ణములనగా స్వభావములు. ప్రధానముగ నాలుగు స్వభావములు కలవు. జీవుల గుణములను బట్టి, చేయు కర్మను బట్టి నాలుగు వర్ణములు దైవమే ఏర్పరచునని తెలియవలెను. కొందరియందు మేధాశక్తి అధికముగ నుండును. వారు కాలమును, దేశమునుబట్టి దైవ నిర్ణయము ననుసరించుచు ఇతరులకు హితము చేయుటయే ప్రధానముగ జీవింతురు. తపస్సు, స్వాధ్యాయము, పరహితము ప్రధాన లక్షణము లుగ వీరు జీవితమును గడుపుచుందురు. ఇట్టివారు గుణముచేత, కర్మచేత బ్రాహ్మణు లనబడుదురు. 

కొందరు శౌర్యము, ధైర్యము, సాహసము స్వభావమున కలిగి యుండి ఇతరులను రక్షించుటలో నిమగ్నమై యుందురు. ఇట్టివారు స్వభావపరముగ క్షత్రియు లనబడుదురు. మరికొందరు వినిమయ శక్తి కలిగి సృష్టి సంపదను, మానవ మేధస్సును మానవ సంఘమునకు వినిమయ పడునట్లు కార్యము లాచరింతురు. ఇట్టివారు వైశ్య ప్రవృత్తి కలవారు. వినిమయ వినియోగ కార్యక్రమములకు ధనమును ప్రధాన వాహికగ ఏర్పరచుకొని కార్యము చేయుదురు. 

మరికొందరు కేవలము శరీర శ్రమనే చేయగలరుగాని పై తెలిపిన మూడు స్వభావములు లేక యుందురు. వీరిని శూద్రులందురు. ఇట్లు ప్రధానముగ నాలుగు వర్ణములు గోచరించును. ఈ విభాగము గుణ కర్మ విభాగమే కాని జాతి భేదము కాదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 286 -1🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🍀 67. ābrahma-kīṭa-jananī varṇāśrama-vidhāyinī |*
*nijājñārūpa-nigamā puṇyāpuṇya-phalapradā || 67 || 🍀*

*🌻 Varṇāśrama-vidhāyinī वर्णाश्रम-विधायिनी (286) 🌻*

Varṇāśrama means the order of life as expounded in Vedās. Veda-s classify people based upon their knowledge and capabilities. For example, soldiers are needed to protect borders of countries, agriculturists are needed to grow grains for consumption to make a living, traders are needed to buy requirements, and priests are needed to perform rituals.  

Veda-s say that the classification is not based upon their birth, but on the ability of a person to perform certain duties. It would not be logical to expect a trader to protect borders effectively. Therefore the inclination, capacity, knowledge and experience are the parameters by which a person is classified.  

Such classifications are applicable only to the human race. Since She is not different from Veda-s and all the Veda-s originated from Her, it is said that She has made these classifications. 

Having created the universe, She also created the Veda-s to effectively administer the universe. Veda-s lay down rules and regulations to be followed in a human life. Path shown by Veda-s is known as dharma or righteousness. If one trespasses prescribed righteousness by Veda-s, he gets afflicted by karma-s that leads to several transmigrations. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

శ్రీ లలితా సహస్ర నామములు - 98 / Sri Lalita Sahasranamavali - Meaning - 98

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 98 / Sri Lalita Sahasranamavali - Meaning - 98 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 98. విశుద్ధి చక్రనిలయా,ఽఽరక్తవర్ణా, త్రిలోచనా ।
ఖట్వాంగాది ప్రహరణా, వదనైక సమన్వితా ॥ 98 ॥ 🍀

🍀 475. విశుద్ధి చక్రనిలయా -
విశుద్ధి చక్రములో వసించునది.

🍀 476. ఆరక్తవర్ణా -
రక్తవర్ణములో నుండునది.

🍀 477. త్రిలోచనా -
మూడు లోచనములు కలది.

🍀 478. ఖట్వంగాది ప్రహరణా -
ఖట్వాంగాది ఆయుధములు ధరించునది.

🍀 479. వదనైక సమన్వితా -
ఒకే ఒక నోటితో సమన్వయింపబడిన రూపము గలది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 98 🌹

📚. Prasad Bharadwaj

🌻 98. viśuddhicakra-nilayā''raktavarṇā trilocanā |
khaṭvāṅgādi-praharaṇā vadanaika-samanvitā || 98 || 🌻

🌻 475 ) Vishudhichakra Nilaya -
She who is in sixteen petalled lotus

🌻 476 ) Aarakthavarni -
She who is slightly red

🌻 477 ) Trilochana -
She who has three eyes

🌻 478 ) Khadwangadhi prakarana -
She who has arms like the sword

🌻 479 ) Vadanaika samavidha -
She who has one face

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

03 Jul 2021

3-JULY-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 221🌹  
2) 🌹. శివ మహా పురాణము - 421🌹 
3) 🌹 Light On The Path - 168🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -49🌹  
5) 🌹 Osho Daily Meditations - 38🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 98 / Lalitha Sahasra Namavali - 98🌹 
7) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 98 / Sri Vishnu Sahasranama - 98🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -221 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚*
శ్లోకము 9

*🍀 8. తత్త్వ దర్శనము - పరమ పురుషుడు పురాతనుడు. లోకముల నెల్లపుడు శాసించువాడు. అతడే కవి. అనగా సృష్టించు వాడు. అతడు అణువుకన్న సూక్ష్మమైనవాడు. సర్వమునకు ఆధారమైనవాడు. చింతింప శక్యము కాని రూపము, స్వరూపము కలవాడు. అతడు చీకటి కావలివాడు. చీకటి కావల ఆదిత్యునివలె వెలుగుచుండెడి వాడు. అట్టివానిగ అతనిని స్మరింపుము. వేదఋషులు ఈ పరమగు పురుషుని 'తత్' అని పిలిచిరి. అనగా 'అది' అనిరి. అదియే ఇదిగా ఏర్పడినదనియు, కనుక ఇది నిజమునకు అదియే యని ఉపనిషత్తులు పదే పదే తెలుపుచున్నవి. దానినే దర్శించు చుండుట తత్త్వదర్శనము. దానినే చింతించుచుండుట తత్త్వ చింతనము. దానిగూర్చియే గోష్ఠిచేయుట తత్త్వ విచారము. 🍀*

కవిం పురాణ మనుశాసితార మణోరణీయాంస మనుస్మరేద్య: |
సర్వస్య ధాతార మచింత్యరూప మాదిత్యవర్ణం తమసః పరస్తాత్ || 9

తాత్పర్యము : 
పై తెలిపిన పరమ పురుషుడు పురాతనుడు. లోకముల నెల్లపుడు శాసించువాడు. అతడే కవి. అనగా సృష్టించు వాడు. అతడు అణువుకన్న సూక్ష్మమైనవాడు. సర్వమునకు ఆధారమైనవాడు. చింతింప శక్యము కాని రూపము, స్వరూపము కలవాడు. అతడు చీకటి కావలివాడు. చీకటి కావల ఆదిత్యునివలె వెలుగుచుండెడి వాడు. అట్టివానిగ అతనిని స్మరింపుము. 

వివరణము : 
పరమ పురుషుని ఆవిష్కరించు శ్లోకమిది. అట్టి పరమపురుషుడు రూపమున కతీతమగు వెలుగు. ఏ నామము లేనివాడు. చీకటిచే క్రమ్మనివాడు. అజ్ఞానమను చీకటి కందని వాడు. సమస్త సృష్టికి అతడే ఆధారము. అయినప్పటికిని అణువందును కూడ యిమిడి యున్నాడు. అతని నుండే సమస్త సృష్టి వ్యక్తమగుచుండును. అతనిలోనికే సమస్త సృష్టి లయమగు చుండును. అతనివలననే సృష్టి నిలచి యుండును. 

లయమందు సమస్తము అతని యందు ఇమిడియుండి, సృష్టియందు వెలువడి, స్థితి యందు పూర్ణమై ప్రకటింపబడి యుండును. అతనికన్న పురాతనుడు లేడు. అతడే సనాతనుడు. అందుండియే కాలము, సంకల్పము, శక్తి, ప్రకృతి, మహత్తు ఇత్యాదివన్నియు జనించును. సమస్తమునకు మూలమైన వానిని, గోచరించుచున్న సమస్తము నందు దర్శించుట ఈ శ్లోకమున తెలుపబడిన సాధన. “అనుస్మరేత్”అని శ్లోకము శాసించుచున్నది. అనుస్మరణము, అనుచింతనము అని తెలుపుటలో ఎడతెగక స్మరించమని, ఎడతెగక చింతనము చేయుమని సూచన. 

ఈ పరమ పురుషుడు స్త్రీయు కాదు, పురుషుడు కాదు. రెండున్నూ మిళితమైన తత్త్వము. కనుక వేదఋషులు ఈ పరమగు పురుషుని 'తత్' అని పిలిచిరి. అనగా 'అది' అనిరి. అదియే ఇదిగా ఏర్పడినదనియు, కనుక ఇది నిజమునకు అదియే యని ఉపనిషత్తులు పదే పదే తెలుపుచున్నవి. దానినే దర్శించు చుండుట తత్త్వదర్శనము. దానినే చింతించుచుండుట తత్త్వ చింతనము. దానిగూర్చియే గోష్ఠిచేయుట తత్త్వ విచారము. 

దాని యందు అన్నియు ఇమిడియుండును. అది శైవము కాదు, వైష్ణవము కాదు, శాక్తేయము కాదు, క్రైస్తవము కాదు, ఇస్లాము కాదు. మరి యే మతము కాదు. మతములు, సిద్ధాంతములు అన్నియు అందిమిడిపోవును. అట్టి తత్త్వమును ధ్యానించ మని బోధించు భగవద్గీత నిశ్చయముగా మతాతీతమైన గ్రంథము. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 421🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 24

*🌻. దేవతలు శివునితో మొరపెట్టుకొనుట - 6 🌻*

ఆ పార్వతి నారదుని ఉపదేశమును పొంది కఠినమగు తపస్సును చేయుచున్నది. స్థావర జంగమ ప్రాణులతో గూడిన ముల్లోకములు ఆమె యొక్కతేజస్సుచే వ్యాప్తమై యున్నవి (53). ఓ పరమేశ్వరా! నీవు ఆ పార్వతికి వరమునిచ్చుటకు వెళ్లుము. ఓ స్వామీ ! దేవతలమగు మా దుఃఖమును పోగొట్టి సుఖములనిమ్ము (54).

ఓ శంకరా! దేవతలకు నాకు హృదయములో నీ వివాహమును చూడవలెననే ఉత్సాహము అధికముగా గలదు. కావున నీవు యథా యోగ్యముగా చేయుము (55). ఓ పరత్పరా! నీవు రతికి ఇచ్చిన వరమును నెరవేర్చే సమయము ఆసన్నమైనది. నీ ప్రతిజ్ఞను సఫలము చేయుము (56).

బ్రహ్మ ఇట్లు పలికెను-

విష్ణువు, దేవతలు, మహర్షులు ఇట్లు పలికి శివునకు నమస్కరించి అనేక స్తోత్రములతో చక్కగా స్తుతించి, వారందరు ఆయన ఎదుట నిలబడిరి (57). అపుడు భక్తులకు వశుడై ఉండే శంకరుడు కూడా దేవతల మాటలను విని నవ్వెను. వేద మర్యాదను రక్షించు శివుడు వెంటనే వారికి ఇట్లు బదులిడెను (58).

శంకరుడిట్లు పలికెను-

ఓ హరీ! బ్రహ్మా! దేవతలారా! అందరు అదరముతో వినుడు. నేను వివేకముతో కూడియున్న యథోచితమగు ప్రత్యేక వచనమును చెప్పెదను (59). మానవులు వివాహమాడుట యోగ్యమగు కర్మ కాదు. వివాహము దృఢమగు బంధము. అది పెద్ద సంకెల అని చెప్పవచ్చును (60). 

లోకములో చెడు సంగములనేకములు గలవు. వాటిలో అన్నింటి కంటె అధికమైనది స్త్రీలతోడి సంగము. మానవుడు బంధములనన్నింటినీ విడిపించుకొనగలడు. కాని స్త్రీసంగము నుండి విడిపించుకొనలేడు (61). ఇనుప సంకెళ్లతోగాని, చెక్కల సంకెలతో గాని దృఢముగా బంధింపబడిన వ్యక్తి విడిపించుకొనగలడు. కాని స్త్రీ అను పాశముచే బంధింపబడిన వ్యక్తి ఏనాటికైనను విముక్తుడు కాలేడు (62). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 LIGHT ON THE PATH - 168 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 11 - Master Hilarion’s note on Rule 21.
*🌻 Regard the three truths. They are equal. - 5 🌻*

597. There is no harm in the fact that we do not know perfectly. It must be so; it is in the nature of things. It is when we suppose our knowledge to be complete, when it is pitifully incomplete, when we think that we know everything and condemn other men who think differently, not realizing that they may be seeing another side of a many-sided truth, that we go wrong. 

Let us by all means cling to our imperfect knowledge, but, while trying to increase it whenever we get an opportunity, let us never forget that it is imperfect, lest we should be led into the mistake of condemning someone who perhaps knows more than we do. Truth is deep; truth is often mysterious. It cannot be grasped in its entirety by any one man nor by any one body or sect of men. We must gradually learn to appreciate truth, before we can know it in any of its aspects. 

The truth about anything is the way in which that thing presents itself to the Logos, to the Maker, of the whole system. He who made it alone understands all, knows all things as they are. His view is the only perfect view. 

For us truth is relative. We cannot see the whole as He sees it; but although our knowledge must be imperfect at least it need not be wrong as far as it goes. We may have so much of the truth about a certain thing chat when we come to know all about it, when we reach Adeptship, we shall not have to correct what we have previously known, but only to add to it.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#LightonPath #Theosophy
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 49 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనం : వేణుమాధవ్ 
📖. సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. లోకోద్ధరణము- లోక కల్యాణము - 2 🌻 *

లోకమంతా విష్ణుమయం. లోకంలోని వ్యక్తుల స్వభావాలనే అలల ఆటు, పోటుల వెనుక నేపథ్యంగా ఉన్నది అంతర్యామి చైతన్యమనే మహా సాగరము. ఇది అవ్యక్తము‌. ఈ సాగరమే వాసుదేవుడు. 

ఈ సాగరాన్ని దర్శించి, జీవుల రూపంలోని వాసుదేవుని సేవకై కడంగి ఆనందించుటే మన కర్తవ్యము. 

దీన్ని ఆచరించే వాని మనస్సులో వాసుదేవుడు అను ముద్ర ఒకటే ఉంటుంది. ఇదియే ప్రభుముద్ర. ఆంజనేయుని వలె ఈ ముద్ర ధరించినవారు సంసార సముద్రాన్ని తరిస్తారు. 

జీవుల స్వభావాలను గూర్చి వీరికి ఎట్టి ముద్ర ఉండదు. ఆయా వ్యక్తుల కష్టాలు, ఆపదలు, రోగాలు వీరికి గుర్తుంటాయి. జీవుల ఆనందానికి, శాంతికి, ఆరోగ్యానికి తమ వంతు సేవ చేస్తారు. లోకకళ్యాణము కొరకు తమ వంతు కర్తవ్యాన్ని అనుష్ఠిస్తారు. 

నిజానికి లోకంలో కాలధర్మం రాజ్యమేలుతుంటుంది. భూమిపై జీవుల ప్రజ్ఞలను అధిష్ఠించే భూమికి కూడ ప్రజ్ఞ ఉంటుంది. ఆ ప్రజ్ఞా పరిణామంలో భాగంగానే, ఆయాకాలాల్లో జీవుల ప్రవర్తనల్లోని కొన్ని సాధారణ సన్నివేశాలు జరుగుతాయి. 

కృతయుగంలోను అసుర ధర్మావలంబులున్నారు. కలియుగంలోను దైవధర్మావలంబులున్నారు. కలి అనేది పరస్పరాభిప్రాయ ముద్రలతో ఘర్షణను పుట్టించే ప్రభావం కల ఒక ఇంద్రజాలం. అంతేకాని ఒక యుగం మాత్రమే కాదు. 

కలి జీవుల ఉద్ధరణకై ప్రయత్నం సాగించేవారు ఈ ఇంద్రజాలానికి వశులై, కలిధర్మ ప్రభావాన్నే పెంచుకుంటూ పోతూ కలికి ఉపకరణాలవుతారు. 

అలాకాక, జీవుల ప్రవర్తనలు, సమాజగతిలో సన్నివేశాలు మున్నగు అలల వెనుక అనంతకాలమనే సాగరాన్ని దర్శించి, లోక కల్యాణమునకై దీక్ష వహించేవారు విష్ణుధర్మాన్ని అవలంబించి, ధన్యులవుతారు....

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 38 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 UNCONDITIONAL 🍀*

*🕉 Once you know what love is, you are ready to give; the more you give, the more you have it. The more you go on showering on others, the more love springs up in your being. 🕉*

Love never bothers much about whether the other is worthy of receiving or not. This is a miserly attitude, and love is never a miser. The cloud never bothers about whether the earth is worthy. It rains on the mountains, it rains on the rocks; it rains everywhere and anywhere. It gives without any conditions, without any strings attached.

And that's how love is: It simply gives, it enjoys giving. Whoever is willing to receive, receives it. He need not be worthy, he needs not fit any special category, he needs not fulfill any qualifications. If all these things are required, then what you are giving is not love; it must be something else. Once you know what love is, you are ready to give; the more you give, the more you have. The more you go on showering on others, the more love springs up in your being.

Ordinary economics is totally different: If you give something, you lose it. If you want to keep something, avoid giving it away. Collect it, be miserly. Just the opposite is the case with love: If you want to have it, don't be miserly; otherwise it will go dead, it will become stale. Go on giving, and fresh sources will become available. Fresh streams will flow into your being. The whole of existence starts pouring into you 'when your giving is unconditional, when it is total.
 
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 98 / Sri Lalita Sahasranamavali - Meaning - 98 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 98. విశుద్ధి చక్రనిలయా,ఽఽరక్తవర్ణా, త్రిలోచనా ।*
*ఖట్వాంగాది ప్రహరణా, వదనైక సమన్వితా ॥ 98 ॥ 🍀*

🍀 475. విశుద్ధి చక్రనిలయా - 
విశుద్ధి చక్రములో వసించునది.

🍀 476. ఆరక్తవర్ణా - 
రక్తవర్ణములో నుండునది.

🍀 477. త్రిలోచనా - 
మూడు లోచనములు కలది.

🍀 478. ఖట్వంగాది ప్రహరణా -
 ఖట్వాంగాది ఆయుధములు ధరించునది.

🍀 479. వదనైక సమన్వితా - 
ఒకే ఒక నోటితో సమన్వయింపబడిన రూపము గలది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 98 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 98. viśuddhicakra-nilayā''raktavarṇā trilocanā |
khaṭvāṅgādi-praharaṇā vadanaika-samanvitā || 98 || 🌻*

🌻 475 ) Vishudhichakra Nilaya -   
She who is in sixteen petalled lotus

🌻 476 ) Aarakthavarni -   
She who is slightly red

🌻 477 ) Trilochana -   
She who has three eyes

🌻 478 ) Khadwangadhi prakarana -   
She who has arms like the sword

🌻 479 ) Vadanaika samavidha -   
She who has one face

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 98 / Sri Vishnu Sahasra Namavali - 98 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*పూర్వాభాద్ర నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం*

*🍀 98. అక్రూరః పేశలో దక్షో దక్షిణః, క్షమిణాంవరః |*
*విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ‖ 98 ‖ 🍀*

🍀 915) అక్రూర: - 
క్రూరత్వము లేనివాడు.

🍀 916) పేశల: - 
మనోవాక్కాయ కర్మలచే రమణీయముగ నుండువాడై పేశల: అని స్తుతించబడును.

🍀 917) దక్ష: - 
సమర్థుడైనవాడు.

🍀 918) దక్షిణ: - 
భక్తులను ఔదార్యముతో బ్రోచువాడు.

🍀 919) క్షమిణాం వర: - 
సహనశీలు లైన వారిలందరిలో శ్రేష్ఠుడు.

🍀 920) విద్వత్తమ: - 
సర్వజ్ఞత్తము కలిగియుండి, అందరిలో ఉత్తమమైనవాడు.

🍀 921) వీతభయ: - 
భయము లేనివాడు.

🍀 922) పుణ్యశ్రవణ కీర్తన: - 
తనను గూర్చి శ్రవణము గాని, కీర్తన గాని పుణ్యము కలుగజేయును.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 98 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for PoorvaBhadra 2nd Padam* 

*🌻 98. akrūraḥ peśalō dakṣō dakṣiṇaḥ, kṣamiṇāṁ varaḥ |*
*vidvattamō vītabhayaḥ puṇyaśravaṇakīrtanaḥ || 98 || 🌻*

🌻 915. Akrūraḥ: 
One who is without cruelty.

🌻 916. Peśalaḥ: 
One who is handsome in regard to His actions, mind, word and body.

🌻 917. Dakṣaḥ: 
One who is fullgrown, strong and does every thing quickly, such a person is Daksha.

🌻 918. Dakṣiṇaḥ: 
This word is also means the same as the above Nama.

🌻 919. Kṣamiṇāṁ varaḥ: 
The greatest among the patient ones, because He is more patient than all Yogis noted for patience.

🌻 920. Vidvattamaḥ: 
He who has got the unsurpassable and all-inclusive knowledge of everything.

🌻 921. Vītabhayaḥ: 
One who, being eternally free and the Lord of all, is free from the fear of trnsmigratory life.

🌻 922. Puṇya-śravaṇa-kīrtanaḥ: 
One to hear about whom and to sing of whom is meritorious.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 49

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 49 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనం : వేణుమాధవ్

📖. సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. లోకోద్ధరణము- లోక కల్యాణము - 2 🌻

లోకమంతా విష్ణుమయం. లోకంలోని వ్యక్తుల స్వభావాలనే అలల ఆటు, పోటుల వెనుక నేపథ్యంగా ఉన్నది అంతర్యామి చైతన్యమనే మహా సాగరము. ఇది అవ్యక్తము‌. ఈ సాగరమే వాసుదేవుడు.

ఈ సాగరాన్ని దర్శించి, జీవుల రూపంలోని వాసుదేవుని సేవకై కడంగి ఆనందించుటే మన కర్తవ్యము.

దీన్ని ఆచరించే వాని మనస్సులో వాసుదేవుడు అను ముద్ర ఒకటే ఉంటుంది. ఇదియే ప్రభుముద్ర. ఆంజనేయుని వలె ఈ ముద్ర ధరించినవారు సంసార సముద్రాన్ని తరిస్తారు.

జీవుల స్వభావాలను గూర్చి వీరికి ఎట్టి ముద్ర ఉండదు. ఆయా వ్యక్తుల కష్టాలు, ఆపదలు, రోగాలు వీరికి గుర్తుంటాయి. జీవుల ఆనందానికి, శాంతికి, ఆరోగ్యానికి తమ వంతు సేవ చేస్తారు. లోకకళ్యాణము కొరకు తమ వంతు కర్తవ్యాన్ని అనుష్ఠిస్తారు.

నిజానికి లోకంలో కాలధర్మం రాజ్యమేలుతుంటుంది. భూమిపై జీవుల ప్రజ్ఞలను అధిష్ఠించే భూమికి కూడ ప్రజ్ఞ ఉంటుంది. ఆ ప్రజ్ఞా పరిణామంలో భాగంగానే, ఆయాకాలాల్లో జీవుల ప్రవర్తనల్లోని కొన్ని సాధారణ సన్నివేశాలు జరుగుతాయి.

కృతయుగంలోను అసుర ధర్మావలంబులున్నారు. కలియుగంలోను దైవధర్మావలంబులున్నారు. కలి అనేది పరస్పరాభిప్రాయ ముద్రలతో ఘర్షణను పుట్టించే ప్రభావం కల ఒక ఇంద్రజాలం. అంతేకాని ఒక యుగం మాత్రమే కాదు.

కలి జీవుల ఉద్ధరణకై ప్రయత్నం సాగించేవారు ఈ ఇంద్రజాలానికి వశులై, కలిధర్మ ప్రభావాన్నే పెంచుకుంటూ పోతూ కలికి ఉపకరణాలవుతారు.

అలాకాక, జీవుల ప్రవర్తనలు, సమాజగతిలో సన్నివేశాలు మున్నగు అలల వెనుక అనంతకాలమనే సాగరాన్ని దర్శించి, లోక కల్యాణమునకై దీక్ష వహించేవారు విష్ణుధర్మాన్ని అవలంబించి, ధన్యులవుతారు....

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

03 Jul 2021

శ్రీ శివ మహా పురాణము - 421

🌹 . శ్రీ శివ మహా పురాణము - 421🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 24

🌻. దేవతలు శివునితో మొరపెట్టుకొనుట - 6 🌻

ఆ పార్వతి నారదుని ఉపదేశమును పొంది కఠినమగు తపస్సును చేయుచున్నది. స్థావర జంగమ ప్రాణులతో గూడిన ముల్లోకములు ఆమె యొక్కతేజస్సుచే వ్యాప్తమై యున్నవి (53). ఓ పరమేశ్వరా! నీవు ఆ పార్వతికి వరమునిచ్చుటకు వెళ్లుము. ఓ స్వామీ ! దేవతలమగు మా దుఃఖమును పోగొట్టి సుఖములనిమ్ము (54).

ఓ శంకరా! దేవతలకు నాకు హృదయములో నీ వివాహమును చూడవలెననే ఉత్సాహము అధికముగా గలదు. కావున నీవు యథా యోగ్యముగా చేయుము (55). ఓ పరత్పరా! నీవు రతికి ఇచ్చిన వరమును నెరవేర్చే సమయము ఆసన్నమైనది. నీ ప్రతిజ్ఞను సఫలము చేయుము (56).

బ్రహ్మ ఇట్లు పలికెను-

విష్ణువు, దేవతలు, మహర్షులు ఇట్లు పలికి శివునకు నమస్కరించి అనేక స్తోత్రములతో చక్కగా స్తుతించి, వారందరు ఆయన ఎదుట నిలబడిరి (57). అపుడు భక్తులకు వశుడై ఉండే శంకరుడు కూడా దేవతల మాటలను విని నవ్వెను. వేద మర్యాదను రక్షించు శివుడు వెంటనే వారికి ఇట్లు బదులిడెను (58).

శంకరుడిట్లు పలికెను-

ఓ హరీ! బ్రహ్మా! దేవతలారా! అందరు అదరముతో వినుడు. నేను వివేకముతో కూడియున్న యథోచితమగు ప్రత్యేక వచనమును చెప్పెదను (59). మానవులు వివాహమాడుట యోగ్యమగు కర్మ కాదు. వివాహము దృఢమగు బంధము. అది పెద్ద సంకెల అని చెప్పవచ్చును (60).

లోకములో చెడు సంగములనేకములు గలవు. వాటిలో అన్నింటి కంటె అధికమైనది స్త్రీలతోడి సంగము. మానవుడు బంధములనన్నింటినీ విడిపించుకొనగలడు. కాని స్త్రీసంగము నుండి విడిపించుకొనలేడు (61). ఇనుప సంకెళ్లతోగాని, చెక్కల సంకెలతో గాని దృఢముగా బంధింపబడిన వ్యక్తి విడిపించుకొనగలడు. కాని స్త్రీ అను పాశముచే బంధింపబడిన వ్యక్తి ఏనాటికైనను విముక్తుడు కాలేడు (62).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

03 Jul 2021

గీతోపనిషత్తు -221

🌹. గీతోపనిషత్తు -221 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚

శ్లోకము 9

🍀 8. తత్త్వ దర్శనము - పరమ పురుషుడు పురాతనుడు. లోకముల నెల్లపుడు శాసించువాడు. అతడే కవి. అనగా సృష్టించు వాడు. అతడు అణువుకన్న సూక్ష్మమైనవాడు. సర్వమునకు ఆధారమైనవాడు. చింతింప శక్యము కాని రూపము, స్వరూపము కలవాడు. అతడు చీకటి కావలివాడు. చీకటి కావల ఆదిత్యునివలె వెలుగుచుండెడి వాడు. అట్టివానిగ అతనిని స్మరింపుము. వేదఋషులు ఈ పరమగు పురుషుని 'తత్' అని పిలిచిరి. అనగా 'అది' అనిరి. అదియే ఇదిగా ఏర్పడినదనియు, కనుక ఇది నిజమునకు అదియే యని ఉపనిషత్తులు పదే పదే తెలుపుచున్నవి. దానినే దర్శించు చుండుట తత్త్వదర్శనము. దానినే చింతించుచుండుట తత్త్వ చింతనము. దానిగూర్చియే గోష్ఠిచేయుట తత్త్వ విచారము. 🍀

కవిం పురాణ మనుశాసితార మణోరణీయాంస మనుస్మరేద్య: |
సర్వస్య ధాతార మచింత్యరూప మాదిత్యవర్ణం తమసః పరస్తాత్ || 9

తాత్పర్యము :

పై తెలిపిన పరమ పురుషుడు పురాతనుడు. లోకముల నెల్లపుడు శాసించువాడు. అతడే కవి. అనగా సృష్టించు వాడు. అతడు అణువుకన్న సూక్ష్మమైనవాడు. సర్వమునకు ఆధారమైనవాడు. చింతింప శక్యము కాని రూపము, స్వరూపము కలవాడు. అతడు చీకటి కావలివాడు. చీకటి కావల ఆదిత్యునివలె వెలుగుచుండెడి వాడు. అట్టివానిగ అతనిని స్మరింపుము.

వివరణము :

పరమ పురుషుని ఆవిష్కరించు శ్లోకమిది. అట్టి పరమపురుషుడు రూపమున కతీతమగు వెలుగు. ఏ నామము లేనివాడు. చీకటిచే క్రమ్మనివాడు. అజ్ఞానమను చీకటి కందని వాడు. సమస్త సృష్టికి అతడే ఆధారము. అయినప్పటికిని అణువందును కూడ యిమిడి యున్నాడు. అతని నుండే సమస్త సృష్టి వ్యక్తమగుచుండును. అతనిలోనికే సమస్త సృష్టి లయమగు చుండును. అతనివలననే సృష్టి నిలచి యుండును.

లయమందు సమస్తము అతని యందు ఇమిడియుండి, సృష్టియందు వెలువడి, స్థితి యందు పూర్ణమై ప్రకటింపబడి యుండును. అతనికన్న పురాతనుడు లేడు. అతడే సనాతనుడు. అందుండియే కాలము, సంకల్పము, శక్తి, ప్రకృతి, మహత్తు ఇత్యాదివన్నియు జనించును. సమస్తమునకు మూలమైన వానిని, గోచరించుచున్న సమస్తము నందు దర్శించుట ఈ శ్లోకమున తెలుపబడిన సాధన. “అనుస్మరేత్”అని శ్లోకము శాసించుచున్నది. అనుస్మరణము, అనుచింతనము అని తెలుపుటలో ఎడతెగక స్మరించమని, ఎడతెగక చింతనము చేయుమని సూచన.

ఈ పరమ పురుషుడు స్త్రీయు కాదు, పురుషుడు కాదు. రెండున్నూ మిళితమైన తత్త్వము. కనుక వేదఋషులు ఈ పరమగు పురుషుని 'తత్' అని పిలిచిరి. అనగా 'అది' అనిరి. అదియే ఇదిగా ఏర్పడినదనియు, కనుక ఇది నిజమునకు అదియే యని ఉపనిషత్తులు పదే పదే తెలుపుచున్నవి. దానినే దర్శించు చుండుట తత్త్వదర్శనము. దానినే చింతించుచుండుట తత్త్వ చింతనము. దానిగూర్చియే గోష్ఠిచేయుట తత్త్వ విచారము.

దాని యందు అన్నియు ఇమిడియుండును. అది శైవము కాదు, వైష్ణవము కాదు, శాక్తేయము కాదు, క్రైస్తవము కాదు, ఇస్లాము కాదు. మరి యే మతము కాదు. మతములు, సిద్ధాంతములు అన్నియు అందిమిడిపోవును. అట్టి తత్త్వమును ధ్యానించ మని బోధించు భగవద్గీత నిశ్చయముగా మతాతీతమైన గ్రంథము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

03 Jul 2021

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 285 / Sri Lalitha Chaitanya Vijnanam - 285

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 285 / Sri Lalitha Chaitanya Vijnanam - 285 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 67. ఆబ్రహ్మ కీటజననీ, వర్ణాశ్రమ విధాయినీ ।
నిజాజ్ఞారూపనిగమా, పుణ్యాపుణ్య ఫలప్రదా ॥ 67 ॥ 🍀

🌻 285. 'ఆ బ్రహ్మకీటజననీ' 🌻

బ్రహ్మ మొదలు సాలీడు వరకు అన్ని జీవరాసులకు జనన మిచ్చునది శ్రీమాత అని అర్థము. ఏ జీవికైననూ శ్రీమాతయే జనని కావున ప్రతి జీవియును శ్రీమాత అనుగ్రహము పొందదలచినచో తమ తమ తల్లుల రూపముల నున్నది. శ్రీమాతయే అని తెలిసి పూజింపవలెను, గౌరవించ వలెను, మన్నించ వలెను. కన్నతల్లిని దూషించుచు శ్రీమాత పూజలు చేయుట వ్యర్థము.

తండ్రి కూడ పూజకు తల్లి తరువాత వాడే. అటుపైన గురువు అని వేదము ఘోషించు చున్నది. ప్రత్యక్ష గురువులలో ప్రధానమైనది తల్లి. అటుపైన తండ్రి, అటుపైన గురువు. తల్లిదండ్రులను కాదని గురువును చేరుట వలన మార్గమున అవరోధము లేర్పడగలవు. నారదుడు సహితము సిద్ధి పొందుటకు పూర్వము తల్లి నారాధించవలసి వచ్చెను.

శంకరులు సహితము సన్యసించుటకు తల్లి ఆజ్ఞను పొందవలసి వచ్చెను. తల్లి ఆశీర్వచనముతో లవకుశలు జగదేక పరాక్రమవంతుడైన శ్రీరాముని యుద్ధమున నిర్జించిరి. కావున శ్రీమాతను ఉపాసించువారు ప్రధానముగ తల్లియందు దైవమును చూచుట అభ్యసించవలెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 285 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🍀 67. ābrahma-kīṭa-jananī varṇāśrama-vidhāyinī |
nijājñārūpa-nigamā puṇyāpuṇya-phalapradā || 67 || 🍀

🌻 Ābrahma-kīṭa-jananī आब्रह्म-कीट-जननी (285) 🌻

The Supreme creator. She creates from Brahma to the smallest insect. Brahma here means humans. Human form is said to be supreme creation of God. Look at the placement of these nāma-s.

After having described the Brahman from nāma 281 to 284, Vāc Devi-s in this nāma have consolidated their description, by mentioning the creative aspect of the Brahman. The Brahman was descried with countless heads, ears and feet only to highlight the ease with which creation is being made by Her.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

02 Jul 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 39

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 39 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మనసు నిశ్చలం కావడమన్నది అతి ముఖ్యం. నువ్వు నీలో కూచుని పరిశీలించు. ఎట్లాంటి నిర్ణయం చెయ్యకుండా మనసు ఆడే ఆటల్ని పరిశీలించు. 🍀

వీలయినంత వరకు నిశ్శబ్దంగా వుండు. మరింత మరింత నిశ్చలనంగా కూచో. కేవలం శారీరకంగానే కాదు. అది కూడా పరిస్థితిని సృష్టించడానికి సహకరిస్తుంది. కానీ అదే అంతం కాదు. అది ఆరంభం మాత్రమే. మనసు నిశ్చలం కావడమన్నది అతి ముఖ్యం. మనసు తన అడ్డూ ఆపూ లేని వాగుడును కట్టి పెట్టడం ముఖ్యం. దాన్ని ఆపితీరాలి. మనం ప్రయత్నించం. అంతే. ఇది చాలా సులభమయిన పద్దతి.

నువ్వు నీలో కూచుని పరిశీలించు. ఎట్లాంటి నిర్ణయం చెయ్యకుండా మనసు ఆడే ఆటల్ని పరిశీలించు. అది మంచివనీ, చెడ్డవనీ అనకు. వాటిని ఆమోదించకు, వ్యతిరేకించకు. సంబంధం లేనట్లు నిర్మలంగా వుండు. ఆ నిశ్శబ్ద స్థితి నుంచీ నీకు అవగాహన కలుగుతుంది. మొదట మనసు తన పాత అతి తెలివితేటల్ని ప్రదర్శిస్తుంది. వాటిలో నువ్వు చలించకుంటే చిరాకు పడుతుంది. నిన్ను ఆందోళనకు గురి చెయ్యడానికి ప్రయత్నిస్తుంది.

దాంతో ఘర్షించకు. దూరంగా వుండిపో. చాలాసార్లు నువ్వు దాని మాయలో పడతావు. అప్పుడు స్పృహలోకి వచ్చి వెనక్కి తగ్గు. నిన్ను నువ్వు వెనక్కి లాగు. మళ్ళీ పరిశీలనలో పడు. ఆలోచన మొదలవుతుంది. దాన్ని చూడు. వేల ఆలోచనలు సాగుతాయి. వాటిని చూడు. అవి ఎలా వచ్చాయో అలాగే వెళతాయి. ఆ విషయం గుర్తించు. వాటి గురించి ఎట్లాంటి నిర్ణయాలకూ లోనుగాకు. కేవలం శాస్త్రీయంగా, నిర్మల పరిశీలన చెయ్యి.

ఒక రోజు హఠాత్తుగా అక్కడ ఏమీ వుండదు. అది నిర్మల నిశ్శబ్ద దినం. అది అంతకు ముందు నీకు అనుభవం లేనిది. అది నిన్ను వదిలి పెట్టదు. నీతోనే వుంటుంది. అది నీ ఆత్మ అవుతుంది. నీకు స్వేచ్ఛానిస్తుంది.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

02 Jul 2021

దేవాపి మహర్షి బోధనలు - 107

🌹. దేవాపి మహర్షి బోధనలు - 107 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 88. మా అనుభవము 🌻

ఉరుములు, పిడుగులతో గాలివాన యున్నప్పుడు నీవటు నిటు నిదురలో పరుగిడుదువా? లేక కుదురుగ నొకచోట నుందువా? బుద్ధిమంతుడు అట్టి భీకర సన్నివేశములలో ఒక పంచను చేరి

తలదాచుకొనును కదా! అట్లే విపత్కర సన్నివేశములలో కూడ చెదరక హృదయమున చేరి సన్నివేశము దాటిపోవు వరకును లోన యుండ వలెను. విపత్కరమగు సన్నివేశములు జీవితమున ఎవరికి తప్పవు.

ఎంత చెట్టుకు అంతగాలి యున్నట్లు జీవి పన్నాను బట్టి అతనికొచ్చు కష్టనష్టములుండును. బాహ్యమున ఒడుదుడుకులు సహజము. అంతరంగమున అవి లేవు. చక్కని గృహమందు యున్నవానికి గాలి, వాన, ఉరుములు, మెరుపులు చూచుటలో ప్రకృతి గాంభీర్యము తెలియును. వానను చూచుచు ఆనందించును కూడ. లోనవున్న వానికే ఈ ఆనందము అందులకే "లోనికి పొమ్ము, శాంతిని, స్వస్థతను పొందుము.” అని మేము నిరంతరము ఘోషించుచుందుము.

ఇది చెవికెక్కక పోవుటయే నిజమగు కలి. అజ్ఞానము. జీవులు ఎన్నిన్నియో దైవకార్యములను, దైవారాధనమును గావించు చున్నారు. కాని వారికి శాంతి మాత్రము లేదు. కారణము చేయు కార్యములన్నియు బాహ్య సంబంధితములే. అంతర్గతము నందే నిజమగు హితమున్నది.

జీవితమున ప్రాథమిక దశలో అంతర్గత మగుట నేర్వవలెను. తాబేలును గురువుగ నుంచుకొని, ఇంద్రియముల వ్యాపారమునులోనికి త్రిప్పుట నేర్వవలెను. ఇందెంతయో హితమున్నది. విద్యాలయములందు ఇతరములైన విద్యలకన్న ఈ విద్యకు ప్రాధాన్య మందించినచో జీవులు పటిష్ఠమగు చేతన కలిగి సన్నివేశముల యందు చెదరని శాంతి కలిగియుందురు. ఇది చదువు పాఠకులు కూడ ఈ పని చేయరు. ఇది మా అనుభవము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

02 Jul 2021

వివేక చూడామణి - 96 / Viveka Chudamani - 96

🌹. వివేక చూడామణి - 96 / Viveka Chudamani - 96🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 22. కోరికలు, కర్మలు - 6 🍀

327. ఎవరైతే బ్రహ్మాన్ని గూర్చిన జ్ఞానాన్ని పూర్తిగా అవగాహన చేసుకుంటారో వారికి దుష్టమైన చావుల భయం ఉండదు. అందుకు కారణము అతడు మనస్సును బ్రహ్మము పై కేంద్రీకరించి ఉంటాడు. ఎవరైతే మనస్సును బ్రహ్మముపై లగ్నము చేస్తారో అతడు సదా విజయాన్ని సాధిస్తారు. అందువలన జాగ్రత్తగా నీవు నీ మనస్సును బ్రహ్మముపై కేంద్రీకరించుము.

328. వ్యతిరేఖ భావముతో వ్యక్తి తన స్వస్వరూపము నుండి విడిపోయినచో, అట్టి వ్యక్తి పతనము చెందుతాడు. పతనమైన వ్యక్తి పతితుడై తిరిగి మరల కోలుకోలేడు.

329. అందువలన ఏ వ్యక్తి తాను బాహ్య వస్తు సముధాయములపై తన మనస్సును మళ్ళించుట చేయరాదు. ఎవరైతే వాటికి పూర్తిగా జీవించినంత కాలము దూరముగా ఉంటారో, వారు చనిపోయిన తరువాత కూడా అలానే ఉంటారు. యజుర్వేదము ప్రకారము ఎవరైతే ఉన్నత గౌరవం పొందుతారో వారు తిరిగి పతనమవటానికి భయపడతారు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 VIVEKA CHUDAMANI - 96 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

🌻 22. Desires and Karma - 6 🌻

327. Hence to the discriminating knower of Brahman there is no worse death than inadvertence with regard to concentration. But the man who is concentrated attains complete success. (Therefore) carefully concentrate thy mind (on Brahman).

328. Through inadvertence a man deviates from his real nature, and the man who has thus deviated falls. The fallen man comes to ruin, and is scarcely seen to rise again.

329. Therefore one should give up reflecting on the sense-objects, which is the root of all mischief. He who is completely aloof even while living, is alone aloof after the dissolution of the body. The Yajur-Veda declares that there is fear for one who sees the least bit of distinction.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

02 Jul 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 439, 440 / Vishnu Sahasranama Contemplation - 439, 440

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 439 / Vishnu Sahasranama Contemplation - 439🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻439. మహామఖః, महामखः, Mahāmakhaḥ🌻

ఓం మహామఖాయ నమః | ॐ महामखाय नमः | OM Mahāmakhāya namaḥ

యదర్పితా మఖాయజ్ఞాః నిర్వాణాఖ్యానకం ఫలమ్ ।
ప్రయచ్ఛంతో మహాంతోహి జాయంతే స మహామఖః ॥

ఎవనియందు సమర్పింపబడు యజ్ఞములు, వస్తుతః సామాన్యములే అయినప్పటికీ, గొప్పవిగా అగు మోక్ష రూప ఫలములను ఇచ్చునో, అట్టివాడు మహామహిముడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 439🌹

📚. Prasad Bharadwaj

🌻439. Mahāmakhaḥ🌻

OM Mahāmakhāya namaḥ

Yadarpitā makhāyajñāḥ nirvāṇākhyānakaṃ phalam,
Prayacchaṃto mahāṃtohi jāyaṃte sa mahāmakhaḥ.

यदर्पिता मखायज्ञाः निर्वाणाख्यानकं फलम् ।
प्रयच्छंतो महांतोहि जायंते स महामखः ॥

The sacrifices, no matter how ordinary they may be, when offered to whom bestow great results like leading to liberation and so, are great. So Mahāmakhaḥ.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

अनिर्विण्णस्स्थविष्ठो भूर्धर्मयूपो महामखः ।नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामस्समीहनः ॥ ४७ ॥

అనిర్విణ్ణస్స్థవిష్ఠో భూర్ధర్మయూపో మహామఖః ।నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామస్సమీహనః ॥ ౪౭ ॥

Anirviṇṇassthaviṣṭho bhūrdharmayūpo mahāmakhaḥ ।Nakṣatranemirnakṣatrī kṣamaḥ kṣāmassamīhanaḥ ॥ 47 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 440 / Vishnu Sahasranama Contemplation - 440🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻440. నక్షత్రనేమిః, नक्षत्रनेमिः, Nakṣatranemiḥ🌻

ఓం నక్షత్రనేమయే నమః | ॐ नक्षत्रनेमये नमः | OM Nakṣatranemaye namaḥ

నక్షత్రతారకైస్సార్ధం చంద్రసూర్యాదయో గ్రహః ।
వాయుపాశమయైర్బంధైర్నిబద్ధా ధ్రువ సంజ్ఞ తే ॥
భ్రామయాన్ జ్యోతిషాం చక్రం పుచ్ఛదేశే వ్యవస్థితః ।
ధ్రువస్య శింశుమారస్య తస్య తారామయస్య చ ॥
శింశుమారస్య హృదయే జ్యోతిశ్చక్రస్య నేమివత్ ।
ప్రవర్తకః స్థితో విష్ణురితి నక్షత నేమితా ॥
నక్షత్రనేమి రిత్యుక్తః స్వాధ్యాయభ్రాహ్మణేపి చ ।
శ్రుతో విష్ణుర్హృదయమిత్యచ్యుతో మధుసూధనః ॥

'చంద్ర సూర్యాది గ్రహములు నక్షత్రములతోనూ, తారకలతోనూ వాయు పాశమయములగు బంధములతో (తమ స్థానములలో నిలిపి ఉంచెడి ఆకర్షణ శక్తులతో) ద్రువుడు అను పేరుగల కట్టుకొయ్యయందు బంధింపబడియున్నవి' అని చెప్పబడిన విధమున వెలుగుచుండు జ్యోతిస్సుల అమరికయగు చక్రమును త్రిప్పుచూ, తారామయమగు 'శిశుమార' నామక చక్రవ్యూహపు పుచ్చతోక దేశమున నిలుకడ పొందినవాడు ద్రువుడు. అట్టి శిశుమార చక్రపు హృదయదేశమునందు ఈ జ్యోతిశ్చక్రమునకు నేమి వలెనుండి వానిని తమ తమ అవధులలో తమ తమ కక్ష్యలలో తమ తమ వేగములతో తిరుగునట్లు చేయువాడు విష్ణువు.

కృష్ణ యజురారణ్యకమున స్వాధ్యాయ బ్రాహ్మణము అను రెండవ ప్రశ్నమున శిశుమార వర్ణనమున 'విష్ణుర్హృదయమ్‍' అనగా విష్ణువు ఈ శిశుమారమునకు హృదయము అని చెప్పబడినది.

మహాంతరిక్షమునందు దీర్ఘ గోళపు ఆకృతితో సమానమగు ఆకృతిగల వ్యూహమునందు తిరుగుచుండు నక్షత్రముల చక్రము వంటి అమరికకు నేమి వలెనుండువాడు మధుసూధనుడు.

శిశుమారము అనునది జలచర విశేషము. జ్యోతిశ్చక్రము ఆ శిశుమారమువలె కనబడుచుండును కావున, శిశుమార చక్రము అని వేదమునందు వ్యవహరించబడినది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 440🌹

📚. Prasad Bharadwaj

🌻440. Nakṣatranemiḥ🌻

OM Nakṣatranemaye namaḥ

శిశుమారము / Gangetic Dolphin

Nakṣatratārakaissārdhaṃ caṃdrasūryādayo grahaḥ,
Vāyupāśamayairbaṃdhairnibaddhā dhruva saṃjña te.
Bhrāmayān jyotiṣāṃ cakraṃ pucchadeśe vyavasthitaḥ,
Dhruvasya śiṃśumārasya tasya tārāmayasya ca.
Śiṃśumārasya hr̥daye jyotiścakrasya nemivat,
Pravartakaḥ sthito viṣṇuriti nakṣata nemitā.
Nakṣatranemi rityuktaḥ svādhyāyabhrāhmaṇepi ca,
Śruto viṣṇurhr̥dayamityacyuto madhusūdhanaḥ.

नक्षत्रतारकैस्सार्धं चंद्रसूर्यादयो ग्रहः ।

वायुपाशमयैर्बंधैर्निबद्धा ध्रुव संज्ञ ते ॥
भ्रामयान् ज्योतिषां चक्रं पुच्छदेशे व्यवस्थितः ।
ध्रुवस्य शिंशुमारस्य तस्य तारामयस्य च ॥
शिंशुमारस्य हृदये ज्योतिश्चक्रस्य नेमिवत् ।
प्रवर्तकः स्थितो विष्णुरिति नक्षत नेमिता ॥
नक्षत्रनेमि रित्युक्तः स्वाध्यायभ्राह्मणेपि च ।
श्रुतो विष्णुर्हृदयमित्यच्युतो मधुसूधनः ॥

It is said 'the planets, the sun, the moon etc., the fixed stars fixed (nakṣatras) and moving (tāras) are bound to Druva by the bonds of Vāyu.' Druva governs the motions of the celestial bodies and resides at the tail of Śiśumāra. At the heart of Śiśumāra is Viṣṇu like a nave regulating them all. The Svādhyāya Brāhmaṇa describes the Śiśumāra and says 'Viṣṇurhr̥dayam' - 'Viṣṇu is the nemi or nave of the nakṣatras'.

Śiśumāra is Gangetic Dolphin.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

अनिर्विण्णस्स्थविष्ठो भूर्धर्मयूपो महामखः ।नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामस्समीहनः ॥ ४७ ॥

అనిర్విణ్ణస్స్థవిష్ఠో భూర్ధర్మయూపో మహామఖః ।నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామస్సమీహనః ॥ ౪౭ ॥

Anirviṇṇassthaviṣṭho bhūrdharmayūpo mahāmakhaḥ ।Nakṣatranemirnakṣatrī kṣamaḥ kṣāmassamīhanaḥ ॥ 47 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

02 Jul 2021

2-JULY-2021 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 1-58 / Bhagavad-Gita - 1-58 - 2 - 11🌹
2) 🌹 శ్రీమద్భగవద్గీత - 626 / Bhagavad-Gita - 626 - 18-37🌹 
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 439, 440 / Vishnu Sahasranama Contemplation - 439, 440🌹
4) 🌹 Daily Wisdom - 134🌹
5) 🌹. వివేక చూడామణి - 96🌹
6) 🌹Viveka Chudamani - 96🌹
7) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 107🌹
8) 🌹. నిర్మల ధ్యానములు - 39🌹
9) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 285 / Sri Lalita Chaitanya Vijnanam - 285 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 58 / Bhagavad-gita - 58 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 11 🌴*

11. శ్రీ భగవానువాచ
అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదంశ్చ భాషసే |
గతాసూన గతాసూంశ్చ నానుశోచన్తి పణ్డితా: ||

🌷. తాత్పర్యం :
పూర్ణపురుషోత్తముడగు శ్రీకృష్ణభగవానుడు పలికెను : ప్రజ్ఞను గూడిన పలుకులను పలుకుచునే నీవు దుఃఖింపదగని విషయమును గూర్చి దుఃఖించుచున్నావు. పండితులైనవారు జీవించి యున్న వారిని గూర్చి గాని, మరణించిన వారిని గూర్చి గాని దుఃఖింపరు.

🌷. భాష్యము :
శ్రీకృష్ణభగవానుడు వెంటనే గురుస్థానమును స్వీకరించి పరోక్షముగా శిష్యుని మూర్ఖుడని పిలుచుచు మందలించు చున్నాడు. “ నీవు పండితుని మాదిరి పలుకుచున్నావు. కాని దేహమననేమో, ఆత్మయననేమో తెలిసిన పండితుడు దేహపు ఏ స్థితిని గూర్చియు (జీవించి యున్న స్థితిని గాని, మరణించిన స్థితిని గాని) శోకింపడని ఎరుగకున్నావు” అని అతడు పలికెను. 

తరువాతి అధ్యాయములలో వివరింపబడిన రీతి జ్ఞానమనగా భౌతికపదార్థము, ఆత్మ మరియు ఆ రెండింటిని నియమించువాని గూర్చి తెలియుటయే. రాజకీయములు లేదా సాంఘిక ఆచారముల కన్నను ధర్మ నియమములకే అధిక ప్రాధాన్యత ఒసగవలెనని అర్జునుడు వాదించెను. కాని భౌతిక పదార్థము, ఆత్మ, భగవానుని గుర్చిన జ్ఞానము ధార్మిక నియమముల కన్నను మరింత ముఖ్యమైనదని అతడు ఎరుగకుండెను. 

అటువంటి జ్ఞానము కొరవడియున్నందున గొప్ప ప్రజ్ఞకలవానిగా తనను అతడు ప్రదర్శించుకొనుట తగియుండలేదు. ప్రజ్ఞగలవాడు కానందునే అతడు విచారింపదగని దానిని గూర్చి విచారించెను. దేహము ఒకప్పుడు ఉద్భవించి నేదో, రేపో రాలిపోయే తీరును. కనుకనే దేహము ఆత్మ యంత ముఖ్యమైనది కాదు. ఇది తెలిసినవాడే నిజముగా ప్రజ్ఞకలవాడు. భౌతికదేహపు స్థితి ఎట్లున్నను అట్టివానికి దుఃఖకారణము ఏదియును లేదు.

*🌹 Bhagavad-Gita as It is - 58 🌹*
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada 
📚. Prasad Bharadwaj 

*🌴 Chapter 2 - Sankhya Yoga - 11 🌴*

11. śrī-bhagavān uvāca
aśocyān anvaśocas tvaṁ prajñā-vādāṁś ca bhāṣase gatāsūn agatāsūṁś ca nānuśocanti paṇḍitāḥ

🌷 Translation : 
The Supreme Personality of Godhead said: While speaking learned words, you are mourning for what is not worthy of grief. Those who are wise lament neither for the living nor for the dead.

🌷 Purport :
The Lord at once took the position of the teacher and chastised the student, calling him, indirectly, a fool. The Lord said, “You are talking like a learned man, but you do not know that one who is learned – one who knows what is body and what is soul – does not lament for any stage of the body, neither in the living nor in the dead condition.” 

As explained in later chapters, it will be clear that knowledge means to know matter and spirit and the controller of both. Arjuna argued that religious principles should be given more importance than politics or sociology, but he did not know that knowledge of matter, soul and the Supreme is even more important than religious formularies. And because he was lacking in that knowledge, he should not have posed himself as a very learned man. 

As he did not happen to be a very learned man, he was consequently lamenting for something which was unworthy of lamentation. The body is born and is destined to be vanquished today or tomorrow; therefore the body is not as important as the soul. One who knows this is actually learned, and for him there is no cause for lamentation, regardless of the condition of the material body.
🌹🌹🌹🌹🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 626 / Bhagavad-Gita - 626 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 37 🌴*

37. యత్తదగ్రే విషమివ పరిణామే(మృతోపమమ్ |
తత్సుఖం సాత్త్వికం ప్రోక్తమాత్మబుద్ధిప్రసాదజమ్ ||

🌷. తాత్పర్యం : 
ఆది యందు విషప్రాయముగా నుండి అంత్యమున అమృతముతో సమానమగునదియు మరియు ఆత్మానుభూతి యెడ మనుజుని జాగృతుని చేయునదియు నైన సుఖము సత్త్వగుణప్రధానమైనదని చెప్పబడును.

🌷. భాష్యము :
ఆత్మానుభూతిని పొందు యత్నములో మనుజుడు మనస్సు, ఇంద్రియములను నిగ్రహించుట మరియు మనస్సును ఆత్మయందు లగ్నము చేయుటకు పలు విధినియమములను అనుసరింపవలసివచ్చును. 

ఆ విధి నియమములన్నియును విషమువలె అతి చేదుగా నుండును. కాని మనుజుడు వానిని అనుసరించుట యందు కృతకృత్యుడై దివ్యమైన ఆధ్యాత్మికస్థితికి చేరగలిగినచో నిజమైన అమృతాస్వాదనమును ప్రారమభించి జీవితమున సుఖింపగలడు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 626 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 37 🌴*

37. yat tad agre viṣam iva
pariṇāme ’mṛtopamam
tat sukhaṁ sāttvikaṁ proktam
ātma-buddhi-prasāda-jam

🌷 Translation : 
That which in the beginning may be just like poison but at the end is just like nectar and which awakens one to self-realization is said to be happiness in the mode of goodness.

🌹 Purport :
In the pursuit of self-realization, one has to follow many rules and regulations to control the mind and the senses and to concentrate the mind on the self. 

All these procedures are very difficult, bitter like poison, but if one is successful in following the regulations and comes to the transcendental position, he begins to drink real nectar, and he enjoys life.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 439, 440 / Vishnu Sahasranama Contemplation - 439, 440 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻439. మహామఖః, महामखः, Mahāmakhaḥ🌻*

*ఓం మహామఖాయ నమః | ॐ महामखाय नमः | OM Mahāmakhāya namaḥ*

యదర్పితా మఖాయజ్ఞాః నిర్వాణాఖ్యానకం ఫలమ్ ।
ప్రయచ్ఛంతో మహాంతోహి జాయంతే స మహామఖః ॥

ఎవనియందు సమర్పింపబడు యజ్ఞములు, వస్తుతః సామాన్యములే అయినప్పటికీ, గొప్పవిగా అగు మోక్ష రూప ఫలములను ఇచ్చునో, అట్టివాడు మహామహిముడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 439🌹*
📚. Prasad Bharadwaj

*🌻439. Mahāmakhaḥ🌻*

*OM Mahāmakhāya namaḥ*

Yadarpitā makhāyajñāḥ nirvāṇākhyānakaṃ phalam,
Prayacchaṃto mahāṃtohi jāyaṃte sa mahāmakhaḥ.

यदर्पिता मखायज्ञाः निर्वाणाख्यानकं फलम् ।
प्रयच्छंतो महांतोहि जायंते स महामखः ॥

The sacrifices, no matter how ordinary they may be, when offered to whom bestow great results like leading to liberation and so, are great. So Mahāmakhaḥ.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अनिर्विण्णस्स्थविष्ठो भूर्धर्मयूपो महामखः ।नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामस्समीहनः ॥ ४७ ॥

అనిర్విణ్ణస్స్థవిష్ఠో భూర్ధర్మయూపో మహామఖః ।నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామస్సమీహనః ॥ ౪౭ ॥

Anirviṇṇassthaviṣṭho bhūrdharmayūpo mahāmakhaḥ ।Nakṣatranemirnakṣatrī kṣamaḥ kṣāmassamīhanaḥ ॥ 47 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 440 / Vishnu Sahasranama Contemplation - 440🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻440. నక్షత్రనేమిః, नक्षत्रनेमिः, Nakṣatranemiḥ🌻*

*ఓం నక్షత్రనేమయే నమః | ॐ नक्षत्रनेमये नमः | OM Nakṣatranemaye namaḥ*

నక్షత్రతారకైస్సార్ధం చంద్రసూర్యాదయో గ్రహః ।
వాయుపాశమయైర్బంధైర్నిబద్ధా ధ్రువ సంజ్ఞ తే ॥
భ్రామయాన్ జ్యోతిషాం చక్రం పుచ్ఛదేశే వ్యవస్థితః ।
ధ్రువస్య శింశుమారస్య తస్య తారామయస్య చ ॥
శింశుమారస్య హృదయే జ్యోతిశ్చక్రస్య నేమివత్ ।
ప్రవర్తకః స్థితో విష్ణురితి నక్షత నేమితా ॥
నక్షత్రనేమి రిత్యుక్తః స్వాధ్యాయభ్రాహ్మణేపి చ ।
శ్రుతో విష్ణుర్హృదయమిత్యచ్యుతో మధుసూధనః ॥

'చంద్ర సూర్యాది గ్రహములు నక్షత్రములతోనూ, తారకలతోనూ వాయు పాశమయములగు బంధములతో (తమ స్థానములలో నిలిపి ఉంచెడి ఆకర్షణ శక్తులతో) ద్రువుడు అను పేరుగల కట్టుకొయ్యయందు బంధింపబడియున్నవి' అని చెప్పబడిన విధమున వెలుగుచుండు జ్యోతిస్సుల అమరికయగు చక్రమును త్రిప్పుచూ, తారామయమగు 'శిశుమార' నామక చక్రవ్యూహపు పుచ్చతోక దేశమున నిలుకడ పొందినవాడు ద్రువుడు. అట్టి శిశుమార చక్రపు హృదయదేశమునందు ఈ జ్యోతిశ్చక్రమునకు నేమి వలెనుండి వానిని తమ తమ అవధులలో తమ తమ కక్ష్యలలో తమ తమ వేగములతో తిరుగునట్లు చేయువాడు విష్ణువు.

కృష్ణ యజురారణ్యకమున స్వాధ్యాయ బ్రాహ్మణము అను రెండవ ప్రశ్నమున శిశుమార వర్ణనమున 'విష్ణుర్హృదయమ్‍' అనగా విష్ణువు ఈ శిశుమారమునకు హృదయము అని చెప్పబడినది.

మహాంతరిక్షమునందు దీర్ఘ గోళపు ఆకృతితో సమానమగు ఆకృతిగల వ్యూహమునందు తిరుగుచుండు నక్షత్రముల చక్రము వంటి అమరికకు నేమి వలెనుండువాడు మధుసూధనుడు.

శిశుమారము అనునది జలచర విశేషము. జ్యోతిశ్చక్రము ఆ శిశుమారమువలె కనబడుచుండును కావున, శిశుమార చక్రము అని వేదమునందు వ్యవహరించబడినది.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 440🌹*
📚. Prasad Bharadwaj

*🌻440. Nakṣatranemiḥ🌻*

*OM Nakṣatranemaye namaḥ*

శిశుమారము / Gangetic Dolphin
Nakṣatratārakaissārdhaṃ caṃdrasūryādayo grahaḥ,
Vāyupāśamayairbaṃdhairnibaddhā dhruva saṃjña te.
Bhrāmayān jyotiṣāṃ cakraṃ pucchadeśe vyavasthitaḥ,
Dhruvasya śiṃśumārasya tasya tārāmayasya ca.
Śiṃśumārasya hrdaye jyotiścakrasya nemivat,
Pravartakaḥ sthito viṣṇuriti nakṣata nemitā.
Nakṣatranemi rityuktaḥ svādhyāyabhrāhmaṇepi ca,
Śruto viṣṇurhrdayamityacyuto madhusūdhanaḥ.

नक्षत्रतारकैस्सार्धं चंद्रसूर्यादयो ग्रहः ।
वायुपाशमयैर्बंधैर्निबद्धा ध्रुव संज्ञ ते ॥
भ्रामयान् ज्योतिषां चक्रं पुच्छदेशे व्यवस्थितः ।
ध्रुवस्य शिंशुमारस्य तस्य तारामयस्य च ॥
शिंशुमारस्य हृदये ज्योतिश्चक्रस्य नेमिवत् ।
प्रवर्तकः स्थितो विष्णुरिति नक्षत नेमिता ॥
नक्षत्रनेमि रित्युक्तः स्वाध्यायभ्राह्मणेपि च ।
श्रुतो विष्णुर्हृदयमित्यच्युतो मधुसूधनः ॥

It is said 'the planets, the sun, the moon etc., the fixed stars fixed (nakṣatras) and moving (tāras) are bound to Druva by the bonds of Vāyu.' Druva governs the motions of the celestial bodies and resides at the tail of Śiśumāra. At the heart of Śiśumāra is Viṣṇu like a nave regulating them all. The Svādhyāya Brāhmaṇa describes the Śiśumāra and says 'Viṣṇurhrdayam' - 'Viṣṇu is the nemi or nave of the nakṣatras'.

Śiśumāra is Gangetic Dolphin.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अनिर्विण्णस्स्थविष्ठो भूर्धर्मयूपो महामखः ।नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामस्समीहनः ॥ ४७ ॥

అనిర్విణ్ణస్స్థవిష్ఠో భూర్ధర్మయూపో మహామఖః ।నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామస్సమీహనః ॥ ౪౭ ॥

Anirviṇṇassthaviṣṭho bhūrdharmayūpo mahāmakhaḥ ।Nakṣatranemirnakṣatrī kṣamaḥ kṣāmassamīhanaḥ ॥ 47 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 DAILY WISDOM - 133 🌹*
*🍀 📖 The Philosophy of Life 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 12. Life Without a Philosophy is Unimaginable 🌻*

Philosophy is generally defined as love of wisdom or the knowledge of things in general by their ultimate causes, so far as reason can attain to such knowledge. It is a comprehensive and critical study and analysis of experience as a whole. Whether it is consciously, deliberately and rationally adopted on conviction or consciously or unconsciously followed in life through faith or persuasion, every man constructs for himself a fundamental philosophy as the basis of life, a theory of the relation of the world and the individual, and this shapes his whole attitude to life. 

Aristotle called metaphysics the fundamental science, for, a correct comprehension of it is enough to give man a complete knowledge of every constituent or content of human experience. All persons live in accordance with the philosophy of life that they have framed for themselves, consciously or unconsciously. Even the uneducated and the uncultured have a rough-and-ready philosophy of their own. Life without a philosophy is unimaginable.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. వివేక చూడామణి - 96 / Viveka Chudamani - 96🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 22. కోరికలు, కర్మలు - 6 🍀*

327. ఎవరైతే బ్రహ్మాన్ని గూర్చిన జ్ఞానాన్ని పూర్తిగా అవగాహన చేసుకుంటారో వారికి దుష్టమైన చావుల భయం ఉండదు. అందుకు కారణము అతడు మనస్సును బ్రహ్మము పై కేంద్రీకరించి ఉంటాడు. ఎవరైతే మనస్సును బ్రహ్మముపై లగ్నము చేస్తారో అతడు సదా విజయాన్ని సాధిస్తారు. అందువలన జాగ్రత్తగా నీవు నీ మనస్సును బ్రహ్మముపై కేంద్రీకరించుము. 

328. వ్యతిరేఖ భావముతో వ్యక్తి తన స్వస్వరూపము నుండి విడిపోయినచో, అట్టి వ్యక్తి పతనము చెందుతాడు. పతనమైన వ్యక్తి పతితుడై తిరిగి మరల కోలుకోలేడు. 

329. అందువలన ఏ వ్యక్తి తాను బాహ్య వస్తు సముధాయములపై తన మనస్సును మళ్ళించుట చేయరాదు. ఎవరైతే వాటికి పూర్తిగా జీవించినంత కాలము దూరముగా ఉంటారో, వారు చనిపోయిన తరువాత కూడా అలానే ఉంటారు. యజుర్వేదము ప్రకారము ఎవరైతే ఉన్నత గౌరవం పొందుతారో వారు తిరిగి పతనమవటానికి భయపడతారు.

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 96 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 22. Desires and Karma - 6 🌻*

327. Hence to the discriminating knower of Brahman there is no worse death than inadvertence with regard to concentration. But the man who is concentrated attains complete success. (Therefore) carefully concentrate thy mind (on Brahman). 

328. Through inadvertence a man deviates from his real nature, and the man who has thus deviated falls. The fallen man comes to ruin, and is scarcely seen to rise again.

329. Therefore one should give up reflecting on the sense-objects, which is the root of all mischief. He who is completely aloof even while living, is alone aloof after the dissolution of the body. The Yajur-Veda declares that there is fear for one who sees the least bit of distinction.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 107 🌹* 
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 88. మా అనుభవము 🌻*

ఉరుములు, పిడుగులతో గాలివాన యున్నప్పుడు నీవటు నిటు నిదురలో పరుగిడుదువా? లేక కుదురుగ నొకచోట నుందువా? బుద్ధిమంతుడు అట్టి భీకర సన్నివేశములలో ఒక పంచను చేరి
తలదాచుకొనును కదా! అట్లే విపత్కర సన్నివేశములలో కూడ చెదరక హృదయమున చేరి సన్నివేశము దాటిపోవు వరకును లోన యుండ వలెను. విపత్కరమగు సన్నివేశములు జీవితమున ఎవరికి తప్పవు. 

ఎంత చెట్టుకు అంతగాలి యున్నట్లు జీవి పన్నాను బట్టి అతనికొచ్చు కష్టనష్టములుండును. బాహ్యమున ఒడుదుడుకులు సహజము. అంతరంగమున అవి లేవు. చక్కని గృహమందు యున్నవానికి గాలి, వాన, ఉరుములు, మెరుపులు చూచుటలో ప్రకృతి గాంభీర్యము తెలియును. వానను చూచుచు ఆనందించును కూడ. లోనవున్న వానికే ఈ ఆనందము అందులకే "లోనికి పొమ్ము, శాంతిని, స్వస్థతను పొందుము.” అని మేము నిరంతరము ఘోషించుచుందుము. 

ఇది చెవికెక్కక పోవుటయే నిజమగు కలి. అజ్ఞానము. జీవులు ఎన్నిన్నియో దైవకార్యములను, దైవారాధనమును గావించు చున్నారు. కాని వారికి శాంతి మాత్రము లేదు. కారణము చేయు కార్యములన్నియు బాహ్య సంబంధితములే. అంతర్గతము నందే నిజమగు హితమున్నది. 

జీవితమున ప్రాథమిక దశలో అంతర్గత మగుట నేర్వవలెను. తాబేలును గురువుగ నుంచుకొని, ఇంద్రియముల వ్యాపారమునులోనికి త్రిప్పుట నేర్వవలెను. ఇందెంతయో హితమున్నది. విద్యాలయములందు ఇతరములైన విద్యలకన్న ఈ విద్యకు ప్రాధాన్య మందించినచో జీవులు పటిష్ఠమగు చేతన కలిగి సన్నివేశముల యందు చెదరని శాంతి కలిగియుందురు. ఇది చదువు పాఠకులు కూడ ఈ పని చేయరు. ఇది మా అనుభవము. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 39 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. మనసు నిశ్చలం కావడమన్నది అతి ముఖ్యం. నువ్వు నీలో కూచుని పరిశీలించు. ఎట్లాంటి నిర్ణయం చెయ్యకుండా మనసు ఆడే ఆటల్ని పరిశీలించు. 🍀*

వీలయినంత వరకు నిశ్శబ్దంగా వుండు. మరింత మరింత నిశ్చలనంగా కూచో. కేవలం శారీరకంగానే కాదు. అది కూడా పరిస్థితిని సృష్టించడానికి సహకరిస్తుంది. కానీ అదే అంతం కాదు. అది ఆరంభం మాత్రమే. మనసు నిశ్చలం కావడమన్నది అతి ముఖ్యం. మనసు తన అడ్డూ ఆపూ లేని వాగుడును కట్టి పెట్టడం ముఖ్యం. దాన్ని ఆపితీరాలి. మనం ప్రయత్నించం. అంతే. ఇది చాలా సులభమయిన పద్దతి. 

నువ్వు నీలో కూచుని పరిశీలించు. ఎట్లాంటి నిర్ణయం చెయ్యకుండా మనసు ఆడే ఆటల్ని పరిశీలించు. అది మంచివనీ, చెడ్డవనీ అనకు. వాటిని ఆమోదించకు, వ్యతిరేకించకు. సంబంధం లేనట్లు నిర్మలంగా వుండు. ఆ నిశ్శబ్ద స్థితి నుంచీ నీకు అవగాహన కలుగుతుంది. మొదట మనసు తన పాత అతి తెలివితేటల్ని ప్రదర్శిస్తుంది. వాటిలో నువ్వు చలించకుంటే చిరాకు పడుతుంది. నిన్ను ఆందోళనకు గురి చెయ్యడానికి ప్రయత్నిస్తుంది. 

దాంతో ఘర్షించకు. దూరంగా వుండిపో. చాలాసార్లు నువ్వు దాని మాయలో పడతావు. అప్పుడు స్పృహలోకి వచ్చి వెనక్కి తగ్గు. నిన్ను నువ్వు వెనక్కి లాగు. మళ్ళీ పరిశీలనలో పడు. ఆలోచన మొదలవుతుంది. దాన్ని చూడు. వేల ఆలోచనలు సాగుతాయి. వాటిని చూడు. అవి ఎలా వచ్చాయో అలాగే వెళతాయి. ఆ విషయం గుర్తించు. వాటి గురించి ఎట్లాంటి నిర్ణయాలకూ లోనుగాకు. కేవలం శాస్త్రీయంగా, నిర్మల పరిశీలన చెయ్యి. 

ఒక రోజు హఠాత్తుగా అక్కడ ఏమీ వుండదు. అది నిర్మల నిశ్శబ్ద దినం. అది అంతకు ముందు నీకు అనుభవం లేనిది. అది నిన్ను వదిలి పెట్టదు. నీతోనే వుంటుంది. అది నీ ఆత్మ అవుతుంది. నీకు స్వేచ్ఛానిస్తుంది.

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 285 / Sri Lalitha Chaitanya Vijnanam - 285 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 67. ఆబ్రహ్మ కీటజననీ, వర్ణాశ్రమ విధాయినీ ।*
*నిజాజ్ఞారూపనిగమా, పుణ్యాపుణ్య ఫలప్రదా ॥ 67 ॥ 🍀*

*🌻 285. 'ఆ బ్రహ్మకీటజననీ' 🌻* 

బ్రహ్మ మొదలు సాలీడు వరకు అన్ని జీవరాసులకు జనన మిచ్చునది శ్రీమాత అని అర్థము. ఏ జీవికైననూ శ్రీమాతయే జనని కావున ప్రతి జీవియును శ్రీమాత అనుగ్రహము పొందదలచినచో తమ తమ తల్లుల రూపముల నున్నది. శ్రీమాతయే అని తెలిసి పూజింపవలెను, గౌరవించ వలెను, మన్నించ వలెను. కన్నతల్లిని దూషించుచు శ్రీమాత పూజలు చేయుట వ్యర్థము. 

తండ్రి కూడ పూజకు తల్లి తరువాత వాడే. అటుపైన గురువు అని వేదము ఘోషించు చున్నది. ప్రత్యక్ష గురువులలో ప్రధానమైనది తల్లి. అటుపైన తండ్రి, అటుపైన గురువు. తల్లిదండ్రులను కాదని గురువును చేరుట వలన మార్గమున అవరోధము లేర్పడగలవు. నారదుడు సహితము సిద్ధి పొందుటకు పూర్వము తల్లి నారాధించవలసి వచ్చెను. 

శంకరులు సహితము సన్యసించుటకు తల్లి ఆజ్ఞను పొందవలసి వచ్చెను. తల్లి ఆశీర్వచనముతో లవకుశలు జగదేక పరాక్రమవంతుడైన శ్రీరాముని యుద్ధమున నిర్జించిరి. కావున శ్రీమాతను ఉపాసించువారు ప్రధానముగ తల్లియందు దైవమును చూచుట అభ్యసించవలెను. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 285 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🍀 67. ābrahma-kīṭa-jananī varṇāśrama-vidhāyinī |*
*nijājñārūpa-nigamā puṇyāpuṇya-phalapradā || 67 || 🍀*

*🌻 Ābrahma-kīṭa-jananī आब्रह्म-कीट-जननी (285) 🌻*